రసెల్‌ ఆల్‌రౌండ్‌ మెరుపులు.. సెమీస్‌ ఆశలు సజీవం | CPL 2021: Andre Russel Sixes Helps Jamaica Tallawahs Hopes Qualification | Sakshi
Sakshi News home page

CPL 2021: వసీమ్‌, రసెల్‌ ఆల్‌రౌండ్‌ మెరుపులు.. సెమీస్‌ ఆశలు సజీవం

Published Fri, Sep 10 2021 12:16 PM | Last Updated on Fri, Sep 10 2021 12:44 PM

CPL 2021: Andre Russel Sixes Helps Jamaica Tallawahs Hopes Qualification - Sakshi

జమైకా: కరీబియన్‌ ప్రీమియర్‌ లీగ్‌( సీపీఎల్‌ 2021)లో భాగంగా గురువారం జమైకా తలైవాస్‌, సెంట్‌ లూసియా మధ్య మ్యాచ్‌ జరిగింది. ఈ మ్యాచ్‌లో జమైకా తలైవాస్‌ ఘన విజయాన్ని అందుకుంది. రసెల్‌ ఆల్‌రౌండ్‌ ప్రదర్శన కనబరచడంతో జమైకా తలైవాస్‌ వరుసగా రెండో విజయాన్ని నమోదు చేసి సెమీస్‌ ఆశలు సజీవంగా ఉంచుకుంది.. ఇక సెంట్‌ లూసియా వరుసగా మూడో పరాజయాన్ని మూటగట్టుకుంది. 

చదవండి: విండీస్‌ టీ20 జట్టు ఇదే.. ఆరేళ్ల తర్వాత ఆ ఆటగాడికి పిలుపు

మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన జమైకా తలైవాస్‌ నిర్ణీత 20 ఓవర్లలో 211 పరుగులకు ఆలౌట్‌ అయింది. ఓపెనర్‌ కెన్నర్‌ లూయిస్‌ 56 పరుగులతో టాప్‌ స్కోరర్‌గా నిలవగా.. చివర్లో పొలార్డ్‌(31,15 బంతులు; 4 సిక్సర్లు), ఇమాద్‌ వసీమ్‌(27, 10 బంతులు; 1 ఫోర్‌, 3 సిక్సర్లు) మెరుపులు మెరిపించారు. సెంట్‌ లూసియా బౌలింగ్‌లో జెవర్‌ రాయల్‌, కదీమ్ అలీన్‌ చెరో మూడు వికెట్లు తీశారు. అనంతరం భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన సెంట్‌ లూసియా 156 పరుగులకే ఆలౌట్‌ అయింది. మార్క్‌ డేయల్‌ 33, ఆండ్రీ ఫ్లెచర్‌ 30 పరుగులు చేశారు.  ఇమాద్‌ వసీమ్‌ 3, రసెల్‌ 2, కార్లోస్‌ బ్రాత్‌వైట్‌ 2 వికెట్లతో రాణించారు. ఈ విజయంతో తలైవాస్‌ 8 మ్యాచ్‌ల్లో 4 విజయాలు.. 4 ఓటములతో పాయింట్ల పట్టికలో 3వ స్థానంలో ఉండగా.. సెంట్‌ లూసియా కూడా 8 మ్యాచ్‌ల్లో 4 విజయాలు.. 4ఓటములతోనే ఉంది. అయితే నెట్‌ రన్‌రేట్‌ విషయంలో మైనస్‌లో ఉండడంతో నాలుగో స్థానంలో ఉంది.

చదవండి: ఇదేం ఫీల్డింగ్‌రా బాబు.. ఒట్టి పుణ్యానికి నాలుగు పరుగులు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement