ఆసీస్‌తో 100 మీటర్ల భారీ సిక్సర్‌.. సీక్రెట్ చెప్పేసిన రింకూ | IND vs AUS 4th T20I: Rinku Singh opens up on the secret behind his 100m six during in Raipur | Sakshi
Sakshi News home page

IND vs AUS: ఆసీస్‌తో 100 మీటర్ల భారీ సిక్సర్‌.. సీక్రెట్ చెప్పేసిన రింకూ

Published Sat, Dec 2 2023 7:25 PM | Last Updated on Sat, Dec 2 2023 7:36 PM

Rinku Singh opens up on the secret behind his 100m six during IND vs AUS 4th T20I in Raipur - Sakshi

టీమిండియా నయా బ్యాటింగ్‌ సంచలనం రింకూ సింగ్‌ మరోసారి దుమ్మురేపాడు. రాయ్‌పూర్‌ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన నాలుగో టీ20లో రింకూ అదరగొట్టాడు.  ఈ మ్యాచ్‌లో 29 బంతులు ఎదుర్కొన్న రింకూ 4 ఫోర్లు, రెండు సిక్స్‌లతో 46 పరుగులు చేశాడు. 

కాగా శ్రేయస్‌ అయ్యర్‌, సూర్యకుమార్‌ యాదవ్‌ వంటి కీలక వికెట్లు కోల్పోయిన సమయంలో క్రీజులోకి వచ్చిన రింకూ తన అద్భుత ఇన్నింగ్స్‌తో జట్టును అదుకున్నాడు. టీమిండియా 174 పరుగులు సాధించడంలో కీలక పాత్ర పోషించాడు. 

అయితే ఈ మ్యాచ్‌లో రింకూ కొట్టిన సింగ్‌ ఓ సిక్సర్‌ ఏకంగా 100 మీటర్ల దూరం వెళ్లింది. దీంతో ఈ సిరీస్‌లో భారీ సిక్సర్‌ కొట్టిన ఆటగాడిగా రింకూ నిలిచాడు. కాగా మ్యాచ్‌ అనంతరం తన పవర్‌ హిట్టింగ్‌కు గల సీక్రెట్‌ను రింకూ బయటపెట్టాడు. రోజూ వ్యాయామం చేయడం, మంచి ఆహారాన్ని తీసుకోవడమే తన బలానికి కారణమని రింకూ తెలిపాడు.

మ్యాచ్‌ ముగిసిన తర్వాత బీసీసీఐ టీవీతో రింకూ సింగ్‌, జితేష్‌ శర్మ మాట్లాడారు. ఈ క్రమంలో జితేష్‌.. నీ పవర్‌ హిట్టింగ్‌కు గల కారణమెంటి అని ప్రశ్నించాడు. "నేను నీతో(జితేష్‌ శర్మ) కలిసి జిమ్‌ చేస్తున్నాను. మంచి ఫుడ్‌ తీసుకుంటున్నాను. బరువులు ఎత్తడం కూడా నాకిష్టం. అందుకే సహజంగా నాలో అంత పవర్‌ ఉంది" అని నవ్వుతూ రింకూ సమాధనమిచ్చాడు. 
చదవండి: IPL 2024 Mini Auction: ఐపీఎల్ వేలంలోకి 1166 మంది ప్లేయర్స్.. వారి కోసం తీవ్ర పోటీ!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement