IPL 2023, KKR Vs CSK: Nitish Rana Left Fuming At The Umpires After His Team Was Given A Punishment For Slow Over Rate, Video Viral - Sakshi
Sakshi News home page

Nitish Rana: గ్రౌండ్‌లో పనిష్మెంట్‌.. అంపైర్లతో నితీశ్‌ రాణా వాగ్వాదం.. వైరల్‌! ఎందుకో ప్రతిదానికీ ఇలా!

Published Mon, May 15 2023 10:01 AM | Last Updated on Mon, May 15 2023 10:37 AM

IPL 2023: Nitish Rana Fumes At Umpires After Receive Punishment Viral - Sakshi

అంపైర్లతో నితీశ్‌ రాణా వాగ్వాదం (PC: IPL)

IPL 2023 CSK vs KKR- Nitish Rana: ఐపీఎల్‌-2023లో చెన్నై సూపర్‌ కింగ్స్‌తో మ్యాచ్‌పై గెలుపొందిన కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ ప్లే ఆఫ్స్‌ అవకాశాలను సజీవంగా నిలుపుకొంది. తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో సీఎస్‌కేపై 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. పటిష్ట చెన్నై జట్టును వారి సొంతగడ్డపై ఓడించి సత్తా చాటింది. 

ఇదిలా ఉంటే.. ఆదివారం నాటి ఈ మ్యాచ్‌లో కెప్టెన్‌ ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్న నితీశ్‌ రాణా.. సీఎస్‌కే ఇన్నింగ్స్‌ సమయంలో వ్యవహరించిన తీరు విమర్శలకు దారితీసింది. సీఎస్‌కే బ్యాటింగ్‌ చేస్తున్నపుడు ఆఖరి ఓవర్‌ వేసేందుకు కేకేఆర్‌ అరోరా సమాయత్తమయ్యాడు.

అంపైర్లతో రాణా గొడవ!
అయితే, స్లో ఓవర్‌ రేటు మెయింట్‌ చేస్తున్న కారణంగా.. కొత్త నిబంధనల ప్రకారం మైదానంలోనే కేకేఆర్‌ మూల్యం చెల్లించాల్సి వచ్చింది. 30 యార్డ్‌ సర్కిల్‌ బయట ఐదుగురికి బదులు నలుగురు ఫీల్డర్‌లనే ప్లేస్‌ చేయాలని అంపైర్లు సూచించారు. దీంతో కోపోద్రిక్తుడైన నితీశ్‌ రాణా.. అంపైర్ల వద్దకు వచ్చి వాగ్వాదానికి దిగాడు. 

ఎందుకో ప్రతిదానికీ ఇలా
ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. ఇందులో అంపైర్లు నిబంధనల ప్రకారం నడుచుకోవాల్సిందేనని తేల్చిచెప్పడంతో రాణా అక్కడి నుంచి కదలినట్లు కనిపించింది. ఈ వీడియోపై స్పందించిన నెటిజన్లు.. ‘‘ఎవరైనా రూల్స్‌ పాటించాల్సిందే కదా! ఎందుకో ప్రతిదానికి గొడవపడటం’’ అంటూ తమదైన శైలిలో కామెంట్లు చేస్తున్నారు.

గెలిచి నిలిచిన కేకేఆర్‌
ఇక సీఎస్‌కే ఇన్నింగ్స్‌లో ఆఖరి ఓవర్‌ వేసిన వైభవ్‌ అరోరా.. 9 పరుగులు మాత్రమే ఇచ్చి రవీంద్ర జడేజా వికెట్‌ తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ క్రమంలో సీఎస్‌కేను 144 పరుగులకే కట్టడి చేసిన కేకేఆర్‌.. నితీశ్‌ రాణా, రింకూ సింగ్‌ అర్ధ శతకాలతో రాణించడంతో జయకేతనం ఎగురవేసింది. 

ఈ మ్యాచ్‌లో రాణా 44 బంతుల్లో 6 ఫోర్లు, ఒక సిక్స్‌ సాయంతో 57 పరుగులతో అజేయంగా నిలవగా.. ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ రింకూ సింగ్‌ 43 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 54 పరుగులు సాధించాడు. ఇక సీఎస్‌కేను ఆరు వికెట్ల తేడాతో ఓడించిన కేకేఆర్‌ ఇప్పటి వరకు ఆడిన 13 మ్యాచ్‌లలో ఆరు గెలిచి 12 పాయింట్లతో ప్లే ఆఫ్స్‌ రేసులో నిలిచింది.

చదవండి: వాళ్ల తప్పేం లేదు..! అతడు అద్భుతం.. జట్టుకు దొరికిన విలువైన ఆస్తి: ధోని
మార్క్రమ్‌ చేసిన తప్పు.. ఆలస్యంగా వెలుగులోకి

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement