Tim Southee
-
కివీస్ పేసర్ భారీ హిట్టింగ్.. క్రిస్ గేల్ సిక్సర్ల రికార్డు సమం
తన కెరీర్లో ఆఖరి టెస్టు ఆడుతున్న న్యూజిలాండ్ సీనియర్ పేసర్ టిమ్ సౌథీ అరుదైన ఘనత సాధించాడు. టెస్టు క్రికెట్లో వెస్టిండీస్ విధ్వంసక వీరుడు క్రిస్ గేల్ పేరిట ఉన్న రికార్డును సౌథీ సమం చేశాడు. కివీస్ జట్టు సొంతగడ్డపై ఇంగ్లండ్‌తో మూడు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో తలపడుతోంది.మరో మ్యాచ్ మిగిలి ఉండగానేఇందులో భాగంగా తొలి రెండు టెస్టుల్లో పర్యాటక ఇంగ్లండ్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్‌ను చిత్తుగా ఓడించి మరో మ్యాచ్ మిగిలి ఉండగానే సిరీస్‌ను 2-0తో కైవసం చేసుకుంది. ఈ క్రమంలో ఇరుజట్ల మధ్య శనివారం నామమాత్రపు మూడో టెస్టు మొదలైంది.లాథమ్, సాంట్నర్ ఫిఫ్టీలుహామిల్టన్లోని సెడాన్ పార్కులో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఇంగ్లండ్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. దీంతో బ్యాటింగ్‌కు దిగిన న్యూజిలాండ్‌తో శనివారం తొలి రోజు ఆట ముగిసే సమయానికి 82 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 315 పరుగులు చేసింది. కెప్టెన్ టామ్ లాథమ్ (135 బంతుల్లో 63; 9 ఫోర్లు), మిచెల్ సాంట్నర్ (54 బంతుల్లో 50 నాటౌట్; 7 ఫోర్లు, 2 సిక్స్‌లు) అర్ధ శతకాలతో ఆకట్టుకున్నారు.మరోవైపు.. మాజీ కెప్టెన్ కేన్ విలియమ్సన్ (44; 9 ఫోర్లు), విల్ యంగ్ (42; 10 ఫోర్లు) రాణించారు. అయితే, ఒక దశలో 172/2తో పటిష్టంగా కనిపించిన న్యూజిలాండ్... మిడిలార్డర్ వైఫల్యంతో 231/7కు పరిమితమైంది. రచిన్ రవీంద్ర (18), డరైన్ మిషెల్ (14), టామ్ బ్లన్‌డెల్ (21), గ్లెన్ ఫిలిప్స్ (5) విఫలమయ్యారు.చెలరేగిన సౌథీమరికాసేపట్లో ఇన్నింగ్స్ ముగియడం ఖాయమే అనుకుంటున్న దశలో ఆల్‌రౌండర్ మిచెల్ సాంట్నర్ చెలరేగాడు. ఈ మ్యాచ్‌తో టెస్టు ఫార్మాట్‌కు వీడ్కోలు పలుకనున్న టిమ్ సౌథీ (10 బంతుల్లో 23; 1 ఫోర్, 3 సిక్స్‌లు) కూడా దుమ్ము రేపడంతో న్యూజిలాండ్ మూడొందల మార్కు దాటగలిగింది. వీరిద్దరి ధాటికి కివీస్ టి20 తరహాలో చివరి 8 ఓవర్లలో 76 పరుగులు రాబట్టడం విశేషం. ఇంగ్లండ్ బౌలర్లలో మాథ్యూ పాట్స్, గస్ అట్కిన్సన్ చెరో 3 వికెట్లు పడగొట్టారు.టెస్టు క్రికెట్లో భారీ సిక్స్‌లకు పెట్టింది పేరైన సౌథీకాగా టెస్టు క్రికెట్లో భారీ సిక్స్‌లకు పెట్టింది పేరైన సౌథీ ఈ మ్యాచ్‌లో మూడు సిక్సర్లు బాదాడు. ఈ క్రమంలో సుదీర్ఘ ఫార్మాట్లో అత్యధిక సిక్స్‌లు కొట్టిన ప్లేయర్ల జాబితాలో... క్రిస్ గేల్ (98 సిక్స్‌లు)తో సమంగా నాలుగో స్థానానికి చేరాడు. ఈ జాబితాలో ఉన్నది వీరేఈ జాబితాలో ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ (133 సిక్స్‌లు) అగ్ర స్థానంలో ఉండగా... న్యూజిలాండ్ మాజీ కెప్టెన్ బ్రెండన్ మెక్కల్లమ్ (107 సిక్స్‌లు), ఆస్ట్రేలియా మాజీ వికెట్ కీపర్ ఆడమ్ గిల్‌క్రిస్ట్ (100 సిక్స్‌లు) వరుసగా ద్వితీయ, తృతీయ స్థానాల్లో ఉన్నారు.ఇక టీమిండియా నుంచి వీరేంద్ర సెహ్వాగ్ (91 సిక్స్‌లు), రోహిత్ శర్మ (88 సిక్స్‌లు) ఈ జాబితాలో వరుసగా ఆరో, ఏడో స్థానాల్లో ఉన్నారు. ఇదిలా ఉంటే.. న్యూజిలాండ్ తరఫున 107వ టెస్టు మ్యాచ్ ఆడుతున్న సౌథీ... ఇంగ్లండ్‌తో సిరీస్ అనంతరం కెరీర్‌కు వీడ్కోలు పలుకుతున్నట్లు ప్రకటించాడు.ఇంగ్లండ్ 143 ఆలౌట్ఆదివారం నాటి రెండో రోజు ఆటలో భాగంగా కివీస్ జట్టు తమ తొలి ఇన్నింగ్స్‌లో 347 పరుగులకు ఆలౌట్ అయింది. ఈ క్రమంలో బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లండ్ 143 పరుగులకే కుప్పకూలింది. అనంతరం రెండో ఇన్నింగ్స్ మొదలుపెట్టిన న్యూజిలాండ్ ఆట పూర్తయ్యేసరికి 32 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 136 పరుగులు చేసింది. ఇంగ్లండ్ కంటే 340 పరుగుల భారీ ఆధిక్యంలో నిలిచింది.చదవండి: భారత్‌తో మూడో టెస్టు: ట్రవిస్ హెడ్ వరల్డ్ రికార్డు.. సరికొత్త చరిత్ర -
రిటైర్మెంట్ ప్రకటించిన స్టార్ క్రికెటర్.. 18 ఏళ్ల కెరీర్‌కు గుడ్ బై!
న్యూజిలాండ్ స్టార్ పేసర్ టిమ్ సౌథీ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. 35 ఏళ్ల సౌథీ టెస్టు క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించేందుకు సిద్దమయ్యాడు. ఈ ఏడాది డిసెంబర్లో తన హోం గ్రౌండ్( హామిల్టన్‌లోని సెడాన్ పార్క్)లో ఇంగ్లండ్‌తో జరగనున్న మ్యాచ్ అనంతరం టెస్టులకు విడ్కోలు పలకనున్నట్లు సౌథీ వెల్లడించాడు.ఒకవేళ కివీస్ ఐసీసీ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్‌కు అర్హత సాధిస్తే మాత్రం అతడు తన దేశం తరపున ఆడేందుకు అందుబాటులో ఉండనున్నాడు. అదే విధంగా దేశీవాళీ టోర్నీల్లో, ఫ్రాంచైజీ క్రికెట్లో కొనసాగనున్నట్లు ఈ కివీ స్టార్ పేసర్ చెప్పుకొచ్చాడు. "న్యూజిలాండ్‌కు ప్రాతినిధ్యం వహించడం నాకు దక్కిన అరుదైన గౌరవంగా భావిస్తున్నాను. 18 సంవత్సరాలుగా బ్లాక్‌క్యాప్స్ కోసం ఆడటం నాకు చాలా స్పెషల్. టెస్టు క్రికెట్‌కు నా హృదయంలో ప్రత్యేక స్ధానం ఉంది. ఏ జట్టుపై అయితే నేను టెస్టు క్రికెట్ అరంగేట్రం చేశానో, ఇప్పుడు అదే జట్టుపై నా కెరీర్‌ను ముగించనున్నాను. నాకు బాగా ఇష్టమైన మూడు మైదానాల్లో సెడాన్ పార్క్ ఒకటి.అందుకే అక్కడే టెస్టులకు విడ్కోలు పలకాలని నిర్ణయించుకున్నాను"అని సౌథీ ఓ ప్రకటనలో పేర్కొన్నాడు. ఈ విషయాన్ని న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు ధ్రువీకరించింది. కాగా 2008లో ఇంగ్లండ్‌పై సౌథీ టెస్టు క్రికెట్లో అడుగుపెట్టాడు. తన 18 ఏళ్ల కెరీర్లో కివీస్ తరపున ఇప్పటివరకు 104 టెస్టులు ఆడిన సౌథీ.. 385 వికెట్లతో పాటు 2185 పరుగులు సాధించాడు. మరోవైపు 161 వన్డేల్లో 742 పరుగులు, 221 వికెట్లు తీశాడు. 125 టీ20లు ఆడిన సౌథీ 303 పరుగులు, 164 వికెట్లను తన ఖాతాలో వేసుకున్నాడు.చదవండి: సూర్యకుమార్ వల్లే సాధ్యమైంది -
సౌథీ అరుదైన ఘనత.. సెహ్వాగ్ సిక్సర్ల రికార్డు బ్రేక్
బెంగళూరు వేదికగా టీమిండియాతో జరుగుతున్న తొలి టెస్టులో న్యూజిలాండ్ స్టార్ టిమ్ సౌథీ అద్భుతమైన హాఫ్ సెంచరీతో మెరిశాడు. కివీస్ మొదటి ఇన్నింగ్స్‌లో 402 పరుగుల భారీ స్కోర్‌ను సాధించడంలో సౌథీ కీలక పాత్ర పోషించాడు. రచిన్ రవీంద్రతో కలిసి ఎనిమిదో వికెట్‌కు 137 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు.73 బంతులు ఎదుర్కొన్న సౌథీ 5 ఫోర్లు, 4 సిక్స్‌లతో 65 పరుగులు చేశాడు. ఈ ఇక మ్యాచ్‌లో హాఫ్ సెంచరీతో మెరిసిన సౌథీ ఓ అరుదైన రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. టెస్టు క్రికెట్లో అత్యధిక సిక్స్‌లు కొట్టిన జాబితాలో సౌథీ ఆరో స్ధానానికి ఎగబాకాడు. ఇప్పటివరకు 147 టెస్టు ఇన్నింగ్స్‌లలో సౌథీ 92 సిక్స్‌లు బాదాడు. ఇంతకుముందు ఈ రికార్డు భారత మాజీ ప్లేయర్ వీరేంద్ర సెహ్వాగ్(91) పేరిట ఉండేది. తాజా మ్యాచ్‌తో సెహ్వాగ్‌ను ఈ కివీ వెటరన్ అధిగమించాడు. ఇక అరుదైన ఫీట్ నమోదు చేసిన జాబితాలో బెన్ స్టోక్స్(131) అగ్రస్ధానంలో ఉన్నాడు.చదవండి: IND vs PAK 2nd Test: ఇంగ్లండ్‌ను చిత్తు చేసిన పాకిస్తాన్.. -
న్యూజిలాండ్ టెస్టు కెప్టెన్సీకి సౌథీ గుడ్‌బై.. కొత్త కెప్టెన్ ఎవరంటే?
టీమిండియాతో టెస్టు సిరీస్‌కు ముందు న్యూజిలాండ్ వెటరన్ టిమ్ సౌథీ అనూహ్య నిర్ణయం తీసుకున్నాడు. కివీస్ టెస్టు జట్టు కెప్టెన్సీ నుంచి సౌథీ తప్పుకున్నాడు. ఇటీవల శ్రీలంకతో జరిగిన సిరీస్‌లో 2-0 తేడాతో న్యూజిలాండ్ ఘోర పరాభావం చూసిన తర్వాత సౌథీ ఈ నిర్ణయం తీసుకున్నాడు.నాకు ఇష్టమైన రెడ్ బాల్ ఫార్మాట్లో న్యూజిలాండ్ కెప్టెన్‌గా పనిచేయడం నాకు దక్కిన గౌరవంగా భావిస్తున్నాను. నా కెరీర్లో జట్టును నెం1గా నిలపడానికి ఎల్లప్పుడూ ప్రయత్నించాను. ఇప్పుడు కూడా ఆటగాడిగా నావంతు పాత్ర పోషిస్తున్నాను. జట్టు ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకున్నాను అని ఓ ప్రకటనలో సౌథీ పేర్కొన్నాడు.కాగా గతేడాది కేన్ విలియమ్సన్ నుంచి కివీస్ టెస్టు జట్టు కెప్టెన్సీ బాధ్యతలు సౌథీ చేపట్టాడు. అయితే కెప్టెన్‌గా సౌథీ పర్వాలేదన్పించాడు. అతడి సారథ్యంలో 14 టెస్టులు ఆడిన బ్లాక్ క్యాప్స్.. ఆరు మ్యాచ్‌ల్లో విజయం సాధించగా, మరో 6 మ్యాచ్‌ల్లో ఓటమి పాలైంది. మరో రెండు మ్యాచ్‌లను ఓటమితో ముగించింది.న్యూజిలాండ్ కెప్టెన్‌గా లాథమ్..ఇక బ్లాక్ క్యాప్స్ టెస్టు కెప్టెన్‌గా వెటరన్ వికెట్ కీపర్ టామ్ లాథమ్ బాధ్యతలు చేపట్టాడు. ఆక్టోబర్ 16 నుంచి భారత్‌తో ప్రారంభం కానున్న తొలి టెస్టుతో కివీస్ కెప్టెన్‌గా లాథమ్ ప్రయాణం మొదలు కానుంది. లాథమ్ వన్డే, టెస్టు ఫార్మాట్లో కివీస్ జట్టులో కీలక సభ్యునిగా కొనసాగుతున్నాడు. ఇక భారత్‌తో కివీస్ మూడు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ ఆడనుంది. ఈ సిరీస్ కోసం కివీస్ ఆక్టోబర్ 10న భారత్‌కు వచ్చే ఛాన్స్ ఉంది. -
Afg vs NZ Day 1: ఒక్క బంతి పడకుండానే ముగిసిన ఆట
అఫ్గనిస్తాన్- న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న టెస్టు మ్యాచ్‌కు మొదటిరోజే ఆటంకం కలిగింది. వర్షం తాలూకు ప్రభావం కారణంగా ఒక్క బంతి పడకుండానే తొలి రోజు ఆట ముగిసిపోయింది. ఫలితంగా మ్యాచ్‌ను ఘనంగా ఆరంభించాలనుకున్న ఇరుజట్లకు చేదు అనుభవమే మిగిలింది.మూడింట విజయాలుకాగా 2017లో టెస్టు జట్టు హోదా పొందిన అఫ్గనిస్తాన్... ఇప్పటి వరకు సంప్రదాయ ఫార్మాట్లో తొమ్మిది మ్యాచ్‌లు ఆడింది. టీమిండియాతో ఒకటి, ఐర్లాండ్‌తో రెండు, బంగ్లాదేశ్‌తో రెండు, వెస్టిండీస్‌తో ఒకటి, జింబాబ్వేతో రెండు, శ్రీలంకతో ఒక టెస్టులో పాల్గొంది. వీటిలో జింబాబ్వే, ఐర్లాండ్, బంగ్లాదేశ్‌లపై ఒక్కో మ్యాచ్‌లో గెలుపొందింది. ఈ క్రమంలో న్యూజిలాండ్‌తో తొలిసారి టెస్టు మ్యాచ్‌కు ఆడేందుకు సిద్ధమైంది.ఆటగాళ్ల క్షేమమే ముఖ్యంతమదేశంలో ఇందుకు అనుకూల పరిస్థితులు లేని నేపథ్యంలో భారత్ వేదికగా కివీస్‌తో పోటీకి అన్నిరకాలుగా సన్నద్ధమైంది. గ్రేటర్ నోయిడాలోని స్పోర్ట్స్ కాంప్లెక్స్ గ్రౌండ్లో సోమవారం ఈ మ్యాచ్ ప్రారంభం కావాల్సి ఉంది. అయితే, గత రెండు వారాలుగా నోయిడాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో అవుట్‌ఫీల్డ్ మొత్తం పూర్తిగా తడిచిపోయింది. ఈరోజు కాస్త ఎండగానే ఉన్నా.. అవుట్‌ఫీల్డ్ మాత్రం పూర్తిగా ఆరలేదు.రోజుకొక అరగంట ఎక్కువ?గ్రౌండ్స్‌మెన్ తీవ్రంగా శ్రమించినప్పటికీ ఫలితం లేకపోయింది. ఇలాంటి పరిస్థితుల్లో మ్యాచ్ నిర్వహిస్తే.. ఫీల్డింగ్ సమయంలో ఆటగాళ్లు జారిపడే ప్రమాదం ఉంది. ఈ నేపథ్యంలో ఆటగాళ్ల భద్రతను దృష్ట్యా తొలిరోజు ఆట రద్దు చేస్తున్నట్లు అంపైర్లు కుమార్ ధర్మసేన, షర్ఫూద్దౌలా తెలిపారు. రేపటి నుంచి నాలుగురోజుల పాటు మ్యాచ్‌ను నిర్వహిస్తామని వెల్లడించారు.అనూహ్య పరిస్థితుల్లో తొలిరోజు ఆట రద్దైన కారణంగా మిగిలిన నాలుగు రోజులు అరగంట ఎక్కువసేపు ఆట కొనసాగిస్తామని తెలిపారు. భారత కాలమానం ప్రకారం ఉదయం 9.30 నిమిషాలకు ఆట మొదలవుతుందని పేర్కొన్నారు. కాగా స్టార్ ఓపెనర్ ఇబ్రహీం జద్రాన్ గాయం కారణంగా కివీస్‌తో టెస్టుకు దూరమయ్యాడు.న్యూజిలాండ్‌తో ఏకైక టెస్టుకు అఫ్గనిస్తాన్ క్రికెట్ బోర్డు ప్రకటించిన జట్టుహష్మతుల్లా షాహిది (కెప్టెన్), రహ్మత్ షా, అబ్దుల్ మాలిక్, రియాజ్ హసన్, అఫ్సర్ జజాయ్, ఇక్రం అలిఖిల్, బహీర్ షా మహబూబ్, షాహిదుల్లా కమల్, అజ్మతుల్లా ఒమర్జాయ్, షామ్స్ ఉర్ రహమాన్, జియా ఉర్ రెహ్మాన్ అక్బర్, జహీర్ ఖాన్ పక్తీన్, కైస్ అహ్మద్, ఖలీల్ అహ్మద్, నిజత్ మసూద్.అఫ్గన్‌తో టెస్టు మ్యాచ్‌కు న్యూజిలాండ్ జట్టుటామ్ లాథమ్(వికెట్ కీపర్), టిమ్ సౌతీ(కెప్టెన్), డెవాన్ కాన్వే(వికెట్ కీపర్), కేన్ విలియమ్సన్, డారిల్ మిచెల్, విల్ యంగ్, గ్లెన్ ఫిలిప్స్, మైకేల్ బ్రాస్‌వెల్, మిచెల్ సాంట్నర్, అజాజ్ పటేల్, మ్యాచ్ హెన్రీ, టామ్ బ్లండెల్, రచిన్ రవీంద్ర, బెన్ సియర్స్, విలియం ఒరూర్కీ. The buildup is 🔛!While we wait for the start of the game, check out these glimpses of the current scenes in Greater Noida. 👍#AfghanAtalan | #GloriousNationVictoriousTeam pic.twitter.com/aLC5SZGoaW— Afghanistan Cricket Board (@ACBofficials) September 9, 2024 -
భారత్‌కు చేరుకున్న న్యూజిలాండ్ జట్టు.. ఎందుకంటే?
న్యూజిలాండ్-అఫ్గానిస్తాన్ మధ్య చారిత్రత్మక టెస్టు మ్యాచ్‌కు గ్రేటర్ నోయిడా ఆతిథ్యమివ్వనుంది. బీసీసీఐ ఆధ్వర్యంలో జరగనున్న ఈ మ్యాచ్ సెప్టెంబర్ 9 నుంచి ప్రారంభం కానుంది. ఈ ఏకైక టెస్టు మ్యాచ్ కోసం అఫ్గానిస్తాన్ జట్టు ఇప్పటికే నోయిడాకు చేరుకోగా.. తాజాగా కివీస్ జట్టు సైతం భారత గడ్డపై అడుగుపెట్టింది.కెప్టెన్ టిమ్ సౌథీ నేతృత్వంలోని న్యూజిలాండ్ జట్టు గురువారం తెల్లవారుజామునఢిల్లీ విమానాశ్రయంలో ల్యాండ్ అయ్యారు. అక్కడ నుంచి గ్రేటర్ నోయిడాకు బస్సులో కివీస్ పయనమైంది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది.శుక్రవారం నుంచి బ్లాక్ క్లాప్స్ తమ ప్రాక్టీస్‌ను మొదలు పెట్టనుంది. కాగా ఈ మ్యాచ్ భారత్‌తో టెస్టు సిరీస్‌కు ముందు జరగనుండడంతో కివీస్‌కు ప్రాక్టీస్‌గా ఉపయోగపడనుంది.అఫ్గాన్ సిరీస్‌కు న్యూజిలాండ్ జట్టు: టిమ్ సౌథీ (కెప్టెన్), టామ్ బ్లండెల్ (వికెట్ కీపర్), మైఖేల్ బ్రేస్‌వెల్, డెవాన్ కాన్వే, మాట్ హెన్రీ, టామ్ లాథమ్ (వికెట్ కీపర్), డారిల్ మిచెల్, విల్ ఓరూర్క్, అజాజ్ పటేల్, గ్లెన్ ఫిలిప్స్, రచిన్ రవీంద్ర, మిచెల్ సాంట్నర్ , బెన్ సియర్స్, కేన్ విలియమ్సన్, విల్ యంగ్ Welcome @BlackCapsVideo: The New Zealand team has arrived at the hotel in Greater Noida, India, for the one-off Test match against Afghanistan's national team.#AfghanAtalan | #AFGvNZ | #GloriousNationVictoriousTeam pic.twitter.com/UlQApG5UXP— Afghanistan Cricket Board (@ACBofficials) September 5, 2024 -
ఐదేసిన సౌథీ.. హండ్రెడ్ లీగ్ నుంచి రాకెట్స్ ఔట్
హండ్రెడ్ లీగ్ 2024 పురుషుల ఎడిషన్ చివరి అంకానికి చేరింది. ప్లే ఆఫ్స్‌కు చేరే నాలుగు జట్లపై క్లారిటీ రానప్పటికీ.. టోర్నీ నుంచి నిష్క్రమించే జట్లేవో తేలిపోయాయి. నిన్న బర్మింగ్హమ్ ఫీనిక్స్ చేతిలో ఓటమితో ట్రెంట్ రాకెట్స్ టోర్నీ నుంచి ఎలిమినేట్ అయ్యింది. రాకెట్స్‌తో పాటు వెల్ష్ ఫైర్, మాంచెస్టర్ ఒరిజినల్స్, లండన్ స్పిరిట్ ఈ ఎడిషన్ నుంచి నిష్క్రమించాయి. ఓవల్ ఇన్విన్సిబుల్స్ మాత్రం అధికారికంగా ప్లే ఆఫ్స్‌కు అర్హత సాధించగా.. సథరన్ బ్రేవ్, బర్మింగ్హమ్ ఫీనిక్స్, నార్త్రన్ సూపర్ ఛార్జర్స్ రేసులో ఉన్నాయి.బర్మింగ్హమ్ ఫీనిక్స్, ట్రెంట్ రాకెట్స్ మధ్య నిన్న (ఆగస్ట్ 12) జరిగిన మ్యాచ్ విషయానికొస్తే.. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన రాకెట్స్ టిమ్ సౌథీ (20-13-12-5) ఐదు వికెట్ల ఘనతతో చెలరేగడంతో నిర్ణీత 100 బంతుల్లో 118 పరుగులకు ఆలౌటైంది. రాకెట్స్ ఇన్నింగ్స్‌లో అల్సోప్ (51), ఇమాద్ వసీం (29) మాత్రమే రెండంకెల స్కోర్లు చేశారు. సౌథీతో పాటు క్రిస్ వుడ్ (20-7-30-2), ఆడమ్ మిల్నే (20-14-17-1) వికెట్లు తీశారు.అనంతరం 119 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఫీనిక్స్.. లివింగ్‌స్టోన్ (30 నాటౌట్), జేకబ్ బేతెల్ (38 నాటౌట్) అజేయ ఇన్నింగ్స్‌లతో రాణించడంతో 93 బంతుల్లో 4 వికెట్లు కోల్పోయి విజయతీరాలకు చేరింది. ఫీనిక్స్ ఇన్నింగ్స్‌లో బెన్ డకెట్ 30, మొయిన్ అలీ 13 పరుగులు చేయగా.. జేమీ స్మిత్, డాన్ మౌస్లీ గోల్డెన్ డకౌట్లయ్యారు. రాకెట్స్ బౌలర్లలో లూక్ వుడ్, జాన్ టర్నర్ తలో రెండు వికెట్లు పడగొట్టారు. -
పసికూనపై ప్రతాపం.. ఎట్టకేలకు తొలి విజయం.. ఏం లాభం?
టీ20 ప్రపంచకప్-2024 టోర్నీలో న్యూజిలాండ్ ఎట్టకేలకు బోణీ కొట్టింది. ఉగాండాను చిత్తుగా ఓడించి తొలి గెలుపు నమోదు చేసింది.ఈ మెగా ఈవెంట్లో అఫ్గనిస్తాన్, వెస్టిండీస్, ఉగాండా, పపువా న్యూగినియాలో కలిసి గ్రూప్-సిలో ఉన్న న్యూజిలాండ్.. తొలి రెండు మ్యాచ్‌లలో పరాజయం పాలైంది.మొదట అఫ్గనిస్తాన్ చేతిలో 84 పరుగుల తేడాతో చిత్తుగా ఓడిన కేన్ విలియమ్సన్ బృందం.. తదుపరి వెస్టిండీస్ చేతిలో 13 పరుగుల తేడాతో పరాజయం పాలైంది. ఈ క్రమంలో సూపర్-8 అవకాశాలు సంక్లిష్టమయ్యాయి.మరోవైపు.. అఫ్గనిస్తాన్, వెస్టిండీస్ వరుస విజయాలతో రాణించి.. సూపర్-8 బెర్తును ఖరారు చేసుకోవడంతో న్యూజిలాండ్ కథ ముగిసిపోయింది.ఈ క్రమంలో మిగిలిన రెండు నామమాత్రపు మ్యాచ్‌లలో విజయం సాధించాలని పట్టుదలగా ఉన్న కివీస్.. తాజాగా శనివారం నాటి మ్యాచ్‌లో పసికూన ఉగాండాపై ప్రతాపం చూపింది.ట్రినిడాడ్ వేదికగా టాస్ గెలిచిన న్యూజిలాండ్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. పేసర్లు ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ టిమ్ సౌతీ(3/4), ట్రెంట్ బౌల్ట్(2/7), లాకీ ఫెర్గూసన్(1/9).. స్పిన్నర్లు మిచెల్ సాంట్నర్(2/8), రచిన్ రవీంద్ర(2/9) ఆకాశమే హద్దుగా చెలరేగారు.దీంతో ఉగాండా 18.4 ఓవర్లలో కేవలం 40 పరుగులే చేసి ఆలౌట్ అయింది. ఉగాండా ఇన్నింగ్స్‌లో టాప్ స్కోర్ 11గా నమోదైంది. ఇక అత్యంత స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన న్యూజిలాండ్ 5.2 ఓవర్లలో పని పూర్తి చేసింది.ఓపెనర్ ఫిన్ అలెన్ 17 బంతుల్లో కేవలం తొమ్మిది పరుగులే చేసి అవుట్ అయ్యాడు. మరో ఓపెనర్ డెవాన్ కాన్వే(15 బంతుల్లో 22), రచిన్ రవీంద్ర(1)తో కలిసి అజేయంగా నిలిచి.. కివీస్ విజయాన్ని ఖరారు చేశాడు.ఫలితంగా వికెట్ నష్టానికి 41 పరుగులు చేసిన న్యూజిలాండ్ వరల్డ్‌కప్-2024లో పాయింట్ల ఖాతా తెరిచింది. తదుపరి జూన్ 17న పపువా న్యూగినియాతో కివీస్ జట్టు తలపడనుంది. కాగా ఉగాండాపై న్యూజిలాండ్ విజయం నేపథ్యంలో అభిమానులు మిశ్రమంగా స్పందిస్తున్నారు. ఇప్పటికైనా ఒకటి గెలిచిందని కొంతమంది సంతోషిస్తుంటే.. చేతులు కాలాక ఆకులు పట్టుకుంటే ఏం లాభమని మరికొందరు విమర్శిస్తున్నారు. View this post on Instagram A post shared by ICC (@icc) -
T20 World Cup 2024: న్యూజిలాండ్ స్టార్ పేసర్‌కు మందలింపు
టీ20 వరల్డ్‌కప్ 2024లో భాగంగా వెస్టిండీస్‌తో జరిగిన మ్యాచ్ సందర్భంగా ఐసీసీ నియమావళిని ఉల్లఘించినందుకు గానూ న్యూజిలాండ్ స్టార్ పేసర్ టిమ్ సౌథీ మందలింపుకు గురయ్యాడు. ఈ మ్యాచ్‌లో సౌథీ ఔటయ్యాక డ్రెస్సింగ్ రూమ్‌కి వెళ్తూ హ్యాండ్ శానిటైజర్ డిస్పెన్సర్‌ను పగులగొట్టాడు. ఐసీసీ కోడ్ ఆఫ్ కాండక్ట్ నిబంధనల ప్రకారం అంతర్జాతీయ మ్యాచ్‌ల్లో గ్రౌండ్ పరికరాలను ధ్వంసం చేస్తే ఆర్టికల్ 2.2 ఉల్లంఘన కింద ఆటగాళ్లపై చర్యలు తీసుకుంటారు. ఐసిసి ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించినందుకు గాను సౌథీ స్వల్ప మందలింపుకు గురి కావడంతో పాటు ఓ డీమెరిట్ పాయింట్ పొందాడు. గడిచిన 24 నెలల్లో సౌథీకి ఇది మొదటి ఉల్లంఘణ కావడంతో ఐసీసీ మందలింపుతో వదిలి పెట్టింది. సౌథీ తన తప్పిదాన్ని మ్యాచ్ రిఫరీ డేవిడ్ బూన్ ముందు అంగీకరించాడు.ఇదిలా ఉంటే, టీ20 వరల్డ్‌కప్ 2024లో న్యూజిలాండ్ ప్రస్తానం ముగిసింది. ఆ జట్టు మరో రెండు మ్యాచ్‌లు ఆడాల్సి ఉండగానే టోర్నీ నుంచి నిష్క్రమించింది. వెస్టిండీస్‌తో జరిగిన మ్యాచ్‌లో ఓడటంతో న్యూజిలాండ్ అధికారికంగా టోర్నీ నుంచి వైదొలిగింది. న్యూజిలాండ్ అంతకుముందు ఆఫ్ఘనిస్తాన్ చేతిలో ఓటమిపాలైంది. న్యూజిలాండ్‌తో మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 149 పరుగులు చేయగా..ఛేదనలో చేతులెత్తేసిన న్యూజిలాండ్ నిర్ణీత ఓవర్లు పూర్తయ్యేసరికి లక్ష్యానికి 14 పరుగుల దూరంలో నిలిచిపోయి ఓటమిపాలైంది. -
NZ vs AUS: చెలరేగిన హాజిల్‌వుడ్.. కుప్పకూలిన కివీస్! కానీ..
ఆస్ట్రేలియాతో రెండో టెస్టులో న్యూజిలాండ్ బ్యాటింగ్ ఆర్డర్ పూర్తిగా విఫలమైంది. కంగారూ పేసర్ జోష్ హాజిల్‌వుడ్ దెబ్బకు కివీస్ బ్యాటర్లంతా పెవిలియన్‌కు క్యూ కట్టారు. ఒక్కరు కూడా కనీసం నలభై పరుగుల మార్కు అందుకోలేకపోయారు. కాగా న్యూజిలాండ్ పర్యటనలో భాగంగా తొలి టెస్టులో ఆస్ట్రేలియా 172 పరుగులతో ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో రెండో టెస్టు గెలిచి సిరీస్‌ను సమం చేయాలనే ఉద్దేశంతో కివీస్ బరిలోకి దిగింది. అయితే, తొలిరోజే ఆసీస్ చేతిలో ఆతిథ్య జట్టుకు చేదు అనుభవం ఎదురైంది. బ్యాటర్లంతా కలిసికట్టుగా విఫలం కావడంతో 162 పరుగులకే ఆలౌట్ అయింది. ఓపెనర్ టామ్ లాథమ్ 38 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా.. లోయర్ ఆర్డర్లో మ్యాట్ హెన్రీ 29 పరుగులతో ఫర్వాలేదనిపించాడు. మిగతా వాళ్లలో వికెట కీపర్ టామ్ బ్లండెల్(22), కెప్టెన్ టిమ్ సౌథీ(26) మాత్రమే 20 పరుగుల మార్కు దాటగలిగారు. ఆసీస్ పేసర్లు జోష్ హాజిల్‌వుడ్ ఐదు వికెట్లతో చెలరేగగా.. మిచెల్ స్టార్క్ మూడు, ప్యాట్ కమిన్స్, కామెరాన్ గ్రీన్ ఒక్కో వికెట్ దక్కించుకున్నారు. ఈ క్రమంలో బ్యాటింగ్ మొదలుపెట్టిన ఆస్ట్రేలియాకు ఆరంభంలోనే షాకిచ్చాడు కివీస్ పేసర్ బెన్ సీర్స్. ఓపెనర్ స్టీవ్ స్మిత్(11)ను వికెట్ల ముందు దొరకబుచ్చుకుని తొలి వికెట్ పడగొట్టాడు. అనంతరం మరో ఫాస్ట్‌బౌలర్ మ్యాట్ హెన్రీ ఉస్మాన్ ఖవాజా(16), కామెరాన్ గ్రీన్(25), ట్రవిస్ హెడ్(21)ల రూపంలో మూడు కీలక వికెట్లు తీశాడు. ఈ క్రమంలో తొలి రోజు ఆట ముగిసే సరికి ఆసీస్ నాలుగు వికెట్ల నష్టానికి 124 పరుగులు చేసింది. వన్‌డౌన్ బ్యాటర్ మార్నస్ లబుషేన్ 45, నాథన్ లియోన్ ఒక పరుగుతో క్రీజులో ఉన్నారు. కాగా ఈ మ్యాచ్ న్యూజిలాండ్ స్టార్లు కేన్ విలియమ్సన్, టిమ్ సౌతీలకు వందో టెస్టు కావడం విశేషం. -
రోజు వ్యవధిలో సెంచరీలు కొట్టనున్న నలుగురు స్టార్ క్రికెటర్లు
అంతర్జాతీయ క్రికెట్లో ఒక్క రోజు వ్యవధిలో నలుగురు స్టార్ క్రికెటర్లు సెంచరీలు కొట్టబోతున్నారు. మార్చి 7, 8 తేదీల్లో టీమిండియాకు చెందిన రవిచంద్రన్ అశ్విన్, ఇంగ్లండ్‌కు చెందిన జానీ బెయిర్‌స్టో, న్యూజిలాండ్‌కు చెందిన కేన్ విలియమ్సన్, టిమ్ సౌథీలు తమ కెరీర్లలో వందో టెస్ట్ మ్యాచ్ ఆడనున్నారు. రోజు వ్యవధిలో నలుగురు స్టార్ క్రికెటర్లు వందో టెస్ట్ మ్యాచ్ ఆడటం క్రికెట్ చరిత్రలో బహుశా జరిగి ఉండకపోవచ్చు. ఈ రికార్డుకు సంబంధించిన సరైన సమాచారం లేదు కానీ, ఇలాంటి సందర్భం రావడం దాదాపు అసాధ్యమనే చెప్పాలి. మరో విశేషమేమిటంటే.. పై పేర్కొన్న తేదీల కంటే కొద్ది రోజుల ముందు (ఫిబ్రవరి 15న) ఇంగ్లండ్‌కే చెందిన మరో ఆటగాడు వంద టెస్ట్ సెంచరీల మార్కును తాకాడు. ఇంగ్లీష్ కెప్టెన్ బెన్ స్టోక్స్ భారత్‌తో జరిగిన మూడో టెస్ట్‌తో వంద సెంచరీల అరుదైన మైలురాయిని తాకాడు. ధర్మశాల వేదికగా భారత్-ఇంగ్లండ్ జట్ల మధ్య మార్చి 7న మొదలయ్యే ఐదో టెస్ట్ మ్యాచ్ రవిచంద్రన్ అశ్విన్, జానీ బెయిర్‌స్టోలకు వందో టెస్ట్ మ్యాచ్ కానుండగా.. క్రైస్ట్‌చర్చ్ వేదికగా న్యూజిలాండ్-ఆస్ట్రేలియా జట్ల మధ్య మార్చి 8న మొదలయ్యే రెండో టెస్ట్ మ్యాచ్ కివీస్ ఆటగాళ్లు కేన్ విలియమ్సన్, టిమ్ సౌథీలకు సెంచరీ మ్యాచ్ అవుతుంది. జానీ బెయిర్‌స్టో- 99 టెస్ట్‌ల్లో 12 సెంచరీలు, 5974 పరుగులు రవింద్రన్ అశ్విన్- 99 టెస్ట్‌ల్లో 5 సెంచరీలు, 3309 పరుగులు, 507 వికెట్లు కేన్ విలియమ్సన్- 99 టెస్ట్‌ల్లో 32 సెంచరీలు, 8675 పరుగులు, 30 వికెట్లు టిమ్ సౌథీ-99 టెస్ట్‌ల్లో 6 హాఫ్ సెంచరీలు, 2072 పరుగులు, 378 వికెట్లు టెస్ట్‌ల్లో ఇప్పటివరకు 75 మంది 100 టెస్ట్‌ల మార్కును తాకారు. ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ తరఫున 15 మంది, భారత్ తరఫున 13, వెస్టిండీస్ నుంచి 9, సౌతాఫ్రికా 8, శ్రీలంక 6, పాకిస్తాన్ 5, న్యూజిలాండ్ తరఫున నలుగురు 100 టెస్ట్‌ల మార్కును తాకారు. ఇదిలా ఉంటే, ఇంగ్లండ్‌తో జరుగుతున్న ఐదు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌ను టీమిండియా మరో మ్యాచ్ మిగిలి ఉండగానే కైవసం చేసుకుంది. -
NZ VS AUS 1st T20: టిమ్ సౌథీ రికార్డు
న్యూజిలాండ్ వెటరన్ బౌలర్ టిమ్ సౌథీ ఆ దేశం తరఫున అత్యధిక టీ20లు ఆడిన ఆటగాడిగా అవతరించాడు. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా వెల్లింగ్టన్ వేదికగా ఆస్ట్రేలియాతో ఇవాళ (ఫిబ్రవరి 21) జరిగిన మ్యాచ్‌లో ఆడటం ద్వారా సౌథీ ఈ ఘనతను సాధించాడు. సౌథీ ఈ రికార్డును సాధించే క్రమంలో మార్టిన్ గప్తిల్‌ను అధిగమించాడు. గప్తిల్ న్యూజిలాండ్ తరఫున 122 టీ20లు ఆడగా.. సౌథీ ఇవాల్టి మ్యాచ్‌తో కలుపుకుని 123 మ్యాచ్‌ల్లో న్యూజిలాండ్‌కు ప్రాతినిథ్యం వహించాడు. సౌథీ, గప్తిల్ తర్వాత న్యూజిలాండ్ తరఫున అత్యధిక టీ20లు ఆడిన రికార్డు ఐష్ సోధి పేరిట ఉంది. సోధి తన టీ20 కెరీర్లో 110 మ్యాచ్‌లు ఆడాడు. ఓవరాల్‌గా అంతర్జాతీయ టీ20ల్లో అత్యధిక మ్యాచ్‌లు ఆడిన రికార్డు టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ పేరిట ఉంది. హిట్‌మ్యాన్ టీమిండియా తరఫున ఇప్పటివరకు 151 మ్యాచ్‌లు ఆడాడు. మ్యాచ్ విషయానికొస్తే.. ఈ మ్యాచ్‌లో ఆసీస్ 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఉత్కంఠభరింతగా సాగిన ఈ మ్యాచ్‌లో ఆసీస్ చివరి బంతికి గెలుపొందింది. తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ నిర్ణీత ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 215 పరుగుల భారీ స్కోర్ చేయగా.. టిమ్ డేవిడ్ (10 బంతుల్లో 31 నాటౌట్; 2 ఫోర్లు, 3 సిక్సర్లు) చివరి బంతికి బౌండరీ బాది ఆసీస్‌ను గెలిపించాడు. ఆసీస్ గెలుపులో మిచెల్ మార్ష్ (44 బంతుల్లో 72 నాటౌట్; 2 ఫోర్లు, 7 సిక్సర్లు) కీలకపాత్ర పోషించాడు. ఈ గెలుపుతో ఆసీస్ మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో 1-0 ఆధిక్యంలోకి వెళ్లింది. -
మార్చి 7, 8 తేదీల్లో సెంచరీలు కొట్టనున్న నలుగురు క్రికెటర్లు..!
మార్చి 7, 8 తేదీల్లో నలుగురు అంతర్జాతీయ క్రికెటర్లు సెంచరీలు కొట్టనున్నారు. ఇదేంటని అనుకుంటున్నారా..? అయితే ఇది చూడండి. పై పేర్కొన్న తేదీల్లో ఓ భారత ఆటగాడు, ఓ ఇంగ్లండ్ ఆటగాడు, ఇద్దరు న్యూజిలాండ్ ఆటగాళ్లు టెస్ట్‌ల్లో వందో మ్యాచ్ ఆడనున్నారు. భారత్-ఇంగ్లండ్ జట్ల మధ్య మార్చి 7న మొదలయ్యే ఐదో టెస్ట్ మ్యాచ్ రవిచంద్రన్ అశ్విన్, జానీ బెయిర్‌స్టోలకు వందో టెస్ట్ మ్యాచ్ కానుండగా.. న్యూజిలాండ్-ఆస్ట్రేలియా జట్ల మధ్య మార్చి 8న మొదలయ్యే రెండో టెస్ట్ మ్యాచ్ కివీస్ ఆటగాళ్లు కేన్ విలియమ్సన్, టిమ్ సౌథీలకు సెంచరీ మ్యాచ్ అవుతుంది. ఈ తేదీల కంటే ముందు ఫిబ్రవరి 15న మరో ఆటగాడు కూడా సెంచరీ టెస్ట్ మ్యాచ్ ఆడనున్నాడు. భారత్-ఇంగ్లండ్ మధ్య మూడో టెస్ట్ మ్యాచ్ ఇంగ్లండ్ సారధి బెన్ స్టోక్స్‌కు వందో టెస్ట్ మ్యాచ్ కానుంది. రోజుల వ్యవధిలో ఐదుగురు ఆటగాళ్లు వంద టెస్ట్‌ల మార్కును తాకడం చాలా అరుదుగా జరుగుతుంది. ఈ ఆటగాళ్లతో పాటు మరికొందరు శతాధిక టెస్ట్ ప్లేయర్లు ఒకేసారి రిటైరైతే టెస్ట్ క్రికెట్లో ఓ శకం ముగిసినట్లవుతుంది. నేటి వరకు (ఫిబ్రవరి 13) పై పేర్కొన్న ఐదుగురు ఆటగాళ్ల గణాంకాలు ఇలా ఉన్నాయి. బెన్ స్టోక్స్- 99 టెస్ట్‌ల్లో 13 సెంచరీలు, 6251 పరుగులు, 197 వికెట్లు జానీ బెయిర్‌స్టో- 97 టెస్ట్‌ల్లో 12 సెంచరీలు, 5902 పరుగులు రవింద్రన్ అశ్విన్- 97 టెస్ట్‌ల్లో 5 సెంచరీలు, 3271 పరుగులు, 499 వికెట్లు కేన్ విలియమ్సన్- 98 టెస్ట్‌ల్లో 31 సెంచరీలు, 8490 పరుగులు, 30 వికెట్లు టిమ్ సౌథీ-98 టెస్ట్‌ల్లో 6 హాఫ్ సెంచరీలు, 2059 పరుగులు, 375 వికెట్లు టెస్ట్‌ల్లో ఇప్పటివరకు 75 మంది 100 టెస్ట్‌ల మార్కును తాకారు. ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ తరఫున 15 మంది, భారత్ తరఫున 13, వెస్టిండీస్ నుంచి 9, సౌతాఫ్రికా 8, శ్రీలంక 6, పాకిస్తాన్ 5, న్యూజిలాండ్ తరఫున నలుగురు 100 టెస్ట్‌ల మార్కును తాకారు. -
సౌతాఫ్రికాతో సిరీస్‌కు న్యూజిలాండ్ జట్టు ప్రకటన.. రచిన్ రీఎంట్రీ..?
సౌతాఫ్రికా స్వదేశంలో జరుగనున్న రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ కోసం న్యూజిలాండ్ జట్టును ఇవాళ (జనవరి 26) ప్రకటించారు. ఈ సిరీస్‌లో టిమ్ సౌథీ న్యూజిలాండ్ కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. రైట్ ఆర్మ్ మీడియం పేసర్ విల్ ఓ రూర్కీకు తొలి సారి టెస్ట్ జట్టులో అవకాశం లభించింది. వరల్డ్‌కప్ హీరో రచిన్ రవీంద్ర ఈ సిరీస్‌తో టెస్ట్‌ల్లోకి రీఎంట్రీ ఇచ్చే అవకాశం ఉంది. అయితే రచిన్ వన్డేల్లోలా ఓపెనర్‌గా కాకుండా మిడిలార్డర్లో ఆడాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఎంపిక చేసిన జట్టులో సీనియర్ ప్లేయర్ హెన్రీ నికోల్స్‌కు అవకాశం లభించలేదు కాదు కాబట్టి రచిన్‌కు దాదాపు లైన్ క్లియర్ అయినట్లే. 2021 భారత పర్యటనలో టెస్ట్ అరంగేట్రం చేసిన రచిన్.. ఆ పర్యటనలో రెండు టెస్ట్‌లు, ఆతర్వాత 2022లో బంగ్లాదేశ్‌తో జరిగిన టెస్ట్‌లో మాత్రమే ఆడాడు. ఆతర్వాత రచిన్‌కు టెస్ట్ జట్టులో అవకాశం దొరకలేదు. తిరిగి ఇన్నాళ్లకు రచిన్‌కు టెస్ట్ జట్టులో ఆడే అవకాశం వచ్చింది. వన్డే వరల్డ్‌కప్ 2023 అద్భుత ప్రదర్శనకు గానూ రచిన్ గతేడాది ఐసీసీ ఎమర్జింగ్ ప్లేయర్ ఆఫ్ ద ఇయర్ అవార్డు గెలుచుకున్న విషయం తెలిసిందే. కాగా, ఈ సిరీస్‌లోని తొలి మ్యాచ్ మౌంట్ మాంగనూయ్ వేదికగా ఫిబ్రవరి 4 నుంచి 8 వరకు.. రెండో మ్యాచ్ హ్యామిల్టన్ వేదికగా ఫిబ్రవరి 13 నుంచి 17 తేదీల మధ్యలో జరుగుతుంది. సౌతాఫ్రికాతో సిరీస్‌కు న్యూజిలాండ్ జట్టు: టిమ్ సౌథీ (కెప్టెన్), టామ్ బ్లండెల్, డెవాన్ కాన్వే, మ్యాట్ హెన్రీ, కైల్ జేమీసన్, టామ్ లాథమ్, డారిల్ మిచెల్, విల్ ఓ రూర్కీ (రెండో టెస్టుకు మాత్రమే), గ్లెన్ ఫిలిప్స్, రచిన్ రవీంద్ర, మిచెల్ సాంట్నర్, నీల్ వాగ్నర్, కేన్ విలియమ్సన్ , విల్ యంగ్ -
చరిత్ర సృష్టించిన కివీస్ పేసర్: ప్రపంచంలోనే ఏకైక బౌలర్‌గా రికార్డు
New Zealand vs Pakistan, 1st T20I: న్యూజిలాండ్ వెటరన్ పేసర్ టిమ్ సౌతీ సరికొత్త చరిత్ర సృష్టించాడు. అంతర్జాతీయ టీ20 క్రికెట్లో 150 వికెట్ల మైలురాయిని అందుకున్నాడు. తద్వారా క్రికెట్ ప్రపంచంలో ఈ ఘనత సాధించిన తొలి బౌలర్‌గా రికార్డులకెక్కాడు. పాకిస్తాన్‌తో తొలి టీ20 సందర్భంగా సౌతీ ఈ అరుదైన ఫీట్ నమోదు చేశాడు. కాగా ఐదు టీ20లు ఆడేందుకు పాకిస్తాన్ జట్టు న్యూజిలాండ్ పర్యటనకు వెళ్లింది. ఇందులో భాగంగా ఇరుజట్ల మధ్య అక్లాండ్ వేదికగా తొలి మ్యాచ్ జరిగింది. టాస్ గెలిచిన షాహిన్ ఆఫ్రిది బృందం న్యూజిలాండ్‌ను తొలుత బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. ఈ క్రమంలో డారిల్ మిచెల్(27 బంతుల్లో 61- నాటౌట్), కెప్టెన్ విలియమ్సన్ (57) అద్భుత అర్ధ శతకాలతో మెరవగా.. కివీస్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు నష్టపోయి 226 పరుగులు సాధించింది. ఇక భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన పాకిస్తాన్ 18 ఓవర్లకే చేతులెత్తేసింది. 180 పరుగులకు ఆలౌట్ అయి 46 పరుగుల తేడాతో ఓడిపోయింది. ఏకైక బౌలర్‌గా రికార్డు ఇదిలా ఉంటే.. ఈ మ్యాచ్‌లో టిమ్ సౌతీ.. మహ్మద్ రిజ్వాన్(25), ఇఫ్తికర్ అహ్మద్(24) రూపంలో రెండు బిగ్ వికెట్లు తీశాడు. అబ్బాస్ ఆఫ్రిదిని అవుట్ చేసిన క్రమంలో.. అంతర్జాతీయ టీ20లలో తన 150వ వికెట్ నమోదు చేశాడు సౌతీ. ప్రపంచంలో ఈ ఘనత సాధించిన ఏకైక బౌలర్‌గా నిలిచాడు. ఇక అబ్బాస్ తర్వాత హ్యారిస్ రవూఫ్‌ను పెవిలియన్‌కు పంపిన సౌతీ తొలి టీ20లో న్యూజిలాండ్ విజయాన్ని ఖరారు చేశాడు. నంబర్ 2 ఎవరంటే ఇదిలా ఉంటే.. అంతర్జాతీయ టీ20లలో అత్యధిక వికెట్లు తీసిన జాబితాలో 35 ఏళ్ల కివీస్ ఫాస్ట్‌బౌలర్ టిమ్ సౌతీ(151) అగ్రస్థానంలో ఉండగా.. 140 వికెట్లతో బంగ్లాదేశ్ స్పిన్ ఆల్‌రౌండర్ షకీబ్ అల్ హసన్ రెండో స్థానంలో కొనసాగుతున్నాడు. ఇక ఈ అరుదైన లిస్టులో న్యూజిలాండ్ నుంచి ఇష్ సోధి(127), మిచెల్ సాంట్నర్(105) కూడా చోటు దక్కించుకోవడం విశేషం. చదవండి: Ind vs Afg: అందుకే 19వ ఓవర్లో బంతి అతడి చేతికి: రోహిత్ శర్మ -
Ban vs NZ: న్యూజిలాండ్‌కు మరో షాకిచ్చిన బంగ్లాదేశ్.. తొలిరోజే..
Bangladesh vs New Zealand, 2nd Test: బంగ్లాదేశ్‌తో రెండో టెస్టులోనూ న్యూజిలాండ్‌కు శుభారంభం లభించలేదు. తొలి ఇన్నింగ్స్ ఆతిథ్య జట్టును 172 పరుగులకే కట్టడి చేశామన్న సంతోషం కివీస్ జట్టుకు ఎక్కువ సేపు నిలవలేదు. తొలి రోజు ఆట ముగిసే సరికి అనూహ్యంగా బంగ్లాదేశ్ ఆధిక్యంలోకి వచ్చింది. రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ ఆడేందుకు న్యూజిలాండ్ బంగ్లా పర్యటనకు వెళ్లిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా సిల్హైట్లో జరిగిన తొలి మ్యాచ్‌లో కివీస్‌కు ఘోర పరభావం ఎదురైంది. బంగ్లాదేశ్ గడ్డపై మొదటిసారి ఆతిథ్య జట్టు చేతిలో.. అది కూడా 150 పరుగుల భారీ తేడాతో ఓటమిపాలైంది. ఈ క్రమంలో రెండో టెస్టులోనైనా సత్తా చాటాలని భావిస్తోంది టిమ్ సౌథీ బృందం. ఇందులో భాగంగా ఢాకాలో బుధవారం మొదలైన మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాను 172 పరుగులకు కట్టడి చేసింది. మిచెల్ సాంట్నర్, గ్లెన్ ఫిలిప్స్ మూడేసి వికెట్లు పడగొట్టగా.. అజాజ్ పటేల్ రెండు, సౌథీ ఒక వికెట్ తమ ఖాతాలో వేసుకున్నారు. ఆరంభంలోనే కివీస్‌కు షాక్ ఈ నేపథ్యంలో బ్యాటింగ్‌కు దిగిన న్యూజిలాండ్‌కు బంగ్లా స్పిన్నర్ తైజుల్ ఇస్లాం ఆరంభంలోనే షాకిచ్చాడు. ఓపెనర్ టామ్ లాథమ్‌ను 4 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద పెవిలియన్‌కు పంపించాడు. మరో ఓపెనర్ డెవాన్ కాన్వే(11), వన్‌డౌన్ బ్యాటర్ కేన్ విలియమ్సన్(13)ను మెహిది హసన్ మిరాజ.. ఆ తర్వాతి స్థానంలో వచ్చిన హెన్రీ నికోల్స్(1)ను తైజుల్ అవుట్ చేశారు. ఆరో స్థానంలో వచ్చిన వికెట్ కీపర్ టామ్ బ్లండెల్‌ను హసన్ మిరాజ్ డకౌట్ చేయగా.. వెలుతురు లేమి కారణంగా తొలి రోజు ఆట ముగిసే సరికి ఐదో నంబర్ బ్యాటర్ డారిల్ మిచెల్ 12, ఎనిమిదో స్థానంలో వచ్చిన గ్లెన్ ఫిలిప్స్ 5 పరుగులతో అజేయంగా నిలిచారు. ఈ క్రమంలో బుధవారం నాటి ఆట పూర్తయ్యేసరికి న్యూజిలాండ్ 12.4 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 55 పరుగులు మాత్రమే చేసి వెనుకబడిపోయింది. హైలైట్స్ ఇవే ఇక ఈ మ్యాచ్‌లో బంగ్లాదేశ్ బ్యాటర్ ముష్ఫికర్ రహీం వింతైన పద్ధతిలో అవుట్ కావడం హైలైట్‌గా నిలిచింది. జెమీసన్ బౌలింగ్‌లో వికెట్ల దిశగా వెళ్తున్న బంతిని చేతితో ఆపి రహీం హ్యాండిలింగ్ ద బాల్ నిబంధన వల్ల పెవిలియన్ చేరాడు. మరోవైపు.. తొలిరోజు ఆటలోనే మొత్తంగా 15 వికెట్లు కూలడం మరో విశేషం. మొత్తానికి ఢాకా పిచ్ స్పిన్నర్లకు బాగా అనుకూలించింది. ఇక న్యూజిలాండ్ ప్రస్తుతం బంగ్లా కంటే 117 పరుగులు వెనుకబడి ఉంది. చదవండి: కోహ్లి, రోహిత్ కాదు! నా ప్రపంచ రికార్డులు బద్దలు కొట్టే సత్తా అతడికే ఉంది: లారా Did Mushfiqur Rahim really need to do that? He's been given out for obstructing the field! This one will be talked about for a while... . .#BANvNZ pic.twitter.com/SC7IepKRTh — FanCode (@FanCode) December 6, 2023 -
న్యూజిలాండ్‌కు భారీ షాక్.. చరిత్ర సృష్టించిన బంగ్లాదేశ్.. భారీ విజయంతో..
Bangladesh vs New Zealand, 1st Test: పటిష్ట న్యూజిలాండ్ జట్టుకు బంగ్లాదేశ్ ఊహించని షాకిచ్చింది. సొంతగడ్డపై ఆకాశమే హద్దుగా చెలరేగి కివీస్‌పై భారీ విజయం సాధించింది. తొలి టెస్టులో టిమ్ సౌథీ బృందాన్ని ఏకంగా 150 పరుగుల తేడాతో చిత్తు చేసి చరిత్ర సృష్టించింది. కాగా రెండు టెస్టులు ఆడే నిమిత్తం న్యూజిలాండ్ జట్టు బంగ్లాదేశ్‌లో పర్యటిస్తోంది. ఈ క్రమంలో మంగళవారం(నవంబరు 28) ఇరు జట్ల మధ్య సిల్హెట్ వేదికగా తొలి టెస్టు ఆరంభమైంది. ఇందులో టాస్ గెలిచిన బంగ్లాదేశ్ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ క్రమంలో తొలి ఇన్నింగ్స్‌లో ఆతిథ్య బంగ్లా 310 పరుగులకు ఆలౌట్ కాగా.. న్యూజిలాండ్ 317 పరుగులు చేసి స్వల్ప ఆధిక్యంలో నిలిచింది. ఇక రెండో ఇన్నింగ్స్‌ను బంగ్లాదేశ్ 338 పరుగుల వద్ద ముగించగా.. కివీస్ 181 పరుగులకే చాపచుట్టేసింది. బంగ్లాదేశ్ వెటరన్ స్పిన్నర్, తైజుల్ ఇస్లాం ఆరు వికెట్లతో చెలరేగి కివీస్ బ్యాటింగ్ ఆర్డర్ పతనాన్ని శాసించాడు. డెవాన్ కాన్వే, కేన్ విలియమ్సన్, టామ్ బ్లండెల్ రూపంలో కీలక వికెట్లు తీసిన తైజుల్.. కైలీ జెమీషన్, ఇష్ సోధి, టిమ్ సౌథీలను కూడా అవుట్ చేసి శనివారం నాటి ఐదోరోజు తొలి సెషన్లోనే మ్యాచ్‌ను ముగించాడు. టెస్టుల్లో షాంటో బృందం సరికొత్త చరిత్ర ఇలా బంగ్లా విజయంలో కీలక పాత్ర పోషించి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్నాడు. కాగా సొంతగడ్డపై న్యూజిలాండ్‌పై బంగ్లాదేశ్‌కు ఇదే తొలి టెస్టు గెలుపు. ఈ క్రమంలో బంగ్లాదేశ్ టెస్టు జట్టుకు తొలిసారి సారథిగా వ్యవహరించిన నజ్ముల్ షాంటో ఈ మేరకు చారిత్రాత్మక విజయం అందుకోవడం విశేషం. ఇక గత 18 టెస్టుల్లోనూ బంగ్లాదేశ్‌కు ఇదే రెండో విజయం కావడం గమనార్హం. నాలుగో రోజు ఆట ముగిసిందిలా కాగా.. 332 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన న్యూజిలాండ్ మ్యాచ్ నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి తమ రెండో ఇన్నింగ్స్‌లో 113 పరుగులకే 7 వికెట్లు కోల్పోయింది. డరైల్ మిచెల్ (44 నాటౌట్) మినహా ఇతర బ్యాటర్లంతా విఫలమయ్యారు. లెఫ్టార్మ్ స్పిన్నర్ తైజుల్ ఇస్లామ్ (4/24) నాలుగు వికెట్లతో ప్రత్యర్థిని దెబ్బ తీశాడు. అంతకు ముందు ఓవర్‌నైట్ స్కోరు 212/3తో శుక్రవారం ఆట కొనసాగించిన బంగ్లాదేశ్ తమ రెండో ఇన్నింగ్స్‌లో 338 పరుగులకు ఆలౌటైంది. ముష్ఫికర్ రహీమ్ (67), మెహదీ హసన్ మిరాజ్ (50 నాటౌట్) అర్ధసెంచరీలు చేశారు. ఇక ఐదో రోజు ఆటలో భాగంగా విజయానికి కివీస్ మరో 219 పరుగులు చేయాల్సి ఉండగా.. స్పిన్నర్ నయీం హసన్ తొలి వికెట్ తీయగా.. తైజుల్ మరో రెండు వికెట్లు తీసి న్యూజిలాండ్ ఓటమిని ఖరారు చేశాడు. చదవండి: అదొక్కటే కలిసి రాలేదు.. అతడిని ఒత్తిడిలోకి నెట్టడం ఇష్టం: సూర్య టీమిండియా హెడ్‌కోచ్ అయితేనేం! కుమారుల కోసం అలా.. -
టీమిండియాతో మ్యాచ్.. న్యూజిలాండ్‌కు గుడ్ న్యూస్!
వన్డే ప్రపంచకప్-2023లో వరుస విజయాలతో దూసుకుపోతున్న న్యూజిలాండ్.. ఇప్పుడు మరో కీలక పోరుకు సిద్దమైంది. ఈ మెగా టోర్నీలో భాగంగా ఆదివారం(ఆక్టోబర్22)న ధర్మశాల వేదికగా టీమిండియాతో కివీస్ తలపడనుంది. ఈ మ్యాచ్‌కు ముందు న్యూజిలాండ్‌కు గుడ్ న్యూస్ అందింది. ఆ జట్టు స్టార్ పేసర్ టిమ్ సౌథీ భారత్‌తో మ్యాచ్‌కు అందుబాటులోకి వచ్చాడు. ఈ మెగా టోర్నీకి ముందు ఇంగ్లండ్‌తో జరిగిన వన్డే సిరీస్‌లో సౌథీ చేతి వేలికి గాయమైంది. దీంతో అప్పటి నుంచి ఆటకు దూరంగా ఉన్నాడు. తమ జట్టుతో కలిసి భారత్‌కు వచ్చినప్పటికీ మొదటి నాలుగు మ్యాచ్‌లకు దూరమయ్యాడు. అయితే సౌథీ ఇప్పుడు పూర్తి ఫిట్నెస్ సాధించి జట్టు సెలక్షన్‌కు అందుబాటోకి వచ్చాడు. ఈ విషయాన్ని న్యూజిలాండ్ స్టాండింగ్ కెప్టెన్ టామ్ లాథమ్ ధృవీకరించాడు. "భారత్‌తో మ్యాచ్ కోసం అతృతగా ఎదురుచూస్తున్నాము. ఇది గొప్ప పోటీ. ప్రపంచవ్యాప్తంగా కివీస్ ఎక్కడ ఆడినా అభిమానుల నుంచి సపోర్ట్ ఉంటుంది. ఈ భారత్‌లో కూడా బ్లాక్ క్యాప్స్‌కు చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. ఇప్పటివకు ఈ టోర్నీలో ఇప్పటివరకు అద్బుత విజయాలు సాధించాం. రాబోయే మ్యాచ్‌ల్లో కూడా అదే రిథమ్‌ను కొనసాగించేందుకు ప్రయత్నిస్తాం. ఇక కేన్ విలియమ్సన్ జట్టుతో ఉన్నప్పటికీ బొటనవేలు గాయంతో బాధపడతున్నాడు. అతడు రోజు రోజుకు బాగా కోలుకుంటున్నాడు. అతడు త్వరలోనే తిరిగి మైదానంలో అడుగుపెడతాడని ఆశిస్తున్నాను. అయితే టిమ్ సౌథీ మాత్రం ఫిట్నెస్ సాధించాడు. అతడు భారత్‌తో మ్యాచ్‌కు జట్టు సెలక్షన్‌కు అందుబాటులో ఉండనున్నాడు" అని ప్రీ మ్యాచ్ కాన్ఫరెన్స్‌లో టామ్ లాథమ్ పేర్కొన్నాడు. -
న్యూజిలాండ్‌కు గుడ్‌న్యూస్.. కేన్ మామ వచ్చేసాడు!
వన్డే ప్రపంచకప్-2023లో వరుసగా మూడో విజయంపై న్యూజిలాండ్ కన్నేసింది. ఈ మెగా టోర్నీలో భాగంగా శుక్రవారం చెన్నై వేదికగా బంగ్లాదేశ్‌తో కివీస్ తలపడనుంది. ఈ మ్యాచ్‌కు ముందు న్యూజిలాండ్‌కు గుడ్ న్యూస్ అందింది. ఆ జట్టు రెగ్యూలర్ కెప్టెన్, స్టార్ బ్యాటర్ కేన్ విలియమ్సన్ బంగ్లాదేశ్‌తో మ్యాచ్‌కు బరిలో దిగనున్నాడు. ఈ టోర్నీలో తొలి రెండు మ్యాచ్‌లకు గాయం కారణంగా విలియమ్సన్ దూరమయ్యాడు. అయితే ఇప్పుడు కేన్ మామ పూర్తి ఫిట్నెస్ సాధించినట్లు సమాచారం. విలియమ్సన్ రాకతో కివీస్ జట్టు మరింత బలంగా తయారుకానుంది. కాగా ఐపీఎల్-2023 సీజన్ సందర్భంగా గాయపడిన విలియమ్సన్ అప్పటినుంచి కివీస్ జట్టుకు దూరంగా ఉన్నాడు. ఈ మెగా టోర్నీ ఆరంభానికి ముందు రెండు వామప్ మ్యాచ్‌ల్లోనూ బ్యాటింగ్ చేసిన కేన్.. మ్యాచ్ మధ్యలోనే రిటైర్ హర్ట్‌గా వెనుదిరిగాడు. ఇప్పడు తన ఫిట్నెస్ను నిరూపించుకోవడంతో రిఎంట్రీ ఇచ్చేందుకు సిద్దమయ్యాడు. మరోవైపు స్టార్ పేసర్ టిమ్ సౌథీ ఇంకా పూర్తి ఫిట్నెస్ సాధించనట్లు తెలుస్తోంది. సౌథీ చేతివేలి గాయంతో బాధపడతున్నాడు. ఈ క్రమంలో బంగ్లాతో మ్యాచ్‌కు కూడా సౌథీ దూరమయ్యే ఛాన్స్ ఉంది. వరల్డ్‌కప్‌కు న్యూజిలాండ్ జట్టు: డెవాన్ కాన్వే, కేన్ విలియమ్సన్ (కెప్టెన్), డారిల్ మిచెల్, రచిన్ రవీంద్ర, టామ్ లాథమ్ (వికెట్ కీపర్), గ్లెన్ ఫిలిప్స్, మార్క్ చాప్మన్, మిచెల్ సాంట్నర్, మాట్ హెన్రీ, లాకీ ఫెర్గూసన్, ట్రెంట్ బౌల్ట్, విల్ యంగ్, టిమ్ సౌతీ, జేమ్స్ నీషమ్, ఇష్ సోధి చదవండి: SMT 2023: తిలక్ వర్మకు బంపరాఫర్.. ఏకంగా జట్టు కెప్టెన్‌గా ప్రమోషన్ -
న్యూజిలాండ్‌కు మరో బిగ్ షాక్.. స్టార్ బౌలర్ దూరం
వన్డే ప్రపంచకప్-2023లో ఇంగ్లండ్‌తో తొలి మ్యాచ్‌కు ముందు న్యూజిలాండ్‌కు మరో బిగ్‌షాక్ తగిలింది. ఆ జట్టు స్టార్ పేసర్ టిమ్ సౌథీ గాయం కారణంగా మొదటి మ్యాచ్‌కు దూరం కానున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే కివీస్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ గాయం కారణంగా ఇంగ్లండ్‌తో మ్యాచ్‌కు దూరమయ్యాడు. ఇప్పుడు సౌథీ కూడా దూరం కావడం కివీస్ నిజంగా గట్టి ఎదురు దెబ్బ అనే చెప్పుకోవాలి. కాగా ఇంగ్లండ్‌తో వన్డే సిరీస్ సందర్భంగా సౌథీ బొటనవేలు గాయమైంది. వెంటనే సిరీస్ మధ్యలో స్వదేశానికి వెళ్లిపోయాడు. అయితే వరల్డ్‌కప్ జట్టు ప్రకటనకు ముందు సౌథీ ఫిట్‌గా ఉన్నాడని కివీస్ ప్రకటించింది. కానీ భారత్‌కు వచ్చిన సౌథీ ఇంకా గాయంతో బాధపడుతున్నట్లు సమాచారం. అతడు పూర్తిగా కోలుకోవడానికి మరో పది రోజుల సమయం పట్టనున్నట్లు పలు రిపోర్ట్లు పేర్కొంటున్నాయి. పాకిస్తాన్‌తో జరిగిన వామాప్ మ్యాచ్‌లో కూడా సౌథీ బరిలోకి దిగలేదు. ఈ క్రమంలో అతడి స్ధానంలో జామీసన్ తొలి మ్యాచ్ ఆడే అవకాశం ఉంది. ఆక్టోబర్ 5న అహ్మదాబాద్ వేదికగా ఆరంభ మ్యాచ్‌లో ఇరు జట్లు తలపడనున్నాయి. న్యూజిలాండ్ వరల్డ్ కప్ జట్టు: కేన్ విలియమ్సన్ (కెప్టెన్), ట్రెంట్ బౌల్ట్, మార్క్ చాప్మన్, డెవాన్ కాన్వే, లాకీ ఫెర్గూసన్, మ్యాట్ హెన్రీ, టామ్ లాథమ్, డారిల్ మిచెల్, జిమ్మీ నీషమ్, గ్లెన్ ఫిలిప్స్, రచిన్ రవీంద్ర, మిచెల్ శాంట్నర్, ఇష్ సోధి, టిమ్ సౌథీ, విల్ యంగ్. చదవండి: కొంచెం బాధగా ఉంది.. నాకు అలవాటు అయిపోయింది: చాహల్ -
చరిత్ర సృష్టించిన న్యూజిలాండ్ కెప్టెన్.. ప్రపంచంలో తొలి బౌలర్‌గా
న్యూజిలాండ్ టెస్టు కెప్టెన్, స్టార్ పేసర్ టిమ్ సౌథీ అరుదైన ఘనత సాధించాడు. అంతర్జాతీయ టీ20ల్లో అత్యధిక వికెట్లు పడగొట్టిన బౌలర్‌గా సౌథీ రికార్డులకెక్కాడు. చెస్టర్-లీ-స్ట్రీట్ వేదికగా ఇంగ్లండ్‌తో జరిగిన తొలి టీ20లో జానీ బెయిర్‌స్టోను ఔట్ చేసిన సౌథీ.. ఈ అరుదైన రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. ఇప్పటివరకు 111 టీ20 మ్యాచ్‌లు ఆడిన ఈ కివీస్ వెటరన్ 8.13 ఏకనామీతో 141 వికెట్లు పడగొట్టాడు. కాగా అంతకుముందు ఈ రికార్డు బంగ్లాదేశ్ కెప్టెన్ షకీబ్ అల్ హసన్(140) పేరిట ఉండేది. తాజా మ్యాచ్‌తో షకీబ్ రికార్డును సౌథీ బ్రేక్ చేశాడు. కాగా రెగ్యూలర్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ గాయం కారణంగా దూరం కావడంతో ఇంగ్లండ్ పర్యటనలో కివీస్ జట్టును సౌథీ నడిపిస్తున్నాడు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. ఇంగ్లండ్ చేతిలో 7 వికెట్ల తేడాతో కివీస్ ఓటమి పాలైంది. తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి కేవలం 139 పరుగులు మాత్రమే చేసింది. కివీస్ బ్యాటర్లలో గ్లెన్ ఫిలిప్స్(41) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ఇంగ్లండ్ బౌలర్లలో లూక్ వుడ్, కార్స్ తలా మూడు వికెట్లు పడగొట్టగా.. రషీద్,మోయిన్ అలీ, లివింగ్ స్టోన్ చెరో వికెట్ సాధించారు. అనంతరం 140 లక్ష్యాన్ని కేవలం 14 ఓవర్లలోనే ఇంగ్లండ్ ఊదిపడేసింది. గ్లండ్ బ్యాటర్లలో డేవిడ్ మలాన్(54), హ్యారీ బ్రూక్(43 నాటౌట్) పరుగులతో మ్యాచ్‌ను మగించారు. చదవండి: Asia Cup 2023 Ind Vs Pak Clash: క్రికెట్ అభిమానులకి బ్యాడ్ న్యూస్.. భారత్- పాకిస్తాన్ మ్యాచ్ కష్టమే! -
ప్రతీకారం తీర్చుకున్న న్యూజిలాండ్.. సిరీస్ సొంతం
దుబాయ్ వేదికగా యూఏఈతో జరిగిన సిరీస్ డిసైడర్ మూడో టీ20లో 32 పరుగుల తేడాతో న్యూజిలాండ్ విజయం సాధించింది. తద్వారా మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను 2-1తేడాతో కివీస్ సొంతం చేసుకుంది. ఈవిజయంతో రెండో టీ20 ఓటమికి కివీస్ ప్రతీకారం తీర్చుకున్నట్లైంది. ఇక ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ నిర్ఱీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 166 పరుగులు చేసింది. కివీస్ బ్యాటర్లలో విల్ యంగ్(56), చాప్మన్(51) పరుగులతో రాణించారు. యూఏఈ బౌలర్లలో జునైద్ సిద్దుఖీ మూడు వికెట్లు పడగొట్టగా.. జహూర్ ఖాన్, జవదుల్లా తలా వికెట్ సాధించారు. అనంతరం 167 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన యూఏఈ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 134 పరుగులకే పరిమితమైంది. యూఏఈ బ్యాటర్లలో ఆయాన్ ఖాన్(42) పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు.బ్లాక్ క్యాప్స్ బౌలర్లలో లిస్టర్ మూడు వికెట్లు, జామీసన్, శాంట్నర్, ఆశోక్ తలా వికెట్ సాధించారు. 56 పరుగులతో రాణించిన విల్‌యంగ్‌కు మ్యాన్ ఆఫ్‌ది మ్యాచ్ అవార్డు లభించింది. చదవండి: చాలా సంతోషంగా ఉంది..10 ఏళ్లగా కష్టపడుతున్నా! నా తొలి మ్యాచ్‌లోనే: రింకూ -
న్యూజిలాండ్‌కు బిగ్‌షాకిచ్చిన పసికూన.. 7 వికెట్ల తేడాతో సంచలన విజయం
న్యూజిలాండ్‌కు పసికూన యూఏఈ బిగ్‌షాకిచ్చింది. దుబాయ్ వేదికగా కివీస్‌తో జరిగిన రెండో టీ20లో 7 వికెట్ల తేడాతో సంచలన విజయం సాధించింది. న్యూజిలాండ్‌పై యూఏఈకు ఇదే తొలి విజయం కావడం గమనార్హం. అదే విధంగా దుబాయ్ అంతర్జాతీయ మైదానంలో యూఏఈకు ఇదే మొదటి గెలుపు. దీంతో మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను 1-1తో యూఏఈ సమం చేసింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్.. యూఏఈ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 144 పరుగుల మాత్రమే చేయగల్గింది. న్యూజిలాండ్ బ్యాటర్లలో చాప్మాన్(63) మినహా మిగితా బ్యాటర్లంతా దారుణంగా విఫలమయ్యారు. యూఏఈ బౌలర్లలో ఆయాన్ ఖాన్ మూడు వికెట్లతో చెలరేగగా.. జవదుల్లా రెండు, నసీర్, మహ్మద్ ఫరాజుద్దీన్ తలా వికెట్ సాధించారు. వసీం కెప్టెన్ ఇన్నింగ్స్.. 145 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన యూఏఈ 15.4 ఓవర్లలో కేవలం 3 వికెట్లు కోల్పోయి ఛేదించింది. యూఏఈ బ్యాటర్లలో కెప్టెన్ మహ్మద్ వసీం(55) హాఫ్ సెంచరీతో చెలరేగగా.. ఆసీఫ్ ఖాన్(48 నాటౌట్) పరుగులతో రాణించాడు. కివీస్ బౌలర్లలో సౌథీ, శాంట్నర్, జేమీసన్ తలా వికెట్ సాధించారు. ఇక సిరీస్ డిసైడర్ మూడో టీ20 దుబాయ్ వేదికగా ఆదివారం జరగనుంది. చదవండి: సిరీస్‌పై భారత్ కన్ను The moment UAE became the first associate team to beat New Zealand...!! A proud day for UAE cricket. pic.twitter.com/v6t6MvpXfc — Mufaddal Vohra (@mufaddal_vohra) August 19, 2023 -
5 వికెట్లతో చెలరేగిన న్యూజిలాండ్ కెప్టెన్.. యూఏఈపై ఘన విజయం
యూఏఈతో మూడు టీ20ల సిరీస్‌లో న్యూజిలాండ్ శుభారంభం చేసింది. దుబాయ్ వేదికగా జరిగిన తొలి టీ20లో 19 పరుగుల తేడాతో కివీస్ విజయం సాధించింది. న్యూజిలాండ్ విజయంలో కెప్టెన్ టిమ్ సౌథీ కీలక పాత్ర పోషించాడు. ఇక తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 155 పరుగులు మాత్రమే చేసింది. బ్లాక్‌క్యాప్స్ బ్యాటర్లలో సీఫెర్ట్(55),మెక్కన్చీ(31) పరుగులతో రాణించారు. యూఏఈ బౌలర్లలో సిద్దుఖీ, హమీద్ తలా రెండు వికెట్లు సాధించగా.. జహూర్ ఖాన్, ఫరాజుద్దీన్ చెరో వికెట్ పడగొట్టారు. 5 వికెట్లతో చెలరేగిన సౌథీ.. 156 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన యూఏఈను టిమ్ సౌథీ ఆదిలోనే దెబ్బతీశాడు. కెప్టెన్ మహ్మద్ వసీంను తొలి బంతికే ఔట్‌చేసి కష్టాల్లో నెట్టాడు. ఈ మ్యాచ్‌లో సౌథీ 5 వికెట్లతో చెలరేగాడు. కివీస్ కెప్టెన్ సంచలన బౌలింగ్ ధాటికి యూఏఈ 136 పరుగులకే ఆలౌటైంది. యూఏఈ బ్యాటర్లలో ఓపెనర్ ఆర్యాన్ష్ శర్మ(60) మినహా మిగితా బ్యాటర్లంతా దారుణంగా విఫలమయ్యారు. ఇరు జట్ల మధ్య రెండో టీ20 దుబాయ్ వేదికగా శనివారం జరగనుంది. చదవండి: IND vs IRE: ఐర్లాండ్‌తో తొలి పోరు.. శుభారంభం లక్ష్యంగా -
కివీస్‌తో సిరీస్.. కొత్త కెప్టెన్‌గా అతడు! ‘ఫాస్టెస్ట్ సెంచరీ’ వీరుడి అరంగేట్రం!
New Zealand tour of United Arab Emirates, 2023: న్యూజిలాండ్‌తో టీ20 సిరీస్‌కు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ క్రికెట్ జట్టును ప్రకటించింది. సొంతగడ్డపై కివీస్‌తో పోరు నేపథ్యంలో 16 మంది సభ్యులతో కూడిన జట్టును ఎంపిక చేసింది. ఈ సందర్భంగా తమ టీ20 కొత్త కెప్టెన్‌గా మహ్మద్ వసీం పేరును ఖరారు చేసినట్లు యూఏఈ క్రికెట్ బోర్డు వెల్లడించింది. ఇంగ్లండ్ కంటే ముందు కాగా ఇంగ్లండ్‌తో సిరీస్‌కు ముందు న్యూజిలాండ్.. యూఏఈతో మూడు మ్యాచ్‌ల సిరీస్ ఆడనుంది. ఆగష్టు 17, 19, 20 తేదీల్లో దుబాయ్ వేదికగా ఇరు జట్ల మధ్య మూడు టీ20లు జరుగనున్నాయి. ఈ క్రమంలో కివీస్ వంటి పటిష్ట జట్టుతో తలపడనున్న వసీం సారథ్యంలో 16 మంది సభ్యులున్న జట్టును ఎంపిక చేసినట్లు యూఏఈ బోర్డు బుధవారం తెలిపింది. రిజ్వాన్ స్థానంలో వసీం సీపీ రిజ్వాన్ స్థానంలో వసీం యూఏఈ టీ20 జట్టును ముందుకు నడిపించనున్నట్లు పేర్కొంది. కాగా కివీస్‌తో సిరీస్ సందర్భంగా అసోసియేట్ దేశాల్లో వన్డేల్లో ఫాస్టెస్ట్ సెంచరీ నమోదు చేసిన అసిఫ్ ఖాన్ అంతర్జాతీయ టీ20లలో అరంగేట్రం చేయనున్నాడు. అతడితో పాటు.. దేశవాళీ క్రికెట్లో అదరగిట్టిన ఆల్‌రౌండర్ ఫరాజుద్దీన్, స్పిన్నర్ జశ్ గియనానీ కూడా ఎంట్రీ ఇవ్వనున్నారు. న్యూజిలాండ్‌తో టీ20 సిరీస్‌కు యూఏఈ జట్టు: మహ్మద్ వసీం(కెప్టెన్), అలీ నాసీర్, అన్ష్ టాండన్, ఆర్యాంశ్ శర్మ, అసిఫ్ ఖాన్, అయాన్ అఫ్జల్ ఖాన్, బాసిల్ హమీద్, ఈథన్ డిసౌజా, ఫరాజుద్దీన్, జశ్ గియనానీ, జునైద్ సిద్దిఖి, లవ్‌ప్రీత్ సింగ్, మహ్మద్ జవాదుల్లా, సంచిత్ శర్మ, వ్రిత్య అరవింద్, జహూర్ ఖాన్. యూఏఈతో సిరీస్‌కు కివీస్ జట్టు: టిమ్ సౌతీ(కెప్టెన్), అది అశోక్, చాడ్ బోస్, మార్క్ చాప్మన్, డేన్ క్లీవర్, జాకబ్ డఫీ, డీన్ ఫాక్స్‌క్రాఫ్ట్, కైలీ జెమీషన్, బెన్ లిస్టర్, కోలీ మెకాంచి, జిమ్మీ నీషం, రచిన్ రవీంద్ర, మిచెల్ సాంట్నర్, టిమ్ సీఫర్ట్, విల్ యంగ్. సిరీస్ వివరాలు ►ఆగష్టు 17, ఆగష్టు 19, ఆగష్టు 20- మూడు టీ20లు ►స్టార్ స్పోర్ట్స్, ఫ్యాన్‌కోడ్ యాప్‌లో ప్రత్యక్ష ప్రసారం ►దుబాయ్‌లోనే మూడు టీ20లు ►భారత కాలమానం ప్రకారం రాత్రి 7.30 గంటలకు మ్యాచ్‌లు ఆరంభం. చదవండి: అక్కడ ఒక్కరాత్రికి 4 వేలు ఉండేది.. ఆరోజు మాత్రం ఏకంగా 60 వేలు! Squad ALERT: We unveil the 16 for the #UAEvNZ series. Mohammad Waseem to captain. More details: https://t.co/Vq3aSFqIwx pic.twitter.com/cmYCucYLUb — UAE Cricket Official (@EmiratesCricket) August 16, 2023