CPL
-
డుప్లెసిస్ ఊచకోత.. కేవలం 31 బంతుల్లోనే! వీడియో
కరేబియన్ ప్రీమియర్ లీగ్-2024లో సెయింట్ లూసియా కింగ్స్ తమ మూడో విజయాన్ని నమోదు చేసింది. గ్రాస్ ఐలెట్ వేదికగా సెయింట్ కిట్స్ అండ్ నెవిస్ పేట్రియాట్స్ జరిగిన మ్యాచ్‌లో 5 వికెట్ల తేడాతో గెలుపొందింది. తొలుత బ్యాటింగ్ చేసిన సెయింట్ కిట్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 173 పరుగులు చేసింది. సెయింట్ కిట్స్ బ్యాటర్లలో ఆండ్రీ ఫ్లెచర్(62), రూసో హాఫ్ సెంచరీలతో మెరిశారు. సెయింట్ లూసియా బౌలర్లలో ఆల్జారీ జోషఫ్ రెండు వికెట్లు పడగొట్టగా.. ఛేజ్, వీస్, సద్రక్ తలా వికెట్ సాధించారు.డుప్లెసిస్ ఊచకోత..అనంతరం 174 పరుగుల లక్ష్యాన్ని సెయింట్ లూసియా కింగ్స్ 16.3 ఓవర్లలో కేవలం 5 వికెట్లు మాత్రమే కోల్పోయి ఊదిపడేసింది. లక్ష్య చేధనలో ఓపెనర్లు ఫాప్ డుప్లెసిస్, జాన్సెన్ చార్లెస్ విధ్వంసం సృష్టించారు. ప్రత్యర్ధి బౌలర్లను ఊతికారేశారు. చార్లెస్ 42 బంతుల్లో 4ఫోర్లు, 7 సిక్స్‌లతో 74 పరుగులు చేయగా.. డుప్లెసిస్ 31 బంతుల్లో 5 ఫోర్లు, 5 సిక్స్‌లతో 62 పరుగులు చేసి ఔటయ్యాడు. ప్రత్యర్ధి జట్టు బౌలర్లలో హసరంగా,క్లార్క్సన్ తలా రెండు వికెట్లు సాధించారు. కాగా డుప్లెసిస్ ఐపీఎల్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు సారథ్యం వహిస్తున్న సంగతి తెలిసిందే. ఇక పాయింట్ల పట్టిక విషయానికి వస్తే.. గయానా ఆమెజాన్ వారియర్స్ తొలి స్ధానంలో ఉండగా.. సెయింట్ లూసియా మూడో స్ధానంలో కొనసాగుతోంది. చదవండి: అంతా అనుకున్నట్టే జరిగింది.. న్యూజిలాండ్- అఫ్గాన్ టెస్టు రద్దు pic.twitter.com/ex0bSYNHN4— Cricket Cricket (@cricket543210) September 13, 2024 -
కరేబియన్ ప్రీమియర్ లీగ్ ఛాంపియన్స్‌గా గయానా.. ఫైనల్లో పొలార్డ్ టీమ్ చిత్తు
కరేబియన్ ప్రీమియర్ లీగ్-2023 ఛాంపియన్స్‌గా ఇమ్రాన్ తహీర్ సారథ్యంలోని గయానా అమెజాన్ వారియర్స్ నిలిచింది. సోమవారం గయానా వేదికగా జరిగిన ఫైనల్లో ట్రిన్‌బాగో నైట్ రైడర్స్‌ను 9 వికెట్ల తేడాతో చిత్తుచేసిన అమెజాన్ వారియర్స్.. తొలిసారి సీపీఎల్ టైటిల్‌ను ముద్దాడింది. ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ దిగిన ట్రిన్‌బాగో నైట్ రైడర్స్.. గయనా బౌలర్ల ధాటికి 94 పరుగులకే కుప్పకూలింది. గయనా బౌలర్లలో ప్రోటీస్ ఆల్‌రౌండర్ డ్వేన్ ప్రిటోరియస్ 4 వికెట్లతో నైట్ రైడర్స్‌ను దెబ్బతీయగా.. మోతీ, తహీర్ తలా రెండు వికెట్లు సాధించారు. నైట్‌రైడర్స్ బ్యాటర్లలో కార్టీ(38) మినహా మిగితందరూ దారుణంగా విఫలమయయ్యారు. 100 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన గయానా.. కేవలం ఒక్క వికెట్ మాత్రమే కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. గయానా బ్యాటర్లలో ఓపెనర్ అయాబ్(52),హోప్(32) పరుగులతో ఆజేయంగా నిలిచి మ్యాచ్‌ను ఫినిష్ చేశారు. ఇక ప్లేయర్ ఆఫ్‌ది మ్యాచ్‌గా డ్వైన్ ప్రిటోరియస్ నిలవగా.. షాయ్ హోప్‌కు ప్లేయర్ ఆఫ్‌ది సిరీస్ అవార్డు వరించింది. చదవండి: KL Rahul: నేను అస్సలు ఊహించలేదు.. అప్పుడప్పుడు అలా జరుగుతుంటుంది -
వెస్టిండీస్ కెప్టెన్ విధ్వంసకర సెంచరీ.. 9 ఫోర్లు, 8 సిక్స్‌లతో! వీడియో వైరల్
కరేబియన్ ప్రీమియర్ లీగ్-2023లో వెస్టిండీస్ వన్డే కెప్టెన్, గయానా అమెజాన్ వారియర్స్ స్టార్ బ్యాటర్ షాయ్ హోప్ విధ్వంసం సృష్టించాడు. ఈ లీగ్‌లో భాగంగా సోమవారం ఉదయం బార్బడోస్ రాయల్స్, గయానా అమెజాన్ వారియర్స్ తలపడ్డాయి. ఈ మ్యాచ్‌లో గయానా బ్యాటర్ షాయ్ హోప్ మెరుపు సెంచరీతో చెలరేగాడు. కేవలం 41 బంతుల్లోనే తన సెంచరీ మార్క్‌ను హోప్ అందుకున్నాడు. ప్రత్యర్ధి జట్టు బౌలర్లను హోప్ ఊచకోత కోశాడు. ముఖ్యంగా గయానా ఇన్నింగ్స్‌లో 10 ఓవర్ వేసిన రహ్కీమ్ కార్న్‌వాల్ బౌలింగ్‌లో హోప్ ఆకాశమే హద్దుగా చేలరేగిపోయాడు. ఆ ఓవర్లో 4 సిక్స్‌లు, రెండు ఫోర్లతో ఏకంగా 32 పరుగులు రాబట్టాడు. ఓవరాల్‌గా ఈ మ్యాచ్‌లో హోప్ 9ఫోర్లు, 8 సిక్స్‌లతో 106 పరుగులు చేశాడు. హోప్ అద్బుత సెంచరీ ఫలితంగా గయానా నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 226 పరుగులు చేసింది. అనంతరం లక్ష్య ఛేదనలో బార్బడోస్ రాయల్స్ 6 వికెట్లు కోల్పోయి 138 పరుగులకే పరిమితమైంది. దీంతో 88 పరుగుల తేడాతో గయానా అమెజాన్ వారియర్స్ ఘన విజయం సాధించింది. బార్బడోస్ రాయల్స్ బ్యాటర్లలో వికెట్ కీపర్ బ్యాటర్ క్లార్క్(54) పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. గయానా బౌలర్లలో కెప్టెన్ ఇమ్రాన్ తహీర్ మూడు వికెట్లు పడగొట్టగా.. మోటీ రెండు వికెట్లు సాధించాడు. చదవండి: నాకు ఒక మెసేజ్ వచ్చింది.. అందుకే సిరాజ్‌కు మళ్లీ బౌలింగ్ ఇవ్వలేదు: రోహిత్ శర్మ RIDICULOUS SCENES!!! Shai Hope hits Rahkeem Cornwall for 32 in the over to reach his first CPL 💯 🙌 - A clear winner for Republic Bank Play of the Day#CPL23 #GAWvBR#CricketPlayedLouder #BiggestPartyInSport #RepublicBank pic.twitter.com/NCYi5OZerX — CPL T20 (@CPL) September 18, 2023 -
విండీస్ బహుబలి విధ్వంసకర సెంచరీ.. 12 సిక్స్‌లతో ఊచకోత! వీడియో వైరల్
కరేబియన్ ప్రీమియర్ లీగ్‌లో బార్బడోస్ రాయల్స్ ఆల్ రౌండర్, విండీస్ బహుబలి రఖీమ్ కార్న్‌వాల్ విధ్వంసం సృష్టించాడు. ఈ లీగ్‌లో భాగంగా సెయింట్ కిట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో మెరుపు శతకంతో కార్న్‌వాల్ చెలరేగాడు. కేవలం 45 బంతుల్లోనే సెంచరీ సాధించి ప్రత్యర్థి బౌలర్లను ఊచకోత కోశాడు. సీపీఎల్ చరిత్రలో అత్యంత వేగంగా సెంచరీ చేసిన మూడో ఆటగాడిగా కార్న్‌వాల్ రికార్డులకెక్కాడు. ఓవరాల్‌గా 48 బంతులు ఎదుర్కొన్న కార్న్‌వాల్ 12 సిక్స్‌లు, 4 ఫోర్లతో 102 పరుగులు చేసి రిటైర్డ్ హర్ట్‌గా వెనుదిరిగాడు. టీ20 క్రికెట్లో కార్న్‌వాల్‌కు ఇదే తొలి సెంచరీ. బార్బడోస్ రాయల్స్ ఘన విజయం.. ఇక ఈ మ్యాచ్‌లో సెయింట్ కిట్స్‌పై 8 వికెట్ల తేడాతో బార్బడోస్ రాయల్స్ ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన సెయింట్ కిట్స్ నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 220 పరుగులు చేసింది. సెయింట్ కిట్స్ బ్యాటర్లలో ఫ్లెచర్(56), విల్ స్మిద్(63), రుథర్ఫర్డ్(65) పరుగులతో అదరగొట్టారు. బార్బోడస్ బౌలర్లలో కార్నవాల్ రెండు వికెట్లు,బ్రాత్‌వైట్ ఒక్క వికెట్ పడగొట్టారు. అనంతరం 221 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన బార్బడోస్ కేవలం రెండు వికెట్లు కోల్పోయి 18.1 ఓవర్లలోనే ఛేదించింది. బార్బడోస్ బ్యాటర్లలో కార్న్‌వాల్‌తో పాటు కెప్టెన్ పావెల్(49) పరుగులతో అదరగొట్టాడు. చదవండి: Asia cup 2023: నేపాల్‌తో మ్యాచ్‌కూ వర్షం గండం.. రద్దయితే టీమిండియా పరిస్థితేంటి..? Wait for the bat drop 🔥 (via @CPL) pic.twitter.com/3SbYJCnZW6 — ESPNcricinfo (@ESPNcricinfo) September 4, 2023 It was never in doubt, the Republic Bank Play of the Day is Rahkeem Cornwall's sensational century.#CPL23 #BRvSKNP #RepublicBank #CricketPlayedLouder #BiggestPartyInSport #Cornwall pic.twitter.com/ELvirLOtZk — CPL T20 (@CPL) September 4, 2023 -
అయ్యో రాయుడు.. తొలి మ్యాచ్‌లోనే ఇలా? వీడియో వైరల్
భారత మాజీ క్రికెటర్ అంబటి రాయుడు సెయింట్ కిట్స్ నెవిస్ అండ్ పేట్రియాట్స్ తరపున కరేబియన్ ప్రీమియర్ లీగ్‌లో అరంగేట్రం చేశాడు. అయితే తన తొలి మ్యాచ్‌లోనే రాయుడు నిరాశపరిచాడు. గురువారం జమైకా తల్లావాస్‌తో జరిగిన మ్యాచ్‌లో రాయుడు డకౌట్‌గా వెనుదిరిగాడు. ఐదో స్ధానంలో బ్యాటింగ్‌కు వచ్చి ఖాతా తెరవకుండానే పెవిలియన్‌కు చేరాడు. సెయింట్స్ కిట్స్ ఇన్నింగ్స్ 4 ఓవర్ వేసిన సల్మాన్ ఇర్షద్ బౌలింగ్‌లో రాయుడు భారీ షాట్‌కు ప్రయత్నించాడు. అయితే బంతి ఎడ్జ్‌తీసుకుని థర్డ్‌మాన్ ఫీల్డర్ దిశగా వెళ్లింది. ఈ క్రమంలో ఇమాద్ వసీం క్యాచ్‌ను అందుకున్నాడు. దీంతో నిరాశతో రాయుడు మైదాన్ని వీడాడు. అతడు ఔట్‌కు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అయ్యో రాయుడు తొలి మ్యాచ్‌లోనే ఇలా జరిగిందేంటి అంటూ అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. కాగా సీపీఎల్‌లో ఆడిన రెండో భారత ఆటగాడిగా రాయుడు నిలిచాడు. ఇక ఐపీఎల్-2023 తర్వాత అన్నిరకాల ఫార్మాట్లకు రాయుడు గుడ్ బై చెప్పిన విషయం తెలిసిందే. ఐదోసారి చెన్నైసూపర్ కింగ్స్ ఛాంపియన్స్‌గా నిలవడంలో రాయుడు కీలక పాత్ర పోషించాడు. అహ్మదాబాద్ వేదికగా గుజరాత్‌తో జరిగిన ఫైనల్లో రాయుడు మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. ఫైనల్లో 8 బంతులు ఎదుర్కొని 19 పరుగులు చేశాడు. ఇక సీఎస్కే విజయంతో ఓ అరుదైన ఘనతను కూడా తన పేరిట లిఖించుకున్నాడు. ఐపీఎల్లో అత్యధిక సార్లు విజేతగా నిలిచిన జట్టులో భాగమైన రెండో ఆటగాడిగా చరిత్రకెక్కాడు. రాయుడు మొత్తంగా ఆరుసార్లు (ముంబై ఇండియన్స్ తరఫున 3, సీఎస్కే తరఫున 3)టైటిల్స్ సాధించిన జట్లలో రాయుడు భాగంగా ఉన్నాడు. రాయుడు కంటే ముందు ఈ ఘనత సాధించిన జాబితాలో రోహిత్ శర్మ ముందన్నాడు. ఇక ఐపీఎల్లో 203 మ్యాచ్‌లు ఆడిన అంబటి.. 4348 పరుగులు చేశాడు. అతడి ఐపీఎల్ కెరీర్లో ఒక సెంచరీ ఉంది. చదవండి: Virat Kohli: యో- యో టెస్టులో పాసయ్యాను.. ఫొటో షేర్ చేసిన కోహ్లి! స్కోరెంతంటే.. Super Salman 🇵🇰 Salman Irshad takes the wickets of Ambati Rayudu, Andre Fletcher and Corbin Bosch in the same over 🤯 #CPL23 #SKNPvJT #CricketPlayedLouder #BiggestPartyInSport pic.twitter.com/eNS4sS2Kib — CPL T20 (@CPL) August 23, 2023 -
అంబటి రాయుడు కీలక నిర్ణయం.. మళ్లీ బ్యాట్ పట్టనున్న ఆంధ్ర ఆటగాడు
టీమిండియా మాజీ క్రికెటర్ అంబటి రాయుడు మరోసారి అభిమానలను అలరించేందుకు సిద్దమయ్యాడు. ఈ నెల ఆఖరిలో జరిగే కరీబియన్ ప్రీమియర్ లీగ్‌లో రాయుడు బరిలోకి దిగనునున్నాడు. ఈ లీగ్‌లో సెయింట్ కిట్స్ అండ్ నెవిస్ పేట్రియాట్స్ జట్టుకు రాయుడు ప్రాతినిథ్యం వహించనున్నాడు. తద్వారా సీపీఎల్‌లో ఆడనున్న రెండో భారత క్రికెటర్‌గా అంబటి రికార్డులకెక్కనున్నాడు. అంతకముందు 2020 సీజన్లో భారత స్పిన్నర్ ప్రవీణ్ తాంబే ట్రిన్‌బాగో నైట్ రైడర్స్ తరపున సీపీఎల్‌లో ఆడాడు. అయితే బీసీసీఐ కొత్త నిబంధనల ప్రకారం సీపీఎల్‌లో ఆడేందుకు రాయుడుకు అటంకం కలిగే ఛాన్స్ ఉంది. కూలింగ్ ఆఫ్ పీరియడ్ రూల్ ప్రకారం.. ఇటీవల కాలంలో రిటైర్డ్ అయిన భారత క్రికెటర్లు ఇతర దేశాల ప్రాంఛైజీ లీగ్ క్రికెట్ టోర్నీలో భాగం కాకుడదు. ఈ నిబంధన కారణంగానే అమెరికా వేదికగా జరిగిన మేజర్ లీగ్ క్రికెట్ టి20 టోర్నమెంట్లో భాగం కాలేదు. లేదంటే ఈ ఏడాది సీజన్లో టెక్సాస్ సూపర్ కింగ్స్ జట్టు తరపున రాయుడు ఆడాల్సింది. కాగా ఈ ఏడాది ఐపీఎల్ తర్వాత అన్నిఫార్మాట్ల క్రికెట్ నుంచి రాయుడు తప్పుకున్న సంగతి తెలిసిందే. ఇక సెయింట్ కిట్స్ ఫ్రాంచైజీతో కుదుర్చుకోవడంపై రాయుడు స్పందించాడు. సెయింట్ కిట్స్ అండ్ నెవిస్ పేట్రియాట్స్ జట్టుతో జత కట్టినందుకు చాలా సంతోషంగా ఉంది. ఈ ఏడాది సీపీఎల్‌లో సెయింట్ కిట్స్‌కు నావంతు సహకారం అందిస్తానని రాయుడు పేర్కొన్నాడు. కాగా సీపీఎల్-2023 సీజన్ ఆగస్టు 16 నుంచి ప్రారంభం కానుంది. చదవండి: IND vs WI: వెస్టిండీస్‌తో నాలుగో టీ20.. గిల్‌పై వేటు! విధ్వంసకర ఆటగాడికి మరో ఛాన్స్ -
క్రికెట్ అభిమానులకు శుభవార్త.. ఇకపై విదేశీ లీగ్‌లలో భారత క్రికెటర్లు..?
భారత క్రికెటర్లు విదేశీ లీగ్‌ల్లో పాల్గొనకూడదనే నిబంధన విషయంలో బీసీసీఐ పట్టువీడనున్నట్లు తెలుస్తోంది. ప్రపంచవ్యాప్తంగా జరిగే వివిధ లీగ్ల్లోని మెజార్టీ ఫ్రాంచైజీలు బీసీసీఐని నడిపిస్తున్న ఐపీఎల్ ఫ్రాంచైజీల యజమానుల చేతుల్లోనే ఉండటంతో బీసీసీఐ ఈ కీలక నిర్ణయం తీసుకోనుందని సమాచారం. త్వరలో దక్షిణాఫ్రికాలో ప్రారంభంకానున్న టీ20 లీగ్‌లో ఆరింటికి ఆరు జట్లను ఐపీఎల్ ఓనర్లే చేజిక్కించుకోవడంతో ఈ విషయమై బీసీసీఐపై ఒత్తిడి అధికమైందని భారత క్రికెట్ వర్గాల్లో చర్చించుకుంటున్నారు. దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో భారత క్రికెటర్లు విదేశీ లీగ్‌ల్లో ఆడేందుకు బీసీసీఐ అంగీకరించిందని తెలుస్తోంది. ఈ విషయమై ఈ ఏడాది సెప్టెంబర్‌లో జరిగే వార్షిక సాధారణ సమావేశంలో (ఏజీఎం) స్పష్టత రానుందని బీసీసీఐకి చెందిన కీలక ప్రతినిధి ఒకరు జాతీయ మీడియాకు తెలిపారు. కాగా, ప్రస్తుత నిబంధనల ప్రకారం బీసీసీఐతో ఒప్పందం కుదుర్చుకున్న ఏ పురుష క్రికెటర్‌కు విదేశీ లీగ్‌లలో ఆడేందుకు అనుమతి లేదు. రిటైరైన వాళ్లు, ఇకపై టీమిండియాకు ఆడబోమని భావించినవాళ్లతో పాటు మహిళా క్రికెటర్లకు మాత్రమే ఫారెన్ లీగ్‌లలో ఆడే అవకాశముంది. చదవండి: భారత్‌కు ఆసియా కప్, ప్రపంచకప్ అందించడమే నా ప్రధాన లక్ష్యం: కోహ్లి -
CPL 2021: గేల్ డకౌట్.. కానీ టైటిల్ మాత్రం అతని జట్టుదే
St Kitts and Nevis Patriots CPL 2021 Champions.. కరీబియన్ ప్రీమియర్ లీగ్(సీపీఎల్ 2021)లో కొత్త చాంపియన్‌గా సెంట్ కిట్స్ అండ్ నెవిస్ పాట్రియెట్స్ అవతరించింది. సెంట్ లూసియా, సెంట్ కిట్స్ అండ్ నెవిస్ పాట్రియెట్స్ మధ్య బుధవారం ఫైనల్ మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో 3 వికెట్ల తేడాతో విజయం అందుకున్న సెంట్ కిట్స్ తొలిసారి సీపీఎల్ టైటిల్‌ను గెలుచుకుంది. టోర్నీ ఆధ్యంతం నిలకడగా రాణించిన సెంట్ కిట్స్ ఫైనల్లోనూ అదే జోరు కనబరిచింది. క్రిస్ గేల్ డకౌట్ అయినప్పటికి.. భీకరఫామ్‌లో ఉన్న ఎవిన్ లూయిస్ 6 పరుగులకే వెనుదిరిగినప్పటికీ.. వికెట్ కీపర్ జోషువా డిసిల్వా రాణించగా.. చివర్లో డొమినిక్ డ్రేక్స్ మ్యాచ్ విన్నర్‌గా నిలిచి తన జట్టుకు తొలిసారి టైటిల్‌ను అందించాడు. చదవండి: CPL 2021: వికెట్ తీశానన్న ఆనందం.. బౌలర్ వింత ప్రవర్తన మ్యాచ్ విన్నర్ డొమినిక్ డ్రేక్స్ ఇక మ్యాచ్ విషయానికి వస్తే తొలుత బ్యాటింగ్ చేసిన సెంట్ లూసియా కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 159 పరుగులు చేసింది. ఓపెనర్ కార్న్‌వాల్ 43, రోస్టన్ చేజ్ 43 రాణించారు. సెంట్ కిట్స్ బౌలర్లలో ఫాబియెన్ అలెన్ , నసీమ్ షా తలా రెండు వికెట్లు తీశారు. అనంతరం 160 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన సెంట్ కిట్స్‌కు ఆదిలోనే షాక్ తగిలింది. గేల్ డకౌట్‌గా వెనుదిరగ్గా.. కాసేపటికే ఎవిన్ లూయిస్ ఆరు పరుగులు చేసి ఔటయ్యాడు. ఆ తర్వాత జోషుహ డిసిల్వా(37), షెర్ఫెన్ రూథర్‌ఫోర్డ్(25)లు కలిసి ఇన్నింగ్స్‌ను చక్కదిద్దారు. విజయం దిశగా సాగిపోతున్న సమయంలో సెంట్ కిట్స్ వరుసగా వికెట్లు కోల్పోయింది. చదవండి: Chris Gayle: గేల్ బ్యాటింగ్.. బ్యాట్ రెండు ముక్కలు; వీడియో వైరల్ ఈ దశలో డొమినిక్ డ్రేక్ అద్భుతం చేశాడు. 24 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్సర్లతో విజృంభించిన అతను చివరి వరకు నాటౌట్‌గా నిలిచి జట్టును చాంపియన్‌గా నిలబెట్టాడు. అతనికి ఫాబియెన్ అలెన్(20 పరుగులు) నుంచి చక్కని సహకారం లభించింది. ఫైనల్ హీరోగా నిలిచిన డొమినిక్ డ్రేక్స్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలవగా.. రోస్టన్ చేజ్ ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డును గెలుచుకున్నాడు. WHAT A FINISH! Dominic Drakes seals the win with a @fun88eng Magic moment. pic.twitter.com/tvyn72hbmP — CPL T20 (@CPL) September 15, 2021 -
వికెట్ తీశానన్న ఆనందం.. బౌలర్ వింత ప్రవర్తన
Kevin Sinclair Flipout CPL 2021: విండీస్ ఆటగాళ్లు ఎక్కడ ఉంటే అక్కడ మజా ఇంకో లెవల్లో ఉంటుందని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. బ్రేవో, గేల్, కాట్రెల్ లాంటి ఆటగాళ్లు తన హావభావాలతో ఫ్యాన్స్‌ను ఎన్నోసార్లు మెప్పించారు. తాజాగా సీపీఎల్ 2021లో భాగంగా కెవిన్ సింక్లెయిర్ చేసిన పని సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వికెట్ తీశానన్న ఆనందంలో సింక్లెయిర్ మైదానంలోనే గెంతులు వేశాడు. గయానా అమెజాన్ వారియర్స్, సెంట్ కిట్స్ మధ్య సెమీ ఫైనల్ మ్యాచ్ జరిగింది. చదవండి: Chris Gayle: గేల్ బ్యాటింగ్.. బ్యాట్ రెండు ముక్కలు; వీడియో వైరల్ అప్పటికే గేల్, లూయిస్‌లు సిక్సర్లు, ఫోర్ల వర్షం కురిపిస్తున్నారు. ఇన్నింగ్స్ 8వ ఓవర్లో సింక్లెయిర్ వేసిన రెండో బంతిని గేల్ లాంగాన్ దిశగా భారీ షాట్ కొట్టాడు. అయితే బౌండరీ లైన్ వద్ద ఉన్న హెట్‌మైర్ ఏ మాత్రం తడబడకుండా క్యాచ్ అందుకున్నాడు. దీంతో సింక్లెయిర్ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. గేల్ వికెట్ తీశానన్న ఆనందంలో ఫ్లిప్స్(గెంతులు)తో రెచ్చిపోయాడు. ఈ వీడియోనూ సీపీఎల్ టి20 తన ట్విటర్లో షేర్ చేసింది. చివర్లో హెట్‌మైర్, పూరన్‌లు వచ్చి సింక్లెయిర్ను ప్రోత్సహించడం హైలెట్‌గా నిలిచింది. ఇక ఇదే మ్యాచ్‌లో గేల్ 42 పరుగులు చేయడం ద్వారా సీపీఎల్‌లో 2500 పరుగులను పూర్తి చేసుకున్నాడు. ఇక ఈ మ్యాచ్‌లో గయానా అమెజాన్ వారియర్స్‌పై విజయం సాధించిన సెంట్ కిట్స్ ఫైనల్లో అడుగుపెట్టింది. చదవండి: వరల్డ్‌కప్ ఉంది.. ప్రతీ విషయాన్ని భూతద్దంలో చూడడం ఆపండి Kevin Sinclair is literally flipping out over the last wicket 😯 #GAWvSKNP #CPL21 #CricketPlayedLouder #BiggestPartyInSport pic.twitter.com/0FhYbfe4nn — CPL T20 (@CPL) September 14, 2021 -
Chris Gayle: గేల్ బ్యాటింగ్.. బ్యాట్ రెండు ముక్కలు; వీడియో వైరల్
జమైకా: యునివర్సల్ బాస్ క్రిస్ గేల్ బ్యాట్ రెండు ముక్కలవడం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. సీపీఎల్ 2021లో భాగంగా గయానా అమెజాన్ వారియర్స్, సెంట్ కిట్స్ మధ్య జరిగిన సెమీ ఫైనల్ మ్యాచ్‌లో ఇది చోటుచేసుకుంది. సెంట్ కిట్స్ ఇన్నింగ్స్ సమయంలో ఇన్నింగ్స్ 4వ ఓవర్‌ను ఒడియన్ స్మిత్ వేశాడు. ఓవర్ రెండో బంతిని స్మిత్ లెగ్‌స్టంప్ దిశగా వేశాడు. గేల్ దానిని ఆఫ్‌సైడ్ ఆడుదామని భావించాడు. అయితే బంతి బ్యాట్‌కు బలంగా తగలడంతో రెండు ముక్కలైంది. బ్యాట్ కింద పడిపోగా.. హ్యాండిల్ మాత్రం గేల్ చేతిలో ఉండిపోయింది. ఆ తర్వాత గేల్ పడిపోయిన బ్యాట్‌ను పరిశీలించి కొత్త బ్యాట్ తెప్పించుకొని ఇన్నింగ్స్ కొనసాగించాడు. చదవండి: Chris Gayle: గేల్ సిక్స్ కొడితే మాములుగా ఉంటుందా.. చదవండి: SL Vs SA: డికాక్ మెరుపులు.. 10 వికెట్లతో విజయం; దక్షిణాఫ్రికా క్లీన్‌స్వీప్ ఇక సెమీస్‌లో సెంట్ కిట్స్ గయానాపై గెలుపొంది ఫైనల్లో అడుగుపెట్టింది. గయానా గయానా విధించిన 179 పరుగుల లక్ష్యాన్ని సెంట్ కిట్స్ మూడు వికెట్లు మాత్రమే కోల్పయి 17.5 ఓవర్లలోనే లక్ష్యాన్ని చేధించింది. ఓపెనర్ లూయిస్ (39 బంతుల్లో 77 నాటౌట్, 3 ఫోర్లు, 8 సిక్సర్లు) విధ్వంసం సృష్టించాడు. అంతకముందు తొలుత బ్యాటింగ్ చేసిన గయానా అమెజాన్ వారియర్స్ 9 వికెట్ల నష్టానికి 178 పరుగులు చేసింది. హెట్‌మైర్ (45, 20 బంతులు; 2 ఫోర్లు, 4 సిక్సర్లు) రాణించాడు. చదవండి: Evin Lewis CPL 2021: లూయిస్ సిక్సర్ల విధ్వంసం.. దర్జాగా ఫైనల్‌కు Batting malFUNction for @henrygayle #GAWvSKNP #CPL21 #CricketPlayedLouder #BiggestPartyInSport pic.twitter.com/kuPgIs7DuY — CPL T20 (@CPL) September 14, 2021 -
CPL 2021: లూయిస్ సిక్సర్ల విధ్వంసం.. దర్జాగా ఫైనల్‌కు
జమైకా: కరీబియన్ ప్రీమియర్ లీగ్(సీపీఎల్ 2021)లో ఎవిన్ లూయిస్ మరోసారి విధ్వంసం సృష్టించాడు. సిక్సర్ల వర్షం కురిపిస్తూ చివరి వరకు నాటౌట్‌గా నిలిచిన లూయిస్ ఒంటిచేత్తో జట్టును ఫైనల్‌కు చేర్చాడు. గయానా అమెజాన్ వారియర్స్‌తో జరిగిన సెమీ ఫైనల్ మ్యాచ్‌లో సెంట్ కిట్స్ అండ్ నెవిస్ పాట్రియెట్స్ ఘన విజయాన్ని సాధించి దర్జాగా ఫైనల్లో అడుగుపెట్టింది. చదవండి: Lasit Malinga: నాలుగు బంతుల్లో నాలుగు వికెట్లు; ఇక ఎవరికి సాధ్యం గయానా విధించిన 179 పరుగుల లక్ష్యాన్ని సెంట్ కిట్స్ మూడు వికెట్లు మాత్రమే కోల్పయి 17.5 ఓవర్లలోనే లక్ష్యాన్ని చేధించింది. ఓపెనర్ లూయిస్ (39 బంతుల్లో 77 నాటౌట్, 3 ఫోర్లు, 8 సిక్సర్లు) విధ్వంసానికి తోడూ క్రిస్ గేల్ (27 బంతుల్లో 42, 5 ఫోర్లు, 3 సిక్సర్లు), కెప్టెన్ బ్రేవో 31 బంతుల్లో 34,3 ఫోర్లు, 1 సిక్సర్) తోడవ్వడంతో సునాయాసంగా విజయం సాధించింది. అంతకముందు తొలుత బ్యాటింగ్ చేసిన గయానా అమెజాన్ వారియర్స్ 9 వికెట్ల నష్టానికి 178 పరుగులు చేసింది. హెట్‌మైర్ (45, 20 బంతులు; 2 ఫోర్లు, 4 సిక్సర్లు) రాణించగా.. ఓపెనర్లు బ్రాండన్ కింగ్ 27, చంద్రపాల్ 27 పరుగులు చేశారు. Evin Lewis: 11 సిక్సర్లతో లూయిస్ విధ్వంసం.. సెంచరీతో గెలిపించాడు Yet again Evin Lewis produces a batting masterclass and earns the @Dream11 MVP from semi final two. #CPL21 #GAWvSKNP #CricketPlayedLouder #Dream11 pic.twitter.com/qoKzrsz9fi — CPL T20 (@CPL) September 14, 2021 -
11 సిక్సర్లతో లూయిస్ విధ్వంసం.. సెంచరీతో గెలిపించాడు
సెంట్కిట్స్: కరీబియన్ ప్రీమియర్ లీగ్(సీపీఎల్ 2021)లో ఎవిన్ లూయిస్ విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడాడు. మ్యాచ్ ఆద్యంతం సిక్సర్లు, ఫోర్లతో విధ్వంసం సృష్టించిన లూయిస్ సెంచరీతో నాటౌట్‌గా నిలిచి జట్టుకు విజయాన్ని అందించాడు. 52 బంతుల్లో 102 పరుగులు చేసిన లూయిస్ ఇన్నింగ్స్‌లో 11 సిక్సర్లు, 5 ఫోర్లు ఉన్నాయి. ఈ విజయంతో సెంట్ కిట్స్ పాయింట్ల పట్టికలో టాప్ స్థానానికి చేరుకొని ప్లేఆఫ్‌కు క్వాలిఫై అయింది. చదవండి: Nicholas Pooran: సిక్సర్లతో శివమెత్తిన పూరన్.. ఫ్లే ఆఫ్‌కు మరింత చేరువగా మ్యాచ్ విషయానికి వస్తే తొలుత బ్యాటింగ్ చేసిన ట్రిన్‌బాగో నైట్‌రైడర్స్ నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 159 పరుగులు చేసింది. కొలిన్ మున్రో 47 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా.. ఆఖర్లో సునీల్ నరైన్( 18 బంతుల్లో 33, 4 సిక్సర్లు, ఒక ఫోర్) ఆకట్టుకున్నాడు. సెంట్ కిట్స్ బౌలర్లలో డొమినిక్ డ్రేక్స్ , జాన్ జాగేసర్ చెరో 3 వికెట్లు తీశారు. అనంతరం 160 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన సెంట్ కిట్స్‌కు ఓపెనర్లు గేల్, లూయిస్‌లు శుభారంభం ఇచ్చారు. ముఖ్యంగా గేల్ ఉన్నంతసేపు దడదడలాడించాడు. 18 బంతుల్లో 35 పరుగులు చేసిన గేల్ ఇన్నింగ్స్‌లో 6 ఫోర్లు, సిక్సర్ ఉన్నాయి. గేల్ ఔటైన తర్వాత బాధ్యతను ఎత్తుకున్న లూయిస్ మిగతా పనిని పూర్తి చేశాడు. ఈ క్రమంలోనే సిక్సర్‌తో సెంచరీ పూర్తి చేసిన లూయిస్ మ్యాచ్‌ను గెలిపించాడు. చదవండి: IPL 2021: బెయిర్ స్టో స్థానంలో విండీస్ స్టార్ ఆటగాడు Evin Lewis 💯 This #IPL gonna be good! @rajasthanroyals 🔥🔥 #RR pic.twitter.com/kumGve2Hrc — Frank (@franklinnnmj) September 12, 2021 -
సిక్సర్లతో శివమెత్తిన పూరన్.. ఫ్లే ఆఫ్‌కు మరింత చేరువగా
జమైకా: కరీబియన్ ప్రీమియర్ లీగ్(సీపీఎల్ 2021)లో నికోలస్ పూరన్ మరోసారి సిక్సర్ల వర్షం కురిపించాడు. (39 బంతుల్లో 75 పరుగులు నాటౌట్, 4 ఫోర్లు, 7 సిక్సర్లతో) రెచ్చిపోయిన పూరన్ కెప్టెన్ ఇన్నింగ్స్‌తో గయానా అమెజాన్ వారియర్స్‌కు కీలక విజయాన్ని అందించాడు. జమైకా తలైవాస్‌తో జరిగిన మ్యాచ్‌లో గయానా విజయం సాధించడంతో పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో నిలవడంతో పాటు ప్లేఆఫ్ ఆశలు సజీవంగా ఉంచుకుంది. ఇక జమైకా తలైవాస్ వరుస ఓటములతో మరింత అట్టడుగుకు చేరింది. లీగ్‌లో నిలవాలంటే జమైకా అన్ని మ్యాచ్‌లు గెలవాల్సిన పరిస్థితి ఏర్పడింది. చదవండి: Viral Video: రనౌట్ అవకాశం; ఊహించని ట్విస్ట్.. ఫీల్డర్ల పరుగులు మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన గయానా అమెజాన్ వారియర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 169 పరుగులు చేసింది. బ్రాండన్ కింగ్, చంద్రపాల్, హెట్‌మైర్, షోయబ్ మాలిక్‌లు మంచి ఆరంభాలే ఇచ్చినప్పటికీ పెద్ద స్కోర్లుగా మలచడంలో విఫలమయ్యారు. అయితే ఫామ్‌లో ఉన్న పూరన్ మాత్రం తన విధ్వంసాన్ని కొనసాగించాడు. కొడితే ఫోర్ లేదంటే సిక్స్ అన్న తరహాలో పూరన్ ఇన్నింగ్స్ సాగింది. 18వ ఓవర్ వరకు సాదాసీదాగా ఉన్న వారియర్స్ స్కోరు పూరన్ ధాటికి చివరి రెండు ఓవర్లలో 30 పరుగులతో 160కి పైగా పరుగులు చేసింది. అనంతరం 170 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన జమైకా తైలవాస్ 19.1 ఓవర్లలో 123 పరుగులకు ఆలౌటై 46 పరుగుల తేడాతో పరాజయం చవిచూసింది. కిర్క్ మెకెంజీ 28 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. గయానా బౌలర్లలో ఓడియన్ స్మిత్ 3 వికెట్లు తీశాడు. చదవండి: CPL 2021: వసీమ్, రసెల్ ఆల్‌రౌండ్ మెరుపులు.. సెమీస్ ఆశలు సజీవం MASSIVE!!! Nicholas Pooran goes LARGE with the @OmegaXL hit from match 26, #CPL21 #JTvGAW #CricketPlayedLouder #OmegaXL pic.twitter.com/7fRnfIRBEA — CPL T20 (@CPL) September 11, 2021 -
రసెల్ ఆల్‌రౌండ్ మెరుపులు.. సెమీస్ ఆశలు సజీవం
జమైకా: కరీబియన్ ప్రీమియర్ లీగ్( సీపీఎల్ 2021)లో భాగంగా గురువారం జమైకా తలైవాస్, సెంట్ లూసియా మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో జమైకా తలైవాస్ ఘన విజయాన్ని అందుకుంది. రసెల్ ఆల్‌రౌండ్ ప్రదర్శన కనబరచడంతో జమైకా తలైవాస్ వరుసగా రెండో విజయాన్ని నమోదు చేసి సెమీస్ ఆశలు సజీవంగా ఉంచుకుంది.. ఇక సెంట్ లూసియా వరుసగా మూడో పరాజయాన్ని మూటగట్టుకుంది. చదవండి: విండీస్ టీ20 జట్టు ఇదే.. ఆరేళ్ల తర్వాత ఆ ఆటగాడికి పిలుపు మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన జమైకా తలైవాస్ నిర్ణీత 20 ఓవర్లలో 211 పరుగులకు ఆలౌట్ అయింది. ఓపెనర్ కెన్నర్ లూయిస్ 56 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా.. చివర్లో పొలార్డ్(31,15 బంతులు; 4 సిక్సర్లు), ఇమాద్ వసీమ్(27, 10 బంతులు; 1 ఫోర్, 3 సిక్సర్లు) మెరుపులు మెరిపించారు. సెంట్ లూసియా బౌలింగ్‌లో జెవర్ రాయల్, కదీమ్ అలీన్ చెరో మూడు వికెట్లు తీశారు. అనంతరం భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన సెంట్ లూసియా 156 పరుగులకే ఆలౌట్ అయింది. మార్క్ డేయల్ 33, ఆండ్రీ ఫ్లెచర్ 30 పరుగులు చేశారు. ఇమాద్ వసీమ్ 3, రసెల్ 2, కార్లోస్ బ్రాత్‌వైట్ 2 వికెట్లతో రాణించారు. ఈ విజయంతో తలైవాస్ 8 మ్యాచ్‌ల్లో 4 విజయాలు.. 4 ఓటములతో పాయింట్ల పట్టికలో 3వ స్థానంలో ఉండగా.. సెంట్ లూసియా కూడా 8 మ్యాచ్‌ల్లో 4 విజయాలు.. 4ఓటములతోనే ఉంది. అయితే నెట్ రన్‌రేట్ విషయంలో మైనస్‌లో ఉండడంతో నాలుగో స్థానంలో ఉంది. చదవండి: ఇదేం ఫీల్డింగ్‌రా బాబు.. ఒట్టి పుణ్యానికి నాలుగు పరుగులు MVP!!! An all round performance with bat and ball sees Imad Wasim pick up the @Dream11 MVP for match 24. #CPL21 #SLKvJT #CricketPlayedLouder #Dream11 pic.twitter.com/tFBWoJvGRu — CPL T20 (@CPL) September 10, 2021 -
ఇదేం ఫీల్డింగ్‌రా బాబు.. ఒట్టి పుణ్యానికి నాలుగు పరుగులు
జమైకా: కరీబియన్ ప్రీమియర్ లీగ్(సీపీఎల్ 2021)లో ఉత్కంఠభరితమైన మ్యాచ్‌లతో పాటు ఫన్నీ ఘటనలు చాలానే చోటుచేసుకుంటున్నాయి. ''క్యాచెస్ విన్ మ్యాచెస్'' అనే పాత నానుడి ఇప్పుడు అక్షరాల నిజమైంది. ఫీల్డర్ చేసిన తప్పు ప్రత్యర్థి జట్టుకు ఒట్టి పుణ్యానికి నాలుగు పరుగుల వచ్చేలా చేశాయి. అయితే మిస్ఫీల్డ్తో బౌండరీ దాటిందనుకుంటే పొరపాటే.. కేవలం ఫీల్డర్ల వైఫల్యంతో ప్రత్యర్థి బ్యాట్స్‌మన్ నాలుగు పరుగులు రాబట్టారు. చదవండి: BAN VS NZ: చరిత్ర సృష్టించిన బంగ్లాదేశ్.. కివీస్‌పై తొలిసారి.. ట్రిన్‌బాగో నైట్‌రైడర్స్, జమైకా తలైవాస్ మధ్య మంగళవారం జరిగిన మ్యాచ్‌లో ఇది జరిగింది. ట్రిన్‌బాగో నైట్‌రైడర్స్ బ్యాటింగ్ సమయంలో ఇన్నింగ్స్ ఆఖరి ఓవర్ నాలుగో బంతిని ప్రిటోరియస్ పొలార్డ్‌కు వేశాడు. పొలార్డ్ లాంగాన్ దిశగా భారీ షాట్ ఆడగా.. అక్కడే ఉన్న ఫీల్డర్ క్యాచ్‌ను మిస్ చేశాడు. కనీసం రనౌట్ అయ్యే అవకాశం ఉందోమోనని అందుకొని ప్రిటోరియస్ వైపు బంతిని త్రో విసిరాడు. అయితే ప్రిటోరియస్ బంతిని అందుకోలేకపోయాడు. అప్పటికే రెండు పరుగులు పూర్తి చేసిన పొలార్డ్- స్టీఫర్ట్ జంట మరోసారి పరిగెత్తారు. ఈసారి ప్రిటోరియస్ వేసిన బంతి మరోసారి వికెట్లకు దూరంగా వెళ్లడంతో పొలార్డ్ జంట మరోసారి పరుగుపెట్టారు. మొత్తానికి ఫీల్డర్ల పుణ్యానా నాలుగు పరుగులు వచ్చేశాయి. ఓవరాల్‌గా ఆ ఓవర్ మొత్తంలో 28 పరుగులు పిండుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం ట్రెండింగ్‌గా మారింది. ఇక ఈ మ్యాచ్‌లో ట్రిన్‌బాగో నైట్‌రైడర్స్ విజయాన్ని అందుకుంది. మొదట బ్యాటింగ్ చేసిన ట్రిన్‌బాగో 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 167 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్ చేసిన జమైకా తలైవాస్ 18.2 ఓవర్లలో 92 పరుగులకే ఆలౌటైంది. చదవండి: అరంగేట్ర మ్యాచ్‌లోనే నాలుగు వికెట్లు.. ఎవరు ఆ బౌలర్? #KieronPollard 😍 pic.twitter.com/J3qDc0MsF3 — Kart Sanaik (@KartikS25864857) September 7, 2021 -
సిమన్స్ ఊచకోత.. నైట్ రైడర్స్ ఘన విజయం
సెంట్కిట్స్: కరీబీయన్ ప్రీమియర్ లీగ్‌లో ఆదివారం జరిగిన మ్యాచ్‌లో జమైకా తల్లావాస్‌పై ట్రిన్‌బాగో నైట్ రైడర్స్ ఏడు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. మొదట బ్యాటింగ్‌కు దిగిన తల్లావాస్ మొదటి ఆరు ఓవర్లలో 15 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. ఈ సమయంలో క్రీజులోకి వచ్చిన కార్లోస్ బ్రాత్‌వైట్..ఇమాడ్ వసీంతో కలిసి ఆరో వికెట్‌కు 83 పరుగుల భాగస్వామ్యాన్ని జోడించారు. బ్రాత్‌వైట్ (58, 45 బంతుల్లో 8 ఫోర్లు, 3 సిక్స్‌లు) అర్థ సెంచరీతో చెలరేగగా, ఇమాడ్ వసీం (42, 38 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్‌లు) పరుగులు సాధించాడు. దీంతో నిర్ణీత 20 ఓవర్లో 145 పరుగుల లక్ష్యన్ని నైట్ రైడర్స్ ముందు ఉంచింది. నైట్ రైడర్స్ బౌలర్లలో అకేల్ హోసిన్, రవి రాంపాల్ చేరో రెండు వికెట్లు పడగొట్టగా, నరైన్ ,ఉదానా ఒక్కో వికెట్ సాధించారు. ఆనంతరం 145 లక్ష్య సాదనతో బరిలోకి దిగిన నైట్ రైడర్స్ ఆరంభంలోనే సునీల్ నరైన్ వికెట్ కోల్పోయింది. అయితే అసలు ఊచకోత తర్వాత మెదలైంది. ప్రత్యర్ధి బౌలర్లపై లెండెల్ సిమన్స్ ఫోర్లు, సిక్సర్లతో విరుచుకుపడ్డాడు. కేవలం 45 బంతుల్లో 70 (5 ఫోర్లు, 5 సిక్స్‌లు) పరుగులు సాధించాడు. కొలిన్ మున్రోతో (34) కలిసి 102 పరుగుల బాగాస్వామ్యన్ని సిమన్స్ నమోదు చేశాడు. చివరకు సిమన్స్ ను అవుట్ చేసిన ప్రిటోరియస్ .. ఈ బాగాస్వామ్యన్ని విడదీశాడు. అరంతరం క్రీజులోకి వచ్చిన డారన్ బ్రావో మ్యాచ్‌ను ముగించాడు. దీంతో కేవలం మూడు వికెట్లు మాత్రమే కోల్పోయి 145 పరుగుల లక్ష్యన్ని సునాయాసంగా చేధించింది. చదవండి: CPL 2021: వార్నీ.. కోపాన్నంత హెల్మెట్‌పై చూపించాడు THREE catches and a SEVENTY with the bat sees Lendl Simmons pick up the @Dream11 MVP for match 18. #CPL21 #TKRvJT #CricketPlayedLouder #Dream11 pic.twitter.com/zk3Lm1ETIB — CPL T20 (@CPL) September 5, 2021 -
CPL 2021: వార్నీ.. కోపాన్నంత హెల్మెట్‌పై చూపించాడు
సెంట్కిట్స్: కరీబియన్ ప్రీమియర్ లీగ్(సీపీఎల్ 2021)లో మ్యాచ్‌లు రోజురోజుకు ఆసక్తికరంగా మారుతున్నాయి. ఆదివారం సెంట్ కిట్స్, సెంట్ లూసియాల మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో సెంట్ లూసియా ఘన విజయాన్ని అందుకుంది. అయితే సెంట్ కిట్స్ బ్యాట్స్‌మన్ షెర్ఫేన్ రూథర్‌ఫోర్డ్ ఔటయ్యానన్న కోపాన్ని ఎవరిపై చూపించాలో తెలియక తన హెల్మెట్‌పై చూపించాడు. ఇన్నింగ్స్ 10వ ఓవర్లో ఇది చోటుచేసుకుంది. 10వ ఓవర్ రెండో బంతిని రూథర్‌ఫోర్డ్ మిడాన్ దిశగా ఆడాడు. సింగిల్ పూర్తి చేసి రెండో పరుగుకు పిలవగా.. నాన్‌స్ట్రైక్ ఎండ్‌లో ఉన్న ఆసిఫ్ అలీ వద్దని వారించాడు. అప్పటికే రూథర్‌ఫోర్ట్ క్రీజు దాటి భయటకు వచ్చేశాడు. దీంతో రోస్టన్ చేజ్ మెరుపువేగంతో రనౌట్ చేశాడు. మ్యాచ్‌లో 14 పరుగులు మాత్రమే చేసి అనూహ్యంగా రనౌట్‌గా వెనుదిరిగిన రూథర్‌ఫోర్డ్ కోపంతో పెవిలియన్ బాట పట్టాడు. బౌండరీలైన్ వద్దకు రాగానే తలకున్న హెల్మెట్ తీసి కిందకు విసిరేశాడు. ఈ ఘటనతో అభిమానులు షాక్‌కు గురయ్యారు. వాస్తవానికి లీగ్‌లో రూథర్‌ఫోర్డ్ మంచి ఆటతీరును కనబరుస్తున్నాడు. ఇప్పటివరకు ఆడిన 7 మ్యాచ్‌ల్లో 201 పరుగులతో టోర్నమెంట్లో రెండో స్థానంలో కొనసాగుతున్నాడు. నాన్‌స్ట్రైక్ ఎండ్ బ్యాట్స్‌మన్ ఆసిఫ్ అలీ పొరపాటు వల్లే అనవసరంగా రనౌట్ అయ్యాననే బాధతో హెల్మెట్‌ను విసిరేసి ఉంటాడని ఫ్యాన్స్ భావిస్తున్నారు. దీనికి సంబంధించిన వీడియోను సీపీఎల్ టీ 20 నిర్వాహకులు ట్విటర్లో షేర్ చేయగా అది కాస్త వైరల్ అయింది. చదవండి: BAN Vs NZ: చిత్తుగా ఓడిన బంగ్లాదేశ్.. పదేళ్లలో కివీస్‌కు రెండో విజయం ఇక మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన సెంట్ కిట్స్ 19.3 ఓవర్లలో 118 పరుగులకే ఆలౌట్ అయింది. ఫాబియన్ అలెన్ 34 పరుగులతో టాప్‌స్కోరర్‌గా నిలిచాడు. సెంట్ లూసియా బౌలర్ల దాటికి ఏడుగురు సింగిల్ డిజిట్‌కే పరిమితమయ్యారు. అనంతరం బ్యాటింగ్ చేసిన సెంట్ లూసియా 15.4 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి చేధించింది. రోస్టన్ చేజ్ (51 పరుగులు, 38 బంతులు; 4 ఫోర్లు, 2 సిక్సర్లు) మెరుపులు మెరిపించాడు. Give that man an #angosturachill 😬#SKNPvSLK #CPL21 #CricketPlayedLouder #BiggestPartyInSport pic.twitter.com/Q9ZHoKs5Ek — CPL T20 (@CPL) September 5, 2021 -
వారెవ్వా కాట్రెల్.. స్టన్నింగ్ క్యాచ్.. ఆఖరి బంతికి సిక్స్
సెంట్ కిట్స్: కరీబియన్ ప్రీమియర్ లీగ్(సీపీఎల్ 2021)లో భాగంగా బుధవారం సెంట్ కిట్స్, బార్బడోస్ రాయల్స్ మధ్య జరిగిన మ్యాచ్ ఉత్కంఠను రేపింది. ఈ మ్యాచ్‌లో సెంట్ కిట్స్ ఆఖరి బంతికి విజయాన్ని అందుకుంది. మ్యాచ్‌లో సూపర్ క్యాచ్‌తో పాటు ఆఖరి బంతికి సిక్స్ కొట్టి గెలిపించిన షెల్డన్ కాట్రెల్ విన్నింగ్ హీరోగా నిలిచాడు. బార్బడోస్ రాయల్స్ ఇన్నింగ్స్ 13వ ఓవర్లో ఇది చోటుచేసుకుంది. డ్వేన్ బ్రావో వేసిన ఓవర్ తొలి బంతిని గ్లెన్ పిలిఫ్స్ మిడ్ వికెట్ మీదుగా భారీ షాట్ ఆడాడు. అయితే బౌండరీ వద్ద ఉన్న కాట్రెల్ ఒంటిచేత్తో అందుకున్నాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇక మ్యాచ్ విషయానికి వస్తే... తొలుత బ్యాటింగ్ చేసిన బార్బడోస్ రాయల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 160 పరుగులు చేసింది. స్మిత్ పటేల్ 54 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. సెంట్ కిట్స్ బౌలర్లలో డ్వేన్ బ్రావో 4 వికెట్లు తీశాడు. అనంతరం 161 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన సెంట్ కిట్స్ 8 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేధించింది. గేల్ 42 పరుగులు చేశాడు. అయితే ఆఖరి ఓవర్లో విజయానికి 10 పరుగులు అవసరమైన దశలో మ్యాచ్ ఉత్కంఠగా మారింది. క్రీజులో కాట్రెల్, డ్రేక్స్ ఉన్నారు. తొలి రెండు బంతుల్లో ఒక పరుగు మాత్రమే రావడంతో.. నాలుగు బంతుల్లో 9 పరుగులు చేయాల్సి ఉంది. అయితే మూడో బంతికి డ్రేక్స్ బౌండరీ సాధించాడు. నాలుగు బంతుల్లో 5 పరుగులు అవసరం కాగా... నాలుగో బంతికి డ్రేక్స్ ఔటయ్యాడు. దీంతో ఐదో బంతికి సింగిల్ రాగా.. చివరి బంతికి 3 పరుగులు చేస్తే చాలు అనుకుంటున్న దశలో కాట్రెల్ ఎవరు ఊహించని విధంగా లాంగాఫ్ మీదుగా భారీ సిక్స్ సంధించాడు. దీంతో సెంట్ కిట్స్ లీగ్‌లో ఐదో విజయాన్ని నమోదు చేసిన సెంట్ కిట్స్ 10 పాయింట్లతో టేబుల్ టాపర్‌గా నిలిచింది. -
షెఫర్డ్ అద్భుత స్పెల్.. సూపర్ ఓవర్లో థ్రిల్లింగ్ విక్టరీ
సెంట్ కిట్స్: కరీబియన్ ప్రీమియర్ లీగ్(సీపీఎల్ 2021)లో బుధవారం గయానా అమెజాన్ వారియర్స్, ట్రిన్‌బాగో నైట్‌రైడర్స్ మధ్య జరిగిన లీగ్ మ్యాచ్ థ్రిల్లర్‌ను తలపించింది. లీగ్‌లో తొలిసారి సూపర్ ఓవర్‌కు దారి తీసిన ఈ మ్యాచ్‌లో గయానా వారియర్స్ విజయాన్ని అందుకుంది. మ్యాచ్ విషయానికి వస్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన ట్రిన్‌బాగో నైట్‌రైడర్స్ 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 138 పరుగులు చేసింది. కొలిన్ మున్రో 32 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా.. ఉడాన 21, నరైన్ 21 పరుగులు చేశారు. రొమారియె షెఫర్డ్ , మహ్మద్ హఫీజ్‌లు చెరో 3 వికెట్లు తీశారు. అనంతరం బ్యాటింగ్ చేసిన గయానా అమెజాన్ వారియర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 138 పరుగులే చేసింది. హెట్‌మైర్ , నికోలస్ పూరన్‌లు 27 పరుగులు చేశారు. చదవండి: పొట్టి క్రికెట్లో అరుదైన మైలురాయిని దాటేసిన విండీస్ యోధుడు మ్యాచ్‌లో ఫలితం రాకపోవడంతో అంపైర్లు సూపర్ ఓవర్ నిర్వహించారు. సూపర్ ఓవర్లో తొలుత బ్యాటింగ్ చేసిన గయానా వారియర్స్ 2 వికెట్లు కోల్పోయి 6 పరుగులు మాత్రమే చేసింది. ఇక ట్రిన్‌బాగో సులువుగా గెలుస్తుందని అంతా భావించారు. కానీ ఇక్కడే షెఫర్డ్ తన బౌలింగ్ మ్యాజిక్‌ను చూపించాడు. షెఫర్డ్ వేసిన తొలి బంతికే పొలార్డ్ ఔట్ కావడంతో విజయానికి ఐదు బంతుల్లో ఆరు పరుగులు కావాల్సి ఉంది. రెండో బంతికి సింగిల్ రాగా.. మూడు బంతికి పరుగు రాలేదు. ఇక నాలుగో బంతికి రెండు పరుగులు రాగా.. చివరి రెండు బంతుల్లో మూడు పరుగులు కావాలి. ఐదో బంతికి పరుగు రాకపోవడం.. ఆరో బంతికి సింగిల్ రావడంతో ట్రిన్‌బాగో నాలుగు పరుగులు మాత్రమే చేసి పరాజయం పాలైంది. ఈ విజయంతో గయానా వారియర్స్ పాయింట్ల పట్టికలో నాలుగో స్థానంలో ఉండగా.. మ్యాచ్‌లో ఓడినప్పటికీ ట్రిన్‌బాగో మూడో స్థానంలోనే కొనసాగుతుంది. చదవండి: వైడ్ ఇవ్వలేదన్న కోపంలో పోలార్డ్ ఏం చేశాడో చూడండి.. -
బంతి ఎలా పడిందన్నది చూడకుండానే.. షాక్ తిన్న బౌలర్
సెంట్కిట్స్: కరీబియన్ ప్రీమియర్ లీగ్(సీపీఎల్ 2021)లో సెంట్ లూసియా కింగ్స్, ట్రిన్‌బాగో నైట్‌రైడర్స్ మధ్య ఆదివారం లీగ్ మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో సెంట్ లూసియా కింగ్స్ 5 పరుగుల తేడాతో విజయాన్ని అందుకుంది. ఈ విషయం కాసేపు పక్కనపెడితే సెంట్ లూసియా కింగ్స్ ఓపెనర్ ఆండ్రీ ఫ్లెచర్ కొట్టిన ఒక సిక్స్ వైరల్‌గా మారింది. ఇసురు ఉడాన వేసిన బంతిని ఫ్లెచర్ డీప్ మిడ్‌వికెట్ మీదుగా సిక్స్ కొట్టాడు. అయితే ఫ్లెచర్ కనీసం బంతి ఎక్కడ పడిందనేది చూడకుండానే ఆడాడంటే అతని కాన్ఫిడెంట్ ఎంతలా ఉందనేది అర్థం చేసుకోవచ్చు. ఇన్నింగ్స్ 8.4 ఓవర్లో ఇది చోటుచేసుకుంది. చదవండి: 20 ఓవర్లలో 32 పరుగులు.. టీ20 మ్యాచ్‌ను కాస్త టెస్టు మ్యాచ్‌గా కాగా భారీ షాట్లకు పెట్టింది పేరైన ఫ్లెచర్‌ను అందరూ ముద్దుగా స్పైస్మన్ అని పిలుచుకుంటారు.కాగా ఈ మ్యాచ్‌లో ఫ్లెచర్ 28 పరుగులు చేశాడు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన సెంట్ లూసియా కింగ్స్ 20 ఓవర్లో 5 వికెట్ల నష్టానికి 157 పరుగులు చేసింది. టిమ్ డేవిడ్ 43 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచారు. ట్రిన్‌బాగో నైట్‌రైడర్స్ బౌలర్ రామ్‌పాల్ 3 వికెట్లతో చెలరేగాడు. అనంతరం బ్యాటింగ్ చేసిన ట్రిన్‌బాగో 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 152 పరుగులు మాత్రమే చేసి 5 పరుగుల తేడాతో ఓటమిపాలయ్యింది. టిమ్ స్టిఫర్ట్ 16 బంతుల్లో 40 పరుగులు చేసినప్పటికి గెలిపించలేకపోయాడు. చదవండి: రిటైర్మెంట్ ప్రకటించిన టీమిండియా ఆల్‌రౌండర్ NO LOOK SIX! The SPICEMAN Andre Fletcher with the @OmegaXL HIT from match 7. #CPL21 #SLKvTKR #CricketPlayedLouder pic.twitter.com/b3PC3lZwBa — CPL T20 (@CPL) August 29, 2021 -
Chris Gayle: గేల్ సిక్స్ కొడితే మాములుగా ఉంటుందా..
వెస్ట్రన్పార్క్: యునివర్సల్ బాస్ క్రిస్ గేల్ అంటేనే విధ్వంసానికి మారుపేరు. భారీ సిక్సర్లు అలవోకగా బాదే గేల్ ఎన్నోసార్లు తన పవర్హిట్టింగ్ను రుచి చూపించాడు. ఫాంలో ఉన్నాడంటే ప్రత్యర్థులకు చుక్కలు చూపిస్తాడు. తాజాగా కరీబియన్ ప్రీమియర్ లీగ్ 2021లో గేల్ కొట్టిన భారీ సిక్స్‌కు స్కోర్‌కార్డ్ డిస్ప్లే చేసే స్ర్కీన్‌గ్లాస్ పగిలిపోయింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. లీగ్‌లో సెంట్ కిట్స్ నెవిస్ పాట్రియోట్స్కు ప్రాతినిధ్యం వహిస్తున్న గేల్.. బార్బడోస్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఈ ఫీట్‌ను నమోదు చేశాడు. జాసన్ హోల్డర్ వేసిన ఇన్నింగ్స్ ఐదో ఓవర్ ఐదో బంతిని నేరుగా స్ట్రెయిట్ సిక్స్ సంధించాడు. బంతి నేరుగా ఉన్న స్కోరుబోర్డు స్క్రీన్కు తగిలింది. ఇంకేముంది ఇది చూసిన నెటిజన్లు ''గేల్ సిక్స్ కొడితే మాములుగా ఉండదు కదా.. గ్లాస్ పగిలింది'' అంటూ కామెంట్లు చేశారు. ఇక ఈ మ్యాచ్‌లో గేల్ అంతగా ఆకట్టుకోలేకపోయాడు. 9 బంతులెదుర్కొన్న గేల్ ఒక సిక్సర్, ఒక ఫోర్‌తో 12 పరుగులు చేసి పెవిలియన్ చేరాడు. ఈ మ్యాచ్‌లో సెంట్ కిట్స్ విజయాన్ని అందుకుంది. మొదట బ్యాటింగ్ చేసిన సెంట్కిట్స్ 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 175 పరుగులు చేసింది. టాపార్డర్ విఫలమైనప్పటికి లోయర్ ఆర్డర్లో ష్రెఫాన్ రూథర్‌ఫర్డ్ 53 నాటౌట్, డ్వేన్ బ్రావో 47 నాటౌట్‌తో రాణించారు. అనంతరం బ్యాటింగ్ చేసిన బార్బడోస్ రాయల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 154 పరుగులు చేసింది. షై హోప్ 44 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా.. మిగిలినవారు విఫలమయ్యారు. సెంట్ కిట్స్ బౌలింగ్‌లో షెల్డన్ కాట్రెల్, డొమినిక్ డ్రేక్స్ చెరో రెండు వికెట్లు, ఫాబియన్ అలెన్ ఒక వికెట్ తీశాడు. చదవండి: ENG Vs IND: టీమిండియా చెత్త ప్రదర్శన.. కోహ్లి, రోహిత్‌లదే బాధ్యత A SMASHING HIT by the Universe Boss @henrygayle sees him with the @OmegaXL hit from match 2. #CPL21 #BRvSKNP #CricketPlayedLouder #OmegaXL pic.twitter.com/8001dFwNWQ — CPL T20 (@CPL) August 27, 2021 -
నేటి నుంచి ధనాధన్ క్రికెట్ లీగ్ ప్రారంభం.. భారత్‌లోనూ ప్రత్యక్ష ప్రసారం
సెయింట్ కిట్స్: ఐపీఎల్ తరువాత ఆ స్థాయిలో ప్రేక్షకాదరణ కలిగిన కరీబియన్ ప్రిమియర్ లీగ్-2021 నేటి నుంచి ప్రారంభంకానుంది. ఐపీఎల్‌ను తలపించేలా భారీ షాట్లతో అలరించేందుకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న విధ్వంసకర యోధులు సిద్ధంగా ఉన్నారు. విండీస్ విధ్వంసకర వీరులు క్రిస్ గేల్, కీరన్ పోలార్డ్, ఆండ్రీ రసెల్, డ్వేన్ బ్రావో సహా వివిధ దేశాలకు చెందిన చాలా మంది స్టార్ క్రికెటర్లు ఈ లీగ్‌లో ఆడనున్నారు. దీంతో ఐపీఎల్‌కు ముందే ధనాధన్ బ్యాటింగ్ విన్యాసాలు క్రికెట్ అభిమానులకు కనువిందు చేయనున్నాయి. లీగ్‌లో భాగంగా తొలి మ్యాచ్ భారత కాలమానం ప్రకారం ఇవాళ సాయంత్రం 7:30 గంటలకు ప్రారంభం కానుంది. సెయింట్ కిట్స్ వేదికగా జరుగనున్న ఈ మ్యాచ్‌లో గయానా అమెజాన్ వారియర్స్(నికోలస్ పూరన్ జట్టు), ట్రింబాగో నైట్ రైడర్స్(పోలార్డ్ జట్టు) తలపడనున్నాయి. ఇదిలా ఉంటే, సీపీఎల్-2021లో భాగంగా జరిగే మ్యాచ్‌లన్నింటినీ స్టార్ స్పోర్ట్స్, ఫ్యాన్ కోడ్ ప్రత్యక్ష ప్రసారం చేయనున్నాయి. భారత సహా మరో 100 దేశాల్లో ఈ మ్యాచ్‌లు లైవ్ టెలికాస్ట్ కానున్నాయి. అలాగే సామాజిక మాధ్యమాలైన ట్విటర్, ఫేస్బుక్, యుట్యూబ్ ద్వారా కూడా ప్రత్యక్ష ప్రసారాలు చేయనున్నట్లు కరీబియన్ ప్రీమియర్ లీగ్ ముఖ్య కార్యనిర్వహణాధికారి పీట్ రస్సెల్స్ తెలిపారు. కాగా, కరోనా వ్యాప్తి నేపథ్యంలో విండీస్ క్రికెట్ బోర్డు కొన్ని అంక్షలను అమల్లోకి తీసుకొచ్చింది. స్టేడియాల్లోకి 50 శాతం మంది అభిమానులకు మాత్రమే అనుమితిస్తున్నట్లు వెల్లడించింది. సెప్టెంబర్ 15న జరిగే ఫైనల్ మ్యాచ్‌తో ఈ లీగ్ ముగియనుండగా, సరిగ్గా నాలుగు రోజుల తర్వాత(సెప్టెంబర్19) యూఏఈ వేదికగా ఐపీఎల్-2021 మలి దశ మ్యాచ్‌లు ప్రారంభంకానున్నాయి. చదవండి: ఇంగ్లండ్ అభిమానుల ఓవరాక్షన్.. సిరాజ్‌పై బంతితో దాడి -
'డబ్బు కోసం లీగ్‌లు ఆడం.. నా జీవితాన్ని మార్చేసింది'
జోహన్నెస్‌బర్గ్ : ఐపీఎల్ లాంటి లీగ్‌ల ద్వారా నైపుణ్యం ఉన్న ఆటగాళ్లు ఎందరో పరిచయమయ్యారు. రవీంద్ర జడేజా, అజింక్య రహానే లాంటి ఆటగాళ్లు ఐపీఎల్లో ఆడిన తర్వాతే భారత జట్టులో చోటు సంపాదించారు. ఈ నేపథ్యంలో దక్షిణాఫ్రికా బౌలర్ తబ్రెజ్ షంసీ టీ20 లీగ్‌లపై పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. '' ఏ దేశానికి చెందిన ఆటగాడైనా సరే.. డబ్బుల కోసం లీగ్ మాత్రం ఆడడు.. ఆటలో నైపుణ్యం చూపించే అవకాశం ఇలాంటి లీగ్‌ల ద్వారానే వస్తాయి. నా దృష్టిలో సీపీఎల్, ఐపీఎల్, ఇంగ్లీష్ దేశాల్లో ఆడే కౌంటీ క్రికెట్ ద్వారా ఆట మెరుగైందని అనుకుంటున్నా. నేను ఇవాళ దక్షిణాఫ్రికా జాతీయ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్నా అంటే దానికి ఇలాంటి లీగ్‌లే కారణం. ఇలాంటి లీగ్స్‌లో ఆడడం వల్ల వివిధ దేశాలకు చెందిన ఆటగాళ్లతో పరిచయాలు.. వారితో కలిసి ఆడడం వల్ల బౌలింగ్‌లో మరిన్ని మెళుకువలు సాధించే అవకాశాలుంటాయి. నేను ఐపీఎల్ ఆడిన మ్యాచ్‌లు తక్కువే కావొచ్చు.. కానీ కరేబియన్ లీగ్‌లో మాత్రం చాలా మ్యాచ్‌లు ఆడాను.. అది నా జీవితాన్నే మార్చేసింది.'' అని చెప్పుకొచ్చాడు. కాగా షంసీ 2016లో రైజింగ్ పుణే సూపర్‌జెయింట్స్ తరపున ఐపీఎల్లో అరంగేట్రం చేశాడు. ఇక దక్షిణాఫ్రికా తరపున 2 టెస్టుల్లో 6 వికెట్లు, 24 వన్డేల్లో 27 వికెట్లు, 32 టీ20ల్లో 31 వికెట్లు తీశాడు. ఐపీఎల్ 14వ సీజన్ రద్దు అనంతరం లీగ్‌లో పాల్గొన్న విదేశీ ఆటగాళ్లు ఎవరి సొంత దేశాలకు వారు చేరుకునే ప్రయత్నంలో ఉన్నారు. ఇప్పటికే వెస్టిండీస్, దక్షిణాఫ్రికా, ఇంగ్లండ్ ఆటగాళ్లు వారి సొంత దేశానికి చేరుకోగా.. ఆస్ట్రేలియా ఆటగాళ్లు మాత్రం డైరెక్ట్‌గా దేశానికి వెళ్లే అవకాశం లేకపోవడంతో మాల్దీవ్స్‌కు వెళ్లి అక్కడినుంచి ఆసీస్‌కు వెళ్లనున్నారు. ఇక న్యూజిలాండ్‌కు చెందిన ఆటగాళ్లలో కొందరు స్వదేశానికి వెళ్లగా.. భారత్‌తో టెస్టు చాంపియన్‌షిప్ ఫైనల్ ఆడాల్సి ఉన్న నేపథ్యంలో మరికొందరు ఆటగాళ్లు మాత్రం ఇంగ్లండ్‌కు చేరుకున్నారు. చదవండి: ఇలా జరుగుతుందని నాకు ముందే తెలుసు 'ప్రైవేట్ జెట్‌లో వెళ్లి అక్కడి వీధుల్లో శవాలను చూడండి' -
పొలార్డ్ గ్యాంగ్‌పై షారుక్ ప్రశంసలు
న్యూఢిల్లీ: ఈ సీజన్ కరీబియన్ ప్రీమియర్ లీగ్(సీపీఎల్)లో ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోకుండా టైటిల్ గెలుచుకున్న ట్రిన్‌బాగో నైట్‌రైడర్స్ ఆటగాళ్లపై ఫ్రాంచైజీ యాజమాని, బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్ ప్రశంసలు కురిపించాడు. ‘ఈ సీపీఎల్‌ను మనం శాసించాం. సమష్టి కృషితోనే అది సాధ్యమైంది. మాకు మీరు గర్వకారణం. ఈ విజయాన్ని వేడుకగా జరుపుకుందాం. అదే సమయంలో ఎటువంటి జన తాకిడి లేకుండా పార్టీ చేసుకుందాం. ఇది పర్ఫెక్ట్ 12( మొత్తం మ్యాచ్‌లు గెలవడంపై). ఇక ఐపీఎల్‌కు రండి. పొలార్డ్ గ్యాంగ్ ధన్యవాదాలు. ప్రత్యేకంగా డ్వేన్ బ్రేవో, డారెన్ బ్రేవో, పొలార్డ్‌లకు నా అభినందనలు. ఇది నైట్‌రైడర్స్‌కు నాల్గో టైటిల్. లవ్ యూ’ అని షారుక్ ట్వీట్ చేశాడు. నిన్న జరిగిన సీపీఎల్ ఫైనల్ పోరులో ట్రిన్‌బాగో 8 వికెట్ల తేడాతో సెయింట్ లూసియా జూక్స్‌ను చిత్తు చేసింది. ముందుగా బ్యాటింగ్‌కు దిగిన జూక్స్ 19.1 ఓవర్లలో 154 పరుగులకే ఆలౌటైంది. ఆండ్రీ ఫ్లెచర్ (27 బంతుల్లో 39; 4 ఫోర్లు, 2 సిక్సర్లు) టాప్‌స్కోరర్‌గా నిలవగా...కీరన్ పొలార్డ్ (4/30) చక్కటి బౌలింగ్‌తో ప్రత్యర్థిని కట్టడి చేశాడు. అనంతరం నైట్‌రైడర్స్ 18.1 ఓవర్లలో 2 వికెట్లకు 157 పరుగులు సాధించింది. లెండిన్ సిమన్స్ (49 బంతుల్లో 84 నాటౌట్; 8 ఫోర్లు, 4 సిక్సర్లు), డారెన్ బ్రావో (47 బంతుల్లో 58 నాటౌట్; 2 ఫోర్లు, 6 సిక్సర్లు) మెరుపు బ్యాటింగ్‌తో జట్టును గెలిపించారు. డారెన్ బ్రావో ఫోర్ కొట్టడంతో నైట్‌రైడర్స్ టైటిల్‌ను ఖాతాలో వేసుకుంది. ఇది ట్రిన్‌బాగో నైట్‌రైడర్స్‌కు నాల్గో టైటిల్. ఫలితంగా సీపీఎల్ చరిత్రలో అత్యధిక టైటిల్స్ గెలిచిన జట్టుగా నైట్‌రైడర్స్ నిలిచింది. నైట్‌రైడర్స్ జట్టుకు పొలార్డ్ కెప్టెన్‌గా వ్యవహరిస్తుండగా డ్వేన్ బ్రేవో, డారెన్ బ్రావో, సిమ్మన్స్ వంటి స్టార్లు ఆ జట్టులో ఉన్నారు. (చదవండి: ‘ఆ గన్ ప్లేయర్‌తో రైనా స్థానాన్ని పూడుస్తాం’) Ami TKR we rule. Awesome display boys...u make us proud, happy and make us party even without a crowd. Love u team.@TKRiders @54simmo and my fav @DMBravo46 well done @KieronPollard55 & my man @DJBravo47 love you how many now4!!! @Bazmccullum come to IPL lov u — Shah Rukh Khan (@iamsrk) September 10, 2020 -
ఫైనల్లో ట్రిన్‌బాగో నైట్‌రైడర్స్
టరూబా (ట్రినిడాడ్ అండ్ టొబాగో): కరీబియన్ ప్రీమియర్ లీగ్ (సీపీఎల్) టి20 టోర్నీ తాజా సీజన్లో లీగ్ దశను అజేయంగా దాటిన ట్రిన్‌బాగో నైట్‌రైడర్స్ సెమీఫైనల్లోనూ అదే దూకుడును కనబరిచి ఫైనల్‌కు అర్హత సాధించింది. మంగళవారం జరిగిన తొలి సెమీఫైనల్లో నైట్‌రైడర్స్ 9 వికెట్లతో జమైకా తలవాస్‌పై గెలుపొందింది. దాంతో సీపీఎల్ టైటిల్ పోరుకు మూడోసారి అర్హత సాధించింది. బాలీవుడ్ నటులు షారూఖ్ ఖాన్, జూహీ చావ్లాలకు చెందిన ట్రిన్‌బాగో నైట్‌రైడర్స్ జట్టు గతంలో 2017, 2018 సీజన్లో ఫైనల్ చేరి చాంపియన్‌గా నిలిచింది. నైట్‌రైడర్స్‌తో జరిగిన సెమీఫైనల్లో తొలుత జమైకా 20 ఓవర్లలో 7 వికెట్లకు 107 పరుగులు మాత్రమే చేయగలిగింది. అకీల్ హుసీన్ (3/14), క్యారీ పియరీ (2/29) ప్రత్యర్థిని కుదురుకునే ప్రయత్నం చేయలేదు. బోనర్ (42 బంతుల్లో 41; 5 ఫోర్లు), రోవ్మాన్ పొవెల్ (35 బంతుల్లో 33; 1 ఫోరు, 1 సిక్స్) తలవాస్‌ను ఆదుకునే ప్రయత్నం చేశారు. స్వల్ప లక్ష్యంతో బ్యాటింగ్‌కు దిగిన నైట్‌రైడర్స్ 15 ఓవర్లలో వికెట్ నష్టపోయి 111 చేసి గెలుపొందింది. ఓపెనర్ లెండిల్ సిమ్మన్స్ అజేయ అర్ధ సెంచరీ (44 బంతుల్లో 54 నాటౌట్; 6 ఫోర్లు, 2 సిక్స్‌లు)తో రాణించాడు. అతడికి టియాన్ వెబ్‌స్టర్ (43 బంతుల్లో 44 నాటౌట్; 6 ఫోర్లు, 1 సిక్స్) చక్కటి సహకారం అందించాడు. వీరు అభేద్యమైన రెండో వికెట్‌కు 97 పరుగులు జోడించి జట్టుకు విజయాన్ని ఖాయం చేశారు. గయానా అమెజాన్ వారియర్స్, సెయింట్ లూసియా జూక్స్ జట్ల మధ్య జరిగే రెండో సెమీఫైనల్ విజేతతో గురువారం జరిగే ఫైనల్లో నైట్‌రైడర్స్ తలపడుతుంది. -
యూ ఆర్ లైక్ ‘ఫైన్ వైన్’ తాంబే
-
యూ ఆర్ లైక్ ‘ఫైన్ వైన్’ తాంబే
ట్రినిడాడ్: కరీబియన్ ప్రీమియర్ లీగ్(సీపీఎల్)లో భారత మాజీ క్రికెటర్ ప్రవీణ్ తాంబే అద్భుతమైన క్యాచ్ పట్టి ఔరా అనిపించాడు. మరొక నెలలో 49వ ఒడిలోకి అడుగుపెడుతున్న తాంబే.. సీపీఎల్‌లో ట్రిన్‌బాగో నైట్‌రైడర్స్ తరఫున ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. అదే సమయంలో సీపీఎల్ ఆడుతున్న తొలి భారత క్రికెటర్‌గా కూడా తాంబే అరుదైన ఘనతను తన పేరిట లిఖించుకున్నాడు. సీపీఎల్‌లో భాగంగా ఆదివారం సెయింట్ కిట్స్ అండ్ నెవిస్ పాట్రియాట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో నైట్‌రైడర్స్ గెలిచింది. ఫలితంగా ఈ లీగ్‌లో పదికి పది గెలిచి టాప్‌లో నిలిచింది. కాగా, తాంబే కళ్లు చెదిరే క్యాచ్‌తో శభాష్ అనిపించాడు. సెయింట్ కిట్స్ ఇన్నింగ్స్‌లో భాగంగా బెన్ డంక్ ఇచ్చిన క్యాచ్‌ను తాంబే పట్టుకున్న తీరు ప్రేక్షకుల్ని ముగ్థుల్ని చేసింది. ఫావద్ అహ్మద్ బౌలింగ్‌లో రివర్స్ స్వీప్‌ను బెన్ డంక్ ఆడబోగా అది కాస్తా టాప్ ఎడ్జ్ తీసుకుని గాల్లోకి లేచింది. ఆ సమయంలో షార్ట్ థర్డ్ మ్యాన్ ఏరియాకు పరుగెత్తుకొంటూ వచ్చిన తాంబే.. ఆ బంతిని కిందకు పడకుండా ఒడిసి పట్టుకున్నాడు. అదే సమయంలో బౌలింగ్‌లో కూడా తాంబే వికెట్ తీశాడు. వీటికి సంబంధించిన వీడియోను సీపీఎల్ యాజమాన్యం తన ట్వీటర్ అకౌంట్లో పోస్ట్ చేసింది. దీనికి ప్రవీణ్ తాంబే ఏజ్‌ను గుర్తు చేస్తూ క్యాప్షన్ ఇచ్చింది. తాంబే యూ ఆర్ లైక్ ఫైన్ వైన్ అని క్యాప్షన్‌లో ఉంచింది. (చదవండి: వావ్.. పదికి పదికి గెలిచారు) ట్రిన్‌బాగో నైట్‌రైడర్స్ జట్టు లీగ్ దశను అజేయంగా ముగించింది. ఆడిన 10 మ్యాచ్‌ల్లోనూ విజయం సాధించింది. సెయింట్ కిట్స్ తొలుత సెయింట్ కిట్స్ జట్టు 18.2 ఓవర్లలో 77 పరుగులకే కుప్పకూలింది. నైట్‌రైడర్స్ బౌలర్ ఫవాద్ అహ్మద్ 21 పరుగులిచ్చి 4 వికెట్లు తీశాడు. అనంతరం నైట్‌రైడర్స్ జట్టు 11.3 ఓవర్లలో వికెట్ నష్టానికి 78 పరుగులు చేసి గెలుపొందింది. వెబ్‌స్టర్ (33 బంతుల్లో 41 నాటౌట్; 5 ఫోర్లు, సిక్స్) మెరిశాడు. మొత్తం ఆరు జట్లు రౌండ్ రాబిన్ లీగ్ పద్థతిలో తలపడుతున్న ఈ టోర్నీలో టీకేఆర్ జట్టు లీగ్ దశలో 20 పాయింట్లతో టాప్ ర్యాంక్‌లో నిలిచింది. ఐపీఎల్లో బ్యాన్.. వివాదం ఇది ఐపీఎల్ నుంచి తనను బ్యాన్ చేయడంపై వెటరన్ లెగ్ స్పిన్నర్ ప్రవీణ్ తాంబే మూడు నెలల క్రితం వ్యంగ్యాస్త్రాలు సంధించాడు. తనను ఐపీఎల్ నుంచి బ్యాన్ చేసినప్పుడు ఇక మిగతా విదేశీ లీగ్‌లు ఆడకుండా అడ్డుకోవాలనుకోవడం మూర్ఖత్వమంటూ బీసీసీఐపై మండిపడ్డాడు.ఈ క్రమంలోనే సీపీఎల్ ఆడటానికి సిద్ధపడ్డాడు. 48 ఏళ్ల వయసులో ఐపీఎల్ బరిలోకి దిగాలని భావించిన అతనికి కొన్ని నెలల క్రితం బీసీసీఐ బ్రేక్ వేసింది. నిబంధనల ప్రకారం తాంబే ఐపీఎల్ ఆడేందును అనర్హుడని బోర్డు ఆదేశాలు జారీ చేసింది. గత ఏడాది యూఏఈలో జరిగిన టి10 లీగ్‌లో సింధీస్ జట్టు తరఫున తాంబే నాలుగు మ్యాచ్‌లు ఆడటం అతనిపై బ్యాన్‌కు కారణమైంది. బీసీసీఐ నిర్వహించే టోర్నీలో ఆడాలనుకునే వారు విదేశీ లీగ్‌ల్లో ఆడకూడదనే నిబంధన ఉన్నా దానిని తాంబే అతిక్రమించాడు. దాంతో నిషేధానికి గురయ్యాడు. (చదవండి: త్వరలో ఆటకు బెల్ బైబై) -
వావ్.. పదికి పదికి గెలిచారు
టరూబా: కరీబియన్ ప్రీమియర్ లీగ్ (సీపీఎల్) టి20 టోర్నమెంట్లో ట్రిన్‌బాగో నైట్‌రైడర్స్ (టీకేఆర్) జట్టు లీగ్ దశను అజేయంగా ముగించింది. ఆడిన 10 మ్యాచ్‌ల్లోనూ విజయం సాధించింది. సెయింట్ కిట్స్ అండ్ నెవిస్ పేట్రియాట్స్ జట్టుతో ఆదివారం జరిగిన చివరి లీగ్ మ్యాచ్‌లో ట్రిన్‌బాగో నైట్‌రైడర్స్ 9 వికెట్ల తేడాతో గెలిచింది. తొలుత సెయింట్ కిట్స్ జట్టు 18.2 ఓవర్లలో 77 పరుగులకే కుప్పకూలింది. నైట్‌రైడర్స్ బౌలర్ ఫవాద్ అహ్మద్ 21 పరుగులిచ్చి 4 వికెట్లు తీశాడు.(చదవండి: త్వరలో ఆటకు బెల్ బైబై) అనంతరం నైట్‌రైడర్స్ జట్టు 11.3 ఓవర్లలో వికెట్ నష్టానికి 78 పరుగులు చేసి గెలుపొందింది. వెబ్‌స్టర్ (33 బంతుల్లో 41 నాటౌట్; 5 ఫోర్లు, సిక్స్) మెరిశాడు. మొత్తం ఆరు జట్లు రౌండ్ రాబిన్ లీగ్ పద్థతిలో తలపడుతున్న ఈ టోర్నీలో టీకేఆర్ జట్టు లీగ్ దశలో 20 పాయింట్లతో టాప్ ర్యాంక్‌లో నిలిచింది. టీకేఆర్ జట్టుతోపాటు గయానా అమెజాన్ వారియర్స్, సెయింట్ లూయిస్ జూక్స్, జమైకా తలవాస్ జట్లు కూడా సెమీఫైనల్ చేరాయి. సోమవారం విశ్రాంతి దినం. 8వ తేదీన సెమీఫైనల్స్ జరుగుతాయి. ఫైనల్‌ను 10వ తేదీన నిర్వహిస్తారు.(చదవండి: మనకు పనిభారం అధికంగా ఉన్నట్లు అనిపిస్తే..: కోహ్లి) -
చిన్నప్పుడు ఏమైనా స్ప్రింగులు మింగాడా
జమైకా : టీ20 క్రికెట్ అంటేనే ధనాధన్ ఆటలా ఉంటుంది.. బ్యాట్స్‌మన్ వీర బాదుడు, ఫీల్డింగ్ నైపుణ్యాలు, బౌలర్లు బంతితో చేసే మేజిక్‌లు కళ్ల ముందు కదులుతాయి. అటువంటి టీ20 క్రికెట్లో వికెట్ దొరకడమే కష్టం.. ఆరంభం నుంచి బాదుడే పనిగా పెట్టుకునే బ్యాట్స్మెన్లకు బౌలర్లు చుక్కులు చూపించడం కొంచెం కష్టమే. అందుకేనేమో టీ20 ఆటలో బౌలర్‌కు వికెట్ లభించగానే పెద్ద పండగలా చేసుకుంటారు. ఇంకొందరు మాత్రం మరికాస్త ముందుకెళ్లి తమదైన శైలిలో సెలబ్రేషన్ నిర్వహించుకుంటారు. సీపీఎల్ 2020 లీగ్ సందర్భంగా గురువారం గయానా వారియర్స్, బార్బడోస్ ట్రైడెంట్స్ మధ్య జరిగిన మ్యాచ్‌ను ఉదాహరణగా చెప్పొచ్చు. గయానా వారియర్స్ బౌలర్ కెవిన్ సింక్లెయిర్ కీలక ఆటగాడిని ఔట్ చేసా అన్న ఆనందంలో దొమ్మరిగడ్డలు వేస్తూ తన సరదాను తీర్చుకున్నాడు. సాధారణంగా సోమర్‌సాల్ట్స్(దొమ్మరిగడ్డలు) కాళ్లతో వేస్తుంటారు. కానీ సింక్లెయిర్ ఒకసారి మాత్రమే కాళ్లను ఉపయోగించి మిగతా రెండుసార్లు గాలిలోనే పల్టీలు కొట్టాడు. ఇది చూసిన మిగతా ఆటగాళ్ల సింక్లెయిర్ చిన్నప్పుడు ఎమైనా స్రింగులు మింగాడా అనే సందేహం కలిగింది. ప్రస్తుతం సింక్లెయిర్ చేసిన పని సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.(చదవండి : ‘సచిన్‌ను మర్చిపోతారన్నాడు’) బార్బడోస్ బ్యాటింగ్ చేస్తున్న 16 వ ఓవర్లో సింక్లెయిర్ ఈ విన్యాసం చేశాడు. లీగ్‌లో మంచి ఫామ్‌లో ఉన్న మిచెల్ సాంట్నర్.. తన బౌలింగ్‌లో వికెట్‌గా వెనుదిరగడంతోనే ఇలా చేసినట్లు సింక్లెయిర్ చెప్పుకొచ్చాడు. కాగా ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన బార్బడోస్ జట్టు 20 ఓవర్లలో 9వికెట్ల నష్టానికి 89 పరుగులే చేసింది. 90 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన గయానా అమెజాన్ వారియర్స్ 15 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి విజయం సాధించింది. ఈ విజయంతో లీగ్‌లో రెండోస్థానానికి చేరుకున్న గయానా వారియర్స్ సెమీఫైనల్ బెర్త్ ఖరారు చేసుకుంది. ఆడిన 10 మ్యాచ్‌ల్లో కేవలం రెండు విజయాలు మాత్రమే నమోదు చేసిన డిపెండింగ్ చాంపియన్ బార్బడోస్ ట్రైడెంట్స్ పాయింట్ల పట్టికలో చివరి నుంచి రెండో స్థానంలో నిలిచి లీగ్ నుంచి నిష్క్రమించింది. Double?? Treble?? Definitely Double Trouble in the Bubble!! What a celebration! #CPL20 #CricketPLayedLouder pic.twitter.com/3N2oKNAzRy — CPL T20 (@CPL) September 3, 2020 -
హ్యాట్రిక్ సిక్స్‌లతో సెంచరీ..
ట్రినిడాడ్: కరీబియన్ ప్రీమియర్ లీగ్(సీపీఎల్)లో విండీస్ ఆటగాళ్ల బ్యాటింగ్ విధ్వంసం కొనసాగుతోంది. శనివారం ఆటలో ట్రిన్‌బాగో నైట్‌రైడర్స్‌కు కెప్టెన్ కీరోన్ పొలార్డ్ 28 బంతుల్లో 9 సిక్స్‌లు, 2 ఫోర్లతో దుమ్ములేపి 72 పరుగులు సాధిస్తే, ఆదివారం నాటిలో గయానా అమెజాన్ వారియర్స్ వికెట్ కీపర్ నికోలస్ పూరన్ పరుగుల దాహం తీర్చుకున్నాడు. సెయింట్ కిట్స్ అండ్ నెవిస్ పాట్రియోట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆకాశమే హద్దుగా చెలరేగిపోయిన పూరన్.. 45 బంతుల్లో 10 సిక్స్‌లు, 4 ఫోర్లతో శతకం సాధించాడు. ఇందులో హాట్రిక్ సిక్స్‌లు ఉండటం విశేషం. సెయింట్ కిట్స్ బౌలర్ ఇష్ సోథీ వేసిన 18 ఓవర్లో వరుసగా మూడు సిక్స్‌లు కొట్టి మ్యాచ్‌ను ఒంటిచేత్తో గెలిపించాడు. జట్టు విజయానికి మూడు పరుగులు కావాల్సిన తరుణంలో సిక్స్ కొట్టి ఇన్నింగ్స్‌ను ముగించాడు. దాంతో మ్యాచ్ గెలవడమే కాకుండా పూరన్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఇది టీ20ల్లో పూరన్‌కు తొలి శతకం. పూరన్ దాటికి గయానా అమెజాన్ 17.3 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి విజయాన్ని అందుకుంది.(చదవండి: పొలార్డ్ కుమ్మేశాడుగా..) ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన గయానా అమెజాన్ వారియర్స్ ముందుగా సెయింట్ కిట్స్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. దాంతో సెయింట్ కిట్స్ 20 ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి 150 పరుగులు చేసింది. జోషువా డా సిల్వా(59) హాఫ్ సెంచరీ సాధించాడు. అనంతరం బ్యాటింగ్ ఆరంభించిన గయానా అమెజాన్ వారియర్స్ 25 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఆ తరుణంలో బ్యాటింగ్‌కు దిగిన పూరన్ తొలుత ఆచితూచి ఆడాడు. పిచ్‌పై పట్టుదొరికిన తర్వాత బౌండరీలతో విరుచుకుపడ్డాడు. క్రీజ్‌లో కుదురుకున్నాక కనీసం ఓవర్‌కు సిక్స్ కొట్టాలన్న కసితో పూరన్ బ్యాట్ ఝుళిపించాడు. ఈ క్రమంలోనే 18 ఓవర్లో హ్యాట్రిక్ సిక్స్‌లతో సెంచరీ పూర్తి చేసుకోవడమే కాకుండా జట్టుకు ఘన విజయాన్ని అందించాడు. ఈ మ్యాచ్‌లో విజయంలో గయానా ఆరు పాయింట్లతో మూడో స్థానానికి చేరింది.(చదవండి: తొలి బంతికే భయపడ్డాను: కోహ్లి) -
పొలార్డ్ కుమ్మేశాడుగా..
ట్రినిడాడ్: వెస్టిండీస్ ఆల్‌రౌండర్ కీరోన్ పొలార్డ్ వీరోచిత ఇన్నింగ్స్‌తో అదరగొట్టాడు. కరీబియన్ ప్రీమియర్ లీగ్(సీపీఎల్)లో భాగంగా ట్రిన్‌బాగో నైట్‌రైడర్స్‌కు కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న పొలార్డ్ బౌండరీల మోత మోగించి జట్టుకు గొప్ప విజయాన్ని అందించాడు. బార్బోడాస్ ట్రిడెంట్స్‌తో శనివారం జరిగిన మ్యాచ్‌లో పొలార్డ్ 28 బంతుల్లో 9 సిక్సర్లు, 2 ఫోర్లతో 72 పరుగులు చేసి ఓటమి ఖాయమనుకున్న జట్టుకు విజయం సాధించిపెట్టాడు. ఇది కదా కెప్టెన్సీ ఇన్నింగ్స్ అన్న చందంగా సాగిన పొలార్డ్ ఇన్నింగ్స్‌తో నైట్‌రైడర్స్ జట్టు రెండు వికెట్ల తేడాతో గెలిచింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన బార్బోడాస్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్లకు 148 పరుగులు చేసింది. అనంతరం 149 పరుగుల విజయ లక్ష్యంతో బ్యాటింగ్ ఆరంభించిన నైట్‌రైడర్స్ 62 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. (చదవండి: రైనా నిష్క్రమణ.. వాట్సన్ ఆవేదన) మరో 15 పరుగుల వ్యవధిలో లెండి సిమ్మన్స్(32) ఔట్ కావడంతో జట్టు భారం పొలార్డ్‌పై పడింది. తనపై పెట్టుకున్న అంచనాలకు తగ్గట్టే ఏడో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన పొలార్డ్ ఆది నుంచి బార్బోడాస్ బౌలర్లకు చుక్కలు చూపించాడు. కొడితే సిక్స్ అయినా కావాలి.. లేకపోతే ఫోర్ అయినా కావాలి అన్న విధంగా సాగింది పొలార్డ్ ఆట. పరిస్థితులకు తగ్గట్టు బ్యాట్ ఝుళిపిస్తూ నైట్‌రైడర్స్ స్కోరును పరుగులు పెట్టించాడు. 17 ఓవర్లో నాలుగు సిక్సర్లు కొట్టి ఒక్కసారిగా నైట్‌రైడర్స్‌లో ఊపుతెచ్చాడు. యువ ఆఫ్ స్పిన్నర్ హేడెన్ వాల్ష్ బౌలింగ్‌లో సిక్సర్లతో దుమ్మురేపాడు. ఆ తర్వాత ఓవర్లో రెండు బౌండరీలు కొట్టి హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. హాఫ్ సెంచరీని 22 బంతుల్లో పూర్తి చేసుకున్న పొలార్డ్.. చివరి ఓవర్ రెండో బంతికి అనవసరపు పరుగు కోసం యత్నించి రనౌట్ అయ్యాడు. అప్పటికి నైట్‌రైడర్స్ స్కోరు 141. దాంతో నైట్‌రైడర్స్ నాలుగు బంతుల్లో ఎనిమిది పరుగులు చేయాల్సి రావడంతో ఖారీ పీర్ బ్యాట్‌కు పని చెప్పి ఇంకా బంతి ఉండగానే విజయంలో భాగమయ్యాడు. ఆ చివరి ఓవర్ మూడో బంతికి సీల్స్ సింగిల్ తీయగా, నాల్గో బంతిని పీర్ సిక్స్ కొట్టాడు. ఒక ఆఖరి బంతికి పీర్ సింగిల్ తీయడంతో నైట్‌రైడర్స్ గెలుపును అందుకుంది. ఇది నైట్‌రైడర్స్‌కు వరుసగా ఆరో విజయం. ఇప్పటివరకూ ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోని నైట్‌రైడర్స్ పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో కొనసాగుతోంది. -
మాస్క్‌తో సంబరం.. కీమో పాల్ వీడియో వైరల్
క్రికెట్ మైదానంలో ఒక్కో ఆటగాడికి ఒక్కోలా ప్రవర్తిసాడు. ఇతరుల కంటే భిన్నంగా ప్రవర్తించి అభిమానులను ఆకట్టుకుంటారు. ముఖ్యంగా వెస్టిండిస్ బౌలర్లు మైదానంతో తమదైన శైలీని ప్రదర్శించి మీడియాను ఆకర్షిస్తారు. వికెట్లు తీసిన తర్వాత మైదానంలో వారు జరుపుకునే సంబరాలు అభిమానులను ఆకట్టుకుంటాయి. షెల్డన్ కాట్రెల్ మార్చ్ సెల్యూట్ మొదలు.. కేస్రిక్ విలియమ్స్ నోట్‌బుక్ టిక్ వరకు ఒక్కొక్కొరు ఒక్కో స్టైల్లో సంబరాలు జరుపుకుంటారు. ఇప్పుడు వారి సరనన కీమో పాల్ కూడా చేరాడు. కరీబియన్ ప్రీమియర్ లీగ్ (సీపీఎల్)మొదటి మ్యాచ్‌లో వికెట్ తీసిన అనంతరం పాల్ ప్రదర్శించిన తీరు అందరిని ఆకట్టుకుంది. వికెట్ తీసిన ఆనందంలోనూ కోవిడ్ నిబంధనలు పాటించి క్రికెట్ అభిమానులతో పాటు నెటిజన్ల మనసును దోచుకున్నాడు. అసలు ఏం జరిగిదంటే.. క్రికెట్లో బౌలర్ వికెట్ తీయగానే ఫీల్డర్లు అతణ్ని చుట్టుముట్టి కరచాలనం చేస్తారు. ఒక్కోసారి బౌలర్‌ను ఎత్తుకొని చిందులేస్తారు. ఇవన్ని ఒకప్పుడు సర్వసాధారణం కానీ ఇప్పుడు కాదు. ఇది కరోనా కాలం. ఈ సమయంలో మనుషుల మధ్య దూరం ఎంత ఎక్కువగా ఉంటే అంత మంచిది. సామాజిక దూరం పాటిస్తే తన ఆరోగ్యంతో పాటు ఇతరులు ఆరోగ్యం కూడా కాపాడినవాళ్లం అవుతాం. సరిగ్గా ఇదే పని చేశాడు వెస్టిండిస్ ఆటగాడు కిమో పాల్. బుధవారం సెయింట్ కిట్స్ అండ్స్ పేట్రియాట్స్ మరియు గయానా అమెజాన్ వారియర్స్ మధ్య తొలి సీపీఎల్ మ్యాచ్ జరిగిన విషయం తెలిసిందే. గయానా జట్టు తరుపున బౌలింగ్ చేసిన కీమో పాల్.. ఏడో ఓవర్లో కీలక వికెట్ తీశాడు. ఈ సందర్భంగా తోటి ఆటగాళ్లు పాల్‌ను అభినందించేందుకు వచ్చారు. అయితే వారిని దగ్గరకు రావద్దని సైగలు చేస్తూ మాస్క్ ధరించిన దూరంగా వెళ్లాడు. కరోనా మహమ్మారిని దృష్టిలో ఉంచుకుని ఆయన ఈ రకంగా ప్రవర్తించాడు. ఈ సంఘటన యొక్క వీడియోను సీసీఎల్ తన ట్విట్టర్ హ్యాండిల్లో షేర్ చేసింది, అక్కడ అభిమానులు సురక్షితంగా ఉండమని కోరింది. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతోంది. (చదవండి : ధోని కంటతడి పెట్టాడు!) కాగా, బుధవారం జరిగిన సీపీఎల్ తొలి మ్యాచ్‌లో గయానా అమెజాన్ వారియర్స్ బోణీ కొట్టింది. సెయింట్ కిట్స్ అండ్స్ పేట్రియాట్స్ జట్టుతో జరిగిన మ్యాచ్‌లో రెయాడ్ ఎమ్రిట్ నేతృత్వంలోని గయానా మూడు వికెట్ల తేడాతో గెలిచింది. విండీస్ స్టార్ ఆటగాళ్లు షిమ్రాన్ హెట్‌మైర్ హాఫ్ సెంచరీ (71; 44 బంతుల్లో 8 ఫోర్లు, 3 సిక్స్‌లు) బాది.. కీమో పాల్ నాలుగు వికెట్లు తీసి గయానా విజయంలో కీలక పాత్ర పోషించారు. MASK ON! Keemo knows the drill! #StaySafe #CPL20 pic.twitter.com/pkABEf472p — CPL T20 (@CPL) August 19, 2020 -
కరీబియన్ లీగ్‌కు వేళాయె
పోర్ట్ ఆఫ్ స్పెయిన్: క్రికెట్ అభిమానులకు నేటి నుంచి ధనాధన్ వినోదం లభించనుంది. ట్రినిడాడ్ అండ్ టొబాగో వేదికగా కరీబియన్ ప్రీమియర్ లీగ్ (సీపీఎల్) టి20 టోర్నమెంట్ నేడు ప్రారంభంకానుంది. కరోనా వైరస్ నేపథ్యంలో ఈసారి ఈ టోర్నీలోని మొత్తం 33 మ్యాచ్‌లను పోర్ట్ ఆఫ్ స్పెయిన్‌లోని బ్రియాన్ లారా స్టేడియం, క్వీన్స్ పార్క్ ఓవల్ మైదానాల్లో మాత్రమే నిర్వహిస్తారు. మొత్తం ఆరు జట్లు (ట్రిన్‌బాగో నైట్‌రైడర్స్, గయానా అమెజాన్ వారియర్స్, బార్బడోస్ ట్రైడెంట్స్, సెయింట్ కిట్స్ అండ్ నెవిస్ పేట్రియాట్స్, జమైకా తలవాస్, సెయింట్ లూసియా జూక్స్) లీగ్ కమ్ నాకౌట్ పద్ధతిలో తలపడనున్నాయి. లీగ్ దశ ముగిశాక టాప్–4లో నిలిచిన జట్లు సెమీఫైనల్లో ‘ఢీ’కొంటాయి. సెప్టెంబర్ 10న ఫైనల్‌తో ఈ టోర్నీ ముగుస్తుంది. భారత కాలమానం ప్రకారం రాత్రి 7 గంటల 30 నిమిషాలకు మొదలయ్యే లీగ్ తొలి మ్యాచ్‌లో ట్రిన్‌బాగో నైట్‌రైడర్స్‌తో గయానా అమెజాన్ వారియర్స్ జట్టు ఆడుతుంది. ముంబైకి చెందిన 48 ఏళ్ల ప్రవీణ్ తాంబే ట్రిన్‌బాగో నైట్‌రైడర్స్ తరఫున బరిలోకి దిగనున్నాడు. ఇదే జట్టు తరఫున డ్వేన్ బ్రావో, డారెన్ బ్రావో, కీరన్ పొలార్డ్, సునీల్ నరైన్, లెండిల్ సిమన్స్ (వెస్టిండీస్), కొలిన్ మున్రో (న్యూజిలాండ్), సికందర్ రజా (జింబాబ్వే) తదితరులు ఆడనున్నారు. ఇతర స్టార్ క్రికెటర్లు క్రిస్ లిన్ (ఆస్ట్రేలియా), రషీద్ ఖాన్, మొహమ్మద్ నబీ (అఫ్గానిస్తాన్), రాస్ టేలర్, సాన్ట్నెర్ (న్యూజిలాండ్) కూడా ఈ టోర్నీలో ఆడనున్నారు. సీపీఎల్ టి20 టోర్నీ మ్యాచ్‌లను స్టార్ స్పోర్ట్స్–1, స్టార్ స్పోర్ట్స్–2 చానెల్స్ ప్రత్యక్ష ప్రసారం చేయనున్నాయి. ఇక్కడ చదవండి: 'పాక్‌లో క్రికెట్ ఆడేందుకు ఇష్టపడతా' ‘ధోనితో కలిసి పనిచేయడం గొప్ప గౌరవం’ వ్యాపారులకు ధోని పాఠాలివే.. -
సీపీఎల్‌కు ఓకే
పోర్ట్ ఆఫ్ స్పెయిన్: అతి త్వరలోనే క్రికెట్ అభిమానులకు ధనాధన్ క్రికెట్ వినోదం లభించనుంది. కరోనా మహమ్మారి కారణంగా దాదాపు నాలుగు నెలలుగా క్రికెట్ కార్యకలాపాలు నిలిచిపోగా... ఈనెల 8న ఇంగ్లండ్, వెస్టిండీస్ తొలి టెస్టుతో అంతర్జాతీయ క్రికెట్ పునఃప్రారంభమైంది. తాజాగా టి20 ఫార్మాట్లో జరిగే కరీబియన్ ప్రీమియర్ లీగ్ (సీపీఎల్)కు కూడా లైన్ క్లియర్ అయ్యింది. ప్రేక్షకులు లేకుండా ఈ లీగ్‌ను నిర్వహించుకోవచ్చని ట్రినిడాడ్ అండ్ టొబాగో ప్రభుత్వం నిర్వాహకులకు అనుమతి ఇచ్చింది. దాంతో సీపీఎల్ ఏడో సీజన్ ఆగస్టు 18 నుంచి సెప్టెంబర్ 10 వరకు ట్రినిడాడ్ అండ్ టొబాగోలోని రెండు వేదికల్లో ప్రేక్షకులకు ప్రవేశం లేకుండా జరగనుంది. మొత్తం ఆరు జట్లు (బార్బడోస్ ట్రైడెంట్స్, గయానా అమెజాన్ వారియర్స్, జమైకా తలవాస్, సెయింట్ కిట్స్ అండ్ నెవిస్ పేట్రియాట్స్, సెయింట్ లూసియా జూక్స్, ట్రిన్‌బాగో నైట్‌రైడర్స్) ఈ లీగ్‌లో టైటిల్ కోసం తలపడనున్నాయి. రెండు సెమీఫైనల్స్, ఫైనల్‌తో కలుపుకొని మొత్తం 33 మ్యాచ్‌లు జరుగుతాయి. సీపీఎల్ నిర్వాహకులకు, ట్రినిడాడ్ ప్రభుత్వానికి జరిగిన ఒప్పందంలో భాగంగా మొత్తం ఆరు జట్లకు చెందిన ఆటగాళ్లు, సిబ్బంది టోర్నీకి బయలుదేరేముందు 14 రోజులు... ట్రినిడాడ్‌లో అడుగుపెట్టాక 14 రోజులు స్వీయ నిర్బంధంలో ఉండాలి. ట్రినిడాడ్ చేరుకున్న వెంటనే అందరికీ కోవిడ్–19 పరీక్షలు చేస్తారు. ఆ తర్వాత 7 రోజులకు, 14 రోజులకు మళ్లీ కోవిడ్–19 పరీక్షలు నిర్వహిస్తారు. ఆరు జట్లూ ట్రినిడాడ్లోనే ఒకే హోటల్లో బస చేస్తాయి. టోర్నీకి ముందుగానీ, టోర్నీ మధ్యలోగానీ ఎవరికైనా కోవిడ్–19 పాజిటివ్ వస్తే వారు స్వీయ నిర్బంధంలోకి వెళ్లాల్సి ఉంటుంది. కరోనా వైరస్ కారణంగా మార్చిలోనే ట్రినిడాడ్ అండ్ టొబాగో ప్రభుత్వం తమ దేశ సరిహద్దులను మూసివేసింది. సీపీఎల్ కారణంగా బయటి వారిని తొలిసారి దేశంలోకి అనుమతి ఇవ్వనుంది. ట్రినిడాడ్‌లో ఇప్పటివరకు కరోనా తీవ్రత తక్కువగానే ఉంది. జూలై 9 వరకు ట్రినిడాడ్‌లో కేవలం 133 కోవిడ్–19 పాజిటివ్ కేసులు రాగా, ఎనిమిది మంది మాత్రమే మృతి చెందారు. -
ఆ రికార్డు సృష్టించనున్న భారత క్రికెటర్!
ముంబై: కరేబియన్ ప్రీమియర్ లీగ్‌లో ఆడనున్న మొదటి భారత క్రికెటర్‌గా ప్రవీణ్ తాంబే రికార్డు సృష్టించనున్నాడు. విండీస్ పరిమిత ఓవర్ల కెప్టెన్ కీరోన్ పొలార్డ్ నేతృత్వంలోని టిన్‌బాగో నైట్ రైడర్స్ జట్టు తరఫున తాంబే ఆడనున్నాడు. భారత వెటరన్ లెగ్ స్పిన్నర్ ప్రవీణ్ తాంబే క్రికెట్ ప్రియులందరికి తెలిసిన వ్యక్తే. 41 ఏళ్ల వయసులో ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో అడుగు పెట్టి అందరినీ ఆశ్చర్యపడేలా చేశాడు. ఇప్పడు ప్రవీణ్ తాంబే మరోసారి రికార్డు సృష్టించబోతున్నాడు. 48 ఏళ్ల తాంబే కరీబియన్ ప్రీమియర్ లీగ్ (సీపీఎల్)కు ఎంపికయ్యాడు. కరేబియన్ ప్రీమియర్ లీగ్‌లో ఆడనున్న మొదటి భారత క్రికెటర్‌గా ప్రవీణ్ తాంబే రికార్డు సృష్టించనున్నాడు. టిన్‌బాగో నైట్ రైడర్స్ జట్టు తరఫున తాంబే ఆడనున్నాడు. సోమవారం జరిగిన సీపీఎల్ ఆటగాళ్ల వేలంలో ప్రవీణ్ తాండేను టిన్‌బాగో నైట్ రైడర్స్ దక్కించుకున్నది. అయితే తాంబే సీపీఎల్‌లో ఆడాలంటే బీసీసీఐ అనుమతి ఉండాలి. (చదవండి: ఐపీఎల్లో బ్యాన్ చేశారు కదా.. ఇంకా ఏంటి?) కానీ ఇండియన్ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించకపోతే బీసీసీఐ నిబంధనల ప్రకారం తాంబే సీపీఎల్ ఆడటానికి అవకాశం ఇవ్వదు. బీసీసీఐ నియమాల ప్రకారం ఇండియన్ ప్రీమియర్ లీగ్‌తో సహా అన్ని రకాల దేశీయ క్రికెట్ల నుండి రిటైర్మెంట్ ప్రకటించిన తరువాతే ఇతర దేశాలలో జరిగే లీగ్‌లలో ఆడాలనుకునే ఆటగాడికి నో ఆబ్జెక్షన్ సర్టిఫికేట్ లభిస్తుంది. అంతకముందు కెనడాలో జరిగిన గ్లోబల్ టీ 20 లీగ్ ఆడటానికి వెళ్లడానికి యువరాజ్ సింగ్ కూడా అదే చేశాడు. అయితే తాంబే రిటైర్మెంట్కు సంబంధించి ముంబై క్రికెట్ అసోసియేషన్ క్లారిటీనిచ్చింది. ప్రస్తుతం అతను రిటైర్డ్ అయ్యాడు అని తెలిపింది. ఈ విషయం గురించి ముంబై క్రికెట్ అసోసియేషన్ మాట్లాడుతూ, ప్రస్తుతం తాండే రిటైర్డ్ అయ్యారు. మొదట ఆయన రిటైర్మెంట్ ప్రకటించారు, కానీ తరువాత దానిని వెనక్కి తీసుకున్నారు. ఇప్పుడు మళ్లీ రిటైర్డ్ అయ్యారు. దీనికి సంబంధించి ఆయన ఆయన ముంబై క్రికెట్ అసోసియేషన్‌కు ఈ మెయిల్ ద్వారా సందేశం పంపించారు. (ఐపీఎల్ 2020: అతడు ఔట్) ఇక తాంబే క్రికెట్ ఆట విషయానికి వస్తే... 2013-16 మధ్య కాలంలో ప్రవీణ్ తాంబే 33 ఐపీఎల్ మ్యాచ్‌లు ఆడాడు. 28 వికెట్లు పడగొట్టాడు. 2014లో రాజస్థాన్ రాయల్స్ తరపున బరిలోకి దిగి 15 వికెట్లు తీసి అందరి దృష్టిని ఆకర్షించాడు. గుజరాత్ లయన్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ టీమ్ తరపున కూడా ఆడాడు. ఇక ప్రవీణ్తాంబే సీపీఎల్ విషయానికి వస్తే కరోనా వైరస్ మహమ్మారి కారణంగా వాయిదా పడ్డ సీపీఎల్ కొత్త సీజన్.. ఆగస్టు 18 నుంచి సెప్టెంబరు 10 వరకు షెడ్యూల్ చేశారు. భారత ప్రభుత్వం జూలై 30 వరకు అంతర్జాతీయ విమాన సర్వీసులను రద్దు చేసిన సంగతి తెలిసిందే. ఒకవేళ దానిని పొడిగిస్తే తాంబే ఆశల మీద నీళ్లు చల్లినట్లే అవుతుంది. -
ఐపీఎల్లో బ్యాన్ చేశారు కదా.. ఇంకా ఏంటి?
న్యూఢిల్లీ: ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) నుంచి తనను బ్యాన్ చేయడంపై వెటరన్ లెగ్ స్పిన్నర్ ప్రవీణ్ తాంబే వ్యంగ్యాస్త్రాలు సంధించాడు. తనను ఐపీఎల్ నుంచి బ్యాన్ చేసినప్పుడు ఇక మిగతా విదేశీ లీగ్‌లు ఆడకుండా అడ్డుకోవాలనుకోవడం మూర్ఖత్వమంటూ బీసీసీఐపై మండిపడ్డాడు. ప్రస్తుతం తాను ఫిట్‌గా ఉన్న క్రమంలో ఆడటానికి ఎటువంటి ఇబ్బందేమీ లేదన్నాడు. ఇక్కడ తన వయసు ప్రధానం కాదని తాంబే స్పష్టం చేశాడు. ‘నన్ను ఐపీఎల్ నుంచి నిషేధించారు. మరి ఇంకా ఏమిటి. ఐపీఎల్ నుంచి బ్యాన్ చేసినప్పుడు విదేశీ లీగ్‌లు ఆడటానికి అర్హత ఉంది కదా. ఆ క్రమంలోనే కరీబియన్ ప్రీమియర్ లీగ్(సీపీఎల్)లో టీకేఆర్ తరఫున ఆడుతున్నాను. బీసీసీఐ ఎలాగూ అది నిర్వహించే టోర్నీల్లో ఆడనివ్వడం లేదు. అటువంటప్పుడు విదేశీ టోర్నీలు ఎందుకు ఆడకూడదు’ అని ఒక జాతీయ పత్రికతో మాట్లాడుతూ తనకు ఎదురైన ప్రశ్నకు సమాధానంలో ఐపీఎల్ నుంచి బ్యాన్ కావడాన్ని ప్రస్తావించాడు. ‘ప్రవీణ్ తాంబే దేశవాళీ మ్యాచ్‌ల్లో ఒక యాక్టివ్ ప్లేయర్. అటువంటప్పుడు విదేశీ లీగ్‌లు ఆడకూడదు’ అని ఒక బీసీసీఐ అధికారి కౌంటర్‌కు సమాధానంగా తాంబే పై విధంగా స్పందించాడు. (కరోనాతో మాజీ క్రికెటర్ మృతి) 48 ఏళ్ల వయసులో ఐపీఎల్ బరిలోకి దిగాలని భావించిన అతనికి కొన్ని నెలల క్రితం బీసీసీఐ బ్రేక్ వేసింది. నిబంధనల ప్రకారం తాంబే ఐపీఎల్ ఆడేందును అనర్హుడని బోర్డు ఆదేశాలు జారీ చేసింది. గత ఏడాది యూఏఈలో జరిగిన టి10 లీగ్‌లో సింధీస్ జట్టు తరఫున తాంబే నాలుగు మ్యాచ్‌లు ఆడటం అతనిపై బ్యాన్‌కు కారణమైంది. బీసీసీఐ నిర్వహించే టోర్నీలో ఆడాలనుకునే వారు విదేశీ లీగ్‌ల్లో ఆడకూడదనే నిబంధన ఉన్నా దానిని తాంబే అతిక్రమించాడు. దాంతో నిషేధానికి గురయ్యాడు. కాగా, ఐపీఎల్ వేలంలో అమ్ముడుపోయిన పెద్ద వయస్కుడిగా తాంబే నిలిచిన సంగతి తెలిసిందే. ఐపీఎల్ 2020 వేలంలో కోల్‌కతా నైట్‌రైడర్స్ రూ. 20 లక్షల కనీస ధరకు అతడిని దక్కించుకుంది. 2013-16 మధ్య కాలంలో 33 ఐపీఎల్ మ్యాచ్‌లు ఆడిన తాంబే 28 వికెట్లు పడగొట్టాడు. 2014లో రాజస్థాన్ రాయల్స్ తరపున బరిలోకి దిగి 15 వికెట్లు దక్కించుకుని అందరి దృష్టిని ఆకర్షించాడు. గుజరాత్ లయన్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ టీమ్ తరపున కూడా ఆడాడు. (పిన్న వయసులోనే ఎలైట్ ప్యానల్లో చోటు) -
గేల్.. ఇక నీ కామెంట్స్ చాలు..!
ఆంటిగ్వా: కరీబియన్ ప్రీమియర్ లీగ్(సీపీఎల్)లో జమైకా తలవాస్ జట్టు నుంచి తనను తొలగించడానికి ఆ జట్టు కోచ్ రామ్ నరేశ్ శర్వాణ్ కారణమంటూ క్రిస్ గేల్ ధ్వజమెత్తిన సంగతి తెలిసిందే. ఆ జట్టు తనను కొనసాగించకపోవడానికి రామ్ నరేశ్ పాత్ర కీలకమని,అతను కరోనా కంటే ప్రమాదమని గేల్ తీవ్ర స్థాయిలో మండిపడ్డాడు. పాము కంటే శర్వాణ్ చాలా విషపూరితమన్నాడు. వెన్నుపొటు పొడవడంలో రామ్ నరేశ్ సిద్ధ హస్తుడని విమర్శించాడు. ఈ వాఖ్యలను జమైకా తలవాస్ ఖండించింది. ఇక గేల్ తన వ్యాఖ్యలకు ఫుల్స్టాప్ పెడితే మంచిదని హెచ్చరించింది. ఒక ఆటగాడ్ని రీటైన్ చేసుకోవాలా.. వద్దా అనే విషయంలో ఫ్రాంచైజీతో పాటు సెలక్షన్ కమిటీ పాత్ర కూడా ఉంటుందనే విషయాన్ని గేల్ గ్రహించాలని చురకలంటించింది. ఇక్కడ గేల్‌ను తప్పించడంలో రామ్ నరేశ్ శర్వాణ్ పాత్ర ఏమీలేదని స్పష్టం చేసింది. బహిరంగ ప్రకటనలు చేసేముందు కాస్త సంయమనం పాటిస్తే మంచిదని గేల్‌కు హితబోధ చేసింది. ('ఇంత చెత్త ఫ్రాంచైజీని నేనెప్పుడు చూడలేదు') ‘ గేల్ కాస్త తగ్గి మాట్లాడితే మంచిది. నిన్ను తీసివేయడానిక సవాలక్ష కారణాలున్నాయి. బహిరంగ విమర్శలు సరికాదు. నిన్నుతప్పించడంలో శర్వాణ్ పాత్ర ఏమీ లేదు. ఇక్కడ సెలక్షన్ కమిటీ ఉంది.. ఫ్రాంచైజీ కూడా ఉంది. నిన్నుఫ్రాంచైజీ కొనసాగించకూడదని నిర్ణయించుకుంది. దాంతో కొనసాగించలేదు. అంతే కానీ ఏ ఒక్కరూ నిన్ను తీసివేయడానికి కారణం కాదు’ అని తలవాస్ ఒక ప్రకటనలో పేర్కొంది.2019లో జమైకా తలవాస్ జట్టులోకి తిరిగి వచ్చిన గేల్.. అంతకుముందు 2013 నుంచి 2016 వరకూ ఆ జట్టుకు ప్రాతినిథ్యం వహించాడు. గతేడాది గేల్ తిరిగి జమైకాకు వచ్చిన క్రమంలో మూడేళ్ల పాటు కాంటాక్ట్ కుదుర్చుకున్నాడు. తన సీపీఎల్ కెరీర్‌ను హోమ్ టౌన్ ఫ్రాంచైజీతోనే ముగించాలనే ఉద్దేశంతోనే జమైకాకు ఆడుతున్నానని గేల్ తెలిపాడు. అయితే తాజా సీజన్లో గేల్‌ను జమైకా తలవాస్ వదిలేసుకుంది. అతన్ని తిరిగి రీటైన్ చేయలేదు.దాంతో సెయింట్ లూసియా జట్టుతో గేల్ ఒప్పందం చేసుకున్నాడు. గతేడాది జమైకాకు తిరిగి వచ్చిన క్రమంలో గేల్ సెంచరీతో మెరిశాడు. కానీ తర్వాత విఫలమైన గేల్ పెద్దగా పరుగులు చేయలేదు. కేవలం 10 ఇన్నింగ్స్‌ల్లో 243 పరుగులు చేయడంతో సదరు ఫ్రాంచైజీ గేల్‌తో ఉపయోగం లేదనుకునే అతన్ని విడిచిపెట్టింది. (రాస్ టేలర్‌కు ‘టాప్’ అవార్డు) -
టీ20 చరిత్రలో నాల్గో బ్యాట్స్‌మన్‌గా..
గయానా: పాకిస్తాన్ ఆల్ రౌండర్ షోయబ్ మాలిక్ మరో అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు. కరీబియన్ ప్రీమియర్ లీగ్(సీపీఎల్)లో గయానా అమెజాన్ వారియర్స్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్న మాలిక్ ఆ జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నాడు. ఆదివారం జరిగిన క్వాలిఫయర్-1లో అమెజాన్ వారియర్స్.. బార్బోడాస్ ట్రిడెంట్స్పై గెలిచి ఫైనల్‌కు చేరింది. బ్రాండన్ కింగ్(132 నాటౌట్72 బంతుల్లో 10 ఫోర్లు, 11 సిక్సర్లు) శుభారంభాన్ని ఇవ్వగా, ఆ తర్వాత చంద్రపాల్ మహరాజ్(27) సమయోచితంగా ఆడాడు. ఆపై మాలిక్ 19 బంతుల్లో 3 సిక్సర్ల సాయంతో 32 పరుగులు చేయడంతో అమెజాన్ వారియర్స్ 20 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 218 పరుగులు చేసింది. ఇక బార్బోడాస్ 188 పరుగులకే పరిమితం కావడంతో ఓటమి పాలైంది. కాగా, నిన్నటి మ్యాచ్ ద్వారా షోయబ్ మాలిక్ తొమ్మిది వేల టీ20 పరుగుల్ని పూర్తి చేసుకున్నాడు. ప్రస్తుతం 9,014 పరుగులతో ఉన్న మాలిక్.. ప్రపంచ క్రికెట్లో ఈ ఘనత సాధించిన నాల్గో బ్యాట్స్‌మన్‌గా నిలిచాడు. అంతకుముందు తొమ్మిదివేల పరుగుల్ని పూర్తి చేసుకున్న జాబితాలో క్రిస్ గేల్(13,051) అగ్రస్థానంలో ఉండగా మెకల్లమ్(9,922) రెండో స్థానంలో ఉన్నాడు. ఇక పొలార్డ్(9,757) పరుగులు సాధించాడు. ఆ తర్వాత స్థానంలో మాలిక్ నిలిచాడు. -
15 పరుగులు.. 7 వికెట్లు!
గయనా: కరీబియన్ ప్రీమియర్ లీగ్(సీపీఎల్)లో గయానా అమెజాన్ వారియర్స్ మరో అద్భుత విజయాన్ని సాధించింది. పాయింట్ల పట్టికలో టాపర్‌గా ఉన్న అమెజాన్ వారియర్స్.. గురువారం జమైకా తల్హాస్‌తో జరిగిన మ్యాచ్‌లో 77 పరుగుల తేడాతో గెలుపును అందుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన అమెజాన్ వారియర్స్ 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 156 పరుగులు చేసింది. అమెజాన్ వారియర్స్ కెప్టెన్ షోయబ్ మాలిక్(73 నాటౌట్; 45 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్సర్లు) ధాటిగా ఆడగా, రూథర్‌ఫర్డ్(45; 43 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్స్) సమయోచితంగా ఆడాడు. దాంతో అమెజాన్ గౌరవప్రదమైన స్కోరును సాధించింది. అనంతరం బ్యాటింగ్ ఆరంభించిన జమైకా జట్టు 16. 3 ఓవర్లలో79 పరుగులకే కుప్పకూలింది. జమైకా కెప్టెన్ క్రిస్ గేల్ గోల్డెన్ డకౌట్ అయ్యాడు. దక్షిణాఫ్రికా సంతతికి చెందిన ఆసీస్ బౌలర్ క్రిస్ గ్రీన్ బౌలింగ్‌లో గేల్ తాను ఆడిన తొలి బంతికే బౌల్డ్ అయ్యాడు. అటు తర్వాత జమైకా పతనం అలానే కొనసాగుతూ వచ్చింది. గ్లెన్ ఫిలిప్స్(21), లిటాన్ దాస్(21), ట్రెవెన్ గ్రిఫిత్(11)లు మాత్రమే రెండంకెల స్కోరును దాటగా మిగతా వారు సింగిల్ డిజిట్‌కే పరిమితమయ్యారు. 15 పరుగుల వ్యవధిలో 7 వికెట్లను కోల్పోవడంతో జమైకా ఘోర ఓటమి పాలైంది. వారియర్స్ బౌలర్లలో తాహీర్ మూడు వికెట్లు సాధించగా, క్వియాస్ అహ్మద్, కీమో పాల్ తలో రెండు వికెట్లు పడగొట్టారు.క్రిస్ గ్రీన్, హెమ్రాజ్, షోయబ్ మాలిక్‌లు వికెట చొప్పున తీశారు. -
రికార్డు ఫిఫ్టీతో చెలరేగిపోయాడు..!
బ్రిడ్జిటౌన్: దక్షిణాఫ్రికా క్రికెటర్ జేపీ డుమినీ చెలరేగి పోయాడు. కరీబియన్ ప్రీమియర్ లీగ్(సీపీఎల్)లో భాగంగా బార్బోడాస్ ట్రిడెంట్స్ తరఫున ఆడుతున్న డుమనీ.. గురువారం ట్రిన్‌బాగ్ నైట్‌రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో విశ్వరూపం ప్రదర్శించాడు. 20 బంతుల్లో 4 ఫోర్లు, 7 సిక్సర్లతో 65 పరుగులు చేశాడు. అయితే హాఫ్ సెంచరీని 15 బంతుల్లోనే సాధించడం ఇక్కడ విశేషం. సీపీఎల్‌లో ఇదే ఫాస్టెస్ట్ ఫిఫ్టీగా నమోదైంది. తొలి మూడు పరుగులు చేయడానికి ఐదు బంతులు ఆడిన డుమినీ.. ఆ తర్వాత మెరుపులు మెరిపించాడు. మిగతా 47 పరుగుల్ని మరో 10 బంతుల్లో సాధించి బ్యాటింగ్‌లో సత్తాచాటాడు. ప్రధానంగా సిక్సర్ల మోత మోగించి సీపీఎల్ ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ రికార్డును తన పేరిట లిఖించున్నాడు. అంతకుముందు ఈ రికార్డు ఎవిన్ లూయిస్ సాధించగా, దాన్ని డుమినీ బ్రేక్ చేశాడు. ఈనెల ఆరంభంలో లూయిస్ 17 బంతుల్లో హాఫ్ సెంచరీ సాధించిన సంగతి తెలిసిందే. ఓవరాల్‌గా టీ20ల్లో ఫాస్టెస్ట్ ఫిఫ్టీ రికార్డు భారత మాజీ ఆటగాడు యువరాజ్ సింగ్ పేరిట ఉంది. 2007 టీ20 వరల్డ్‌కప్‌లో ఇంగ్లండ్‌పై యువరాజ్ సింగ్ 12 బంతుల్లో అర్థ శతకం సాధించాడు. తాజా మ్యాచ్‌లో డుమినీకి జతగా చార్లెస్(58), కార్టర్(51)లు రాణించడంతో బార్బోడాస్ 20 ఓవర్లలో 192 పరుగులు చేసింది. ఆ తర్వాత 193 పరుగుల టార్గెట్‌తో ఇన్నింగ్స్ ఆరంభించిన నైట్‌రైడర్స్ 17.4 ఓవర్లలో 129 పరుగులకే ఆలౌటైంది. దాంతో బార్బోడాస్ 63 పరుగుల తేడాతో భారీ విజయం సాధించింది. హేడన్ వాల్ష్ ఐదు వికెట్లతో నైట్‌రైడర్స్ పతనాన్ని శాసించాడు. అతనికి జతగా డుమినీ రెండు వికెట్లు సాధించాడు. నైట్‌రైడర్స్ ఇన్నింగ్స్‌లో డారెన్ బ్రేవో(28)దే అత్యధిక వ్యక్తిగత స్కోరు. -
క్రికెట్ ‘బాహుబలి’ ఫన్నీ రనౌట్
సెయింట్ లూసియా: ప్రపంచ క్రికెట్లో అత్యంత బరువున్న ఆటగాడిగా వెస్టిండీస్ ఆటగాడు రకీమ్ కార్న్‌వాల్ రికార్డు సాధించిన సంగతి తెలిసిందే. ఇటీవల భారత్‌తో జరిగిన రెండో టెస్టు ద్వారా అంతర్జాతీయ క్రికెట్లో అరంగేట్రం చేసిన రకీమ్ ఆరు అడుగులకు పైగా ఉండగా, 140 కేజీలకు పైగా బరువు ఉన్నాడు. దాంతో అత్యంత బరువు కల్గిన క్రికెటర్‌గా రికార్డు సాధించాడు. ఇప్పటివరకూ ఆసీస్ మాజీ క్రికెటర్ వార్విక్ ఆర్మ్‌స్ట్రాంగ్ పేరిట(133 కేజీల నుంచి-139 కేజీల వరకూ) ఉండగా, దాన్ని కార్న్‌వాల్ బ్రేక్ చేశాడు. ఇదిలా ఉంచితే, కరీబియర్ ప్రీమియర్ లీగ్(సీపీఎల్)లో కార్న్‌వాల్ మరోసారి వార్తల్లోకి ఎక్కాడు. అంత బరువు ఉన్న ఆటగాడు పరుగు పెట్టడమే కష్టం అనే విమర్శకుల నోటికి పని చెప్పాడు. సెయింట్ లూసియా జౌక్స్ తరఫున ఆడుతున్న కార్న్‌వాల్.. గయానా అమెజాన్ వారియర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రనౌట్ అయ్యాడు. సాధారణంగా పరుగు కోసం యత్నించే సమయంలో క్రీజ్‌లోకి రాకపోతే సదరు బ్యాట్స్‌మన్ రనౌట్ అవుతాడు. మరీ భారీ కాయుడు కార్న్‌వాల్ మాత్రం క్రీజ్‌లోకి వచ్చినా వంగలేక బ్యాట్‌ను పెట్టలేకపోయాడు. దాంతో పెవిలియన్‌కు చేరాల్సి వచ్చింది. కేవలం 12 బంతుల్లో ఆరు పరుగులు మాత్రమే చేసిన కార్న్‌వాల్.. సింగిల్ తీసే క్రమంలో పెవిలియన్ చేరాడు. అది ఈజీ సింగిల్ అయినప్పటికీ కార్న్‌వాల్ క్రీజ్‌లోకి చేరినా బ్యాట్‌ను గాల్లోనే ఉంచాడు. దాంతో మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చింది. -
కూతురు పుట్టబోతోంది: క్రికెటర్
వెస్టిండీస్ ఆల్‌రౌండర్ ఆండ్రీ రసెల్ మొదటిసారి తండ్రి కాబోతున్నాడు. అతడి భార్య జేసిమ్ లోరా త్వరలోనే పండంటి పాపాయికి జన్మనివ్వబోతున్నట్లు తెలిపాడు. తాము తల్లిదండ్రులు కాబోతున్న విషయాన్ని క్యూట్ వీడియో ద్వారా రసెల్ ఇన్‌స్టాలో అభిమానులతో పంచుకున్నాడు. బేబీ రసెల్ పేరిట ఏర్పాటు చేసిన పార్టీలో..రసెల్ భార్య బౌలింగ్ చేయగా.. ఆ బాల్‌ను బ్యాట్‌తో పగులగొట్టిన రసెల్..తనకు కూతురు పుట్టబోతున్నట్లు సింబాలిక్‌గా చెప్పాడు. ఇందుకు సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన రసెల్...‘ నా జీవితంలోకి మరో ఆనందం రాబోతోంది. అమ్మాయి పుట్టబోతోంది. కూతురైనా, కొడుకైనా నాకు ఒక్కటే. పుట్టేది ఎవరైనా సరే వారు పూర్తి ఆరోగ్యంగా ఉండాలని దేవుడిని ప్రార్థిస్తున్నా’ అని క్యాప్షన్ జతచేశాడు. ఈ క్రమంలో రసెల్- జేసిమ్ లోరా దంపతులకు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ‘కంగ్రాట్స్ బ్రదర్. మరో అదృష్టవంతురాలైన అమ్మాయి. మరి నాకు ఆహ్వానం పంపలేదే’ అంటూ సిక్సర్ల వీరుడు క్రిస్ గేల్ అభినందనలు తెలుపుతూనే అలకబూనాడు. ఇక మరో విండీస్ ఆటగాడు బ్రెత్‌వైట్..తల్లీబిడ్డా క్షేమంగా ఉండాలని..ప్రసవం సాఫీగా జరగాలని ఆకాంక్షించాడు. ఇతర సహచర ఆటగాళ్లు సైతం రసెల్‌ను శుభాకాంక్షలతో ముంచెత్తారు. కాగా మోకాలి గాయంతో ప్రపంచ కప్ నుంచి నిష్క్రమించిన రసెల్... భారత్‌తో జరిగిన టీ20 సిరీస్‌కు కూడా దూరమైన సంగతి తెలిసిందే. ప్రస్తుతం కరీబియన్ ప్రీమియర్ లీగ్(సీపీఎల్)లో భాగంగా మైదానంలో దిగిన ఈ విండీస్ ఆల్‌రౌండర్ బంతిని బలంగా బాదేందుకు ప్రయత్నించి తీవ్రంగా గాయపడ్డాడు. ఈ క్రమంలో అతడికి ప్రాథమిక చికిత్స చేసిన మెడికల్ విభాగం..ఆస్పత్రికి తరలించింది. అనేక పరీక్షల అనంతరం రసెల్‌కు ఎటువంటి ప్రమాదం లేదని వైద్యులు తేల్చడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. View this post on Instagram So it's #GIRL😁😁😁 another blessing in my life it didn't matter if it was a girl or a boy, all am asking God for is a healthy baby #babyrussell @partyblasterspro A post shared by Andre Russell (@ar12russell) on Sep 15, 2019 at 6:37pm PDT -
బ్యాటింగ్ మెరుపులతో సరికొత్త రికార్డు
జమైకా: కరీబియన్ ప్రీమియర్ లీగ్(సీపీఎల్)లో హ్యాట్రిక్ టైటిల్‌పై కన్నేసిన ట్రిన్‌బాగో నైట్ రైడ్రైడర్స్ మరోసారి తన బ్యాటింగ్ పవర్ చూపిస్తోంది. డిఫెండింగ్ చాంపియన్‌గా బరిలోకి దిగిన నైట్‌రైడర్స్.. శుక్రవారం జమైకా తల్హాస్‌తో జరిగిన మ్యాచ్‌లో సరికొత్త బ్యాటింగ్ రికార్డు నెలకొల్పింది. తొలుత బ్యాటింగ్ చేసిన నైట్‌రైడర్స్ విజృంభించి ఆడింది. ఓపెనర్ సునీల్ నరైన్(20) తొందరగానే పెవిలియన్ చేరినప్పటికీ, మరొక ఓపెనర్ లెండి సిమ్మన్స్(86; 42 బంతుల్లో 8 ఫోర్లు, 5 సిక్సర్లు) చెలరేగి ఆడాడు. దాంతో స్కోరు బోర్డు పరుగులు తీసింది. అతనికి మున్రో జత కలవడంతో ఇద్దరూ ఎడాపెడా బాదుతూ జమైకా బౌలర్లకు దడపుట్టించారు. మున్రో(96 నాటౌట్; 50 బంతుల్లో 6 ఫోర్లు, 8 సిక్సర్లు) బౌండరీల మోత మోగించాడు. ఈ క్రమంలోనే రెండో వికెట్‌కు సిమ్మన్స్‌తో కలిసి 124 పరుగుల్ని జత చేశాడు. అటు తర్వాత కెప్టెన్ కీరన్ పొలార్డ్(45 నాటౌట్; 17 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్సర్లు) బ్యాట్ ఝుళిపించడంతో నైట్‌రైడర్స్ నిర్ణీత ఓవర్లలో రెండు వికెట్లుకు 267 పరుగులు చేసింది. ఇది కరీబియన్ లీగ్‌లో అత్యధిక స్కోరు కాగా, ఓవరాల్ టీ20ల్లో మూడో అత్యుత్తమంగా నమోదైంది. ఈ జాబితాలో అఫ్గానిస్తాన్ 278 పరుగులతో టాప్‌లో ఉంది. నైట్‌రైడర్స్ నిర్దేశించిన రికార్డు టార్గెట్‌ను ఛేదించే క్రమంలో జమైకా ధీటుగానే బదులిచ్చినా ఓటమి తప్పలేదు. నిర్ణీత ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 226 పరుగులకు పరిమితమై పరాజయం చెందింది. గేల్(39), గ్లెన్ ఫిలిప్స్(62), జావెల్లె గ్లెన్(34 నాటౌట్), రామల్ లూయిస్(37 నాటౌట్)లు మెరుపులు మెరిపించినా జట్టును గెలిపించలేకపోయారు. గత రెండు సీపీఎల్ టైటిల్స్‌ను నైట్‌రైడర్స్ గెలిచిన సంగతి తెలిసిందే. -
అయ్యో.. ఫీల్డ్‌లోనే కూలబడ్డ రసెల్!
జమైకా: కరీబియన్ ప్రీమియర్ లీగ్(సీపీఎల్)లో వెస్టిండీస్ ఆల్ రౌండర్ ఆండ్రీ రసెల్ తీవ్రంగా గాయపడ్డాడు. బంతిని హిట్ చేసే క్రమంలో అది రసెల్ హెల్మెట్ వెనుకబాగాన బలంగా తాకింది. కుడి చెవికి తగలడంతో రసెల్ మైదానంలో కుప్పకూలిపోయాడు. దాంతో ప్రాథమిక చికిత్స తర్వాత రసెల్‌ను ఆస్పత్రికి తరలించారు. సీపీఎల్‌లో భాగంగా జమైకా తలవాస్ తరఫున ఆడుతున్న రసెల్.. గురువారం సెయింట్ లూసియా జౌక్స్‌తో మ్యాచ్‌లో 14 ఓవర్లో బంతిని హిట్ చేసేందుకు యత్నించాడు. షార్ట్ పిచ్ బంతిని భారీ షాట్‌కు ప్రయత్నించగా అది కాస్తా అంచనా తప్పి రసెల్ హెల్మెట్‌ను తాకుతూ దూసుకుపోయింది. ఈ క్రమంలోనే కుడి చెవికి గాయం కావడంతో రసెల్ ఫీల్డ్‌లో నిలబడలేకపోయాడు. ఫీల్డ్‌లోనే కూలబడిపోయాడు. దాంతో ఒక్కసారిగా ఆందోళన రేకెత్తింది. ప్రత్యర్థి జట్టు ఫీల్డర్లు రసెల్ వద్దకు వచ్చి హెల్మెట్ తీసి చెక్ చేయడమే కాకుండా నెమ్మదిగా పైకి లేపారు. అదే సమయంలో హుటాహుటీనా అక్కడికి చేరుకున్న మెడికల్ విభాగం ప్రాథమికి చికిత్స తర్వాత రసెల్‌ను ఆస్పత్రికి తరలించింది. అనేక రకాలైన స్కాన్లు నిర్వహించిన తర్వాత రసెల్‌కు ఎటువంటి ప్రమాదం లేదని వైద్యులు తేల్చారు. రసెల్ గాయపడే సమయానికి మూడు బంతులు ఆడి పరుగులేమీ చేయలేదు. ఈ మ్యాచ్‌లో సెయింట్ లూసియా ఐదు వికెట్ల తేడాతో విజయం సాధించింది. -
తొలి ఆటగాడిగా ఇర్ఫాన్ పఠాన్
జమైకా: ఈ సీజన్ కరీబియన్ ప్రీమియర్ లీగ్ (సీపీఎల్)లో భారత మాజీ ఆటగాడు ఇర్ఫాన్ పఠాన్ ఆడేందుకు దాదాపు రంగం సిద్ధమైంది. గురువారం ప్రకటించిన సీపీఎల్ ఆటగాళ్ల జాబితాలో ఇర్ఫాన్ పఠాన్ చోటు దక్కించుకున్నాడు. ఈ డ్రాఫ్ట్‌లో చోటు సంపాదించిన తొలి భారత ఆటగాడు ఇర్ఫానే. అయితే ఈ లీగ్‌లో ఆడాలంటే ఇర్ఫాన్‌కు భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు(బీసీసీఐ)నుంచి ఆమోదం లభించాల్సి ఉంది. దాంతో పాటు సీపీఎల్‌లో ఏదొక ఫ్రాంచైజీ ఇర్ఫాన్‌ను కొనుగోలు చేయాల్సి ఉంటుంది. అదే జరిగితే అటు సీపీఎల్‌తో పాటు ఒక విదేశీ టీ20 లీగ్‌లో ఆడిన తొలి భారత ఆటగాడిగా ఇర్ఫాన్ గుర్తింపు పొందుతాడు. గత రెండు ఐపీఎల్ సీజన్లలో ఇర్ఫాన్ ఆడలేదు. 2017లో గుజరాత్ లయన్స్‌కు ప్రాతినిధ్యం వహించిన ఈ ఆల్‌రౌండర్.. 2016లో రైజింగ్ పుణె సూపర్ జెయింట్ తరఫున నాలుగు మ్యాచ్‌లు ఆడాడు. వెస్టిండీస్ వేదికగా సెప్టెంబర్ 4వ తేదీ నుంచి అక్టోబర్ 12వ తేదీ వరకూ సీపీఎల్ జరుగనుంది. -
నైట్‌రైడర్స్‌దే టైటిల్
ట్రినిడాడ్: కరీబియన్ ప్రీమియర్ లీగ్(సీపీఎల్)లో ట్రిన్‌బాగో నైట్‌రైడర్స్ మరోసారి చాంపియన్‌గా నిలిచింది. ఆదివారం జరిగిన ఫైనల్లో డిఫెండింగ్ చాంపియన్‌గా బరిలోకి దిగిన నైట్‌రైడర్స్ 8 వికెట్ల తేడాతో గుయానా అమెజాన్ వారియర్స్ జట్టుపై గెలిచి టైటిల్‌ను ఎగరేసుకుపోయింది. ఫలితంగా ముచ్చటగా మూడోసారి టైటిల్‌ను చేజిక్కించుకుంది. తుది పోరులో తొలుత బ్యాటింగ్ చేసిన అమెజాన్ వారియర్స్ నిర్ణీత ఓవర్లలో తొమ్మిది వికెట్ల నష్టానికి 147 పరుగులు చేసింది. ఆపై బ్యాటింగ్‌కు దిగిన నైట్‌రైడర్స్ 17.3 ఓవర్లలో రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి లక్ష్యాన్ని చేరుకుంది. నైట్‌రైడర్స్ ఓపెనర్లు దినేశ్ రామ్‌దిన్(24), బ్రెండన్ మెకల్లమ్(39)లు మంచి ఆరంభాన్నివ్వగా, ఫస్ట్ డౌన్ ఆటగాడు కొలిన్ మున్రో(68; 39 బంతుల్లో 6 ఫోర్లు,3 సిక్సర్లు) దూకుడుగా బ్యాటింగ్ చేసి జట్టు టైటిల్ గెలవడంలో ముఖ్య పాత్ర పోషించాడు. -
ఒకే ఓవర్లో ఐదు సిక్సర్లు
-
ఒకే ఓవర్లో ఐదు సిక్సర్లు
సెయింట్‌కిట్స్: వెస్టిండీస్ ఆల్ రౌండర్ డ్వేన్ బ్రేవో మరోసారి విధ్వంసకర ఆట తీరుతో అలరించాడు. కరీబియన్ ప్రీమియర్ లీగ్(సీపీఎల్)లో భాగంగా ట్రిన్‌బాగో నైట్ రైడర్స్ తరపున ఆడుతున్న బ్రేవో.. శనివారం సెయింట్ కిట్స్‌తో జరిగిన టీ 20 మ్యాచ్‌లో చెలరేగిపోయాడు. ప్రధానంగా 19 ఓవర్లో బ్రేవో సిక్సర్లతో విరుచుకుపడ్డాడు. జోసెఫ్ వేసిన ఆ ఓవర్ తొలి బంతికి పరుగులేమీ చేయని బ్రేవో.. ఆపై వరుస బంతుల్లో సిక్సర్ల వర్షం కురిపించాడు. ఒక్కో సిక్సర్‌ను ఒక్కో తరహాలో పెవిలియన్‌లోకి కొట్టాడు. మొత్తంగా 11 బంతులు ఎదుర్కొన్న బ్రేవో.. 1 ఫోర్, 5 సిక్సర్లతో 37 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. దాంతో నైట్‌రైడర్స్ 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 199 పరుగులు చేసింది. ఆపై బ్యాటింగ్‌కు దిగిన సెయింట్ కిట్స్ 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 153 పరుగులు చేసి ఓటమి పాలైంది.