Photo Courtesy: Twitter
ముంబై: సీఎస్‌కే-కేకేఆర్‌ల మధ్య బుధవారం జరిగిన మ్యాచ్ ఈ సీజన్ హైవోల్టేజ్ మ్యాచ్‌ల్లో ఒకటి. ఇందులో సీఎస్‌కే నమోదు చేసిన 220 భారీ స్కోరు ఒకటైతే, ఆపై కేకేఆర్ 202 పరుగులకు వచ్చి ఇంకా ఐదు బంతులు ఉండగా ఆలౌట్ కావడం మరొకటి. కాగా, రసెల్(54;22 బంతుల్లో 3 ఫోర్లు, 6 సిక్సర్లు), ఆడుతున్నంతసేపు మ్యాచ్ కేకేఆర్ వైపే ఉందనే అనిపించింది.
కాగా, దినేశ్ కార్తీక్‌తో కలిసి 83 పరుగులు జత చేసిన తర్వాత రసెల్ ఆరో వికెట్‌గా ఔటయ్యాడు. రసెల్‌ను ఔట్ చేయకపోతే మ్యాచ్ చేజారిపోయే స్థితిలో అతను బౌల్ట్ అయ్యాడు. సామ్ కరాన్ వేసిన 12 ఓవర్ రెండో బంతి రసెల్ లెగ్ స్టంప్‌ను పట్టుకుపోవడంతో ఒక్కసారిగా కేకేఆర్ శిబిరంలో ఆందోళన నెలకొంది. రసెల్ ఆరో వికెట్‌గా ఔటైన తర్వాత అతను డగౌట్‌లోని మెట్లపైనే కూర్చుండిపోయాడు. గ్లౌజ్‌లు, ప్యాడ్లు, హెల్మెట్ తీయకుండా అలానే మ్యాచ్ చూస్తూ ఉండిపోయాడు.
అనవసరంగా ఔట్ అయ్యాననే బాధ రసెల్‌లో స్పష్టంగా కనబడింది.. కీలక సమయంలో అయిపోయినందకు రసెల్‌లో పశ్చాత్తాపం కనిపించింది. మ్యాచ్ ముగిసి పోయిన తర్వాత రసెల్ అలా మెట్లపై కూర్చొండిపోవడం సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీనిపై తాజాగా వివరణ ఇచ్చిన రసెల్.. ‘అవును.. ఔటైన తర్వాత ఛేంజింగ్ రూమ్‌కు వెళ్లలేకపోయా. రూమ్‌కి ఎలా వెళ్లాలో తెలియక మెట్లపై కూర్చొండిపోయా.
మా జట్టు సభ్యుల వద్దకు వెళ్లే ధైర్యం చేయలేకపోయా. వారి వద్దకు ఏ ముఖం పెట్టుకుని వెళతాం అనిపించింది. నేను వదిలేసాననుకున్న బంతి వికెట్లను పట్టుకుపోయింది. అది నాకు ఏమీ అర్థం కాలేదు. నేను ఎక్కువగా ఎమోషనల్ అవుతూ ఉంటా. అవే నన్ను మరింత రాటుదేలేలా చేస్తాయి. నా జాబ్ ఇంకా కంప్లీట్ కాలేదు. మా జట్టును గాడిలో పెట్టడమే నా ముందున్న కర్తవ్యం’ అని రసెల్ తన ఫ్రాంచైజీ అయిన కేకేఆర్ డాట్ ఇన్ తెలిపాడు.
Comments
Please login to add a commentAdd a comment