అతడి బ్యాటింగ్‌ కోసమే భారత్‌-ఆసీస్‌ టీ20 మ్యాచ్‌లు చూస్తున్నాను: రస్సెల్‌ | I Am Watching IND Vs AUS T20I Series Only To See Rinku Singh Batting, Says Andre Russell - Sakshi
Sakshi News home page

Russell On Rinku Singh Batting: అతడి బ్యాటింగ్‌ కోసమే భారత్‌-ఆసీస్‌ టీ20 మ్యాచ్‌లు చూస్తున్నాను

Published Fri, Dec 1 2023 9:26 PM | Last Updated on Sat, Dec 2 2023 11:28 AM

Only watching IND vs AUS T20I series to see Rinku Singhs batting: Andre Russell - Sakshi

టీమిండియా నయా బ్యాటింగ్‌ సంచలనం రింకూ సింగ్‌పై వెస్టిండీస్‌ స్టార్‌ ఆండ్రీ రస్సెల్‌ ప్రశంసల వర్షం కురిపించాడు. రింకూ అద్భుతమైన ఆటగాడని, అతడి సత్తా ఎంటో తనకు బాగా తెలుసు అని రస్సెల్‌ అన్నాడు. స్వదేశంలో ఆస్ట్రేలియాతో జరుగుతున్న టీ20 సిరీస్‌లో ఇప్పటివరకు ఆడిన మూడు ఇన్నింగ్స్‌లోనూ రింకూ దుమ్మురేపాడు.

ఆసీస్‌తో జరిగిన తొలి టీ20లో 14 బంతుల్లో 22 పరుగులు చేసిన రింకూ.. రెండో టీ20లో అయితే కేవలం 9 బంతుల్లోనే 31 పరుగులతో మెరుపు ఇన్నింగ్స్‌ ఆడాడు. నాలుగో టీ20లో 46 పరుగులతో అద్బుత ఇన్నింగ్స్‌  ఈ నేపథ్యంలో రస్సెల్‌ హిందూస్తాన్‌ టైమ్స్‌తో రస్సెల్‌ మాట్లాడూతూ.. "నేను ఆస్ట్రేలియా-భారత్‌ టీ20 మ్యాచ్‌లను చూస్తున్నాను.

ఒకవేళ ఏ మ్యాచ్‌ అయినా మిస్‌ అయితే హైలెట్స్‌ కచ్చితంగా చూస్తాను. ఎందుకంటే రింకూ సింగ​ జట్టులో ఉన్నాడు. అతడి బ్యాటింగ్‌ అంటే నాకు ఎంతో ఇష్టం. ఈ సిరీస్‌లో రింకూ బ్యాటింగ్‌ నన్ను ఏమి ఆశ్చర్యపరచడం లేదు. అతడు కొన్నేళ్ల క్రితం కేకేఆర్‌తో జతకట్టాడు.  అతడు ప్రాక్టీస్‌ గేమ్‌లలో లేదా నెట్స్‌లో‍ భారీ షాట్‌లు ఆడేవాడు.

అప్పుడే అతడు టాలెంట్‌ ఎంటో మాకు అర్ధమైపోయింది. అతడొక టీమ్‌ మ్యాన్‌. ఆట పట్ల అతడికి చాల మక్కువ ఎక్కువ. జాతీయ జట్టు అద్బుతంగా రాణిస్తుండడంతో అతడు చాలా సంతోషంగా ఉంటాడు. అతడు భవిష్యత్తులో మరింత మెరుగుపడతాడని నేను భావిస్తున్నాను అని చెప్పుకొచ్చాడు. కాగా ఐపీఎల్‌లో గత కొన్ని సీజన్ల నుంచి కేకేఆర్‌ తరపున ఆడుతున్నారు.
చదవండి: IND vs SA: గొప్ప నాయకుడు.. అప్పటిదాకా అతడే టీమిండియా కెప్టెన్‌గా ఉండాలి: గంగూలీ

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement