టీమిండియా మాజీ క్రికెటర్ అంబటి రాయుడు మరోసారి అభిమానలను అలరించేందుకు సిద్దమయ్యాడు. ఈ నెల ఆఖరిలో జరిగే కరీబియన్ ప్రీమియర్ లీగ్‌లో రాయుడు బరిలోకి దిగనునున్నాడు. ఈ లీగ్‌లో సెయింట్ కిట్స్ అండ్ నెవిస్ పేట్రియాట్స్ జట్టుకు రాయుడు ప్రాతినిథ్యం వహించనున్నాడు.
తద్వారా సీపీఎల్‌లో ఆడనున్న రెండో భారత క్రికెటర్‌గా అంబటి రికార్డులకెక్కనున్నాడు. అంతకముందు 2020 సీజన్‌లో భారత స్పిన్నర్ ప్రవీణ్ తాంబే ట్రిన్‌బాగో నైట్ రైడర్స్ తరపున సీపీఎల్‌లో ఆడాడు. అయితే బీసీసీఐ కొత్త నిబంధనల ప్రకారం సీపీఎల్‌లో ఆడేందుకు రాయుడుకు అటంకం కలిగే ఛాన్స్ ఉంది.
కూలింగ్ ఆఫ్ పీరియడ్ రూల్ ప్రకారం.. ఇటీవల కాలంలో రిటైర్డ్ అయిన భారత క్రికెటర్లు ఇతర దేశాల ప్రాంఛైజీ లీగ్ క్రికెట్ టోర్నీలో భాగం కాకుడదు. ఈ నిబంధన కారణంగానే అమెరికా వేదికగా జరిగిన మేజర్ లీగ్ క్రికెట్ టి20 టోర్నమెంట్‌లో భాగం కాలేదు.
లేదంటే ఈ ఏడాది సీజన్‌లో టెక్సాస్ సూపర్ కింగ్స్ జట్టు తరపున రాయుడు ఆడాల్సింది. కాగా ఈ ఏడాది ఐపీఎల్ తర్వాత అన్నిఫార్మాట్‌ల క్రికెట్ నుంచి రాయుడు తప్పుకున్న సంగతి తెలిసిందే. ఇక సెయింట్ కిట్స్ ఫ్రాంచైజీతో కుదుర్చుకోవడంపై రాయుడు స్పందించాడు.
సెయింట్ కిట్స్ అండ్ నెవిస్ పేట్రియాట్స్ జట్టుతో జత కట్టినందుకు చాలా సంతోషంగా ఉంది. ఈ ఏడాది సీపీఎల్‌లో సెయింట్ కిట్స్‌కు నావంతు సహకారం అందిస్తానని రాయుడు పేర్కొన్నాడు. కాగా సీపీఎల్-2023 సీజన్ ఆగస్టు 16 నుంచి ప్రారంభం కానుంది.
చదవండి: IND vs WI: వెస్టిండీస్‌తో నాలుగో టీ20.. గిల్‌పై వేటు! విధ్వంసకర ఆటగాడికి మరో ఛాన్స్
Comments
Please login to add a commentAdd a comment