Rinku Singh
-
రింకూ సింగ్, ఎంపీ ప్రియా సరోజ్‌ల పెళ్లి.. అఫీషియల్ అప్డేట్
టీమిండియా విధ్వంసకర బ్యాటర్, టీ20 స్పెషలిస్ట్ రింకూ సింగ్.. సమాజ్‌వాదీ పార్టీ ఎంపీ (లోక్‌సభ) ప్రియా సరోజ్ పెళ్లాడబోతున్నారు. ఈ విషయాన్ని ప్రియా తండ్రి, సమాజ్‌వాదీ పార్టీ ఎమ్మెల్యే తూఫానీ సరోజ్ ధృవీకరించారు. రింకూ, ప్రియాల పెళ్లికి ఇరు కుటుంబాలు అంగీకరించాయని తూఫానీ సరోజ్ తెలిపారు. ప్రస్తుతం ప్రియా తిరువనంతపురంలో జరుగుతున్న పార్లమెంటరీ కమిటీ మీటింగ్‌తో బిజీగా ఉందని తూఫానీ పేర్కొన్నారు. రింకూ కూడా త్వరలో ఇంగ్లండ్‌తో జరుగబోయే టీ20 సిరీస్ సన్నాహకాల్లో నిమగ్నమయ్యాడని అన్నారు. రింకూ, ప్రియాల నిశ్చితార్థం జరిగిందని గత కొద్ది రోజులుగా సోషల్‌మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని ఆయన ఖండించారు. శీతాకాల పార్లమెంట్ సమావేశాలు అనంతరం రింకూ, ప్రియా ఎంగేజ్మెంట్, పెళ్లి తేదీలను వెల్లడిస్తామని తెలిపారు. లక్నోలో ఎంగేజ్మెంట్ వేడుక జరుగుతుందని స్పష్టం చేశారు.కాగా, రింకూ సింగ్, ప్రియా సరోజ్ గత కొంతకాలంగా ప్రేమలో ఉన్నారు. పెద్దల అంగీకారంతోనే పెళ్లి చేసుకోవాలని వారు డిసైడయ్యారు. తాజాగా ఇరువురి కుటుంబాలు పెళ్లికి అంగీకరించినట్లు ప్రియా తండ్రి వెల్లడించారు. స్నేహితురాలి తండ్రి ద్వారా ప్రియాకు రింకూతో పరిచయం ఏర్పడినట్లు తెలుస్తుంది.27 ఏళ్ల రింకూ భారత్ తరఫున 30 టీ20లు, రెండు వన్డేలు ఆడాడు. 26 ఏళ్ల ప్రియా ప్రస్తుతం ఉత్తర్‌ప్రదేశ్‌లోని మచ్లిషెహర్ లోక్‌సభ స్థానం నుంచి ఎంపీగా ఉన్నారు. 2024 జనరల్ ఎలెక్షన్స్‌లో ప్రియా సిట్టింగ్ బీజేపీ ఎంపీ బీపీ సరోజ్‌పై 35000 ఓట్ల తేడాతో గెలుపొందింది. ప్రియాకు ఇవే తొలి ఎన్నికలు. వారణాసికి చెందిన ప్రియా పాలిటిక్స్‌లోకి రాక ముందు 'లా'లో బ్యాచ్‌లర్ డిగ్రీ పొందింది. ప్రియా తన ఉన్నత చదువులను ఢిల్లీలో పూర్తి చేసింది. ప్రియా తండ్రి తూఫానీ సరోజ్ మూడు సార్లు ఎంపీగా పని చేశారు. ప్రస్తుతం అతను జౌన్పూర్ జిల్లాలోని కేరాకట్ అసెంబ్లీ స్థానం నుంచి సమాజ్‌వాదీ పార్టీ ఎమ్మెల్యేగా ఉన్నారు. కాగా, ఈ నెల 22 నుంచి ఇంగ్లండ్‌తో టీ20 సిరీస్ ప్రారంభం కానుంది. ఈ సిరీస్‌లో రింకూ సింగ్ పాల్గొననున్నాడు. ఇందు కోసం అతను కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో టీమిండియాతో కలిసి ప్రాక్టీస్ చేస్తున్నాడు. -
అది నిజమే.. కానీ..: రింకూ ‘ఎంగేజ్మెంట్’లో ట్విస్ట్!
టీమిండియా స్టార్ క్రికెటర్ రింకూ సింగ్(Cricketer Rinku Singh)కు ఎంపీ ప్రియా సరోజ్(Priya Saroj)తో నిశ్చితార్థం జరిగినట్లు ప్రచారం జరుగుతోంది. అయితే, ఈ వార్తల్ని ప్రియా తండ్రి తుఫానీ సరోజ్ ఖండించారు. ఇరు కుటుంబాల మధ్య రింకూ- ప్రియల పెళ్లి గురించి చర్చలు జరుగుతున్న మాట వాస్తవమేనని.. అయితే, ఎంగేజ్మెంట్ మాత్రం కాలేదన్నారు.పెళ్లి ముచ్చట్లు జరుగుతున్నాయి ‘‘ప్రియ ప్రస్తుతం తిరువనంతపురంలో ఉంది. రింకూతో ఆమె నిశ్చితార్థం జరిగినట్లు వస్తున్న వార్తలు పూర్తిగా అవాస్తవం. ఇరు కుటుంబాలు ఈ విషయం గురించి చర్చిస్తున్నాయి. అయితే, రింకూ- ప్రియలపై పెళ్లిపై ఇంతవరకు నిర్ణయం తీసుకోలేదు’’ అని తెలిపారు. రింకూ కుటుంబం నుంచే పెళ్లి ప్రతిపాదన వచ్చిందని తుఫానీ సరోజ్ ఈ సందర్భంగా తెలిపారు. విధ్వంసకర ఇన్నింగ్స్‌తో వెలుగులోకిమరోవైపు.. నిశ్చితార్ధం జరిగిందన్న వార్తలను రింకూ సింగ్ కుటుంబ సభ్యులు ఖండించడం గమనార్హం. కాగా ఐపీఎల్(IPL)లో కోల్‌కతా నైట్‌రైడర్స్ తరఫున విధ్వంసకర ఇన్నింగ్స్‌తో ఒక్కసారిగా వెలుగులోకి వచ్చాడు ఉత్తరప్రదేశ్ కుర్రాడు రింకూ సింగ్. గుజరాత్ టైటాన్స్‌తో మ్యాచ్‌లో ఒకే ఓవర్లో ఐదు సిక్సర్లు బాది సత్తా చాటాడు. అద్భుతమైన షాట్లు, భారీ హిట్టింగ్తో అభిమానుల మనసు గెలుచుకున్నాడు. ఈ క్రమంలోనే అంతర్జాతీ క్రికెట్లోనూ అడుగుపెట్టాడు రింకూ సింగ్. భారత జట్టు తరఫున ఎన్నో విలువైన ఇన్నింగ్స్‌లు ఆడిన రింకూ సింగ్... నయా ఫినిషర్‌గా నీరాజనాలు అందుకుంటున్నాడు. ఇప్పటి వరకు టీమిండియా తరఫున 27 ఏళ్ల రింకూ సింగ్ ఇప్పటి వరకు 30 టీ20లు, రెండు వన్డేలు ఆడాడు. ఆయా ఫార్మాట్లలో 507, 55 పరుగులు సాధించాడు. ఇక ఐపీఎల్ మెగా వేలం-2025కి ముందు కోల్‌కతా ఫ్రాంఛైజీ అతడిని రూ. 13 కోట్లకు అట్టిపెట్టుకుంది.ఆ ఫొటోలతో బలపడిన ప్రచారంఅయితే, జీవితంలోనూ రింకూ కొత్త ఇన్నింగ్స్ ప్రారంభించనున్నట్లు శుక్రవారం వార్తలు వచ్చాయి. అందుకు తగ్గట్టుగానే రింకూ సోదరి నేహా సింగ్ తమ ఇంట్లో బంధువుల కోలాహలం నిండిన ఫొటోలు షేర్ చేసింది. తన అన్నయ్యను ప్రేమగా హత్తుకుని ఉన్న ఫొటోలు పంచుకుంటూ ప్రేమను కురిపిస్తున్నట్లుగా ఎమోజీలు జతచేసింది. ఈ నేపథ్యంలో క్రికెట్ వర్గాల్లో రింకూ ఎంగేజ్మెంట్ వా ర్తలు విపరీతరం సర్క్యులేట్ అయ్యాయి.యువ ఎంపీగా ప్రస్థానంఉత్తరప్రదేశ్కు చెందిన రాజకీయ నాయకురాలు ప్రియా సరోజ్‌తో త్వరలో రింకూ ఏడడుగులు వేయనున్నట్లు ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలో ప్రియా సరోజ్ గురించి నెటిజన్లు ఆరా తీయడం మొదలుపెట్టారు.కాగా ప్రియా సమాజ్‌వాదీ పార్టీ తరఫున 2024 సాధారణ ఎన్నికల్లో పోటీ చేశారు. 25 ఏళ్ల వయసులోనే మచిలీషహర్ నియోజకవర్గం నుంచి ఆమె ఎంపీగా విజయం సాధించారు. ప్రస్తుతం లోక్‌సభ ఎంపీగా కొనసాగుతున్నారు. పార్లమెంట్లో తనదైన శైలిలో స్పీచ్‌లు ఇస్తూ యువ నేతల్లో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటున్నారు. ఇక ప్రియా తండ్రి తుఫానీ సరోజ్ గతంలో మూడుసార్లు ఎంపీగా పనిచేయడంతో పాటు ప్రస్తుతం ఉత్తరప్రదేశ్‌లోని కేరాకట్ ఎమ్మెల్యేగా వ్యవహరిస్తున్నారు. ఆయనే స్వయంగా కూతురి ఎంగేజ్మెంట్ గురించి స్పందించడంతో వదంతులకు చెక్ పడింది.చదవండి: CT 2025: వన్డేల్లోనూ అదరగొడతాడు.. అతడిని సెలక్ట్ చేయండి: సెహ్వాగ్ Rinku Singh gets engaged to Samajwadi Party MP Priya Saroj. 💍- Many congratulations to them! ❤️ pic.twitter.com/7b7Hb0D2Em— Mufaddal Vohra (@mufaddal_vohra) January 17, 2025 View this post on Instagram A post shared by Neha ❤️ (@_neha_singh_0700) -
ఎంపీతో రింకూ సింగ్ నిశ్చితార్థం? ఆమె ఎవరంటే?
టీమిండియా క్రికెటర్ రింకూ సింగ్(Cricketer Rinku Singh Engagement) త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతున్నాడు. సమాజ్‌వాదీ పార్టీ ఎంపీ ప్రియా సరోజ్(MP Priya Saroj)తో అతడి నిశ్చితార్థం జరిగినట్లు సమాచారం. రింకూ- ప్రియాల ఎంగేజ్మెంట్కు సంబంధించిన వివరాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.చెల్లెలితో రింకూ సింగ్బంధువుల కోలాహలంఈ నేపథ్యంలో కాబోయే వధూవరులకు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. అయితే, అటు రింకూ గానీ.. ఇటు ప్రియా గానీ నిశ్చితార్థం విషయమై అధికారికంగా స్పందించలేదు. అయితే, రింకూ చెల్లెలు నేహా సింగ్(Neha Singh) తన అన్నతో కలిసి ఉన్న ఫొటోలను తాజాగా షేర్ చేసింది. ఇందులో బంధువుల కోలాహలంతో పాటు.. ఇల్లంతా అలంకరించినట్లుగా కనిపిస్తోంది. దీనిని బట్టి నిశ్చితార్థం జరిగినట్లు నెటిజన్లు అంచనాకు వస్తున్నారు.పేద కుటుంబంలో జన్మించిన రింకూకాగా ఉత్తరప్రదేశ్‌లోని అలీఘర్‌లోని పేద కుటుంబంలో రింకూ కుమార్ సింగ్ జన్మించాడు. అతడి తండ్రి ఇంటింటికి గ్యాస్ సిలిండర్లు వేసి కుటుంబాన్ని పోషించేవాడు. ఒక్కోసారి రింకూ కూడా తండ్రికి ఆరోగ్యం సహకరించనపుడు సిలిండర్లు వేసేవాడు. ఒకానొక సమయంలో స్వీపర్‌గానూ రింకూ పనిచేశాడు.కోటీశ్వరుడిగా ఎదిగిన రింకూఅయితే, ఎన్ని కష్టాలు ఎదురైనా రింకూ మాత్రం క్రికెట్‌పై ప్రేమను వదులుకోలేదు. ఒక్కో మెట్టు ఎక్కుతూ తొలుత ఐపీఎల్లో అడుగుపెట్టిన ఈ ఎడమచేతి వాటం బ్యాటర్.. కోల్‌కతా నైట్ రైడర్స్ తరఫున అదరగొట్టాడు. ఈ క్రమంలో టీమిండియా తరఫున అంతర్జాతీయ క్రికెట్లోనూ ఎంట్రీ ఇచ్చి నయా ఫినిషర్‌గా ఎదిగాడు. ఆర్థికంగానూ స్థిరపడ్డాడు.ఇప్పటి వరకు భారత్ తరఫున 27 ఏళ్ల రింకూ సింగ్ 30 టీ20లు, రెండు వన్డేలు ఆడి 507, 55 పరుగులు సాధించాడు. ఇక ఐపీఎల్ మెగా వేలం-2025కి ముందు కోల్‌కతా ఫ్రాంఛైజీ అతడిని రూ. 13 కోట్లకు రిటైన్ చేసుకుంది.ఎవరీ ప్రియా సరోజ్?ఇక ప్రియా సరోజ్ విషయానికొస్తే.. వారణాసిలో 1998లో జన్మించిన ఆమె.. న్యూఢిల్లీలోని ఎయిర్ ఫోర్స్ గోల్డెన్ జూబ్లీ ఇన్స్టిట్యూట్లో విద్యాభ్యాసం చేశారు. ఢిల్లీ యూనివర్సిటీ నుంచి బ్యాచిలర్ డిగ్రీ పొందారు. అనంతరం.. అమిటి యూనివర్సిటీ నుంచి ఎల్ఎల్బీ పూర్తి చేశారు.రాజకీయాలపై ఆసక్తి కలిగి ఉన్న ప్రియా సరోజ్ 2024 సాధారణ ఎన్నికల్లో సమాజ్‌వాదీ పార్టీ తరఫున పోటీ చేశారు. మచ్లిశహర్ లోక్‌సభ నియోజక వర్గం నుంచి ఎంపీగా గెలుపొందారు. తన ప్రత్యర్థి బీపీ సరోజ్‌పై 35850 ఓట్ల తేడాతో విజయం సాధించి పార్లమెంట్లో అడుగుపెట్టారు. ప్రియా సరోజ్ నికర ఆస్తుల విలువ రూ. 11.3 లక్షలుగా సమాచారం. ఇక ప్రియా తండ్రి తూఫానీ సరోజ్ కూడా మూడుసార్లు ఎంపీగా గెలుపొందారు. ప్రస్తుతం కేరాకట్ ఎమ్మెల్యేగా ఉన్నారు. అయితే, రింకూ- ప్రియల నిశ్చితార్థ వార్తలను తూఫానీ సరోజ్ తాజాగా ఖండించారు.చదవండి: CT 2025: వన్డేల్లోనూ అదరగొడతాడు.. అతడిని సెలక్ట్ చేయండి: సెహ్వాగ్ Rinku Singh gets engaged to Samajwadi Party MP Priya Saroj. 💍- Many congratulations to them! ❤️ pic.twitter.com/7b7Hb0D2Em— Mufaddal Vohra (@mufaddal_vohra) January 17, 2025 -
శతక్కొట్టిన షారుఖ్ ఖాన్.. రింకూ సింగ్‌కు షాక్!
విజయ్ హజారే ట్రోఫీ(Vijay Hazare Trophy 2024-25)లో తమిళనాడు బ్యాటర్ షారుఖ్ ఖాన్(Shahrukh Khan) అద్భుత శతకంతో మెరిశాడు. విధ్వంసకర ఆట తీరుతో ఉత్తరప్రదేశ్ జట్టు బౌలర్లపై విరుచుకుపడ్డాడు. ఆకాశమే హద్దుగా చెలరేగి తమిళనాడుకు భారీ విజయం అందించాడు. విశాఖ వేదికగాకాగా దేశవాళీ వన్డే టోర్నీ విజయ్ హజారే ట్రోఫీ(వీహెచ్‌టీ)లో గ్రూప్-‘డి’లో తమిళనాడు గురువారం నాటి మ్యాచ్‌లో ఉత్తరప్రదేశ్(యూపీ)తో తలపడింది. విశాఖపట్నంలోని డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి ఏసీఏ-వీడీసీఏ క్రికెట్ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌కు వర్షం ఆటంకం కలిగించింది. దీంతో 47 ఓవర్లకు మ్యాచ్‌ను కుదించారు. ఇక విశాఖలో టాస్ గెలిచిన యూపీ.. తొలుత బౌలింగ్ చేసింది. ఈ క్రమంలో బ్యాటింగ్‌కు దిగిన తమిళనాడు నిర్ణీత 47 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 284 పరుగులు చేసింది.టాపార్డర్‌లో ఓపెనర్లు నారాయణ్ జగదీశన్(0) డకౌట్ కాగా.. తుషార్ రహేజా(15), ప్రదోష్ పాల్(0) కూడా విఫలమయ్యారు. ఇక మిడిలార్డర్లో బాబా ఇంద్రజిత్(27), విజయ్ శంకర్(16) కూడా నిరాశపరిచారు. ఈ క్రమంలో ఇన్నింగ్స్ చక్కదిద్దే బాధ్యత తీసుకున్న షారుఖ్ ఖాన్ యూపీ బౌలర్లకు చుక్కలు చూపించాడు.శతక్కొట్టిన షారుఖ్.. అలీ హాఫ్ సెంచరీఆరో స్థానంలో బ్యాటింగ్ చేసిన షారుఖ్.. 85 బంతుల్లో 13 ఫోర్లు, 7 సిక్సర్ల సాయంతో 132 పరుగులతో అజేయంగా నిలిచాడు. అతడికి తోడుగా ఏడో నంబర్ బ్యాటర్ మొహమద్ అలీ(75 బంతుల్లో 76 నాటౌట్) కూడా బ్యాట్ ఝులిపించాడు. ఫలితంగా తమిళనాడు మెరుగైన స్కోరు సాధించింది.హాఫ్ సెంచరీ చేసినా రింకూకు షాక్!ఇక లక్ష్య ఛేదనలో యూపీ ఆది నుంచే తడబడింది. ఓపెనర్లు అభిషేక్ గోస్వామి(14), ఆర్యన్ జుయాల్(8)లతో పాటు.. వన్‌డౌన్ బ్యాటర్ కరణ్ శర్మ(8) కూడా విఫలమయ్యాడు. నితీశ్ రాణా(17) చేతులెత్తేయగా.. ప్రియమ్ గార్గ్(48), కెప్టెన్ రింకూ సింగ్(Rinku Singh- 55) రాణించారు. అయితే, లోయర్ ఆర్డర్లో విప్రజ్ నిగమ్(2), సౌరభ్ కుమార్(7), శివం మావి(2), యశ్ దయాల్(1), ఆకిబ్ ఖాన్(0 నాటౌట్) సింగిల్ డిజిట్ స్కోర్లకే పరిమితమయ్యారు.114 పరుగుల భారీ తేడాతో ఘన విజయంఈ నేపథ్యంలో 32.5 ఓవర్లలో 170 పరుగులకే యూపీ జట్టు ఆలౌట్ అయింది. ఫలితంగా తమిళనాడు 114 పరుగుల భారీ తేడాతో గెలుపొందింది. తమిళనాడు బౌలర్లలో సందీప్ వారియర్, వరుణ్ చక్రవర్తి, విజయ్ శంకర్ రెండేసి వికెట్లు తీయగా.. సీవీ అచ్యుత్, మొహమద్ అలీ, కెప్టెన్ ఆర్. సాయి కిషోర్ ఒక్కో వికెట్ తమ ఖాతాలో వేసుకున్నారు.కాగా విజయ్ హజారే ట్రోఫీ తాజా సీజన్లో తమిళనాడు తొలుత చండీగఢ్‌తో తలపడగా.. వర్షం వల్ల టాస్ పడకుండానే మ్యాచ్ ముగిసింది. తాజాగా రెండో మ్యాచ్‌లో యూపీని మట్టికరిపించి తొలి గెలుపు నమోదు చేసింది. ఇదిలా ఉంటే...‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ షారుఖ్ ఖాన్‌కు లిస్ట్-‘ఎ’ క్రికెట్లో ఇదే తొలి శతకం కావడం విశేషం.చదవండి: IND Vs AUS 4th Test: చరిత్ర సృష్టించిన ఆసీస్ యువ ఓపెనర్.. 95 ఏళ్ల రికార్డు బద్దలు -
కెప్టెన్‌గా రింకూ సింగ్
టీమిండియా స్టార్ క్రికెటర్ రింకూ సింగ్‌కు సువర్ణావకాశం వచ్చింది. దేశవాళీ వన్డే టోర్నమెంట్ విజయ్ హజారే ట్రోఫీ-2024లో అతడు ఉత్తరప్రదేశ్ జట్టుకు సారథిగా ఎంపికయ్యాడు. దేశీ టీ20 టోర్నీ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో అద్భుత ప్రదర్శన కనబరిచిన రింకూకు ఈ అవకాశం దక్కింది.టీ20 టోర్నీలో అదరగొట్టిన రింకూకాగా సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ తాజా ఎడిషన్‌లో ఉత్తరప్రదేశ్ జట్టుకు భారత వెటరన్ పేసర్ భువనేశ్వర్ కుమార్ సారథ్యం వహించాడు. అతడి కెప్టెన్సీలో యూపీ క్వార్టర్ ఫైనల్స్ వరకు చేరుకుంది. ఇక ఈ టోర్నీలో రింకూ తొమ్మిది మ్యాచ్‌లలో కలిపి 152కు పైగా స్ట్రైక్‌రేటుతో 277 పరుగులు చేశాడు.ఇక లిస్ట్-ఏ(వన్డే ఫార్మాట్) క్రికెట్లోనూ రింకూ సింగ్‌కు మెరుగైన రికార్డు ఉంది. ఇప్పటి వరకు 57 మ్యాచ్‌లు ఆడిన ఈ ఎడమచేతి వాటం బ్యాటర్ ఖాతాలో 1899 పరుగులు ఉన్నాయి. ఇందులో ఒక సెంచరీతో పాటు 17 అర్ధ శతకాలు ఉన్నాయి.ఈసారి రింకూ కెప్టెన్సీలో భువీఈ నేపథ్యంలో విజయ్ హజారే ట్రోఫీ-2024కు ప్రకటించిన జట్టుకు రింకూ సింగ్ కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. సీనియర్ సెలక్షన్ కమిటీ ప్రకటించిన 19 మంది సభ్యులతో కూడిన జట్టులో సారథిగా ఛాన్స్ కొట్టేశాడు. అయితే, భువీ ఈసారి కేవలం బౌలర్‌గానే బరిలోకి దిగనున్నాడు. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో కెప్టెన్సీ చేసిన భువనేశ్వర్.. ఆటగాడిగానూ రాణించాడు.ఈ టోర్నీలో తొమ్మిది మ్యాచ్‌లలో కలిపి పదకొండు వికెట్లు తీశాడు. ఇందులో హ్యాట్రిక్ కూడా ఉండటం విశేషం. అయితే, విజయ్ హజారే ట్రోఫీలో మాత్రం రింకూ కెప్టెన్సీలో భువీ ఆడనున్నాడు. ఇక యూపీ జట్టులో రింకూ, భువీతో పాటు నితీశ్ రాణా, మొహ్సిన్ ఖాన్, శివం మావి వంటి ఐపీఎల్ స్టార్లు కూడా ఉన్నారు. ఇక ఈ దేశీ వన్డే టోర్నీ విజయ్ హజారే ట్రోఫీ డిసెంబరు 21 నుంచి ఆరంభం కానుంది.విజయ్ హజారే ట్రోఫీ-2024కు ఉత్తరప్రదేశ్ జట్టురింకూ సింగ్ (కెప్టెన్), భువనేశ్వర్ కుమార్, మాధవ్ కౌశిక్, కరణ్ శర్మ, ప్రియమ్ గార్గ్, నితీశ్ రాణా, అభిషేక్ గోస్వామి, అక్షదీప్ నాథ్, ఆర్యన్ జుయాల్, ఆరాధ్య యాదవ్, సౌరభ్ కుమార్, కృతజ్ కుమార్ సింగ్, విప్రాజ్ నిగమ్, మొహ్సిన్ ఖాన్, శివం మావి, అక్విబ్ ఖాన్, అటల్ బిహారీ రాయ్, కార్తికేయ జైస్వాల్, వినీత్ పన్వర్.చదవండి: ‘రోహిత్ శర్మ వెంటనే తప్పుకోవాలి.. అతడిని కెప్టెన్ చేయండి’ఇప్పటికైనా చోటిస్తారా?.. టీమిండియా సెలక్టర్లకు స్ట్రాంగ్ మెసేజ్ -
SA Vs IND: తిలక్ వర్మ అజేయ సెంచరీ.. మూడో టీ20లో భారత్ గెలుపు (ఫొటోలు)
-
ఖరీదైన ఇంటిని కొన్న రింకూ సింగ్.. ఎన్ని కోట్లంటే?
ఐపీఎల్-2025 సీజన్ మెగా వేలానికి ముందు టీమిండియా స్టార్ ప్లేయర్ రింకూ సింగ్‌ను రూ. 13 కోట్ల భారీ ధరకు కోల్‌కతా నైట్‌రైడర్స్ రిటైన్ చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఫ్రాంచైజీ నుంచి భారీగా సొమ్ము రావడంతో రింకూ సింగ్ ఎట్టకేలకు తన సొంతంటి కలను నేరవేర్చుకున్నాడు.అలీఘర్‌లోని ఓజోన్ సిటీలో ఖరీదైన విల్లాను రింకూ సింగ్ కొనుగోలు చేశాడు. 500 చదరపు గజాల స్థలం గల ఇంటిని రూ. 3.5 కోట్ల భారీ మొత్తం వెచ్చించి రింకూ సొంతం చేసుకున్నట్లు పలు రిపోర్ట్లు పేర్కొంటున్నాయి. ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. కాగా ఒకప్పుడు ఇదే ఓజోన్ సిటీలోని రింకూ తండ్రి గ్యాస్ సిలిండర్లు వేసి తన కుటుంబాన్ని పోషించేవాడు. ఇప్పుడు అదే సొసైటీలో కొడుకు విల్లాను కొనుగోలు చేసి తండ్రికి బహుమతిగా ఇచ్చాడు. దీంతో రింకూపై నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఇది కాదా సక్సెస్ అని రింకూను కొనియాడుతున్నారు.ఒకే ఓవర్లో 5 సిక్సర్లు..కాగా ఐపీఎల్-2023 సీజన్లో గుజరాత్ టైటాన్స్ పేసర్ యశ్‌దయాల్ బౌలింగ్‌లో ఆఖరి ఓవర్లో వరుసగా ఐదు సిక్స్‌లు బాది రింకూ ఓవర్ నైట్‌స్టార్‌గా మారిపోయాడు. ఆ తర్వాత భారత జట్టులోకి రింకూ ఎంట్రీ ఇచ్చాడు. అంతర్జాతీయ క్రికెట్లో కూడా రింకూ తన మార్క్‌ను చూపించాడు. కాగా ఐపీఎల్ 2024 సీజన్ రింకూ సింగ్‌కు రూ. 55 లక్షల వేతనం మాత్రమే వచ్చేది. కానీ తన అద్బుతప్రదర్శనలతో రింకూ ఇప్పుడు కోటీశ్వరుడు అయిపోయాడు.ఈ ఏడాది నుంచి అతడు రూ. 13 కోట్లు అందుకుంటాడు. కేకేఆర్ అంటిపెట్టుకున్న వారిలో రింకూనే టాప్ రిటెన్షన్ కావడం గమనార్హం. రింకూ సింగ్ ప్రస్తుతం దక్షిణాఫ్రికాతో టీ20 సిరీస్‌కు సన్నద్దమవుతున్నాడు.చదవండి: #Shreyas Iyer: శ్రేయస్ అయ్యర్ ఊచకోత.. కెరీర్లో తొలి డబుల్ సెంచరీ -
IPL 2025: మన లీడర్.. మన కెప్టెన్.. రీటైన్ను సంపూర్ణంగా వాడుకుంది ఎవరు?
గత మూడేళ్లుగా పేలవ ఆట తీరుతో వెనుకబడ్డ సన్‌రైజర్స్ హైదరాబాద్‌ను తన అద్భుత కెప్టెన్సీతో ఈసారి టైటిల్ రేసులో నిలిపాడు ప్యాట్ కమిన్స్. ఆస్ట్రేలియాకు వన్డే వరల్డ్‌కప్ అందించిన సారథిగా నీరాజనాలు అందుకున్న ఈ ఫాస్ట్ బౌలర్.. ఫ్రాంఛైజీ తనకు చెల్లించిన రూ. 20.50 కోట్లకు పైసా వసూల్ ప్రదర్శన ఇచ్చాడు.సహచర ఆటగాళ్లతో మమేమకమవుతూ సరైన సమయంలో అవకాశాలు ఇచ్చి జట్టును ఫైనల్‌కు తీసుకువెళ్లాడు. తద్వారా ఆరెంజ్ ఆర్మీకి ఇష్టమైన కెప్టెన్‌గా మారిపోయాడు. కానీ.. జాతీయ జట్టు విధుల దృష్ట్యా ఈసారి కమిన్స్ అసలు ఐపీఎల్ ఆడతాడా? కెప్టెన్‌గా కొనసాగుతాడా? అనే సందేహాలు వ్యక్తమయ్యాయి. అయితే, రిటెన్షన్ లిస్టు విడుదల సందర్భంగా సన్‌రైజర్స్ ఆ అనుమానాలన్నింటినీ పటాపంచలు చేసింది.మన లీడర్.. మన కెప్టెన్వచ్చే ఏడాది కూడా ప్యాటీనే రైజర్స్‌ను ముందుకు నడిపించబోతున్నాడని..ఫ్రాంఛైజీ అధికారికంగా ప్రకటించింది. ‘‘మన లీడర్.. మన కెప్టెన్... ప్యాటీ కమిన్స్ మిమ్మల్ని ఉప్పల్‌లో మరోసారి కలిసేందుకు సిద్ధంగా ఉన్నాడు’’ అంటూ ఆరెంజ్ ఆర్మీకి శుభవార్త అందించింది. ఇక ఈ ఏడాది పరుగుల విధ్వంసంతో రికార్డులు తిరగరాసిన సన్‌రైజర్స్.. రిటెన్షన్ల విషయంలోనూ దూకుడుగా వ్యవహరించింది. హార్డ్ హిట్టర్ హెన్రిక్ క్లాసెన్ కోసం ఏకంగా రూ. 23 కోట్లు ఖర్చు చేసింది. ఆ జట్లు వదిలేశాయిఇదిలా ఉంటే.. ఇతర ఫ్రాంఛైజీలలో కోల్‌కతా, ఢిల్లీ, లక్నో, పంజాబ్, బెంగళూరు తమ కెప్టెన్లను వేలంలోకి వదిలివేయగా.. చెన్నై, ముంబై, గుజరాత్, రాజస్తాన్ మాత్రం తమ సారథులను కొనసాగించాయి. దీంతో ఈసారి ఈసారి ఐపీఎల్ వేలం ఆసక్తికరంగా సాగడం ఖాయం.ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) మెగా వేలం ఈనెల నెలాఖరున జరగనుండగా... రీటైన్ చేసుకున్న ఆటగాళ్ల జాబితాను ఐపీఎల్ నిర్వాహకులు వెల్లడించిన విషయం తెలిసిందే. ఇందులో కొందరు ఆటగాళ్లు అనూహ్యంగా కోట్లు కొల్లగొట్టగా... మరికొందరు స్టార్ ప్లేయర్లు ఫ్రాంచైజీ నమ్మకాన్ని నిలబెట్టుకోలేకపోయారు. అధిక ధర వీరికేఅందరికంటే అత్యధికంగా దక్షిణాఫ్రికా ‘హార్డ్ హిట్టర్’ హెన్రిచ్ క్లాసెన్‌కు సన్‌రైజర్స్ హైదరాబాద్ ఫ్రాంచైజీ రూ. 23 కోట్లు కేటాయించగా... విరాట్ కోహ్లీకి రాయల్ చాలెంజర్స్ బెంగళూరు... నికోలస్ పూరన్‌కు లక్నో సూపర్ జెయింట్స్ రూ.21 కోట్లు ఇచ్చి అట్టిపెట్టుకున్నాయి. ఈ సీజన్లో ముంబై ఇండియన్స్ జట్టుకు సారథ్యం వహించిన హార్దిక్ పాండ్యా... ఇక మీదట కూడా నాయకుడిగా కొనసాగడం ఖాయం కాగా... ముంబై మొత్తంగా ఐదుగురు ప్రధాన ఆటగాళ్లను అట్టిపెట్టుకుంది. మేటి పేసర్ జస్ప్రీత్ బుమ్రాకు అత్యధికంగా రూ. 18 కోట్లు కేటాయించిన ఫ్రాంచైజీ సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యాలకు చెరో రూ. 16 కోట్ల 35 లక్షలు వెచ్చించింది.ఇక ‘హిట్‌మ్యాన్’ రోహిత్ శర్మకు రూ. 16 కోట్ల 30 లక్షలు కేటాయించింది. హైదరాబాద్ ఆటగాడు ఠాకూర్ తిలక్ వర్మకు రూ.8 కోట్లు ఇచ్చి ముంబై తమ వద్దే పెట్టుకుంది. రీటైన్ను సంపూర్ణంగా వాడుకుంది ఎవరంటే?ఆటగాళ్ల కొనుగోలు కోసం ఒక్కో జట్టు రూ.120 కోట్లు ఖర్చు చేసుకునే అవకాశం ఉండగా... అందులో రూ. 75 కోట్లు రిటెన్షన్‌కు కేటాయించారు. తాజా జాబితాను చూస్తే ముంబై ఇండియన్స్ జట్టు రీటైన్ను సంపూర్ణంగా వాడుకోగా... అత్యల్పంగా పంజాబ్ కింగ్స్ జట్టు కేవలం ఇద్దరు ప్లేయర్లనే అట్టి పెట్టుకుంది. పంజాబ్ మరీ ఇద్దరినేపంజాబ్ హెడ్ కోచ్‌గా బాధ్యతలు చేపట్టిన ఆ్రస్టేలియా దిగ్గజ కెప్టెన్ రికీ పాంటింగ్ వ్యూహాల్లో భాగంగా... కేవలం ఇద్దరు ‘అన్క్యాప్డ్’ ప్లేయర్లను మాత్రమే రీటైన్ చేసుకున్న పంజాబ్ వద్ద వేలం కోసం అత్యధికంగా రూ. 110.5 కోట్లు మిగిలి ఉన్నాయి. ఈ ఏడాది జట్టుకు ఐపీఎల్ టైటిల్ అందించిన శ్రేయస్ అయ్యర్‌ను కోల్‌కతా నైట్ రైడర్స్ వేలానికి వదిలేయగా... తొమ్మిదేళ్లుగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో కొనసాగుతున్న రిషబ్ పంత్‌ను ఫ్రాంచైజీ వదిలేసుకుంది. లక్నో సూపర్ జెయింట్స్ యాజమాన్యం కేఎల్ రాహుల్‌పై నమ్మకం ఉంచలేదు. రింకూ సింగ్‌కు జాక్‌పాట్.. ధోనీ ‘అన్క్యాప్డ్’ ప్లేయర్చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ధోనీ సహా మొత్తం ఐదుగురు ప్లేయర్లను అట్టిపెట్టుకోగా... రాజస్తాన్ రాయల్స్ కూడా ఆరుగురు ప్లేయర్లను రీటైన్ చేసుకుంది. స్పిన్ ఆల్‌రౌండర్ అక్షర్ పటేల్ కోసం ఢిల్లీ క్యాపిటల్స్ రూ. 16 కోట్ల 50 లక్షలు కేటాయించగా... సిక్సర్ల వీరుడు రింకూ సింగ్‌కు కోల్‌కతా రూ.13 కోట్లు ఇచ్చి అట్టిపెట్టుకుంది. వెస్టిండీస్ ద్వయం రసెల్, నరైన్‌తో పాటు మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తికి తలా రూ. 12 కోట్లు కేటాయించింది. కోల్‌కతా వదిలేసుకున్న శ్రేయస్ అయ్యర్ కోసం వేలంలో ఢిల్లీ క్యాపిటల్స్ పోటీ పడటం ఖాయమే కాగా... సారథి కోసం చూస్తున్న రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు పంత్‌పై కన్నేసే అవకాశాలు ఉన్నాయి. బేబీ మలింగకు రూ. 13 కోట్లుజాతీయ జట్టుకు ప్రాతినిధ్యం వహించి ఐదేళ్లు దాటిపోయిన ధోనీని ఐపీఎల్ నిబంధనల ప్రకారం ‘అన్క్యాప్డ్’ ప్లేయర్ కోటాలో రీటైన్ చేసుకున్న చెన్నై సూపర్ కింగ్స్ ఫ్రాంచైజీ... మాజీ సారథికి రూ.4 కోట్లు కేటాయించింది. కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్‌తో పాటు స్పిన్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజాకు చెరో రూ. 18 కోట్లు వెచ్చించింది. శ్రీలంక పేసర్ పతిరణకు రూ. 13 కోట్లు, పేస్ ఆల్‌రౌండర్ శివమ్ దూబేను రూ.12 కోట్లకు అట్టిపెట్టుకుంది. రాజస్తాన్ రైట్రైట్రిటైనింగ్లో మొత్తం ఆరు అవకాశాలను వాడుకున్న రాజస్తాన్ రాయల్స్... సంజూ సామ్సన్, యశస్వి జైస్వాల్‌కు చెరో రూ.18 కోట్లు కేటాయించింది. రియాన్ పరాగ్, ధ్రువ్ జురెల్‌కు చెరో రూ. 14 కోట్లు వెచ్చించింది.పూరన్ కోసం అంత అవసరమా?కేఎల్ రాహుల్‌ను వేలానికి వదిలేసిన లక్నో సూపర్ జెయింట్స్ జట్టు నిలకడగా ఆడతాడో లేదో తెలియని వెస్టిండీస్ హిట్టర్ నికోలస్ పూరన్ కోసం రూ. 21 కోట్లు కేటాయించింది. గాయాలతో సహవాసం చేసే సూపర్ ఫాస్ట్ బౌలర్ మయాంక్ యాదవ్, స్పిన్నర్ రవి బిష్ణోయ్‌కు రూ. 11 కోట్లు కేటాయించిన లక్నో... మొహసిన్ ఖాన్, ఆయుష్ బదోనీలకు చెరో రూ. 4 కోట్లు వెచ్చించింది. స్టార్ స్పిన్నర్ రషీద్ ఖాన్‌కు రూ.18 కోట్లు కేటాయించిన గుజరాత్ టైటాన్స్ ఫ్రాంచైజీ... కెప్టెన్ శుబ్‌మన్ గిల్‌ను రూ. 16 కోట్ల 50 లక్షలకు అట్టిపెట్టుకుంది. వేలానికి రానున్న ప్రధాన ఆటగాళ్లు కేఎల్ రాహుల్, రిషబ్ పంత్, శ్రేయస్ అయ్యర్, ఇషాన్ కిషన్, అర్ష్‌దీప్ సింగ్, సిరాజ్, చాహల్, అశ్విన్, వాషింగ్టన్ సుందర్, భువనేశ్వర్, శార్దూల్ ఠాకూర్, దీపక్ చాహర్, షమీ (భారత్). వార్నర్, మ్యాక్స్‌వెల్, కామెరూన్ గ్రీన్, మిచెల్ స్టార్క్, స్టొయినిస్ ఆస్ట్రేలియా). బెయిర్‌స్టో, లివింగ్‌స్టోన్, స్యామ్ కరన్, బట్లర్, ఫిల్ సాల్ట్ (ఇంగ్లండ్). డుప్లెసిస్, డేవిడ్ మిల్లర్, క్వింటన్ డికాక్, నోర్జే (దక్షిణాఫ్రికా). కాన్వే, రచిన్ రవీంద్ర, బౌల్ట్ (న్యూజిలాండ్). చదవండి: Ind vs Pak: భారత బ్యాటర్ల విధ్వంసం.. అయినా పాక్ చేతిలో తప్పని ఓటమి -
‘పరుగుల విధ్వంసం తప్ప.. ఇంకోటి వద్దన్నారు’
టీ20 క్రికెట్లో టీమిండియా దూకుడు మంత్రంతో దూసుకెళ్తోందని మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా అన్నాడు. ఇందుకు కొత్త హెడ్‌కోచ్ గౌతం గంభీర్, నూతన సారథి సూర్యకుమార్ యాదవ్‌లే కారణమని పేర్కొన్నాడు. ఫలితంతో సంబంధం లేకుండా పరుగుల విధ్వంసం సృష్టించేందుకు యంగిస్తాన్ సిద్ధమైందని.. మున్ముందు పొట్టి ఫార్మాట్లో భారత జట్టు మరిన్ని సంచలనాలు సృష్టించడం ఖాయమని అభిప్రాయపడ్డాడు.లంక పర్యటనతో మొదలుకాగా టీమిండియా ప్రధాన కోచ్‌గా రాహుల్ ద్రవిడ్ స్థానాన్ని భర్తీ చేసిన గంభీర్.. శ్రీలంక పర్యటనతో తన ప్రయాణం ప్రారంభించాడు. సూర్యకుమార్ పూర్తిస్థాయి కెప్టెన్ అయిన తర్వాత జరిగిన పొట్టి సిరీస్‌లో లంకను భారత్ 3-0తో క్లీన్‌స్వీప్ చేసింది. అనంతరం వీరిద్దరి కాంబినేషన్లో స్వదేశంలో టీమిండియా ఇటీవలే బంగ్లాదేశ్‌తో టీ20 సిరీస్ ఆడింది.బంగ్లా బౌలింగ్ ఊచకోతసొంతగడ్డపై యువ ఆటగాళ్లతో నిండిపోయిన సూర్యసేన ఆకాశమే హద్దుగా చెలరేగి.. బంగ్లానూ 3-0తో వైట్‌వాష్ చేసింది. అయితే, లంక పర్యటనతో పోలిస్తే ఈసారి మరింత వేగంగా, మరింత దూకుడుగా పరుగులు రాబట్టింది. తొలి టీ20లో 11.5 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించిన భారత్.. ఆఖరి రెండు మ్యాచ్‌లలో బంగ్లా బౌలింగ్‌ను ఊచకోత కోసింది. వరుసగా 221, 297 పరుగులు సాధించి వారెవ్వా అనిపించింది.ఈ నేపథ్యంలో భారత మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా తన యూట్యూబ్ చానెల్ వేదికగా మాట్లాడుతూ.. ‘‘గౌతం గంభీర్, సూర్యకుమార్ యాదవ్ జోడీ టీమిండియాకు సరికొత్త దూకుడు మంత్రాన్ని ఉపదేశించింది. మ్యాచ్ అయినపోయిన తర్వాత రింకూ సింగ్ స్వయంగా ఈ విషయాన్ని పంచుకున్నాడు.పరుగుల విధ్వంసం తప్ప.. ఇంకోటి వద్దన్నారువిధ్వంసకరంగా బ్యాటింగ్ చేయడం తప్ప.. వేరే విషయాల గురించి ఆలోచించవద్దని తమకు ఆదేశాలు వచ్చాయన్నాడు. ఫియర్లెస్ క్రికెట్ ఆడాలని.. వికెట్ పడుతుందనే బెంగ వద్దని మేనేజ్మెంట్ చెప్పిందన్నాడు. దీనిని బట్టి కోచ్, కెప్టెన్ దూకుడు ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.నిజానికి పరుగులు రాబట్టాలనే తొందరలో వికెట్ పారేసుకుంటే జట్టులో చోటు దక్కదని ఆటగాళ్లు భయపడతారు. అయితే, స్వయంగా మేనేజ్మెంట్ రంగంలోకి దిగి ఫాస్ట్‌గా ఆడమని చెప్పటమే గాక.. ఆ క్రమంలో ప్రతికూల ఫలితాలు వచ్చినా అండగా ఉంటే.. అంతకంటే ఆటగాళ్లకు ఇంకేం కావాలి.బలహీన జట్లపై మాత్రమేనా?జట్టులో తమ స్థానానికి వచ్చిన ఢోకా ఏమీ లేదని ప్లేయర్లు భావిస్తే.. ఫలితాలు కూడా ఇలాగే ఉంటాయి మరి! ఈ యంగిస్తాన్ భవిష్యత్తులో మరిన్ని అద్భుతాలు చేయడం ఖాయంగా కనిపిస్తోంది’’ అని ప్రశంసలు కురిపించాడు. అయితే, ఇప్పటి వరకు యువ టీమిండియా శ్రీలంక, బంగ్లాదేశ్ వంటి బలహీన జట్లపై తమ బ్యాటింగ్ ప్రతాపాన్ని చూపిందన్న ఆకాశ్ చోప్రా.. పటిష్ట జట్లపై కూడా ఇదే విధానాన్ని అనుసరిస్తే కొన్నిసార్లు చిక్కులు తప్పవని అభిప్రాయపడ్డాడు. ఏదేమైనా తమ బ్యాటింగ్.. ముఖ్యంగా పవర్ ప్లేలో ఎలా ఉంటుందో ఇప్పటికే చూపించిందని పేర్కొన్నాడు. కాగా బంగ్లాదేశ్‌తో మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో అభిషేక్ శర్మ మినహా మిగతా బ్యాటర్లు 180కి పైగా స్ట్రైక్‌రేటుతో పరుగులు చేశారు.చదవండి: మళ్లీ శతక్కొట్టాడు: ఆసీస్‌తో టెస్టులకు టీమిండియా ఓపెనర్‌గా వస్తే! -
భారత కుర్రాళ్ల జోరు.. బంగ్లా పులుల బేజారు (ఫోటోలు)
-
IND vs BAN: న్యూఢిల్లీలో నితీశ్ ‘షో’.. సిరీస్ భారత్ సొంతం
అందివచ్చి న అవకాశాన్ని రెండు చేతులా ఒడిసి పడుతూ... ఆంధ్రప్రదేశ్ ఆల్‌రౌండర్ నితీశ్ కుమార్ రెడ్డి అటు బ్యాటింగ్‌లో ఇటు బౌలింగ్‌లో విజృంభించిన వేళ... బంగ్లాదేశ్‌పై భారత్ ఘనవిజయం సాధించింది. నితీశ్, రింకూ సింగ్ అర్ధశతకాలతో టీమిండియా భారీ స్కోరు చేయగా... బంగ్లాదేశ్ కనీస ప్రతిఘటన లేకుండానే పరాజయం పాలైంది. దీంతో మరో మ్యాచ్ మిగిలుండగానే భారత జట్టు టి20 సిరీస్‌ను 2–0తో కైవసం చేసుకుంది. సిరీస్‌లోని చివరిదైన మూడో టి20 మ్యాచ్ శనివారం హైదరాబాద్‌లో జరుగుతుంది. న్యూఢిల్లీ: టెస్టు సిరీస్‌లో బంగ్లాదేశ్‌ను చిత్తు చేసిన భారత జట్టు... టి20ల్లోనూ అదే జోరు కనబర్చింది. ఆల్‌రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టిన టీమిండియా మరో మ్యాచ్ మిగిలుండగానే 2–0తో సిరీస్ పట్టేసింది. స్వదేశంలో టీమిండియాకు ఇది వరుసగా 16వ సిరీస్ విజయం కావడం విశేషం. ఆంధ్ర ఆటగాడు నితీశ్ కుమార్ రెడ్డి ఆల్‌రౌండ్ ప్రదర్శన ఫలితంగా... మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా బుధవారం జరిగిన రెండో టి20లో భారత్ 86 పరుగుల తేడాతో బంగ్లాదేశ్‌ను ఓడించింది. పరుగుల తేడా పరంగా బంగ్లాపై టీమిండియాకిదే అతిపెద్ద విజయం. మొదట బ్యాటింగ్‌కు దిగిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 221 పరుగులు చేసింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ నితీశ్ (34 బంతుల్లో 74; 4 ఫోర్లు, 7 సిక్సర్లు) మెరిపించాడు. రింకూ సింగ్ (29 బంతుల్లో 53; 5 ఫోర్లు, 3 సిక్సర్లు) అర్ధ సెంచరీ చేయగా... హార్దిక్ పాండ్యా (19 బంతుల్లో 32; 2 ఫోర్లు, 2 సిక్సర్లు) కూడా దూకుడుగా ఆడాడు. అనంతరం లక్ష్యఛేదనలో బంగ్లాదేశ్ 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 135 పరుగులకే పరిమితమైంది. మహ్ముదుల్లా (39 బంతుల్లో 41; 3 సిక్సర్లు) మినహా ఇతర బ్యాటర్లు విఫలమయ్యారు. వైజాగ్ కుర్రాడి వీరవిహారం... టాస్ ఓడి మొదట బ్యాటింగ్‌కు దిగిన భారత జట్టుకు శుభారంభం దక్కలేదు. రెండు బౌండరీలతో జోరు కనబర్చిన ఓపెనర్ సంజూ సామ్సన్ (10) రెండో ఓవర్ చివరి బంతికి ఔట్ కాగా.. కాసేపటికే మరో ఓపెనర్ అభిõÙక్ శర్మ (15) అతడిని అనుసరించాడు. కెప్టెన్ సూర్యకుమార్ (8) కూడా వెనుదిరగడంతో టీమిండియా 41 పరుగులకే 3 వికెట్లు కోల్పోయింది. ఈ దశలో విశాఖపట్నం కుర్రాడు నితీశ్ కుమార్ రెడ్డి చక్కటి ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్నాడు. బంగ్లా బౌలర్లపై ఎదురుదాడికి దిగి ఫలితం రాబట్టాడు. మహ్ముదుల్లా బౌలింగ్‌లో 6,4తో మోత ప్రారంభించిన నితీశ్... రిషాద్ వేసిన 10వ ఓవర్లో రెండు సిక్సర్లు బాదాడు. దీంతో 10 ఓవర్లు ముగిసేసరికి భారత స్కోరు 100 పరుగులు దాటింది. ఆడుతున్న రెండో మ్యాచ్‌లోనే భారీ సిక్సర్లతో విరుచుకుపడిన నితీశ్ 27 బంతుల్లో తొలి అంతర్జాతీయ అర్ధశతకం పూర్తి చేసుకున్నాడు. మిరాజ్ వేసిన 13వ ఓవర్లో నితీశ్ 6,4,2,6,6 బాది మొత్తం 26 పరుగులు రాబట్టాడు. ఇదే జోష్‌లో మరో భారీ షాట్‌కు ప్రయత్నించి నితీశ్ ఔట్ కాగా.. ఆ తర్వాత బాదే బాధ్యత రింకూ, పాండ్యా తీసుకున్నారు. వీరిద్దరూ విజృంభించడంతో భారత్ భారీ స్కోరు చేయగలిగింది. ఆది నుంచి తడబాటే! ఛేదన ఏ దశలోనూ బంగ్లాదేశ్ లక్ష్యం దిశగా సాగలేదు. భారత్ తరఫున బౌలింగ్ చేసిన ఏడుగురు ప్రభావవంతంగా బంతులు వేయగా... పరుగులు రాబట్టేందుకు బంగ్లా బ్యాటర్లు అష్టకష్టాలు పడ్డారు. మూడో ఓవర్లో పర్వేజ్ హుస్సేన్ (16)ను ఔట్ చేసి అర్ష్ దీప్ వికెట్ల పతనానికి తెరలేపగా... అది చివరి వరకు కొనసాగింది. వాషింగ్టన్ సుందర్, అభిషేక్ శర్మ, మయాంక్ యాదవ్, రియాన్ పరాగ్ కూడా ఒక్కో వికెట్ ఖాతాలో వేసుకున్నారు. బ్యాట్‌తో సంచలన ఇన్నింగ్స్ ఆడిన నితీశ్ కుమార్ రెడ్డి బంతితోనూ చెలరేగి తన కోటా 4 ఓవర్లలో 23 పరుగులే ఇచ్చి రెండు వికెట్లు పడగొట్టాడు. స్కోరు వివరాలు భారత్ ఇన్నింగ్స్: సామ్సన్ (సి) నజ్ముల్ (బి) తస్కీన్ 10; అభిషేక్ (బి) తన్జీమ్ 15; సూర్య (సి) నజు్మల్ (బి) ముస్తఫిజుర్ 8; నితీశ్ కుమార్ రెడ్డి (సి) మిరాజ్ (బి) ముస్తఫిజుర్ 74; రింకూ సింగ్ (సి) జాకిర్ అలీ (బి) తస్కీన్ 53; పాండ్యా (సి) మిరాజ్ (బి) రిషాద్ 32; రియాన్ పరాగ్ (సి) మహ్ముదుల్లా (బి) తన్జీమ్ 15; సుందర్ (నాటౌట్) 0; వరుణ్ చక్రవర్తి (సి) పర్వేజ్ (బి) రిషాద్ 0; అర్ష్ దీప్ (సి) లిటన్ దాస్ (బి) రిషాద్ 6; మయాంక్ యాదవ్ (నాటౌట్) 1; ఎక్స్‌ట్రాలు: 7, మొత్తం (20 ఓవర్లలో 9 వికెట్లకు) 221. వికెట్ల పతనం: 1–17, 2–25, 3–41, 4–149, 5–185, 6–213, 7–214, 8–214, 9–220, బౌలింగ్: మిరాజ్ 3–0–46–0; తస్కీన్ 4–0–16–2; తన్జీమ్ 4–0–50–2; ముస్తఫిజుర్ 4–0–36–2; రిషాద్ 4–0–55–3; మహ్ముదుల్లా 1–0–15–0. బంగ్లాదేశ్ ఇన్నింగ్స్: పర్వేజ్ (బి) అర్ష్ దీప్ 16; లిటన్ దాస్ (బి) వరుణ్ 14; నజ్ముల్ (సి) పాండ్యా (బి) సుందర్ 11; తౌహిద్ (బి) అభిõÙక్ 2; మిరాజ్ (సి) (సబ్) రవి బిష్ణోయ్ (బి) రియాన్ 16; మహ్ముదుల్లా (సి) రియాన్ (బి) నితీశ్ 41; జాకీర్ అలీ (సి) సుందర్ (బి) మయాంక్ యాదవ్ 1; రిషాద్ (సి) పాండ్యా (బి) వరుణ్ 9; తన్జీమ్ (సి) పాండ్యా (బి) నితీశ్ 8; తస్కీన్ (నాటౌట్) 5; ముస్తఫిజుర్ (నాటౌట్) 1; ఎక్స్‌ట్రాలు 11, మొత్తం (20 ఓవర్లలో 9 వికెట్లకు) 135. వికెట్ల పతనం: 1–20, 2–40, 3–42, 4–46, 5–80, 6–83, 7–93, 8–120, 9–127, బౌలింగ్: అర్ష్ దీప్ 3–0–26–1; నితీశ్ కుమార్ రెడ్డి 4–0–23–2; వాషింగ్టన్ సుందర్ 1–0–4–1; వరుణ్ చక్రవర్తి 4–0–19–2; అభిషేక్ 2–0–10–1; మయాంక్ యాదవ్ 4–0–30–1; రియాన్ పరాగ్ 2–0–16–1. -
దులీప్ ట్రోఫీ.. శాంసన్, రింకూ ఎంట్రీ! తుది జట్లు ఇవే
దులీప్ ట్రోఫీ-2024లో భాగంగా రౌండ్-2 మ్యాచ్‌లు ప్రారంభమయ్యాయి. అనంతపురం వేదికగా ఇండియా-ఎ, ఇండియా-డి జట్లు తలపడతున్నాయి. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఇండియా-డి జట్టు కెప్టెన్ శ్రేయస్ అయ్యర్.. తొలుత భారత్-ఎను బ్యాటింగ్ ఆహ్హనించాడు. డి జట్టులోకి సంజూ శాంసన్, సౌరభ్ కుమార్ రాగా.. ఎ జట్టులోకి తిలక్ వర్మ, విధ్వత్ కావేరప్ప, కుమార్ కుశాగ్రా వచ్చారు. దులీప్ ట్రోఫీలో భాగమైన చాలా మంది భారత క్రికెటర్లు బంగ్లాదేశ్‌తో టెస్టు సిరీస్‌కు సన్నద్దమయ్యేందుకు వెళ్లడంతో ఈ మార్పులు చోటు చేసుకున్నాయి.తుది జట్లుఇండియా D : అథర్వ తైదే, యశ్ దూబే, శ్రేయాస్ అయ్యర్ (సి), దేవదత్ పడిక్కల్, సంజు శాంసన్ (వికెట్ కీపర్), రికీ భుయ్, సరాంశ్ జైన్, సౌరభ్ కుమార్, హర్షిత్ రాణా, అర్ష్‌దీప్ సింగ్, విధ్వత్ కావరప్పఇండియా A : ప్రథమ్ సింగ్, మయాంక్ అగర్వాల్(కెప్టెన్), తిలక్ వర్మ, రియాన్ పరాగ్, శాశ్వత్ రావత్, కుమార్ కుషాగ్రా(వికెట్ కీపర్), షామ్స్ ములానీ, తనుష్ కోటియన్, ప్రసిద్ధ్ కృష్ణ, ఖలీల్ అహ్మద్, ఆకిబ్ ఖాన్బౌలింగ్ ఎంచుకున్న ఇండియా-బిఇక ఈ టోర్నీలో మరోవైపు అనంతపూర్‌లో బి స్టేడియంలో ఇండియా-బి, ఇండియా-సి జట్ల మధ్య మ్యాచ్ జరుగుతోంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన భారత్-బి టీమ్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. భారత-బి జట్టులోకిఇండియా సి: అభిషేక్ పోరెల్ (వికెట్), ఇషాన్ కిషన్, రుతురాజ్ గైక్వాడ్ (కెప్టెన్), రజత్ పటీదార్, అన్షుల్ కాంబోజ్, బాబా ఇంద్రజిత్, బి సాయి సుదర్శన్, మయాంక్ మార్కండే, మానవ్ జగ్దూసకుమార్ సుతార్, వైషక్ విజయ్‌కుమార్, సందీప్ వారియర్ఇండియా బి: అభిమన్యు ఈశ్వరన్ (కెప్టెన్), నితీష్ కుమార్ రెడ్డి, ముఖేష్ కుమార్, ముషీర్ అహ్మద్ ఖాన్, నారాయణ్ జగదీసన్ (వికెట్ కీపర్), నవదీప్ సైనీ, రాహుల్ చాహర్, రవిశ్రీనివాసన్ సాయి కిషోర్, రింకు సింగ్, సర్ఫరాజ్ ఖాన్, వాషింగ్టన్ సుందర్భారత బి జట్టులోకి ముఖేష్ కుమార్, రింకూ సింగ్, జగదీసన్ రాగా, ఇండియా సి జట్టులోకి మయాంక్ మార్కండే, రజిత్ పాటిదార్ ఎంట్రీ ఇచ్చారు. -
రింకూ, శ్రేయస్, సుందర్‌లపై దృష్టి
సాక్షి, అనంతపురం: దేశవాళీ క్రికెట్ టోర్నీ దులీప్ ట్రోఫీలో నేడు రెండో దశ మ్యాచ్‌లు ప్రారంభం కానున్నాయి. అనంతపురం వేదికగా జరగనున్న ఈ మ్యచ్‌ల్లో భారత్ ‘ఎ’ జట్టుతో భారత్ ‘డి’... భారత్ ‘బి’ జట్టుతో భారత్ ‘సి’ తలపడనున్నాయి. తొలి రౌండ్ మ్యాచ్‌ల్లో భారత్ ‘బి’, ‘సి’ జట్లు విజయాలు సాధించాయి. ఈ నెల 19 నుంచి భారత్, బంగ్లాదేశ్ మధ్య తొలి టెస్టు ప్రారంభం కానున్న నేపథ్యంలో సర్ఫరాజ్ ఖాన్ మినహా టీమిండియా ప్లేయర్లెవరూ రెండో రౌండ్ దులీప్ ట్రోఫీ మ్యాచ్‌లో పాల్గొనడం లేదు. తొలి మ్యాచ్‌లో ఆడిన శుబ్‌మన్ గిల్, కేఎల్ రాహుల్, ధ్రువ్ జురేల్, కుల్దీప్ యాదవ్, ఆకాశ్‌దీప్, యశస్వి జైస్వాల్, రిషబ్ పంత్, యశ్ దయాళ్, అక్షర్ పటేల్... తమతమ జట్లను వీడి టీమిండియాతో జట్టు కట్టారు. దీంతో భారత్ ‘సి’ జట్టులో మినహా మిగిలిన టీమ్‌లలో మార్పులు చోటు చేసుకున్నాయి. భారత ‘ఎ’ జట్టుకు మయాంక్ అగర్వాల్ సారథ్యం వహించనుండగా.. ‘బి’ టీమ్‌కు అభిమన్యు ఈశ్వరన్ కెపె్టన్‌గా వ్యవహరించనున్నాడు. ‘సి’ టీమ్‌కు రుతురాజ్ గైక్వాడ్, ‘డి’ జట్టుకు శ్రేయస్ అయ్యర్ సారథ్యం వహించనున్నారు. ప్రధాన ఆటగాళ్ల గైర్హాజరీలో దేశవాళీల్లో నిలకడ కొనసాగిస్తున్న యువ ఆటగాళ్లకు ఈ మ్యాచ్‌లు మంచి అవకాశం కానున్నాయి. రింకూ సింగ్, రుతురాజ్ గైక్వాడ్, శ్రేయస్ అయ్యర్, మయాంక్ అగర్వాల్, వాషింగ్టన్ సుందర్ వంటి వాళ్లు మెరుగైన ప్రదర్శన చేసి జాతీయ జట్టులో చోటు దక్కించుకోవాలని భావిస్తున్నారు. గత మ్యాచ్‌లో భారత్ ‘ఎ’ జట్టుకు సారథిగా వ్యవహరించిన శుబ్‌మన్ గిల్ అందుబాటులో లేకపోవడంతో మయాంక్‌కు జట్టు పగ్గాలు దక్కాయి. రెండేళ్ల క్రితం జాతీయ జట్టు తరఫున చివరి టెస్టు ఆడిన మయాంక్ తిరిగి సెలెక్టర్ల దృష్టిలో పడాలంటే భారీగా పరుగులు చేయాల్సిన అవసరముంది. బంగ్లాదేశ్‌తో రెండు మ్యాచ్‌ల సిరీస్‌లో తొలి టెస్టు కోసమే భారత జట్టును ఎంపిక చేయగా... దులీప్ ట్రోఫీలో మెరుగైన ప్రదర్శన చేస్తే బంగ్లాతో రెండో టెస్టు కోసం ప్రకటించనున్న జట్టులో చోటు దక్కించుకునే అవకాశం లేకపోలేదు.ఈ ఏడాది ఆరంభంలో ఇంగ్లండ్‌తో స్వదేశంలో జరిగిన టెస్టు సిరీస్ ద్వారా అంతర్జాతీయ అరంగేట్రం చేసిన మిడిలార్డర్ బ్యాటర్ సర్ఫరాజ్ ఖాన్ చక్కటి ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. ప్రస్తుతం బంగ్లాదేశ్‌తో తొలి టెస్టు కోసం ప్రకటించిన టీమిండియాలో సభ్యుడైన సర్ఫరాజ్... ఈ మ్యాచ్ అనంతరం నేరుగా చెన్నైలో జట్టుతో చేరనున్నాడు. భారత్ ‘బి’ జట్టు తరఫున బరిలోకి దిగనున్న సర్ఫరాజ్ ఖాన్... మరో మంచి ఇన్నింగ్స్‌తో రాణించి టీమిండియాలో చేరాలనుకుంటున్నాడు. ఇక గత మ్యాచ్‌లో భారీ సెంచరీతో చెలరేగిన సర్ఫరాజ్ సోదరుడు ముషీర్ ఖాన్ అదే జోరు కొనసాగించాలనుకుంటున్నాడు. అటు బ్యాట్‌తో ఇటు బంతితో సత్తాచాటగల స్పిన్ ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్ భారత్ ‘బి’ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. ఇంగ్లండ్‌తో సిరీస్‌లో ఆకట్టుకోలేకపోయిన రజత్ పాటిదార్‌తో పాటు శ్రేయస్ అయ్యర్ తిరిగి సత్తాచాటి సెలెక్టర్ల దృష్టిలో పడాలని చూస్తున్నారు. గత మ్యాచ్ ప్లెయింగ్ ఎలెవన్‌లో చోటు దక్కించుకోలేకపోయిన దేవదత్ పడిక్కల్, సంజూ సామ్సన్ భారత్ ‘డి’ జట్టు తరఫున ఈ మ్యాచ్‌లోనైనా అవకాశం దక్కించుకుంటారా చూడాలి. ఇక పేస్ బౌలర్లు ముఖేశ్ కుమార్, ప్రసిద్ధ్ కృష్ణ, అర్ష్‌దీప్ సుదీర్ఘ టెస్టు సీజన్‌కు ముందు లయ అందుకునేందుకు ఇది చక్కటి అవకాశం. వచ్చే ఏడాది జరగనున్న ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ (డబ్ల్యూటీసీ) ఫైనల్‌కు ముందు భారత్ మొత్తం 10 టెస్టులు ఆడనుండగా... పేస్ బౌలర్లకు విరివిగా అవకాశాలు వచ్చే చాన్స్ ఉంది. ఈ నేపథ్యంలో దులీప్ ట్రోఫీలో రాణించిన వారిపై సెలెక్టర్ల దృష్టి ఉండనుంది. ఇక గత మ్యాచ్‌లో ఎనిమిది వికెట్లతో సత్తాచాటిన లెఫ్టార్మ్ స్పిన్నర్ మానవ్ సుతార్ అదే జోరు కొనసాగించాలని చూస్తున్నాడు.దులీప్ ట్రోఫీలో తెలుగు రాష్ట్రాల ఆటగాళ్లుతిలక్ వర్మ (భారత్ ‘ఎ’) షేక్ రషీద్ (భారత్ ‘ఎ’) నితీశ్ కుమార్ రెడ్డి (భారత్ ‘బి’) రికీ భుయ్ (భారత్ ‘డి’) శ్రీకర్ భరత్ (భారత్ ‘డి’) -
రింకూ సింగ్‌కు లక్కీ ఛాన్స్.. ఆ జట్టు నుంచి పిలుపు?
టీమిండియా విధ్వంసకర ఆటగాడు రింకూ సింగ్ మళ్లీ రెడ్ బాల్ క్రికెట్ ఆడేందుకు సిద్దమయ్యాడు. దులీప్ ట్రోఫీ-2024లో ఇండియా-బి జట్టు తరపున రింకూ ఆడనున్నాడు. భారత-బి జట్టులోని చాలా మంది ఆటగాళ్లు బంగ్లాదేశ్‌తో టెస్టు సిరీస్ ఆడేందుకు వెళ్లనున్నారు.ప్రస్తుతం బి జట్టులో భాగంగా ఉన్న యశస్వీ జైశ్వాల్, రిషబ్ పంత్, సర్ఫరాజ్ ఖాన్, యశ్ దయాల్‌లకు బంగ్లాతో టెస్టు సిరీస్‌కు ఎంపికయ్యారు. సెప్టెంబర్ 12 నుంచి జరగనున్న తదుపరి రౌండ్ మ్యాచ్‌లకు వీరిందరూ అందుబాటులో ఉండరు.ఈ నేపథ్యంలోనే రింకూ సింగ్‌తో పాటు మరో ఉత్తరప్రదేశ్ ఆటగాడు ఆకిబ్ ఖాన్‌కు దులీప్ ట్రోఫీలో ఆడేందుకు పిలుపు వచ్చింది అయితే ఈ దేశీవాళీ టోర్నీకి ముందు ఎంపిక చేసిన జట్లలో రింకూకు చోటు దక్కలేదు. దీంతో అతడు యూపీ టీ20లో లీగ్‌లో భాగమయ్యాడు. కానీ ఇప్పుడు సెలక్టర్లు నుంచి పిలుపు రావడంతో అతడు ఇండియా బి జట్టుతో చేరనున్నాడు."దులీప్ ట్రోఫీలో ఆడేందుకు అవకాశం వచ్చినందుకు చాలా ఆనందంగా ఉంది. కష్టపడి పనిచేయడమే నా పని. మొదట జట్లను ప్రకటించినప్పుడు.. నా పేరు లేకపోవడం కాస్త నిరుత్సాహపడ్డాను. కానీ ఇప్పడు మళ్లీ పిలుపు రావడంతో సంతోషంగా ఉంది" అని టైమ్స్ ఆఫ్ ఇండియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో రింకూ పేర్కొన్నాడు. అతడు త్వరలోనే అనంతపూర్‌లో ఉన్న భారత జట్టుతో చేరనున్నాడు.చదవండి: IND vs BAN: అప్పుడు జీరో.. కట్ చేస్తే..! ఇప్పుడు ఏకంగా టీమిండియాలో ఎంట్రీ? -
బంతితో చెలరేగిన రింకూ సింగ్.. ఒకే ఓవర్లో మూడు వికెట్లు
ఇప్పటి వరకు తన బ్యాటింగ్ మెరుపులతో ఆకట్టుకున్న టీమిండియా నయా ఫినిషర్ రింకూ సింగ్.. ఇప్పుడు తన బౌలింగ్ నైపుణ్యాలతోనూ అభిమానులను ఫిదా చేస్తున్నాడు. దీంతో ఈ లెఫ్టాండర్ బ్యాటర్ ఇలాగే నిలకడగా రాణిస్తే భారత జట్టుకు మరో అదనపు స్పిన్ బౌలింగ్ ఆల్‌రౌండర్ దొరికినట్టేనంటూ అతడిని ప్రశంసిస్తున్నారు. ఉత్తరప్రదేశ్‌కు చెందిన రింకూ సింగ్ యూపీ టీ20 లీగ్ 2024లో మీరట్ మెవెరిక్స్ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు.ఈ క్రమంలో సారథ్య బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తున్న రింకూ... ఆల్‌రౌండ్ ప్రతిభతోనూ ఆకట్టుకుంటున్నాడు. ఇటీవల నోయిడా సూపర్ కింగ్స్‌తో మ్యాచ్‌లో 64 పరుగులు చేయడంతో పాటు రెండు కీలక వికెట్లు తీసిన విషయం తెలిసిందే. తాజాగా కాన్పూర్ సూపర్‌స్టార్స్‌తో మ్యాచ్‌లోనూ మూడు వికెట్లు పడగొట్టి ఔరా అనిపించాడు.ఏకనా క్రికెట్ స్టేడియంలో బుధవారం జరిగిన మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన మీరట్ మెవెరిక్స్‌కు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. విధ్వంసకర ఓపెనర్‌గా పేరొందిన స్వస్తిక్ చికరా డకౌట్ అయ్యాడు. అయితే, మరో ఓపెనర్ అక్షయ్ దూబే సైతం 14 బంతుల్లో 11 పరుగులు చేసి నిష్క్రమించాడు.ఆ తర్వాతి స్థానంలో వచ్చిన మాధవ్ కౌశిక్ నెమ్మదిగా ఇన్నింగ్స్ ఆరంభించినా.. క్రమంగా క్రీజులో పాతుకుపోయి అద్భుత ఇన్నింగ్స్‌తో అదరగొట్టాడు. మాధవ్ 18, రితురాజ్ శర్మ 14 పరుగులతో ఉన్న సమయంలో వర్షం ఆటంకం కలిగించింది. ఈ క్రమంలో మ్యాచ్‌ను తొమ్మిది ఓవర్లకు కుదించారు. అప్పటికి మెవెరిక్స్ స్కోరు 49-2.26 బంతుల్లో 52 పరుగులువర్షం తగ్గిన తర్వాత మళ్లీ ఆట మొదలుపెట్టగా మాధవ్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. కేవలం 26 బంతుల్లోనే 52 పరుగులతో అజేయంగా నిలిచాడు. ఇందులో ఐదు ఫోర్లు, నాలుగు సిక్సర్లు ఉన్నాయి. ఈ క్రమంలో నిర్ణీత తొమ్మిది ఓవర్లలో మెవెరిక్స్ మూడు వికెట్ల నష్టానికి 90 పరుగులు చేసింది.ఈ నేపథ్యంలో డక్‌వర్త్ లూయిస్ పద్ధతి ప్రకారం కాన్పూర్ సూపర్‌స్టార్స్‌కు 106 పరుగుల లక్ష్యం విధించారు. ఈ క్రమంలో ఐదు ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 61 పరుగులు చేసిన కాన్పూర్ టార్గెట్ ఛేదించేలా కనిపించింది. అయితే, ఆరో ఓవర్లో బంతితో రంగంలోకి దిగిన మెవెరిక్స్ కెప్టెన్ రింకూ సింగ్.. స్పిన్ మాయాజాలంతో కాన్పూర్ బ్యాటర్లకు వరుస షాకులిచ్చాడు.ఒకే ఓవర్లో మూడు వికెట్లు తీసిన రింకూ సింగ్ఈ రైటార్మ్ ఆఫ్‌బ్రేక్ స్పిన్నర్‌కు ఫోర్‌తో స్వాగతం పలికిన శౌర్య సింగ్(5).. ఆ మరుసటి బంతికే పెవిలియన్ చేరాడు. ఆ తర్వాత ఆదర్శ్ సింగ్, సుధాంశుల వికెట్లు కూడా పడగొట్టాడు రింకూ. ఒకే ఓవర్లో మూడు వికెట్లు(3/7) పడగొట్టి కాన్పూర్ను కోలుకోలేని దెబ్బకొట్టాడు. ఈ క్రమంలో 7.4 ఓవర్లలోనే కాన్పూర్ కథ(83 రన్స్) ముగియగా.. 22 పరుగుల తేడాతో మీరట్ మెవెరిక్స్ జయభేరి మోగించింది. దీంతో ఇప్పటి వరకు ఆడిన ఆరు మ్యాచ్‌లలో ఐదింట గెలిచి పాయింట్ల పట్టికలో మొదటిస్థానంలో నిలిచింది. View this post on Instagram A post shared by UP T20 League (@t20uttarpradesh) -
ఆల్‌రౌండ్ షోతో అదరగొట్టిన రింకూ సింగ్
యూపీ టీ20 లీగ్‌లో టీమిండియా చిచ్చరపిడుగు రింకూ సింగ్ చెలరేగిపోతున్నాడు. ఈ టోర్నీలో ఇప్పటివరకు మూడు మ్యాచ్‌లు ఆడిన అతను.. మూడింటిలో అజేయంగా (7 నాటౌట్ (2), 48 నాటౌట్ (35), 64 నాటౌట్ (35)) నిలిచి 119 పరుగులు చేశాడు. ఈ టోర్నీలో మీరట్ మెవెరిక్స్‌కు నాయకత్వం వహిస్తున్న రింకూ.. తాజాగా నోయిడా సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 35 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 64 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. ఫలితంగా తొలుత బ్యాటింగ్ చేసిన మెవెరిక్స్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 163 పరుగులు చేసింది. మెవెరిక్స్ ఇన్నింగ్స్‌లో రింకూతో పాటు మాధవ్ కౌశిక్ (40) రాణించాడు. నోయిడా బౌలర్లలో నమన్ తివారి, కునాల్ త్యాగి చెరో 2 వికెట్లు పడగొట్టగా.. పియూశ్ చావ్లా, కార్తికేయ యాదవ్, నితీశ్ రాణా తలో వికెట్ దక్కించుకున్నారు.164 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన నోయిడా.. నిర్ణీత ఓవర్లలో 152 పరుగులకే (8 వికెట్ల నష్టానికి) పరిమితమై 11 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. కావ్య టియోటియా (65) నోయిడాను గెలిపించేందుకు విఫలయత్నం చేశాడు. ఆఖర్లో ఆదిత్య శర్మ (8 బంతుల్లో 21) బ్యాట్ ఝులిపించినా ప్రయోజనం లేకుండా పోయింది. నోయిడా కెప్టెన్ నితీశ్ రాణా ఓ మోస్తరు స్కోర్ (21) చేశాడు. మెవెరిక్స్ బౌలర్లలో విజయ్ కుమార్ 3 వికెట్లు పడగొట్టాడు.బంతితోనూ రాణించిన రింకూ..బ్యాట్‌తో ఇరగదీసిన రింకూ సింగ్ బౌలింగ్‌లోనూ (2/18) సత్తా చాటాడు. విశాల్ చౌదరీ, యశ్ గార్గ్, జీషన్ అన్సారీ తలో వికెట్ పడగొట్టారు. -
ఒకవేళ అదే జరిగితే ఆర్సీబీకి ఆడుతా: రింకూ సింగ్
ఐపీఎల్-2025 మెగా వేలానికి బీసీసీఐ ప్రణాళికలు రచిస్తోంది. అయితే ఇంకా ఆటగాళ్ల రిటెన్షన్ రూల్స్‌పై ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ మాత్రం ఇంకా ఎటువంటి ఆధికారిక ప్రకటన చేయలేదు.వాస్తవానికి మెగా వేలానికి ముందు ఫ్రాంచైజీలు గరిష్టంగా ముగ్గురు లేదా నలుగురు ఆటగాళ్లను మాత్రమే రిటైన్ చేసుకొని మిగతా ఆటగాళ్లను రిలీజ్ చేయాల్సి ఉంటుంది. కానీ కొన్ని ఫ్రాంచైజీలు మాత్రం రిటైన్ చేసుకునే ఆటగాళ్ల సంఖ్యను పెంచాలని డిమాండ్ చేస్తున్నాయి. ఇదే విషయాన్ని గత నెలలో జరిగిన ఐపీఎల్ గవర్నింగ్ బాడీ మీటింగ్‌లో కూడా ఆయా ఫ్రాంచైజీలు ప్రస్తావించాయి. కానీ ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ మాత్రం ఆయా ఫ్రాంచైజీల అభ్యర్ధననను తిరష్కరించినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో మెగా వేలాన్ని ఈ ఏడాది చివరలో నిర్వహించాలని బీసీసీఐ భావిస్తున్నట్లు సమాచారం. అందుకు తగ్గట్టే ఆయా ఫ్రాంచైజీలు కూడా తమ జట్టులో సమూల మార్పులు దిశగా అడుగులు వేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.ఆర్సీబీకి ఆడాలని ఉంది: రింకూ ఇక ఐపీఎల్ మెగా వేలం వార్తల నేపథ్యంలో టీమిండియా ఫినిషర్, కోల్‌కతా నైట్‌రైడర్స్ ఆటగాడు రింకూ సింగ్ తన మనసులోని మాటను బయట పెట్టాడు. ఒకవేళ కేకేఆర్ అతడిని రిటైన్ చేసుకోపోతే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) తరపున ఆడాలన్న తన కోరికను రింకూ వ్యక్తపరిచాడు. విరాట్ కోహ్లి ఆర్సీబీలో ఉన్నందున ఆ ఫ్రాంచైజీకి ఆడాలనకుంటున్నట్లు అతడు తెలిపాడు.కాగా తన ఐపీఎల్ అరంగేట్రం నుంచి రింకూ కేకేఆర్ తరపున ఆడుతున్నాడు. కొన్ని సీజన్లలో అతడిని కోల్‌కతా వేలంలోకి విడిచిపెట్టినప్పటకి తిరిగి మళ్లీ సొంతం చేసుకుంది. ఆ జట్టు ఫినిషర్‌గా రింకూ మారాడు. అయితే ఈ ఏడాది సీజన్లతో కేకేఆర్ ఛాంపియన్స్‌గా నిలిచినప్పటకి రింకూ మాత్రం తన మార్క్‌ను చూపించలేకపోయాడు. ఇప్పటివరకు ఐపీఎల్లో కేకేఆర్ తరపున 45 మ్యాచ్‌లు ఆడిన రింకూ 143.34 స్ట్రైక్ రేటుతో 893 పరుగులు చేశాడు. -
రింకూ, సూర్యకుమార్ అద్భుత బౌలింగ్.. సూపర్ ఓవర్లో లంకను చిత్తు చేసిన భారత్
శ్రీలంకతో జరిగిన మూడో టీ20లో టీమిండియా ఓడాల్సిన మ్యాచ్‌లో గెలిచింది. పార్ట్ టైమ్ బౌలర్ల అయిన రింకూ సింగ్, సూర్యకుమార్ అద్బుతంగా బౌలింగ్ చేసి మ్యాచ్‌ను 'టై' చేశారు. అనంతరం సూపర్ ఓవర్లో టీమిండియా ఘన విజయం సాధించింది. 138 పరుగుల స్వల్ప లక్ష్య ఛేదనలో శ్రీలంక తడబడింది. చివరి ఏడు వికెట్లను 22 పరుగుల వ్యవధిలో (4.2 ఓవర్లలో) కోల్పోయింది. 19వ ఓవర్ వేసిన రింకూ సింగ్ కేవలం మూడు పరుగులు మాత్రమే ఇచ్చి 2 వికెట్లు తీయగా.. 20వ ఓవర్ వేసిన కెప్టెన్ సూర్యకుమార్ 5 పరుగులిచ్చి రెండు వికెట్లు పడగొట్టాడు. రింకూ, స్కై సూపర్ బౌలింగ్‌తో చెలరేగడంతో మ్యాచ్ 'టై'గా మారి సూపర్ ఓవర్‌కు దారి తీసింది.GG & SURYA 🤝 DOING INNOVATION. 😄- A 20th over of the match was bowled by Suryakumar Yadav and he defended 6 runs. 🤯pic.twitter.com/dBIT8XdqX0— Mufaddal Vohra (@mufaddal_vohra) July 30, 2024సూపర్ ఓవర్లో వాషింగ్టన్ సుందర్ సూపర్‌గా బౌలింగ్ చేసి రెండు వికెట్లు తీసి రెండు పరుగులు మాత్రమే ఇచ్చాడు. అనంతరం సూర్యకుమార్ తొలి బంతికే బౌండరీ బాది టీమిండియాకు చిరస్మరణీయ విజయాన్నందించాడు. ఈ గెలుపుతో భారత్ మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను 3-0 తేడాతో క్లీన్ స్వీప్ చేసింది. ఓడాల్సిన మ్యాచ్‌ను సూపర్ ఓవర్ దాకా తీసుకెళ్లి గెలవడంతో పార్ట్ టైమ్ బౌలర్లు రింకూ సింగ్, సూర్యకుమార్ యాదవ్‌లపై ప్రశంసల వర్షం కురుస్తుంది. ముఖ్యంగా చివరి ఓవర్ అద్భుతంగా బౌలింగ్ చేసిన స్కైను అభిమానులు ఆకాశానికెత్తుతున్నారు. RINKU SINGH, THE STAR IN THE 19TH OVER. 🔥 pic.twitter.com/eDv1Qt3uYj— Johns. (@CricCrazyJohns) July 30, 2024నిజమైన మ్యాచ్ విన్నర్ అంటూ కొనియాడుతున్నారు. సూపర్ ఓవర్ వేసిన సుందర్‌పై కూడా ప్రశంసల వర్షం కురుస్తుంది. సూపర్ ఓవర్లో అద్బుతంగా బౌలింగ్ చేశాడంటూ నెటిజన్లు కితాబునిస్తున్నారు. రెగ్యులర్ మ్యాచ్‌లో రెండు, సూపర్ ఓవర్లో రెండు వికెట్లు తీయడంతో పాటు కీలకమైన 25 పరుగులు చేసిన సుందర్ ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్‌గా ఎంపికయ్యాడు. రెగ్యులర్ కెప్టెన్‌గా తొలి సిరీస్‌లోనే అద్భుతంగా రాణించిన సూర్యకుమార్‌కు ప్లేయర్ ఆఫ్ సిరీస్ అవార్డు లభించింది.ఇక ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్.. నిర్ణీత ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 137 పరుగులు చేసింది. శుభ్‌మన్ గిల్ (39), రియాన్ పరాగ్ (26), సుందర్ (25) ఓ మోస్తరు పరుగులు చేశారు. లంక బౌలరల్లో తీక్షణ 3, హసరంగ 2, విక్రమసింఘే, అశిత ఫెర్నాండో, రమేశ్ మెండిస్ తలో వికెట్ పడగొట్టారు.అనంతరం స్వల్ప లక్ష్య ఛేదనకు దిగిన శ్రీలంక ఆదిలో గెలుపు దిశగా పయనించినప్పటికీ చివర్లో తడబడి ఓటమిని కొనితెచ్చుకుంది. ఆ జట్టు నిర్ణీత ఓవర్లు పూర్తయ్యేసరికి 8 వికెట్ల నష్టానికి 137 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఓపెనర్లు నిస్సంక (26), కుశాల్ మెండిస్ (43), వన్‌డౌన్ బ్యాటర్ (46) ఓ మోస్తరు స్కోర్లు చేసినా ప్రయోజనం లేకుండా పోయింది. మిగతా ఆటగాళ్లంతా కనీసం రెండంకెల స్కోర్లు కూడా చేయలేకపోయారు. భారత బౌలర్లలో సుందర్, బిష్ణోయ్, రింకూ సింగ్, స్కై తలో 2 వికెట్లు తీశారు. కాగా, ఇరు జట్ల మధ్య మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్ ఆగస్ట్ 2, 4, 7 తేదీల్లో కొలొంబో వేదికగా జరుగనుంది. -
టెస్ట్‌ల్లోకి రింకూ..?
పొట్టి ఫార్మాట్లో అత్యుత్తమ ఫినిషర్‌గా పేరు తెచ్చుకున్న భారత అప్ కమింగ్ స్టార్ రింకూ సింగ్‌పై టీమిండియా తాజా మాజీ బ్యాటింగ్ కోచ్ విక్రమ్ రాథోడ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. రింకూకు టెస్ట్‌ల్లో అవకాశాలు కల్పిస్తే ఖచ్చితంగా రాణిస్తాడని ఆశాభావం వ్యక్తం చేశాడు. రింకూకు ఉన్న టెంపర్మెంట్ సుదీర్ఘ ఫార్మాట్‌కు సరిగ్గా సరిపోతుందని అభిప్రాయపడ్డాడు. రింకూ నెట్స్‌లో బ్యాటింగ్ చేసే విధానం చూస్తే, అతనెందుకు టెస్ట్ జట్టులో ఉండకూడదని అనిపిస్తుందన్నాడు. రింకూ ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 50కి పైగా సగటు కలిగి ఉన్నాడన్న విషయాన్ని గుర్తు చేశాడు. సరిగ్గా వినియోగించుకుంటే రింకూ టెస్ట్‌ల్లో సత్తా చాటగలడని ఆశాభావం వ్యక్తం చేశాడు. ప్రముఖ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో రాథోడ్ రింకూపై తన అభిప్రాయాన్ని వ్యక్తపరిచాడు. 26 ఏళ్ల రింకూ ఫస్ట్‌క్లాస్ క్రికెట్లో ఉత్తర్‌ప్రదేశ్‌కు ప్రాతినిథ్యం వహిస్తాడు. ఈ ఫార్మాట్లో అతను 47 మ్యాచ్‌లు ఆడి 54.70 సగటున 3173 పరుగులు చేశాడు. త్వరలో భారత్.. స్వదేశంలో బంగ్లాదేశ్‌తో టెస్ట్ సిరీస్ ఆడనుంది. ఈ సిరీస్ కోసం భారత సెలెక్టర్లు రింకూ సింగ్ పేరును పరిశీలిస్తారేమో చూద్దాం.ఇదిలా ఉంటే, రింకూ.. భారత్ టీ20 వరల్డ్ కప్ 2024 గెలిచిన జట్టులో రిజర్వ్ సభ్యుడిగా ఉన్నాడు. జట్టు కూర్పులో సమతుల్యత కోసం ప్రపంచకప్ జట్టుకు రింకూని ఎంపిక చేయలేదు. తాజాగా జింబాబ్వే ముగిసిన టీ20 సిరీస్‌లో రింకూ చెప్పుకోదగ్గ స్కోర్లేమీ చేయలేదు. ఈ సిరీస్‌లో అతను నాలుగు ఇన్నింగ్స్‌ల్లో 60 పరుగులు మాత్రమే చేశాడు. ఓవరాల్‌గా రింకూ టీ20 కెరీర్లో 15 ఇన్నింగ్స్‌లు ఆడి 83.2 సగటున, 176.27 స్ట్రయిక్‌రేట్‌తో 416 పరుగులు చేశాడు. రింకూ గతేడాది వన్డేల్లోనూ అరంగేట్రం చేశాడు. ఈ ఫార్మాట్లో అతను రెండు మ్యాచ్‌లు ఆడి 55 పరుగులు చేశాడు. -
రింకూ సింగ్ ఖాతాలో ప్రత్యేక రికార్డు.. ధోని, విరాట్ కంటే వేగంగా..!
జింబాబ్వేతో జరిగిన రెండో టీ20లో భారత అప్ కమింగ్ స్టార్ రింకూ సింగ్ ఓ ప్రత్యేకమైన రికార్డు నెలకొల్పాడు. ఈ మ్యాచ్‌లో 22 బంతుల్లో 2 ఫోర్లు, 5 సిక్సర్ల సాయంతో 48 పరుగులు చేసి అజేయంగా నిలిచిన రింకూ.. భారత్ తరఫున టీ20ల్లో చివరి రెండు ఓవర్లలో అత్యధిక సిక్సర్లు (18) బాదిన ఆటగాళ్ల జాబితాలో నాలుగో స్థానానికి ఎగబాకాడు. ఈ జాబితాలో హార్దిక్ పాండ్యా (32 సిక్సర్లు) టాప్‌లో ఉండగా.. విరాట్ (24), ధోని (19) రెండు, మూడు స్థానాల్లో నిలిచారు. 32 సిక్సర్ల మార్కును చేరుకునేందుకు హార్దిక్‌కు 193 బంతులు, 24 సిక్సర్ల మార్కును చేరుకునేందుకు కోహ్లికి 158 బంతులు, 19 సిక్సర్ల మార్కును చేరుకునేందుకు ధోనికి 258 బంతులు అవసరం కాగా.. రింకూ కేవలం 48 బంతుల్లోనే 18 సిక్సర్ల మార్కును తాకాడు. రింకూ కెరీర్లో చివరి రెండు ఓవర్లలో 334.69 స్ట్రయిక్‌రేట్‌తో పరుగులు సాధించడం గమనార్హం. తన టీ20 కెరీర్లో ఇప్పటివరకు (13 ఇన్నింగ్స్‌లు) 25 సిక్సర్లు బాదిన రింకూ.. 178.76 స్ట్రయిక్‌రేట్‌తో 80.8 సగటున 404 పరుగులు చేశాడు. అంతర్జాతీయ స్థాయిలో కనీసం 15 మ్యాచ్‌లు ఆడిన ఆటగాళ్లలో ఇవే అత్యుత్తమ గణాంకాలు. రింకూ తన టీ20 కెరీర్లో చేసిన స్కోర్లు ఇలా ఉన్నాయ. 38(21), 37*(15), 22*(14), 31*(9), 46(29), 6(8), 68*(39), 14(10), 16*(9), 9*(9), 69*(39), 0(2), 48*(22)🚨 WHAT A SHOT, RINKU 🚨 pic.twitter.com/gNZKRjAYZ9— Johns. (@CricCrazyJohns) July 7, 2024జింబాబ్వేతో రెండో టీ20లో 15వ ఓవర్లో క్రీజ్‌లోకి వచ్చిన రింకూ.. తొలి 14 బంతుల్లో కేవలం 18 పరుగులు మాత్రమే చేశాడు. చివరి రెండు ఓవర్లలో గేర్ మార్చిన రింకూ.. 8 బంతుల్లో 4 సిక్సర్లు, ఓ బౌండరీ బాది టీమిండియా భారీ స్కోర్‌కు దోహదపడ్డాడు. ఈ మ్యాచ్‌లో రింకూ కొట్టిన ఓ సిక్సర్ స్టేడియం బయటపడింది.ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా.. యువ ఓపెనర్ అభిషేక్ శర్మ (47 బంతుల్లో 100; 7 ఫోర్లు, 8 సిక్సర్లు) శతక్కొట్టడంతో నిర్ణీత 20 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 234 పరుగులు చేసింది. అభిషేక్‌తో పాటు రుతురాజ్ గైక్వాడ్ (47 బంతుల్లో 77 నాటౌట్; 11 ఫోర్లు, సిక్సర్), రింకూ సింగ్ కూడా చెలరేగడంతో భారత్ భారీ స్కోర్ చేసింది. అనంతరం ఛేదనలో చేతులెత్తేసిన జింబాబ్వే.. ముకేశ్ కుమార్ (3.4-0-37-3), ఆవేశ్ ఖాన్ (3-0-15-3), రవి బిష్ణోయ్ (4-0-11-2), వాషింగ్టన్ సుందర్ (4-0-28-1) ధాటికి 18.4 ఓవర్లలో 134 పరుగులకే కుప్పకూలి ఘోర పరాజయాన్ని (100 పరుగుల తేడాతో) మూటగట్టుకుంది. ఈ మ్యాచ్‌లో గెలుపుతో భారత్.. తొలి టీ20లో ఎదురైన పరాభవానికి ప్రతీకారం తీర్చుకుంది. ప్రస్తుతం ఐదు మ్యాచ్‌ల ఈ సిరీస్‌లో భారత్, జింబాబ్వే చెరో విజయంతో సమంగా ఉన్నాయి. మూడో మ్యాచ్ జులై 10న జరుగనుంది. -
అభిషేక్, రుతురాజ్, రింకూ ఊచకోత.. జింబాబ్వే టార్గెట్ 235 పరుగులు
హరారే వేదికగా జింబాబ్వే జరుగుతున్న రెండో టీ20లో భారత బ్యాటర్లు విధ్వంసం సృష్టించారు. టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 234 పరుగుల భారీ స్కోర్ సాధించింది. భారత బ్యాటర్లలో ఓపెనర్ అభిషేక్ శర్మ విధ్వంసకర సెంచరీతో చెలరేగాడు.జింబాబ్వే బౌలర్లకు అభిషేక్ చుక్కలు చూపించాడు. మైదానం నలుమూలల బౌండరీల వర్షం కురిపించాడు. కేవలం 46 బంతుల్లోనే తన సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. సరిగ్గా 100 పరుగులు చేసి అభిషేక్ ఔటయ్యాడు. అతడి ఇన్నింగ్స్‌లో 7 ఫోర్లు, 8 సిక్స్‌లు ఉన్నాయి. అతడితో పాటు ఫస్ట్ డౌన్ బ్యాటర్ రుతురాజ్ గైక్వాడ్ అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు. రుతురాజ్ 47 బంతుల్లో 11 ఫోర్లు,1 సిక్స్‌తో 77 పరుగులు చేసి ఆజేయంగా నిలిచాడు. రింకూ సింగ్( తన బ్యాట్‌కు పనిచెప్పాడు. రింకూ కేవలం 22 బంతుల్లో 2 ఫోర్లు, 5 సిక్స్‌లతో 48 పరగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. ఇక జింబాబ్వే బౌలర్లలో ముజుబ్రానీ,మసకజ్డా తలా వికెట్ సాధించారు. -
T20 WC: గిల్‌తో పాటు అతడు ఇంటికి! వాళ్లిద్దరు అక్కడే..
టీ20 ప్రపంచకప్-2024లో టీమిండియా అదరగొడుతోంది. లీగ్ దశలో ఒక మ్యాచ్ మిగిలి ఉండగానే సూపర్-8కు చేరుకున్న రోహిత్ సేన.. తదుపరి కెనడాతో తలపడనుంది.ఫ్లోరిడాలోని ఫోర్ట్ లాడెర్డేల్లో ఇరు జట్ల మధ్య జూన్ 15న మ్యాచ్ జరుగనుంది. ఈ నేపథ్యంలో భారత జట్టుకు సంబంధించిన ఓ ఆసక్తికర అప్డేట్ తెరమీదకు వచ్చింది.వరల్డ్‌కప్-2024 జట్టులో ట్రావెలింగ్ రిజర్వు ప్లేయర్లుగా ఉన్న స్టార్ ఓపెనర్ శుబ్‌మన్ గిల్, యువ పేసర్ ఆవేశ్ ఖాన్ స్వదేశానికి తిరిగి రానున్నట్లు సమాచారం. అయితే, వీరితో పాటు ఇదే కేటగిరిలో ఉన్న రింకూ సింగ్, ఖలీల్ అహ్మద్ మాత్రం ప్రధాన జట్టుతో కొనసాగనున్నట్లు తెలుస్తోంది.ప్రస్తుతం వీరు నలుగురు టీమిండియాతో కలిసి చార్టెడ్ ఫ్లైట్‌లో ఫ్లోరిడాకు చేరుకున్నట్లు సమాచారం. అక్కడ కెనడాతో మ్యాచ్ ముగిసిన తర్వాత గిల్, ఆవేశ్ ఖాన్ భారత్‌కు తిరిగి పయనం కానున్నట్లు తెలుస్తోంది. కారణం ఏమిటి?ఈ మెగా టోర్నీలో కెప్టెన్ రోహిత్ శర్మతో పాటు విరాట్ కోహ్లి ఓపెనర్‌గా బరిలోకి దిగుతున్న విషయం తెలిసిందే. అదే విధంగా బ్యాకప్ ఓపెనర్‌గా యశస్వి జైస్వాల్ అందుబాటులో ఉన్నాడు. సంజూ శాంసన్ రూపంలో మరో ఆప్షన్ కూడా ఉంది.ఈ నేపథ్యంలో గ్రూప్ దశ ముగిసిన తర్వాత ఇక శుబ్‌మన్ గిల్‌తో అవసరం ఉండదని బీసీసీఐ భావిస్తున్నట్లు సమాచారం. మరోవైపు.. గ్రూప్ దశలోని నాలుగు మ్యాచ్‌లు అమెరికాలో పూర్తి చేసుకున్న తర్వాత టీమిండియా.. మిగతా మ్యాచ్‌ల కోసం వెస్టిండీస్‌కు వెళ్లనుంది.అవసరం లేదుఇక విండీస్ పిచ్‌లు స్లోగా.. స్పిన్నర్లకు కాస్త అనుకూలంగా ఉంటాయన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అదనపు పేసర్‌తో అవసరం లేదు.ఇప్పటికే పేస్ దళ నాయకుడు జస్ప్రీత్ బుమ్రాతో పాటు అర్ష్‌దీప్ సింగ్, మహ్మద్ సిరాజ్‌తో పాటు ఆల్‌రౌండర్లు హార్దిక్ పాండ్యా, శివం దూబే అందుబాటులో ఉన్నారు. కాబట్టి ఎక్స్ట్రాగా ఆవేశ్ ఖాన్‌ను ఇంటికి పంపించాలని మేనేజ్మెంట్ యోచిస్తున్నట్లు తెలుస్తోంది.అయితే, హిట్టర్ రింకూ సింగ్‌తో పాటు బ్యాకప్ పేసర్‌గా ఖలీల్ అహ్మద్‌ను మాత్రం కొనసాగించనుందని సమాచారం. కాగా టీ20 వరల్డ్‌కప్-2024లో టీమిండియా ఇప్పటి వరకు ఐర్లాండ్, పాకిస్తాన్, అమెరికా జట్లపై విజయాలు సాధించింది. గ్రూప్- ఏ టాపర్‌గా సూపర్-8కు అర్హత సాధించింది.చదవండి: T20 World Cup 2024: వరల్డ్‌కప్ టోర్నీ నుంచి అవుట్.. శ్రీలంకకు ఏమైంది? -
వంద కోట్ల స్కాం బయటపెట్టిన అధికారిని పిచ్చోడని వేటు వేశారు..కట్ చేస్తే 15 ఏళ్ల తర్వాత
బుల్లెట్లు శరీరంలోకి దూసుకుపోయినా ఫైట్ చేయడం సినిమాల్లోని హీరోలకే సాధ్యం. అదే రియల్ లైఫ్‌లో హీరో అయినా జీరో అయిపోతాడు. కానీ ఈ సంక్షేమ అధికారి కథ వింటే ఆ మాట తప్పు అని ఒప్పుకుంటారు. తన నిజాయితీకి బహుమానంగా ఏడు రౌండ్లు కాల్పులు జరిపారు దుండగులు. చావు అంచాలదాక వెళ్లి వచ్చాడు. ఆయన స్థానంలో మరొకరు ఉంటే జీవచ్ఛవంలా అయిపోతారు. కానీ ఆయన ఎక్కడైతే తనకు ఇలాంటి పరిస్థితి ఎదురయ్యిందో అక్కడకే మళ్లీ ఐఏఎస్ హోదాలో వచ్చి మరీ వాళ్ల పనిపట్టారు. ఇలాంటి కథ సినిమాల్లోనే చూస్తాం. కానీ రియల్ లైఫ్‌లో కూడా సాధ్యమే అని ప్రూవ్ చేసి అందరికి ఆదర్శంగా నిలిచారు ఆయనే....ఆ అధికారి పేరు రింకు సింగ్ రాహీ. ఉత్తరప్రదేశ్‌కి చెందిన రింకు రాష్ట్ర స్థాయి పీసీఎస్ ఎగ్జామ్ 2007 క్వాలిఫై అయ్యి సంక్షేమ శాఖలో అధికారిగా ఉద్యోగం పొందాడు. తన విధులు నిర్వర్తిస్తున్నప్పుడూ సంక్షేమ నిధుల్లో అవకతవకలు జరిగినట్లు గుర్తించారు. ఆయన చేసిన దర్యాప్తులో డిపార్టుమెంట్ నుంచి పెద్దమొత్తంలో సంక్షేమ నిధులు మళ్లీంచబడ్డాయని తేలుతుంది. దీంతో ఎలా జరిగిందనే దిశగా..క్షణ్ణంగా దర్యాప్తు చేయగా ఏకంగా రూ. 100 కోట్ల స్కాలర్షిప్ స్కామ్‌ని వెలికితీశారు రాహీ. దీంతో కోర్టు ఈ కుంభకోణానికి పాల్పడ ఎనిమిది మందిపై కేసులు నమోదు చేసి జైల్లో పెట్టారు. వారిలో నలుగురికి పదేళ్ల జైలు శిక్ష పడింది. దీంతో వారంతా కక్షతో రాహీని హత్య చేసేందకు కుట్ర పన్నారు. అదను చూసి ఏకంగా అతడిపై ఏడు రౌండ్లు తుపాకీ కాల్పులు జరిపారు. ఈ దాడిలో రాహి తీవ్రంగా గాయపడ్డాడు. కుడివైపు కన్ను, దవడ పూర్తిగా దెబ్బతిన్నాయి. వినికిడిని, ఒక కంటిని కోల్పోయాడు. చెప్పాలంటే అందవిహీనంగా అయ్యిపోయి సర్వం కోల్పోయినవాడుగా అయ్యిపోయాడు రాహీ. అంతేగాదు ఆ దాడి కారణంగా రాహీ నాలుగు నెలలు పైగా ఆస్పత్రిలోనే ఉన్నాడు. కనీసం ఆయన మెడికల్ లీవ్‌ని కూడా ఆమోదించకుండా అతనిపట్ల నిర్థాక్షిణ్యంగా వ్యవహరించారు అతడి పైఅధికారులు. ఇదంతా ఒక ఎత్తు అయితే అయితే..తన నిజాయితీని అధికారులు గుర్తించకపోగా..పిచ్చోడని ముద్రవేసి సస్పెండ్ చేశారు. అతను కష్టపడి వెలికితీసిన ఆధారాలన్ని వీగిపోయాయి. ఇవన్నీ రాహీని శారీరకంగా, మానసికంగా చాలా నిరాశనిస్ప్రుహల్లోకి నెట్టేశాయి. ఒక చిన్న అధికారిగా ఉంటే ఇలాంటి స్కామ్‌లకు అడ్డుకట్టవేయలేనని భావించి..ఐఏఎస్ ఆఫీసర్ అవ్వాలని అనుకుంటాడు. విధికి ఎదురీదైనా అనుకున్న లక్ష్యం సాధించాలని నిశ్చయించకున్నాడు. సరిగ్గా 40 ఏళ్ల వయసులో వికలాంగులో కోటలో యూపీఎస్సీ ఎగ్జామ్‌కి రాసేందుకు ప్రిపేర్ అయ్యాడు. తన చివరి ప్రయత్నంలో 2021లో ఉత్తీర్ణ సాధించి 683వ ర్యాంకు సాధించారు. ఎక్కడైతే పిచ్చోడని ముద్ర వేయించుకుని సస్పెండ్ అయ్యాడో అదే ప్రాంతానికి 15 ఏళ్ల తర్వాత ఐఏఎస్ ఆఫీసర్‌గా వచ్చారు. ఉత్తరప్రదేశ్‌లోని ముజఫర్‌నగర్‌కు మేజిస్ట్రేట్ అఫీసర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. ఈ మేరకు రాహీ మాట్లాడతూ..తనకు ప్రజా ప్రయోజనాలే ముఖ్యం అని చెప్పారు. స్వప్రయోజనాలకు, ప్రజా ప్రయోజనాలకు మధ్య ఎప్పుడైనా ఘర్షణ తలెత్తితే, తాను ప్రజా ప్రయోజనాలను ఎంచుకుంటానని నిర్భయంగా చెప్పారు. ప్రస్తుతం ఆయనకి 44 ఏళ్లు, తొమ్మిదేళ్ల కొడుకు కూడా ఉన్నాడు. నిజంగా రింకు సింగ్ రాహీ రియల్ హీరో కదూ. అంతటి పరిస్థితి ఎదర్కొంటే..ఎవ్వరైనా చాలా అవమానంగా భావించి కుంగిపోతారు. ఆయన మాత్రం విధికే సవాలు విసిసి లేచి నిలబడి తానేంటో చూపించాడు. అతడకి కథ ఎందరికో స్ఫూర్తి.(చదవండి: అల్జీమర్ వ్యాధికి దానిమ్మ చెక్ పెట్టగలదా? పరిశోధనలో షాకింగ్ విషయాలు) -
రింకూ సెలక్ట్ కాకపోవడానికి కారణం ఆ రూలే: ఆర్పీ సింగ్
టీ20 ప్రపంచకప్-2024 కోసం ఎంపిక చేసిన భారత జట్టు గురించి ప్రధాన జట్టులో రింకూ సింగ్‌కు చోటు దక్కకపోవడానికి కారణం ఐపీఎల్‌లోని నిబంధనే అని పేర్కొన్నాడు,టీమిండియా నయా ఫినిషర్‌గా ప్రశంసలు అందుకుంటున్న రింకూ సింగ్ గురించి భారత మాజీ పేసర్ ఆర్పీ సింగ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. టీ20 ప్రపంచకప్-2024 కోసం ఎంపిక చేసిన జట్టులో అతడికి చోటు దక్కకపోవడానికి ఐపీఎల్ నిబంధననే కారణమని వాపోయాడు.కాగా అమెరికా- వెస్టిండీస్ వేదికగా జూన్ 1 నుంచి ఈ మెగా ఈవెంట్ ఆరంభం కానుంది. ఈ క్రమంలో జూన్ 5న టీమిండియా తమ తొలి మ్యాచ్ ఆడనుంది.ఇక ఈ ఐసీసీ టోర్నీకి ప్రకటించిన 15 మంది సభ్యుల జట్టులో రింకూ సింగ్‌కు చోటు దక్కలేదన్న విషయం తెలిసిందే. అతడికి కేవలం రిజర్వ్ ప్లేయర్‌గానే అవకాశం ఇచ్చారు సెలక్టర్లు.నిజానికి టీ20లలో టీమిండియా తరఫున ఫినిషర్‌గా రాణిస్తున్న రింకూకు మొండిచేయి చూపడానికి కారణం ఐపీఎల్-2024లో అతడి ప్రదర్శన ఓ కారణమని చెప్పవచ్చు. గతేడాది 14 మ్యాచ్‌లు ఆడిన ఈ కోల్‌కతా నైట్ రైడర్స్ లోయర్ ఆర్డర్ బ్యాటర్.. 474 పరుగులు చేశాడు.ఒకే ఓవర్లో ఐదు సిక్స్‌లు బాది సిక్సర్ల కింగ్‌గా పేరొందాడు. ఈ క్రమంలో టీమిండియా తరఫున అరంగేట్రం చేసిన రింకూ.. ఇప్పటి వరకు 15 టీ20లు ఆడి 356 పరుగులు సాధించాడు.నిలకడైన ఆటతో జట్టులో స్థానం సుస్థిరం చేసుకుంటాడని అంతా భావించారు. వరల్డ్‌కప్ రేసులోనూ రింకూ ముందుంటాడని అభిప్రాయపడ్డాడు. అయితే, తాజా ఐపీఎల్ ఎడిషన్‌లో మాత్రం రింకూకు ఎక్కువగా బ్యాటింగ్ చేసే అవకాశమే రాలేదు.ఇంపాక్ట్ ప్లేయర్ నిబంధన కారణంగా ఈ లోయర్ ఆర్డర్ బ్యాటర్ అవసరం ఎక్కువగా లేకుండా పోయింది. ఈ నేపథ్యంలో 11 ఇన్నింగ్స్‌లో భాగమైన రింకూ 168 పరుగులు మాత్రమే చేయగలిగాడు.ఈ నేపథ్యంలో ఆర్పీ సింగ్ మాట్లాడుతూ.. ‘‘వరల్డ్‌కప్ జట్టులో రింకూ సింగ్ పేరు తప్పక ఉండాల్సింది. దురదృష్టవశాత్తూ అతడికి స్థానం దక్కలేదు. ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ గనుక లేకపోయి ఉంటే అతడు కచ్చితంగా ప్రపంచకప్ జట్టుకు ఎంపికయ్యేవాడు’’ అని పేర్కొన్నాడు. -
కొంచెం బాధపడ్డాను.. కానీ రోహిత్ భయ్యా మాత్రం చాలా: రింకూ
టీ20 వరల్డ్‌కప్-2024కు మరో మూడు రోజుల్లో తెరలేవనుంది. జూన్ 1 నుంచి అమెరికా, వెస్టిండీస్‌ల వేదికగా ఈ మెగా టోర్నీ ఆరంభం కానుంది. ఈ మెగా ఈవెంట్ కోసం భారత జట్టు ఇప్పటికే అమెరికా గడ్డపై అడుగు పెట్టింది. ఇక ఇది ఇలా ఉండగా.. భారత టీ20 వరల్డ్‌కప్ ప్రధాన జట్టులో నయా ఫినిషర్ రింకూ సింగ్‌కు చోటు దక్కకపోయిన సంగతి తెలిసిందే.రింకూకు మెయిన్ స్వ్కాడ్‌లో కాకుండా రిజర్వ్ జాబితాలో సెలక్టర్లు చోటిచ్చారు. సెలక్టర్లు తీసుకున్న ఈ నిర్ణయంపై పెద్ద ఎత్తున చర్చ నడిచింది. ఈ క్రమంలో వరల్డ్‌కప్ జట్టులో చోటుదక్కకపోవడంపై తొలిసారి రింకూ స్పందించాడు. జట్టు సెలక్షన్ తర్వాత భారత కెప్టెన్ రోహిత్ శర్మ తనతో మాట్లాడాని, ఎంతో సపోర్ట్‌గా నిలిచాడని రింకూ చెప్పుకొచ్చాడు."టీ20 వరల్డ్‌కప్ ప్రధాన జట్టులో చోటు దక్కకపోవడం నాకు కొంచెం బాధ కల్గించంది. ఎందుకంటే మనం బాగా ఆడుతున్నప్పటకి ఎంపిక కాకపోతే సహజంగా ఎవరైనా బాధపడతారు. అయితే నన్ను ఎంపిక చేయకపోవడంలో సెలక్టర్లు తప్పేమి లేదు. టీమ్ కాంబినేషన్ కారణంగా నన్ను ఎంపిక చేయలేదు. నేను మొదట్లో కొంచెం బాధపడ్డాను. ఆ తర్వాత మన చేతిలో లేని వాటి గురించి ఎక్కువగా ఆలోచించకూడదని నాకు నేనే సర్ది చెప్పుకున్నాను. ఏది జరిగినా సరే అది మన మంచికే అనుకున్నాను. రోహిత్ భయ్యా కూడా నాతో మాట్లాడు. సెలక్షన్ గురించి ఎక్కువగా ఆలోచించవద్దు అని రోహిత్ చెప్పాడు. కష్టపడి పనిచేస్తూ ఉంటూ రెండేళ్ల తర్వాత మళ్లీ ప్రపంచకప్ ఉంటుందని రోహిత్ నాకు సపోర్ట్‌గా నిలిచాడని" దైనిక్ జాగరణ్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో రింకూ పేర్కొన్నాడు.