
Courtesy: IPL Twitter
ఐపీఎల్-2022లో భాగంగా చెన్నైసూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ 54 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది. పంజాబ్ విజయంలో ఆజట్టు యువ పేసర్ వైభవ్ అరోరా కీలక పాత్ర పోషించాడు. ఐపీఎల్ అరంగేట్ర మ్యాచ్‌లోనే అరోరా ప్రత్యర్ధి బ్యాటర్లకు చుక్కలు చూపించాడు. ఈ మ్యాచ్‌లో నాలుగు ఓవర్లు వేసిన అరోరా.. 21 పరుగులు ఇచ్చి రెండు కీలక వికెట్లు పడగొట్టాడు.
రాబిన్ ఉతప్ప, మొయిన్ అలీ వంటి స్టార్ ఆటగాళ్లను పెవిలియన్ పంపి పంజాబ్‌కు ఆరోరా అద్భుతమైన ఆరంభాన్ని ఇచ్చాడు. ఆ జట్టు పేసర్ సందీప్ శర్మ స్థానంలో అరోరా తుది జట్టులో చోటు దక్కించుకున్నాడు. కాగా పంజాబ్ జట్టు తీసుకున్న నిర్ణయం సరైనది అని అరోరా నిరూపించాడు. ఈ క్రమంలో వైభవ్ అరోరా గురుంచి కొన్ని ఆసక్తికర విషయాలు తెలుసుకుందాం.
►వైభవ్ అరోరా డిసెంబర్ 14, 1997న అంబాలాలో జన్మించాడు.
► అరోరా దేశీయ స్థాయిలో హిమాచల్ ప్రదేశ్ తరపున ఆడుతున్నాడు.
► 2019లో సౌరాష్ట్రపై ఫస్ట్-క్లాస్ అరంగేట్రం చేశాడు.
► ఆరోరా టీ20ల్లో 2021లో ఛత్తీస్‌గఢ్‌పై అరంగేట్రం చేశాడు.
► 2020 ఐపీఎల్ సీజన్‌లో పంజాబ్ కింగ్స్ నెట్‌బౌలర్‌గా అరోరాను ఎంపిక చేసింది.
►2021 ఐపీఎల్ సీజన్‌లో వైభవ్ అరోరా కోల్‌కతా నైట్ రైడర్స్‌లో భాగంగా ఉన్నాడు. కానీ అతనికి అరంగేట్రం చేసే అవకాశం రాలేదు.
►ఐపీఎల్-2022 మెగా వేలంలో ఆరోరాని రూ. 2 కోట్లకు పంజాబ్ కింగ్స్ కొనుగోలు చేసింది.
►తన కెరీర్‌లో 12 టీ20 మ్యాచ్‌లు ఆడిన ఆరోరా 12 వికెట్లు పడగొట్టాడు.
Comments
Please login to add a commentAdd a comment