వారెవ్వా.. డైవ్ చేస్తూ అద్భుత‌మైన క్యాచ్.. వీడియో వైరల్‌ | Tim Southee runs from long-on, dives to complete catch | Sakshi
Sakshi News home page

IPL 2022: వారెవ్వా.. డైవ్ చేస్తూ అద్భుత‌మైన క్యాచ్.. వీడియో వైరల్‌

Published Sat, Apr 2 2022 4:59 PM | Last Updated on Sat, Apr 2 2022 5:16 PM

Tim Southee runs from long-on, dives to complete catch - Sakshi

Courtesy: IPL Twitter

ఐపీఎల్‌-2022లో పంజాబ్‌ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్‌ ఆటగాడు టిమ్‌ సౌతీ అద్భుతమైన క్యాచ్‌తో మెరిశాడు. పంజాబ్‌ ఇన్నింగ్స్‌ 19 ఓవర్‌ వేసిన రసెల్‌ బౌలింగ్‌లో.. రబడా భారీ షాట్‌ ఆడటానికి ప్రయత్నించాడు. అయితే అది మిస్‌ టైమ్‌ అయ్యి బంతి గాల్లోకి లేచింది. ఈ క్రమంలో లాంగ్‌ ఆన్‌లో ఫీల్డింగ్‌ చేస్తున్న సౌతీ పరెగెత్తుకుంటూ 30 యార్డ్‌ సర్కిల్‌ లోపలకు వచ్చి డైవ్‌ చేస్తూ అద్భుతమైన క్యాచ్‌ను అందుకున్నాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

ఇక మ్యాచ్‌ విషయానికి వస్తే.. పంజాబ్‌ కింగ్స్‌పై కేకేఆర్‌ 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది.  టాస్‌ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన పంజాబ్‌ కింగ్స్‌ 18.2 ఓవర్లలో 137 పరుగులకు ఆలౌటైంది. కేకేఆర్‌ బౌలర్లో ఉమేశ్‌ యాదవ్‌ నాలుగు వికెట్లు, సౌతీ రెండు వికెట్లు, నరైన్‌, రసెల్‌ చెరో వికెట్‌ సాధించారు. పంజాబ్‌ బ్యాటర్లలో భానుక రాజపక్స(31), కగిసో రబడ(25) కీలక ఇన్నింగ్స్‌ ఆడారు. అనంతరం 138 పరుగులతో లక్ష్యంతో బరిలోకి దిగిన కేకేఆర్‌ 4 వికెట్లు కోల్పోయి చేధించింది. కేకేఆర్‌ బ్యాటర్లలో ఆండ్రీ రసెల్‌ 31 బంతుల్లో 70 పరుగులు సాధించి విధ్వంసం‍ సృష్టించాడు.

చదవండి: Tom Latham: చరిత్ర సృష్టించిన కివీస్ కెప్టెన్‌.. 24 ఏళ్ల కిందటి సచిన్ టెండూల్కర్ రికార్డు బద్దలు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement