
Tim Southee: ఐపీఎల్ 2022 ప్రారంభానికి ముందు మరో స్టార్ క్రికెటర్ పెళ్లి పీటలెక్కాడు. రెండ్రోజుల కిందట (మార్చి 18) ఆస్ట్రేలియా స్టార్ ఆల్‌రౌండర్, ఆర్సీబీ కీలక ఆటగాడు గ్లెన్ మ్యాక్స్‌వెల్.. తన ప్రేయసి, భారత సంతతి అమ్మాయి విని రామన్‌ను మనువాడగా, తాజాగా న్యూజిలాండ్ ఆటగాడు, కోల్‌కతా నైట్‌రైడర్స్ స్టార్ ఆల్‌రౌండర్ టిమ్ సౌథీ.. తాను చాలాకాలంగా ప్రేమిస్తున్న బ్రయా ఫహీని పెళ్లి చేసుకున్నాడు.
సౌథీ తన పెళ్లి ఫోటోను ఇన్‌స్టా షేర్ చేసి ఫరెవర్ అని క్యాప్షన్ జోడించాడు. దీంతో నెట్టింట సౌథీ దంపతులకు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. కాగా, సౌథీ జంట చాలాకాలంగా రిలేషన్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. వీరికి పెళ్లికి ముందే ఇద్దరు పిల్లలు ఉన్నారు. 2017లో ఇండీ మే సౌథీ, 2019లో స్లోయానే అవా సౌథీ వీరికి జన్మించారు.
కాగా, న్యూజిలాండ్ తరఫున 85 టెస్ట్ మ్యాచ్‌లు, 143 వన్డేలు, 92 టీ20లు ఆడిన సౌథీ.. 639 వికెట్లతో పాటు 2600కు పైగా పరుగులు సాధించాడు. ఇక ఐపీఎల్ విషయానికొస్తే.. ఈ కివీస్ ఆల్‌రౌండర్ క్యాష్ రిచ్ లీగ్‌లో చెన్నై సూపర్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్, ముంబై ఇండియన్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, కేకేఆర్ జట్ల తరఫున 43 మ్యాచ్‌లు ఆడి 31 వికెట్లు 118 పరుగులు సాధించాడు. ఐపీఎల్ 2022 మెగా వేలంలో సౌథీని కేకేఆర్ జట్టు బేస్ ప్రైజ్ రూ. 1.5 కోట్లకు కొనుగోలు చేసింది.
చదవండి: గర్ల్‌ఫ్రెండ్‌ను పెళ్లాడిన ఆసీస్ విధ్వంసకర ఆటగాడు
Comments
Please login to add a commentAdd a comment