
photo courtesy:ipl twitter
పంజాబ్ కింగ్స్ పేసర్ వైభవ్ ఆరోరా ఐపీఎల్ అరంగేట్ర మ్యాచ్‌లోనే అదరగొట్టాడు. ఐపీఎల్- 2022లో భాగంగా సీఎస్‌కే తో జరిగిన మ్యాచ్‌లో ఆరోరా బ్యాటర్లకు తన పేస్ బౌలింగ్‌తో చుక్కలు చూపించాడు. ఈ మ్యాచ్‌లో నాలుగు ఓవర్లు బౌలింగ్ చేసిన ఆరోరా 21 పరుగులు ఇచ్చి రెండు కీలకమైన వికెట్లు పడగొట్టాడు. ఇది ఇలా ఉంటే.. క్యాష్ రిచ్ లీగ్ ప్రారంభానికి ముందు ఓ లోకల్ న్యూస్ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆరోరా తన మనసులోని మాటను బయటపెట్టాడు. తన తల్లికి ఇల్లు కొనాలని, తండ్రికి ఆర్థికంగా సహాయం చేయాలని అనుకుంటున్నట్లు ఆరోరా తెలిపాడు.
"మా నాన్న మా కోసం చాలా కష్టపడి పనిచేస్తున్నాడు. అతనికి వయస్సు కూడా సహకరిచండంలేదు. నేను మా నాన్నకు పని చేయడం మానేయమని చెప్పాను. ఐపీఎల్ నుంచి వచ్చే డబ్బుతో వారికి సహాయం చేయాలనుకుంటున్నాను. అలాగే మా అమ్మకు మంచి ఇల్లు బహుమతిగా ఇవ్వాలనుకుంటున్నాను" అని ఆరోరా పేర్కొన్నాడు. ఇక ఐపీఎల్-2021లో కోల్‌కతా జట్టులో భాగమైన ఆరోరాకు ఐపీఎల్‌లో అరంగేట్రం చేసే అవకాశం రాలేదు. ఐపీఎల్-2022 మెగా వేలంలో అతడిని రూ. 2కోట్లకు పంజాబ్ కింగ్స్ కొనుగోలు చేసింది. పంజాబ్‌కు చెందిన ఈ యువ పేసర్ దేశీయస్థాయిలో హిమాచల్ ప్రదేశ్ తరపున ప్రాతినిద్యం వహిస్తున్నాడు.
చదవండి: World Cup 2022: భారత క్రికెటర్లకు ఘోర అవమానం.. ఆ జట్టులో ఒక్కరికి కూడా..!