Vaibhav Arora
-
IPL 2024: కేకేఆర్ స్టార్ పేసర్‌కు గ్రాండ్ వెల్కమ్
ఐపీఎల్ 2024 సీజన్ టైటిల్ గెలిచాక సొంత పట్టణం అంబాలకు (హర్యానా) విచ్చేసిన కేకేఆర్ స్టార్ పేసర్ వైభవ్ అరోరాకు ఘన స్వాగతం లభించింది. వైభవ్‌ను అతని సన్నిహితులు, అభిమానులు, అంబాల వాసులు డప్పు వాయిద్యాల మధ్య పూల మాలలు వేసి ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా వైభవ్‌తో ఫోటోలు దిగేందుకు జనాలు ఎగబడ్డారు. అనంతరం వైభవ్ ఓపెన్ టాప్ జీపులో ర్యాలీగా వెళ్లాడు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరలవుతుంది. ఐపీఎల్ 2024 సీజన్ ముగిసి వారం రోజులు పూర్తయినా జనాలు ఇంకా అదే మూడ్‌లో ఉన్నారు. 27 ఏళ్ల వైభవ్ ఈ ఐపీఎల్ సీజన్లో అద్భుతమైన ప్రదర్శనలతో చెలరేగాడు. వైభవ్ ఈ సీజన్లో 10 మ్యాచ్‌ల్లో 11 వికెట్లు తీసి కేకేఆర్ విజయంలో ప్రధానపాత్ర పోషించాడు. Vaibhav Arora gets a hero's welcome to his hometown after IPL win. 🏆pic.twitter.com/PhWOMk76Y6— Mufaddal Vohra (@mufaddal_vohra) June 1, 2024రైట్ ఆర్మ్ ఫాస్ట్ బౌలర్ అయిన వైభవ్.. సహచరుడు హర్షిత్ రాణా, మిచెల్ స్టార్క్‌లతో కలిసి కేకేఆర్ పేస్ అటాక్‌ను లీడ్ చేశాడు. లోయర్ ఆర్డర్లో ఉపయోగకర బ్యాటర్ కూడా అయిన వైభవ్‌ను కేకేఆర్ ఈ సీజన్ వేలంలో 60 లక్షలకు సొంతం చేసుకుంది. వైభవ్ ఇప్పటివరకు 21 ఐపీఎల్ మ్యాచ్‌లు ఆడి 19 వికెట్లు పడగొట్టాడు. వైభవ్ దేశవాలీ క్రికెట్లో హిమాచల్ ప్రదేశ్‌కు ప్రాతినిథ్యం వహిస్తాడు. 2021లో ఐపీఎల్ అరంగేట్రం చేసిన వైభవ్ ఆ సీజన్లో కేకేఆర్‌కు ఆడి ఆతర్వాతి సీజన్లో (2022) పంజాబ్ కింగ్స్‌కు ప్రాతినిథ్యం వహించాడు. ఈ సీజన్లో వైభవ్ తిరిగి కేకేఆర్ పంచన చేరాడు. ఈ సీజన్లో వైభవ్‌కు చాలా పాపులారిటీ వచ్చింది. సన్‌రైజర్స్‌తో జరిగిన ఫైనల్లో వైభవ్ 3 ఓవర్లలో 24 పరుగులిచ్చి అత్యంత కీలకమైన ట్రవిస్ హెడ్ వికెట్ తీశాడు. ఈ సీజన్ ప్రదర్శనల కారణంగా కేకేఆర్ తదుపరి సీజన్లోనూ ఇతన్ని రీటెయిన్ చేసుకునే అవకాశం ఉంది. -
పనిష్మెంట్.. అంపైర్లతో రాణా అలా.. వైరల్! ఎందుకో ప్రతిదానికీ ఇలా!
IPL 2023 CSK vs KKR- Nitish Rana: ఐపీఎల్-2023లో చెన్నై సూపర్ కింగ్స్‌తో మ్యాచ్‌పై గెలుపొందిన కోల్‌కతా నైట్ రైడర్స్ ప్లే ఆఫ్స్ అవకాశాలను సజీవంగా నిలుపుకొంది. తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో సీఎస్కేపై 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. పటిష్ట చెన్నై జట్టును వారి సొంతగడ్డపై ఓడించి సత్తా చాటింది. ఇదిలా ఉంటే.. ఆదివారం నాటి ఈ మ్యాచ్‌లో కెప్టెన్ ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్న నితీశ్ రాణా.. సీఎస్కే ఇన్నింగ్స్ సమయంలో వ్యవహరించిన తీరు విమర్శలకు దారితీసింది. సీఎస్కే బ్యాటింగ్ చేస్తున్నపుడు ఆఖరి ఓవర్ వేసేందుకు కేకేఆర్ అరోరా సమాయత్తమయ్యాడు. అంపైర్లతో రాణా గొడవ! అయితే, స్లో ఓవర్ రేటు మెయింట్ చేస్తున్న కారణంగా.. కొత్త నిబంధనల ప్రకారం మైదానంలోనే కేకేఆర్ మూల్యం చెల్లించాల్సి వచ్చింది. 30 యార్డ్ సర్కిల్ బయట ఐదుగురికి బదులు నలుగురు ఫీల్డర్లనే ప్లేస్ చేయాలని అంపైర్లు సూచించారు. దీంతో కోపోద్రిక్తుడైన నితీశ్ రాణా.. అంపైర్ల వద్దకు వచ్చి వాగ్వాదానికి దిగాడు. ఎందుకో ప్రతిదానికీ ఇలా ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. ఇందులో అంపైర్లు నిబంధనల ప్రకారం నడుచుకోవాల్సిందేనని తేల్చిచెప్పడంతో రాణా అక్కడి నుంచి కదలినట్లు కనిపించింది. ఈ వీడియోపై స్పందించిన నెటిజన్లు.. ‘‘ఎవరైనా రూల్స్ పాటించాల్సిందే కదా! ఎందుకో ప్రతిదానికి గొడవపడటం’’ అంటూ తమదైన శైలిలో కామెంట్లు చేస్తున్నారు. గెలిచి నిలిచిన కేకేఆర్ ఇక సీఎస్కే ఇన్నింగ్స్‌లో ఆఖరి ఓవర్ వేసిన వైభవ్ అరోరా.. 9 పరుగులు మాత్రమే ఇచ్చి రవీంద్ర జడేజా వికెట్ తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ క్రమంలో సీఎస్కేను 144 పరుగులకే కట్టడి చేసిన కేకేఆర్.. నితీశ్ రాణా, రింకూ సింగ్ అర్ధ శతకాలతో రాణించడంతో జయకేతనం ఎగురవేసింది. ఈ మ్యాచ్‌లో రాణా 44 బంతుల్లో 6 ఫోర్లు, ఒక సిక్స్ సాయంతో 57 పరుగులతో అజేయంగా నిలవగా.. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ రింకూ సింగ్ 43 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 54 పరుగులు సాధించాడు. ఇక సీఎస్కేను ఆరు వికెట్ల తేడాతో ఓడించిన కేకేఆర్ ఇప్పటి వరకు ఆడిన 13 మ్యాచ్‌లలో ఆరు గెలిచి 12 పాయింట్లతో ప్లే ఆఫ్స్ రేసులో నిలిచింది. చదవండి: వాళ్ల తప్పేం లేదు..! అతడు అద్భుతం.. జట్టుకు దొరికిన విలువైన ఆస్తి: ధోని మార్క్రమ్ చేసిన తప్పు.. ఆలస్యంగా వెలుగులోకి pic.twitter.com/DW2nun5NJs — Raju88 (@Raju88784482906) May 14, 2023 𝙔𝙚𝙡𝙡𝙤𝙫𝙚! 💛 A special lap of honour filled with memorable moments ft. @msdhoni & Co. and the ever-so-energetic Chepauk crowd 🤗#TATAIPL | #CSKvKKR | @ChennaiIPL pic.twitter.com/yHntEpuHNg — IndianPremierLeague (@IPL) May 14, 2023 -
ఆ డబ్బుతో మా అమ్మకు ఇల్లు కొంటా.. అలాగే మా నాన్నకు..
పంజాబ్ కింగ్స్ పేసర్ వైభవ్ ఆరోరా ఐపీఎల్ అరంగేట్ర మ్యాచ్‌లోనే అదరగొట్టాడు. ఐపీఎల్- 2022లో భాగంగా సీఎస్కే తో జరిగిన మ్యాచ్‌లో ఆరోరా బ్యాటర్లకు తన పేస్ బౌలింగ్‌తో చుక్కలు చూపించాడు. ఈ మ్యాచ్‌లో నాలుగు ఓవర్లు బౌలింగ్ చేసిన ఆరోరా 21 పరుగులు ఇచ్చి రెండు కీలకమైన వికెట్లు పడగొట్టాడు. ఇది ఇలా ఉంటే.. క్యాష్ రిచ్ లీగ్ ప్రారంభానికి ముందు ఓ లోకల్ న్యూస్ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆరోరా తన మనసులోని మాటను బయటపెట్టాడు. తన తల్లికి ఇల్లు కొనాలని, తండ్రికి ఆర్థికంగా సహాయం చేయాలని అనుకుంటున్నట్లు ఆరోరా తెలిపాడు. "మా నాన్న మా కోసం చాలా కష్టపడి పనిచేస్తున్నాడు. అతనికి వయస్సు కూడా సహకరిచండంలేదు. నేను మా నాన్నకు పని చేయడం మానేయమని చెప్పాను. ఐపీఎల్ నుంచి వచ్చే డబ్బుతో వారికి సహాయం చేయాలనుకుంటున్నాను. అలాగే మా అమ్మకు మంచి ఇల్లు బహుమతిగా ఇవ్వాలనుకుంటున్నాను" అని ఆరోరా పేర్కొన్నాడు. ఇక ఐపీఎల్-2021లో కోల్‌కతా జట్టులో భాగమైన ఆరోరాకు ఐపీఎల్లో అరంగేట్రం చేసే అవకాశం రాలేదు. ఐపీఎల్-2022 మెగా వేలంలో అతడిని రూ. 2కోట్లకు పంజాబ్ కింగ్స్ కొనుగోలు చేసింది. పంజాబ్‌కు చెందిన ఈ యువ పేసర్ దేశీయస్థాయిలో హిమాచల్ ప్రదేశ్ తరపున ప్రాతినిద్యం వహిస్తున్నాడు. చదవండి: World Cup 2022: భారత క్రికెటర్లకు ఘోర అవమానం.. ఆ జట్టులో ఒక్కరికి కూడా..! -
ఎవరీ వైభవ్ అరోరా.. తొలి మ్యాచ్‌లోనే చుక్కలు చూపించాడు!
ఐపీఎల్-2022లో భాగంగా చెన్నైసూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ 54 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది. పంజాబ్ విజయంలో ఆజట్టు యువ పేసర్ వైభవ్ అరోరా కీలక పాత్ర పోషించాడు. ఐపీఎల్ అరంగేట్ర మ్యాచ్‌లోనే అరోరా ప్రత్యర్ధి బ్యాటర్లకు చుక్కలు చూపించాడు. ఈ మ్యాచ్‌లో నాలుగు ఓవర్లు వేసిన అరోరా.. 21 పరుగులు ఇచ్చి రెండు కీలక వికెట్లు పడగొట్టాడు. రాబిన్ ఉతప్ప, మొయిన్ అలీ వంటి స్టార్ ఆటగాళ్లను పెవిలియన్ పంపి పంజాబ్‌కు ఆరోరా అద్భుతమైన ఆరంభాన్ని ఇచ్చాడు. ఆ జట్టు పేసర్ సందీప్ శర్మ స్థానంలో అరోరా తుది జట్టులో చోటు దక్కించుకున్నాడు. కాగా పంజాబ్ జట్టు తీసుకున్న నిర్ణయం సరైనది అని అరోరా నిరూపించాడు. ఈ క్రమంలో వైభవ్ అరోరా గురుంచి కొన్ని ఆసక్తికర విషయాలు తెలుసుకుందాం. ►వైభవ్ అరోరా డిసెంబర్ 14, 1997న అంబాలాలో జన్మించాడు. ► అరోరా దేశీయ స్థాయిలో హిమాచల్ ప్రదేశ్ తరపున ఆడుతున్నాడు. ► 2019లో సౌరాష్ట్రపై ఫస్ట్-క్లాస్ అరంగేట్రం చేశాడు. ► ఆరోరా టీ20ల్లో 2021లో ఛత్తీస్‌గఢ్‌పై అరంగేట్రం చేశాడు. ► 2020 ఐపీఎల్ సీజన్లో పంజాబ్ కింగ్స్ నెట్‌బౌలర్‌గా అరోరాను ఎంపిక చేసింది. ►2021 ఐపీఎల్ సీజన్లో వైభవ్ అరోరా కోల్‌కతా నైట్ రైడర్స్‌లో భాగంగా ఉన్నాడు. కానీ అతనికి అరంగేట్రం చేసే అవకాశం రాలేదు. ►ఐపీఎల్-2022 మెగా వేలంలో ఆరోరాని రూ. 2 కోట్లకు పంజాబ్ కింగ్స్ కొనుగోలు చేసింది. ►తన కెరీర్లో 12 టీ20 మ్యాచ్‌లు ఆడిన ఆరోరా 12 వికెట్లు పడగొట్టాడు. చదవండి: IPL 2022: ఆర్సీబీకి భారీ షాక్.. యువ ఆటగాడు దూరం!