CPL 2021: Lendl Simmons Trinbago Knight Riders Match Highlights In Telugu - Sakshi
Sakshi News home page

CPL 2021: సిమన్స్ ఊచకోత.. నైట్ రైడర్స్ ఘన విజయం

Published Mon, Sep 6 2021 12:39 PM | Last Updated on Mon, Sep 6 2021 2:11 PM

Lendl Simmons Fiery 70 Guides Trinbago Knight Riders Easy win against Jamaica Tallawahs - Sakshi

సెంట్‌కిట్స్‌: కరీబీయన్‌ ప్రీమియర్‌ లీగ్‌లో ఆదివారం జరిగిన మ్యాచ్‌లో జమైకా తల్లావాస్‌పై ట్రిన్‌బాగో నైట్ రైడర్స్ ఏడు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది.  మొదట బ్యాటింగ్‌కు దిగిన తల్లావాస్ మొదటి ఆరు ఓవర్లలో 15 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. ఈ సమయంలో క్రీజులోకి వచ్చిన కార్లోస్ బ్రాత్‌వైట్..ఇమాడ్‌ వసీంతో కలిసి ఆరో వికెట్‌కు 83 పరుగుల భాగస్వామ్యాన్ని జోడించారు. బ్రాత్‌వైట్ (58, 45 బంతుల్లో 8 ఫోర్లు, 3 సిక్స్‌లు) అర్థ సెంచరీతో చెలరేగగా, ఇమాడ్‌ వసీం (42, 38 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్‌లు) పరుగులు సాధించాడు.

దీంతో నిర్ణీత 20 ఓవర్లో 145 పరుగుల లక్ష్యన్ని నైట్ రైడర్స్ ముందు ఉంచింది. నైట్ రైడర్స్ బౌలర్లలో  అకేల్ హోసిన్,  రవి రాంపాల్ చేరో  రెండు వికెట్లు పడగొట్టగా, నరైన్‌ ,ఉదానా ఒక్కో వికెట్‌ సాధించారు. ఆనంతరం 145 లక్ష్య సాదనతో బరిలోకి దిగిన నైట్ రైడర్స్ ఆరంభంలోనే సునీల్ నరైన్‌ వికెట్‌ కోల్పోయింది. అయితే అసలు ఊచకోత తర్వాత మెదలైంది. ప్రత్యర్ధి బౌలర్లపై లెండెల్ సిమన్స్ ఫోర్లు, సిక్సర్‌లతో విరుచుకుపడ్డాడు.

కేవలం 45 బంతుల్లో 70 (5 ఫోర్లు, 5 సిక్స్‌లు) పరుగులు సాధించాడు. కొలిన్ మున్రోతో (34) కలిసి  102 పరుగుల బాగాస్వామ్యన్ని  సిమన్స్ నమోదు చేశాడు. చివరకు సిమన్స్‌ ను అవుట్‌ చేసిన ప్రిటోరియస్ .. ఈ బాగాస్వామ్యన్ని విడదీశాడు. అరంతరం క్రీజులోకి వచ్చిన డారన్‌ బ్రావో మ్యాచ్‌ను ముగించాడు. దీంతో కేవలం మూడు వికెట్లు మాత్రమే కోల్పోయి 145 పరుగుల లక్ష్యన్ని సునాయాసంగా చేధించింది.

చదవండి: CPL 2021: వార్నీ.. కోపాన్నంత హెల్మెట్‌పై చూపించాడు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement