Andre Russell
-
'ఐరెన్ లెగ్' ఆండ్రీ రసెల్.. ఎక్కడ అడుగుపెడితే అక్కడ భస్మం..!
విండీస్ విధ్వంసకర వీరుడు ఆండ్రీ రసెల్ (Andre Russell) ఫ్రాంచైజీ క్రికెట్లో తీరిక లేకుండా గడుపుతున్నాడు. రాత్రి ఓ లీగ్ ఆడితే, ఉదయం మరో లీగ్‌లో పాల్గొంటున్నాడు. మొన్న రసెల్ గంటల వ్యవధిలో (15 గంటలు) దేశాలు దాటి రెండు వేర్వేరు లీగ్‌ల్లో పాల్గొన్న వైనం సోషల్‌మీడియాలో వైరలయ్యింది. ఇదే సమయంలో రసెల్ ఓ అపవాదును కూడా మూటగట్టుకున్నాడు. నిద్ర లేకుండా జర్నీ చేసి రెండు వేర్వేరు లీగ్‌ల్లో పాల్గొంటే రెండు చోట్ల రసెల్ జట్లు లీగ్‌ల నుంచి నిష్క్రమించాయి. దీంతో నెటిజన్లు రసెల్‌ను ఐరెన్ లెగ్ అని అంటున్నారు. రసెల్ ఎక్కడ అడుగుపెడితే అక్కడ ఆ జట్టు భస్మం అంటూ కామెంట్లు చేస్తున్నారు. నెటిజన్లు రసెల్‌పై ఈ స్థాయిలో విరుచుకుపడటానికి అతని పేలవ ఫామ్ కూడా ఓ కారణం. రసెల్ ఇటీవలికాలంలో ఏ లీగ్‌లోనూ చెప్పుకోదగ్గ రీతిలో రాణించలేదు. ఇంకా చెప్పాలంటే అన్ని చోట్లా దారుణంగా విఫలమయ్యాడు. బ్యాటింగ్‌లో మెరుపులు లేవు, బౌలింగ్‌లో వికెట్లు లేవు. దీంతో అభిమానులు చిరెత్తిపోయి రసెల్‌పై దుష్ప్రచారం మొదలుపెట్టారు. వయసు మీద పడింది, ఇక తప్పుకో అని కొందరంటుంటే.. మరికొందరేమో, పోయి జాతీయ జట్టుకు ఆడుకోమని సలహాలు ఇస్తున్నారు. ఇంకొందరేమో డబ్బు కోసం రెస్ట్ లేకుండా ఇన్ని ఊర్లు తిరగాలా అని కామెంట్స్ చేస్తున్నారు. కాగా, రసెల్ అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించకుండా ప్రైవేట్ లీగ్‌ల్లో ఆడుతున్న విషయం తెలిసిందే.రసెల్ ఫిబ్రవరి 2వ తేదీ రాత్రి ఇంటర్నేషనల్ లీగ్ టీ20లో (ILT20) అబుదాబీ నైట్‌రైడర్స్ తరఫున ఆడి తొలి బంతికే డకౌటయ్యాడు. ఆ మ్యాచ్‌లో ఓటమితో ఇంటర్నేషనల్ లీగ్ టీ20లో అబుదాబీ నైట్‌రైడర్స్ కథ ముగిసింది (నిష్క్రమించింది). ILT20లో తన జట్టు ఓడిన వెంటనే రసెల్ ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా బంగ్లాదేశ్‌కు పయనమయ్యాడు. ఫిబ్రవరి 3వ తేదీ రాత్రి బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్‌లో పాల్గొన్నాడు. ఈ లీగ్‌లో ఖుల్నా టైగర్స్‌తో జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్‌లో రంగ్‌పూర్ రైడర్స్‌కు ప్రాతినిథ్యం వహించిన రసెల్ 9 బంతులు ఎదుర్కొని కేవలం 4 పరుగులు మాత్రమే చేసి ఔటయ్యాడు. ఈ మ్యాచ్‌లో ఓ ఓవర్ బౌలింగ్ కూడా చేసిన రసెల్ వికెట్ లేకుండా 14 పరుగులు సమర్పించుకున్నాడు. ఈ మ్యాచ్‌లో రంగ్‌పూర్ రైడర్స్ ఓటమికి రసెల్ ప్రధాన కారణం కానప్పటికీ.. అతని జట్టు మాత్రం లీగ్ నుంచి నిష్క్రమించింది.ఇదిలా ఉంటే, ఇంటర్నేషనల్ లీగ్ టీ20, బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్‌లు చివరి దశకు చేరాయి. బీపీఎల్‌లో ఫార్చూన్ బారిషల్ ఫైనల్‌కు చేరగా.. రేపు రెండో క్వాలిఫయర్ జరుగనుంది. ఇంటర్నేషనల్ లీగ్ టీ20 లీగ్ దశ మ్యాచ్‌లన్నీ ముగిశాయి. డెజర్ట్ వైపర్స్, దుబాయ్ క్యాపిటల్స్, ఎంఐ ఎమిరేట్స్, షార్జా వారియర్జ్ తదుపరి దశకు క్వాలిఫై అయ్యాయి. -
ILT20 2025: చరిత్ర సృష్టించిన ఆండ్రీ రసెల్.. పొట్టి క్రికెట్లో అత్యంత వేగంగా..!
విండీస్ విధ్వంసకర ఆటగాడు ఆండ్రీ రసెల్ (Andre Russell) పొట్టి క్రికెట్లో చరిత్ర సృష్టించాడు. ప్రస్తుతం ఇంటర్నేషనల్ టీ20 లీగ్‌లో (ILT20 2025) ఆడుతున్న రసెల్ (అబుదాబీ నైట్‌రైడర్స్).. నిన్న (ఫిబ్రవరి 1) గల్ఫ్ జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఓ అరుదైన మైలురాయిని చేరుకున్నాడు. నిన్నటి మ్యాచ్‌లో టామ్ కర్రన్ బౌలింగ్‌లో బౌండరీ బాదడంతో రసెల్ పొట్టి క్రికెట్లో 9000 పరుగులు పూర్తి చేసుకున్నాడు. తద్వారా టీ20ల్లో ఈ ఘనత సాధించిన 25వ ఆటగాడిగా నిలిచాడు. ఇక్కడ రికార్డు ఏంటంటే.. రసెల్ ఈ ఘనతను ప్రపంచంలో ఏ ఆటగాడు సాధించనంత వేగంగా (బంతుల పరంగా) సాధించాడు. రసెల్.. 9000 పరుగుల మార్కును కేవలం 5321 బంతుల్లో చేరుకున్నాడు. పొట్టి క్రికెట్లో అత్యంత వేగంగా 9000 పరుగులు పూర్తి చేసిన రికార్డు రసెల్ కంటే ముందు ఆసీస్ విధ్వంసకర వీరుడు గ్లెన్ మ్యాక్స్‌వెల్ పేరిట ఉండేది. మ్యాక్సీ టీ20ల్లో 9000 పరుగులను 5915 బంతుల్లో పూర్తి చేశాడు. టీ20ల్లో 9000 పరుగులను అత్యంత వేగంగా పూర్తి చేసిన టాప్-5 ఆటగాళ్ల జాబితాలో రసెల్, మ్యాక్సీ తర్వాత ఏబీ డివిలియర్స్ (5985), కీరన్ పోలార్డ్ (5988), క్రిస్ గేల్ ఉన్నారు.టీ20ల్లో రసెల్ ఇప్పటివరకు 536 మ్యాచ్‌లు ఆడి 26.79 సగటున, 169.15 స్ట్రయిక్‌రేట్‌తో 9004 పరుగులు చేశాడు. ఇందులో 2 సెంచరీలు, 31 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. పొట్టి క్రికెట్లో అత్యధిక పరుగులు చేసిన ఘనత రసెల్ మాజీ సహచరుడు క్రిస్ గేల్ పేరిట ఉంది. గేల్ 463 మ్యాచ్‌ల్లో 144.75 స్ట్రయిక్‌రేట్‌తో 14562 పరుగులు చేశాడు. ఇందులో 22 శతకాలు, 88 అర్ద శతకాలు ఉన్నాయి.టీ20ల్లో రసెల్ బ్యాటింగ్‌తో పాటు బౌలింగ్‌లోనూ అదిరిపోయే రికార్డు కలిగి ఉన్నాడు. రైట్ ఆర్మ్ మీడియం ఫాస్ట్ బౌలింగ్ వేసే రసెల్.. పొట్టి ఫార్మాట్లో 25.55 సగటున, 8.71 ఎకానమీతో 466 వికెట్లు పడగొట్టాడు.36 ఏళ్ల రసెల్ అంతర్జాతీయ క్రికెట్ నుంచి ఇంకా రిటైర్ కానప్పటికీ ఎక్కువగా ఫ్రాంచైజీ క్రికెట్లోనే ఆడుతున్నాడు.రసెల్ ప్రస్తుత ILT20 ఎడిషన్‌లో పెద్దగా ప్రభావం చూపలేకపోయాడు. ఈ సీజన్లో అతను 9 ఇన్నింగ్స్‌ల్లో 158.53 స్ట్రయిక్‌రేట్‌తో కేవలం 130 పరుగులు మాత్రమే చేశాడు. ఇందులో 7 ఫోర్లు, 12 సిక్సర్లు ఉన్నాయి. బౌలింగ్ విషయానికొస్తే.. రసెల్ ఈ సీజన్లో కేవలం రెండు వికెట్లు మాత్రమే తీశాడు. ఇందులో అతని ఎకానమీ 11.42గా ఉంది.రసెల్ విషయాన్ని పక్కన పెడితే ఈ సీజన్లో అతని జట్టు అబుదాబీ నైట్‌రైడర్స్ చెత్త ప్రదర్శనలు చేస్తూ పాయింట్ల పట్టికలో చివరి నుంచి మొదటిస్థానంలో ఉంది. ఈ సీజన్లో నైట్‌రైడర్స్ నిన్నటి మ్యాచ్‌తో కలుపుకుని 9 మ్యాచ్‌లు ఆడి ఆరింట ఓడిపోయింది. ఏదైనా అద్భుతం జరిగితే కానీ నైట్‌రైడర్స్ ఈ సీజన్లో ప్లే ఆఫ్స్‌కు చేరలేదు. ఇప్పటికే డెజర్ట్ వైపర్స్, ఎంఐ ఎమిరేట్స్ ప్లే ఆఫ్స్ బెర్త్‌లు ఖరారు చేసుకున్నాయి.నిన్నటి మ్యాచ్‌లో నైట్‌రైడర్స్ గల్ఫ్ జెయింట్స్ చేతిలో 7 వికెట్ల తేడాతో ఓడింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన నైట్‌రైడర్స్ నిర్ణీత ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 123 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఈ మ్యాచ్‌లో 9000 పరుగులు పూర్తి చేసిన రసెల్ కేవలం 9 పరుగులు మాత్రమే చేసి ఔటయ్యాడు. నైట్‌రైడర్స్ ఇన్నింగ్స్‌లో డేవిడ్ విల్లే (41) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. 124 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన జెయింట్స్.. గెర్హార్డ్ ఎరాస్మస్ (47), టామ్ కర్రన్ (38 నాటౌట్), హెట్‌మైర్ (20 నాటౌట్) రాణించడంతో 17.5 ఓవర్లలో విజయతీరాలకు చేరింది. -
WI vs Eng: డూ ఆర్ డై.. సిరీస్ మొత్తానికి విధ్వంసకర వీరుడు దూరం
ఇంగ్లండ్‌తో మిగిలిన మూడు టీ20లకు వెస్టిండీస్ తమ జట్టును ప్రకటించింది. తమ టీమ్‌లో మూడు కీలక మార్పులు చేసినట్లు బుధవారం వెల్లడించింది. యువ పేసర్ షమార్ స్ప్రింగర్ పునరాగమనం చేయనుండగా.. మరో ఫాస్ట్ బౌలర్ అల్జారీ జోసెఫ్ సైతం రీఎంట్రీ ఇవ్వనున్నట్లు తెలిపింది.వన్డే సిరీస్ విండీస్దేఅదే విధంగా.. విధ్వంసకర ఆల్‌రౌండర్ ఆండ్రీ రసెల్ ఇంగ్లండ్‌తో మిగిలిన టీ20లకు దూరమైనట్లు విండీస్ బోర్డు పేర్కొంది. కాగా మూడు వన్డేలు, ఐదు టీ20ల సిరీస్ ఆడేందుకు ఇంగ్లండ్ వెస్టిండీస్ పర్యటనకు వచ్చింది. వన్డే సిరీస్‌ను ఆతిథ్య విండీస్ 2-1తో గెలుచుకోగా.. మొదటి రెండు టీ20లలో గెలిచి ఇంగ్లండ్ 2-0తో ఆధిక్యంలో కొనసాగుతోంది.17 బంతుల్లో 30 పరుగులుఈ క్రమంలో ఇరుజట్ల మధ్య గురువారం మూడో టీ20 మొదలుకానుంది. ఈ నేపథ్యంలో విండీస్ బోర్డు మిగిలిన సిరీస్‌కు తమ జట్టును ప్రకటించింది. కాగా బట్లర్ బృందంతో తొలి టీ20లో పాల్గొన్న రసెల్.. 17 బంతుల్లో నాలుగు సిక్సర్ల సాయంతో 30 పరుగులు చేశాడు. అయితే, వికెట్లు మాత్రం తీయలేకపోయాడు.ఈ మ్యాచ్ సందర్భంగా మడమ నొప్పితో బాధపడ్డ ఆండ్రీ రసెల్.. రెండో టీ20కి దూరంగా ఉన్నాడు. అయితే, గాయం తీవ్రత ఇంకా తగ్గకపోవడంతో అతడిని మిగిలిన మూడు టీ20 మ్యాచ్‌లకు ఎంపిక చేయలేదు. మరోవైపు.. గత నెలలో శ్రీలంకతో సిరీస్ సందర్భంగా అంతర్జాతీయ టీ20లలో అడుగుపెట్టిన షమార్ స్ప్రింగర్ రీఎంట్రీ ఇచ్చాడు.డూ ఆర్ డై మ్యాచ్అదే విధంగా.. మూడో వన్డే సందర్భంగా కెప్టెన్ షాయీ హోప్‌తో అనుచితంగా ప్రవర్తించినందుకు నిషేధం ఎదుర్కొన్న అల్జారీ జోసెఫ్ కూడా జట్టులోకి తిరిగి వచ్చాడు. కాగా రసెల్ దూరం కావడం విండీస్‌కు పెద్ద ఎదురుదెబ్బలాంటిది. ఇక సెయింట్ లూసియా వేదికగా మూడో టీ20లో గెలిస్తేనే వెస్టిండీస్ సిరీస్ ఆశలు సజీవంగా ఉంటాయి.చావోరేవో తేల్చుకోవాల్సిన ఈ మ్యాచ్‌లో విండీస్ ఆటగాళ్లు ఏ మేరకు రాణిస్తారనేది ఆసక్తికరంగా మారింది. కాగా తొలి టీ20లో ఎనిమిది వికెట్లు, రెండో టీ20లో ఏడు వికెట్ల తేడాతో గెలిచి ఇంగ్లండ్ విండీస్‌పై పూర్తి ఆధిపత్యం కనబరిచింది.ఇంగ్లండ్‌తో మిగిలిన మూడు టీ20లకు వెస్టిండీస్ జట్టురోవ్మన్ పావెల్ (కెప్టెన్), రోస్టన్ చేజ్, మాథ్యూ ఫోర్డ్, షిమ్రాన్ హెట్మెయిర్, టెర్రాన్ హిండ్స్, షాయీ హోప్, అకీల్ హోసేన్, అల్జారీ జోసెఫ్, బ్రాండన్ కింగ్, ఎవిన్ లూయిస్, గుడాకేష్ మోటీ, నికోలస్ పూరన్, షెర్ఫాన్ రూథర్‌ఫర్డ్, రొమారియో షెపర్డ్, షమార్ స్ప్రింగర్.చదవండి: సౌతాఫ్రికాతో మూడో టీ20.. కీలక మార్పు సూచించిన భారత మాజీ స్టార్ -
వెస్టిండీస్ జట్టు ప్రకటన.. ముగ్గురు మొనగాళ్లు వచ్చేశారు
స్వదేశంలో ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్‌ను 2-1 తేడాతో సొంతం చేసుకున్న వెస్టిండీస్.. ఇప్పుడు అదే జట్టుతో టీ20 సిరీస్‌కు సిద్దమైంది. ఇంగ్లీష్ జట్టుతో ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో విండీస్ తలపడనుంది. బార్బోడస్ వేదికగా నవంబర్ 9 (శనివారం) నుంచి జరగనున్న తొలి టీ20తో ఈ సిరీస్ ప్రారంభం కానుంది. ఈ క్రమంలో ఈ సిరీస్‌లో మొదటి రెండు టీ20లకు 15 మంది సభ్యులతో కూడిన తమ జట్టును విండీస్ క్రికెట్ బోర్డు ప్రకటించింది. నికోలస్ పూరన్, ఆండ్రీ రస్సెల్,షిమ్రాన్ హెట్మెయర్లు తిరిగి జట్టులో చేరారు. వీరు ముగ్గురు గత నెలలో శ్రీలంకతో జరిగిన టీ20 సిరీస్‌కు వ్యక్తిగత కారణాలతో దూరమయ్యారు.మరోవైపు ఫాబియన్ అలెన్, అలిక్ అథానాజ్, ఆండ్రీ ఫ్లెచర్, షమర్ స్ప్రింగర్లు ఈ జట్టులో చోటు దక్కించలేకపోయారు. అదేవిధంగా స్టార్ పేసర్ జోషఫ్పై నిషేధం పడడటంతో తొలి రెండు మ్యాచ్‌లకు దూరమయ్యాడు.ఇంగ్లండ్‌తో తొలి రెండు టీ20లకు విండీస్ జట్టురోవ్మన్ పావెల్ (కెప్టెన్), రోస్టన్ చేజ్, మాథ్యూ ఫోర్డ్, షిమ్రాన్ హెట్మెయర్, టెరెన్స్ హిండ్స్, షాయ్ హోప్, అకేల్ హోసేన్, షామర్ జోసెఫ్, బ్రాండన్ కింగ్, ఎవిన్ లూయిస్, గుడాకేష్ మోటీ, నికోలస్ పూరన్, ఆండ్రీ రస్సెల్, షెర్ఫాన్ రోథర్ఫోర్డ్,వెస్టిండీస్ సిరీస్‌కు ఇంగ్లండ్ జట్టుజోస్ బట్లర్ (కెప్టెన్), జోఫ్రా ఆర్చర్, జాకబ్ బెథెల్, జాఫర్ చోహన్, సామ్ కర్రాన్, విల్ జాక్స్, లియామ్ లివింగ్‌స్టోన్, సాకిబ్ మహమూద్, డాన్ మౌస్లీ, జామీ ఓవర్టన్, ఆదిల్ రషీద్, ఫిల్ సాల్ట్, రీస్ టోప్లీ, జాన్ టర్నర్ -
నేను హార్డ్ హిట్టర్‌ని.. వచ్చే వరల్డ్‌కప్‌లోనూ ఆడతా!
మరో రెండేళ్ల పాటు తాను అంతర్జాతీయ క్రికెట్ ఆడేందుకు సిద్ధంగా ఉన్నానని వెస్టిండీస్ వెటరన్ ఆల్‌రౌండర్ ఆండ్రీ రసెల్ అన్నాడు. మునుపటి కంటే ఇప్పుడే మరింత ఫిట్‌గా ఉన్నానని.. టీ20 ప్రపంచకప్-2026లోనూ తనను చూస్తారని పేర్కొన్నాడు. తమ కోచ్ డారెన్ సామీ తనను మరికొన్నాళ్లపాటు ఇంటర్నేషనల్ క్రికెట్ ఆడాల్సిందిగా కోరాడని.. అలాంటపుడు తానెలా జట్టుకు దూరమవుతానని ప్రశ్నించాడు.హార్డ్ హిట్టర్కాగా 2010లో వెస్టిండీస్ తరఫున అరంగేట్రం చేసిన రసెల్.. టీ20 స్పెషలిస్టుగా గుర్తింపు పొందాడు. జాతీయ జట్టుతో పాటు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న పొట్టిలీగ్లలో భాగమవుతూ హార్డ్ హిట్టర్‌గా పేరొందాడు. అంతర్జాతీయ స్థాయిలో ఇప్పటి వరకు 82 టీ20లు ఆడిన ఈ బౌలింగ్ ఆల్‌రౌండర్.. 60 వికెట్లు తీయడంతో పాటు 1033 పరుగులు చేశాడు.విధ్వంసకర వీరుడుఇక ఐపీఎల్లో అయితే తనబ్యాటింగ్ తీరుతో విధ్వంసకర వీరుడిగా పేరొందిన ఆండ్రీ రసెల్ 126 మ్యాచ్‌లలో.. 2484 పరుగులు చేశాడు. ఇందులో 170 ఫోర్లు, 209 సిక్సర్లు ఉన్నాయి. ఇక మొత్తంగా 115 వికెట్లు కూడా తన ఖాతాలో వేసుకున్నాడు ఈ రైటార్మ్ ఫాస్ట్‌బౌలర్.ట్రోఫీలు గెలిచిన జట్లలో సభ్యుడుఇక.. వెస్టిండీస్ తరఫున టీ20 ప్రపంచకప్-2012, 2016 ట్రోఫీలు గెలిచిన జట్లలో సభ్యుడైన రసెల్.. చివరగా టీ20 వరల్డ్‌కప్-2024 సందర్భంగా జాతీయ జట్టుకు ప్రాతినిథ్యం వహించాడు. ఈ ఐసీసీ టోర్నీలో సౌతాఫ్రికాతో మ్యాచ్‌లో ఆఖరిగా ఆడాడు. ప్రస్తుతం కరేబియన్ ప్రీమియర్ లీగ్-2024తో బిజీగా ఉన్న రసెల్.. ట్రింబాగో నైట్ రైడర్స్‌కు ఆడుతున్నాడు.ఇప్పటి వరకు ఐదు మ్యాచ్‌లలో 207కు పైగా స్ట్రైక్‌రేటుతో 56 పరుగులు రాబట్టిన రసెల్.. కేవలం ఒకే ఒక వికెట్ తీశాడు. ఇదిలా ఉంటే.. వెస్టిండీస్ త్వరలోనే శ్రీలంకతో మూడు టీ20 మ్యాచ్‌లు ఆడనుంది. ఈ సిరీస్‌కు తాను అందుబాటులో ఉంటానని 36 ఏళ్ల రసెల్ స్పష్టం చేశాడు.బంతిని బాదగల సత్తా నాకు ఉందిఇండియా టు డేతో మాట్లాడుతూ.. ‘‘2026 వరల్డ్‌కప్‌లో నేను కచ్చితంగా ఆడతాను. ఎందుకంటే నాలో క్రికెట్ ఆడగల సత్తా ఇంకా మిగిలే ఉందని మీకు కూడా తెలుసు. నేను ఇప్పటికే అంతర్జాతీయక్రికెట్ నుంచి తప్పుకొని ఉండవచ్చు. అలా చేస్తే యువ ఆల్రౌండర్లకు అవకాశాలు రావచ్చు.అయితే, నేను ఇప్పటికీ బంతిని అనుకున్న చోటకు బాదగలను. అద్భుతమైన పేస్‌తో బౌలింగ్ చేయగలను. ఇంకా ఫిట్‌గానే ఉన్నాను. కాబట్టి ఇక్కడితో ఎందుకు ఆగిపోవాలి’’ అంటూ రసెల్ ఆత్మవిశ్వాసం ప్రదర్శించాడు. తమ కోచ్ ఈ విషయం గురించి తనతో చర్చించాడని.. మరికొన్నాళ్లపాటు విండీస్‌కు ఆడతానని తెలిపాడు.చదవండి: వీవీఎస్ లక్ష్మణ్ క్యాచ్ డ్రాప్ చేశా.. నా కెరీర్ అంతటితో ఖతం! -
ఆండ్రీ రసెల్ విధ్వంసం.. నైట్ రైడర్స్ ఖాతాలో మరో విజయం
కరీబియన్ ప్రీమియర్ లీగ్ 2024 ఎడిషన్‌లో ట్రిన్‌బాగో నైట్ రైడర్స్ మరో విజయం సాధించింది. గయానా అమెజాన్ వారియర్స్‌తో ఇవాళ (సెప్టెంబర్ 19) జరిగిన మ్యాచ్‌లో 5 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన వారియర్స్ నిర్ణీత ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 148 పరుగులు చేయగా.. నైట్ రైడర్స్ 19.2 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది.రసెల్ విధ్వంసం149 పరుగుల లక్ష్య ఛేదనలో నైట్ రైడర్స్ 89 పరుగులకే సగం వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ దశలో ఆండ్రీ రసెల్ (36).. టిమ్ డేవిడ్‌తో (31) కలిసి నైట్ రైడర్స్‌ను గెలిపించాడు. రసెల్ 15 బంతుల్లో బౌండరీ, నాలుగు సిక్సర్ల సాయంతో విధ్వంసం సృష్టించాడు. నైట్ రైడర్స్ ఇన్నింగ్స్‌లో సునీల్ నరైన్ (11), పూరన్ (10), పోలార్డ్ (8) తక్కువ స్కోర్లకే ఔటయ్యారు.షెపర్డ్ మెరుపు హాఫ్ సెంచరీఅంతకుముందు రొమారియో షెపర్డ్ మెరుపు హాఫ్ సెంచరీతో (24 బంతుల్లో 51 నాటౌట్; 3 ఫోర్లు, 4 సిక్సర్లు) చెలరేగడంతో వారియర్స్ ఓ మోస్తరు స్కోర్ చేయగలిగింది. టిమ్ రాబిన్సన్ (34), ప్రిటోరియస్ (21 నాటౌట్), మొయిన్ అలీ (11) రెండంకెల స్కోర్లు చేశారు. నైట్ రైడర్స్ బౌలర్లలో నరైన్, వకార్ సలాంఖీల్ తలో రెండు, బ్రావో, అకీల్ హొసేన్ చెరో వికెట్ పడగొట్టారు.కాగా, ఈ సీజన్లో నైట్ రైడర్స్ ఐదు మ్యాచ్‌ల్లో నాలుగు విజయాలతో పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో ఉంది. ఆరు మ్యాచ్‌ల్లో ఐదు విజయాలు సాధించిన బార్బడోస్ రాయల్స్ అగ్రస్థానంలో కొనసాగుతుంది. సెయింట్ లూసియా కింగ్స్, గయానా అమెజాన్ వారియర్స్ మూడు, నాలుగు స్థానాల్లో ఉన్నాయి. ఈ సీజన్లో పేలవ ప్రదర్శన కనబరుస్తున్న సెయింట్ కిట్స్ అండ్ నెవిస్ పేట్రియాట్స్, ఆంటిగ్వా అండ్ బార్బుడా ఫాల్కన్స్ చివరి నుంచి రెండు స్థానాల్లో ఉన్నాయి.చదవండి: IND VS BAN 1st Test: నిరాశపరిచిన రోహిత్ -
వెస్టిండీస్ జట్టు ప్రకటన.. విధ్వంసకర ఆటగాడు దూరం
స్వదేశంలో దక్షిణాఫ్రికాతో టీ20 సిరీస్‌కు 15 మంది సభ్యులతో కూడిన తమ జట్టును వెస్టిండీస్ క్రికెట్ బోర్డు ప్రకటించింది. ఈ సిరీస్‌కు స్టార్ ఆటగాళ్లు ఆండ్రీ రస్సెల్, జాసన్ హోల్డర్, అల్జారీ జోషఫ్, కైల్ మైర్స్‌కు సెలక్టర్లు విశ్రాంతి ఇచ్చారు. ఈ జట్టుకు రోవ్మాన్ పావెల్ మరోసారి సారథ్యం వహించనున్నాడు. అతడి డిప్యూటీగా స్టార్ ఆల్‌రౌండర్ రోస్టన్ చేజ్ వ్యవరించారు. ఇక ఈ జట్టులో వెటరన్ ఆల్‌రౌండర్ ఫాబియన్ అలెన్, పేసర్ మాథ్యూ ఫోర్డ్, యంగ్ బ్యాటర్ అలిక్ అథనాజ్లకు చోటు దక్కింది. ఇక ఈ సిరీస్‌లో భాగంగా ఇరు జట్లు మూడు టీ20 మ్యాచ్‌లు ఆడనున్నాయి. ఆగస్టు 23 నుంచి ఈ సిరీస్ ప్రారంభం కానుంది. మూడు మ్యాచ్‌లు కూడా ట్రినిడాడ్ వేదికగానే జరగనున్నాయి. కాగా ఇప్పటికే ప్రోటీస్ జట్టు విండీస్ టెస్టు సిరీస్‌ను 0-1తో సొంతం చేసుకుంది.దక్షిణాఫ్రికాతో టీ20లకు విండీస్ జట్టురోవ్మన్ పావెల్ (కెప్టెన్), రోస్టన్ చేజ్ (వైస్ కెప్టెన్), అలిక్ అథానాజ్, జాన్సన్ చార్లెస్, మాథ్యూ ఫోర్డ్, షిమ్రాన్ హెట్మెయర్, ఫాబియన్ అలెన్, షాయ్ హోప్, అకేల్ హోసేన్, షామర్ జోసెఫ్, ఒబెడ్ మెక్కాయ్, గుడాకేష్ మోటీ, నికోలస్ పూరన్, షెర్ఫాన్ రూథర్‌ఫోర్డ్. -
ట్రవిస్ హెడ్ బ్యాట్‌ను రెండు ముక్కలు చేసిన రసెల్
మేజర్ లీగ్ క్రికెట్ 2024 ఎడిషన్‌లో భాగంగా లాస్ ఏంజెలెస్ నైట్‌రైడర్స్, వాషింగ్టన్ ఫ్రీడం జట్ల మధ్య ఇవాళ (జులై 15) జరిగిన మ్యాచ్‌లో ఓ ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. నైట్‌రైడర్స్ ఆటగాడు ఆండ్రీ రసెల్ బౌలింగ్‌లో వాషింగ్టన్ ఆటగాడు ట్రవిడ్ హెడ్ పుల్ షాట్ ఆడబోగా బ్యాట్ రెండు ముక్కలైంది. ఈ ఘటన వాషింగ్టన్ ఇన్నింగ్స్ రెండో ఓవర్లో జరిగింది. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట చక్కర్లు కొడుతుంది.Russell broke Travis head's bat with a Fierce bowlMajor league cricket #Russell#travishead#mlc#majorleaguecricket #Cricket #smith#head#funnyincident pic.twitter.com/0cFLoYDB1Y— जंबारू (@jambr123356) July 14, 2024ఈ మ్యాచ్‌లో నైట్‌రైడర్స్‌పై వాషింగ్టన్ ఫ్రీడం 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన నైట్‌రైడర్స్.. వాషింగ్టన్ బౌలర్లు నేత్రావల్కర్ (3.4-0-35-4), మ్యాక్స్‌వెల్ (4-0-15-3), లోకీ ఫెర్గూసన్ (4-0-31-2), రచిన్ రవీంద్ర (2-0-7-1) చెలరేగడంతో 18.4 ఓవర్లలో 129 పరుగులకు ఆలౌటైంది. నైట్‌రైడర్స్ ఇన్నింగ్స్‌లో సైఫ్ బదార్ అత్యధికంగా 35 పరుగులు చేయగా.. స్టార్ ఆటగాళ్లు జేసన్ రాయ్ (12), సునీల్ నరైన్ (0), ఉన్ముక్త్ చంద్ (1), షకీబ్ (0), మిల్లర్ (1) దారుణంగా విఫలమయ్యారు. ఆఖర్లో రసెల్ (20), వాన్ స్కాల్విక్ (12 నాటౌట్), స్పెన్సర్ జాన్సన్ (16), అలీ ఖాన్ (11) బ్యాట్ ఝులిపించడంతో నైట్‌రైడర్స్ 100 పరుగుల మార్కు దాటగలిగింది.అనంతరం స్వల్ప లక్ష్య ఛేదనకు దిగిన వాషింగ్టన్.. ఓపెనర్లు ట్రవిస్ హెడ్ (2 బంతుల్లో 54; 2 ఫోర్లు, 6 సిక్సర్లు), స్టీవ్ స్మిత్ (36 బంతుల్లో 42 నాటౌట్; 2 ఫోర్లు, 2 సిక్సర్లు) సత్తా చాటడంతో 16 ఓవర్లలో కేవలం రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి విజయతీరాలకు చేరింది. వాషింగ్టన్ ఇన్నింగ్స్‌లో రచిన్ రవీంద్ర 11 పరుగులు చేసి ఔట్ కాగా.. స్మిత్‌తో పాటు ఆండ్రియస్ గౌస్ (15) అజేయంగా నిలిచాడు. నైట్‌రైడర్స్ బౌలర్లలో స్పెన్సర్ జాన్సన్, వాన్ స్కాల్విక్ తలో వికెట్ పడగొట్టారు.కాగా, మేజర్ లీగ్ క్రికెట్ రెండో ఎడిషన్ జులై 5న మొదలైన విషయం తెలిసిందే. ఈ ఎడిషన్‌లో ఇప్పటివరకు 12 మ్యాచ్‌లు పూర్తయ్యాయి. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో వాషింగ్టన్ ఫ్రీడం (4 మ్యాచ్‌ల్లో 3 విజయాలు) టాప్‌లో ఉండగా.. టెక్సాస్ సూపర్ కింగ్స్, ముంబై ఇండియన్స్ న్యూయార్క్, శాన్ఫ్రాన్సిస్కో యూనికార్న్స్, లాస్ ఏంజెలెస్ నైట్‌రైడర్స్, సీయాటిల్ ఓర్కాస్ వరుస స్థానాల్లో ఉన్నాయి. లీగ్‌లో భాగంగా రేపు (రాత్రి ఒంటి గంటకు) జరుగబోయే మ్యాచ్‌లో సీయాటిల్ ఓర్కాస్, శాన్ఫ్రాన్సిస్కో యూనికార్న్ తలపడనున్నాయి. -
పీఎన్జీ బ్యాటర్ల అద్బుత పోరాటం.. విండీస్ టార్గెట్ ఎంతంటే?
టీ20 వరల్డ్‌కప్-2024లో భాగంగా గయానా వేదికగా పాపువా న్యూ గినియా, వెస్టిండీస్ జట్లు తలపడతున్నాయి. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన న్యూ గునియా పర్వాలేదన్పించింది. పటిష్టమైన కరేబియన్ బౌలింగ్ లైనప్‌ను ఎదుర్కొన్న న్యూ గునియా.. నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 136 పరుగులు చేసింది. పీఎన్జీ బ్యాటర్లలో సెసే బౌ(50) హాఫ్ సెంచరీతో చెలరేగాడు. బౌకు ఇది తొలి అంతర్జాతీయ టీ20 సెంచరీ కావడం గమనార్హం. ఇక అతడితో పాటు కెప్టెన్ అసద్ వాలా(21), డొరిగా(27) పరుగులతో రాణించారు. 7 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడ్డ పీఎన్జీని వలా, బావు ఆదుకున్నారు. వీరిద్దరూ విండీస్ బౌలర్లకు అడ్డుగా నిలవడంతో పీఎన్జీ గౌరవప్రదమైన స్కోర్ సాధించగల్గింది. ఇక వెస్టిండీస్ బౌలర్లలో రస్సెల్, జోసెఫ్ తలా రెండు వికెట్లు పడగొట్టగా.. హోస్సేన్, షెఫెర్డ్, మోటీ తలా వికెట్ సాధించారు. -
అవికా గోర్‌తో స్టార్ క్రికెటర్ డ్యాన్స్.. సోషల్ మీడియాలో వైరల్
ప్రపంచ క్రికెట్లో ఆండ్రూ రస్సెల్‌కు ప్రత్యేకమైన స్థానం ఉంది. విధ్వంసకర బ్యాటర్లలో తరచుగా వినిపించే పేర్లలో ఆయన టాప్‌లో ఉంటారు. వెస్టిండీస్‌కు చెందిన ఈ ఆల్‌రౌండర్ ప్రస్తుతం జరుగుతున్న ఐపీఎల్ 17వ సీజన్లో ఉన్న కోల్‌కతా నైట్ రైడర్స్ తరపున రాణిస్తున్నాడు.తాజాగా ఆండ్రూ రస్సెల్ సరికొత్త అవతారం ఎత్తాడు. ఏకంగా హిందీ పాటతో బాలీవుడ్లో తెరంగేట్రం చేశారు. 'లడ్ కీ తూ కమాల్ కీ' అంటూ తన గాత్రంతో మెప్పించాడు. ఉయ్యాలా జంపాలా సినిమాతో గుర్తింపు తెచ్చుకున్న అవికా గోర్‌తో కలసి రస్సెల్ స్టెప్పులేశాడు. ప్రస్తుతం యూట్యూబ్‌లో ఈ పాట ట్రెండ్ అవుతుంది. ఇందులో వారిద్దరి డ్యాన్స్‌కు ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు. -
హీరోయిన్‌తో స్టార్ క్రికెటర్ డ్యాన్స్.. నువ్వు ఆల్‌రౌండరయ్యా సామీ! (ఫోటోలు)
-
IPL 2024: ధోని ఫ్యాన్స్‌తో అట్లుంది మరి.. భరించలేకపోయిన రసెల్
క్రికెట్ సర్కిల్స్‌లో ఎంఎస్ ధోనికి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ఆన్ ఫీల్డ్, ఆఫ్ ద ఫీల్డ్ అన్న తేడా లేకుండా ధోని ఎక్కడ కనిపించినా అభిమానులు కేరింతలు పెడతారు. ధోని హోం గ్రౌండ్ (ఐపీఎల్) చెపాక్ స్టేడియంలో అయితే క్రేజ్ వేరే లెవెల్లో ఉంటుంది. ధోని స్క్రీన్‌పై కనిపిస్తే చాలు స్టేడియం మొత్తం హోరెత్తిపోతుంది. ధోని నామస్మరణతో వచ్చే సౌండ్లకు చెవులు చిల్లులు పడతాయి. నిన్న సీఎస్కే, కేకేఆర్ మధ్య జరిగిన మ్యాచ్‌లో ధోని బ్యాటింగ్‌కు దిగుతుండగా అభిమానులు చేసిన రచ్చ నభూతో నభవిష్యతి అన్నట్లుగా ఉంది. ఆ సమయంలో ధోని ఫ్యాన్స్ చేసిన సౌండ్లకు మైదానంలో ఉన్నవారి కర్ణభేరులు పగిలిపోయుంటాయి. ధోని బరిలోకి దిగుతున్న సమయంలో బౌండరీ లైన్ వద్ద ఫీల్డింగ్ చేస్తున్న కేకేఆర్ ఆటగాడు రసెల్ అయితే ఫ్యాన్స్ చేసిన శబ్దాలు తట్టుకోలేక చెవులు మూసుకున్నాడు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరలవుతుంది. దీన్ని చూసిన నెటిజన్లు అట్లుంటది ధోని ఫ్యాన్స్‌తోని అంటూ కామెంట్లు చేస్తున్నారు. Russell's reaction is Gold. 😄👌 - The Craze for Dhoni....!!!!!pic.twitter.com/r7iePy96Op — Johns. (@CricCrazyJohns) April 8, 2024 కాగా, నిన్నటి మ్యాచ్‌లో కేకేఆర్‌పై సీఎస్కే 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో రవీంద్ర జడేజా అద్భుతంగా బౌలింగ్ (4-0-18-3) చేసి సీఎస్కేను గెలిపించాడు. తొలుత బ్యాటింగ్ చేసిన కేకేఆర్ జడ్డూ ధాటికి 137 పరుగులకే పరిమితం కాగా.. ఛేదనలో రుతురాజ్ కెప్టెన్స్ ఇన్నింగ్స్ (67 నాటౌట్) ఆడి సీఎస్కేను విజయతీరాలకు చేర్చాడు. The Goosebumps entry in IPL history. - MS Dhoni, the face of IPL. 🦁pic.twitter.com/7nxy7Kdhpn — Johns. (@CricCrazyJohns) April 8, 2024 తొలుత బ్యాటింగ్ చేసిన కేకేఆర్.. రవీంద్ర జడేజా (4-0-18-3), తుషార్ దేశ్‌పాండే (4-0-33-3), ముస్తాఫిజుర్ (4-0-22-2), తీక్షణ (4-0-28-1) దెబ్బకు నిర్ణీత ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 137 పరుగులు మాత్రమే చేయగలిగింది. విధ్వంసకర వీరులున్న కేకేఆర్ ఈ మ్యాచ్‌లో తేలిపోయింది. సాల్ట్ (0), వెంకటేశ్ అయ్యర్ (3), రింకూ సింగ్ (9), రసెల్ (10) తస్సుమనిపించారు. నరైన్ (27), రఘువంశీ (24), శ్రేయస్ అయ్యర్ (34) నామమాత్రపు స్కోర్లు చేశారు. అనంతరం స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన సీఎస్కేను రుతురాజ్ (67 నాటౌట్) కెప్టెన్సీ ఇన్నింగ్స్ ఆడి గెలిపించాడు. రచిన్ రవీంద్ర 15, డారిల్ మిచెల్ 25, శివమ్ దూబే 28 పరుగులు (18 బంతుల్లో ఫోర్, 3 సిక్సర్లు) చేసి ఔట్ కాగా.. ధోని ఒక్క పరుగు చేసి నాటౌట్‌గా మిగిలాడు. కేకేఆర్ బౌలర్లలో వైభవ్ అరోరా 2 వికెట్లు పడగొట్టగా.. నరైన్ ఓ వికెట్ దక్కించుకున్నాడు. ఈ గెలుపుతో సీఎస్కే మరో రెండు పాయింట్లు ఖాతాలో వేసుకుని పాయింట్ల పట్టికలో నాలుగో స్థానంలో నిలిచింది. సీజన్ తొలి ఓటమిని మూటగట్టుకున్న కేకేఆర్ రెండో స్థానంలో ఉంది. -
IPL 2024 DC VS KKR: రసెల్ రికార్డును సమం చేసిన నరైన్
ఐపీఎల్ 2024లో భాగంగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో నిన్న (ఏప్రిల్ 3) జరిగిన మ్యాచ్‌లో కేకేఆర్ 106 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. సునీల్ నరైన్ (39 బంతుల్లో 85; 7 ఫోర్లు, 7 సిక్సర్లు) విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడి కేకేఆర్ విజయంలో కీలకపాత్ర పోషించాడు. ఫలితంగా అతనికి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు దక్కింది. నరైన్ కేకేఆర్ తరఫున ఈ అవార్డు అందుకోవడం ఇది 14వసారి. కేకేఆర్ తరఫున అత్యధిక ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డులు అందుకున్న రికార్డు ఆండ్రీ రసెల్ (14) పేరిట ఉండగా.. నిన్నటి మ్యాచ్‌తో నరైన్ రసెల్ రికార్డును సమం చేశాడు. రసెల్, నరైన్ ఐపీఎల్లో అత్యధిక ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డులు అందుకున్న ఆటగాళ్ల జాబితాలో 10, 11 స్థానాల్లో ఉన్నారు. ఐపీఎల్లో అత్యధిక ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డుల రికార్డు ఏబీ డివిలియర్స్ పేరిట ఉంది. ఏబీడి ఢిల్లీ డేర్‌డెవిల్స్, ఆర్సీబీ తరఫున 25 ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డులు అందుకున్నాడు. ఏబీడీ తర్వాత క్రిస్ గేల్ (22), రోహిత్ శర్మ (19), డేవిడ్ వార్నర్ (18), ఎంఎస్ ధోని (17), విరాట్ కోహ్లి (17), షేన్ వాట్సన్ (16), యూసఫ్ పఠాన్ (16) అత్యధిక ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డులు అందుకున్న ఆటగాళ్ల జాబితాలో ఉన్నారు. రసెల్, నరైన్‌తో సమానంగా సురేశ్ రైనా, కీరన్ పోలార్డ్ కూడా 14 ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డులు అందుకున్నారు. కాగా, ఢిల్లీతో మ్యాచ్‌లో నరైన్‌తో పాటు యువ ఆటగాడు రఘువంశీ (27 బంతుల్లో 54; 5 ఫోర్లు, 3 సిక్సర్లు), ఆండ్రీ రసెల్ (19 బంతుల్లో 41; 4 ఫోర్లు, 3 సిక్సర్లు), శ్రేయస్ అయ్యర్ (11 బంతుల్లో 18; 2 సిక్సర్లు), రింకూ సింగ్ (8 బంతుల్లో 26; ఫోర్, 3 సిక్సర్లు) రెచ్చిపోవడంతో కేకేఆర్ నిర్ణీత ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 272 పరుగుల భారీ స్కోర్ చేసింది. ఐపీఎల్ చరిత్రలో ఇది రెండో భారీ స్కోర్. ఇదే సీజన్లో ముంబై ఇండియన్స్‌పై సన్‌రైజర్స్ చేసిన స్కోర్ (277/3) ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక స్కోర్‌గా ఉంది. 273 పరుగుల భారీ లక్ష్యాన్నిఛేదించేందుకు బరిలోకి దిగిన ఢిల్లీ.. 17.2 ఓవర్లలో 166 పరుగులకే చాపచుట్టేసి, ఘోర పరాభవాన్ని మూటగట్టుకుంది. రిషబ్ పంత్ (55), ట్రిస్టన్ స్టబ్స్ (54) ఓటమి ఖరారైన దశలో బ్యాట్‌ను ఝులిపించారు. వీరిద్దరు మినహా ఢిల్లీ ఆటగాళ్లంతా చేతులెత్తేశారు. వార్నర్ (18), పృథ్వీ షా (10) రెండంకెంల స్కోర్లు చేయగా.. మార్ష్, పోరెల్, అక్షర్ డకౌట్లయ్యారు. కేకేఆర్ బౌలర్లలో వైభవ్ అరోరా, వరుణ్ చక్రవర్తి అద్భుతంగా బౌల్ చేసి చెరి 3 వికెట్లు పడగొట్టారు. స్టార్క్ 2, రసెల్, నరైన్ తలో వికెట్ దక్కించుకున్నారు. ఈ గెలుపుతో కేకేఆర్ హ్యాట్రిక్ విజయాలు సొంతం చేసుకుని పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి దూసుకెళ్లగా.. ఢిల్లీ తాజా ఓటమితో పాయింట్ల పట్టికలో తొమ్మిదో స్థానానికి పడిపోయింది. -
IPL 2024 : విశాఖలో కోల్‌కతా బ్యాటర్ల విధ్వంసం (ఫొటోలు)
-
కళ్లు చెదిరే యార్కర్.. అభినందించకుండా ఉండలేకపోయిన బ్యాటర్
ఢిల్లీ క్యాపిటల్స్ వెటరన్ పేసర్ ఇషాంత్ శర్మ కళ్లు చెదిరే యార్కర్‌ను సంధించాడు. కేకేఆర్‌తో ఇవాళ (ఏప్రిల్ 3) జరుగుతున్న మ్యాచ్‌లో ఇషాంత్ సూపర్ డెలివరీని బౌల్ చేశాడు. ఇషాంత్ యార్కర్ దెబ్బకు బ్యాటర్ ఆండ్రీ రసెల్ ఫ్యూజులు ఎగిరిపోయాయి. సెకెన్ల వ్యవధిలో బంతి వికెట్లను గిరాటు వేయడంతో రసెల్ నిర్ఘాంతపోయాడు. ఇషాంత్ యార్కర్‌కు సమాధానం చెప్పలేని రసెల్ బంతిని అడ్డుకునే క్రమంలో బొక్కబోర్లా పడ్డాడు. ఈ బంతిని సంధించినందుకుగాను రసెల్ ఇషాంత్‌ను అభినందించకుండా ఉండలేకపోయాడు. కిందపడి లేవగానే చప్పట్లతో అభినందించాడు. ఇషాంత్ సూపర్ యార్కర్‌కు సంబంధించిన వీడియో నెట్టింట వైరలవుతుంది. ISHANT SHARMA WITH A BALL OF IPL 2024...!!! 🤯 pic.twitter.com/9O015ZzlwZ — Mufaddal Vohra (@mufaddal_vohra) April 3, 2024 ఇషాంత్ రసెల్‌ను ఔట్ చేసిన సందర్భం కూడా చాలా కీలకమైంది. ఆఖరి ఓవర్ తొలి బంతికి.. అప్పటికే రసెల్ (19 బంతుల్లో 41; 4 ఫోర్లు, 3 సిక్సర్లు) శివాలెత్తిపోయి ఉన్నాడు. ఆ సమయంలో ఇషాంత్ అద్భుతమైన యార్కర్‌తో రసెల్‌ను బోల్తా కొట్టించాడు. ఆ బంతికి రసెల్ ఔట్ కాకపోయి ఉండివుంటే, కేకేఆర్ ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత భారీ స్కోర్ నమోదు చేసి ఉండేది. లేటు వయసులో ఇషాంత్ ప్రదర్శనకు అభిమానులు ఫిదా అవుతున్నారు. ఈ మ్యాచ్‌లో అతను ధారాళంగా పరుగులు సమర్పించుకున్నప్పటికీ రెండు వికెట్లు పడగొట్టాడు. కాగా, ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన కేకేఆర్.. సునీల్ నరైన్ (39 బంతుల్లో 85; 7 ఫోర్లు, 7 సిక్సర్లు), రఘువంశీ (27 బంతుల్లో 54; 5 ఫోర్లు, 3 సిక్సర్లు), ఆండ్రీ రసెల్, శ్రేయస్ అయ్యర్ (11 బంతుల్లో 18; 2 సిక్సర్లు), రింకూ సింగ్ (8 బంతుల్లో 26; ఫోర్, 3 సిక్సర్లు) చెలరేగడంతో నిర్ణీత ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 272 పరుగుల చేసింది. ఐపీఎల్ చరిత్రలో ఇది రెండో భారీ స్కోర్. ఇదే సీజన్లో ముంబై ఇండియన్స్‌పై సన్‌రైజర్స్ చేసిన స్కోర్ (277/3) ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక స్కోర్‌గా ఉంది. ఓ సీజన్లో 250పైగా స్కోర్లు రెండు సార్లు నమోదు కావడం 17 ఏళ్ల ఐపీఎల్ చరిత్రలో ఇదే మొదటిసారి. -
విధ్వంసం సృష్టించిన కేకేఆర్ యువ బ్యాటర్.. శుభ్‌మన్ గిల్ తర్వాత..!
ఐపీఎల్ 2024లో భాగంగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో ఇవాళ (ఏప్రిల్ 3) జరుగుతున్న మ్యాచ్‌లో కేకేఆర్ యువ బ్యాటర్ అంగ్క్రిష్ రఘువంశీ విధ్వంసం సృష్టించాడు. కేవలం 25 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. తద్వారా కేకేఆర్ తరఫున శుభ్‌మన్ గిల్ తర్వాత అత్యంత పిన్న వయసులో హాఫ్ సెంచరీ చేసిన ఆటగాడిగా రికార్డుల్లోకెక్కాడు. శుభ్‌మన్ 18 ఏళ్ల 237 రోజుల వయసులో (2018 సీజన్) సీఎస్కేపై హాఫ్ సెంచరీ చేయగా.. రఘువంశీ 18 ఏళ్ల 303 రోజుల వయసులో ఢిల్లీ క్యాపిటల్స్‌పై అర్దసెంచరీ సాధించాడు. రఘువంశీకి ఐపీఎల్లో ఇది తొలి ఇన్నింగ్స్ కావడం విశేషం. Innovative! Maiden IPL Fifty for Angkrish Raghuvanshi ✨ Head to @JioCinema and @StarSportsIndia to watch the match LIVE#TATAIPL | #DCvKKR pic.twitter.com/72oQQZIDbd — IndianPremierLeague (@IPL) April 3, 2024 ఈ ఇన్నింగ్స్‌కు ముందు అతను ఓ మ్యాచ్ ఆడినా అందులో బ్యాటింగ్ చేసే అవకాశం రాలేదు. కేకేఆర్ తరఫున అరంగేట్రం ఇన్నింగ్స్‌లో ఆరో అత్యధిక స్కోర్ చేసిన ఆటగాడిగానూ రఘువంశీ రికార్డుల్లోకెక్కాడు. ఈ ఇన్నింగ్స్‌లో మొత్తం 27 బంతులు ఎదుర్కొన్న రఘువంశీ 5 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 54 పరుగులు చేసి ఔటయ్యాడు. ఈ మ్యాచ్‌లో రఘువంశీతో పాటు సునీల్ నరైన్ సైతం విధ్వంసం సృష్టించాడు. నరైన్ కేవలం 39 బంతుల్లో 7 ఫోర్లు, 7 సిక్సర్ల సాయంతో 85 పరుగులు చేశాడు. వీరిద్దరి ఊచకోత ధాటికి ఢిల్లీ బౌలర్లు వణికిపోయారు. వీరిద్దరు ఔటయ్యాక రసెల్ భారీ షాట్లు ఆడటం మొదలుపెట్టాడు. రసెల్ 15 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 38 పరుగులు చేసి క్రీజ్‌లో కొనసాగుతున్నాడు. అతనికి జతగా శ్రేయస్ అయ్యర్ (12) ఉన్నాడు. నరైన్, రఘువంశీ, రసెల్ ధాటికి కేకేఆర్ 16వ ఓవర్లోనే 200 పరుగుల మార్కును దాటింది. ఐపీఎల్ చరిత్రలో ఇది మూడో వేగవంతమై 200. 17 ఓవర్ల తర్వాత కేకేఆర్ స్కోర్ 224/3గా ఉంది. ఈ మ్యాచ్‌లో కేకేఆర్ టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. ఐదో ఓవర్లో ఫిలిప్ సాల్ట్ (18) ఔటయ్యాడు. నోర్జే బౌలింగ్‌లో ట్రిస్టన్ స్టబ్స్‌కు క్యాచ్ ఇచ్చి సాల్ట్ పెవిలియన్‌కు చేరాడు. కాగా, ప్రస్తుత సీజన్లో ఆడిన రెండు మ్యాచ్‌ల్లో విజయాలు సాధించి, పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో ఉన్న కేకేఆర్ మరో విజయం సాధించే దిశగా అడుగులు వేస్తుంది. అండర్-19 వరల్డ్‌కప్ హీరో.. 18 ఏళ్ల రఘువంశీ భారత అండర్-19 జట్టు వరల్డ్‌కప్ గెలిచిన జట్టులో సభ్యుడు. 2022 వరల్డ్‌కప్ ఎడిషన్‌లో రఘువంశీ భారత్ తరఫున లీడింగ్ రన్‌స్కోరర్‌గా ఉన్నాడు. -
విధ్వంసకర వీరుడు.. ఐపీఎల్ చరిత్రలోనే రెండో ఆల్‌రౌండర్‌గా!
వెస్టిండీస్ ఆల్‌రౌండర్, కోల్‌కతా నైట్ రైడర్స్ స్టార్ ఆండ్రీ రసెల్ చరిత్ర సృష్టించాడు. రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో మ్యాచ్ సందర్భంగా ఐపీఎల్లో అరుదైన ఘనత సాధించాడు. ఆర్సీబీతో శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో రసెల్ రెండు వికెట్లు తీశాడు. నాలుగు ఓవర్ల బౌలింగ్ కోటా పూర్తి చేసిన ఈ పేస్ ఆల్‌రౌండర్.. 40 పరుగులు ఇచ్చి.. కామెరాన్ గ్రీన్(33), రజత్ పాటిదార్(3) వికెట్లు దక్కించుకున్నాడు. ఇక లక్ష్య ఛేదనలో ఈ హార్డ్ హిట్టర్‌కు బ్యాటింగ్ చేసే అవకాశమే రాకుండా చేశారు కేకేఆర్ బ్యాటర్లు. ధనాధన్ ఇన్నింగ్స్‌తో 16.5 ఓవర్లలోనే టార్గెట్‌ను పూర్తి చేసి ఏడు వికెట్ల తేడాతో ఆర్సీబీపై కోల్‌కతా విజయానికి కారణమయ్యారు. ఇదిలా ఉంటే.. ఈ మ్యాచ్‌లో రెండు వికెట్లు తీసిన ఆండ్రీ రసెల్ ఐపీఎల్లో సరికొత్త ఫీట్ నమోదు చేశాడు. 𝐃𝐊 🤝𝐕𝐊 The @RCBTweets batters flourish with high octane maximums💥 Watch the match LIVE on @JioCinema and @StarSportsIndia 💻📱 Match Updates ▶️ https://t.co/CJLmcs7aNa #TATAIPL | #RCBvKKR pic.twitter.com/t112XqH29R — IndianPremierLeague (@IPL) March 29, 2024 లీగ్ చరిత్రలో 2 వేల పరుగులు పూర్తి చేసుకోవడంతో పాటు కనీసం వంద వికెట్లు తీసిన రెండో ఆల్‌రౌండర్‌గా చరిత్రకెక్కాడు. ఈ జాబితాలో చెన్నై సూపర్ కింగ్స్ స్పిన్ ఆల్‌రౌండర్, టీమిండియా స్టార్ రవీంద్ర జడేజా మొదటి స్థానంలో ఉన్నాడు. జడ్డూ ఇప్పటి వరకు 228 ఐపీఎల్ మ్యాచ్‌లలో కలిపి 2724 పరుగులు సాధించడంతో పాటు.. 152 వికెట్లు తీశాడు. ఇక రైటార్మ్ పేస్ బౌలర్ అయిన రసెల్ 114 మ్యాచ్‌లలో 2326 రన్స్ పూర్తి చేసుకుని 100 వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. కాగా 2012లో ఢిల్లీ డేర్‌డెవిల్స్(ప్రస్తుతం ఢిల్లీ క్యాపిటల్స్) తరఫున రసెల్ క్యాష్ రిచ్ లీగ్‌లో అరంగేట్రం చేశాడు. ఆ తర్వాత రెండేళ్లకు కేకేఆర్ శిబిరంలో చేరిన అతడు పదేళ్లుగా అదే ఫ్రాంఛైజీతో కొనసాగుతున్నాడు. ఇక ఐపీఎల్-2024లో కేకేఆర్ ఆరంభ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో తలపడిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌లో రసెల్ ఎనిమిదో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చి 25 బంతుల్లోనే 3 ఫోర్లు, 7 సిక్సర్ల సాయంతో 64 పరుగులు సాధించాడు. ఆఖరి వరకు అజేయంగా నిలిచి జట్టును గెలిపించాడు. ఆ మ్యాచ్‌లో రసెల్ రెండు వికెట్లు తీశాడు కూడా! నరైన్ @ 500 వెస్టిండీస్ ఆఫ్‌స్పిన్నర్ సునీల్ నరైన్ టి20 క్రికెట్లో అరుదైన మైలురాయిని అందుకున్నాడు. ఆర్సీబీతో మ్యాచ్‌తో అతను ఈ ఫార్మాట్లో అతను 500 మ్యాచ్‌లు పూర్తి చేసుకున్నాడు. ఈ ఘనత సాధించిన 4వ ఆటగాడిగా అతను నిలిచాడు. నరైన్‌కు ముందు పొలార్డ్ (660), డ్వేన్ బ్రేవో (573), షోయబ్ మలిక్ (542) అతనికంటే ముందు 500 మ్యాచ్‌లు ఆడారు. 35 ఏళ్ల నరైన్ ఈ సుదీర్ఘ కెరీర్లో ఏకంగా 17 టి20 జట్లకు ప్రాతినిధ్యం వహించి 537 వికెట్లు పడగొట్టాడు. వరల్డ్ కప్ సహా మొత్తం 10 టైటిల్స్ విజయాల్లో అతను భాగంగా ఉన్నాడు. ఐపీఎల్లో 2012నుంచి వరుసగా 13 సీజన్లుగా కోల్‌కతా నైట్‌రైడర్స్ తరఫున 164 మ్యాచ్‌లు ఆడాడు. బ్యాటింగ్‌లో కూడా ఓపెనర్‌గా, పించ్ హిట్టర్‌గా బరిలోకి దిగి కేకేఆర్ పలు విజయాల్లో అతను కీలక పాత్ర పోషించాడు. చదవండి: వాళ్లిద్దరికి ఆస్కార్ ఇవ్వాలి: టీమిండియా దిగ్గజం షాకింగ్ కామెంట్ -
#KKR: ఆర్సీబీపై మా విజయానికి కారణం అదే: అయ్యర్
చిన్నస్వామి స్టేడియంలో పరుగుల వరద పారించిన కోల్‌కతా నైట్ రైడర్స్ ఆల్‌రౌండర్ సునిల్ నరైన్‌పై ఆ జట్టు సారథి శ్రేయస్ అయ్యర్ ప్రశంసలు కురిపించాడు. ఓపెనర్‌గా వచ్చి తన పాత్రకు పూర్తి న్యాయం చేశాడని కొనియాడాడు. అద్భుత ఇన్నింగ్స్ ఆడి జట్టు గొప్ప ఆరంభం అందించాడని పేర్కొన్నాడు. ఐపీఎల్-2024లో భాగంగా కేకేఆర్ శుక్రవారం రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో తలపడింది. టాస్ గెలిచి తొలుత బౌలింగ్ ఎంచుకోగా.. ఆర్సీబీ నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్లు నష్టపోయి 182 పరుగులు చేసింది. అయితే, ఆరంభంలో బౌలర్లకు కాస్త అనుకూలించిన బెంగళూరు పిచ్‌పై.. సెకండాఫ్‌లో బ్యాటర్లు రెచ్చిపోయారు. ఆర్సీబీ విధించిన లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో కేకేఆర్ ఓపెనర్ ఫిలిప్ సాల్ట్(20 బంతుల్లో 30) మెరుగ్గా రాణించగా.. మరో ఓపెనర్, ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ సునిల్ నరైన్ ధనాధన్ ఇన్నింగ్స్‌తో దంచికొట్టాడు. 22 బంతులు ఎదుర్కొన్న ఈ బౌలింగ్ ఆల్‌రౌండర్ 2 ఫోర్లు, 5 సిక్స్‌ల సాయంతో 47 పరుగులు చేశాడు. A quick-fire 47 off just 22 deliveries 💥💥 An entertaining opening act from Sunil Narine comes to an end 👏👏 Head to @JioCinema and @StarSportsIndia to watch the match LIVE#TATAIPL | #RCBvKKR pic.twitter.com/s0dNMzrL80 — IndianPremierLeague (@IPL) March 29, 2024 ఇక వన్‌డౌన్‌లో వచ్చిన వెంకటేశ్ అయ్యర్ 30 బంతుల్లోనే యాభై పరుగులు పూర్తి చేసుకున్నాడు. ఆఖర్లో కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ 39, రింకూ సింగ్ 5 పరుగులతో అజేయంగా నిలిచి జట్టును విజయతీరాలకు చేర్చారు. 16.5 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించిన కేకేఆర్ ఆర్సీబీపై ఏడు వికెట్ల తేడాతో విజయం సాధించింది. తద్వారా పదిహేడో ఎడిషన్‌లో వరుసగా రెండో గెలుపు నమోదు చేసింది. ఈ నేపథ్యంలో కేకేఆర్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ జట్టు ఆట తీరుపై హర్షం వ్యక్తం చేశాడు. వికెట్ బౌలర్లకు పెద్దగా అనుకూలించడం లేదని ఆండ్రీ రసెల్ చెప్పాడని.. పిచ్ పరిస్థితులను సరిగ్గా అంచనా వేసి తమకు సూచనలు ఇచ్చాడని తెలిపాడు. ఈ క్రమంలో సునిల్ నరైన్‌ను ఓపెనర్‌గా పంపాలా వద్దా అన్న అంశంపై చర్చలు జరిపామని.. ఆఖరికి ఓపెనర్‌గానే బరిలోకి దించామని పేర్కొన్నాడు. జట్టులో తన పాత్ర ఏమిటో నరైన్‌కు స్పష్టంగా తెలుసని అయ్యర్ పేర్కొన్నాడు. కాగా ఆర్సీబీతో మ్యాచ్‌లో రసెల్ నాలుగు ఓవర్ల బౌలింగ్ కోటా పూర్తి చేసి 29 పరుగులు ఇచ్చి రెండు వికెట్లు తీశాడు. మరోవైపు నరైన్ 4 ఓవర్లలో 40 పరుగులు ఇచ్చి ఒక వికెట్ తన ఖాతాలో వేసుకున్నాడు. Venkatesh F-IYER 🔥🔥 Head to @JioCinema and @StarSportsIndia to watch the match LIVE#TATAIPL | #RCBvKKR pic.twitter.com/2EeUvGTR8J — IndianPremierLeague (@IPL) March 29, 2024 ఇక వరుసగా రెండో గెలుపుపై స్పందిస్తూ.. ఇది కేవలం ఆరంభం మాత్రమేనని.. టోర్నీలో మున్ముందు ఇంకెన్నో సాధించాల్సి ఉందని శ్రేయస్ అయ్యర్ పేర్కొన్నాడు. కాగా కేకేఆర్ తదుపరి మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌తో తలపడనుంది. విశాఖపట్నంలో బుధవారం ఇరు జట్ల మధ్య మ్యాచ్ జరుగనుంది. చదవండి: #Kohli: పాపం.. కోహ్లి ఒక్కడు ఏం చేయగలడు? -
IPL 2024: రసెల్ సిక్సర్ల సునామీ.. గేల్ రికార్డు బద్దలు
ఐపీఎల్ 2024లో భాగంగా సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో నిన్న జరిగిన మ్యాచ్‌లో కేకేఆర్ విధ్వంసకర ఆటగాడు ఆండ్రీ రసెల్ ఓ భారీ రికార్డును సొంతం చేసుకున్నాడు. ఈ మ్యాచ్‌లో సిక్సర్ల సునామీ (25 బంతుల్లో 64 నాటౌట్; 3 ఫోర్లు, 7 సిక్సర్లు) సృష్టించిన రసెల్.. ఐపీఎల్లో అత్యంత వేగంగా 200 సిక్సర్లను (1322 బంతుల్లో) పూర్తి చేసుకున్న ఆటగాడిగా రికార్డుల్లోకెక్కాడు. రసెల్‌కు ముందు ఈ రికార్డు క్రిస్ గేల్ (1811 బంతుల్లో) పేరిట ఉండేది. రసెల్, గేల్ తర్వాత అత్యంత వేగంగా 200 సిక్సర్లు పూర్తి చేసిన ఘనత కీరన్ పోలార్డ్‌కు (2055) దక్కింది. ఈ జాబితాలో టాప్-3 ఆటగాళ్లు విండీస్ వీరులే కావడం విశేషం. ఈ మ్యాచ్‌తో సిక్సర్ల సంఖ్యను 202కు పెంచుకున్న రసెల్.. క్యాష్ రిచ్ లీగ్‌లో 200 సిక్సర్ల మైలురాయిని తాకిన తొమ్మిదో క్రికెటర్‌గా రికార్డుల్లోకెక్కాడు. రసెల్‌కు ముందు గేల్ (357), రోహిత్ శర్మ (257), ఏబీ డివిలియర్స్ (251), ధోని (239), విరాట్ కోహ్లి (235), వార్నర్ (228), పోలార్డ్ (223), రైనా (203) ఈ మార్కును తాకిన వారిలో ఉన్నారు. కాగా, సన్‌రైజర్స్‌తో నిన్న జరిగిన మ్యాచ్‌లో కేకేఆర్ 4 పరుగుల తేడాతో గెలుపొందింది. చివరి బంతి వరకు ఉత్కంఠగా సాగిన ఈ మ్యాచ్‌లో రసెల్ బ్యాటింగ్ విన్యాసాలకు హర్షిత్ రాణా అద్భుతమైన బౌలింగ్ (4-0-33-3) తోడు కావడంతో కేకేఆర్ చిరస్మరణీయ విజయం సాధించింది. భారీ లక్ష్య ఛేదనలో సన్‌రైజర్స్‌కు చివరి ఓవర్లో 13 పరుగులు అవసరం కాగా.. రాణా అద్భుతంగా బౌలింగ్ చేసి కేవలం ఎనిమిది పరుగులు మాత్రమే ఇచ్చాడు. అలాగే కీలకమైన క్లాసెన్ వికెట్‌తో పాటు షాబాజ్ అహ్మద్ వికెట్లు పడగొట్టి కేకేఆర్‌ను గెలిపించాడు. ఆఖరి ఓవర్ తొలి బంతికే క్లాసెన్ సిక్సర్ బాదినప్పటికీ.. సన్‌రైజర్స్ మిగిలిన ఐదు బంతుల్లో 7 పరుగులు చేయలేక ఓటమిపాలైంది. తొలుత బ్యాటింగ్ చేసిన కేకేఆర్.. సాల్ట్ (54), రసెల్ (64) అర్దసెంచరీలతో విరుచుకుపడటంతో నిర్ణీత ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 208 పరుగులు చేయగా.. ఛేదనలో క్లాసెన్ (63; 8 సిక్సర్లు) విధ్వంసం సృష్టించినప్పటికీ సన్‌రైజర్స్ గెలవలేకపోయింది. ఆ జట్టు నిర్ణీత ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 204 పరుగులకే పరిమితమై ఓటమిపాలైంది. సన్‌రైజర్స్ ఈ మ్యాచ్ చేజార్చుకున్నప్పటికీ.. క్లాసెన్ విధ్వంసకర ఇన్నింగ్స్‌తో అభిమానుల మనసుల్ని దోచుకున్నాడు. -
KKR Vs SRH: రస్సెల్ ఊచకోత.. వణికిపోయిన ఎస్ఆర్హెచ్ బౌలర్లు! 25 బంతుల్లోనే
ఐపీఎల్-2024లో భాగంగా ఈడెన్ గార్డెన్స్‌తో సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్ ఆటగాడు ఆండ్రీ రస్సెల్ విధ్వంసం సృష్టించాడు. ఏడో స్ధానంలో బ్యాటింగ్‌కు వచ్చిన రస్సెల్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. బౌలర్‌తో సంబంధం లేకుండా ఊచకోత కోశాడు. ఈ క్రమంలో కేవలం 20 బంతుల్లోనే తన హాఫ్ సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. ఓవరాల్‌గా 25 బంతులు ఎదుర్కొన్న రస్సెల్ 3 ఫోర్లు, 7 సిక్స్‌లతో 64 పరుగులతో ఆజేయంగా నిలిచాడు. రస్సెల్ ఇన్నింగ్స్‌కు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా ఎస్ఆర్హెచ్పై రస్సెల్‌కే ఇదే తొలి ఫిప్టీ కావడం విశేషం. ఇక ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన కేకేఆర్.. రస్సెల్ విధ్వంసకర ఇన్నింగ్స్ ఫలితంగా నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 208 పరుగుల భారీ స్కోర్ సాధించింది. కేకేఆర్ బ్యాటర్లలో రస్సెల్‌తో పాటు ఫిల్ సాల్ట్(54) హాఫ్ సెంచరీతో రాణించాడు. ఎస్ఆర్హెచ్ బౌలర్లలో నటరాజన్ 3 వికెట్లు పడగొట్టగా.. మయాంక్ మార్కండే రెండు, కమ్మిన్స్ ఒక్క వికెట్ సాధించారు. Russell's Muscles 💪 Andre Russell is hitting it out of park with ease 😮 Watch the match LIVE on @JioCinema and @StarSportsIndia 💻📱 Match Updates ▶️ https://t.co/xjNjyPa8V4 #TATAIPL | #KKRvSRH | @KKRiders pic.twitter.com/Od84aM2rMr — IndianPremierLeague (@IPL) March 23, 2024 -
ఆండ్రీ రసెల్ ఊచకోత.. 12 బంతుల్లోనే.. 358.33 స్ట్రయిక్‌రేట్‌తో..!
బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్‌లో కొమిల్లా విక్టోరియన్స్ ఆటగాడు, విండీస్ విధ్వంసకర వీరుడు ఆండ్రీ రసెల్ శివాలెత్తిపోయాడు. రంగ్‌పూర్ రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రసెల్ విధ్వంసం సృష్టించాడు. కేవలం 12 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో 358.33 స్ట్రయిక్‌రేట్‌తో అజేయమైన 43 పరుగులు చేసి తన జట్టును ఒంటిచేత్తో గెలిపించాడు. అంతకుముందు రసెల్ బౌలింగ్‌లో చెలరేగిపోయాడు. 2.5 ఓవర్లలో 20 పరుగులిచ్చి 3 వికెట్లు పడగొట్టాడు. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన రైడర్స్.. రసెల్, ముస్ఫిక్ హసన్ (3/18), మథ్యూ ఫోర్డ్ (2/32), తన్వీర్ ఇస్లాం (1/12) ధాటికి 19.5 ఓవర్లలో 150 పరుగులకు కుప్పకూలింది. రైడర్స్ ఇన్నింగ్స్‌లో నీషమ్ ఒక్కడే అజేయమైన అర్దసెంచరీతో (69 నాటౌట్) రాణించాడు. నీషమ్‌తో పాటు రోనీ తాలుక్దార్ (14), షకీబ్ అల్ హసన్ (24) మాత్రమే రెండంకెల స్కోర్లు చేశారు. అనంతరం ఛేదనకు దిగిన విక్టోరియన్స్.. రసెల్ శివాలెత్తడంతో 17.4 ఓవర్లలోనే లక్ష్యాన్ని చేరుకుంది (4 వికెట్లు కోల్పోయి). విక్టోరియన్స్ ఇన్నింగ్స్‌లో రసెల్‌తో పాటు లిటన్ దాస్ (43), మహిదుల్ ఇస్లాం (39) కూడా రాణించారు. ఓపెనర్‌గా బరిలోకి దిగిన సునీల్ నరైన్ 15 పరుగులు మాత్రమే చేసి ఔట్ కాగా.. మొయిన్ అలీ (6 నాటౌట్) రసెల్‌తో కలిసి జట్టును విజయతీరాలకు చేర్చాడు. రైడర్స్ బౌలర్లలో షకీబ్ 3 వికెట్లు పడగొట్టగా.. హైదర్ రోని ఓ వికెట్ దక్కించుకున్నాడు. -
చరిత్ర సృష్టించిన రసెల్, రూథర్‌ఫోర్డ్ జోడీ
పొట్టి క్రికెట్లో ఆండ్రీ రసెల్, షెర్ఫాన్ రూథర్‌ఫోర్డ్ జోడీ (వెస్టిండీస్ క్రికెటర్లు) చరిత్ర సృష్టించింది. ఈ జోడీ ఆరో వికెట్‌కు అత్యధిక భాగస్వామ్యం నమోదు చేసిన జోడీగా రికార్డుల్లోకెక్కింది. ఆస్ట్రేలియాతో ఇవాళ (ఫిబ్రవరి 13) జరిగిన మ్యాచ్‌లో రసెల్, రూథర్‌ఫర్డ్ జోడీ ఆరో వికెట్‌కు 139 పరుగులు జోడించి గత రికార్డును బద్దలుకొట్టింది. ఈ మ్యాచ్‌కు ముందు ఈ రికార్డు పపువా న్యూ గినియా జోడీ (టోనీ ఉరా-నార్మన్ వనువా) పేరిట ఉండింది. 2022లో జరిగిన ఓ మ్యాచ్‌లో పపువా జోడీ ఆరో వికెట్‌కు అత్యధికంగా 115 పరుగులు జోడించింది. దీనికి ముందు ఈ రికార్డు ఆస్ట్రేలియన్ జోడీ (మైక్ హస్సీ-కెమరూన్ వైట్) పేరిట ఉండింది. 2010లో శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో హస్సీ-వైట్ కాంబో ఆరో వికెట్‌కు అజేయమైన 101 పరుగులు జోడించింది. ఇదిలా ఉంటే, మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో పర్యాటక విండీస్ జట్టు 37 పరుగుల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్‌లో రసెల్ (29 బంతుల్లో 71; 4 ఫోర్లు, 7 సిక్సర్లు), రూథర్‌ఫోర్డ్ (40 బంతుల్లో 67 నాటౌట్; 5 ఫోర్లు, 5 సిక్సర్లు) మెరుపు అర్ధశతకాలు సాధించి విండీస్‌ను గెలిపించారు. తొలుత బ్యాటింగ్ చేసిన విండీస్ నిర్ణీత ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 220 పరుగులు చేసింది. రసెల్, రూథర్‌ఫోర్డ్‌తో పాటు రోస్టన్ ఛేజ్ (37), రోవ్‌మన్ పావెల్ (21) ఓ మోస్తరు ఇన్నింగ్స్‌లు ఆడారు. భారీ లక్ష్య ఛేదనకు దిగిన ఆస్ట్రేలియా.. వార్నర్ (49 బంతుల్లో 81; 9 ఫోర్లు, 3 సిక్సర్లు) విశ్వరూపం ప్రదర్శించడంతో తొలుత విజయం దిశగా సాగింది. అయితే వార్నీ ఔట్ అయిన వెంటనే వరుసగా వికెట్లు కోల్పోవడంతో ఆసీస్‌కు ఓటమి తప్పలేదు. ఆఖర్లో టిమ్ డేవిడ్ (19 బంతుల్లో 41 నాటౌట్; 2 ఫోర్లు, 4 సిక్సర్లు) రెచ్చిపోయినా అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. నిర్ణీత ఓవర్లలో ఆసీస్ 5 వికెట్ల నష్టానికి 183 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఆసీస్ ఇన్నింగ్స్‌లో గత మ్యాచ్ సెంచరీ హీరో మ్యాక్స్‌వెల్ (12) సహా, హిట్టర్లు మిచ్ మార్ష్ (17), ఆరోన్ హార్డీ (16) విఫలమయ్యారు. ఈ సిరీస్‌లో తొలి రెండు టీ20లు ఆసీస్ గెలవగా.. చివరి మ్యాచ్‌లో విండీస్ విజయం సాధించింది. -
రఫ్ఫాడించిన రసెల్.. వార్నర్ మెరుపులు వృధా
ఆస్ట్రేలియా పర్యటనను విండీస్ గెలుపుతో ముగించింది. మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో పర్యాటక జట్టు చివరి మ్యాచ్‌లో విజయం సాధించింది. ఇవాళ (ఫిబ్రవరి 13) జరిగిన నామమాత్రపు మూడో టీ20లో విండీస్ ఆటగాళ్లు ఆల్‌రౌండ్ ప్రదర్శనతో ఇరగదీశారు. ఫలితంగా 37 పరుగుల తేడాతో విజయం సాధించి, క్లీన్ స్వీప్ పరాభవాన్ని తప్పించుకున్నారు. రఫ్ఫాడించిన రసెల్.. రెచ్చిపోయిన రూథర్‌ఫోర్డ్ తొలుత బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ రసెల్ (29 బంతుల్లో 71; 4 ఫోర్లు, 7 సిక్సర్లు), రూథర్‌ఫోర్డ్ (40 బంతుల్లో 67 నాటౌట్; 5 ఫోర్లు, 5 సిక్సర్లు) రఫ్ఫాడించడంతో నిర్ణీత ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 220 పరుగులు చేసింది. వీరిద్దరితో పాటు రోస్టన్ ఛేజ్ (37), రోవ్‌మన్ పావెల్ (21) ఓ మోస్తరు ఇన్నింగ్స్‌లు ఆడారు. వార్నర్ మెరుపులు వృధా భారీ లక్ష్య ఛేదనకు దిగిన ఆస్ట్రేలియా.. వార్నర్ (49 బంతుల్లో 81; 9 ఫోర్లు, 3 సిక్సర్లు) విశ్వరూపం ప్రదర్శించడంతో విజయం దిశగా సాగింది. అయితే వార్నీ ఔట్ అయిన వెంటనే ఆసీస్ వరుసగా వికెట్లు కోల్పోయి ఓటమిపాలైంది. ఆఖర్లో టిమ్ డేవిడ్ (19 బంతుల్లో 41 నాటౌట్; 2 ఫోర్లు, 4 సిక్సర్లు) రెచ్చిపోయినా అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. నిర్ణీత ఓవర్లలో ఆసీస్ 5 వికెట్ల నష్టానికి 183 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఆసీస్ ఇన్నింగ్స్‌లో గత మ్యాచ్ సెంచరీ హీరో మ్యాక్స్‌వెల్ (12) సహా, హిట్టర్లు మిచ్ మార్ష్ (17), ఆరోన్ హార్డీ (16) విఫలమయ్యారు. ఈ సిరీస్‌లో తొలి రెండు టీ20లు ఆసీస్ గెలవగా.. చివరి మ్యాచ్‌లో విండీస్ విజయం సాధించింది. టీ20 సిరీస్‌కు ముందు ఇరు జట్ల మధ్య టెస్ట్, వన్డే సిరీస్‌లు జరిగాయి. టెస్ట్ సిరీస్ 1-1తో డ్రా కాగా.. 3 మ్యాచ్‌ల వన్డే సిరీస్‌ను ఆసీస్ క్లీన్ స్వీప్ చేసింది. -
ఓ పక్క రసెల్ ఊచకోత.. మరో పక్క విల్ జాక్స్ శతక్కొట్టుడు
పొట్టి ఫార్మాట్లో ఇవాళ (ఫిబ్రవరి 13) రెండు ధమాకా ఇన్నింగ్స్‌లు క్రికెట్ అభిమానులకు కనువిందు చేశాయి. వీటితో పాటు మరో రెండు మెరుపు ఇన్నింగ్స్‌లు ఫ్యాన్స్‌ను ఆకట్టుకున్నాయి. ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడో టీ20లో వెస్టిండీస్ విధ్వంసకర యోధుడు ఆండ్రీ రసెల్ సుడిగాలి అర్ధశతకంతో (29 బంతుల్లో 71; 4 ఫోర్లు, 7 సిక్సర్లు) రచ్చ చేయగా.. బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్‌లో కొమిల్లా విక్టోరియన్స్‌కు ఆడుతున్న ఇంగ్లండ్ మెరుపు వీరుడు విల్ జాక్స్ (53 బంతుల్లో 108 నాటౌట్; 5 ఫోర్లు, 10 సిక్సర్లు) సిక్సర్ల సునామీ సృష్టించి శతక్కొట్టాడు. వీరిద్దరికి సహచరులు షెర్ఫాన్ రూథర్‌ఫోర్డ్ (40 బంతుల్లో 67 నాటౌట్; 5 ఫోర్లు, 5 సిక్సర్లు), మొయిన్ అలీ (24 బంతుల్లో 53 నాటౌట్; 2 ఫోర్లు, 5 సిక్సర్లు) తోడవ్వడంతో వారివారి జట్లు భారీ స్కోర్లు నమోదు చేశాయి. ఆసీస్‌తో మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన విండీస్.. రసెల్, రూథర్‌పోర్డ్ చెలరేగడంతో నిర్ణీత ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 220 పరుగులు చేయగా.. చట్టోగ్రామ్ ఛాలెంజర్స్‌తో మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన కొమిల్లా విక్టోరియన్స్ నిర్ణీత ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 239 పరుగుల భారీ స్కోర్ చేసింది. ఈ రెండు మ్యాచ్‌ల్లో సెకెండ్ ఇన్నింగ్స్లె కొనసాగుతున్నాయి. -
WI Vs AUS 3rd T20I : రసెల్ బ్యాటింగ్ విధ్వంసం.. 29 బంతుల్లోనే!
Australia vs West Indies, 3rd T20I: ఆస్ట్రేలియాతో మూడో టీ20లో వెస్టిండీస్ వెటరన్ ఆల్‌రౌండర్ ఆండ్రీ రసెల్ బ్యాట్‌తో విధ్వంసం సృష్టించాడు. పెర్త్ మ్యాచ్‌లో కంగారూ బౌలర్లకు చుక్కలు చూపిస్తూ పరుగుల వరద పారించాడు. ఆకాశమే హద్దుగా చెలరేగుతూ సిక్సర్ల వర్షం కురిపించాడు. కేవలం 29 బంతుల్లోనే ఏకంగా 244కు పైగా స్ట్రైక్‌రేటుతో 71 రన్స్ సాధించాడు. ఆసీస్ బౌలింగ్‌ను చితక్కొడుతూ నాలుగు ఫోర్లు, ఏడు సిక్సర్ల సాయంతో ఈ మేరకు ఆండ్రీ రసెల్ పరుగుల సునామీ సృష్టించాడు. హిట్టర్ అన్న బిరుదును మరోసారి సార్థకం చేసుకున్నాడు. Bang! Andre Russell is seeing them nicely at Perth Stadium. Tune in on Fox Cricket or Kayo #AUSvWI pic.twitter.com/DoUaQghJiZ — cricket.com.au (@cricketcomau) February 13, 2024 కాగా మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా తొలి రెండు టీ20లలో ఓడిన విండీస్.. ఆఖరి మ్యాచ్‌లోనైనా గెలిచి పరువు కాపాడుకోవాలని భావిస్తోంది. ఇందులో భాగంగా పెర్త్ స్టేడియంలో టాస్ గెలిచిన వెస్టిండీస్ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. రూథర్‌ఫర్డ్, రసెల్ దంచికొట్టారు టాపార్డర్ మొత్తం కలిపి కనీసం 20 పరుగులు కూడా చేయకుండానే నిష్క్రమించడంతో భారమంతా మిడిలార్డర్‌పై పడింది. ఈ క్రమంలో నాలుగు.. వరుసగా ఆ తర్వాతి స్థానాలో దిగిన రోస్టన్ చేజ్(20 బంతుల్లో 37), కెప్టెన్ రోవ్‌మన్ పావెల్(14 బంతుల్లో 21) రాణించగా.. షెర్ఫానే రూథర్‌ఫర్డ్ అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు. మొత్తంగా 40 బంతులు ఎదుర్కొన్న రూథర్‌ఫర్డ్ 67 పరుగులు సాధించాడు. అతడి ఇన్నింగ్స్‌లో ఐదు ఫోర్లు, ఐదు సిక్సర్లు ఉన్నాయి. ఇక రూథర్‌ఫర్డ్‌కు జతైన 35 ఏళ్ల ఆండ్రీ రసెల్ మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. ఫలితంగా వెస్టిండీస్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 220 పరుగులు చేసింది. ఇక ఈ మ్యాచ్‌లో రసెల్.. స్పెన్సర్ జాన్సెన్ బౌలింగ్‌లో మాక్స్‌వెల్‌కు క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు. కాగా ఆస్ట్రేలియా పర్యటనలో టెస్టు సిరీస్‌ను 1-1తో డ్రా చేసుకున్న కరేబియన్ జట్టు.. వన్డే సిరీస్‌లో 3-0తో వైట్‌వాష్‌కు గురైంది. మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో మాత్రం ఆ ఫలితం పునరావృతం కాకూడదని ప్రయత్నం చేస్తోంది. చదవండి: IPL 2024- SRH: సన్‌రైజర్స్ కెప్టెన్‌గా అతడే! -
రెచ్చిపోయిన రసెల్.. 17 బంతుల్లో 6 సిక్సర్లు, అయినా ఓడిన నైట్‌రైడర్స్
దుబాయ్ వేదికగా జరుగుతున్న ఇంటర్నేషనల్ టీ20 లీగ్‌లో అబుదాబీ నైట్‌రైడర్స్ ఆటగాడు, విండీస్ విధ్వంసకర వీరుడు ఆండ్రీ రసెల్ శివాలెత్తిపోయాడు. ముంబై ఇండియన్స్ ఎమిరేట్స్‌తో నిన్న జరిగిన మ్యాచ్‌లో కేవలం 17 బంతుల్లోనే ఏకంగా 6 సిక్సర్లు కొట్టి 46 పరుగులతో అజేయంగా నిలిచాడు. రసెల్ విధ్వంసకర ఇన్నింగ్స్‌తో రెచ్చిపోయినా ఈ మ్యాచ్‌లో నైట్‌రైడర్స్ ఓటమిపాలైంది. రసెల్ ధాటికి తొలుత బ్యాటింగ్ చేసిన నైట్‌రైడర్స్ నిర్ణీత ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 188 పరుగులు చేసింది. రసెల్‌తో పాటు జో క్లార్క్ (21), మైఖేల్ పెప్పర్ (38), అలీషాన్ షరాఫు (37), సామ్ హెయిన్ (40) ఓ మోస్తరు స్కోర్లతో రాణించారు. ఎమిరేట్స్ బౌలర్లలో ఫజల్ హక్ ఫారూకీ 3 వికెట్లు పడగొట్టగా.. ట్రెంట్ బౌల్ట్, వకార్ సలామ్ తలో వికెట్ పడగొట్టారు. అనంతరం ఎంఐ ఎమిరేట్స్ మరో ఓవర్ మిగిలుండగానే కేవలం 2 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. ఓపెనర్లు కుశాల్ పెరీరా (27 బంతుల్లో 56; 4 ఫోర్లు, 3 సిక్సర్లు), ముహమ్మద్ వసీం (61 బంతుల్లో 87 నాటౌట్; 8 ఫోర్లు, 3 సిక్సర్లు) మెరుపు అర్ధశతకాలతో ఎమిరేట్స్‌ను విజయతీరాలకు చేర్చారు. ఆఖర్లో ఎమిరేట్స్ కెప్టెన్ నికోలస్ పూరన్ సైతం విరుచుకుపడ్డాడు. పూరన్ కేవలం 19 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో 33 పరుగులు చేసి ఔటయ్యాడు. ముహమ్మద్ వసీం.. టిమ్ డేవిడ్ (10) సాయంతో ఎమిరేట్స్‌ను గెలిపించాడు. నైట్‌రైడర్స్ బౌలర్లలో డేవిడ్ విల్లే, అలీ ఖాన్లకు తలో వికెట్ దక్కింది. అలెక్స్ హేల్స్ మెరుపు ఇన్నింగ్స్ వృధా.. నిన్ననే జరిగిన మరో మ్యాచ్‌లో డెజర్ట్ వైపర్స్‌పై షార్జా వారియర్స్ 7 పరుగుల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన వారియర్స్.. 7 వికెట్ల నష్టానికి 174 పరుగులు చేయగా.. ఛేదనలో తడబడిన వైపర్స్ లక్ష్యానికి 8 పరుగుల దూరంలో నిలిచిపోయింది. వారియర్స్ ఇన్నింగ్స్‌లో ఆ జట్టు కెప్టెన్ టామ్ కోహ్లెర్ కాడ్మోర్ (68) టాప్ స్కోరర్‌గా నిలువగా.. వైపర్స్ ఇన్నింగ్స్‌లో అలెక్స్ హేల్స్ (61) అర్దసెంచరీతో రాణించాడు. వారియర్స్ బౌలర్లు క్రిస్ వోక్స్ (2/26), డేనియల్ సామ్స్ (2/29) వైపర్స్ పతనాన్ని శాశించాడు. -
రీఎంట్రీలో రసెల్ బ్యాటింగ్ విధ్వంసం.. విండీస్ చేతిలో ఇంగ్లండ్ చిత్తు
West Indies vs England, 1st T20I: వెస్టిండీస్ క్రికెటర్ ఆండ్రీ రసెల్ జాతీయ జట్టులో పునరాగమనాన్ని ఘనంగా చాటాడు. ఇంగ్లండ్‌తో తొలి టీ20లో అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. తొలుత బంతితో చెలరేగిన ఈ ఆల్‌రౌండర్.. అనంతరం లక్ష్య ఛేదనలో విధ్వంసకర ఇన్నింగ్స్‌తో విరుచుకుపడ్డాడు. ఇంగ్లండ్ బౌలర్ల ఎత్తులను చిత్తు చేస్తూ ధనాధన్ బ్యాటింగ్‌తో జట్టును విజయతీరాలకు చేర్చాడు. తద్వారా ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచి రీఎంట్రీ అదుర్స్ అనిపించాడు. కాగా మూడు వన్డే, ఐదు టీ20 మ్యాచ్‌ల సిరీస్ ఆడేందుకు ఇంగ్లండ్ వెస్టిండీస్ పర్యటనకు వెళ్లింది. మూడు వికెట్లు పడగొట్టిన రసెల్ ఈ క్రమంలో వన్డే సిరీస్‌ను 2-1తో గెలిచి ఇంగ్లిష్ జట్టుకు షాకిచ్చిన వెస్టిండీస్.. టీ20 సిరీస్‌ను విజయంతో ఆరంభించి సత్తా చాటింది. బార్బడోస్ వేదికగా బుధవారం తెల్లవారుజామున జరిగిన మ్యాచ్‌లో టాస్ గెలిచిన విండీస్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఈ నేపథ్యంలో ఆతిథ్య జట్టు ఆహ్వానం మేరకు బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లండ్ 19.3 ఓవర్లలో 171 పరుగులు చేసి ఆలౌట్ అయింది. ఓపెనర్లు ఫిలిప్ సాల్ట్ 20 బంతుల్లో 40, జోస్ బట్లర్ 31 బంతుల్లో 39 పరుగులతో శుభారంభం అందించగా.. మిగతా వాళ్లలో లియామ్ లివింగ్ స్టోన్(27) ఒక్కడే ఇరవై పరుగుల పైచిలుకు స్కోరు రాబట్టాడు. కరేబియన్ బౌలర్ల ధాటికి మిగిలిన ఇంగ్లిష్ బ్యాటర్లంతా చేతులెత్తేశారు. ఇక ఇంగ్లండ్ ఇన్నింగ్స్‌లో పేస్ ఆల్‌రౌండర్ ఆండ్రీ రస్సెల్, మరో ఫాస్ట్‌బౌలర్ అల్జారీ జోసెఫ్ చెరో మూడు వికెట్లు పడగొట్టారు. మిగిలిన వాళ్లలో పేసర్లు జేసన్ హోల్డర్ ఒకటి, రొమారియో షెఫర్డ్ రెండు వికెట్లు కూల్చారు. ఇక స్పిన్నర్ అకీల్ హొసేన్‌కు ఒక వికెట్ దక్కింది. Unstoppable Russell Mania! . .#WIvENG #WIvENGonFanCode pic.twitter.com/VjbBCJMMIV — FanCode (@FanCode) December 13, 2023 పావెల్ కెప్టెన్ ఇన్నింగ్స్.. ఈ క్రమంలో లక్ష్య ఛేదనకు దిగిన వెస్టిండీస్‌కు ఓపెనర్లు బ్రాండన్ కింగ్(22), కైలీ మేయర్స్(35) మంచి ఆరంభం అందించగా.. వన్‌డౌన్ బ్యాటర్ షాయీ హోప్ 36 పరుగులతో రాణించాడు. ఆ తర్వాతి స్థానాల్లో వచ్చిన నికోలస్ పూరన్ 13, షిమ్రన్ హెట్మెయిర్ ఒక్క పరుగుకే పరిమితమయ్యారు. అయితే, ఆరో నంబర్ బ్యాటర్, కెప్టెన్ రోవ్‌మన్ పావెల్, ఎనిమిదో స్థానంలో వచ్చిన ఆండ్రీ రసెల్ ధనాధన్ ఇన్నింగ్స్‌తో చెలరేగారు. పావెల్ 15 బంతుల్లో మూడు ఫోర్లు, రెండు సిక్సర్లతో 206.67 స్ట్రైక్‌రేటుతో 31 పరుగులు రాబట్టి అజేయంగా నిలిచాడు. సునామీ ఇన్నింగ్స్‌తో రసెల్ విధ్వంసం మరోవైపు రసెల్ కూడా 14 బంతులు ఎదుర్కొని 207కు పైగా స్ట్రైక్‌రేటుతో 29 పరుగులు సాధించాడు. అతడి ఇన్నింగ్స్‌లో రెండు ఫోర్లు, రెండు సిక్సర్లు ఉన్నాయి. కాగా రసెల్ దాదాపు రెండేళ్ల తర్వాత వెస్టిండీస్ తరఫున బరిలోకి దిగడం ఇదే తొలిసారి. Russell roars back! . .#WIvENG #WIvENGonFanCode pic.twitter.com/zdlJBWJdWA — FanCode (@FanCode) December 13, 2023 ఈ నేపథ్యంలో ఇంగ్లండ్‌పై టీ20 సిరీస్‌లో వెస్టిండీస్ 1-0తో ఆధిక్యంలోకి వెళ్లింది. దీంతో జోస్ బట్లర్ బృందానికి మరోసారి నిరాశే మిగిలింది. ఇరు జట్ల మధ్య గురువారం రెండో టీ20 జరుగనుంది. చదవండి: Ind vs SA: అందుకే ఓడిపోయాం.. మాకు ఇదొక గుణపాఠం: సూర్యకుమార్ -
వెస్టిండీస్ టీ20 జట్టు ప్రకటన.. విధ్వంసకర ఆటగాడు రీ ఎంట్రీ
ఇంగ్లండ్‌తో ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌కు 15 మంది సభ్యులతో కూడిన జట్టును తమ జట్టును క్రికెట్ వెస్టిండీస్ ప్రకటించింది. దాదాపు రెండేళ్ల పాటు జాతీయ జట్టుకు దూరమైన స్టార్ ఆల్ రౌండర్ ఆండ్రీ రస్సెల్‌కు ఇంగ్లండ్ సిరీస్ కోసం విండీస్ సెలక్టర్లు పిలుపునిచ్చారు. రస్సెల్ చివరగా వెస్టిండీస్ తరపున 2021లో ఆస్ట్రేలియాపై టీ20 మ్యాచ్ ఆడాడు. ఇటీవల కాలంలో రస్సెస్ మెరుగైన ప్రదర్శన కనబరుస్తుండంతో మళ్లీ సెలక్టర్లు అతడిని పరిగణలోకి తీసుకున్నారు. అదే విధంగా ఇంగ్లండ్‌తో వన్డేలకు దూరమైన స్టార్ ఆటగాళ్లు జాసన్ హోల్డర్, నికోలస్ పూరన్ లు టీ20 జట్టులో మాత్రం చోటు దక్కించుకున్నారు. ఈ జట్టుకు రోవ్‌మన్ పావెల్ కెప్టెన్ గా వ్యవహరించనుండగా.. షాయ్ హోప్ వైస్ కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. డిసెంబర్ 12న బార్బోడేస్ వేదికగా జరగనున్న తొలి టీ20తో ఈ సిరీస్ ప్రారంభం కానుంది. కాగా ఇప్పటికే ఇంగ్లండ్‌తో జరిగిన మూడు వన్డేల సిరీస్‌ను 2-1తో వెస్టిండీస్ సొంతం చేసుకుంది. ఇంగ్లండ్‌తో టీ20లకు విండీస్ జట్టు: రోవ్‌మన్ పావెల్ (కెప్టెన్), షాయ్ హోప్ (వైస్ కెప్టెన్), రోస్టన్ చేజ్, మాథ్యూ ఫోర్డ్, షిమ్రాన్ హెట్మెయర్, జాసన్ హోల్డర్, అకేల్ హోసేన్, అల్జారీ జోసెఫ్, బ్రాండన్ కింగ్, కైల్ మేయర్స్, గుడాకేష్ మోటీ, నికోలస్ పూరన్, ఆండ్రీ రస్సెల్, షెర్ఫేన్ రూథర్‌ఫోర్డ్, రొమారియో షెపర్డ్. చదవండి: ENG vs WI: ఇంగ్లండ్‌ను చిత్తు చేసిన వెస్టిండీస్.. 24 ఏళ్ల తర్వాత ఇదే తొలిసారి -
అతడి బ్యాటింగ్ కోసమే భారత్-ఆసీస్ టీ20 మ్యాచ్‌లు చూస్తున్నాను: రస్సెల్
టీమిండియా నయా బ్యాటింగ్ సంచలనం రింకూ సింగ్‌పై వెస్టిండీస్ స్టార్ ఆండ్రీ రస్సెల్ ప్రశంసల వర్షం కురిపించాడు. రింకూ అద్భుతమైన ఆటగాడని, అతడి సత్తా ఎంటో తనకు బాగా తెలుసు అని రస్సెల్ అన్నాడు. స్వదేశంలో ఆస్ట్రేలియాతో జరుగుతున్న టీ20 సిరీస్‌లో ఇప్పటివరకు ఆడిన మూడు ఇన్నింగ్స్‌లోనూ రింకూ దుమ్మురేపాడు. ఆసీస్‌తో జరిగిన తొలి టీ20లో 14 బంతుల్లో 22 పరుగులు చేసిన రింకూ.. రెండో టీ20లో అయితే కేవలం 9 బంతుల్లోనే 31 పరుగులతో మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. నాలుగో టీ20లో 46 పరుగులతో అద్బుత ఇన్నింగ్స్ ఈ నేపథ్యంలో రస్సెల్ హిందూస్తాన్ టైమ్స్‌తో రస్సెల్ మాట్లాడూతూ.. "నేను ఆస్ట్రేలియా-భారత్ టీ20 మ్యాచ్‌లను చూస్తున్నాను. ఒకవేళ ఏ మ్యాచ్ అయినా మిస్ అయితే హైలెట్స్ కచ్చితంగా చూస్తాను. ఎందుకంటే రింకూ సింగ జట్టులో ఉన్నాడు. అతడి బ్యాటింగ్ అంటే నాకు ఎంతో ఇష్టం. ఈ సిరీస్‌లో రింకూ బ్యాటింగ్ నన్ను ఏమి ఆశ్చర్యపరచడం లేదు. అతడు కొన్నేళ్ల క్రితం కేకేఆర్‌తో జతకట్టాడు. అతడు ప్రాక్టీస్ గేమ్‌లలో లేదా నెట్స్‌లో భారీ షాట్లు ఆడేవాడు. అప్పుడే అతడు టాలెంట్ ఎంటో మాకు అర్ధమైపోయింది. అతడొక టీమ్ మ్యాన్. ఆట పట్ల అతడికి చాల మక్కువ ఎక్కువ. జాతీయ జట్టు అద్బుతంగా రాణిస్తుండడంతో అతడు చాలా సంతోషంగా ఉంటాడు. అతడు భవిష్యత్తులో మరింత మెరుగుపడతాడని నేను భావిస్తున్నాను అని చెప్పుకొచ్చాడు. కాగా ఐపీఎల్లో గత కొన్ని సీజన్ల నుంచి కేకేఆర్ తరపున ఆడుతున్నారు. చదవండి: IND vs SA: గొప్ప నాయకుడు.. అప్పటిదాకా అతడే టీమిండియా కెప్టెన్‌గా ఉండాలి: గంగూలీ -
బీసీసీఐ అలా చేస్తే.. అంతకంటే పిచ్చితనం మరొకటి ఉండదు: రసెల్
తమ అభిప్రాయాలు నిక్కచ్చిగా చెప్పడంలో కరేబియన్ క్రికెటర్లు ముందు వరుసలో ఉంటారు. ఆల్‌రౌండర్ ఆండ్రీ రసెల్ కూడా ఇందుకు మినహాయింపు కాదు. టీమిండియా స్టార్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లిల అంతర్జాతీయ టీ20 భవితవ్యం గురించి అతడు ఇచ్చిన సమాధానం ఈ విషయాన్ని మరోసారి నిరూపించింది. కాగా టీ20 ప్రపంచకప్-2022 తర్వాత విరాహిత్ ద్వయం టీమిండియా తరఫున పొట్టి ఫార్మాట్లో ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు. ఈ క్రమంలో వన్డే ప్రపంచకప్-2023 తర్వాత వీరిద్దరు అంతర్జాతీయ టీ20లకు పూర్తిగా దూరం కానున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. డిసెంబరులో సౌతాఫ్రికా పర్యటన సందర్భంగా ఈ విషయంపై పూర్తి స్పష్టత రానుంది. ఈ నేపథ్యంలో హిందుస్తాన్ టైమ్స్‌తో సంభాషించిన ఆండ్రీ రసెల్‌కు రోహిత్, కోహ్లిల గురించి ప్రశ్న ఎదురైంది. ఇందుకు స్పందిస్తూ.. "అసలు రోహిత్, కోహ్లిల విషయంలో ఇంత పెద్ద చర్చ ఎందుకు జరుగుతుందో అర్థం కావడం లేదు. ఇప్పుడు చాలా మంది సోషల్ మీడియా వేదికగా ఆటగాళ్ల నైపుణ్యాల గురించి చర్చలు పెట్టడం పరిపాటిగా మారిపోయింది. రోహిత్ అనుభవజ్ఞుడైన ఆటగాడు.. ఇక విరాట్ విరాట్(బిగ్) ప్లేయర్ అని ప్రత్యేకంగా చెప్పేదేముంది? వీళ్లిద్దరిని గనుక వచ్చే ఏడాది టీ20 వరల్డ్ కప్ జట్టుకు ఎంపిక చేయకపోతే అంతకంటే పిచ్చితనం మరొకటి ఉండదు. ప్రపంచకప్ లాంటి మెగా ఈవెంట్లో అనుభవం ఉన్న ఆటగాళ్లు ఉండటం అత్యంత ముఖ్యం. యుద్ధ క్షేత్రానికి 11 మంది యువ సైనికులను పంపలేరు కదా! సీనియర్లకే కచ్చితంగా పెద్దపీట వేయాల్సి ఉంటుంది" అంటూ ఈ విండిస్ వీరుడు కుండబద్దలు కొట్టాడు. యువ ఆటగాళ్లు ఇలాంటి మేజర్ టోర్నీల్లో ఒత్తిడిని జయించలేక చిత్తవుతారు కాబట్టి.. అనుభవం ఉన్న ఆటగాళ్లను బరిలోకి దింపడం ముఖ్యమని రసెల్ అభిప్రాయపడ్డాడు. కాగా ఐపీఎల్లో ఈ బౌలింగ్ ఆల్‌రౌండర్ కోల్‌కతా నైట్ రైడర్స్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్న విషయం తెలిసిందే. చదవండి: దక్షిణాఫ్రికాతో టీ20, వన్డే సిరీస్.. టీమిండియా కెప్టెన్‌గా కేఎల్ రాహుల్!? -
మున్రో మెరుపు ఇన్నింగ్స్ వృధా.. తుక్కు రేగ్గొట్టిన రసెల్
కరీబియన్ ప్రీమియర్ లీగ్ 2023లో భాగంగా సెయింట్ లూసియా కింగ్స్‌తో ఇవాళ (సెప్టెంబర్ 11) జరిగిన మ్యాచ్‌లో ట్రిన్‌బాగో నైట్‌రైడర్స్ 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన లూసియా కింగ్స్.. ఓపెనర్ కొలిన్ మున్రో (51 బంతుల్లో 72 నాటౌట్; 6 ఫోర్లు, 3 సిక్సర్లు) బాధ్యతాయుతమైన అజేయ అర్ధసెంచరీతో రాణించడంతో నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 167 పరుగులు చేయగా.. మార్క్ దెయాల్ (45 బంతుల్లో 57; 6 ఫోర్లు, 2 సిక్సర్లు) అర్ధసెంచరీతో, ఆఖర్లో ఆండ్రీ రసెల్ (13 బంతుల్లో 29 నాటౌట్; 2 ఫోర్లు, 3 సిక్సర్లు) మెరుపు ఇన్నింగ్స్‌తో విరుచుకుపడటంతో నైట్‌రైడర్స్ మరో 7 బంతులు మిగిలుండగానే కేవలం 3 వికెట్లు మాత్రమే కోల్పోయి విజయతీరాలకు చేరుకుంది. మున్రో మెరుపు ఇన్నింగ్స్ వృధా.. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన లూసియా కింగ్స్‌ను మున్రో బాధ్యతాయుతమైన అజేయ అర్ధసెంచరీతో ఆదుకున్నాడు. అతను చివరి వరకు క్రీజ్‌లో ఉండటంతో లూసియా కింగ్స్ ఈ మాత్రం స్కోరైనా (167/3) చేయగలిగింది. మున్రోకు రోస్టన్ ఛేజ్ (31 బంతుల్లో 32; 3 ఫోర్లు, సిక్స్), సీన్ విలియమ్స్ (17 బంతుల్లో 34 నాటౌట్; 4 ఫోర్లు, సిక్స్) సహకరించగా.. జాన్సన్ చార్లెస్ (13), సికందర్ రజా (8) విఫలమయ్యారు. నైట్‌రైడర్స్ బౌలర్లలో జేడన్ సీల్స్, సునీల్ నరైన్, వకార్ సలామ్ తలో వికెట్ పడగొట్టారు. రాణించిన మార్క్ దెయాల్, రఫ్ఫాడించిన రసెల్ 168 పరుగుల సాధారణ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన నైట్‌రైడర్స్ ఓపెనర్ మార్క్ దెయాల్, ఆఖర్లో ఆండ్రీ రసెల్ మెరుపు ఇన్నింగ్స్‌తో విజృంభించడంతో 18.5 ఓవర్లలో కేవలం 3 వికెట్లు మాత్రమే కోల్పోయి విజయతీరాలకు చేరుకుంది. నైట్‌రైడర్స్ ఇన్నింగ్స్‌లో మార్టిన్ గప్తిల్ (16), నికోలస్ పూరన్ (15) విఫలం కాగా.. దెయాల్, రసెల్‌తో పాటు లోర్కాన్ టక్కర్ (38 నాటౌట్) రాణించాడు. లూసియా బౌలర్లలో అల్జరీ జోసఫ్ 2 వికెట్లు పడగొట్టగా.. రోస్టన్ ఛేజ్ ఓ వికెట్ దక్కించుకున్నాడు. -
సిక్సర్ల సునామీ.. విధ్వంసం సృష్టించిన విండీస్ వీరులు
కరీబియన్ ప్రీమియర్ లీగ్ 2023లో భాగంగా నిన్న జరిగిన రెండు మ్యాచ్‌ల్లో సిక్సర్ల మోత మోగింది. పలువురు విండీస్ జాతీయ జట్టు ఆటగాళ్లు ఆకాశమే హద్దుగా చెలరేగిపోయారు. వీరి సిక్సర్ల సునామీలో మైదానాలు కొట్టుకుపోయాయి. వీరి బాదుడు అభిమానులకు అసలుసిసలు టీ20 క్రికెట్ మజాను అందించింది. బంతి పడటమే ఆలస్యం అన్నట్లుగా బౌలర్లను ఊచకోత కోశారు. ఫలితంగా భారీ స్కోర్లు నమోదవ్వడంతో పాటు పలు రికార్డులు కూడా బద్దలయ్యాయి. హెట్‌మైర్, కీమో పాల్ ఊచకోత జమైకా తల్లావాస్-గయానా అమెజాన్ వారియర్స్ మధ్య జరిగిన మ్యాచ్ విషయానికొస్తే.. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన గయానా.. షిమ్రోన్ హెట్‌మైర్ (45 బంతుల్లో 60; 3 ఫోర్లు, 4 సిక్సర్లు), కీమో పాల్ (29 బంతుల్లో 57; ఫోర్, 7 సిక్సర్లు) సుడిగాలి అర్ధశతకాలతో విరుచుకుపడటంతో నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 210 పరుగులు చేసింది. కీమో పాల్ ఆకాశమే హద్దుగా చెలరేగి దాదాపుగా ప్రతి బంతిని సిక్సర్‌గా మలిచాడు. THE CHAMPION! What a way to mark your 100th CPL match by taking a wicket in your first ball 🙌 @DJBravo47 strikes again! #CPL23 #SKNPvTKR #CricketPlayedLouder #BiggestPartyInSport #RepublicBank pic.twitter.com/aRoSZv9J2B — CPL T20 (@CPL) August 28, 2023 వీరికి షాయ్ హోప్ (17 బంతుల్లో 25; 2 సిక్సర్లు), రొమారియో షెపర్డ్ (9 బంతుల్లో 19 నాటౌట్; 2 ఫోర్లు, సిక్స్) జతకావడంతో గయానా టీమ్ 200 పరుగుల మార్కును దాటింది. జమైకా బౌలర్లలో మహ్మద్ ఆమిర్ 3 వికెట్లు పడగొట్టగా.. క్రిస్ గ్రీన్ 2, సల్మాన్ ఇర్షాద్, రీఫర్ తలో వికెట్ దక్కించుకున్నారు. సరిపోని ఇమాద్ వసీం, ఫేబియన్ అలెన్ మెరుపులు 211 పరుగుల భారీ లక్ష్యఛేదనలో ఇమాద్ వసీం (36 బంతుల్లో 63; 3 ఫోర్లు, 5 సిక్సర్లు), ఫేబియన్ అలెన్ (25 బంతుల్లో 47; 6 సిక్సర్లు) మెరుపు ఇన్నింగ్స్‌లు ఆడినా జమైకా విజయతీరాలకు చేరలేకపోయింది. వీరు మినహా మిగతావారెవ్వరూ రాణించడకపోవడంతో జమైకా ఇన్నింగ్స్ 18.4 ఓవర్లలోనే ముగిసింది. ఆ జట్టు 176 పరుగులు మాత్రమే చేసి ఆలౌటైంది. ఫలితంగా గయానా 34 పరుగుల తేడాతో గెలుపొందింది. రొమారియో షెపర్డ్ (3-1-7-3) అద్భుతమైన ప్రదర్శనతో జమైకా పతనాన్ని శాసించగా.. ప్రిటోరియస్ (2/35), సింక్లెయిర్ (2/17) రాణించారు. Rutherford Relishes Responsibility💪 Captain's knock from Sherfane👏#CPL23 #SKNPvTKR #CricketPlayedLouder #BiggestPartyInSport #Skyfair pic.twitter.com/lSvN2Kehfi — CPL T20 (@CPL) August 28, 2023 రూథర్‌పోర్డ్ ప్రయాస వృధా.. సెయింట్ కిట్స్ అండ్ నెవిస్ పేట్రియాట్స్‌తో నిన్న జరిగిన మ్యాచ్‌లో ట్రిన్‌బాగో నైట్‌రైడర్స్ బ్యాటర్లు ఉగ్రరూపం దాల్చారు. ఫలితంగా వారి జట్టు 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన సెయింట్ కిట్స్.. షెర్ఫాన్ రూథర్‌ఫోర్డ్ (38 బంతుల్లో 62 నాటౌట్; 4 ఫోర్లు, 5 సిక్సర్లు), ఆండ్రీ ఫ్లెచర్ (17 బంతుల్లో 32; 3 ఫోర్లు, 3 సిక్సర్లు), కోర్బిన్ బాష్ (21 బంతుల్లో 30; 3 ఫోర్లు, సిక్స్) రాణించడంతో నిర్ణీత ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 178 పరుగులు చేసింది. నైట్‌రైడర్స్ బౌలర్లలో సునీల్ నరైన్ 3 వికెట్లతో రాణించగా.. బ్రావో 2 వికెట్లు పడగొట్టాడు. Nicky P with an entertaining innings 🙌!#CPL23 #SKNPVTKR #CricketPlayedLouder #BiggestPartylnSport #Skyfair pic.twitter.com/WAcooLRBgu — CPL T20 (@CPL) August 28, 2023 Wowza 🤩 @KieronPollard55 SMASHES 4 💯 meter sixes in a row 🔥 #CPL23 #SKNPvTKR #CricketPlayedLouder #BiggestPartyInSport #BetBarter pic.twitter.com/qVpn0fRKA1 — CPL T20 (@CPL) August 28, 2023 విధ్వంసం సృష్టించిన పూరన్, పోలార్డ్, రసెల్ 179 పరుగుల లక్ష్యాఛేదనలో నికోలస్ పూరన్ (32 బంతుల్లో 61; 5 ఫోర్లు, 4 సిక్సర్లు), కీరన్ పోలార్డ్ (16 బంతుల్లో 37 నాటౌట్; 5 సిక్సర్లు), ఆండ్రీ రసెల్ (8 బంతుల్లో 23 నాటౌట్; 2 ఫోర్లు, 2 సిక్సర్లు) చెలరేగిపోవడంతో నైట్‌రైడర్స్ 17.1 ఓవర్లలో కేవలం 4 వికెట్లు మాత్రమే కోల్పోయి లక్ష్యాన్ని చేరుకుంది. సెయింట్ కిట్స్ బౌలర్లలో బోష్ 3, ముజరబానీ ఓ వికెట్ పడగొట్టారు. SUPER SALMAN takes 4 🤩 #CPL23 #CricketPlayedLouder #BiggestPartyInSport pic.twitter.com/jSr1RT24G4 — CPL T20 (@CPL) August 28, 2023 -
రెచ్చిపోయిన రసెల్, రూథర్‌ఫోర్డ్.. కెనడా టీ20 లీగ్ విజేత మాంట్రియాల్ టైగర్స్
కెనడా టీ20 లీగ్ 2023 ఎడిషన్ (మూడో ఎడిషన్.. 2018, 2019, 2023) విజేతగా మాంట్రియాల్ టైగర్స్ నిలిచింది. సర్రే జాగ్వార్స్‌తో నిన్న (ఆగస్ట్ 6) జరిగిన ఫైనల్లో మాంట్రియాల్ 5 వికెట్ల తేడాతో గెలుపొందింది. రసవత్తరంగా సాగిన ఈ లో స్కోరింగ్ గేమ్‌లో షెర్ఫాన్ రూథర్‌ఫోర్డ్ (29 బంతుల్లో 38 నాటౌట్; 3 ఫోర్లు, 2 సిక్సర్లు) కడ దాకా నిలిచి మాంట్రియాల్‌ను విజయతీరాలకు చేర్చాడు. ఆఖర్లో ఆండ్రీ రసెల్ (6 బంతుల్లో 20 నాటౌట్; ఫోర్, 2 సిక్సర్లు) మెరుపు ఇన్నింగ్స్‌తో విజృంభించి మాంట్రియాల్‌ను గెలిపించాడు. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన సర్రే జాగ్వార్స్ నిర్ణీత ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 130 పరుగుల నామమాత్రపు స్కోర్ చేసింది. ఓపెనర్ జతిందర్ సింగ్ (57 బంతుల్లో 56 నాటౌట్; 3 ఫోర్లు) అజేయమైన అర్ధసెంచరీతో రాణించగా.. మరో ఓపెనర్ మహ్మద్ హరీస్ (22 బంతుల్లో 23; 2 ఫోర్లు, సిక్స్), అయాన్ ఖాన్ (15 బంతుల్లో 26; 2 సిక్సర్లు) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. మాంట్రియాల్ బౌలర్లలో అయాన్ అఫ్జల్ ఖాన్ 2 వికెట్లు పడగొట్టగా.. కార్లోస్ బ్రాత్‌వైట్, అబ్బాస్ అఫ్రిది, ఆండ్రీ రసెల్ తలో వికెట్ దక్కించుకున్నారు. Montreal Tigers - Champions of GT20 Canada Season 3 🙌 The Montreal Tigers unleashed a loud Roar and clinched the Title 🏆#GT20Canada #GT20Season3 #GlobalT20 #CricketsNorth #GT20Finals #SJvMT pic.twitter.com/paLAtYBa1U — GT20 Canada (@GT20Canada) August 6, 2023 అనంతరం అతి సాధారణ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన మాంట్రియాల్ సున్నా పరుగులకే వికెట్ కోల్పోయి డిఫెన్స్‌లో పడింది. అయితే కెప్టెన్ క్రిస్ లిన్ (35 బంతుల్లో 31; 3 ఫోర్లు, సిక్స్).. స్రిమంత (15 బంతుల్లో 12; 2 ఫోర్లు), దిల్‌ప్రీత్ సింగ్ (15 బంతుల్లో 14; 2 ఫోర్లు) సాయంతో స్కోర్ బోర్డును నెమ్మదిగా కదిలించాడు. 60 పరుగుల వద్ద పరుగు వ్యవధిలో మాంట్రియాల్ 2 వికెట్లు కోల్పోవడంతో కష్టాల్లో పడింది. The Moment, the Feels, and the Celebrations ❤️#GT20Canada #GT20Season3 #GlobalT20 #CricketsNorth #GT20Finals pic.twitter.com/ONOQtgOKSK — GT20 Canada (@GT20Canada) August 7, 2023 ఈ దశలో వచ్చిన షెర్ఫాన్ రూథర్‌ఫోర్డ్.. దీపేంద్ర సింగ్ (16 రిటైర్డ్), ఆండ్రీ రసెల్‌ల సాయంతో మాంట్రియాల్‌ను విజయతీరాలకు చేర్చాడు. జాగ్వార్స్ బౌలర్లలో కెప్టెన్ ఇఫ్తికార్ అహ్మద్ (4-0-8-2) అద్భుతంగా బౌల్ చేయగా.. స్పెన్సర్ జాన్సన్, అయాన్ ఖాన్ తలో వికెట్ పడగొట్టారు. ఈ మ్యాచ్‌తో పాటు సిరీస్ ఆధ్యాంతం రాణించిన రూథర్‌ఫోర్డ్‌కు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డుతో పాటు ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ అవార్డు లభించింది. It was a busy presentation ceremony for Sherfane Rutherford and deservingly so 🫶 Dean Jones - Most Valuable Player ✅ Finals Man of the Match ✅ Moment of the Match ✅#GT20Canada #GT20Season3 #GlobalT20 #CricketsNorth #GT20Finals #SJvMT pic.twitter.com/OCHQxU4IlT — GT20 Canada (@GT20Canada) August 7, 2023 -
తీరు మార్చుకోని నైట్‌రైడర్స్.. కొనసాగుతున్న పేలవ ప్రదర్శన.. ఐపీఎల్లో కాస్త నయం..!
ఫ్రాంచైజీ క్రికెట్లో కోల్‌కతా నైట్‌రైడర్స్ అనుబంధ జట్ల పేలవ ప్రదర్శన కొనసాగుతుంది. గతేడాది కరీబియన్ ప్రీమియర్ లీగ్‌లో (సీపీఎల్) మొదలైన నైట్‌రైడర్స్ వైఫల్యాల పరంపర.. అమెరికా వేదికగా ప్రస్తుతం జరుగుతున్న మేజర్ లీగ్ క్రికెట్లోనూ (ఎంఎల్సీ) కంటిన్యూ అవుతుంది. 2022 సీపీఎల్‌ను ఆఖరి స్థానంతో ముగించిన ట్రిన్‌బాగో నైట్‌రైడర్స్.. ఆతర్వాత జరిగిన ఇంటర్నేషనల్ టీ20 లీగ్‌లోనూ (ఐఎల్టీ20) చివరాఖరి స్థానంలోనే (అబుదాబీ నైట్‌రైడర్స్) నిలిచింది. అనంతరం జరిగిన ఐపీఎల్-2023లో కాస్త పర్వాలేదనిపించిన కోల్‌కతా నైట్‌రైడర్స్ (7వ స్థానం).. ప్రస్తుతం జరుగుతున్న ఎంఎల్‌సీలో మరోసారి తమకెంతో అచ్చొచ్చిన ఆఖరి స్థానంలో (లాస్ ఏంజెలెస్ నైట్‌రైడర్స్) నిలిచి, లీగ్ దశలోనే పోటీ నుంచి నిష్క్రమించింది. సునీల్ నరైన్ సారధ్యంలో ఎంఎల్‌సీలో మొత్తం 5 మ్యాచ్‌లు ఆడిన నైట్‌రైడర్స్ వరుసగా నాలుగు మ్యాచ్‌ల్లో ఓటమిపాలై, టేబుల్ టాపర్ సియాటిల్ ఆర్కాస్‌తో జరిగిన ఆఖరి మ్యాచ్‌లో విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో కూడా నైట్‌రైడర్స్ అతికష్టం మీద నెగ్గింది. రిలీ రొస్సో (38 బంతుల్లో 78 నాటౌట్; 3 ఫోర్లు, 7 సిక్సర్లు) ఆకాశమే హద్దుగా చెలరేగడంతో నైట్‌రైడర్స్ ఈ మ్యాచ్‌లో గెలవగలిగింది. 6 జట్లు పాల్గొన్న ఎంఎల్సీ-2023 సీజన్‌ను ఆఖరి స్థానంతో ముగించింది. కాగా, నైట్‌రైడర్స్ గ్రూప్ ఆఫ్ ఫ్రాంచైజెస్ను బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్, నటి జూహి చావ్లా, వ్యాపారవేత్త జై మెహతా, రెడ్ చిల్లీస్ ఎంటర్టైన్మెంట్ సంయుక్తంగా నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. జట్టు నిండా విధ్వంసకర ఆటగాళ్లే, అయినా..! లీగ్ క్రికెట్లో నైట్‌రైడర్స్ ఫ్రాంచైజీల ప్రస్తానాన్ని గమనిస్తే, అన్ని జట్లలో ప్రపంచంలోని విధ్వంసకర ఆటగాళ్లు మెజారిటీ శాతం ఉన్నారు. కరీబియన్ ప్రీమియర్ లీగ్ దగ్గర నుంచి ప్రస్తుతం జరుగుతున్న మేజర్ లీగ్ క్రికెట్ వరకు అన్ని నైట్‌రైడర్స్ ఫ్రాంచైజీల్లో భారీ హిట్టర్లు ఉన్నారు. సీపీఎల్‌లో ట్రిన్‌బాగో నైట్‌రైడర్స్‌లో కీరన్ పోలార్డ్, మార్టిన్ గప్తిల్, సునీల్ నరైన్, నికోలస్ పూరన్, డ్వేన్ బ్రేవో, రిలీ రొస్సో, ఆండ్రీ రసెల్ ఉండగా.. ఐపీఎల్లో నితీశ్ రాణా, రింకూ సింగ్, జేసన్ రాయ్, వెంకటేశ్ అయ్యర్, ఆండ్రీ రసెల్, సునీల్ నరైన్, రహ్మానుల్లా గుర్భాజ్, జాన్సన్ చార్లెస్, శార్దూల్ ఠాకూర్ తదితరులు ఉన్నారు. ఇంటర్నేషనల్ టీ20 లీగ్ విషయానికొస్తే.. ఈ జట్టులో సునీల్ నరైన్, కొలిన్ ఇంగ్రామ్, బ్రాండన్ కింగ్, ఆండ్రీ రసెల్ లాంటి హార్డ్ హిట్టర్లు ఉండగా.. మేజర్ లీగ్ క్రికెట్లో జేసన్ రాయ్, రిలీ రొస్సో, మార్టిన్ గప్తిల్, ఆండ్రీ రసెల్, సునీల్ నరైన్ తదితరులు నైట్‌రైడర్స్ జట్టులో ఉన్నారు. ప్రతి నైట్‌రైడర్స్ ఫ్రాంచైజీలో ఈ స్థాయిలో మ్యాచ్ విన్నర్లు ఉన్నప్పటికీ ఈ ఫ్రాంచైజీ ఏ లీగ్‌లోనూ ఛాంపియన్ కాలేకపోతుంది. కనీసం టాప్ జట్లలో ఒకటిగా కూడా నిలువలేకపోతుంది. ఐపీఎల్లో రెండుసార్లు విజేతగా నిలిచిన నైట్‌రైడర్స్ ఆ తర్వాత ఏ లీగ్‌లోనూ ఆ స్థాయిలో రాణించలేకపోతుంది. దీంతో నైట్‌రైడర్స్ ఫ్యాన్స్ తెగ హర్టై పోతున్నారు. మరో పక్క ఇదే ఫ్రాంచైజీ క్రికెట్లో సూపర్ కింగ్స్ జట్లు మాత్రం దూసుకుపోతున్నాయి. ఈ లీగ్‌లో అయినా ఆ జట్టు మినిమం గ్యారెంటీగా మారింది. ప్రస్తుతం జరుగుతున్న ఎంఎల్‌సీలోనూ ఆ జట్టు ప్లే ఆఫ్స్‌కు అర్హత సాధించింది. -
శివాలెత్తిన రొస్సో.. నైట్ రైడర్స్ ఖాతాలో తొలి విజయం
మేజర్ లీగ్ క్రికెట్ సీజన్ 2023లో లాస్ ఏంజెలెస్ నైట్ రైడర్స్ తొలి విజయం నమోదు చేసింది. నిన్న (జులై 23) సీయాటిల్ ఆర్కాస్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆ జట్టు 2 వికెట్ల తేడాతో గెలుపొందింది. రిలీ రొస్సో (38 బంతుల్లో 78 నాటౌట్; 3 ఫోర్లు, 7 సిక్సర్లు) అజేయమైన మెరుపు హాఫ్ సెంచరీతో విరుచుకుపడి నైట్ రైడర్స్‌ను విజయతీరాలకు చేర్చాడు. రొస్సోకు ఆండ్రీ రసెల్ (29 బంతుల్లో 37; 4 ఫోర్లు, 2 సిక్సర్లు) సహకరించాడు. ఫలితంగా నైట్ రైడర్స్.. ఆర్కాస్ నిర్ధేశించిన 171 పరుగుల లక్ష్యాన్ని 8 వికెట్లు కోల్పోయి మరో 5 బంతులు మిగిలుండగానే ఛేదించింది. One of the innings of the tournament 👏 Rilee Rossouw wins the Player of the Match award for his impressive 7️⃣8️⃣* (3️⃣8️⃣)#MLC2023 pic.twitter.com/WQhNFWn3UH — Major League Cricket (@MLCricket) July 23, 2023 ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆర్కాస్.. షెహన్ జయసూర్య (45 బంతుల్లో 60 నాటౌట్; 7 ఫోర్లు, సిక్స్) అర్ధసెంచరీతో రాణించడంతో నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 170 పరుగులు చేసింది. స్టార్ బ్యాటర్ డికాక్ (10) విఫలం కాగా.. నౌమన్ అన్వర్ (32; 5 ఫోర్లు), క్లాసెన్ (13 బంతుల్లో 25; 3 ఫోర్లు, సిక్స్) పర్వాలేదనిపించాడు. నైట్ రైడర్స్ బౌలర్లలో ఆడమ్ జంపా 2 వికెట్లు పడగొట్టగా.. స్పెన్సర్ జాన్సన్, ఆండ్రీ రసెల్, వాన్ షాల్విక్, కెప్టెన్ సునీల్ నరైన్ తలో వికెట్ దక్కించుకున్నారు. అనంతరం 171 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన నైట్ రైడర్స్‌కు మంచి ఆరంభం లభించనప్పటికీ.. రొస్సో, రసెల్ ఆ జట్టును గెలిపించారు. 8 పరుగులకే 3 వికెట్లు కోల్పోయిన దశలో బరిలోకి దిగిన రొస్సో ఆఖరి వరకు క్రీజ్‌లో నిలబడి నైట్ రైడర్స్‌కు సీజన్ తొలి విజయాన్ని అందించాడు. నైట్ రైడర్స్ ఇన్నింగ్స్‌లో జేసన్ రాయ్ (2), జస్కరన్ మల్హోత్రా (2), గజానంద్ సింగ్ (3),సునీల్ నరైన్ (8) విఫలం కాగా.. సైఫ్ దర్బార్ (10), వాన్ షాల్విక్ (12), ఆడమ్ జంపా (12) రెండంకెల స్కోర్లు చేశారు. ఆర్కాస్ బౌలర్లలో కెమరాన్ గానన్ 3 వికెట్లతో రాణించగా.. ఆండ్రూ టై 2, ఇమాద్ వసీం, కెప్టెన్ వేన్ పార్నెల్, హర్మీత్ సింగ్ తలో వికెట్ పడగొట్టారు. -
'చిన్నా.. నేను క్రీజులో ఉన్నానంటే బంతిపై కన్నేసి ఉంచాలి'
మేజర్ క్రికెట్ లీగ్(MLC 2023)లో లాస్ ఏంజిల్స్ నైట్ రైడర్స్ ఇప్పటివరకు భోణీ చేయలేకపోయింది. ఆడిన నాలుగు మ్యాచ్‌ల్లోనూ పరాజయాలే చవిచూసిన నైట్‌రైడర్స్ జట్టు ఎప్పుడు గెలుపు బాట పడుతుందనేది ఆసక్తికరంగా మారింది. తాజాగా వాషింగ్టన్ ఫ్రీడమ్‌తో జరిగిన మ్యాచ్‌లో లాస్ ఏంజిల్స్ నైట్‌రైడర్స్ ఆరు వికెట్ల తేడాతో ఓటమిపాలయ్యింది. అయితే మ్యాచ్‌లో ఆల్‌రౌండర్ ఆండ్రీ రసెల్ మాత్రం సక్సెస్ అయ్యాడు. 37 బంతుల్లో ఆరు ఫోర్లు, ఆరు సిక్సర్లతో 70 పరుగులు నాటౌట్‌గా నిలిచాడు. తాను విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడిన బౌలింగ్ వైఫల్యంతో నైట్‌రైడర్స్ ఓటమి పాలైంది. ఈ సంగతి పక్కనబెడితే రసెల్ కొట్టిన సిక్సర్లలో ఒక బంతి పిల్లాడిని గాయపరిచింది. ఇన్నింగ్స్ 13వ ఓవర్లో అకీల్ హొసెన్ వేసిన రెండో బంతిని రసెల్ లాంగాఫ్ మీదుగా భారీ సిక్సర్ బాదాడు. స్టాండ్సలోకి వెళ్లిన బంతి నేరుగా పిల్లాడి తలకు తాకింది. దీంతో పిల్లాడు నొప్పితో విలవిల్లాడిపోయాడు. ఆ తర్వాత పిల్లాడి తండ్రి ఐస్ప్యాక్తో తలకు మర్దన చేస్తూ స్టేడియంలోకి వచ్చాడు. ఇది గమనించిన రసెల్ పిల్లాడి దగ్గరకు వచ్చి ఒక హగ్ ఇచ్చాడు. ఆ తర్వాత అతనికి సిగ్నేచర్ చేసిన బ్యాట్‌తో పాటు టోపీలు గిఫ్ట్‌గా ఇచ్చాడు. ఈ సందర్భంగా పిల్లాడికి రసెల్ ఒక సలహా కూడా ఇచ్చాడు.. చూడు చిన్న.. రసెల్ బ్యాటింగ్‌లో ఉన్నాడంటే బంతిపై కూడా ఒక కన్నేసి ఉంచు.. ఓకేనా అని తెలిపాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. తొలుత బ్యాటింగ్ చేసిన లాస్ ఏంజిల్స్ నైట్‌రైడర్స్ నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 175 పరుగులు చేసింది. రసెల్ 70 నాటౌట్, రిలీ రొసౌ 41 పరుగులు మినహా మిగతావారు పెద్దగా ఆకట్టుకోలేదు. ప్రత్యర్థి బౌలర్లలో హెన్రిక్స్ మూడు వికెట్లు పడగొట్టగా.. మార్కో జాన్సెన్ రెండు, నెత్రావల్కర్, అకిల్ హొసెన్‌లు చెరొక వికెట్ తీశారు. 176 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన వాషింగ్టన్ ఫ్రీడమ్ 18.1 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి టార్గెట్‌ను అందుకుంది. వాషింగ్టన్ ఇన్నింగ్స్‌లో అందరు బ్యాటర్లు సమిష్టిగా రాణించారు. ఓపెనర్లు మాథ్యూ స్కాట్(43 పరుగులు), ఆండ్రీస్ గౌస్(40 పరుగులు) చేయగా.. గ్లెన్ పిలిప్స్ 29, ఒబెస్ పియనర్ 26 పరుగులు నాటౌట్ జట్టును గెలిపించాడు. Dre Russ made sure to check on the kid who took a blow to his head from one of his sixes in Morrisville 💜 We’re glad the impact wasn’t too bad, and the li’l champ left with a smile and some mementos for a lifetime.#LAKR #LosAngeles #WeAreLAKR #MLC23 #AndreRussell @Russell12A… pic.twitter.com/EtLO5z2avx — Los Angeles Knight Riders (@LA_KnightRiders) July 22, 2023 చదవండి: IND vs WI: అశ్విన్‌తో అట్లుంటది మరి.. విండీస్ కెప్టెన్ ఫ్యూజ్‌లు ఔట్! వీడియో వైరల్ -
ప్రత్యర్థిని చితక్కొట్టినా తప్పని ఓటమి.. వరుసగా నాలుగోది
మేజర్ లీగ్ క్రికెట్(MLC 2023)లో లాస్ ఏంజిల్స్ నైట్ రైడర్స్ వైఫల్యాల పరంపర కొనసాగుతూనే ఉంది. లీగ్‌లో ఇప్పటివరకు ఆడిన నాలుగు మ్యాచ్‌ల్లోనూ ఓటమి చవిచూసిన నైట్ రైడర్స్ ఖాతా తెరవలేకపోతుంది. తాజాగా వాషింగ్టన్ ఫ్రీడమ్‌తో జరిగిన మ్యాచ్‌లో నైట్‌రైడర్స్ ఆరు వికెట్ల తేడాతో ఓటమి పాలయ్యింది. నైట్‌రైడర్స్ ఆల్‌రౌండర్ ఆండ్రీ రసెల్(37 బంతుల్లో 70 నాటౌట్, 6 ఫోర్లు, ఆరు సిక్సర్లు ) విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడినా జట్టును గెలిపించలేకపోయాడు. తొలుత బ్యాటింగ్ చేసిన లాస్ ఏంజిల్స్ నైట్‌రైడర్స్ నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 175 పరుగులు చేసింది. రసెల్ 70 నాటౌట్, రిలీ రొసౌ 41 పరుగులు మినహా మిగతావారు పెద్దగా ఆకట్టుకోలేదు. ప్రత్యర్థి బౌలర్లలో హెన్రిక్స్ మూడు వికెట్లు పడగొట్టగా.. మార్కో జాన్సెన్ రెండు, నెత్రావల్కర్, అకిల్ హొసెన్‌లు చెరొక వికెట్ తీశారు. 176 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన వాషింగ్టన్ ఫ్రీడమ్ 18.1 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి టార్గెట్‌ను అందుకుంది. వాషింగ్టన్ ఇన్నింగ్స్‌లో అందరు బ్యాటర్లు సమిష్టిగా రాణించారు. ఓపెనర్లు మాథ్యూ స్కాట్(43 పరుగులు), ఆండ్రీస్ గౌస్(40 పరుగులు) చేయగా.. గ్లెన్ పిలిప్స్ 29, ఒబెస్ పియనర్ 26 పరుగులు నాటౌట్ జట్టును గెలిపించాడు. నైట్‌రైడర్స్ బౌలర్లలో సునీల్ నరైన్, అలీ ఖాన్, స్పెన్సర్ జాన్సన్, ఆడమ్ జంపాలు తలా ఒక వికెట్ తీశారు. కాగా వాషింగ్టన్ ఫ్రీడమ్ ఆడిన మూడు మ్యాచ్‌ల్లో రెండు విజయాలతో పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో ఉండగా.. నైట్‌రైడర్స్ నాలుగు పరాజయాలతో ఆఖరి స్థానంలో ఉంది. THE DRE RUSS SHOW!🌟 What a WAY to bring up his FIFTY AND BEYOND!📈 1⃣4⃣5⃣/4⃣ (17.0) pic.twitter.com/EBPLKpQ13u — Major League Cricket (@MLCricket) July 20, 2023 And that closes the first game in Morrisville 😁 The Washington Freedom 🔵 🔴 score 2️⃣ points, ending the tournament for the LA Knight Riders who drop to 0-4 😔 #MLC2023 pic.twitter.com/sOKjJHdmkA — Major League Cricket (@MLCricket) July 21, 2023 A disappointing season for LAKR, but one man has shined bright ✨ throughout. Andre Russell picks up today's Player of the Match for his 7️⃣0️⃣* (3️⃣7️⃣)#MLC2023 pic.twitter.com/BU3ZCxbfdh — Major League Cricket (@MLCricket) July 21, 2023 చదవండి: దాయాదుల సమరం.. ఆసుపత్రి బెడ్లను కూడా వదలడం లేదు! Indian Football Team: ఫిఫా ర్యాంకింగ్స్.. టాప్-100లో భారత జట్టుకు చోటు -
మాథ్యూ వేడ్ వీరవిహారం.. రసెల్, నరైన్ మెరుపులు వృధా
మేజర్ లీగ్ క్రికెట్-2023 సీజన్లో భాగంగా లాస్ ఏంజెలెస్ నైట్ రైడర్స్‌తో ఇవాళ (జులై 19) జరిగిన మ్యాచ్‌లో శాన్ఫ్రాన్సిస్కో యునికార్న్స్ 21 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన యునికార్న్స్, నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 212 పరుగుల భారీ స్కోర్ చేసింది. ఓపెనర్ మాథ్యూ వేడ్ (41 బంతుల్లో 78; 7 ఫోర్లు, 5 సిక్సర్లు) బౌండరీలు, సిక్సర్లతో వీరవిహారం చేయగా.. మరో ఓపెనర్ ఫిన్ అలెన్ 2 సిక్సర్లు, బౌండరీతో 20 పరుగులు, స్టోయినిస్ 37 (18 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్సర్లు), కోరె ఆండర్సన్ 39 పరుగులు (20 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్సర్లు) చేశారు. కెప్టెన్ ఫించ్ 12 పరుగులతో (10 బంతుల్లో 2 ఫోర్లు) అజేయంగా నిలిచాడు. నైట్‌రైడర్స్ బౌలర్లలో ఆడమ్ జంపా 3 వికెట్లు పడగొట్టగా.. అలీ ఖాన్, ఆండ్రీ రసెల్, సునీల్ నరైన్ తలో వికెట్ దక్కించుకున్నారు. అనంతరం 213 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన నైట్‌రైడర్స్.. 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 191 పరుగులకే పరిమితమైంది. ఆరంభంలో జేసన్ రాయ్ (21 బంతుల్లో 45; 4 ఫోర్లు, 4 సిక్సర్లు), నితీశ్ కుమార్ (23 బంతుల్లో 31; 3 ఫోర్లు, సిక్స్).. ఆఖర్లో ఆండ్రీ రసెల్ (26 బంతుల్లో 42 నాటౌట్; 2 ఫోర్లు, 4 సిక్సర్లు), సునీల్ నరైన్ (17 బంతుల్లో 28 నాటౌట్; 3 సిక్సర్లు) రాణించినప్పటికీ నైట్‌రైడర్స్ విజయతీరాలకు చేరలేకపోయింది. నైట్ రైడర్స్ ఇన్నింగ్స్‌లో రిలీ రొస్సో (8) నిరాశపరిచాడు. యునికార్న్స్ బౌలర్లలో షాదాబ్ ఖాన్ 2 వికెట్లు పడగొట్టగా.. హరీస్ రౌఫ్, బిష్ణోయ్, ఆండర్సన్ తలో వికెట్ చేజిక్కించుకున్నారు. ఈ ఓటమితో నైట్‌రైడర్స్ లీగ్‌లో హ్యాట్రిక్ ఓటములను నమోదు చేసింది. కోల్‌కతా నైట్ రైడర్స్ అనుబంధ ఫ్రాంచైజీ అయిన లాస్ ఏంజెలెస్ నైట్ రైడర్స్ మేజర్ లీగ్ క్రికెట్ సీజన్ 2023లో ఇంకా బోణీ కొట్టాల్సి ఉంది. -
టీమిండియాతో టీ20 సిరీస్.. వెస్టిండీస్‌కు గుడ్ న్యూస్! విధ్వంసకర వీరుడు వచ్చేస్తున్నాడు
వెస్టిండీస్ విధ్వంసకర ఆల్‌రౌండర్ అండ్రీ రస్సెల్ గత కొంతకాలంగా జాతీయ జట్టుకు దూరంగా ఉంటున్న సంగతి తెలిసిందే. విండీస్ క్రికెట్ బోర్డుతో విభేదాల కారణంగానే రస్సెల్ జట్టుకు దూరంగా ఉంటున్నట్లు గతంలో వార్తలు వినిపించాయి. రస్సెల్ చివరగా యూఏఈ వేదికగా జరిగిన టీ20 ప్రపంచకప్ 2021లో విండీస్ తరపున ప్రాతినిధ్యం వహించాడు. అప్పటి నుంచి కరేబియన్ జట్టుకు కూడా కేవలం ఫ్రాంచైజీ లీగ్‌ల్లోనే ఆడుతూ వస్తున్నాడు. అయితే ప్రస్తుతం రస్సెల్ తన నిర్ణయం మార్చుకున్నాడు. మళ్లీ వెస్టిండీస్ జెర్సీని ధరించాలని అనుకుంటున్నట్లు రస్సెల్ తాజాగా ఇంటర్వ్యూలో తెలిపాడు. కాగా వెస్టిండీస్ క్రికెట్ జట్టు ప్రస్తుతం గడ్డు పరిస్ధితులను ఎదుర్కొంటుంది. వన్డే ప్రపంచకప్-2023 క్వాలిఫయర్స్‌లో నెదర్లాండ్, స్కాట్లాండ్ వంటి పసికూనల చేతిలో ఓటమి పాలైన విండీస్.. భారత్ వేదికగా జరగనున్న ప్రాధాన టోర్నీకి అర్హత సాధించలేకపోయింది. ఈ క్రమంలో రస్సెల్ వంటి ఆటగాళ్లు సేవలు కచ్చితంగా విండీస్ అవసరం. "నేను ఇకపై విండీస్ క్రికెట్‌కు అందుబాటులో ఉండనున్నాను. వచ్చే ఏడాది జరగనున్న టీ20 ప్రపంచకప్‌లో భాగం కావడమే నా లక్ష్యం. జట్టులోకి తిరిగి రావడానికి అన్ని విధాల సిద్దంగా ఉన్నాను. ప్రపంచకప్‌కు కంటే ముందు వైట్‌బాల్ సిరీస్‌లలో కూడా ఆడాలి అనుకుంటున్నాను. త్వరలో టీమిండియాతో జరగనున్న సిరీస్‌కు నాకు అవకాశం దక్కుతుందని భావిస్తున్నాను. అయితే విండీస్ తరపున నేను ఆడాలంటే రెండు ఫాంచైజీ లీగ్‌లకు దూరం కావాలి. నేను అలా చేయడానికి సిద్ధంగా ఉన్నాను. ప్రపంచకప్ వంటి ఈవెంట్లో అద్భుతంగా రాణించి నా జట్టుకు మరో టైటిల్‌ను అందించేందుకు అన్ని విధాల ప్రయత్నిస్తాను. నేను మా వైట్ బాల్ కోచ్ డారెన్ సామీతో టచ్‌లో ఉన్నాను. అతడు కూడా నా పట్ల పాజిటివ్ మైండ్‌తో ఉన్నాడని" జమైకా అబ్జర్వర్‌తో రస్సెల్ పేర్కొన్నాడు. కాగా టీమిండియాతో ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో విండీస్ తలపడనుంది. ట్రినిడాడ్ వేదికగా ఆగస్టు 3 నుంచి జరగనున్న తొలి మ్యాచ్‌తో ఈ సిరీస్ ప్రారంభం కానుంది. ఈ సిరీస్‌తో రస్సెల్ విండీస్ తరపున రీ ఎంట్రీ ఇచ్చే ఛాన్స్ ఉంది. చదవండి: #Ishan Kishan: ఇషాన్ కిషన్ గర్ల్‌ఫ్రెండ్‌ను చూశారా? ఆమె బ్యాగ్రౌండ్ తెలుసా? ఎంత అందంగా ఉందో -
మిల్లర్ కిల్లర్ ఇన్నింగ్స్.. రసెల్ పోరాటం వృధా.. బోణీ కొట్టిన సూపర్ కింగ్స్
అమెరికా వేదికగా జరుగుతున్న మేజర్ లీగ్ క్రికెట్ (ఎంఎల్సీ) తొలి సీజన్ నిన్నటి (జులై 13) నుంచి ప్రారంభమైంది. సీజన్ ఆరంభ మ్యాచ్‌లో టెక్సాస్ సూపర్ కింగ్స్.. లాస్ ఏంజెలెస్ నైట్ రైడర్స్‌పై విజయఢంకా మోగించింది. భారతకాలమానం ప్రకారం ఇవాళ ఉదయం ప్రారంభమైన మ్యాచ్‌లో సూపర్ కింగ్స్ 69 పరుగుల తేడాతో గెలుపొంది, ఎంఎల్సీ-2023లో బోణీ విజయం దక్కించుకుంది. మిల్లర్ కిల్లర్ ఇన్నింగ్స్.. కాన్వే సూపర్ ఫిఫ్టి.. బ్రేవో మెరుపులు ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి ప్రత్యర్ధి ఆహ్వానం మేరకు తొలుత బ్యాటింగ్ చేసిన సూపర్ కింగ్స్.. కాన్వే (37 బంతుల్లో 55; 7 ఫోర్లు, సిక్స్), డేవిడ్ మిల్లర్ (42 బంతుల్లో 61; 2 ఫోర్లు, 4 సిక్సర్లు) మెరుపు అర్ధసెంచరీలతో చెలరేగడంతో నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 181 పరుగులు చేసింది. ఆఖర్లో మిచెల్ సాంట్నర్ (14 బంతుల్లో 21; 2 సిక్సర్లు), డ్వేన్ బ్రేవో (6 బంతుల్లో 16 నాటౌట్; 2 సిక్సర్లు) మెరుపు ఇన్నింగ్స్‌లు ఆడారు. సూపర్ కింగ్స్ కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్ తానెదుర్కొన్న తొలి బంతికే ఔటయ్యాడు. నైట్‌రైడర్స్ బౌలరల్లో అలీ ఖాన్, లోకీ ఫెర్గూసన్ తలో 2 వికెట్లు.. సునీల్ నరైన్, ఆడమ్ జంపా చెరో వికెట్ దక్కించుకున్నారు. రసెల్ పోరాటం వృధా.. 182 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన నైట్ రైడర్స్.. సూపర్ కింగ్స్ బౌలర్ల ధాటికి 14 ఓవర్లలో 112 పరుగులకే కుప్పకూలింది. సూపర్ కింగ్స్ స్పిన్నర్ మొహమ్మద్ మొహిసిన్ (4/8) నైట్‌రైడర్స్ పతనాన్ని శాశించగా.. గెరాల్డ్ కొయెట్జీ, రస్టీ థెరన్ తలో 2 వికెట్లు, కాల్విన్ సావేజ్, డ్వేన్ బ్రేవో చెరో వికెట్ పడగొట్టారు. నైట్‌రైడర్స్ ఇన్నింగ్స్‌లో మిగతా బ్యాటర్లంతా పెవిలియన్‌కు క్యూ కడుతుంటే విండీస్ విధ్వంసర వీరుడు ఆండ్రీ రసెల్ (34 బంతుల్లో 55; 7 ఫోర్లు, 3 సిక్సర్లు) ఒక్కడే ఒంటరిపోరాటం చేశాడు. జస్కరన్ మల్హోత్రా (22), సునీల్ నరైన్ (15) రెండంకెల స్కోర్లు చేయగా.. మిగతావారంతా సింగిల్ డిజిట్‌కే పరిమితమయ్యారు. మార్టిన్ గప్తిల్ (0), ఉన్ముక్త్ చంద్ (4), రిలీ రొస్సో (4), జంపా (3), ఫెర్గూసన్ (1) నిరాశపరిచారు. కాగా, ఐపీఎల్ ఫ్రాంచైజీల యాజమాన్యాలే ఎంఎల్సీ జట్లను కూడా కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. చెన్నై సూపర్ కింగ్స్ యాజమాన్యం.. టెక్సాస్ సూపర్ కింగ్స్‌ను, కోల్‌కతా నైట్‌రైడర్స్ యాజమాన్యం.. లాస్ ఏంజెలెస్ నైట్‌రైడర్స్‌ను సొంతం చేసుకున్నాయి. లీగ్‌లో భాగంగా రేపు (భారతకాలమానం ప్రకారం) సీటిల్ ఓర్కాస్, వాషింగ్టన్ ఫ్రీడం జట్లు.. ముంబై ఇండియన్స్ న్యూయార్క్, శాన్ఫ్రాన్సిస్కో యూనికార్న్స్ జట్లు తలపడతాయి. -
'రింకూ లాంటి ఫినిషర్ ఉండగా.. టెన్షన్ ఎందుకు దండగ'
ఐపీఎల్ 16వ సీజన్లో సోమవారం కేకేఆర్, పంజాబ్ కింగ్స్ మ్యాచ్ మరో థ్రిల్లర్‌ను తలపించింది. ఆద్యంతం ఉత్కంఠగా సాగిన మ్యాచ్‌లో కేకేఆర్ ఆఖరి బంతికి విజయాన్ని అందుకొని ప్లేఆఫ్ చాన్స్‌ను మరింత పటిష్టం చేసుకుంది. అయితే కేకేఆర్ గెలుపులో ముఖ్య పాత్ర ఆండ్రీ రసెల్. కానీ ఆఖరి ఓవర్ ఐదో బంతికి రసెల్ రనౌట్ అవ్వడం కేకేఆర్‌కు బిగ్‌షాక్. కానీ చివరి బంతిని రింకూ సింగ్ బౌండరీ బాది జట్టును గెలిపించాడు. అయితే రసెల్ తాను రనౌట్ అవ్వడంపై బాధపడలేదంట. కేకేఆర్విజయంపై కాన్ఫిడెంట్‌గా ఉన్నట్లు మ్యాచ్ అనంతరం పేర్కొన్నాడు. అందుకు కారణం క్రీజులో ఉన్నది రింకూ సింగ్ అని పేర్కొన్నాడు. ''రింకూ సింగ్ స్థానంలో ఏ బ్యాటర్ ఉన్నా నేను చాన్స్ ఇచ్చేవాడిని కాదు.. కానీ రింకూపై నాకున్న నమ్మకం.. నేను రనౌట్ అయినప్పటికి పెద్దగా బాధపడలేదు. ఎందుకంటే రింకూ మ్యాచ్‌ను గెలిపిస్తాడని అప్పటికే ఊహించా. విన్నింగ్ షాట్ కొట్టే చాన్స్ అతనికే రావాలని అనుకున్నా. ఈ సీజన్లో రింకూ సింగ్ లాంటి ఫినిషర్ ఉండగా కేకేఆర్ భయపడనసరం లేదు. ఆఖరి ఓవర్‌కు ముందు రింకూ నన్ను ఒక ప్రశ్న అడిగాడు. ''ఒకవేళ బంతి నీకు పడితే పరుగు తీసేందుకు సిద్ధంగా ఉంటావా'' అని అడిగాడు. దానికి ''నేను కచ్చితంగా'' అని సమాధానం ఇచ్చాను. వాస్తవానికి నేను మ్యాచ్‌ను ఫినిష్ చేద్దామనుకున్నా. కానీ రింకూ లాంటి ఫినిషర్ ఉన్నప్పుడు అతనికే చాన్స్ ఇవ్వాలి. రనౌట్ అయిన ఒక్క క్షణం బాధపడ్డా.. నమ్మకం ఉన్నా ఆఖరి బంతికి రింకూ సింగ్ ఏం చేస్తాడోనని టెన్షన్‌కు లోనయ్యా. కానీ నా నమ్మకాన్ని రింకూ నిలబెట్టాడు'' అని నవ్వుతూ పేర్కొన్నాడు. చదవండి: అతడు అద్బుతంగా రాణిస్తున్నాడు.. టీమిండియా రీ ఎంట్రీ పక్కా! Happiness is mutual, 𝙍𝙪𝙨𝙨𝙚𝙡𝙡 𝙙𝙖 🤗#KKRvPBKS | #AmiKKR | #TATAIPL | @Russell12A pic.twitter.com/bqflnzcw7e— KolkataKnightRiders (@KKRiders) May 9, 2023 Just Rinku doing Rinku things & his happy captain interviewing the best finisher in the side 💜🤗 Presenting Rana & Rinku from the Eden Gardens as they sum up @KKRiders' riveting chase 🔥🔥 - By @28anand Full Interview 🎥🔽 #TATAIPL | #KKRvPBKS https://t.co/hsTzGeCY4b pic.twitter.com/c304XQnylR — IndianPremierLeague (@IPL) May 9, 2023 -
PBKS VS KKR: మొన్న ఫిలిప్స్.. నిన్న రసెల్
ఐపీఎల్ 2023లో మరో మ్యాచ్ ఆఖరి బంతి వరకు ఉత్కంఠభరితంగా సాగింది. పంజాబ్ కింగ్స్‌తో నిన్న (మే 8) జరిగిన మ్యాచ్‌లో కేకేఆర్ చివరి బంతికి విజయం సాధించి, ప్లే ఆఫ్స్ ఆశలను సజీవంగా ఉంచుకుంది. ఈ సీజన్లో ఆఖరి బంతివరకు సాగిన మ్యాచ్‌ల్లో (6) ఇది వరుసగా రెండవది. మ్యాచ్ విషయానికొస్తే.. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్.. కెప్టెన్ శిఖర్ ధవన్ (47 బంతుల్లో 57; 9 ఫోర్లు,సిక్స్), ఆఖర్లో షారుక్ ఖాన్ (8 బంతుల్లో 21 నాటౌట్; 3 ఫోర్లు, సిక్స్) రాణించడంతో నిర్ణీత ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 179 పరుగులు చేసింది. ప్రభ్‌సిమ్రన్ (8 బంతుల్లో 12), లివింగ్‌స్టోన్ (9 బంతుల్లో 15), జితేశ్ శర్మ (18 బంతుల్లో 21), రిషి ధవన్ (11 బంతుల్లో 19), హర్‌ప్రీత్ బ్రార్ (9 బంతుల్లో 17 నాటౌట్) రెండంకెల స్కోర్లు చేయగా.. భానుక రాజపక్ష (0), సామ్ కర్రన్ (9 బంతుల్లో 4) విఫలమయ్యారు. కేకేఆర్ బౌలర్లలో వరుణ్ చక్రవర్తి 3, హర్షిత్ రాణా 2, సుయాశ్ శర్మ, నితీశ్ రాణా తలో వికెట్ పడగొట్టారు. అనంతరం కష్టసాధ్యం కాని లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన కేకేఆర్.. జేసన్ రాయ్ (24 బంతుల్లో 38; 8 ఫోర్లు), నితీశ్ రాణా (38 బంతుల్లో 51; ఫోర్, సిక్స్), ఆండ్రీ రసెల్ (23 బంతుల్లో 42; 3 ఫోర్లు, 3 సిక్సర్లు), రింకూ సింగ్ 10 బంతుల్లో 21 నాటౌట్; 2 ఫోర్లు, సిక్స్) రాణించడంతో 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. రహ్మానుల్లా గుర్భాజ్ (15), వెంకటేశ్ అయ్యర్ (11) రెండంకెల స్కోర్ చేశారు. పంజాబ్ బౌలర్లలో రాహుల్ చాహర్ 2, నాథన్ ఇల్లిస్, హర్‌ప్రీత్ బ్రార్ తలో వికెట్ పడగొట్టారు. మొన్న ఫిలిప్స్.. నిన్న రసెల్. ఛేదనలో కేకేఆర్ ఆరంభంలో దూకుడుగానే ఆడినప్పటికీ మధ్యలో స్కోర్ కాస్త నెమ్మదించడంతో మ్యాచ్ ఆఖరి బంతి వరకు సాగింది. మొన్న రాజస్థాన్‌తో మ్యాచ్‌లో ఎస్ఆర్హెచ్ ఆటగాళ్లు గ్లెన్ ఫిలిప్స్, అబ్దుల్ సమద్‌లు ఏ పాత్ర అయితే పోషించారో.. నిన్నటి మ్యాచ్‌లో కేకేఆర్ ప్లేయర్స్ రసెల్, రింకూ సింగ్ కూడా అదే పాత్ర పోషించారు. క్లిష్ట సమయంలో ఫిలిప్స్ మెరుపు ఇన్నింగ్స్ (7 బంతుల్లో 25; ఫోర్, 3 సిక్సర్లు) ఆడి గెలుపుపై ఆశలు లేని ఎస్ఆర్హెచ్ను గేమ్‌లోకి తేగా.. ఆఖరి బంతికి అబ్దుల్ సమద్ (7 బంతుల్లో 17 నాటౌట్; 2 ఫోర్లు) సిక్సర్ బాది గెలిపించాడు. ఇంచుమించు అలాగే పంజాబ్‌తో మ్యాచ్‌లో రసెల్ విధ్వంసకర ఇన్నింగ్స్‌తో కేకేఆర్‌ను గెలుపు ట్రాక్‌లో పెడితే, రింకూ సింగ్ ఆఖరి బంతికి బౌండరీ బాది మ్యాచ్‌ను లాంఛనంగా ముగించాడు. రాజస్థాన్‌తో మ్యాచ్‌లో ఫిలిప్స్ తరహాలోనే నిన్నటి మ్యాచ్‌లో రసెల్ కూడా 19వ ఓవర్లో శివాలెత్తిపోయాడు. ఆ మ్యాచ్‌లో ఫిలిప్స్.. కుల్దీప్ బౌలింగ్‌లో 3 సిక్సర్లు, ఓ ఫోర్ బాదితే.. నిన్నటి మ్యాచ్‌లో సామ్ కర్రన్ బౌలింగ్‌లో రసెల్ 3 సిక్సర్లతో విరుచుకుపడి, మ్యాచ్‌ను మలుపు తిప్పాడు. ఫిలిప్స్, రసెల్ సుడిగాలి ఇన్నింగ్స్‌లు ఆడకపోయుంటే రెండు మ్యాచ్‌ల్లో ప్రత్యర్ధులు గెలిచేవారు. అలాగే సన్‌రైజర్స్, కేకేఆర్ ప్లే ఆఫ్స్ రేసు నుంచి నిష్క్రమించేవి. చదవండి: ఐపీఎల్లో ధావన్ అరుదైన రికార్డు.. కోహ్లి, వార్నర్ సరసన -
IPL 2023: రసెల్ ధమాకా...
కోల్‌కతా: ఆండ్రీ రసెల్ (23 బంతుల్లో 42; 3 ఫోర్లు, 3 సిక్సర్లు) అడుగంటిన కోల్‌కతా ఆశలకు సిక్సర్లతో జీవం పోశాడు. మళ్లీ ఆఖరి ఓవర్ డ్రామా కనిపించినా... నైట్‌రైడర్స్ 5 వికెట్ల తేడాతో పంజాబ్ కింగ్స్‌ను ఓడించింది. మొదట పంజాబ్ కింగ్స్ 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 179 పరుగులు చేసింది. ధావన్ (47 బంతుల్లో 57; 9 ఫోర్లు, 1 సిక్స్) రాణించాడు. అనంతరం కోల్‌కతా 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 182 పరుగులు చేసి గెలిచింది. నితీశ్ రాణా (38 బంతుల్లో 51; 6 ఫోర్లు, 1 సిక్స్) అర్ధసెంచరీ సాధించాడు. ధావన్ ఫిఫ్టీతో... కోల్‌కతా పవర్‌ప్లేలోనే ఓపెనర్ ప్రభ్‌సిమ్రన్ (12), రాజపక్స (0) వికెట్లను కోల్పోయింది. వీరిద్దరిని హర్షిత్ రాణా పెవిలియన్ చేర్చాడు. ఈ దశలో మిగతా జట్టు సభ్యుల నుంచి సహకారం కరువైనా... శిఖర్ ధావన్ జట్టును నడిపించాడు. లివింగ్‌స్టోన్ (9 బంతుల్లో 15; 3 ఫోర్లు), జితేశ్ శర్మ (18 బంతుల్లో 21; 2 సిక్సర్లు) తక్కువే చేసినా... ధావన్ (41 బంతుల్లో) ఫిఫ్టీతో జట్టు స్కోరు 100 పరుగులు దాటింది. జితేశ్, ధావన్ నాలుగో వికెట్‌కు 53 పరుగులు జోడించారు. పరుగుల వేగం పెరగాల్సిన దశలో స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి స్పిన్‌కు పంజాబ్ డీలా పడింది. 106/3 స్కోరు వద్ద పటిష్టంగా కనిపించిన జట్టు స్వల్ప వ్యవధిలో 4 వికెట్లను కోల్పోయింది. స్యామ్ కరన్ (4), రిషి ధావన్ (11 బంతుల్లో 19; 3 ఫోర్లు, 1 సిక్స్) పెద్దగా ఆకట్టుకోలేదు. ఇలాంటిస్థితిలో షారుఖ్ (8 బంతుల్లో 21 నాటౌట్, 3 ఫోర్లు, 1 సిక్స్), హర్‌ప్రీత్ బ్రార్ ( 9 బంతుల్లో 17 నాటౌట్; 2 ఫోర్లు, 1 సిక్స్) ధాటితో ఆఖరి 16 బంతుల్లో 40 పరుగులు చేయగలిగింది. కెప్టెన్ ఇన్నింగ్స్... జేసన్ రాయ్ (24 బంతుల్లో 38; 8 ఫోర్లు) బౌండరీలతో కోల్‌కతా ఇన్నింగ్స్ వేగంగా సాగింది. అయితే గుర్బాజ్ (12 బంతుల్లో 15; 1 ఫోర్, 1 సిక్స్) వికెట్ పారేసుకోగా... కోల్‌కతా ఇన్నింగ్స్ కూడా కెప్టెన్ నితీశ్ రాణా అర్ధసెంచరీతోనే నడించింది. రాయ్ దూకుడుకు హర్‌ప్రీత్ బ్రేకులేయగా, నితీశ్... వెంకటేశ్ (11)తో కలిసి జట్టు స్కోరును వంద పరుగులు దాటింది. మధ్యలో పంజాబ్ కట్టుదిట్టమైన బౌలింగ్‌తో పరుగుల వేగం తగ్గింది. 16వ ఓవర్లో రాణా అవుటయ్యాక ఒత్తిడి పెరిగింది. 12 బంతుల్లో 26 పరుగుల సమీకరణం ఇరు జట్లకూ అవకాశమిచ్చింది. కానీ స్యామ్ కరన్ వేసిన ఇన్నింగ్స్ 19వ ఓవర్లో రసెల్ 3 భారీ సిక్సర్లతో 20 పరుగులొచ్చాయి. దీంతో 6 బంతుల్లో 6 పరుగుల సమీకరణం కోల్కతావైపే మొగ్గింది. అయితే 2 పరుగుల దూరంలో ఐదో బంతికి రసెల్ రనౌట్ కావడంతో కాస్త ఉత్కంఠ రేకెత్తించినా... అర్‡్ష దీప్ వేసిన చివరి బంతిని రింకూ సింగ్ (10 బంతుల్లో 21 నాటౌట్; 2 ఫోర్లు, 1 సిక్స్) బౌండరీకి తరలించి గెలిపించాడు. స్కోరు వివరాలు పంజాబ్ కింగ్స్ ఇన్నింగ్స్: ప్రభ్సిమ్రాన్ (సి) గుర్బాజ్ (బి) హర్షిత్ 12; ధావన్ (సి) వైభవ్ (బి) నితీశ్ రాణా 57; రాజపక్స (సి) గుర్బాజ్ (బి) హర్షిత్ 0; లివింగ్‌స్టోన్ (ఎల్బీడబ్ల్యూ) (బి) వరుణ్ 15; జితేశ్ (సి) గుర్బాజ్ (బి) వరుణ్ 21; స్యామ్ కరన్ (సి) గుర్బాజ్ (బి) సుయశ్ 4; రిషి ధావన్ (బి) వరుణ్ 19; షారుఖ్ (నాటౌట్) 21; హర్‌ప్రీత్ బ్రార్ (నాటౌట్) 17; ఎక్స్‌ట్రాలు 13; మొత్తం (20 ఓవర్లలో 7 వికెట్లకు) 179. వికెట్ల పతనం: 1–21, 2–29, 3–53, 4–106, 5–119, 6–139, 7–139. బౌలింగ్: వైభవ్ 3–0–32–0, హర్షిత్ 3–0–33–2, రసెల్ 1–0–19–0, వరుణ్ 4–0–26–3, సుయశ్ 4–0–26–1, నరైన్ 4–0–29–0, నితీశ్ రాణా 1–0–7–1. కోల్‌కతా నైట్‌రైడర్స్ ఇన్నింగ్స్: జేసన్ రాయ్ (సి) షారుఖ్ (బి) హర్‌ప్రీత్ 38; గుర్బాజ్ (ఎల్బీడబ్ల్యూ) (బి) ఎలిస్ 15; నితీశ్ రాణా (సి) లివింగ్‌స్టోన్ (బి) చహర్ 51; వెంకటేశ్ (సి) లివింగ్‌స్టోన్ (బి) చహర్ 11; రసెల్ (రనౌట్) 42; రింకూ సింగ్ (నాటౌట్) 21; శార్దుల్ (నాటౌట్) 0; ఎక్స్‌ట్రాలు 4; మొత్తం (20 ఓవర్లలో 5 వికెట్లకు) 182. వికెట్ల పతనం: 1–38, 2–64, 3–115, 4–124, 5–178. బౌలింగ్: రిషి ధావన్ 2–0–15–0, అర్‡్షదీప్ సింగ్ 4–0–39–0, ఎలిస్ 4–0–29–1, స్యామ్ కరన్ 3–0–44–0, లివింగ్‌స్టోన్ 2–0–27–0, హర్‌ప్రీత్ 1–0–4–1, రాహుల్ చహర్ 4–0–23–2. -
ఉత్తమ కెప్టెన్‌గా రోహిత్.. కోహ్లి, బుమ్రాలకు అవార్డులు, ధోనికి మొండిచెయ్యి
తొట్ట తొలి ఐపీఎల్ వేలం (2008 ఫిబ్రవరి 20) జరిగి 15 సంవత్సరాలు పూర్తి అయిన సందర్భంగా స్టార్ స్పోర్ట్స్ సంస్థ.. ఈఎస్పీఎన్ క్రిక్ ఇన్ఫో భాగస్వామ్యంలో ఐపీఎల్ ఇన్క్రెడిబుల్ అవార్డులను అనౌన్స్ చేసింది. మొత్తం ఆరు విభాగాల్లో విజేతలను ప్రకటించిన స్టార్ స్పోర్ట్స్-ఈఎస్పీఎన్ క్రిక్ ఇన్ఫో.. ఐపీఎల్ చరిత్రలో ఉత్తమ కెప్టెన్‌గా ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మను ఎంపిక చేసింది. రోహిత్ 2013-22 మధ్యలో ముంబై ఇండియన్స్‌ను 5 సార్లు ఛాంపియన్‌గా నిలిపినందున అతన్ని ఈ ప్రతిష్టాత్మక అవార్డుకు ఎంపిక చేసినట్లు స్టార్ స్పోర్ట్స్-ఈఎస్పీఎన్ క్రిక్ ఇన్ఫో సంయుక్త ప్రకటన చేశాయి. కెప్టెన్‌గా రోహిత్ 143 మ్యాచ్‌ల్లో 56.64 విన్నింగ్ పర్సంటేజ్‌తో 79 సార్లు ముంబై ఇండియన్స్‌ను విజేతగా నిలిపాడు. ఈ విభాగంలో గౌతమ్ గంభీర్, ఎంఎస్ ధోని, లేట్ షేన్ వార్న్ నామినేట్ అయినప్పటికీ హిట్‌మ్యాన్‌నే అవార్డు వరించింది. ఉత్తమ బ్యాటర్ కేటగిరి విషయానికొస్తే.. ఈ విభాగంలో ఏబీ డివిలియర్స్, క్రిస్ గేల్, డేవిడ్ వార్నర్, సురేశ్ రైనా నామినేట్ కాగా.. ఏబీడీని అవార్డు వరించింది. మిప్టర్ 360 డిగ్రీస్ ప్లేయర్.. 2008-21 మధ్యకాలంలో 184 మ్యాచ్‌ల్లో 3 సెంచరీలు, 40 హాఫ్ సెంచరీల సాయంతో 39.71 సగటున 5162 పరుగులు చేశాడు. ఏబీడీ.. 2016 సీజన్లో ఆర్సీబీ తరఫున 168.97 స్ట్రయిక్ రేట్‌తో 687 పరుగులు చేసి ఔరా అనిపించాడు. ఓ సీజన్లో ఉత్తమ బ్యాటింగ్ కేటగిరిలో విరాట్ కోహ్లి, క్రిస్ గేల్, డేవిడ్ వార్నర్, జోస్ బట్లర్ పోటీ పడగా.. కోహ్లి విజేతగా నిలిచాడు. కోహ్లి.. 2016 సీజన్లో ఆస్సీబీ తరఫున 152.03 స్ట్రయిక్ రేట్‌తో 973 పరుగులు సాధించాడు. ఐపీఎల్ మొత్తంలో ప్రభావవంతమైన క్రికెటర్ కేటగిరిలో సునీల్ నరైన్, ఆండ్రీ రసెల్, షేన్ వాట్సన్, రషీద్ ఖాన్ నామినేట్ కాగా.. ఈ అవార్డు ఆండ్రీ రసెల్‌ను వరించింది. ఉత్తమ బౌలర్ కేటగిరిలో రషీద్ ఖాన్, జస్ప్రీత్ బుమ్రా, సునీల్ నరైన్, యుజ్వేంద్ర చహల్ నామినేట్ కాగా.. బుమ్రా విజేతగా నిలిచాడు. ఐపీఎల్ సీజన్లో ఉత్తమ ప్రదర్శన కేటగిరి విషయానికొస్తే.. ఈ విభాగంలో సునీల్ నరైన్ (2012), రషీద్ ఖాన్ (2018), జోఫ్రా ఆర్చర్ (2020), యుజ్వేంద్ర చహల్ (2022) నామినేట్ కాగా.. చహల్‌ను ఈ అవార్డు వరించింది. -
హ్యాట్రిక్ వృధా.. అర డజన్ సిక్సర్లు కొట్టి గెలిపించిన రసెల్
బిగ్‌బాష్ లీగ్ 2022-23 సీజన్లో భాగంగా మెల్బోర్న్ రెనగేడ్స్, బ్రిస్బేన్ హీట్ జట్లు ఇవాళ (డిసెంబర్ 21) తలపడ్డాయి. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన బ్రిస్బేన్ హీట్.. టామ్ రోజర్స్ (4/23), అకీల్ హొసేన్ (3/26) ముజీబ్ ఉర్ రెహ్మాన్ (1/18) ధాటికి నిర్ణీత ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 137 పరుగులు మాత్రమే చేయగలిగింది. బ్రిస్బేన్ ఇన్నింగ్స్‌లో మ్యాట్ రెన్షా (29), సామ్ బిల్లింగ్స్ (25), పీయర్సన్ (45) మాత్రమే రెండంకెల స్కోర్ చేశారు. అనంతరం 139 పరుగుల సాధారణ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన మెల్బోర్న్ టీమ్‌ను ఫాస్ట్ బౌలర్ మైఖేల్ నెసర్ హ్యాట్రిక్ వికెట్లు పడగొట్టి (4/32) భయపెట్టాడు. తొలి ఓవర్ తొలి బంతికే వికెట్ పడగొట్టిన నెసర్.. అదే ఓవర్ ఆఖరి బంతికి మరో వికెట్‌ను, ఆతర్వాత మూడో ఓవర్ తొలి రెండు బంతులకు వికెట్లు పడగొట్టి తమ జట్టు విజయానికి గట్టి పునాది వేశాడు. నెసర్ ధాటికి మెల్బోర్న్ 2.2 ఓవర్లలో కేవలం 9 పరుగులు మాత్రమే చేసి 4 వికెట్లు కోల్పోయింది. Just admiring this shot 😍 pic.twitter.com/G6ljSi7q2J — Melbourne Renegades (@RenegadesBBL) December 21, 2022 అయితే ఆరో స్థానంలో బరిలోకి దిగిన విండీస్ విధ్వంసకర యోధుడు ఆండ్రీ రసెల్ (42 బంతుల్లో 57; 2 ఫోర్లు, 6 సిక్సర్లు).. ఆరోన్ ఫించ్ (43 బంతుల్లో 31 నాటౌట్; 2 ఫోర్లు, సిక్స్), అకీల్ హొసేన్ (19 బంతుల్లో 30; 2 ఫోర్లు, 2 సిక్సర్లు) సహకారంతో మ్యాచ్ స్వరూపాన్నే మార్చేశాడు. అర డజన్ సిక్సర్లతో విరుచుకుపడిన రసెల్ ప్రత్యర్ధి చేతుల్లో నుంచి మ్యాచ్‌ను లాగేసుకుని మెల్బోర్న్ రెనెగేడ్స్‌ను 4 వికెట్ల తేడాతో గెలిపించాడు. రసెల్ మెరుపు ఇన్నింగ్స్ హవాలో నెసర్ హ్యాట్రిక్ వృధా అయిపోయింది. బ్రిస్బేన్ బౌలర్లలో నెసర్తో పాటు మార్క్ స్టీకీట్ (2/23) వికెట్లు దక్కించుకున్నాడు. జేమ్స్ బాజ్లే బౌలింగ్‌లో రసెల్ కొట్టిన 103 మీటర్ల సిక్సర్ మ్యాచ్ మొత్తానికే హైలైట్‌గా నిలిచింది. కాగా, బిగ్‌బాష్ లీగ్‌లో మెల్బోర్న్ రెనగేడ్స్ జట్టు 1400 రోజుల తర్వాత వరుసగా 3 మ్యాచ్‌ల్లో గెలుపొందడం విశేషం. -
'నీకేం పోయే కాలం'.. రసెల్‌పై అభిమానుల ఆగ్రహం
వెస్టిండీస్ విధ్వంసకర ఆల్‌రౌండర్ ఆండ్రీ రసెల్‌పై అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒంటిపై దుస్తులు లేకుండా ఫోటో దిగిన రసెల్ దానిని ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టడం ఆగ్రహాం తెప్పించింది. ప్రైవేట్ లీగ్స్ మోజులో పడి దేశానికి ఆడడం మానేసిన రసెల్‌పై.. ''నీకేం పోయే కాలం.. ఈ సోకులకేం తక్కువ లేదు.. ఇలాంటి వాటిలో కాదు ఆటలో చూపించు నీ ప్రతాపం'' అంటూ మండిపడ్డారు. కాగా భారత అభిమానులు మాత్రం రసెల్‌ను దారుణంగా ట్రోల్ చేశారు. రసెల్ దిగిన న్యూడ్ ఫోటోనూ చాలామంది రణ్వీర్ సింగ్ ఫోటోతో పోలుస్తున్నారు కొన్ని నెలల క్రితం బాలీవుడ్ స్టార్ రణ్వీర్ సింగ్ ఒక మ్యాగ్జైన్ కోసం ఒంటిపై నూలు పోగు లేకుండా నగ్నంగా ఫోటోషూడ్ ఇచ్చాడు. అప్పట్లో రణ్వీర్ ఫోటోషూట్‌పై పెద్ద వివాదామే నడిచింది. తాజాగా రసెల్‌ను కూడా రణ్వీర్తో పోలుస్తూ కామెంట్స్ చేశారు. ఇక రసెల్ విండీస్ తరపున ఆడి చాలా కాలమైపోయింది. విండీస్ క్రికెట్ బోర్డు సీఈవోతో గొడవ రసెల్‌ను జాతీయ జట్టుకు దూరం చేసింది. గతేడాది టి20 ప్రపంచకప్‌లో చివరి మ్యాచ్ ఆడిన రసెల్ మళ్లీ జాతీయ జట్టు గడప తొక్కలేదు. ఇక ఈ ఏడాది టి20 ప్రపంచకప్‌లో వెస్టిండీస్ ఘోర ప్రదర్శన కనబరిచింది. కనీసం క్వాలిఫయర్ దశ కూడా దాటలేయపోయిన విండీస్ అవమానకర రీతిలో నిష్క్రమించింది. ఇక రసెల్ విండీస్ తరపున 56 వన్డేలు, 67 టి20మ్యాచ్‌లు ఆడాడు. ఇక ఇటీవలే ఐపీఎల్లో కేకేఆర్ ఆండ్రీ రసెల్‌ను రిటైన్ చేసుకున్న సంగతి తెలిసిందే. ఐపీఎల్-2023 మినీవేలంకు ముందు కేకేఆర్ 11 మంది ఆటగాళ్లను రిటైన్ చేసుకుంది. అదే విధంగా 16 మందిని వేలంలోకి విడిచిపెట్టింది. ప్రస్తుతం కోల్‌కతా పర్స్‌లో రూ. 7.5 కోట్లు ఉన్నాయి. కేకేఆర్ రిటైన్ లిస్ట్: శ్రేయాస్ అయ్యర్ (కెప్టెన్), నితీష్ రానా, వెంకటేష్ అయ్యర్, ఆండ్రీ రస్సెల్, సునీల్ నరైన్, ఉమేష్ యాదవ్, టిమ్ సౌథీ, హర్షిత్ రానా, వరుణ్ చక్రవర్తి, అనుకుల్ రాయ్, రింకూ సింగ్ కేకేఆర్ రిలీజ్ లిస్ట్: పాట్ కమిన్స్, సామ్ బిల్లింగ్స్, అమన్ ఖాన్, శివమ్ మావి, మహ్మద్ నబీ, చమికా కరుణరత్నే, ఆరోన్ ఫించ్, అలెక్స్ హేల్స్, అభిజీత్ తోమర్, అజింక్య రహానే, అశోక్ శర్మ, బాబా ఇంద్రజిత్, ప్రథమ్ సింగ్, రమేష్ కుమార్, రసిఖ్ సలామ్, షెల్డన్ జాక్సన్ pic.twitter.com/TXsXnEC0Zy — Out Of Context Cricket (@GemsOfCricket) November 18, 2022 pic.twitter.com/TXsXnEC0Zy — Out Of Context Cricket (@GemsOfCricket) November 18, 2022 pic.twitter.com/TXsXnEC0Zy — Out Of Context Cricket (@GemsOfCricket) November 18, 2022 wtf?! 😭😭😭 — fahad. (@abeeyaaar) November 18, 2022 చదవండి: సెలెక్టర్ల కథ ముగించారు.. రోహిత్ శర్మను ఎప్పుడు? -
T20 WC 2022: అందుకే రసెల్‌ను ఎంపిక చేయలేదు: విండీస్ చీఫ్ సెలక్టర్
T20 World Cup 2022 - West Indies Squad: టీ20 ప్రపంచకప్-2022 జట్టులో ఆల్‌రౌండర్ ఆండ్రీ రసెల్‌కు చోటు దక్కకపోవడంపై వెస్టిండీస్ చీఫ్ సెలక్టర్ డెస్మాండ్ హేన్స్ స్పందించాడు. పొట్టి ఫార్మాట్లో రసెల్ ప్రదర్శన గొప్పగా లేదని.. అందుకే అతడిని పక్కనపెట్టినట్లు వెల్లడించాడు. ఆస్ట్రేలియా వేదికగా అక్టోబరు 16 నుంచి నవంబరు 13 వరకు టీ20 వరల్డ్‌కప్ టోర్నీ జరుగనున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో విండీస్ క్రికెట్ బోర్డు 15 మంది సభ్యులతో కూడిన జట్టును గురువారం ప్రకటించింది. ఇందులో రసెల్‌కు చోటు దక్కలేదు. వెటరన్ పవర్ హిట్టర్ ఎవిన్ లూయిస్ మాత్రం చాలా రోజుల తర్వాత జట్టులోకి వచ్చాడు. అందుకే అతడిని సెలక్ట్ చేయలేదు! ఈ నేపథ్యంలో చీఫ్ సెలక్టర్ డెస్మాండ్ హైన్స్ మాట్లాడుతూ.. రసెల్‌ను పక్కనపెట్టడానికి గల కారణాలు వెల్లడించాడు. ‘‘ఈ ఏడాది ఆరంభంలో మేము ఆండ్రీ రసెల్‌తో సమావేశమయ్యాం. అతడి ఆట తీరు బాగా లేదు. గత కొన్నాళ్లుగా చూస్తున్నాం. రసెల్ ప్రదర్శనతో మేము సంతృప్తి చెందలేదు. కాబట్టి రసెల్‌ను పక్కనపెట్టాలని నిర్ణయించుకున్నాం. అతడి స్థానంలో ఫామ్‌లో ఉన్న ఆటగాడిని.. ముఖ్యంగా టీ20 ఫార్మాట్లో బాగా ఆడుతున్న క్రికెటర్‌ను ఎంపిక చేయాలని భావించాం’’ అని డెస్మాండ్ పేర్కొన్నాడు. అలాంటి వాళ్లకు అవకాశం! ఇక ఎవిన్ లూయిస్ గురించి చెబుతూ.. ‘‘విండీస్ అత్యుత్తమ వన్డే క్రికెటర్ ఎవిన్ లూయిస్ వంటి ఆటగాడి అవసరం జట్టుకు ఉంది. జట్టు కోసం తాను కష్టపడతానని అతడు మాతో చెప్పాడు. అందుకే ఒక అవకాశం ఇవ్వాలని భావించాం. అతడు మాతో మాట్లాడిన తీరు.. జట్టులో తన అవసరం ఏమిటో వివరించిన విధానం నచ్చింది.. ఇలా జట్టు ప్రయోజనాల గురించి ఆలోచించే ఆటగాళ్లకు తప్పక అవకాశం ఇస్తాం’’ అని డెస్మాండ్ పేర్కొన్నాడు. కాగా గతేడాది టీ20 వరల్డ్‌కప్ తర్వాత రసెల్ ఇంత వరకు విండీస్ తరఫున ఆడలేదు. రసెల్ విఫలం! ప్రస్తుతం కరేబియన్ ప్రీమియర్ లీగ్-2022లో ట్రింబాగో నైట్ రైడర్స్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్న రసెల్.. తన స్థాయికి తగ్గట్లు ఆడలేకపోతున్నాడు. సింగిల్ డిజిట్ స్కోర్లకే పరిమితమవుతున్నాడు. చెప్పుకోదగ్గ స్థాయిలో వికెట్లు కూడా పడగొట్టలేకపోతున్నాడు. ఇదిలా ఉంటే.. విండీస్ క్రికెట్ హెడ్‌కోచ్ ఫిల్ సిమ్మన్స్.. డబ్బుపై మోజుతో కొందరు కేవలం ప్రైవేట్ లీగ్‌లలోనే ఎక్కువగా ఆడుతున్నారని వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. ఈ విషయంపై స్పందించిన రసెల్.. కొంతమంది తనను కావాలనే బలిపశువును చేయాలని చూస్తున్నారని పేర్కొన్నాడు. ఇక ఇప్పుడు చీఫ్ సెలక్టర్ సైతం రసెల్‌ను ఉద్దేశించి అతడి ప్రదర్శన బాగా లేదంటూ వ్యాఖ్యానించడం గమనార్హం. కాగా విండీస్ జట్టు టీ20 ప్రపంచకప్-2022 సూపర్-12కు క్వాలిఫై కాలేదన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో క్వాలిఫైయింగ్ దశలో స్కాట్లాండ్, జింబాబ్వే, ఐర్లాండ్‌లతో నికోలస్ పూరన్ బృందం తలపడాల్సి ఉంది. చదవండి: T20 WC 2022: ‘ప్రపంచకప్ తర్వాత కోహ్లి రిటైర్మెంట్ ప్రకటిస్తాడు’! ప్రారంభానికి ముందే టి20 ప్రపంచకప్ 2022 కొత్త చరిత్ర -
విధ్వంసం సృష్టించిన రస్సెల్.. ఆరు బంతుల్లో ఆరు సిక్స్‌లు! వీడియో వైరల్
వెస్టిండీస్ ఆల్‌రౌండర్ ఆండ్రీ రస్సెల్ మరోసారి విధ్వంసం సృష్టించాడు. కరిబీయన్ దేశీవాళీ టోర్నీ 'సిక్స్టీ' టీ10 లీగ్‌లో ట్రిన్‌బాగో నైట్ రైడర్స్‌కు రస్సెల్ ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. ఈ లీగ్‌లోభాగంగా శనివారం సెయింట్ కిట్స్, ట్రిన్‌బాగో నైట్ రైడర్స్ జట్లు వార్నర్ వేదికగా తలపడ్డాయి. ఈ మ్యాచ్‌లో రస్సెల్ ఫోర్లు, సిక్సర్లతో ప్రత్యర్థి బౌలర్లకు చుక్కలు చూపించాడు. రస్సెల్ కేవలం 24 బంతుల్లోనే 5 ఫోర్లు, 8 సిక్స్‌లతో 72 పరుగులు సాధించాడు. కాగా ఇదే మ్యాచ్‌లో రస్సెల్ వరుసగా ఆరు బంతుల్లో ఆరు సిక్స్‌లు బాది సునామీ సృష్టించాడు. ఈ టోర్నీ రూల్స్ ప్రకారం.. ఏ బ్యాటర్ అయితే ఓవర్ ఆఖరి బంతికి స్ట్రైక్‌లో ఉంటాడో తరువాతి ఓవర్ తొలి బంతిని ఆ బ్యాటరే ఎదుర్కొంటాడు. ఈ క్రమంలో నైట్ రైడర్స్ ఇన్నింగ్స్ ఆరో ఓవర్ వేసిన డొమానిక్ డ్రేక్స్ బౌలింగ్‌లో అఖరి నాలుగు బంతులకు నాలుగు సిక్స్‌లు బాదిన రస్సెల్.. తర్వాతి ఓవర్ వేసిన జోన్-రస్ జగ్గేసర్ బౌలింగ్‌లో తొలి రెండు బంతులను రస్సెల్ సిక్సర్లగా మలిచాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. రస్సెల్ తుపాన్ ఇన్నింగ్స్ ఫలితంగా నైట్ రైడర్స్ నిర్ణీత 10 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 155 పరుగులు చేసింది. అనంతరం లక్ష్య చేధనలో సెయింట్ కిట్స్ నిర్ణీత ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 152 పరుగులు మాత్రమే చేయగల్గింది. తద్వారా నైట్ రైడర్స్ చేతిలో సెయింట్ కిట్స్ మూడు పరుగుల తేడాతో పరాజాయం పాలైంది. చదవండి: Asia Cup Ind Vs Pak: పాకిస్తాన్‌తో తొలి మ్యాచ్.. దినేష్ కార్తీక్‌కు నో ఛాన్స్! Andre Russell SIX SIXES off consecutive SIX balls in the SIXTY tournament. 8 SIXES and 5 FOURS.@TKRiders pic.twitter.com/jBKyzqwPOj — 𝗔𝗱𝗶𝘁𝘆𝗮⎊ (@StarkAditya_) August 28, 2022 -
'బలిపశువులా బస్సు కిందకు తోయాలనుకుంటున్నారు!'
వెస్టిండీస్ సీనియర్ ఆల్‌రౌండర్ ఆండ్రీ రసెల్, విండీస్ క్రికెట్ హెడ్‌కోచ్ ఫిల్ సిమ్మన్స్ మధ్య మాటల యుద్ధం ఇంకా కొనసాగుతూనే ఉంది. కొంతమంది విండీస్ క్రికెటర్లు డబ్బుపై మోజుతో జాతీయ జట్టుకు ప్రాతినిధ్యం వహించడం కంటే ప్రైవేట్ లీగ్‌ల్లోనే ఎక్కువగా ఆడుతున్నారంటూ ఫిల్ సిమ్మన్స్ ఇటీవలే సంచలన వ్యాఖ్యలు చేశాడు. ''ఇలా జరుగుతుందని ముందే ఊహించాను.. కానీ ఇప్పుడు సైలెంట్‌గా ఉండడమే బెటర్'' అని సిమ్మన్స్ వ్యాఖ్యలపై ఇన్స్టాగ్రామ్ వేదికగా రసెల్ ధీటుగా కౌంటర్ ఇచ్చాడు. ఆ తర్వాత రసెల్ ఆ పోస్టును డిలీట్ చేశాడు. తాజాగా తాను చేసిన వ్యాఖ్యలను సమర్థించుకున్నట్లు రసెల్ మరోసారి కుండబద్దలు కొట్టాడు. ప్రస్తుతం ది హండ్రెడ్ టోర్నమెంట్లో పాల్గొంటున్న రసెల్‌ను.. బుధవారం విండీస్ మాజీ ఆల్‌రౌండర్ డారెన్ సామీ ఇంటర్య్వూ చేశాడు. ఈ సందర్భంగా రసెల్ మాట్లాడుతూ.. '' ఈ విషయంలో నిశబ్దంగా ఉండాలని అనుకుంటున్నా. ఇంతకముందు జరిగిన చర్చల్లో ఈ విషయంపై చాలా స్పష్టంగా మాట్లాడుకున్నాం. అందుకే నన్ను చెడ్డవాడిగా సృష్టించి.. బలిపశువులా బస్సు కిందకు తోసేయాలని కొంతమంది కంకణం కట్టుకున్నారు. అందుకే నన్ను రెచ్చగొట్టేలా ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారు. కానీ ఇలాంటి రోజు వస్తుందని ఎప్పుడో ఊహించాను కాబట్టే సైలెంట్‌గా ఉండదలచుకున్నా. అయితే విండీస్ జట్టు నుంచి దూరమవ్వాలని నేనెప్పుడు భావించలేదు. ఏ క్రికెటర్ అయినా సొంత జట్టుకు ప్రాతినిధ్యం వహించాలని కోరకుంటాడు. నాకు అవకాశం వచ్చినప్పుడు నేనేంటో నిరూపించుకున్నా. ఇప్పటికిప్పుడు విండీస్ జట్టుతో ఆడి రెండు ప్రపంచకప్‌లు గెలవాలని ఉంది. కానీ ఆ అవకాశం వస్తుందా అంటే చెప్పలేను. నిజాయితీగా చెప్పాలంటే.. ప్రైవేట్ లీగ్స్‌లో ఆడేటప్పుడే రెండు సెంచరీలు సాధించాను. కానీ అవి విండీస్ జట్టుకు చేస్తే బాగుండు అని చాలాసార్లు అనిపించింది. ఒకవేళ ఆ రెండు సెంచరీలు విండీస్ తరపున చేసి ఉంటే జట్టులో ప్రత్యేక స్థానం ఉండేది. అయితే కొన్ని షరతులు అంగీకరించలేకుండా ఉన్నాయి. అందుకే ప్రైవేట్ లీగ్స్ ఆడాల్సి వస్తోంది. ఇప్పుడు నా వయసు 34 సంవత్సరాలు. మహా అయితే మరో నాలుగేళ్లు క్రికెట్ ఆడుతానేమో. మాకు కుటుంబాలు ఉన్నాయి. వారి బాగోగులు చూసుకోవడానికి కెరీర్లో వచ్చిన అవకాశాలను అందిపుచ్చుకోవాల్సిన అవసరం ఉంది. అయితే అవకాశం వస్తే ఇప్పటికి విండీస్‌కు ప్రపంచకప్ అందించాలని భావిస్తున్నా'' అంటూ చెప్పుకొచ్చాడు. 2010లో అంతర్జాతీయ క్రికెట్లో అరంగేట్రం చేసిన ఆండ్రీ రసెల్ వెస్టిండీస్ తరపున 56 టి20ల్లో 1034 పరుగులు, 70 వికెట్లు.. 67 టి20ల్లో 741 పరుగులు, 39 వికెట్లు తీశాడు. ఇక తన చివరి వన్డేను విండీస్ తరపున 2019లో ఆడాడు. రసెల్ ఆఖరిసారిగా వెస్టిండీస్ తరపున టి20 ప్రపంచకప్ 2021లో పాల్గొన్నాడు. అయితే యూఏఈ వేదికగా జరిగిన ఆ ప్రపంచకప్‌లో వెస్టిండీస్ దారుణ ప్రదర్శన కనబరిచింది. చదవండి: 'ఆడమని ఎవరిని అడుక్కోం'.. విండీస్ కోచ్; రసెల్ స్ట్రాంగ్ కౌంటర్ Jonny Bairstow: కాలం ఎప్పుడు ఒకేలా ఉండదు.. మరోసారి నిరూపితం -
కేకేఆర్ ఫ్యామిలీలోకి ఇంగ్లండ్ విధ్వంసకర బ్యాటర్..
ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)లో రెండుసార్లు చాంపియన్‌గా నిలిచిన కేకేఆర్ యూఈఏ వేదికగా జరగనున్న ఇంటర్నేషనల్ లీగ్ టి20లో అబుదాబి నైట్‌రైడర్స్ జట్టును కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. తాజాగా 14 మందితో కూడిన అబుదాబి నైట్‌రైడర్స్(ఏడీకేఆర్)జట్టును కేకేఆర్ యాజమాన్యం మంగళవారం తమ ట్విటర్లో ప్రకటించింది. ప్రస్తుతం ఐపీఎల్లో కేకేఆర్‌కు ఆడుతున్న ఆండ్రీ రసెల్, సునీల్ నరైన్‌లు యూఏఈ టి20లీగ్‌లోనూ అబుదాబి నైట్‌రైడర్స్‌కు ప్రాతినిధ్యం వహించనున్నారు. వీరితో పాటు ఇంగ్లండ్ స్టార్ జానీ బెయిర్ స్టో, ఐర్లాండ్ విధ్వంసకర ఆటగాడు పాల్ స్టిర్లింగ్, లంక క్రికెటర్లు చరిత్ అసలంక, లాహిరు కుమారాలు ఉన్నారు.. కొలిన్ ఇంగ్రామ్, అకిల్ హొసేన్లు కూడా ఎంపికయ్యారు. ఈ సందర్భంగా కేకేఆర్ సీఈవో వెంకీ మైసూర్ మాట్లాడుతూ.. ''క్రికెట్లో ప్రపంచవ్యాప్తంగా మా అడుగులు పడడం గొప్ప అచీవ్మెంట్ అన్ని చెప్పొచ్చు. ఐపీఎల్లో కేకేఆర్.. కరేబియన్ ప్రీమియర్ లీగ్(సీపీఎల్)లో టీకేఆర్.. తాజాగా ఐఎల్టి20లో ఏడీకేఆర్. కేకేఆర్ జట్టులో ఉన్న ఆండ్రీ రసెల్, సునీల్ నరైన్‌లు ఏడీకేఆర్లో ఉండడం మాకు సానుకూలాంశం. ఇక కేకేఆర్ ఫ్యామిలీలోకి బెయిర్ స్టోకు స్వాగతం. ఐఎల్టి20లో ఏడీకేఆర్ తరపున బెయిర్ స్టో విధ్వంసకర ఇన్నింగ్స్‌లు ఆడాలని కోరుకుంటున్నాం. అలాగే లంక క్రికెటర్లు చరిత్ అసలంక, లాహిరు కుమారా.. ఐర్లాండ్ స్టార్ పాల్ స్టిర్లింగ్లకు కూడా గ్రాండ్ వెల్కమ్. కొలిన్ ఇంగ్రామ్, అకిల్ హొసేన్, రవి రాంపాల్ సహా ఇతర క్రికెటర్లకు కూడా స్వాగతం. ఐఎల్టి20 ద్వారా మేం గ్లోబల్ క్రికెట్లో విజయవంతమయ్యే ప్రయత్నంలో ఉన్నాం. ఆల్ ది బెస్ట్ అబుదాబి నైట్‌రైడర్స్ టీం(ఏడీకేఆర్)'' అంటూ ముగించాడు. యూఏఈ వేదికగా జరగబోయే ఇంటర్నేషనల్ లీగ్ టి20(ఐఎల్టీ20) జనవరి 6 నుంచి ఫిబ్రవరి 12 వరకు జరగనుంది. ఐఎల్టి 20 కోసం అబుదాబి నైట్ రైడర్స్ జట్టు: సునీల్ నరైన్, ఆండ్రీ రస్సెల్, జానీ బెయిర్‌స్టో, పాల్ స్టిర్లింగ్, లహిరు కుమార, చరిత్ అసలంక, కోలిన్ ఇంగ్రామ్, అకేల్ హోసేన్,రేమాన్ రీఫర్, ఎస్ ప్రసన్న, రవి రాంపాల్, కెన్నార్ లూయిస్,అలీ ఖాన్, బ్రాండన్ గ్లోవర్ Welcome to the family, Knights 💜 https://t.co/mFNyF7a94T — KolkataKnightRiders (@KKRiders) August 16, 2022 చదవండి: MI Emirates: 'పొలార్డ్ నుంచి బౌల్ట్ దాకా'.. ఆరంభం కాకముందే టైటిల్‌పై కన్నేశారు -
'ఆడమని ఎవరిని అడుక్కోం'.. విండీస్ కోచ్; రసెల్ స్ట్రాంగ్ కౌంటర్
వెస్టిండీస్ క్రికెటర్లు తమ దేశానికంటే బయటి దేశాలు నిర్వహించే లీగ్స్‌లోనే ఎక్కువగా కనబడుతుంటారు. కారణం డబ్బు. విండీస్‌కు ఆడితే వచ్చే డబ్బుతో పోలిస్తే.. ప్రైవేట్ లీగ్స్‌లో ఆ డబ్బు రెండింతల కంటే ఎక్కువుంటుంది. అందుకే క్రిస్ గేల్, డ్వేన్ బ్రావో, కీరన్ పొలార్డ్ , ఆండ్రీ రసెల్, సునీల్ నరైన్ ఇలా చెప్పుకుంటూ పోతే పెద్ద లిస్టే తయారవుతుంది. మొత్తంగా చెప్పాలంటే.. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా నిర్వహిస్తున్న వివిధ క్రికెట్ లీగ్స్ అందరికంటే ఎక్కువగా కనబడేది కరేబియన్ క్రికెటర్లే. మన ఐపీఎల్‌తోనూ వారికి విడదీయరాని బంధం ఉంది. డబ్బులు ఎక్కువొస్తాయంటే అవసరమైతే జాతీయ జట్టుకు ఆడే విషయాన్ని పక్కకుబెట్టడం విండీస్ ఆటగాళ్ల నైజం. అందుకే టి20 ఫార్మాట్లో రెండుసార్లు చాంపియన్ అయినప్పటికి ఆ జట్టులో ఎప్పుడు నిలకడ ఉండదు. ఈ మధ్య కాలంలో అది మరోసారి నిరూపితమైంది. ఇటీవలే భారత్‌తో జరిగిన టి20 సిరీస్‌లో 4-1 తేడాతో దారుణ పరాజయాన్ని మూటగట్టుకుంది. ఈ క్రమంలోనే విండీస్ జట్టు కోచ్ ఫిల్ సిమ్మన్స్ రెండు రోజుల క్రితం దేశానికంటే విదేశీ లీగ్స్‌కే ఎక్కువ ప్రాధాన్యమిస్తున్న కొందరు క్రికెటర్లపై వ్యంగ్యంగా స్పందించాడు. ''వెస్టిండీస్ కోసం కాస్త ఆడండయ్యా అంటూ మేము ప్లేయర్లను అడుక్కోవాలని అనుకోవడం లేదు. ప్రపంచవ్యాప్తంగా ఫ్రాంచైజీ ఆధారిత లీగ్‌లు ఆడుతున్న ఆండ్రీ రస్సెల్, సునీల్ నరైన్ తదితర స్టార్లు.. జాతీయ జట్టుకు ముఖం చాటేస్తున్నారు. అక్టోబర్‌లో జరగబోయే టీ20 ప్రపంచకప్ కోసం వెస్టిండీస్ జట్టులో అత్యుత్తమ ప్లేయర్లను బరిలోకి దించడానికి బోర్డు తీవ్రంగా కష్టపడుతున్నప్పటికీ.. చాలా మంది క్రికెటర్లు డబ్బు కోసం ఫ్రాంచైజీ లీగ్‌కే మొగ్గు చూపుతున్నారు. ఇంకొంతమంది గాయాలతో జట్టుకు అందుబాటులో ఉండట్లేదంటూ అబద్దాలు చెబుతూ తప్పించుకుంటున్నారు. దీంతో మాకు వేరే మార్గం లేకుండా పోయింది.. ఈ విషయంలో ఎవరూ ఏమీ చేయలేరు. స్టార్ ప్లేయర్లు తన జాతీయ జట్టు కోసం ఆడాలని తాపత్రాయపడితే మార్పు వస్తుందని నమ్ముతున్నా. అందుకు తగ్గట్లు వాళ్లు కొన్ని లీగ్‌లను వదులుకుంటే తప్పితే మేము ఏం చేయలేని పరిస్థితి'' అని ఆవేదన వ్యక్తం చేశాడు. తాజాగా విండీస కోచ్ ఫిల్ సిమ్మన్స్ చేసిన వ్యాఖ్యలపై విండీస్ సీనియర్ ప్లేయర్ ఆండ్రీ రసెల్ కాస్త ఘూటుగానే స్పందించాడు. ఫిల్ సిమ్మన్స్ ఆర్టికల్‌ను తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేస్తూ.. ''ఇలాంటిది వస్తుందని నాకు ముందే తెలుసు.. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో సైలెంట్‌గా ఉండడమే ఉత్తమం..'' అంటూ క్యాప్షన్ జత చేసి కోపంతో ఉన్న ఎమోజీలను షేర్ చేశాడు. రసెల్ కామెంట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇక రసెల్ వెస్టిండీస్ తరపున 67 టి20ల్లో ప్రాతినిధ్యం వహించాడు. ఆఖరిసారిగా వెస్టిండీస్ తరపున టి20 ప్రపంచకప్ 2021లో పాల్గొన్నాడు. అయితే యూఏఈ వేదికగా జరిగిన ఆ ప్రపంచకప్‌లో వెస్టిండీస్ దారుణ ప్రదర్శన కనబరిచింది. రసెల్ మాత్రమే కాదు సునీల్ నరైన్ కూడా 2019 నుంచి జాతీయ జట్టుకు రెగ్యులర్‌గా అందుబాటులో ఉండడం లేదు. గాయాల సాకు చెప్పి డబ్బులు బాగా వచ్చే ఐపీఎల్, బిగ్‌బాష్ లీగ్, కరేబియన్ లీగ్‌ల్లో ఆడుతూ బిజీగా గడుపుతున్నారు. View this post on Instagram A post shared by Andre Russell🇯🇲 Dre Russ.🏏 (@ar12russell) చదవండి: MI Emirates: 'పొలార్డ్ నుంచి బౌల్ట్ దాకా'.. ఆరంభం కాకముందే టైటిల్‌పై కన్నేశారు Dwayne Bravo: 600 వికెట్లతో ప్రపంచ రికార్డు.. టి20 క్రికెట్లో తొలి బౌలర్‌గా -
ఖరీదైన కారు కొన్న వెస్టిండీస్ హిట్టర్.. వీడియో వైరల్!
IPL 2022- Andre Russell: ‘‘పెద్ద పెద్ద కలలు కనాలి! అయితే, కఠిన శ్రమతో పాటు ఎన్నో త్యాగాలు చేస్తేనే వాటిని నిజం చేసుకోగలం. ఆ దేవుడు మంచివాడు! అందుకు ఆయనకు నేను రుణపడి ఉంటాను’’ అంటూ వెస్టిండీస్ హిట్టర్, కోల్‌కతా నైట్‌రైడర్స్ ఆల్‌రౌండర్ ఆండ్రీ రసెల్ తాను కారు కొన్న విషయాన్ని వెల్లడించాడు. తన పట్టుదల, కృషితో కలలను సాకారం చేసుకుంటున్నట్లు పేర్కొన్నాడు. కాగా ఐపీఎల్-2022 నేపథ్యంలో కేకేఆర్ రసెల్‌ను 12 కోట్ల రూపాయలు ఖర్చు చేసి రిటైన్ చేసుకున్న సంగతి తెలిసిందే. తాజా ఎడిషన్‌లో అతడు 12 ఇన్నింగ్స్‌లో 335 పరుగులు(అత్యధిక స్కోరు 70 నాటౌట్) చేసి ఆకట్టుకున్నాడు. ఇక 13 ఇన్నింగ్స్‌లో కలిపి 17 వికెట్లు పడగొట్టి తనకు వెచ్చించిన ధరకు న్యాయం చేశాడు ఈ ఆల్‌రౌండర్. ఇక క్యాష్ రిచ్ లీగ్ తాజా సీజన్ ముగింపు నేపథ్యంలో స్వదేశానికి చేరుకున్న రసెల్ వ్యక్తిగత జీవితానికి సమయం కేటాయించాడు. ఈ క్రమంలో ఖరీదైన మెర్సిడెస్ బెంజ్ ఏమ్జీ(Mercedes-Benz AMG) కారును కొన్నాడు. కారులో ప్రయాణిస్తున్న వీడియోను షేర్ చేస్తూ ఆనందం పంచుకున్నాడు. ఇందుకు స్పందించిన క్రిస్ గేల్, డారెన్ సమీ, సూర్యకుమార్ యాదవ్ తదితరులు ఈ ఆల్‌రౌండర్‌కు శుభాకాంక్షలు తెలిపారు. కాగా రసెల్ కొన్న ఈ స్టైలిష్ కారు విలువ సుమారు 2 కోట్ల రూపాయలు అని తెలుస్తోంది. ఇక టీ20 ప్రపంచకప్-2021 తర్వాత జాతీయ జట్టుకు దూరమైన ఆండ్రీ రసెల్.. పాకిస్తాన్ పర్యటనకు వెళ్లిన విండీస్ జట్టులో లేకపోవడం గమనార్హం. చదవండి: Mohsin Khan: ‘4 నెలల సమయం ఇస్తే.. అతడిని ఇండియా బెస్ట్ ఆల్‌రౌండర్‌గా తీర్చిదిద్దుతా’ View this post on Instagram A post shared by Andre Russell🇯🇲 Dre Russ.🏏 (@ar12russell) -
IPL 2022: సన్‌రైజర్స్ ఢమాల్
పుణే: సీజన్ తొలి రెండు మ్యాచ్‌లలో ఓటమి...ఆ తర్వాత కోలుకొని చక్కటి ప్రదర్శనతో వరుసగా ఐదు విజయాలు...ఇక ప్లే ఆఫ్స్ దారి సులువే అనుకుంటున్న తరుణంలో మళ్లీ పరాజయాల బాట...విజయాలలాగే వరుసగా ఐదో ఓటమితో అవకాశాలు సంక్లిష్టం! ఐపీఎల్లో సన్‌రైజర్స్ హైదరాబాద్ పరిస్థితి ఇది. శనివారం జరిగిన కీలక పోరులో హైదరాబాద్ 54 పరుగుల తేడాతో కోల్‌కతా నైట్‌రైడర్స్ చేతిలో ఓడింది. తొలుత నైట్‌రైడర్స్ 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 177 పరుగులు చేసింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ ఆండ్రీ రసెల్ (28 బంతుల్లో 49 నాటౌట్; 3 ఫోర్లు, 4 సిక్సర్లు) రాణించాడు. తర్వాత సన్‌రైజర్స్ 20 ఓవర్లలో 8 వికెట్లకు 123 పరుగులకే పరిమితమైంది. అభిషేక్ శర్మ (28 బంతుల్లో 43; 4 ఫోర్లు, 2 సిక్సర్లు), ఎయిడెన్ మార్క్రమ్ (25 బంతుల్లో 32; 3 సిక్స్‌లు) ఫర్వాలేదనిపించారు. రసెల్ మెరుపులు... ఓపెనర్ వెంకటేశ్ అయ్యర్ (7) త్వరగానే అవుటైనా... నితీశ్ రాణా (16 బంతుల్లో 26; 1 ఫోర్, 3 సిక్సర్లు), అజింక్య రహానే (24 బంతుల్లో 28; 3 సిక్సర్లు) కోల్‌కతా ఇన్నింగ్స్‌ను దారిలో పెట్టారు. దీంతో పవర్‌ప్లేలో జట్టు 55/1 స్కోరు చేసింది. అయితే తన తొలి ఓవర్లోనే నితీశ్, రహానేలను పెవిలియన్ చేర్చిన ఉమ్రాన్ తన తర్వాతి ఓవర్లో కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ (15)ను అవుట్ చేశాడు. రింకూ సింగ్ (5) ఎల్బీగా నిష్క్రమించగా, బిల్లింగ్స్ (29 బంతుల్లో 34; 3 ఫోర్లు, 1 సిక్స్) ఆటలో దూకుడు కనిపించలేదు. 19వ ఓవర్లో చక్కటి బౌలింగ్‌తో భువనేశ్వర్ 6 పరుగులే ఇచ్చినా... వాషింగ్టన్ సుందర్ వేసిన చివరి ఓవర్లో రసెల్ రెచ్చిపోయాడు. అతను 3 సిక్సర్లతో చెలరేగడంతో మొత్తం 20 పరుగులు వచ్చాయి. పేలవ బ్యాటింగ్... ముందంజ వేసే అవకాశాలు మెరుగుపడాలంటే తప్పని సరిగా గెలవాల్సిన మ్యాచ్‌లో హైదరాబాద్ బ్యాటింగ్ పూర్తిగా విఫలమైంది. అభిషేక్, మార్క్రమ్ మినహా అంతా విఫలమయ్యారు. చెత్త షాట్లతో రైజర్స్ ఆశల్ని ముంచేశారు. విలియమ్సన్ (9), రాహుల్ త్రిపాఠి (9)లతో పాటు మిడిలార్డర్లో పూరన్ (2), సుందర్ (4), శశాంక్ సింగ్ (11) ప్రభావం చూపలేకపోయారు. స్కోరు వివరాలు కోల్‌కతా నైట్‌రైడర్స్ ఇన్నింగ్స్: వెంకటేశ్ (బి) జాన్సెన్ 7; రహానె (సి) శశాంక్ (బి) ఉమ్రాన్ 28; నితీశ్ (సి) శశాంక్ (బి) ఉమ్రాన్ 26; శ్రేయస్ (సి) త్రిపాఠి (బి) ఉమ్రాన్ 15; బిల్లింగ్స్ (సి) విలియమ్సన్ (బి) భువనేశ్వర్ 34; రింకూ సింగ్ (ఎల్బీ) (బి) నటరాజన్ 5; రసెల్ నాటౌట్ 49; నరైన్ 1; ఎక్స్‌ట్రాలు 12; మొత్తం (20 ఓవర్లలో 6 వికెట్లకు) 177. వికెట్ల పతనం: 1–17, 2–65, 3–72, 4–83, 5–94, 6–157. బౌలింగ్: భువనేశ్వర్ 4–0–27–1, జాన్సెన్ 4–0–30–1, నటరాజన్ 4–0–43–1, సుందర్ 4–0–40–0, ఉమ్రాన్ మలిక్ 4–0–33–3. సన్‌రైజర్స్ హైదరాబాద్ ఇన్నింగ్స్: అభిషేక్ (సి) బిల్లింగ్స్ (బి) వరుణ్ 43; విలియమ్సన్ (బి) రసెల్ 9; త్రిపాఠి (సి) అండ్ (బి) సౌతీ 9; మార్క్రమ్ (బి) ఉమేశ్ 32; పూరన్ (సి) అండ్ (బి) నరైన్ 2; సుందర్ (సి) వెంకటేశ్ (బి) రసెల్ 4; శశాంక్ (సి) శ్రేయస్ (బి) సౌతీ 11; జాన్సెన్ (సి) బిల్లింగ్స్ (బి) రసెల్ 1; భువనేశ్వర్ నాటౌట్ 6; ఉమ్రాన్ నాటౌట్ 3; ఎక్స్‌ట్రాలు 3; మొత్తం (20 ఓవర్లలో 8 వికెట్లకు) 123. వికెట్ల పతనం: 1–30, 2–54, 3–72, 4–76, 5–99, 6–107, 7–113, 8–113. బౌలింగ్: ఉమేశ్ 4–0–19–1, సౌతీ 4–0–23–2, నరైన్ 4–0–34–1, రసెల్ 4–0–22–3, వరుణ్ 4–0–25–1. ఐపీఎల్లో నేడు చెన్నై సూపర్ కింగ్స్ X గుజరాత్ టైటాన్స్ లక్నో సూపర్ జెయింట్స్ X రాజస్తాన్ రాయల్స్ వేదిక: ముంబై, రాత్రి గం. 7:30 నుంచి స్టార్ స్పోర్ట్స్–1లో ప్రత్యక్ష ప్రసారం. -
Andre Russell: ఆఖరి ఐదు మ్యాచ్‌ల్లో మా తడాఖా ఏంటో చూపిస్తాం..
ఐపీఎల్ 2022 సీజన్లో గతేడాది రన్నరప్ కోల్‌కతా నైట్ రైడర్స్ అందరి అంచనాలను తలకిందులు చేస్తూ పేలవ ప్రదర్శన చేస్తోంది. ఆ జట్టు ఇప్పటివరకు ఆడిన 9 మ్యాచ్‌ల్లో 3 విజయాలు, 6 పరాజయాలతో పాయింట్ల పట్టికలో చివరి నుంచి మూడో స్థానంలో నిలిచింది. కేకేఆర్ ప్రదర్శన గత ఐదు మ్యాచ్‌ల్లో మరీ దారుణంగా ఉంది. ఆ జట్టు చివరిగా ఆడిన ఐదు మ్యాచ్‌ల్లో ఓటమిపాలై ప్లే ఆఫ్స్ ఆవకాశాలను సంక్లిష్టం చేసుకుంది. ప్రస్తుత సీజన్లో ఆ జట్టు ప్లే ఆఫ్స్‌కు చేరాలంటే మిగిలిన 5 మ్యాచ్‌ల్లో తప్పక గెలవాల్సిన పరిస్థితి ఏర్పడింది. A special message for the fans from Big Dre! 💜#AndreRussell • #KnightsInAction presented by @glancescreen | #KKRHaiTaiyaar #KKRvRR #IPL2022 pic.twitter.com/IaZheaz4th — KolkataKnightRiders (@KKRiders) May 2, 2022 ఈ నేపథ్యంలో ఇవాళ (మే 2) రాజస్థాన్ రాయల్స్‌తో జరుగబోయే కీలక మ్యాచ్‌కు ముందు కేకేఆర్ తమ ట్విట్టర్ హ్యాండిల్లో ఓ వీడియో విడుదల చేసింది. ఆ వీడియోలో కేకేఆర్ స్టార్ ఆల్‌రౌండర్ ఆండ్రీ రసెల్ ఫ్యాన్స్‌కు సందేశమిచ్చాడు. ప్రస్తుత సీజన్లో తాము ఆడాల్సిన చివరి ఐదు మ్యాచ్‌లను ఐదు ఫైనల్స్‌గా భావిస్తామని, ఈ మ్యాచ్‌ల్లో తమ తడాఖా ఏంటో ప్రత్యర్ధులకు చూపిస్తామని శపథం చేశాడు. తాము ఫ్లే ఆఫ్స్ చేరేందుకు అవకాశాల ఇంకా సజీవంగానే ఉన్నాయని, ప్లే ఆఫ్స్ రేసులో నిలిచేందుకు చివరివరకు తమ పోరాటం సాగిస్తామని పేర్కొన్నాడు. క్లిష్ట సమయాల్లో తమను ఉత్సాహపరుస్తూ అండగా నిలిచిన అభిమానులకు రసెల్ ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపాడు. ఇదిలా ఉంటే, కేకేఆర్ ప్లే ఆఫ్స్ రేసులో నిలవాలంటే.. వారు ఆడబోయే తదుపరి ఐదు మ్యాచ్‌ల్లో తప్పక గెలవాల్సి ఉంది. శ్రేయస్ సేన తమ తర్వాతి మ్యాచ్‌ల్లో కఠినమైన ప్రత్యర్థులను ఢీకొట్టాల్సి ఉంది. ఇవాళ (మే 2) రాజస్థాన్ రాయల్స్, ఆతర్వాత పటిష్టమైన లక్నో సూపర్ జెయింట్స్ (రెండు మ్యాచ్‌లు), సన్‌రైజర్స్ హైదరాబాద్, ముంబై ఇండియన్స్ జట్లతో కేకేఆర్ తలపడాల్సి ఉంది. చదవండి: రాజస్థాన్‌పై కేకేఆర్ ప్రతీకారం తీర్చుకునేనా..? గత రికార్డులు ఎలా ఉన్నాయంటే..? -
రస్సెల్ భారీ సిక్సర్.. దెబ్బకు కుర్చీ బద్దలైంది..వీడియో వైరల్!
ఐపీఎల్-2022లో కోల్‌కతా నైట్ రైడర్స్ తమ తదుపరి మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌తో గురువారం(ఏప్రిల్ 28) తలపడనుంది. ఈ క్రమంలో కేకేఆర్ విధ్వంసకర ఆల్‌రౌండర్ ఆండ్రీ రస్సెల్ నెట్స్‌తో తీవ్రంగా శ్రమిస్తోన్నాడు. అయితే రస్సెల్ నెట్స్‌లో తన పవర్ ఫుల్ బ్యాటింగ్‌తో కుర్చీను విరగ్గొట్టాడు. రస్సెల్ కొట్టిన భారీ షాట్‌కు కుర్చీ బద్దలైంది. ఈ ఘటనకు సంబంధించిన వీడియాను కేకేఆర్ ఇనస్ట్రాగామ్లో షేర్ చేసింది. "రస్సెల్ విధ్వంసకర ఇన్నింగ్స్ కోసం వేచి ఉండండి" అంటూ క్యాప్షన్ జతచేసింది. ఇక దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇప్పటి వరకు ఈ సీజన్లో 7 మ్యాచ్‌లు ఆడిన రస్సెల్ 227 పరుగులు సాధించాడు. దీంట్లో 12 ఫోర్లు, 22 సిక్స్‌లు ఉన్నాయి. అదే విధంగా అతడు బౌలింగ్‌లో అద్భుతంగా రాణిస్తోన్నాడు. ఇప్పటి వరుకు 10 వికెట్లు పడగొట్టాడు.ఇక కేకేఆర్ విషయానికి వస్తే.. ఈ సీజన్లో ఇప్పటి వరకు 8 మ్యాచ్‌లు ఆడిన కేకేఆర్.. కేవలం 3 మ్యాచ్‌ల్లో విజయం సాధించి పాయింట్ల పట్టికలో ఎనిమిదో స్థానంలో నిలిచింది. చదవండి: IPL 2022: ఈ ఏడాది ఎమర్జింగ్ ప్లేయర్ అతడే: టీమిండియా మాజీ క్రికెటర్ View this post on Instagram A post shared by Kolkata Knight Riders (@kkriders) -
KKR vs GT: రసెల్ చెలరేగినా... ఓటమి తప్పలేదు
ముంబై: బౌలింగ్‌లో వేసింది ఒకే ఓవర్.. అదీ ఇన్నింగ్స్‌లో చివరిది... చక్కటి నియంత్రణతో బౌలింగ్ చేస్తూ 5 పరుగులే ఇచ్చిన అతను ఏకంగా 4 వికెట్లు పడగొట్టాడు... బ్యాటింగ్‌లో 25 బంతుల్లో 1 ఫోర్, 6 సిక్సర్లతో 48 పరుగులు... ఆండ్రీ రసెల్ ఆల్‌రౌండ్ ప్రదర్శన ఇది! అయితే ఇది కూడా కోల్‌కతా నైట్‌రైడర్స్‌ను గెలిపించేందుకు సరిపోలేదు. శనివారం జరిగిన మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ 8 పరుగుల తేడాతో నైట్‌రైడర్స్‌పై విజయం సాధించింది. ముందుగా గుజరాత్ 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 156 పరుగులు చేసింది. హార్దిక్ పాండ్యా (49 బంతుల్లో 67; 4 ఫోర్లు, 2 సిక్స్‌లు) వరుసగా మూడో అర్ధ సెంచరీ సాధించాడు. ఆండ్రీ రసెల్ 4 వికెట్లు పడగొట్టాడు. అనంతరం కోల్‌కతా 20 ఓవర్లలో 8 వికెట్లకు 148 పరుగులే చేయగలిగింది. ఆండ్రీ రసెల్ టాప్ స్కోరర్‌గా నిలవగా, రింకూ సింగ్ (28 బంతుల్లో 35; 4 ఫోర్లు, 1 సిక్స్) రాణించాడు. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ రషీద్ ఖాన్ (2/22) ప్రత్యర్థిని దెబ్బ తీశాడు. టాస్ గెలిచిన గుజరాత్ బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ సీజన్లో ఇది 35వ మ్యాచ్ కాగా...టాస్ గెలిచిన కెప్టెన్ తొలిసారి బ్యాటింగ్ ఎంచుకోవడం విశేషం. గత 34 మ్యాచ్‌లలో టాస్ గెలవగానే అన్ని జట్లు ఫీల్డింగ్‌నే తీసుకున్నాయి. గిల్ (7) మళ్లీ విఫలం కాగా, సాహా (25 బంతుల్లో 25; 2 ఫోర్లు, 1 సిక్స్) వేగంగా ఆడలేకపోయాడు. ఈ స్థితిలో కెప్టెన్ ఇన్నింగ్స్‌తోనే గుజరాత్ కోలుకుంది. 36 బంతుల్లో హార్దిక్ అర్ధ సెంచరీ పూర్తి చేసుకోగా, మిల్లర్ (20 బంతుల్లో 27; 1 ఫోర్, 2 సిక్స్‌లు) అతనికి సహకరించాడు. అయితే 18 పరుగుల వ్యవధిలో 6 వికెట్లు కోల్పోయిన టైటాన్స్ సాధారణ స్కోరుకే పరిమితమైంది. చివరి ఓవర్ వేసిన రసెల్... అభినవ్ మనోహర్, ఫెర్గూసన్, తెవాటియా, యష్ దయాళ్ వికెట్లు తీశాడు. ఛేదనలో కోల్‌కతా పూర్తిగా తడబడింది. 6.1 ఓవర్లలోనే 4 వికెట్లు కోల్పోయిన జట్టు కోలుకోవడం కష్టంగా మారింది. బిల్లింగ్స్ (4), నరైన్ (5), రాణా (2), శ్రేయస్ (12) విఫలమయ్యారు. 47 బంతుల్లో 78 పరుగులు చేయాల్సిన స్థితిలో క్రీజ్‌లోకి వచ్చిన రసెల్ వరుస సిక్సర్లతో చెలరేగి కోల్‌కతా విజయావకాశాలు పెంచాడు. అల్జారి చివరి ఓవర్లో 18 పరుగులు కావాల్సి ఉండగా తొలి బంతినే అతను సిక్సర్‌గా మలచడంతో కేకేఆర్ గెలుపుపై ఆశలు పెంచుకుంది. అయితే తర్వాతి బంతికే మరో భారీ షాట్‌కు ప్రయత్నించి రసెల్ అవుటయ్యాడు. -
ఐపీఎల్లో చరిత్ర సృష్టించిన ఆండ్రీ రస్సెల్.. తొలి బౌలర్‌గా!
ఐపీఎల్లో కోల్‌కతా నైట్ రైడర్స్ ఆల్‌రౌండర్ ఆండ్రీ రస్సెల్ అరుదైన రికార్డు సాధించాడు. ఐపీఎల్ చరిత్రలోనే ఒక ఓవర్ లేదా అంతకంటే తక్కువ వ్యవధిలో నాలుగు వికెట్లు పడగొట్టిన తొలి బౌలర్‌గా రస్సెల్ రికార్డు సృష్టించాడు. ఐపీఎల్-2022లో భాగంగా గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో అఖరి ఓవర్ వేసిన రస్సెల్.. 5 పరుగులు ఇచ్చి ఏకంగా నాలుగు వికెట్లు పడగొట్టాడు. కాగా ఈ మ్యాచ్‌లో రస్సెల్ కేవలం ఒకే ఒక ఓవర్ మాత్రమే వేశాడు. ఈ క్రమంలోనే అరుదైన ఘనతను రస్సెల్ సాధించాడు. గతంలో కేకేఆర్ బౌలర్ లక్ష్మీ రతన్ శుక్లా కేవలం ఐదు బంతులు మాత్రమే వేసి మూడు వికెట్లు పడగొట్టాడు. అదే విధంగా 2019లో రాజస్తాన్ స్పిన్నర్ శ్రేయాస్ గోపాల్ ఒక ఓవర్ వేసి మూడు వికెట్లు సాధించాడు. చదవండి: IPL 2022: నో బాల్ వివాదం.. రాజస్తాన్ రాయల్స్ హెడ్ కోచ్ ఎమన్నాడంటే..? Brilliant catch by Rinku Singh in his first match. Andre Russell at his best! pic.twitter.com/Xp0n3aIg7v — Vaishnavi Sawant (@VaishnaviS45) April 23, 2022 -
'రసెల్‌తో బ్యాటింగ్ అంటే నాకు ప్రాణ సంకటం'
కేకేఆర్ ఆల్‌రౌండర్ ఆండ్రీ రసెల్ శుక్రవారం పంజాబ్ కింగ్స్‌తో మ్యాచ్‌లో తన విశ్వరూపం చూపెట్టాడు. కష్టాల్లో పడిన జట్టును ఒంటిచేత్తో విజయతీరాలకు చేర్చాడు. 31 బంతుల్లోనే 2 ఫోర్లు, 8 సిక్సర్లతో 70 పరుగులతో సునామీ ఇన్నింగ్స్‌ను తలపించాడు. అతని దాటికి కేకేఆర్ 138 పరుగుల లక్ష్యాన్ని 14.3 ఓవర్లలోనే చేధించింది. ఓడియన్ స్మిత్ వేసిన ఇన్నింగ్స్ 12వ ఓవర్లో రసెల్ విశ్వరూపాన్నే చూపించాడు. మూడు సిక్సర్లు, ఒక ఫోర్, నోబాల్ సహా మొత్తం 24 పరుగులు పిండుకోగా.. అదే ఓవర్ ఆఖరి బంతిని సామ్ బిల్లింగ్స్ సిక్సర్ సంధించడంతో మొత్తం 30 పరుగులు వచ్చాయి. కాగా మ్యాచ్‌లో రసెల్ విధ్వంసాన్ని కళ్లారా ఆస్వాధించిన సామ్ బిల్లింగ్స్ 24 పరుగులు నాటౌట్‌గా నిలిచి అతనికి సహకరించాడు. ఈ నేపథ్యంలో మ్యాచ్ అనంతరం సామ్ బిల్లింగ్స్ రసెల్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ''రసెల్ విధ్వంసాన్ని దగ్గరుండి చేశాను. ఒక విధ్వంసకర ఆటగాడు ఫామ్‌లో ఉంటే మనం సపోర్ట్ చేయడం తప్ప ఇంకేం చేయలేము. పవర్ హిట్టింగ్‌లో అతన్ని మించినవారు లేరని మరోసారి నిరూపించాడు. కొన్నిసార్లు రసెల్ విధ్వంసం చూసి.. అతనితో కలిసి ఆడాలంటే నాకు ప్రాణ సంకటంగా అనిపించేది. కానీ నాన్‌స్ట్రైక్ ఎండ్‌లో నుంచి రసెల్ ఇన్నింగ్స్‌ను ఆస్వాధించాను. వాస్తవానికి 51 పరుగుల వద్ద నాలుగు వికెట్లు కోల్పోయినప్పుడు.. రసెల్ ఒక మాట చెప్పాడు. వికెట్లు పోయాయని కంగారుపడొద్దు.. పోరాడుదాం.. ఫలితం మనకు అనుకూలంగా వస్తుంది. మా హెడ్‌కోచ్ బ్రెండన్ మెక్కల్లమ్ కూడా రసెల్‌కు ఇదే విషయాన్ని చెప్పి పంపాడు.'' అంటూ తెలిపాడు. చదవండి: IPL 2022: పంజాబ్ బౌలర్‌కు చుక్కలు చూపించిన రసెల్ IPL 2022: పగ తీర్చుకున్న కేకేఆర్ బౌలర్.. వీడియో వైరల్ -
IPL 2022: వయసై పోతోందన్నాడు... కానీ..
IPL 2022- KKR Vs PBKS: కోల్‌కతా నైట్‌రైడర్స్ పేసర్ ఉమేశ్ యాదవ్‌పై ఆ జట్టు కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ ప్రశంసలు కురిపించాడు. అతడిలో కష్టపడే తత్వం ఎక్కువని, అలాంటి వ్యక్తితో కలిసి ఆడటం తనకు గర్వకారణమని కొనియాడాడు. కాగా ముంబైలోని వాంఖడే వేదికగా పంజాబ్ కింగ్స్‌తో శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో కేకేఆర్ ఘన విజయం సాధించిన తెలిసిందే. ఆరు వికెట్ల తేడాతో పంజాబ్‌ను మట్టికరిపించి.. ఈ సీజన్లో తమ రెండో గెలుపును నమోదు చేసింది. 34 ఏళ్ల ఉమేశ్ యాదవ్ అద్భుత బౌలింగ్‌కు తోడు 33 ఏళ్ల ఆండ్రీ రసెల్ అదిరిపోయే ఇన్నింగ్స్‌తో ఈ విజయం సాధ్యమైంది. ఈ నేపథ్యంలో మ్యాచ్ అనంతరం కేకేఆర్ సారథి శ్రేయస్ అయ్యర్ ఉమేశ్ యాదవ్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ‘‘తనకు వయసై పోతుందని ఉమేశ్ నాతో అన్నాడు. కానీ నేను మాత్రం నువ్వు రోజురోజుకు ఫిట్‌గా తయారవుతున్నావని చెప్పాను. జిమ్‌కు ఎప్పుడు వెళ్లినా ఉమేశ్ కసరత్తులు చేస్తూ కనిపిస్తాడు. అతడిది కష్టపడే తత్వం. తను నా సహచర ఆటగాడిగా ఉండటం గొప్ప విషయం’’ అని శ్రేయస్ అయ్యర్ వ్యాఖ్యానించాడు. కోల్‌కతా నైట్‌రైడర్స్ వర్సెస్ పంజాబ్ కింగ్స్ మ్యాచ్ స్కోర్లు: పంజాబ్ కింగ్స్- 137 (18.2) కేకేఆర్- 141/4 (14.3). చదవండి: IPL 2022: ముంబై ఇండియన్స్‌కు గుడ్‌న్యూస్.. విధ్వంసకర వీరుడు వచ్చేశాడు! A thumping win for @KKRiders 💪 💪 The @ShreyasIyer15 -led unit returns to winning ways as they beat #PBKS by 6⃣wickets👏 👏 Scorecard ▶️ https://t.co/JEqScn6mWQ #TATAIPL | #KKRvPBKS pic.twitter.com/UtmnpIufGJ — IndianPremierLeague (@IPL) April 1, 2022 -
IPL 2022: అతడి సహకారం వల్లే ఇదంతా సాధ్యమైంది: రసెల్
IPL 2022: 31 బంతుల్లో 70 పరుగులు.. రెండు ఫోర్లు.. ఎనిమిది సిక్సర్లు.. స్ట్రైక్ రేటు 225.81. ఇలాంటి అద్భుత ఇన్నింగ్స్‌తో.. భారీ షాట్లతో ఐపీఎల్ అభిమానులకు అమితమైన వినోదాన్ని పంచాడు కోల్‌కతా నైట్‌రైడర్స్ స్టార్ హిట్టర్ ఆండ్రీ రసెల్. విధ్వంసకర ఆట తీరుతో పంజాబ్ కింగ్స్ బౌలర్లకు చుక్కలు చూపించాడు. డెబ్బై పరుగులతో అజేయంగా నిలిచి కేకేఆర్ విజయంలో కీలక పాత్ర పోషించి తానేంటో మరోసారి నిరూపించుకున్నాడు. ఆరో స్థానంలో బ్యాటింగ్‌కు దిగి తన ప్రదర్శనతో పొట్టి ఫార్మాట్ ప్రేమికులకు రసెల్ అసలైన మజాను అందించాడు. కేకేఆర్ క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న వేళ తానున్నాంటూ సామ్ బిల్లింగ్స్ సహకారంతో జట్టును విజయతీరాలకు చేర్చాడు. ఈ నేపథ్యంలో తన ప్రదర్శనపై సంతృప్తి వ్యక్తం చేసిన రసెల్.. తానేం చేయగలనో తనకు తెలుసనని వ్యాఖ్యానించాడు. ఈ మేరకు విజయానంతరం మాట్లాడుతూ.. ‘‘ఈ ఫీలింగ్ అద్బుతంగా ఉంది. ఇలాంటి అనుభూతుల కోసమే కదా క్రికెట్ ఆడేది! జట్టు అలాంటి పరిస్థితుల్లో ఉన్నపుడు నేనేం చేయాలో.. నేనేం చేయగలనో నాకు తెలుసు. సామ్ బిల్లింగ్స్ వంటి ఆటగాడు సహకారం అందిస్తూ.. స్ట్రైక్ రొటేట్ చేయడం కలిసి వచ్చింది. నా శక్తిసామర్థ్యాలేమిటో నాకు తెలుసు. క్లిష్ట పరిస్థితుల నుంచి జట్టును బయటపడేయడం పట్ల ఎంతో సంతోషంగా ఉన్నోఆ. జట్టు ప్రయోజనాల కోసం నేను ఏం చేయడానికైనా సిద్ధం. బ్యాట్‌తోనే కాదు బంతితోనూ రెడీగా ఉంటా’’ అని రసెల్ పేర్కొన్నాడు. కాగా పంజాబ్ కింగ్స్‌తో మ్యాచ్‌లో బ్యాట్ ఝులిపించడంతో పాటు రసెల్ బంతితోనూ మెరిసిన విషయం తెలిసిందే. కగిసో రబడ వికెట్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు. ఇక ఈ మ్యాచ్‌లో బౌలర్ ఉమేశ్ యాదవ్ విజృంభణ, రసెల్ మెరుపు బ్యాటింగ్‌తో కేకేఆర్ పంజాబ్‌పై 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. చదవండి: IPL 2022: రసెల్ విధ్వంసం A thumping win for @KKRiders 💪 💪 The @ShreyasIyer15 -led unit returns to winning ways as they beat #PBKS by 6⃣wickets👏 👏 Scorecard ▶️ https://t.co/JEqScn6mWQ #TATAIPL | #KKRvPBKS pic.twitter.com/UtmnpIufGJ — IndianPremierLeague (@IPL) April 1, 2022 -
పంజాబ్ బౌలర్‌కు చుక్కలు చూపించిన రసెల్
ఐపీఎల్ 2022లో ఆండ్రీ రసెల్ తన విధ్వంసం ఎలా ఉంటుందో రుచి చూపించాడు. ఫామ్‌లోకి వస్తే ఎంతటి డేంజర్ బ్యాట్స్‌మన్ అనేది చెప్పకనే చెప్పాడు. 51 పరుగుల వద్ద నాలుగో వికెట్ కోల్పోయిన దశలో క్రీజులోకి వచ్చిన రసెల్ ఆట స్వరూపాన్నే మార్చేశాడు. ఆరంభంలో కాస్త నిధానంగా కనిపించిన రసెల్ ఇన్నింగ్స్ 10వ ఓవర్లో గేర్ మార్చాడు. హర్‌ప్రీత్ బార్ వేసిన పదో ఓవర్లో రెండు సిక్సర్లు బాదిన రసెల్ మొత్తంగా 17 పరుగులు పిండుకున్నాడు. ఆ తర్వాత ఓడియన్ స్మిత్ వేసిన ఇన్నింగ్స్ 12వ ఓవర్లో ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. స్మిత్ వేసిన ఆ ఓవర్లో మూడు సిక్సర్లు, ఒక ఫోర్, నో బాల్ సహా మొత్తం 24 పరుగులు రసెల్ పిండుకోగా.. చివరి బంతిని సామ్ బిల్లింగ్స్ సిక్సర్ సంధించడంతో మొత్తంగా ఆ ఓవర్లో 30 పరుగులు వచ్చాయి. మ్యాచ్ టర్నింగ్ పాయింట్ కావడంతో పాటు స్మిత్‌కు రసెల్ చుక్కలు చూపించాడు. ఆండ్రీ రసెల్ విధ్వంసం కోసం క్లిక్ చేయండి చదవండి: IPL 2022: పంజాబ్ కింగ్స్ అంటే ఉమేశ్ యాదవ్‌కు ఎందుకంత ఇష్టం! PERSISTENCE. RESILIENCE. DOMINANCE. 💜#KKRHaiTaiyaar #KKRvPBKS #IPL2022 pic.twitter.com/axcYImDqkg — KolkataKnightRiders (@KKRiders) April 1, 2022 -
IPL 2022: బెంగ తీర్చిన హసరంగ
129 పరుగుల విజయ లక్ష్యం అంటే పెద్ద కష్టమేమీ కాదు... ఆడుతూ, పాడుతూ ఛేదించవచ్చని అనిపిస్తుంది. కానీ దీనిని అందుకునేందుకు కూడా రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) తీవ్రంగా శ్రమించింది. 7 వికెట్లు కోల్పోయి చివరి ఓవర్ రెండో బంతికి గానీ లక్ష్యం చేరలేదు... ఆఖర్లో తడబడ్డా అదృష్టం ఆ జట్టు పక్షాన నిలిచింది. అంతకుముందు కోల్‌కతా నైట్‌రైడర్స్ (కేకేఆర్) సాధారణ బ్యాటింగ్ ప్రదర్శనతో తక్కువ స్కోరుకే పరిమితమైంది. హసరంగ తన లెగ్ స్పిన్‌తో నైట్‌రైడర్స్‌ను కట్టి పడేయగా, హర్షల్ పటేల్ కూడా పొదుపైన బౌలింగ్‌తో ఆకట్టుకున్నాడు. ముంబై: తొలి మ్యాచ్‌లో ఓడిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరుకు మలి పోరులో విజయం దక్కింది. బుధవారం జరిగిన మ్యాచ్‌లో ఆర్సీబీ 3 వికెట్ల తేడాతో కోల్‌కతా నైట్‌రైడర్స్‌ను ఓడించింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన కేకేఆర్ 18.5 ఓవర్లలో 128 పరుగులకే ఆలౌటైంది. ఆండ్రీ రసెల్ (18 బంతుల్లో 25; 1 ఫోర్, 3 సిక్స్‌లు)దే అత్యధిక స్కోరు. వనిందు హసరంగ (4/20) నాలుగు వికెట్లతో ప్రత్యర్థిని దెబ్బ తీయగా, ఆకాశ్‌దీప్ 3, హర్షల్ 2 వికెట్లు తీశారు. అనంతరం బెంగళూరు 19.2 ఓవర్లలో 7 వికెట్లకు 132 పరు గులు చేసి గెలిచింది. రూథర్‌ఫర్డ్ (40 బంతుల్లో 28; 1 ఫోర్, 1 సిక్స్) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. టపటపా... గత మ్యాచ్‌లో చక్కటి విజయం సాధించిన కోల్‌కతా తర్వాతి మ్యాచ్‌కే పేలవ ప్రదర్శన కనబర్చింది. ఏ దశలోనూ జట్టు ఇన్నింగ్స్ నిలకడగా సాగలేదు. పవర్‌ప్లే ముగిసేసరికే వెంకటేశ్ అయ్యర్ (10), రహానే (9), నితీశ్ రాణా (10) పెవిలియన్ చేరగా, తర్వాతి ఓవర్లోనే శ్రేయస్ అయ్యర్ (13) వెనుదిరిగాడు. తన తొలి ఓవర్లోనే శ్రేయస్‌ను అవుట్ చేసిన హసరంగ, తర్వాతి ఓవర్లో వరుస బంతుల్లో నరైన్ (12), షెల్డన్ జాక్సన్ (0) పని పట్టాడు. రసెల్ ధాటిగా ఆడే ప్రయత్నం చేసినా, బిల్లింగ్స్ (14) కూడా విఫలం కావడం కేకేఆర్‌ను దెబ్బ తీసింది. చివర్లో ఉమేశ్ యాదవ్ (18) కొన్ని పరుగులు జోడించడంతో కనీస స్కోరు నమోదైంది. తన 4 ఓవర్లలో 2 మెయిడిన్లు వేసిన పేసర్ హర్షల్ పటేల్... ఐపీఎల్లో ఈ ఘనత సాధించిన రెండో బౌలర్‌గా (సిరాజ్ తర్వాత– 2020లో కోల్‌కతాపైనే) నిలవడం విశేషం. తడబడుతూనే... ఛేదనలో బెంగళూరు ఇన్నింగ్స్ కూడా గొప్పగా సాగలేదు. తొలి మూడు ఓవర్లలో వరుసగా రావత్ (0), డుప్లెసిస్ (5), కోహ్లి (12) వెనుదిరిగారు. విల్లీ (18) కూడా ప్రభావం చూపలేకపోయాడు. రూథర్‌ఫర్డ్ బాగా నెమ్మదిగా ఆడగా... షహబాజ్ అహ్మద్ (20 బంతుల్లో 27; 3 సిక్స్‌లు) ఇన్నింగ్స్ బెంగళూరుకు కాస్త ఊపు తెచ్చింది. చివర్లో 10 పరుగుల వ్యవధిలో 3 వికెట్లు కోల్పోయి కొంత ఉత్కంఠ పెరిగినా... దినేశ్ కార్తీక్ (14 నాటౌట్), హర్షల్ పటేల్ (10 నాటౌట్) జాగ్రత్తగా ఆడి మరో నాలుగు బంతులు మిగిలి ఉండగా మ్యాచ్‌ను ముగించారు. స్కోరు వివరాలు కోల్‌కతా నైట్‌రైడర్స్ ఇన్నింగ్స్: రహానే (సి) షహబాజ్ (బి) సిరాజ్ 9; వెంకటేశ్ (సి అండ్ బి) ఆకాశ్‌దీప్ 10; శ్రేయస్ (సి) డుప్లెసిస్ (బి) హసరంగ 13; రాణా (సి) విల్లీ (బి) ఆకాశ్‌దీప్ 10; నరైన్ (సి) ఆకాశ్‌దీప్ (బి) హసరంగ 12; బిల్లింగ్స్ (సి) కోహ్లి (బి) హర్షల్ 14; జాక్సన్ (బి) హసరంగ 0; రసెల్ (సి) కార్తీక్ (బి) హర్షల్ 25; సౌతీ (సి) డుప్లెసిస్ (బి) హసరంగ 1; ఉమేశ్ (బి) ఆకాశ్‌దీప్ 18; వరుణ్ (నాటౌట్) 10; ఎక్స్‌ట్రాలు 6; మొత్తం (18.5 ఓవర్లలో ఆలౌట్) 128. వికెట్ల పతనం: 1–14, 2–32, 3–44, 4–46, 5–67, 6–67, 7–83, 8–99, 9–101, 10–128. బౌలింగ్: విల్లీ 2–0–7–0, సిరాజ్ 4–0–25–1, ఆకాశ్‌దీప్ 3.5–0–45–3, హసరంగ 4–0–20–4, హర్షల్ 4–2–11–2, షహబాజ్ 1–0–16–0. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఇన్నింగ్స్: డుప్లెసిస్ (సి) రహానే (బి) సౌతీ 5; రావత్ (సి) జాక్సన్ (బి) ఉమేశ్ 0; కోహ్లి (సి) జాక్సన్ (బి) ఉమేశ్ 12; విల్లీ (సి) రాణా (బి) నరైన్ 18; రూథర్‌ఫర్డ్ (సి) జాక్సన్ (బి) సౌతీ 28; షహబాజ్ (స్టంప్డ్) జాక్సన్ (బి) వరుణ్ 27; దినేశ్ కార్తీక్ (నాటౌట్) 14; హసరంగ (సి) రసెల్ (బి) సౌతీ 4; హర్షల్ (నాటౌట్) 10; ఎక్స్‌ట్రాలు 14; మొత్తం (19.2 ఓవర్లలో 7 వికెట్లకు) 132. వికెట్ల పతనం: 1–1, 2–17, 3–17, 4–62, 5–101, 6–107, 7–111. బౌలింగ్: ఉమేశ్ యాదవ్ 4–0–16–2, సౌతీ 4–0–20–3, రసెల్ 2.2–0–36–0, నరైన్ 4–0–12–1, వరుణ్ 4–0–33–1, వెంకటేశ్ 1–0–10–0. ఐపీఎల్లో నేడు చెన్నై సూపర్ కింగ్స్ X లక్నో సూపర్ జెయింట్స్ వేదిక: ముంబై, రాత్రి గం. 7:30 నుంచి స్టార్ స్పోర్ట్స్–1లో ప్రత్యక్ష ప్రసారం That's that from Match 6 of #TATAIPL. A nail-biter and @RCBTweets win by 3 wickets. Scorecard - https://t.co/BVieVfFKPu #RCBvKKR #TATAIPL pic.twitter.com/2PzouDTzsN — IndianPremierLeague (@IPL) March 30, 2022 -
ప్రాక్టీస్ సమయంలో వింత అనుభవం.. మళ్లీ బుక్కైన రసెల్
బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్(బీపీఎల్ 2022) ఏ ముహూర్తానా మొదలైందో కానీ.. చిత్రమైన ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. గతవారం రసెల్‌ను విధి ఆడుకున్న తీరు అంత తొందరగా ఎవరు మరిచిపోలేరు. ఎవరూ ఊహించని రీతిలో రనౌట్ అయిన ఆండ్రీ రసెల్ మరోసారి బుక్కయ్యాడు. ఈసారి రనౌట్ మాత్రం కాదులెండి..హెలికాప్టర్ రూపంలో రసెల్‌ను భయపెట్టింది.బీపీఎల్‌లో భాగంగా చిట్టోగ్రామ్‌లోని ఎంఏ ఆజీజ్ స్టేడియంలో రసెల్ సహా తమీమ్ ఇక్బాల్, మోర్తజా, మహ్మద్ షెహజాద్‌లు సీరియస్‌గా ప్రాక్టీస్ చేస్తున్నారు. చదవండి: Andre Rusell: రసెల్‌తో ఆడుకున్న 'విధి'.. క్రికెట్ చరిత్రలో మిగిలిపోవడం ఖాయం ఇదే సమయంలో స్డేడియంలో ఒక హెలికాప్టర్ ల్యాండ్ అయింది. దీంతో రసెల్ సహా మిగిలిన ఆటగాళ్లు ఏం జరిగిందోనని భయపడిపోయారు. విషయం ఏంటని ఆరా తీయగా.. హెలికాప్టర్లో ప్రయాణిస్తున్న వ్యక్తికి ఆరోగ్య సమస్య తలెత్తడంతో ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేయాల్సి వచ్చింది. అయితే దీనికి ముందు ఎయిర్వేస్ అధికారులు జిల్లా కమిషనర్‌తో పాటు స్పోర్ట్స్ అసోసియేషన్‌తో మాట్లాడారు. వీరి చొరవతో..చట్టోగ్రామ్ స్టేడియం అధికారులు హెలికాప్టర్ ల్యాండింగ్‌కు అనుమతి ఇచ్చారని తెలిసింది. ఆ తర్వాత అంబులెన్స్‌లో ఆ వ్యక్తిని ఆసుపత్రికి తరలించడంతో పరిస్థితి సద్దుమణిగింది. ఈ విషయం ఆటగాళ్లకు తెలియక కాస్త కంగారుపడ్డారు. అయితే ఈ విషయాన్ని బీపీఎల్ తన ట్విటర్లో షేర్ చేయగా..''పాపం రసెల్‌ను నిజంగా ఏదో వెంటాడుతుంది.. మళ్లీ బుక్కైన రసెల్.. బీపీఎల్‌లో ఈ ఏడాది ఏది కలిసిరావడం లేదు..'' అంటూ నెటిజన్లు కామెంట్స్ చేశారు. ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. చదవండి: BBL 2021-22: రసెల్ సునామీ ఇన్నింగ్స్.. సిక్సర్లతో ఊచకోత..! Helicopter lands suddenly in Chattogram when Andre Russell, Tamim Iqbal were practicing 😲#BPL2022 #AndreRussell #TamimIqbal #Cricket pic.twitter.com/9TpwavCTQ5 — SportsTiger (@sportstigerapp) February 1, 2022 -
రసెల్‌తో ఆడుకున్న 'విధి'.. క్రికెట్ చరిత్రలో మిగిలిపోవడం ఖాయం
క్రికెట్లో రనౌట్లు జరగడం సహజం. అందులో కొన్ని విచిత్ర రనౌట్లు ఉంటాయి. ఇప్పుడు మనం చెప్పుకునే రనౌట్ మాత్రం అంతకుమించినది. అసలు ఎవరు ఊహించని రీతిలో ఆండ్రీ రసెల్ రనౌటవ్వడం క్రికెట్ చరిత్రలో ఎప్పటికి నిలిచిపోతుంది. బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్ ఇది చోటుచేసుకుంది. ఢాకా ప్లాటూన్, కుల్నా టైగర్స్ మధ్య శుక్రవారం మ్యాచ్ జరిగింది. చదవండి: BBL 2021-22: స్టన్నింగ్ క్యాచ్.. చరిత్రలో నిలిచిపోయే అవకాశం మిస్సయింది ఆండ్రీ రసెల్, మహ్మదుల్లా నిలకడైన బ్యాటింగ్‌తో ఢాకా ప్లాటూన్ ఇన్నింగ్స్ సజావుగా సాగుతుంది. ఇద్దరి మధ్య మంచి భాగస్వామ్యం కూడా ఏర్పడింది. ఇన్నింగ్స్ 15వ ఓవర్లో ఐదో బంతిని రసెల్ భారీ సిక్స్ కొట్టి మంచి ఊపుమీద కనిపించాడు. ఓవర్ చివరి బంతికి సింగిల్ తీసి స్ట్రైక్ ఉంచుకోవాలని భావించి థర్డ్‌మన్ దిశగా ఆడాడు. మెహదీ హసన్ బంతిని అందుకొని స్ట్రైకింగ్ వైపు విసిరాడు. బంతి వికెట్లకు తాకినప్పటికి.. అప్పటికే మహ్మదుల్లా క్రీజులోకి చేరుకున్నాడు. అవతలి వైపు రసెల్ కూడా ఇక భయం లేదనుకొని కాస్త స్లో అయ్యాడు. ఇక్కడే రసెల్‌ను దురదృష్టం వెంటాడింది. మెహదీ హసన్ వేసిన త్రో స్ట్రైకింగ్ ఎండ్ వద్ద ఉన్న వికెట్లను తాకి.. మళ్లీ అక్కడినుంచి నాన్‌స్ట్రైకింగ్ ఎండ్‌వైపు వెళ్లింది. రసెల్ క్రీజులోకి చేరేలోపే బంతి వికెట్లను గిరాటేసింది. బిగ్స్క్రీన్పై రసెల్ క్లియర్ రనౌట్ అని తేలింది. పాపం తాను ఇలా ఔటవుతానని రసెల్ అసలు ఊహించి ఉండడు. తాను ఔటైన తీరుపై నవ్వాలో.. ఏడ్వాలో తెలియక ఆకాశం వైపు చూస్తూ పెవిలియన్ బాట పట్టాడు.'' విధి అతన్ని ఈ రకంగా వక్రీకరించింది... ఎంత ఘోరం జరిగిపోయింది..'' అంటూ క్రికెట్ ఫ్యాన్స్ కామెంట్స్ చేశారు. ప్రస్తుతం రసెల్ ఔటైన తీరు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. చదవండి: IND Vs SA: అరె! పంత్.. కొంచమైతే కొంపమునిగేది Rajinikant fielding? 😲😲😲pic.twitter.com/aWGwKMJYyG — Rohit Sankar (@imRohit_SN) January 21, 2022 -
ఆండ్రీ రసెల్ సునామీ ఇన్నింగ్స్.. సిక్సర్లతో విధ్వంసం
Andre Russell: విండీస్ విధ్వంసకర ఆల్‌రౌండర్ ఆండ్రీ రసెల్ బిగ్ బాష్ లీగ్ 2021-22లో సునామీ ఇన్నింగ్స్‌తో ప్రళయంలా విరుచుకుపడ్డాడు. ప్రస్తుత సీజన్లో మెల్బోర్న్ స్టార్స్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న ఈ కరీబియన్ యోధుడు.. సిడ్నీ థండర్‌తో జరిగిన మ్యాచ్‌లో సిక్సర్ల మోత మోగించాడు. 6 బంతుల్లో 5 సిక్సర్లు, ఓ ఫోర్‌తో 34 పరుగులు పిండుకుని మ్యాచ్ స్వరూపాన్నే మార్చేసాడు. ప్రత్యర్ధి నిర్ధేశించిన 152 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో మెల్బోర్న్ జట్టు 12 ఓవర్లలో 83 పరుగులకే 4 వికెట్లు కోల్పోయిన దశలో బరిలోకి దిగిన రసెల్.. 21 బంతుల్లో 200 స్ట్రైక్ రేట్‌తో 5 సిక్సర్లు, ఫోర్‌తో అజేయమైన 42 పరుగులు సాధించి మరో 17 బంతులు మిగిలుండగానే తన జట్టును విజయతీరాలకు చేర్చాడు. ఫలితంగా మెల్బోర్న్ స్టార్స్ 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ప్రత్యర్ధి బౌలర్లను ఊచకోత కోసిన రసెల్‌కే ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది. కాగా, రసెల్ ప్రాతినిధ్యం వహిస్తున్న జట్టుకు ఈ లీగ్‌లో(3 మ్యాచ్‌ల్లో) ఇది రెండో విజయం చదవండి: క్రికెట్ చరిత్రలో అరుదైన ఘట్టం.. ఒకే ఓవర్లో ఆరు వికెట్లు -
BBL 2021-22: బిగ్ బాష్ లీగ్‌లో విధ్వంసం సృష్టించనున్న రస్సెల్..
Melbourne Stars sign Andre Russell for Big Bash league 2021: వెస్టిండీస్ విద్వంసకర ఆల్‌రౌండర్ ఆండ్రీ రస్సెల్ తిరిగి బిగ్ బాష్ లీగ్‌లో అడుగు పెట్టనునన్నాడు. ప్రస్తుతం జరుగుతున్న11వ ఎడిషన్ కోసం మెల్బోర్న్ స్టార్స్‌తో ఒప్పందం రస్సెల్ కుదుర్చుకున్నాడు. ఈ విషయాన్ని మెల్బోర్న్ స్టార్స్ కోచ్ డేవిడ్ హస్సీ సృష్టం చేశాడు. రస్సెల్ లాంటి స్టార్ ఆటగాడు మాతో ఒప్పందం కుదుర్చుకోవడం చాలా సంతోషకరమని హస్సీ తెలిపాడు. రస్సెల్ ప్రపంచంలోని అత్యుత్తమ ఆటగాళ్లలో ఒకడని హస్సీ చెప్పాడు. డిసెంబర్10న సిడ్నీ థండర్స్‌తో జరిగే మ్యాచ్‌లో రస్సెల్ ఆడనున్నాడని హస్సీ పేర్కొన్నాడు. కాగా రస్సెల్‌కు బిగ్ బాష్ లీగ్‌లో ఆడడం ఇదేం తొలిసారి కాదు. అంతకుముందు రస్సెల్ ఈ లీగ్‌లో 2014 నుంచి 2017 వరకు సిడ్నీ థండర్స్ తరుపున ఆడాడు. కాగా ఐపీఎల్-14 సీజన్లో రస్సెల్ పేలవ ప్రదర్శన కనబర్చాడు. కానీ ఇటీవల ముగిసిన అబుదాబి టీ10 లీగ్‌లో రస్సెల్ అద్బుతంగా రాణించి తిరిగి ఫామ్‌లోకి వచ్చాడు. మరి ఈ ఆస్ట్రేలియాన్ లీగ్‌లో ఎలా రాణిస్తాడో వేచి చూడాలి. కాగా బిగ్ బాష్ లీగ్ డిసెంబర్ 5న ప్రారంభంమైన సంగతి తెలిసిందే. చదవండి: Ashes Series: ఇంగ్లండ్ చెత్త ఆట.. క్వీన్స్లాండ్ పోలీస్ విచారణ -
బౌలర్లను ఊచకోత కోసిన రస్సెల్.. 7 సిక్సర్లు, 9 ఫోర్లుతో..
Andre Russell helps Deccan Gladiators crowned champions of Abu Dhabi T10 Season 5: ఆండ్రీ రస్సెల్ విద్వంసం సృష్టించడంతో తొలిసారిగా అబుదాబి టీ10 టైటిల్‌ను డెక్కన్ గ్లాడియేటర్స్ ముద్దాడింది. డిసెంబర్ 4న జరిగిన ఫైనల్లో ఢిల్లీ బుల్స్‌పై 56 పరుగుల తేడాతో గ్లాడియేటర్స్ ఘన విజయం సాధించింది. టాస్ ఓడిబ్యాటింగ్ దిగిన డెక్కన్ గ్లాడియేటర్స్ ఓపెనర్లు రస్సెల్, కోహ్లర్-కాడ్మోర్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయారు. వీరిద్దరూ కలిసి 159 పరుగల అజేయ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. దీంతో నీర్ణీత 10 ఓవరల్లో వికెట్ నష్టపోకుండా గ్లాడియేటర్స్ 159 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్ధేశించింది. ఆండ్రీ రస్సెల్ కేవలం 32 బంతుల్లో 9 ఫోర్లు , 7 సిక్సర్లతో 90 పరుగులు సాధించాడు. అదే విధంగా కోహ్లర్-కాడ్మోర్ 3 ఫోర్లు, 5 సిక్సర్లతో 59 పరుగులు చేశాడు. 160 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీ బుల్స్ నీర్ణీత 10 ఓవరల్లో 7 వికెట్లు కోల్పోయి 103 పరుగులకే పరిమితమైంది. ఢిల్లీ బుల్స్ బ్యాటరల్లో చంద్రపాల్ హేమ్రాజ్ 42 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. డెక్కన్ గ్లాడియేటర్స్ బౌలరల్లో ఒడియన్ స్మిత్, వనిందు హసరంగా, టైమల్ మిల్స్ చెరో రెండు వికెట్లు సాధించారు. ఇక ప్లేయర్ ఆఫ్‌ది మ్యాచ్‌గా ఆండ్రీ రస్సెల్ ఎంపికకగా, ప్లేయర్ ఆఫ్‌ది సిరీస్‌ను వనిందు హసరంగా దక్కించుకున్నాడు. చదవండి: IND Vs NZ: వహ్వా అజాజ్! ఏమా బౌలింగ్.. ధనాధన్‌గా ‘టెన్’ రికార్డు -
T20 WC 2021: అతి పెద్ద సిక్స్ కొట్టిన రసెల్.. వీడియో వైరల్
Andre Russell Hits Biggest Six T20 WC 2021.. వెస్టిండీస్ ఆల్‌రౌండర్ ఆండీ రసెల్ టి20 ప్రపంచకప్ 2021లో అత్యంత భారీ సిక్స్‌తో మెరిశాడు. అది కూడా మిచెల్ స్టార్క్ లాంటి టాప్‌క్లాస్ పేసర్ బౌలింగ్‌లో ఇన్నింగ్స్ చివరి బంతికి రసెల్ సిక్స్ బాదాడు. రసెల్ కొట్టిన సిక్స్ మీటర్ రీడింగ్‌లో 111 మీటర్ల దూరంగా నమోదైంది. ఈ ప్రపంచకప్‌లో నమోదైన సిక్సర్లలో రసెల్ కొట్టిందే అతి పెద్దది కావడం విశేషం. ప్రస్తుతం రసెల్ కొట్టిన సిక్స్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. చదవండి: T20 World Cup 2021: ఆసీస్ చేతిలో విండీస్ కచ్చితంగా గెలవాలి.. లేదంటే..! View this post on Instagram A post shared by ICC (@icc) -
BAN Vs WI: రసెల్ డైమండ్ డక్.. వెంటాడిన దురదృష్టం
Russell Diamond Duck.. టి20 ప్రపంచకప్‌లో భాగంగా బంగ్లాదేశ్, వెస్టిండీస్ మ్యాచ్‌లో ఆండ్రీ రసెల్‌ను దురదృష్టం వెంటాడింది. ఒక్క బంతి ఎదుర్కోకుండానే రనౌట్‌గా వెనుదిరిగాడు. ఇన్నింగ్స్ 13వ ఓవర్ నాలుగో బంతిని తస్కిన్ అహ్మద్ రోస్టన్ చేజ్‌కు విసిరాడు. అతను స్ట్రెయిట్ డ్రైవ్ ఆడే ప్రయత్నం చేశాడు. అయితే అక్కడే ఉన్న తస్కిన్ అహ్మద్ కాలితో బంతిని టచ్ చేయడం.. అది వెళ్లి నేరుగా వికెట్లను గిరాటేయడం జరిగిపోయింది. అప్పటికే క్రీజు బయటికి వచ్చేసిన రసెల్ ఎవరు ఊహించని విధంగా రనౌట్(డైమండ్ డక్)అయ్యాడు. చదవండి: IND Vs NZ: కోహ్లి రెండుసార్లు ఓడిపోయావు.. మరి ఈసారైనా! ఇక టి20 ప్రపంచకప్‌ల్లో డైమండ్ డక్(ఒక్క బంతి ఎదుర్కోకకుండా ఔటవ్వడం) అయిన ఆటగాళ్ల జాబితాలో రసెల్ తొమ్మిదో ఆటగాడిగా నిలిచాడు. ఇంతకముందు డానియల్ వెటోరి(న్యూజిలాండ్), మొహమ్మద్ అమీర్(పాకిస్తాన్), మైకెల్ యార్డి(ఇంగ్లండ్), మిస్బా-ఉల్-హక్(పాకిస్తాన్), టి దిల్షాన్(శ్రీలంక), మహేళ జయవర్ధనే(శ్రీలంక), డేవిడ్ విల్లీ(ఇంగ్లండ్), ముస్తాఫిజుర్ రెహమాన్(బంగ్లాదేశ్) ఉన్నారు. చదవండి: T20 World Cup 2021: టాస్ గెలిస్తేనే విజయం.. శ్రీలంక లాంటి జట్లకు నష్టం: జయవర్ధనే Russell is run out by Taskin Ahmed for zero via @t20worldcup https://t.co/oTxgZEv65E — varun seggari (@SeggariVarun) October 29, 2021 -
WI VS SA: రసెల్ స్టన్నింగ్ త్రో.. దాదాపు 100 కిమీ వేగంతో
Andre Russel Bullet Throw.. టి20 ప్రపంచకప్ 2021లో వెస్టిండీస్, దక్షిణాఫ్రికా మ్యాచ్‌లో ఆండీ రసెల్ సూపర్ త్రోతో మెరిశాడు. దాదాపు 100 కిమీ వేగంతో విసిరిన డైరెక్ట్ త్రోకు దక్షిణాఫ్రికా కెప్టెన్ టెంబా బవుమా రనౌట్‌గా వెనుదిరిగాల్సి వచ్చింది. ఇన్నింగ్స్ తొలి ఓవర్లోనే ఇది చోటుచేసుకోవడం విశేషం. చదవండి: T20 WC 2021: ఫోకస్‌గా లేవు.. న్యూజిలాండ్‌తో మ్యాచ్‌కు పక్కనపెడుతున్నా తొలి ఓవర్‌ను ఎకిల్ హొస్సేన్ వేయగా.. చివరి బంతిని బవుమా మిడాన్ దిశగా ప్లిక్ చేశాడు. ఫీల్డర్ దూరంగా ఉండడంతో ఈజీ సింగిల్ అనుకున్నారు.. కానీ రసెల్ ఇక్కడే మ్యాజిక్ చేశాడు. వేగంగా ముందుకు పరిగెత్తుకు వచ్చిన రసెల్ బంతిని అందుకొని వేగంగా త్రో విసిరాడు. దీంతో బంతి డైరెక్టుగా వికెట్లను గిరాటేయడం.. బవుమా రనౌట్ కావడం చకచకా జరిగిపోయాయి. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం ట్రెండింగ్‌గా మారింది. చదవండి: T20 WC 2021 SA Vs WI: విండీస్ బ్యాటర్ చెత్త రికార్డు.. 35 బంతుల్లో..! A bullet of a throw from Russell gets the wicket of Bavuma via @t20worldcup https://t.co/87kxjf0Ysb — varun seggari (@SeggariVarun) October 26, 2021 -
IPL 2021 Final: ‘కెప్టెన్’ డ్రాప్ అయినా ఆశ్చర్యపడనక్కర్లేదు!
Don’t be surprised if Morgan drops himself: మరికొన్ని గంటల్లో ఐపీఎల్-2021 ఫైనల్ మ్యాచ్ ప్రారంభం కాబోతోంది. మాజీ చాంపియన్లు చెన్నై సూపర్ కింగ్స్, కోల్‌కతా నైట్‌రైడర్స్ తుదిపోరుకు సంసిద్ధమవుతున్నాయి. ఈ క్రమంలో ఇంగ్లండ్ మాజీ క్రికెటర్ మైకేల్ వాన్ కేకేఆర్ జట్టు కూర్పు గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. గాయం నుంచి కోలుకున్న ఆల్‌రౌండర్ ఆండ్రీ రసెల్ జట్టుతో చేరే అవకాశాలున్న వాన్... షకీబ్ అల్ హసన్ స్థానాన్ని అతడు భర్తీ చేసే ఛాన్స్ ఉందన్నాడు. ఒకవేళ అది కుదరకపోతే కేకేఆర్ కెప్టెన్ ఇయాన్ మోర్గాన్.. రస్సెల్ కోసం తనను తాను తుదిజట్టు నుంచి డ్రాప్ చేసుకున్నా ఆశ్చర్యపోనక్కర్లేదన్నాడు. కాగా ఐపీఎల్-2021 రెండో అంచెలో అద్భుతమైన కెప్టెన్సీతో ఆకట్టుకున్న మోర్గాన్... బ్యాటర్‌గా మాత్రం పూర్తిగా విఫలమవుతున్న సంగతి తెలిసిందే. ఈ సీజన్లో ఇప్పటి వరకు కేవలం 129 రన్స్ మాత్రమే చేసిన అతడు... కీలకమైన క్వాలిఫైయర్-2లో పరుగుల ఖాతా తెరవకుండానే వెనుదిరిగాడు. ఈ నేపథ్యంలో మైకేల్ వాన్ క్రిక్‌బజ్‌తో మాట్లాడుతూ... ‘‘షార్జాలో వాళ్లు బాగా ఆడారు. అక్కడి పిచ్‌పై పూర్తి అవగాహన ఉంది. అయితే, దుబాయ్‌లో పిచ్ కాస్త భిన్నంగా ఉంటుంది. ఆండ్రీ రస్సెల్‌తో నాలుగు ఓవర్లు వేయిస్తే బాగుంటుంది. లెఫ్టార్మ్ స్పిన్నర్ అవసరం లేదనుకుంటే... షకీబ్ స్థానంలో అతడు జట్టులోకి రావొచ్చు. ఇక మోర్గాన్ విషయానికొస్తే... జట్టు ప్రయోజనాల కోసం తను ఎంతటి తాగ్యానికైనా సిద్ధపడతాడు. తనను తాను తుది జట్టు నుంచి తప్పించుకున్నా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. తన పట్టుదల గురించి నాకు తెలుసు’’ అని చెప్పుకొచ్చాడు. చదవండి: MS Dhoni: హెలికాప్టర్ షాట్ ప్రాక్టీస్ చేస్తున్న ధోని.. వీడియో వైరల్ -
KKR vs RCB: కోల్‌కతా ధనాధన్ షో.. రసెల్ పడేశాడు, వరుణ్ తిప్పేశాడు
భారత్‌లో చక్కగా సాగిపోయిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు యూఏఈలో మాత్రం పేలవంగా ఆరంభించింది. కోహ్లి, డివిలియర్స్, మ్యాక్స్‌వెల్‌లాంటి సూపర్ హిట్టర్లున్న జట్టు కనీసం వంద పరుగులైనా చేయలేకపోయింది. మరోవైపు కోల్‌కతా నైట్‌రైడర్స్ జట్టు మాత్రం ధనాధన్ షోతో మ్యాచ్‌ను ముగించింది. మొదట స్పిన్–పేస్ బౌలింగ్ కలయికతో ప్రత్యర్థి ఆటకట్టించిన నైట్‌రైడర్స్ లక్ష్యాన్ని మెరుపువేగంతో ఛేదించింది. అబుదాబి: ఐపీఎల్–14 సీజన్ రెండో అంచెలో కోల్‌కతా నైట్‌రైడర్స్ బెబ్బులిలా పంజా విసిరింది. కోహ్లి సేనకు ఊహించని షాక్ ఇచ్చింది. బౌలింగ్‌లో వందలోపే కట్టడి చేసిన మోర్గాన్ బృందం బ్యాటింగ్‌లో 10 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఉఫ్‌మని ఊదేసింది. దీంతో 20–20 ఓవర్ల ఆట కాస్తా 29 ఓవర్లలోనే ముగిసింది. సోమవారం ముందుగా బ్యాటింగ్‌కు దిగిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు 19 ఓవర్లలో 92 పరుగుల వద్ద ఆలౌటైంది. ఓపెనర్ దేవ్‌దత్ పడిక్కల్ చేసిన 22 (20 బంతుల్లో 3 ఫోర్లు) పరుగులే వారి ఇన్నింగ్స్‌లో టాప్ స్కోర్. రసెల్ (3/9)) నిప్పులు చెరిగే స్పెల్‌తో... వరుణ్ చక్రవర్తి (3/13) తిప్పేసే మ్యాజిక్‌తో కోహ్లి సేన చేష్టలుడిగింది. తర్వాత కోల్‌కతా 10 ఓవర్లలో వికెట్ మాత్రమే కోల్పోయి 94 పరుగులు చేసి జయభేరి మోగించింది. ఓపెనర్లు శుబ్‌మన్ గిల్ (34 బంతుల్లో 48; 6 ఫోర్లు, 1 సిక్స్), వెంకటేశ్ అయ్యర్ (27 బంతుల్లో 41 నాటౌట్; 7 ఫోర్లు, 1 సిక్స్) చెలరేగారు. వరుణ్‌కు ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు దక్కింది. కోహ్లి 5, డివిలియర్స్ 0 బెంగళూరు దళానికి బ్యాటింగే బలం. అందులోనూ కోహ్లి, డివిలియర్స్‌ల బ్యాట్ల నుంచి జాలువారే పరుగులు, సిక్సర్లు అభిమానులకు కనువిందు. కానీ... సోమవారం కోల్‌కతా కసి ముందు ఎవరి ఆటలు సాగలేదు. మ్యాక్స్‌వెల్ రూపంలో జట్టుకు మరో మెరుపు వీరుడు జతయినప్పటికీ నైట్‌రైడర్స్ కట్టుదిట్టమైన బౌలింగ్‌కు మొత్తం బెంగళూరు ఇన్నింగ్సే చెల్లాచెదురైంది. రెండో ఓవర్లోనే కోహ్లి (5) ఔటయ్యాడు. పవర్‌ప్లేలో పడిక్కల్ పెవిలియన్ చేరాడు. 6 ఓవర్లు ముగిసేసరికి బెంగళూరు 41/2 స్కోరుతో బాగానే కనిపించింది. 9వ ఓవర్ వేసేందుకు రసెల్ వచ్చాక, స్పిన్నర్ వరుణ్ మ్యాజిక్ మొదలయ్యాక బెంగళూరు ఒక్కసారిగా కుదేలైంది. రసెల్ తన తొలి ఓవర్లోనే భరత్ (16), డివిలియర్స్ (0)ను ఔట్ చేశాడు. వరుణ్ కూడా తన సహచరుడినే ఫాలో అయ్యాడు. మ్యాక్స్‌వెల్ (10), హసరంగ (0)ను ఒకే ఓవర్లో ఔట్ చేశాడు. ఇలా 8 వికెట్లను 41 పరుగుల వ్యవధిలోనే కోల్పోయింది. ఓపెనర్లే చితగ్గొట్టారు... అవతలివైపు ఆపసోపాలు పడి చేసిన పరుగుల్ని ఇవతలివైపు ఇద్దరంటే ఇద్దరే బాదేశారు. కోల్‌కతా ఓపెనర్లు వెంకటేశ్ అయ్యర్, శుబ్‌మన్ గిల్ పోటీపడి మరీ బౌండరీలు బాదేశారు. దీంతో బెంగళూరు బౌలర్లు అలసిపోకుండా సగం కోటా (ఐదుగురు తలా 2 ఓవర్లు వేశారు)లోనే లక్ష్యం పూర్తయ్యింది. పదో ఓవర్లో గిల్ ఔటైనా... కావాల్సిన 11 పరుగుల్ని మూడు బౌండరీలతో వెంకటేశ్ అదే ఓవర్లో పూర్తి చేయడంతో రసెల్‌కు బంతిని ఎదుర్కొనే అవకాశమే చిక్కలేదు. స్కోరు వివరాలు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఇన్నింగ్స్: కోహ్లి (ఎల్బీ) (బి) ప్రసిధ్ కృష్ణ 5; పడిక్కల్ (సి) దినేశ్ కార్తీక్ (బి) ఫెర్గూసన్ 22; శ్రీకర్ భరత్ (సి) గిల్ (బి) రసెల్ 16; మ్యాక్స్‌వెల్ (బి) వరుణ్ 10; డివిలియర్స్ (బి) రసెల్ 0; సచిన్ బేబీ (సి) నితీశ్ (బి) వరుణ్ 7; హసరంగ (ఎల్బీ) (బి) వరుణ్ 0; జేమీసన్ (రనౌట్) 4; హర్షల్ పటేల్ (బి) ఫెర్గూసన్ 12; సిరాజ్ (సి) వరుణ్ (బి) రసెల్ 8; చహల్ (నాటౌట్) 2; ఎక్స్‌ట్రాలు 6; మొత్తం (19 ఓవర్లలో ఆలౌట్) 92. వికెట్ల పతనం: 1–10, 2–41, 3–51, 4–52, 5–63, 6–63, 7–66, 8–76, 9–83, 10–92. బౌలింగ్: వరుణ్ చక్రవర్తి 4–0–13–3, ప్రసిధ్ కృష్ణ 4–0–24–1, ఫెర్గూసన్ 4–0–24–2, నరైన్ 4–0–20–0, రసెల్ 3–0– 9–3. కోల్‌కతా నైట్‌రైడర్స్ ఇన్నింగ్స్: గిల్ (సి) సిరాజ్ (బి) చహల్ 48; వెంకటేశ్ (నాటౌట్) 41; రసెల్ (నాటౌట్) 0; ఎక్స్‌ట్రాలు 5; మొత్తం (10 ఓవర్లలో వికెట్ నష్టానికి) 94. వికెట్ పతనం: 1–82. బౌలింగ్: సిరాజ్ 2–0–12–0, జేమీసన్ 2–0–26–0, హసరంగ 2–0–20–0, చహల్ 2–0–23–1, హర్షల్ పటేల్ 2–0–13–0. -
రసెల్ ఆల్‌రౌండ్ మెరుపులు.. సెమీస్ ఆశలు సజీవం
జమైకా: కరీబియన్ ప్రీమియర్ లీగ్( సీపీఎల్ 2021)లో భాగంగా గురువారం జమైకా తలైవాస్, సెంట్ లూసియా మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో జమైకా తలైవాస్ ఘన విజయాన్ని అందుకుంది. రసెల్ ఆల్‌రౌండ్ ప్రదర్శన కనబరచడంతో జమైకా తలైవాస్ వరుసగా రెండో విజయాన్ని నమోదు చేసి సెమీస్ ఆశలు సజీవంగా ఉంచుకుంది.. ఇక సెంట్ లూసియా వరుసగా మూడో పరాజయాన్ని మూటగట్టుకుంది. చదవండి: విండీస్ టీ20 జట్టు ఇదే.. ఆరేళ్ల తర్వాత ఆ ఆటగాడికి పిలుపు మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన జమైకా తలైవాస్ నిర్ణీత 20 ఓవర్లలో 211 పరుగులకు ఆలౌట్ అయింది. ఓపెనర్ కెన్నర్ లూయిస్ 56 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా.. చివర్లో పొలార్డ్(31,15 బంతులు; 4 సిక్సర్లు), ఇమాద్ వసీమ్(27, 10 బంతులు; 1 ఫోర్, 3 సిక్సర్లు) మెరుపులు మెరిపించారు. సెంట్ లూసియా బౌలింగ్‌లో జెవర్ రాయల్, కదీమ్ అలీన్ చెరో మూడు వికెట్లు తీశారు. అనంతరం భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన సెంట్ లూసియా 156 పరుగులకే ఆలౌట్ అయింది. మార్క్ డేయల్ 33, ఆండ్రీ ఫ్లెచర్ 30 పరుగులు చేశారు. ఇమాద్ వసీమ్ 3, రసెల్ 2, కార్లోస్ బ్రాత్‌వైట్ 2 వికెట్లతో రాణించారు. ఈ విజయంతో తలైవాస్ 8 మ్యాచ్‌ల్లో 4 విజయాలు.. 4 ఓటములతో పాయింట్ల పట్టికలో 3వ స్థానంలో ఉండగా.. సెంట్ లూసియా కూడా 8 మ్యాచ్‌ల్లో 4 విజయాలు.. 4ఓటములతోనే ఉంది. అయితే నెట్ రన్‌రేట్ విషయంలో మైనస్‌లో ఉండడంతో నాలుగో స్థానంలో ఉంది. చదవండి: ఇదేం ఫీల్డింగ్‌రా బాబు.. ఒట్టి పుణ్యానికి నాలుగు పరుగులు MVP!!! An all round performance with bat and ball sees Imad Wasim pick up the @Dream11 MVP for match 24. #CPL21 #SLKvJT #CricketPlayedLouder #Dream11 pic.twitter.com/tFBWoJvGRu — CPL T20 (@CPL) September 10, 2021 -
శివాలెత్తిన రసెల్.. అతి భారీ స్కోర్ నమోదు చేసిన జమైకా తలైవాస్
సెయింట్ కిట్స్: కరీబియన్ ప్రిమియర్ లీగ్(సీపీఎల్) 2021 సీజన్లో భాగంగా సెయింట్ లూసియా కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో విండీస్ విధ్వంసకర యోధుడు ఆండ్రీ రసెల్(14 బంతులో 50; 3 ఫోర్లు, 6 సిక్సర్లు) ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. ప్రత్యర్ధి బౌలర్లను చితక్కొటి సీపీఎల్ చరిత్రలో తన జట్టు రెండో అతి భారీ స్కోర్ సాధించడంలో కీలకపాత్ర పోషించాడు. రసెల్ విధ్వంసానికి తోడు చాడ్విక్ వాల్టన్(29 బంతులో 47; 6 ఫోర్లు, 2 సిక్సర్లు), కెన్నార్ లూయిస్(21 బంతులో 48; 2 ఫోర్లు, 5 సిక్సర్లు), హైదర్ అలీ(32 బంతులో 45; 4 ఫోర్లు, 2 సిక్సర్లు), కెప్టెన్ రోమన్ పావెల్(26 బంతులో 38; 3 ఫోర్లు, సిక్సర్లు) చెలరేగి ఆడటంతో జమైకా తైలవాస్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 255 పరుగుల భారీ స్కోర్ సాధించింది. జమైకా తైలవాస్ టాపార్డర్ ధాటికి ప్రత్యర్ధి బౌలర్లు వణిపోయారు. సెయింట్ లూసియా కింగ్స్ బౌలర్లలో ఓబెద్ మెక్ కాయ్ 3 వికెట్లు పడగొట్టగా, రోస్టన్ ఛేజ్ 2 వికెట్లు దక్కించుకున్నాడు. అనంతరం 256 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో సెయింట్ లూసియా జట్టు ఆరంభంలోనే తడబడింది. జమైకా బౌలర్ ప్రిటోరియస్(3/25) సెయింట్ లూసియా జట్టును దారుణంగా దెబ్బకొట్టాడు. అతనికి క్రిస్ గ్రీన్(1/22), ఆండ్రీ రసెల్(1/9) తోడవ్వడంతో 5 ఓవర్ల తర్వాత సెయింట్ లూసియా స్కోర్ 56/5. ఆ జట్టు గెలవాలంటే 90 బంతుల్లో 200 పరుగులు చేయాల్సి ఉంది. చదవండి: నీకంత సీన్ లేదంటూ ఆ ఇద్దరు ఆంటీలు నన్ను రెచ్చగొట్టేవారు.. -
హెల్మెట్‌కు తాకిన బంతి.. స్ట్రెచర్‌పై వెళ్లిన రసెల్
అబుదాబి: విండీస్ ఆల్‌రౌండర్ ఆండ్రీ రసెల్.. తన పవర్ హిట్టింగ్తో ఎంతోమంది బౌలర్లకు చుక్కలు చూపించాడు. బంతిని బలంగా బాదే రసెల్‌కు షార్ట్‌బాల్ ఆడడంలో కాస్త వీక్నెస్ ఉంది. తాజాగా అదే షార్ట్‌బాల్ అతని హెల్మెట్‌కు బలంగా తాకడం.. స్ట్రెచర్‌పై మైదానం వీడేలా చేసింది. వివరాలు.. శుక్రవారం క్వెటా గ్లాడియేటర్స్, ఇస్లామాబాద్ యునైటెడ్ మధ్య మ్యాచ్ జరిగింది. అప్పటికే రెండు సిక్సర్లతో దూకుడు మీద కనిపించిన రసెల్‌కు ఇన్నింగ్స్ 14వ ఓవర్లో మహ్మద్ ముసా షార్ట్‌బాల్ వేశాడు. బంతి బౌన్స్ అయి రసెల్ హెల్మెట్‌కు బలంగా తాకింది. దాంతో తన హెల్మెట్ తీసిన రసెల్ గాయం తీవ్రతను చూసుకున్నాడు. ఫిజియో వచ్చి పరీక్షించి ఏం కాలేదు అన్నట్లుగా చెప్పి వెళ్లిపోయాడు. ఆ తర్వాత అదే తరహాలో వేసిన షార్ట్‌బాల్‌ను ఆడే షాట్ ఆడే ప్రయత్నంలో మహ్మద్ వసీమ్‌కు క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు. ఈ దశలో తల పట్టేయడంతో రసెల్ అలానే కింద కూర్చుండిపోయాడు. దీంతో అప్రమత్తమైన సిబ్బంది స్ట్రెచర్ తీసుకొచ్చి రసెల్‌ను దానిపై పడుకోబెట్టి తీసుకెళ్లారు. కాగా రసెల్ గాయం తీవ్రత గురించి ఎక్స్‌రే తర్వాతే తెలియనుంది. దీనికి సంబంధించిన వీడియోనూ పీఎస్ఎల్ తన ట్విటర్లో షేర్ చేయడంతో వైరల్‌గా మారాయి. అయితే రసెల్ గాయంపై అభిమానులు వినూత్నంగా స్పందించారు.'' రసెల్ ఇది ఐపీఎల్ కాదు.. పీఎస్ఎల్.. నువ్వు ఇంకా ఆ మాయలోనే ఉన్నట్లున్నావు..'' అంటూ కామెంట్ చేశారు. ఇక ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన క్వెటా గ్లాడియేటర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 133 పరుగులకు ఆలౌటైంది. గ్లాడియేటర్స్ బ్యాటింగ్‌లో వెదర్లాండ్ 43 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా..అజమ్ ఖాన్ 26 పరుగులు చేశాడు. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన ఇస్లామాబాద్ యునైటెడ్ 10 ఓవర్లలోనే వికెట్ కోల్పోకుండా లక్ష్యాన్ని చేధించి 10 వికెట్ల తేడాతో భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. కొలిన్ మున్రో (36 బంతుల్లోనే 90 పరుగులు; 12 ఫోర్లు, 5 సిక్సర్లు) విధ్వంసం సృష్టించగా.. ఉస్మాన్ ఖవాజా 41 పరుగులతో అతనికి సహకరించాడు.ఈ విజయంతో ఇస్లామాబాద్ యునైటెడ్ 6 పాయింట్లతో మూడో స్థానంలో నిలవగా.. వరుసగా నాలుగో పరాజయంతో క్వెటా ఆఖరి స్థానంలో నిలిచింది. లాహోర్ ఖలాండర్స్ 10 పాయింట్లతో టేబుల్ టాపర్‌గా కొనసాగుతుంది. చదవండి: అవసరమా.. ఇలాంటి ప్లేయర్స్ మనకు! 'బయోబబుల్ నా మెంటల్‌హెల్త్‌ను దెబ్బతీస్తుంది' One must always witness a Dre Russ show. This time cut short by @iMusaKhan 🪄 #MatchDikhao l #HBLPSL6 l #QGvIU pic.twitter.com/pemprmMbCj — PakistanSuperLeague (@thePSLt20) June 11, 2021 -
'బయోబబుల్ నా మెంటల్‌హెల్త్‌ను దెబ్బతీస్తుంది'
దుబాయ్: కరోనా మహమ్మారి వల్ల పదేపదే బయోబబూల్ సెక్యూర్‌లో ఉండడం వల్ల తన మెంటల్ హెల్త్ దెబ్బతింటుందని వెస్టిండీస్ ఆల్‌రౌండర్ ఆండ్రీ రసెల్ పేర్కొన్నాడు. తాజాగా పీఎస్ఎల్లో ఆడేందుకు దుబాయ్‌కు చేరుకున్న రసెల్ ఈ వ్యాఖ్యలు చేశాడు. ''నేను చేసిన ఈ వ్యాఖ్యలు నాకు మాత్రమే పరిమితం. బయోబబూల్ ఒక నరకంలా కనిపిస్తుంది.. అది నా మెంటల్‌హెల్త్‌ను దెబ్బతీస్తుంది. రెండేళ్లుగా బయోబబుల్ అనే పదం ఎక్కువగా వినాల్సి వస్తుంది.ఐపీఎల్ 14వ సీజన్లో భాగంగా భారత్‌లో అడుగపెట్టిన నేను బయోబబూల్‌లో ఉండాల్సి వచ్చింది. అలా ఒక బయోబబూల్ నుంచి మరోచోటికి వెళ్లిన నాకు బయటకు వెళ్లే అవకాశం లేకపోవడం, నచ్చిన ప్రదేశం.. కనీసం బయట నడిచేందుకు కూడా ఉండేది కాదు. ఇది నిజంగా నాకు కొంచెం వింతగా అనిపిస్తుంది. అయినా ఇవన్నీ తట్టుకోవడానికి ఒకటే కారణం. బయోబబూల్‌లో ఉంటున్నా నాకు ఇష్టమైన క్రికెట్‌ను ఆడుతున్నా.. ఇది గొప్ప విషయంగా భావిస్తున్నా.. నా జాబ్ నేను నిర్వహిస్తున్నా'' అంటూ చెప్పుకొచ్చాడు. కాగా రసెల్ పీఎస్ఎల్లో క్వెటా గ్లాడియేటర్స్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న సంగతి తెలిసిందే. ఇక నవంబర్‌లో కరోనా మహమ్మారితో వాయిదా పడిన పీఎస్ఎల్ను నిర్వహించేందుకు పీసీబీ సమాయత్తమవుతుంది. జూన్ 9 నుంచి 24 వరకు యూఏఈ వేదికగా పీఎస్ఎల్ జరగనుంది. చదవండి: పాపం మంచి షాట్ ఆడాడు కానీ గెలిపించలేకపోయాడు చీకటి రోజుల్ని గుర్తుచేసుకున్న రసెల్ -
చీకటి రోజుల్ని గుర్తుచేసుకున్న రసెల్
అహ్మదాబాద్: తన కెరీర్ మంచి పీక్‌లో ఉన్నప్పుడు తగిలిన ఎదురుదెబ్బలను వెస్టిండీస్ ఆల్‌రౌండర్ ఆండ్రీ రసెల్ గుర్తుచేసుకున్నాడు. ప్రస్తుత ఐపీఎల్లో కేకేఆర్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్న రసెల్.. చీకటి రోజుల్ని మరొకసారి నెమరవేసుకున్నాడు. తనను ప్రజలు డ్రగ్స్ తీసుకున్నానని ప్రశ్నించడం ఎప్పటికీ చేదు జ్ఞాపకమేనన్నాడు. తన కెరీర్ మంచి స్టేజ్‌లో ఉన్న 2017లో డ్రగ్స్ ఆరోపణలు రావడంతో నిషేధానికి గురైన విషయాన్ని తలచుకున్నాడు. కేకేఆర్ అప్లోడ్ చేసిన యూట్యూబ్ వీడియోలో గత జ్ఞాపకాలను పంచుకున్నాడు. ‘నా కెరీర్లో 2017 ఒక చెత్త ఏడాది. నేను క్రికెట్లో టాప్ గేర్‌లో ఉన్నప్పుడు నిషేధానికి గురయ్యా. నేను బంతిని హిట్ చేస్తే అది క్లీన్‌హిట్ అయ్యేది. ఏం జరిగిందో ప్రజలు తెలుసుకోవాలనుకున్నారు. నేను ఏదీ దాచాలను కోవడం లేదు. నేను టెస్టులు చేయించుకున్న తర్వాత క్రికెట్ ఆడేవాడిని. నేను 100 మీటర్ల దాటి సిక్స్ కొట్టగలను. షార్ట్ రన్ తీసుకునే 140 కి.మీ కంటే వేగంగా బౌలింగ్ చేయగలను. అటువంటిది నేను డ్రగ్స్ తీసుకున్నాని ప్రజలు ప్రశ్నించడం మొదలు పెట్టారు. ఇక్కడ నేను చూపించుకోవడానికి ఏమీ లేదు. కానీ ఎలా బయటపడాలో తెలుసు. రెండేళ్ల పాటు కోర్టు ప్రొసీడింగ్స్ జరిగాయి. ఆ సమయంలో నన్ను గట్టిగా కొట్టారు. ఇది నన్ను బాధించింది. ఇది దుష్ట ప్రపంచం. మనల్ని ఏదో రకంగా నాశనం చేయాలనే చూస్తారు. అప్పుడు ఎవరో ఒకరు తీసుకొచ్చిన బైబిల్‌పై ప్రమాణం చేసి చెప్పాను.. నేను ఏ తప్పు చేయలేదని బైబిల్‌పై ప్రమాణం చేశా. మహిళలు కానీ పురుషులు కానీ ఎవరూ కూడా బైబిల్‌పై ప్రమాణం చేసి అబద్ధం చెప్పరు. నాకు బైబిల్ అంటే చాలా గౌరవం’ అని రసెల్ ఆ వీడియోలో చెప్పుకొచ్చాడు. ఇక్కడ చదవండి: వార్నర్‌కు ఇంత అవమానమా.. ఇదేం బాలేదు మ్యాక్స్‌వెల్ ఇలా జరిగిందేంటి? -
క్రిస్ గేల్ డైవ్‌కు రసెల్ నవ్వులే నవ్వులు
అహ్మదాబాద్: క్రికెట్లో కొంతమంది బ్యాటింగ్ వరకే పరిమితమైతే, మరికొంతమంది బౌలింగ్ వరకే ఉంటారు. మరి బ్యాటింగ్‌కే పరిమితమయ్యే బ్యాటర్స్ కానీ బౌలింగ్‌కే పరిమితమయ్యే బౌలర్లు కానీ ఫీల్డింగ్‌లో అసాధారణ విన్యాసాలు కాకుండా సాధారణ విన్యాసాలు చేసినా విపరీతమైన నవ్వు రావడం ఖాయం. అందుకు నిన్న పంజాబ్ కింగ్స్- కేకేఆర్ జట్ల మధ్య అహ్మదాబాద్ వేదికగా జరిగిన మ్యాచే ఉదాహరణ. సాధారణంగా ఫీల్డింగ్‌లో పెద్దగా ఆకట్టుకోని గేల్.. ఈ మ్యాచ్‌లో డైవ్ కొట్టి అందరిలో నవ్వులు పూయించాడు. ఫీల్డింగ్ విన్యాసాలు పెద్దగా చేయని గేల్.. ఏకంగా జాంటీ రోడ్స్ తరహాలో డైవ్ కొట్టి మరీ బంతిని ఆపేశాడు. కోల్‌కతా నైట్‌రైడర్స్ ఛేజింగ్ చేసే సమయంలో జోర్డాన్ వేసిన ఓ ఫుల్లర్ డెలివరీని స్ట్రైకింగ్‌లో ఉన్న రాహుల్ త్రిపాఠి మిడ్ వికెట్‌వైపు ఆడాడు. కానీ అక్కడే ఫీల్డింగ్ చేస్తున్న గేల్ డైవ్ కొట్టి మరీ బంతిని ఆపేశాడు. దీనికి డగౌట్లో ఉన్న ఆండ్రీ రసెల్ తెగ నవ్వుకున్నాడు. అప్పటివరకూ సీరియస్‌గా ఉన్న రసెల్.. గేల్ డైవ్‌తో అసలు నవ్వును ఆపులేకపోయాడు. చేతిని అడ్డం పెట్టుకుని మరీ నవ్వుకున్నాడు. కామెంటేటర్లు కూడా రోడ్స్ డైవ్లా ఉందంటూ సరదాగా వ్యాఖ్యానించారు. ప్రస్తుతం పంజాబ్ కింగ్స్‌కు రోడ్స్ ఫీల్డింగ్ కోచ్‌గా ఉన్న సంగతి తెలిసిందే. గేల్ డైవ్, రసెల్ నవ్వులు వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో కేకేఆర్ విజయాన్ని నమోదు చేసింది. వరుసగా నాలుగు ఓటముల తర్వాత మరో విజయాన్ని కేకేఆర్ సాధించింది.. పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కేకేఆర్ 5 వికెట్ల తేడాతో విజయాన్ని అందుకుంది. 124 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన కేకేఆర్ 16.4 ఓవర్లలో లక్ష్యాన్ని చేధించింది. కేకేఆర్ కెప్టెన్ మోర్గాన్ 47 పరుగులు నాటౌట్‌గా నిలిచి విజయంలో కీలకపాత్ర పోషించాడు. త్రిపాఠి 41 పరుగులతో ఆకట్టుకున్నాడు. ఇక్కడ చదవండి: అక్కడ ఆడటానికి వెళ్లని మీరు.. ఐపీఎల్‌కు ఎలా వచ్చారు? Gayle diving like Jonty Rhodes and see the epic reaction of Russell 😂😂 pic.twitter.com/FjdbzGJ4ts — msc media (@mscmedia2) April 27, 2021 -
వారి వద్దకు ఏ ముఖం పెట్టుకుని వెళ్లాలి: రసెల్
ముంబై: సీఎస్కే-కేకేఆర్‌ల మధ్య బుధవారం జరిగిన మ్యాచ్ ఈ సీజన్ హైవోల్టేజ్ మ్యాచ్‌ల్లో ఒకటి. ఇందులో సీఎస్కే నమోదు చేసిన 220 భారీ స్కోరు ఒకటైతే, ఆపై కేకేఆర్ 202 పరుగులకు వచ్చి ఇంకా ఐదు బంతులు ఉండగా ఆలౌట్ కావడం మరొకటి. కాగా, రసెల్(54;22 బంతుల్లో 3 ఫోర్లు, 6 సిక్సర్లు), ఆడుతున్నంతసేపు మ్యాచ్ కేకేఆర్ వైపే ఉందనే అనిపించింది. కాగా, దినేశ్ కార్తీక్‌తో కలిసి 83 పరుగులు జత చేసిన తర్వాత రసెల్ ఆరో వికెట్‌గా ఔటయ్యాడు. రసెల్‌ను ఔట్ చేయకపోతే మ్యాచ్ చేజారిపోయే స్థితిలో అతను బౌల్ట్ అయ్యాడు. సామ్ కరాన్ వేసిన 12 ఓవర్ రెండో బంతి రసెల్ లెగ్ స్టంప్‌ను పట్టుకుపోవడంతో ఒక్కసారిగా కేకేఆర్ శిబిరంలో ఆందోళన నెలకొంది. రసెల్ ఆరో వికెట్‌గా ఔటైన తర్వాత అతను డగౌట్‌లోని మెట్లపైనే కూర్చుండిపోయాడు. గ్లౌజ్‌లు, ప్యాడ్లు, హెల్మెట్ తీయకుండా అలానే మ్యాచ్ చూస్తూ ఉండిపోయాడు. అనవసరంగా ఔట్ అయ్యాననే బాధ రసెల్‌లో స్పష్టంగా కనబడింది.. కీలక సమయంలో అయిపోయినందకు రసెల్‌లో పశ్చాత్తాపం కనిపించింది. మ్యాచ్ ముగిసి పోయిన తర్వాత రసెల్ అలా మెట్లపై కూర్చొండిపోవడం సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీనిపై తాజాగా వివరణ ఇచ్చిన రసెల్.. ‘అవును.. ఔటైన తర్వాత ఛేంజింగ్ రూమ్‌కు వెళ్లలేకపోయా. రూమ్‌కి ఎలా వెళ్లాలో తెలియక మెట్లపై కూర్చొండిపోయా. మా జట్టు సభ్యుల వద్దకు వెళ్లే ధైర్యం చేయలేకపోయా. వారి వద్దకు ఏ ముఖం పెట్టుకుని వెళతాం అనిపించింది. నేను వదిలేసాననుకున్న బంతి వికెట్లను పట్టుకుపోయింది. అది నాకు ఏమీ అర్థం కాలేదు. నేను ఎక్కువగా ఎమోషనల్ అవుతూ ఉంటా. అవే నన్ను మరింత రాటుదేలేలా చేస్తాయి. నా జాబ్ ఇంకా కంప్లీట్ కాలేదు. మా జట్టును గాడిలో పెట్టడమే నా ముందున్న కర్తవ్యం’ అని రసెల్ తన ఫ్రాంచైజీ అయిన కేకేఆర్ డాట్ ఇన్ తెలిపాడు. -
'ఎడమకాలుతో దాటుతా.. బ్యాట్‌ను నాలుగుసార్లు తిప్పుతా'
ముంబై: ప్రతి మనిషికి మూడ నమ్మకాలు ఉండడం సహజం.. ఏదైనా పని ప్రారంభించే ముందు తమకు ఇష్టమైన దేవుడిని తలుచుకోవడమో లేక ఇంకా ఏదైనా పని చేస్తుంటారు. అలా చూసుకుంటే ఒక క్రికెటర్‌కు కూడా మూడ నమ్మకాలు ఉంటాయి. ఉదాహరణకు భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ మైదానంలోకి వచ్చేముందు ప్రతీసారి ఆకాశంలోకి చూస్తూ దండం పెడుతాడు. సచిన్ ఒక్కడే కాదు.. ఎవరైనా సరే ఆటను ప్రారంభించేముందు నమ్మకంగా అనిపించే పని చేసిన తర్వాత బరిలోకి దిగుతారు. అలాంటి మూడ నమ్మకాలు నాకు ఉన్నాయని కేకేఆర్ విధ్వంసకర ఆటగాడు ఆండ్రీ రసెల్ పేర్కొన్నాడు. కేకేఆర్ యాజమాన్యం నైట్‌క్లబ్ సిరీస్ పేరిట ఒక కార్యక్రమం నిర్వహించింది. ఆ కార్యక్రమానికి రసెల్‌తో పాటు శివమ్ మావి అతిథులుగా వచ్చారు. ఈ సందర్భంగా వారు నిర్వహించిన ఇంటర్య్వూలో రసెల్ పలు ఆసక్తికర విషయాలు పేర్కొన్నాడు.''ప్రతీ ఆటగాడికి కొన్ని మూడ నమ్మకాలు ఉంటాయి. కొందరు వాటిని ఎక్కువ నమ్మితే.. మరికొందరు ఆచరిస్తారు. నేను రెండో కోవకు చెందినవాడిని. మైదానంలో అడుగుపెట్టే ముందు ప్రతీసారి నా ఎడమకాలుతో బౌండరీ రోప్‌ను దాటడం చేస్తుంటాను. ఆ తర్వాత బౌలర్ వేసే మొదటి బంతిని ఎదుర్కోవడానికి ముందు బ్యాట్‌ను నాలుగు.. అంతకంటే ఎక్కువసార్లు తిప్పుతాను. అలా చేయకపోతే.. నాకు ఆరోజు మ్యాచ్‌లో బ్యాటింగ్, బౌలింగ్‌లో మంచి ప్రదర్శన చేయలేనని నమ్మకం.'' అంటూ చెప్పుకొచ్చాడు. కాగా ఐపీఎల్ 14వ సీజన్లో బుధవారం సీఎస్కేతో జరిగిన మ్యాచ్‌లో రసెల్ విధ్వంసం అంత తొందరగా మరిచిపోలేం. 31 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి ఓటమి అంచున నిలిచిన కేకేఆర్‌ను కార్తిక్ సాయంతో రసెల్ ఇన్నింగ్స్ నడిపిన తీరు అద్బుతం. 22 బంతుల్లో 54 పరుగులు చేసిన రసెల్ ఇన్నింగ్స్‌లో 3 ఫోర్లు, 6 సిక్సర్లు ఉన్నాయి. రసెల్ ఔటైన తర్వాత కమిన్స్ (34 బంతుల్లో 66 నాటౌట్, 4 ఫోర్లు, 6 సిక్సర్లతో) విధ్వంసం సృష్టించాడు. 221 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన కేకేఆర్ ఒక దశలో గెలుపుకు దగ్గరైనా చివర్లో వరుసగా వికెట్లు కోల్పోవడంతో 18 పరుగుల తేడాతో ఓడి వరుసగా మూడో పరాజయాన్ని మూటగట్టుకుంది. ఇక కేకేఆర్ తన తర్వాతి మ్యాచ్‌ను ఏప్రిల్ 24న ముంబై వేదికగా రాజస్తాన్ రాయల్స్‌తో ఆడనుంది. చదవండి: రసెల్.. ఇది మమ్మల్ని బాధిస్తోంది..! ఎవరో ఎందుకని వాళ్లను వాళ్లే ట్రోల్ చేసుకున్నారు.. రసెల్ ఔట్ ప్లాన్‌లో భాగమా?.. ధోని రిప్లై అదిరింది Tap, tap, tap, tap, 𝗕𝗢𝗢𝗠 💥 Even #MuscleRussell himself has his superstitions, and they happen to be totally opposite to those of @ShivamMavi23 😅@Russell12A #KKRHaiTaiyaar #IPL2021 pic.twitter.com/9xrlDz2mc8 — KolkataKnightRiders (@KKRiders) April 23, 2021 -
రసెల్ ఔట్ ప్లాన్‌లో భాగమా?.. ధోని రిప్లై అదిరింది
ముంబై: సీఎస్కేతో మ్యాచ్.. కేకేఆర్‌కు 221 పరుగుల టార్గెట్. 31 పరుగులకే 5 వికెట్లు కోల్పోయిన మోర్గాన్ సేన. 100 పరుగులోపే ఆలౌట్ అవుతుందని విశ్లేషకుల అంచనా. కానీ అది జరగలేదు. దినేశ్ కార్తీక్-ఆండ్రీ రసెల్ దెబ్బకు మొత్తం పరిస్థితి మారిపోయింది. ఇద్దరూ కలిసి కేకేఆర్ ఇన్నింగ్స్ హెరెత్తించారు. కాగా, ఈ జోడి 83 పరుగులు జత చేసిన తర్వాత రసెల్ ఆరో వికెట్‌గా ఔటయ్యాడు. రసెల్‌ను ఔట్ చేయకపోతే మ్యాచ్ చేజారిపోయే స్థితిలో అతను బౌల్ట్ అయ్యాడు. సామ్ కరాన్ వేసిన 12 ఓవర్ రెండో బంతి రసెల్ లెగ్ స్టంప్‌ను పట్టుకుపోవడంతో ఒక్కసారిగా కేకేఆర్ శిబిరంలో నిరుత్సాహం.. సీఎస్కే శిబిరంలో ఫుల్ జోష్. కాగా, రసెల్ ఔట్ అనేది ప్లాన్ ప్రకారం జరిగిందా అనేది సగటు క్రికెట్ అభిమాని మదిలో మెదిలిన అనుమానం. బ్యాట్స్‌మన్ బ్యాటింగ్‌కు తగ్గట్టు వ్యూహాల్ని సిద్ధహస్తుడైన ధోనినే రసెల్‌ను ఔట్ చేయడానికి లెగ్ స్టంప్ ప్యాడ్స్లోకి బంతిని సంధించమన్నాడా.. కరాన్‌కు ఇలా చేయమని సలహా ఇచ్చాడా? ఇవే సందేహాలు. కానీ పోస్ట్ మ్యాచ్ కాన్ఫరెన్స్‌లో ధోని సమాధానమిచ్చాడు. ధోనికి ఎదురైన ఒక ప్రశ్నకు సమాధానంగా రసెల్ ఔట్‌పై వివరణ ఇచ్చాడు. ‘ రసెల్ ఔట్ ప్లాన్ ప్రకారమే జరిగిందని సులువుగా చెప్పేయవచ్చు. కానీ అలా జరగలేదు. నేను సామ్ కరాన్‌కు రసెల్ ఔట్‌పై ఎటువంటి సూచన చేయలేదు. లెగ్‌స్టంప్‌పై మేము చాలా బంతుల్నే వేశాం. అదొక అద్భుతమైన బంతి. అది అతని చేతి నుంచి సాధారణంగా వచ్చేంది తప్పా ఇక్కడ ప్లానింగ్ లేదు’ అని తెలిపాడు. ఈ మ్యాచ్‌లో కేకేఆర్ 19.1 ఓవర్లలో 202 పరుగులకే ఆలౌటై ఓటమి చెందింది. That #SamCurran delivery though! Andre Russell looked 🤯 #KKRvCSK pic.twitter.com/dLzUUdfjwK — Royden Gomes (@EkOldMonk) April 21, 2021 ఇక్కడ చదవండి: వైరల్: భజ్జీ కాళ్లు మొక్కిన రైనా.. వెంటనే రసెల్.. ఇది మమ్మల్ని బాధిస్తోంది..! -
భారీ టార్గెట్‌ను చూసి టాపార్డర్ జడుసుకుంది.. అందుకే అలా
ముంబై: చెన్నై, కేకేఆర్ జట్ల మధ్య బుధవారం జరిగిన ఆసక్తికర పోరులో చెన్నై నిర్ధేశించిన భారీ టార్గెట్‌ను(221 పరుగులు) చూసి కేకేఆర్ టాపార్డర్ జడుసుకుందని, ఆ టెన్షన్లో అనవసరపు షాట్లకు ప్రయత్నించి పేక మేడలా కుప్పకూలిందని కేకేఆర్ మాజీ కెప్టెన్ గౌతమ్ గంభీర్ ఆరోపించాడు. వాంఖడే లాంటి బ్యాట్స్‌మెన్ ఫ్రెండ్లీ పిచ్‌లపై ఎంత భారీ టార్గెట్ నిర్ధేశించినా ఛేజింగ్ చేసే జట్టు జంక కూడదని, కేకేఆర్ టాపార్డర్ ఆటగాళ్లు కాస్త బాధ్యతగా ఆడివుంటే ఫలితం మరోలా ఉండేదని ఆయన అభిప్రాయపడ్డాడు. ఈ విషయమై టాపార్డర్ బ్యాట్స్మెన్లు నిందార్హులేనని, వారి బాధ్యతారాహిత్యమే కేకేఆర్ కొంప ముంచిందని మండిపడ్డాడు. టాపార్డర్ ప్లేయర్స్ కాస్త నిలదొక్కుకున్న తరువాత భారీ షాట్లకు ప్రయత్నించాల్సిందని, కానీ వారు అనవసరపు షాట్లు ఆడి వికెట్లు పారేసుకున్నారని నిందించారు. 31 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో ఉన్నప్పుడు రసెల్ కూడా అనవసరపు షాట్ ఆడి వుంటే కేకేఆర్ స్కోర్ 40/6గా ఉండేదని, కానీ రసెల్ అలా చేయకపోవడం వల్ల మ్యాచ్‌పై చివరిదాకా ఆశలు సజీవంగా ఉన్నాయని పేర్కొన్నాడు. దీపక్ చాహర్ ధాటికి కేకేఆర్ 5.2 ఓవర్లలోనే 5 టాపార్డర్ వికెట్లు కోల్పోయి మ్యాచ్‌పై పట్టు కోల్పోయినప్పటికీ, లోయర్ ఆర్డర్ ఆటగాళ్లు రసెల్(22 బంతుల్లో 54; 3 ఫోర్లు, 6 సిక్సర్లు), దినేశ్ కార్తిక్(24 బంతుల్లో 40; 4 ఫోర్లు, 2 సిక్సర్లు), కమిన్స్(34 బంతుల్లో 66 నాటౌట్; 4 ఫోర్లు, 6 సిక్సర్లు)లు అద్వితీయమైన పోరాటం చేసి చెన్నై శిబిరంలో దడ పుట్టించిన వైనాన్ని కేకేఆర్ అభిమానులు చిరకాలం గుర్తుపెట్టుకుంటారని అన్నాడు. 6,7,8 స్థానాల్లో రసెల్, డీకే, కమిన్స్ లాంటి ఆటగాళ్లుండటం కేకేఆర్ అదృష్టమని ఆయన పేర్కొన్నాడు. కొండంత లక్ష్యం ముందున్నా లోయరార్డర్ ఆటగాళ్లు, ముఖ్యంగా కమిన్స్ చేసిన అరివీర భయంకరమైన పోరాటాన్ని ఆయన ఆకాశానికెత్తాడు. భారీ లక్ష్యాన్ని చూసి వాళ్లు కూడా చేతులెత్తేసి ఉంటే 70 లేదా 80 పరుగలకే కేకేఆర్ ఆలౌటయ్యేదన్నాడు. చివరిదాకా కమిన్స్ పోరాటం చేయడం, అతనికి టెయిలెండర్ల నుంచి సహకారం లభించకపోవడంతో కేకేఆర్ 18 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. చదవండి: 'ఈ పిచ్‌పై మాకు మొదటి మ్యాచ్.. అందుకే' -
రసెల్.. ఇది మమ్మల్ని బాధిస్తోంది..!
ముంబై: సీఎస్కే-కేకేఆర్‌ల మధ్య నిన్న(బుధవారం)జరిగిన మ్యాచ్ ఈ సీజన్ హైవోల్టేజ్ మ్యాచ్‌ల్లో ఒకటి. ఇందులో సీఎస్కే నమోదు చేసిన 220 భారీ స్కోరు ఒకటైతే, ఆపై కేకేఆర్ 202 పరుగులకు వచ్చి ఇంకా ఐదు బంతులు ఉండగా ఆలౌట్ కావడం మరొకటి. ఆ ఐదు బంతులు కేకేఆర్ ఆడి ఉండే ఆ మ్యాచ్‌లో ఫలితం ఎలా ఉండేది ఊహించడం కష్టమే. 20 ఓవర్ తొలి బంతిని ఆడిన కమిన్స్ స్టైకింగ్ తీసుకోవాలనే ఉద్దేశంతో రెండో పరుగు కోసం పరుగెట్టాడు. ఆ క్రమంలోనే ప్రసీద్ధ్ కృష్ణ రనౌట్ కావడంతో కేకేఆర్ కథ ముగిసింది. ఈ మ్యాచ్ చూసిన ఆ ఫ్రాంచైజీ అభిమానులకు ఇది తీవ్ర నిరాశను మిగిల్చింది. పవర్‌ప్లే ముగిసేసరికి ఐదు వికెట్లు కోల్పోయిన కేకేఆర్ ఇక్కడి వరకూ వచ్చిందంటే ఆండ్రీ రసెల్(54;22 బంతుల్లో 3 ఫోర్లు, 6 సిక్సర్లు), దినేశ్ కార్తీక్(40; 24 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స్‌లు), కమిన్స్(66 నాటౌట్; 34 బంతుల్లో 4 పోర్లు, 6 సిక్సర్లు)లు మాత్రమే. ఇందులో రసెల్, కమిన్స్‌లు ఆడిన ఇన్నింగ్స్ సీఎస్కేకు దడపుట్టించింది. రసెల్ ఆరో వికెట్‌గా ఔటైన తర్వాత అతను డగౌట్‌లోని మెట్లపైనే కూర్చుండిపోయాడు. గ్లౌజ్‌లు, ప్యాడ్లు, హెల్మెట్ తీయకుండా అలానే మ్యాచ్ చూస్తూ ఉండిపోయాడు. అనవసరంగా ఔట్ అయ్యాననే బాధ రసెల్‌లో స్పష్టంగా కనబడింది.. కీలక సమయంలో అయిపోయినందకు రసెల్‌లో పశ్చాత్తాపం కనిపించింది. రసెల్‌ను కెమెరాలు క్యాప్చుర్ చేయడం, అది సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఫ్యాన్స్ రసెల్ అలా చూస్తే బాధేస్తుందంటూ ట్వీట్లు చేస్తున్నారు. ‘ రసెల్ బ్యాటింగ్ చేసిన తీరు అమోఘం’ అని ఒక అభిమాని ట్వీట్ చేయగా, ‘ ప్రతీ క్రికెట్ లవర్ నిన్ను ఇలా చూసిన తర్వాత బాధపడకుండా ఉండడు’ అని స్పందించాడు. ‘ క్రికెట్ అనేది ఒక గేమ్.. దాన్ని తేలిగ్గా తీసుకోవాలి’ అని మరొక అభిమాని ట్వీట్ చేయగా, ‘రసెల్ బంగారం లాంటి మనసు కల్గిన మనిషి’ అని స్పందించారు. రసెల్ మెట్లపై అలానే కూర్చొండి పోయిన ఫోటోను షేర్లు చేస్తున్నారు నెటిజన్లు. ఇక్కడ చదవండి: అతను ఔటయ్యాక దూరంగా ఉంటా: మోర్గాన్ IPL 2021: ఇదేం నో బాల్ సైరన్.. క్రికెటర్ల అసహనం! -
మ్యాచ్ ఓడినందుకు షారుఖ్ క్షమాపణ.. స్పందించిన రసెల్
చెన్నై: మంగళవారం ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కేకేఆర్ పరాజయం చెందడంపై ఆ జట్టు సహ యజమాని షారుఖ్ క్షమాపణ చెప్పాడు. ''మ్యాచ్ ఓడిపోయినందుకు క్షమించండి.. ముంబై చేతిలో ఓడినప్పటికి తమ కుర్రాళ్లపై పూర్తి విశ్వాసం ఉందని.. రానున్న మ్యాచ్‌ల్లో అది నిలుపుకుంటారన్న నమ్మకం ఉంది'' అంటూ ట్వీట్ చేశాడు. కాగా షారుఖ్ ట్వీట్‌పై ఆ జట్టు ఆటగాడు.. ఆల్‌రౌండర్ ఆండ్రీ రసెల్ స్పందించాడు. ''షారుఖ్ చేసిన ట్వీట్‌ను నేను సమర్థిస్తాను. ఓటమి అనేది ప్రతీ జట్టుకు మామూలే. క్రికెట్ అంటే ఇలాగే ఉంటుంది. ఎంత ఆసక్తికరంగా సాగినా.. చివరికి ఏదో ఒక జట్టు ఓడిపోవాల్సిందే. ముంబై ఇండియన్సతో మేం నాణ్యమైన క్రికెట్ ఆడాం. మా కుర్రాళ్ల ప్రదర్శన బాగానే ఉంది.. వారిపై ఆత్మవిశ్వాసం ఉంది. మ్యాచ్‌లో ఓటమి చెందడంపై నిరాశం చెందాం.. కానీ ఇది ముగింపు కాదు.. లీగ్‌లో ఇది మాకు రెండో మ్యాచ్ మాత్రమే. ఈ ఓటమి నుంచి పాఠాలు నేర్చుకుంటాం. నేను వందల టీ20 మ్యాచ్‌లు ఆడాను. ఇలాంటి పరిస్థితులు ఎన్నోసార్లు ఎదుర్కొన్నా. మొదట్లో స్పష్టమైన ఆధిపత్యం చూపించే జట్లు హఠాత్తుగా ఓడిపోవడం చాలాసార్లు చూశాను. మంగళవారం ముంబైతో జరిగిన మ్యాచ్‌లోనూ అదే జరిగింది. రానున్న మ్యాచ్‌లకు ఆ తప్పులను పునరావృతం కాకుండా జట్టులో కొన్ని మార్పులతో బరిలోకి దిగనున్నాం.'' అంటూ చెప్పుకొచ్చాడు. కాగా ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రసెల్ అద్భుత బౌలింగ్ ప్రదర్శన చేశాడు. 2 ఓవర్లు మాత్రమే వేసి 15 పరుగులిచ్చి ఐదు వికెట్లు తీసి ఐపీఎల్లో అత్యుత్తమ గణాంకాలు నమోదు చేశాడు. అయితే ముంబై విధించిన 152 పరుగుల సాధారణ లక్ష్యంతో బరిలోకి దిగిన కేకేఆర్ రాహుల్ చహర్ స్పిన్ ఉచ్చులో చిక్కుకొని 7 వికెట్ల నష్టానికి 142 పరుగులు మాత్రమే చేసి 10 పరుగుల తేడాతో ఓటమి పాలయింది. కాగా కేకేఆర్ తన తర్వాతి మ్యాచ్‌ను ఏప్రిల్ 18న చెన్నై వేదికగా ఆర్సీబీతో తలపడనుంది. చదవండి: కేకేఆర్ మిడిలార్డర్‌పై ధ్వజమెత్తిన వీరూ నిర్లక్ష్యమే కేకేఆర్ కొంపముంచింది: లారా -
రసెల్, డీకేలలో గెలవాలన్న కసి కనబడలేదు: సెహ్వాగ్
చెన్నై: ముంబైతో మ్యాచ్‌ను చేజేతులా జారవిడిచిన కేకేఆర్ మిడిలార్డర్ బ్యాట్స్మెన్లు దినేశ్ కార్తీక్(11 బంతుల్లో 8 నాటౌట్), ఆండ్రీ రసెల్(15 బంతుల్లో 9)లపై టీమిండియా మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తాడు. ఆడుతూపాడుతూ విజయతీరాలకు చేరాల్సిన సమయంలో రసెల్, డీకేలు అలసత్వం ప్రదర్శించడాన్ని ఆయన ప్రశ్నించాడు. సరిపడా బంతులు, చేతిలో వికెట్లున్నా ఎదురుదాడి చేయకపోవడం ఏంటని నిలదీశాడు. రసెల్ క్రీజ్‌లోకి వచ్చినప్పుడు 27 బంతుల్లో 30 పరుగులు చేయాల్సి ఉంది, చేతిలో ఇంకా 5 వికెట్లు ఉన్నాయి. సునాయాసంగా గెలవాల్సిన ఇలాంటి పరిస్థితుల్లో కూడా వారిలో జట్టును గెలిపించాలన్న కసి కనిపించలేదని విమర్శించాడు. తొలి మ్యాచ్ విజయం అనంతరం కెప్టెన్ మోర్గాన్ చెప్పిన సానుకూల దృక్పథం అన్నది వీరిద్దరిలో ఏ కోశానా కనపడలేదని ఎద్దేవా చేశాడు. వారు మ్యాచ్‌ను ఆఖరి బంతి వరకు తీసుకెళ్లి గెలిపిద్దామనుకుని విఫలంమయ్యారని ఆరోపించారు. రసెల్, డీకేల కంటే ముందు బ్యాటింగ్‌కు దిగిన శుభ్‌మన్, నితీశ్ రాణా, షకిబ్, మోర్గాన్‌లు జట్టును గెలిపించాలన్న ఉద్దేశంతో బ్యాటింగ్ చేశారని, ఈ క్రమంలో వారు వికెట్లు కోల్పోయారని, కానీ రసెల్, డీకేల పరిస్థితి అలా కనిపించలేదని విమర్శించాడు. ఈ ఓటమితో కేకేఆర్ సిగ్గుతో తల దించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నాడు. కేకేఆర్ ఓటమిపై ఆ జట్టు సహా యజామని షారుక్ ఖాన్ సైతం అసంతృప్తి వ్యక్తం చేశాడు. గెలవాల్సిన మ్యాచ్‌లో ఓడినందుకుగాను ఆయన అభిమానులకు క్షమాపణలు కూడా చెప్పాడు. కాగా, రోహిత్ సేన నిర్దేశించిన 153 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో మోర్గాన్ బృందం 10 పరుగుల తేడాతో ఓటమి పాలైన సంగతి తెలిసిందే. -
మొన్న హర్షల్.. ఈరోజు రసెల్.. మళ్లీ అదే జట్టు
చెన్నై: కేకేఆర్ ఆల్‌రౌండర్ ఆండ్రీ రసెల్ తన ఐపీఎల్ కెరీర్లో అత్యుత్తమ గణాంకాలు నమోదు చేశాడు. చెపాక్ వేదికగా మంగళవారం ముంబైతో జరుగుతున్న మ్యచ్‌లో రసెల్ 2 ఓవర్లు మాత్రమే వేసి 15 పరుగులిచ్చి 5 వికెట్లు తీశాడు.ఈ నేపథ్యంలో రస్సెల్ తన పేరిట కొత్త రికార్డును నమోదు చేసుకున్నాడు. ఐపీఎల్లో ముంబై ఇండియన్స్‌పై 5 వికెట్లు తీసిన రెండో ఆటగాడిగా రస్సెల్ నిలిచాడు. ఇంతకముందు ఆర్సీబీ బౌలర్ హర్షల్ పటేల్ ముంబై ఇండియన్స్‌పై ఐదు వికెట్లు తీసిన తొలి ఆటగాడిగా నిలిచాడు. కాగా గణాంకాల విషయంలో రస్సెల్(5/15) తొలి స్థానంలో ఉండగా.. హర్షల్ పటేల్(5/27)తో రెండో స్థానంలో ఉన్నాడు. ఇక మూడో స్థానంలో రోహిత్ శర్మ(డెక్కన్ చార్జర్స్, 4/6)తో నిలిచాడు. ఇక కేకేఆర్ బౌలర్‌గా అత్యుత్తమ గణాంకాలతో రస్సెల్ తొలి స్థానంలో ఉండగా.. సునీల్ నరైన్ (5/19, వర్సెస్ కింగ్స్ పంజాబ్ ,2012) రెండో స్థానంలో.. వరుణ్ చక్రవర్తి ( 5/20, వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్, 2020) మూడో స్థానంలో ఉన్నారు. కాగా ఈ సీజన్లో ముంబై ఇండియన్స్‌ను బ్యాడ్‌లక్ వెంటాడుతున్నట్లు అనిపిస్తుంది. ఆర్సీబీతో జరిగిన మొదటి మ్యాచ్‌లో హర్షల్ పటేల్ ఐదు వికెట్లు తీయగా.. నేడు కేకేఆర్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో రస్సెల్ ఐదు వికెట్ల ఫీట్‌ను సాధించడం విశేషం. కాగా టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ముంబై ఇండియన్స్ ఇన్నింగ్స్ ఆధ్యంతం నిధానంగా సాగింది. సూర్యకుమార్ మినహా ఎవరు దాటిగా ఆడకపోవడంతో ముంబై పెద్దగా స్కోరు చేయలేకపోయింది. నిర్ణీత 20 ఓవర్లలో 152 పరుగులకు ఆలౌటైంది. చదవండి: సూర్య యాక్షన్.. హార్దిక్ రియాక్షన్ -
సన్‌రైజర్స్‌తో ఆనాటి మ్యాచ్ గుర్తుకో తెచ్చుకో రసెల్..!
చెన్నై: ఈ ఐపీఎల్ సీజన్లో ఆండ్రీ రసెల్ కొత్త హెయిర్ స్టైల్‌తో కనిపించనున్నాడు. ఈ మేరకు రసెల్ న్యూలుక్లో ఉన్న ఫోటోను కేకేఆర్ తమ ట్వీటర్ అకౌంట్లో షేర్ చేసింది. ‘ కొత్త హెయిర్ స్టైల్. అతను ఎవరు?, నీ గత హెయిర్ స్టైల్‌తో ఏమి జరిగిందో గుర్తుంచుకో’ అని క్యాప్షన్ ఇచ్చింది. 2019 ఐపీఎల్లో భాగంగా సన్‌రైజర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రసెల్ కొత్త హెయిర్ స్టైల్‌తో కనిపించాడు. తలపై హెయిర్ చుట్టూ తీసేసి మధ్య భాగంలో మాత్రమే ఉంచుకుని డిఫరెంట్‌గా కనిపించాడు. ఆ మ్యాచ్‌లో రసెల్ విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడాడు. సన్‌రైజర్స్‌తో రెండో లీగ్ మ్యాచ్‌లో భాగంగా ఈడెన్ గార్డెన్లో జరిగిన మ్యాచ్‌లో రసెల్ 19 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్స్‌లతో 49 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. దాంతో కేకేఆర్ ఇంకా రెండు బంతులు మిగిలి ఉండగానే సన్‌రైజర్స్ నిర్దేశించిన 182 పరుగుల టార్గెట్‌ను ఛేదించింది. ఇదే విషయాన్ని కేకేఆర్ చెప్పకనే చెబుతున్నట్లు ట్వీట్ ద్వారా వెల్లడించింది. ఆదివారం(ఏప్రిల్11వ తేదీ) సన్‌రైజర్స్ హైదరాబాద్-కేకేఆర్‌లు తమ తొలి మ్యాచ్‌ను ఆడనున్నాయి. కేకేఆర్ సక్సెస్ కావాలంటే వారు హిట్ కావాలి గత ఐపీఎల్ సీజన్లో చివరివరకూ ప్లే ఆఫ్ రేసు కోసం పోటీ పడిన కోల్‌కతా నైట్‌రైడర్స్‌కు చుక్కెదురైంది. లీగ్ దశలో ఏడు విజయాలు సాధించిన కేకేఆర్ ఐదో స్థానంలో నిలిచింది. రన్‌రేట్ కారణంగా కేకేఆర్ ప్లే ఆఫ్స్ నెరవేరలేదు. ఆ జట్టులో అంతా హార్డ్ హిట్టర్లే ఉన్నా ఓవరాల్‌గా విఫలం కావడం ఆ జట్టు ప్లే ఆఫ్ ఆశలపై ప్రభావం చూపించింది. ఇక్కడ ఆర్సీబీ మెరుగైన రన్‌రేట్‌తో నాల్గో స్థానాన్ని దక్కించుకోవడంతో కేకేఆర్ ఆట లీగ్ దశలోనే ముగిసింది. మరి ఈ సీజన్లో కేకేఆర్ మరొకసారి భారీ అంచనాలతో బరిలోకి దిగుతోంది. ఇయాన్ మోర్గాన్ సారథ్యంలోని కేకేఆర్.. తన తొలి మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో చెన్నైలోని చెపాక్ వేదికగా తలపడనుంది. ఇరుజట్లలో స్టార్ ఆటగాళ్లు ఉండటంతో అభిమానులు మరొకసారి మంచి మజాను ఆస్వాదించే అవకాశం ఉంది. కాగా, గత సీజన్ నుంచి కేకేఆర్‌ను బ్యాటింగ్ సమస్స వేధిస్తోందని, ఒకవేళ బ్యాటింగ్‌లో 5, 6 స్థానాల్లో ఆ జట్టు మెరిస్తే తిరుగుండదని టీమిండియా మాజీ క్రీకెటర్ ఆకాశ్ చోప్రా అభిప్రాయపడ్డాడు. కేకేఆర్ సక్సెస్ అనేది ఐదు, ఆరు స్థానాల్లో తరచుగా బ్యాటింగ్‌కు వచ్చే ఆండ్రీ రసెల్, దినేశ్ కార్తీక్‌లపై ఆధారపడి ఉందన్నాడు. వీరిద్దరూ హిట్ అయిన పక్షంలోనే కేకేఆర్ ఆశలు పెట్టుకోవచ్చన్నాడు. ప్రధానంగా రసెల్ ఆల్‌రౌండర్‌గా కాబట్టి అతని ఆట కీలకమని చోప్రా పేర్కొన్నాడు. ఇక దినేశ్ ఆరంభం నుంచే షాట్ల ఎంపికలో జాగ్రత్త వహించాల్సి ఉంటుందన్నాడు. New Hair. Who dis? 🤯 Remember what happened when Dre last coloured his hair Blonde? 💜@Russell12A #KKRHaiTaiyaar #IPL2021 pic.twitter.com/nDqAfEtaQD — KolkataKnightRiders (@KKRiders) April 10, 2021 -
రసెల్ విధ్వంసం.. తప్పించుకోవడంలో కార్తిక్ కష్టాలు
ముంబై: ఐపీఎల్ 2021 సీజన్‌కు ముందు కేకేఆర్ స్టార్ ఆల్‌రౌండర్ ఆండ్రీ రసెల్ బ్యాటింగ్‌తో విధ్వంసం సృష్టించాడు.. అదేంటి ఐపీఎల్ సీజన్ ఇంకా ప్రారంభం కాకముందే రసెల్ భారీ ఇన్నింగ్స్‌తో చెలరేగాడా అనే అనుమానం వచ్చిందా. అయితే రసెల్ ఈ విధ్వంసం సృష్టించింది ప్రాక్టీస్ మ్యాచ్‌లో కావడం విశేషం. శనివారం కేకేఆర్ జట్టు ఇంట్రా స్క్వాడ్ టీమ్ ఏర్పాటు చేసుకొని ప్రాక్టీస్ మ్యాచ్ ఆడాయి. ఒక జట్టుకు బెన్ కటింగ్ సారధ్యం వహించగా.. మరొక దానికి మోర్గాన్ నాయకత్వం వహించాడు. ఇన్నింగ్స్ మధ్యలో రసెల్ కొన్ని భారీ షాట్లతో అలరించాడు. ఈ నేపథ్యంలో రసెల్ కొట్టిన ఒక షాట్ నాన్‌స్ట్రైకింగ్ ఎండ్‌లో ఉన్న దినేష్ కార్తిక్ వైపు దూసుకెళ్లింది. అయితే కార్తిక్ మెరుపువేగంతో స్పందించి మొకాళ్ల మీద కిందకు వంగడంతో రెప్పపాటులో బంతి అతని పై నుంచి వెళ్లిపోయింది. రసెల్ కొట్టిన పవర్‌పుల్ షాట్ ఒకవేళ కార్తిక్ తగిలిఉంటే మాత్రం పరిస్థితి వేరేలా ఉండేది. దీనికి సంబంధించిన వీడియోనూ కేకేఆర్ తన ట్విటర్లో షేర్ చేసింది. ఈ వీడియో చూసిన నెటిజన్లు వినూత్న రీతిలో కామెంట్లు పెట్టారు. ''రసెల్ పవర్‌హిట్టింగ్ నుంచి కార్తిక్ తప్పించుకున్నాడు.. ఆ బంతి కార్తిక్ తగిలిఉంటే ఏమై ఉండేదో.. రెప్పపాటులో తప్పించుకున్నాడు..'' అంటూ కామెంట్స్ జత చేశారు. కాగా కేకేఆర్ ఈ సీజన్లో తన తొలి మ్యాచ్‌ను ఏప్రిల్ 11న చెన్నై వేదికగా సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో ఆడనుంది. కాగా కేకేఆర్ జట్టులో నితీష్ రాణాకు కరోనా పాజిటివ్‌గా నిర్థారణ కావడంతో కేకేఆర్ శిబిరంలోనూ కలవరం మొదలైంది. చదవండి: కేకేఆర్‌కు భారీ షాక్.. స్టార్ ఆటగాడికి కరోనా 'మేం సీఎస్కేకు ఆడలేం'.. కారణం అదేనట Andre 🤯 DK 😅 Watch the Knights get competitive in a practice game LIVE from DY Patil Stadium now 👇🤩@Russell12A @DineshKarthik #KKRHaiTaiyaar #IPL2021 — KolkataKnightRiders (@KKRiders) April 3, 2021 -
ఐపీఎల్లో ప్రత్యర్థులు.. అక్కడ మాత్రం మిత్రులు
లండన్: ఆసీస్ విధ్వంసకర ఆటగాడు డేవిడ్ వార్నర్, ఇంగ్లండ్ స్టార్ బౌలర్ జోఫ్రా ఆర్చర్.. విండీస్ విధ్వంసం ఆండీ రసెల్ ఒక జట్టుకు ఆడడం ఎప్పుడైనా చూశారా. అంతర్జాతీయంగా వేర్వేరు జట్లకు ఆడే వీరు ఐపీఎల్ సహా ఇతర లీగ్‌ల్లోనూ ప్రత్యర్థులుగా తలపడ్డారు. అయితే త్వరలోనే వీరు ముగ్గురు ఒకే జట్టుకు ప్రాతినిధ్యం వహించనున్నారు.. కాకపోతే హండ్రెడ్ 2021 టోర్నమెంట్ వరకు ఆగాల్సిందే. ఇంగ్లండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు సంయుక్తంగా హండ్రెడ్ 2021 టోర్నమెంట్‌ను నిర్వహించనున్నాయి. వాస్తవానికి గతేడాది జూన్‌లోనే ఈ టోర్నమెంట్ జరగాల్సింది. కానీ కరోనా మహమ్మారితో టోర్నీ నిర్వహణ వాయిదా పడింది. తాజాగా ఐపీఎల్ 2021 సీజన్ ముగిసిన తర్వాత జూలై 2021లో ఈ టోర్నీ ఆరంభం కానుంది. కాగా టోర్నీలో పురుషులతో పాటు మహిళల మ్యాచ్‌లు కూడా సమానంగా జరగనున్నాయి. హండ్రెడ్ 2021 పేరుతో నిర్వహించనున్న ఈ టోర్నీలో మొత్తం ఎనిమిది జట్లు పాల్గొంటాయి. బర్మింగ్హమ్ ఫోనిక్స్, ట్రెంట్ రాకెట్స్, ఓవల్ ఇన్విసిబల్స్, సౌతర్న్ బ్రేవ్, లండన్ స్పిరిట్, వేల్ష్ ఫైర్, నార్తన్ సూపర్ చార్జర్స్, మాంచెస్టర్ ఒరిజనల్స్ టోర్నీలో జట్లుగా ఉండనున్నాయి. కాగా జోఫ్రా ఆర్చర్, వార్నర్, ఆండీ రసెల్‌లు సౌతర్న్ బ్రేవ్‌లో ఆడనున్నారు. అయితే వార్నర్ గజ్జల్లో గాయం కారణంగా ఐపీఎల్ ఆడేది అనుమానంగా ఉంది. 6-9 నెలల విశ్రాంతి అవసరం అని స్వయంగా వార్నరే ప్రకటించిన సంగతి తెలిసిందే. కాగా ఐపీఎల్లో వార్నర్ ఎస్ఆర్హెచ్కు, ఆర్చర్ రాజస్తాన్ రాయల్స్‌కు, ఆండీ రసెల్ కేకేఆర్‌కు ఆడుతున్న సంగతి తెలిసిందే. చదవండి: సన్‌రైజర్స్‌కు వార్నర్ షాక్ ఇవ్వనున్నాడా! That's it for The Hundred Men's Draft 2021! 🖋️ Happy with how your team is looking? 👇 pic.twitter.com/j7c2KdMHSJ — The Hundred (@thehundred) February 23, 2021 -
'రసెల్ కంటే శుభమన్ కీలకం కానున్నాడు'
దుబాయ్ : ఐపీఎల్ 13వ సీజన్లో నేడు మరో బిగ్‌ఫైట్ జరగనుంది. ఈ సీజన్లో కోల్‌కతా నైట్‌రైడర్స్ డిపెండింగ్ చాంపియన్ ముంబై ఇండియన్స్‌తో తమ మొదటి మ్యాచ్ ఆడనుంది. ఈ నేపథ్యంలో ఇప్పుడు అందరి కళ్లు విండీస్ ఆల్‌రౌండర్ ఆండ్రీ రసెల్‌పై పడ్డాయి. ఎందుకంటే 2019 సీజన్లో రసెల్ తన విధ్వంసకర బ్యాటింగ్‌తో చేసిన రచ్చ మాములుగా లేదు. ఆ సీజన్లో కోల్‌కతా తరపున 14 మ్యాచ్‌లాడిన రసెల్ 510 పరుగులు, 11 వికెట్లు సాధించి ప్లేయర్ ఆఫ్ ది సిరీస్‌గా నిలిచాడు. అంతేగాక రసెల్ టోర్నీ మొత్తంలో 52 సిక్సులు బాది ఒక సీజన్లో అత్యధిక సిక్స్‌లు బాదిన ఆటగాడిగా గేల్ తర్వాత రికార్డు నెలకొల్పాడు. అయితే ఈ సీజన్లో ఆండ్రీ రసెల్ కంటే శుభమన్ గిల్ జట్టుకు కీలకంగా మారనున్నాడని న్యూజిలాండ్ మాజీ ఆటగాడు స్కాట్ స్టైరిస్ అభిప్రాయపడ్డాడు. ముఖ్యంగా రాబిన్ ఊతప్ప, గౌతమ్ గంభీర్ కోల్‌కతాకు దూరమైన తర్వాత శుభమన్ గిల్ కీలకపాత్ర పోషించే అవకాశం ఉందని తెలిపాడు. స్టార్‌స్పోర్ట్స్‌తో జరిగిన ఇంటర్య్వూలో పలు ఆసక్తికర విషయాలు పేర్కొన్నాడు. 'గత 18 నెలలుగా శుభమన్ గిల్‌ను దగ్గర్నుంచి చూస్తున్నా.. గిల్లో మంచి నైపుణ్యం ఉంది.. దానిని సక్రమంగా వాడితే విధ్వంసకర ఇన్నింగ్స్‌లు చూసే అవకాశం ఉంటుంది. గతంలో జట్టుకు ప్రాతినిధ్యం వహించిన రాబిన్ ఊతప్ప, గంబీర్లు లేకపోవడంతో గిల్ జట్టులో కీలకంగా మారడంతో పాటు ప్రధాన బ్యాట్స్‌మన్‌గా మారే అవకాశం ఉంది. రసెల్ విధ్వంసం గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.. కానీ అతను విదేశీ ఆటగాడిగా జట్టులో ఉంటాడు కాబట్టి.. దేశీయ ఆటగాళ్లలో శుభమన్‌కు ఇది మంచి అవకాశమని నా అభిప్రాయం. (చదవండి : ఆర్చర్ రెచ్చిపోతాడని అప్పుడు ఊహించలేదు) అంతేగాక స్వదేశీ ఆటగాళ్లలో పృథ్వీ షా, దేవదూత్ పడిక్కల్ కంటే గిల్‌పై ఎక్కువ ఒత్తిడి ఉండే అవకాశం ఉంది. ఒకరకంగా వారిద్దరు వేరే టీమ్‌లలో కొనసాగుతున్నా.. సీనియర్ ఆటగాళ్ల మధ్యన ఉండడంతో ఒత్తిడి తక్కువగా ఉండి ఆటపై దృష్టి సారిస్తారు. కానీ గిల్‌కు ఆ అవకాశం లేదు.. కోల్‌కతాలో అంతా హిట్టర్లే కనిపిస్తున్నారు. ఎవరికి వారే హిట్టింగ్ చేసే నైపుణ్యం ఉండడంతో గిల్ తన ప్రతిభను బయటపెట్టేందుకు ఇదే చక్కని అవకాశం. నా దృష్టిలో కేకేఆర్ జట్టు ఐపీఎల్ 2020లో టాప్4 లో ఒకటిగా నిలుస్తుందంటూ' తెలిపాడు. దినేశ్ కార్తిక్ నేతృత్వంలో మంచి హిట్టర్లతో బలంగా కనిపిస్తున్న కేకేఆర్ ముంబైతో మ్యాచ్‌లో ఏ విధమైన ప్రదర్శన ఇస్తుందనేది కొద్దిసేపట్లో తేలనుంది. -
ఆండ్రీ రసెల్ వి‘ధ్వంసం’
అబుదాబి: ఐపీఎల్-13వ సీజన్లో కోల్‌కతా నైట్‌రైడర్స్(కేకేఆర్) రేపు తన తొలి మ్యాచ్‌ను ఆడనుంది. బుధవారం ముంబై ఇండియన్స్‌తో అబుదాబిలో జరుగున్న మ్యాచ్‌లో కేకేఆర్ తలపడనుంది. దీనిలో భాగంగా కేకేఆర్ తమ ప్రాక్టీస్‌ను ముమ్మరం చేసింది. ఆ జట్టు కీలక ఆటగాడు, ఆల్‌రౌండర్ ఆండ్రీ రసెల్ తీవ్రంగా ప్రాక్టీస్ చేశాడు. ఎక్కువ సేపు నెట్స్‌లో గడిపిన రసెల్ భారీ షాట్లతో అలరించాడు. కాగా, రసెల్ ప్రాక్టీస్ చేసే క్రమంలో ఎదురుగా ఉన్న కెమెరా ధ్వంసమైంది. దీనికి సంబంధించిన వీడియో కేకేఆర్ తన సోషల్ మీడియా హ్యాండిల్స్ పోస్ట్ చేసింది. ఓహ్.. అదొక స్మాషింగ్ షాట్.. చివరి షాట్ వరకూ వెయిట్ చేయండి అంటూ క్యాప్షన్‌లో పేర్కొంది.(చదవండి: ఏబీ డివిలియర్స్@ 200) గతేడాది ఐపీఎల్లో కేకేఆర్ తరఫున రసెల్ మెరుపులు మెరిపించిన సంగతి తెలిసిందే. ఆ సీజన్లో 57.00 యావరేజ్, 205 స్టైక్‌రేట్‌తో రసెల్ 504 పరుగులు సాధించాడు. అదే సమయంలో కేకేఆర్ తరఫున అత్యధిక వికెట్లు సాధించిన బౌలర్‌గా నిలిచాడు. 2019 సీజన్లో రసెల్ 11 వికెట్లను ఖాతాలో వేసుకున్నాడు. దాంతో ఈ సీజన్లో సైతం రసెల్‌పై కేకేఆర్ భారీ ఆశలు పెట్టుకుంది. కచ్చితంగా రసెల్ మరోసారి మెరిపించి కేకేఆర్‌కు విజయాలు సాధించి పెడతాడనే ధీమాలో ఉంది. ఐపీఎల్ చరిత్రలో కేకేఆర్ రెండుసార్లు చాంపియన్‌గా నిలిచిన సంగతి తెలిసిందే.(చదవండి: రికార్డు బ్రేక్ చేసిన ఐపీఎల్ మ్యాచ్) 💥 Oh gosh! That’s SMASHED - wait for the last shot..#MuscleRussell warming up to his devastating best! @Russell12A #KKRHaiTaiyaar #Dream11IPL pic.twitter.com/0NsOHJ2Pja — KolkataKnightRiders (@KKRiders) September 21, 2020 -
రసెల్‌కు బౌలింగ్ చేయనే చేయను..
దుబాయ్ : కోల్‌కతా నైట్‌రైడర్స్ స్టార్ ఆల్‌రౌండర్ ఆండ్రూ రసెల్‌కు బౌలింగ్ చేయడం ఇష్టం లేదంటూ ఆల్‌రౌండర్ సిద్దేశ్ లాడ్ కుండబద్దలు కొట్టాడు. రసెల్‌కు బౌలింగ్ వేయడం కంటే బుమ్రా బౌలింగ్‌లో బ్యాటింగ్ చేయడానికి ఇష్టపడతా అంటూ తెలిపాడు. వాస్తవానికి రసెల్ ఉన్న కేకేఆర్ జట్టులోనే సిద్ధేశ్ లాడ్ ఉండడం గమనార్హం. ఇద్దరు ఓకే జట్టులో ఉండడంతో 2020 ఐపీఎల్లో రసెల్‌కు బౌలింగ్ వేసే అవకాశం సిద్దేశ్‌కు రాదు. కానీ మ్యాచ్‌లకు ముందు కేకేఆర్ ప్రాక్టీస్ సమయంలో తమ రిజర్వ్ బౌలర్లతోనే నెట్స్‌లో బంతులు వేయించుకొని ప్రాక్టీస్ చేస్తుంటారు. ఒకవేళ రసెల్‌కు బౌలింగే చేయాల్సి వస్తే తాను అతనికి బౌలింగ్ వేయడానికి ఇష్టపడను.. అంతేకాదు ఇతర పరిష్కార మార్గాలు కూడా వెతుక్కుంటానంటూ సిద్ధేశ్ తెలిపాడు. (చదవండి : ఆరు బంతులు.. ఆరు రకాలుగా) 'ఎందుకో నాకు రసెల్‌ను చూస్తే బౌలింగ్ వేయాలనిపించదు. అతను బంతులను బలంగా బాదుతూ తన విధ్వంసకర ఆటను కొనసాగిస్తాడు. నేను ముంబై ఇండియన్స్ జట్టుతో ఉన్నప్పుడు రసెల్ ఆటను గమనించాను. ప్రత్యర్థిగా ఎన్నోసార్లు విధ్వంసాన్ని దగ్గరుండి చూశాను. ఇప్పటివరకు నేను రసెల్‌కు బౌలింగ్ చేయలేదు.. ఇప్పుడు ఒకే జట్టులో ఉన్నాం కాబట్టి నెట్స్‌లోనూ అతనికి బౌలింగ్ చేయాలనుకోవడం లేదు.' అంటూ చెప్పుకొచ్చాడు. (చదవండి : పంత్.. సిక్సర్ల మోత!) ఇక గతేడాది 2019 ఐపీఎల్లో కోల్‌కతా తరపున రసెల్ విధ్వంసకర ఇన్నింగ్స్‌లు ఆడాడు. పరాజయం అంచున నిలిచిన ప్రతీసారి తన విధ్వంసకర ఆటతో జట్టును విజయతీరాలకు చేర్చాడు. ఆ సీజన్లో 204.81 సగటుతో 510 పరుగులు చేశాడు. ఇందులో 4 అర్థసెంచరీలు ఉన్నాయి. ఐదు లేదా ఆరు స్థానాల్లో వచ్చే రసెల్‌ను ఈసారి బ్యాటింగ్ ఆర్డర్లో ముందు పంపాలని జట్టు మేనేజ్మెంట్ నిర్ణయించిందని ఆ జట్టు ప్రధాన కోచ్ బ్రెండన్ మెక్కల్లమ్, మెంటార్ డేవిడ్ హస్సీలు తెలిపారు. బ్యాటింగ్ ఆర్డర్లో రసెల్‌ను ముందు పంపితే టీ20 డబుల్ సెంచరీ చేసే సత్తా రసెల్‌కు ఉందంటూ డేవిడ్ హస్సీ అభిప్రాయపడ్డాడు. గౌతం గంభీర్ నేతృత్వంలో 2012, 2014లో కోల్‌కతా నైట్‌రైడర్స్ జట్టు రెండుసార్లు ఐపీఎల్ టైటిల్ నెగ్గింది. గంభీర్ తర్వాత కోల్‌కతా కెప్టెన్‌గా ఎంపికయిన దినేష్ కార్తిక్ సారధ్యంలో 2018లో ఫ్లే ఆఫ్స్, 2019లో లీగ్ స్టేజీలోనే వెనుదిరిగింది. -
చివరి వరకు కేకేఆర్‌తోనే: రసెల్
న్యూఢిల్లీ: వెస్టిండీస్ విధ్వంసకర బ్యాట్స్‌మన్ ఆండ్రూ రసెల్ ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)పై తన ఇష్టాన్ని చాటుకున్నాడు. మిగతా లీగ్‌లతో పోలిస్తే ఐపీఎల్ ఆడే సందర్భంలోనే తనకు రోమాలు నిక్కబొడుచుకుంటాయని గుర్తు చేసుకున్నాడు. ఐపీఎల్లో చివరివరకు కోల్‌కతా నైట్‌రైడర్స్ (కేకేఆర్) జట్టుకే ప్రాతినిధ్యం వహించడాన్ని ఆస్వాదిస్తానని చెప్పాడు. ‘నేను మీ ముందు ఒక్కటి అంగీకరించాలి. కరీబియన్ ప్రీమియర్ లీగ్ (సీపీఎల్) కన్నా కూడా ఐపీఎల్ సమయంలోనే నా రోమాలు నిక్కబొడుచుకుంటాయి. ముఖ్యంగా ఈడెన్ గార్డెన్స్‌లో ఆడేటపుడు భావోద్వేగాలు తారాస్థాయికి చేరుకుంటాయి. గత ఆరు సీజన్లుగా కోల్‌కతాకే ప్రాతినిధ్యం వహిస్తున్నా. అక్కడి అభిమానుల ప్రేమ అనిర్వచనీయం. నేను వరుసగా రెండు మ్యాచ్‌ల్లో విఫలమైనా... మూడో మ్యాచ్‌కు వారు నన్ను అదే రీతిలో స్వాగతిస్తారు. అందుకే నా చివరి మ్యాచ్ వరకు కేకేఆర్ జట్టుకే ఆడతా’ అని రసెల్ వివరించాడు. -
'ఇంత చెత్త ఫ్రాంచైజీని నేనెప్పుడు చూడలేదు'
జమైకా : వెస్టిండీస్ ఆల్‌రౌండర్ ఆండ్రీ రసెల్ కరేబియన్ ప్రీమియర్ లీగ్ ప్రాంచైజీపై అసహనం వ్యక్తం చేశాడు. రసెల్ కరేబియన్ ప్రీమియర్ లీగ్‌లో జమైకా తలవాస్కు ఆడుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటివరకు జమైకా తలవాస్ లాంటి విచిత్ర జట్టును మరొకటి చూడలేదంటూ రసెల్ పేర్కొన్నాడు. కాగా రెండు రోజుల క్రితమే ఇదే ఫ్రాంచైజీకి సహాయ కోచ్‌గా ఉన్న మాజీ విండీస్ ఆటగాడు రామ్‌నరేశ్ శర్వాణ్‌పై విండీస్ విధ్వంసక వీరుడు క్రిస్ గేల్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తిన సంగతి తెలిసిందే. శర్వాణ్ కరోనా మహమ్మారి కంటే చెత్త అని గేల్ విరుచుకుపడ్డాడు. ఈ సీజన్లో ఫ్రాంచైజీ తనను రీటెయిన్ చేసుకోకుండా వదిలించుకోవడానికి శర్వాణే కారణమని గేల్ ఆరోపించాడు. తాజాగా రసెల్ జమైకా తలవాస్‌పై తనదైన శైలిలో విరుచుకుపడ్డాడు.(శర్వాణ్... నీవు కరోనా వైరస్ కంటే డేంజర్) 'నేను ప్రాతినిథ్యం వహించిన అన్ని జట్లలోకెల్లా జమైకా తలవాస్ విచిత్రమైనది. ఇది నిజంగా ఒక చెత్త ఫ్రాంచైజీ.. ఇలాంటి ఫ్రాంచైజీని నేనెప్పుడు చూడలేదు. ఇది నేను ఊరికే చేస్తున్న ఆరోపణ కాదు. ఆ జట్టుతో కలిసి సుధీర్ఘంగా కొనసాగుతున్నా. అంతే కాదు ఒకప్పుడు లీడర్ టీమ్‌లో మెంబర్‌గానూ ఉన్నా. వారి ఆలోచనా ధోరణిని దగ్గరి నుంచి పరిశీలించా. ఆ జట్టు తరఫున ఆడటం కంటే ఊరుకోవడం ఉత్తమం. ఇప్పటికైనా యాజమాన్య తీరు మారకపోతే ఆ జట్టు మనుగడ కష్టమేనంటూ' రసెల్ పేర్కొన్నాడు. ('రసెల్‌తో ఆడితే అదే ఫీలింగ్ కలుగుతుంది') (షోయబ్ అక్తర్‌పై ‘పీసీబీ’ పరువు నష్టం కేసు) -
'రసెల్‌తో ఆడితే అదే ఫీలింగ్ కలుగుతుంది'
కోల్‌కతా : కరోనా నేపథ్యంలో క్రీడలన్నీ వాయిదా పడిన సంగతి తెలిసిందే. లాక్‌డౌన్‌తో ఆటగాళ్లంతా ఇంటికే పరిమితమయ్యారు. ఈ నేపథ్యంలో టీమిండియా యువ ఆటగాడు శుభమన్ గిల్ ట్విటర్ ద్వారా అభిమానులు అడిగిన ప్రశ్నలకు ఆసక్తికర సమాధానాలతో ఆకట్టుకున్నాడు. కోల్‌కతా నైట్ రైడర్స్ తరపున విండీస్ స్టార్ ఆల్ రౌండర్ ఆండ్రీ రసెల్ తో బ్యాటింగ్ చేసేటప్పుడు మీకు ఏ విధంగా అనిపిస్తుందని ఒక అభిమాని అడిగాడు. దానికి శుభమన్ స్పందిస్తూ..'రసెల్‌తో ఆడినప్పుడు మ్యాచ్ హైలెట్స్ చూస్తున్నామా అనే ఫీలింగ్ కలుగుతుంది. ఎందుకంటే అతను ఆడితే నేను నాన్ స్ట్రైకింగ్ ఎండ్‌కు పరిమితమవ్వాల్సి వస్తుందంటూ' నవ్వుతూ పేర్కొన్నాడు. (శర్వాణ్... నీవు కరోనా వైరస్ కంటే డేంజర్: గేల్) ఇక క్రికెట్ నుంచి రిటైరైన ఆటగాళ్లలో నువ్వు ఎవరితో ఆడడానికి ఇష్టపడతావు మరో అభిమాని ప్రశ్నించగానే.. శుభమన్ ఒక్క సెకన్ కూడా ఆలోచించకుండా లెజెండరీ సచిన్ టెండూల్కర్ పేరు చెప్పేశాడు. ' సచిన్ గొప్ప ఆటగాడు.. అతని ఆటను చూస్తూ పెరిగా.. ఇప్పటికీ అవకాశమొస్తే సచిన్‌తో ఆడేందుకు సిద్ధంగా ఉన్నా' అని పేర్కొన్నాడు. ఇక విదేశీ ఆటగాళ్లలో తనకు ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ అంటే ఎంతో ఇష్టమని వెల్లడించాడు.కోల్‌కతా నైట్ రైడర్స్ కెప్టెన్ దినేశ్ కార్తీక్ గొప్ప నాయకుడంటూ పొగిడాడు. ఫ్రాంచైజీ యజమాని షారూక్ ఖాన్ తాము ఓడినా.. గెలిచినా ఎప్పుడూ ఎంతో మద్దతుగా నిలుస్తాడని గిల్ చెప్పుకొచ్చాడు. అలాగే ఫుట్‌బాల్‌లో తనకు క్రిస్టియానో రొనాల్డో కంటే లియోనెల్ మెస్సీ అంటేనే ఇష్టమని శుభ్‌మన్‌గిల్ తెలిపాడు. 2018 నుంచి కేకేఆర్ తరపున ఆడుతున్న శుభమన్ గిల్ 132 స్ట్రైక్‌రేట్‌తో 499 పరుగులు సాధించాడు.(మిస్టరీ : అసలు ఆరోజు ఏం జరిగింది?) -
అందుకు రసెల్ లేకపోవడమే..
న్యూఢిల్లీ: ఓవరాల్ ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)లో కోల్‌కతా నైట్‌రైడర్స్ రెండు టైటిల్స్ కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే. 2012లో గౌతం గంభీర్ నేతృత్వంలోని తొలిసారి ఐపీఎల్ టైటిల్ గెలిచిన కేకేఆర్.. 2014లో మరొకసారి గంభీర్ సారథ్యంలోనే ఐపీఎల్ టైటిల్‌ను సొంతం చేసుకుంది. తొలి టైటిల్‌ను సాధించే క్రమంలో చెన్నై సూపర్ కింగ్స్‌ను ఓడించి చాంపియన్స్‌గా నిలవగా, రెండో సారి కింగ్స్ పంజాబ్‌ను మట్టికరిపించి టైటిల్‌ను ఎగరేసుకుపోయింది. అయితే తమ జట్టులో మొదట్నుంచీ విండీస్ స్టార్ ఆల్ రౌండర్ ఆండ్రీ రసెల్ ఉంటే మరిన్ని టైటిల్స్‌ను సాధించేవాళ్లమని గంభీర్ అభిప్రాయపడ్డాడు. తాను కేకేఆర్‌కు ఆడిన ఏడేళ్ల కాలంలో రసెల్ కూడా ఉండి ఉంటే తాము కనీసం మరొక ఒకటి-రెండు టైటిల్స్ గెలిచేవాళ్లమన్నాడు. (డీకాక్ స్థానం ఎవరిది.. ఇంకా నో క్లారిటీ!) 2012లో రసెల్ తొలిసారి ఐపీఎల్ అరంగేట్రం చేశాడు. అయితే ఢిల్లీ(డేర్‌డెవిల్స్) తరఫున రసెల్ తొలినాళ్లలో ప్రాతినిథ్యం వహించాడు. 2014 వేలంలో రసెల్‌ను కేకేఆర్ కొనుగోలు చేయగా ఆ ఏడాదే కేకేఆర్ టైటిల్‌ను కూడా గెలిచింది. ఆ సీజన్లో రసెల్‌కు కేకేఆర్ కొన్ని మ్యాచ్‌ల్లో మాత్రమే అవకాశం కల్పించింది. 2015 సీజన్లో రసెల్ 192 స్టైక్‌రేట్‌తో 326 పరుగులు సాధించడమే కాకుండా, 14 వికెట్లతో ఆకట్టుకున్నాడు. 2016 సీజన్లో 188 పరుగులతో పాటు 15 వికెట్లను రసెల్ తన ఖాతాలో వేసుకన్నాడు.ఆపై ఏడాది పాటు నిషేధం ఎదుర్కొన్న రసెల్.. 2018 సీజన్లో సైతం రాణించాడు. 300కు పైగా పరుగులు 13 వికెట్లను రసెల్ సాధించాడు. ఈ సీజన్లో కేకేఆర్ ప్లేఆఫ్స్‌కు వెళ్లడంలో రసెల్ కీలక పాత్ర పోషించినా, ఆ జట్టు ఫైనల్లో అడుగుపెట్టలేకపోయింది. (నేనేమైనా పిచ్చోడిలా కనిపిస్తున్నానా..?) -
సచిన్‌కు మోదం.. టీమిండియాకు ఖేదం
‘జ్ఞాపకాలు చెడ్డవైనా మంచివైనా ఎప్పుడూ మనతోటే ఉంటాయి..మోయక తప్పదు’అని ఓ సినిమాలో పేర్కొన్నట్టు భారత క్రికెట్ జట్టు, అభిమానులు ఎప్పటికీ మర్చిపోలేని రెండు సంఘటనలు జరిగినవి ఇదే రోజు(మార్చి 31). ఆ రెండు జ్ఞాపకాల్లో ఒకటి టీమిండియా మనోవేదనకు గురైనది కాగా.. మరొకటి సరికొత్త చరిత్ర లిఖించిన అంశం. అందుకే ఏళ్లు గడుస్తున్నా ఆ రెండు జ్ఞాపకాలను టీమిండియాతో పాటు అభిమానులు తమ గుండెల్లో మోస్తూనే ఉన్నారు. అవేంటో చూద్దాం.. 2016, మార్చి 31.. టీమిండియా అభిమానులు కలలో కూడా మర్చిపోలేని రోజు. ధోని చేతిలో టీమిండియా ఖాతాలో మరొక ప్రపంచకప్ ఖాయమని అనుకున్న ఆందరి ఆశలపై వెస్టిండీస్ నీళ్లు చల్లింది. టీ20 ప్రపంచకప్ 2016 సెమీస్‌లో భాగంగా విండీస్ చేతిలో కంగుతిన్న టీమిండియా టోర్నీ నుంచి నిష్క్రమించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా.. విరాట్ కోహ్లి(89 నాటౌట్; 47 బంతుల్లో 11 ఫోర్లు, 1 సిక్సర్) వీరతాండవం చేయగా.. రోహిత్ శర్మ (43), అజింక్యా రహానే (40) రాణించారు. దీంతో టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 192 పరుగులు చేసింది. అనంతరం భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన విండీస్ 19 పరుగులకే క్రిస్ గేల్(5), శాముల్స్(8) వికెట్లను చేజార్చుకుంది. West Indies needed 73 runs from the last six overs against India #OnThisDay in 2016, in order to secure a spot in the #T20WorldCup final. 🎥 Watch how @Russell12A and @54simmo finished it with two balls to spare 👇 pic.twitter.com/I5ZAvdhiYJ — ICC (@ICC) March 31, 2020 మూడు ఓవర్లు ముగిసే సరికే విండీస్ రెండు వికెట్లు చేజార్చుకోవడంతో విండీస్ గెలుపు అంత ఈజీ కాదని అందరూ అనుకున్నారు. కానీ పొట్టి క్రికెట్‌కు కేరాఫ్ అడ్రస్ అయిన కరేబియన్ ఆటగాళ్లు ఆ తర్వాత విధ్వంసం సృష్టించారు. తొలుత చార్లెస్ (52; 36 బంతుల్లో 7ఫోర్లు, 2 సిక్సర్లు) రెచ్చిపోయి మిగతా ఆటగాళ్లకు బూస్టప్ ఇచ్చాడు. అనంతరం సిమ్మన్స్ (82 నాటౌట్; 51 బంతుల్లో 7ఫోర్లు, 5 సిక్సర్లు) ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. అయితే విండీస్ విజయానికి 36 బంతుల్లో 73 పరుగులు చేయాల్సిన సమయంలో గెలుపు అవకాశాలు సమంగానే నిలిచాయి. కానీ సిమ్మన్స్ సహాయంతో అండ్రీ రసెల్ (43 నాటౌట్, 20 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్సర్లు) టీమిండియా గెలుపు ఆశలపై నీళ్లు చల్లాడు. మరో రెండు బంతులు మిగిలుండగానే విండీస్ భారీ లక్ష్యాన్ని ఛేదించి టీమిండియాను ఓడించింది. ఈ మ్యాచ్‌లో బౌలింగ్ చేసిన కోహ్లి ఒక వికెట్ దక్కించుకోవడం విశేషం. ఇక ఫైనల్‌కు చేరుకున్న విండీస్ అందరి అంచనాలను తలకిందులు చేసి ఇంగ్లండ్‌ను ఓడించి ప్రపంచకప్‌ను ముద్దాడింది. తొలి క్రికెటర్‌గా సచిన్.. 2001, మార్చి31.. అంతర్జాతీయ, టీమిండియా వన్డే క్రికెట్ చరిత్రలో సరికొత్త అధ్యాయం లిఖించిన రోజు. టీమిండియా గాడ్, లిటిల్ మాస్టర్ సచిన్ టెండూల్కర్ వన్డేల్లో పది వేల పరుగుల మైలురాయిని అందుకున్న తొలి క్రికెటర్‌గా సరికొత్త రికార్డును సృష్టించాడు. ద్వైపాక్షిక సిరీస్‌లో భాగంగా ఇండోర్‌లో ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో సచిన్ ఈ మార్క్ అందుకున్నాడు. ఆ తర్వాత 13 మంది క్రికెటర్లు పదివేల పరుగుల మార్క్‌ను అందుకున్నారు. అంతేకాకుండా వన్డేల్లో వేగంగా పదివేల పరుగులు సాధించిన రెండో క్రికెటర్‌గా సచిన్(259 ఇన్నింగ్స్‌ల్లో) ఇప్పటికీ కొనసాగుతున్నాడు. తొలి స్థానంలో సారథి విరాట్ కోహ్లి(205 ఇన్నింగ్స్‌ల్లో) ఉన్న విషయం తెలిసిందే. చదవండి: వీరంతా ఏం చేస్తున్నారో చూశారా? రూ. 1.25 కోట్లు : సానియా మీర్జా -
కూతురు పుట్టబోతోంది: క్రికెటర్
వెస్టిండీస్ ఆల్‌రౌండర్ ఆండ్రీ రసెల్ మొదటిసారి తండ్రి కాబోతున్నాడు. అతడి భార్య జేసిమ్ లోరా త్వరలోనే పండంటి పాపాయికి జన్మనివ్వబోతున్నట్లు తెలిపాడు. తాము తల్లిదండ్రులు కాబోతున్న విషయాన్ని క్యూట్ వీడియో ద్వారా రసెల్ ఇన్‌స్టాలో అభిమానులతో పంచుకున్నాడు. బేబీ రసెల్ పేరిట ఏర్పాటు చేసిన పార్టీలో..రసెల్ భార్య బౌలింగ్ చేయగా.. ఆ బాల్‌ను బ్యాట్‌తో పగులగొట్టిన రసెల్..తనకు కూతురు పుట్టబోతున్నట్లు సింబాలిక్‌గా చెప్పాడు. ఇందుకు సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన రసెల్...‘ నా జీవితంలోకి మరో ఆనందం రాబోతోంది. అమ్మాయి పుట్టబోతోంది. కూతురైనా, కొడుకైనా నాకు ఒక్కటే. పుట్టేది ఎవరైనా సరే వారు పూర్తి ఆరోగ్యంగా ఉండాలని దేవుడిని ప్రార్థిస్తున్నా’ అని క్యాప్షన్ జతచేశాడు. ఈ క్రమంలో రసెల్- జేసిమ్ లోరా దంపతులకు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ‘కంగ్రాట్స్ బ్రదర్. మరో అదృష్టవంతురాలైన అమ్మాయి. మరి నాకు ఆహ్వానం పంపలేదే’ అంటూ సిక్సర్ల వీరుడు క్రిస్ గేల్ అభినందనలు తెలుపుతూనే అలకబూనాడు. ఇక మరో విండీస్ ఆటగాడు బ్రెత్‌వైట్..తల్లీబిడ్డా క్షేమంగా ఉండాలని..ప్రసవం సాఫీగా జరగాలని ఆకాంక్షించాడు. ఇతర సహచర ఆటగాళ్లు సైతం రసెల్‌ను శుభాకాంక్షలతో ముంచెత్తారు. కాగా మోకాలి గాయంతో ప్రపంచ కప్ నుంచి నిష్క్రమించిన రసెల్... భారత్‌తో జరిగిన టీ20 సిరీస్‌కు కూడా దూరమైన సంగతి తెలిసిందే. ప్రస్తుతం కరీబియన్ ప్రీమియర్ లీగ్(సీపీఎల్)లో భాగంగా మైదానంలో దిగిన ఈ విండీస్ ఆల్‌రౌండర్ బంతిని బలంగా బాదేందుకు ప్రయత్నించి తీవ్రంగా గాయపడ్డాడు. ఈ క్రమంలో అతడికి ప్రాథమిక చికిత్స చేసిన మెడికల్ విభాగం..ఆస్పత్రికి తరలించింది. అనేక పరీక్షల అనంతరం రసెల్‌కు ఎటువంటి ప్రమాదం లేదని వైద్యులు తేల్చడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. View this post on Instagram So it's #GIRL😁😁😁 another blessing in my life it didn't matter if it was a girl or a boy, all am asking God for is a healthy baby #babyrussell @partyblasterspro A post shared by Andre Russell (@ar12russell) on Sep 15, 2019 at 6:37pm PDT -
అయ్యో.. ఫీల్డ్‌లోనే కూలబడ్డ రసెల్!
జమైకా: కరీబియన్ ప్రీమియర్ లీగ్(సీపీఎల్)లో వెస్టిండీస్ ఆల్ రౌండర్ ఆండ్రీ రసెల్ తీవ్రంగా గాయపడ్డాడు. బంతిని హిట్ చేసే క్రమంలో అది రసెల్ హెల్మెట్ వెనుకబాగాన బలంగా తాకింది. కుడి చెవికి తగలడంతో రసెల్ మైదానంలో కుప్పకూలిపోయాడు. దాంతో ప్రాథమిక చికిత్స తర్వాత రసెల్‌ను ఆస్పత్రికి తరలించారు. సీపీఎల్‌లో భాగంగా జమైకా తలవాస్ తరఫున ఆడుతున్న రసెల్.. గురువారం సెయింట్ లూసియా జౌక్స్‌తో మ్యాచ్‌లో 14 ఓవర్లో బంతిని హిట్ చేసేందుకు యత్నించాడు. షార్ట్ పిచ్ బంతిని భారీ షాట్‌కు ప్రయత్నించగా అది కాస్తా అంచనా తప్పి రసెల్ హెల్మెట్‌ను తాకుతూ దూసుకుపోయింది. ఈ క్రమంలోనే కుడి చెవికి గాయం కావడంతో రసెల్ ఫీల్డ్‌లో నిలబడలేకపోయాడు. ఫీల్డ్‌లోనే కూలబడిపోయాడు. దాంతో ఒక్కసారిగా ఆందోళన రేకెత్తింది. ప్రత్యర్థి జట్టు ఫీల్డర్లు రసెల్ వద్దకు వచ్చి హెల్మెట్ తీసి చెక్ చేయడమే కాకుండా నెమ్మదిగా పైకి లేపారు. అదే సమయంలో హుటాహుటీనా అక్కడికి చేరుకున్న మెడికల్ విభాగం ప్రాథమికి చికిత్స తర్వాత రసెల్‌ను ఆస్పత్రికి తరలించింది. అనేక రకాలైన స్కాన్లు నిర్వహించిన తర్వాత రసెల్‌కు ఎటువంటి ప్రమాదం లేదని వైద్యులు తేల్చారు. రసెల్ గాయపడే సమయానికి మూడు బంతులు ఆడి పరుగులేమీ చేయలేదు. ఈ మ్యాచ్‌లో సెయింట్ లూసియా ఐదు వికెట్ల తేడాతో విజయం సాధించింది. -
వరల్డ్‌కప్ నుంచి ఆండ్రీ రసెల్ ఔట్
లండన్: మోకాలి గాయంతో బాధపడుతున్న వెస్టిండీస్ స్టార్ ఆల్ రౌండర్ ఆండ్రీ రసెల్ వరల్డ్‌కప్ నుంచి వైదొలిగాడు. వన్డే వరల్డ్‌కప్ ఆరంభమైన నాటి నుంచి మోకాలి గాయంతో పదే పదే మ్యాచ్‌లకు దూరమవుతున్న రసెల్ టోర్నీ నుంచి తప్పుకున్న విషయాన్ని విండీస్ మేనేజ్మెంట్ స్పష్టం చేసింది. ఈ టోర్నీలో కేవం నాలుగు మ్యాచ్‌లు మాత్రమే ఆడిన రసెల్.. 36 పరుగులు మాత్రే చేసి ఐదు వికెట్లు మాత్రమే తీశాడు. ఇంకా మూడు మ్యాచ్‌లు మాత్రమే ఆడాల్సి ఉన్న విండీస్.. సెమీస్ అవకాశాలపై ఆశలు పెట్టుకోవాలంటే అన్నింటా గెలవాలి. ఈ తరుణంలో ఆండ్రీ రసెల్ జట్టుకు దూరం కావడం విండీస్‌కు ఎదురుదెబ్బే. రసెల్ స్థానంలో సునీల్ అంబ్రిస్‌ను ఎంపిక చేస్తూ విండీస్ బోర్డు నిర్ణయం తీసుకుంది. ఈ మెగా టోర్నీలో విండీస్ ఇప్పటివరకూ మ్యాచ్ మాత్రమే గెలవగా, ఆ జట్టు ఆడాల్సిన ఒక మ్యాచ్ రద్దయ్యింది. దాంతో విండీస్ ఖాతాలో మూడు పాయింట్లు మాత్రమే ఉన్నాయి. -
అతని కోసం ప్రణాళిక సిద్ధం చేశాం: చహల్
మాంచెస్టర్: వన్డే వరల్డ్‌కప్‌లో అపజయం లేకుండా దూసుకుపోతున్న భారత క్రికెట్ జట్టు తమ తదుపరి పోరులో వెస్టిండీస్‌తో తలపడనుంది. గురువారం మాంచెస్టర్ వేదికగా ఇరు జట్ల మధ్య మ్యాచ్ జరుగనుంది. ఈ నేపథ్యంలో విండీస్ ఆటగాళ్ల కోసం వ్యూహ రచనలు చేస్తోంది భారత్. హార్డ్ హిట్టర్లు ఎక్కువగా ఉన్న విండీస్ జట్టును కట్టడి చేయడంపైనే దృష్టి సారించామని టీమిండియా స్పిన్నర్ యజ్వేంద్ర చహల్ తెలిపాడు. ‘దేశం కోసం ఆడటం వేరు.. ఐపీఎల్ వంటి లీగ్‌లో ఆడటం వేరు. రెండింటికి చాలా వ్యత్యాసం ఉంది. ఐపీఎల్‌కు వరల్డ్‌కప్‌కు ఎంతమాత్రం పోలిక లేదు. దేశం తరఫున సమిష్టిగా ఆడటంపైనే మా దృష్టి ఉంది. ఒత్తిడిని అధిగమిస్తేనే వరల్డ్‌కప్ వంటి మెగా టోర్నీల్లో విజయం సాధిస్తాం. వెస్టిండీస్ చాలా ప్రమాదకరమైన జట్టు. ఆ జట్టులో అంతా హార్డ్ హిట్టర్లే. మాతో జరుగనున్న పోరులో వారు కచ్చితంగా ఫామ్‌ను చాటుకుని తిరిగి గాడిలో పడటానికి యత్నిస్తారు. దాంతో మేము కచ్చితమైన ప్రణాళికలతో బరిలోకి దిగుతాం’ అని చహల్ పేర్కొన్నాడు. ఇక విండీస్ ఆల్ రౌండర్ ఆండ్రీ రసెల్ కోసం ఏమైనా ప్రణాళిక సిద్ధం చేశారా? అని అడిగిన ప్రశ్నకు చహల్ అవుననే సమాధానం చెప్పాడు. ‘ రసెల్ కోసం గేమ్ ప్లాన్ ఉంది. అతనొక హార్డ్ హిట్టర్. కానీ మేము చాలా మ్యాచ్‌ల్లో అతనికి బంతులు వేశాం. అతని ఆట తీరుపై అవగాహన ఉంది. రసెల్ ఎప్పుడూ సహజ సిద్ధంగా ఆడటానికి యత్నిస్తాడు. అప్పటి పరిస్థితుల్ని మా ప్రణాళికలు మార్చుకోవాల్సిన అవసరం కూడా ఉంది’ అని చహల్ తెలిపాడు. -
కివీస్‌తో మ్యాచ్: గాయంతో రసెల్ ఔట్
మాంచెస్టర్: ఇంగ్లండ్ వేదికగా జరుగుతన్న ప్రపంచకప్‌లో మాజీ చాంపియన్ వెస్టిండీస్ పేలవ ప్రదర్శనతో నిరుత్సాహపరుస్తుండగా.. మరో వైపు న్యూజిలాండ్ వరుస విజయాలతో దూసుకపోతోంది. శనివారం ఓల్డ్ ట్రాఫోర్డ్ వేదికగా ఈ రెండు జట్లు(విండీస్, కివీస్) తలపడుతున్నాయి. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన కరేబియన్ జట్టు తొలుత ఫీల్డింగ్ ఎంచుకుంది. ఇక ఈ మ్యాచ్‌లో కివీస్ ఎలాంటి మార్పులు లేకుండానే బరిలోకి దిగుతుండగా.. విండీస్ మూడు మార్పులు చేసింది. గాయం కారణంగా విండీస్ స్టార్ ఆల్‌రౌండర్ ఆండ్రీ రసెల్ ఈ మ్యాచ్‌కు దూరమయ్యాడు. అతడి స్థానంలో బ్రాత్‌వైట్‌ను తుదిజట్టులోకి తీసుకుంది. అంతేకాకుండా గత మ్యాచ్‌లో విపలమైన డారెన్ బ్రేవో, గాబ్రియల్లను పక్కకు పెట్టి వారి స్థానాలలో నర్స్, కీమర్ రోచ్‌లకు అవకాశం కల్పించింది. గత మ్యాచ్‌లో బంగ్లాదేశ్ చేతిలో అవమానకర రీతిలో ఓడిన విండీస్ నేటి మ్యాచ్‌లో పటిష్టమైన న్యూజిలాండ్‌ను ఎలా ఎదుర్కొంటుందో చూడాలి. ఇక విండీస్ బ్యాట్స్‌మెన్ ఈరోజు అద్భుతాలు చేస్తే తప్ప కివీస్ జోరును అడ్డుకోవడం అసాధ్యం. మరోవైపు వరుస విజయాలతో సెమీస్ బెర్త్‌ను ఇప్పటికే దాదాపు ఖాయం చేసుకున్న కివీస్ మరో విజయంతో దానిని మరింతగా పటిష్టం చేసుకోవాలనుకొంటుంది. బ్యాటింగ్, బౌలింగ్ అన్ని విభాగాల్లో విండీస్ కంటే కివీస్ మెరుగ్గా ఉంది. ప్రపంచకప్‌లో విండీస్, న్యూజిలాండ్‌లు 7 సార్లు తలపడగా.. న్యూజిలాండ్ 4 సార్లు, విండీస్ 3 సార్లు గెలిచాయి. తుదిజట్లు: వెస్టిండీస్: జాసన్ హోల్డర్(కెప్టెన్), క్రిస్ గేల్, హోప్, లూయిస్, నికోలస్ పూరన్, హెట్మేర్, బ్రాత్‌వైట్, నర్స్, థామస్, కీమర్ రోచ్, కాట్రెల్ న్యూజిలాండ్: కేన్ విలియమ్సన్(కెప్టెన్), మార్టిన్ గప్టిల్, కోలిన్ మున్రో, రాస్ టేలర్, టామ్ లాథమ్, జేమ్స్ నీషమ్, గ్రాండ్‌హోమ్, సాంట్నర్, మ్యాట్ హెన్రీ, ఫెర్గుసన్, ట్రెంట్ బౌల్ట్ -
రసెల్ వచ్చేశాడు..
సౌతాంప్టన్: వన్డే వరల్డ్‌కప్‌లో మరో ఆసక్తికర సమరానికి రంగం సిద్ధమైంది. శుక్రవారం రోజ్‌బౌల్ మైదానం వేదికగా ఆతిథ్య ఇంగ్లండ్‌తో వెస్టిండీస్ తలపడుతోంది. ఒకవైపు భీకరమైన ఫామ్‌తో ఉన్న ఇంగ్లండ్.. మరొకవైపు తమదైన రోజున ఎటువంటి ప్రత్యర్థినైనా మట్టికరిపించే వెస్టిండీస్. దాంతో రసవత్తర పోరు కోసం అభిమానులు ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. తాజా మ్యాచ్‌లో ఇంగ్లండ్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. టాస్ గెలిచిన ఇంగ్లండ్ కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ ముందుగా విండీస్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించాడు. ఇంగ్లండ్ జట్టు ఎటువంటి మార్పులు లేకుండా బరిలోకి దిగుతోంది. విండీస్ పలుమార్పులు చేసింది. ఆండ్రీ రసెల్, ఎవిన్ లూయిస్, గాబ్రియెల్‌లు తుది జట్టులోకి వచ్చారు. గాయం కారణంగా గత మ్యాచ్‌కు దూరమైన విండీస్ స్టార్ ఆటగాడు ఆండ్రీ రసెల్ ఇంగ్లండ్‌తో పోరులో బరిలోకి దిగుతున్నాడు. గాయం నుంచి కోలుకోవడంతో రసెల్‌కు తుది జట్టులో చోటు దక్కించుకున్నాడు. దాంతో విండీస్ బ్యాటింగ్ విభాగం పటిష్టంగా కనిపిస్తోంది. మరొకవైపు విండీస్ బౌలింగ్ విభాగంలో షెనాన్ గాబ్రియల్ జట్టులోకి వచ్చాడు. ఇరు జట్లు తమ ముఖాముఖి రికార్డులో 101 మ్యాచ్‌లు ఆడగా ఇంగ్లండ్ 51 మ్యాచ్‌ల్లో గెలుపొందగా, వెస్టిండీస్ 44 గెలిచింది. ఆరుమ్యాచ్‌లు రద్దయ్యాయి. ప్రపంచ కప్‌లో మాత్రం ఇంగ్లండ్‌దే పూర్తిగా పైచేయి. విండీస్‌తో ఆరుసార్లు తలపడగా... ఐదుసార్లు ఇంగ్లండే నెగ్గింది. ఒక్కదాంట్లోనే కరీబియన్లు (1979 ప్రపంచ కప్ ఫైనల్) విజయం సాధించగలిగారు. తుది జట్లు వెస్టిండీస్ జేసన్ హోల్టర్(కెప్టెన్), క్రిస్ గేల్, ఎవిన్ లూయిస్, షాయ్ హోప్, నికోలస్ పూరన్, హెట్మెయిర్, ఆండ్రీ రసెల్, కార్లోస్ బ్రాత్‌వైట్, షెల్డాన్ కాట్రెల్, షెనాల్ గాబ్రియెల్, ఓష్నీ థామస్ ఇంగ్లండ్ ఇయాన్ మోర్గాన్(కెప్టెన్), జోనీ బెయిర్ స్టో, జో రూట్, జేసన్ రాయ్, జోస్ బట్లర్, బెన్ స్టోక్స్, క్రిస్ వోక్స్, ప్లంకెట్, జోఫ్రా ఆర్చర్, ఆదిల్ రషీద్, మార్క్ వుడ్ -
మీడియం పేసర్‌నని ఎవడు చెప్పిండు: రసెల్
నాటింగ్‌హామ్ : ‘ఆండ్రీ రసెల్’.. భారత క్యాష్ రిచ్ లీగ్ ఐపీఎల్ ఆసాంతం మారుమోగిన పేరు. రస్సెల్ మెరుపులు.. రసెల్ విధ్వంసకరం అంటూ అంతా అతని బ్యాటింగ్ గురించే చర్చ జరిగింది. భారత్‌లో అతనికి విపరీతమైన అభిమాన గణాన్ని తెచ్చిపెట్టింది. అయితే ఈ వెస్టిండీస్ ఆటగాడి విధ్వంసకరం ఐపీఎల్‌తోనే ఆగిపోలేదు.. మెగా ఈవెంట్ ప్రపంచకప్‌లోనూ కొనసాగుతుంది. కానీ ఈసారి మాట్లాడుతోంది మాత్రం అతని బౌలింగ్ గురించి! శుక్రవారం పాక్‌తో వరల్డ్ కప్ మ్యాచ్‌లో రసెల్ బౌలింగ్ ఒక అద్భుతం. దాదాపు 146 కిలోమీటర్ల వేగంతో వరుసగా షార్ట్ పిచ్ బంతులు విసిరి అతను పాక్ బ్యాట్స్‌మెన్‌ను ఒక ఆటాడుకున్నాడు. ఎక్కడా వేగం తగ్గకుండా, కచ్చితత్వంతో, నిలకడగా షార్ట్ బంతులు వేయడంలో అతని అసాధారణ ప్రతిభ కనిపించింది. రసెల్ వేసిన 18 బంతుల్లో 15 బంతులు షార్ట్ పిచ్‌వే కావడం విశేషం! అతని మూడు ఓవర్ల స్పెల్ పాక్‌లో భయం పుట్టించింది. రసెల్ తొలి ఓవర్లో బౌన్సర్‌ను ఫఖర్ జమాన్ ఆడలేకపోయాడు. అతని హెల్మెట్ గ్రిల్‌కు తగిలి బంతి వికెట్లపై పడింది. రెండో ఓవర్లో షార్ట్ బంతులను ఆడలేక బాబర్ బెదిరిపోయాడు. మెయిడిన్‌గా ముగిసిన మూడో ఓవర్లో ఎత్తులో వేగంగా దూసుకొచ్చిన బంతిని ఆడలేక సొహైల్ వికెట్ సమర్పించుకున్నాడు. 3 ఓవర్లలో కేవలం 4 పరుగులే ఇచ్చి 2 వికెట్లు తీసిన రసెల్.. ‘నేను మీడియం పేసర్‌ను కాదు.. ఫాస్ట్ బౌలర్‌ను’అని గట్టిగా చెబుతూ ప్రత్యర్థులను పరోక్షంగా హెచ్చరించాడు. మ్యాచ్ అనంతరం మాట్లాడుతూ.. ‘చాలా మంది నేను ఓ బిగ్‌హిట్టర్‌నని చెబుతుంటారు. వారందరికీ తెలియనిది ఏమిటంటే నేను ఓ ఫాస్ట్ బౌలర్‌ను. అందరూ నన్ను తక్కువ అంచనా వేసారు. నన్నందరూ మీడియం పేసర్‌గా పరిగణిస్తుంటే అసూయ పుట్టేది. నేను బంతి అందుకోవడానికి వచ్చినప్పుడు స్క్రీన్‌పై ‘మీడియం పేసర్’ అని కనిపించేది. అప్పుడు నాకు తెగ కోపం వచ్చేది. ఎవడు చెప్పిండ్రా నేను మీడియం పేసర్‌నని గట్టిగా అరవాలనిపించేది.’ అని రసెల్ తన ఆవేదనను వెళ్లగక్కాడు. ఇక గాయంపై స్పందిస్తూ.. ‘చాలా ఏళ్లుగా మోకాలి గాయంతోనే ఆడుతున్నాను. కొన్నిసార్లు చాలా ఇబ్బందిగా ఉంటుంది. కానీ నేను ఫ్రొఫెషనల్ క్రికెటర్‌ను కాబట్టి మాములే. గాయం నుంచి ఎలా కోలుకోవాలో నాకు బాగా తెలుసు. మరుసటి మ్యాచ్‌కు ఇంకా ఐదు రోజులున్నట్లుంది. నా గాయం తగ్గడానికి ఈ సమయం సరిపోతుంది. నాకు మంచి ఫిజియో టీమ్, మసాజ్ టీమ్ ఉంది. వారంతా నా గాయం తగ్గడానికి కృషి చేస్తారు.’ అని రసెల్ చెప్పుకొచ్చాడు. -
పూర్వ వైభవం కోసం...
ప్రపంచ క్రికెట్‌ను ఏలిన జట్టు... క్రికెట్ ప్రత్యర్థుల్ని వణికించిన జట్టు... తొలి మూడు ప్రపంచ కప్‌లను శాసించిన జట్టు... విండీస్, విండీస్, విండీస్!నిజం. వెస్టిండీస్‌తో ఆటంటేనే హడలెత్తే రోజుల నుంచి వెస్టిండీస్‌పై విజయం తేలికే అనే రోజులొచ్చాయి. గతమైన ఘనం నుంచి బలహీనమైన భవిష్యత్తులోకి పడిపోయిన జట్టు కరీబియన్ జట్టు. డబుల్ ‘చాంపియన్’ నుంచి చాంపియన్‌షిప్ బాట మరిచిన జట్టుగా తయారైంది. ఈసారైతే క్వాలిఫయింగ్తో మెగా ఈవెంట్లోకి అడుగుపెట్టింది. పడుతూ... నానాటికి పడిపోతూ... దిగజారుతూ వస్తోన్న ఈ జట్టు ఈ ప్రపంచకప్‌లో ఏమేరకు రాణిస్తుందో చూడాలి. సాక్షి క్రీడావిభాగం: ప్రపంచ క్రికెట్లోనే ‘ఫైవ్ స్టార్’ రేటింగ్ ఉన్న జట్టు వెస్టిండీస్. కానీ ఇది గతం! 1970, 80 దశకాల్లో టెస్టు, వన్డే ఫార్మాట్లలో ఆటనే శాసించిన ఈ జట్టు క్రమంగా ప్రాభవం కోల్పోయింది. మొదట్లో చాంపియన్ (1975, 1979) అయ్యాక 1983లో రన్నరప్‌గా నిలిచాకా... చాన్నాళ్ల తర్వాత ఒకసారి సెమీస్ (1996), రెండుసార్లు క్వార్టర్స్ (2011, 2015) మినహా లీగ్ దశ జట్టుగా మిగిలిపోయింది. ఇప్పుడైతే టి20ల పుణ్యమాని భారీ హిట్టర్లతో కళకళలాడుతోంది. బ్యాటింగ్ మజాను పంచుతోంది. అయితే 50 ఓవర్ల ఆట వేరు... టి20 మెరుపులు వేరు. ఈ నేపథ్యంలో మెరుపులను మేళవిస్తూనే జట్టు సమతూకంతో వన్డే ప్రపంచకప్‌లో రాణించాలని గంపెడాశలతో మెగా ఈవెంట్‌కు సిద్ధమైంది. దిశ మారితే దశ కూడా... క్రమంగా అధఃపాతాళానికి పడిపోయిన వెస్టిండీస్ గత రెండు టోర్నీల్లో మాత్రం ఆకట్టుకుంది. లీగ్ దశను దాటి క్వార్టర్స్ దిశను చూపెట్టింది. ఇప్పుడు ఫార్మాట్ మారింది. అన్నీ జట్లు అందరితో ఆడాల్సిన ఈవెంట్ ఇది. హిట్టర్లున్న బ్యాటింగ్‌తో పాటు బౌలింగ్‌లో కాస్త కష్టపడితే తప్పకుండా ప్రభావం చూపగలదు. ముఖ్యంగా గేల్‌తో పాటు నికోలస్ పూరన్, షై హోప్, హెట్‌మైర్‌లు కాసేపు క్రీజులో కుదురుకుంటే పరుగుల వరద ఖాయం. బౌలింగ్‌లో కెప్టెన్ హోల్డర్, గాబ్రియెల్, నర్స్, రోచ్‌లు తమ స్థాయికితగ్గ ప్రదర్శన కనబరిస్తే ప్రత్యర్థి జట్టును ఇబ్బంది పెట్టవచ్చు. ఆల్‌రౌండర్ల రూపంలో రసెల్, బ్రాత్‌వైట్‌లు జట్టుకు అదనపు బలం. ఇటీవలి వన్డే రికార్డును పరిశీలిస్తే గత చివరి పది వన్డేల్లో వెస్టిండీస్ నాలుగు మ్యాచ్‌లు నెగ్గింది. ఐదింట ఓడగా... ఒక మ్యాచ్ రద్దయింది. రసెల్... ఓ మిసైల్... ఈ ఐపీఎల్ చూసిన వారెవరైనా గేల్+గేల్= రసెల్ అనే అంటారు. అంతలా రెచ్చిపోయాడీ కరీబియన్ ఆల్‌రౌండర్. బౌండరీల్ని కాదు చుక్కల్ని తాకే సిక్స్ల్నే మంచినీళ్ల ప్రాయంగా బాదేశాడు. అలవోకగా సిక్సర్ల అర్ధసెంచరీ (52)ని మించేశాడు. టోర్నీ ఆసాంతం మెరుగ్గా ఆడాడు. లీగ్‌లో ‘మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్’గా నిలిచాడు. ఈ నేపథ్యంలో మెగా ఈవెంట్లో 31 ఏళ్ల ఈ బ్యా ట్స్మన్పై కన్నేయొచ్చు. విండీస్ ఇన్నింగ్స్ మొదలైతే క్రికెట్ ప్రేక్షకులు తప్పకుండా అతని బ్యాటింగ్ చూస్తారు. అంతలా తన విధ్వంసంతో అందరినీ ఆ‘కట్టి’పడేశాడీ బ్యాట్స్‌మన్. తనదైన రోజున ఎంతటి కఠిన ప్రత్యర్థి ఎదురైనా బలికావాల్సిందే. తన ఫామ్‌ను, సిక్సర్ల సునామీని ప్రపంచకప్‌లోనూ కొనసాగిస్తే విండీస్ దూసుకెళ్లడం ఖాయం ఆఖరి ఆటకు గేల్ రెడీ... క్రిస్ గేల్ అంటేనే సుడిగాలి ఇన్నింగ్స్‌లకు పెట్టింది పేరు. అతనిప్పుడు ప్రపంచకప్‌తో ఆఖరి ఆటకు సిద్ధమయ్యాడు. 39 ఏళ్ల ఈ డాషింగ్ ఓపెనర్ ఈ మెగా ఈవెంట్ తర్వాత వన్డే క్రికెట్‌కు బైబై చెబుతున్నట్లు ప్రకటించాడు. ఈ నేపథ్యంలో అతను తన బ్యాట్‌తో ఆఖరి ‘షో’ చూపించేందుకు సిద్ధంగా ఉన్నాడు. ప్రపంచకప్‌లో విజయంతో రిటైరైతే తన కెరీర్‌కు అంతకు మించిన ముగింపు ఏముంటుం దనే ఆశతో ఉన్నాడు. పైగా అగ్గికి ఆజ్యం తోడైనట్లు రసెల్ కూడా సుడి‘గేల్’కు జతకలిస్తే ప్రత్యర్థి జట్లు విలవిలలాడాల్సిందే. గేల్ లక్ష్యం కూడా తన జట్టుకు ప్రపంచకప్‌ను అందించడమే కావడంతో ఇంగ్లండ్‌లో భారీ సిక్సర్ల విందును ఆశించవచ్చు. ఐపీఎల్లో గేల్ మొత్తంగా విఫలమేమీ కాలేదు. ఈ ఫామ్‌ను కొన సాగిస్తే అతను వరల్డ్‌కప్‌లో విజయవంతమవుతాడు. ప్రపంచకప్‌లో విండీస్ దిగ్గజం లారా (1,225) చేసిన పరుగుల్ని గేల్ (944) అధిగమించే అవకాశముంది. -
‘మా కేకేఆర్ క్యాంప్‌లో సఖ్యత లేదు’
ముంబై: తాజా ఐపీఎల్ సీజన్లో తమ జట్టు ప్లేఆఫ్స్‌కు చేరకపోవడానికి విభేదాలు కూడా ఒక కారణమని కోల్‌కతా నైట్‌రైడర్స్(కేకేఆర్) అసిస్టెంట్ కోచ్ సైమన్ కాటిచ్ స్సష్టం చేశాడు. కేకేఆర్ శిబిరంలో ఆటగాళ్ల మధ్య అంతగా సఖ్యత లేకపోవడమే వరుస ఓటములకు కారణమన్నాడు. నిన్న ముంబై ఇండియన్స్ చేతిలో ఓటమి తర్వాత ప్రెస్ కాన్ఫరెన్స్‌లో మాట్లాడిన కాటిచ్..‘ వరుసగా ఆరు మ్యాచ్‌ల్లో ఓటమి చెందడం మా ప్లేఆఫ్ అవకాశాలను దెబ్బతీసింది. ఇక్కడ ఒక్క విషయాన్ని చెప్పాలి. మా జట్టులో విభేదాలు ఉన్న మాట వాస్తవమే. దీన్ని దాయాలన్నా దాగదు. ఐపీఎల్ వంటి మెగా లీగ్‌కు సిద్ధమయ్యేటప్పుడు జట్టులో సమైక్యత అనేది చాలా ముఖ్యం. కేకేఆర్ సక్సెస్ఫుల్ ఫ్రాంచైజీ అనడంలో ఎటువంటి సందేహం లేదు. గత కొన్నేళ్లుగా జట్టు విజయాలు కోసం ప్రతీ ఒక్కరూ కృషి చేస్తూనే ఉన్నారు. కానీ ఈ సీజన్లో పరిస్థితిలో మార్పు వచ్చింది. ఆటగాళ్ల మధ్య విభేదాలు చోటు చేసుకున్నాయి. ఇది మంచిది కాదు’ అని కాటిచ్ పేర్కొన్నాడు. ఇటీవల కేకేఆర్ స్టార్ ఆటగాడు ఆండ్రీ రసెల్ బహిరంగంగానే ఆ జట్టు నాయకత్వాన్ని ప్రశ్నించాడు. జట్టులో ఎవర్ని ఎలా ఉపయోగించుకోవాలో తమ కెప్టెన్ దినేశ్ కార్తీక్ తెలియడం లేదంటూ చురకలు అంటించాడు. దాంతో కేకేఆర్ క్యాంపులో విభేదాలు ఉన్న విషయం బయటపడింది. (ఇక్కడ చదవండి: దినేశ్ కార్తీక్ ఆగ్రహం.. జట్టు సభ్యులకు వార్నింగ్!) -
ప్రతీసారి రసెల్‌పై ఆధారపడితే ఎలా?
ముంబై: ప్రస్తుత ఐపీఎల్ సీజన్లో కోల్‌కతా నైట్‌రైడర్స్ కథ లీగ్ దశలోనే ముగిసిన సంగతి తెలిసిందే. ఆదివారం ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కేకేఆర్ ఓటమి పాలు కావడంతో ఆ జట్టు ప్లేఆఫ్ అవకాశాలు మూసుకుపోయాయి. ప్రతి మ్యాచ్‌లో మాదిరిగానే ఈసారి కూడా ఆండ్రీ రసెల్.. కేకేఆర్‌ను ఆదుకుంటాడని భావించారంతా. ఈ ఐపీఎల్లో సిక్సర్ల వర్షంలో క్రికెట్ అభిమానులను తడిపేసిన రసెల్‌పై ఆ స్థాయి అంచనాలే నెలకొన్నాయి. కానీ తాడో పేడో తేల్చుకోవాల్సిన మ్యాచ్‌లో రసెల్ చేతులెత్తేశాడు. పరుగులేమీ చేయకుండా పెవిలియన్ చేరాడు. అయితే ఈ మ్యాచ్ ఓటమిపై కోల్‌కతా కెప్టెన్ దినేశ్ కార్తీక్ మీడియాతో మాట్లాడాడు. ‘రసెల్ బ్యాటింగ్ చేయడానికి ఎంతో అవకాశం ఉంది. కానీ ప్రతి మ్యాచ్‌ను అతడే గట్టెక్కిస్తాడనుకోవడం బాగోదు. అతడి మీద ఆధార పడటం కూడా పద్ధతి కాదు. ప్రతీసారి రసెల్‌పై ఆధారపడితే ఎలా. ఈ టోర్నమెంట్ మొత్తంలో రసెల్ ఆట అద్భుతం. ఈ సీజన్ మాకు అంత బెస్ట్ కాదనుకుంటా. ఐపీఎల్ ఒక వినోదాత్మకమైన టోర్నమెంట్. ప్రతిరోజు మేం మా సామర్థ్యం మేరకు పనిచేయడానికి ప్రయత్నిస్తాం. అందరి అంచనాలు అందుకోవాలంటే ముందుగా మేం కొన్నింట్లో మెరుగుపడాలి. వచ్చే ఏడాది మరింత బలంతో, ఆత్మవిశ్వాసంతో ఐపీఎల్లో అడుగుపెడతాం’ అని కార్తిక్ తెలిపాడు. -
కోల్‌కతా... లిన్ గిల్గింత
లీగ్‌లో ఎనిమిదో ఓటమితో ఐపీఎల్ ప్లే ఆఫ్స్ రేసు నుంచి కింగ్స్ ఎలెవెన్ పంజాబ్ దాదాపు బయటికెళ్లిపోయింది. ఇదే సమయంలో ఆరో గెలుపుతో కోల్‌కతా నైట్‌రైడర్స్ తదుపరి దశ అవకాశాలను సజీవంగా ఉంచుకుంది. ఒకింత పెద్దదైన లక్ష్యం కళ్ల ముందున్నా... ఎక్కడా తగ్గకుండా ఆడిన కోల్‌కతా మ్యాచ్‌ను ఏకపక్షంగా వశం చేసుకుంది. క్రీజులోకి వచ్చిన ప్రతి బ్యాట్స్‌మెన్ తమ వంతుగా, దూకుడుగా ఆడటంతో ఆ జట్టుకు లక్ష్య ఛేదనలో ఇబ్బందే లేకపోయింది. మొహాలీ: ఐపీఎల్–12లో పడుతూ లేస్తూ సాగిన పంజాబ్ ప్రయాణం ప్లే ఆఫ్స్ చేరకుండానే ముగిసింది! ఈ దిశగా ఏ మూలనో మిణుకుమిణుకుమంటున్న ఆ జట్టు ఆశలను వారి సొంతగడ్డ పైనే కోల్‌కతా ఆవిరి చేసింది. రెండు జట్ల మధ్య శుక్రవారం ఇక్కడ జరిగిన మ్యాచ్‌లో నైట్‌రైడర్స్ ఏడు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించి... ప్లే ఆఫ్ అవకాశాలను నిలబెట్టుకుంది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన పంజాబ్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 183 పరుగులు చేసింది. ఆల్ రౌండర్ స్యామ్ కరన్ (24 బంతుల్లో 55 నాటౌట్; 7 ఫోర్లు, 2 సిక్స్‌లు), వికెట్ కీపర్ నికోలస్ పూరన్ (27 బంతుల్లో 48; 3 ఫోర్లు, 4 సిక్స్‌లు) దూకుడు కనబర్చారు. సందీప్ వారియర్ (2/31) రెండు వికెట్లు పడగొట్టాడు. యువ ఓపెనర్, ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ శుబ్‌మన్ గిల్ (49 బంతుల్లో 65 నాటౌట్; 5 ఫోర్లు, 2 సిక్స్‌లు) అజేయ అర్ధ సెంచరీ... మరో ఓపెనర్ క్రిస్ లిన్ (22 బంతుల్లో 46; 5 ఫోర్లు, 3 సిక్స్‌లు) ఫటాఫట్ ఇన్నింగ్స్‌తో లక్ష్యాన్ని కోల్‌కతా 18 ఓవర్లలో మూడు వికెట్లు మాత్రమే కోల్పోయి ఛేదించింది. పూరన్ దూకుడు... కరన్ దంచుడు సందీప్ వారియర్ వేసిన తొలి ఓవర్లోనే రెండు ఫోర్లు సహా 10 పరుగులు వచ్చినా తర్వాత పంజాబ్ ఇన్నింగ్స్ వేగంగా సాగలేదు. ఇబ్బందిగా కనిపించిన ఓపెనర్ కేఎల్ రాహుల్ (2)ను స్లో బంతితో, గేల్ (14)ను షార్ట్ బాల్‌తో సందీప్ బోల్తా కొట్టించాడు. పవర్ ప్లే పూర్తయ్యేసరికి జట్టు 41/2తో నిలిచింది. వస్తూనే బౌండరీతో ఖాతా తెరిచిన మయాంక్ (26 బంతుల్లో 36; 2 ఫోర్లు, 1 సిక్స్) సమయోచితంగా ఆడుతుండగా, పూరన్ విజృంభించాడు. గర్నీ బౌలింగ్‌లో సిక్స్.. రసెల్, చావ్లా ఓవర్లలో రెండేసి సిక్స్‌లు, ఫోర్లు దంచాడు. 40 బంతుల్లో 69 పరుగులతో మంచి రన్‌రేట్‌తో దూకుడు మీదున్న ఈ జోడీని నితీశ్ రాణా విడదీశాడు. చావ్లాను లక్ష్యంగా చేసుకున్న పూరన్‌ను నిలువరించేందుకు రాణాను రంగంలోకి దించడం ఫలితాన్నిచ్చింది. అతడి బౌలింగ్‌లో భారీ షాట్ కొట్టబోయిన పూరన్ మిడ్ వికెట్లో సందీప్‌కు క్యాచ్ ఇచ్చాడు. కాసేపటికే మయాంక్... రింకూ సింగ్ చురుకైన ఫీల్డింగ్‌కు రనౌటయ్యాడు. ఆరంభం నుంచి ఊపు కనబర్చిన కరన్‌కు మన్దీప్ సింగ్ (17 బంతుల్లో 25; ఫోర్, సిక్స్) తోడయ్యాడు. వీరు ఐదో వికెట్‌కు 24 బంతుల్లోనే 38 పరుగులు జోడించి స్కోరు పడిపోకుండా చూశారు. 151/6...! 19వ ఓవర్ తొలి బంతికి అశ్విన్ (0) ఔటయ్యేటప్పటికి పంజాబ్ స్కోరిది. కరన్ క్రీజులో ఉన్నా గర్నీ, రసెల్ కట్టుదిట్టంగా బంతులేస్తుండటంతో పంజాబ్ సాధారణ స్కోరే చేసేలా కనిపించింది. కానీ, కరన్ కథ మార్చాడు. ఇన్నింగ్స్ చివరి 11 బంతుల్లో 9 బంతులను ఎదుర్కొన్న అతడు ఏకంగా 31 పరుగులు సాధించాడు. ఇందులో 5 ఫోర్లు, ఒక సిక్స్ ఉండటం విశేషం. తలా కొంత దంచేశారు... ఛేదనలో కోల్‌కతా ఇన్నింగ్స్ ఎక్కడా వేగం తగ్గలేదు. ఓపెనర్లలో శుబ్‌మన్ సంయమనం చూపగా, లిన్ మొదటి నుంచే ధాటిగా ఆడుతూ పంజాబ్‌కు వణుకు పుట్టించాడు. అర్షదీప్ ఓవర్లో హ్యాట్రిక్ బౌండరీలు, అశ్విన్ బౌలింగ్‌లో రెండు ఫోర్లు బాదాడు. ఆండ్రూ టై ఓవర్లో వరుసగా 6, 4 కొట్టాడు. మరుసటి బంతికి భారీ షాట్ ఆడబోయి టైకే క్యాచ్ ఇచ్చాడు. పవర్ ప్లే అనంతరం నైట్ రైడర్స్ 62/1తో నిలిచింది. ఉతప్ప (14 బంతుల్లో 22; 2 ఫోర్లు, సిక్స్) ఔటయ్యాక గిల్ జూలు విదిల్చాడు. అప్పటివరకు బంతికో పరుగు చొప్పున చేస్తున్న అతడు... అశ్విన్ వేసిన 13వ ఓవర్లో విరుచుకుపడి రెండు సిక్స్‌లు, ఫోర్ కొట్టాడు. 48 బంతుల్లో 74 పరుగులుగా ఉన్న విజయ సమీకరణం దీంతో ఒక్కసారిగా 42 బంతుల్లో 54 పరుగులుగా మారిపోయింది. 36 బంతుల్లోనే గిల్ అర్ధ సెంచరీ పూర్తయింది. అనంతరం టై బౌలింగ్‌లో రసెల్ (14 బంతుల్లో 24; 2 ఫోర్లు, 2 సిక్స్‌లు) రెండు సిక్స్‌లు బాదడంతో లక్ష్యం మరింత తేలికైంది. కరన్ ఓవర్లో కెప్టెన్ దినేశ్ కార్తీక్ (9 బంతుల్లో 21 నాటౌట్; 2 ఫోర్లు, 1 సిక్స్) తనదైన శైలిలో షాట్లు కొట్టి అనుకున్నదానికంటే ముందే మ్యాచ్‌ను ముగించాడు. కీలకమైన మ్యాచ్‌లో అదీ సొంతగడ్డపై బౌలింగ్ తేలిపోవడం పంజాబ్‌ను దెబ్బతీసింది. హైదరాబాద్, కోల్‌కతా మధ్యలో రాజస్తాన్ ప్లే ఆఫ్ ముంగిట పాయింట్ల పరంగా (13 మ్యాచ్‌ల్లో 12) ప్రస్తుతం సన్‌రైజర్స్ హైదరాబాద్, కోల్‌కతా నైట్‌రైడర్స్ సమంగా ఉన్నాయి. అయితే, రన్‌రేట్‌లో హైదరాబాద్ చాలా మెరుగ్గా ఉంది. శనివారం బెంగళూరుపై గెలిస్తే సన్‌రైజర్స్ 14 పాయింట్లతో ఉంటుంది. దీంతో ఆదివారం ముంబైతో మ్యాచ్‌లో కోల్‌కతా రన్‌రేట్ లెక్కలను చూసుకుంటూ నెగ్గాల్సి వస్తుంది. బహుశా పరుగుల్లో భారీ తేడాతోనో, లక్ష్యాన్ని చాలా ముందుగానో ఛేదించాల్సి రావొచ్చు. హైదరాబాద్ ఓడితే మాత్రం... కోల్‌కతాకు ఫ్లే ఆఫ్ బెర్త్ దక్కాలంటే ముంబైపై గెలిస్తే సరిపోతుంది. ఒకవేళ... హైదరాబాద్, కోల్‌కతా తమ మ్యాచ్‌ల్లో ఓడిపోయి, ఢిల్లీపై రాజస్తాన్ నెగ్గితే ఆ జట్టు 13 పాయింట్లతో ప్లే ఆఫ్ బెర్త్‌ను సంపాదిస్తుంది. -
ముంబైపై గెలుపుతో రేసులో కోల్‌కతా
-
కోల్‌కతా తడాఖా
నైట్‌రైడర్స్ తరఫున నలుగురే బ్యాటింగ్‌కు దిగారు. కానీ... చేసింది 232 పరుగులు! ఈ సీజన్లోనే అత్యధిక స్కోరిది. ఔటైన ఇద్దరు (గిల్, లిన్)... ఔట్ కాని ఒక్కడు (రసెల్) సిక్సర్లతో విరుచుకుపడ్డారు. బౌండరీల్ని అవలీలగా బాదేశారు. 20 ఓవర్లయ్యాక చూస్తే కొండంత స్కోరు కోల్‌కతాది. హార్దిక్ పోరాడినా ముంబై దీనిని అందుకోలేక పోయింది. ముఖ్యంగా తనను వన్‌డౌన్‌లో దింపితే అవతలి జట్టుకు ఎంత నష్టమో రసెల్ నిరూపించాడు. కోల్‌కతా: ముంబైతో మ్యాచ్‌కు ముందు రోజు కోల్‌కతా మిసైల్ బ్యాట్స్‌మన్ రసెల్ మీడియా సమావేశంలో మాట్లాడుతూ ‘సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకోలేకే వరుసగా ఓడుతున్నాం’ అని విమర్శించాడు. అందుకేనేమో వెంటనే కళ్లు తెరిచిన నైట్‌రైడర్స్ యాజమాన్యం సరైన నిర్ణయం తీసుకుంది. రసెల్‌ను వన్‌డౌన్‌లో దించింది. అంతే సిక్సర్ల ఉప్పెనే! గెలిచి రేసులో నిలవాల్సిన పోరులో కోల్‌కతా ‘ధనాధన్’లాడించింది. గెలిస్తే ముందడుగు వేసే స్థితిలో ఉన్న ముంబైని నిలువరించింది. ఆదివారం జరిగిన మ్యాచ్‌లో నైట్‌రైడర్స్ 34 పరుగుల తేడాతో ముంబైని ఓడించింది. శుబ్‌మన్ గిల్ (45 బంతుల్లో 76; 6 ఫోర్లు, 4 సిక్స్‌లు), క్రిస్ లిన్ (29 బంతుల్లో 54; 8 ఫోర్లు, 2 సిక్స్‌లు), రసెల్ (40 బంతుల్లో 80 నాటౌట్; 6 ఫోర్లు, 8 సిక్సర్లు) చెలరేగారు. దీంతో మొదట కోల్‌కతా 20 ఓవర్లలో 2 వికెట్లకు 232 పరుగులు చేసింది. తర్వాత ముంబై 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 198 పరుగులు చేసి ఓడింది. హార్ధిక్ పాండ్యా (34 బంతుల్లో 91; 6 ఫోర్లు, 9 సిక్స్‌లు) బెదరగొట్టాడు. సిక్స్‌ల వర్షం కురిపించాడు. రసెల్, గర్నీ, నరైన్‌లు తలా 2 వికెట్లు తీశారు. రసెల్ ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ అందుకున్నాడు. దిగినాడో... దంచాడే! ముంబై టాస్ నెగ్గి తప్పు చేసింది. కోల్‌కతాకు బ్యాటింగ్ అప్పజెప్పింది. లిన్‌తో జతగా ఓపెనింగ్ చేసిన శుబ్‌మన్ గిల్ నైట్‌రైడర్స్ ఇన్నింగ్స్‌కు బౌండరీలతో శ్రీకారం చుట్టాడు. శరణ్ బౌలింగ్‌లో 2 ఫోర్లు, సిక్స్‌తో 14 పరుగులు బాదాడు. నాలుగో ఓవర్లో లిన్ రెండు బౌండరీలతో టచ్‌లోకి వచ్చాడు. ఆ తర్వాత ప్రతీ ఓవర్ 10 పరుగులకు తగ్గలేదు. మలింగ, రాహుల్ చహర్, బుమ్రా ఎవరు బౌలింగ్ వేసినా ఫోర్లు, సిక్సర్లే! 9 ఓవర్లు ముగిసేసరికి వికెటే కోల్పోకుండా 89 పరుగులు చేసింది. లిన్ 27 బంతుల్లోనే ఫిఫ్టీ చేశాడు. జోరుమీదున్న ఈ జోడీకి పదో ఓవర్లో చుక్కెదురైంది. లిన్‌ను చహర్ ఔట్ చేయడంతో 96 పరుగుల తొలి వికెట్ భాగస్వామ్యానికి తెరపడింది. దీంతోపాటే రసెల్ వన్‌డౌన్‌లోకి రావడంతో బౌలర్ల భరతం పట్టేందుకు తెరలేచింది. గిల్ అర్ధశతకం... ఆద్యంతం దూకుడుగానే కనిపించిన గిల్ జిగేల్మనే ఇన్నింగ్స్ ఆడాడు. బ్యాట్‌కు అందిన బంతిని బౌండరీగా, చెత్త బంతిని సిక్సర్‌గా మలిచాడు. ఈ క్రమంలో 32 బంతుల్లో శుబ్‌మన్ అర్ధసెంచరీ పూర్తి చేసుకున్నాడు. రసెల్‌తో రెండో వికెట్‌కు 62 పరుగులు జోడించాక నిష్క్రమించాడు. తర్వాత దినేశ్ కార్తీక్ (7 బంతుల్లో 15 నాటౌట్; 1 ఫోర్, 1 సిక్స్) జత కలువగా రసెల్ వన్‌సైడ్ ఇన్నింగ్స్ ఆడాడు. వీళ్లిద్దరు అబేధ్యమైన మూడో వికెట్‌కు 4.4 ఓవర్లలోనే 74 పరుగులు జోడించడం విశేషం. ముంబై తడబాటు... ఈ సీజన్లోనే కష్టసాధ్యమైన లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబై ఆరంభం నుంచే ఒత్తిడికి గురైంది. రెండో ఓవర్లోనే డికాక్ (0) డకౌట్ కాగా, నాలుగో ఓవర్లో రోహిత్ శర్మ (12) ఆట ముగిసింది. ఓపెనర్లు 21 పరుగులకే పెవిలియన్ చేరారు. తర్వాత వచ్చిన లూయిస్ (15), సూర్యకుమార్ (14 బంతుల్లో 26; 2 ఫోర్లు, 2 సిక్స్‌లు) కాసేపు ఆడగలిగినా... రసెల్ వీళ్లిద్దరిని ఔట్ చేశాడు. క్రీజులోకి వచ్చిన పొలార్డ్ (20; 2 ఫోర్లు) 21 బంతులాడినా మెరిపించలేకపోయాడు. రెండు బౌండరీలు కొట్టిన పొలార్డ్... నరైన్ ఉచ్చులో పడ్డాడు. తర్వాత పాండ్యా బ్రదర్స్ ఆటకు వేగం తెచ్చారు. హార్దిక్ అదరగొట్టాడు... హార్దిక్ పాండ్యా ఆకాశమే హద్దుగా చెలరేగాడు. భారీ సిక్సర్లతో విధ్వంసం సృష్టించాడు. చావ్లా వరుస ఓవర్లలో (10, 12వ) రెండేసి సిక్స్‌ల చొప్పున బాదాడు. నరైన్, గర్నీ ఓవర్లలో సిక్స్‌ల మోత మోగించాడు. కేవలం 17 బంతుల్లోనే 7 సిక్స్‌లు, ఒక బౌండరీ సాయంతో వేగంగా అర్ధసెంచరీ చేశాడు. ఎవరు బౌలింగ్‌కు వచ్చినా బంతిని అదేపనిగా సిక్స్‌లుగా మలిచాడు. 16వ ఓవర్ వేసేందుకు చావ్లా రాగా సిక్స్, 2 ఫోర్లతో 20 పరుగులు రాబట్టాడు. 17వ ఓవర్లో 4, 6తో 14 పరుగులు జతచేశాడు. చిచ్చర పిడుగల్లే చెలరేగుతున్న హార్దిక్‌ను గర్నీ 18వ ఓవర్లో పెవిలియన్ చేర్చాడు. చావ్లా ఆఖరి ఓవర్లో కృనాల్ (24) ఔటయ్యాడు. అతని ఆటే ‘హైలైట్స్’ ఇన్నింగ్స్ బ్రేక్‌లోనో, మ్యాచ్ పూర్తయ్యాకో టీవీల్లో మనకు కనిపిస్తాయే... ఆ హైలైట్స్! అవి రసెల్ ఆటలోనే కనిపించాయి. మూడు బంతులాడినా పరుగే చేయని ఈ మిసైల్ తర్వాత ముంబై బౌలర్లకు ముచ్చెమటలు పట్టించాడు. చహర్ వేసిన 12వ ఓవర్లో బౌండరీతో మొదలైన హిట్టింగ్‌కు అడ్డుఅదుపే లేకుండా పోయింది. ఫుల్‌టాస్‌ను డీప్ మిడ్‌వికెట్ మీదుగా, బౌన్సర్ వేస్తే అప్పర్ కట్‌తో థర్డ్‌మ్యాన్ దిశగా ఎక్కడ బంతి వేసినా... అది సిక్స్‌గానే ఫిక్సయింది. చహర్ 13 ఓవర్లో రెండు సిక్సర్లు బాదేశాడు. బంతి పదేపదే బౌండరీ లైన్ అవతలికే వెళ్లిపోవడంతో 30 బంతుల్లోనే ఫిఫ్టీ చేశాడు. హార్దిక్ పాండ్యా 18వ ఓవర్లో మూడు కళ్లు చెదిరే సిక్స్‌లు బాదితే 20 పరుగులొచ్చాయి. 19వ ఓవర్ బుమ్రా వేస్తే సిక్స్, ఫోర్ 15 పరుగులు! మలింగ ఆఖరి ఓవర్లో 6, 4, 4, 0, 0, 6 ఇరవై పరుగులు లభించాయి. -
గేల్, రసెల్‌కు చోటు..పొలార్డ్, నరైన్‌కు నో చాన్స్
ఆంటిగ్వా: ఐపీఎల్లో అదరగొడుతున్న విధ్వంసకర ఆటగాళ్లు గేల్ (కింగ్స్ పంజాబ్), రస్సెల్ (కోల్‌కతా నైట్‌రైడర్స్) వెస్టిండీస్ ప్రపంచకప్ జట్టులో చోటు దక్కించుకున్నా రు. ఈ మేరకు జాసన్ హోల్డర్ సారథ్యంలోని 15 మందితో కూడిన జట్టును ప్రకటించారు. అయితే పొలార్డ్, నరైన్‌కు మాత్రం చుక్కెదురైంది. గేల్, రసెల్‌లను మాత్రమే పరిగణలోకి తీసుకున్న విండీస్ క్రికెట్ బోర్డు.. పొలార్డ్, నరైన్‌లకు మాత్రం ఉద్వాసన పలికింది. వెస్టిండీస్ వరల్డ్‌కప్ జట్టు హోల్డర్ (కెప్టెన్), క్రిస్‌గేల్, ఆష్లే నర్స్, రసెల్, కార్లోస్ బ్రాత్‌వైట్, డారెన్ బ్రావో, ఎవిన్ లూయిస్, ఫాబియన్ అలెన్, కీమర్ రోచ్, పూరన్ (వికెట్‌కీపర్), ఒషానె థామస్, షాయ్ హోప్, షానన్ గాబ్రియెల్, షెల్డన్ కొట్రెల్, హెట్మెయిర్ -
అందుకు క్రిస్ గేల్ కారణం: రసెల్
కోల్‌కతా: ఈ ఐపీఎల్ సీజన్లో బంతిని బలంగా బాదుతూ అభిమానులకు ఎక్కువ వినోదాన్ని పంచుతున్న క్రికెటర్లలో కోల్‌కతా నైట్‌రైడర్స్ ఆటగాడు ఆండ్రీ రసెల్ ఒకడు. ప్రస్తుత ఐపీఎల్లో ఇప్పటివరకూ ఆడిన మ్యాచ్‌ల ప్రకారం చూస్తే రసెల్ 217.00 స్ట్రైక్‌రేట్‌తో అందరి కంటే ముందున్నాడు. సుమారు 66.00 సగటుతో 392 పరుగులు చేశాడు. ఇప్పటివరకే రసెల్ 41 సిక్సర్లు బాదాడు. అయితే తన హార్డ్ హిట్టింగ్ వెనుకాల ఒక వ్యక్తి ఉన్నాడంటూ రసెల్ తాజాగా బయటపెట్టాడు. తమ దేశానికి చెందిన క్రిస్ గేల్ సలహాతోనే భారీ షాట్లను అవలీలగా ఆడుతున్నానని రసెల్ తెలిపాడు. ‘క్రిస్ గేల్ ఇచ్చిన సలహా నా జీవితాన్నే మార్చేసింది. సిక్సులు ఎలా కొట్టాలో గేల్‌ను చూసే నేర్చుకున్నా. ఇంతకు ముందు చాలా తేలికైన బ్యాట్లు వాడేవాడిని. గత టీ20 ప్రపంచకప్‌లో డ్రెస్సింగ్ రూమ్‌లో ఉన్న సమయంలో గేల్ నా దగ్గరికి వచ్చి.. ‘నువ్వు బరువైన బ్యాటు ఎందుకు వాడవు.. ఆ బ్యాటుతో సిక్సర్లు సులభంగా కొట్టవచ్చు’ అని సలహా ఇచ్చాడు. ఆ సలహాను నేను అమలు చేసినప్పటి నుంచి నా బ్యాటింగ్ తీరే మారిపోయింది. అదే టీ20 ప్రపంచకప్ సెమీఫైనల్లో 48 పరుగులు చేశాను. అప్పటి నుంచి నేను చూస్తుండగానే నా దశ తిరిగింది. ప్రస్తుతం మిగతా బ్యాట్స్‌మెన్ బ్యాట్ల కంటే నా బ్యాట్ బరువెక్కువ. అదే నా సక్సెస్‌కు కారణం’ అని రసెల్ తెలిపాడు. -
యాహూ.. ఆర్సీబీ మళ్లీ గెలిచిందోచ్
పరుగుల వర్షం అంటే ఇదేనేమో.. 40 ఓవర్లు, 416 పరుగులు.. 26 సిక్సర్లు, 35 ఫోర్లు. బ్యాట్స్‌మెన్ ధాటికి బౌండరీలు చిన్న బోయాయి. బౌలర్లు బంతులెక్కడ వేయాలో అర్థంకాలేదు. తాజా ఐపీఎల్ సీజన్లో తొలి సారి ప్రేక్షకులకు కావల్సిన విందు, టీ20 మజాను ఆర్సీబీ, కేకేఆర్ జట్టు అందించాయి. తొలుత విరాట్ శతకంతో అదరగొట్టగా.. అనంతరం రసెల్, రాణా విధ్వంసం సృష్టించడంతో కోల్‌కతా ఈడెన్ గార్డెన్స్ మైదానం పరుగుల వర్షంతో తడిసిముద్దైయింది. విజయం ఎవరిని వరించినా అభిమానులు మాత్రం పరుగుల పండగ చేసుకున్నారు. కోల్‌కతా: రాయల్ చాలెంజర్స్ బెంగళూరు మరో విజయం సాధించింది. అవును ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)లో భాగంగా కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 10 పరుగుల తేడాతో ఆర్సీబీ రెండో విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. దీంతో ప్లేఆఫ్ ఆశలను కోహ్లి సేన ఇంకా సజీవంగానే ఉంచుకుంది. ఆర్సీబీ నిర్దేశించిన 214 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన కేకేఆర్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 203 పరుగులకే పరిమితమైంది. ఛేదనలో కేకేఆర్ టాపార్డర్ పూర్తిగా విఫలమైంది. క్రిస్ లిన్(1), నరైన్(18), గిల్(9), ఊతప్ప(9)లు నిరాశ పరిచారు. దీంతో 79 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ క్రమంలో నితీష్ రాణా(85 నాటౌట్; 46 బంతుల్లో 9ఫోర్లు, 5 సిక్సర్లు), రసెల్(65; 25 బంతుల్లో 2 ఫోర్లు, 9 సిక్సర్లు)లు పెను విధ్వంసం సృష్టించడంతో కేకేఆర్ విజయం అంచునకు చేరింది. అయితే వీరిద్దరు శక్తిమేర ప్రయత్నించినప్పటికీ భారీ స్కోర్ కావడంతో కేకేఆర్‌కు ఓటమి తప్పలేదు. అంతకుముందు టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేపట్టిన ఆర్సీబీ ఆదిలోనే పార్ధివ్ పటేల్(11) వికెట్‌ను నష్టపోయింది. ఆపై అక్షదీప్ నాథ్(13)కూడా నిరాశపరచడంతో ఆర్సీబీ 59 పరుగులకే రెండో వికెట్‌ను నష్టపోయింది. ఆ తరుణంలో కోహ్లి-మొయిన్ అలీల జోడి తొలుత బాధ్యతాయుతంగా బ్యాటింగ్ చేసింది. అయితే ఓ దశలో మొయిన్ అలీ రెచ్చిపోయి ఆడటంతో స్కోరు బోర్డు పరుగులు తీసింది. అతనికి కోహ్లి నుంచి చక్కటి సహకారం లభించింది. ఈ క్రమంలోనే కోహ్లి ముందుగా హాఫ్ సెంచరీ సాధించగా, కాసేపటికి అలీ కూడా అర్థ శతకం నమోదు చేశాడు. ప్రధానంగా కుల్దీప్ వేసిన 16 ఓవర్లో 27 పరుగులు సాధించిన మొయిన్ అలీ(66; 28 బంతుల్లో 5 ఫోర్లు, 6 సిక్సర్లు).. అదే ఓవర్ ఆఖరి బంతికి ఔటయ్యాడు. అటు తర్వాత ఇక కోహ్లి విజృంభించి ఆడాడు. బౌలర్ ఎవరన్నది చూడకుండా సొగసైన షాట్లతో అలరించాడు. ఆఖరి ఓవర్లో సెంచరీ పూర్తి చేసుకున్న కోహ్లి(58 బంతుల్లో 9 ఫోర్లు 4 సిక్సర్లతో 100 పరుగులు).. చివరి బంతికి పెవిలియన్ చేరాడు. ఆర్సీబీ తొలి పది ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 70 పరుగులు చేస్తే, చివరి 10 ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయి 143 పరుగులు చేయడం విశేషం. దీంతో ఆర్సీబీ నిర్ణీత ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 213 పరుగులు చేసింది. -
నేటి మ్యాచ్‌లో గంగూలీ ఎవరివైపు?
కోల్‌కతా: ప్రస్తుత ఐపీఎల్లో భీకరమైన ఫామ్‌లో ఉండి ప్రత్యర్థి జట్లకు చెమటపట్టిస్తున్న ఆటగాడెవరెంటే నిస్సందేహంగా కోల్‌కతా నైట్‌రైడర్స్ ఆటగాడు ఆండ్రూ రసెలే. ఇప్పటివరకూ కేకేఆర్ ఆడిన మ్యాచ్‌ల్లో రస్సెల్ విజృంభించిన తీరు దీనికి నిదర్శనం. ఆరు మ్యాచ్‌లు ఆడిన కేకేఆర్ 4 విజయాలతో పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో ఉందంటే అది రస్సెల్ చలవే. ఈ ఆరు మ్యాచ్‌ల్లోనూ విధ్వంసక వీరుడు 257 పరుగులు సాధించాడు. ఇందులో 150 పరుగులు ఏకంగా సిక్సర్ల రూపంలోనే వచ్చాయి. ఇంతగా విజృంభిస్తున్న రసెల్‌ను కట్టడి చేసింది.. ఢిల్లీ క్యాపిటల్స్ బౌలర్ కాగిసో రబడ మాత్రమే. ఢిల్లీలోని ఫిరోజ్ షా కోట్లా మైదానం వేదికగా కేకేఆర్‌తో జరిగిన మ్యాచ్‌లో.. సూపర్ ఓవర్లో రబడ అద్భుతమైన యార్కర్‌తో రస్సెల్‌ను పెవిలియన్‌కు చేర్చి తమ జట్టుకు విజయాన్ని కట్టబెట్టిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో నేడు కోల్‌కతా వేదికగా ఈ రెండు జట్లు మరోసారి తలపడనున్నాయి. ఇందులోనూ ఈ ఇద్దరి మధ్య ఆసక్తికర పోరు సాగడం ఖాయం. గంగూలీ ఎటువైపు..? ఈ రెండు జట్ల మధ్య పోరులో మరో ఆసక్తికర అంశం. టీమిండియా, కేకేఆర్ మాజీ కెప్టెన్ సౌరభ్ గంగూలీకి కోల్‌కతా సొంత మైదానం. అంతేకాదు క్యాబ్ అధ్యక్షుడిగానూ గంగూలీ బాధ్యతలు నిర్వహిస్తున్నాడు. ఇంతకుముందు ఇక్కడ కేకేఆర్‌తో ఏ జట్టు తలపడినా గంగూలీ మద్దతు సొంత జట్టుకే. అయితే, ఈసారి ఢిల్లీ క్యాపిటల్స్(డీసీ)కు సలహాదారుగా ఉన్న దాదా ఈసారి ఏ జట్టు డగౌట్ వైపు కూర్చుంటాడనేది ఆసక్తికరం. జట్లు(అంచనా): కోల్‌కతా నైట్ రైడర్స్: దినేశ్ కార్తీక్(కెప్టెన్), రాబిన్ ఉతప్ప, క్రిస్ లిన్, శుభ్‌మన్ గిల్, రసెల్, సునీల్ నరైన్, పీయూష్ చావ్లా, కుల్దీప్ యాదవ్, ప్రసీద్ కృష్ణ, ఫెర్గూసన్. ఢిల్లీ క్యాపిటల్స్: శ్రేయస్ అయ్యర్(కెప్టెన్), పృథ్వీ షా, శిఖర్ ధవన్, రిషబ్ పంత్, కొలిన్ ఇంగ్రామ్, అక్షర్ పటేల్, రాహుల్ తెవాటియా, రబడ, ఇషాంత్, క్రిస్ మోరిస్, బౌల్ట్. -
రసెల్ వీక్నెస్ బయటపెట్టిన కుల్దీప్
హైదరాబాద్: ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) సీజన్ 12లో ఇప్పటివరకు కోల్‌కతా నైట్‌రైడర్స్ సాధించిన విజయాల్లో విధ్వంసకర ఆటగాడు ఆండ్రీ రసెల్ కీలకపాత్ర పోషించిన విషయం తెలిసిందే. ప్రత్యర్థి బౌలర్లకు కొరకరాని కొయ్యగా మారిన రసెల్ బ్యాటింగ్ బలహీనతలను ఆ జట్టు ఆటగాడే కుల్దీప్ యాదవ్ తెలిపాడు. బంతిని ఎక్కువగా స్సిన్ చేస్తే రసెల్ ఆడలేడని పేర్కొన్నాడు. ఒకవేళ అతడిని ఎదుర్కోవాల్సి వస్తే బంతిని ఎక్కువగా టర్న్ చేసి అతడిని కట్టడి చేస్తానని వివరించాడు. అయితే సరైన రీతిలో యార్కర్లు వేస్తే రసెల్ ఇబ్బందులకు గురవుతాడని మాజీ క్రికెటర్లు తమ అభిప్రాయాన్ని తెలుపుతున్నారు. ఇక ఈ ఐపీఎల్లో ఆకాశమే హద్దుగా చెలరేగుతున్న రసెల్.. ఇప్పటివరకు 212.39 స్ట్రైక్ రేట్‌తో 257 పరుగులు సాధించాడు. రసెల్‌తో పాటు మిగతా ఆటగాళ్లు సరైన సమయంలో రాణిస్తుండటంతో కేకేఆర్ పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో కొనసాగుతోంది. ఢిల్లీతో జరిగిన మ్యాచ్‌లో సూపర్ ఓవర్‌తో ఓడిపోయిన కార్తీక్ సేన.. సీఎస్కేపై మాత్రమ తేలిపోయింది. ఆ మ్యాచ్‌లో తమ బలహీనతలను కేకేఆర్ ఆటగాళ్లు బయటపెట్టుకున్నారు. కేకేఆర్ తన తరువాతి మ్యాచ్ ఢిల్లీ క్యాపిటల్స్‌తో రేపు(శుక్రవారం) తలపడనుంది. -
చెన్నై చెడుగుడు
కోల్‌కతా నైట్‌రైడర్స్... ఈ సీజన్లో రెండు మ్యాచ్‌ల్లో 18 బంతుల్లోనే 53 పరుగులతో అసాధ్యాన్ని సుసాధ్యం చేసిన జట్టు. అలాంటి జట్టుతో చెన్నై చెడుగుడు ఆడుకుంది. 20 ఓవర్లు ఆడినా... 108 పరుగులకు మించకుండా ఎక్కడికక్కడ కట్టడి చేసింది. తర్వాత సునాయాస లక్ష్యాన్ని కష్టపడి ఛేదించింది.ఒక్కముక్కలో చెప్పాలంటే ఈ రోజు ‘పసుపు సేన’ది. కాబట్టే చెపాక్‌లో ‘సూపర్’ కింగ్స్ అజేయంగా నిలిచింది. చెన్నై: సొంతగడ్డపై చెన్నై సూపర్‌కింగ్స్ ఎదురేలేకుండా సాగిపోతోంది. మంగళవారం జరిగిన మ్యాచ్‌లో చెన్నై 7 వికెట్ల తేడాతో కోల్‌కతా నైట్‌రైడర్స్‌ను ఓడించింది. ముందుగా బ్యాటింగ్‌కు దిగిన కోల్‌కతా నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 108 పరుగులు చేసింది. ఒకే ఒక్కడు ఆండ్రీ రసెల్ (44 బంతుల్లో 50 నాటౌట్; 5 ఫోర్లు, 3 సిక్సర్లు) అజేయ అర్ధసెంచరీ సాధించాడు. ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ దీపక్ చహర్ 3 వికెట్లు తీశాడు. తర్వాత స్వల్ప లక్ష్యాన్ని చెన్నై సూపర్‌కింగ్స్ 17.2 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 111 పరుగులు చేసి గెలిచింది. డుప్లెసిస్ (45 బంతుల్లో 43 నాటౌట్; 3 ఫోర్లు) రాణించాడు. 0, 6, 11, 0... కోల్‌కతా టాపార్డర్ స్కోరిది! ఆట మొదలైందో లేదో... ఇంకా సీట్లలోకి ప్రేక్షకులు పూర్తిగా కూర్చోకముందే నైట్‌రైడర్స్ పతనం ఫటాఫట్‌గా మొదలైంది. చెన్నై పేసర్ దీపక్ చహర్ నిప్పులు చెరిగాడు. ఓవర్‌కు ఒక వికెట్ చొప్పున లిన్ (0), నితీశ్ రాణా (0), రాబిన్ ఉతప్ప (11)లను పెవిలియన్ చేర్చాడు. ఇది చాలదన్నట్లు హర్భజన్ స్పిన్ మాయలో నరైన్ (6) పడ్డాడు. అంతే 24 పరుగులకే 4 టాపార్డర్ బ్యాట్స్‌మెన్ ఔట్. తర్వాత తాహిర్ కూడా ఓ చెయ్యి వేశాడు. కెప్టెన్ దినేశ్ కార్తీక్ (27 బంతుల్లో 19; 3 ఫోర్లు), శుబ్‌మన్ గిల్ (9)లను పెవిలియన్ పంపించాడు. ఆదుకున్న రసెల్ బ్యాట్స్‌మెన్ చేతులెత్తేసిన చెపాక్ పిచ్‌పై టెయిలెండర్లు పీయూష్ చావ్లా (8), కుల్దీప్ (0), ప్రసిధ్ కృష్ణ (0) మాత్రం ఏం చేస్తారు. 79 పరుగులకే 9 వికెట్లను కోల్పోయి వంద కంటే ముందే ఆలౌటయ్యేందుకు కోల్‌కతా సిద్ధమైంది. కానీ ఒక్కడు పోరాటం చేశాడు. పిచ్ పూర్తిగా బౌలర్ల వశమైన తరుణంలో రసెల్ నిలబడ్డాడు. కానీ మిస్సైల్ షాట్లు మాత్రం అంత ఈజీగా రాలేదు. బంతిని బలంగా బాదే క్రమంలో అతను కొద్దిసేపు కండరాల నొప్పితో బాధపడ్డాడు. అయినా మొండిగా కడదాకా బ్యాట్‌ను ఝళిపించాడు. జట్టు స్కోరును వందకు చేర్చాడు. తను 5 ఫోర్లు, 3 సిక్సర్లతో 44 బంతుల్లో అర్ధ సెంచరీ చేశాడు. హర్భజన్, తాహిర్ చెరో 2 వికెట్లు తీశారు. రాణించిన డుప్లెసిస్... సూపర్‌కింగ్స్ సునాయాస లక్ష్యఛేదన వాట్సన్ బౌండరీతో మొదలైంది. కానీ పిచ్ పరిస్థితుల దృష్ట్యా ఆతిథ్య జట్టుకు కష్టాలు తప్పలేదు. 2 ఫోర్లు, సిక్సర్‌తో ఊపుమీదున్న వాట్సన్ (9 బంతుల్లో 17), క్రీజులో నిలబడేందుకు సాహసించిన రైనా (13 బంతుల్లో 14; 1 ఫోర్, 1 సిక్స్)లు నరైన్ ఉచ్చులో పడ్డారు. దీంతో 35 పరుగులకే 2 కీలక వికెట్లను కోల్పోయింది. అందుకేనేమో తర్వాత వచ్చిన బ్యాట్స్‌మెన్ పిచ్‌ను గౌరవించారు. ఆచితూచి ఆడుతూ తమ ఆటను మెల్లిగా కొనసాగించారు. డుప్లెసిస్, రాయుడు (31 బంతుల్లో 21; 2 ఫోర్లు) ఒకట్రెండు పరుగులతో, వీలుచిక్కినపుడు బౌండరీతో స్కోరు బోర్డును నడిపించారు. అంతేగానీ అనవసర మెరుపులకు ఆస్కారమివ్వలేదు. ఇద్దరు మూడో వికెట్‌కు 46 పరుగులు జోడించారు. జట్టు స్కోరు 81 వద్ద రాయుడు షాట్‌కు యత్నించి నిష్క్రమించాడు. తర్వాత కేదార్ జాదవ్ (8 నాటౌట్)తో కలిసి డుప్లెసిస్ మిగతా లక్ష్యాన్ని పూర్తిచేశాడు. నరైన్‌కు 2 వికెట్లు దక్కాయి. -
చెన్నై ‘సూపర్’ విజయం
చెన్నై: డిపెండింగ్ చాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ మరో అపూర్వ విజయం సాధించింది. ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) సీజన్ 12లో భాగంగా కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఏడు వికెట్ల తేడాతో సీఎస్కే ఘన విజయం సాధించింది. కేకేఆర్ నిర్దేశించిన 109 పరుగుల లక్ష్యాన్ని.. 17.2 ఓవర్లలో కేవలం మూడు వికెట్ల కోల్పోయి ఛేదించింది. సీఎస్కే ఓపెనర్ డుప్లెసిస్(43నాటౌట్; 45 బంతుల్లో 3ఫోర్లు) చివరి వరకు ఉండి జట్టుకు విజయాన్నందించాడు. డుప్లెసిస్‌కు తోడుగా వాట్సన్(17), రైనా(14), రాయుడు(21)లు తమ వంతు కృషి చేశారు. కేకేఆర్ బౌలర్లలో నరైన్ రెండు వికెట్లు తీయగా.. చావ్లా ఒక్క వికెట్ దక్కించుకున్నాడు. అంతకముందు టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేపట్టిన కేకేఆర్‌ను తొలి ఓవర్లోనే షాక్ తగిలింది. ఓపెనర్ క్రిస్ లిన్ డకౌట్‌గా వెనుదిరిగాడు. అనంతరం సీఎస్కే బౌలర్లు క్రమంతప్పకుండా వికెట్లు తీయడంతో కేకేఆర్ బ్యాటింగ్ ఆర్డర్ కుప్పకూలింది. కేకేఆర్ ప్రధాన బ్యాట్స్‌మెన్ రాణా(0), నరైన్(6), ఊతప్ప(8), దినేశ్ కార్తీక్(19), గిల్(10)లు తీవ్రంగా నిరాశపరిచారు. రసెల్ (50 నాటౌట్; 44 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్సర్లు) ఒంటరి పోరాటం చేయడంతో కేకేఆర్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 108 పరుగులు చేయగలిగింది. సీఎస్కే బౌలర్లలో దీపక్ చాహర్ మూడు వికెట్లు సాధించగా, హర్భజన్ సింగ్, ఇమ్రాన్ తాహీర్‌లు తలో రెండు వికెట్లు తీశారు. -
రసెల్ ఒంటరి పోరాటం
చెన్నై: ఐపీఎల్లో భాగంగా చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్ 109 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. కేకేఆర్ వరుసగా వికెట్లు కోల్పోవడంతో స్వల్ప స్కోరుకే పరిమితమైంది. తొమ్మిది పరుగులకే పరుగులకు మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన కేకేఆర్..స్వల్ప విరామాల్లో వికెట్లు కోల్పోతూ వచ్చింది. చెన్నై సూపర్ కింగ్స్ బౌలర్లు విజృంభించి బౌలింగ్ చేసి కేకేఆర్ బ్యాటింగ్ ఆర్డర్‌ను కకావికలం చేశారు. కేకేఆర్ ఆటగాళ్లో ఆండ్రీ రసెల్(50 నాటౌట్; 44 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్సర్లు) ఒంటరి పోరాటం చేసి జట్టు పరిస్థితిని చక్కదిద్దాడు. కేకేఆర్ జట్టులో నలుగురు డకౌట్‌గా పెవిలియన్ చేరడంతో ఆ జట్టు నిర్ణీత ఓవర్లలో తొమ్మిది వికెట్లు కోల్పోయి 108 పరుగులు చేసింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేపట్టిన కేకేఆర్ జట్టులో ఓపెనర్లు క్రిస్ లిన్ పరుగులేమీ చేయకుండా పెవిలియన్ చేరితే, సునీల్ నరైన్(6) కూడా నిరాశపరిచాడు. దీపక్ చాహర్ వేసిన తొలి ఓవర్లో లిన్ ఔటైతే, హర్భజన్ వేసిన రెండో ఓవర్లో నరైన్ పెవిలియన్ చేరాడు. లిన్‌ను చాహర్ ఎల్బీ రూపంలో ఔట్ చేస్తే, నరైన్ భారీ షాట్‌కు యత్నించి పెవిలియన్ బాట పట్టాడు. దీపక్ చాహర్ అద్భుతమైన క్యాచ్‌తో నరైన్ ఇన్నింగ్స్ ముగిసింది. ఇక సెకండ్ డౌన్ వచ్చిన నితీశ్ రాణా డకౌట్ అయ్యాడు. చాహర్ వేసిన మూడో ఓవర్లో రాణా ఔటయ్యాడు. అటు తర్వాత రాబిన్ ఊతప్ప(11), దినేశ్ కార్తీక్(19)లు కూడా విఫలం కావడంతో కేకేఆర్ మరింత ఇబ్బందుల్లో పడింది. అయితే రసెల్ కడవరకూ క్రీజ్‌లో ఉండి జట్టు స్కోరును వంద పరుగులు దాటించాడు. సీఎస్కే బౌలర్లలో దీపక్ చాహర్ మూడు వికెట్లు సాధించగా, హర్భజన్ సింగ్, ఇమ్రాన్ తాహీర్‌లు తలో రెండు వికెట్లు తీశారు. -
సమఉజ్జీల పోరు.. గెలుపెవరిదో
చెన్నై: ఐపీఎల్లో నేడు మరో ఆసక్తికర పోరు. చెరో 8 పాయింట్లతో పట్టికలో మొదటి రెండు స్థానాల్లో ఉన్న కోల్‌కతా నైట్ రైడర్స్(కేకేఆర్), చెన్నై సూపర్ కింగ్స్(సీఎస్కే) జట్లు చెన్నై వేదికగా తలపడనున్నాయి. రెండు జట్లూ ఆడిన ఐదు మ్యాచ్‌ల్లో నాలుగేసి విజయాలు నమోదు చేశాయి. బలాబలాల్లో ఇరు జట్లూ సమంగానే కనిపిస్తున్నప్పటికీ ఒంటిచేత్తే కేకేఆర్‌కు విజయాలు సాధించిపెడుతున్న ఆల్‌రౌండర్, హార్డ్ హిట్టర్ రసెల్‌పైనే అందరి దృష్టి నెలకొని ఉంది. పై చేయి ఏ స్పిన్ త్రయందో.. ప్రస్తుత ఐపీఎల్లో నాణ్యమైన స్పిన్ విభాగం కేకేఆర్, సీఎస్కే సొంతం. కోల్‌కతా తరఫున కుల్దీప్ యాదవ్, సునీల్ నరైన్, పీయూష్ చావ్లా ప్రత్యర్థి ఆటగాళ్లకు ముకుతాడు వేస్తుండగా, చెన్నై తరఫున ఆ బాధ్యతను వెటరన్ హర్భజన్, ఇమ్రాన్ తాహిర్, రవీంద్ర జడేజా సమర్థంగా నెరవేరుస్తున్నారు. మ్యాచ్ జరగనున్న చెపాక్ స్టేడియం స్పిన్నర్లకు స్వర్గధామం. ఈ క్రమంలో రెండు జట్లూ తమ స్పిన్ త్రయాలతో బరిలోకి దిగే అవకాశం ఉంది. అదే జరిగితే ఏ జట్టు స్పిన్ త్రయానిది పై చేయి కానుందో చూడాలి. కాగా, మిస్టర్ కూల్ మహేంద్ర సింగ్ ధోని నేతృత్వంలోని చెన్నై జట్టు వరుసగా మూడు మ్యాచ్‌ల్లో గెలిచి ఆ తర్వాత ముంబై చేతిలో ఓడినప్పటికీ శనివారం కింగ్స్ లెవెన్ పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో మళ్లీ విజయాల బాట పట్టింది. మరోవైపు గంభీర్ దూరమైనప్పటికీ కొత్త కెప్టెన్ దినేశ్ కార్తీక్ సారథ్యంలోని కేకేఆర్ ఆల్‌రౌండ్ ప్రదర్శనతో ప్రత్యర్థి జట్లకు ముచ్చెమటలు పట్టిస్తోంది. ముఖ్యంగా ఆ జట్టు ఆల్‌రౌండర్ ఆండ్రూ రస్సెల్ అటు బంతితోనూ ఇటు బ్యాట్‌తోనూ చెలరేగిపోతున్నాడు. విధ్వంసక ఆటతో ఇప్పటికే జట్టును మూడు మ్యాచ్‌ల్లో ఒంటి చేత్తో గెలిపించాడు. దీంతో నేడు జరగబోయే మ్యాచ్‌లో రస్సెల్‌పైనే అందరి దృష్టీ నెలకొంది. అతన్ని అడ్డుకోవడానికి ధోని ఏ వ్యూహాలు రచిస్తాడో వేచి చూడాల్సిందే. ఇక చెన్నై జట్టుకు మరో విండీస్ ఆల్‌రౌండర్ బ్రేవో దూరమైనప్పటికీ అతని స్థానంలో జట్టులోకి వచ్చిన డుప్లెసిస్ తొలి మ్యాచ్‌లోనే అర్ధసెంచరీతో జట్టు విజయంలో కీలక పాత్ర వహించాడు. ధోని సైతం ఫామ్‌లోనే ఉండడంతో కోల్‌కతాకు ఈ మ్యాచ్ అంత సులభం కాకపోవచ్చు. -
రసెల్‌ను రాజస్తాన్ కట్టడి చేసేనా?
జైపూర్: ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) సీజన్లో భాగంగా స్థానిక సవాయ్ మాన్సింగ్ మైదానంలో రాజస్తాన్ రాయల్స్‌తో కోల్‌కతా నైట్‌రైడర్స్ తలపడుతోంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన కేకేఆర్ సారథి దినేశ్ కార్తీక్ తొలుత బౌలింగ్‌కే మొగ్గుచూపాడు. గాయం నుంచి ఇంకా పూర్తిగా కోలుకోకపోవడంతో సంజూ శాంసన్ ఈ మ్యాచ్‌కు కూడా దూరమయ్యాడు. ఇక గత మ్యాచ్‌లో అంతగా ఆకట్టుకోని స్టువార్టు బిన్ని, వరుణ్ ఆరోన్లను తప్పించిన రాజస్తాన్ రాయల్స్.. ప్రశాంత్ చోప్రా, మిధున్లను తుది జట్టులోకి తీసుకుంది. ఇక కేకేఆర్ కూడా ఒక మార్పుతో బరిలోకి దిగుతోంది. ఫెర్గుసన్‌ను పక్కకు పెట్టి మరో పేసర్ హరే గుర్నేకు అవాకశం కల్పించింది. అయితే ఈ మ్యాచ్‌కు వర్షం అంతరాయం కలిగించే అవకాశం ఉంది. ఇక ఇప్పటివరకు ఆడిన నాలుగింటిలో మూడు మ్యాచ్‌ల్లో గెలిచి పాయింట్ల పట్టికలో కేకేఆర్ మూడో స్థానంలో ఉంది. రాజస్తాన్ రాయల్స్ ఇప్పటివరకు ఆడిన మ్యాచ్‌ల్లో ఒక్క మ్యాచే గెలిచి చివరి నుంచి రెండో స్థానంలో ఉంది. సొంత మైదానంలో పర్యాటకు జట్టుకు ఎలాంటి అవకాశం ఇవ్వకుండా గెలవాలని రహానే సేన ఆరాటపడుతోంది. కాగా ఈ మ్యాచ్‌లో గెలిచి పాయింట్ల పట్టికలో ఆగ్రస్థానానికి వెళ్లాలని కేకేఆర్ భావిస్తోంది. రెండు జట్లు బలబలాల విషయంలో సమానంగా ఉన్నా.. సమష్టి కృషితో కేకేఆర్ వరుస విజయాలు సాధిస్తోంది. కేకేఆర్ విజయాల్లో కీలకపాత్ర పోషిస్తున్న రసెల్‌ను కట్టడి చేస్తే విజయం సాధించవచ్చని రాజస్తాన్ భావిస్తోంది. తుది జట్లు: రాజస్తాన్: అజింక్యా రహానే(కెప్టెన్), బట్లర్, స్టీవ్ స్మిత్, రాహుల్ త్రిపాఠి, బెన్ స్టోక్స్, ప్రశాంత్ చోప్రా, క్రిష్ణప్ప గౌతమ్, జోఫ్రా ఆర్చర్, శ్రేయాస్ గోపాల్, ధావల్ కులకర్ణి, మిదున్ కేకేఆర్: దినేశ్ కార్తీక్(కెప్టెన్), క్రిస్ లిన్, సునీల్ నరైన్, రాబిన్ ఊతప్ప, నితీష్ రాణా, శుభ్‌మన్ గిల్, ఆండ్రీ రసెల్, పియూష్ చావ్లా, కుల్దీప్ యాదవ్, ప్రసీద్ కృష్ణ, హరే గుర్నే -
నాకు ఏ మైదానమైనా చిన్నదే!
బెంగళూరు: విధ్వంసకర బ్యాటింగ్‌తో ఈ ఐపీఎల్లో చెలరేగిపోతున్న ఆండ్రీ రసెల్‌కు తన ఆటపై అమిత విశ్వాసముంది. ఎలాంటి పరిస్థితుల్లోనైనా భారీ షాట్లు ఆడగలననే నమ్మకమే తనను నడిపిస్తోందని అతను వ్యాఖ్యానించాడు. శుక్రవారం బెంగళూరుతో మ్యాచ్‌లో 13 బంతుల్లో అజేయంగా 48 పరుగులు చేసి కోల్‌కతాను గెలిపించిన అనంతరం రసెల్ తన ఆటతీరు గురించి మాట్లాడాడు. తాను చెలరేగిపోయే సమయం వస్తే ప్రపంచంలో ఏ గ్రౌండ్ కూడా సరిపోదని అతను చెప్పడం విశేషం. ‘ఆస్ట్రేలియాలోని పెద్ద స్టేడియాల్లోనే నేను భారీ సిక్సర్లు కొట్టగలిగాను. అప్పుడు నాపై నాకే ఆశ్చర్యమేసింది. నా ఆటకు ప్రపంచంలో ఏ మైదానమైనా చిన్నదేనని నాకర్థమైంది. నా కండబలంపై నాకు నమ్మకమెక్కువ. అదే నా శక్తి కూడా. బ్యాట్ కూడా అమిత వేగంతో దూసుకుపోతుంది. ఇవన్నీ నాలో ఆత్మవిశ్వాసం పెంచి అలాంటి ఇన్నింగ్స్‌లు ఆడేలా చేస్తాయి. ఒక్క ఓవర్లో మ్యాచ్ మారిపోవడం టి20 క్రికెట్ స్వభావం. అందుకే నేను ముందే ఓటమిని అంగీ కరించను. ఎన్ని పరుగులు చేయాల్సి ఉన్నా చివరి వరకు పోరాడాలని భావిస్తా. అదే మాకు విజయా లు అందించింది’ అని రసెల్ విశ్లేషించాడు. -
రసెల్‌కు ఆ బంతి వేసుంటే..!
బెంగళూరు : ‘హమ్మయ్యా.. ఈ మ్యాచ్ అయితే గెలిచేట్టున్నాం..’ అని రాయల్‌చాలెంజర్స్ బ్యాటింగ్ చూసిన తరువాత ఆ జట్టు ప్రతి అభిమాని మనసులో మెదిలిన మాట. వరుసగా నాలుగు మ్యాచ్‌ల్లో తమ అభిమాన జట్టు దారుణ ఓటమి మూటగట్టుకోవడంతో వారి అసహనం తీవ్రస్థాయికి చేరింది. ఒక్క మ్యాచ్ అన్న గెలవండి అంటూ కోహ్లిసేనను వారంతా సోషల్ మీడియా వేదికగా అర్ధించారు.. తిట్టారు.. ప్రాధేయపడ్డారు. అభిమానులను అలరించాడానికి ఎలాగైన కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరిగే మ్యాచ్ గెలవాలని ఆర్సీబీ ఆటగాళ్లు సైతం సిద్దమయ్యారు. కానీ ఏం లాభం.. అదృష్టం తలుపు తడితే దురుదృష్టం వెనక తలుపు తట్టినట్లు... కెప్టెన్ విరాట్ కోహ్లి, మిస్టర్ 360 డివిలియర్స్ రూపంలో భారీ లక్ష్యం నమోదైతే.. ఆండ్రీ రసెల్ భీకర ఇన్నింగ్స్ రూపంలో ఆ కొండంత లక్ష్యం కొట్టుకుపోయింది. రసెల్ క్రీజులోకి వచ్చినప్పుడు కోల్‌కతా విజయానికి 26 బంతుల్లో 67 పరుగులు అవసరం. ఈ పరిస్థితుల్లో ఒక్క ఓవర్ సరిగ్గా పడ్డా ఆర్సీబీదే విజయమని మ్యాచ్చూస్తున్న ప్రతి ప్రేక్షకుడు అనుకున్నాడు. కానీ రసెల్ విధ్వంసం సృష్టించాడు. 13 బంతుల్లోనే 7 సిక్సర్లు, ఒక ఫోర్‌తో చెలరేగి 48 పరుగులు చేసి ఐదు బంతులు మిగిలి ఉండగానే విజయాన్నందించాడు. అయితే రసెల్ భీకరంగా ఆడుతుంటే ఒక్కరు కూడా యార్కర్లు సంధించకపోవడం మ్యాచ్ చూస్తున్న అభిమానులకు ఆగ్రహం తెప్పించింది. అవే షార్ట్ పిచ్, స్లో బంతులు వేస్తుంటే రసెల్ దంచికొట్టాడు. ఒక్కరైనా ఒక ఓవర్లో కనీసం మూడు బంతులను యార్కర్లు సంధించినా మ్యాచ్ ఫలితం వేరేలా ఉండేదని అభిప్రాయపడుతున్నారు. రసెల్ యార్కర్లను ఆడటంలో తడబడుతాడని, అతను ఆ బంతులను భారీ షాట్స్‌గా మల్చలేడని పేర్కొంటున్నారు. రసెల్ గత మ్యాచ్‌లను చూస్తే ఇది నిజమే అనిపిస్తోంది. ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో సూపర్ ఓవర్ బరిలో దిగిన రసెల్‌ను రబడ యార్కర్లతోనే ఇబ్బందిపెట్టి ఔట్ చేశాడు. కింగ్స్ఎలెవన్ పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో కూడా ఆ జట్టు బౌలర్ మహ్మద్ షమీ అద్భుత యార్కర్‌తో రసెల్‌ను క్లీన్‌బౌల్డ్ చేశాడు. దురదృష్టవశాత్తు.. అది కాస్త అశ్విన్ కెప్టెన్సీ లోపంతో నోబాల్ కావడంతో రసెల్ బతికిపోయాడు. అనంతరం సునామీలా బౌలర్లపై విరుచుకుపడ్డాడు. -
ఒక్క బంతికి 13 పరుగులు
బెంగళూరు: ఇదేలా సాధ్యం అనుకుంటున్నారా? ఐపీఎల్లో ఇది సాధ్యమైంది. వెస్టిండీస్ ఆల్‌రౌండర్ ఆండ్రి రసెల్ ఈ ఫీట్ సాధించాడు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో రసెల్ రప్ఫాడించాడు. సిక్సర్లతో సునామీ ఇన్నింగ్స్ ఆడి కోల్‌కతా నైట్ రైడర్స్‌కు ఒంటి చేత్తో విజయాన్ని అందించాడు. 13 బంతుల్లోనే ఏకంగా 48 పరుగులు బాదేసి 5 బంతులు మిగిలుండగానే కోల్‌కతాను గెలిపించాడు. రసెల్ బ్యాట్ ఝళిపించడానికి ముందు కోల్‌కతా 16 బంతుల్లో 53 పరుగులు చేయాల్సి ఉంది. మహ్మద్ సిరాజ్ వేసిన 17వ ఓవర్ మూడో బంతిని సిక్సర్ కొట్టి రసెల్ పరుగుల వేట మొదలుపెట్టాడు. అది బీమర్ కావడంతో అంపైర్ సిరాజ్‌ను తప్పించి అతడి స్థానంలో వచ్చిన స్టాయినిస్‌కు బౌలింగ్ ఇచ్చాడు. సిరాజ్ బీమర్ వేయడంతో స్టాయినిస్ బౌలింగ్‌లో రసెల్‌కు ఫ్రీహిట్ ఛాన్స్ వచ్చింది. దీన్ని కూడా రసెల్ సిక్సర్ బాదాడు. దీంతో ఒక్క బంతికే 13 పరుగులు వచ్చినట్లయింది. స్ట్రైక్ రేట్ సూపర్ ఇప్పటి వరకు ఈ లీగ్‌లో ఆడిన నాలుగు మ్యాచ్‌లలో ఆండ్రి రసెల్ 77 బంతులు ఎదుర్కొని 268.83 స్ట్రైక్ రేట్‌తో 207 పరుగులు చేశాడు. ఇందులో 12 ఫోర్లు, 22 సిక్సర్లు ఉన్నాయి. (చదవండి: బెంగళూరు చిన్నబోయింది) -
కోల్‌కతా నైట్‌రైడర్స్ జయభేరి
-
పాపం.. ఆర్సీబీకి మరో ఓటమి
బెంగళూరు: కోల్‌కతా నైట్‌రైడర్స్‌కు భారీ లక్ష్యాన్ని నిర్దేశించి కూడా రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఘోర ఓటమి చవిచూసింది. ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) సీజన్ 12లో భాగంగా కేకేఆర్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆర్సీబీ అనూహ్యంగా ఓటమి చవిచూసింది. ఈ సీజన్లో ఆర్సీబీకి ఇది ఐదో ఓటమి. దీంతో ఈ మ్యాచ్ చూసిన ప్రతీ ఒక్కరు ఆర్సీబీని జాలిగా చూశారు. 206 పరుగుల భారీ లక్ష్యాన్ని కూడా ఆర్సీబీ కాపాడుకోలేకపోయింది. మరో ఐదు బంతులు మిగిలుండగానే కేవలం ఐదు వికెట్లు కోల్పోయి కేకేఆర్ లక్ష్యాన్ని చేదించింది. పసలేని బౌలింగ్‌కు తోడుగా చెత్త ఫీల్డింగ్ ఆర్సీబీ కొంపముంచింది. సిరాజ్ ఒక్కడే రెండు సులువైన క్యాచ్‌లు నేలపాలు చేయడం గమనార్హం. ఛేదనలో క్రిస్ లిన్(43), రాణా(37), ఊతప్ప(33)లు రాణించారు. అయితే ఫలితం ఇరు జట్లకు అనుకూలంగా ఉన్న పరిస్థితుల్లో క్రీజులోకి వచ్చిన విధ్వంసకర ఆటగాడు ఆండ్రీ రసెల్ మ్యాచ్ స్వరూపాన్నే మార్చేశాడు. ఆర్సీబీ చేతుల్లోంచి మ్యాచ్‌ను లాగేసుకున్నాడు. రసెల్ సిక్సర్ల వర్షం ఆర్సీబీ ఓడిపోవడానికి కేకేఆర్ గెలవడానికి ఒకేఒక కారణం రసెల్. నితీష్ రాణా అవుటైన అనంతరం క్రీజులోకి వచ్చిన ఈ విధ్వసంకర ఆటగాడు ఉప్పెనలా రెచ్చిపోయాడు. ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. రసెల్ ధాటికి 18,19 ఓవర్లలో 23,29 పరుగులు వచ్చాయి. ఓవరాల్‌గా రసెల్ కేవలం 13 బంతుల్లో 1 ఫోరు, 7 సిక్సర్ల సహాయంతో 48 పరుగులు చేసి విజయాన్ని ఖాయం చేశాడు. ఆర్సీబీ బౌలర్లలో నేగి, సైనీలు తలో రెండు వికెట్లు పడగొట్టగా, చహల్ ఒక్క వికెట్ దక్కించుకున్నాడు. ఆర్సీబీ భారీ స్కోర్ అంతకముందు టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేపట్టిన ఆర్సీబీకి ఓపెనర్లు శుభారంభాన్ని అందించారు. ఓపెనర్ పార్థీవ్ పటేల్(25) అవుటైన అనంతరం క్రీజులోకి వచ్చిన డివిలియర్స్‌కు జతగా కోహ్లి కలిశాడు. ఇద్దరూ ఆచితూచి ఆడుతూ వీలు చిక్కినప్పుడల్లా బౌండరీలు బాదుతూ స్కోర్ బోర్డు పరుగులు పెట్టించారు. ఈ క్రమంలో విరాట్ కోహ్లి(84), డివిలియర్స్(63)లు అర్దసెంచరీలు పూర్తి చేసుకున్నారు. ఇక చివర్లో స్టొయినిస్(23) మెరుపులు మెరిపించడంతో 20 ఓవరల్లో మూడు వికెట్ల నష్టానికి 205 పరుగులు చేసింది. కేకేఆర్ బౌలర్లలో నరైన్, రాణా, కుల్దీప్లు తలో వికెట్ సాధించారు. -
మళ్లీ రసెల్ మోత..
ఢిల్లీ: ఐపీఎల్లో కోల్‌కతా నైట్‌రైడర్స్ ఆల్ రౌండర్ ఆండ్రీ రసెల్ మళ్లీ మోత మోగించాడు. ఢిల్లీ క్యాపిటల్స్‌తో మ్యాచ్‌లో రసెల్ చెలరేగి ఆడాడు. 28 బంతుల్లో 4 ఫోర్లు, 6 సిక్సర్లతో 62 పరుగులు సాధించాడు. ఏడో స్థానంలో బ్యాటింగ్‌కు దిగిన వచ్చీ రావడంతోనే బ్యాట్ ఝుళిపించాడు. కేకేఆర్ 61 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన తరుణంలో రసెల్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. బౌలర్ ఎవరన్నది చూడకుండా బౌండరీలే లక్ష్యంగా ఆడాడు. అతనికి జతగా దినేశ్ కార్తీక్ 36 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్సర్లతో 50 పరుగులు సాధించి జట్టు స్కోరును గాడిలో పెట్టాడు. ఈ జోడి 95 పరుగుల ఆరో వికెట్ భాగస్వామ్యాన్ని సాధించడంతో కేకేఆర్ నిర్ణీత ఓవర్లలో ఎనిమిది వికెట్లకు 185 పరుగులు చేసింది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఢిల్లీ ఫీల్డింగ్ తీసుకుంది. దాంతో కేకేఆర్ ముందుగా బ్యాటింగ్ దిగింది. కేకేఆర్ బ్యాటింగ్‌ను నిఖిల్ నాయక్, క్రిస్ లిన్లు ఆరంభించారు. అయితే నిఖిల్ నాయక్(7) తొలి వికెట్‌గా పెవిలియన్ చేరగా, ఆపై కాసేపటికి రాబిన్ ఊతప్ప(11) కూడా పెవిలియన్ చేరాడు. ఆ తర్వాత వరుస విరామాల్లో కేకేఆర్ వికెట్లు కోల్పోతూ వచ్చింది. దినేశ్ కార్తీక్ సమయోచితంగా బ్యాటింగ్ చేయగా, మిగతా టాపార్డర్ ఆటగాళ్లు వరుస పెట్టి క్యూకట్టారు. అయితే రసెల్ వచ్చిన తర్వాత ఆట స్వరూపం మారిపోయింది. ఆకాశమే హద్దుగా చెలరేగిపోయిన రసెల్ స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు. ఓ దశలో రసెల్ ధాటికి బెంబెలేత్తిపోయిన ఢిల్లీ బౌలర్లు.. చివరకు అతని వికెట్ తీసిన తర్వాత ఊపిరి పీల్చుకున్నారు. క్రిస్ మోరిస్ వేసిన 18 ఓవర్ ఐదో బంతికి భారీ షాట్‌కు యత్నించిన రసెల్ ఔటయ్యాడు. అటు తర్వాత కార్తీక్ హాఫ్ సెంచరీ సాధించిన వెంటనే ఔటయ్యాడు. ఢిల్లీ బౌలర్లలో హర్షల్ పటేల్ రెండు వికెట్లు తీయగా, అమిత్ మిశ్రా, రబడా, లామ్‌చెన్, క్రిస్ మోరిస్, అమిత్ మిశ్రాలు తలో వికెట్ తీశారు. -
సొంతగడ్డపై కోల్‌కతా రెండో విజయం
-
పంజాబ్‌తో మ్యాచ్: కేకేఆర్ ఘన విజయం
కోల్‌కతా: ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)-2019లో కోల్‌కతా నైట్‌రైడర్స్ రెండో విజయాన్ని నమోదు చేసింది. బుధవారం ఈడెన్ గార్డెన్ వేదికగా కింగ్స్ పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో 28 పరుగుల తేడాతో కేకేఆర్ జయభేరి మోగించింది. మొదట పంజాబ్ బౌలర్లను కేకేఆర్ బ్యాట్స్‌మెన్ ఉతికారేయగా.. అనంతరం పంజాబ్ బ్యాట్స్‌మెన్‌ను కేకేఆర్ బౌలర్లు కట్టడి చేశారు. కార్తీక్ సేన నిర్దేశించిన 219 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన పంజాబ్.. నిర్ణీత 20ఓవర్లలో 175 పరుగులకే పరిమితమై ఘోర ఓటమి చవిచూసింది. మయాంక్ అగర్వాల్(58), డేవిడ్ మిల్లర్(59 నాటౌట్) అర్ధసెంచరీలతో రాణించినప్పటికి జట్టును విజయతీరాలకు చేర్చలేకపోయారు. భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన పంజాబ్‌కు ఆదిలోనే షాక్ తగిలింది. కేఎల్ రాహుల్(1) మరోసారి తీవ్రంగా నిరాశపరిచాడు. అనంతరం క్రిస్‌గేల్ (20) కూడా ఎక్కువసేపు క్రీజులో నిలువలేదు. ఓ వైపు వికెట్లు పడుతున్నా మయాంక్ ఎంతో పట్టుదలను ప్రదర్శించాడు. సర్ఫరాజ్(13) కూడా వెంటనే ఔట్ అవ్వడంతో పంజాబ్ మరింత కష్టాల్లో పడింది. ఈ తరుణంలో డేవిడ్ మిల్లర్‌తో జతకట్టిన మయాంక్ ఎంతో ఓర్పుగా ఆడారు. వీలు చిక్కినప్పుడల్లా బౌండరీలు బాదారు. కానీ భారీ లక్ష్యం కావడంతో రన్‌రేట్ చాలా పెరిగింది. మయాంక్ అవుటయిన తర్వాత క్రీజులోకి వచ్చిన మన్దీప్ సింగ్ ఎడాపెడా బౌండరీలు బాదినా జట్టును విజయాన్ని అందించలేకపోయాడు. కేకేఆర్ బౌలర్లలో రసెల్ రెండు వికెట్లు పడగొట్టగా, ఫెర్గుసన్, చావ్లా తలో వికెట్ తీశారు. అంతకముందు టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేపట్టిన కేకేఆర్‌కు శుభారంభం లభించలేదు. క్రిస్ లిన్(10) ఎక్కువ సేపు క్రీజులో నిలవలేదు. మరో ఓపెనర్ సునీల్ నరైన్(24) ఉన్నంతసేపు మెరుపులు మెరిపించినా.. భారీ స్కోర్ చేయలేకపోయాడు. దీంతో 36 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయింది. ఈ సమయంలో రాబిన్ ఊతప్ప(61), నితీష్ రాణాలు ఆచితూచి ఆడారు. క్రీజులో నిలదొక్కుకున్న అనంతరం గేర్ మార్చి దాటిగా ఆడటం ప్రారంభించారు. ముఖ్యంగా రాణా అశ్విన్ బౌలింగ్‌ను టార్గెట్ చేస్తూ బౌండరీలు బాదాడు. ఈ క్రమంలో ఈ సీజన్లో రెండో అర్దసెంచరీ సాధించాడు. అనంతరం భారీ షాట్‌కు యత్నించి రాణా(63) ఔటవుతాడు. భారీ మూల్యం చెల్లించుకున్నారు రసెల్ మూడు పరుగుల వ్యక్తి గత స్కోర్ వద్ద షమీ బౌలింగ్‌లో బౌల్డ్ అయ్యాడు. అయితే ఆ బంతి నోబాల్ కావడంతో.. పంజాబ్ భారీ మూల్యం చెల్లించుకుంది. ఆతర్వాత ఆకాశమే హద్దుగా చెలరేగడంతో పంజాబ్ బౌలర్లు నేలచూపులు చూశారు. బౌలర్ ఎవరు.. ఏబంతి వేశాడనేది చూడకుండా బంతిని బౌండరీ దాటించడమే లక్ష్యంగా రసెల్ ఆడాడు. దీంతో కేకేఆర్ స్కోర్ బోర్డు పరుగులు పెట్టింది. చివరి ఓవర్లో భారీ షాట్‌కు యత్నించి రసెల్(48) క్యాచ్ ఔటయ్యాడు. లేకుంటే తన ఖాతాలో హాఫ్ సెంచరీ.. స్కోర్ బోర్డుపై మరో పది పరుగులు ఉండేవి. దీంతో కేకేఆర్ ఆటగాళ్ల వీరవిహారంతో నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 218 పరుగులు చేసింది. -
కేకేఆర్ పరుగుల సునామీ..
కోల్‌కతా: విధ్వంసకర బ్యాటింగ్ అంటే ఏంటో కింగ్స్ పంజాబ్‌కు కోల్‌కతా నైట్ రైడర్స్ బ్యాట్స్‌మెన్ చూపించారు. బౌండరీల ఖాతాను నరైన్ మొదలెట్టగా.. ఊతప్ప ముగించాడు. మధ్యలో నితీష్ రాణా, ఆండ్రీ రసెల్ పరుగుల సునామీ సృష్టించడంతో కేకేఆర్ భారీ స్కోర్ నమోదు చేసింది. కేకేఆర్ బ్యాట్స్‌మెన్ దాటికి బంతులెక్కడ వేయాలో పంజాబ్ బౌలర్లకు పాలుపోలేదు. ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)లో భాగంగా పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో కేకేఆర్ 219 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది. రాబిన్ ఊతప్ప(67 నాటౌట్; 50 బంతుల్లో 6ఫోర్లు, 2 సిక్సర్లు), నితీష్ రాణా(63; 34 బంతుల్లో 2 ఫోర్లు, 7 సిక్సర్లు)లు అర్దసెంచరీలతో రాణించగా.. చివర్లో రసెల్(48; 17 బంతుల్లో 3 ఫోర్లు, 5 సిక్సర్లు) ఉప్పెనలా విజృంభించాడు. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేపట్టిన కేకేఆర్‌కు శుభారంభం లభించలేదు. క్రిస్ లిన్(10) ఎక్కువ సేపు క్రీజులో నిలవలేదు. మరో ఓపెనర్ సునీల్ నరైన్(24) ఉన్నంతసేపు మెరుపులు మెరిపించినా.. భారీ స్కోర్ చేయలేకపోయాడు. దీంతో 36 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయింది. ఈ సమయంలో రాబిన్ ఊతప్ప, నితీష్ రాణాలు ఆచితూచి ఆడారు. క్రీజులో నిలదొక్కుకున్న అనంతరం గేర్ మార్చి దాటిగా ఆడటం ప్రారంభించారు. ముఖ్యంగా రాణా అశ్విన్ బౌలింగ్‌ను టార్గెట్ చేస్తూ బౌండరీలు బాదాడు. ఈ క్రమంలో ఈ సీజన్లో రెండో అర్దసెంచరీ సాధించాడు. అనంతరం భారీ షాట్‌కు యత్నించి రాణా ఔటవుతాడు. భారీ మూల్యం చెల్లించుకున్నారు రసెల్ మూడు పరుగుల వ్యక్తి గత స్కోర్ వద్ద షమీ బౌలింగ్‌లో బౌల్డ్ అయ్యాడు. అయితే ఆ బంతి నోబాల్ కావడంతో.. పంజాబ్ భారీ మూల్యం చెల్లించుకుంది. ఆతర్వాత ఆకాశమే హద్దుగా చెలరేగడంతో పంజాబ్ బౌలర్లు నేలచూపులు చూశారు. బౌలర్ ఎవరు.. ఏబంతి వేశాడనేది చూడకుండా బంతిని బౌండరీ దాటించడమే లక్ష్యంగా రసెల్ ఆడాడు. దీంతో కేకేఆర్ స్కోర్ బోర్డు పరుగులు పెట్టింది. చివరి ఓవర్లో భారీ షాట్‌కు యత్నించి క్యాచ్ ఔటయ్యాడు. లేకుంటే తన ఖాతాలో హాఫ్ సెంచరీ.. స్కోర్ బోర్డుపై మరో పది పరుగులు ఉండేవి. దీంతో కేకేఆర్ ఆటగాళ్ల వీరవిహారంతో నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 218 పరుగులు చేసింది. -
రసెల్ దెబ్బకు సన్ డౌన్
విజయానికి చివరి 3 ఓవర్లలో 53 పరుగులు చేయాలి. ఐపీఎల్లో గతంలో ఏ జట్టుకూ సాధ్యం కాని ఘనత ఇది. కానీ ఆండ్రీ రసెల్ పవర్ హిట్టింగ్తో కోల్‌కతా నైట్‌రైడర్స్ అలాంటి లక్ష్యాన్ని అందుకుంది. సిద్ధార్థ్ కౌల్ వేసిన 18వ ఓవర్లో 2 సిక్సర్లు, ఫోర్ బాదిన రసెల్... భువనేశ్వర్ వేసిన 19వ ఓవర్లో మరో 2 ఫోర్లు, 2 సిక్సర్లు కొట్టడంతో రెండు ఓవర్లలో కలిపి 40 పరుగులు వచ్చేశాయి. షకీబ్ వేసిన ఆఖరి ఓవర్లో విజయానికి 13 పరుగులు అవసరం కాగా... ఈ సారి నేనున్నానంటూ శుబ్‌మన్ గిల్ 2 సిక్సర్లతో చెలరేగి 2 బంతుల ముందే ఆట ముగించాడు. తొలి మ్యాచ్‌లో అనూహ్య పరాజయం సన్‌రైజర్స్ హైదరాబాద్‌ను పలకరించగా ...సొంతగడ్డపై కేకేఆర్ సంబరాల్లో మునిగిపోయింది. కోల్‌కతా: ఐపీఎల్ తొలి రోజు ఆటతో తీవ్ర నిరాశకు గురైన అభిమానులకు రెండో రోజు అసలైన వినోదం లభించింది. కోల్‌కతా, హైదరాబాద్ జట్లు పోటీ పడి పరుగుల వరద పారించాయి. చివరకు ఆండ్రీ రసెల్ మెరుపులు లీగ్‌లో జోష్ తెచ్చాయి. ఆదివారం ఇక్కడ జరిగిన మ్యాచ్‌లో నైట్‌రైడర్స్ 6 వికెట్ల తేడాతో సన్‌రైజర్స్‌పై ఘన విజయం సాధించింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన హైదరాబాద్ 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 181 పరుగులు చేసింది. డేవిడ్ వార్నర్ (53 బంతుల్లో 85; 9 ఫోర్లు, 3 సిక్సర్లు) ఐపీఎల్లో 37వ అర్ధసెంచరీతో ఘనంగా పునరాగమనం చేయగా, విజయ్ శంకర్ (24 బంతుల్లో 40 నాటౌట్; 2 ఫోర్లు, 2 సిక్సర్లు), జానీ బెయిర్‌స్టో (35 బంతుల్లో 39; 3 ఫోర్లు, 1 సిక్స్) రాణించారు. అనంతరం కోల్‌కతా 19.4 ఓవర్లలో 4 వికెట్లకు 183 పరుగులు చేసింది. నితీశ్ రాణా (47 బంతుల్లో 68; 8 ఫోర్లు, 3 సిక్సర్లు), ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ ఆండ్రీ రసెల్ (19 బంతుల్లో 49 నాటౌట్; 4 ఫోర్లు, 4 సిక్సర్లు) చెలరేగగా, ఉతప్ప (27 బంతుల్లో 35; 3 ఫోర్లు, 1 సిక్స్) కీలక ఇన్నింగ్స్ ఆడాడు. వార్నర్ జోరు... బాల్ ట్యాంపరింగ్‌తో గత ఏడాది లీగ్‌కు దూరమైన వార్నర్ మళ్లీ తన సత్తాను ప్రదర్శించాడు. చావ్లా వేసిన ఇన్నింగ్స్ రెండో ఓవర్లో రెండు ఫోర్లు కొట్టి అతను తన రాకను తెలియజేశాడు. అదే ఓవర్ ఐదో బంతికి కోల్‌కతా ఎల్బీ కోసం అప్పీల్ చేయగా అంపైర్ తిరస్కరించాడు. అయితే రీప్లేలో నాటౌట్ అని స్పష్టంగా తేలడంతో కోల్‌కతా రివ్యూ కోల్పోయింది. ఆ తర్వాత నరైన్ తొలి ఓవర్లో వరుసగా రెండు ఫోర్లు కొట్టిన వార్నర్... రసెల్ మొదటి ఓవర్లో వరుస బంతుల్లో 4, 6 బాదాడు. ఈ సిక్సర్‌తో 31 బంతుల్లోనే వార్నర్ అర్ధ సెంచరీ పూర్తయింది. అనంతరం 68 పరుగుల వద్ద వార్నర్ ఇచ్చిన క్యాచ్‌ను కీపర్ కార్తీక్ వదిలేశాడు. సెంచరీ ఖాయమనుకున్న దశలో ఎట్టకేలకు వార్నర్ ఆటను రసెల్ ముగించాడు. అతని ఓవర్లో భారీ సిక్సర్ కొట్టిన తర్వాత మరో బలమైన షాట్‌కు ప్రయత్నించగా కవర్స్‌లో ఉతప్ప అద్భుత క్యాచ్ పట్టడంతో వార్నర్ ఇన్నింగ్స్ ముగిసింది. బెయిర్‌స్టో మొదటి మ్యాచ్... ఇంగ్లండ్ తరఫున గత కొంత కాలంగా అద్భుత ఫామ్‌లో ఉన్న జానీ బెయిర్‌స్టోకు తొలిసారి ఐపీఎల్లో ఆడే అవకాశం దక్కింది. తొమ్మిదేళ్లలో వేర్వేరు జట్ల తరఫున 99 టి20లు ఆడిన అతనికి ఆదివారం మ్యాచ్ 100వ టి20 కావడం విశేషం. చావ్లా బౌలింగ్‌లో చక్కటి సిక్సర్‌తో తొలి బౌండరీ రాబట్టిన అతను ఆ తర్వాత మరో మూడు ఫోర్లు కొట్టాడు. వార్నర్, బెయిర్‌స్టో కలిసి 77 బంతుల్లో 118 పరుగులు జోడించారు. మరోవైపు భారత జట్టులో వరుస అవకాశాలు లభించిన తర్వాత ఆత్మవిశ్వాసం పెరిగిన విజయ్ శంకర్ ఐపీఎల్లో కూడా దానిని చూపించాడు. నరైన్, ప్రసిద్ధ్ కృష్ణ బౌలింగ్‌లలో అతను ఒక్కో సిక్సర్ బాదాడు. 27 పరుగుల వద్ద అంపైర్ ఎల్బీగా ప్రకటించినా... రివ్యూలో బతికిపోయిన అతను అదనంగా మరో 13 పరుగులు జోడించగలిగాడు. కీలక భాగస్వామ్యం... భారీ లక్ష్య ఛేదనలో కోల్‌కతా ఆరంభంలోనే క్రిస్ లిన్ (7) వికెట్ కోల్పోయింది. అయితే నితీశ్ రాణా, ఉతప్ప భాగస్వామ్యం ఆ జట్టును రేసులో నిలిపింది. సందీప్ శర్మ ఓవర్లో 2 ఫోర్లు, సిక్సర్ కొట్టి రాణా దూకుడు ప్రదర్శించగా, ఉతప్ప కూడా కొన్ని చక్కటి షాట్లు ఆడాడు. వీరిద్దరు రెండో వికెట్‌కు 58 బంతుల్లో 80 పరుగులు జోడించారు. కెప్టెన్ దినేశ్ కార్తీక్ (2) విఫలం కాగా, 35 బంతుల్లో రాణా అర్ధ సెంచరీ చేశాడు. లైట్స్ ఆఫ్! ఈడెన్ గార్డెన్స్‌లో ఒక ఫ్లడ్ లైట్ టవర్ పని చేయకపోవడంతో 16వ ఓవర్లో ఆట ఆగిపోయింది. దాదాపు 13 నిమిషాల తర్వాత మళ్లీ మ్యాచ్ మొదలైంది. భువనేశ్వర్ రెండోసారి... సన్‌రైజర్స్ కెప్టెన్ విలియమ్సన్ గాయం నుంచి కోలుకోకపోవడంతో తొలి మ్యాచ్‌కు దూరమయ్యాడు. పేసర్ భువనేశ్వర్ కుమార్ అతని స్థానంలో నాయకత్వ బాధ్యతలు చేపట్టాడు. తన కెరీర్లో భువీ కెప్టెన్‌గా వ్యవహరించడం ఇది రెండోసారి మాత్రమే. 2016–17 రంజీ ట్రోఫీలో ముంబైతో జరిగిన మ్యాచ్‌లో అతను యూపీకి కెప్టెన్‌గా పని చేశాడు. -
రఫ్పాడించిన రసెల్
కోల్‌కతా: ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)-12వ సీజన్లో భాగంగా సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్ అద్భుతమైన విజయాన్ని సాధించింది. సన్‌రైజర్స్ విసిరిన 182 పరుగుల లక్ష్యాన్ని ఇంకా రెండు బంతులు మిగిలి ఉండగానే ఛేదించి తమ సొంత గ్రౌండ్లో తమకు తిరుగులేదని మరోసారి నిరూపించింది. మరొకవైపు ఐపీఎల్లో తాము ఆడుతున్న తొలి మ్యాచ్‌లో విజయాల్ని సాధించే రికార్డును మరింత మెరుగుపరుచుకుంది. 2013 నుంచి కేకేఆర్ తన తొలి మ్యాచ్‌లో ఇప్పటివరకూ ఓటమి చూడలేదు. తాజా మ్యాచ్‌లో ఆండ్రీ రసెల్ విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడి సన్‌రైజర్స్ ఆశలకు గండికొట్టాడు. 19 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్సర్లతో అజేయంగా 49 పరుగులు సాధించి కేకేఆర్ విజయంలో ముఖ్య భూమిక పోషించాడు. సన్‌రైజర్స్ నిర్దేశించిన లక్ష్య ఛేదనలో కేకేఆర్ ఆదిలోనే క్రిస్ లిన్(7) వికెట్‌ను కోల్పోయింది. ఆ తరుణంలో నితీష్ రాణా-రాబిన్ ఊతప్పల జోడి స్కోరు బోర్డును ముందుకు తీసుకెళ్లింది. వీరిద్దరూ రెండో వికెట్‌కు 80 పరుగులు సాధించి కేకేఆర్‌ను గాడిలో పెట్టారు. ఈ క్రమంలోనే రాణా(68; 47 బంతుల్లో 8 ఫోర్లు, 3 సిక్సర్లు) హాఫ్ సెంచరీ సాధించాడు. ఆ తర్వాత దినేశ్ కార్తీక్(2) విఫలమైనప్పటికీ రసెల్ రెచ్చిపోయి ఆడాడు. బౌండరీలే లక్ష్యంగా చెలరేగి ఆడటంతో మ్యాచ్ ఒక్కసారిగా కేకేఆర్ చేతుల్లోకి వచ్చేసింది. అతనికి జతగా శుభ్‌మన్ గిల్(18 నాటౌట్; 10 బంతుల్లో 2 ఫోర్లు) సమయోచితంగా ఆడటంతో కేకేఆర్ ఆరు వికెట్ల తేడాతో విజయం సాధించింది. అంతకుముందు సన్‌రైజర్స్ నిర్ణీత ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి 181 పరుగులు చేసింది. డేవిడ్ వార్నర్, బెయిర్ స్టోలు ఆరంభించారు. వీరిద్దరూ తొలి వికెట్‌కు 118 పరుగుల భాగస్వామ్యాన్ని సాధించిన తర్వాత బెయిర్ స్టో(39; 35 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్స్) పెవిలియన్ చేరాడు. అనంతరం వార్నర్‌కు జత కలిసిన విజయ్ శంకర్ స్కోరు బోర్డును చక్కదిద్దాడు. డేవిడ్ వార్నర్ రీ ఎంట్రీలో అదరగొట్టి సన్‌రైజర్స్ గౌరవప్రదమైన స్కోరు చేయడంలో సహకరించాడు. 53 బంతుల్లో 9 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 85 పరుగులు చేసి తానెంత విలువైన ఆటగాడినో మరోసారి చాటిచెప్పాడు. ఆపై విజయ్ శంకర్(40 నాటౌట్; 24 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్సర్లు) ధాటిగా ఆడటంతో సన్‌రైజర్స్ పోరాడే స్కోరును ఉంచకల్గింది. అయితే కేకేఆర్ ఆటగాళ్ల విజృంభణతో సన్‌రైజర్స్ నిర్దేశించిన లక్ష్యం చిన్నబోయింది. -
అయోమయంలో విండీస్!
కోల్‌కతా: టీమిండియాతో ఇక్కడ ఈడెన్ గార్డెన్ స్టేడియంలో ఆదివారం జరుగునున్న తొలి టీ20 మ్యాచ్‌లో వెస్టిండీస్ స్టార్ ఆటగాడు ఆండ్రీ రస్సెల్ ఆడటం అనుమానంగా మారింది. గాయం కారణంగా వన్డేలకు ఎంపిక కాని రస్సెల్.. ఇప్పుడు మొదటి టీ20 మ్యాచ్‌లో ఆడటంపై సందిగ్ధత నెలకొంది. టీ 20ల కోసం ఆలస్యంగా భారత్‌కు వచ్చిన రస్సెల్ ప్రాక్టీస్ సెషన్‌కు హాజరుకాలేదు. దాంతో ఆరంభపు టీ20 మ్యాచ్‌కు దూరం కానున్నట్లు సమాచారం. టీ20ల కోసం రెండు రోజుల క్రితం కెప్టెన్ బ్రాత్‌వైట్‌తో సహా ఏడుగురు వెస్టిండీస్ క్రికెటర్లు భారత్‌కి వచ్చారు. అయితే వారితో కలిసి విమానంలో రాని రస్సెల్ దుబాయ్ మీదుగా.. ఈరోజు భారత్‌కు వచ్చినట్లు తెలుస్తోంది. దీంతో ఈడెన్ గార్డెన్స్‌లో జరిగిన వెస్టిండీస్ ప్రాక్టీస్ సెషన్లో అతను పాల్గొనలేకపోయాడు. ఐపీఎల్లో కోల్‌కతా నైట్‌రైడర్స్ తరపున మ్యాచ్‌లు ఆడిన రస్సెల్‌కు ఈడెన్ గార్డెన్స్ మైదానం కొట్టినపిండి. దాంతో తొలి టీ20లో అతను జట్టుకి అదనపు బలం అవుతాడని విండీస్ ఆశించింది. కానీ తాజాగా రస్సెల్ తీరుతో ఆ జట్టు ఇప్పుడు అయోమయంలో పడింది. గాయం నుంచి కోలుకున్న అతడ్ని కనీస ప్రాక్టీస్ లేకుండా ఆడించాలా? వద్దా? అని జట్టు మేనేజ్మెంట్ సమాలోచన చేస్తోంది. -
కరేబీయన్ లీగ్‌లో కింగ్ ఖాన్ చిందులు!
పోర్ట్ ఆఫ్ స్పెయిన్ : కరేబీయన్ ప్రీమియర్ లీగ్‌లో బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ సందడి చేశారు. శుక్రవారం జమైకా తలవాస్‌తో జరగిన మ్యాచ్‌కు షారుఖ్ హాజరై తన జట్టు ట్రిన్‌బాగో నైట్ రైడర్స్(టీకేఆర్)కు మద్దతు తెలిపాడు. ఇక మ్యాచ్‌కు ముందు చీర్ గర్ల్స్‌తో కలిసి మైదానంలో చిందేశాడు. దీనికి సంబంధించిన వీడియోను సీపీఎల్ తమ అధికారిక ట్విటర్ షేర్ చేసింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో హల్చల్ చేస్తోంది. ఇక షారుఖ్ ఉత్సాహాన్ని జమైకా తలవాస్ సారథి ఆండ్రూ రస్సెల్ ఆవిరి చేశాడు. భారీ లక్ష్యం నిర్దేశించిన తమ జట్టు గెలుస్తుందని భావించిన షారుఖ్‌కు నిరాశే ఎదురైంది. రస్సెల్ ఆల్‌రౌండ్ షోతో షారుఖ్ టీమ్ 4 వికెట్ల తేడాతో ఓడింది. ఇక ఐపీఎల్లో రస్సెల్ షారుఖ్ జట్టు కోల్‌కతా నైటరైడర్స్ అన్న విషయం తెలిసిందే. ❤❤😘😘😘😍 #cpl18 #biggestpartyinsport @iamsrk pic.twitter.com/eA7VPFbKuq — CPL T20 (@CPL) August 11, 2018 టీకేఆర్ ప్రమోషనల్ సాంగ్.. ఇక తమ జట్టు ప్రచార సాంగ్‌ను బ్రావో తన ట్విటర్ వేదికగా విడుదల చేశారు. టీకేఆర్ ప్రమోషన్ సాంగ్‌ను విడుదల చేస్తున్నానని, ఫ్రాంచైజీ యజమాని షారుఖ్ ఖాన్‌కు ధన్యవాదాలంటూ బ్రావో ట్విట్ చేశాడు. ఇక ఈ ప్రమోషన్ సాంగ్ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. (చదవండి: ఆండ్రూ రస్సెల్ అద్భుత రికార్డు!) -
సీపీఎల్‌లో షారుఖ్ సందడి
-
ఆండ్రూ రస్సెల్ అద్భుత రికార్డు!
పోర్ట్ ఆఫ్ స్పెయిన్ : వెస్టిండీస్ ఆల్‌రౌండర్ ఆండ్రూ రస్సెల్ అద్భుత రికార్డు నమోదు చేశాడు. కరేబీయన్ ప్రీమియర్ లీగ్(సీపీఎల్)లో అటు బ్యాటింగ్, ఇటు బౌలింగ్‌లో రెచ్చిపోయాడు. శుక్రవారం ట్రిన్‌బాగో నైట్ రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో జమైకా తలవాస్ కెప్టెన్ అయిన రస్సెల్ ఆల్‌రౌండ్ ప్రదర్శనతో తమ జట్టును ఒంటి చేత్తో గెలిపించాడు. తొలుత హ్యాట్రిక్‌తో రెచ్చిపోయిన జమైకన్ స్టార్ అనంతరం బ్యాటింగ్‌లో సెంచరీతో చెలరేగాడు. దీంతో ఒకే మ్యాచ్‌లో హ్యాట్రిక్‌తో పాటు సెంచరీ సాధించిన రెండో టీ20 ప్లేయర్‌గా రస్సెల్ గుర్తింపు పొందాడు. అంతకు ముందు ఇంగ్లండ్ ఆటగాడు జోయ్ డెన్లీ మాత్రమే ఈ ఘనతను అందుకున్నాడు. డ్వాన్బ్రేవో జట్టైన ట్రిన్‌బాగో నైట్ రైడర్స్ తొలుత బ్యాటింగ్ చేయగా.. రస్సెల్ ఇన్నింగ్స్ చివరి ఓవర్ తొలి మూడు బంతుల్లో మెకల్లమ్(56), బ్రావో(29), రామ్‌దిన్(0)లను పెవిలియన్‌కు చేర్చి హ్యాట్రిక్ సాధించాడు. దీంతో బ్రేవో జట్టు 224 పరుగుల లక్ష్యాన్ని నిర్ధేశించింది. రస్సెల్ వీరవిహారం.. 224 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన జమైకా తలవాస్.. ఆ బాధ్యతలను సారథిగా రస్సెల్ స్వీకరించాడు. ఒక వైపు త్వరగా వికెట్లు కోల్పోయినా 7 స్థానంలో బ్యాటింగ్‌కు దిగి లూయిస్(51) సహకారంతో ఆకాశమే హద్దుగా చెలరేగాడు. కేవలం 49 బంతుల్లో 6 ఫోర్లు 13 సిక్సర్లతో 121 పరుగులు సాధించి నాటౌట్‌గా నిలిచాడు. దీంతో జమైకా తలవాస్ 3 బంతులు మిగిలి ఉండగానే విజయాన్నందుకుంది. ఇక సీపీఎల్‌లో రస్సెల్‌దే వేగవంతమైన సెంచరీ కావడం విశేషం. ఇక ఐపీఎల్లో రస్సెల్ కోల్‌కతా నైట్ రైడర్స్‌కు ప్రాతినిథ్యం వహించిన విషయం తెలిసిందే. -
మూడేళ్ల తర్వాత వన్డే జట్టులోకి..
ఆంటిగ్వా: వెస్టిండీస్ స్టార్ ఆల్ రౌండర్ ఆండ్రీ రస్సెల్ మూడేళ్ల తర్వాత వన్డే జట్టులో పునరాగమనం చేయబోతున్నాడు. ఈ మేరకు బంగ్లాదేశ్ జరుగనున్న వన్డే సిరీస్‌కు ప్రకటించిన 13 మంది సభ్యుల జట్టులో రస్సెల్ చోటు దక్కించుకున్నాడు. 2015లో శ్రీలంకతో చివరిసారి విండీస్ జట్టులో కనిపించిన రస్సెల్.. డోపింగ్ నిబంధనల్ని అతిక్రమించాడు. దాంతో యాంటీ డోపింగ్ ఏజెన్సీ క్రమశిక్షణా ఉల్లంఘన చర్యలు తీసుకోవడంతో విండీస్ జట్టుకు రస్సెల్ దూరం కావాల్సి వచ్చింది. తాజాగా అతనికి మరొకసారి జట్టులో చోటు కల్పిస్తూ విండీస్ బోర్డు నిర్ణయం తీసుకుంది. ‘వచ్చే ఏడాది వరల్డ్ కప్ జరుగనున్న నేపథ్యంలో రస్సెల్‌కు చోటు కల్సిస్తూ సెలక్టర్లు తీసుకున్న నిర్ణయం అభినందనీయం. అతనొక అసాధారణ ఆటగాడు. రస్సెల్ ఎంతటి ప్రమాదకర ఆటగాడో ప్రపంచానికి తెలుసు. రస్సెల్ వంటి ఆల్ రౌండర్ జట్టులోకి రావడంతో మా బలం రెట్టింపు అయ్యింది’ అని రస్సెల్ పునరాగమనంపై విండీస్ ప్రధాన కోచ్ స్టువర్ట్ లా ఆనందం వ్యక్తం చేశాడు. 2018 ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)లో రస్సెల్ ఆకట్టుకున్న సంగతి తెలిసిందే. ఐపీఎల్లో 316 పరుగులు చేయడంతో పాటు 13 వికెట్లను ఖాతాలో వేసుకున్నాడు. -
రస్సెల్ మెరుపులు.. రాజస్తాన్ లక్ష్యం 170
కోల్‌కతా : ఐపీఎల్-11 సీజన్లో భాగంగా రాజస్తాన్ రాయల్స్‌తో జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్ 170 పరుగుల లక్ష్యాన్ని నిర్ధేశించింది. టాపార్డర్ విఫలమైనా..దినేశ్ కార్తీక్ కెప్టెన్ ఇన్నింగ్స్‌కు తోడు రస్సెల్, శుబ్మన్గిల్లు రాణించడంతో గౌరవప్రదమైన స్కోర్ చేయగలిగింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ దిగిన కోల్‌కతాకు ఆదిలోని గట్టి ఎదురుదెబ్బ తగిలింది. తొలి బంతినే బౌండరీకి తరలించిన ఓపెనర్ సునీల్ నరైన్ మరుసటి బంతికే స్టంపౌట్‌గా పెవిలియన్ చేరాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన రాబిన్ ఉతప్ప(3), నితీష్ రాణాలు(3) తీవ్రంగా నిరాశ పరిచారు. ఈ క్రమంలో క్రీజులోకి వచ్చిన కెప్టెన్ దినేశ్ కార్తీక్ మరో ఓపెనర్ క్రిస్‌లిన్‌తో బాధ్యతాయుతంగా ఆడాడు. దీంతో పవర్ ప్లే ముగిసే సమయానికి కోల్‌కతా మూడు వికెట్లు కోల్పోయి 46 పరుగులు చేసింది. క్రీజులో కుదురుకుంటుండనుకున్న లిన్(18)ను శ్రేయస్ గోపాల్ పెవిలియన్‌కు చేర్చాడు. దీంతో కోల్‌కతా 51 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. కార్తీక్ కెప్టెన్ ఇన్నింగ్స్.. క్రీజులోకి వచ్చిన యువ ఆటగాడు శుభ్‌మన్ గిల్‌తో కెప్టెన్ దినేశ్ కార్తీక్ ఆచితూచి ఆడాడు. వీలు చిక్కినప్పుడల్లా బౌండరీలు బాదుతు వికెట్‌ను కాపాడారు. అయితే జట్టు స్కోర్ 106 పరుగుల వద్ద శుభ్‌మన్ గిల్ 28(17 బంతుల్లో 3 ఫోర్లు, 1సిక్స్)ను జోఫ్రా ఆర్చర్ ఔట్ చేశాడు దీంతో ఐదో వికెట్‌కు నమోదైన 55 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. అనంతరం క్రీజులోకి వచ్చి రస్సెల్‌తో కార్తీక్ వేగంగా ఆడాడు. ఈ క్రమంలో కార్తీక్ 35 బంతుల్లో 4 ఫోర్లు 2 సిక్స్‌లతో హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. అనంతరం భారీ షాట్‌కు ప్రయత్నించిన కార్తీక్ 52(38 బంతుల్లో 4 ఫోర్లు 2 సిక్స్‌లు) క్యాచ్ ఔట్‌గా వెనుదిరిగాడు. చివర్లో రస్సెల్ మెరుపులు ఓ దశలో సాధారణ లక్ష్యాన్ని అయినా నిర్ధేశిస్తుందా అనుకున్న కోల్‌కతా .. రస్సెల్ 5 సిక్సులతో చెలరేగడంతో 170 పరుగుల లక్ష్యాన్ని నిర్ధేశించింది. 25 బంతుల్లో 5 సిక్స్‌లు, 3 ఫోర్లతో రస్సెల్ 49 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. దీంతో కోల్‌కతా నిర్ణీత 20 ఓవర్లకు 7 వికెట్లు నష్టపోయి 169 పరుగులు చేసింది. రాజస్తాన్ బౌలర్లలో గౌతమ్, ఆర్చర్, లాఫ్లిన్‌లు రెండేసి వికెట్లు తీయగా.. గోపాల్ ఓ వికెట్ పడగొట్టాడు. -
ఐపీఎల్: బర్త్ డే రోజే గోల్డెన్ డక్!
బెంగళూరు: చిన్నస్వామి స్టేడియం వేదికగా రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్ బ్యాట్స్‌మన్, బర్త్‌డే బాయ్ ఆండ్రూ రస్సెల్ గోల్డెన్ డక్ అయి తీవ్రంగా నిరాశపరిచాడు. ఏప్రిల్ 29న(ఆదివారం) ఈ విండీస్ క్రికెటర్ 30వ ఏట అడుగుపెట్టిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన బెంగళూరు విరాట్ కోహ్లి(68 నాటౌట్) రాణించడంతో 20 ఓవర్లలో 4 వికెట్లకు 175 పరుగులు చేసింది. అనంతరం ఓపెనర్ క్రిస్‌లిన్(62 నాటౌట్) విజృంభించడంతో లక్ష్యాన్ని కోల్‌కతా 19.1 ఓవర్లలో 4 వికెట్లు మాత్రమే కోల్పోయి చేధించి విజయాన్ని సొంతం చేసుకుంది. కోల్‌కతా ఇన్నింగ్స్ 17వ ఓవర్లో బెంగళూరు బౌలర్ మహ్మద్ సిరాజ్ వేసిన రెండో బంతికి నితీశ్ రాణా ఫోర్ బాదాడు. అనంతరం వెన్ను నొప్పి కారణంగా అతడు మైదానాన్ని వీడాడు. ఈ దశలో వెస్టిండీస్ ఆల్‌రౌండర్ ఆండ్రూ రస్సెల్ క్రీజులోకి వచ్చాడు. అతను క్రీజులోకి వస్తుండుగా అభిమానులంతా హ్యాపీ బర్త్‌డే రస్సెల్ అని స్వాగతం పలికారు. కానీ మూడో బంతిని ఎదుర్కొన్న రస్సెల్ తొలి బంతిని భారీ షాట్ ఆడటంతో బంతి కీపర్‌కు సమీపంలో చాలా ఎత్తులో లేచింది. ఈ సులువైన క్యాచ్‌ను డికాక్ అందుకోవడంతో పరుగులేమీ చేయకుండా తొలి బంతికే గోల్డెన్ డక్‌గా పెవిలియన్ చేరాడు. అయితే బ్యాట్‌తో నిరాశ పరిచిన రస్సెల్ బంతితో మూడు వికెట్లు సాధించి బెంగళూరును కట్టడి చేశాడు. ఇక రస్సెల్.. ఆర్సీబీ బ్యాట్స్‌మన్ మనన్ వోహ్రాను గోల్డెన్ డక్ చేయడం విశేషం. -
రస్సెల్ బర్త్‌డే రోజు గోల్డెన్ డక్
-
క్రికెట్ కండల వీరులు
-
స్టేడియం బయటకి కొట్టేశాడు..
చెపాక్: ఐపీఎల్లో భాగంగా మంగళవారం ఇక్కడ చెన్నై సూపర్ కింగ్స్‌తో మ్యాచ్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్ ఆటగాడు ఆండ్రీ రసెల్ విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడాడు. ఆకాశమే హద్దుగా చెలరేగిపోయిన రసెల్ 36 బంతుల్లో 11 సిక్సర్లు, 1 ఫోర్‌తో 88 పరుగులు సాధించి చివరి వరకూ అజేయంగా నిలిచాడు. అయితే రసెల్ కొట్టిన 10 సిక్సర్లు ఒక ఎత్తయితే, బ్రేవో వేసిన ఓవర్లో కొట్టిన ఒక సిక్స్ మాత్రం మ్యాచ్‌కే హైలైట్‌గా నిలిచింది. 17 ఓవర్ రెండో బంతికి రసెల్ భారీ సిక్సర్ కొట్టాడు. అది స్టేడియాన్ని దాటుకుని బయటపడింది. ఈ సీజన్లో ఇదే లాంగెస్ట్ సిక్స్‌గా నిలవడం మరొక విశేషం. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన కేకేఆర్ 89 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఆ తరుణంలో బ్యాటింగ్‌కు వచ్చిన రసెల్ తన బ్యాటింగ్‌లో పవర్ చూపించాడు. ప్రధానంగా మ్యాచ్ చివర్లో రసెల్ మరింత ప్రమాదకరంగా మారిపోయాడు. వరుసగా సిక్సర్ల కొడుతూ స్టేడియాన్ని హోరెత్తించాడు. కేకేఆర్ కీలక వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడ్డ తరుణంలో రసెల్ చెలరేగి ఆడాడు. 26 బంతుల్లో 1 ఫోర్, 6 సిక్సర్లతో హాఫ్ సెంచరీ సాధించిన రసెల్.. ఆపై మరింత దూకుడుగా ఆడాడు. ఏడో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన రసెల్.. వచ్చీ రావడంతోనే బ్యాట్‌కు పనిచెప్పాడు. ప్రధానంగా బంతిని బౌండరీ దాటించి చెన్నై బౌలర్లకు చుక్కలు చూపించాడు. -
ఉమేశ్.. రస్సెల్ తలను టార్గెట్ చేయ్.!
కోల్‌కతా : ఈడెన్ గార్డేన్స్ వేదికగా ఆదివారం కోల్‌కతానైట్ రైడర్స్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(ఆర్సీబీ) కెప్టెన్ విరాట్ కోహ్లి చేసిన సైగలకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట్లో హల్చల్ చేస్తోంది. కోల్‌కతా విజయానికి 30 పరుగుల దూరంలో ఉండగా ఆర్సీబీ పేసర్ ఉమేశ్ యాదవ్ 17 ఓవర్ వేయడానికి బంతి అందుకున్నాడు. తొలి బంతిని కోల్‌కతా ఆలౌరౌండర్ ఆండ్రూ రస్సెల్ బౌండరీ తరలించగా.. రెండో బంతిని డాట్ చేశాడు. అయితే పరుగుల కట్టడి చేసే ప్రయత్నంలో ఉమేశ్ యాదవ్ మూడో బంతిని వైడ్ వేశాడు. దీనికి కోహ్లి రస్సెల్ టార్గెట్ చేయ్ అంటూ ఉమేశ్‌కు సైగ చేశాడు. అలానే ఉమేశ్ బంతిని తలకు వేయడంతో రస్సెల్ బంతిని బ్యాట్ తగిలించే ప్రయత్నంలో ఇబ్బందిపడ్డాడు. కొంచెంలో హిట్ వికెట్ అయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. దీనికి కోహ్లి నవ్వుతూ.. సంతోషం వ్యక్తం చేశాడు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఇక ఈ మ్యాచ్‌లో కోల్‌కతా 4 వికెట్ల తేడాతో విజయం సాధించిన విషయం తెలిసిందే. -
ఉమేశ్.. రస్సెల్ తలను గురిపెట్టు..!
-
బాలీవుడ్‌లోకి మరో క్రికెటర్!
ముంబై: డ్వేన్ బ్రావో బాటలోనే మరో వెస్టిండీస్ క్రికెటర్ ఆండ్రీ రస్సెల్ ఎంటర్టైన్మెంట్ రంగంలోకి అడుగుపెడుతున్నాడు. ఈ ఏడాది ఓ ఇంటర్నేషనల్ మ్యాజిక్ వీడియోను విడుదల చేయడానికి ప్లాన్ చేసుకున్న రస్సెల్.. బాలీవుడ్‌పై తనకున్న ఆసక్తిని తాజాగా బయటపెట్టాడు. 'కళల రంగంలో రాణించడానికి ప్రయత్నిస్తున్నాను. ఈ ఏడాది లాంచ్ చేసే మొదటి ఇంటర్నేషనల్ మ్యూజిక్ వీడియోను ఎక్కువగా ఇండియాను దృష్టిలో ఉంచుకునే చేస్తున్నాం. ఆ తరువాత కుదిరితే బాలీవుడ్లో నటిస్తానేమో' అని శనివారం ఓ ప్రకటనలో రస్సెల్ తెలిపాడు. జస్టిన్ బీబర్ గ్రామీ అవార్డ్ విన్నింగ్ ఆల్బమ్ 'సారీ' కి ప్రొడక్షన్ హౌస్‌గా ఉన్న సంస్థనే రస్సెల్ మ్యూజిక్ ఆల్బమ్‌ను ప్రొడ్యూస్ చేస్తోంది. కాగా.. డ్వేన్ బ్రావో ఇప్పటికే.. 'ఛాంపియన్', 'ట్రిప్ అబీ బాకీ హై' లాంటి మ్యూజిక్ వీడియోలను విడుదల చేసిన విషయం తెలిసిందే. -
విండీస్ క్రికెటర్ రసెల్‌పై ఏడాది నిషేధం
డోపింగ్ నిబంధనలను అతిక్రమించినందుకు వెస్టిండీస్ ఆల్‌రౌండర్ ఆండ్రీ రసెల్‌పై ఏడాది పాటు నిషేధం విధించారు. స్వతంత్ర డోపింగ్ నిరోధక ట్రిబ్యునల్ మంగళవారం ఈ తీర్పు వెలువరించింది. నిషేధం వెంటనే అమల్లోకి వస్తుంది. 2015లో మూడు వేర్వేరు తేదీల్లో తాను ఎక్కడ ఉన్నాడో తెలపాలంటూ ప్రపంచ డోపింగ్ నిరోధక సంస్థ (వాడా) ఆదేశించగా, ఆ వివరాలను ఇవ్వడంలో రసెల్ విఫలమయ్యాడు. నిబంధనల ప్రకారం స్పందించకపోవడాన్ని డ్రగ్ పరీక్షలో విఫలమైనట్లుగానే భావిస్తారు. విండీస్ తరఫున రసెల్ 51 వన్డేలు, 43 టి20 మ్యాచ్‌లు ఆడాడు. -
దేవుడే దారి చూపాడు..
చిన్నప్పుడు తల్లి ఎంత వారించినా గ్రౌండ్ వైపు పరుగులు తీశాడు. తండ్రి అభీష్టానికి వ్యతిరేకంగా క్రికెట్ బ్యాట్ పట్టాడు. మైదానాన్నే సర్వస్వంగా భావించాడు. తనవైన టెక్నిక్స్ తో ఆటలో రాణించాడు. డొమెస్టిక్ స్థాయి నుంచి ఇంటర్నేషనల్ స్టార్ గా ఎదిగాడు. సమకాలీన క్రికెట్ చరిత్రలో అరివీరభయంకరుడు అనదగ్గ ఆల్ రౌండర్లలో ఒకరైన జమైకన్ పుత్రుడు ఆండ్రీ రస్సెల్.. తన జీవితంలో చోటుచేసుకున్న అన్ని మలుపులకూ దేవుడే కారణం అంటాడు. తన వివాహవేడుకలోనూ ఇదే చెప్పాడు. వెస్టిండీస్ ఆల్ రౌండర్ ఆండ్రీ రస్సెల్ తన గర్ల్ ఫ్రెండ్ జాసిమ్ లోరాను శుక్రవారం పెళ్లిచేసుకున్నాడు. డోమినికన్ రిపబ్లిక్ కు చెందిన జాసిమ్ మోడల్ గా కొనసాగుతోంది. చాలా ఏళ్ల కిందటే వీరిమధ్య పరిచయం ఏర్పడింది. అదికాస్తా ప్రేమగా మారి 2014లో నిశ్చితార్థానికి దారితీసింది. ఇప్పుడు పెళ్లితో శుభంకార్డు పడినట్లైంది. 'ఏ విషయంలోనైనా దేవుణ్ని ముందుంచుకోవాలి.. ఆయనే దారి చూపిస్తాడు'అని ఇన్ స్టాగ్రామ్ లో పెళ్లిఫొటోతోపాటు కామెంట్ పెట్టాడు రస్సెల్. కెరీర్ పరంగా తీవ్ర ఒడిదుడుకులు ఎదుర్కొంటున్న ఈ విండీస్ క్రికెటర్ కు ఆటలో ఎదురైన విఘ్నాలను కూడా దేవుడే తొలిగించాలని కోరుకుందాం! ఐపీఎల్ లో కోల్ కతా నైట్ రైడర్స్ కు ప్రాతినిథ్యం వహిస్తోన్న రస్సెల్ కు ఆ జట్టు యాజమాన్యం వివాహ శుభాకాంక్షలు తెలిపింది. (ప్రమాదంలో రస్సెల్ కెరీర్?) -
ప్రమాదంలో రస్సెల్ కెరీర్?
సెయింట్ కిట్స్: వెస్టిండీస్ స్టార్ ఆటగాడు, ఆల్ రౌండర్ ఆండ్రీ రస్సెల్ కెరీర్ ప్రమాదంలో పడింది. డోపింగ్ టెస్టులకు ఆండ్రీ రస్సెల్ పలుమార్లు గైర్హాజరీ కావడంతో అతనిపై రెండేళ్ల పాటు నిషేధం పడే అవకాశాలు కనబడుతున్నాయి. ఏడాదిలో మూడుసార్లు స్థానిక డోపింగ్ పరీక్షలకు హాజరు కావాల్సిన ఉన్నా రస్సెల్ మాత్రం ఆ నిబంధనల్ని ఉల్లఘించాడు. వరల్డ్ యాంటీ డోపింగ్ ఏజెన్సీ(డబ్యూఏడీఏ) నియామవళి ప్రకారం ప్రతీ అథ్లెట్ ఏడాదిలో మూడు సార్లు స్థానిక యాంటీ డోపింగ్ కమిషన్ ముందు హాజరు కాకుండా ఉంటే అతను డోపింగ్ కు పాల్పడినట్లు నిర్ధారిస్తారు. దీనిలో భాగంగా జమైకా యాంటీ డోపింగ్ కమిషన్(జడ్కో) నిర్వహించే పరీక్షలకు రస్సెల్ హాజరుకాలేదు. ఈ విషయాన్ని వరల్డ్ యాంటీ డోపింగ్ ఏజెన్సీ దృష్టికి తీసుకువెళ్లడంతో అతనిపై విచారణకు రంగం సిద్ధం చేసింది. ఈ విచారణలో రస్సెల్ ఉద్దేశ పూర్వకంగానే డోపింగ్ పరీక్షలకు హాజరు కాలేదని తేలితే అతనిపై సుమారు రెండేళ్ల పాటు అంతర్జాతీయ నిషేధం అమలయ్యే అవకాశం ఉంది. దాంతో పాటు పలు దేశాల్లో జరిగే లీగ్ లకు కూడా రస్సెల్ దూరం కాక తప్పదు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో కోల్ కతా నైట్ రైడర్స్ జట్టుకు రస్సెల్ ప్రాతినిథ్యం వహిస్తుండగా, బిగ్ బాష్ లీగ్‌లో సిడ్నీ థండర్ కు, పాకిస్తాన్ సూపర్ లీగ్(పీఎస్ఎల్)లో ఇస్లామాబాద్ యునైటెడ్ జట్టుకు రస్సెల్ ఆడుతున్నాడు. -
శామ్యూల్స్ తీరు సరికాదు:రస్సెల్
ముంబై: ఇటీవల టీ 20 వరల్డ్ కప్ ను వెస్టిండీస్ గెలిచిన అనంతరం ఆ జట్టు ఆటగాడు మార్లోన్ శామ్యూల్స్ మీడియాతో వ్యవహరించిన తీరు ఎంతమాత్రం సరికాదని సహచర ఆటగాడు ఆండ్రీ రస్సెల్ తాజాగా పేర్కొన్నాడు. ఆ మ్యాచ్‌లో మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ గెలిచిన శామ్యూల్స్ మీడియా మైకులు పెట్టే బల్లపై కాళ్లు పెట్టి శృతిమించి వ్యవహరించడాన్ని రస్సెల్ తప్పుబట్టాడు. ఈ విషయంపై ఇప్పటికే తనను చాలా మంది అభిమానులు అడిగినట్లు రస్సెల్ తెలిపాడు. ఇలా వ్యవహరించిన అతను జమైకా ఆటగాడేనా అంటూ తనను కొంతమంది నిలదీశారన్నాడు. అతను జమైకా నుంచి వచ్చిన ఒక భిన్నమైన వ్యక్తిత్వం ఉన్న ఆటగాడని బదులిచ్చినట్లు రస్సెల్ స్పష్టం చేశాడు. ఇందులో తాను చెప్పడానికి ఏమీ లేదంటూ ఓ వైపు అంటూనే, శామ్యూల్స్ వ్యవహరించిన తీరు మాత్రం ఎంతమాత్రం సమంజసం కాదన్నాడు. తాము వరల్డ్ కప్ గెలవడం ఒక మధురమైన జ్ఞాపకంగా రస్సెల్ పేర్కొన్నాడు. కప్ గెలిచిన ఆనందాన్ని ఒక వారం పాటు సెలబ్రేట్ చేసుకున్నామని, అది అంతవరకే పరిమితమన్నాడు. కాకపోతే శామ్యూల్స్ లో ఉత్సాహం అధికమై అలా ప్రవర్తించి ఉంటాడని రస్సెల్ అన్నాడు. -
రస్సెల్‌పై వేటు పడే అవకాశం
జమైకా:ఏడాది కాలంలో డోపింగ్ టెస్టులకు హాజరుకాకపోవడంతో వెస్టిండీస్ ఆల్‌రౌండర్ ఆండ్రీ రస్సెల్‌పై సుదీర్ఘ కాలం వేటు పడే అవకాశం ఉంది. డోపింగ్ వ్యతిరేక నిబంధనల ప్రకారం మ్యాచ్‌లు లేని సమయంలో ఓ ఆటగాడు తాను ఎక్కడుండేదీ స్థానిక డోపింగ్ ఏజెన్సీకి తెలపాల్సి ఉంటుంది. అయితే ఈ నిబంధనను రస్సెల్ అతిక్రమించాడని, ఏడాది కాలంలో మూడు డోపింగ్ టెస్టులకు హాజరుకాలేదని జాడ్కో పేర్కొంది. రూల్ ప్రకారం ఇలా జరిగితే అతడు డోపింగ్ టెస్టులో పాజిటివ్‌గా తేలినట్టు భావించాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో రస్సెల్ దోషిగా తేలితే మాత్రం దాదాపు రెండేళ్లపాటు నిషేధం పడే అవకాశం ఉంది.