Kieron Pollard
-
IPL 2025: రోహిత్, పోలార్డ్ తర్వాత సూర్యకుమార్
ఐపీఎల్ 2025లో భాగంగా చెన్నై సూపర్ కింగ్స్‌తో నిన్న (మార్చి 23) జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ తాత్కాలిక సారధి సూర్యకుమార్ యాదవ్ ఓ అరుదైన ఘనత సాధించాడు. ఈ మ్యాచ్‌లో 29 పరుగులు చేసిన స్కై.. ఐపీఎల్లో ముంబై ఇండియన్స్ తరఫున 3000 పరుగులు పూర్తి చేసుకున్నాడు. తద్వారా రోహిత్ శర్మ, కీరన్ పోలార్డ్ తర్వాత ఈ ఘనత సాధించిన మూడో ఆటగాడిగా రికార్డుల్లోకెక్కాడు. రోహిత్ 209 ఇన్నింగ్స్‌ల్లో 5458 పరుగులు చేసి ముంబై ఇండియన్స్ తరఫున లీడింగ్ రన్ స్కోరర్‌గా కొనసాగుతుండగా.. పోలార్డ్ 171 ఇన్నింగ్స్‌ల్లో 3412, స్కై 95 ఇన్నింగ్స్‌ల్లో 3015 పరుగులు చేశాడు. ఈ ముగ్గురి తర్వాత ఎంఐ తరఫున అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా అంబటి రాయుడు ఉన్నాడు. రాయుడు 107 ఇన్నింగ్స్‌ల్లో 2416 పరుగులు చేశాడు.ఇదిలా ఉంటే, సీఎస్కేతో నిన్న జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ 4 వికెట్ల తేడాతో పరాజయం పాలైంది. సీజన్ ఆరంభ మ్యాచ్‌ల్లో ఓడటం ముంబైకి ఇది వరుసగా 13వ సారి. ఈ మ్యాచ్‌లో సీఎస్కే బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో సత్తా చాటి ముంబై ఇండియన్స్‌ను ఓడించింది. బ్యాటింగ్‌లో విఫలమైన ముంబై ఆతర్వాత బౌలింగ్‌లో రాణించినప్పటికీ అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది.టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై.. నూర్ అహ్మద్ (4-0-18-4), ఖలీల్ అహ్మద్ (4-0-29-3) విజృంభించడంతో 155 పరుగులకే (9 వికెట్ల నష్టానికి) పరిమితమైంది. ముంబై ఇన్నింగ్స్‌లో ఒక్కరు కూడా చెప్పుకోదగ్గ స్కోర్ చేయలేదు. సూర్యకుమార్ (29), తిలక్ వర్మ (31), ఆఖర్లో దీపక్ చాహర్ (15 బంతుల్లో 28 నాటౌట్) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. రోహిత్ శర్మ డకౌట్ కాగా.. విధ్వంసకర వీరులు రికెల్టన్ (13), విల్ జాక్స్ (11), అరంగ్రేటం ఆటగాడు రాబిన్ మింజ్ (3), నమన్ ధిర్ (17), సాంట్నర్ (11) తక్కువ స్కోర్లకే ఔటయ్యారు. సీఎస్కే బౌలర్లలో అశ్విన్, ఇల్లిస్ కూడా తలో వికెట్ తీశారు.ఛేదనలో రచిన్ రవీంద్ర (45 బంతుల్లో 65 నాటౌట్; 2 ఫోర్లు, 4 సిక్సర్లు), రుతురాజ్ గైక్వాడ్ (26 బంతుల్లో 53; 6 ఫోర్లు, 3 సిక్సర్లు) మెరుపు అర్ద సెంచరీలు చేసి సీఎస్కేను గెలిపించారు. రుతురాజ్ 22 బంతుల్లోనే హాఫ్ సెంచరీ చేసి సీఎస్కే గెలుపుకు బలమైన పునాది వేయగా.. రచిన్ చివరి వరకు క్రీజ్‌లో ఉండి సిక్సర్‌తో మ్యాచ్‌ను ముగించాడు. ఈ మ్యాచ్‌లో ముంబై ఓడినా అద్భుతంగా ప్రతిఘటించింది. అరంగేట్రం స్పిన్నర్ విజ్ఞేశ్ పుథుర్ (4-0-32-3) అద్భుతంగా బౌలింగ్ చేసి ఓ దశలో సీఎస్కేకు దడ పుట్టించాడు. ముంబై బౌలర్లలో విజ్ఞేశ్‌తో పాటు విల్ జాక్స్ (4-0-32-1), నమన్ ధిర్ (3-0-12-0) కూడా రాణించారు. మిడిల్ ఓవర్లలో వీరిద్దరు సీఎస్కేను ఇబ్బంది పెట్టారు. మొత్తంగా మ్యాచ్ ఓడినా ముంబై మంచి మార్కులే కొట్టేసింది. సీఎస్కే తమ తదుపరి మ్యాచ్‌లో ఆర్సీబీతో (మార్చి 28) తలపడనుండగా.. ముంబై ఇండియన్స్ గుజరాత్‌ను (మార్చి 29) ఢీకొట్టనుంది. -
చరిత్రపుటల్లోకెక్కిన పోలార్డ్
విండీస్ విధ్వంసకర వీరుడు కీరన్ పోలార్డ్ పొట్టి క్రికెట్లో ఓ అరుదైన ఘనత సాధించాడు. పోలీ టీ20 ఫార్మాట్లో 900 సిక్సర్లు బాదిన రెండో ఆటగాడిగా రికార్డు నెలకొల్పాడు. టీ20ల్లో పోలార్డ్‌కు ముందు క్రిస్ గేల్ మాత్రమే 900 సిక్సర్ల మార్కును తాకాడు. గేల్ 463 మ్యాచ్‌ల్లో 1056 సిక్సర్లు బాదగా.. పోలార్డ్ తన 690వ మ్యాచ్‌లో 900 సిక్సర్ల మార్కును తాకాడు.టీ20ల్లో అత్యధిక సిక్సర్లు బాదిన ఆటగాళ్లు..క్రిస్ గేల్ 1056 (463 మ్యాచ్‌లు)కీరన్ పోలార్డ్ 901 (690 మ్యాచ్‌లు)ఆండ్రీ రసెల్ 727 (529 మ్యాచ్‌లు)నికోలస్ పూరన్ 593 (376 మ్యాచ్‌లు)కొలిన్ మున్రో 550 (434 మ్యాచ్‌లు)కాగా, ఇంటర్నేషనల్ లీగ్ టీ20 టోర్నీలో (ILT20 2025) భాగంగా డెసర్ట్ వైపర్స్‌తో నిన్న (జనవరి 16) జరిగిన మ్యాచ్‌లో పోలీ 900 సిక్సర్స్ క్లబ్లో చేరాడు. ఈ మ్యాచ్‌లో పోలార్డ్ (ముంబై ఇండియన్స్ ఎమిరేట్స్) 23 బంతుల్లో 2 బౌండరీలు, 3 సిక్సర్ల సాయంతో 36 పరుగులు చేశాడు. ఎంఐ ఎమిరేట్స్ ఇన్నింగ్స్‌లో పోలార్డే టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ఈ మ్యాచ్‌లో పోలార్డ్ మెరిసినా ఎంఐ ఎమిరేట్స్ 5 వికెట్ల తేడాతో పరాజయంపాలైంది.తొలుత బ్యాటింగ్ చేసిన ఎంఐ ఎమిరేట్స్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 159 పరుగులు చేసింది. ఎమిరేట్స్ ఇన్నింగ్స్‌లో కుసాల్ పెరీరా 33, ముహమ్మద్ వసీం 18, టామ్ బాంటన్ 15, నికోలస్ పూరన్ 15, పోలార్డ్ 36, మౌస్లీ 15, రొమారియో షెపర్డ్ 16 (నాటౌట్), అకీల్ హొసేన్ 4 (నాటౌట్) పరుగులు చేశారు. డెసర్ట్ వైపర్స్ బౌలర్లలో లోకీ ఫెర్గూసన్ 2, డేవిడ్ పేన్, వనిందు హసరంగ, డాన్ లారెన్స్ తలో వికెట్ పడగొట్టారు.160 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన వైపర్స్ మరో ఐదు బంతులు మిగిలుండగానే విజయతీరాలకు చేరింది. ఫకర్ జమాన్ (52 బంతుల్లో 67; 5 ఫోర్లు, 4 సిక్సర్లు) అర్ద సెంచరీతో రాణించి వైపర్స్‌ను గెలిపించాడు. ఆఖర్లో షెర్ఫాన్ రూథర్‌ఫోర్డ్ (8 బంతుల్లో 21 నాటౌట్; 3 ఫోర్లు, సిక్స్) మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. అలెక్స్ హేల్స్ 34, సామ్ కర్రన్ 28 పరుగులు చేసి వైపర్స్ గెలుపులో తమవంతు పాత్ర పోషించారు. డాన్ లారెన్స్ (5), ఆజమ్ ఖాన్ (2) తక్కువ స్కోర్లకే ఔటయ్యారు. ఎంఐ ఎమిరేట్స్ బౌలర్లలో జహూర్ ఖాన్, డాన్ మౌస్లీ తలో రెండు వికెట్లు పడగొట్టగా.. వకార్ సలామ్‌ఖీల్ ఓ వికెట్ దక్కించుకున్నాడు. ఈ గెలుపుతో వైపర్స్ హ్యాట్రిక్ విజయాలు నమోదు చేసి పాయింట్ల పట్టికలో అగ్రస్థానాన్ని ఆక్రమించుకుంది. -
గెలవాల్సిన మ్యాచ్‌లో ఓడిపోయిన ముంబై ఇండియన్స్.. పూరన్, పోలార్డ్ కూడా ఏమీ చేయలేకపోయారు..!
దుబాయ్ వేదికగా జరిగే ఇంటర్నేషన్ లీగ్ టీ20, 2025 ఎడిషన్ (రెండో ఎడిషన్) నిన్న (జనవరి 11) ప్రారంభమైంది. తొలి మ్యాచ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ ముంబై ఇండియన్స్ ఎమిరేట్స్.. దుబాయ్ క్యాపిటల్స్‌తో తలపడింది. ఈ మ్యాచ్ ముంబై ఇండియన్స్‌కు పరాభవం ఎదురైంది. తప్పక గెలుస్తుందనున్న మ్యాచ్‌లో ఎంఐ ఎమిరేట్స్ పరుగు తేడాతో ఓటమిపాలైంది. విధ్వంసకర ఆటగాళ్లు నికోలస్ పూరన్, కీరన్ పోలార్డ్ జట్టులో ఉన్నా ముంబై ఇండియన్స్‌ను గెలిపించలేకపోయారు.ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన దుబాయ్ క్యాపిటల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 133 పరుగులు మాత్రమే చేసింది. దుబాయ్ ఆటగాళ్లలో బ్రాండన్ మెక్‌ముల్లెన్ (42 బంతుల్లో 58; 4 ఫోర్లు, 3 సిక్సర్లు) ఒక్కడే అర్ద సెంచరీతో రాణించాడు. రోవమన్ పావెల్ (25), దసున్ షనక (13), కెప్టెన్ సికందర్ రజా (10) రెండంకెల స్కోర్లు చేయగా.. షాయ్ హోప్ 9, రొస్సింగ్టన్ 9, గుల్బదిన్ నైబ్ 2, ఫర్హాన్ ఖాన్ 2 (నాటౌట్) పరుగులు చేశారు. ముంబై పేసర్ ఫజల్హక్ ఫారూకీ (4-0-16-5) ఐదు వికెట్లు తీయడంతో పాటు పొదుపుగా బౌలింగ్ చేసి దుబాయ్ క్యాపిటల్స్‌ను ఇబ్బంది పెట్టాడు. అల్జరీ జోసఫ్, జహూర్ ఖాన్‌కు తలో వికెట్ దక్కింది.స్వల్ప లక్ష్య ఛేదనలో ఎంఐ ఎమిరేట్స్ కూడా తడబడింది. ఆ జట్టు 23 పరుగులకు నాలుగు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయింది. ఈ దశలో కెప్టెన్ నికోలస్ పూరన్ (40 బంతుల్లో 60; 3 ఫోర్లు, 4 సిక్సర్లు) తన జట్టును గెలిపించుకునేందుకు విఫలయత్నం చేశాడు. పూరన్‌కు అకీల్ హొసేన్ (31 బంతుల్లో 30; 2 ఫోర్లు) కాసేపు సహకరించాడు. ఆఖరి ఓవర్లో కీరన్ పోలార్డ్ (15 బంతుల్లో 16 నాటౌట్; 2 ఫోర్లు) ఎంత ప్రయత్నించినా తన జట్టును గెలిపించుకోలేకపోయాడు. చివరి బంతికి ఆరు పరుగులు కావాల్సి ఉండగా పోలార్డ్ బౌండరీ బాదాడు. అయినా ఉపయోగం లేకుండా పోయింది. దుబాయ్ క్యాపిటల్స్ పరుగు తేడాతో గెలుపొందింది. నిర్ణీత ఓవర్లు పూర్తయ్యే సరికి ఎంఐ ఎమిరేట్స్ 7 వికెట్ల కోల్పోయి 132 పరుగులకే పరిమితమైంది. ఎమిరేట్స్ ఇన్నింగ్స్‌లో ముహమ్మద్ వసీం, ఆండ్రీ ఫ్లెచర్, అల్జరీ జోసఫ్ డకౌట్లు కాగా.. కుసాల్ పెరీరా 12, టామ్ బాంటన్ 7 పరుగులు చేశారు.గెలుపు దూరం చేసిన గుల్బదిన్ నైబ్, ఓల్లీ స్టోన్ఓ దశలో ఎంఐ ఎమిరేట్స్ సునాయాసంగా విజయం సాధించేలా కనిపించింది. ఆ జట్టు 18 బంతుల్లో కేవలం 19 పరుగులు మాత్రమే సాధించాల్సి ఉండింది. చేతిలో ఐదు వికెట్లు ఉండేవి. ఈ దశలో గుల్బదిన్ నైబ్ (4-0-13-3, ఓల్లీ స్టోన్ (4-1-14-2) ముంబైకు గెలుపును దూరం చేశారు. 18వ ఓవర్ వేసిన గుల్బదిన్ నైబ్ రెండు కీలక వికెట్లు తీసి (పూరన్, అల్జరీ జోసఫ్) కేవలం ఐదు పరుగులు మాత్రమే ఇచ్చాడు. అనంతరం 19వ ఓవర్ వేసిన ఓల్లీ స్టోన్ మరింత పొదుపుగా బౌలింగ్ చేసి కేవలం ఒక్క పరుగు మాత్రమే ఇచ్చాడు. చివరి ఓవర్ వచ్చే సరికి ముంబై గెలుపుకు 13 పరుగులు అవసరమయ్యాయి. ఫర్హాన్ ఖాన్ బౌలింగ్‌లో పోలార్డ్ రెండు బౌండరీలు బాదినా ప్రయోజనం లేకుండా పోయింది. ఆ ఓవర్లో 11 పరుగులు మాత్రమే వచ్చాయి. పొదుపుగా బౌలింగ్ చేయడంతో పాటు కీలకమైన వికెట్లు తీసిన గుల్బదిన్ నైబ్కు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది. -
పొలార్డ్ విధ్వంసకర బ్యాటింగ్: ఒక్క ఫోర్ లేదు! అన్నీ సిక్సర్లే!
వెస్టిండీస్ విధ్వంసక బ్యాటర్ కీరన్ పొలార్డ్ ధనాధన్ ఇన్నింగ్స్‌తో అదరగొట్టాడు. సిక్సర్ల వర్షం కురిపిస్తూ అభిమానులకు కనువిందు చేశాడు. కేవలం పందొమ్మిది బంతుల్లోనే 52 పరుగులు సాధించి సత్తా చాటాడు. కరేబియన్ ప్రీమియర్ లీగ్(సీపీఎల్)-2024లో భాగంగా సెయింట్ లూసియా కింగ్స్‌తో మ్యాచ్‌లో ఈ మేరకు తుఫాన్ ఇన్నింగ్స్‌తో అలరించాడు.రోస్టన్ చేజ్ హాఫ్ సెంచరీకాగా సీపీఎల్ తాజా ఎడిషన్‌లో పొలార్డ్ ట్రిన్‌బాగో నైట్ రైడర్స్‌కు కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు. ఈ క్రమంలో మంగళవారం రాత్రి సెయింట్ లూసియా కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బౌలింగ్ ఎంచుకున్నాడు. దీంతో బ్యాటింగ్‌కు దిగిన లూసియా కింగ్స్ సొంత మైదానంలో మెరుగైన స్కోరు సాధించింది. ఓపెనర్లు, కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్(26 బంతుల్లో 34), జె.చార్ల్స్(14 బంతుల్లో 29) శుభారంభం అందించగా.. రోస్టన్ చేజ్ హాఫ్ సెంచరీతో రాణించాడు. నాలుగో స్థానంలో బ్యాటింగ్‌కు దిగిన చేజ్ 40 బంతుల్లో 56 పరుగులతో అజేయంగా నిలిచాడు. అతడికి తోడుగా భనుక రాజపక్స(29 బంతుల్లో 33) కూడా ఫర్వాలేదనిపించాడు. ఫలితంగా లూసియా కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్లు నష్టపోయి 187 పరుగులు సాధించింది. ట్రిన్‌బాగో బౌలర్లలో సునిల్ నరైన్, వకార్ సలామ్‌ఖీల్ రెండేసి వికెట్లు తీయగా.. టెర్రాన్స్ హిండ్స్, పొలార్డ్ తలా ఒక వికెట్ పడగొట్టారు. ఆకాశమే హద్దుగా పొలార్డ్ఈ క్రమంలో లూసియా కింగ్స్ విధించిన లక్ష్య ఛేదనకు దిగిన ట్రిన్‌బాగోకు ఆరంభంలోనే షాక్ తగిలింది. ఓపెనర్లు జేసన్ రాయ్(15 బంతుల్లో 16), సునిల్ నరైన్(8 బంతుల్లో 14) విఫలమయ్యారు. అయితే, వన్‌డౌన్ బ్యాటర్ షకెరె పారిస్ 33 బంతుల్లో 57 పరుగులతో రాణించి ఇన్నింగ్స్ చక్కదిద్దాడు.సిక్సర్ల వర్షంమిగతా వాళ్లలో నికోలస్ పూరన్(17), కేసీ కార్టీ(15) పూర్తిగా నిరాశపరచగా.. పొలార్డ్ రంగంలోకి దిగిన తర్వాత సీన్ మొత్తం మారిపోయింది. ప్రత్యర్థి జట్టు బౌలర్లకు చుక్కలు చూపిస్తూ ఆకాశమే హద్దుగా చెలరేగాడు ఈ ఆల్‌రౌండర్. ఏడు సిక్సర్ల సాయంతో 19 బంతుల్లోనే 52 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. పందొమ్మిదో ఓవర్లోనే నాలుగు సిక్సర్లు బాది జట్టును విజయతీరాలకు చేర్చాడు. ఇక ఆఖరి ఓవర్లో అకీల్ హొసేన్ ఫోర్ బాదడంతో.. మరో ఐదు బంతులు మిగిలి ఉండగానే ట్రిన్‌బాగో గెలుపు ఖరారైంది. లూయిస్ కింగ్స్‌పై నాలుగు వికెట్ల తేడాతో జయభేరి మోగించింది. కెప్టెన్ ఇన్నింగ్స్‌తో మెరిసిన కీరన్ పొలార్డ్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు.సెయింట్ లూయీస్ వర్సెస్ ట్రిన్‌బాగో నైట్ రైడర్స్ స్కోర్లులూయీస్ కింగ్స్- 187/6 (20 ఓవర్లు)నైట్ రైడర్స్- 189/6 (19.1 ఓవర్లు)ఫలితం- కింగ్స్‌పై నాలుగు వికెట్ల తేడాతో నైట్ రైడర్స్ విజయం.టాప్‌లో అమెజాన్ వారియర్స్కాగా కరేబియన్ ప్రీమియర్ లీగ్-2024లో గయానా అమెజాన్ వారియర్స్ మూడు విజయాల(ఆరు పాయింట్లు)తో పట్టికలో టాప్‌లో ఉండగా.. బార్బడోస్ రాయల్స్ రెండింట రెండు గెలిచి రెండో స్థానంలో కొనసాగుతోంది. ఇక ట్రిన్‌బాగో నైట్ రైడర్స్మూడింట రెండు గెలిచి మూడు, ఆంటిగ్వా-బర్బుడా ఫాల్కన్స్ ఆరింట రెండు గెలిచి నాలుగు, సెయింట్ లూసియా కింగ్స్ నాలుగింట రెండు గెలిచి ఐదు, సెయింట్ కిట్స్- నెవిస్ పేట్రియాట్స్ ఆరింట ఒకటి గెలిచి అట్టడుగున ఆరో స్థానంలో ఉంది.చదవండి: హిట్‌మ్యాన్ మరో 10 పరుగులు చేస్తే..! Kieron Pollard is awarded @Dream11 MVP! Well done Polly 🙌🏾 #CPL24 #SLKvTKR #CricketPlayedLouder #BiggestPartyInSport #Dream11 pic.twitter.com/AASf9KO7mC— CPL T20 (@CPL) September 11, 2024 -
వరుసగా ఐదు సిక్సర్లు.. రషీద్ ఖాన్‌కు చుక్కలు.. చరిత్ర సృష్టించిన పోలార్డ్
హండ్రెడ్ లీగ్‌లో సథరన్ బ్రేవ్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్న విండీస్ దిగ్గజం కీరన్ పోలార్డ్ ఓ అరుదైన రికార్డు నెలకొల్పాడు. నిన్న (ఆగస్ట్ 10) ట్రెంట్ రాకెట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రషీద్ ఖాన్ బౌలింగ్‌లో వరుసగా ఐదు సిక్సర్లు బాదిన పోలార్డ్.. క్రికెట్ చరిత్రలో ఒకే ఓవర్లో ఐదు అంతకంటే ఎక్కువ సిక్సర్లు రెండుసార్లు బాదిన తొలి బ్యాటర్‌గా చరిత్ర సృష్టించాడు. ఈ మ్యాచ్‌కు ముందు పోలార్డ్ శ్రీలంకతో జరిగిన అంతర్జాతీయ టీ20లో అఖిల ధనంజయం బౌలింగ్‌లో ఒకే ఓవర్లో ఆరు సిక్సర్లు బాదాడు. తాజాగా రషీద్ ఖాన్ బౌలింగ్‌లో ఓ సెట్లో (హండ్రెడ్ లీగ్‌లో ఐదు బంతులను ఓ సెట్‌గా పరిగణిస్తారు) ఐదుకు ఐదు సిక్సర్లు కొట్టాడు. పొట్టి క్రికెట్లో రషీద్‌ను ఈ స్థాయిలో చితక్కొట్టిన బౌలర్ కూడా లేడు. ఈ మ్యాచ్‌కు ముందు రషీద్ బౌలింగ్‌లో ఓ ఓవర్లో అత్యధికంగా నాలుగు సిక్సర్లు మాత్రమే వచ్చాయి. Kieron Pollard against yellow teams. 🥶- Rashid Khan taken to the cleaners, 5 sixes in a row. 🤯pic.twitter.com/CjrB63JwWD— Mufaddal Vohra (@mufaddal_vohra) August 11, 20242016 టీ20 వరల్డ్‌కప్‌లో ఏబీ డివిలియర్స్ రషీద్ బౌలింగ్‌లో వరుసగా నాలుగు సిక్సర్లు కొట్టాడు. 2018 ఐపీఎల్లో క్రిస్ గేల్, 2023 సౌతాఫ్రికా టీ20 లీగ్‌లో మార్కో జన్సెన్, 2024 ఐపీఎల్లో విల్ జాక్స్ రషీద్ ఓవర్లో వరుసగా నాలుగు సిక్సర్లు బాదారు.మ్యాచ్ విషయానికొస్తే.. స్వల్ప లక్ష్య ఛేదనలో నిదానంగా ఇన్నింగ్స్‌ను ప్రారంభించిన పోలార్డ్.. రషీద్ ఖాన్ బౌలింగ్‌లో ఒక్కసారిగా గేర్ మార్చి సిక్సర్ల వర్షం కురిపించాడు. 127 పరుగుల ఛేదనలో 14 బంతులు ఎదుర్కొని 6 పరుగులు మాత్రమే చేసిన పోలార్డ్.. రషీద్ వేసిన 16వ సెట్లో పూనకం వచ్చినట్లు ఊగిపోయి ఐదు సిక్సర్లు బాదాడు. 20 బంతుల్లో తన జట్టు విజయానికి 49 పరుగులు అవసరం కాగా.. పోలార్డ్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. రషీద్ బౌలింగ్‌ను ఊచకోత కోసి మ్యాచ్ స్వరూపాన్నే మార్చేశాడు. మొత్తంగా ఈ మ్యాచ్‌లో 23 బంతులు ఎదుర్కొన్న పోలార్డ్ 2 ఫోర్లు, 5 సిక్సర్ల సాయంతో 45 పరుగులు చేశాడు. పోలార్డ్ విధ్వంసం ధాటికి బ్రేవ్ మరో బంతి మిగిలుండగానే లక్ష్యాన్ని చేరుకుంది. -
కిరాన్ పొలార్డ్ విధ్వంసం.. వరుసగా 5 సిక్స్‌లు! వీడియో వైరల్
ది హండ్రెడ్ లీగ్-2024లో శనివారం సౌతాంప్టన్ వేదికగా ట్రెంట్ రాకెట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 2 వికెట్ల తేడాతో సదరన్ బ్రేవ్ జట్టు విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో సదరన్ బ్రేవ్ ఆల్-రౌండర్ కీరన్ పొలార్డ్ విధ్వంసం సృష్టించాడు.127 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన సదరన్ బ్రేవ్ 68 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ సమయంలో క్రీజులోకి వచ్చిన పొలార్డ్ తొలుత కాస్త ఆచితూచి ఆడాడు. బౌలర్లను ఎదుర్కొవడానికి కాస్త ఇబ్బంది పడ్డాడు.ఒకనొక దశలో 14 బంతులు ఎదుర్కొన్న ఈ కరేబియన్ ఆల్‌రౌండర్ కేవలం 6 పరుగులు మాత్రమే చేసి అభిమానులకు విసుగు తెప్పించాడు. ఆఖరి 20 బంతుల్లో సదరన్ బ్రేవ్ విజయానికి 49 పరుగులు అవసరమయ్యాయి. ఈ క్రమంలో అప్పటివరకు జిడ్డు బ్యాటింగ్ చేసిన పొలార్డ్ పూనకం వచ్చినట్లు చెలరేగిపోయాడు. ట్రెంట్ రాకెట్స్ స్పిన్నర్ రషీద్ ఖాన్‌ను పొలార్డ్ ఊచకోత కోశాడు. 16వ సెట్ బౌలింగ్ చేసిన రషీద్ ఖాన్ బౌలింగ్‌లో పొలార్డ్ వరుసగా 5 సిక్స్‌లు బాది మ్యాచ్ స్వరూపాన్నే మార్చేశాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తతం సోషల్ మీడియాలో వైరలవుతోంది.ఓవరాల్‌గా ఈ మ్యాచ్‌లో 23 బంతులు ఎదుర్కొన్న పొలార్డ్.. 2 ఫోర్లు, 5 సిక్స్‌లతో 45 పరుగులు చేశాడు. 127 పరుగుల లక్ష్యాన్ని 99 బంతుల్లో 8 వికెట్లు కోల్పోయి చేధించింది. View this post on Instagram A post shared by Southern Brave (@southernbrave) -
T20 WC: బుమ్రాకు విశ్రాంతి?.. పొలార్డ్ కీలక వ్యాఖ్యలు
ఐపీఎల్-2024లో ముంబై ఇండియన్స్ ప్రదర్శన ఎలా ఉన్నా ఆ జట్టు ప్రధాన పేసర్ జస్ప్రీత్ బుమ్రా మాత్రం ఆకట్టుకుంటున్నాడు. ఇప్పటి వరకు జరిగిన 12 మ్యాచ్‌లలో భాగమైన బుమ్రా.. 18 వికెట్లు కూల్చాడు.తద్వారా అత్యధిక వికెట్ల వీరుల జాబితాలో అగ్రస్థానం(మే 7 నాటికి) అగ్రస్థానంలో నిలిచి.. పర్పుల్ క్యాప్ తన దగ్గర పెట్టుకున్నాడు. ఇదిలా ఉంటే.. సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో సోమవారం నాటి మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ గెలుపొందిన విషయం తెలిసిందే.ఆశలు సజీవమేవాంఖడే వేదికగా హైదరాబాద్ జట్టును ఏడు వికెట్ల తేడాతో ఓడించిన ముంబై.. ఈ సీజన్లో నాలుగో విజయం నమోదు చేసింది. పాయింట్ల పట్టికలో తొమ్మిదో స్థానంలో ఉన్నప్పటికీ అధికారికంగా ముంబై ఇంకా ప్లే ఆఫ్స్ రేసు నుంచి నిష్క్రమించలేదు.ఇక ఇప్పటికి 12 మ్యాచ్‌లు ఆడిన ముంబై ఇండియన్స్‌కు లీగ్ దశలో ఇంకో రెండు మ్యాచ్‌లు మిగిలి ఉన్నాయి. ఒకవేళ ప్లే ఆఫ్స్ చేరితే సంగతి వేరు!కాగా మే 26 నాటి ఫైనల్‌తో ఐపీఎల్ పదిహేడో ఎడిషన్‌కు తెరపడనుండగా.. జూన్ 1 నుంచి టీ20 ప్రపంచకప్ టోర్నీ ఆరంభం కానుంది. ఈ నేపథ్యంలో ఈ మెగా ఈవెంట్ కోసం బీసీసీఐ జట్టును ప్రకటించింది. జూన్ 5న టీమిండియా ఐర్లాండ్‌తో తమ తొలి మ్యాచ్ ఆడనుంది.బుమ్రాకు విశ్రాంతి ఇవ్వాలిఈ నేపథ్యంలో పేస్ దళ నాయకుడు జస్ప్రీత్ బుమ్రాకు ముంబై ఇండియన్స్ యాజమాన్యం విశ్రాంతినివ్వాలనే డిమాండ్లు వినిపిస్తున్నాయి. ఈ విషయమై అసిస్టెంట్ కోచ్ కీరన్ పొలార్డ్‌కు సోమవారం ప్రశ్న ఎదురైంది.కుదరదుఇందుకు బదులిస్తూ.. ‘‘ఈ విషయంపై నేను స్పష్టతనివ్వలేను. అయితే, మేమంతా ఇక్కడున్నది సీజన్ ఆసాంతం సేవలు అందించడానికే! ఇతర విషయాల గురించి పెద్దగా ఆలోచించే పరిస్థితిలో లేము. వరల్డ్‌కప్ గురించి ఇప్పటి నుంచే మాట్లాడటం అనవసరం. ఇలాంటివి ప్రస్తుత ప్రదర్శనలను ప్రభావితం చేసే అవకాశం ఉంటుంది’’ అని కీరన్ పొలార్డ్ చెప్పుకొచ్చాడు. బుమ్రాకు ప్రస్తుతం విశ్రాంతినిచ్చే ఆలోచన లేదని పరోక్షంగా స్పష్టం చేశాడు.చదవండి: Rohit Sharma Crying Video: కన్నీళ్లు పెట్టుకున్న రోహిత్ శర్మ.. వీడియో వైరల్ -
ధోని 3 సిక్స్‌లు బాదాడు.. అయితే ఏంటి?: పొలార్డ్
చెన్నై సూపర్ కింగ్స్ స్టార్, టీమిండియా దిగ్గజం మహేంద్ర సింగ్ ధోని గురించి ముంబై ఇండియన్స్ బ్యాటింగ్ కోచ్ కీరన్ పొలార్డ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఆఖరి ఓవర్లో ఎవరైనా హిట్టింగ్ ఆడటం సహజమేనని.. అదేమీ గొప్ప విషయం కాదన్నాడు. ముఖ్యంగా ధోని లాంటి వరల్డ్‌క్లాస్ ప్లేయర్ల నుంచి ఇలాంటి ఇన్నింగ్స్ రావడాన్ని బౌలర్ తప్పిదంగా చూడలేమని పొలార్డ్ పేర్కొన్నాడు. కాగా ఐపీఎల్-2024లో భాగంగా ముంబై ఇండియన్స్ ఆదివారం చెన్నై జట్టుతో తలపడింది. సొంతమైదానం వాంఖడేలో టాస్ గెలిచిన ముంబై సారథి హార్దిక్ పాండ్యా తొలుత బౌలింగ్ ఎంచుకోగా.. బౌలర్లు చెత్త ప్రదర్శన కనబరిచారు. ముఖ్యంగా పేసర్లు పెద్దగా ప్రభావం చూపలేక ధారాళంగా పరుగులు సమర్పించుకున్నారు. గెరాల్డ్ కొయెట్జీ(1/35), జస్ప్రీత్ బుమ్రా(0/27) కాస్త మెరుగైన ఎకానమీతో బౌలింగ్ చేయగా.. హార్దిక్ పాండ్యా(2/43), రొమారియో షెఫర్డ్(0/33). ఆకాశ్ మధ్వాల్ (0/37) మాత్రం చెత్తగా ఆడారు. DO NOT MISS MSD 🤝 Hat-trick of Sixes 🤝 Wankhede going berserk Sit back & enjoy the LEGEND spreading joy & beyond 💛 😍 Watch the match LIVE on @JioCinema and @StarSportsIndia 💻📱#TATAIPL | #MIvCSK | @msdhoni | @ChennaiIPL pic.twitter.com/SuRErWrQTG — IndianPremierLeague (@IPL) April 14, 2024 సీఎస్కే ఇన్నింగ్స్‌లో ఆఖరి ఓవర్ వేసిన పాండ్యా బౌలింగ్‌లో ధనాధన్ ధోని హ్యాట్రిక్ సిక్సర్లతో దుమ్ములేపాడు. పాండ్యా సంధించిన బంతులను లాంగాఫ్, లాంగాన్, డీప్ స్క్వేర్ లెగ్ దిశగా సిక్సర్లుగా మలిచి.. మరో రెండు రన్స్ చేసి.. 20 పరుగులతో అజేయంగా నిలిచాడు. ఇక ఈ మ్యాచ్‌లో సీఎస్కే నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 206 పరుగులు చేయగా.. ముంబై 186 పరుగులకే పరిమితమైంది. ఫలితంగా 20 పరుగుల తేడాతో ఓటమిని మూటగట్టుకుంది. ఈ నేపథ్యంలో బౌలర్‌గా, బ్యాటర్(6 బంతుల్లో 2), కెప్టెన్‌గా విఫలమైన హార్దిక్ పాండ్యాపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా అతడి బౌలింగ్‌లో ధోని సిక్సర్లు హైలైట్ కావడంతో.. ముంబై బ్యాటింగ్ కోచ్ కీరన్ పొలార్డ్ భిన్నంగా స్పందించాడు. ‘‘అవును.. అతడు మూడు సిక్సర్లు కొట్టాడు. చివరి ఓవర్లో 20 పరుగులు తీశాడు. అయితే, ఆఖరి ఓవర్లో ఎవరైనా 20 పరుగులు సాధించగలరు కదా! అందులో వింతేముంది? ఇక ఎంఎస్ చాలా ఏళ్లుగా వరల్డ్‌క్లాస్ క్రికెటర్‌గా కొనసాగుతున్నాడు. అలాంటి వ్యక్తి ఇలాంటి ఇన్నింగ్స్ ఆడటంలో ఆశ్చర్యం లేదు. అతడు మైదానంలో అడుగుపెట్టి షాట్లు బాదుతుంటే చూడటాన్ని మేము కూడా ఆస్వాదిస్తాం. అయితే, ఈరోజు ధోనిని పెవిలియన్‌కు చేర్చేందుకు మేము రచించిన వ్యూహాలు ఫలితాన్నివ్వలేదు. మా ప్రణాళికలను సరిగ్గా అమలు చేయలేకపోయాం’’ అని కీరన్ పొలార్డ్ చెప్పుకొచ్చాడు. కాగా ముంబైపై సీఎస్కే విజయంలో కీలక పాత్ర పోషించిన పేసర్ ‘బేబీ మలింగ’ మతీశ పతిరణ(4/28)కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది. చదవండి: #Hardik Pandya: అతడిదంతా నటన! ధోని సిక్సర్లు కొడుతుంటే అలా.. var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_7552012696.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
#MI: హార్దిక్ రాగానే కోపంగా వెళ్లిపోయిన మలింగ! పొలార్డ్ సైతం..
ముంబై ఇండియన్స్ మ్యాచ్ అంటే చాలు కెప్టెన్ హార్దిక్ పాండ్యానే ట్రెండింగ్‌లోకి వస్తున్నాడు. సారథిగా తప్పిదాలు చేయడమే గాకుండా.. సీనియర్ల పట్ల అగౌరవంగా ప్రవర్తిస్తున్నాడంటూ నెటిజన్లు అతడిపై మండిపడుతున్నారు. ఐపీఎల్-2024లో భాగంగా తమ తొలి మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్‌తో తలపడినపుడు.. మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ ఫీల్డింగ్ పొజిషన్‌ను పాండ్యా పదే పదే మారుస్తూ అతడిని పరుగులు పెట్టించిన విషయం తెలిసిందే. అదే విధంగా.. ప్రధాన పేసర్, ఎంఐ సీనియర్ జస్ప్రీత్ బుమ్రాను కాదని తానే బౌలింగ్ ఎటాక్ ఆరంభించాడు. బ్యాటింగ్ ఆర్డర్లోనూ ఏడో స్థానంలో వచ్చి విమర్శలు మూటగట్టుకున్నాడు. ఇక అహ్మదాబాద్‌లో జరిగిన ఈ మ్యాచ్‌లో ముంబై ఆరు పరుగుల తేడాతో ఓడిన విషయం తెలిసిందే. తాజాగా ఉప్పల్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో మ్యాచ్‌లోనూ ఓటమి పాలైంది. పరుగుల వరద పారిన ఈ మ్యాచ్‌లో 31 రన్స్ తేడాతో ప్రత్యర్థి చేతిలో పరాజయం చవిచూసింది. ఇక్కడ కూడా పాండ్యా.. అరంగేట్ర క్వెనా మఫాకాతో ముంబై బౌలింగ్ ఎటాక్‌ను ఆరంభించాడు. మరోసారి.. బుమ్రాను పక్కనపెట్టి మూల్యం చెల్లించాడు. Hardik didn't even tried to stop Malinga from getting up and leaving the chair for him. Look at the face of Pollard even he is not comfortable. Pandya doesn't know how to respect seniors. He could have brought new chair 😡😡#MIvsSRH #SRHvMI #RohitSharma𓃵 #klaasen #HardikPandya pic.twitter.com/araISohypL — Rishabh (@iamrishabhNP) March 27, 2024 ఈ నేపథ్యంలో ముంబై ఇండియన్స్ బౌలింగ్ కోచ్ లసిత్ మలింగతో పాండ్యా ప్రవర్తించిన తీరు చర్చనీయాంశమైంది. మ్యాచ్ అనంతరం కరచాలనం చేస్తున్న సమయంలో మలింగను నెట్టివేసినంత పనిచేశాడు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అయింది. అనంతరం మరో వీడియో కూడా తెరమీదకు వచ్చింది. ఇందులో బ్యాటింగ్ కోచ్ కీరన్ పొలార్డ్, మలింగ కుర్చీల్లో కూర్చుని ఉండగా.. హార్దిక్ అక్కడికి వచ్చాడు. ఇద్దరూ అక్కడి నుంచి లేచి వెళ్లేందుకు ప్రయత్నించగా.. పొలార్డ్‌ను చెయ్యిపట్టి ఆపిన మలింగ.. కుర్చీ ఖాళీ చేసి అక్కడి నుంచి వెళ్లిపోయాడు. WHAT. A. MATCH! 🔥 Raining sixes and 500 runs scored for the first time ever in #TATAIPL 💥 Hyderabad is treated with an epic encounter 🧡💙👏 Scorecard ▶️ https://t.co/oi6mgyCP5s#SRHvMI pic.twitter.com/hwvWIDGsLh — IndianPremierLeague (@IPL) March 27, 2024 ఆ తర్వాత ఆ కుర్చీలో కూర్చున్న పాండ్యా పొలార్డ్‌తో మాట్లాడేందుకు ప్రయత్నించగా.. అతడు కూడా ముభావంగా ఉన్నట్లు కనిపించింది. ఏదేమైనా.. ముంబై ఇండియన్స్‌లో ఇప్పుడు పాండ్యా పెత్తనమే నడుస్తోందని.. ఇది ఎవరికీ మింగుడుపడటం లేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. Im the captain 💙 HARDIK 😎 Give me my chair 🪑 #HardikPandya #pollard#malinga#SRHvMI #MIvsSRH pic.twitter.com/gixxZFj7Qn — கீரிபுள்ள 2.0❤️🔥MSD 💛CSK 💛AMARAN🤓 (@ssv__remo) March 27, 2024 -
#MI: బుమ్రాను వద్దన్నారా?.. అందులో తప్పేముంది?
‘‘జట్టుగా ముందుకు వెళ్లాలనుకున్నపుడు కొన్ని కఠిన నిర్ణయాలు అమలు చేయాల్సి ఉంటుంది. గత రెండేళ్లుగా హార్దిక్ గుజరాత్ తరఫున బౌలింగ్ ఎటాక్ ఆరంభిస్తూనే ఉన్నాడు. ఇక్కడ కూడా అంతే. కొత్త బంతిని అతడు బాగా స్వింగ్ చేయగలడు. ఇందులో కొత్తేమీ లేదు. న్యూ బాల్‌తో కలిగే ప్రయోజనాలను మేము అందిపుచ్చుకోవాలనుకున్నాం. హార్దిక్ ఈ నిర్ణయం తీసుకున్నపుడు నాకేమీ తప్పుగా అనిపించలేదు. అందుకే అలాగే ముందుకు వెళ్లాం’’ అని ముంబై ఇండియన్స్ బ్యాటింగ్ కోచ్ కీరన్ పొలార్డ్ అన్నాడు. గుజరాత్ టైటాన్స్‌తో మ్యాచ్‌లో హార్దిక్ పాండ్యా సరైన నిర్ణయాలే తీసుకున్నాడని సమర్థించాడు. కాగా ఐపీఎల్-2024ను పరాజయంతో మొదలుపెట్టింది ముంబై ఇండియన్స్. అహ్మదాబాద్‌లో గుజరాత్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆరు పరుగుల తేడాతో ఓటమిపాలైంది. ఫలితంగా ముంబై కెప్టెన్‌గా తొలి మ్యాచ్‌లో హార్దిక్ ఖాతాలో పరాజయం చేరింది. ఈ నేపథ్యంలో గుజరాత్‌తో మ్యాచ్‌లో హార్దిక్ పాండ్యా నిర్ణయాలపై విమర్శలు వస్తున్నాయి. జస్ప్రీత్ బుమ్రా వంటి వరల్డ్‌క్లాస్ పేసర్ ఉండగా.. ఆల్‌రౌండర్ పాండ్యా బౌలింగ్ ఎటాక్ ఆరంభించడమేమిటని మాజీ క్రికెటర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆటగాళ్ల సేవలను సరిగ్గా వినియోగించుకుంటునే అనుకున్న ఫలితాలు రాబట్టవచ్చని పాండ్యాకు హితవు పలుకుతున్నారు. అదే విధంగా.. లక్ష్య ఛేదనలో భాగంగా హార్దిక్ పాండ్యా ఏడోస్థానంలో రావడాన్ని విమర్శిస్తున్నారు. ఈ విషయాలపై స్పందించిన కోచ్ కీరన్ పొలార్డ్ పాండ్యాకు మద్దతుగా నిలిచాడు. కొత్త బంతితో హార్దిక్ బరిలోకి దిగడం సరైందేననన్న పొలార్డ్.. ఏడో స్థానంలో బ్యాటింగ్‌కు రావాలన్నది హార్దిక్ ఒక్కడి నిర్ణయం కాదని తెలిపాడు. ‘‘ఏ డెసిషన్ అయినా కలిసే తీసుకుంటాం. జట్టు ప్రయోజనాలకు అనుగుణంగా ఏం చేయాలో ఆలోచిస్తున్నాం. టాపార్డర్ చివరి వరకు బ్యాటింగ్ చేస్తే బాగుంటుంది. అలా కాని పక్షంలో.. టాప్, మిడిలార్డర్ విఫలమైతే పవర్ హిట్టర్లను కాస్త ఆలస్యంగా పంపిస్తాం. చాలాసార్లు టిమ్ డేవిడ్ మా మ్యాచ్‌ను ఫినిష్ చేయడం చూసే ఉంటారు. హార్దిక్ కూడా చాలా ఏళ్లుగా ఇదే పని చేస్తున్నాడు. ఆటలో ఇవన్నీ సహజం. ఎప్పుడు ఏం జరుగుతుందో అంచనా వేయలేం. నిన్న మాత్రం మా వ్యూహాలు సత్ఫలితాలను ఇవ్వలేదంతే’’ అని పొలార్డ్ చెప్పుకొచ్చాడు. చదవండి: #Hardik Pandya: నువ్వేమైనా ధోని అనుకున్నావా?.. నీకిది అవసరమా?: షమీ A game of ᴇʙʙꜱ & ꜰʟᴏᴡꜱ 🫡@gujarat_titans display quality death bowling to secure a remarkable 6️⃣ run win over #MI 👏@ShubmanGill's captaincy starts off with with a W Scorecard ▶️https://t.co/oPSjdbb1YT #TATAIPL | #GTvMI pic.twitter.com/jTBxANlAtk — IndianPremierLeague (@IPL) March 24, 2024 -
పొలార్డ్ విధ్వంసం.. ఆఖరి బంతికి గెలుపు! షాక్‌లో షాహీన్
పాకిస్తాన్ సూపర్ లీగ్-2024 సీజన్లో కరాచీ కింగ్స్ వరుసగా రెండో విజయాన్ని నమోదు చేసింది. ఈ లీగ్‌లో భాగంగా శనివారం లాహోర్ ఖలందర్స్‌తో జరిగిన ఉత్కంఠ పోరులో 2 వికెట్ల తేడాతో కరాచీ విజయం సాధించింది. చివరి బంతికి మీర్ హంజా సింగిల్ తీసి కరాచీని గెలిపించాడు. అయితే 176 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన కరాచీ కింగ్స్ 44 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. ఈ సమయంలో క్రీజులోకి వచ్చిన కరాచీ ఆటగాడు, వెస్టిండీస్ మాజీ కెప్టెన్ కిరాన్ పొలార్డ్ ప్రత్యర్ధి బౌలర్లపై ఎదుకు దాడికి దిగాడు. మరో ఎండ్‌లో ఉన్న షోయబ్ మాలిక్‌తో కలిసి స్కోర్ బోర్డును పరుగులు పెట్టించాడు. ఈ క్రమంలో కిరాన్ కేవలం 33 బంతుల్లోనే 5 సిక్స్‌లు, ఒక ఫోరుతో 58 పరుగులు చేశాడు. అయితే కరాచీ ఇన్నింగ్స్ 16 ఓవర్లో షాహీన్ అఫ్రిది.. అద్భుత బంతితో పొలార్డ్‌ను ఔట్ చేశాడు. ఆ తర్వాతి ఓవర్లోనే మాలిక్ కూడా ఔట్ కావడంతో ఒక్కసారిగా మ్యాచ్ లాహోర్ వైపు మలుపు తిరిగింది. ఆఖరి ఓవర్లో కరాచీ విజయానికి 11 పరుగులు అవసరమయ్యాయి. ఈ క్రమంలో ఆఖరి ఓవర్ వేసే బాధ్యతను కెప్టెన్ షాహీన్ షా అఫ్రిది.. ఆఫ్ స్పిన్నర్ ఆషాన్ బట్టికి అప్పగించాడు. ఇదే షాహీన్ చేసిన తప్పిదం. చివరి ఓవర్లో తొలి బంతినే హసన్ అలీ సిక్సర్‌గా మలిచాడు. దీంతో కరాచీ విజయసమీకరణం 5 బంతుల్లో 5 పరుగులగా మారిపోయింది. ఆ తర్వాత ఐదో బంతికి హసన్ అలీ ఔటైనప్పటికీ.. క్రీజులోకి వచ్చిన కొత్త బ్యాటర్ మీర్ సింగిల్ తీసి మ్యాచ్‌ను ఫినిష్ చేశాడు. ఇది చూసిన అఫ్రిది తలను పట్టుకున్నాడు. ఇక ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన లహోర్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 175 పరుగులు చేసింది. లహోర్ ఓన సాహిబ్జాదా ఫర్హాన్(72) పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. కరాచీ బౌలర్లలో మీర్ హంజా, షంసీ, హసన్ అలీ తలా రెండు వికెట్లు సాధించారు. -
పూనకాలు తెప్పించిన పోలార్డ్.. బాబర్ వరల్డ్ రికార్డు ఇన్నింగ్స్ వృధా
పాకిస్తాన్ సూపర్ లీగ్ 2024 ఎడిషన్‌లో కరాచీ కింగ్స్ ఆటగాడు, విండీస్ విధ్వంసకర యోధుడు కీరన్ పోలార్డ్ రెచ్చిపోయాడు. పెషావర్ జల్మీతో ఇవాళ (ఫిబ్రవరి 21) జరిగిన మ్యాచ్‌లో మెరుపు ఇన్నింగ్స్‌తో పూర్వంలా పూనకాలు తెప్పించాడు. 21 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో అజేయమైన 49 పరుగులు చేసి తన జట్టును గెలిపించాడు. 𝑽𝒊𝒏𝒕𝒂𝒈𝒆 𝑷𝒐𝒍𝒍𝒚 𝒊𝒏 𝑷𝑺𝑳 𝟐𝟎𝟐𝟒🔥 📸: Fan Code pic.twitter.com/uUMO58x5Sj — CricTracker (@Cricketracker) February 21, 2024 పోలార్డ్ సుడిగాలి ఇన్నింగ్స్‌తో విరుచుకుపడటంతో ప్రత్యర్ది బ్యాటర్ బాబర్ ఆజమ్ (పెషావర్) వరల్డ్ రికార్డు ఇన్నింగ్స్ వృధా అయ్యింది. ఈ మ్యాచ్‌లో 51 బంతుల్లో 7 ఫోర్లు, సిక్సర్ సాయంతో 72 పరుగులు చేసిన బాబర్.. టీ20ల్లో అత్యంత వేగంగా (271 ఇన్నింగ్స్‌ల్లో) 10,000 పరుగులు పూర్తి చేసిన ఆటగాడిగా ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. He's still got it 🥶pic.twitter.com/kthsVbhdf3 — CricTracker (@Cricketracker) February 21, 2024 పోలార్డ్‌తో పాటు జేమ్స్ విన్స్ (30 బంతుల్లో 28 నాటౌట్; 3 ఫోర్లు, సిక్స్), ముహమ్మద్ అక్లక్ (13 బంతుల్లో 24; 3 ఫోర్లు, 2 సిక్సర్లు), షోయబ్ మాలిక్ (29 బంతుల్లో 29; ఫోర్, సిక్స్) రాణించడంతో పెషావర్ నిర్ధేశించిన 155 పరుగుల లక్ష్యాన్ని కరాచీ 16.5 ఓవర్లలో కేవలం 3 వికెట్లు మాత్రమే కోల్పోయి ఛేదించింది. ఫలితంగా ఏడు వికెట్ల తేడాతో విజయం సాధించింది. పెషావర్ బౌలర్లలో లూక్ వుడ్ (3.5-1-20-2) ఒక్కడే కరాచీ బ్యాటర్లను కాస్త ఇబ్బంది పెట్టాడు. సలాంకీల్ వికెట్ తీసినప్పటికీ (4-0-54-1) భారీగా పరుగులు సమర్పించుకున్నాడు. తొలుత బ్యాటింగ్ చేసిన పెషావర్.. బాబర్ ఆజమ్ (72) రాణించడంతో 154 పరుగుల గౌరవప్రదమైన స్కోర్ (19.5 ఓవర్లలో ఆలౌట్) చేయగలిగింది. పెషావర్ ఇన్నింగ్స్‌లో బాబర్‌తో పాటు రోవ్‌మన్ పావెల్ (39), ఆసిఫ్ అలీ (23) మాత్రమే రెండంకెల స్కోర్లు చేయగలిగారు. కరాచీ బౌలర్లలో మీర్ హమ్జా, హసన్ అలీ చెరో 3 వికెట్లు, డేనియల్ సామ్స్ 2, షోయబ్ మాలిక్, మొహమ్మద్ నవాజ్ తలో వికెట్ పడగొట్టారు. -
అక్కడ అలా.. ఇక్కడ ఇలా.. ముంబై ఇండియన్స్ విచిత్ర పరిస్థితి
ప్రస్తుతం జరుగుతున్న సౌతాఫ్రికా టీ20 లీగ్, ఇంటర్నేషన్ టీ20 లీగ్‌ల్లో ముంబై ఇండియన్స్ ఫ్రాంచైజీ పరిస్థితి విచిత్రంగా ఉంది. ఈ ఫ్రాంచైజీకి చెందిన జట్లు ఓ లీగ్‌లో ఒకలా మరో, మరో లీగ్‌లో ఇంకోలా ఆడుతున్నాయి. సౌతాఫ్రికా టీ20 లీగ్‌లో ముంబై ఇండియన్స్ కేప్‌టౌన్ వరుస పరాజయాలు (10 మ్యాచ్‌ల్లో 7 ఓటములు) చవిచూసి, లీగ్ నుంచి నిష్క్రమించిన తొలి జట్టు నిలువగా.. ఇంటర్నేషనల్ లీగ్‌కు వచ్చేసరికి పరిస్థితి భిన్నంగా మారిపోయింది. ఈ లీగ్‌లో ముంబై ఇండియన్స్ ఎమిరేట్స్ జట్టు వరుస విజయాలతో (8 మ్యాచ్‌ల్లో 6 విజయాలు) దూసుకుపోతూ ప్లే ఆఫ్స్‌కు చేరిన తొలి జట్టుగా నిలిచింది. సౌతాఫ్రికా టీ20 లీగ్‌లో ఎంఐ కేప్‌టౌన్ కీరన్ పోలార్డ్ నేతృత్వంలో బరిలో నిలువగా.. ఇంటర్నేషనల్ టీ20 లీగ్‌లో ఎంఐ ఎమిరేట్స్ నికోలస్ పూరన్ సారథ్యంలో పోటీలో ఉంది. ఇవాళ (ఫిబ్రవరి 4) జరిగిన మ్యాచ్‌లో డెజర్ట్ వైపర్స్‌పై విజయంతో ఎంఐ ఎమిరేట్స్ ప్లే ఆఫ్స్ బెర్త్‌ను కన్ఫర్మ్ చేసుకుంది. కెప్టెన్ సుడిగాలి ఇన్నింగ్స్.. డెజర్ట్ వైపర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఎంఐ ఎమిరేట్స్ నిర్ణీత ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 188 పరుగులు చేసింది. ఓపెనర్ కుశాల్ పెరీరా అర్ధసెంచరీతో (46 బంతుల్లో 65; 8 ఫోర్లు, సిక్స్), అంబటి రాయుడు (38 బంతుల్లో 44; 5 ఫోర్లు, సిక్స్) పర్వాలేదనిపించాడు. ఆఖర్లో కెప్టెన్ పూరన్ సుడిగాలి ఇన్నింగ్స్‌తో (15 బంతుల్లో 39; 3 ఫోర్లు, 4 సిక్సర్లు) విరుచుకుపడ్డాడు. వైపర్స్ బౌలర్లలో మొహమ్మద్ అమిర్ 2, సౌటర్, హసరంగ, పతిరణ తలో వికెట్ పడొట్టారు. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన వైపర్స్ టాపార్డర్ అంతా విఫలం కావడంతో లక్ష్యానికి 31 పరుగుల దూరంలో నిలిచిపోయింది. ఆ జట్టు నిర్ణీత ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 158 పరుగులకే పరిమితమైంది. విధ్వంసకర హిట్టర్లు అలెక్స్ హేల్స్ (6), కొలిన్ మున్రో (7) తక్కువ స్కోర్లకే ఔట్ కాగా.. లోయర్ ఆర్డర్ బ్యాటర్ అలీ నసీర్ (63 నాటౌట్) ఆఖర్లో మెరుపు ఇన్నింగ్స్‌తో విరుచుకుపడ్డాడు. అతనికి లూక్ వుడ్ (30) తోడైనప్పటికీ అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. వైపర్స్‌ను ఎంఐ బౌలర్ ఫజల్ హక్ ఫారూకీ (4-0-31-4) దెబ్బ తీశాడు. ఈ లీగ్‌లో ముంబై ఇండియన్స్ మరో రెండు లీగ్ మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది. సౌతాఫ్రికా లీగ్ విషయానికొస్తే.. నిన్న ప్రిటోరియా క్యాపిటల్స్ చేతిలో ఓటమితో ఈ లీగ్‌లో ఎంఐ కేప్‌టౌన్ కథ ముగిసింది. -
లోయర్ ఆర్డర్ ఆటగాళ్ల మెరుపు ఇన్నింగ్స్.. ఎంఐ ఖేల్ ఖతం
MI Cape Town vs Pretoria Capitals- MI Cape Town knocked out: సౌతాఫ్రికా టీ20 లీగ్-2-24లో ఎంఐ కేప్‌టౌన్ ప్రయాణం ముగిసింది. కనీసం ప్లే ఆఫ్స్ కూడా చేరకుండా టోర్నీ నుంచి నిష్క్రమించింది. ప్రిటోరియా క్యాపిటల్స్‌తో శనివారం నాటి మ్యాచ్‌లో ఓడిపోయి ఈ పరాభవాన్ని మూటగట్టుకుంది. కేప్‌టౌన్ వేదికగా న్యూలాండ్స్‌లో క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఎంఐ జట్టు తొలుత బ్యాటింగ్ చేసింది. ఓపెనర్లు వాన్ డర్ డసెన్(46 బంతుల్లో 60), రెకెల్టన్(35) శుభారంభం అందించగా.. మిడిలార్డర్ మాత్రం పూర్తిగా విఫలమైంది. వన్‌డౌన్ బ్యాటర్ లివింగ్‌స్టోన్(6), సామ్ కరన్(3), డెవాల్డ్ బ్రెవిస్(9) సింగిల్ డిజిట్ స్కోర్లకే చేతులెత్తేయగా.. కీరన్ పొలార్డ్ కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడాడు. మొత్తం 16 బంతులు ఎదుర్కొన్న ఈ కరేబియన్ ఆల్‌రౌండర్ 33 పరుగులు సాధించాడు. మిగతవాళ్లులో ఎవరూ కూడా చెప్పుకోదగ్గ స్కోరు చేయలేదు. క్యాపిటల్స్(PC: Twitter) దంచికొట్టిన లోయర్ ఆర్డర్ ప్లేయర్లు ఈ క్రమంలో నిర్ణీత 20 ఓవర్లలో ఎంఐ కేప్‌టౌన్ 9 వికెట్ల నష్టానికి 163 పరుగులు చేసింది. ప్రిటోరియా క్యాపిటల్స్ బౌలర్లలో కెప్టెన్ వేన్ పార్నెల్ అత్యధికంగా నాలుగు వికెట్లు తీయగా.. ఆదిల్ రషీద్ రెండు, ఈథన్ బాష్ రెండు, అకెర్మాన్ ఒక వికెట్ తమ ఖాతాలో వేసుకున్నారు. 𝙃𝙤𝙬 𝙩𝙤 𝙚𝙣𝙙 𝙖𝙣 𝙞𝙣𝙣𝙞𝙣𝙜𝙨. 𝘼 𝙋𝙖𝙧𝙣𝙚𝙡𝙡 𝙈𝙖𝙨𝙩𝙚𝙧𝙘𝙡𝙖𝙨𝙨.#Betway #SA20 #WelcomeToIncredible #MICTvPC pic.twitter.com/3BtcGws1Fb — Betway SA20 (@SA20_League) February 3, 2024 ఇక లక్ష్య ఛేదనకు దిగిన 19.4 ఓవర్లలోనే టార్గెట్‌ను పూర్తి చేసింది. టాపార్డర్ విఫలం కాగా.. లోయర్ ఆర్డర్లో ఆటగాళ్లు దంచికొట్టడంతో ప్రిటోరియాకు ఈ విజయం సాధ్యమైంది. ఆరోస్థానంలో బ్యాటింగ్ చేసిన తునిస్ డి బ్రూయిన్ 33 బంతుల్లో 42 పరుగులతో చెలరేగగా.. ఆ తర్వాతి స్థానంలో వచ్చిన సెనూరన్ ముత్తుస్వామి 18 బంతుల్లోనే 38 పరుగులతో అజేయంగా నిలిచాడు. కెప్టెన్ పార్నెల్ కూడా మెరుపు ఇన్నింగ్స్(6 బంతుల్లో 12) ఆడాడు. కేప్‌టౌన్ రాతమారలేదు దీంతో నాలుగు వికెట్ల తేడాతో ఎంఐ కేప్‌టౌన్‌పై గెలిచిన ప్రిటోరియా క్యాపిటల్స్ ప్లే ఆఫ్స్ రేసులో నిలిచింది. పొలార్డ్ బృందం మాత్రం గతేడాది తరహాలోనే నిరాశగా టోర్నీ నుంచి నిష్క్రమించింది. ఇక ఇప్పటికే డిఫెండింగ్ చాంపియన్ ఈస్టర్న్‌కేప్, పర్ల్ రాయల్స్, డర్బన్ సూపర్‌జెయింట్స్ ప్లే ఆఫ్స్‌లో అడుగుపెట్టాయి. క్యాపిటల్స్‌తో పాటు సూపర్ కింగ్స్ కూడా నాలుగో స్థానం కోసం పోటీపడుతోంది. -
కీరన్ పొలార్డ్ ఊచకోత.. కేవలం 7 బంతుల్లోనే
వెస్టిండీస్ మాజీ కెప్టెన్ కిరాన్ పోలార్డ్ తనలో ఏ మాత్రం దూకుడు తగ్గలేదని నిరూపించుకుంటున్నాడు. సౌతాఫ్రికా టీ20 లీగ్-2024లో ఏంఐ కేప్‌టౌన్‌కు సారథ్యం వహిస్తున్న పొలార్డ్ ఆల్ రౌండ్ ప్రదర్శనతో అదరగొడుతున్నాడు. ఈ లీగ్‌లో భాగంగా గురువారం ప్రిటోరియా క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో పొలార్డ్ మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. ఆరో స్ధానంలో బ్యాటింగ్ వచ్చి ప్రిటోరియా బౌలర్లకు చుక్కలు చూపించాడు. కేవలం 7 బంతుల్లోనే 2 ఫోర్లు, 3 సిక్స్‌లతో 27 పరుగులు చేసి ఆజేయంగా నిలిచాడు. అంతేకాకుండా బౌలింగ్‌లో కూడా ఓ వికెట్ పడగొట్టాడు. ఇక ఈ మ్యచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఏంఐ కేప్‌టౌన్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 248 పరుగుల భారీ స్కోర్ సాధించింది. ఏంఐ బ్యాటర్లలో ఓపెనర్ రికెల్టన్ విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడాడు. కేవలం 45 బంతుల్లో 10 ఫోర్లు, 5 సిక్స్‌ల సాయంతో 90 పరుగులు చేశాడు. అతడితో పాటు డెవాల్డ్ బ్రెవిస్( 32 బంతుల్లో66, 3 ఫోర్లు, 6 సిక్స్‌లు) మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. అనంతరం 249 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ప్రిటోరియా ఆఖరి వరకు పోరాడింది. లక్ష్య చేధనలో ప్రిటోరియా 8 వికెట్ల నష్టానికి 214 పరుగులు చేసింది. దీంతో 34 పరుగుల తేడాతో ఓటమి చవిచూసింది. కాగా ప్రిటోరియా బ్యాటర్ కైల్ వెర్రెయిన్నే విధ్వంసకర సెంచరీతో చెలరేగాడు. 52 బంతుల్లో 7 ఫోర్లు, 9 సిక్స్‌లతో 116 పరుగులు చేసి ఆజేయంగా నిలిచాడు. -
94 నాటౌట్.. ఎంఐ కేప్‌టౌన్ ఘన విజయం! పొలార్డ్ ప్రశంసలు
సౌతాఫ్రికా టీ20 లీగ్-2024లో హ్యాట్రిక్ విజయాలతో జోరు మీదున్న పర్ల్ రాయల్స్‌కు ఎంఐ కేప్‌టౌన్ షాకిచ్చింది. సీజన్ ఆరంభం నుంచి వరుసగా మూడు మ్యాచ్‌లు గెలిచిన మిల్లర్ బృందానికి తొలి ఓటమిని రుచి చూపించింది. వికెట్ కీపర్ బ్యాటర్ రియాన్ రెకెల్టన్ విధ్వంసకర ఇన్నింగ్స్‌తో విరుచుకుపడటంతో కేప్‌టౌన్‌కు ఈ విజయం సాధ్యమైంది. సొంత మైదానం న్యూల్యాండ్స్‌లో శుక్రవారం నాటి మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఎంఐ కేప్‌టౌన్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. స్పిన్ ఆల్‌రౌండర్ థామస్ కెబర్ మూడు కీలక వికెట్లు తీసి పర్ల్ రాయల్స్‌ను దెబ్బకొట్టాడు. మిగతా వాళ్లలో ఓలీ స్టోన్, జార్జ్ లిండే, కగిసో రబడ, సామ్ కరన్ ఒక్కో వికెట్ తీశారు. ఈ క్రమంలో నిర్ణీత 20 ఓవర్లలో పర్ల్ జట్టు ఎనిమిది వికెట్ల నష్టానికి 172 పరుగులు సాధించింది. ఇక లక్ష్య ఛేదనలో ఎంఐ కేప్‌టౌన్‌కు ఓపెనర్లు రాసీ వాన్ డర్ డసెన్(28 బంతుల్లో 41), రియాన్ రెకెల్టన్ అద్భుత ఆరంభం అందించారు. రెకెల్టన్ ఆకాశమే హద్దుగా చెలరేగుతూ ఫోర్లు, సిక్సర్ల వర్షం కురిపించాడు. మొత్తంగా 52 బంతులు ఎదుర్కొని 7 ఫోర్లు, 6 సిక్సర్ల సాయంతో 94 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. ఇక.. వన్‌డౌన్ బ్యాటర్ డెవాల్డ్ బ్రెవిస్(10) విఫలం కాగా.. నాలుగో నంబర్ బ్యాటర్ కానర్(17*), రియాన్‌తో కలిసి ఆఖరి వరకు అజేయంగా నిలిచాడు. ఈ నేపథ్యంలో 16.5 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించిన ఎంఐ కేప్‌టౌన్.. పర్ల్ రాయల్స్ మీద 8 వికెట్ల తేడాతో జయభేరి మోగించింది. రియాన్‌కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. గెలుపు అనంతరం ఎంఐ కేప్‌టౌన్ కెప్టెన్ కీరన్ పొలార్డ్ మాట్లాడుతూ.. ‘‘మంచి ఆరంభం ఇవ్వాలని ఓపెనర్లకు చెప్పాము. రెకెల్టన్ అద్భుతం చేశాడు. అతడికి మేము అవకాశం ఇచ్చాం. పూర్తిగా సద్వినియోగం చేసుకున్నాడు. ప్రతిభకు ఆకాశమే హద్దు’’ అంటూ రియాన్ రెకెల్టన్ను ప్రశంసించాడు. -
IPL 2024: పొలార్డ్ పోస్ట్ వైరల్.. మళ్లీ రోహిత్ శర్మనే దిక్కవుతాడా?
ఐపీఎల్-2024కు ముందు కెప్టెన్‌ను మారుస్తూ ముంబై ఇండియన్స్ తీసుకున్న నిర్ణయం పట్ల విమర్శలు కొనసాగుతూనే ఉన్నాయి. రోహిత్ శర్మనే సారథిగా కొనసాగించాలని అభిమానులు సోషల్ మీడియా వేదికగా ఇప్పటికీ డిమాండ్ చేస్తూనే ఉన్నారు. ఈ నేపథ్యంలో ముంబై జట్టు మాజీ ఆల్‌రౌండర్, ప్రస్తుత బ్యాటింగ్ కోచ్ కీరన్ పొలార్డ్ ఇన్‌స్టా పోస్టు నెట్టింట వైరల్ అవుతోంది. విశ్వసనీయత కూడా అంతే.. భారమైపోతుంది ‘‘ఒక్కసారి వర్షం కురిసి వెలిసిపోయాక.. ప్రతి ఒక్కరికి తాము పట్టుకున్న గొడుగు భారంగానే అనిపిస్తుంది. విశ్వాసం కూడా అంతే! ఎప్పుడైతే లబ్ది చేకూరడం ఆగిపోతుందో అప్పుడే విశ్వసనీయత కూడా చెల్లిపోతుంది’’ అన్న అర్థంలో పొలార్డ్ ఓ కోట్ షేర్ చేశాడు. ఇందుకు నెటిజన్ల నుంచి మిశ్రమ స్పందన వస్తోంది. ముంబై ఇండియన్స్ రోహిత్ శర్మను కెప్టెన్‌గా తప్పించడాన్ని ఉద్దేశించే పొలార్డ్ ఈ పోస్ట్ పెట్టాడని హిట్‌మ్యాన్ ఫ్యాన్స్ భావిస్తుండగా.. రోహిత్ తనకు తానుగా తప్పుకొన్నాడు కాబట్టి ఇరు వర్గాలను ఉద్దేశించి పొలార్డ్ ఇలా అంటున్నాడని మరికొంత మంది అభిప్రాయపడుతున్నారు. పాండ్యాను రప్పించి.. కెప్టెన్‌గా నియమించి కాగా ఐపీఎల్-2024 వేలానికి ముందు టీమిండియా ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యాను గుజరాత్ టైటాన్స్ నుంచి ముంబై ట్రేడ్ చేసుకున్న విషయం తెలిసిందే. పాండ్యా కోసం భారీ మొత్తం చెల్లించిన ముంబై.. అతడిని తమ కెప్టెన్‌గా నియమిస్తూ సంచలన ప్రకటన చేసింది. ఐదుసార్లు ముంబైని చాంపియన్‌గా నిలిపిన రోహిత్ శర్మను తప్పిస్తూ.. సారథ్య బాధ్యతలను పాండ్యాకు అప్పగించింది. దీంతో సొంత అభిమానుల నుంచే విమర్శలు ఎదుర్కొన్న ముంబై ఇండియన్స్ సోషల్ మీడియాలో భారీ ఎత్తున ఫాలోవర్లను కోల్పోయింది. ఇదిలా ఉంటే.. కొత్త కెప్టెన్‌గా నియమితుడైన పాండ్యా గాయం కారణంగా ఐపీఎల్ ఆరంభ మ్యాచ్‌లకు అందుబాటులో ఉండే పరిస్థితి కనిపించడం లేదు. రోహిత్ శర్మనే మళ్లీ దిక్కవుతాడా? ఈ నేపథ్యంలో అఫ్గనిస్తాన్‌తో టీ20 సిరీస్ సందర్భంగా అంతర్జాతీయ పొట్టి ఫార్మాట్లో రీఎంట్రీ ఇస్తున్న రోహిత్ శర్మనే మళ్లీ దిక్కవుతాడా? లేదంటే కొత్త వాళ్లకు పగ్గాలు అప్పగిస్తారా? అన్నది ఆసక్తికరంగా మారింది. మరోవైపు.. సౌతాఫ్రికా టీ20 లీగ్ ఫ్రాంఛైజీ ఎంఐ కేప్‌టౌన్‌కు కీరన్ పొలార్డ్‌ను ముంబై తమ సారథిగా ఎంపిక చేసింది. ఈ విషయాన్ని ఆదివారం ధ్రువీకరించింది. Kieron Pollard's Instagram story. pic.twitter.com/4fyml5GPf7 — Mufaddal Vohra (@mufaddal_vohra) January 7, 2024 -
కెప్టెన్ల పేర్లను ప్రకటించిన ముంబై ఇండియన్స్
ఐపీఎల్ ఫ్రాంచైజీ అయిన ముంబై ఇండియన్స్ సౌతాఫ్రికా టీ20 లీగ్, ఇంటర్నేషనల్ టీ20 లీగ్‌ల కోసం తమ అనుబంధ ఫ్రాంచైజీలైన ముంబై ఇండియన్స్ కేప్‌టౌన్, ముంబై ఇండియన్స్ ఎమిరేట్స్ జట్లకు కెప్టెన్లను ప్రకటించింది. ఎంఐ కేప్‌టౌన్‌కు (SA20 2024) కీరన్ పోలార్డ్, ఎంఐ ఎమిరేట్స్‌కు (ILT20 2024) నికోలస్ పూరన్ కెప్టెన్లుగా వ్యవహరిస్తారని ముంబై యాజమాన్యం ఇవాళ వెల్లడించింది. సౌతాఫ్రికా టీ20 లీగ్ ఈ నెల 10 నుంచి ప్రారంభం కానుండగా.. ఇంటర్నేషనల్ టీ20 లీగ్ ఈ నెల 19 నుంచి మొదలవుతుంది. కాగా, కీరన్ పోలార్డ్ అమెరికా వేదికగా జరిగే మేజర్ లీగ్ క్రికెట్లో కూడా ముంబై ఇండియన్స్ అనుబంధ ఫ్రాంచైజీ అయిన ఎంఐ న్యూయార్క్‌కు కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు. ఐపీఎల్ ఫ్రాంచైజీ అయిన ముంబై ఇండియన్స్ ఇటీవల తమ కెప్టెన్‌ను మార్చిన విషయం తెలిసిందే. ఐదుసార్లు ముంబై ఇండియన్స్‌ను ఐపీఎల్ ఛాంపియన్‌గా నిలిపిన రోహిత్ శర్మ స్థానంలో హార్దిక్ పాండ్యాను కెప్టెన్‌గా ఎంపిక చేసింది ముంబై ఇండియన్స్ యాజమాన్యం. మహిళల ఐపీఎల్లో ముంబై ఇండియన్స్ కెప్టెన్‌గా హర్మన్‌ప్రీత్ కౌర్ వ్యవహరిస్తుంది. ఇదిలా ఉంటే, సౌతాఫ్రికా టీ20 లీగ్, ఇంటర్నేషనల్ టీ20 లీగ్‌ల తర్వాత మే నెలలో ఐపీఎల్ 2024 ప్రారంభమయ్యే అవకాశం ఉంది. గత ఎడిషన్‌లో అట్టడుగు స్థానంలో నిలిచి ఫ్యాన్స్‌ను తీవ్రంగా నిరాశపర్చిన ముంబై ఇండియన్స్ ఈసారి కొత్త జట్టుతో ఉత్సాహంగా కనిపిస్తుంది. కొద్ది రోజుల కిందట జరిగిన వేలంలో ముంబై ఇండియన్స్ సౌతాఫ్రికా పేస్ గన్ గెరాల్డ్ కోయెట్, లంక పేసర్ దిల్షాన్ మధుశంకను భారీ మొత్తం వెచ్చించి సొంతం చేసుకుంది. ప్రస్తుతం ముంబై ఇండియన్స్‌లో మొత్తం 25 మంది ఆటగాళ్లు ఉన్నారు. ముంబై ఇండియన్స్ పూర్తి జట్టు.. రోహిత్ శర్మ బ్యాట్స్‌మన్ 16 కోట్లు జస్ప్రీత్ బుమ్రా బౌలర్ 12 కోట్లు సూర్యకుమార్ యాదవ్ బ్యాట్స్‌మన్ 8 కోట్లు ఇషాన్ కిషన్ బ్యాట్స్‌మన్ 15.25 కోట్లు డెవాల్డ్ బ్రెవిస్ బ్యాట్స్‌మన్ 3 కోట్లు తిలక్ వర్మ బ్యాట్స్‌మెన్ 1.7 కోట్లు హార్దిక్ పాండ్యా ఆల్ రౌండర్ 15 కోట్లు (కెప్టెన్) టిమ్ డేవిడ్ ఆల్ రౌండర్ 8.25 కోట్లు అర్జున్ టెండూల్కర్ బౌలర్ 30 లక్షలు కుమార్ కార్తికేయ బౌలర్ 20 లక్షలు జాసన్ బెహ్రెన్‌డార్ఫ్ బౌలర్ 75 లక్షలు ఆకాష్ మధ్వల్ బౌలర్ 20 లక్షలు విష్ణు వినోద్ వికెట్ కీపర్ 20 లక్షలు రొమారియో షెపర్డ్ ఆల్ రౌండర్ 50 లక్షలు షామ్స్ ములానీ ఆల్ రౌండర్ 20 లక్షలు నేహాల్ వధేరా బ్యాటర్ 20 లక్షలు పీయూష్ చావ్లా బౌలర్ 50 లక్షలు గెరాల్డ్ కోయెట్జీ ఆల్ రౌండర్ 5 కోట్లు దిల్షాన్ మధుశంక బౌలర్ 4.6 కోట్లు శ్రేయాస్ గోపాల్ బౌలర్ 20 లక్షలు నువాన్ తుషార బౌలర్ 4.8 కోట్లు నమన్ ధీర్ ఆల్ రౌండర్ 20 లక్షలు అన్షుల్ కాంబోజ్ బౌలర్ 20 లక్షలు మహ్మద్ నబీ ఆల్ రౌండర్ 1.5 కోట్లు శివాలిక్ శర్మ ఆల్ రౌండర్ 20 లక్షలు -
ఇంగ్లండ్ జట్టు అసిస్టెంట్ కోచ్‌గా కీరన్ పొలార్డ్..
టీ20 వరల్డ్‌కప్-2024కు ముందు ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. తమ జట్టు అసిస్టెంట్ కోచ్‌గా వెస్టిండీస్ మాజీ కెప్టెన్ కీరన్ పొలార్డ్‌ను నియమించింది. వచ్చే ఏడాది టీ20 వరల్డ్‌కప్ అమెరికా, వెస్టిండీస్ వేదికలగా జరగనున్న నేపథ్యంలో ఈసీబీ ఈ నిర్ణయం తీసుకుంది. "వచ్చే ఏడాది టీ20 ప్రపంచకప్ కోసం ఇంగ్లండ్ పురుషుల జట్టు అసిస్టెంట్ కోచ్‌గా వెస్టిండీస్ మాజీ కెప్టెన్ కీరన్ పొలార్డ్ పొలార్డ్ నియమితులయ్యారు. పొలార్డ్‌కు టీ20ల్లో అపారమైన అనుభవం ఉంది. టీ20 వరల్డ్‌కప్- 2012 విజయంలో పొలార్డ్ కీలక పాత్ర పోషించాడు. టీ20ల్లో 600 కంటే ఎక్కువ మ్యాచ్‌లు ఆడాడు. అటువంటి లెజెండరీ క్రికెటర్‌తో ఒప్పందం కుదర్చుకోవడం చాలా సంతోషంగా ఉంది" అని ఇంగ్లండ్ వెల్స్ క్రికెట్ బోర్డు ఒక ప్రకటనలో పేర్కొంది. కాగా గతేడాది అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పిన పొలార్డ్ ప్రస్తుతం ముంబై ఇండియన్స్ బ్యాటింగ్ కోచ్‌గా పనిచేస్తున్నాడు. అయితే అంతర్జాతీయ స్ధాయిలో కోచ్‌గా బాధ్యతలు చేపట్టడం ఇదే తొలిసారి. ఇక 2007లో దక్షిణాఫ్రికాతో జరిగిన వన్డే మ్యాచ్‌తో అరంగేట్రం చేసిన పొలార్డ్ 15 ఏళ్ల పాటు విండీస్ జట్టుకు ప్రాతినిథ్యం వహించాడు. 123 వన్డేలు, 101 టీ20లు ఆడిన పొలార్డ్.. వరుసగా 2,706, 1569 పరుగులు చేశాడు. అతడి కెరీర్లో 3 అంతర్జాతీయ సెంచరీలు ఉన్నాయి. -
IPL 2024: ముంబై ఇండియన్స్ ప్రకటన.. అతడితో తెగదెంపులు! కొత్త కోచ్‌గా..
IPL 2024- Mumbai Indians: ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఫ్రాంఛైజీ ముంబై ఇండియన్స్ కీలక ప్రకటన చేసింది. ఐపీఎల్-2024 సీజన్లో తమ బ్యాటింగ్, బౌలింగ్ కోచ్‌లుగా ఇద్దరు దిగ్గజ క్రికెటర్లను నియమించుకున్నట్లు వెల్లడించింది. గతంలో వీరిద్దరు ముంబై ఇండియన్స్‌కు ఆడినవారే కావడం విశేషం. బ్యాటింగ్ కోచ్‌గా విండీస్ దిగ్గజం కాగా తమ బ్యాటింగ్ కోచ్‌గా ముంబై ఫ్రాంఛైజీ ఇప్పటికే వెస్టిండీస్ మాజీ ఆల్‌రౌండర్ కీరన్ పొలార్డ్ పేరును ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో శ్రీలంక లెజెండరీ పేసర్ లసిత్ మలింగను తమ బౌలింగ్ కోచ్‌గా ఎంచుకున్నట్లు తెలిపింది. నాకు దక్కిన గౌరవం: బౌలింగ్ కోచ్ మలింగ ఇక తన నియామకంపై స్పందించిన మలింగ.. ‘‘ఇప్పటికే ఎంఐ న్యూయార్క్, ఎంఐ కేప్టౌన్లతో నా ప్రయాణం మొదలైంది. ఇప్పుడు ముంబై ఇండియన్స్ బౌలింగ్ కోచ్‌గా నియమితుడిని కావడం గొప్పగా అనిపిస్తోంది. పోలీ, రోహిత్, మార్క్‌లతో పాటు జట్టు మొత్తానికి మరింత సన్నిహితంగా మెలిగే అవకాశం వస్తుంది. ముఖ్యంగా బౌలింగ్ విభాగంతో నాకు కొత్త అనుబంధం ఏర్పడుతుంది. ప్రతిభావంతులైన యువ బౌలర్లకు మార్గదర్శనం చేయడం నాకు దక్కిన గౌరవం’’ అని హర్షం వ్యక్తం చేశాడు. షేన్ బాండ్‌తో తెగదెంపులు కాగా ముంబై ఇండియన్స్ బౌలింగ్ కోచ్‌గా లసిత్ మలింగ షేన్ బాండ్ స్థానాన్ని భర్తీ చేయనున్నాడు. తొమ్మిదేళ్లపాటు ముంబై ఇండియన్స్ కోచ్‌గా వ్యవహరించిన న్యూజిలాండ్ మాజీ పేసర్ షేన్ బాండ్‌తో ఫ్రాంఛైజీ తెగదెంపులు చేసుకున్న తరుణంలో మలింగకు ఈ అవకాశం దక్కినట్లు తెలుస్తోంది. నాలుగుసార్లు టైటిల్ గెలిచిన ముంబై జట్లలో సభ్యుడు ఇక ఆటగాడిగా మలింగ ఐపీఎల్ కెరీర్ విషయానికొస్తే.. 2008 నుంచి 2020 వరకు ముంబై ఇండియన్స్‌కి ప్రాతినిథ్యం వహించాడు. ఇందులో భాగంగా 122 మ్యాచ్‌లు ఆడి రికార్డు స్థాయిలో 170 వికెట్లు తీశాడు. అదే విధంగా.. 2013, 2015, 2017, 2019లో ట్రోఫీ గెలిచిన ముంబై ఇండియన్స్ జట్టులో సభ్యుడైన మలింగ ఖాతాలో నాలుగు టైటిళ్లు ఉన్నాయి. ఇక ప్లేయర్‌గా 2021లో రిటైరైన తర్వాత మలింగ బౌలింగ్ కోచ్‌గా అవతారమెత్తాడు. రాజస్తాన్ రాయల్స్ జట్టుకు 2022, 2023 సీజన్లలో పేస్ బౌలింగ్ కోచ్‌గా పనిచేశాడు. ఇప్పుడు ముంబై క్యాంపులో పునరాగమనం చేయనున్నాడు. చదవండి: Virat Kohli: 78వ సెంచరీ! వాళ్ల వల్లే సాధ్యమైంది.. జడ్డూకు సారీ చెప్పాలి: కోహ్లి 𝗕𝗔𝗧𝗧𝗜𝗡𝗚 𝗖𝗢𝗔𝗖𝗛 - 🄿🄾🄻🄻🄰🅁🄳 𝗕𝗢𝗪𝗟𝗜𝗡𝗚 𝗖𝗢𝗔𝗖𝗛 - 🄼🄰🄻🄸🄽🄶🄰 Paltan, आता कसं वाटतय? 🤩#OneFamily #MumbaiIndians #MumbaiMeriJaan @malinga_ninety9 @KieronPollard55 pic.twitter.com/bdPWVrfuDy — Mumbai Indians (@mipaltan) October 20, 2023 -
రికార్డు స్థాయిలో ఐదోసారి ఫైనల్‌కు చేరిన పోలార్డ్ టీమ్
కరీబియన్ ప్రీమియర్ లీగ్‌లో విండీస్ దిగ్గజ ఆల్‌రౌండర్ కీరన్ పోలార్డ్ నేతృత్వం వహిస్తున్న ట్రిన్‌బాగో నైట్‌రైడర్స్ జట్టు రికార్డు స్థాయిలో ఐదోసారి ఫైనల్‌కు చేరింది. ఈ లీగ్‌లో నైట్‌రైడర్స్‌తో పాటు అమెజాన్ వారియర్స్ కూడా ఐదుసార్లు ఫైనల్స్‌కు చేరినప్పటికీ, ఆ జట్టు ఒక్కసారి కూడా టైటిల్ సాధించలేకపోయింది. అయితే నైట్‌రైడర్స్ ఇప్పటివరకు ఆడిన నాలుగు ఫైనల్స్‌లో విజయాలు సాధించి, రికార్డు స్థాయిలో ఐదో టైటిల్‌పై కన్నేసింది. సీపీఎల్‌లో అత్యధిక టైటిల్స్ (4) రికార్డు నైట్‌రైడర్స్ పేరిటే ఉంది. నైట్‌రైడర్స్ తర్వాత జమైకా తల్లావాస్ మూడు సార్లు, బార్బడోస్ రాయల్స్ రెండు సార్లు, సెయింట్ కిట్స్ అండ్ నెవిస్ పేట్రియాట్స్ ఓసారి సీపీఎల్ టైటిల్ సాధించాయి. ప్రస్తుతం జరుగుతున్న 2023 ఎడిషన్ పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో నిలిచిన నైట్‌రైడర్స్, క్వాలిఫయర్ 1లో గయానా అమెజాన్ వారియర్స్‌పై విజయం సాధించి, నేరుగా ఫైనల్ బెర్త్ ఖరారు చేసుకుంది. ఇవాళ (సెప్టెంబర్ 21) జరిగిన క్వాలిఫయర్ 1 మ్యాచ్‌లో ఆ జట్టు అమెజాన్ వారియర్స్‌పై 7 వికెట్ల తేడాతో గెలుపొందింది. తొలుత బ్యాటింగ్ చేసిన వారియర్స్.. సైమ్ అయూబ్ (49), అజమ్ ఖాన్ (36) ఓ మోస్తరుగా రాణించడంతో నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 166 పరుగులు చేసింది. నైట్‌రైడర్స్ బౌలర్లలో వకార్ సలామ్‌ఖీల్, టెర్రెన్స్ హిండ్స్ చెరో 2 వికెట్లు.. అకీల్ హొస్సేన్, అలీ ఖాన్ తలో వికెట్ పడగొట్టారు. అనంతరం 167 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన నైట్‌రైడర్స్.. 18.1 ఓవర్లలో 3 వికెట్లు మాత్రమే కోల్పోయి విజయతీరాలకు చేరింది. చాడ్విక్ వాల్టన్ అజేయమైన 80 పరుగులతో నైట్‌రైడర్స్‌ను గెలిపించాడు. పూరన్ (33), పోలార్డ్ (23) ఓ మోస్తరుగా రాణించారు. వారియర్స్ బౌలర్లలో డ్వేన్ ప్రిటోరియస్ 2, ఇమ్రాన్ తాహిర్ ఓ వికెట్ పడగొట్టారు. జమైకా తల్లావాస్, అమెజాన్ వారియర్స్ మధ్య సెప్టెంబర్ 23న జరిగే రెండో క్వాలిఫయర్ విజేతతో నైట్‌రైడర్స్ ఫైనల్స్‌లో తలపడుతుంది. ఈ మ్యాచ్ సెప్టెంబర్ 25న జరుగనుంది. -
శివాలెత్తిన గప్తిల్.. 9 సిక్సర్ల సాయంతో విధ్వంసకర శతకం
కరీబియన్ ప్రీమియర్ లీగ్ 2023 ఎడిషన్‌లో తొలి సెంచరీ నమోదైంది. బార్బడోస్ రాయల్స్‌తో నిన్న (ఆగస్ట్ 31) జరిగిన మ్యాచ్‌లో ట్రిన్‌బాగో నైట్‌రైడర్స్ ఓపెనర్ మార్టిన్ గప్తిల్ విధ్వంసకర శతకంతో విరుచుకుపడ్డాడు. 58 బంతుల్లో బౌండరీ, 9 సిక్సర్ల సాయంతో అజేయమైన 100 పరుగులు చేశాడు. గప్తిల్‌కు పోలార్డ్ (32 బంతుల్లో 46; ఫోర్, 4 సిక్సర్లు), మార్క్ దెయాల్ (19 బంతుల్లో 27; 2 ఫోర్లు, 2 సిక్సర్లు) తోడవ్వడంతో తొలుత బ్యాటింగ్ చేసిన నైట్‌రైడర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 194 పరుగులు చేసింది. Raise your bat Martin Guptill. What a knock from the kiwi sensation 🙌 #CPL23 #BRvTKR #CricketPlayedLouder #BiggestPartyInSport #Betbarter @BetBarteronline pic.twitter.com/GdqWmEzPx5 — CPL T20 (@CPL) August 31, 2023 నైట్‌రైడర్స్‌లో గప్తిల్, పోలార్డ్‌తో పాటు నికోలస్ పూరన్ (6), ఆండ్రీ రసెల్ (5), డ్వేన్ బ్రావో (0) లాంటి హేమాహేమీలు ఉన్నప్పటికీ, వారు తక్కువ స్కోర్లకే ఔటయ్యారు. గప్తిల్ ధాటికి బార్బడోస్ బౌలర్ ఓబెద్ మెక్కాయ్ బలయ్యాడు. అతను 4 ఓవర్లు వేసి వికెట్లేమీ తీయకుండా 47 పరుగులు సమర్పించుకున్నాడు. గప్తిల్ మరో బార్బడోస్ బౌలర్ రకీమ్ కార్న్‌వాల్‌ను కూడా ఆడుకున్నాడు. కార్న్‌వాల్ కేవలం 2 ఓవర్లు వేసి 21 పరుగులు సమర్పించుకున్నాడు. బార్బడోస్ బౌలర్లలో జేసన్ హోల్డర్ 2.. కైస్ అహ్మద్, వాన్ డర్ మెర్వ్ తలో వికెట్ దక్కించుకున్నారు. వకార్ దెబ్బకు కుప్పకూలిన బార్బడోస్.. నైట్‌రైడర్స్ నిర్ధేశించిన 195 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన బార్బడోస్.. వకార్ సలామ్ కైల్ (3.1-0-14-4), ఆండ్రీ రసెల్ (2-0-13-2), అకీల్ హొసేన్ (4-0-16-2), సునీల్ నరైన్ (2-0-11-1) దెబ్బకు 12.1 ఓవర్లలో 61 పరుగులు మాత్రమే చేసి చాపచుట్టేసింది. బార్బడోస్ ఇన్నింగ్స్‌లో ఓపెనర్లు రకీమ్ కార్న్‌వాల్, కైల్ మేయర్స్ డకౌట్లు కాగా.. లారీ ఈవాన్స్ (5), అథనేజ్ (2), కెవిన్ విక్హమ్ (9), యంగ్ (3), వాన్ డర్ మెర్వ్ (3), ఓబెద్ మెక్ కాయ్ (1) సింగిల్ డిజిట్ స్కోర్లకే పరిమితమయ్యారు. జేసన్ హోల్డర్ (14), రోవ్‌మన్ పావెల్ (10), కైస్ అహ్మద్ (10 నాటౌట్) అతికష్టం మీద రెండంకెల స్కోర్లు చేశారు. -
సిక్సర్ల సునామీ.. విధ్వంసం సృష్టించిన విండీస్ వీరులు
కరీబియన్ ప్రీమియర్ లీగ్ 2023లో భాగంగా నిన్న జరిగిన రెండు మ్యాచ్‌ల్లో సిక్సర్ల మోత మోగింది. పలువురు విండీస్ జాతీయ జట్టు ఆటగాళ్లు ఆకాశమే హద్దుగా చెలరేగిపోయారు. వీరి సిక్సర్ల సునామీలో మైదానాలు కొట్టుకుపోయాయి. వీరి బాదుడు అభిమానులకు అసలుసిసలు టీ20 క్రికెట్ మజాను అందించింది. బంతి పడటమే ఆలస్యం అన్నట్లుగా బౌలర్లను ఊచకోత కోశారు. ఫలితంగా భారీ స్కోర్లు నమోదవ్వడంతో పాటు పలు రికార్డులు కూడా బద్దలయ్యాయి. హెట్‌మైర్, కీమో పాల్ ఊచకోత జమైకా తల్లావాస్-గయానా అమెజాన్ వారియర్స్ మధ్య జరిగిన మ్యాచ్ విషయానికొస్తే.. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన గయానా.. షిమ్రోన్ హెట్‌మైర్ (45 బంతుల్లో 60; 3 ఫోర్లు, 4 సిక్సర్లు), కీమో పాల్ (29 బంతుల్లో 57; ఫోర్, 7 సిక్సర్లు) సుడిగాలి అర్ధశతకాలతో విరుచుకుపడటంతో నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 210 పరుగులు చేసింది. కీమో పాల్ ఆకాశమే హద్దుగా చెలరేగి దాదాపుగా ప్రతి బంతిని సిక్సర్‌గా మలిచాడు. THE CHAMPION! What a way to mark your 100th CPL match by taking a wicket in your first ball 🙌 @DJBravo47 strikes again! #CPL23 #SKNPvTKR #CricketPlayedLouder #BiggestPartyInSport #RepublicBank pic.twitter.com/aRoSZv9J2B — CPL T20 (@CPL) August 28, 2023 వీరికి షాయ్ హోప్ (17 బంతుల్లో 25; 2 సిక్సర్లు), రొమారియో షెపర్డ్ (9 బంతుల్లో 19 నాటౌట్; 2 ఫోర్లు, సిక్స్) జతకావడంతో గయానా టీమ్ 200 పరుగుల మార్కును దాటింది. జమైకా బౌలర్లలో మహ్మద్ ఆమిర్ 3 వికెట్లు పడగొట్టగా.. క్రిస్ గ్రీన్ 2, సల్మాన్ ఇర్షాద్, రీఫర్ తలో వికెట్ దక్కించుకున్నారు. సరిపోని ఇమాద్ వసీం, ఫేబియన్ అలెన్ మెరుపులు 211 పరుగుల భారీ లక్ష్యఛేదనలో ఇమాద్ వసీం (36 బంతుల్లో 63; 3 ఫోర్లు, 5 సిక్సర్లు), ఫేబియన్ అలెన్ (25 బంతుల్లో 47; 6 సిక్సర్లు) మెరుపు ఇన్నింగ్స్‌లు ఆడినా జమైకా విజయతీరాలకు చేరలేకపోయింది. వీరు మినహా మిగతావారెవ్వరూ రాణించడకపోవడంతో జమైకా ఇన్నింగ్స్ 18.4 ఓవర్లలోనే ముగిసింది. ఆ జట్టు 176 పరుగులు మాత్రమే చేసి ఆలౌటైంది. ఫలితంగా గయానా 34 పరుగుల తేడాతో గెలుపొందింది. రొమారియో షెపర్డ్ (3-1-7-3) అద్భుతమైన ప్రదర్శనతో జమైకా పతనాన్ని శాసించగా.. ప్రిటోరియస్ (2/35), సింక్లెయిర్ (2/17) రాణించారు. Rutherford Relishes Responsibility💪 Captain's knock from Sherfane👏#CPL23 #SKNPvTKR #CricketPlayedLouder #BiggestPartyInSport #Skyfair pic.twitter.com/lSvN2Kehfi — CPL T20 (@CPL) August 28, 2023 రూథర్‌పోర్డ్ ప్రయాస వృధా.. సెయింట్ కిట్స్ అండ్ నెవిస్ పేట్రియాట్స్‌తో నిన్న జరిగిన మ్యాచ్‌లో ట్రిన్‌బాగో నైట్‌రైడర్స్ బ్యాటర్లు ఉగ్రరూపం దాల్చారు. ఫలితంగా వారి జట్టు 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన సెయింట్ కిట్స్.. షెర్ఫాన్ రూథర్‌ఫోర్డ్ (38 బంతుల్లో 62 నాటౌట్; 4 ఫోర్లు, 5 సిక్సర్లు), ఆండ్రీ ఫ్లెచర్ (17 బంతుల్లో 32; 3 ఫోర్లు, 3 సిక్సర్లు), కోర్బిన్ బాష్ (21 బంతుల్లో 30; 3 ఫోర్లు, సిక్స్) రాణించడంతో నిర్ణీత ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 178 పరుగులు చేసింది. నైట్‌రైడర్స్ బౌలర్లలో సునీల్ నరైన్ 3 వికెట్లతో రాణించగా.. బ్రావో 2 వికెట్లు పడగొట్టాడు. Nicky P with an entertaining innings 🙌!#CPL23 #SKNPVTKR #CricketPlayedLouder #BiggestPartylnSport #Skyfair pic.twitter.com/WAcooLRBgu — CPL T20 (@CPL) August 28, 2023 Wowza 🤩 @KieronPollard55 SMASHES 4 💯 meter sixes in a row 🔥 #CPL23 #SKNPvTKR #CricketPlayedLouder #BiggestPartyInSport #BetBarter pic.twitter.com/qVpn0fRKA1 — CPL T20 (@CPL) August 28, 2023 విధ్వంసం సృష్టించిన పూరన్, పోలార్డ్, రసెల్ 179 పరుగుల లక్ష్యాఛేదనలో నికోలస్ పూరన్ (32 బంతుల్లో 61; 5 ఫోర్లు, 4 సిక్సర్లు), కీరన్ పోలార్డ్ (16 బంతుల్లో 37 నాటౌట్; 5 సిక్సర్లు), ఆండ్రీ రసెల్ (8 బంతుల్లో 23 నాటౌట్; 2 ఫోర్లు, 2 సిక్సర్లు) చెలరేగిపోవడంతో నైట్‌రైడర్స్ 17.1 ఓవర్లలో కేవలం 4 వికెట్లు మాత్రమే కోల్పోయి లక్ష్యాన్ని చేరుకుంది. సెయింట్ కిట్స్ బౌలర్లలో బోష్ 3, ముజరబానీ ఓ వికెట్ పడగొట్టారు. SUPER SALMAN takes 4 🤩 #CPL23 #CricketPlayedLouder #BiggestPartyInSport pic.twitter.com/jSr1RT24G4 — CPL T20 (@CPL) August 28, 2023 -
ముంబై ఇండియన్స్ ఖాతాలో మరో టైటిల్.. ప్రపంచ రికార్డు సమం చేసిన పోలార్డ్
అమెరికా వేదికగా జరిగిన మేజర్ లీగ్ క్రికెట్ ఇనాగురల్ టైటిల్‌ను (2023) ముంబై ఇండియన్స్ అనుబంధ ఫ్రాంచైజీ ముంబై ఇండియన్స్ న్యూయార్క్ ఎగరేసుకుపోయింది. భారతకాలమానం ప్రకారం ఇవాళ (జులై 31) ఉదయం జరిగిన ఫైనల్లో ముంబై ఇండియన్స్.. సియాటిల్ ఆర్కాస్పై 7 వికెట్ల తేడాతో గెలుపొంది, తొలి ఎంఎల్సీ టైటిల్‌ను తమ ఖాతాలో వేసుకుంది. సీజన్ ఆరంభంలో వెనుకపడిన ఎంఐ న్యూయార్క్.. ఆతర్వాత అనూహ్యంగా పుంజుకుని హ్యాట్రిక్ విజయాలతో టైటిల్‌ను నెగ్గింది. All the feels 🥰 💙 🤩 Congratulations to @MINYCricket for winning the inaugural #MajorLeagueCricket Championship Final 🏆 pic.twitter.com/Mk1agQmgo6 — Major League Cricket (@MLCricket) July 31, 2023 ఎలిమినేటర్ మ్యాచ్‌లో వాషింగ్టన్ ఫ్రీడంపై నెగ్గిన ఎంఐ.. ఆతర్వాత ఛాలెంజర్ మ్యాచ్‌లో టెక్సాస్ సూపర్ కింగ్స్‌పై, ఫైనల్లో పటిష్టమైన సియాటిల్ ఆర్కాస్పై నెగ్గి విజేతగా ఆవిర్భవించింది. ఈ గెలుపుతో ముంబై ఇండియన్స్ ఖాతాలో తొమ్మిదో టీ20 టైటిల్ చేరింది. ముకేశ్ అంబానీ అండ్ ఫ్యామిలీ ఆధ్వర్యంలో నడిచే ముంబై ఇండియన్స్ గ్రూప్ ఆఫ్ ఫ్రాంచైజెస్ 2011, 2013 ఛాంపియన్స్ లీగ్ టైటిళ్లను, ఆతర్వాత 2013, 2015, 2017, 2019, 2020 ఐపీఎల్ టైటిళ్లను, ఈ ఏడాదే (2023) ప్రారంభమైన మహిళల ఐపీఎల్ టైటిల్‌ను, తాజాగా మేజర్ లీగ్ టీ20 టైటిల్‌ను నెగ్గాయి. MI are serial winners 🏆🏆🏆🏆🏆🏆🏆🏆 📸: IPL/BCCI pic.twitter.com/owVjc46r38 — CricTracker (@Cricketracker) July 31, 2023 ప్రపంచ రికార్డు సమం చేసిన పోలార్డ్ మేజర్ లీగ్ టీ20 లీగ్ 2023 టైటిల్ నెగ్గడం ద్వారా ముంబై ఇండియన్స్ న్యూయార్క్ జట్టు సభ్యుడు కీరన్ పోలార్డ్.. తన దేశానికే చెందిన సహచర ఆటగాడు డ్వేన్ బ్రావో పేరిట ఉన్న అత్యధిక టీ20 టైటిళ్ల ప్రపంచ రికార్డును సమం చేశాడు. ఓ ఆటగాడిగా బ్రావో 16 టీ20 టైటిళ్లలో భాగం కాగా.. ఎంఎల్సీ టైటిల్‌తో పోలార్డ్, బ్రావో రికార్డును సమం చేశాడు. పోలార్డ్ కూడా ఆటగాడిగా 16 టీ20 టైటిళ్లలో భాగమయ్యాడు. ఆ తర్వాతి స్థానంలో షోయబ్ మాలిక్ (13), రోహిత్ శర్మ (10), ధోని (9), లసిత్ మలింగ (9) ఉన్నారు. RASHID WINS THE BATTLE!⚔️ Rashid Khan gets the last LAUGH 😄against Heinrich Klaasen! 9⃣1⃣/3⃣ (12.1) pic.twitter.com/cfgaAf5CRJ — Major League Cricket (@MLCricket) July 31, 2023 నిప్పులు చెరిగిన బౌల్డ్.. రషీద్ మాయాజాలం ఎంఎల్సీ 2023 ఫైనల్ విషయానికొస్తే.. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆర్కాస్.. ట్రెంట్ బౌల్డ్ (4-0-34-3), రషీద్ ఖాన్ (4-0-9-3) ధాటికి 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 183 పరుగులు చేసింది. ఓపెనర్ డికాక్ (52 బంతుల్లో 87; 9 ఫోర్లు, 4 సిక్సర్లు) ఒక్కడే మెరుపు అర్ధసెంచరీతో విరుచుకుపడ్డాడు. 𝓞𝓷 𝓻𝓮𝓹𝓮𝓪𝓽 🔄 Can’t stop watching @nicholaspooran’s 1️⃣3️⃣ sixes he hit today‼️ #MLC2023 #MLCFINAL pic.twitter.com/OynKTi2xnD — Major League Cricket (@MLCricket) July 31, 2023 KHAN-TASTIC!🪄 Rashid Khan STRIKES FIRST💫 for the @MINYCricket! 2⃣5⃣/1⃣ (4.1) pic.twitter.com/ZPhVmSQhfA — Major League Cricket (@MLCricket) July 31, 2023 పూరన్ ఊచకోత.. అనంతరం 184 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ముంబై ఇండియన్స్.. నికోలస్ పూరన్ (55 బంతుల్లో 137; 10 ఫోర్లు, 13 సిక్సర్లు) సుడిగాలి శతకంతో విరుచుకుపడటంతో 16 ఓవర్లలోనే 3 వికెట్లు కోల్పోయి విజయతీరాలకు చేరింది. -
'ఫ్లైట్ ఎక్కాల్సిన సమయం ఆసన్నమైంది.. మీ ఆజ్ఞ మహారాజా!'
మేజర్ లీగ్ క్రికెట్ తొలి ఎడిషన్‌లో భాగంగా ముంబై న్యూయార్క్ ఫైనల్లో అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. నికోలస్ పూరన్ సారధ్యంలోని ముంబై న్యూయార్క్ టెక్సస్ సూపర్ కింగ్స్‌తో జరిగిన చాలెంజర్ మ్యాచ్‌లో ఆరు వికెట్ల తేడాతో విజయాన్ని అందుకుంది. జూలై 31న జరగనున్న ఫైనల్లో సీటెల్ ఓర్కాస్, ముంబై న్యూయార్క్‌లు తలపడనున్నాయి. కాగా వెస్టిండీస్ మాజీ ఆల్‌రౌండర్లు కీరన్ పొలార్డ్, డ్వేన్ బ్రావోలు మంచి స్నేహితులన్న సంగతి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ముంబై న్యూయార్క్‌కు పొలార్డ్ కెప్టెన్‌గా ఉంటే.. టెక్సస్ సూపర్ కింగ్స్‌లో బ్రావో సభ్యుడిగా ఉన్నాడు. మ్యాచ్ ముగిసిన అనంతరం ఇద్దరి మధ్య ఒక ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. ముంబై న్యూయార్క్.. టెక్సస్ సూపర్ కింగ్స్‌ను ఓడించగానే బ్రావోనూ చూస్తూ పొలార్డ్.. ''ఇక నువ్వు ఫ్లైట్ ఎక్కాల్సిన సమయం ఆసన్నమైంది'' అంటూ సైగలు చేశాడు. దీనికి స్పందించిన బ్రావో పొలార్డ్ ముందు తలవంచి.. ''మీ ఆజ్ఞ మహారాజా.. తప్పక పాటిస్తా'' అంటూ చేతులెత్తి నమస్కరించాడు. దీంతో ఇద్దరి మధ్య నవ్వులు విరపూశాయి. ఆ తర్వాత బ్రావో, పొలార్డ్‌లు ఒకరినొకరు హగ్ చేసుకొని ఆల్ ది బెస్ట్ చెప్పుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. These two & their banter 😂💙 Polly wins this round, DJ! 😉#OneFamily #MINewYork #MajorLeagueCricket #MINYvTSK pic.twitter.com/wEDEe7VKvg — MI New York (@MINYCricket) July 29, 2023 చదవండి: Japan Open 2023: భారత్ కథ ముగిసింది.. సెమీస్‌లో లక్ష్యసేన్ ఓటమి -
Viral: పోలార్డ్పైకి దూసుకెళ్లిన అఫ్రిది.. నాలుగు సిక్సర్లు కొట్టాడన్న కోపంలో..!
పాకిస్తాన్ సూపర్ లీగ్-2023 చివరి అంకానికి చేరుకున్న సమయంలో ఇద్దరు అంతర్జాతీయ స్టార్ల మధ్య జరిగిన గొడవ లీగ్ మొత్తానికే కలంకంగా మారింది. లీగ్‌లో భాగంగా నిన్న (మార్చి 15) జరిగిన మ్యాచ్‌లో సుల్తాన్స్ ఆల్‌రౌండర్ కీరన్ పోలార్డ్పై ఖలందర్స్ బౌలర్ షాహీన్ అఫ్రిది దాదాపుగా చేయి చేసుకున్నంత పని చేశాడు. తన బౌలింగ్‌లో పోలార్డ్ 4 సిక్సర్లు (ఒక ఓవర్లో 1, ఇంకో ఓవర్ 3) బాదడంతో సహనం కోల్పోయిన అఫ్రిది.. దూషణ పర్వానికి దిగగా, పోలీ సైతం అంతే ధీటుగా బదులిచ్చే ప్రయత్నం చేశాడు. Shaheen Afridi and Kieron Pollard 😲#PSL8 #LQvMSpic.twitter.com/HM9CP5Y8tC — Cricket Pakistan (@cricketpakcompk) March 15, 2023 అయితే సొంతగడ్డ అడ్వాంటేజ్ తీసుకున్న అఫ్రిది ఓవరాక్షన్ చేసి పోలార్డ్పైకి దూసుకెళ్లడంతో మైదానంలో ఒక్కసారిగా ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. అనంతరం సహచరులు సర్ది చెప్పడంతో వెనక్కు తగ్గిన అఫ్రిది తన పని తాను చేసుకున్నాడు. అఫ్రిది-పోలార్డ్ మధ్య వాగ్వాదానికి సంబంధించిన వీడియో సోషల్‌మీడియాలో వైరల్ కావడంతో అఫ్రిది చర్యపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నెటిజన్లు పాక్ యువ పేసర్‌ను ఓ రేంజ్లో ఆడుకుంటున్నారు. ఇదిలా ఉంటే, ఈ మ్యాచ్‌లో లాహోర్ ఖలందర్స్‌పై 84 పరుగుల తేడాతో ఘన విజయం సాధించిన ముల్తాన్ సుల్తాన్స్ నేరుగా ఫైనల్‌కు చేరింది. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన సుల్తాన్స్.. పోలార్డ్ (34 బంతుల్లో 57; ఫోర్, 6 సిక్సర్లు) మెరుపు హాఫ్ సెంచరీతో చెలరేగడంతో నిర్ణీత ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 160 పరుగులు చేయగా, ఛేదనలో షెల్డన్ కాట్రెల్ (3-0-20-3), ఉసామా మిర్ (2-0-12-2) ధాటికి ఖలందర్స్ 14.3 ఓవర్లలో 76 పరుగులకే చాపచుట్టేసింది. సుల్తాన్స్ ఇన్నింగ్స్‌లో మహ్మద్ రిజ్వాన్ (29 బంతుల్లో 33; 3 ఫోర్లు), ఉస్మాన్ ఖాన్ (28 బంతుల్లో 29; 4 ఫోర్లు), టిమ్ డేవిడ్ (15 బంతుల్లో 22 నాటౌట్; ఫోర్, సిక్స్) ఓ మోస్తరుగా రాణించగా.. ఖలందర్స్ ఇన్నింగ్స్‌లో సామ్ బిల్లింగ్స్ (19), డేవిడ్ వీస్ (12), హరీస్ రౌఫ్ మాత్రమే రెండంకెల స్కోర్ చేశారు. ఖలందర్స్ బౌలర్లలో హరీస్ రౌఫ్ 3, జమాన్ ఖాన్, రషీద్ ఖాన్ తలో వికెట్ పడగొట్టారు. సుల్తాన్స్ బౌలర్లలో కాట్రెల్ 3, మిర్ 2, అన్వర్ అలీ, అబ్బాస్ అఫ్రిది, ఇహసానుల్లా, కీరన్ పోలార్డ్ తలో వికెట్ పడగొట్టారు. రెండో ఫైనల్ బెర్తు ఎవరిది..? ఇవాళ (మార్చి 16) జరిగే ఎలిమినేటర్ 1 మ్యాచ్‌లో ఇస్లామాబాద్ యునైటెడ్, పెషావర్ జల్మీ తలపడనుండగా.. రేపు జరుగబోయే ఎలిమినేటర్ 2 మ్యాచ్‌లో లాహోర్ ఖలందర్స్ ఎలిమినేటర్ 1 విజేతను ఢీకొడుతుంది. ఈ మ్యాచ్‌లో విజేత మార్చి 19న జరిగే ఫైనల్లో ముల్తాన్ సుల్తాన్స్‌తో అమీతుమీ తేల్చుకోనుంది. -
పేలిన పోలార్డ్.. కేక పుట్టించిన కాట్రెల్
పాకిస్తాన్ సూపర్ లీగ్-2023 ఎడిషన్‌లో ఓ ఫైనల్ బెర్తు ఖరారైంది. నిన్న (మార్చి 15) లాహోర్ ఖలందర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో విజయం సాధించడం ద్వారా మహ్మద్ రిజ్వాన్ నేతృత్వంలోని ముల్తాన్ సుల్తాన్స్ తుదిపోరుకు అర్హత సాధించింది. ఇంకో రెండు మ్యాచ్‌ల తర్వాత సుల్తాన్స్‌తో తలపడబోయే రెండో ఫైనలిస్ట్ ఎవరో తేలిపోతుంది. TO THE FINALS#HBLPSL8 | #SabSitarayHumaray | #LQvMS pic.twitter.com/gIIye2TYtO — PakistanSuperLeague (@thePSLt20) March 15, 2023 ఇవాళ (మార్చి 16) జరిగే ఎలిమినేటర్ 1 మ్యాచ్‌లో ఇస్లామాబాద్ యునైటెడ్, పెషావర్ జల్మీ తలపడనుండగా.. రేపు జరుగబోయే ఎలిమినేటర్ 2 మ్యాచ్‌లో లాహోర్ ఖలందర్స్ ఎలిమినేటర్ 1 విజేతను ఢీకొడుతుంది. ఈ మ్యాచ్‌లో విజేత మార్చి 19న జరిగే ఫైనల్లో ముల్తాన్ సుల్తాన్స్‌తో అమీతుమీ తేల్చుకోనుంది. 𝐏𝐎𝐋𝐋𝐀𝐑𝐃 𝐓𝐇𝐄 𝐁𝐈𝐆-𝐇𝐈𝐓𝐓𝐈𝐍𝐆 𝐌𝐀𝐂𝐇𝐈𝐍𝐄 💥 Giving the treatment to the Qalandars 💪#HBLPSL8 | #SabSitarayHumaray | #LQvMS pic.twitter.com/k2CfWGN3xq — PakistanSuperLeague (@thePSLt20) March 15, 2023 ఇక నిన్న జరిగిన మ్యాచ్ విషయానికొస్తే.. లాహోర్ ఖలందర్స్‌పై ముల్తాన్ సుల్తాన్స్ 84 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన సుల్తాన్స్.. పోలార్డ్ (34 బంతుల్లో 57; ఫోర్, 6 సిక్సర్లు) మెరుపు హాఫ్ సెంచరీతో చెలరేగడంతో నిర్ణీత ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 160 పరుగులు చేయగా, ఛేదనలో షెల్డన్ కాట్రెల్ (3-0-20-3), ఉసామా మిర్ (2-0-12-2) ధాటికి ఖలందర్స్ 14.3 ఓవర్లలో 76 పరుగులకే చాపచుట్టేసింది. 🫡 #HBLPSL8 | #SabSitarayHumaray | #LQvMS pic.twitter.com/zDH8en06kW — PakistanSuperLeague (@thePSLt20) March 15, 2023 సుల్తాన్స్ ఇన్నింగ్స్‌లో మహ్మద్ రిజ్వాన్ (29 బంతుల్లో 33; 3 ఫోర్లు), ఉస్మాన్ ఖాన్ (28 బంతుల్లో 29; 4 ఫోర్లు), టిమ్ డేవిడ్ (15 బంతుల్లో 22 నాటౌట్; ఫోర్, సిక్స్) ఓ మోస్తరుగా రాణించగా.. ఖలందర్స్ ఇన్నింగ్స్‌లో సామ్ బిల్లింగ్స్ (19), డేవిడ్ వీస్ (12), హరీస్ రౌఫ్ మాత్రమే రెండంకెల స్కోర్ చేశారు. ఖలందర్స్ బౌలర్లలో హరీస్ రౌఫ్ 3, జమాన్ ఖాన్, రషీద్ ఖాన్ తలో వికెట్ పడగొట్టారు. సుల్తాన్స్ బౌలర్లలో కాట్రెల్ 3, మిర్ 2, అన్వర్ అలీ, అబ్బాస్ అఫ్రిది, ఇహసానుల్లా, కీరన్ పోలార్డ్ తలో వికెట్ పడగొట్టారు. -
పొలార్డ్ స్టన్నింగ్ క్యాచ్.. చూసి తీరాల్సిందే? వీడియో వైరల్
పాకిస్తాన్ సూపర్ లీగ్‌లో వెస్టిండీస్ మాజీ కెప్టెన్ కీరన్ పొలార్డ్ ముల్తాన్ సుల్తాన్స్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. అయితే బుధవారం కరాచీ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో పొలార్డ్ అద్భుతమైన క్యాచ్‌తో మెరిశాడు. కరాచీ ఇన్నింగ్స్ 17 ఓవర్ వేసిన అబ్బాస్ అఫ్రిది బౌలింగ్‌లో వెటరన్ బ్యాటర్ షోయబ్ మాలిక్ భారీ షాట్ ఆడేందుకు ప్రయత్నించాడు. అయితే షాట్ సరిగ్గా కనక్ట్ కాకపోవడంతో బంతి లాంగాన్ దిశగా వెళ్లింది. ఈ క్రమంలో లాంగాన్‌లో ఫీల్డింగ్ చేస్తున్న పొలార్డ్ ముందుకు వేగంగా కదిలి అద్భుతమైన డైవింగ్ క్యాచ్‌ను అందుకున్నాడు. దీంతో 13 పరుగులు చేసిన మాలిక్ నిరాశతో పెవిలియన్‌కు చేరాడు. ఇక సంచలన క్యాచ్‌ను అందుకున్న పొలార్డ్‌ను సహచర ఆటగాళ్లు దగ్గరకు వెళ్లి మరి అభినందించారు. ఇందుకు సబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.ఇక ఈ మ్యాచ్‌లో ముల్తాన్ సుల్తాన్స్ చేతిలో కరాచీ కింగ్స్ 3 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. చదవండి: అలుపెరగని యోధుడు రషీద్ ఖాన్.. మనిషా.. రోబోనా అంటున్న జనం BIG MAN @KieronPollard55 TAKES A RIPPER! 😲#HBLPSL8 | #SabSitarayHumaray | #MSvKK pic.twitter.com/2ynzehnsp2 — PakistanSuperLeague (@thePSLt20) February 22, 2023 -
కిల్లర్ మిల్లర్ ఊచకోత.. పోలార్డ్ విధ్వంసం
పాకిస్తాన్ సూపర్ లీగ్-2023లో బ్యాటర్ల హవా కొనసాగుతుంది. ఇవాళ (ఫిబ్రవరి 19) ఇస్లామాబాద్ యునైటెడ్‌తో జరిగిన మ్యాచ్‌లో ముల్తాన్ సుల్తాన్స్ రెచ్చిపోయారు. తొలుత బ్యాటింగ్ చేసిన సుల్తాన్స్.. కెప్టెన్ మహ్మద్ రిజ్వాన్ (38 బంతుల్లో 50; 5 ఫోర్లు, సిక్స్), రిలీ రొస్సో (30 బంతుల్లో 36; 2 ఫోర్లు, 2 సిక్సర్లు), డేవిడ్ మిల్లర్ (25 బంతుల్లో 52; 3 ఫోర్లు, 4 సిక్సర్లు), పోలార్డ్ (21 బంతుల్లో 32 నాటౌట్; 4 ఫోర్లు, సిక్స్) శివాలెత్తడంతో నిర్ణీత ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 190 పరుగుల భారీ స్కోర్ చేసింది. Killer Miller time 🤩#HBLPSL8 | #SabSitarayHumaray | #MSvIU pic.twitter.com/7bfAEfTRAp — PakistanSuperLeague (@thePSLt20) February 19, 2023 ఈ ఇన్నింగ్స్‌లో రిజ్వాన్, రొస్సో ఓ మోస్తరుగా బ్యాట్ ఝులిపించగా.. మిల్లర్, పోలార్డ్‌లు ఆకాశమే హద్దుగా చెలరేగిపోయారు. మిల్లర్ 4 సిక్సర్లు, 3 ఫోర్లతో ప్రత్యర్ధి బౌలర్లను ఊచకోత కోస్తే.. పోలార్డ్ చిన్న సైజ్ విధ్వంసమే సృష్టించాడు. ఇన్నింగ్స్ 15వ ఓవర్లో మిల్లర్ హ్యాట్రిక్ సిక్సర్లతో విరుచుకుపడితే.. ఇన్నింగ్స్ ఆఖరి మూడు బంతులను పోలీ బౌండరీలకు తరలించాడు. సుల్తాన్స్ ఇన్నింగ్స్‌లో మసూద్ (3) ఒక్కడే నిరాశపరిచాడు. ఇస్లామాబాద్ బౌలర్లలో రయీస్, మహ్మద్ వసీం జూనియర్, షాదాబ్ ఖాన్, టామ్ కర్రన్ తలో వికెట్ పడగొట్టారు. A hat-trick of boundaries ⚡ The perfect finish for @MultanSultans 🙌#HBLPSL8 | #SabSitarayHumaray | #MSvIU pic.twitter.com/5HcJQpxs8h — PakistanSuperLeague (@thePSLt20) February 19, 2023 191 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఇస్లామాబాద్.. అబ్బాస్ అఫ్రిది (4/22), మహ్మద్ ఇలియాస్ (2/12), ఇహసానుల్లా (2/19), ఉసామా మిర్ (2/33) చెలరేగడంతో 17.5 ఓవర్లలో 138 పరుగలకు ఆలౌటై, 52 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. ఇస్లామాబాద్ ఇన్నింగ్స్‌లో డస్సెన్ (49) టాప్ స్కోరర్‌గా నిలువగా.. హసన్ (21), మున్రో (31), ఆజం ఖాన్ (16) మాత్రమే రెండంకెల స్కోర్ చేశారు. ఇదిలా ఉంటే, ఈ సీజన్లో ముల్తాన్ సుల్తాన్స్ హవా కొనసాగుతుంది. తొలి మ్యాచ్‌లో లాహోర్ ఖలందర్స్ చేతిలో ఓడిన ఈ జట్టు, ఆతర్వాత వరుసగా హ్యాట్రిక్ విజయాలు సాధించింది. సుల్తాన్స్ కెప్టెన్ రిజ్వాన్ ఈ సీజన్లో ఇప్పటికే మూడు హాఫ్ సెంచరీలు సాధించి సూపర్ ఫామ్‌లో ఉండగా.. రిలీ రొస్సో 3 మ్యాచ్‌ల్లో రెండు మెరుపు హాఫ్ సెంచరీలతో విరుచుకుపడ్డాడు. ఈ మ్యాచ్‌తో కిల్లర్ మిల్లర్ కూడా ఫామ్‌లోకి రావడంతో తదుపరి లీగ్‌లో ప్రత్యర్ధి బౌలర్లకు కష్టాలు తప్పవని విశ్లేషకులు అంటున్నారు. లీగ్‌లో ఇవాళ జరుగబోయే మరో మ్యాచ్‌లో కరాచీ కింగ్స్, లాహోర్ ఖలందర్స్ తలపడనున్నాయి. -
ప్రమాదకరంగా మారుతున్న పొలార్డ్.. ప్లేఆఫ్స్‌కు ఎంఐ ఎమిరేట్స్
అబుదాబి వేదికగా జరుగుతున్న తొలి ఎడిషన్ ఇంటర్నేషనల్ లీగ్ టి20లో ఎంఐ ఎమిరేట్స్ దుమ్మురేపుతుంది. ముఖ్యంగా జట్టు కెప్టెన్ కీరన్ పొలార్డ్ రోజురోజుకు మరింత ప్రమాదకరంగా మారుతున్నాడు. ఇప్పటికే వరుస అర్థసెంచరీలతో జోరు కనబరుస్తున్న పొలార్డ్ తాజాగా మరో కీలక ఇన్నింగ్స్‌తో మెరిసి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు. ఇప్పటివరకు 8 మ్యాచ్‌లాడిన పొలార్డ్ 337 పరుగులు చేశాడు. మూడు అర్థసెంచరీలు సాధించిన పొలార్డ్ ప్రస్తుతం లీగ్‌లో రెండో టాప్‌స్కోరర్‌గా కొనసాగుతున్నాడు. శుక్రవారం లీగ్‌లో భాగంగా ఎంఐ ఎమిరేట్స్, అబుదాబి నైట్‌రైడర్స్ మధ్య 26వ మ్యాచ్ జరిగింది. మ్యాచ్‌లో ఎంఐ ఎమిరేట్స్ 18 పరుగుల తేడాతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఎంఐ ఎమిరేట్స్ నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 180 పరుగులు చేసింది. మహ్మద్ వసీమ్ 60 పరుగులతో రాణించగా.. ఆఖర్లో పొలార్డ్ 17 బంతుల్లో 4 ఫోర్లు, మూడు సిక్సర్లతో 43 పరుగులతో విధ్వంసం సృష్టించాడు. టక్కర్ 33 పరుగులు చేశాడు. అనంతరం 181 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన అబుదాబి నైట్‌రైడర్స్ 19.2 ఓవర్లలో 162 పరుగులకు ఆలౌటైంది. ఆండ్రీ రసెల్ 42 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ఎంఐ ఎమిరేట్స్ బౌలర్లలో డ్వేన్ బ్రేవో మూడు వికెట్లు తీయగా.. ఇమ్రాన్ తాహిర్, జహూర్ ఖాన్లు చెరో రెండు వికెట్లు తీశారు. కాగా ఈ విజయంతో ఎంఐ ఎమిరేట్స్ ప్లేఆఫ్స్‌కు చేరుకోగా.. సీజన్లో అబుదాబి నైట్‌రైడర్స్‌కు ఇది వరుసగా ఎనిమిదో పరాజయం. ఆడిన తొమ్మిది మ్యాచ్‌ల్లో ఒక మ్యాచ్ రద్దు కాగా.. ఎనిమిదింటిలో ఓడిన ఆ జట్టు ఎప్పుడో టోర్నీ నుంచి నిష్ర్కమించింది. ఇక ఇప్పటికే డెసర్ట్ వైపర్స్, గల్ఫ్ జెయింట్స్ కూడా ప్లే ఆఫ్స్‌కు వెళ్లగా.. తాజాగా ఎంఐ ఎమిరేట్స్ ప్లేఆఫ్‌కు చేరకుంది. ఇక షార్జా వారియర్స్, దుబాయ్ క్యాపిటల్స్‌లో ఏ జట్టు నాలుగో స్థానంలో ప్లేఆఫ్‌కు వెళ్తుందనేది ఆసక్తికరంగా మారింది. Four 4️⃣s. Three 6️⃣s. A powerful 4️⃣3️⃣ off just 17 balls.@KieronPollard55 lit up the field with every shot. Another #DPWorldILT20 innings you don't want to miss! #ALeagueApart #MIEvADKR @MIEmirates pic.twitter.com/vR4FkASBZs — International League T20 (@ILT20Official) February 3, 2023 With a never-say-die attitude, the @MIEmirates have made it to the playoffs 🤩 Congratulations, team 💙 #MIEmirates #DPWorldILT20 #ALeagueApart pic.twitter.com/46XEgirZxK — International League T20 (@ILT20Official) February 3, 2023 చదవండి: అంత భయమేలా.. అరిగిపోయిన పిచ్‌లపై ప్రాక్టీస్ -
ILT20 2023: తిరిగిస్తాడనుకుంటే పారిపోయాడు
అబుదాబి వేదికగా జరుగుతున్న ఇంటర్నేషనల్ లీగ్ టి20 క్రికెట్లో హాస్యాస్పద సన్నివేశం చోటుచేసుకుంది. బ్యాటర్ కొట్టిన బంతి స్టేడియం అవతల పడింది. అయితే స్డేడియం బయట ఉన్న వ్యక్తి దానిని క్యాచ్‌గా తీసుకున్నాడు. ఆ తర్వాత బంతిని తీసుకొని అక్కడినుంచి పారిపోయాడు. చెప్పుకోవడానికి పెద్దగా ఏమి లేకపోయినప్పటికి సదరు వ్యక్తి చర్య నవ్వులు పూయించింది. ఎంఎఐ ఎమిరేట్స్, డెసర్ట్ వైపర్స్ మధ్య జరిగిన మ్యాచ్‌లో ఇది జరిగింది. ఎమిరేట్స్ బ్యాటింగ్ సమయంలో మౌస్లే డీప్‌స్క్వేర్ లెగ్ దిశగా బంతిని స్టాండ్స్ బయటికి పంపించాడు. బంతి వెళ్లి నేరుగా రోడ్డుపై పడింది. ఆ తర్వాత ఒక వ్యక్తి పరిగెత్తుకుంటూ వచ్చి బంతిని తీసుకున్నాడు. స్టేడియంలోకి తిరిగి విసురుతాడనుకుంటే.. బంతితో అక్కడి నుంచి ఉడాయించాడు. ఆ తర్వాత కాసేపటికే కీరన్ పొలార్డ్ భారీ సిక్సర్ కొట్టాడు. ఈసారి కూడా బంతి స్టేడియం అవతల పడింది. ఆ వ్యక్తి మళ్లీ కనిపిస్తాడేమో అని చూస్తే బంతిని తీసుకోవడానికి ఎవరు రాలేదు. దీనికి సంబంధించిన వీడియోను ఐఎల్టి20 తన ట్విటర్లో షేర్ చేసింది. సిక్సర్ల వర్షం కురుస్తోంది.. మీరు ఏ టైప్ క్రికెట్ లవర్స్.. 1). తీసుకొని పారిపోవడం..2). తీసుకొని తిరిగిచ్చేయడం .. మీరే ఎంపిక చేసుకొండి అంటూ కామెంట్ చేసింది. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. ఎంఐ ఎమిరేట్స్ 157 పరుగుల తేడాతో భారీ విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఎంఐ ఎమిరేట్స్ నిర్ణీత 20 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 241 పరుగుల భారీ స్కోరు చేసింది. మహ్మద్ వసీమ్ 86, ఆండ్రీ ఫ్లెచర్ 50, కీరన్ పొలార్డ్ 50, మౌస్లే 31 పరుగులు చేశారు. అనంతరం బ్యాటింగ్ చేసిన డెసర్ట్ వైపర్స్ 84 పరుగులకే కుప్పకూలింది. ఎమిరేట్స్ బౌలింగ్‌లో ఫజల్లా ఫరుఖీ మూడు వికెట్లు తీయగా.. జహూర్ ఖాన్, ఇమ్రాన్ తాహిర్‌లు చెరో రెండు వికెట్లు తీశారు. When it’s raining 6️⃣s, There are 2 types of cricket lovers.. 1. Pick and run 🏃♂️ 2. Pick and return Which category are you? Book your tickets now : https://t.co/sv2yt8acyL#DPWorldILT20 #ALeagueApart #DVvMIE pic.twitter.com/P0Es01cMz8 — International League T20 (@ILT20Official) January 29, 2023 చదవండి: కాఫీ బ్యాగులతో ఆసీస్ క్రికెటర్; తాగడానికా.. అమ్మడానికా? రిటైర్మెంట్ ప్రకటించిన టీమిండియా స్టార్ ఓపెనర్ -
86 పరుగులకే కుప్పకూలిన వైపర్స్.. 157 పరుగుల తేడాతో ముంబై విజయం
ఇంటర్నేషనల్ లీగ్‌లో భాగంగా ఆదివారం డెసర్ట్ వైపర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ముంబై ఎమిరేట్స్ ఏకంగా 157 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. 241 పరుగుల భారీ లక్క్ష్యంతో బరిలోకి దిగిన డెసర్ట్ వైపర్స్.. ముంబై బౌలర్లు చెలరేగడంతో 84 పరుగులకే కుప్పకూలింది. ముంబై పేసర్ ఫజల్హక్ ఫారూఖీ మూడు వికెట్లు పడగొట్టి వైపర్స్ వెన్ను విరచగా.. తహీర్, జహూర్ ఖాన్ చెరో రెండు వికెట్లు, బౌల్ట్, బ్రావో, మౌస్లీ తలా వికెట్ సాధించారు. వైపర్స్ బ్యాటర్లలో టామ్ కుర్రాన్(12), మార్క్ వాట్(12) పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచారు. చెలరేగిన వసీం, పొలార్డ్ ఇక టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ఎమిరేట్స్ నిర్ణీత 20 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి 241 పరుగులు చేసింది. ఎమిరేట్స్ బ్యాటర్లలో మహ్మద్ వసీం విధ్వంసం సృష్టించాడు. 44 బంతులు ఎదుర్కొన్న వసీం 11 ఫోర్లు, 4 సిక్స్‌లతో 86 పరుగులు చేశాడు. అతడితో పాటు ఫ్లెచర్(50), పొలార్డ్(50 నాటౌట్) రాణించారు. కాగా పొలార్డ్ తన అర్ధ సెంచరీని కేవలం 19 బంతుల్లోనే సాధించడం గమానార్హం. వైపర్స్ బౌలర్లలో టామ్ కుర్రాన్ రెండు వికెట్లు పడగొట్టాడు. చదవండి: పాండ్యాది చెత్త నిర్ణయం.. నంబర్ 1 బౌలర్ విషయంలో ఎందుకలా? హుడాను మాత్రం.. The moment Waseem decided to cut loose 🙌#MIEmirates #OneFamily #DVvMIEpic.twitter.com/4SJFdGdqrV — MI Emirates (@MIEmirates) January 29, 2023 -
విన్యాసం బాగానే ఉంది.. ఆ ఎక్స్‌ప్రెషన్‌కు అర్థమేంటి!
అబుదాబి వేదికగా జరుగుతున్న ఇంటర్నేషనల్ లీగ్ టి20లో ముంబై ఎమిరేట్స్ కెప్టెన్ కీరన్ పొలార్డ్ ఆల్‌రౌండ్ ప్రదర్శనతో అదరగొడుతున్నాడు. ఇప్పటికే రెండు హాఫ్ సెంచరీలతో మెరిసిన పొలార్డ్ ఫీల్డింగ్‌లోనూ మెరుపులు మెరిపిస్తున్నాడు. మంగళవారం డెసర్ట్ వైపర్స్‌తో మ్యాచ్‌లో పొలార్డ్ క్యాచ్ తీసుకునే క్రమంలో చేసిన విన్యాసం అదుర్స్ అనిపించింది. బౌండరీ లైన్ వద్ద ఒంటిచేత్తో పొలార్డ్ అందుకున్న క్యాచ్ హైలైట్‌గా నిలిచింది. ఇన్నింగ్స్ 8వ ఓవర్లో సమిత్ పటేల్ వేసిన ఫుల్‌టాస్ బంతిని కొలిన్ మున్రో లాంగాన్ దిశగా బాదాడు. కచ్చితంగా సిక్సర్ అనుకున్న తరుణంలో అక్కడే ఉన్న పొలార్డ్ అమాంతం గాల్లోకి ఎగిరి ఒంటిచేత్తో క్యాచ్‌ను తీసుకొని వెనుకవైపుకు డైవ్ చేశాడు. ఆ తర్వాత బౌండరీలైన్ ముంగిట నిలబడి అభిమానులను చూస్తూ ఒక రకమైన ఎక్స్ప్రెషన్ ఇచ్చాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇక మ్యాచ్ విషయానికి వస్తే డెసర్ట్ వైపర్స్ ఏడు వికెట్ల తేడాతో ముంబై ఎమిరేట్స్‌పై విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై ఎమిరేట్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 169 పరుగులు చేసింది. పొలార్డ్ 67 నాటౌట్, పూరన్ 57 పరుగులతో రాణించారు. అనంతరం బ్యాటింగ్ చేసిన డెసర్ట్ వైపర్స్.. అలెక్స్ హేల్స్(44 బంతుల్లో 62 నాటౌట్), షెర్ఫెన్ రూథర్‌ఫోర్డ్(29 బంతుల్లో 56 నాటౌట్) విధ్వంసం ధాటికి 16.3 ఓవర్లలోనే లక్ష్యాన్ని అందుకుంది. కొలిన్ మున్రో 41 పరుగులు చేసి ఔటయ్యాడు. #PollyPandey, what have you done! 🤯🤯🤯🤯@KieronPollard55 with a 𝑩𝒂𝒘𝒂𝒂𝒍 one-handed catch and the celebration to match. 😎#MIEvDV #CricketOnZee #DPWorldILT20 #BawaalMachneWalaHai #HarBallBawaal @MIEmirates @ILT20Official pic.twitter.com/2eKZPWjoYk — Zee Cricket (@ilt20onzee) January 24, 2023 చదవండి: టాప్‌లెస్‌గా దర్శనం.. 'అలా చూడకు ఏదో అవుతుంది' '22 ఏళ్ల పరిచయం.. కచ్చితంగా తప్పు చేసి ఉండడు' -
విధ్వంసం సృష్టిస్తున్నాడు.. టెస్టు క్రికెటర్ ముద్ర చెరిపేయాల్సిందే
ఇంగ్లండ్ ఆటగాడు జోరూట్ అనగానే టెస్టు స్పెషలిస్ట్ అనే ట్యాగ్ గుర్తొస్తుంది. పరిమిత ఓవర్ల క్రికెట్లో చూసుకుంటే వన్డేలు మాత్రమే ఆడే రూట్ టి20లు చాలా తక్కువగా ఆడాడు. ఇక టెస్టుల్లో తన ఆట గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. కెప్టెన్‌గా, బ్యాటర్‌గా టెస్టుల్లో ఇంగ్లండ్‌కు ఎన్నో విజయాలు అందించాడు. టెస్టు స్పెషలిస్ట్ అనే ముద్ర ఉండడంతో ఐపీఎల్, బీబీఎల్ లాంటి లీగ్స్‌లో రూట్ పేరు పెద్దగా కనిపించదు. ఒకవేళ వేలంలో పాల్గొన్నా అతన్ని కొనడానికి ఏ ఫ్రాంచైజీ పెద్దగా ఆసక్తి చూపేది కాదు. అయితే రూట్కున్న టెస్టు స్పెషలిస్ట్ అనే ట్యాగ్ చెరిపేయాల్సిన సమయం వచ్చినట్లుంది. అబుదాబి వేదికగా జరుగుతున్న ఇంటర్నేషనల్ లీగ్ టి20లో రూట్ ఆడిన విధ్వంసకర ఇన్నింగ్స్ అందుకు కారణమయింది. ఆదివారం రాత్రి దుబాయ్ క్యాపిటల్స్, ముంబై ఎమిరేట్స్ మధ్య మ్యాచ్ జరిగింది. భారీ స్కోర్లు నమోదైన మ్యాచ్‌లో దుబాయ్ క్యాపిటల్స్ 16 పరుగుల తేడాతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన దుబాయ్ క్యాపిటల్స్ నిర్ణీత 20 ఓవర్లలో మూడు వికెట్లు నష్టానికి 222 పరుగులు చేసింది. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ రోవ్‌మెన్ పావెల్ (41 బంతుల్లో 4 ఫోర్లు, 10 సిక్సర్లతో 97 పరుగులు) విధ్వంసం సృష్టించగా.. జో రూట్ (54 బంతుల్లో 82, 8 ఫోర్లు, మూడు సిక్సర్లు) మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. తన శైలికి విరుద్ధంగా ఆడిన రూట్ మ్యాచ్‌లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాడు. అనంతరం బ్యాటింగ్ చేసిన ముంబై ఎమిరేట్స్ కూడా ధీటుగానే బదులిచ్చింది. అయితే చివర్లో ఒత్తిడికి తలొగ్గిన ముంబై ఎమిరేట్స్ నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 206 పరుగులు చేసి 16 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. కీరన్ పొలార్డ్(38 బంతుల్లో 86, 8 ఫోర్లు, 6 సిక్సర్లు) మెరుపులు మెరిపించాడు. We saw the reverse sweep yesterday. Here's the conventional sweep with the SAME precision!@root66 is all class!pic.twitter.com/GRo5zKQAyd — International League T20 (@ILT20Official) January 22, 2023 చదవండి: ఫించ్ 'దంచి కొట్టుడు'.. 35 బంతుల్లో 7 ఫోర్లు, 5 సిక్సర్లతో..! -
ముంబై ఇండియన్స్ కీలక ప్రకటన: కెప్టెన్లుగా కీరన్ పొలార్డ్, రషీద్ ఖాన్..
Kieron Pollard- Rashid Khan As MI Teams captains: వెస్టిండీస్ దిగ్గజం కీరన్ పొలార్డ్, అఫ్గనిస్తాన్ స్టార్ బౌలర్ రషీద్ ఖాన్‌కు ముంబై ఇండియన్స్ యాజమాన్యం రిలయన్స్ కీలక బాధ్యతలు అప్పగించింది. విదేశీ టీ20 లీగ్‌లలో తమ జట్లకు వీరిద్దరిని కెప్టెన్లుగా నియమించింది. ఈ మేరకు ముంబై ఇండియన్స్ మేనేజ్మెంట్ ప్రకటన విడుదల చేసింది. యూఏఈ ఐఎల్టీ20 లీగ్‌లో ఎంఐ ఎమిరేట్స్‌కు కీరన్ పొలార్డ్, సౌతాఫ్రికా టీ20 లీగ్‌లో ఎంఐ కేప్‌టౌన్‌కు రషీద్ ఖాన్ సారథ్యం వహిస్తారని తెలిపింది. వీరిద్దరిపై తమకు పూర్తి నమ్మకం ఉందని.. ఆయా లీగ్‌లలో తమ జట్లను ఉన్నత శిఖరాలకు చేరుస్తారనే నమ్మకం ఉందని పేర్కొంది. కాగా ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో ముంబై ఇండియన్స్‌కు రోహిత్ శర్మ నాయకుడిగా ఉన్న విషయం తెలిసిందే. ఇప్పుడు ముంబై ఫ్రాంఛైజీల కెప్టెన్ల జాబితాలో పొలార్డ్, రషీద్ కూడా చేరడం విశేషం. ముంబై ఇండియన్స్‌కు గుడ్‌బై ఐపీఎల్లో అత్యుత్తమ ఆల్‌రౌండర్‌గా పేరొందిన కీరన్ పొలార్డ్ ఇటీవలే ఈ లీగ్‌కు ఆటగాడిగా గుడ్‌బై చెప్పిన విషయం తెలిసిందే. అయితే, అతడు ముంబై బ్యాటింగ్ కోచ్‌గా కొత్త అవతారం ఎత్తనున్నాడు. ఈ క్రమంలో యూఏఈ లీగ్‌లో ముంబై జట్టు కెప్టెన్‌గా పోలీని ప్రకటించడం గమనించడం గమనార్హం. గుజరాత్ టైటాన్స్ వైస్ కెప్టెన్ ఇక ఐపీఎల్-2022 సీజన్‌తో క్యాష్ రిచ్ లీగ్‌లో ఎంట్రీ ఇచ్చిన గుజరాత్ టైటాన్స్‌కు రషీద్ ఖాన్ వైస్ కెప్టెన్‌గా ఉన్నాడు. ఈ నేపథ్యంలో అతడు సౌతాఫ్రికా టీ20 లీగ్‌లో ముంబై జట్టుకు సారథిగా నియమితుడు కావడం విశేషం. ఇదిలా ఉంటే.. గతేడాది ముంబై ఇండియన్స్ వదులుకున్న టీమిండియా ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా.. గుజరాత్‌ను అరంగేట్ర సీజన్లోనే చాంపియన్‌గా నిలిపిన విషయం తెలిసిందే. 🇮🇳🇦🇪🇿🇦 Leaders of the #OneFamily. 💙#MICapeTown #MIEmirates @MIEmirates @MICapeTown @ImRo45 @KieronPollard55 @rashidkhan_19 pic.twitter.com/ngGMQWSrgS — Mumbai Indians (@mipaltan) December 2, 2022 -
రుతురాజ్ది ప్రపంచ రికార్డే! కానీ.. అతడు ఒకే ఓవర్లో ఏకంగా 8 సిక్స్‌లు కొట్టాడు!
Cricketers Who Hits 6 Sixes In An Over- Entire List: అంతర్జాతీయ వన్డేల్లో ఇద్దరు బ్యాటర్లు ఒకే ఓవర్లో 6 సిక్సర్లు కొట్టారు. అంతర్జాతీయ టి20ల్లో ఇద్దరు బ్యాటర్లు ఒకే ఓవర్లో 6 సిక్సర్లతో చెలరేగారు. దేశవాళీ వన్డేల్లో ఒక ఆటగాడు ఓవర్లో 6 సిక్సర్లతో సత్తా చాటాడు. దేశవాళీ టి20ల్లో ముగ్గురు బ్యాటర్లు ఓవర్లో 6 సిక్సర్లతో దూకుడు ప్రదర్శించారు. వీరంతా ఓవర్లో ఆరేసి సిక్సర్లతో పండగ చేసుకున్నారు. ఇదంతా ఇప్పటి వరకు రికార్డు... కానీ ఇప్పుడు దీన్ని దాటి ఒకే ఓవర్లో 7 సిక్సర్లతో కొత్త ఘనత నమోదైన విషయం తెలిసిందే. మహారాష్ట్ర బ్యాటర్ రుతురాజ్ గైక్వాడ్ నోబాల్ సహా 7 బంతుల్లో సిక్సర్లు బాది లిస్ట్–ఎ (దేశవాళీ, అంతర్జాతీయ వన్డేలు) క్రికెట్లో ప్రపంచ రికార్డు సృష్టించాడు. అయితే, స్ట్క్లాస్ క్రికెట్లో (టెస్టులు, మూడు, నాలుగు రోజుల మ్యాచ్‌లు) మాత్రం రికార్డు లీ జెర్మన్ (8 సిక్స్‌లు) పేరిట ఉంది. లీ జెర్మన్ కొట్టిన మ్యాచ్‌లో... న్యూజిలాండ్ మాజీ కెప్టెన్ లీ జెర్మన్ ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లో ఒకే ఓవర్లో 8 సిక్సర్లు కొట్టడం అధికారికంగానే నమోదై ఉంది. అయితే ఆ మ్యాచ్ జరిగిన తీరు పూర్తిగా భిన్నమైంది. వెల్లింగ్టన్ కెప్టెన్ మెక్ స్వీనీ ‘ప్రత్యేక వ్యూహం’లో భాగంగా ఇదంతా జరిగింది. 59 ఓవర్లలో 291 పరుగులు ఛేదించే క్రమంలో కాంటర్బరీ 108/8 వద్ద నిలిచింది. అయితే ఆ జట్టును అంత సులువుగా ఓడించరాదని, సులభంగా పరుగులు ఇచ్చి కాస్త ఆడిద్దామని వెల్లింగ్టన్ భావించింది. ఒకదశలో స్కోరు 196/8కు చేరింది. మరో 2 ఓవర్లు మిగలగా.. అసలు బౌలింగ్ రాని వాన్స్ చేతికి బంతి ఇచ్చారు. అతను ఓవర్లో ఏకంగా 17 నోబాల్స్ సహా 22 బంతులు వేశాడు. అంటే 5 బంతులే! ఇందులోనే లీ జెర్మన్ 8 సిక్స్‌లు బాదాడు. ఈ ఓవర్లో మొత్తం 77 పరుగులు (0,4,4,4,6,6,4,6,1,4,1,0,6,6,6,6,6,0,0,4,0,1) వచ్చాయి. ఇప్పటికీ ఫస్ట్‌క్లాస్ క్రికెట్లో అత్యధిక పరుగుల రికార్డు ఇదే. చివరకు మ్యాచ్ ‘డ్రా’ అయింది. మరిన్ని రికార్డులు ఒకే ఓవర్లో అత్యధిక పరుగుల రికార్డు సమమైంది. 2018లో న్యూజిలాండ్‌లో ఫోర్డ్ ట్రోఫీలో భాగంగా సెంట్రల్ డిస్ట్రిక్స్తో జరిగిన మ్యాచ్‌లో నార్తర్న్ డిస్ట్రిక్స్ నమోదు చేసింది. అయితే ఇందులో బ్రెట్ హామ్టన్ 23 పరుగులు, జో కార్టర్ 18 పరుగులు రాబట్టారు. భారత్ తరఫున రోహిత్ శర్మ (3 సార్లు), సచిన్ టెండూల్కర్, వీరేంద్ర సెహ్వాగ్, యశస్వి జైస్వాల్, సంజూ సామ్సన్, పృథ్వీ షా, శిఖర్ ధావన్, సమర్థ్ వ్యాస్, కరణ్ కౌశల్ తర్వాత లిస్ట్–ఎ క్రికెట్లో డబుల్ సెంచరీ సాధించిన పదో భారత ఆటగాడిగా రుతురాజ్ నిలిచాడు. ఓవర్లో 6 సిక్సర్ల వీరులు అంతర్జాతీయ వన్డేలు ►హెర్షల్ గిబ్స్ (దక్షిణాఫ్రికా)- బౌలర్: డాన్ వాన్ బంగ్ (నెదర్లాండ్స్; 2007లో) ►జస్కరన్ మల్హోత్రా (అమెరికా)- బౌలర్: గౌడీ టోకా (పాపువా న్యూగినియా; 2021లో) అంతర్జాతీయ టి20లు ►యువరాజ్ (భారత్) బౌలర్- స్టువర్ట్ బ్రాడ్ (ఇంగ్లండ్; 2007లో) ►కీరన్ పొలార్డ్ (వెస్టిండీస్) బౌలర్- అఖిల ధనంజయ (శ్రీలంక; 2021లో) ఫస్ట్ క్లాస్ క్రికెట్ ►సోబర్స్ (నాటింగమ్‌షైర్ కౌంటీ)- బౌలర్: నాష్ (గ్లామోర్గాన్; 1968లో) ►రవిశాస్త్రి (ముంబై)- బౌలర్: తిలక్ రాజ్ (బరోడా; 1984లో) ►లీ జెర్మన్ (కాంటర్ బరీ)- బౌలర్: వాన్స్ (వెల్లింగ్టన్; 1990లో) దేశవాళీ వన్డేలు ►తిసారా పెరీరా (శ్రీలంక; శ్రీలంక ఆర్మీ స్పోర్ట్స్ క్లబ్)- బౌలర్: దిల్హాన్ కూరే (బ్లూమ్‌ఫీల్డ్; 2021లో) ►రుతురాజ్ గైక్వాడ్ (భారత్; మహారాష్ట్ర)- బౌలర్: శివ సింగ్ (ఉత్తరప్రదేశ్; 2022లో) దేశవాళీ టి20లు ►రోజ్ వైట్లీ (వొర్స్‌టర్‌షైర్) - బౌలర్: కార్ల్ కార్వర్ (యార్క్‌షైర్; 2017లో) ►లియో కార్టర్ (కాంటర్బరీ) - బౌలర్: ఆంటన్ డెవ్‌సిచ్ (నార్తర్న్ డిస్ట్రిక్ట్స్; 2020లో) ►హజ్రతుల్లా జజాయ్ (కాబూల్ జ్వానన్)- బౌలర్: అబ్దుల్లా మజారి (బాల్క్ లెజెండ్స్; 2018లో) చదవండి: Christiano Ronaldo: రొనాల్డోకు బంపరాఫర్ .. ఏడాదికి రూ.612 కోట్లు! Indian Captain: హార్దిక్‌తో పాటు టీమిండియా కెప్టెన్సీ రేసులో ఆ యువ ప్లేయర్ కూడా! జట్టులో చోటుకే దిక్కులేదు! 6⃣,6⃣,6⃣,6⃣,6⃣nb,6⃣,6⃣ Ruturaj Gaikwad smashes 4⃣3⃣ runs in one over! 🔥🔥 Follow the match ▶️ https://t.co/cIJsS7QVxK…#MAHvUP | #VijayHazareTrophy | #QF2 | @mastercardindia pic.twitter.com/j0CvsWZeES — BCCI Domestic (@BCCIdomestic) November 28, 2022 -
Kieron Pollard: రిటైర్మెంట్ ప్రకటించినా వదలని ముంబై ఇండియన్స్
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) చరిత్రలో అత్యధిక మ్యాచ్‌లు (189) ఆడిన విదేశీ ఆటగాడిగా, ఐపీఎల్ కెరీర్ మొత్తంలో ఒకే జట్టుకు (ముంబై ఇండియన్స్) ప్రాతినిధ్యం వహించిన అతి కొద్ది మంది ఆటగాళ్లలో ఒకడిగా, 13 సీజన్ల పాటు ముంబై ఇండియన్స్‌లో భాగమై, ఆ జట్టు 5 ఐపీఎల్ టైటిల్స్, 2 ఛాంపియన్స్ లీగ్ టైటిల్స్ గెలవడంలో కీలకపాత్ర పోషించిన ఆటగాడిగా పలు అరుదైన ఘనతలు సాధించిన కీరన్ పొలార్డ్ ఐపీఎల్‌కు వీడ్కోలు పలుకుతున్నట్లు నిన్న (నవంబర్ 15) ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ఆటగాడిగా రిటైర్మెంట్ ప్రకటించిన పోలార్డ్ సేవలను ముంబై ఇండియన్స్ యాజమాన్యం వేరే రూపంలో వినియోగించుకోవాలని నిర్ణయించింది. పోలార్డ్ ఎంఐకి చేసిన సేవలను గుర్తిస్తూ.. అతన్ని ఫ్రాంచైజీ బ్యాటింగ్ కోచ్‌గా నియమించుకొవాలని డిసైడ్ అయ్యింది. ఇందుకు పోలీ కూడా అంగీకారం తెలిపాడు. దీంతో అతను వచ్చే సీజన్ నుంచి ముంబై ఇండియన్స్ కోచ్‌గా వ్యవహరించనున్నాడు. మరోవైపు యూఏఈలో జరిగే ఇంటర్నేషనల్ టీ20 లీగ్‌లో ముంబై ఇండియన్స్ మరో ఫ్రాంచైజీ అయిన ముంబై ఎమిరేట్స్‌లో ఆటగాడిగా కొనసాగుతానని పోలీ ప్రకటించాడు. ఇదిలా ఉంటే, ఐపీఎల్ కెరీర్లో మొత్తంలో 189 మ్యాచ్‌లు ఆడిన పోలార్డ్.. 147.3 స్ట్రయిక్ రేట్‌తో 3412 పరుగులు చేశాడు. ఇందులో 16 అర్ధశతాకలు ఉన్నాయి. అలాగే బౌలింగ్‌లో 8.79 ఎకానమీతో 69 వికెట్లు పడగొట్టాడు. పోలార్డ్ తన ఐపీఎల్ కెరీర్లో రికార్డు స్థాయిలో 218 ఫోర్లు, 223 సిక్సర్లు బాదాడు. చదవండి: 13 మంది ఆటగాళ్లను వదులుకున్న ముంబై ఇండియన్స్.. -
13 మంది ఆటగాళ్లను వదులుకున్న ముంబై ఇండియన్స్..
ఈ ఏడాది ఐపీఎల్లో ఘోరమైన ప్రదర్శన కనబరిచిన ముంబై ఇండియన్స్.. ఐపీఎల్-2023లో సరికొత్తగా బరిలోకి దిగేందుకు సిద్దమవుతోంది. ఈ నేపథ్యంలో ఐపీఎల్-2023 మినీ వేలంకు ముందు ఏకంగా 13 మంది ఆటగాళ్లను ముంబై విడిచిపెట్టింది. విడిచిపెట్టిన ఆటగాళ్ల జాబితాను ముంబై ఇండియన్స్ ట్విటర్లో షేర్ చేసింది. కాగా మినీ వేలం ముందు ఇంతమంది ఆటగాళ్లను ముంబై రిలీజ్ చేయడం ఇదే తొలి సారి. అదే విధంగా ఈ ఏడాది సీజన్లో ఆర్సీబీ తరపున ఆడిన జాసన్ బెహ్రెండార్ఫ్ను ముంబై ట్రెడ్ చేసుకుంది. మరోవైపు వెస్టిండీస్ మాజీ కెప్టెన్ కీరాన్ పోలార్డ్‌ను బ్యాటింగ్ కోచ్‌గా ముంబై ఇండియన్స్ నియమించింది. కాగా ఐపీఎల్‌కు పొలార్డ్ రిటైర్మెంట్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ముంబై ఇండియన్స్ రిటైన్ చేసుకున్న ఆటగాళ్లు: రోహిత్ శర్మ (కెప్టెన్), టిమ్ డేవిడ్, రమణదీప్ సింగ్, తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్, ఇషాన్ కిషన్, ట్రిస్టన్ స్టబ్స్, డెవాల్డ్ బ్రీవిస్, జోఫ్రా ఆర్చర్, జస్ప్రీత్ బుమ్రా, అర్జున్ టెండూల్కర్, అర్షద్ ఖాన్, కుమార్ కార్తికేయ, హృతిక్ షోకీన్, జాసన్ బెహ్రెండార్ఫ్ , ఆకాష్ మధ్వల్ విడిచిపెట్టిన ఆటగాళ్లు: కీరన్ పొలార్డ్, అన్మోల్ప్రీత్ సింగ్, ఆర్యన్ జుయల్, బాసిల్ థంపి, డేనియల్ సామ్స్, ఫాబియన్ అలెన్, జయదేవ్ ఉనద్కత్, మయాంక్ మార్కండే, మురుగన్ అశ్విన్, రాహుల్ బుద్ధి, రిలే మెరెడిత్, సంజయ్ యాదవ్, టైమల్ మిల్స్ చదవండి: IPL 2023: స్టార్ ఆటగాళ్లకు షాకిచ్చిన ఐపీఎల్ జట్లు.. మొత్తం రిటెన్షన్ జాబితా ఇదే! -
IPL: ముంబై విధ్వంసకర ప్లేయర్ సంచలన నిర్ణయం! మిస్ యూ.. ట్విస్ట్ ఇచ్చాడిలా
IPL 2023- Kieron Pollard- Mumbai Indians: వెస్టిండీస్ వెటరన్ ఆల్‌రౌండర్, ముంబై ఇండియన్స్ స్టార్ ప్లేయర్‌గా వెలుగొందిన కీరన్ పొలార్డ్ తన ఐపీఎల్ కెరీర్‌కు సంబంధించి కీలక నిర్ణయం తీసుకున్నాడు. ఇకపై తాను ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో ఆటగాడిగా కనిపించబోనంటూ రిటైర్మెంట్ ప్రకటించాడు. ఐపీఎల్-2023 మినీ వేలానికి ముందు ముంబై ఫ్రాంఛైజీ అతడిని రిలీజ్ చేసిన నేపథ్యంలో ఈ మేరకు పోలీ సంచలన ప్రకటన చేశాడు. అపురూప విజయాల్లో భాగమై 2010 నుంచి ముంబై ఫ్రాంఛైజీతో అనుబంధం కొనసాగిస్తున్న 35 ఏళ్ల పొలార్డ్.. ఐదుసార్లు టైటిల్ గెలిచిన జట్టులో సభ్యుడిగా రికార్డు సృష్టించాడు. తన అద్భుత ప్రదర్శనతో జట్టుకు అనేక విజయాలు అందించాడు. ఈ క్రమంలో ఐపీఎల్లో ఆటగాడిగా 13 ఏళ్ల తన విజయవంతమైన కెరీర్‌కు గుడ్ బై చెబుతూ మంగళవారం ప్రకటన చేశాడు. అందరికీ ధన్యవాదాలు ఈ మేరకు ట్విటర్లో భావోద్వేగ నోట్ షేర్ చేశాడు. ఆటగాడిగా ఐపీఎల్‌ను మిస్ అవుతానని.. 2013, 2015, 2017, 2019, 2020తో పాటు 2011 నాటి చాంపియన్స్ లీగ్ గెలవడం ఎన్నటికీ మర్చిపోలేనన్నాడు. తనకు ఇన్నాళ్లు సహకరించిన ముంబై యాజమాన్యానికి పొలార్డ్ ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలిపాడు. తన భార్య జెనా, తన ముగ్గురు పిల్లలకు కూడా కృతజ్ఞతలు చెప్పాడు. ఓ బ్యాడ్ న్యూస్.. ఓ గుడ్ న్యూస్ తనకు సహకరించిన ముకేశ్, నీత, ఆకాశ్ అంబానీల పట్ల కృతజ్ఞతా భావం చాటుకున్న పొలార్డ్... ముంబైతో తన బంధం ముగిసిపోలేదంటూ ఫ్యాన్స్‌కు ఓ శుభవార్త కూడా చెప్పాడు. ఐపీఎల్లో బ్యాటింగ్ కోచ్‌గా కొత్త అవతారం ఎత్తబోతున్నట్లు పొలీ ఈ సందర్భంగా వెల్లడించాడు. అదే విధంగా ముంబై ఎమిరేట్స్ తరఫున ఆటగాడిగా బరిలోకి దిగుతానని స్పష్టం చేశాడు. తన నోట్‌ను ముగిస్తూ సిన్సియర్లీ కీరన్ పొలార్డ్.. ది ముంబై వెస్ట్ ఇండియన్ అంటూ అభిమానం చాటుకున్నాడు. తనని అభిమానిస్తున్న వాళ్లందరికీ ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలిపాడు. కాగా పొలార్డ్‌ను ఇక ఐపీఎల్ ఆటగాడిగా చూడలేమా అంటూ ఫ్యాన్స్ ఉద్వేగానికి లోనవుతున్నారు. మిస్ యూ పోలీ అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఇక గత సీజన్లో పొలార్డ్ పూర్తిగా నిరాశపరిచిన విషయం తెలిసిందే. 💙 #OneFamily @mipaltan pic.twitter.com/4mDVKT3eu6 — Kieron Pollard (@KieronPollard55) November 15, 2022 🙏𝕋ℍ𝔼 𝕃𝕃𝕆ℝ𝔻 𝗛𝗔𝗦 𝗪𝗢𝗡 𝗜𝗧 𝗔𝗟𝗟 🏆#OneFamily #MumbaiIndians @KieronPollard55 pic.twitter.com/VPWTdWZEdH — Mumbai Indians (@mipaltan) November 15, 2022 -
స్టార్ ఆల్‌రౌండర్‌ను వదులుకున్న ముంబై, జడేజాను అట్టిపెట్టుకున్న చెన్నై..!
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) తదుపరి ఎడిషన్ (16) కోసం ఇప్పటినుంచే సన్నాహకాలు ఊపందుకున్నాయి. కొచ్చి వేదికగా డిసెంబర్ 23న జరుగనున్న ఐపీఎల్-2023 మినీ వేలం నేపథ్యంలో ఆయా ఫ్రాంచైజీలు అట్టిపెట్టుకోవాలనుకున్న ఆటగాళ్ల జాబితా పాటు వద్దనుకున్న ఆటగాళ్ల జాబితాను సమర్పించాలని బీసీసీఐ నవంబర్ 15ను డెడ్‌లైన్‌గా ప్రకటించింది. ఈ క్రమంలో ప్రముఖ జట్లు ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్.. తమ రిలీజ్డ్, రీటెయిన్డ్ ప్లేయర్ల లిస్ట్‌ను బీసీసీఐకి సమర్పించినట్లు తెలుస్తోంది. తదుపరి సీజన్‌కు ముంబై వద్దనుకున్న ఆటగాళ్ల జాబితాలో విండీస్ వెటరన్ ఆల్‌రౌండర్ కీరన్ పోలార్డ్ ఉండటం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తుంది. 2010 సీజన్ నుంచి ముంబై ఇండియన్స్‌తో అనుబంధాన్ని కొనసాగిస్తూ, జట్టకు ఎన్నో అపురూప విజయాలు అందించిన పోలీని.. ఇలా అవమానకర రీతిలో తప్పించడం బాధాకరమని ఎంఐకి సంబంధించిన అతని ఫ్యాన్స్ వాపోతున్నారు. పోలార్డ్‌తో పాటు ఫాబ్ అలెన్, తైమాల్ మిల్స్, మయాంక్ మార్కండే, హతిక్ షోకీన్‌లను కూడా ఎంఐ రిలీజ్ చేసినట్లు తెలుస్తోంది. పేస్ విభాగం బలం పెంచుకోవడం కోసం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు నుంచి జేసన్ బెహ్రెన్‌డార్ఫ్‌ను ట్రేడింగ్ చేసుకున్నట్లు సమాచారం. ప్రముఖ ఆంగ్ల మీడియా కథనం మేరకు ముంబై అట్టిపెట్టుకున్న ఆటగాళ్ల జాబితాలో రోహిత్ శర్మ, డెవాల్డ్ బ్రెవిస్, ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్, డేనియల్ సామ్స్, టిమ్ డేవిడ్, జోఫ్రా ఆర్చర్, జస్ప్రీత్ బుమ్రా, ట్రిస్టన్ స్టబ్స్, తిలక్ వర్మ ఉన్నట్లు తెలుస్తోంది. మరో పక్క ఫోర్ టైమ్ ఛాంపియన్ సీఎస్కే అనూహ్యంగా రవీంద్ర జడేజాను అట్టిపెట్టుకున్నట్లు తెలుస్తోంది. ఇలా జరగడానికి జట్టు కెప్టెన్ ఎంఎస్ ధోని మధ్యవర్తిత్వం వహించినట్లు సమాచారం. గత సీజన్లో సీఎస్కే యజమాన్యానికి, జడేజాకు మధ్య విభేదాలు తలెత్తడంతో.. జడ్డూ లీగ్ మధ్యలోనే గాయం సాకుగా చూపి వైదొలిగిన విషయం తెలిసిందే. ఇక సీఎస్కే వద్దనుకున్న ఆటగాళ్ల జాబితాలో క్రిస్ జోర్డన్, ఆడమ్ మిల్నే, మిచెల్ సాంట్నర్ ఉన్నట్లు సమాచారం. సీఎస్కే కొనసాగించనున్న ఆటగాళ్ల జాబితాలో ఎంఎస్ ధోని, రవీంద్ర జడేజా, మొయిన్ అలీ, శివమ్ దూబే, రుతురాజ్ గైక్వాడ్, డెవాన్ కాన్వే, ముకేశ్ చౌదరీ, డ్వేన్ ప్రిటోరియస్, దీపక్ చాహర్ ఉన్నట్లు తెలుస్తోంది. చదవండి: రియాన్ పరాగ్ ఊచకోత.. కెరీర్లో తొలి శతకం బాదిన రాజస్తాన్ రాయల్స్ ఆల్‌రౌండర్ -
'పొలార్డ్ నుంచి బౌల్ట్ దాకా'.. ఆరంభం కాకముందే టైటిల్‌పై కన్నేశారు
ఐపీఎల్లో విజయవంతమైన జట్టుగా పేరుపొందిన ముంబై ఇండియన్స్ క్రికెట్ సౌతాఫ్రికా, యూఏఈ లీగ్స్‌లోనూ పెట్టుబడులు పెట్టి జట్లను కొనుగోలు చేసింది. కొనుగోలు చేయడమే కాదు అందరికంటే ముందుగా తమ కొత్త జట్ల పేర్లను ప్రకటించడంతో పాటు ఆటగాళ్లను పరిచయం చేసింది. సీఎస్ఏ టి20 లీగ్‌లో 'ఎంఐ కేప్‌టౌన్'(MI Capetown).. యూఏఈ టి20 లీగ్‌లో 'ఎంఐ ఎమిరేట్స్'(MI Emirates)ను జట్లుగా ప్రకటించింది ముంబై ఇండియన్స్ యాజమాన్యం రిలయన్స్ ఇండస్ట్రీస్. తాజాగా యూఏఈ ఇంటర్నేషనల్ టి20లో తమ జట్టుకు ప్రాతినిథ్యం వహించబోయే జట్టును కూడా ప్రకటించింది. వెస్టిండీస్, ఇంగ్లండ్ ఆటగాళ్లకు ఈ జట్టులో పెద్దపీట వేసింది. 14 మందితో కూడిన ఈ జట్టులో ముంబై ఇండియన్స్ ఆల్ రౌండర్, విండీస్ మాజీ సారథి కీరన్ పొలార్డ్‌తో పాటు నికోలస్ పూరన్, డ్వేన్ బ్రావో, ఆండ్రీ ఫ్లెచర్‌లు కూడా ఉన్నారు. ఇక ఐపీఎల్లో గతంలో ముంబై ఇండియన్స్‌కు ఆడిన ట్రెంట్ బౌల్ట్‌ను మళ్లీ జట్టులో చోటు కల్పించింది. వీరితో పాటు ఇంగ్లండ్ నుంచి సమిత్ పటేల్, విల్ సమీద్, జోర్డాన్ థాంప్సన్ లు ఉన్నారు. అఫ్ఘనిస్తాన్ బౌలర్ జహీర్ ఖాన్, ఫజల్హక్ ఫరూఖీలను ఎంపిక చేసింది. సౌతాఫ్రికా స్పిన్నర్ ఇమ్రాన్ తాహిర్‌కు అవకాశం దక్కింది. ఈ మేరకు ఎంఐ ఎమిరేట్స్ జట్టును తమ అధికారిక ట్విటర్ ఖాతాలో ప్రకటించింది. యూఏఈ వేదికగా జరగబోయే ఇంటర్నేషనల్ లీగ్ టి20(ఐఎల్టీ20) జనవరి 6 నుంచి ఫిబ్రవరి 12వరకు జరగనుంది. లీగ్ మార్గదర్శకాలను అనుసరించి తమ ఫ్రాంచైజీకి ఆటగాళ్లు ఒప్పందాలు చేసుకున్నారని, ఇక స్థానిక (యూఏఈ) క్రికెటర్లు కూడా వీరికి జతకలుస్తారని ఎంఐ ఎమిరేట్స్ ఒక ప్రకటనలో పేర్కొంది. ఈ సందర్భంగా జట్టు ఓనర్ ఆకాశ్ అంబానీ స్పందిస్తూ.. ‘మా జట్టుకు చెందిన 14 మంది ఆటగాళ్లను పరిచయం చేయడం సంతోషంగా ఉంది. ముంబై ఇండియన్స్‌లో కీలక ఆటగాడైన పొలార్డ్.. ఎమిరేట్స్‌లో మాతోనే కొనసాగుతున్నాడు. బ్రావో, బౌల్డ్, పూరన్ లు మళ్లీ మాతో చేతులు కలపనున్నారు. ఎమిరేట్స్ జట్టుకు ఆడబోయే ఆటగాళ్లకు స్వాగతం.’అని పేర్కొన్నాడు. ఐఎల్టీ20కి ఎంఐ ఎమిరేట్స్ జట్టు: కీరన్ పొలార్డ్, డ్వేన్ బ్రావో, నికోలస్ పూరన్, ట్రెంట్ బౌల్ట్, అండ్రె ఫ్లెచర్, ఇమ్రాన్ తాహిర్, సమిత్ పటేల్, విల్ సమీద్, జోర్డాన్ థాంప్సన్, నజిబుల్లా జద్రాన్, జహీర్ ఖాన్, ఫరూఖీ, బ్రాడ్లే వీల్, బాడ్ డీ లీడే The 𝗟𝗹𝗼𝗿𝗱, the 𝗟𝗲𝗴𝗲𝗻𝗱 & his 𝗟𝗲𝗴𝗮𝗰𝘆! @KieronPollard55 will don the iconic Blue and Gold in IL T20 💙 🗞️ Read more: https://t.co/RMiQOJfj9N#OneFamily #MIemirates @MIEmirates @EmiratesCricket pic.twitter.com/C1flVytrpI — Mumbai Indians (@mipaltan) August 12, 2022 చదవండి: MI Capetown: ఐదుగురు ఆటగాళ్ల పేర్లను ప్రకటించిన ఎంఐ కేప్‌టౌన్.. రబడ సహా.. Mumbai Indians: విదేశీ లీగ్స్‌లోనూ తనదైన ముద్ర.. -
చరిత్ర సృష్టించిన కీరన్ పొలార్డ్.. ఎవరికి అందనంత ఎత్తులో
వెస్టిండీస్ మాజీ ఆల్‌రౌండర్ కీరన్ పొలార్డ్ టి20 క్రికెట్లో అరుదైన ఫీట్ అందుకున్నాడు. టి20ల్లో 600వ మ్యాచ్ ఆడిన తొలి క్రికెటర్‌గా పొలార్డ్ చరిత్ర సృష్టించాడు. ప్రస్తుతం హండ్రెడ్ టోర్నమెంట్లో ఆడుతున్న ఈ హిట్టర్ లండన్ స్పిరిట్స్ తరపున ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. సోమవారం మాంచెస్టర్ ఒరిజినల్స్‌తో మ్యాచ్‌లో పొలార్డ్ ఈ ఘనత అందుకున్నాడు. కాగా తన 600 వ ప్రతిష్టాత్మక మ్యాచ్‌లో పొలార్డ్ 11 బంతుల్లో 34 పరుగులు సాధించాడు. అతని ఇన్నింగ్స్‌లో ఒక ఫోర్, నాలుగు భారీ సిక్సర్లు ఉన్నాయి. ఇక టి20ల్లో సక్సెస్ అయిన బ్యాట్స్మెన్లలో పొలార్డ్ ఒకడిగా నిలిచాడు. 600 మ్యాచ్‌ల్లో 31.34 సగటుతో 11, 723 పరుగులు సాధించాడు. ఇందులో ఒక సెంచరీ ఉండగా.. 56 అర్థసెంచరీలు ఉన్నాయి. ఇక బౌలింగ్‌లో 309 వికెట్లు పడగొట్టిన పొలార్డ్ అత్యుత్తమ బౌలింగ్ 4/15 గా ఉంది. దాదాపు 15 ఏళ్ల నుంచి టి20లు ఆడుతున్న పొలార్డ్ వెస్టిండీస్‌తో పాటు ఎన్నో జట్లకు ప్రాతినిధ్యం వహించాడు. దేశవాలీలో ట్రినిడాడ్ అండ్ టొబాగొ, కరేబియన్ ప్రీమియర్ లీగ్‌లో ట్రిన్‌బాగో నైట్‌రైడర్స్‌కు, ఐపీఎల్లో ముంబై ఇండియన్స్, బీబీఎల్‌లో అడిలైడ్ స్ట్రైకర్స్, మెల్బోర్న్ రెనెగేడ్స్, బంగ్లా ప్రీమియర్ లీగ్‌లో డాకా గ్లాడియేటర్స్, డాకా డైనమిటీస్, పాకిస్తాన్ సూపర్ లీగ్(పీఎస్ఎల్)లో కరాచీ కింగ్స్, ముల్తాన్ సుల్తాన్స్, పెషావర్ జాల్మికి ప్రాతినిధ్యం వహించాడు. పొలార్డ్ తర్వాత టి20 క్రికెట్లో అత్యధిక మ్యాచ్‌లు ఆడిన జాబితాలో డ్వేన్ బ్రావో(543 మ్యాచ్‌లు), షోయబ్ మాలిక్(472 మ్యాచ్‌లు), క్రిస్ గేల్(463 మ్యాచ్‌లు), రవి బొపారా(426 మ్యాచ్‌లు) ఉన్నారు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే పొలార్డ్ హిట్టింగ్తో లండన్ స్పిరిట్స్ 10 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 160 పరుగుల భారీ స్కోరు చేసింది. పొలార్డ్‌తో పాటు కెప్టెన్ ఇయాన్ మెర్గాన్(37 పరుగులు), ఓపెనర్ జాక్ క్రాలీ(41 పరుగులు) చేశారు. ఆ తర్వాత మాంచెస్టర్ ఒరిజినల్స్ జోర్డాన్ థాంప్సన్(4/15) ధాటికి 108 పరుగులకే కుప్పకూలింది. దీంతో లండన్ స్పిరిట్స్ 52 పరుగుల తేడాతో ఘన విజయం అందుకుంది. చదవండి: Asia Cup 2022: పాక్ ప్రత్యర్ధిగా వందో టీ20 ఆడేందుకు సిద్ధంగా ఉన్న కోహ్లి బంగ్లాదేశ్‌కు మరోసారి ఊహించని షాక్.. వన్డే సిరీస్ జింబాబ్వే సొంతం! -
పొలార్డ్ ఇంట పాండ్యా.. ఇది జరగకుండా విండీస్ టూర్ ముగియదంటూ కామెంట్స్
విండీస్ పర్యటనలో వరుస విజయాలతో (ఒక్క టీ20 మినహాయించి) దూసుకుపోతున్న టీమిండియా ఖాళీ సమయం దొరికితే కరీబియన్ దీవుల్లో చక్కర్లు కొడుతూ సేద తీరుతుంది. భారత జట్టులోని మెజారిటీ సభ్యులు వివిధ పర్యాటక ప్రదేశాలను విజిట్ చేయగా.. స్టార్ ఆల్‌రైండర్ హార్ధిక్ పాండ్యా మాత్రం తన మాజీ ఐపీఎల్ సహచరుడు, తనెంతో అభిమానించే విండీస్ మాజీ కెప్టెన్ కీరన్ పోలార్డ్ ఇంటిని సందర్శించి, అతని కుటుంబ సభ్యులతో సరదాగా గడిపాడు. No trip to the Caribbean is complete without a visit to the King’s home ❤️❤️ Polly my favourite and your beautiful family, thank you for hosting me my brother 🥰❤️😘 @KieronPollard55 pic.twitter.com/pGdhNX0n6l — hardik pandya (@hardikpandya7) August 4, 2022 టీమిండియా విండీస్ పర్యటన ముగిసే ముందు హార్ధిక్.. పోలార్డ్ కుటుంబ సభ్యులతో కలిసి దిగిన ఫోటోలు ట్విటర్లో పోస్ట్ చేశాడు. కింగ్ పొలార్డ్ ఆతిథ్యం స్వీకరించకుండా విండీస్ పర్యటన ముగియదని.. పోలార్డ్ తన ఫేవరెట్ అని, అన్నతో సమానమని, తనకు ఆతిధ్యం ఇచ్చినందుకు ధన్యవాదాలు అని కామెంట్ చేశాడు. ఈ ఫోటోలు ప్రస్తుతం సోషల్‌మీడియాలో ట్రెండింగ్‌లో ఉన్నాయి. ఇదిలా ఉంటే, విండీస్‌తో 5 మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో ప్రస్తుతానికి (3 మ్యాచ్‌ల్లో) టీమిండియా 2-1 ఆధిక్యంలో కొనసాగుతున్న విషయం తెలిసిందే. తదుపరి రెండు మ్యాచ్‌లు అమెరికాలోని ఫ్లోరిడాలో జరుగనున్నాయి. విండీస్ పర్యటనలో టీమిండియా వన్డే సిరీస్‌ను 3-0తేడాతో క్లీన్ స్వీప్ చేసింది. చదవండి: రోహిత్ బాటలోనే కేఎల్ రాహుల్.. హార్దిక్‌కు ప్రమోషన్! -
ఆరు బంతుల్లో ఆరు సిక్స్‌లు.. టీ10 చరిత్రలో అరుదైన ఫీట్.. తొలి ఆటగాడిగా..!
క్రికెట్ చరిత్రలో మరో ఆరు బంతుల్లో ఆరు సిక్స్‌ల రికార్డు నమోదైంది. ప్రస్తుతం జరుగుతున్న పాండిచ్చేరి టీ10 లీగ్‌లో పేట్రియాట్స్ యువ ఆటగాడు కృష్ణ పాండే ఆరు బంతుల్లో ఆరు సిక్స్‌లు బాది ఈ అరుదైన రికార్డు సాధించాడు. శనివారం రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కృష్ణ పాండే ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. పేట్రియాట్స్ ఇన్నింగ్స్ ఆరో ఓవర్ వేసిన నితీష్ ఠాకూర్ బౌలింగ్‌లో వరుసగా ఆరు బంతుల్లో ఆరు సిక్స్‌లు బాది పాండే విధ్వంసం సృష్టించాడు. పాండే కేవలం 19 బంతుల్లోనే 12 సిక్స్‌లు, 2 ఫోర్లతో 83 పరుగులు సాధించాడు. అయితే ఆనూహ్యంగా పేట్రియాట్స్ ఈ మ్యాచ్‌లో 4పరుగుల తేడాతో ఓటమి పాలైంది. 158 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పేట్రియాట్స్ నిర్ణీత 10 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 153 పరుగులు చేయగల్గింది. ఇక టీ20ల్లో టీమిండియా మాజీ ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్ 2007 టీ20 ప్రపంచకప్‌లో ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌లో మొదటిసారిగా ఈ ఫీట్‌ను సాధించాడు. అదే విధంగా శ్రీలంకతో జరగిన టీ20లో వెస్టిండీస్ మాజీ కెప్టెన్ కిరాన్ పొలార్డ్ కూడా ఈ అరుదైన ఫీట్ సాధించాడు. అయితే టీ10 క్రికెట్లో ఈ ఘనత సాధించిన తొలి ఆటగాడిగా పాండే నిలిచాడు. చదవండి: Attack On Cricketer Mondli Khumalo: కోమా నుంచి కోలుకున్న దక్షిణాఫ్రికా యువ క్రికెటర్.. 6️⃣6️⃣6️⃣6️⃣6️⃣6️⃣ He has done the unthinkable! #KrishnaPandey shows what's possible with his heart-stirring hits! Watch the Pondicherry T10 Highlights, exclusively on #FanCode 👉 https://t.co/GMKvSZqfrR pic.twitter.com/jfafcU8qRW — FanCode (@FanCode) June 4, 2022 -
IPL 2022: గత సీజన్లో అదరగొట్టారు.. కోట్లు కొట్టేశారు.. ఈసారి అట్టర్ ఫ్లాఫ్!
IPL 2022: ఐపీఎల్ లాంటి టీ20 టోర్నమెంట్లో ఎప్పుడు ఎవరు అదరగొడుతారు? ఎప్పుడు ఎవరు డీలా పడతారు? ఏ జట్టు పైచేయి సాధిస్తుందన్న విషయాలను అంచనా వేయడం కాస్త కష్టమే! ఐదుసార్లు చాంపియన్ అయిన ముంబై ఇండియన్స్ ఈసారి పాయింట్ల పట్టికలో అట్టడుగున నిలవగా.. డిఫెండింగ్ చాంపియన్ చెన్నై సూపర్‌కింగ్స్ తొమ్మిదో స్థానంలో నిలిచింది. ఇక ఈ విషయం కాసేపు పక్కన పెడితే.. పొట్టి ఫార్మాట్లో ఫామ్‌ను కొనసాగిస్తూ ముందుకు సాగటం కొంతమంది ఆటగాళ్లకు మాత్రమే సాధ్యమవుతుంది. ఒక సీజన్లో అదరగొట్టిన వాళ్లు.. మరో ఎడిషన్‌లో ఏమాత్రం ప్రభావం చూపకపోవచ్చు. లేదంటే ఢిల్లీ క్యాపిటల్స్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్న ఆసీస్ డేవిడ్ వార్నర్‌లా గతంలో ఫామ్‌లేమితో ఇబ్బంది పడిన వాళ్లు తిరిగి విజృంభించనూ వచ్చు. ఈ నేపథ్యంలో ఐపీఎల్-2021లో అదరగొట్టి.. 2022 ఎడిషన్‌లో చతికిలపడ్డ టాప్-5 ఆటగాళ్లు ఎవరో ఓసారి గమనిద్దాం. PC: IPL/BCCI మయాంక్ అగర్వాల్ పంజాబ్ కింగ్స్ బ్యాటర్ మయాంక్ అగర్వాల్ ఐపీఎల్-2021లో అదరగొట్టే ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. 12 ఇన్నింగ్స్‌లలో కలిపి 441 పరుగులు చేశాడు. ఇందులో 4 అర్ధ శతకాలు ఉండటం విశేషం. ఇక పంజాబ్ తరఫున గత ఎడిషన్‌లో అత్యధిక పరుగులు సాధించిన రెండో బ్యాటర్‌గా మయాంక్ నిలిచాడు. అయితే, తాజా సీజన్లో పరిస్థితులు మారాయి. 12 కోట్ల రూపాయలకు రిటైన్ చేసుకుని పంజాబ్ కెప్టెన్‌గా అతడిని నియమించింది ఫ్రాంఛైజీ. కానీ కెప్టెన్సీ భారం మోయలేక మయాంక్ చేతులెత్తేశాడు. బ్యాటర్‌గానూ విఫలమయ్యాడు. ఐపీఎల్-2022లో ఆడిన 12 మ్యాచ్‌లలో కలిపి 195 పరుగులు మాత్రమే చేయగలిగాడు. మయాంక్ సారథ్యంలో పంజాబ్ కింగ్స్ పెద్దగా రాణించింది కూడా లేదు. ఇప్పటి వరకు ఆడిన 13 మ్యాచ్‌లలో కేవలం ఆరు గెలిచి ఏడో స్థానంలో ఉంది. PC: IPL/BCCI వెంకటేశ్ అయ్యర్ దేశవాళీ క్రికెట్లో అదరగొట్టిన మధ్యప్రదేశ్ యువ ప్లేయర్ వెంకటేశ్ అయ్యర్‌ను కోల్‌కతా నైట్‌రైడర్స్ సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. గత సీజన్ రెండో అంచెలో వరుస అవకాశాలు దక్కించుకున్న వెంకటేశ్.. 10 ఇన్నింగ్స్‌లలో 370 పరుగులు చేశాడు. ఈ క్రమంలో టీమిండియాలోనూ చోటు దక్కించుకున్నాడు. హార్దిక్ పాండ్యా స్థానాన్ని భర్తీ చేయగల ఆల్‌రౌండర్‌గా ప్రశంసలు అందుకున్నాడు. కానీ ఐపీఎల్-2022లో అంచనాలకు అనుగుణంగా రాణించలేకపోయాడు. వరుస వైఫల్యాలతో ఒకానొక సమయంలో తుది జట్టులో చోటు కోల్పోయాడు. ఇక మొత్తంగా ఈ సీజన్లో 12 ఇన్నింగ్స్ ఆడిన అతడు కేవలం 182 పరుగులు చేశాడు. అత్యధిక స్కోరు 50 నాటౌట్. తనను రిటైన్ చేసుకునేందుకు ఫ్రాంఛైజీ ఖర్చు చేసిన 8 కోట్లకు న్యాయం చేయలేకపోయాడు. PC: IPL/BCCI కీరన్ పొలార్డ్ వెస్టిండీస్ బ్యాటర్, ముంబై ఇండియన్స్ హిట్టర్ కీరన్ పొలార్డ్ గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. 2010 నుంచి ముంబై జట్టు ప్రాతినిథ్యం వహిస్తున్న ఈ విండీస్ మాజీ కెప్టెన్ గత సీజన్లో 245 పరుగులు చేశాడు. చెన్నైపై సంచలన ఇన్నింగ్స్(34 బంతుల్లో 87 పరుగులు నాటౌట్) ఆడాడు. కట్ చేస్తే ఐపీఎల్-2022లో పరిస్థితి తలకిందులైంది. 6 కోట్లకు ముంబై రిటైన్ చేసుకుంటే స్థాయికి తగ్గట్లు రాణించలేక అతడు డీలా పడ్డాడు. ఆడిన 11 మ్యాచ్‌లలో కలిపి పొలార్డ్ చేసిన స్కోరు 144. ఇక వరుసగా పొలార్డ్ నిరాశపరిచిన నేపథ్యంలో యువ ఆటగాళ్లకు అవకాశం ఇవ్వాలనే తలంపుతో అతడిని తుది జట్టు నుంచి తప్పించారు. PC: IPL/BCCI హర్షల్ పటేల్ గత ఐపీఎల్ ఎడిషన్‌లో అదరగొట్టే ప్రదర్శనతో పర్పుల్ క్యాప్ గెలుచుకున్నాడు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు బౌలర్ హర్షల్ పటేల్. ఆడిన 15 మ్యాచ్‌లలో 8.14 ఎకానమీతో 32 వికెట్లు పడగొట్టి ‘పర్పుల్’ పటేల్ అని కితాబులందుకున్నాడు. ఆర్సీబీని ప్లే ఆఫ్స్ చేర్చడంలో హర్షల్ కీలక పాత్ర పోషించాడు. అయితే, రిటెన్షన్‌లో వదిలేసిన్పటికీ మెగా వేలంలో ఆర్సీబీ అతడ కోసం 10.75 కోట్లు వెచ్చించింది. కానీ తాజా సీజన్లో పెద్దగా ఆకట్టుకోలేకపోయాడు. 12 మ్యాచ్‌లలో అతడు తీసినవి 18 వికెట్లు. గతేడాది పోలిస్తే ఈసారి పెద్దగా రాణించలేదనే చెప్పాలి. PC: IPL/BCCI వరుణ్ చక్రవర్తి మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి గత ఐపీఎల్ సీజన్లో 17 వికెట్లు పడగొట్టాడు. వరుణ్ అద్భుత ప్రదర్శనతో యూఏఈ వేదికగా సాగిన రెండో అంచెలో కోల్‌కతా నైట్‌రైడర్స్ అదరగొట్టింది. ఏకంగా ఫైనల్ చేరి రన్నరప్‌గా నిలిచింది. ఈ క్రమంలో ఐపీఎల్-2022 మెగా వేలం నేపథ్యంలో వరుణ్‌ను 8 కోట్లకు రిటైన్ చేసుకుంది కేకేఆర్. కానీ అతడు ధరకు తగ్గ న్యాయం చేయలేకపోయాడు. దీంతో తుదిజట్టు నుంచి తప్పించి హర్షిత్ రాణా వంటి కొత్త ఆటగాళ్లకు అవకాశమిచ్చారు. ఐపీఎల్-2022లో వరుణ్ చక్రవర్తి 11 ఇన్నింగ్స్‌లో కలిపి తీసిన వికెట్ల సంఖ్య- 6. చదవండి👉🏾IPL 2022: సన్‌రైజర్స్ చేసిన అతిపెద్ద తప్పిదం అదే.. అందుకే ఇలా: సెహ్వాగ్ చదవండి👉🏾IPL 2022: యార్కర్లతో అదరగొట్టాడు.. చివరి మ్యాచ్‌లోనైనా అవకాశమివ్వండి! -
"పొలార్డ్‌ను పక్కన పెట్టండి.. ఆ యువ ఆటగాడికి అవకాశం ఇవ్వండి"
ఐపీఎల్-2022లో ముంబై ఇండియన్స్ విధ్వంసకర ఆల్ రౌండర్ కీరన్ పొలార్డ్ తీవ్రంగా నిరాశపరుస్తున్నాడు. ఈ ఏడాది సీజన్లో ఇప్పటి వరకు 10 మ్యాచ్‌లు ఆడిన పొలార్డ్ కేవలం 129 పరుగులు మాత్రమే సాధించాడు. ఇక ఈ ఏడాది సీజన్లో ముంబై ఆడునున్న తదుపరి మ్యాచ్‌లకు పొలార్డ్‌ను పక్కన పెట్టి, డెవాల్డ్ బ్రెవిస్‌ను తుది జట్టులోకి తీసుకురావాలని భారత మాజీ ఓపెనర్ ఆకాష్ చోప్రా సూచించాడు. "వరుస ఓటములతో సతమతమైన ముంబై ఇప్పుడు అద్భుతంగా ఆడుతోంది. అయితే వారి జట్టులో ఒక మార్పు చేయవలసిన సమయం వచ్చింది. కీరన్ పొలార్డ్ స్థానంలో డెవాల్డ్ బ్రీవిస్ మళ్లీ తిరిగి జట్టులో రావాలి.పొలార్డ్‌కి మీరు ఎన్ని అవకాశాలు ఇస్తారు? అతడు బ్యాటింగ్‌లో పూర్తిగా విఫలమవుతున్నాడు. ఈ పిచ్‌లపై బౌలింగ్ పరంగా పర్వాలేదనిపిస్తున్నాడు.. అయితే బౌలర్‌గా అతడిని జట్టులో ఎంపిక చేయడం లేదు కదా. కాబట్టి పొలార్డ్‌కు టాటా బై బై చెప్పే సమయం వచ్చిందని నేను భావిస్తున్నాను"అని ఆకాష్ చోప్రా యూట్యూబ్ ఛానల్లో పేర్కొన్నాడు. ముంబై తన తదపురి మ్యాచ్‌లో సోమవారం కేకేఆర్‌తో తలపడనుంది. చదవండి: IPL 2022: ముంబైతో కేకేఆర్ ఢీ.. శ్రేయస్ సేన ఓడిందా..? var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_4381453179.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
IPL 2022: పొలార్డ్ కథ ముగిసింది.. జట్టు నుంచి తప్పించడం ఖాయం!
IPL 2022 MI Vs GT: ఐపీఎల్ మెగా వేలం-2022 నేపథ్యంలో వెస్టిండీస్ ‘హిట్టర్’ కీరన్ పొలార్డ్‌ను 6 కోట్ల రూపాయలు వెచ్చించి మరీ రిటైన్ చేసుకుంది ముంబై ఇండియన్స్. కానీ ఈ సీజన్లో అతడు తన స్థాయికి తగ్గట్టు రాణించడం లేదు. ఇప్పటి వరకు ఆడిన 10 మ్యాచ్‌లలో పొలార్డ్ చేసింది కేవలం 129 పరుగులు. అత్యధిక స్కోరు 25. ఈ గణాంకాలను బట్టి చూస్తే పరిస్థితి ఎంత ఘోరంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. జట్టులో కీలక సభ్యుడైన పొలార్డ్ వైఫల్యం ముంబై ఇండియన్స్ గెలుపోటములపై తీవ్ర ప్రభావం చూపిస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు. అయినప్పటికీ పొలార్డ్‌ను మాత్రం కొనసాగిస్తూనే ఉన్నారు. ఈ క్రమంలో గుజరాత్ టైటాన్స్‌తో శుక్రవారం(మే 6) మ్యాచ్‌లో మరోసారి పొలార్డ్ విఫలం కావడంతో అతడి ఆట తీరుపై విమర్శలు తీవ్రమయ్యాయి. ఈ మ్యాచ్‌లో 14 బంతులు ఎదుర్కొన్న ఈ వెస్టిండీస్ మాజీ కెప్టెన్ కేవలం 4 పరుగులు మాత్రమే చేసి అవుటయ్యాడు. ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ బ్యాటర్, వ్యాఖ్యాత ఆకాశ్ చోప్రా కీలక వ్యాఖ్యలు చేశాడు. మిగిలి ఉన్న మ్యాచ్‌లలో పొలార్డ్‌పై వేటు తప్పదని అభిప్రాయపడ్డాడు. గుజరాత్‌తో మ్యాచ్ ఈ సీజన్లో అతడికి చివరిది కావొచ్చంటూ జోస్యం చెప్పాడు. ఈ మేరకు తన యూట్యూబ్ చానెల్ వేదికగా.. ‘‘నాకు తెలిసి కీరన్ పొలార్డ్ ఇక వచ్చే ఏడాది నుంచి ఆడకపోవచ్చు. డెవాల్డ్ బ్రెవిస్ ఉన్నాడు. టిమ్ డేవిడ్ రాణిస్తున్నారు. కాబట్టి ఇక పొలార్డ్‌ను ఆడించకపోవచ్చు. నిజానికి ముందే వాళ్లు(ముంబై) టిమ్ డేవిడ్‌ను ఎందుకు జట్టులోకి తీసుకురాలేదో తెలియడం లేదు. సిక్సర్లు కొట్టే హిట్టింగ్ మెషీన్‌ను వాళ్లు పక్కకు పెట్టారు’’ అని పేర్కొన్నాడు. ఇక టిమ్ డేవిడ్‌ను తప్పక కొనసాగిస్తారని ఆకాశ్ చోప్రా అభిప్రాయపడ్డాడు. ఇక ఈ సీజన్లో సమిష్టి వైఫల్యంతో పదింట కేవలం రెండే మ్యాచ్‌లు గెలిచిన ముంబై ప్లే ఆఫ్స్ రేసు నుంచి ఇప్పటికే నిష్క్రమించిన సంగతి తెలిసిందే. ఇక మిగిలినవి 4 మ్యాచ్‌లు. వీటిలో గెలిచి పరువు నిలబెట్టుకోవాలని రోహిత్ సేన భావిస్తోంది. కాగా గుజరాత్‌తో మ్యాచ్‌లో ముంబై 5 పరుగుల తేడాతో గెలిచి రెండో విజయం నమోదు చేసిన సంగతి తెలిసిందే. 21 బంతుల్లో 44 పరుగులతో అజేయంగా నిలిచిన టిమ్ డేవిడ్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు. చదవండి👉🏾PBKS Vs RR Records: పంజాబ్, రాజస్తాన్.. వాంఖడేలో ఇరు జట్లకు పాపం ఏకంగా! var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_4381453179.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
IPL 2022: పొలార్డ్ వచ్చే ఏడాది గుజరాత్ టైటాన్స్‌కు ఆడతాడేమో!
IPL 2022 MI Vs GT: వెస్టిండీస్ మాజీ కెప్టెన్ కీరన్ పొలార్డ్‌తో టీమిండియా ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యాకు ఉన్న అనుబంధం గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఐపీఎల్లో ముంబై ఇండియన్స్‌కు ప్రాతినిథ్యం వహించిన సమయంలో వీరి మధ్య స్నేహం బలపడింది. ఇక క్యాష్ రిచ్ లీగ్ మెగా వేలం-2022 నేపథ్యంలో ముంబై హార్దిక్‌ను వదిలేసి.. పొలార్డ్‌ను అట్టిపెట్టుకున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో కొత్త ఫ్రాంఛైజీ గుజరాత్ టైటాన్స్ హార్దిక్ పాండ్యాను సొంతం చేసుకుని తమ కెప్టెన్‌గా నియమించింది. ఇక ముంబై ఇండియన్స్ ఇప్పటి వరకు కేవలం తొమ్మిదింట ఒక్కటి మాత్రమే గెలిచి పాయింట్ల పట్టికలో అట్టడుగున ఉండగా.. గుజరాత్ మాత్రం పది మ్యాచ్‌లలో ఏకంగా ఎనిమిది విజయాలతో టాప్‌లో కొనసాగుతోంది. ఇక ఈ రెండు జట్లు శుక్రవారం(మే 6) ముంబైలోని బ్రబౌర్న్ వేదికగా తలపడనున్నాయి. ఈ నేపథ్యంలో హార్దిక్ పాండ్యా మాట్లాడుతూ ఈ సీజన్లో పెద్దగా ఆకట్టుకోలేకపోతున్న పొలార్డ్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. అదే విధంగా ముంబై జట్టుతో తన అనుబంధాన్ని గుర్తు చేసుకున్నాడు. ఈ మేరకు హార్దిక్ పాండ్యా మాట్లాడుతూ.. ‘‘ఈరోజు పాలీ(పొలార్డ్) బాగా ఆడాలి. అయితే మేము మ్యాచ్ గెలవాలి. నువ్వు బాగానే ఉన్నావా అంటూ తనకు నేను మెసేజ్‌లు పెడుతూ ఉంటాను. ఒకవేళ నువ్వు వచ్చే ఏడాది గుజరాత్ టైటాన్స్‌కు ఆడతావేమో అని సరాదాగా ఆటపట్టిస్తూ ఉంటాను. అది ఎప్పటికీ జరగదని నాకు తెలుసు. కానీ అలా జోక్ చేస్తూ ఉంటా’’ అని పేర్కొన్నాడు. అదే విధంగా.. ‘‘2015 నాకు అత్యంత ముఖ్యమైనది. నాకౌట్ దశకు చేరాలంటే ఏడు మ్యాచ్‌లలో గెలవాల్సిన తరుణంలో నేను రెండు మ్యాచ్‌లలో జట్టును గెలిపించడంలో కీలక పాత్ర పోషించి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డులు గెలుచుకున్నా. అలా విజయంతో పేరుప్రఖ్యాతులు సొంతం చేసుకున్నా. అప్పుడు నేను మూడు సిక్సర్లు కొట్టానుకుంటా. చివరి రెండు ఓవర్లలో 32 పరుగులు అవసరమైన వేళ మూడు నాలుగు బంతులు మిగిలి ఉండగానే లక్ష్యం చేరుకుంటే ఆ మజానే వేరు’’ అని గత జ్ఞాపకాలు నెమరువేసుకున్నాడు. ఇక గుజరాత్‌తోనూ తనకు ప్రత్యేక బంధం ఉందన్న హార్దిక్ పాండ్యా.. ముంబై జట్టు టైటిళ్లు గెలిచిన సందర్భంలో తాను కూడా ఆ జట్టులో భాగం కావడం మరింత ప్రత్యేకమని ఫ్రాంఛైజీ మీద అభిమానం చాటుకున్నాడు. చదవండి👉🏾Rovman Powell: ఆ రికార్డు బద్దలు కొట్టాలి! 130 మీటర్లు.. నా లక్ష్యం అదే! A tale of two colours - blue and golden - in the words of #PapaPandya 😍 📽 Captain relives his MI memories before the clash of the day #GTvMI@hardikpandya7 #SeasonOfFirsts #AavaDe pic.twitter.com/4ZNe7Gh69v — Gujarat Titans (@gujarat_titans) May 6, 2022 -
IPL 2022: పాపం పొలార్డ్.. కృనాల్ ఓవరాక్షన్ భరించలేకున్నాం!
IPL 2022 MI Vs LSG- Krunal Pandya- Kieron Pollard: లక్నో సూపర్ జెయింట్స్ ఆటగాడు కృనాల్ పాండ్యా తీరును టీమిండియా మాజీ వికెట్ కీపర్ బ్యాటర్ పార్థివ్ పటేల్ విమర్శించాడు. ఎదుటి వ్యక్తుల మానసిక స్థితిని అర్థం చేసుకుని వ్యవహరించాలంటూ హితవు పలికాడు. స్నేహితుడే కదా అని ఇష్టారీతిన ప్రవర్తించడం సరికాదని, ఎదుటివారి మనోభావాలను గౌరవించాలని సూచించాడు. కాగా ముంబై ఇండియన్స్, లక్నో జట్ల మధ్య ఆదివారం మ్యాచ్ జరిగిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్‌లో లక్నో ముంబైపై 36 పరుగుల తేడాతో గెలుపొందింది. అయితే, చివరి ఓవర్లో కృనాల్ పాండ్యా.. ముంబై ఆల్‌రౌండర్ కీరన్ పొలార్డ్‌తో వ్యవహరించిన తీరు చర్చకు దారితీసింది. తొలుత లక్నో సూపర్ జెయింట్స్ ఇన్నింగ్స్ సందర్భంగా పొలార్డ్ కృనాల్ పాండ్యాను అవుట్ చేశాడు. ఇక ముంబై లక్ష్య ఛేదనకు దిగిన క్రమంలో.. ఆరో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన పొలార్డ్ వికెట్‌ను కృనాల్ తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ క్రమంలో తీవ్ర నిరాశతో క్రీజును వీడుతున్న పొలార్డ్ వీపు పైకి దుమికి కృనాల్ అతడి తలను ముద్దు పెట్టుకున్నాడు. అయితే, పొలార్డ్ ఎలాంటి స్పందనా లేకుండా భారంగా పెవిలియన్ చేరాడు. ఈ ఘటనపై స్పందించిన పార్థివ్ పటేల్ క్రిజ్బజ్తో మాట్లాడుతూ.. ‘‘కృనాల్, పొలార్డ్ మంచి స్నేహితులు. కానీ, ప్రత్యర్థులుగా మైదానంలో దిగినపుడు పరిస్థితులు వేరుగా ఉంటాయి. పొలార్డ్ పరుగులు చేయలేకపోవడంతో నిరాశలో ఉన్నాడు. ముంబై మ్యాచ్ ఓడిపోయే స్థితిలో ఉంది. అలాంటపుడు ఎవరి మానాన వారిని వదిలేయాలి. అంతగా చనువు ఉంటే.. డ్రెస్సింగ్‌రూంలో ‘స్నేహితుల’తో ఏడాదంతా ఎంత సరదాగా ఉన్నా పర్లేదు కానీ.. మైదానంలో ఇలా చేయకూడదు. ఈ రియాక్షన్ నాకైతే మరీ ఓవర్‌గా అనిపిస్తోంది’’ అని కృనాల్ తీరును తప్పుబట్టాడు. ఇక మరో మాజీ క్రికెటర్ ఆర్పీ సింగ్ ఈ విషయంపై తన అభిప్రాయాన్ని పంచుకుంటూ.. ‘‘ఓడిపోవాలని ఎవరూ కోరుకోరు. ఒక ఆటగాడు కఠిన పరిస్థితులను ఎదుర్కొంటున్న స్థితిలో ఇలాంటివి చేయకపోవడం మంచిది. ఆ సమయంలో అతడి భావోద్వేగాలు, మానసిక సంఘర్షణ ఎలా ఉంటుందో మనం అంచనా వేయలేం. ఒకవేళ పొలార్డ్ వెనక్కి తిరిగి సమాధానం ఇచ్చి ఉంటే ఏమయ్యేది? తను జట్టును గెలపించలేకపోతున్నాననే నిరాశతో వెనుదిరిగినపుడు కృనాల్ ఇలా చేయడం నిజంగా టూ మచ్’’ అని కృనాల్ పాండ్యాపై విమర్శలు గుప్పించాడు. కాగా గతంలో పొలార్డ్, కృనాల్ ఒకే ఫ్రాంఛైజీ(ముంబై)కి ఆడారన్న విషయాన్ని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇక ఐపీఎల్-2022లో భాగంగా ప్రత్యర్థులుగా మైదానంలోకి దిగుతున్నారు. ఇక భారీ హిట్టర్‌గా పేరొందిన పొలార్డ్ ఈ సీజన్లో ఆకట్టుకోలేకపోతున్నాడు. ఇటీవలే అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన అతడికి తాజా ఐపీఎల్ ఎడిషన్ ఏమాత్రం కలిసిరావడం లేదు. ఇప్పటి వరకు 8 మ్యాచ్‌లు ఆడి 115 పరుగులు(అత్యధిక స్కోరు: 25) చేసిన ఈ వెస్టిండీస్ మాజీ ఆల్‌రౌండర్.. 3 వికెట్లు తీశాడు. ఇక లక్నోతో మ్యాచ్‌లో పొలార్డ్ చేసిన స్కోరు: 20 బంతుల్లో 19 పరుగులు. ఇదిలా ఉంటే.. ముంబై వరుసగా ఎనిమిదో ఓటమి మూటగట్టుకుని పాయింట్ల పట్టికలో అట్టడుగు స్థానానికే పరిమితమైంది. దీంతో ప్లే ఆఫ్స్ రేసు నుంచి ఈ జట్టు నిష్క్రమించినట్లయింది. చదవండి👉🏾 Trolls On Ishan Kishan: ధర 15 కోట్లు.. ఇషాన్ ఇదేమైనా టెస్టు మ్యాచ్ అనుకున్నావా? పాపం ముంబై ఫ్రాంఛైజీ var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_4141448520.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); That's that from Match 37 and @LucknowIPL take this home with a 36-run win over #MumbaiIndians Scorecard - https://t.co/O75DgQTVj0 #LSGvMI #TATAIPL pic.twitter.com/9aLniT8oHi — IndianPremierLeague (@IPL) April 24, 2022 -
అప్పుడూ.. ఇప్పుడూ ధోని మాస్టర్ ప్లాన్‌కు చిత్తు.. ఇగో వదిలెయ్!
IPL 2022 CSK Vs MI- MS Dhoni- Kieron Pollard: ముంబై ఇండియన్స్ హిట్టర్ కీరన్ పొలార్డ్ తీరుపై టీమిండియా మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ విమర్శలు గుప్పించాడు. నాకు తిరుగులేదు అన్న అహంభావంతోనే చెన్నై సూపర్‌కింగ్స్‌తో మ్యాచ్‌లో వికెట్ కోల్పోయాడంటూ ఘాటు వ్యాఖ్యలు చేశాడు. ఇకనైనా ఇగోను పక్కనపెట్టి జట్టు ప్రయోజనాల కోసం ఆడాలని సూచించాడు. కాగా ఐపీఎల్-2022లో భాగంగా చెన్నైతో గురువారం జరిగిన మ్యాచ్‌లో ముంబై పరాజయం పాలైన సంగతి తెలిసిందే. ఆఖరి బంతికి ధోని ఫోర్ బాదడంతో మూడు వికెట్ల తేడాతో ఓటమి పాలై వరుసగా ఏడో పరాజయాన్ని మూటగట్టుకుంది. ఓపెనర్లు రోహిత్ శర్మ(0), ఇషాన్ కిషన్(0) పూర్తిగా విఫలం కాగా... వన్‌డౌన్‌లో వచ్చిన డెవాల్డ్ బ్రెవిస్ 4 పరుగులకే పెవిలియన్ చేరాడు. ఈ క్రమంలో సూర్యకుమార్ యాదవ్(32), తిలక్ వర్మ(51) కలిసి ఇన్నింగ్స్ చక్కదిద్దే ప్రయత్నం చేశారు. ఆఖర్లో 9 బంతుల్లో ఒక ఫోర్, ఒక సిక్సర్ బాది 14 పరుగులు సాధించిన పొలార్డ్ భారీ స్కోరు చేసేలా కనిపించాడు. అయితే, ప్రమాదకరంగా పరిణమిస్తున్న పొలార్డ్‌ను పెవిలియన్‌కు పంపేందుకు చెన్నై మాజీ కెప్టెన్ ధోని ఫీల్డ్ సెట్ చేశాడు. తలైవా మాస్టర్ ప్లాన్‌లో చిక్కుకున్న ఈ భారీ హిట్టర్ మహీశ్ తీక్షణ బౌలింగ్‌లో శివమ్ దూబేకు క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు. మహీశ్ సంధించిన క్యారమ్ బాల్‌ను తేలికగా తీసుకుని డీప్‌లో ఉన్న దూబేకు దొరికిపోయి వికెట్ సమర్పించుకున్నాడు. ఒకరకంగా చెప్పాలంటే ధోనికి కౌంటర్ ఇవ్వాలనే ఉద్దేశంతో ఇగోకు పోయి బొక్కబోర్లా పడ్డాడు. ఈ నేపథ్యంలో ఇర్ఫాన్ పఠాన్ స్టార్ స్పోర్ట్స్ షోలో మాట్లాడుతూ.. ‘‘స్ట్రెయిట్ షాట్లు ఆడటమే పొలార్డ్ బలం. అందుకే అక్కడ వాళ్లు(సీఎస్కే) ఫీల్డర్‌ను పెట్టారు. కాబట్టి పొలార్డ్ కాస్త ఆచితూచి ఆడాల్సింది. కానీ అతడు అప్పుడు కూడా స్ట్రెయిట్ షాట్ ఆడేందుకే మొగ్గు చూపాడు. మూల్యం చెల్లించాడు. మంచి ఇన్నింగ్స్ ఆడుతూ.. మ్యాచ్‌లు గెలిపిస్తూ కీలక ప్లేయర్‌గా అవతరించిన తర్వాత.. ‘‘మీరు నాకోసం వల పన్నారు కదా! చూడండి నా బలమేమిటో చూపిస్తా’’ అన్నట్లుగా పొలార్డ్ వ్యవహరించాడు. ఫలితంగా వికెట్ సమర్పించుకున్నాడు’’ అని పేర్కొన్నాడు. 12 ఏళ్ల క్రితం ఇదే తరహాలో ఐపీఎల్-2010 ఫైనల్లో సీఎస్కేతో మ్యాచ్‌లో పొలార్డ్ అవుటైన సంగతి తెలిసిందే. ఆల్బీ మోర్కెల్‌కు బంతిని ఇచ్చిన ధోని మిడాఫ్‌లో మాథ్యూ హెడెన్ ఫీల్డర్‌గా పెట్టగా.. పొలార్డ్ అతడికి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. ఈ మ్యాచ్‌లో ముంబైపై 22 పరుగుల తేడాతో గెలుపొందిన ధోని సేన టైటిల్ ఎగురేసుకుపోయింది. చదవండి👉🏾: MS Dhoni IPL Record: ఐపీఎల్లో ధోని అరుదైన రికార్డు.. రైనా, డివిల్లియర్స్‌ను వెనక్కి నెట్టి.. Nobody finishes cricket matches like him and yet again MS Dhoni 28* (13) shows why he is the best finisher. A four off the final ball to take @ChennaiIPL home. What a finish! #TATAIPL #MIvCSK pic.twitter.com/oAFOOi5uyJ — IndianPremierLeague (@IPL) April 21, 2022 var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_4031445617.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
పొలార్డ్ కాళ్లకు దండం పెట్టిన బ్రావో.. వీడియో వైరల్
ఐపీఎల్-2022లో భాగంగా ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ మ్యాచ్ ఆరంభానికి ముందు ఓ ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. ముంబై విధ్వంసకర ఆల్ రౌండర్ కీరన్ పొలార్డ్ బ్యాటింగ్ ప్రాక్టీస్‌కు వెళ్తుండగా.. సీఎస్కే స్టార్ ఆల్‌రౌండర్ డ్వేన్ బ్రావో అతడి కాళ్లకు దండం పెట్టాడు. అదే విధంగా అనంతరం వీరిద్దరూ ఆత్మీయ ఆలింగనం చేసుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా వీరిద్దరూ మంచి స్నేహితులన్న విషయం తెలిసిందే. అదే విధంగా వీరిద్దరూ చాలా ఏళ్ల పాటు వెస్టిండీస్ జట్టుకు ప్రాతినిధ్యం వహించారు. అయితే పొలార్డ్ ఆకస్మికంగా అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించి అందరనీ షాక్‌కు గురి చేశాడు. పొలార్డ్ విండీస్ తరపున 123 వన్డేలు, 101 టీ20ల్లో ప్రాతినిధ్యం వహించాడు. pic.twitter.com/7gVh2Uys7n — Diving Slip (@SlipDiving) April 21, 2022 -
పొలార్డ్ నిర్ణయం నన్ను షాక్‌కు గురిచేసింది: సునీల్ నరైన్
వెస్టిండీస్ కెప్టెన్ కీరన్ పొలార్డ్ అంతర్జాతీయ క్రికెట్ నుంచి తప్పుకుని అందరని షాక్‌కు గురి చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తన సహచర ఆటగాడు, కేకేఆర్ విధ్వంసకర ఆల్‌రౌండర్ సునీల్ నరైన్ .. కీరన్ పొలార్డ్ ఆకస్మిక రిటైర్మెంట్ పట్ల నిరాశను వ్యక్తం చేశాడు.అంతర్జాతీయ క్రికెట్ నుంచి తప్పుకున్న పొలార్డ్ ఇకపై దేశవాళీ టోర్నీల్లో మాత్రం ఆడనున్నాడు. ఇక ప్రస్తుతం జరుగుతున్న ఐపీఎల్ సీజన్లో ముంబై ఇండియన్స్ తరపున పొలార్డ్ ఆడుతున్నాడు. పొలార్డ్ విండీస్ తరపున 123 వన్డేలు, 101 టీ20ల్లో ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. "పొలార్డ్ తీసుకున్న నిర్ణయం నన్ను షాక్‌కు గురి చేసింది. అయితే అతడు మరి కొంత కాలం విండీస్ జట్టుకు ప్రాతినిధ్యం వహించి ఉంటే బాగుండేది. అతడు జట్టుకు చేయవలిసింది ఇంకా చాలా ఉంది. అంతర్జాతీయ క్రికెట్ నుంచి తప్పుకున్న పొలార్డ్.. తన భవిష్యత్తులో ఏ టోర్నమెంట్లో ఆడినా అద్భుతంగా రాణించాలని ఆశిస్తున్నాను" నరైన్ అని పేర్కొన్నాడు. చదవండి: IPL 2022: లంక యువ పేసర్‌కు బంపర్ ఆఫర్.. ఆడమ్ మిల్నే స్థానంలో సీఎస్కేలోకి ఎంట్రీ -
పొలార్డ్ సంచలన నిర్ణయం.. గుడ్‌బై చెప్పేశాడు!
Kieron Pollard Retirement: వెస్టిండీస్ కెప్టెన్ కీరన్ పొలార్డ్ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. అంతర్జాతీయ క్రికెట్‌కు పొలార్డ్ బుధవారం రిటైర్మెంట్ ప్రకటించాడు. దీంతో.. ఫ్యాన్స్ ఒక్కసారిగా షాక్ కు గురవుతున్నారు. పొలార్డ్ తన నిర్ణయాన్ని ఇన్స్టాగ్రామ్ వేదికగా వెల్లడించాడు. వెస్టిండీస్ జట్టుకు పరిమిత ఓవర్ల కెప్టెన్‌గా పొలార్డ్ వ్యవహరిస్తున్నాడు. కేవలం 34 ఏళ్ల వయస్సులోనే అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించడం గమనార్హం. పొలార్డ్ ప్రస్తుతం ఐపీఎల్-2022లో ముంబై ఇండియన్స్ తరపున ఆడుతున్నాడు. ఇక ఏప్రిల్ 2007లో అంతర్జాతీయ అరంగేట్రం చేసిన పొలార్డ్ తన ఆల్‌రౌండ్ సామర్థ్యంతో విండీస్ జట్టులోతన స్థానాన్ని సుస్థిరం చేసుకున్నాడు. ఎన్నో మ్యాచ్‌లను ఒంటి చేత్తో జట్టును పొలార్డ్ గెలిపించాడు. "నేను ఈ రోజు అంతర్జాతీయ క్రికెట్ నుండి రిటైర్ కావాలని నిర్ణయించుకున్నాను. నాకు నేను ఆలోచించాకే ఈ నిర్ణయం తీసుకున్నాను. చాలా మంది యువకుల మాదిరిగానే.. నేను 10 సంవత్సరాల బాలుడుగా ఉన్నప్పటి నుంచి వెస్టిండీస్ జట్టుకు ప్రాతినిధ్యం వహించాలనేది నా కల. 15 సంవత్సరాలకు పైగా టీ20,వన్డేల్లో వెస్టిండీస్ క్రికెట్‌కు ప్రాతినిధ్యం వహించినందుకు గర్వపడుతున్నాను. నేను రిటైర్ అయ్యాక కూడా.. నా జట్టుకు ఎల్లప్పుడూ మద్దతుగా ఉంటాను. నాకు 15 ఏళ్లపాటు ఈ అవకాశం కల్పించినందుకు వెస్టిండీస్ క్రికెట్ నా కృతజ్ఞతలు అని పొలార్డ్ పేర్కొన్నాడు. కాగా 2007లో దక్షిణాఫ్రికాతో జరిగిన వన్డే మ్యాచ్‌తో అరంగేట్రం చేసిన పొలార్డ్ 15 ఏళ్ల కెరీర్లో 123 వన్డేలు ఆడాడు. 2,706 పరుగులు చేశాడు. ఇందులో 3 సెంచరీలు ఉన్నాయి. 2008లో ఆస్ట్రేలియాతో టి20 ఫార్మాట్‌కు శ్రీకారం చుట్టిన ఈ హిట్టర్ 101 మ్యాచ్‌ల్లో 1,569 పరుగులు చేశాడు. గత ఏడాది శ్రీలంకతో మ్యాచ్‌లో పొలార్డ్ 6 బంతుల్లో 6 సిక్స్ లు బాది... అంతర్జాతీయ క్రికెట్లో గిబ్స్, యువరాజ్ సింగ్ తర్వాత ఈ ఘనత సాధించిన మూడో క్రికెటర్‌గా నిలిచాడు. 2012లో విండీస్ గెలిచిన టి20 ప్రపంచకప్‌లో పొలార్డ్ సభ్యుడిగా ఉన్నాడు. చదవండి: IPL 2022 DC Vs PBKS: ఢిల్లీ అలవోకగా... -
పొలార్డ్.. మరీ ఇంత నిర్లక్ష్యం పనికి రాదు!
ముంబై ఇండియన్స్ ఆల్‌రౌండర్ కీరన్ పొలార్డ్ తన నిర్లక్ష్యం కారణంగా వికెట్ పారేసుకోవాల్సి వచ్చింది. పంజాబ్ కింగ్స్‌తో మ్యాచ్‌లో ఇది చోటు చేసుకుంది. విషయంలోకి వెళితే.. ఇన్నింగ్స్ 17వ ఓవర్ తొలి బంతిని పోలార్డ్ లాంగాన్ దిశగా ఆడాడు. ఇక్కడ ఈజీగా రెండు పరుగులు వచ్చే అవకాశం ఉంది. కానీ పొలార్డ్ పరుగు తీయాలా వద్దా అన్నట్లుగా నత్తనడకన సింగిల్ పూర్తి చేశాడు. అయితే అప్పటికే సూర్యకుమార్ సింగిల్ పూర్తి చేసి రెండో పరుగు కోసం వస్తున్నాడు. ఇది గమనించని పొలార్డ్ కొన్ని సెకన్లు నాన్‌స్ట్రైక్ ఎండ్‌లో ఉన్నాడు. సూర్యను చూసి తేరుకున్న పొలార్డ్ రెండో పరుగుకు వెళ్లినప్పటికి అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. బంతి అందుకున్న ఓడియన్ స్మిత్ కీపర్ జితేశ్ శర్మకు త్రో వేశాడు. పొలార్డ్ క్రీజులోకి చేరుకునేలోపే అతను వికెట్లను గిరాటేయడంతో రనౌట్ అయ్యాడు. పొలార్డ్ నిర్లక్ష్యం ఇక్కడ స్పష్టంగా కనిపించింది. రెండు పరుగులు వచ్చే చోట ఒక పరుగుకే పరిమితం కావడం ఏంటని అభిమానులు దుమ్మెత్తి పోశారు. అప్పటికే సూర్య కారణంగా తిలక్ వర్మ రనౌట్ అయిన సంగతి తెలిసిందే. ఇక్కడ కూడా సూర్య తప్పు లేదు.. తిలక్ వర్మ ఆవేశంగా పరిగెత్తి అనవసరంగా రనౌట్ అయ్యాడు. చదవండి: IPL 2022: సూర్య తప్పు లేదు.. తిలక్వర్మదే దురదృష్టం పొలార్డ్ రనౌట్ కోసం క్లిక్ చేయండి -
రోహిత్ కెప్టెన్సీ వదిలేస్తాడనుకున్నా..!
ఐపీఎల్ 2022లో ముంబై ఇండియన్స్ తీవ్రంగా నిరాశపరుస్తుంది. ఇప్పటివరకు ఆడిన నాలుగు మ్యాచ్‌ల్లోనూ పరాజయాలే చూసిన ముంబై.. బుధవారం పంజాబ్ కింగ్స్‌తో కీలక మ్యాచ్ ఆడనుంది. ఈ మ్యాచ్‌లో గనుక ముంబై ఓడిపోతే ఇక అంతే సంగతి. దీనికి తోడూ రోహిత్ శర్మ అటు కెప్టెన్‌గా.. ఇటు బ్యాట్స్‌మన్‌గా ఘోరంగా విఫలమవుతున్నాడు. నాలుగు మ్యాచ్‌లు కలిపి రోహిత్ .. 41,10, 3,26 పరుగులు చేశాడు. ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ క్రికెటర్ సంజయ్ మంజ్రేకర్ రోహిత్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ''కోహ్లిలాగే రోహిత్ శర్మ సీజన్ ఆరంభానికి ముందే కెప్టెన్సీ వదిలేస్తాడనుకున్నా. కోహ్లి కూడా గత సీజన్లో బ్యాటింగ్‌పై దృష్టి పెట్టేందుకు కెప్టెన్సీ నుంచి తప్పుకుంటున్నట్లు స్పష్టం చేశాడు. ఇక రోహిత్ కూడా కెప్టెన్సీ బాధ్యతలు పొలార్డ్‌కు అప్పజెప్పి తాను బ్యాటింగ్‌పై దృష్టి సారిస్తే బాగుండేది. టీమిండియా కెప్టెన్‌గా పూర్తిస్థాయి బాధ్యతలు చేపట్టకముందు రోహిత్ ఐపీఎల్లో విజయవంతమైన కెప్టెన్‌గా ఉన్నాడు. ఐదుసార్లు ముంబైని చాంపియన్‌గా నిలిపాడు. కానీ దేశానికి కెప్టెన్ అనే పదం రోహిత్‌ను ఒత్తిడిలో పడేసింది. ఆ ప్రభావం ఐపీఎల్లో కనిపిస్తుంది. ఇప్పటికైనా రోహిత్.. పొలార్డ్‌కు నాయకత్వ బాధ్యతలు అప్పజెపితే బాగుంటుంది. కెప్టెన్‌గా పొలార్డ్‌కు చక్కని అనుభవం ఉంది. అంతర్జాతీయ క్రికెట్లో విండీస్ కెప్టెన్‌గా పొలార్డ్ వ్యవహరిస్తున్నాడు. ఒక రకంగా పొలార్డ్‌కు కెప్టెన్సీ ఉంటేనే బ్యాటింగ్‌లో రాణిస్తాడని అంటారు. కెప్టెన్సీ అతనికి బలంగా మారుతుంది.. సిక్సర్లు అవలీలగా సందిస్తాడు.'' అంటూ చెప్పుకొచ్చాడు. చదవండి: IPL 2022: 'రిటైర్డ్ ఔట్'.. ఇది ఆరంభం మాత్రమే : అశ్విన్ IPL 2022: రెండు భారీ రికార్డులపై కన్నేసిన రోహిత్ శర్మ -
దేవుని దయవల్ల ఏం కాలేదు.. అంతా బాగానే ఉంది
ఐపీఎల్ 2022లో ముంబై ఇండియన్స్, ఆర్సీబీ మధ్య మ్యాచ్‌లో ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. ఆర్సీబీ ఓపెనర్ అనూజ్ రావత్‌కు కొంచెంలో ప్రమాదం తప్పింది. విషయంలోకి వెళితే.. ఆర్సీబీ ఇన్నింగ్స్ సమయంలో డుప్లెసిస్, అనూజ్‌రావత్ నిలకడగా ఆడుతున్నారు. ఇన్నింగ్స్ 8వ ఓవర్ కీరన్ పొలార్డ్ వేశాడు. ఆ ఓవర్ రెండో బంతిని అనూజ్ రావత్ బ్యాక్వర్డ్ పాయింట్ దిశగా ఆడాడు. నాన్‌స్ట్రైక్ ఎండ్‌లో ఉన్న డుప్లెసిస్ సింగిల్‌కు కాల్ ఇయ్యడంతో అనూజ్ పరిగెత్తాడు. ఇంతలో ముంబై ఫీల్డర్ పొలార్డ్‌కు త్రో వేశాడు. దానిని అందుకునే క్రమంలో పొలార్డ్ అనూజ్ రావత్ పరిగెత్తుతున్న వైపు వచ్చాడు. దీంతో ఇద్దరు ఒకరినొకరు బలంగా ఢీకొట్టుకోవడంతో అనూజ్ కిందపడ్డాడు. అయితే హెల్మెట్ గ్రౌండ్‌కు బలంగా గుద్దుకున్నప్పటికి.. రావత్ కొద్దిసేపు అలాగే ఉండిపోయాడు. ఆ తర్వాత పొలార్డ్ అతని వద్దకు వచ్చి బాగానే ఉందిగా అని అడిగాడు.. దానికి రావత్.. ఐయామ్ ఫైన్ అంటూ సమాధానం ఇచ్చాడు. దీనికి సంబంధించిన వీడియోపై ఒక లుక్కేయండి. ఈ వీడియో చూసిన అభిమానులు.. ''పెద్ద గండం తప్పింది.. దేవుని దయవల్ల ఏం కాలేదు.. అంతా బాగానే ఉంది'' అంటూ కామెంట్ చేశారు. చదవండి: Surya Kumar Yadav: అంతా కట్టగట్టుకొని విఫలమయ్యారు.. ఒక్కడు మాత్రం Abhishek Sharma: కోట్లు పెట్టి కొన్నందుకు ఎట్టకేలకు మెరిశాడు.. #AnujRawat pic.twitter.com/WG8OAsCYYw — Raj (@Raj93465898) April 9, 2022 -
జట్టుకు భారంగా మారుతున్నాడా.. సమయం ఆసన్నమైందా!
విధ్వంసకర ఆటతీరుకు పెట్టింది పేరు కీరన్ పొలార్డ్. 10వేలకు పైగా పరుగులు.. 300కు పైగా వికెట్లు తీసి టి20 క్రికెట్ చరిత్రలోనే అత్యున్నత ఆల్ఆరౌండర్గా పేరు పొందాడు. కానీ ఎందుకనో పొలార్డ్‌లో ఆ విధ్వంసం కొన్నాళ్లుగా కనబడడం లేదు. అంతర్జాతీయ మ్యాచ్‌ల నుంచి ప్రైవేట్ లీగ్స్ వరకు పొలార్డ్ ఈ మధ్యన పెద్దగా ఆకట్టుకోలేకపోతున్నాడు. దీంతో ముంబై ఇండియన్స్ స్టార్ ఆల్‌రౌండర్ కీరన్ పొలార్డ్ జట్టుకు భారంగా మారనున్నాడా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. గత సీజన్లోనూ పొలార్డ్ పెద్దగా రాణించింది ఏం లేదు. 14 మ్యాచ్‌లాడిన పొలార్డ్ 245 పరుగులు.. బౌలింగ్‌లో కేవలం ఐదు వికెట్లు మాత్రమే తీశాడు. ముంబై ఇండియన్స్ ఐదుసార్లు టైటిల్ గెలిచిన ప్రతీసారి పొలార్డ్ జట్టులో ఉండడంతో మెగావేలానికి ముందే అతన్ని రిటైన్ చేసుకున్నారు. కానీ ఒక రాణించని ఆటగాడిని రిటైన్ చేసుకోవడం ఏంటని విమర్శలు కూడా వచ్చాయి. తాజాగా ఐపీఎల్ 2022లోనూ పొలార్డ్ తొలి మ్యాచ్‌లో నిరాశ పరిచాడు. ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కేవలం మూడు పరుగులు మాత్రమే చేసి ఔటయ్యాడు. కాగా శనివారం రాజస్తాన్ రాయల్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో బౌలింగ్‌లోనూ తేలిపోయాడు. పొలార్డ్ వేసిన ఇన్నింగ్స్ 17వ ఓవర్లో హెట్‌మైర్ విశ్వరూపం ప్రదర్శించాడు. రెండు సిక్సర్లు, మూడు ఫోర్లు సహా మొత్తం 26 పరుగులు పిండుకున్నాడు. ఈ దెబ్బతో పొలార్డ్ తన 4 ఓవర్ల కోటాలో 46 పరుగులిచ్చి ఒక్క వికెట్ తీయగలిగాడు. ఇక బ్యాటింగ్‌లో పొలార్డ్ మెరవకపోతే.. రోహిత్ అతన్ని జట్టు నుంచి పక్కకు తప్పించినా ఆశ్చర్యపోనక్కర్లేదు. కాగా ముంబై అభిమానులు కూడా పొలార్డ్ ఆటతీరుపై విమర్శలు కురిపిస్తున్నారు. పొలార్డ్‌ను ఎందుకు రిటైన్ చేసుకున్నారో అర్థం కావడం లేదు.. అతని స్థానంలో వేరే వాళ్లకు అవకాశం ఇవ్వండి.. మునుపటి పొలార్డ్‌ను మేము చూడలేకపోతున్నాం.. అతని పని అయిపోయింది అంటూ కామెంట్స్ చేశారు. చదవండి: Russell-Sam Billings: 'రసెల్‌తో బ్యాటింగ్ అంటే నాకు ప్రాణ సంకటం' IPL 2022: సీఎస్కేకు దెబ్బ మీద దెబ్బ.. స్టార్ బౌలర్ ఆసుపత్రి పాలు, మరొకరిది అదే పరిస్థితి -
స్పిన్నర్‌గా మారిన పొలార్డ్.. ముంబై ఇండియన్స్‌కు ఇక.. వీడియో వైరల్
వెస్టిండీస్ కెప్టెన్ కిరాన్ పొలార్డ్ సరికొత్త అవతారం ఎత్తాడు. సాదారణంగా మీడియం పేస్ బౌలింగ్ చేసే పొలార్డ్.. తొలి సారి స్పిన్నర్‌గా మారాడు. ట్రినిడాడ్ టీ10 బ్లాస్ట్‌లో భాగంగా స్కార్లెట్ ఐబిస్ స్కార్చర్స్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. సోకా కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో పొలార్డ్ ఆఫ్ స్పిన్ బౌలింగ్ చేస్తూ అందరనీ ఆశ్చర్య పరిచాడు. సోకా కింగ్స్ ఇన్నింగ్స్ నాలుగో ఓవర్ వేసిన పొలార్డ్ స్పిన్ బౌలింగ్ చేయడమే కాకుండా.. బ్యాటర్ లియోనార్డో జూలియన్‌ను క్లీన్ బౌల్డ్ కూడా చేశాడు.ఈ మ్యాచ్‌లో కేవలం ఒకే ఓవర్ బౌలింగ్ చేసిన పొలార్డ్ 10 పరుగులు ఇచ్చి ఒక వికెట్ పడగొట్టాడు. కాగా పొలార్డ్ బౌలింగ్ సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియోపై నెటిజన్లు ఫన్నీ కామెంట్లు చేస్తున్నారు. మంబైకు కొత్త స్పిన్నర్ దొరికేశాడంటూ కామెంట్లు చేస్తున్నారు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. సోకా కింగ్స్ నిర్ణీత 10 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 150 పరుగులు సాధించింది. అయితే వర్షం కారణంగా టార్గెట్‌ను 8 ఓవర్లకు 122 పరుగులకు కుదించారు. ఇక 122 పరుగల లక్ష్యంతో బరిలోకి దిగిన స్కార్చర్స్ మూడు వికెట్లు కోల్పోయి 80 పరుగులకు మాత్రమే పరిమితమైంది. అయితే స్కార్చర్స్ కెప్టెన్ పొలార్డ్ మాత్రం కేవలం 8 పరుగుల మాత్రమే చేసి పెవిలియన్‌కు చేరాడు. ఐపీఎల్-2022లో ముంబై ఇండియన్స్‌కు పొలార్డ్ ప్రాతినిథ్యం వహిస్తున్న సంగతి తెలిసిందే. Kieron Pollard bowling off-spin in the Trinidad T10 Blast.pic.twitter.com/rN0mq04II8 — Johns. (@CricCrazyJohns) February 28, 2022 -
Ind Vs Wi: అతడు వరల్డ్ క్లాస్ ప్లేయర్.. అందరూ తన నుంచి నేర్చుకోవాలి: పొలార్డ్
Ind Vs Wi T20 Series- మిగతా ఆటగాళ్లతో పోలిస్తే ఎంట్రీ కాస్త లేటయినా... అవకాశం వచ్చిన ప్రతిసారి తనను నిరూపించుకుంటూనే ఉన్నాడు టీమిండియా బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్. తాజాగా స్వదేశంలో వెస్టిండీస్‌తో ముగిసిన టీ20 సిరీస్‌లోనూ సత్తా చాటాడు ఈ ముంబైకర్. మూడు మ్యాచ్‌లలో కలిపి 107 పరుగులు సాధించాడు. సగటు 53.50. స్ట్రైక్‌రేటు 194.55. ముఖ్యంగా ఆఖరిదైన మూడో మ్యాచ్‌లో 31 బంతుల్లోనే 65 పరుగులు చేసి ఆకట్టుకున్నాడు. ఇందులో ఒక ఫోర్, 7 సిక్సర్లు ఉన్నాయి. ఈ క్రమంలో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్, ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డులు సూర్యకుమార్ సొంతమయ్యాయి. ఈ క్రమంలో విండీస్‌తో సిరీస్‌లో సూర్యకుమార్ ప్రదర్శనపై ప్రశంసల జల్లు కురుస్తోంది. ఇక వెస్టిండీస్ కెప్టెన్, ఐపీఎల్ జట్టు ముంబై ఇండియన్స్ ఆటగాడు కీరన్ పొలార్డ్ కూడా సూర్యను ప్రశంసల్లో ముంచెత్తడం గమనార్హం. ఆదివారం నాటి వర్చువల్ సమావేశంలో పొలార్డ్ మట్లాడుతూ... ‘‘సూర్య వరల్డ్‌క్లాస్ ప్లేయర్. 2011 నుంచి ముంబై ఇండియన్స్ జట్టులో తనతో కలిసి ఆడుతున్నాను. క్రికెటర్‌గా తన ఎదుగులను చూస్తూ ఉన్నాను. వ్యక్తిగతంగా... టీమిండియా విజయాల కోసం అతడు చేస్తున్న కృషి, ఆడుతున్న తీరు అమోఘం. అతడు 360 డిగ్రీ ప్లేయర్. ప్రతి బ్యాటర్ తన నుంచి నేర్చుకోవాల్సి ఉంది. అతడి నుంచి స్ఫూర్తి పొందాలి’’ అని పేర్కొన్నాడు. కాగా ఐపీఎల్ మెగా వేలం నేపథ్యంలో రిటెన్షన్‌లో భాగంగా ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ(రూ. 16 కోట్లు) సహా జస్ప్రీత్ బుమ్రా (రూ. 12 కోట్లు), సూర్యకుమార్ యాదవ్ (రూ. 8 కోట్లు) , కీరన్ పొలార్డ్ (రూ. 6 కోట్లు)ను అట్టిపెట్టుకున్న విషయం తెలిసిందే. అంతర్జాతీయ టీ20 సిరీస్‌లో భాగంగా రోహిత్, సూర్యకుమార్ అదరగొట్టగా... పొలార్డ్ ఇటు బ్యాటర్‌గా.. అటు కెప్టెన్‌గా విఫలమయ్యాడు. రోహిత్ సేన చేతిలో పొలార్డ్ బృందం వన్డే, టీ20 సిరీస్‌లో వైట్‌వాష్‌కు గురైంది. 𝐓𝐇𝐀𝐓. 𝐖𝐈𝐍𝐍𝐈𝐍𝐆. 𝐅𝐄𝐄𝐋𝐈𝐍𝐆 ☺️ ☺️ What a performance this has been by the @ImRo45 -led #TeamIndia to complete the T20I series sweep! 🏆 👏#INDvWI | @Paytm pic.twitter.com/L04JzVL5Sm — BCCI (@BCCI) February 20, 2022 చదవండి: Ind Vs Wi 3rd T20- Rohit Sharma: వాళ్లు జట్టులో లేకున్నా మేము గెలిచాం.. సంతోషం: రోహిత్ శర్మ -
సిరీస్ విజయంపై కన్నేసిన టీమిండియా
-
IND vs WI 2nd T20I Prediction: బ్యాటర్లు కూడా అంతంత మాత్రమే.. పాపం విండీస్‌ను గెలిపించేదెవరు?
వన్డే సిరీస్‌లో టీమిండియా చేతిలో వైట్‌వాష్‌కు గురైన వెస్టిండీస్ టీ20 సిరీస్‌ను కూడా పరాజయంతోనే ఆరంభించింది. మొదటి మ్యాచ్‌లో 6 వికెట్ల తేడాతో ఓటమి పాలైంది. ఈ క్రమంలో శుక్రవారం(ఫిబ్రవరి 18) నాటి రెండో టీ20 మ్యాచ్‌కు సన్నద్ధమవుతోంది. కాగా బౌలింగ్‌లో చెప్పుకోదగ్గ వనరులు లేని విండీస్ కనీసం తమకు తెలిసిన విద్య దూకుడైన బ్యాటింగ్‌తోనైనా మ్యాచ్‌లో ప్రభావం చూపలేకపోక అభిమానుల ఆగ్రహానికి గురవుతోంది. నికోలస్ పూరన్ మాత్రమే గత మ్యాచ్‌లో బాగా ఆడగా, మిగతా వారంతా టి20 తరహా ప్రదర్శన చేయలేకపోయారు. ముఖ్యంగా ఐపీఎల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు ఉన్న ‘హిట్టర్’ పొలార్డ్ ఒక్క ఇన్నింగ్స్‌లోనైనా చెలరేగాలని జట్టు కోరుకుంటోంది. కెప్టెన్ కూడా అయిన పొలార్డ్ గత మ్యాచ్‌లో మరీ ఏడో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చాడు. ఇదిలా ఉంటే... వరుస విజయాలతో జోరు మీదున్న టీమిండియా రెట్టించిన ఉత్సాహంతో బరిలోకి దిగనుంది. మరి విండీస్ ఓపెనర్లు బ్రండన్ కింగ్, మేయర్స్ శుభారంభం అందించడం సహా, పూరన్, పొలార్డ్ భారీ ఇన్నింగ్స్ ఆడితే తప్ప పర్యాటక జట్టు నుంచి చెప్పుకోదగ్గ స్కోరు ఆశించలేం. ఇండియా వర్సెస్ వెస్టిండీస్- రెండో టీ20: ఎప్పుడు, ఎక్కడ.. తదితర వివరాలు తేదీ: ఫిబ్రవరి 18, 2002 వేదిక: ఈడెన్ గార్డెన్స్, కోల్‌కతా . సమయం: రాత్రి 7 గంటలకు ఆరంభం స్టార్‌స్పోర్ట్స్, హాట్‌స్టార్‌లో ప్రత్యక్ష ప్రసారం ముఖాముఖి రికార్డు: మొత్తం 18 మ్యాచ్‌లు జరుగగా భారత్ 11, విండీస్ 6 మ్యాచ్‌లు గెలిచాయి. ఒక మ్యాచ్ రద్దయింది. తుది జట్ల అంచనా: భారత్: ఇషాన్ కిషన్, రోహిత్ శర్మ(కెప్టెన్), విరాట్ కోహ్లి, సూర్యకుమార్ యాదవ్, రిషభ్ పంత్(వికెట్ కీపర్), వెంకటేశ్ అయ్యర్/శార్దూల్ ఠాకూర్, మహ్మద్ సిరాజ్/ ఆవేశ్ ఖాన్, భువనేశ్వర్ కుమార్, హర్షల్ పటేల్, రవి బిష్ణోయి, యజువేంద్ర చహల్. వెస్టిండీస్: బ్రాండన్ కింగ్, కైల్ మేయెర్స్, నికోలస్ పూరన్(వికెట్ కీపర్), రోవ్‌మన్ పావెల్, కీరన్ పొలార్డ్(కెప్టెన్), జేసన్ హోల్డర్, ఫ్యాబియన్ అలెన్, రొమారియో షెపర్డ్, ఓడియన్ స్మిత్, అకీల్ హొసేన్, షెల్డన్ కాట్రెల్/డొమినిక్ డ్రేక్స్. చదవండి: Ishan Kishan-Rohit Sharma: ఇషాన్ కిషన్‌కు క్లాస్ పీకిన రోహిత్ శర్మ.. విషయమేంటి Ranji Trophy 2022: సూపర్ సెంచరీతో ఫాంలోకి వచ్చిన రహానే .@surya_14kumar and Venkatesh Iyer take #TeamIndia home with a 6-wicket win in the 1st T20I. Scorecard - https://t.co/dSGcIkX1sx #INDvWI @Paytm pic.twitter.com/jfrJo0fsR3 — BCCI (@BCCI) February 16, 2022 -
తొలి టీ-20లో భారత్ ఘన విజయం
-
IND Vs WI : తొలి టి20లో భారత్ ఘన విజయం (ఫోటోలు)
-
అదే జోరు.. టీమిండియా తగ్గేదే లే
రోహిత్ శర్మ నాయకత్వంలో వెస్టిండీస్‌పై వన్డే సిరీస్‌లో ఏకపక్ష విజయాలు సాధించిన భారత జట్టు టి20 సిరీస్‌లోనూ అదే జోరును కొనసాగించింది. మ్యాచ్ ఫార్మాట్, వేదిక మారడం మినహా ఫలితంలో మాత్రం ఎలాంటి మార్పు లేదు. తొలి మ్యాచ్ ఆడిన రవి బిష్ణోయ్ సహా బౌలర్లు రాణించడంతో ముందుగా ప్రత్యర్థిని సాధారణ స్కోరుకే పరిమితం చేసిన టీమిండియా ఆ తర్వాత రోహిత్ శర్మ మెరుపు ఇన్నింగ్స్ పునాదిపై సునాయాసంగా లక్ష్యాన్ని అందుకుంది. కోల్‌కతా: వెస్టిండీస్‌తో జరిగిన తొలి టి20లో భారత్ ఆరు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈడెన్ గార్డెన్స్‌లో టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన వెస్టిండీస్ 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 157 పరుగులు చేసింది. నికోలస్ పూరన్ (43 బంతుల్లో 61; 4 ఫోర్లు, 5 సిక్సర్లు) అర్ధ సెంచరీ సాధించగా, కైల్ మేయర్స్ (24 బంతుల్లో 31; 7 ఫోర్లు) రాణించాడు. తన తొలి మ్యాచ్‌లోనే ప్రత్యర్థిని కట్టడి చేసిన రవి బిష్ణోయ్ (2/14) ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’గా నిలవగా, చహల్‌కు 2 వికెట్లు దక్కాయి. అనంతరం భారత్ 18.5 ఓవర్లలో 4 వికెట్లకు 162 పరుగులు చేసి గెలిచింది. రోహిత్ శర్మ (19 బంతుల్లో 40; 4 ఫోర్లు, 3 సిక్స్‌లు), ఇషాన్ కిషన్ (42 బంతుల్లో 35; 4 ఫోర్లు), సూర్యకుమార్ యాదవ్ (18 బంతుల్లో 34 నాటౌట్; 5 ఫోర్లు, 1 సిక్స్) కీలక ఇన్నింగ్స్‌లు ఆడారు. ఇరు జట్ల మధ్య రేపు రెండో టి20 జరుగుతుంది. పూరన్ మినహా... తొలి ఓవర్లోనే బ్రండన్ కింగ్ (4)ను అవుట్ చేసి విండీస్‌ను భువనేశ్వర్ దెబ్బ కొట్టాడు. అయితే ఎనిమిది బంతుల వ్యవధిలో మూడు ఫోర్లు కొట్టిన మేయర్స్, ఆపై భువీ, హర్షల్ పటేల్ ఓవర్లలో రెండేసి ఫోర్లు బాది దూకుడు ప్రదర్శించాడు. అయితే చహల్ మొదటి ఓవర్లోనే మేయర్స్‌ను వికెట్ల ముందు దొరకబుచ్చుకోగా... ఛేజ్ (4), రావ్మన్ పావెల్ (2) విఫలమయ్యారు. వీరిద్దరిని రవి బిష్ణోయ్ ఒకే ఓవర్లో అవుట్ చేశాడు. మరో ఎండ్‌లో పూరన్ మాత్రం మెరుపు ఇన్నింగ్స్‌తో జట్టు ఇన్నింగ్స్‌ను చక్కదిద్దాడు. చహల్ బౌలింగ్‌లోనే మూడు సిక్సర్లు బాదిన పూరన్ 38 బంతుల్లోనే అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. చివర్లో కీరన్ పొలార్డ్ (19 బంతుల్లో 24 నాటౌట్; 2 ఫోర్లు, 1 సిక్స్) కొంత ధాటిని ప్రదర్శించడంతో విండీస్ స్కోరు 150 పరుగులు దాటగలిగింది. చివరి ఐదు ఓవర్లలో ఆ జట్టు 61 పరుగులు సాధించింది. శుభారంభం... ఛేదనను భారత్ మెరుపు వేగంతో ప్రారంభించింది. ముఖ్యంగా ఒడెన్ స్మిత్ వేసిన ఓవర్లో రోహిత్ 2 ఫోర్లు, 2 సిక్సర్లతో చెలరేగాడు. పవర్‌ప్లే ముగిసేసరికే భారత్ స్కోరు 58 పరుగులకు చేరింది. అయితే తొలి వికెట్‌కు 45 బంతుల్లోనే 64 పరుగులు జోడించాక భారీ షాట్‌కు ప్రయత్నించి రోహిత్ అవుటయ్యాడు. కొద్ది సేపటికే రెండు పరుగుల వ్యవధిలో ఇషాన్, కోహ్లి (17) కూడా వెనుదిరగ్గా, పంత్ (8) విఫలమయ్యాడు. అయితే సూర్యకుమార్, వెంకటేశ్ అయ్యర్ (13 బంతుల్లో 24 నాటౌట్; 2 ఫోర్లు, 1 సిక్స్) ఎలాంటి ఇబ్బంది లేకుండా మ్యాచ్‌ను ముగించారు. స్కోరు వివరాలు వెస్టిండీస్ ఇన్నింగ్స్: కింగ్ (సి) సూర్యకుమార్ (బి) భువనేశ్వర్ 4; మేయర్స్ (ఎల్బీ) (బి) చహల్ 31; పూరన్ (సి) కోహ్లి (బి) హర్షల్ 61; ఛేజ్ (ఎల్బీ) (బి) బిష్ణోయ్ 4; పావెల్ (సి) వెంకటేశ్ (బి) బిష్ణోయ్ 2; హొసీన్ (సి అండ్ బి) చహర్ 10; పొలార్డ్ (నాటౌట్) 24; స్మిత్ (సి) రోహిత్ (బి) హర్షల్ 4; ఎక్స్‌ట్రాలు 17; మొత్తం (20 ఓవర్లలో 7 వికెట్లకు) 157. వికెట్ల పతనం: 1–4, 2–51, 3–72, 4–74, 5–90, 6–135, 7–157. బౌలింగ్: భువనేశ్వర్ 4–0–31–1, దీపక్ చహర్ 3–0–28–1, హర్షల్ పటేల్ 4–0–37–2, చహల్ 4–0–34–1, రవి బిష్ణోయ్ 4–0–17–2, వెంకటేశ్ అయ్యర్ 1–0–4–0. భారత్ ఇన్నింగ్స్: రోహిత్ (సి) స్మిత్ (బి) ఛేజ్ 40; ఇషాన్ కిషన్ (సి) అలెన్ (బి) ఛేజ్ 35; కోహ్లి (సి) పొలార్డ్ (బి) అలెన్ 17; పంత్ (సి) స్మిత్ (బి) కాట్రెల్ 8; సూర్యకుమార్ (నాటౌట్) 34; వెంకటేశ్ అయ్యర్ (నాటౌట్) 24; ఎక్స్‌ట్రాలు 4; మొత్తం (18.5 ఓవర్లలో 4 వికెట్లకు) 162. వికెట్ల పతనం: 1–64, 2–93, 3–95, 4–114. బౌలింగ్: కాట్రెల్ 4–0–35–1, షెఫర్డ్ 3–0–24–0, ఒడెన్ స్మిత్ 2–0–31–0, హొసీన్ 4–0–34–0, ఛేజ్ 4–0–14–2, అలెన్ 1.5–0–23–1. (మరిన్ని ఫొటోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
IND Vs WI 1st T20: ఇండియా వర్సెస్ వెస్టిండీస్.. అప్డేట్స్
-
Ind Vs Wi 1st T20: అలా అయితే రోహిత్ సేనకు సవాళ్లు తప్పవు మరి!
West Indies Tour Of India 2022- T20 Series: కోల్‌కతా వేదికగా టీమిండియా- వెస్టిండీస్ మధ్య బుధవారం టీ20 సిరీస్ ఆరంభం కానుంది. వన్డే సిరీస్ కోల్పోయిన పొలార్డ్ బృందం టి20 సిరీస్‌లో ఎలాగైనా శుభారంభం చేయాలనే కసితో బరిలోకి దిగుతోంది. తద్వారా పరాజయాల పరంపరకు ఫుల్స్టాప్ పెట్టాలనే లక్ష్యంతో ఉంది. ఇక ఐపీఎల్ మెగా వేలంలో భారీ మొత్తాలు పలికిన విండీస్ ఆటగాళ్లు ఆ ఉత్సాహాన్ని తమ ప్రదర్శనలో చూపాలని పట్టుదలతో ఉన్నారు. నిలకడలేమి సమస్యను ఆధిగమిస్తే నిజంగానే విండీస్ టి20ల్లో దీటైన ప్రత్యర్థి. పొలార్డ్, పూరన్, పావెల్, హోల్డర్లు తమ బ్యాట్లు ఝుళిపిస్తే రోహిత్ సేనకు సవాళ్లు తప్పవు. భారత్- విండీస్ ముఖాముఖి పోరు- రికార్డులు భారత్, వెస్టిండీస్ మధ్య ఇప్పటివరకు 17 టి20 మ్యాచ్‌లు జరిగాయి. భారత్ 10 మ్యాచ్‌ల్లో నెగ్గగా... విండీస్ 6 మ్యాచ్‌ల్లో గెలిచింది. మరో మ్యాచ్ రద్దయింది. మ్యాచ్ ఎప్పుడు, ఎక్కడ? ఈడెన్ గార్డెన్స్, కోల్‌కతా ఫిబ్రవరి 16(బుధవారం)- రాత్రి 7 గంటలకు ఆరంభం. అంచనా జట్లు: భారత్: ఇషాన్ కిషన్, రోహిత్ శర్మ(కెప్టెన్), విరాట్ కోహ్లి, సూర్యకుమార్ యాదవ్/శ్రేయస్ అయ్యర్, రిషభ్ పంత్(వికెట్ కీపర్), వెంకటేశ్ అయ్యర్, దీపక్ చహర్, శార్దూల్ ఠాకూర్, శార్దూల్ ఠాకూర్, హర్షల్ పటేల్, మహ్మద్ సిరాజ్, యజువేంద్ర చహల్. వెస్టిండీస్: బ్రాండన్ కింగ్, కైల్ మేయెర్స్, నికోలస్ పూరన్(వికెట్ కీపర్), పావెల్, కీరన్ పొలార్డ్(కెప్టెన్), జేసన్ హోల్డర్, ఫాబియన్ అలెన్, రొమారియో షెపర్డ్, ఓడియన్ స్మిత్, అకీల్ హొసేన్, షెల్డన్ కాట్రెల్/డొమినిక్ డ్రేక్స్. చదవండి: IPL 2022: ఆ ఇద్దరే మా ఓపెనర్లు.. క్లారిటీ ఇచ్చిన సన్‌రైజర్స్ కోచ్ A sneak peek into #TeamIndia's fielding drill at the Eden Gardens. 👀 👌#INDvWI | @Paytm pic.twitter.com/wSFH4keVTx — BCCI (@BCCI) February 15, 2022 Bull's-eye Bhuvi 🎯 Sharp Siraj ⚡ A snippet of how the #TeamIndia speedsters sweated it out in the practice session under the watchful eyes of the Bowling Coach Paras Mhambrey at the Eden Gardens. 👌 👌#INDvWI | @Paytm | @BhuviOfficial | @mdsirajofficial pic.twitter.com/hMhCdAY9VJ — BCCI (@BCCI) February 15, 2022 -
Ind Vs WI 1st T20I: భువీ వద్దు... సిరాజ్‌కు జతగా ఆవేశ్ ఖాన్!
Ind Vs Wi T20 Series 2022- కోల్‌కతా: వన్డే సిరీస్ సంపూర్ణ విజయంతో ఆతిథ్య భారత జట్టు టి20 సిరీస్‌పైనా కన్నేసింది. మెరిపించి మురిపించేందుకు బ్యాటర్స్ సిద్ధంగా ఉన్నారు. సత్తా చాటేందుకు సీమర్లు తహతహలాడుతున్నారు. ఇక శుభారంభమే తరువాయి అన్నట్లుగా టీమిండియాలో ఆత్మవిశ్వాసం తొణకిసలాడుతోంది. మరోవైపు వన్డేలన్నీ ఓడిన వెస్టిండీస్ జట్టు మళ్లీ ఓడేందుకు సిద్ధంగా లేదు. పైగా ఫార్మాట్ మారింది. తమ ఆటగాళ్ల గేరు కూడా మారబోతుందని మ్యాచ్ ద్వారా చాటాలని కరీబియన్ ఆటగాళ్లు పట్టుదలతో ఉన్నారు. ఈ నేపథ్యంలో బుధవారం జరిగే తొలి టి20 ఆసక్తికరంగా జరిగే అవకాశముంది. ఇషాన్తోనే ఓపెనింగ్ ఐపీఎల్లో ముంబై ఇండియన్స్‌కు ఐదు టైటిళ్లు అందించిన రోహిత్ శర్మ ఇప్పుడు పూర్తిస్థాయి కెప్టెన్‌గా టీమిండియాకు అంతర్జాతీయ ట్రోఫీ అందించేందుకు తొలి అడుగు వేయబోతున్నాడు. తన ఫ్రాంచైజీ సహచరుడు పొలార్డ్ ఇప్పుడు ప్రత్యర్థి కెప్టెన్. ఈ నేపథ్యంలో పొట్టి సిరీస్‌లో ఎవరి వ్యూహాప్రతివ్యూహాలు పైచేయి సాధిస్తాయనేది ఆసక్తికరంగా మారింది. తుది జట్టు కసరత్తు విషయానికొస్తే రెగ్యులర్ ఓపెనర్ కేఎల్ రాహుల్ గాయంతో దూరం కావడంతో రోహిత్ తన ఓపెనింగ్ భాగస్వామిగా ఇషాన్ కిషన్‌నే బరిలోకి దింపుతాడు. సూర్యకుమార్‌ను కొనసాగించాలనుకుంటున్న కెప్టెన్ ఆల్రౌండర్లలో శార్దుల్, దీపక్ చహర్, హర్షల్ పటేల్‌లలో ఒకరినే తీసుకోవచ్చు. పేసర్లలో వన్నే తగ్గిన భువనేశ్వర్‌ను కాదని సిరాజ్‌కు జతగా అవేశ్ ఖాన్‌ను బరిలోకి దించడం దాదాపు ఖాయమైంది. చదవండి: IPL 2022: ఆ ఇద్దరే మా ఓపెనర్లు.. క్లారిటీ ఇచ్చిన సన్‌రైజర్స్ కోచ్ Bull's-eye Bhuvi 🎯 Sharp Siraj ⚡ A snippet of how the #TeamIndia speedsters sweated it out in the practice session under the watchful eyes of the Bowling Coach Paras Mhambrey at the Eden Gardens. 👌 👌#INDvWI | @Paytm | @BhuviOfficial | @mdsirajofficial pic.twitter.com/hMhCdAY9VJ — BCCI (@BCCI) February 15, 2022 -
Ind Vs Wi: ‘నిజంగా విచారకరం.. పొలార్డ్ మిస్సయాడు.. పోలీసులకు రిపోర్టు చేయండి’
Ind Vs Wi ODI Series- Kieron Pollard- Dwayne Bravo : టీమిండియాతో వన్డే సిరీస్‌లో వెస్టిండీస్‌కు ఘోర పరాభవం ఎదురైన సంగతి తెలిసిందే. తొలి రెండు మ్యాచ్‌లలోనూ ఓడి సిరీస్‌ను భారత జట్టుకు సమర్పించుకుంది. ముఖ్యంగా విండీస్ కెప్టెన్ కీరన్ పొలార్డ్ ఫామ్‌లేమి, గాయం జట్టును కలవరపెడుతోంది. మొదటి వన్డేలో అతడు వైఫల్యం చెందిన విషయం తెలిసిందే. టీమిండియా బౌలర్ యజువేంద్ర చహల్ సంధించిన మొదటి బంతికే పొలార్డ్ వెనుదిరిగాడు. పరుగుల ఖాతా తెరవకుండానే పెవిలియన్ చేరాడు. ఇక రెండో వన్డేలో గాయం కారణంగా జట్టుకు దూరమయ్యాడు. ఈ మ్యాచ్‌లో రోహిత్ సేన విండీస్‌పై 44 పరుగుల తేడాతో విజయం సాధించి సిరీస్‌ను కైవసం చేసుకుంది. ఈ క్రమంలో శుక్రవారం నాటి నామమాత్రపు మూడో వన్డేకు ఇరు జట్లు సిద్ధమవుతున్నాయి. అయితే, పొలార్డ్ గాయం నుంచి కోలుకున్నప్పటికీ.. ఏ మేరకు రాణిస్తాడన్నది వేచిచూడాల్సిందే. అతడు బ్యాట్ ఝులిపిస్తే చూడాలని అభిమానులు కోరుకుంటున్నారు. ఈ నేపథ్యంలో పొలార్డ్ సహచర ఆటగాడు, విండీస్ మాజీ క్రికెటర్ డ్వేన్ బ్రావో సోషల్ మీడియాలో చేసిన పోస్టు వైరల్‌గా మారింది. ‘‘ఇది నిజంగా విచారకర దినం. నా బెస్ట్ ఫ్రెండ్ పొలార్డ్ తప్పిపోయాడు. ఒకవేళ మీకు ఏదైనా సమాచారం అందితే దయచేసి నాకు తెలియజేయండి. లేదంటే పోలీసులకు రిపోర్టు చేయండి’’ అంటూ ఏడుపు, నవ్వులు కలగలిసిన ఎమోజీలను జతచేశాడు. అంతేగాక.. ‘‘వయసు 34, ఎత్తు 1.85 మీటర్లు, చివరగా చహల్ పాకెట్లో చూశాం. కనిపిస్తే వెస్టిండీస్‌ను కాంటాక్ట్ చేయండి’’ అని పొలార్డ్ ఫొటోను షేర్ చేశాడు. ఇందుకు పొలార్డ్ సైతం సరదాగా స్పందించాడు. ‘‘అవునా బ్రావో.. నేను మిస్సయ్యానా.. ఎప్పుడు ఎలా?’’ అంటూ నవ్వుతున్న ఎమోజీలతో బదులిచ్చాడు. కాగా ఇటీవల స్వదేశంలో ఐర్లాండ్ చేతిలో ఓడి విండీస్ వన్డే సిరీస్‌ను చేజార్చుకుంది. భారత పర్యటనలో ఇదే తరహాలో చేదు అనుభవం మూటగట్టుకుంది. చదవండి: IPL 2022 Mega Auction: ఐపీఎల్-2022 మెగా వేలం.. పంజాబ్ కింగ్స్‌కు భారీ షాక్! Series lost, but the boys go again on Friday in the final ODI with the opportunity to gain some World Cup qualification points. #MenInMaroon #INDvWI pic.twitter.com/Ah8U8XAnzt — Windies Cricket (@windiescricket) February 9, 2022 View this post on Instagram A post shared by Dwayne Bravo aka SIR Champion🏆 (@djbravo47) View this post on Instagram A post shared by Kieron Pollard (@kieron.pollard55) -
Ind Vs Wi 3rd ODI: సీమర్లు, స్పిన్నర్లకు చక్కని అవకాశం.. కుల్దీప్ తుదిజట్టులోకి?
Ind Vs Wi 3rd ODI: వన్డే సిరీస్‌ను కైవసం చేసుకున్న టీమిండియా రెట్టించిన ఉత్సాహంతో వెస్టిండీస్‌తో నామమాత్రపు మ్యాచ్‌కు సన్నద్ధమవుతోంది. అహ్మదాబాద్ వేదికగా మూడో వన్డేలోనూ విజయం సాధించి వైట్‌వాష్‌తో విజయాన్ని పరిపూర్ణం చేసుకోవాలని భావిస్తోంది. ఆల్‌రౌండ్ ప్రతిభతో ఇప్పటికే రెండింట గెలిచిన రోహిత్ సేన పూర్తి ఆత్మవిశ్వాసంతో ఉంది. ఇటు బ్యాటర్లు.. అటు బౌలర్లు అద్భుతంగా రాణిస్తుండటంతో విండీస్‌ను క్లీన్‌స్వీప్ చేయడం అంత కష్టమేమీ కాకపోవచ్చు. మరోవైపు ఒత్తిడిలో కూరుకుపోయిన విండీస్ ఆఖరి వన్డేలోనైనా విజయం సాధించి పరువు నిలుపుకోవాలని భావిస్తోంది. జట్లు (అంచనా) భారత్: రోహిత్ (కెప్టెన్), ధావన్, కోహ్లి, రాహుల్, పంత్, దీపక్ హుడా / సూర్యకుమార్, వాషింగ్టన్ సుందర్, శార్దుల్, సిరాజ్, చహల్ / కుల్దీప్, ప్రసిధ్ కృష్ణ. వెస్టిండీస్: పొలార్డ్ (కెప్టెన్), షై హోప్, బ్రండన్ కింగ్, డారెన్ బ్రేవో, బ్రూక్స్, పూరన్, హోల్డర్, ఫ్యాబియన్ అలెన్, హోసీన్, జోసెఫ్, రోచ్. పిచ్, వాతావరణం గత మ్యాచ్‌లాగే బౌలర్లకు అనుకూలించవచ్చు. ఇది సీమర్లు, స్పిన్నర్లకు చక్కని అవకాశం. వాతావరణంతో ఇబ్బంది లేదు. చలి తగ్గడంతో మంచు ప్రభావం ఉండదు. చదవండి: Under 19 Vice Captain Shaik Rasheed: సీఎం వైఎస్ జగన్‌ను కలిసి ఆశీస్సులు తీసుకుంటా That Winning Feeling! 👏 👏@prasidh43 picks his fourth wicket as #TeamIndia complete a 4⃣4⃣-run win over West Indies in the 2nd ODI. 👍 👍 #INDvWI @Paytm Scorecard ▶️ https://t.co/yqSjTw302p pic.twitter.com/R9KCvpMImH — BCCI (@BCCI) February 9, 2022 -
IPL 2022: 6 కోట్లు తగలేశారు.. ఇషాన్‌ను పక్కనపెట్టారు.. ముంబై పెద్ద తప్పే చేసింది!
IPL 2022 Auction- Mumbai Indians: టీ20 ప్రపంచకప్-2021 జరుగుతున్న సమయంలోనే జట్టుకు దూరం..... డిసెంబరులో పాకిస్తాన్ పర్యటనకు గైర్హాజరు.. ఇంగ్లండ్‌తో సిరీస్‌కు ముందు రిహాబిలిటేషన్ సెంటర్లో చికిత్స... పర్లేదనిపించాడు... తర్వాత భారత్ టూర్‌కు విచ్చేశాడు.. టీమిండియాతో వన్డే సిరీస్‌లో భాగంగా తొలి మ్యాచ్‌లో పూర్తిగా విఫలం... రెండో వన్డేకు దూరం.. అవును... ఈ ఉపోద్ఘాతమంతా వెస్టిండీస్ కెప్టెన్ కీరన్ పొలార్డ్ గురించే. 34 ఏళ్ల ఈ ‘భారీ హిట్టర్’ ఇటీవలి కాలంలో తరచూ గాయాల బారిన పడుతున్నాడు. ఫిట్నెస్ లేమి కారణంగా పలు సందర్భాల్లో జట్టుకు దూరమయ్యాడు. భారత్‌తో బుధవారం నాటి మ్యాచ్‌లోనూ పొలార్డ్ ఆడలేదు. అతడి స్థానంలో నికోలస్ పూరన్ జట్టు పగ్గాలు చేపట్టాడు. అయితే, అప్పటికే 1-0 తేడాతో వెనుకబడి ఉన్న విండీస్.. భారత బౌలర్లు చెలరేగడంతో ఈ మ్యాచ్‌లోనూ ఓడి సిరీస్‌ను సమర్పించుకుంది. తద్వారా 19 ఏళ్ల తర్వాత భారత గడ్డపై వన్డే సిరీస్ గెలవాలన్న ఆశ నిరాశే అయ్యింది. Series lost, but the boys go again on Friday in the final ODI with the opportunity to gain some World Cup qualification points. #MenInMaroon #INDvWI pic.twitter.com/Ah8U8XAnzt — Windies Cricket (@windiescricket) February 9, 2022 ఈ విషయాన్ని కాసేపు పక్కన పెడితే... కెప్టెన్ పొలార్డ్ ఫిట్నెస్ గురించే ముంబై ఇండియన్స్ అభిమానులు కలవరపడుతున్నారు. ఐపీఎల్-2022 మెగా వేలం నేపథ్యంలో ముంబై కెప్టెన్ రోహిత్ శర్మ(రూ. 16 కోట్లు) సహా ముగ్గురు ఆటగాళ్లను రిటైన్ చేసుకున్న సంగతి తెలిసిందే. స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా (రూ. 12 కోట్లు), సూర్యకుమార్ యాదవ్ (రూ. 8 కోట్లు) , కీరన్ పొలార్డ్ (రూ. 6 కోట్లు)ను అట్టిపెట్టుకుంది. కానీ పొలార్డ్ తరచూ గాయం కారణంగా జట్టుకు దూరం కావడం, బ్యాటింగ్‌లో కూడా అంతగా మెరుపులు లేకపోవడంతో ముంబై.. అతడిని రిటైన్ చేసుకుని పెద్ద తప్పు చేసిందా అనే చర్చ మొదలైంది. అదే విధంగా... విధ్వంసకర యువ వికెట్ కీపర్ బ్యాటర్ ఇషాన్ కిషన్‌ను వదిలేయడంపై ఫ్యాన్స్ పెదవి విరుస్తున్నారు. ఇషాన్‌ను పక్కనపెట్టడం, పొలార్డ్ రిటైన్ చేయడం సరికాదనే అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. కాగా ఫిబ్రవరి 12, 13 తేదీల్లో బెంగళూరు వేదికగా ఐపీఎల్ మెగా వేలం జరుగనుంది. కాగా భారత్‌తో తొలి వన్డేలో పొలార్డ్ డకౌట్ అయిన విషయం తెలిసిందే. మరోవైపు.. ముంబై ఇండియన్స్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్న టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్ అద్భుత ఆట తీరుతో ఆకట్టుకుంటున్నారు.విండీస్‌తో జరిగిన రెండో వన్డేలో సూర్యకుమార్ 83 బంతుల్లో 5 ఫోర్ల సాయంతో 64 పరుగులు చేసి వరల్డ్ రికార్డు నెలకొల్పాడు. వన్డే క్రికెట్ చరిత్రలో తొలి ఆరు మ్యాచ్‌ల్లో 30కి పైగా పరుగులు చేసిన తొలి బ్యాటర్‌గా చరిత్ర సృష్టించాడు. చదవండి: Surya Kumar Yadav: వన్డే క్రికెట్ చరిత్రలో ఆ రికార్డు సాధించిన ఒకే ఒక్కడు -
Live Blog: విండీస్‌తో టీమిండియా రెండో వన్డే... హైలైట్స్
-
Ind Vs Wi: అదే ఆఖరు... 19 ఏళ్లకు పైగానే అయింది గెలిచి.. ఈసారి కూడా!
Ind Vs Wi ODI Series 2022- చారిత్రాత్మక 1000వ వన్డేలో వెస్టిండీస్‌పై అద్భుత విజయం అందుకున్న టీమిండియా రెండో మ్యాచ్‌లోనూ గెలిచి సిరీస్‌ను కైవసం చేసుకోవాలని పట్టుదలగా ఉంది. మరోవైపు భారత్‌లో మరోవన్డే సిరీస్ పరాజయాన్ని తప్పించుకోవాలని వెస్టిండీస్ భావిస్తోంది. ప్రస్తుత బలాబలాలను పరిశీలిస్తే రోహిత్ సేనదే పైచేయిగా కనిపిస్తోంది. తొలి వన్డేలో ఆల్‌రౌండ్ ప్రతిభతో సంపూర్ణ ఆధిపత్యం కనబరిచిన నేపథ్యంలో టీమిండియాకే గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. దీంతో బుధవారం నాటి మ్యాచ్‌లో పొలార్డ్ సేనకు మరోసారి పరాభవం తప్పదనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో భారత గడ్డపై విండీస్ వన్డే సిరీస్‌ల పరాజయ పరంపర రికార్డును పరిశీలిద్దాం. ఇండియా వర్సెస్ వెస్టిండీస్ వన్డే రికార్డులు: ►19 ఏళ్ల నుంచి ఒక్కసారి కూడా విండీస్ భారత్‌లో టీమిండియాను ఓడించలేకపోయింది. ►2002 సిరీస్‌లో 7 మ్యాచ్‌ల సిరీస్‌లో వెస్డిండీస్ 4-3 తేడాతో గెలుపొందింది. భారత్‌లో విండీస్‌కు ఇదే ఆఖరి విజయం. ►ఆ తర్వాత వరుసగా ఏడు వన్డే సిరీస్‌లో భారత్ చేతిలో విండీస్ ఓటమి పాలైంది. ►2007లో టీమిండియా 4 మ్యాచ్‌ల సిరీస్‌లో విండీస్‌పై 3-1 తేడాతో గెలుపొందింది. ►2011లో భారత్ విండీస్‌ను 4-1 తేడాతో చిత్తుగా ఓడించింది. ►2013లో విండీస్‌పై 2-1తేడాతో టీమిండియా నెగ్గింది. ►2014లో భారత జట్టు మరోసారి 2-1 తేడాతో వెస్టిండీస్‌ను ఓడించింది. ►2018లో భారత్ 3-1 తేడాతో విండీస్‌ను ఓడించి సిరీస్ గెలిచింది. ►2019లో విండీస్ టీమిండియా చేతిలో 2-1 తేడాతో పరాజయం పాలై వన్డే సిరీస్‌ను చేజార్చుకుంది. ►2022లో భాగంగా భారత్‌తో తొలి వన్డేలో వెస్టిండీస్ ఓడిపోయింది. చదవండి: IPL 2022 Mega Auction: అప్పుడు 1.5 కోట్లు.. ఇప్పుడు అతడి కోసం యుద్దం జరగనుంది.. రికార్డులు బద్దలు అవ్వాల్సిందే! -
IND Vs WI: ఏంటి సూర్య.. ఆ షాట్ ఎందుకు ఆడటం లేదు? ఇది ఐపీఎల్ కాదుగా పొలార్డ్!
వెస్డిండీస్‌తో తొలి వన్డేలో అద్భుత ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్నాడు టీమిండియా బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్. చారిత్రాత్మక 1000వ వన్డేలో 36 బంతుల్లో 34 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. కెప్టెన్ రోహిత్ శర్మ(60 పరుగులు) తర్వాత టీమిండియాలో సూర్యదే టాప్ స్కోర్. సూపర్ ఇన్నింగ్స్‌తో విజయంలో తన వంతు పాత్ర పోషించిన సూర్య.. మ్యాచ్ సందర్భంగా విండీస్ కెప్టెన్ కీరన్ పొలార్డ్‌తో జరిగిన సంభాషణ గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించాడు. ఐపీఎల్ జట్టు ముంబై ఇండియన్స్‌లో సూర్య, పొలార్డ్ సహచర ఆటగాళ్లన్న సంగతి తెలసిందే. సూర్య ఆట, షాట్ సెలక్షన్ గురించి అవగాహన ఉన్న పొలార్డ్... వన్డే మ్యాచ్‌లో అతడిని మాటలతో కవ్వించాడు. ఈ విషయంపై స్పందించిన సూర్యకుమార్ యాదవ్... ‘‘పొలార్డ్ నాకు కొన్ని విషయాలు చెప్పాడు. మిడ్ వికెట్ ఓపెన్ ఉంది కదా. ఐపీఎల్లో ఆడిన మాదిరిగా ఫ్లిక్ షాట్ ఇక్కడెందుకు ఆడటం లేదు’’ అని నన్ను అడిగాడు. ‘‘ఐపీఎల్‌కు... వన్డేకు తేడా ఉంది కదా! చివరి వరకు క్రీజులో ఉండాలనుకుంటున్నా.. అందుకే షాట్ ఆడటం లేదు అని చెప్పాను’’ అని పేర్కొన్నాడు. అదే విధంగా అరంగేట్ర ఆటగాడు దీపక్ హుడాతో భాగస్వామ్యం నెలకొల్పడం గురించి మాట్లాడుతూ... ‘‘గత ఏడేళ్లుగా తను దేశవాళీ క్రికెట్ ఆడుతున్నాడు. ఆఖరి వరకు క్రీజులో ఉండటం తనకు ముఖ్యం. అయితే... తనకు నేనేమీ సలహాలు ఇవ్వలేదు. ఆత్మవిశ్వాసంతో అతడు అజేయంగా నిలిచాడు. తన పట్టుదల నాకు నచ్చింది’’ అని చెప్పుకొచ్చాడు. చదవండి: U19 WC- Shaikh Rasheed: 40 లక్షల నగదు.. అంత డబ్బు ఎప్పుడూ చూడలేదు.. చిన్న ఇల్లు కొంటాను.. మిగతా మొత్తంతో.. Not the start to series boys wanted. But we go again on Wednesday. #MenInMaroon #INDvWI pic.twitter.com/1VpPjMHnyZ — Windies Cricket (@windiescricket) February 6, 2022 -
రోహిత్ శర్మ కళ్లు చెదిరే సిక్స్.. ఆ చూపుకు అర్థమేంటి ?
టీమిండియాతో జరిగిన తొలి వన్డేలో వెస్టిండీస్ ఓటమి పాలయింది. 177 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా 4 వికెట్లు కోల్పోయి 28 ఓవర్లలో లక్ష్యాన్ని అందుకుంది. టీమిండియా కెప్టెన్.. ఓపెనర్ రోహిత్ శర్మ 60 పరుగులతో ఆరంభంలోనే గట్టి పునాది వేసి విజయానికి బాటలు పరిచాడు. తద్వారా టీమిండియా 1000వ వన్డేలో విజయం సాధించడం గొప్ప విషయంగా చెప్పుకోవచ్చు. ఇక పూర్తిస్థాయి కెప్టెన్‌గా బరిలోకి దిగిన రోహిత్ బ్యాటింగ్‌లో సూపర్ షాట్స్ ఆడాడు. రోహిత్ తాను ఔటయ్యే సమయానికి టీమిండియా స్కోరు 84. అందులో రోహిత్‌వే 60 పరుగులున్నాయంటే ఎంత వేగంగా ఆడాడో అర్థమవుతుంది. చదవండి: Rishabh Pant: ఎంత పని చేశావు సూర్య.. పంత్‌ను వెంటాడిన దురదృష్టం 51 బంతుల్లో 60 పరుగులు సాధించిన రోహిత్ ఇన్నింగ్స్‌లో 10 ఫోర్లు, ఒక సిక్స్ ఉన్నాయి. ఇక ఇన్నింగ్స్ 10వ ఓవర్లో అల్జారీ జోసెఫ్ బౌలింగ్‌లో రోహిత్ శర్మ కొట్టిన సిక్స్ హైలెట్‌గా నిలిచింది. జోసెఫ్ వేసిన షార్ట్ పిచ్ బంతిని రోహిత్ క్రీజులోనే ఉండి వెనక్కి వంగి డీప్‌స్క్వేర్ లెగ్ దిశగా కళ్లు చెదిరే సిక్స్ కొట్టాడు. ఇది చూసిన పొలార్డ్ కోపంతో రోహిత్‌కు ఒక లుక్ ఇచ్చాడు.. తన పళ్లు నూరుతూ ఏంటి రోహిత్ అన్నట్లుగా ఆ లుక్‌లో అర్థం కనిపించింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. Ear Therapy @ImRo45 💉pic.twitter.com/mrEJaU8oyW — 🎭 (@CloudyCrick) February 6, 2022 -
భారత్- విండీస్ తొలి వన్డే.. తుది జట్లు అంచనా!
స్వదేశంలో వెస్టిండీస్‌తో తొలి పోరుకు టీమిండియా సిద్దమైంది. అహ్మదాబాద్ వేదికగా భారత్-విండీస్ మధ్య తొలి వన్డే ఆదివారం జరగనుంది. గాయం నుంచి కోలుకున్న రోహిత్ శర్మ తిరిగి సారథ్య బాధ్యతలు చేపట్టనున్నాడు. ఇక వ్యక్తిగత కారణాలతో కేఎల్ రాహుల్, కరోనాతో ధావన్, శ్రేయస్, రుతురాజ్, సైనీలు దూరమయ్యారు. మరో వైపు విండీస్ జట్టుకు గాయంతో హెట్‌మైర్, కోవిడ్‌తో ఎవిన్ లూయిస్ దూరమయ్యారు. వీరి స్ధానంలో ఒడియన్ స్మిత్, రొమరియో షెఫర్డ్ జట్టులోకి వచ్చారు. జట్లు (అంచనా) భారత్: రోహిత్ శర్మ (కెప్టెన్), ఇషాన్ కిషన్, కోహ్లి, పంత్, సూర్యకుమార్, దీపక్ హుడా/వాషింగ్టన్ సుందర్, చహర్, శార్దుల్, కుల్దీప్, చహల్, ప్రసిధ్ కృష్ణ. వెస్టిండీస్: పొలార్డ్ (కెప్టెన్), హోప్, బ్రాండన్ కింగ్/బానెర్, పూరన్, బ్రూక్స్, డారెన్ బ్రేవో, స్మిత్/షెఫర్డ్, హోల్డర్, హొసెయిన్, రోచ్, హెడెన్ వాల్ష్ జూనియర్. పిచ్–వాతావరణం పిచ్ బ్యాటింగ్‌కు స్వర్గధామం. భారీ స్కోర్లు ఖాయం. మంచు వల్ల బౌలర్లకు సవాళ్లు తప్పవు. వర్షం ముప్పులేదు. చదవండి: Under-19 World Cup Final: అరుదైన రికార్డు సాధించిన రాజ్ బావా.. కపిల్ దేవ్ తర్వాత! -
"టీమిండియాపై విజయం మాదే.. విండీస్ పవర్ ఏంటో చూపిస్తాం"
స్వదేశంలో ఇంగ్లండ్‌ను మట్టి కరిపించి టీమిండియా పర్యటనకు వెస్టిండీస్ బయలు దేరింది. కీరన్ పొలార్డ్ నేతృత్వంలోని విండీస్ జట్టు మంగళవారం రాత్రి భారత్‌కు చేరుకోనుంది. అనంతరం అహ్మదాబాద్‌లో 3 రోజుల పాటు క్వారంటైన్లో విండీస్ జట్టు గడపనుంది. ఈ నేపథ్యంలో వెస్టిండీస్ స్టార్ ఆల్ రౌండర్ జేసన్ హోల్డర్ ఆసక్తికర వాఖ్యలు చేశాడు. స్వదేశంలో టీమిండియాను ఓడించిడం అంత సులువు కాదని, అయితే ప్రస్తుత కరీబియన్ జట్టుకు భారత్‌ను ఓడించే సత్తా ఉందని హోల్డర్ తెలిపాడు. "టీమిండియాతో సిరీస్ అతి పెద్ద సిరీస్‌గా భావిస్తున్నాను. ప్రపంచంలోనే భారత్ అత్యుత్తమ ఆల్‌రౌండ్ క్రికెట్ జట్టు. వాళ్ల గడ్డపై వారిని ఓడించడం అంత సులభం కాదు. గత రెండేళ్లుగా టీమిండియా స్వదేశంలో అధ్బుతంగా రాణిస్తుంది. కానీ ప్రస్తుత వెస్టిండీస్ జట్టుకు భారత్‌ను ఓడించే సత్తా ఉంది. గత ఏడాది స్వదేశంలో ఐర్లాండ్ చేతిలో ఓటమి తర్వాత మా జట్టు నిరాశకు గురైంది. ఇంగ్లండ్‌పై మా జట్టు బౌన్స్‌బ్యాక్ చేసి అద్భుతమైన విజయం సాధించింది. అదే విధంగా మా డ్రెసింగ్ రూమ్‌లో కూడా ఏటువంటి విభేదాలు లేవు" అని హోల్డర్ పేర్కొన్నాడు. ఇక భారత పర్యటనలో భాగంగా విండీస్ జట్టు మూడు వన్డేలు, టీ20లు ఆడనుంది. ఇక ఆహ్మదాబాద్ వేదికగా ఫిబ్రవరి 6న తొలి వన్డే జరగనుంది. చదవండి: Rashid Khan: శ్రీవల్లి పాటకు స్టెప్పులేసిన రషీద్ ఖాన్.. అదరగొట్టేశాడుగా! -
Ind Vs Wi: కెప్టెన్‌ను మార్చే ప్రసక్తే లేదు... అనవసరంగా విమర్శలు... ఒకవేళ..
Ind Vs Wi: ‘‘ఫిల్, పొలార్డ్‌పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. క్రికెటేతర కారణాల వల్లే ఇలా జరుగుతోంది. అంతేతప్ప ఆట పరంగా ఎలాంటి ఇబ్బందులు లేవు. ఏదేమైనా ఇప్పట్లో కోచ్, కెప్టెన్‌ను మార్చే యోచనే లేదు’’ అని క్రికెట్ వెస్టిండీస్ అధ్యక్షుడు రికీ స్కెరిట్ స్పష్టం చేశాడు. కాగా టీమిండియాతో పరిమిత ఓవర్ల సిరీస్‌కు ముందు విండీస్ కెప్టెన్ కీరన్ పొలార్డ్, కోచ్ ఫిల్ సిమన్స్పై విమర్శలు వెల్లువెత్తిన సంగతి తెలిసిందే. టీ20 ప్రపంచకప్-2021లో వెస్టిండీస్ జట్టు ఘోర వైఫల్యం, ఇటీవల స్వదేశంలో ఐర్లాండ్ చేతిలో వన్డే సిరీస్ ఓటమి తర్వాత ఇవి మరింత ఎక్కువయ్యాయి. ముఖ్యంగా జట్టులోని కొందరు ఆటగాళ్ల పట్ల పొలార్డ్ వివక్షపూరితంగా వ్యవహరిస్తున్నాడంటూ ఆరోపణలు వచ్చాయి. ఇందుకు సంబంధించి స్థానిక మీడియాలో కథనాలు వెలువడగా... విండీస్ బోర్డు వాటిని ఖండించింది. ఈ క్రమంలో సీడబ్ల్యూఐ అధ్యక్షుడు రికీ క్రిక్‌బజ్‌తో మాట్లాడుతూ... ‘‘ఒకవేళ వాళ్లు(ఫిల్, పొలార్డ్) తమ బాధ్యతను సరిగా నెరవేర్చలేదని నిరూపితమైతే అప్పుడు కచ్చితంగా పునరాలోచన చేస్తాం. అంతేతప్ప ఇప్పటికిప్పుడు వారిని పంపే ప్రసక్తే లేదు. కొంతమంది అకారణంగా వారిపై నిందలు వేస్తున్నారు. వారిని తక్కువ చేసి చూపించాలనుకుంటున్నారు’’ అని కెప్టెన్, కోచ్‌కు మద్దతుగా నిలిచాడు. కాగా ఐర్లాండ్ చేతిలో ఘోర ఓటమి పాలైన విండీస్.. ఇంగ్లండ్‌తో జరిగిన టీ20 సిరీస్(3-2 తేడాతో)ను కైవసం చేసుకుని తిరిగి ఫామ్‌లోకి వచ్చింది. ఫిబ్రవరి 6న టీమిండియాతో ఆరంభం కానున్న వన్డే సిరీస్‌కు పొలార్డ్ బృందం సన్నద్ధమవుతోంది. చదవండి: IPL 2022 Mega Auction: అతడు వేలంలోకి వస్తే.. జట్లు పోటీ పడాల్సిందే: అశ్విన్ IND vs WI: ఇప్పుడు ఇంగ్లండ్ పని అయిపోయింది.. తరువాత టీమిండియానే: పొలార్డ్ -
ఇంగ్లండ్ పని అయిపోయింది.. తరువాత టీమిండియానే: పొలార్డ్
Wi Vs Eng T20I: స్వదేశంలో ఇంగ్లండ్‌తో జరిగిన 5 టీ20ల సిరీస్‌ను 3-2 తేడాతో వెస్టిండీస్ కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే. కాగా త్వరలో టీమిండియాతో జరగబోయే పరిమిత ఓవర్ల సిరీస్‌పై కీరన్ పొలార్డ్ సారథ్యంలోని విండీస్ జట్టు ఇప్పుడు కన్ను వేసింది. ఇంగ్లండ్‌తో ఐదో టీ20 అనంతరం విలేకరుల సమావేశంలో మాట్లాడిన వెస్టిండీస్ కెప్టెన్ కీరన్ పొలార్డ్ కీలక వాఖ్యలు చేశాడు. రోహిత్ శర్మ నేతృత్వంలోని భారత జట్టుతో ఆడడం తనకు చాలా ప్రత్యేకమైనది పొలార్డ్ తెలిపాడు. "ఇంగ్లండ్‌పై మాకు ఇది అద్భుత విజయం. ఇప్పుడు మేము భారత పర్యటనపై దృష్టిసారిస్తాం. మేము ఈ పర్యటనలో టీమిండియాపై కచ్చితంగా విజయం సాధిస్తాం. రోహిత్ శర్మ నేతృత్వంలోని టీమిండియాతో ఆడడానికి అతృతగా ఎదురు చూస్తున్నాం" అని పొలార్డ్ పేర్కొన్నాడు. ఇక భారత పర్యటనలో భాగంగా విండీస్ జట్టు మూడు వన్డేలు, టీ20లు ఆడనుంది. ఇక ఆహ్మదాబాద్ వేదికగా ఫిబ్రవరి 6న తొలి వన్డే జరగనుంది. కాగా ఐపీఎల్లో రోహిత్ శర్మ నేతృత్వంలో ముంబై ఇండియన్స్ తరఫున పొలార్డ్ ఆడుతున్న సంగతి తెలిసిందే. ఇక ఐపీఎల్-2022 మెగా వేలం ముందు ముంబై ఇండియన్స్ పొలార్డ్‌ను రీటైన్ చేసుకుంది. చదవండి: ENG vs WI: నాలుగు బంతుల్లో నాలుగు వికెట్లు.. సంచలనం సృష్టించిన జాసన్ హోల్డర్ The first captain in history to start his post-match interview with a song? 😀🎶 Loving Captain @KieronPollard55's rendition of Sizzla's "Solid As A Rock"🎙🌴#WIvENG #MenInMaroon pic.twitter.com/3TESWijqdZ — Windies Cricket (@windiescricket) January 31, 2022 WI WIN the Betway T20I Series!!💥🙌🏾 #WIvENG #WIVibes pic.twitter.com/gAdNgMA6wS — Windies Cricket (@windiescricket) January 31, 2022 -
అనవసరంగా 20 పరుగులు.. సొంత జట్టుపై పొలార్డ్ అసహనం
ఇంగ్లండ్, వెస్టిండీస్‌ల మధ్య శనివారం నాలుగో టి20 మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్ 34 పరుగులుతో గెలిచి సిరీస్‌ను సమం చేసింది. ఐదు మ్యాచ్‌ల టి20 సిరీస్‌లో ఇరు జట్లు రెండు విజయాలతో సమానంగా ఉన్నాయి. టోర్నీ విజేత ఎవరో తేలాలంటే ఆఖరి మ్యాచ్ కీలకం కానుంది. తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 193 పరుగులు చేసింది. కెప్టెన్ మొయిన్ అలీ 63, జేసన్ రాయ్ 52 పరుగులతో రాణించారు. అనంతరం బ్యాటింగ్ చేసిన విండీస్ 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 159 పరుగులు చేసి 34 పరుగులతో ఓటమి పాలైంది. చదవండి: కెరీర్ బెస్ట్ స్కోరు నమోదు.. చేదు అనుభవమే మిగిల్చింది మ్యాచ్ ఓటమి అనంతరం విండీస్ కెప్టెన్ పొలార్డ్ తన సొంతజట్టుపై అసహనం వ్యక్తం చేశాడు.'' ఇంగ్లండ్ వికెట్లు తీయడంలో మా బౌలర్లు పూర్తిగా విఫలమయ్యారు. . ఇంగ్లండ్‌ను 160, 170లోపే కట్టడి చేయాలని భావించాం. చివరి ఓవర్లలో అనవసరంగా 20 పరుగులు ఇచ్చుకున్నాం. ఇంగ్లండ్ చివర్లో బాగా ఆడి తమ స్కోరును 190 దాటించింది. అదే మా కొంప ముంచింది. ఇక సిరీస్ గెలవాలంటే ఆఖరి మ్యాచ్ తప్పనిసరిగా గెలవాలి. మా శక్తి మేరకు ప్రయత్నిస్తాం'' అంటూ చెప్పుకొచ్చాడు. -
టీమిండియాతో టి20 సిరీస్.. విండీస్ జట్టు ప్రకటన
Wi Squad For India 2022 T20: ఫిబ్రవరిలో టీమిండియా టూర్ రానున్న వెస్టిండీస్ జట్టు టి20 సిరీస్‌కు 16 మందితో కూడిన జట్టును శనివారం ప్రకటించింది. కీరన్ పొలార్డ్ కెప్టెన్ కాగా.. నికోలస్ పూరన్ వైస్ కెప్టెన్‌గా వ్యహరించనున్నాడు. ప్రస్తుతం ఇంగ్లండ్‌తో ఐదు మ్యాచ్‌ల టి20 సిరీస్ ఆడుతున్న విండీస్.. 2-1తో ఆధిక్యంలో ఉంది. ఇంగ్లండ్‌తో ఆడుతున్న జట్టునే భారత్‌తో జరగనున్న టి20 సిరీస్‌కు ఎంపిక చేశారు. అయితే విండీస్ క్రికెట్ బోర్డు ఇదివరకే వన్డే జట్టును ప్రకటించింది. షామ్రా బ్రూక్స్, క్రుమ్హా బోనర్, కీమర్ రోచ్‌లను వన్డేలకే పరిమితం చేశారు. ఇక టి20 ప్రపంచకప్‌లో పొలార్డ్ కెప్టెన్సీలో విండీస్ జట్టు అంతగా రాణించకపోవడంతో సూపర్-12 దశలోనే వెనుదిరిగింది. దీంతో వచ్చే ఏడాది జరగనున్న టి20 ప్రపంచకప్‌లో విండీస్ జట్టు క్వాలిఫయర్ మ్యాచ్‌లు ఆడి సూపర్-12 దశకు అర్హత సాధించాల్సి ఉంటుంది. వెస్టిండీస్ జట్టు: కీరన్ పొలార్డ్ (కెప్టెన్), నికోలస్ పూరన్ (వైస్‌కెప్టెన్), ఫాబియన్ అలెన్, డారెన్ బ్రావో, రోస్టన్ చేజ్, షెల్డన్ కాట్రెల్, డొమినిక్ డ్రేక్స్, జాసన్ హోల్డర్, షై హోప్, అకియెల్ హోసేన్, బ్రాండన్ కింగ్, రోవ్‌మన్ పావెల్, ఓడియన్ స్మిత్ షెపర్డ్, కైల్ మేయర్స్, హేడెన్ వాల్ష్ -
IND Vs WI: టీమిండియా సేఫ్ హ్యాండ్స్‌లో ఉంది.. అయినా మాతో అంత ఈజీ కాదు..!
Darren Sammy: త్వరలో టీమిండియాతో ప్రారంభంకానున్న పరిమిత ఓవర్ల సిరీస్ నేపథ్యంలో విండీస్ మాజీ సారధి డారెన్ సామి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. పరిమిత ఓవర్ల ఫార్మాట్లో తమ జట్టును ఏమాత్రం తక్కువ అంచనా వేయరాదని భారత్‌ను హెచ్చరించాడు. గతంలో చాలా సందర్భాల్లో టీమిండియా కంటే బలమైన జట్లకు షాకిచ్చామని, ఈ విషయాన్ని భారత్ గుర్తు చేసుకోవాలని సూచించాడు. భారత్ ఎలాంటి క్లిష్ట పరిస్థితుల్లో నుంచైనా త్వరగా బయటపడగలదని, ప్రస్తుతం ఆ జట్టు రోహిత్ శర్మ లాంటి గొప్ప నాయకుడి చేతుల్లో సేఫ్‌గా ఉందని అభిప్రాయపడ్డాడు. ఇటీవలి దక్షిణాఫ్రికా పర్యటనలో వరుస ఓటములు, కెప్టెన్సీ వివాదం వంటివి భారత్‌పై ఎలాంటి ప్రభావం చూపవని, స్వదేశంలో రోహిత్ సేన బెబ్బులిలా గర్జిస్తుందని తమ జట్టును అలర్ట్ చేశాడు. ఫిబ్రవరి 6 నుంచి 20 వరకు జరిగే 3 వన్డేలు, 3 టీ20ల సిరీస్‌లో పోలార్డ్ సేనకు ప్రధాన ముప్పు కెప్టెన్, మాజీ కెప్టెన్ల నుంచి ఉంటుందని హెచ్చరించాడు. రోహిత్ నేతృత్వంలో టీమిండియా బలంగా కనిపిస్తుందని, విండీస్ జట్టు సైతం ఆల్‌రౌండర్లతో నిండి ఉందని ప్రస్తావించాడు. విండీస్ జట్టులోని కొందరు ఆటగాళ్లకు భారత్‌లో ఆడిన అనుభవం ఉందని, ముఖ్యంగా కెప్టెన్ పోలార్డ్‌కు భారత్‌లో పరిస్థితులపై మంచి అవగాహన ఉందని, ఇది ఓ రకంగా తమకు కలిసొచ్చే అంశమని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఇంగ్లండ్‌తో సిరీస్‌లో రాణిస్తున్న కుర్రాళ్లు విండీస్‌కు అదనపు బలంగా మారతారని, యువకులు, అనుభవజ్ఞుల కలియకలో కరీబియన్ జట్టు టీమిండియాకు గట్టి పోటీ ఇస్తుందని ధీమా వ్యక్తం చేశాడు. లెజెండ్స్ లీగ్ సందర్భంగా మాట్లాడుతూ.. సామి తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. చదవండి: IPL 2022: వేలంలో రికార్డు ధర పలికే భారత ఆటగాళ్లు ఆ ఇద్దరే..! -
టీమిండియాతో సిరీస్.. వెస్టిండీస్ జట్టులో గొడవలు.. పొలార్డ్‌పై సంచలన ఆరోపణలు!
వెస్టిండీస్ క్రికెట్ జట్టు త్వరలో భారత పర్యటనకు రానుంది. ఈ పర్యటనలో భాగంగా మూడు వన్డేలు, మూడు టీ20లు ఆడనుంది. ఫిబ్రవరి 6న భారత్- వెస్టిండీస్ మధ్య తొలి వన్డే జరగనుంది. ఇప్పటికే వన్డే సిరీస్ కోసం విండీస్ జట్టును ఆ దేశ క్రికెట్ బోర్డు ప్రకటించింది. అయితే ఈ సిరీస్‌కు ఎంపిక చేసిన వెస్టిండీస్ జట్టులో కొంత మంది సీనియర్ ఆటగాళ్లతో కెప్టెన్ కీరన్ పొలార్డ్‌కి విభేదాలు తలెత్తినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఆల్‌రౌండర్ ఓడెన్ స్మిత్ విషయంలో అతడు వివక్షాపూరితంగా వ్యవహరించినట్లు స్థానిక మీడియాలో సంచలన కథనాలు వెలువడ్డాయి. ఈ క్రమంలో ఈ వార్తలపై క్రికెట్ వెస్టిండీస్ స్పందించింది. వెస్టిండీస్ జట్టులో విభేదాలు చెలరేగాయి అంటూ వస్తున్న వార్తలను కొట్టిపారేసింది. విండీస్ జట్టులో ఎటువంటి విభేదాలు లేవని, ఆటగాళ్లు అందరూ బాగానే ఉన్నారని క్రికెట్ వెస్టిండీస్ పేర్కొంది. కెప్టెన్ పొలార్డ్ విశ్వసనీయతని దెబ్బతీసేందుకు ఇటువంటి రూమర్స్ సృష్టించారని సీడబ్ల్యూఐ ప్రెసిడెంట్ రిక్కీ స్టేరిట్ తెలిపాడు.కాగా విండీస్ జట్టు స్వదేశంలో ఇంగ్లండ్‌తో 5 మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో తలపడుతోంది. 5 మ్యాచ్‌ల సిరీస్‌లో 2-1తో విండీస్ అధిక్యంలో ఉంది. చదవండి: India Captain: భవిష్యత్తు కెప్టెనా... అసలు అతడిలో ఏ స్కిల్ చూసి ఎంపిక చేశారు: సెలక్టర్లపై మండిపడ్డ మనోజ్ తివారి IPL 2022 Mega Auction: వేలంలో పేరు నమోదు చేసుకున్న శ్రీశాంత్.. ధర ఎంతో తెలుసా? -
WI Vs IRE: వెస్టిండీస్‌పై ఐర్లాండ్ సంచలన విజయం.. ఏకంగా..
Ireland Beat West Indies : ఐర్లాండ్ సంచలన విజయం సాధించింది. వెస్టిండీస్‌ను ఐదు వికెట్ల తేడాతో చిత్తుగా ఓడించి సిరీస్ గెలుపు ఆశలను సజీవంగా ఉంచుకుంది. కాగా మూడు వన్డేలు ఆడే నిమిత్తం ఐర్లాండ్.. వెస్టిండీస్ పర్యటనకు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తొలి వన్డేలో ఆతిథ్య విండీస్ 24 పరుగుల తేడాతో గెలుపొందగా.. పర్యాటక జట్టులో కోవిడ్ కేసుల కారణంగా రెండో వన్డే వాయిదా పడింది. ఈ నేపథ్యంలో జనవరి 11న జరగాల్సిన మ్యాచ్‌ను 13వ తేదీన నిర్వహించారు. ఇక ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఐర్లాండ్ తొలుత ఫీల్డింగ్ ఎంచుకుంది. ఈ క్రమంలో పొలార్డ్ బృందం 229 పరుగులకు ఆలౌట్ కాగా... వర్షం కారణంగా డక్‌వర్త్ లూయీస్ నిబంధన ప్రకారం మ్యాచ్‌ను 36 ఓవర్లకు కుదించారు. ఇందులో భాగంగా 168 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఐర్లాండ్... 32.3 ఓవర్లలోనే ఐదు వికెట్లు కోల్పోయి విండీస్‌పై విజయం సాధించింది. ఐదు వికెట్ల తేడాతో గెలుపొంది సిరీస్‌ను 1-1తో సమం చేసింది. ఈ విజయంలో కీలక పాత్ర పోషించిన ఆండీ మెక్‌బ్రైన్(4 వికెట్లు... 45 బంతుల్లో 35 పరుగులు) ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు. హ్యారీ హెక్టార్ 54 పరుగుల(నాటౌట్)తో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ఇక ఐర్లాండ్ కెప్టెన్ పాల్ స్టిర్లింగ్ వన్డే కెరీర్లో 5 వేల పరుగులు పూర్తి చేసుకున్న తొలి ఐరిష్ క్రికెటర్‌గా ఘనత సాధించాడు. ఈ విజయం గురించి స్పందించిన పాల్.. విండీస్‌పై గెలుపు తమ ఆత్మవిశ్వాసాన్ని పెంచిందన్నాడు. స్కోర్లు: వెస్టిండీస్- 229 (48) ఐర్లాండ్- 168/5 (32.3) చదవండి: Virat Kohli Vs Dean Elgar: సైలెంట్‌గా ఉంటానా డీన్.. 3 ఏళ్ల క్రితం ఏం చేశావో తెలుసు.. కోహ్లి మాటలు వైరల్ The 2nd wicket to fall in the innings. A good grab by the skipper! #WIvIRE pic.twitter.com/bJFUOo0Hd2 — Windies Cricket (@windiescricket) January 13, 2022 -
4 ఫోర్లు, 4 సిక్స్‌లు.. పొలార్డ్ కెప్టెన్ ఇన్నింగ్స్ ..
కింగ్స్టన్ వేదికగా ఐర్లాండ్‌తో జరిగిన తొలి వన్డేలో వెస్టిండీస్ 24 పరుగుల తేడాతో విజయం సాధించింది. దీంతో మూడు మూడు వన్డేల సిరీస్‌లో విండీస్1-0తో అధిక్యంలో నిలిచింది. మ్యాచ్ విషయానికి వస్తే.. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన వెస్టిండీస్ ఆదిలోనే జస్టిన్ గ్రీవ్స్ వికెట్ కోల్పోయింది. ఈ క్రమంలో మరో ఓపెనర్ షాయ్ హోప్, నికోలస్ పూరన్ వెస్టిండీస్ ఇన్నింగ్స్‌ను చక్కదిద్దారు. వీరిద్దరూ సెకెండ్ వికెట్‌కు 50 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. అయితే 4 పరుగల వ్యవధిలోనే విండీస్ మూడు వికెట్లు కొల్పోయి కష్టాల్లో పడింది. ఈ సమయంలో కెప్టెన్ పొలార్డ్, బ్రూక్స్ వెస్టిండీస్‌ను అదుకున్నారు. వీరిద్దరూ ఐదో వికెట్‌కు 155 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. అయితే అఖరిలో వరుస క్రమంలో వికెట్లు కోల్పోవడంతో విండీస్ 269 పరుగులకు ఆలౌటైంది. విండీస్ బ్యాటర్లలో బ్రూక్స్ 93 పరుగులు చేయగా, పొలార్డ్ 69 పరుగులు సాధించాడు. ఐర్లాండ్ బౌలరల్లో మార్క్ అదైర్, క్రెగ్ యంగ్ చెరో మూడు వికెట్లు పడగొట్టారు. ఇక 270 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఐర్లాండ్ ఆదిలోనే ఒపెనర్ విలియం ఫోర్ట్ ఫీల్డ్ వికెట్ కోల్పోయింది. ఈ క్రమంలో కెప్టెన్ బాల్బిర్నీ, ఆండీ మెక్‌బ్రైన్ రెండో వికెట్‌కు 61 పరుగులు జోడించారు. ఈ సమయంలో మంచి ఊపు మీద ఉన్న మెక్‌బ్రైన్ రిటైర్ హర్ట్‌గా వెనుదిరిగాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన టెక్టర్ కూడా అద్భుతంగా ఆడాడు. బాల్బిర్నీ, టెక్టర్ కలిసి 103 పరుగుల భాగస్తామ్యాన్ని నెలకొల్పారు. ఈ క్రమంలో బాల్బిర్నీ, టెక్టర్ వికెట్లను ఐర్లాండ్ వరుస క్రమంలో కోల్పోయింది. అనంతరం ఐరీష్ బ్యాటర్లు పెవిలియన్‌కు క్యూ కట్టారు. దీంతో 49.1ఓవర్లలో ఐర్లాండ్ 245 పరుగులకు ఆలౌటైంది. ఐరీష్ బ్యాటర్లలో బాల్బిర్నీ(71), టెక్టర్(53) పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచారు. విండీస్ బౌలర్లలో షెపర్డ్, జోషప్ చెరో మూడు వికెట్లు సాధించారు. చదవండి: Lara Dutta Love Story: ఇద్దరితో తెగతెంపులు, ఆల్రెడీ పెళ్లైన టెన్నిస్ స్టార్‌తో నటి వివాహం -
కెప్టెన్‌గా పొలార్డ్.. జట్టును ప్రకటించిన వెస్టిండీస్
స్వదేశంలో జరిగే ఇంగ్లండ్,ఐర్లాండ్ సిరీస్‌లకు వెస్టిండీస్ జట్టును ఆ దేశ క్రికెట్ బోర్డు శుక్రవారం ప్రకటించింది. ఐసీసీ వన్డే సూపర్ లీగ్‌లో భాగంగా ఐర్లాండ్‌తో వెస్టిండీస్ మూడు వన్డేలు ఆడనుంది. జనవరి8న జమైకా వేదికగా తొలి వన్డే జరగనుంది. కాగా మొత్తం మూడు వన్డేలు కూడా ఒకే వేదికలో జరగనున్నాయి. అనంతరం ఇంగ్లండ్‌తో 5 టీ20 మ్యాచ్‌లు ఆడనుంది. తొలి టీ20 బార్బడోస్ వేదికగా జరగనుంది. మొత్తం 5 టీ20 మ్యాచ్‌లు బార్బడోస్‌లోనే జరగనున్నాయి. కాగా గత ఏడాది డిసెంబర్లో పాకిస్తాన్ పర్యటించిన వెస్టిండీస్ వైట్‌వాష్ గురై ఘోర పరాభావం మూట కట్టుకుంది. మూడు టీ20 సిరీస్‌ను 3-0తో పాక్ కైవసం చేసుకుంది. అయితే పాక్ పర్యటనకు గాయంతో దూరమైన పొలార్డ్ తిరిగి జట్టులోకి వచ్చాడు. ఐర్లాండ్ వన్డేలకు వెస్టిండీస్ జట్టు కీరన్ పొలార్డ్ (కెప్టెన్), షాయ్ హోప్ (వైస్ కెప్టెన్), షమర్ బ్రూక్స్, రోస్టన్ చేజ్, జస్టిన్ గ్రీవ్స్, జాసన్ హోల్డర్, అకేల్ హోసేన్, అల్జారీ జోసెఫ్, గుడాకేష్ మోటీ, జేడెన్ సీల్స్, నికోలస్ పూరన్, రొమారియో షెపర్డ్, ఓడియన్ స్మిత్ , డెవాన్ థామస్, ఐర్లాండ్, ఇంగ్లండ్ టీ20లకు వెస్టిండీస్ జట్టు కీరన్ పొలార్డ్ (కెప్టెన్), నికోలస్ పూరన్ (వైస్ కెప్టెన్), ఫాబియన్ అలెన్ (ఇంగ్లండ్ టీ20లు మాత్రమే), డారెన్ బ్రావో (ఇంగ్లండ్ టీ20లు మాత్రమే), రోస్టన్ చేజ్, షెల్డన్ కాట్రెల్, డొమినిక్ డ్రేక్స్, షాయ్ హోప్, అకెల్ హోసేన్, జాసన్ హోల్డర్, బ్రాండ్ , కైల్ మేయర్స్, రోవ్మాన్ పావెల్, రొమారియో షెపర్డ్, ఓడియన్ స్మిత్, హేడెన్ వాల్ష్ జూనియర్. చదవండి: ట్రవిస్ హెడ్‌కు కరోనా... మరి యాషెస్ సిరీస్? -
Retirement: బ్రావోకు చేదు అనుభవం.. తృటిలో తప్పించుకున్నాడు
Dwayne Bravo Falls After Pollard Shot Hits Him Viral.. టి20 ప్రపంచకప్ 2021లో భాగంగా వెస్టిండీస్, ఆస్ట్రేలియా మ్యాచ్‌లో విండీస్ ఆల్‌రౌండర్ డ్వేన్ బ్రావోకు తన రిటైర్మెంట్ రోజే చేదు అనుభవం ఎదురైంది. ఏమైందో అని కంగారుపడకండి.. తృటిలో గాయం నుంచి తప్పించుకున్నాడు. మిచెల్ మార్ష్ వేసిన ఇన్నింగ్స్ 15వ ఓవర్ ఐదో బంతిని వెస్టిండీస్ కెప్టెన్ పొలార్డ్ స్ట్రెయిట్ డ్రైవ్ ఆడే ప్రయత్నం చేశాడు. అయితే బంతి వేగంగా దూసుకురాడంతో బ్రావో కిందకు వంగాడు.. ఈ నేపథ్యంలో బ్యాట్ ఎగిరి క్రీజుపై పడింది. బ్రావో కొద్దిలో తప్పించుకున్నాడు.. లేదంటే పెద్ద ప్రమాదం జరిగేది. ఒకవేళ బంతి తగిలి ఉంటే మాత్రం బ్రావోకు తన చివరి మ్యాచ్ చేదు అనుభవంగా మిగిలిపోయి ఉండేది. చదవండి: Dwayne Bravo: అంతర్జాతీయ క్రికెట్‌కు బ్రావో గుడ్ బై.. ఇక చాలు 2004లో డ్వేన్ బ్రావో అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టాడు. వెస్టిండీస్ తరఫున ఇప్పటి వరకు మొత్తంగా అన్ని ఫార్మాట్లు కలిపి 293 మ్యాచ్‌లు ఆడాడు. ఇక 2006లో న్యూజిలాండ్‌తో మ్యాచ్‌తో పొట్టి ఫార్మాట్లో అరంగేట్రం చేసిన బ్రావో.. ఇప్పటివరకు 90 టీ20 మ్యాచ్‌లు ఆడాడు. 1000 పరుగులు చేశాడు. 78 వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు.అదే విధంగా 2012, 2016 టీ20 ప్రపంచకప్ గెలిచిన జట్టులో అతడు సభ్యుడు. ముఖ్యంగా 2012 టోర్నీలో విన్నింగ్ క్యాచ్ అందుకుని జట్టును విజయతీరాలకు చేర్చిన తీరును ఎవరూ మర్చిపోలేరు. చదవండి:Chris Gayle Retirement: సన్ గ్లాసెస్‌తో బరిలోకి.. క్రిస్ గేల్ రిటైర్మెంట్! pic.twitter.com/nOfU94aN1L — Simran (@CowCorner9) November 6, 2021 -
T20 WC WI Vs SL: వాళ్లిద్దరు మినహా.. డిఫెండింగ్ చాంపియన్.. 1,8,9, 2,0,8,2,1
Sri Lanka Beat West Indies By 20 Runs WI Out Of Tourney: టీ20 ప్రపంచకప్-2021 టోర్నీలో డిఫెండింగ్ చాంపియన్ వెస్టిండీస్ పేలవ ప్రదర్శన కొనసాగుతోంది. అబుదాబి వేదికగా శ్రీలంకతో మ్యాచ్‌లో 20 పరుగుల తేడాతో ఓడిపోయి ఈవెంట్ నుంచి అధికారికంగా నిష్క్రమించింది. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న పొలార్డ్ బృందం.. లంకను బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. ఈ క్రమంలో నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి శ్రీలంక 189 పరుగులు చేసింది. ఆండ్రీ రసెల్‌కు రెండు, బ్రావోకు ఒక వికెట్ దక్కాయి. ఇక లక్ష్య ఛేదనలో భాగంగా విండీస్‌కు ఓపెనర్లు క్రిస్ గేల్(1), ఎవిన్ లూయీస్(8) దారుణంగా విఫలమయ్యారు. నికోలస్ పూరన్(46) ఇన్నింగ్స్ చక్కదిద్దే ప్రయత్నం చేయగా... షిమ్రన్ హెట్మెయిర్(81) ఆఖరి వరకు ఒంటరి పోరాటం చేశాడు. అయితే అర్ధ సెంచరీతో మెరిసి అజేయంగా నిలిచినా... జట్టును విజయతీరాలకు చేర్చలేకపోయాడు. రసెల్(2), పొలార్డ్(0), జేసన్ హోల్డర్(8), డ్వేన్ బ్రావో(2), అకేల్ హొసేన్(1) కనీసం పది పరుగులు కూడా చేయలేక చకచకా పెవిలియన్ చేరడంతో రెండుసార్లు పొట్టిఫార్మాట్ ప్రపంచకప్ విజేత అయిన విండీస్‌కు ఓటమి తప్పలేదు. బినుర ఫెర్నాండో రెండు వికెట్లు, దుష్మంత చమీర ఒకటి, చమిక కరుణరత్నే రెండు, కెప్టెన్ దసున్ షనక ఒకటి, వనిందు హసరంగ రెండు వికెట్లు తీసి వెస్టిండీస్ పతనాన్ని శాసించారు. ఫలితంగా యువ ఆటగాళ్లతో కూడిన శ్రీలంక జట్టు చేతిలో డిఫెండింగ్ చాంపియన్ 20 పరుగుల తేడాతో ఓటమిపాలై నాకౌట్ దశలోనే చేతులెత్తేసింది. ఇక ఇప్పటికే 5 మ్యాచ్‌లలో మూడింటిలో ఓటమితో టోర్నీ నుంచి నిష్క్రమించిన శ్రీలంక.. విండీస్‌కు కూడా తమలాంటి చేదు అనుభవాన్ని మిగిల్చింది. చరిత్ అసలంక(41 బంతుల్లో 68 పరుగులు, 8 ఫోర్లు, ఒక సిక్సర్) ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు. స్కోర్లు: శ్రీలంక- 189/3 (20) వెస్టిండీస్- 169/8 (20) చదవండి: AUS VS BAN: టీ20 ప్రపంచకప్‌లో సరికొత్త రికార్డు సృష్టించిన ఆస్ట్రేలియా T20 WC Aus Vs Ban: బంగ్లాదేశ్ మరో చెత్త రికార్డు.. కెన్యా, అఫ్గనిస్తాన్ సరసన T20 WC 2021: సెమీస్ చేరడం కష్టమే.. కానీ అదొక్కటే దారి var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_1981407197.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
T20 World Cup WI Vs BAN: వరుస పరాజయాలు... టోర్నీ నుంచి అవుట్!
వీరాభిమానుల ఆశలు ఆవిరి చేస్తూ... ఉత్కంఠ పోరులో తడబడిన బంగ్లాదేశ్ టి20 ప్రపంచకప్‌లో వరుసగా మూడో పరాజయం చవిచూసింది. కీలక సమయంలో బౌలింగ్‌లో... ఆ తర్వాత బ్యాటింగ్‌లో చేతులెత్తేసిన బంగ్లాదేశ్ జట్టు మూల్యం చెల్లించుకుంది. వెస్టిండీస్ చేతిలో మూడు పరుగుల తేడాతో ఓడిన బంగ్లాదేశ్ ఈ మెగా ఈవెంట్లో సెమీఫైనల్ చేరే అవకాశాలను చేజార్చుకుంది. Bangladesh Lost To West Indies By 3 Runs Out Tourney: అత్యున్నత వేదికపై మంచి ఫలితాలు రావాలంటే ఆద్యంతం నిలకడగా రాణించాల్సి ఉంటుంది. లేదంటే ఎంతటి మేటి జట్టుకైనా భంగపాటు తప్పదు. వీరాభిమానులకు కొదువలేని బంగ్లాదేశ్ జట్టు అంచనాలను అందుకోవడంలో విఫలమై టి20 ప్రపంచకప్ సెమీఫైనల్ రేసు నుంచి నిష్క్రమించింది. సెమీస్ ఆశలు సజీవంగా ఉండాలంటే తప్పక గెలవాల్సిన చోట బంగ్లాదేశ్ చతికిలపడింది. ఈసారికి సూపర్–12తోనే సరిపెట్టుకోనుంది. చివరి బంతికి 4 పరుగులు అవసరం గ్రూప్–1 లో శుక్రవారం షార్జాలో జరిగిన మ్యాచ్‌లో డిఫెండింగ్ చాంపియన్ వెస్టిండీస్ మూడు పరుగుల తేడా తో బంగ్లాదేశ్‌ను ఓడించి ఎట్టకేలకు ఈ టోర్నీలో గెలుపు బోణీ కొట్టింది. విజయం సాధించాలంటే ఆఖరి ఓవర్లో 13 పరుగులు చేయాల్సిన బంగ్లాదేశ్ 9 పరుగులు మాత్రమే చేసి ఓడిపోయింది. బంగ్లాదేశ్ గెలుపునకు చివరి బంతికి 4 పరుగులు అవసరమయ్యాయి. విండీస్ ఆల్‌రౌండర్ రసెల్ వేసిన బంతిపై క్రీజులో ఉన్న బంగ్లాదేశ్ కెప్టెన్ మహ్ముదుల్లా ఒక్క పరుగూ తీయలేకపోయాడు. దాంతో విండీస్ విజయం, బంగ్లాదేశ్ ఓటమి ఖాయమైంది. తొలుత బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ 20 ఓవర్లలో 7 వికెట్లు నష్టపోయి 142 పరుగులు చేసింది. నికోలస్ పూరన్ దూకుడు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ నికోలస్ పూరన్ (22 బంతుల్లో 40; 1 ఫోర్, 4 సిక్స్‌లు) దూకుడుగా ఆడగా... తొలి టి20 మ్యాచ్ ఆడిన రోస్టన్ చేజ్ (46 బంతుల్లో 39; 2 ఫోర్లు) కీలక ఇన్నింగ్స్ ఆడాడు. ఛేదనలో బంగ్లాదేశ్ 20 ఓవర్లలో 5 వికెట్లకు 139 పరుగులు చేసింది. లిటన్ దాస్ (43 బంతుల్లో 44; 4 ఫోర్లు), కెప్టెన్ మహ్ముదుల్లా (24 బంతుల్లో 31 నాటౌట్; 2 ఫోర్లు, 1 సిక్స్) పోరాడినా జట్టును విజయతీరానికి చేర్చలేకపోయారు. స్కోరు వివరాలు వెస్టిండీస్ ఇన్నింగ్స్: గేల్ (బి) మెహదీ హసన్ 4; లూయిస్ (సి) ముష్ఫికర్ (బి) ముస్తఫిజుర్ 6; రోస్టన్ చేజ్ (బి) ఇస్లామ్ 39; హెట్‌మైర్ (సి) సౌమ్య సర్కార్ (బి) మెహదీ హసన్ 9; పొలార్డ్ (నాటౌట్) 14; రసెల్ (రనౌట్) 0; పూరన్ (సి) నైమ్ (బి) ఇస్లామ్ 40; బ్రావో (సి) సౌమ్య సర్కార్ (బి) ముస్తఫిజుర్ 1; హోల్డర్ (నాటౌట్) 15; ఎక్స్‌ట్రాలు: 14; మొత్తం (20 ఓవర్లలో 7 వికెట్లకు) 142. వికెట్ల పతనం: 1–12, 2–18, 3–32, 4–62, 5–119, 6–119, 7–123. బౌలింగ్: మెహదీ హసన్ 4–0–27–2, తస్కిన్ అహ్మద్ 4–0–17–0, ముస్తఫిజుర్ 4–0–43–2, షోరిఫుల్ 4–0–20–2, షకీబ్ 4–0–28–0. బంగ్లాదేశ్ ఇన్నింగ్స్: నైమ్ (బి) హోల్డర్ 17; షకీబ్ (సి) హోల్డర్ (బి) రసెల్ 9; లిటన్ దాస్ (సి) హోల్డర్ (బి) బ్రావో 44; సౌమ్య సర్కార్ (సి) గేల్ (బి) హొసీన్ 17; ముష్ఫికర్ (బి) రాంపాల్ 8; మహ్ముదుల్లా (నాటౌట్) 31; అఫిఫ్ (నాటౌట్) 2; ఎక్స్‌ట్రాలు 11; మొత్తం (20 ఓవర్లలో 5 వికెట్లకు) 139. వికెట్ల పతనం: 1–21, 2–29, 3–60, 4–90, 5–130. బౌలింగ్: రవి రాంపాల్ 4–0– 25–1, హోల్డర్ 4–0–22–1, రసెల్ 4–0– 29–1, హొసీన్ 4–0–24–1, బ్రావో 4–0– 36–1. -
SA Vs WI: రెండుసార్లు విజేత.. 8 వికెట్ల తేడాతో చిత్తు.. అరె ఏంట్రా ఇది?
T20 World Cup 2021: రెండుసార్లు టి20 ప్రపంచకప్ విశ్వవిజేత, డిఫెండింగ్ చాంపియన్ వెస్టిండీస్ ఈసారి మెగా టోర్నీలో అందరికంటే ముందే నిష్క్రమించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇంగ్లండ్‌తో తొలి మ్యాచ్‌లో 55కే కుప్పకూలిన విండీస్ ఈసారి అంతకంటే మెరుగ్గా ఆడినా అదీ ఓటమి నుంచి తప్పించలేకపోయింది. వరుసగా రెండు ఓటముల తర్వాత పేలవ రన్‌రేట్‌తో నిలిచిన పొలార్డ్ బృందం ముందుకెళ్లాలంటే అద్భుతాలు జరగాలి. మరోవైపు గత ఓటమి నుంచి పాఠం నేర్చుకున్న దక్షిణాఫ్రికా పదునైన ఆటతో ప్రత్యరి్థని పడగొట్టి కీలక పాయింట్లు తమ ఖాతాలో వేసుకుంది. నోర్జే, ప్రిటోరియస్ బౌలింగ్‌తో పాటు బ్యాటింగ్‌లో మార్క్రమ్ మెరుపులు సఫారీలను గెలిపించాయి. South Africa Beat West Indies By 8 Wickets: టి20 ప్రపంచకప్‌లో దక్షిణాఫ్రికాకు తొలి విజయం దక్కింది. దుబాయ్‌లో మంగళవారం జరిగిన గ్రూప్–1 మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా 8 వికెట్ల తేడాతో వెస్టిండీస్‌పై ఘన విజయం సాధించింది. ముందుగా విండీస్ 20 ఓవర్లలో 8 వికెట్లకు 143 పరుగులు చేసింది. ఎవిన్ లూయిస్ (35 బంతుల్లో 56; 3 ఫోర్లు, 6 సిక్సర్లు) అర్ధ సెంచరీ చేయగా...‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ నోర్జే (1/14), ప్రిటోరియస్ (3/17) ప్రత్యర్థిని దెబ్బ తీశారు. అనంతరం దక్షిణాఫ్రికా 18.2 ఓవర్లలో 2 వికెట్లకు 144 పరుగులు చేసి గెలిచింది. మార్క్రమ్ (26 బంతుల్లో 51 నాటౌట్; 2 ఫోర్లు, 4 సిక్సర్లు), వాన్ డర్ డసెన్ (51 బంతుల్లో 43 నాటౌట్; 3 ఫోర్లు), రీజా హెన్డ్రిక్స్ (30 బంతుల్లో 39; 4 ఫోర్లు, 1 సిక్స్) కీలక ఇన్నింగ్స్ ఆడారు. var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_1971406958.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); గేల్ విఫలం... ఓపెనర్ లూయిస్ విధ్వంసకర బ్యాటింగ్‌తో చెలరేగిపోగా... మిగతా ఆటగాళ్లంతా విఫలం కావడంతో విండీస్ తక్కువ స్కోరుకే పరిమితమైంది. ముఖ్యంగా రెండో ఓపెనర్ లెండిల్ సిమన్స్ (35 బంతుల్లో 16;) అనూహ్యంగా బంతులను వృథా చేయడం కూడా జట్టును దెబ్బ తీసింది. ఒక ఎండ్‌లో లూయిస్ మెరుపు బ్యాటింగ్‌తో తొలి వికెట్‌కు 73 పరుగుల పార్ట్నర్షిప్ నమోదైనా, ఇందులో లూయిస్ ఒక్కడే 56 పరుగులు సాధించాడు. రబడ ఓవర్లో వరుసగా ఫోర్, సిక్స్ కొట్టిన అతను... మార్క్రమ్ ఓవర్లో వరుస బంతుల్లో 6, 6, 4 బాదాడు. షమ్సీ బౌలింగ్‌లో కొట్టిన మరో భారీ సిక్స్‌తో 32 బంతుల్లోనే లూయిస్ అర్ధసెంచరీ పూర్తయింది. ఎట్టకేలకు మహరాజ్ బౌలింగ్‌లో లూయిస్ వెనుదిరగడంతో తొలి వికెట్ భాగస్వామ్యానికి తెర పడింది. పూరన్ (12) విఫలం కాగా, తన 75 మ్యాచ్‌ల అంతర్జాతీయ కెరీర్లో ఎన్నడూ మూడో స్థానంకంటే దిగువన ఆడని క్రిస్ గేల్ (12) ఈ మ్యాచ్‌లోనే తొలిసారి నాలుగో స్థానంలో బ్యాటింగ్ దిగి ప్రభావం చూపలేకపోయాడు. ఆ తర్వాత విండీస్ బ్యాటింగ్ పూర్తిగా తడబడింది. చివర్లో పొలార్డ్ (20 బంతుల్లో 26; 2 ఫోర్లు, 1 సిక్స్) రాణించాడు. ఆఖరి 3 ఓవర్లలోనే 5 వికెట్లు కోల్పోయిన విండీస్ 22 పరుగులే జోడించింది. కీలక భాగస్వామ్యాలు... సాధారణ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో దక్షిణాఫ్రికా రనౌట్ రూపంలో కెప్టెన్ బవుమా (2) వికెట్ కోల్పోయింది. అయితే ఆ తర్వాతి రెండు అర్ధ సెంచరీ భాగస్వామ్యాలు సఫారీలను గెలిపించాయి. ముందుగా హెన్డ్రిక్స్, డసెన్ కలిసి రెండో వికెట్‌కు 57 పరుగులు (50 బంతుల్లో) జోడించారు. ఎక్కడా తొందరపాటు ప్రదర్శించకుండా వీరిద్దరు జాగ్రత్తగా ఆడుతూ ఇన్నింగ్స్‌ను నడిపించారు. హెట్‌మైర్ అద్భుత క్యాచ్‌తో హెన్డ్రిక్స్ ఆట ముగిసినా ...ఆ తర్వాత వచ్చిన మార్క్రమ్ చూడచక్కటి షాట్లతో దూసుకుపోయాడు. 4 భారీ సిక్సర్లు సహా 25 బంతుల్లోనే ఫిఫ్టీ చేసిన అతను, తర్వాతి బంతికే సింగిల్‌తో మ్యాచ్‌ను ముగించాడు. వీరిద్దరు మూడో వికెట్‌కు అజేయంగా 83 పరుగులు (54 బంతుల్లో) జత చేశారు. స్కోరు వివరాలు వెస్టిండీస్ ఇన్నింగ్స్: సిమన్స్ (బి) రబడ 16; లూయిస్ (సి) రబడ (బి) మహరాజ్ 56; పూరన్ (సి) మిల్లర్ (బి) మహరాజ్ 12; గేల్ (సి) క్లాసెన్ (బి) ప్రిటోరియస్ 12; పొలార్డ్ (సి) డసెన్ (బి) ప్రిటోరియస్ 26; రసెల్ (బి) నోర్జే 5; హైట్‌మైర్ (రనౌట్) 1; బ్రావో (నాటౌట్) 8; వాల్‡్ష (సి) హెన్డ్రిక్స్ (బి) ప్రిటోరియస్ 0; హొసీన్ (నాటౌట్) 0; ఎక్స్‌ట్రాలు 7, మొత్తం (20 ఓవర్లలో 8 వికెట్లకు) 143. వికెట్ల పతనం: 1–73, 2–87, 3–89, 4–121, 5–132, 6–133, 7–137, 8–137. బౌలింగ్: మార్క్రమ్ 3–1–22–0, రబడ 4–0–27–1, నోర్జే 4–0–14–1, మహరాజ్ 4–0–24–2, షమ్సీ 3–0–37–0, ప్రిటోరియస్ 2–0–17–3. దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్: బవుమా (రనౌట్) 2; హెన్డ్రిక్స్ (సి) హెట్‌మైర్ (బి) హొసీన్ 39; వాన్ డర్ డసెన్ (నాటౌట్) 43; మార్క్రమ్ (నాటౌట్) 51; ఎక్స్‌ట్రాలు 9, మొత్తం (18.2 ఓవర్లలో 2 వికెట్లకు) 144. వికెట్ల పతనం: 1–4, 2–61. బౌలింగ్: హొసీన్ 4–0–27–1, రవి రాంపాల్ 3–0–22–0, రసెల్ 3.2–0–36–0, హేడెన్ వాల్‡్ష 3–0–26–0, బ్రావో 4–0–23–0, పొలార్డ్ 1–0–9–0. చదవండి: T20 WC 2021: వారెవ్వా హసన్ అలీ.. అయ్యో విలియమ్సన్ T20 World Cup 2021 Pak Vs NZ: రెండు మేటి జట్లపై విజయాలు.. సెమీస్ దారిలో పాక్ .. South Africa got their #T20WorldCup 2021 campaign back on track after a commanding victory against West Indies 💪 https://t.co/YriZdtyUev — T20 World Cup (@T20WorldCup) October 26, 2021 -
T20 World Cup: అతడొక విధ్వంసకర బ్యాట్స్‌మెన్.. ఇక కోహ్లి: రషీద్ ఖాన్
మరికొన్ని రోజుల్లో టీ20 వరల్డ్‌కప్ మొదలుకానుంది. యూఏఈ, ఒమన్ వేదికగా జరుగనున్న పొట్టి ఫార్మాట్ మెగా టోర్నీకి సర్వం సిద్ధమవుతోంది. ఈ క్రమంలో.. ఇప్పటికే పలు జట్ల ఆటగాళ్లు యూఏఈకి పయనమయ్యారు. ఇక క్రికెట్ ప్రేమికులు ఎంతగానో ఎదురుచూస్తున్న ఈ ఐసీసీ ఈవెంట్‌కు సంబంధించిన ప్రతీ వార్త ఆసక్తికరంగా మారింది. ఈ నేపథ్యంలో అఫ్గనిస్తాన్ లెగ్ స్పిన్నర్ రషీద్ ఖాన్ టీ20 ఫార్మాట్లో తనకు ఇష్టమైన ఐదుగురు ఆటగాళ్ల పేర్లను వెల్లడించాడు. ఇందులో ఇద్దరు టీమిండియా ఆటగాళ్లకు, ఒక న్యూజిలాండ్, వెస్టిండీస్ క్రికెటర్, దక్షిణాఫ్రికా స్టార్‌కు చోటిచ్చాడు. వారు ఎవరంటే! విరాట్ కోహ్లి.. టీమిండియా కెప్టెన్, ఐపీఎల్ ఫ్రాంఛైజీ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు సారథిగా విరాట్ కోహ్లి పేరిట పలు రికార్డులు ఉన్నాయి. టీ20 ఫార్మాట్లో మొత్తంగా అతడు.. 10,136 పరుగులు చేశాడు. అంతర్జాతీయ టీ20 మ్యాచ్‌లలో 3159 పరుగులు సాధించాడు. ఈ నేపథ్యంలో రషీద్ ఖాన్.. కోహ్లి గురించి మాట్లాడుతూ... ‘‘ఎలాంటి వికెట్‌పై అయినా ధీటుగా నిలబడి.. అత్యుత్తమ ప్రదర్శన కనబరచగల ఆటగాడు’’అని అభివర్ణించాడు. కేన్ విలియమ్సన్(న్యూజిలాండ్) న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్.. టీ20 ఫార్మాట్లో 5429 పరుగులు చేశాడు. అంతర్జాతీయ టీ20 మ్యాచ్‌లలో 125.08 స్ట్రైక్‌రేటుతో 1805 రన్స్ సాధించాడు. ఇక ఐపీఎల్ ఫ్రాంఛైజీ సన్‌రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ విలియమ్సన్ సహచర ఆటగాడైన రషీద్ ఖాన్... కివీస్ సారథి గురించి చెబుతూ తాను ప్రశాంతంగా ఉంటూ.. జట్టును కూడా కూల్‌గా ముందుకు నడిపిస్తాడని చెప్పుకొచ్చాడు. ఏబీ డివిల్లియర్స్(దక్షిణాఫ్రికా) సౌతాఫ్రికా స్టార్ ఏబీ డివిల్లియర్స్‌ను విధ్వంసకర బ్యాట్స్‌మెన్‌గా రషీద్ ఖాన్ అభివర్ణించాడు. ఎలాంటి పరిస్థితుల్లోనైనా, ఎదురుగా ఎలాంటి బౌలర్ ఉన్నా విరుచుకుపడటమే తనకు అలవాటు అని ప్రశంసలు కురిపించాడు. తనలాంటి బ్యాటర్ జట్టులో ఉండాలని ప్రతీ కెప్టెన్ కోరుకుంటాడని కితాబిచ్చాడు. టీ20 ఫార్మాట్లో మొత్తంగా 9424 పరుగులు చేసిన ఏబీడీ... అంతర్జాతీయ టీ20 క్రికెట్లో 1672 రన్స్ చేశాడు. ఐపీఎల్లో ఏబీ... ఆర్సీబీకి ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. కీరన్ పొలార్డ్(వెస్టిండీస్) విండీస్ కెప్టెన్ కీరన్ పొలార్డ్‌ను తన ఫేవరెట్ ఆటగాళ్లలో ఒకడిగా రషీద్ ఖాన్ పేర్కొన్నాడు. తన జట్టులో ఆల్‌రౌండర్‌గా తనకు స్థానం కల్పిస్తానన్నాడు. కాగా టీ20 ఫార్మాట్లో మొత్తంగా... 11,236 పరుగులు చేసిన పొలార్డ్... అంతర్జాతీయ టీ20 క్రికెట్లో 1378 పరుగులు చేశాడు. అంతేగాకుండా పొట్టి ఫార్మాట్లో ఓవరాల్‌గా 300 వికెట్లు తన పేరిట లిఖించుకున్నాడు. 2012లో టీ20 వరల్డ్‌కప్ గెలిచిన విండీస్ జట్టులో సభ్యుడిగా, 2016లో జట్టును విన్నర్‌గా నిలిపిన కెప్టెన్‌గా ప్రశంసలు అందుకున్నాడు. హార్దిక్ పాండ్యా(టీమిండియా) మరో ఆల్‌రౌండర్‌గా భారత ఆటగాడు హార్దిక్ పాండ్యాను ఎంచుకున్నాడు రషీద్ ఖాన్. పొలార్డ్, పాండ్యా వలె బ్యాటింగ్, బౌలింగ్‌లో రాణించే వాళ్లు జట్టులో ఉంటే ప్రయోజనకరంగా ఉంటుందని పేర్కొన్నాడు. వారిద్దరు ఉన్నారంటే కెప్టెన్‌కు పని కాస్త సులువు అవుతుందని చెప్పుకొచ్చాడు. కాగా వీరిద్దరు ఐపీఎల్ ఫ్రాంఛైజీ ముంబై ఇండియన్స్ జట్టులో సభ్యులు అన్న సంగతి తెలిసిందే. ఇక హార్దిక్ పాండ్యా పొట్టి ఫార్మాట్లో మొత్తంగా 2728 పరుగులు చేయగా... అంతర్జాతీయ టీ20 క్రికెట్లో 484 రన్స్ సాధించాడు. చదవండి: T20 World Cup: పొలార్డ్ టాప్-5 ఫేవరెట్ లిస్టు.. ఆశ్చర్యకరంగా తను కూడా! -
T20 World Cup: పొలార్డ్ టాప్-5 ఫేవరెట్ లిస్టు.. ఆశ్చర్యకరంగా తను కూడా!
Kieron Pollard Top Five T20 Players: టీ20 వరల్డ్‌కప్ ఆరంభం కానున్న నేపథ్యంలో వెస్టిండీస్ కెప్టెన్ కీరన్ పొలార్డ్ పొట్టి ఫార్మాట్లో తనకు ఇష్టమైన ఐదుగురు ఆటగాళ్ల పేర్లను ప్రకటించాడు. ఇందులో ఓ విధ్వంసకర ఓపెనర్, మాజీ వికెట్ కీపర్ బ్యాటర్, ఆల్‌రౌండర్, మాజీ స్పిన్నర్, మాజీ పేసర్‌కు చోటిచ్చాడు. మరి.. కీరన్ పొలార్డ్ ఫేవరెట్ టాప్-5 టీ20 క్రికెటర్స్ ఎవరంటే..! క్రిస్ గేల్(వెస్టిండీస్), లసిత్ మలింగ(శ్రీలంక), సునిల్ నరైన్(వెస్టిండీస్), ఎంఎస్ ధోని(ఇండియా), కీరన్ పొలార్డ్(వెస్టిండీస్). అవును.. తనకు ఇష్టమైన జాబితాలో ముగ్గురూ విండీస్ ఆటగాళ్లు.. ముఖ్యంగా అందులో తన పేరును కూడా పొలార్డ్ పేర్కొనడం విశేషం. క్రిస్‌గేల్(Chris Gayle) విధ్వంసకర ఇన్నింగ్స్‌తో యూనివర్స్ బాస్‌గా పేరొందిన క్రిస్ గేల్.. టీ20 ఫార్మాట్లో ఇప్పటి వరకు 446 మ్యాచ్‌లు ఆడి... 14261 పరుగులు చేశాడు. సగటు 36.94. స్ట్రైక్‌రేటు.. 145.87. ఇందులో 22 శతకాలు ఉన్నాయి. అత్యధిక స్కోరు 175(నాటౌట్). రెండుసార్లు టీ20 వరల్డ్‌కప్(2012, 2016) గెలిచిన విండీస్ జట్టులో ఈ సిక్సర్ల వీరుడు సభ్యుడిగా ఉన్నాడు. లసిత్ మలింగ(Lasith Malinga) యార్కర్ల కింగ్‌గా పేరొందిన లసిత్ మలింగ... తనదైన శైలిలో బంతులు సంధించి ఎంతో మంది దిగ్గజ బ్యాటర్లను పెవిలియన్‌కు పంపిన సంగతి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. టీ20 ఫార్మాట్లో 295 మ్యాచ్‌లలో 390 వికెట్లు తీసిన మలింగ.. 2014లో టైటిల్ గెలిచిన శ్రీలంక జట్టులో సభ్యుడు. ఇక ఆటకు స్వస్తి పలికిన మలింగ.. తాను అన్ని ఫార్మాట్ల నుంచి వైదొలగుతున్నట్లు సెప్టెంబరు 15న ప్రకటించాడు. సునిల్ నరైన్(Sunil Narine) స్పిన్ మాయాజాలంతో ఎంతో బ్యాటర్లకు ముచ్చెమటలు పట్టించిన విండీస్ ఆటగాడు సునిల్ నరైన్... పొట్టి ఫార్మాట్లో అత్యధిక వికెట్లు తీసిన మూడో ఆటగాడిగా గుర్తింపు పొందాడు. ఇమ్రాన్ తాహిర్, డ్వేన్ బ్రావో తర్వాతి స్థానాన్ని ఆక్రమించాడు. ఇటీవలి కాలంలో బ్యాటర్(లీగ్)గా కూడా సత్తా చాటుతున్నాడు. ఇక విండీస్ 2012లో టీ20 వరల్డ్‌కప్ గెలవడంలో నరైన్ కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. ఆ టోర్నీలో ఆరు మ్యాచ్‌లలో 5.63 ఎకానమీతో 9 వికెట్లు తీశాడు. శ్రీలంకతో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో 3 వికెట్లు పడగొట్టాడు. ఎంఎస్ ధోని(MS Dhoni) టీమిండియా మాజీ కెప్టెన్, మిస్టర్ కూల్, బెస్ట్ ఫినిషర్, అత్యుత్తమ వికెట్ కీపర్.. ఇలా ధోని గురించి ఎంత చెప్పినా తక్కువే. భారత్‌కు మూడు ఐసీసీ టైటిళ్లు సాధించిపెట్టిన సారథి. ముఖ్యంగా తొట్టతొలి టీ20 వరల్డ్‌కప్-2007 గెలిచిన జట్టుకు కెప్టెన్. అన్ని ఫార్మాట్లలోనూ సారథిగా తనదైన ముద్ర వేసిన ధోని... టీ20 క్రికెట్లో 185 క్యాచ్‌లు, 84 స్టంపింగ్‌లు చేసిన వికెట్‌కీపర్‌గా పేరొందాడు. 6861 పరుగులు(స్ట్రైక్ రేటు- 134.82) చేసి బ్యాటర్‌గానూ సత్తా చాటాడు. కీరన్ పొలార్డ్(Kieron Pollard) ఆరంభంలో తడబడినా.. రానురాను తనదైన విధ్వంసకర ఇన్నింగ్స్‌తో టీ20 క్రికెట్‌కే పర్యాయపదంగా మారాడు పొలార్డ్. గేల్ తర్వాత అంతటి హిట్టర్‌గా పేరొందాడు. టీ20 ఫార్మాట్లో 298 వికెట్లు తీసిన ఈ ఆల్‌రౌండర్.. 2012లో టీ20 వరల్డ్‌కప్ గెలిచిన విండీస్ జట్టులో సభ్యుడిగా, 2016లో జట్టును విజేతగా నిలిపిన కెప్టెన్‌గా ప్రశంసలు అందుకున్నాడు. డిఫెండింగ్ చాంపియన్‌గా ఈసారి బరిలోకి దిగనున్న వెస్టిండీస్ జట్టుకు అతడే సారథి అని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. విండీస్ టీ20 జట్టు ఇదే: కీరన్ పొలార్డ్ (కెప్టెన్), నికోలస్ పూరన్ (వైస్ కెప్టెన్), క్రిస్ గేల్, ఫాబియన్ అలెన్, డ్వేన్ బ్రావో, రోస్టన్ చేజ్, ఆండ్రీ ఫ్లెచర్, షిమ్రన్ హెట్‌మైర్, ఎవిన్ లూయిస్, ఒబేడ్ మెక్కాయ్, రవి రాంపాల్, ఆండ్రీ రసెల్, లెండెల్ సిమన్స్, ఒస్నేన్ థామస్, హెడెన్ వాల్ష్ జూనియర్ స్టాండ్ బై ప్లేయర్లు: జాసన్ హోల్డర్, డారెన్ బ్రావో, షెల్డన్ కాట్రెల్, ఏకేల్ హోసిన్. -వెబ్‌డెస్క్ చదవండి: T20 World Cup 2021: ఈ ఐదు తొలిసారిగా.. సరికొత్తగా.. ఆసక్తికర విశేషాలు -
పొలార్డ్ కళ్లు చెదిరే త్రో.. ధావన్ పేరిట చెత్త రికార్డు
Shikar Dhawan Run Out By Pollard Stunning Throw.. ఐపీఎల్ 2021 సెకండ్‌ఫేజ్‌లో భాగంగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ ఆల్‌రౌండర్ కీరన్ పొలార్డ్ కళ్లు చెదిరే త్రోతో మెరిశాడు. దీంతో శిఖర్ ధావన్ రనౌట్ కావడంతో పాటు ఐపీఎల్ చరిత్రలో చెత్త రికార్డు నమోదు చేశాడు. జయంత్ యాదవ్ వేసిన ఇన్నింగ్స్ రెండో ఓవర్ ఆఖరి బంతిని ధావన్ మిడాన్ దిశగా షాట్ ఆడాడు. అయితే రిస్క్ అని తెలిసినా ధవన్ అనవసర సింగిల్‌కు ప్రయత్నించాడు. ఇంకేముంది అక్కడే ఉన్న పొలార్డ్ బంతిని అందుకొని డైరెక్ట్ త్రో విసిరాడు. ధవన్ క్రీజులోకి చేరేలోపే బంతి వికెట్లను గిరాటేయడంతో రనౌట్ అయ్యాడు. కాగా ధవన్ రనౌట్ల విషయంలో ఒక చెత్త రికార్డును మూటగట్టుకున్నాడు. ఇప్పటివరకు ఐపీఎల్లో 16 సార్లు రనౌట్ అయిన ధావన్.. గంభీర్‌తో సమానంగా తొలిస్థానంలో నిలిచాడు. ఆ తర్వాత సురేశ్ రైనా 15 సార్లు రనౌట్‌తో రెండో స్థానంలో.. అంబటి రాయుడు, డివిలియర్స్‌లు 13 సార్లు రనౌట్ అయి మూడవ స్థానంలో నిలిచారు. ఇక మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ విజయాన్ని అందుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 129 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ 6 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేధించింది. ఈ విజయంతో ఢిల్లీ క్యాపిటల్స్ ప్లే ఆఫ్ బెర్తును దాదాపు ఖరారు చేసుకుంది. మరోవైపు ఓటమితో ముంబై ఇండియన్స్ ప్లే ఆఫ్ అవకాశాలను సంక్లిష్టం చేసుకుంది. That was an Amazing Direct hit from Polly🔥#MIvsDC #MI #IPL2021 pic.twitter.com/BCFbwbSsou — MaHi 💔 (@MaHi_Shreyasian) October 2, 2021 -
టీ20ల్లో రికార్డు సృష్టించిన పొలార్డ్...
Kieron Pollard Scripts History In T20 Cricket: టీ20ల్లో వెస్టిండీస్ విద్వంసకర ఆల్ రౌండర్ కిరాన్ పొలార్డ్ అరుదైన ఘనత సాధించాడు. టీ20 క్రికెట్లో 300 వికెట్లతో పాటు పది వేలు పరగులు సాధించిన ఏకైక ఆటగాడుగా పొలార్డ్ రికార్డు సృష్టించాడు. ఐపీఎల్ సెకెండ్ ఫేజ్‌లో భాగంగా ఆదివారం పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఇన్నింగ్స్ 7 ఓవర్ వేసిన పొలార్డ్.. ఓకే ఓవర్లోయూనివర్స్ల్ బాస్ క్రిస్ గేల్, కెప్టెన్ కెఎల్ రాహుల్ ను పెవిలియన్‌కు పంపి ఈ ఘనతను సాధించాడు. అయితే కాగా ఇప్పటి వరకు ఐపీఎల్లో 175 మ్యాచ్‌లు ఆడిన పొలార్డ్ 2037 పరుగులు, 65 వికెట్లు పడగొట్టాడు. కాగా ఐపీఎల్ రెండో దశలో వరుస అపజయాలతో డీలా పడ్డ ముంబై.. పంజాబ్‌పై విజయంతో తిరిగి ట్రాక్‌లో పడింది. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. ముందుగా బ్యాటింగ్‌కు దిగిన పంజాబ్ 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 135 పరుగులు చేసింది. మార్క్రమ్ 42 పరుగులు చేసి టాప్ స్కోరర్‌గా నిలిచాడు. అనంతరం 136 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబై 19 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి చేధించింది. సౌరభ్ తివారి (37 బంతుల్లో 45; 3 ఫోర్లు, 2 సిక్సర్లు), హార్దిక్ పాండ్యా (30 బంతుల్లో 40 నాటౌట్; 4 ఫోర్లు, 2 సిక్సర్లు) కీలక ఇన్నింగ్స్‌లతో జట్టును గెలిపించారు. చదవండి: Chris Gayle: వయసు మీద పడుతున్న సింహం లాంటివాడే.. కానీ -
డివిలియర్స్ కెప్టెన్ కాలేడు.. ఆ ముగ్గురికే చాన్స్
RCB New Captain After Virat Kohli.. ఐపీఎల్ 2021 తర్వాత విరాట్ కోహ్లి ఆర్సీబీ కెప్టెన్సీ పదవి నుంచి పక్కకు తప్పుకోనున్న సంగతి తెలిసిందే. ఈ మేరకు ఇప్పటికే కోహ్లి కెప్టెన్సీ విషయాన్ని ట్విటర్ ద్వారా తెలిపాడు. అయితే కోహ్లి తర్వాత ఆర్సీబీకి కెప్టెన్ ఎవరు వ్యవహరిస్తే బాగుంటుందనే దానిపై టీమిండియా మాజీ క్రికెటర్.. క్రికెట్ ఎక్స్పర్ట్ సంజయ్ మంజ్రేకర్ స్పందించాడు. ''కోహ్లి పక్కకు తప్పుకున్న తర్వాత ప్రస్తుతం వైస్‌కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న ఏబీ డివిలియర్స్‌కు కెప్టెన్ అయ్యే అవకాశాలు లేవు. అతను జట్టును సరైన రీతిలో నడిపించలేడు. అంతేగాక వచ్చే ఐపీఎల్లో అతను ఆడే చాన్సులు కూడా చాలా తక్కువ. నా దృష్టిలో పొలార్డ్ ఆర్సీబీ కెప్టెన్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. వచ్చే వేలంలో అతను ముంబై ఇండియన్స్‌ను నుంచి రిలీవ్ అయితే మాత్రం ఆర్సీబీ అతని కొనుగోలుపై ఆసక్తి చూపుతుంది. అంతేగాక ఐపీఎల్లో రోహిత్ శర్మ గైర్హాజరీలో పలుమార్లు కెప్టెన్‌గా వ్యవహరించిన పొలార్డ్ ముంబైకి మంచి విజయాలు అందించాడు. అతని అనుభవం ఎంతగానే ఉపయోగపడే అవకాశం ఉంది. చదవండి: Gautam Gambhir: చెన్నై ప్లేఆఫ్స్ చేరాక ధోని ఆ స్థానంలో బ్యాటింగ్‌కు రావాలి! ఒకవేళ అతను కాదంటే తర్వాత కెప్టెన్ అయ్యే అవకాశాలు సూర్యకుమార్ లేదా డేవిడ్ వార్నర్‌లకు ఉంది. వచ్చే వేలంలో సూర్యకుమార్.. వార్నర్‌ల కోసం కచ్చితంగా పోటీ ఉండే అవకాశం ఉంది.'' అంటూ పేర్కొన్నాడు. మరోవైపు దక్షిణాఫ్రికా మాజీ క్రికెటర్ డేల్ స్టెయిన్ మాత్రం కేఎల్ రాహుల్‌కు ఆర్సీబీ కెప్టెన్ అయ్యే అవకాశాలు ఉన్నాయని చెప్పుకొచ్చాడు. దీంతోపాటు డివిలియర్స్ కెప్టెన్ కాలేడని మంజ్రేకర్ చేసిన వ్యాఖ్యలను స్టెయిన్ సమర్థించడం విశేషం. చదవండి: Kohli Big Six: కోహ్లి కొడితే మాములుగా ఉంటుందా.. స్టేడియం అవతలే -
పొలార్డ్‌కే దమ్కీ ఇద్దామనుకున్నాడు.. తర్వాతి ఓవర్ చూసుకుంటా
Kieron Pollard Vs Prasidh Krishna.. టి20 అంటేనే క్షణాల్లో మారిపోయే ఆట.. కసిగా కొట్టాలని బ్యాటర్ భావిస్తే.. పరుగులు ఇవ్వకూడదని బౌలర్ అనుకుంటాడు. ఈ సందర్భంగా వారిద్దరి మధ్య చోటుచేసుకునే సన్నివేశాలు ఆసక్తికరంగా ఉంటాయి. తాజాగా ఐపీఎల్ 2021 సెకండ్‌ఫేజ్‌లో ముంబై ఇండియన్స్, కేకేఆర్ మధ్య జరిగిన మ్యాచ్‌లో ఇలాంటి ఘటనే చోటుచేసుకుంది. ముంబై ఇండియన్స్ ఆల్‌రౌండర్ కీరన్ పొలార్డ్, ప్రసిధ్ కృష్ణ మధ్య కొన్ని సెకన్ల పాటు మాటల యుద్దం చోటుచేసుకుంది. ప్రసిధ్ కృష్ణ పొలార్డ్‌కు దమ్కీ ఇద్దామని భావించాడు. ఇన్నింగ్స్ 15వ ఓవర్ చివరి బంతిని ఆఫ్‌స్టంప్ మీదుగా విసిరాడు. బంతిని డిఫెన్స్ చేద్దామనే ప్రయత్నంలో పొలార్డ్ ప్రసిధ్ వైపు కొట్టాడు. అయితే బంతిని అందుకున్న ప్రసిధ్ పొలార్డ్ వైపు విసురుదామనుకొన్నాడు కానీ బంతి చేజారింది. చదవండి: IPL 2021: కేకేఆర్‌కు భారీ షాక్.. కెప్టెన్‌తో పాటు ఆటగాళ్లకు కూడా భారీ జరిమానా అంతే పొలార్డ్ కోపంగా ప్రసిధ్ కృష్ణ వైపు చూస్తూ తర్వాతి ఓవర్లో చూసుకుంటా.. అంటూ బ్యాట్‌ను కొడుతూ కౌంటర్ ఇచ్చాడు. మళ్లీ 18వ ఓవర్లో బౌలింగ్‌కు వచ్చిన ప్రసిధ్‌కు పొలార్డ్ తన పవరేంటో చూపించాడు. వరుసగా సిక్స్, ఫోర్ బాదాడు. ఈ దెబ్బకు ప్రసిధ్‌కు దిమ్మతిరిగి మూడు వైడ్స్, ఒక నో బాల్ కూడా ఇచ్చుకోవాల్సి వచ్చింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇక మ్యాచ్‌లో కేకేఆర్ ముంబైపై ఘన విజయాన్ని సాధించింది. 156 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన కేకేఆర్ 15.1 ఓవర్లలోనే చేధించింది. వెంకటేశ్ అయ్యర్(53), రాహుల్ త్రిపాఠి(74 నాటౌట్) మెరుపులు మెరిపించడంతో కేకేఆర్ సునాయాస విజయాన్ని అందుకుంది. ఈ విజయంతో కేకేఆర్ పాయింట్ల పట్టికలో నాలుగో స్థానానికి చేరుకోగా.. ముంబై మరో ఓటమితో ఆరో స్థానానికి చేరుకుంది. చదవండి: Aakash Chopra: నీకు స్పీడ్ ఎక్కువైంది.. చలాన్లు పడుతాయేమో చూసుకో pic.twitter.com/XU63FEDu8G — pant shirt fc (@pant_fc) September 23, 2021 -
పొలార్డ్ చేసిన తప్పు ఇదే.. లేదంటే చెన్నై 80 పరుగులకే ఆలౌట్ అయ్యేది!
Kieron Pollards captaincy blunder vs CSK: ఐపీఎల్-2021 రెండో అంచె తొలి మ్యాచ్‌లో ముంబై ప్రదర్శనపై ఇంగ్లండ్ దిగ్గజం కెవిన్ పీటర్సన్ పెదవి విరిచాడు. తాత్కాలిక కెప్టెన్ కీరన్ పొలార్డ్ బౌలర్లు అందించిన ఆరంభాన్ని చక్కగా వినియోగించుకోలేక తప్పిదాలు చేశాడని విమర్శించాడు. ఐపీఎల్-2021 రెండో అంచెలో భాగంగా చెన్నై సూపర్‌కింగ్స్, ముంబై ఇండియన్స్ మధ్య ఆదివారం తొలి మ్యాచ్ జరిగిన విషయం తెలిసిందే. సారథి రోహిత్ శర్మ, హార్దిక్ పాండ్యా లేకుండానే మైదానంలో దిగిన డిఫెండింగ్ చాంపియన్ ముంబై.. సీఎస్కే చేతిలో ఓటమి పాలైంది. 20 పరుగుల తేడాతో పరాజయం చవిచూసింది. పవర్‌ప్లే ముగిసే వరకు చెన్నై కీలక వికెట్లన్నీ కోల్పోయినప్పటికీ.. ఆ అవకాశాన్ని వినియోగించుకోలేపోయింది. అయితే, ఇందుకు ప్రధాన కారణం కెప్టెన్ కీరన్ పొలార్డ్ వ్యూహాలేనని పీటర్సన్ అభిప్రాయపడ్డాడు. ఈ మేరకు అతడు స్టార్ స్పోర్ట్స్‌తో మాట్లాడుతూ.. ‘‘ముంబై ఘనంగా మ్యాచ్ ఆరంభించింది. ఆరంభంలో పూర్తి ఆధిపత్యం కనబరిచింది. రెగ్యులర్ కెప్టెన్ దూరమైనప్పటికీ, ఆ ఒత్తిడిని జయించి శుభారంభం చేసింది. పవర్‌ప్లే ముగిసేసరికి సీఎస్కే నాలుగు వికెట్లు కోల్పోయింది. అంబటి రాయుడు రిటైర్డ్‌హర్ట్‌గా వెనుదిరిగాడు. ఇలా కీలక వికెట్లు పడిన వేళ.. ఆ అవకాశాన్ని ముంబై చక్కగా ఉపయోగించుకోవాల్సింది. కానీ, అక్కడే ముంబై ఇండియన్స్ కెప్టెన్ ట్రిక్ మిస్సయ్యాడు. జస్ప్రీత్ బుమ్రాతో 2 లేదా 3 ఓవర్లు వేయించి ఉండాల్సింది. అలా అయితే, 40 లేదా 50 పరుగులకే సీఎస్కే 7 వికెట్లు కోల్పోయి ఉండేది. 60, 70 లేదంటే 80 పరుగులకే ఆలౌట్ అయి ఉండేది. నేనేమీ ఇదంతా ఊరికే ఏం చెప్పడం లేదు. ఒత్తిడిలో ఉన్న బ్యాట్స్‌మెన్‌ను అవుట్ చేసేందుకు స్టార్ బౌలర్లను బరిలోకి దించడం సత్ఫలితాలను ఇస్తుంది కదా’’అని అభిప్రాయపడ్డాడు. కాగా ఓపెనర్ రుత్‌రాజ్ గైక్వాడ్ ఒత్తిడిలోనూ సూపర్ ఇన్నింగ్స్(58 బంతుల్లో 88 నాటౌట్; 9 ఫోర్లు, 4 సిక్స్‌లు) ఆడి సీఎస్కేకు మంచి విజయాన్ని అందించిన సంగతి తెలిసిందే. ఇక ముంబై బౌలర్లలో ఆడమ్ మిల్నే, బుమ్రా, ట్రెంట్ బౌల్ట్ తలా రెండు వికెట్లు తీశారు. పొలార్డ్ చేసిన తప్పు ఇదేనా? కాగా ఆరు ఓవర్ల వరకు మిల్నే, బౌల్ట్‌తో బౌలింగ్ చేయించిన పొలార్డ్.... ఆ తర్వాతి ఓవర్లో బుమ్రాను రంగంలోకి దించాడు. అయితే, మళ్లీ 14వ ఓవర్ వరకు అతడిని బంతిని ఇవ్వలేదు. 16 ఓవర్లో మళ్లీ బుమ్రాకు అవకాశం ఇచ్చినా అప్పటికే రుతురాజ్.. నిలదొక్కుకుని తమ జట్టును గౌరవప్రదమైన స్కోరు సాధించే దిశగా తీసుకువెళ్లడంతో డెత్ ఓవర్లలో స్టార్ పేసర్‌ను దించినా పెద్దగా ఫలితం లేకుండా పోయింది. ఈ నేపథ్యంలో పీటర్సన్ ఈ విధంగా స్పందించడం గమనార్హం. 🎥 Game TURner Rocket Raja's MOM moments! @ruutu1331#CSKvMI #WhistlePodu #Yellove 🦁💛 pic.twitter.com/Hnny0FV4t3 — Chennai Super Kings - Mask P😷du Whistle P🥳du! (@ChennaiIPL) September 20, 2021 -
విండీస్ టీ20 జట్టు ఇదే.. ఆరేళ్ల తర్వాత ఆ ఆటగాడికి పిలుపు
జమైకా: టీ20 ప్రపంచకప్‌ను రెండుసార్లు గెలుచుకున్న ఏకైక జట్టుగా నిలిచింది. తాజాగా టీ20 ప్రపంచకప్ 2021కు సంబంధించి 15 మందితో కూడిన జట్టును ప్రకటించింది. డిపెండింగ్ చాంపియన్‌గా బరిలోకి దిగనున్న విండీస్ జట్టుకు కీరన్ పొలార్డ్ నాయకత్వం వహించనున్నాడు. ఇక దాదాపు ఆరేళ్ల విరామం తర్వాత రవి రాంపాల్‌కు విండీస్ టీ20 జట్టులో చోటు దక్కింది. 2010 టీ20 ప్రపంచకప్ గెలిచిన వెస్టిండీస్ జట్టులో సభ్యుడిగా ఉన్న రవి రాంపాల్ జట్టు తరపున చివరి టీ20 2015లో ఆడడం విశేషం. చదవండి: T20 World Cup 2021: స్టార్ ఆటగాళ్లకు మొండిచేయి.. దక్షిణాఫ్రికా టీ20 జట్టు ఇదే జట్టుగా చూస్తే మొత్తం హిట్లర్లే కనిపిస్తుండడంతో మరోసారి ఫెవరెట్‌గా బరిలోకి దిగుతుంది. నికోలస్ పూరన్ వైస్ కెప్టెన్‌గా వ్యవహరిస్తుండగా.. క్రిస్ గేల్, లెండి సిమన్స్, హెట్‌మైర్, రోస్టన్ చేజ్ వంటి ఆటగాళ్లతో బ్యాటింగ్ బలంగా కనిపిస్తుంది. ఇక డ్వేన్ బ్రేవో, ఆండ్రీ రసెల్, ఫాబియన్ అలెన్ లాంటి నాణ్యమైన ఆల్‌రౌండర్లు ఉన్నారు. హెడెన్ వాల్ష్ జూనియర్ ఒక్కడే విండీస్ మాజీ కెప్టెన్ జాసన్ హోల్డర్‌కు 15 మందిలో చోటు దక్కలేదు. అయితే అతనికి రిజర్వ్ ఆటగాళ్ల జాబితాలో స్థానం కల్పించారు. ఇక టీ20 ప్రపంచకప్‌లో గ్రూప్ 1లో ఉన్న వెస్టిండీస్ ఇంగ్లండ్, ఆస్ట్రేలియా లాంటి పటిష్టమైన జట్టను ఎదుర్కోనుంది. డెత్ గ్రూఫ్‌గా పరిగణిస్తున్న ఈ గ్రూఫ్‌లో విండీస్ తన తొలి మ్యాచ్‌ను అక్టోబర్ 23న ఇంగ్లండ్‌తో ఆడనుంది. ఇక పొట్టి క్రికెట్లో విండీస్ జట్టు 2010, 2016లో చాంపియన్‌గా నిలిచింది. విండీస్ టీ20 జట్టు ఇదే: కీరన్ పొలార్డ్ (కెప్టెన్), నికోలస్ పూరన్ (వైస్ కెప్టెన్), క్రిస్ గేల్, ఫాబియన్ అలెన్, డ్వేన్ బ్రావో, రోస్టన్ చేజ్, ఆండ్రీ ఫ్లెచర్, షిమ్రన్ హెట్‌మైర్, ఎవిన్ లూయిస్, ఒబేడ్ మెక్కాయ్, రవి రాంపాల్, ఆండ్రీ రసెల్, లెండెల్ సిమన్స్, ఒస్నేన్ థామస్, హెడెన్ వాల్ష్ జూనియర్ స్టాండ్ బై ప్లేయర్లు: జాసన్ హోల్డర్, డారెన్ బ్రావో, షెల్డన్ కాట్రెల్, ఏకేల్ హోసిన్ చదవండి: Six Balls Six Sixes: ఆరు బంతుల్లో ఆరు సిక్సర్లు.. వీడియో వైరల్ CWI announces squad for the ICC T20 World Cup 2021🏆 #MissionMaroon #T20WorldCup World Cup Squad details⬇️https://t.co/qoNah4GTZS pic.twitter.com/IYGQNBobgi — Windies Cricket (@windiescricket) September 9, 2021 -
ఇదేం ఫీల్డింగ్‌రా బాబు.. ఒట్టి పుణ్యానికి నాలుగు పరుగులు
జమైకా: కరీబియన్ ప్రీమియర్ లీగ్(సీపీఎల్ 2021)లో ఉత్కంఠభరితమైన మ్యాచ్‌లతో పాటు ఫన్నీ ఘటనలు చాలానే చోటుచేసుకుంటున్నాయి. ''క్యాచెస్ విన్ మ్యాచెస్'' అనే పాత నానుడి ఇప్పుడు అక్షరాల నిజమైంది. ఫీల్డర్ చేసిన తప్పు ప్రత్యర్థి జట్టుకు ఒట్టి పుణ్యానికి నాలుగు పరుగుల వచ్చేలా చేశాయి. అయితే మిస్ఫీల్డ్తో బౌండరీ దాటిందనుకుంటే పొరపాటే.. కేవలం ఫీల్డర్ల వైఫల్యంతో ప్రత్యర్థి బ్యాట్స్‌మన్ నాలుగు పరుగులు రాబట్టారు. చదవండి: BAN VS NZ: చరిత్ర సృష్టించిన బంగ్లాదేశ్.. కివీస్‌పై తొలిసారి.. ట్రిన్‌బాగో నైట్‌రైడర్స్, జమైకా తలైవాస్ మధ్య మంగళవారం జరిగిన మ్యాచ్‌లో ఇది జరిగింది. ట్రిన్‌బాగో నైట్‌రైడర్స్ బ్యాటింగ్ సమయంలో ఇన్నింగ్స్ ఆఖరి ఓవర్ నాలుగో బంతిని ప్రిటోరియస్ పొలార్డ్‌కు వేశాడు. పొలార్డ్ లాంగాన్ దిశగా భారీ షాట్ ఆడగా.. అక్కడే ఉన్న ఫీల్డర్ క్యాచ్‌ను మిస్ చేశాడు. కనీసం రనౌట్ అయ్యే అవకాశం ఉందోమోనని అందుకొని ప్రిటోరియస్ వైపు బంతిని త్రో విసిరాడు. అయితే ప్రిటోరియస్ బంతిని అందుకోలేకపోయాడు. అప్పటికే రెండు పరుగులు పూర్తి చేసిన పొలార్డ్- స్టీఫర్ట్ జంట మరోసారి పరిగెత్తారు. ఈసారి ప్రిటోరియస్ వేసిన బంతి మరోసారి వికెట్లకు దూరంగా వెళ్లడంతో పొలార్డ్ జంట మరోసారి పరుగుపెట్టారు. మొత్తానికి ఫీల్డర్ల పుణ్యానా నాలుగు పరుగులు వచ్చేశాయి. ఓవరాల్‌గా ఆ ఓవర్ మొత్తంలో 28 పరుగులు పిండుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం ట్రెండింగ్‌గా మారింది. ఇక ఈ మ్యాచ్‌లో ట్రిన్‌బాగో నైట్‌రైడర్స్ విజయాన్ని అందుకుంది. మొదట బ్యాటింగ్ చేసిన ట్రిన్‌బాగో 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 167 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్ చేసిన జమైకా తలైవాస్ 18.2 ఓవర్లలో 92 పరుగులకే ఆలౌటైంది. చదవండి: అరంగేట్ర మ్యాచ్‌లోనే నాలుగు వికెట్లు.. ఎవరు ఆ బౌలర్? #KieronPollard 😍 pic.twitter.com/J3qDc0MsF3 — Kart Sanaik (@KartikS25864857) September 7, 2021 -
సిమన్స్ ఊచకోత.. నైట్ రైడర్స్ ఘన విజయం
సెంట్కిట్స్: కరీబీయన్ ప్రీమియర్ లీగ్‌లో ఆదివారం జరిగిన మ్యాచ్‌లో జమైకా తల్లావాస్‌పై ట్రిన్‌బాగో నైట్ రైడర్స్ ఏడు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. మొదట బ్యాటింగ్‌కు దిగిన తల్లావాస్ మొదటి ఆరు ఓవర్లలో 15 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. ఈ సమయంలో క్రీజులోకి వచ్చిన కార్లోస్ బ్రాత్‌వైట్..ఇమాడ్ వసీంతో కలిసి ఆరో వికెట్‌కు 83 పరుగుల భాగస్వామ్యాన్ని జోడించారు. బ్రాత్‌వైట్ (58, 45 బంతుల్లో 8 ఫోర్లు, 3 సిక్స్‌లు) అర్థ సెంచరీతో చెలరేగగా, ఇమాడ్ వసీం (42, 38 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్‌లు) పరుగులు సాధించాడు. దీంతో నిర్ణీత 20 ఓవర్లో 145 పరుగుల లక్ష్యన్ని నైట్ రైడర్స్ ముందు ఉంచింది. నైట్ రైడర్స్ బౌలర్లలో అకేల్ హోసిన్, రవి రాంపాల్ చేరో రెండు వికెట్లు పడగొట్టగా, నరైన్ ,ఉదానా ఒక్కో వికెట్ సాధించారు. ఆనంతరం 145 లక్ష్య సాదనతో బరిలోకి దిగిన నైట్ రైడర్స్ ఆరంభంలోనే సునీల్ నరైన్ వికెట్ కోల్పోయింది. అయితే అసలు ఊచకోత తర్వాత మెదలైంది. ప్రత్యర్ధి బౌలర్లపై లెండెల్ సిమన్స్ ఫోర్లు, సిక్సర్లతో విరుచుకుపడ్డాడు. కేవలం 45 బంతుల్లో 70 (5 ఫోర్లు, 5 సిక్స్‌లు) పరుగులు సాధించాడు. కొలిన్ మున్రోతో (34) కలిసి 102 పరుగుల బాగాస్వామ్యన్ని సిమన్స్ నమోదు చేశాడు. చివరకు సిమన్స్ ను అవుట్ చేసిన ప్రిటోరియస్ .. ఈ బాగాస్వామ్యన్ని విడదీశాడు. అరంతరం క్రీజులోకి వచ్చిన డారన్ బ్రావో మ్యాచ్‌ను ముగించాడు. దీంతో కేవలం మూడు వికెట్లు మాత్రమే కోల్పోయి 145 పరుగుల లక్ష్యన్ని సునాయాసంగా చేధించింది. చదవండి: CPL 2021: వార్నీ.. కోపాన్నంత హెల్మెట్‌పై చూపించాడు THREE catches and a SEVENTY with the bat sees Lendl Simmons pick up the @Dream11 MVP for match 18. #CPL21 #TKRvJT #CricketPlayedLouder #Dream11 pic.twitter.com/zk3Lm1ETIB — CPL T20 (@CPL) September 5, 2021 -
పొట్టి క్రికెట్లో అరుదైన మైలురాయిని దాటేసిన విండీస్ యోధుడు
సెయింట్ కిట్స్: టీ20 క్రికెట్లో విండీస్ పరిమిత ఓవర్ల సారధి, ముంబై ఇండియన్స్ స్టార్ ఆటగాడు కీరన్ పోలార్డ్ ఓ అరుదైన మైలురాయిని క్రాస్ చేశాడు. ఈ ఫార్మాట్లో 11వేల పరుగుల ల్యాండ్ మార్క్‌ను దాటిన రెండో బ్యాట్స్‌మెన్‌గా చరిత్ర సృష్టించాడు. ఇప్పటివరకు పొట్టి ఫార్మాట్లో 554 మ్యాచ్‌లు ఆడిన పోలార్డ్(11,008).. కరీబియన్ ప్రీమియర్ లీగ్ (సీపీఎల్) 2021లో భాగంగా సెయింట్ లూసియా కింగ్స్‌తో మంగళవారం జరిగిన మ్యాచ్‌లో ఈ అరుదైన ఫీట్‌ను సాధించాడు. ఈ జాబితాలో యూనివర్సల్ బాస్ క్రిస్ గేల్.. 14,108 పరుగులతో అగ్రస్థానంలో కొనసాగుతుండగా, పాకిస్థాన్ వెటరన్ ఆటగాడు షోయబ్ మాలిక్(10,741) మూడో స్థానంలో, ఆసీస్ స్టార్ ప్లేయర్ డేవిడ్ వార్నర్(10,0017) నాలుగో ప్లేస్‌లో, టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి(9922) ఐదో స్థానంలో కొనసాగుతున్నారు. పోలార్డ్ బౌలింగ్‌లో 297 వికెట్లు పడగొట్టి.. పొట్టి క్రికెట్ చరిత్రలో అత్యుత్తమ ఆల్ రౌండర్లలో ముఖ్యుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు. చదవండి: విండీస్ విధ్వంసకర ఆటగాడిని దక్కించుకున్న రాజస్తాన్ రాయల్స్ -
వైడ్ ఇవ్వలేదన్న కోపంలో పోలార్డ్ ఏం చేశాడో చూడండి..
సెయింట్ కిట్స్: కరీబియన్ ప్రీమియర్ లీగ్ (సీపీఎల్) 2021లో భాగంగా ట్రిన్‌బాగో నైట్ రైడర్స్, సెయింట్ లూసియా కింగ్స్ జట్ల మధ్య మంగళవారం జరిగిన మ్యాచ్‌లో ఓ ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. ఇన్నింగ్స్ 19వ ఓవర్ ఐదో బంతిని సెయింట్ లూసియా కింగ్స్ పేసర్ వాహబ్ రియాజ్ వేయగా సీఫెర్ట్ ఎదుర్కొన్నాడు. పూర్తిగా ఆఫ్ సైడ్ వెళ్లిన ఆ బంతిని(డబుల్ వైడ్) సీఫెర్ట్ కిందపడి మరి ఆడినా.. అందలేదు. కనీస క్రికెట్ పరిజ్ఞానం లేని వారు కూడా దీన్ని వైడ్‌గా ప్రకటిస్తారు. అయితే, ఫీల్డ్ అంపైర్ నిగెల్ డుగుయిడ్ ఈ బంతిని వైడ్‌గా ప్రకటించకపోవడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. Polly : Are you blind? Umpire : Yes Pollard walks away 😂😂😂 #TKRvSLK #CPL2021 @KieronPollard55 pic.twitter.com/NGjSdMqmYu — Thakur (@hassam_sajjad) August 31, 2021 దీనిపై నాన్ స్ట్రైక్ ఎండ్‌లో ఉన్న ట్రిన్‌బాగో కెప్టెన్ పొలార్డ్ తనదైన శైలిలో అసహనం వ్యక్తం చేశాడు. నిర్ధేశిత ప్రాంతంలో కాకుండా వికెట్లకు దూరంగా వెళ్లి 30 యార్డ్ సర్కిల్ దగ్గర నిలబడి తన నిరసన వ్యక్తం చేశాడు. ఈ మొత్తం తతంగానికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది. వీడియో చూసిన అభిమానుల తమదైన శైలిలో స్పందిస్తున్నారు. అంపైర్ తప్పిదాలు రోజురోజుకు ఎక్కువ అవుతున్నాయని కొందరంటుంటే.. వైడ్ బాల్ కూడా థర్డ్ అంపైరే చూసుకోవాలని మరికొందరు ట్వీటారు. మొత్తానికి అభిమానులు సదరు అంపైర్ నిర్ణయంపై మండిపడుతున్నారు. ఇదిలా ఉంటే, ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన ట్రిన్‌బాగో నైట్ రైడర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 158 పరుగులు చేసింది. కీరన్ పొలార్డ్ (29 బంతుల్లో 41; 6 ఫోర్లు, సిక్స్), టిమ్ సీఫెర్ట్ (25 బంతుల్లో 37; 4 ఫోర్లు, 2 సిక్సర్లు) రాణించారు. సెయింట్ లూసియా కింగ్స్ పేసర్ కేస్రిక్ విలియమ్స్ నాలుగు వికెట్లు పడగొట్టాడు. లక్ష్య ఛేదనలో సెయింట్ లూసియా కింగ్స్ నిర్ణీత ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి కేవలం 131 పరుగులు మాత్రమే చేసి 27 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. ఆండ్రీ ఫ్లెచర్ ( 55 బంతుల్లో 81; 6 ఫోర్లు, నాలుగ సిక్సర్లు) ఒంటరి పోరాటం వృధా అయ్యింది. రవి రాంపాల్ మూడు వికెట్లతో లూసియా కింగ్స్ పతనాన్ని శాసించాడు. చదవండి: ఏ దేశ క్రికెట్ జట్టైనా అఫ్గాన్‌లో పర్యటించవచ్చు: తాలిబన్ ప్రతినిధి -
HBD Pollard: వరల్డ్ కప్‌తో అరంగేట్రం!
వెస్టిండీస్: విండీస్ ఆల్‌రౌండర్ కీరన్ పొలార్డ్ పుట్టినరోజు నేడు. నేటితో అతడు 34వ వసంతంలో అడుగుపెడుతున్నాడు. ఈ క్రమంలో సహచర ఆటగాళ్లు, ముంబై ఇండియన్స్, అభిమానుల నుంచి పొలార్డ్‌కు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ఈ సందర్భంగా.. ఈ విధ్వంసకర క్రికెటర్ గురించి ఆసక్తికర అంశాలు మీకోసం.. ►పొలార్డ్ 1987, మే12న ట్రినిడాడ్‌లోని టకరిగ్వాలో జన్మించాడు. ►2007 వరల్డ్ కప్ టోర్నీలో భాగంగా ఏప్రిల్ 10న దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్ ద్వారా అంతర్జాతీయ వన్డేల్లో అరంగేట్రం చేశాడు. ►ఇప్పటివరకు 116 వన్డేలు ఆడిన పొలార్డ్ 2564 పరుగులు చేశాడు. ఇందులో 3 సెంచరీలు, 11 అర్ధ సెంచరీలు ఉన్నాయి. ►ఇక బౌలింగ్ విషయానికొస్తే.. వన్డేల్లో 54 వికెట్లు పడగొట్టాడు. ►ప్రస్తుతం అతడు వెస్టిండీస్ పరిమిత ఓవర్ల కెప్టెన్‌గా ఉన్నాడు. ►2008లో ఆస్ట్రేలియాతో జరిగిన టీ20 మ్యాచ్‌తో పొలార్డ్ పొట్టి ఫార్మాట్లో ఎంట్రీ ఇచ్చాడు. ►ఇప్పటివరకు 79 అంతర్జాతీయ టీ20లు ఆడిన పొలార్డ్ 1277 పరుగులు చేశాడు. 37 వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. ►ముంబై ఇండియన్స్ తరఫున 2010లో ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో అడుగుపెట్టిన పొలార్డ్ .. టోర్నీలో ఇప్పటిదాకా 171 మ్యాచ్‌లు ఆడి 3191 పరుగులతో సత్తా చాటాడు. ►ఐపీఎల్లో 63 వికెట్లు తీసి తాను ప్రాతినిథ్యం వహించిన జట్ల విజయాల్లో కీలక పాత్ర పోషించాడు. ►పొలార్డ్ ప్రస్తుతం ముంబై ఇండియన్స్ తరఫున ఆడుతున్నాడు. కరోనా నేపథ్యంలో ఐపీఎల్-2021 నిరవధికంగా వాయిదా పడిన నేపథ్యంలో ఇంటి బాటపట్టాడు. ఆరు సిక్సర్లతో సంచలనం శ్రీలంకతో ఇటీవల జరిగిన టీ20 మ్యాచ్‌లో కీరన్ పొలార్డ్ అరుదైన ఘనత సాధించాడు. అంతర్జాతీయ క్రికెట్లో ఒకే ఓవర్లో ఆరు సిక్సర్లు బాదిన మూడో క్రికెటర్‌గా ఖ్యాతిగడించాడు. అదే విధంగా ట్వంటీ ట్వంటీల్లో ఈ రికార్డు నమోదు చేసిన రెండో ఆటగాడిగా చరిత్రకెక్కాడు. Thank you Lord for giving us 𝑻𝒉𝒆 𝑳𝒍𝒐𝒓𝒅 🙏 Send in your birthday wishes for Polly 👇💙#OneFamily #MumbaiIndians @KieronPollard55 pic.twitter.com/HXHcLFhoSr — Mumbai Indians (@mipaltan) May 12, 2021 Happy Birthday @KieronPollard55 Only the 3rd man in international Cricket to hit 6 sixes in a single over.❤️😎#KieronPollard #Pollard #MumbaiIndians #HappyBirthdayKieronPollard #HappyBirthdayPollardpic.twitter.com/IvBbMp9DQR — ABDULLAH NEAZ (@AbdullahNeaz) May 12, 2021 -
పొలార్డ్ కోసం అన్ని అస్త్రాలు ప్రయోగించాం..
ఢిల్లీ: ముంబై ఇండియన్స్ ఆల్‌రౌండర్ కీరోన్ పొలార్డ్ ఐపీఎల్లో చాలా కాలం తర్వాత ఒక గొప్ప ఇన్నింగ్స్ ఆడాడని సీఎస్కే కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్ కొనియాడాడు. బంతిని హిట్ చేసేటప్పుడు పొలార్డ్ కచ్చితమైన టైమింగ్‌తో ఉంటాడన్నాడు. పొలార్డ్ క్రీజ్‌లో పాతుకుపోతే ప్రమాదమనే విషయం తమకు తెలుసని, అతన్ని ఔట్ చేయడానికి అన్ని అస్త్రాలు ప్రయోగించామన్నాడు. కానీ చివరకు అతన్ని పెవిలియన్‌కు చేర్చడంలో విఫలం కావడంతోనే తమను పరాజయం వెక్కిరించిందన్నాడు. మ్యాచ్ తర్వాత రిపోర్టర్లతో మాట్లాడిన ఫ్లెమింగ్.. ‘ అసలు పొలార్డ్ ఏ షాట్ ఎలా ఆడతాడో కచ్చితంగా అంచనా వేయలేం. ఐపీఎల్లో సుదీర్ఘ కాలం తర్వాత మంచి ఇన్నింగ్స్ ఆడాడు. పొలార్డ్ చాలా ప్రమాదకరమైన ఆటగాడు. ముంబైకు ప్రధాన ఆటగాడు. అతన్ని ఔట్ చేయడానికి చాలా ప్రయోగాలు చేశాం. కానీ నిలువరించలేకపోయాం. ముంబై ఇండియన్స్ మూడు వికెట్లు తీసిన తర్వాత వారిపై ఒత్తిడి తెచ్చే యత్నం చేశాం. మేము చాలా మంచి టార్గెట్ ముంబై ముందు ఉంచాం. అయినా కొన్ని తప్పిదాలతో ఓటమి పాలయ్యాం. మేము చేసిన తప్పిదాలను విశ్లేషించుకుని తర్వాత మ్యాచ్‌కు సిద్ధమవుతాం. మేము మరింత కసిగా తుదపరి మ్యాచ్‌కు వస్తాం. టోర్నమెంట్లో ఓడిపోతే ప్రత్యర్థి జట్టు బాగా ఆడిందనే అంటారు. అది సర్వసాధారణం’ అని తెలిపాడు. కాగా, సీఎస్కే నిర్దేశించిన 219 పరుగుల భారీ టార్గెట్‌లో పొలార్డ్ 34 బంతుల్లో 8 సిక్స్‌లు, 6 ఫోర్లతో సునామీ ఇన్నింగ్స్ ఆడాడు. తొలుత 17 బంతుల్లో హాఫ్ సెంచరీ సాధించిన పొలార్డ్.. మ్యాచ్‌ను గెలిపించేతవరకూ క్రీజ్‌లో ఉండి తన బ్యాటింగ్ పవర్ చూపెట్టాడు. ఆఖరి ఓవర్లో 16 పరుగులు పిండుకుని ముంబైకు ఎప్పటికీ గుర్తుండిపోయే విజయాన్ని అందించాడు. ఇక్కడ చదవండి: డేవిడ్ వార్నర్‌కు నో ప్లేస్ మీకు బౌలర్లు ఉన్నారు.. కానీ డెత్ ఓవర్ బౌలర్ ఎక్కడ? వార్నర్ ఇన్స్టాగ్రామ్ స్టోరీస్ వైరల్ -
ఆ బంతిని కూడా ఫోర్ కొడితే ఇంకేం చేస్తాం!
ఢిల్లీ: ముంబై ఇండియన్స్‌తో మ్యాచ్‌లో సీఎస్కే 219 పరుగుల టార్గెట్ ఇచ్చిన తర్వాత మ్యాచ్ ఫలితం ముందే డిసైడ్ అయిపోయిందనుకున్నారంతా. ముంబై ఇండియన్స్ బ్యాట్స్‌మెన్ ప్రస్తుత ఫామ్‌ను బట్టి ఇంత టార్గెట్ వారి వల్ల కాదనుకున్నారు. మరి డిఫెండింగ్ చాంపియన్ హోదాలో దిగిన ముంబై ఇండియన్స్ ఐదుసార్లు ట్రోఫీని ఎలా గెలిచిందో సీఎస్కేతో మ్యాచ్‌ను బట్టి అర్థమవుతోంది. ఆ జట్టు బ్యాటింగ్ లైనప్ అంతా భారీ హిట్టర్లతో ఉంది. ఒక బ్యాట్స్‌మన్ క్లిక్ కాకపోయినా ఎవరో ఒకరు సెట్ అయితే మ్యాచ్ స్వరూపాన్నే మార్చేసి ఆటగాళ్లు వారి సొంతం. అదే జరిగింది శనివారం(మే 1వ తేదీ) నాటి మ్యాచ్‌లో. కీరోన్ పొలార్డ్ సునామీ ఇన్నింగ్స్‌తో ముంబై ఊహించని విజయాన్ని అందుకుంది. ప్రధానంగా ఆఖరి ఓవర్లలో 16 పరుగులు కావాల్సిన తరుణంలో ముంబై విజయం కష్టమే అనిపించింది. కానీ పొలార్డ్ క్రీజ్‌లో ఉన్నాడన్న దీమా మాత్రం ముంబై శిబిరంలో ఉంది. దాన్ని నిజం చేశాడు పొలార్డ్. ఆ ఓవర్లో రెండు బంతులకు సింగిల్ వచ్చే అవకాశం ఉన్నా పొలార్డ తీయలేదు. ఎన్గిడి వేసిన 20వ ఓవర్ తొలి బంతిని ఫ్లిక్ చేసి సింగిల్ తీసే అవకాశం ఉన్నా వద్దనుకున్నాడు. ఆ తర్వాత రెండు బంతుల్ని ఫోర్లు కొట్టాడు. మళ్లీ నాల్గో బంతికి నో సింగిల్. ఐదో బాల్ సిక్స్, ఆరో బాల్ రెండు పరుగులు. అంతే లాంఛనం పూర్తయ్యింది. ఆ బంతిని కూడా ఫోర్ కొడితే ఇంకేం చేస్తాం! Photo Courtesy: IPL 34 బంతుల్లో 6 ఫోర్లు, 8 సిక్స్‌లతో 87 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచిన పొలార్డ్.. ఆఖరి ఓవర్లో కొట్టిన ఒక ఫోర్.. సీఎస్కే ఆటగాళ్లు అసలు ఊహించి ఉండరు. ఆఖరి ఓవర్ రెండో బంతిని ఎన్గిడి కాళ్ల మధ్యలో ఫెర్ఫెక్ట్ యార్కర్ వేశాడు. దాదాపు 140 కి.మీ వేగంతో వచ్చిన ఆ బంతి మిస్సయితే పొలార్డ్ బౌల్డ్ కావాల్సిందే. మరి పొలార్డ్ ఆ బంతి యార్కర్ పడటమే తరువాయి ఒక లెగ్‌ను కాస్త ఎడంగా తీసుకుని స్క్వేర్ లెగ్ మీదుగా ఫోర్ కొట్టాడు. ఆ బంతిని ఫోర్ కొట్టడంతో ధోనితో సహా ఎన్గిడి కూడా ఆశ్చర్యానికి గురయ్యాడు. ఇది కూడా ఫోర్ కొడితే ఇంకేం చేస్తాం అన్న భావన ఎన్గిడిలో కనబడింది. మంచి బంతిని ఫోర్‌గా కొట్టడంతో ధోని కూడా బౌలర్‌ను ఏమీ అనలేని పరిస్థితి లేదు. ఆ బంతిని ఫోర్ కొట్టడం అంటే అది నిజంగా బ్యాట్స్‌మన్ గొప్పదనమే. కీలక సమయంలో అది ఫోర్ కావడంతో ముంబై ఇండియన్స్ అభిమానులు ఖుషీ అయ్యారు. కాకపోతే ఆ బంతిని ఫోర్ కొట్టడం మాత్రం బౌలర్ కోణంలో అన్‌ఫెయిర్ అనుకోవచ్చని స్టూడియోల్లో కూర్చొన్న అనలిస్టులు సరదాగా వ్యాఖ్యానించారు. -
'పో.. పో.. ఫోర్ వెళ్లు' అంటూ పొలార్డ్.. నోరెళ్లబెట్టిన మోరిస్
అహ్మదాబాద్: పవర్ హిట్టింగ్‌కు మారు పేరుగా ఉండే కీరన్ పొలార్డ్ ఎంటర్టైన్ అందించడంలోనూ అంతే ముందుంటాడు. ఒక్కోసారి తన చర్యలు నవ్వు తెప్పించే విధంగా ఉంటుంది. తాజాగా రాజస్తాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో పొలార్డ్ ఇచ్చిన ఒక ఎక్స్ప్రెషన్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. విషయంలోకి వెళితే.. ముంబై ఇన్నింగ్స్ 18వ ఓవర్‌ను క్రిస్ మోరిస్ వేశాడు. ఆ ఓవర్ మూడో బంతి పొలార్డ్ ఆడే ప్రయత్నం చేయగా.. వేగంగా వచ్చిన బంతి అతని హెల్మెట్‌కు బలంగా తాకి బౌండరీ వైపు పరుగులు తీసింది. దీంతో పొలార్డ్ వెనుకకు తిరిగి పో.. పో.. బౌండరీ వెళ్లు.. అంటూ చేతులను ఊపాడు.. తీరా బంతి బౌండరీ దాటడం.. లెగ్ బై రూపంలో పరుగుల వచ్చాయి. అయితే ఇది ఊహించని మోరిస్ మాత్రం షాక్ తిని నోరెళ్లబెట్టాడు. ఆ తర్వాత పొలార్డ్ మోరిస్ దగ్గరకు వచ్చి మోరిస్.. నువ్వు ఇది ఊహించి ఉండవు అంటూ పేర్కొన్నాడు. పొలార్డ్ చర్యలు నవ్వు తెప్పించే విధంగా ఉండడంతో నెటిజన్లు వినూత్న రీతిలో కామెంట్లు చేశారు. Courtesy: IPL T20.Com ఇక ఈ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. 172 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబై ఇండియన్స్ 3 వికెట్లు కోల్పోయి 18.3 ఓవర్లలోనే లక్ష్యాన్ని చేధించింది. డికాక్ 70 పరుగులు నాటౌట్‌గా నిలిచి జట్టు గెలవడంలో కీలకపాత్ర పోషించాడు. కృనాల్ 39 పరుగులతో అతనికి సహకరించాడు. రాజస్తాన్ బౌలర్లలో మోరిస్ 2, ముస్తాఫిజుర్ 1 వికెట్ తీశాడు. అంతకముందు రాజస్తాన్ రాయల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 173 పరుగులు చేసింది. రాజస్తాన్ బ్యాటింగ్‌లో సంజూ సామ్సన్ 42 పరుగలతో టాప్ స్కోరర్‌గా నిలవగా.. బట్లర్ 41, దూబే 35, జైస్వాల్ 32 పరుగులు చేశారు. ముంబై బౌలర్లలో రాహుల్ చహర్ 2, బుమ్రా, బౌల్ట్‌లు చెరో వికెట్ తీశారు. చదవండి: 'చహర్ ఇదేం బాలేదు.. పాపం జైస్వాల్‌ను చూడు' pic.twitter.com/4SPgRkWgJg — Cricsphere (@Cricsphere) April 29, 2021 -
మీరు కావాల్సినంత నవ్వుకోండి.. నాకేంటి?: పొలార్డ్
చెన్నై: ముంబై ఇండియన్స్-పంజాబ్ కింగ్స్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో నాన్ స్టైకింగ్ ఎండ్‌లో ఉన్న కీరోన్ పొలార్డ్ బౌలర్ బంతిని విసరకముందే లైన్ దాటి ముందుకు వెళ్లిపోవడం తీవ్ర విమర్శలకు దారి తీసింది. పంజాబ్ కింగ్స్ పేసర్ మహ్మద్ షమీ బౌలింగ్ వేసే క్రమంలో ఓ బంతికి పొలార్డ్ ఇలా చేశాడు. బౌలర్ షమీని చూస్తూనే క్రీజ్‌ను ముందుగా వీడాడు. దీనిపై ట్వీటర్లో విమర్శల వర్షం కురిసింది. మాజీ క్రికెటర్లు కూడా పొలార్డ్ తీరును తప్పుబట్టారు. కాగా, దీనిపై పొలార్డ్ కాస్త విభిన్నంగా స్పందించాడు. దీన్ని చూసి మీరు కావాల్సినంత నవ్వుకోండి.. నాకేంటి’ అంటూ ట్వీట్ చేశాడు. ఇటువంటి వాటిని తాను పట్టించుకోనని, అసలు గుర్తించనని, అందుచేత పెద్దగా రియాక్ట్ కానంటూ పోస్ట్ చేశాడు. మళ్లీ ఈ తరహా జడ్జ్మెంట్ ఇచ్చే వారిని ప్రేమిస్తానంటూ తెలివిగా సమాధానమిచ్చాడు. 2019 ఐపీఎల్ సీజన్లో అప్పటి కింగ్స్ పంజాబ్( పంజాబ్ కింగ్స్) బౌలర్ రవిచంద్రన్ అశ్విన్ రాజస్తాన్ రాయల్స్ బ్యాట్స్‌మన్ జోస్ బట్లర్‌ను మన్కడింగ్ ద్వారా ఔట్ చేయడం వివాదాస్పదంగా మారిన సంగతి తెలిసిందే. దీనిపై పెద్ద దుమారమే చెలరేగింది. ఎవరిది తప్పు.. ఎవరిది ఒప్పు అనే కోణంలో సుదీర్గమైన చర్చలు నడిచాయి. ఆ తర్వాత మన్కడింగ్ చేయడం ఐపీఎల్లో ఎక్కడా కనిపించలేదు. తాజాగా బ్యాట్స్‌మన్ పదే పదే క్రీజ్ దాటుతుండటంతో మన్కడింగ్ సబబే అనే వాదన వినిపిస్తోంది. Got to love these individuals who suppose to be objective ... laughable at best 😇😇😇😇😇!! pic.twitter.com/tWRs4cFBpj — Kieron Pollard (@KieronPollard55) April 24, 2021 -
పొలార్డ్‌ను చూడండి.. ఎలా లైన్ దాటేస్తున్నాడో?
చెన్నై: ఈ ఐపీఎల్ సీజన్లో సీఎస్కే, రాజస్తాన్ రాయల్స్ మధ్య జరిగిన మ్యాచ్‌లో ముస్తాఫిజుర్ బౌలింగ్ వేయడానికి ముందే డ్వేన్ బ్రావో క్రీజును దాటేసి ముందుకు వెళ్లిపోవడం తీవ్ర విమర్శలకు దారి తీసింది. బౌలర్ క్రీజ్ లైన్ దాటి బౌలింగ్ వేస్తే నో బాల్ కదా.. బ్యాట్స్‌మన్ ముందే క్రీజ్ దాటితే ఏమి చేయాలంటూ మాజీ క్రికెటర్ వెంకటేశ్ ప్రసాద్ ధ్వజమెత్తాడు. కాగా, ముంబై ఇండియన్స్-పంజాబ్ కింగ్స్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో కూడా ఈ తరహా ఘటన చోటు చేసుకుంది. పంజాబ్ కింగ్స్ పేసర్ మహ్మద్ షమీ బౌలింగ్ వేసే క్రమంలో నాన్ స్టైకింగ్ ఎండ్‌లో ఉన్న ముంబై బ్యాట్స్‌మన్ కీరోన్ పొలార్డ్ క్రీజ్‌ను దాటి ముందుకు వెళ్లిపోయాడు. బౌలర్ వైపు చూస్తూనే ఇలా వెళ్లడం ట్వీటర్లో విమర్శల వర్ష మొదలైంది. ఈ ఫోటోలను షేర్ చేస్తూ పొలార్డ్ చేసిన పనిని తప్పుబట్టాడు. ఇలాంటి వారికి ఐదు పరుగుల పెనాల్టీ విధించాలని కోరుతున్నారు. కామెంటేటర్లు కూడా ఇదే విషయాన్ని చెప్పారని ఒక ట్వీటర్ యూజర్ కోడ్ చేశాడు. 2019 ఐపీఎల్ సీజన్లో అప్పటి కింగ్స్ పంజాబ్( పంజాబ్ కింగ్స్) బౌలర్ రవిచంద్రన్ అశ్విన్ రాజస్తాన్ రాయల్స్ బ్యాట్స్‌మన్ జోస్ బట్లర్‌ను మన్కడింగ్ ద్వారా ఔట్ చేయడం వివాదాస్పదంగా మారిన సంగతి తెలిసిందే. దీనిపై పెద్ద దుమారమే చెలరేగింది. ఎవరిది తప్పు.. ఎవరిది ఒప్పు అనే కోణంలో సుదీర్గమైన చర్చలు నడిచాయి. ఆ తర్వాత మన్కడింగ్ చేయడం ఐపీఎల్లో ఎక్కడా కనిపించలేదు. తాజాగా బ్యాట్స్‌మన్ పదే పదే క్రీజ్ దాటుతుండటంతో మన్కడింగ్ సబబే అనే వాదన వినిపిస్తోంది. Kieron Pollard started running even before the ball was released from Mohammad Shami's hand.#PBKSvMI#RohitBirthdayCDP pic.twitter.com/9Zr1KWufVm — THOMAS SHELBY 👑 (@rohithcool5) April 23, 2021 Pollard backing up again on Shami. Commentator wants more than a warning, wants penalty runs. #IPL2021 #PBKSvMI pic.twitter.com/odRtaqeoK1 — Paul Watson (@paulmwatson) April 23, 2021 Kieron Pollard started running even before the ball was released from Mohammad Shami's hand.#PBKSvMI#RohitBirthdayCDP pic.twitter.com/4rvDifYrw6 — Aithey_enti (@Aitheyenti2) April 23, 2021 -
ఈ మ్యాచ్‌లోనే పొలార్డ్ సాధిస్తాడా?
చెన్నై: ఈ ఐపీఎల్ సీజన్-14 రెండు పటిష్టమైన బ్యాటింగ్ కల్గిన జట్లతో ఆరంభం కానుండటంతో ప్రేక్షకులు మంచి మజాను ఆస్వాదించడం ఖాయం. డిఫెండింగ్ చాంపియన్ ముంబై ఇండియన్స్-రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్లు ఈ సీజన్ తొలి మ్యాచ్‌లో తలపడుతుండటంతో విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ, ఏబీ డివిలియర్స్, గ్లెన్ మ్యాక్స్‌వెల్, హార్దిక్ పాండ్యా, కీరోన్ పొలార్డ్‌ల పవర్ఫుల్ స్ట్రోక్స్‌పై ఆసక్తి నెలకొంది. కాగా, పొలార్డ్ మాత్రం అరుదైన ఘనతకు చేరువలో ఉన్నాడు. ఇంకా రెండు సిక్స్‌లు కొడితే రోహిత్, కోహ్లి, ఏబీ డివిలియర్స్, క్రిస్ గేల్, ఎంఎస్ ధోనిల సరసన చేరిపోతాడు పొలార్డ్. ఓవరాల్‌గా 200 ఐపీఎల్ సిక్సర్ల క్లబ్లో చేరడానికి పొలార్డ్ ఇంకా రెండు సిక్సర్ల దూరంలో ఉన్నాడు. ఇప్పటివరకూ 198 ఐపీఎల్ సిక్స్‌లు సాధించిన పొలార్డ్.. ఆర్సీబీతో జరుగనున్న తొలి మ్యాచ్‌లోనే ఈ ఫీట్‌ను సాధించే అవకాశం ఉంది. స్వతహాగా హార్డ్ హిట్టర్ అయిన పొలార్డ్.. తన బ్యాట్‌కు పని చెబితే సిక్సర్ల కింగ్స్ సరసన చేరిపోతాడు. ఈ జాబితాలో గేల్(349), ఏబీ డివిలియర్స్(235), ఎంఎస్ ధోని(216), రోహిత్ శర్మ(213), విరాట్ కోహ్లి(201)లు వరుస స్థానాల్లో ఉన్నారు. గత ఐపీఎల్ సీజన్లో పొలార్డ్ 16 మ్యాచ్‌ల్లో 22 సిక్స్‌లు సాధించాడు. ఇక బ్యాటింగ్‌లో 53.60 యావరేజ్‌తో 268 పరుగులు సాధించాడు. ఐపీఎల్ 2020లో పొలార్డ్ అత్యధిక స్కోరు 60 నాటౌట్. మరొకవైపు పొలార్డ్ నాలుగు ఫోర్లు కొడితే ఐపీఎల్ 200 ఫోర్ల మార్కును చేరతాడు. ప్రస్తుతం పొలార్డ్ ఖాతాలో 196 ఐపీఎల్ ఫోర్లు ఉన్నాయి. ఈ రెండు రికార్డులు కూడా పొలార్డ్ ఆర్సీబీతో మ్యాచ్‌లోనే సాధిస్తాడో లేదో చూడాలి. ఇక ఏడు వికెట్లు సాధిస్తే టీ20 ఫార్మాట్లో 300 వికెట్ల మార్కును పొలార్డ్ చేరతాడు. అదే సమయంలో టీ20 ఫార్మాట్లో మూడొందల వికెట్లను, 5వేలకు పైగా పరుగులు చేసిన నాల్గో ఆల్‌రౌండర్‌గా నిలుస్తాడు. ఈ జాబితాలో డ్రేన్ బ్రేవో; షకీబుల్ హసన్, ఆండ్రీ రసెల్‌లు తొలి మూడు స్థానాల్లో ఉన్నారు. ఈ ఐపీఎల్లో 10 క్యాచ్‌లో పడితే క్యాష్ రిచ్ లీగ్‌లో 100 క్యాచ్‌లు పూర్తి చేసుకుంటాడు పొలార్డ్. ఇక టీ20 ఫార్మాట్లో 700 ఫోర్లు పూర్తి చేసుకోవడానికి 25 ఫోర్ల దూరంలో ఉన్నాడు ఈ విండీస్ ఆల్‌రౌండర్. -
ప్రముఖ క్రికెటర్ ఇంట విషాదం.. సచిన్ సంతాపం
ముంబై: వెస్టిండీస్ పరిమిత ఓవర్ల క్రికెట్ కెప్టెన్, ముంబై ఇండియన్స్ ఆటగాడు కీరన్ పొలార్డ్ ఇంట విషాదం చోటుచేసుకుంది. అతడి తండ్రి మంగళవారం కన్నుమూశారు. ఈ విషయాన్ని పొలార్డ్ నేడు సోషల్ మీడియా వేదికగా వెల్లడించాడు. ఈ మేరకు.. ‘‘టాల్ బాయ్ ఇకలేరు. ప్రశాంతంగా విశ్రమించండి.. ఎల్లప్పుడూ మిమ్మల్ని నేను ప్రేమిస్తూనే ఉంటాను. ఎన్నో హృదయాలను మీరు గెలుచుకున్నారు. ఇక ముందు కూడా మిమ్మల్ని గర్వపడేలా చేస్తాను. మీరు ఎక్కడో ఒకచోట విశ్రాంతి తీసుకుంటున్నారని నాకు తెలుసు’’ అని పొలార్డ్ భావోద్వేగానికి లోనయ్యాడు. ఈ సందర్భంగా ఐపీఎల్ ట్రోఫీతో తండ్రితో కలిసి ఉన్న ఫొటోను షేర్ చేశాడు ఇక ఈ విషయంపై స్పందించిన టీమిండియా దిగ్గజం సచిన్ టెండుల్కర్ పొలార్డ్‌కు సానుభూతి ప్రకటించాడు. ‘‘మీ నాన్న గారు మరణించారన్న విషయం ఇప్పుడే తెలిసింది. ఈ విషాదం నుంచి కోలుకునేందుకు ఆ దేవుడు మీకు, మీ కుటుంబ సభ్యులకు ధైర్యం ఇవ్వాలి’’అని ట్విటర్ వేదికగా సంతాపం వ్యక్తం చేశాడు. కాగా కీరన్ పొలార్డ్ ఐపీఎల్ ఫ్రాంచైజీ ముంబై ఇండియన్స్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్న విషయం తెలిసిందే. ఇక ఐపీఎల్-14 వ సీజన్ ఏప్రిల్ 9 నుంచి ఆరంభం కానుంది. డిఫెండింగ్ చాంపియన్స్ ముంబై ఇండియన్స్- రాయల్ చాలెంజర్స్ బెంగళూరు మధ్య తొలిపోరు జరుగనుంది. చదవండి: ముగ్గురు కెప్టెన్లకు గాయాలు.. ఆందోళనలో ఫ్రాంచైజీలు కృనాల్- టామ్ కరన్ గొడవ; కోహ్లి రియాక్షన్ చూశారా?! View this post on Instagram A post shared by Kieron Pollard (@kieron.pollard55) -
పొలార్డ్ క్షమాపణలు చెప్పాడు..
ఆంటిగ్వా: వెస్టిండీస్‌తో జరిగిన తొలి వన్డేలో శ్రీలంక ఓపెనర్ దనుష గుణతిలక అబ్స్ట్రక్టింగ్ ద ఫీల్డ్‌గా వెనుదిరిగాడు.నిబంధనల ప్రకారం ఒక బ్యాట్స్‌మన్ బంతిని కావాలని అడ్డుకుంటేనే దానిని అబ్స్ట్రక్టింగ్ ద ఫీల్డ్‌గా పరిగణిస్తారు. శ్రీలంక ఇన్నింగ్ష్ 22వ ఓవర్లో ఈ ఘటన చోటుచేసుకుంది. కీరన్ పొలార్డ్ వేసిన ఆ ఓవర్ మొదటి బంతిని నిసాంకా ఆడి పరుగు కోసం ప్రయత్నించాడు. అయితే అతడిని వారిస్తూ ముందుకొచ్చిన గుణతిలక... వెనక్కి వెళ్లే ప్రయత్నంలో బంతిపై కాలు పెట్టాడు. అయితే పొలార్డ్ సహా ఇతర విండీస్ ఆటగాళ్లు అప్పీల్ చేయగా అంపైర్లు గుణతిలకను అవుట్‌గా ప్రకటించారు. అయితే వీడియోలో మాత్రం గుణతిలక అసలు బంతి ఎక్కడ ఉందో చూడకుండా వెనక్కి జరగడాన్ని బట్టి చూస్తే అతను ఉద్దేశపూర్వకంగా అడ్డుకోలేదని అర్థమవుతోంది. దీనిపై పొలార్డ్ సైతం క్షమాపణలు తెలియజేశాడని గుణతిలకా పేర్కొన్నాడు. మ్యాచ్ ముగిసిన తర్వాత పొలార్డ్ తన వద్దకు వచ్చి క్షమాపణలు కోరినట్టు స్పష్టం చేశాడు. ‘ నేను బంతిని కాలితో తొక్కి అడ్డుకోవడం కావాలని చేసింది కాదని పొలార్డ్ రిప్లేలో చూసి తెలుసుకున్నాడు. దాంతో మ్యాచ్ ముగిసిన తర్వాత నా వద్దకు క్షమాపణలు చెప్పాడు. దీనికి సంబంధించిన ఫోటోను వెస్టిండీస్ క్రికెట్ ట్వీటర్లో షేర్ చేసింది. గుణతిలకాతో పొలార్డ్ చాట్ చేశాడు. ఇది స్పిరిట్ ఆఫ్ క్రికెట్ అని పేర్కొంది. ఈ మ్యాచ్‌లో వెస్టిండీస్ 8 వికెట్ల తేడాతో గెలిచింది. శ్రీలంక 232 పరుగులు చేస్తే, విండీస్ రెండు కోల్పోయి ఆ లక్ష్యాన్ని ఛేదించింది. Danushka Gunathilaka has been given out Obstructing the field. Very difficult to interpret if this was a wilful obstruction. Looks unintentional but has been given out as per the lawspic.twitter.com/CJh3GmzvaN — Sarang Bhalerao (@bhaleraosarang) March 10, 2021 @KieronPollard55 and @danushka_70 had a chat at close of play. 🙏🏾#SpiritOfCricket #WIvSL 🏏🌴 pic.twitter.com/FowckA7ajx — Windies Cricket (@windiescricket) March 10, 2021 -
ఒక ఆటగాడు అలా ఔటవ్వడం ఇది ఏడోసారి
నార్త్‌సౌండ్: వెస్టిండీస్, శ్రీలంక మధ్య జరిగిన తొలి వన్డేలో ఒక ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. శ్రీలంక ఓపెనర్ గుణతిలక అబ్స్ట్రక్టింగ్ ద ఫీల్డ్‌గా వెనుదిరిగాడు.నిబంధనల ప్రకారం ఒక బ్యాట్స్‌మన్ బంతిని కావాలని అడ్డుకుంటేనే దానిని అబ్స్ట్రక్టింగ్ ద ఫీల్డ్‌గా పరిగణిస్తారు. శ్రీలంక ఇన్నింగ్ష్ 22వ ఓవర్లో ఈ ఘటన చోటుచేసుకుంది. కీరన్ పొలార్డ్ వేసిన ఆ ఓవర్ మొదటి బంతిని నిసాంకా ఆడి పరుగు కోసం ప్రయత్నించాడు. అయితే అతడిని వారిస్తూ ముందుకొచ్చిన గుణతిలక... వెనక్కి వెళ్లే ప్రయత్నంలో బంతిపై కాలు పెట్టాడు. అయితే పొలార్డ్ సహా ఇతర విండీస్ ఆటగాళ్లు అప్పీల్ చేయగా అంపైర్లు గుణతిలకను అవుట్‌గా ప్రకటించారు. అయితే వీడియోలో మాత్రం గుణతిలక అసలు బంతి ఎక్కడ ఉందో చూడకుండా వెనక్కి జరగడాన్ని బట్టి చూస్తే అతను ఉద్దేశపూర్వకంగా అడ్డుకోలేదని అర్థమవుతోంది.అయితే ఒక ఆటగాడు అబ్స్ట్రక్టింగ్ ది ఫీల్డ్ కింద వన్డేల్లో ఔటవ్వడం ఇది ఏడోసారి. ఇంతకముందు వన్డేల్లో 6 సార్లు, టెస్టుల్లో ఒకసారి.. టీ20ల్లో ఒకసారి బ్యాట్స్‌మన్ ఈ పద్దతిలో ఔటయ్యాడు.అతను కావాలని అలా చేశాడో.. లేక యాదృశ్చికంగా జరిగిందో తెలియదు కానీ నిబంధనల ప్రకారం గుణతిలకను అవుట్‌గా ప్రకటించారని మ్యాచ్ అనంతరం విండీస్ కెప్టెన్ పొలార్డ్ పేర్కొన్నాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. మొదట బ్యాటింగ్ చేసిన శ్రీలంక 49 ఓవర్లలో 232 పరుగులకు ఆలౌటైంది. గుణతిలక (55), కరుణరత్నే (52), ఆషెన్ బండార (50) అర్ధ సెంచరీలతో రాణించారు. విండీస్ బౌలర్లలో హోల్డర్, జాసన్ మొహమ్మద్ 2, పొలార్డ్ , పాబియెన్ అలెన్, జోసెఫ్ తలా ఒక వికెట్ తీశారు. అనంతరం 233 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన విండీస్ 47ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేధించింది. షై హోప్ 110 పరుగులతో ఆకట్టుకోగా.. ఎవిన్ లూయిస్ 65 అతనికి సహకరించాడు. ఈ విజయంతో విండీస్ మూడు వన్డేల సిరీస్‌లో 1-0 ఆధిక్యంలో నిలిచింది. ఇరు జట్ల మధ్య రెండో వన్డే మార్చి 12న జరగనుంది. చదవండి: 'ద్రవిడ్ భయ్యా.. ఎవరీ కుర్రాడు కుమ్మేస్తున్నాడు' Danushka Gunathilaka has been given out Obstructing the field. Very difficult to interpret if this was a wilful obstruction. Looks unintentional but has been given out as per the lawspic.twitter.com/CJh3GmzvaN — Sarang Bhalerao (@bhaleraosarang) March 10, 2021 -
ఒకే ఓవర్లో 6 సిక్సర్లు.. యూ బ్యూటీ: యువీ
అంటిగ్వా: వెస్టిండీస్ క్రికెటర్ కీరన్ పొలార్డ్ సరికొత్త రికార్డుపై టీమిండియా మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ స్పందించాడు. ‘‘సిక్స్ సిక్సర్ల క్లబ్‌లోకి స్వాగతం.. యూ బ్యూటీ’’అంటూ సంతోషం వ్యక్తం చేశాడు. కాగా స్వదేశంలో శ్రీలంకతో గురువారం జరిగిన తొలి టీ20లో పొలార్డ్ ఒకే ఓవర్లో ఆరు సిక్సర్లతో విధ్వంసం సృష్టించిన సంగతి తెలిసిందే. లంక ఆటగాడు అకిల ధనుంజయ బౌలింగ్‌లో ఈ రికార్డు సృష్టించాడు. తద్వారా అంతర్జాతీయ క్రికెట్లో ఒకే ఓవర్లో ఆరు సిక్సర్లు కొట్టిన మూడో క్రికెటర్‌గా నిలిచాడు. అదే విధంగా టీ20ల్లో ఈ ఫీట్ సాధించిన తొలి విండీస్ క్రికెటర్‌గా, పొట్టి ఫార్మాట్ చరిత్రలో రెండో ఆటగాడిగా చరిత్రకెక్కాడు. ఇక ఇంతకు ముందు భారత మాజీ ఆటగాడు యువరాజ్ సింగ్ ఈ ఘనత సాధించిన సంగతి తెలిసిందే. టీ20 ప్రపంచకప్-2007లో భాగంగా ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌లో స్టువర్ట్ బ్రాడ్ బౌలింగ్‌లో యువీ ఈ ఫీట్ నమోదు చేశాడు. ఇదిలా ఉంటే.. ఇంటర్నేషనల్ క్రికెట్లో ఒకే ఓవర్లో సిక్స్ సిక్సర్లు బాదిన తొలి క్రికెటర్‌గా దక్షిణాఫ్రికా క్రికెటర్ హెర్షెల్ గిబ్స్ చరిత్రకెక్కాడు. ఐసీసీ వన్డే వరల్డ్ కప్-2007లో నెదర్లాండ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఈ రికార్డు నమోదు చేశాడు. అంతర్జాతీయ క్రికెట్లో సిక్స్ సిక్సర్ల విశేషాలు ►ఒకే ఓవర్లో ఆరు సిక్సర్లు బాదిన మూడో క్రికెటర్‌గా వెస్టిండీస్ సూపర్‌స్టార్ కీరన్ పొలార్డ్ నిలిచాడు. ►శ్రీలంకతో జరిగిన మొదటి టీ20 మ్యాచ్‌లో ఈ ఘనత దక్కించుకున్నాడు. ►లంక బౌలర్ అకిల ధనంజయ బౌలింగ్‌లో ఈ రికార్డు సాధించాడు. ►ఒకే ఓవర్లో ఆరు సిక్సర్లు కొట్టిన మొదటి క్రికెటర్‌గా దక్షిణాఫ్రికా ఆటగాడు హెర్షెల్ గిబ్స్ చరిత్రకెక్కాడు. ►ఐసీసీ వరల్డ్ కప్-2007లో భాగంగా గిబ్స్ ఈ ఘనత సాధించాడు. ►నెదర్లాండ్స్ బౌలర్ డాన్ వాన్ బంగే బౌలింగ్‌లో ఈ రికార్డు నమోదు చేశాడు. ►టీ20 చరిత్రలో ఒకే ఓవర్లో ఆరు సిక్సర్లు బాదిన క్రికెటర్‌గా టీమిండియా మాజీ ఆటగాడు యువరాజ్ సింగ్ చరిత్ర సృష్టించాడు. ►టీ20 ప్రపంచకప్-2007లో ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఈ ఫీట్ నమోదు చేశాడు. ►స్టువర్ట్ బ్రాడ్ బౌలింగ్‌ను చీల్చి చెండాడి యువీ సరికొత్త రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. చదవండి: పొలార్డ్.. హ్యాట్రిక్ సంతోషం లేకుండా చేశావ్ Take a bow Skipper!🔥 🔥 🔥 🔥 🔥 🔥 The 1st West Indian to hit 6️⃣ sixes in an over in a T20I!🤯 #WIvSL #MenInMaroon Live Scorecard⬇️ https://t.co/MBDOV534qQ pic.twitter.com/etkxX7l7bq — Windies Cricket (@windiescricket) March 4, 2021 -
పొలార్డ్.. హ్యాట్రిక్ సంతోషం లేకుండా చేశావ్
ఆంటిగ్వా: వెస్టిండీస్, శ్రీలంక మధ్య గురువారం తొలి టీ20 మ్యాచ్ జరిగిన సంగతి తెలిసిందే. అయితే లో స్కోరింగ్ మ్యాచ్‌లో రెండు అరుదైన రికార్డులు నమోదయ్యాయి. అయితే పొలార్డ్ రికార్డు ముందు రెండో రికార్డ్ పాపులర్ అవలేదు. అసలు విషయంలోకి వెళితే.. విండీస్ ఇన్నింగ్స్ సమయంలో శ్రీలంక స్పిన్నర్ అఖిల ధనుంజయ హ్యాట్రిక్‌ను నమోదు చేశాడు. ఇన్నింగ్స్ 3వ ఓవర్ వేసిన ధనుంజయ మూడు వరుస బంతుల్లో ఓపెనర్ ఎవిన్ లూయిస్(28 పరుగులు), క్రిస్ గేల్( 0 పరుగులు), నికోలస్ పూరన్(0 పరుగులు)లను ఔట్ చేసి ఈ ఫీట్ సాధించాడు. తద్వారా లంక తరపున హ్యాట్రిక్ సాధించిన మూడో బౌలర్‌గా ..ఓవరాల్‌గా 13వ ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు. ఇంతకముందు లంక నుంచి లసిత్ మలింగ రెండుసార్లు(2017,2019), తిసారా పెరీరా( 2016) హ్యాట్రిక్‌ను నమోదు చేశారు. అయితే హ్యాట్రిక్ తీసిన ఆనందం ధనుంజయకు ఎంతోసేపు నిలవలేదు. విండీస్ విధ్వంసం కీరన్ పొలార్డ్ ధనుంజయ బౌలింగ్‌లోనే ఆరు బంతుల్లో ఆరు సిక్సర్లు బాది చరిత్ర సృష్టించాడు. అంతర్జాతీయ క్రికెట్లో ఒకే ఓవర్లో ఆరు సిక్సర్లు బాదిన మూడో క్రికెటర్‌గా.. అదే విధంగా టీ20ల్లో ఈ రికార్డు నమోదు చేసిన రెండో ఆటగాడిగా పొలార్డ్ రికార్డులకెక్కాడు. ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన లంక 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 131 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్ చేసిన విండీస్ పొలార్డ విధ్వంసంతో 13.1 ఓవర్లలోనే 6 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేధించింది. తద్వారా మూడు టీ20ల సిరీస్‌లో విండీస్ 1-0 ఆధిక్యంలో నిలిచింది. ఇరు జట్ల మధ్య రెండో టీ20 మార్చి 5న ఆంటిగ్వా వేదికలోనే జరగనుంది. చదవండి: రెచ్చిపోయిన పొలార్డ్.. ఒకే ఓవర్లో ఆరు సిక్సర్లు -
పొలార్డ్ సంచలనం.. ఒకే ఓవర్లో ఆరు సిక్సర్లు
అంటిగ్వా: శ్రీలంకతో జరిగిన తొలి టీ20 మ్యాచ్‌లో వెస్టిండీస్ ఆటగాడు కీరన్ పొలార్డ్ అరుదైన ఘనత సాధించాడు. అంతర్జాతీయ క్రికెట్లో ఒకే ఓవర్లో ఆరు సిక్సర్లు బాదిన మూడో క్రికెటర్‌గా నిలిచాడు. అదే విధంగా ట్వంటీ ట్వంటీల్లో ఈ రికార్డు నమోదు చేసిన రెండో ఆటగాడిగా చరిత్రకెక్కాడు. లంక బౌలర్ అకిల ధనంజయ బౌలింగ్‌లో పొలార్డ్ ఈ ఫీట్ సాధించాడు. ఇక అంతకు ముందు పొట్టి ఫార్మాట్లో ఈ ఘనత సాధించిన రికార్డును టీమిండియా మాజీ ఆటగాడు యువరాజ్ సింగ్ తన పేరిట లిఖించుకున్న సంగతి తెలిసిందే. టీ20 ప్రపంచకప్-2007లో ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌లో యువీ ఈ ఫీట్ నమోదు చేశాడు. స్టువర్ట్ బ్రాడ్ బౌలింగ్‌ను చీల్చి చెండాడి చరిత్ర సృష్టించాడు. కాగా మొత్తంగా అంతర్జాతీయ క్రికెట్లో ఒకే ఓవర్లో ఆరు సిక్సర్లు బాదిన తొలి ఆటగాడిగా దక్షిణాఫ్రికా క్రికెటర్ హెర్షెల్ గిబ్స్ చరిత్రకెక్కాడు. ఐసీసీ వన్డే వరల్డ్ కప్-2007లో భాగంగా ఈ ఘనత సాధించాడు. నెదర్లాండ్స్ బౌలర్ డాన్ వాన్ బంగే బౌలింగ్‌లో ఈ రికార్డు నమోదు చేశాడు. సిరీస్‌లో ముందంజలో వెస్టిండీస్ కాగా 3 టెస్టులు, మూడు వన్డేలు, 3 టీ20ల నిమిత్తం శ్రీలంక ప్రస్తుతం వెస్టిండీస్ లో పర్యటిస్తోంది. ఈ క్రమంలో మొదటి టీ20లో టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న ఆతిథ్య జట్టు.. 4 వికెట్ల తేడాతో గెలుపొందింది. సిరీస్‌లో 1-0 తేడాతో ముందంజలో నిలిచింది. పొలార్డ్ 38 పరుగుల(11 బంతులు, ఆరు సిక్సర్లు)తో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. లంక బౌలర్లలో అకిత ధనంజయకు 3, వనిందు హసరంగకు 3 వికెట్లు దక్కాయి. You will never have a better Mastercard Priceless Moment than this one! 👌🏾 @KieronPollard55 became the 1st West Indian to hit 6 sixes in a T20I over!#WIvSL #MastercardPricelessMoment #MenInMaroon pic.twitter.com/YOGItXOY8H — Windies Cricket (@windiescricket) March 4, 2021 చదవండి: నాలుగో టెస్టు లైవ్ అప్డేట్స్: టాస్ గెలిచిన ఇంగ్లండ్ -
59 పరుగులకే 5 వికెట్లు కోల్పోయినా గానీ
ఆక్లాండ్: న్యూజిలాండ్- వెస్టిండీస్ జట్ల మధ్య మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్ నేడు ప్రారంభమైంది. తొలి మ్యాచ్‌కు ఆక్లాండ్‌లోని ఈడెన్ పార్క్ మైదానం వేదికైంది. టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న కివీస్ జట్టు, విండీస్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. కాగా, వర్షం కారణంగా మ్యాచ్‌ను 16 ఓవర్లకు కుదించారు. ఇక ఆరంభంలో తడబడినా కెప్టెన్ కీరన్ పొలార్డ్ , ఫాబియన్ అలెన్ దూకుడుగా ఆడటంతో విండీస్ జట్టు నిర్ణీత ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి, 180 పరుగులు చేసింది. 59 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉన్న వేళ ఈ జోడీ 84 పరుగుల భాగస్వామ్యంతో భారీ స్కోరు సాధించింది. ఇక మ్యాచ్‌ను కుదించిన కారణంగా డక్‌వర్త్ లూయిస్ నిబంధన ప్రకారం 176 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆతిథ్య జట్టు ప్రస్తుతం బ్యాటింగ్ చేస్తోంది. 10 ఓవర్లు ముగిసే సరికి 4 వికెట్లు కోల్పోయి 118 పరుగులు చేసింది.(చదవండి: జాగ్రత్త.. నోరు అదుపులో పెట్టుకోండి: అక్తర్ ఫైర్) టపాటపా వికెట్లు.. కానీ ఆండ్రూ ఫ్లెచర్, బ్రాండన్ కింగ్ వెస్టిండీస్ ఇన్నింగ్స్‌ను ఆరంభించారు. న్యూజిలాండ్ కెప్టెన్ టిమ్ సౌథీ వైడ్‌తో ఖాతా తెరిచాడు. తొలి ఓవర్ ముగిసేసరికి పర్యాటక జట్టు 8 పరుగులు చేసింది. కివీస్ ఫాస్ట్ పేసర్లు ఫెర్గూసన్, సౌథీ విండీస్ ఆటగాళ్లను ముప్పుతిప్పలు పెట్టారు. ఫెర్గూసన్ ఒకే ఓవర్లో ఫ్లెచర్, హెట్‌మెయిర్‌ను అవుట్ చేయగా.. సౌథీ బ్రాండన్ కింగ్‌ను పెవిలియన్‌కు చేర్చాడు. ఆ వెంటనే క్రీజులోకి వచ్చిన పావెల్ సైతం పరుగుల ఖాతా తెరవకుండానే వెనుదిరిగాడు. సౌథీ బౌలింగ్‌లో ఫెర్గూసన్‌కు క్యాచ్ ఇచ్చి వికెట్ సమర్పించుకున్నాడు. ఆ తర్వాత నికోలస్ పూరన్‌ను ఫెర్గూసన్ అవుట్ చేయడంతో కేవలం 59 పరుగులకే విండీస్ జట్టు ఐదు వికెట్లు కోల్పోయింది. ఇక అప్పటికే క్రీజులో ఉన్న పొలార్డ్, అలెన్‌తో కలిసి ఇన్నింగ్స్‌ను చక్కదిద్దే ప్రయత్నం చేశాడు. ఇద్దరూ కలిసి స్కోరు బోర్డును పరిగెత్తించారు. కానీ మరోసారి బంతితో మ్యాజిక్ చేసిన ఫెర్గూసన్ అలెన్‌ను, ఆ వెంటనే పాల్‌ను పెవిలియన్‌కు చేర్చాడు. అలా పద్నాలుగు ఓవర్లు ముగిసే సరికి 7 వికెట్లు కోల్పోయిన వెస్టిండీస్ జట్టు 146 పరుగులు చేసింది. ఇక 37 బంతుల్లో 75 పరుగులతో అజేయంగా నిలిచిన పొలార్డ్ కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడి.. జట్టు భారీ స్కోరు(180) సాధించడంలో కీలక పాత్ర పోషించాడు. -
ప్రపంచకప్ తర్వాత ఇదే పెద్ద మ్యాచ్
కరోనా కారణంగా ఇళ్లకే పరిమితమైన క్రికెట్ అభిమానులకు అసలైన మజా ఇస్తున్న ఐపీఎల్ చివరి దశకు చేరుకుంది. నేటి ఫైనల్ మ్యాచ్‌లో డిఫెండింగ్ ఛాంపీయన్ను ఢిల్లీ క్యాపిటల్స్ ఢీ కొట్టేందుకు సిద్ధమైంది. నాలుగు సార్లు ఐపీఎల్ విజేతగా నిలిచిన ముంబై ఇండియన్స్ మరోసారి ట్రోఫీని ముద్దాడాలని ఉరకలు వేస్తోంది. మరోవైపు తొలిసారి ఫైనల్‌కు చేరిన ఢిల్లీ.. ఒక్క సారైనా ట్రోఫీ గెలవాలని ఆరాటపడుతోంది. తామే కప్ గెలుస్తామని ఇరు జట్ల ఆటగాళ్లు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఫైనల్ మ్యాచ్‌కు ముందు ముంబై ఆల్ రౌండర్ కీరన్ పోలార్డ్ మాట్లాడుతూ.. ప్రపంచకప్ ఫైనల్ తర్వాత క్రికెట్లో ఐపీఎల్ ఫైనలే అతి పెద్ద మ్యాచ్ అని అభిప్రాయపడ్డాడు. ఫైనల్ అనగానే సహజంగానే ఒత్తిడి ఉంటుందని, ఆటగాళ్లు అందరూ ఒత్తిడికి గురవుతారని పేర్కొన్నాడు. కానీ కప్ గెలవాలంటే సాధారణ మ్యాచ్‌గానే భావించాలని, ఎలాంటి తప్పులు జరగనివ్వద్దని ఆటగాళ్లకు సూచించారు. ప్రశాంతంగా గ్రౌండ్లో అడుగుపెట్టి వాతావరణాన్ని ఆస్వాదిస్తూ ఆడండి అంటూ పోలార్డ్ ఒక వీడియోలో సందేశమిచ్చాడు. ఈ వీడియోని ముంబై ఇండియన్స్ అధికారిక ట్విట్టర్లో మంగళవారం సాయంత్రం పోస్టు చేసింది. ముంబై ఇండియన్స్ ఇది వరకే 4 సార్లు (2013, 2015, 2017, 2019) సీజన్లో ట్రోఫీ కైవసం చేసుకుంది. కానీ ఢిల్లీ క్యాపిటల్స్ ఫైనల్ చేరడం ఇదే మొదటిసారి. క్వాలిఫైయర్-2 లో సన్‌రైజర్స్ ను ఓడించి ఫైనల్‌కు చేరింది. ఇక ఫైనల్ మ్యాచ్ గురించి ముంబై ఇండియన్స్ కోచ్ మహేల జయవర్దనే మాట్లాడుతూ.. ‘ఇది క్రికెట్ లో ఒక మ్యాచ్ మాత్రమే. దీని గురించి తాము ఎక్కువగా ఆలోచించడం లేదు. మేము ప్రయత్నాలని నమ్ముతూ, నైపుణ్యాలని అమలు చేయడానికి ప్రయత్నిస్తాం. ఇది బ్యాట్‌కి బంతికి, పరుగులకి వికెట్లకి మధ్య పోరాటం. కాబట్టి ఆ పోరాటాన్ని ఆస్వాదించడానికి ప్రయత్నిస్తాం’ అని పేర్కొన్నాడు. మా జట్టులో కొందరి ఆటగాళ్లకు ఫైనల్ మ్యాచ్ ఆడిన అనుభవం ఉందని, క్లిష్ట సమయంలో ఎలా ఆడాలో వారికి తెలుసన్నారు. తుది పోరులో ఖచ్చితంగా విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేశాడు. -
'ప్లే ఆఫ్ ఆడకు.. అప్పుడే నీ విలువ తెలుస్తుంది'
షార్జా : ఐపీఎల్ 13వ సీజన్లో మంగళవారం ముంబై ఇండియన్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ మధ్య చివరి లీగ్ మ్యాచ్ జరిగిన సంగతి తెలిసిందే. ఈ మ్యచ్‌లో ఎస్ఆర్హెచ్ ముంబైపై 10 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించి ప్లేఆఫ్స్‌కు చేరింది. ఈ మ్యాచ్ విజయం సంగతి పక్కన పెడితే ముంబై ఇండియన్స్ వైస్ కెప్టెన్ కీరన్ పొలార్డ్ తన ఇన్‌స్టాగ్రామ్‌తో పాటు ట్విటర్లో ఒక ఆసక్తికర పోస్ట్‌ను పెట్టాడు. పొలార్డ్‌పై ఎవరో తెలియని కోపం ప్రదర్శిస్తున్నారనేలా ఆ కామెంట్ ఉంది. 'రహస్యంగా స్నేహం ముసుగులో నన్ను అణిచివేసే వారికంటే .. నేను శత్రువుగా భావించని వారు నన్ను ఎక్కువ ద్వేషిస్తున్నారు.'అంటూ పోస్ట్ చేశాడు. అయితే ఆ కామెంట్ ఎవరిని ఉద్దేశించి చేశాడనేది మాత్రం తెలియదు. తాజాగా వన్డే జట్టుకు పొలార్డ్ స్థానంలో జాసన్ హోల్డర్‌ను ఎంపిక చేశారు. అలాగే రోహిత్ గైర్హాజరీలో ఐపీఎల్ 13వ సీజన్లో ముంబై ఇండియన్స్ జట్టుకు కెప్టెన్‌గా ప్రాతినిధ్యం వహించిన సంగతి తెలిసిందే. అయితే ఎస్ఆర్హెచ్ మ్యాచ్‌కు రోహిత్ అందుబాటులోకి రావడంతో పొలార్డ్ వైస్ కెప్టెన్‌గా వ్యవహరించాడు. ఈ రెండు విషయాలను దృష్టిలో పెట్టుకొని సోషల్ మీడియాలో పెద్ద చర్చే నడిచింది. కొందరేమో పొలార్డ్ ఆ కామెంట్ చేయడం వెనుక ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ అని.. మరికొందరు మాత్రం జాసన్ హోల్డర్ ఉన్నాడని అంటున్నారు. ఇంకొందకు మాత్రం ఇంకాస్త ముందుకెళ్లి 'పొలార్డ్.. నువ్వు ఢిల్లీతో జరిగే ప్లేఆఫ్ మ్యాచ్‌లో ఆడకు.. అప్పుడే నీ విలువ రోహిత్ శర్మకు అర్థమవుతుంది. అంటూ' కామెంట్స్ చేశాడు. కాగా గురువారం జరగనున్నమొదటి క్వాలిఫయర్ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ ఢిల్లీ క్యాపిటల్స్‌తో తలపడనుంది. (చదవండి : 'ధోని ఇంపాక్ట్ ఎంత అనేది అప్పుడు తెలిసింది') -
సూర్య ప్రదర్శన అద్భుతం.. అయినా నిరాశతోనే
అబుదాబి : ఐపీఎల్ 13వ సీజన్లో ముంబై ఇండియన్స్ జైత్రయాత్ర కొనసాగుతున్న సంగతి తెలిసిందే. బుధవారం ఆర్సీబీతో జరిగిన మ్యాచ్‌లో ముంబై 5 వికెట్ల తేడాతో గెలిచి ప్లేఆఫ్ బెర్త్‌ను దాదాపు ఖరారు చేసుకుంది. ఈ మ్యాచ్‌లో అనుకున్నంత మెరుపులు లేవు.. భారీ హిట్టింగ్‌లు లేవు.. కానీ ముంబై ఖాతాలో విజయం చేరిందంటే దానికి ప్రధాన కారణం సూర్య కుమార్ యాదవ్ అని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఆర్సీబీ విధించిన 165 పరుగుల లక్ష్యాన్ని ముంబై చేధించడంలో సింహబాగం సూర్య ఆడిన ఇన్నింగ్స్ నుంచి వచ్చినవే అని చెప్పొచ్చు. 43 బంతుల్లో 79 పరుగుల నాకౌట్ ఇన్నింగ్స్ ఆడి ముంబైని ఒంటిచేత్తో ప్లేఆఫ్‌కు చేర్చాడు. సూర్యకుమార్ ఆడిన ఇన్నింగ్స్‌పై పలువురు మాజీ క్రికెటర్లు ప్రశంసలు కురిపించారు.. అదే సమయంలో ఆస్ట్రేలియా పర్యటన కోసం సూర్యకుమార్‌ను ఎంపిక చేయకపోవడంపై సెలక్షన్ కమిటీ నిర్ణయాన్ని తప్పుబడుతున్నారు. ఇదే విషయంపై మ్యాచ్ అనంతరం ముంబై ఇండియన్స్ తాత్కాలిక కెప్టెన్ కీరన్ పొలార్డ్ స్పందించాడు. (చదవండి : సూర్యకుమార్‌పై ప్రశంసలు.. కాస్త ఓపిక పట్టు!) 'ఈరోజు సూర్యకుమార్ అద్భుతమైన ప్రదర్శన కనబరిచాడు. అతనిలో ఉన్న నైపుణ్యతకు ఎప్పుడో టీమిండియాలో అడుగుపెట్టాల్సింది. అయితే తాజాగా ఆసీస్ పర్యటనకు సూర్యను ఎంపిక చేయకపోవడం పట్ల అతను తీవ్ర నిరాశ చెంది ఉంటాడు. ఒక కుర్రాడు మూడో స్థానంలో వచ్చి అలాంటి స్ట్రైక్‌రేట్‌తో ఆడడం ఎలా ఉంటుందో ఊహించుకోండి. ఒక వైపు వికెట్లు పడుతున్నా మరోవైపు ఒంటరిపోరాటం చేశాడు. అతను నిలకడగా ఆడటమే మాకు చేసే అత్యంత మేలు. ఒక ఆటగాడిగా ఇలా నిలకడగా ఆడుతుంటే రివార్డులు వాటంతట అవే వస్తాయి. నేనేం చేయాలని జట్టు ఆశిస్తుందో అదే చేస్తాను. జట్టు బాగా ఆడితే సంతోషంగా ఉంటా.' అంటూ పొలార్డ్ చెప్పుకొచ్చాడు. (చదవండి : సూర్య ప్రతాపం.. ప్లేఆఫ్స్‌కు ముంబై) వాస్తవానికి గత రెండేళ్లుగా సూర్యకుమార్ యాదవ్ స్థిరమైన ప్రదర్శన కనబరుస్తున్నాడు. ఒక అనామక ప్లేయర్‌గా ఐపీఎల్లో అడుగుపెట్టిన సూర్యకుమార్ యాదవ్ ముంబై ఇండియన్స్‌కు వచ్చిన తర్వాత బాగా రాటుదేలాడు. 2018 నుంచి ముంబై తరపున ఐపీఎల్లో ఆడుతున్న అతను మంచి ప్రదర్శన కనబరిచాడు. తాజాగా ఆస్ట్రేలియా పర్యటన కోసం టీ20 సిరీస్‌కు సూర్య పేరును పరిగణలోకి తీసుకుంటారని అంతా భావించారు. కానీ సూర్యను కనీసం పరిగణలోకి తీసుకోలేదు. కానీ ఇదేమి పట్టించుకోని సూర్యకుమార్ తన ఆట తను ఆడాడు. ఏదో ఒకరోజు టీమిండియా జట్టులోకి పిలుపు వస్తుందని అతను ఆశతో ఉన్నాడు. సూర్య కుమార్ ఆశ త్వరలోనే నెరవేరాలని కోరుకుందాం. -
100 లోపే అనుకున్నాం, కానీ అతని వల్లే
దుబాయ్: ఐపీఎల్ టోర్నీ చరిత్రలో అత్యంత పేలవ ప్రదర్శన చేసిన సూపర్ కింగ్స్ తాజా సీజన్లో ప్లే ఆప్స్‌కు దూరమైంది. శుక్రవారం ముంబైతో జరిగిన మ్యాచ్‌లో ఒక్క సామ్ కరన్ మినహా, మిగతా సభ్యులంతా విఫలమయ్యారు. అతని ఒంటరి పోరుతోనే చెన్నై సెంచరీ మార్కును దాటగలిగింది. ప్రత్యర్థిని 100 పరుగుల లోపే కట్టడి చేయాలని భావించినా సామ్ కరన్ అద్భుత ప్రదర్శనతో అది సాధ్యం కాలేదని ముంబై కెప్టెన్ కీరన్ పొలార్డ్ చెప్పుకొచ్చాడు. కరన్ కొరకరాని కొయ్యలా మారడంతో చెన్నై ఆ మాత్రం పరుగులు చేయగలిగిందని అన్నాడు. తొలి పవర్ ప్లే ముగిసే సమయానికి టాప్ 5 వికెట్లను కూల్చడం ఆనందాన్నిచ్చిందని పొలార్డ్ తెలిపాడు. ట్రెంట్ బౌల్ట్, జస్ప్రీత్ బుమ్రా అదిరిపోయే బౌలింగ్‌తో చెన్నై ఆటగాళ్లు తేరుకోలేకపోయారని పోస్ట్ మ్యాచ్ ప్రజెంటేషన్‌లో వ్యాఖ్యానించాడు. సమష్టి ప్రదర్శనతో ముంబై గెలిచిందని తెలిపాడు. కాగా, 5 వికెట్లు కోల్పోయి అత్యల్ప స్కోర్ నమోదు దిశగా పయనిస్తున్న సీఎస్కేను సామ్ కరన్ ఆ ప్రమాదం నుంచి తప్పించాడు. ఆరో ఓవర్ మూడో బంతికి క్రీజ్‌లోకి వచ్చిన అతను బౌలర్లందరినీ సమర్థంగా ఎదుర్కొంటూ చివరి బంతి వరకు పట్టుదలగా నిలిచి పరుగులు రాబట్టాడు. రాహుల్ చహర్, కూల్టర్‌నైల్ వరుస ఓవర్లలో ఒక్కో సిక్స్ కొట్టి అతను జోరును ప్రదర్శించాడు. అద్భుత గణాంకాలతో చెన్నై ఆటగాళ్లకు చెమటలు పట్టంచిన బౌల్ట్ బౌలింగ్‌లోనూ పరుగులు రాబట్టాడు. బౌల్ట్ వేసిన 20వ ఓవర్లో కరన్ బ్యాటింగ్ హైలైట్‌గా నిలిచింది. అప్పటివరకు 3 ఓవర్లలో 5 పరుగులే ఇచ్చిన బౌల్ట్ గణాంకాలు ఈ ఓవర్‌తో మారిపోయాయి. ఈ ఓవర్లో మూడు ఫోర్లు బాదిన కరన్ 46 బంతుల్లో అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఆఖరి బంతికి అద్భుత యార్కర్‌తో కరన్‌ను బౌల్డ్ చేసి బౌల్ట్ సంతృప్తి చెందాడు. ఇక 114 పరుగుల లక్ష్యాన్ని ముంబై 12.2 ఓవర్లలోనే ఛేదించింది. ఓపెనర్లు ఇషాన్ కిషన్ (37 బంతుల్లో 68 నాటౌట్; 6 ఫోర్లు, 5 సిక్సర్లు), డికాక్ (37 బంతుల్లో 46 నాటౌట్; 5 ఫోర్లు, 2 సిక్సర్లు) అజేయంగా నిలిచారు. 11 మ్యాచ్‌లలో ఎనిమిదింట పరాజయం పాలైన చెన్నై జట్టు ఇక ముందుకు వెళ్లేందుకు అన్ని దారులు మూసుకుపోయాయి. కాగా, ఈ విజయంతో ముంబై ఢిల్లీని వెనక్కి నెట్టి తొలి స్థానాన్ని ఆక్రమించింది. గాయం కారణంగా రోహిత్ ఈ మ్యాచ్‌కు దూరమవడంతో పొలార్డ్ కెప్టెన్‌గా బాధ్యతలు నిర్వర్తించాడు. -
పొలార్డ్ బ్యాగ్‌లు సర్దుకోమన్నాడు: బ్రేవో
దుబాయ్: ఈ ఐపీఎల్ సీజన్ నుంచి సీఎస్కే ఆల్‌రౌండర్ డ్వేన్ బ్రేవో వైదొలిగిన సంగతి తెలిసిందే. గాయం కారణంగా టోర్నీ మధ్య నుంచి బ్రేవో తప్పుకున్నాడు. ఆరంభంలో కొన్ని మ్యాచ్‌లకు గాయం కారణంగా దూరమైన బ్రేవో.. ఈ టోర్నీలో పూర్తిగా ఆస్వాదించుకుండానే తప్పుకున్నాడు. సీఎస్కేది కూడా దాదాపు నిష్ర్కమించే పరిస్థితి. ఇప్పటివరకూ 10 మ్యాచ్‌లు ఆడిన సీఎస్కే ఏడింట ఓటమి చూసింది. ఇంకా నాలుగు మ్యాచ్‌లు మాత్రమే ఉండటంతో సీఎస్కే వాటిలో విజయం సాధించినా ప్లేఆఫ్స్‌కు చేరడం అసాధ్యం. (ఆరుసార్లు ఆర్చర్‌కే దొరికేశాడు..!) ముంబై ఇండియన్స్‌తో ఈరోజు సీఎస్కే రెండో అంచె మ్యాచ్ జరుగనుంది. తొలి అంచె మ్యాచ్‌లో సీఎస్కే విజయం సాధించగా, రెండో అంచె మ్యాచ్‌లో ముంబై గెలిచి ప్రతీకారం తీర్చుకోవాలని చూస్తోంది. ఈ క్రమంలోనే కొన్ని విషయాలను స్టార్ స్పోర్ట్స్ చాట్ షోలో బ్రేవో పంచుకున్నాడు. దాదాపు ఏడేళ్ల నాటి ఘటనను బ్రేవో గుర్తు చేసుకున్నాడు. ముంబై ఇండియన్స్‌తో జరిగిన ఫైనల్ నాటి జ్ఞాపకాలను నెమరువేసుకున్నాడు. ఆ మ్యాచ్‌లో ముంబై విజయం సాధించి ట్రోఫీని కైవసం చేసుకోగా, సీఎస్కే రన్నరప్‌గా సరిపెట్టుకుంది. అయితే ఆ మ్యాచ్‌కు ముందు తనను ముంబై ఇండియన్స్ ఆల్ రౌండర్ కీరోన్ పొలార్డ్ తనను టీజ్ చేశాడని బ్రేవో చెప్పుకొచ్చాడు. ‘పొలార్డ్ అప్పుడు ఒక వాట్సాప్ మెసేజ్ పంపాడు. ఇక మీ బ్యాగ్‌లు సర్దుకోండి అని టెక్స్ట్ మెసేజ్ చేశాడు. మీరు ఇంటికి వెళ్లడానికి సిద్ధంగా ఉండండి’ అని అన్నాడు. దానికి ఓకే అని రిప్లే ఇవ్వడమే కాకుండా ప్రొబ్లమ్ ఏమీ లేదని తిరిగి మెసేజ్ చేశానన్నాడు. ప్లేఆఫ్‌లో ముంబైపై గెలిచి సీఎస్కే ఫైనల్‌కు క్వాలిఫై అయిన విషయాన్ని ప్రస్తావించిన బ్రేవో.. ఎవరు ఇంటికి వెళతారో చూద్దాం అని పొలార్డ్‌కు రిప్లే ఇచ్చానన్నాడు. 2013 ఫైనల్ అనేది నిజంగా ఒక గొప్ప మ్యాచ్ అని బ్రేవో తెలిపాడు. అప్పటివరకూ ముంబైని తాము ఓడిస్తూ వస్తే, అప్పుడు వారు తమపై గెలిచి సంతృప్తి చెందారన్నాడు. అప్పట్నుంచి ఇరుజట్ల మధ్య ఎప్పుడు పోరు జరిగినా ఆసక్తికరంగానే ఉంటుందన్నాడు. -
బిషప్ టీమ్‌లో ఏడుగురు భారత క్రికెటర్లు..!
దుబాయ్: ఈ ఐపీఎల్ సీజన్లో ముంబై ఆల్‌రౌండర్ కీరోన్ పొలార్డ్ అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. ప్రస్తుత ఐపీఎల్‌కు ముందు జరిగిన కరీబియన్ ప్రీమియర్ లీగ్(సీపీఎల్)లో సత్తాచాటి అక్కడ ఫామ్‌నే ఇక్కడ కొనసాగిస్తున్న పొలార్డ్‌ను దిగ్గజ క్రికెటర్ ఇషాన్ బిషప్ తన ఐపీఎల్ జట్టుకు కెప్టెన్‌గా ఎంపిక చేశాడు. వెస్టిండీస్‌కు చెందిన మాజీ బౌలర్ బిషప్.. ప్రస్తుతం ఐపీఎల్లో కామెంటేటర్‌గా వ్యవహరిస్తున్నాడు. ఈ క్రమంలోనే తన ఫాంటసీ ఐపీఎల్ జట్టును ఎంపిక చేశాడు. దీనికి పొలార్డ్‌ను కెప్టెన్‌గా ఎంపిక చేసిన బిషప్.. ఏడుగురు భారత క్రికెటర్లను జట్టులోకి తీసుకున్నాడు. (అంతా ధోని వల్లే..: ఆర్సీబీ బౌలర్) ఏదైనా టోర్నీ జరుగుతున్నప్పుడు తమ జట్లను ప్రకటిస్తూ ఉంటారు మాజీలు. ఈ క్రమంలోనే బిషప్ కూడా జట్టును ఎంపిక చేశాడు. ఇందులో పొలార్డ్ సారథిగా ఉండగా, కేఎల్ రాహుల్, డుప్లెసిస్‌లను ఓపెనర్లగా తీసుకున్నాడు. ఫస్ట్ డౌన్ ఆటగాడిగా సూర్యకుమార్ యాదవ్ ఎంచుకోగా, సెకండ్ డౌన్లో శ్రేయస్ అయ్యర్‌కు స్థానం కల్పించాడు. హార్దిక్ పాండ్యా, రషీద్ ఖాన్‌లను ఆల్‌రౌండర్ల కోటాలో తీసుకున్న బిషప్..ఫాస్ట్ బౌలర్లుగా మహ్మద్ షమీ, కగిసో రబడ, బుమ్రాలను తీసుకున్నాడు. స్పెషలిస్టు స్పిన్నర్‌గా యజ్వేంద్ర చహల్‌ను ఎంపిక చేశాడు. కాగా, ఆర్సీబీ కెప్టెన్ విరాట్ కోహ్లికి బిషప్ చోటు కల్పించలేదు. ఈ ఐపీఎల్ ఫామ్ ఆధారంగా జట్టును ఎంపిక చేశాడు బిషప్.(ఐపీఎల్ చరిత్రలోనే ‘ఫాస్టెస్ట్’ రికార్డు) -
పొలార్డ్‌ను అనుసరించిన దినేష్ కార్తీక్
అబుదాబి : ఐపీఎల్ 13వ సీజన్లో క్రికెట్ మజాను అందించడంతో పాటు మరొకఅంశం కూడా తెగ ఊపేస్తుంది. అదే 'బ్రేక్ ది బియర్డ్ చాలెంజ్'. ముంబై ఆటగాడు హార్దిక్ పాండ్యా మొదలుపెట్టిన ఈ బ్రేక్ ది బియర్డ్ చాలెంజ్ ఇప్పుడు యమ క్రేజ్ సంపాదించింది. మొదట పాండ్యా తన బియర్డ్‌ను తొలగించి విండీస్ విధ్వంసం కీరన్ పొలార్డ్‌కు చాలెంజ్ విసిరాడు. కాగా పొలార్డ్ పాండ్యా చాలెంజ్‌ను స్వీకరించి రాజస్తాన్‌తో మ్యాచ్‌కు ముందు ఫ్రెంచ్ కట్లో ఉన్న వీడియో రిలీజ్ చేశాడు. ఆ వీడియోలో పొలార్డ్ గడ్డంతో కాకుండా ఫ్రెంచ్కట్తో న్యూలుక్లో దర్శనమిచ్చాడు. తర్వాత ఈ చాలెంజ్‌ను కేకేఆర్ కెప్టెన్ దినేష్ కార్తీక్‌ను నామినేట్ చేశాడు. (చదవండి : నయా చాలెంజ్.. కొత్త లుక్‌లో పొలార్డ్) పొలార్డ్ చాలెంజ్‌ను స్వీకరించిన దినేష్ కార్తీక్ బుధవారం తన ఇన్‌స్టాలో దానికి సంబంధించిన వీడియోనూ షేర్ చేశాడు. ఆ వీడియోలో మొదట గుబురు గడ్డంతో కనిపించిన కార్తీక్.. ఆపై ఫ్రెంచ్ కట్లో మెరిసాడు. కాగా కేకేఆర్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న దినేష్ కార్తీక్ అటు కెప్టెన్‌గానూ.. ఇటు బ్యాట్స్‌మన్‌గానూ విఫలమవుతూ వస్తున్నాడు. (చదవండి : 'ఈ సమయంలో గేల్ చాలా అవసరం') View this post on Instagram @kieron.pollard55 Challenge accepted 😎 As the season intensifies, time to hit a new level & #breakthebeard. KKR 1 - MI 1. #korbolorbojeetbo #GameFaceOn #ipl #MIvsKKR @break_the_beard A post shared by Dinesh Karthik (@dk00019) on Oct 6, 2020 at 9:29pm PDT -
నయా చాలెంజ్.. కొత్త లుక్‌లో పొలార్డ్
అబుదాబి: ముంబై ఇండియన్స్ స్టార్ ప్లేయర్ కీరోన్ పొలార్డ్ నయా లుక్‌లో కనిపిస్తున్నాడు. తన మొత్తం గడ్డాన్ని తీసేసి కేవలం ఫ్రెంచ్ కట్లో కనిపిస్తూ ముంబై ఫ్యాన్స్‌కు సర్ప్రైజ్ ఇచ్చాడు. తన సహచర ఆటగాడు హార్దిక్ పాండ్యా విసిరిన ‘బ్రేక్ ద బియార్డ్’ చాలెంజ్‌లో భాగంగా కొత్త పోలీ కనిపిస్తున్నాడని పొలార్డ్ పేర్కొన్నాడు. ఈ మేరకు ఒక వీడియోను పొలార్డ్ షేర్ చేశాడు. తొలుత గడ్డాన్ని చూపించిన పొలార్డ్.. ఆపై ఫ్రెంచ్ కట్లో కనిపించాడు. ఈ చాలెంజ్‌కు కేకేఆర్ కెప్టెన్ దినేశ్ కార్తీక్‌ను నామినేట్ చేశాడు పొలార్డ్. (చదవండి: రాబిన్ ఊతప్ప ఔట్) ‘ఇది కొత్త సీజన్.. కొత్త పోలీ(పొలార్డ్). ఈ చాలెంజ్‌ను నా బ్రదర్ హర్దిక్ పాండ్యాను స్వీకరించా. గేమ్ ఆన్’ అని పేర్కొన్న పొలార్డ్.. కార్తీక్‌ను ట్యాగ్ చేశాడు. ఈ సవాల్‌ను దినేశ్ కార్తీక్ స్వీకరించాడు. అక్టోబర్ 16వ తేదీని కేకేఆర్-ముంబై ఇండియన్స్ ల మధ్య మ్యాచ్ జరుగనున్న క్రమంలో ఈ చాలెంజ్‌ను దినేశ్ కార్తీక్ విసిరాడు పొలార్డ్. ఈ సీజన్లో పొలార్డ్(25 నాటౌట్, 47 నాటౌట్, 60 నాటౌట్, 13 నాటౌట్, 18)జట్టుకు విలువైన పరుగులు చేస్తూ విజయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నాడు. సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో పొలార్డ్ 13 బంతుల్లో 3 సిక్స్‌లతో అజేయంగా 25 పరుగులు చేసి స్కోరు బోర్డును రెండొందలు దాటించాడు. ఎస్ఆర్హెచ్తో మ్యాచ్‌లో ముంబై 34 పరుగుల తేడాతో విజయం సాధించింది. View this post on Instagram Cheggit! New Season, New Polly! 😎 Taking the cue from my brother @hardikpandya93. #BreakTheBeard and Game ON! #MIvsKKR. @dk00019 Ready? . . . @break_the_beard A post shared by Kieron Pollard (@kieron.pollard55) on Oct 6, 2020 at 12:52am PDT -
ముంబైతో కలిసిన వెస్టిండీస్ ఆల్‌రౌండర్
అబుదాబి: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) కోసం వెస్టిండీస్ ఆల్‌రౌండర్ కీరన్ పొలార్డ్ శనివారం అబుదాబి చేరుకున్నాడు. అతనితో పాటు కరీబియన్ ప్రీమియర్ లీగ్ (సీపీఎల్)లో పాల్గొన్న ఆటగాళ్లు కూడా తమ తమ ఫ్రాంచైజీలతో కలిశారు. తన ముంబై ఇండియన్స్ సహచరుడు రూథర్‌ఫర్డ్‌తో కలిసి పొలార్డ్ ఇక్కడ అడుగుపెట్టాడు. ఈ విషయాన్ని ముంబై ఇండియన్స్ జట్టు యాజమాన్యం ట్విట్టర్ ద్వారా ప్రకటించింది. ‘కరీబియన్ నుంచి అబుదాబి వచ్చిన రూథర్‌ఫర్డ్‌తో పాటు పొలార్డ్ కుటుంబం ముంబై ఇండియన్స్ కుటుంబంతో కలిసింది’ అని తన ఖాతాలో రాసుకొచ్చింది. కరీబియన్ ప్రీమియర్ లీగ్‌లో విజేతగా నిలిచిన ట్రిన్‌బాగో నైట్ రైడర్స్ జట్టులో పొలార్డ్ సభ్యుడు. (చదవండి: ‘ఐపీఎల్ 2020 విజేత ఎవరో చెప్పేశాడు’) -
పొలార్డ్ గ్యాంగ్‌పై షారుక్ ప్రశంసలు
న్యూఢిల్లీ: ఈ సీజన్ కరీబియన్ ప్రీమియర్ లీగ్(సీపీఎల్)లో ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోకుండా టైటిల్ గెలుచుకున్న ట్రిన్‌బాగో నైట్‌రైడర్స్ ఆటగాళ్లపై ఫ్రాంచైజీ యాజమాని, బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్ ప్రశంసలు కురిపించాడు. ‘ఈ సీపీఎల్‌ను మనం శాసించాం. సమష్టి కృషితోనే అది సాధ్యమైంది. మాకు మీరు గర్వకారణం. ఈ విజయాన్ని వేడుకగా జరుపుకుందాం. అదే సమయంలో ఎటువంటి జన తాకిడి లేకుండా పార్టీ చేసుకుందాం. ఇది పర్ఫెక్ట్ 12( మొత్తం మ్యాచ్‌లు గెలవడంపై). ఇక ఐపీఎల్‌కు రండి. పొలార్డ్ గ్యాంగ్ ధన్యవాదాలు. ప్రత్యేకంగా డ్వేన్ బ్రేవో, డారెన్ బ్రేవో, పొలార్డ్‌లకు నా అభినందనలు. ఇది నైట్‌రైడర్స్‌కు నాల్గో టైటిల్. లవ్ యూ’ అని షారుక్ ట్వీట్ చేశాడు. నిన్న జరిగిన సీపీఎల్ ఫైనల్ పోరులో ట్రిన్‌బాగో 8 వికెట్ల తేడాతో సెయింట్ లూసియా జూక్స్‌ను చిత్తు చేసింది. ముందుగా బ్యాటింగ్‌కు దిగిన జూక్స్ 19.1 ఓవర్లలో 154 పరుగులకే ఆలౌటైంది. ఆండ్రీ ఫ్లెచర్ (27 బంతుల్లో 39; 4 ఫోర్లు, 2 సిక్సర్లు) టాప్‌స్కోరర్‌గా నిలవగా...కీరన్ పొలార్డ్ (4/30) చక్కటి బౌలింగ్‌తో ప్రత్యర్థిని కట్టడి చేశాడు. అనంతరం నైట్‌రైడర్స్ 18.1 ఓవర్లలో 2 వికెట్లకు 157 పరుగులు సాధించింది. లెండిన్ సిమన్స్ (49 బంతుల్లో 84 నాటౌట్; 8 ఫోర్లు, 4 సిక్సర్లు), డారెన్ బ్రావో (47 బంతుల్లో 58 నాటౌట్; 2 ఫోర్లు, 6 సిక్సర్లు) మెరుపు బ్యాటింగ్‌తో జట్టును గెలిపించారు. డారెన్ బ్రావో ఫోర్ కొట్టడంతో నైట్‌రైడర్స్ టైటిల్‌ను ఖాతాలో వేసుకుంది. ఇది ట్రిన్‌బాగో నైట్‌రైడర్స్‌కు నాల్గో టైటిల్. ఫలితంగా సీపీఎల్ చరిత్రలో అత్యధిక టైటిల్స్ గెలిచిన జట్టుగా నైట్‌రైడర్స్ నిలిచింది. నైట్‌రైడర్స్ జట్టుకు పొలార్డ్ కెప్టెన్‌గా వ్యవహరిస్తుండగా డ్వేన్ బ్రేవో, డారెన్ బ్రావో, సిమ్మన్స్ వంటి స్టార్లు ఆ జట్టులో ఉన్నారు. (చదవండి: ‘ఆ గన్ ప్లేయర్‌తో రైనా స్థానాన్ని పూడుస్తాం’) Ami TKR we rule. Awesome display boys...u make us proud, happy and make us party even without a crowd. Love u team.@TKRiders @54simmo and my fav @DMBravo46 well done @KieronPollard55 & my man @DJBravo47 love you how many now4!!! @Bazmccullum come to IPL lov u — Shah Rukh Khan (@iamsrk) September 10, 2020 -
వావ్.. పదికి పదికి గెలిచారు
టరూబా: కరీబియన్ ప్రీమియర్ లీగ్ (సీపీఎల్) టి20 టోర్నమెంట్లో ట్రిన్‌బాగో నైట్‌రైడర్స్ (టీకేఆర్) జట్టు లీగ్ దశను అజేయంగా ముగించింది. ఆడిన 10 మ్యాచ్‌ల్లోనూ విజయం సాధించింది. సెయింట్ కిట్స్ అండ్ నెవిస్ పేట్రియాట్స్ జట్టుతో ఆదివారం జరిగిన చివరి లీగ్ మ్యాచ్‌లో ట్రిన్‌బాగో నైట్‌రైడర్స్ 9 వికెట్ల తేడాతో గెలిచింది. తొలుత సెయింట్ కిట్స్ జట్టు 18.2 ఓవర్లలో 77 పరుగులకే కుప్పకూలింది. నైట్‌రైడర్స్ బౌలర్ ఫవాద్ అహ్మద్ 21 పరుగులిచ్చి 4 వికెట్లు తీశాడు.(చదవండి: త్వరలో ఆటకు బెల్ బైబై) అనంతరం నైట్‌రైడర్స్ జట్టు 11.3 ఓవర్లలో వికెట్ నష్టానికి 78 పరుగులు చేసి గెలుపొందింది. వెబ్‌స్టర్ (33 బంతుల్లో 41 నాటౌట్; 5 ఫోర్లు, సిక్స్) మెరిశాడు. మొత్తం ఆరు జట్లు రౌండ్ రాబిన్ లీగ్ పద్థతిలో తలపడుతున్న ఈ టోర్నీలో టీకేఆర్ జట్టు లీగ్ దశలో 20 పాయింట్లతో టాప్ ర్యాంక్‌లో నిలిచింది. టీకేఆర్ జట్టుతోపాటు గయానా అమెజాన్ వారియర్స్, సెయింట్ లూయిస్ జూక్స్, జమైకా తలవాస్ జట్లు కూడా సెమీఫైనల్ చేరాయి. సోమవారం విశ్రాంతి దినం. 8వ తేదీన సెమీఫైనల్స్ జరుగుతాయి. ఫైనల్‌ను 10వ తేదీన నిర్వహిస్తారు.(చదవండి: మనకు పనిభారం అధికంగా ఉన్నట్లు అనిపిస్తే..: కోహ్లి) -
పొలార్డ్ కుమ్మేశాడుగా..
ట్రినిడాడ్: వెస్టిండీస్ ఆల్‌రౌండర్ కీరోన్ పొలార్డ్ వీరోచిత ఇన్నింగ్స్‌తో అదరగొట్టాడు. కరీబియన్ ప్రీమియర్ లీగ్(సీపీఎల్)లో భాగంగా ట్రిన్‌బాగో నైట్‌రైడర్స్‌కు కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న పొలార్డ్ బౌండరీల మోత మోగించి జట్టుకు గొప్ప విజయాన్ని అందించాడు. బార్బోడాస్ ట్రిడెంట్స్‌తో శనివారం జరిగిన మ్యాచ్‌లో పొలార్డ్ 28 బంతుల్లో 9 సిక్సర్లు, 2 ఫోర్లతో 72 పరుగులు చేసి ఓటమి ఖాయమనుకున్న జట్టుకు విజయం సాధించిపెట్టాడు. ఇది కదా కెప్టెన్సీ ఇన్నింగ్స్ అన్న చందంగా సాగిన పొలార్డ్ ఇన్నింగ్స్‌తో నైట్‌రైడర్స్ జట్టు రెండు వికెట్ల తేడాతో గెలిచింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన బార్బోడాస్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్లకు 148 పరుగులు చేసింది. అనంతరం 149 పరుగుల విజయ లక్ష్యంతో బ్యాటింగ్ ఆరంభించిన నైట్‌రైడర్స్ 62 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. (చదవండి: రైనా నిష్క్రమణ.. వాట్సన్ ఆవేదన) మరో 15 పరుగుల వ్యవధిలో లెండి సిమ్మన్స్(32) ఔట్ కావడంతో జట్టు భారం పొలార్డ్‌పై పడింది. తనపై పెట్టుకున్న అంచనాలకు తగ్గట్టే ఏడో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన పొలార్డ్ ఆది నుంచి బార్బోడాస్ బౌలర్లకు చుక్కలు చూపించాడు. కొడితే సిక్స్ అయినా కావాలి.. లేకపోతే ఫోర్ అయినా కావాలి అన్న విధంగా సాగింది పొలార్డ్ ఆట. పరిస్థితులకు తగ్గట్టు బ్యాట్ ఝుళిపిస్తూ నైట్‌రైడర్స్ స్కోరును పరుగులు పెట్టించాడు. 17 ఓవర్లో నాలుగు సిక్సర్లు కొట్టి ఒక్కసారిగా నైట్‌రైడర్స్‌లో ఊపుతెచ్చాడు. యువ ఆఫ్ స్పిన్నర్ హేడెన్ వాల్ష్ బౌలింగ్‌లో సిక్సర్లతో దుమ్మురేపాడు. ఆ తర్వాత ఓవర్లో రెండు బౌండరీలు కొట్టి హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. హాఫ్ సెంచరీని 22 బంతుల్లో పూర్తి చేసుకున్న పొలార్డ్.. చివరి ఓవర్ రెండో బంతికి అనవసరపు పరుగు కోసం యత్నించి రనౌట్ అయ్యాడు. అప్పటికి నైట్‌రైడర్స్ స్కోరు 141. దాంతో నైట్‌రైడర్స్ నాలుగు బంతుల్లో ఎనిమిది పరుగులు చేయాల్సి రావడంతో ఖారీ పీర్ బ్యాట్‌కు పని చెప్పి ఇంకా బంతి ఉండగానే విజయంలో భాగమయ్యాడు. ఆ చివరి ఓవర్ మూడో బంతికి సీల్స్ సింగిల్ తీయగా, నాల్గో బంతిని పీర్ సిక్స్ కొట్టాడు. ఒక ఆఖరి బంతికి పీర్ సింగిల్ తీయడంతో నైట్‌రైడర్స్ గెలుపును అందుకుంది. ఇది నైట్‌రైడర్స్‌కు వరుసగా ఆరో విజయం. ఇప్పటివరకూ ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోని నైట్‌రైడర్స్ పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో కొనసాగుతోంది. -
‘పంజరంలో పావురం’ కాదల్చుకోలేదు..
ఆంటిగ్వా: గతేడాది జరిగిన వన్డే వరల్డ్‌కప్‌లో వెస్టిండీస్ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించిన జాసన్ హోల్టర్..తనకు అన్ని ఫార్మాట్ల క్రికెట్ ఆడాలనే కోరిక ఉందనే విషయాన్ని వెల్లడించాడు. ఇటీవల కీరోన్ పొలార్డ్‌ను పరిమిత ఓవర్ల కెప్టెన్‌గా ఎంపిక చేసి హోల్డర్‌ను టెస్టు సారథిగా మాత్రమే పరిమితం చేసిన సంగతి తెలిసిందే. దాంతో పరిమిత ఓవర్ల క్రికెట్లో తన స్థానం ఉండదేమోనని ఆందోళనలో ఉన్న హోల్డర్.. తనను అన్ని ఫార్మాట్ల క్రికెట్‌కు పరిగణలోకి తీసుకోవాలని బోర్డుకు విన్నవించాడు. గత కొన్ని ఏళ్లుగా విండీస్ తరపున అన్ని ఫార్మాట్ల క్రికెట్ ఆడుతున్నానని, ఇకపై కూడా ఆడాలనే కోరుకుంటున్నానని పేర్కొన్నాడు. (17 ఏళ్లకు ‘వరల్డ్‌కప్’ ఆరోపణలా?) తాను విండీస్ జట్టుకు టెస్టు కెప్టెన్‌గా ఉన్నప్పటికీ మూడు ఫార్మాట్లలో ఆడిన విషయాన్ని ఈ సందర్భంగా ప్రస్తావించాడు. తన దృష్టి ఎప్పుడూ విండీస్ క్రికెట్‌పైనే ఉంటుందని, అది కేవలం టెస్టు క్రికెట్ మాత్రమే కాదన్నాడు. తాను పంజరంలో పావురంలా ఏ ఒక్క దానికో పరిమితం కాదల్చుకోలేదన్నాడు. విండీస్ క్రికెట్ అనేది వేర్వేరు సందర్భాల్లో పలు రకాలుగా రూపాంతరం చెందుతూ ఉంటుందన్నాడు. ఈ పజిల్లో ఆటగాళ్లంతా ఒకరినొకరు అర్థం చేసుకుంటూ ముందుకు సాగడమే తమ కర్తవ్యమన్నాడు. అంతర్జాతీయ టెస్టు ఆల్‌రౌండర్ ర్యాంకింగ్స్‌లో నంబర్ వన్ స్థానంలో ఉన్న హోల్డర్.. టెస్టు బౌలర్ల ర్యాంకింగ్‌లో మూడో స్థానంలో కొనసాగుతున్నాడు. ప్రస్తుతం తమ క్రికెట్ జట్టులో బ్యాటింగ్ లోతు అసాధారణమని వెస్టిండీస్ ఆల్ రౌండర్ డ్వేన్ బ్రేవో పేర్కొన్న సంగతి తెలిసిందే. కొన్ని కొన్ని పొరపాట్ల వల్ల తమ బ్యాటింగ్‌లో పూర్తి స్థాయి సామర్థ్యం బయటకు రావడం లేదని తెలిపిన బ్రేవో.. ఓవరాల్‌గా చూస్తే తమకున్న బ్యాటింగ్ వనరులు అమోఘమన్నాడు. 2016 టీ20 వరల్డ్‌కప్ గెలిచిన జట్టు కంటే కూడా ప్రస్తుతం ఉన్న జట్టే సూపర్ అని బ్రేవో తెలిపాడు. ఇక పరిమిత ఓవర్ల కెప్టెన్‌గా ఎంపికైన పొలార్డ్ నిజాయితీ పరుడంటూ బ్రేవో ప్రశంసించాడు. గతంలోని కెప్టెన్ల వలే సెలక్టర్లు చెప్పిన దానికి తల ఊపే నైజం పొలార్డ్‌ది కాదని, కచ్చితమైన అభిప్రాయం చెప్పే వ్యక్తిత్వం అతని సొంతమన్నాడు.(పొలార్డ్‌లో నిజాయితీ ఉంది: బ్రేవో) -
పొలార్డ్‌లో నిజాయితీ ఉంది: బ్రేవో
ఆంటిగ్వా: ప్రస్తుతం తమ క్రికెట్ జట్టులో బ్యాటింగ్ లోతు అసాధారణమని వెస్టిండీస్ ఆల్ రౌండర్ డ్వేన్ బ్రేవో పేర్కొన్నాడు. కొన్ని కొన్ని పొరపాట్ల వల్ల తమ బ్యాటింగ్‌లో పూర్తి స్థాయి సామర్థ్యం బయటకు రావడం లేదని తెలిపిన బ్రేవో.. ఓవరాల్‌గా చూస్తే తమకున్న బ్యాటింగ్ వనరులు అమోఘమన్నాడు. 2016 టీ20 వరల్డ్‌కప్ గెలిచిన జట్టు కంటే కూడా ప్రస్తుతం ఉన్న జట్టే సూపర్ అని బ్రేవో తెలిపాడు. తమ బ్యాటింగ్ లైనప్‌ను చూస్తే కొన్ని సందర్భాల్లో ఆశ్చర్యం కలుగుతుందన్నాడు. పదో నంబర్ వరకూ కూడా తమ జట్టులో బ్యాటింగ్ చేసే ఆటగాళ్లు ఉన్నారన్నాడు. కాగా, గత శ్రీలంక సిరీస్‌లో తమ బ్యాటింగ్ లైనప్‌లో సామర్థ్యాన్ని కోచ్ ఫిల్ సిమ్మన్స్ మరింత వెలికి తీశాడన్నాడు. తన పేరును 9వ స్థానంలో పెట్టడమే ఇందుకు ఉదాహరణగా పేర్కొన్నాడు. తాను ఎప్పుడూ టీ20 క్రికెట్లో 9వ స్థానంలో బ్యాటింగ్ చేస్తానని అనుకోలేదనే, ఇందుకు కారణం తమ బ్యాటింగ్ లైనప్ బలంగా ఉండటమేనన్నాడు. ఇదే విషయాన్ని తమ కుర్రాళ్లకు సైతం చెప్పానన్నాడు.(‘ఆసీస్‌తో టీమిండియాను పోల్చలేం’) ‘ మా బ్యాటింగ్ లైనప్ నన్ను ఆశ్చర్యానికి గురి చేస్తూ ఉంటుంది. ఇందులో ఎటువంటి జోక్ లేదు. మ్యాచ్ ముగిసే రోజు పదో స్థానం వరకూ బ్యాటింగ్ చేసే సామర్థ్యం ప్రస్తుత వెస్టిండీస్ జట్టు సొంతం. ఒక ఆధిపత్యం చెలాయించే జట్టు మాది. ప్రత్యేకంగా టీ20ల్లో మాకు తిరుగులేదు. ఇక నుంచి జట్టు బౌలింగ్ విభాగంలో కూడా కీలక పాత్ర పోషించాలనుకుంటున్నా. ప్రధానంగా డెత్ ఓవర్ల స్పెషలిస్టుగా ఆకట్టుకోవాలనుకుంటున్నా. గతంలో తాను ఏ రకంగా అయితే బౌలింగ్ చేసేవాడినో దాన్ని అందిపుచ్చుకోవాలి’ అని బ్రేవో తెలిపాడు. ఇక తమ పరిమిత ఓవర్ల కెప్టెన్ పొలార్డ్‌లో నిజాయితీని చూశానన్నాడు. ‘పొలార్డ్ ఎప్పుడూ గెలవడాన్ని ఆస్వాదిస్తాడు. కెప్టెన్‌గా అది చాలా ముఖ్యం. విజయం సాధించడానికి మిక్కిలి శ్రమిస్తాడు. విజయం సాధించడం కోసం అనే రకాలు మార్గాలను పొలార్డ్ ఎంచుకుంటాడు. ఎప్పుడైతే పొలార్డ్‌కు సారథ్య బాధ్యతలు అప్పచెప్పారో, ఇది నీకు ఒక చాలెంజ్ అని చెప్పా. అత్యంత కష్టంతో కూడుకున్న పెద్ద బాధ్యత నీపై ఉందని చెప్పా. జట్టును మరింత ఉన్నత స్థితిలోకి తీసుకురావడానికి, సరైన దిశలో నడిపించడానికి పొలార్డ్ సరైన సమయంలో బాధ్యతలు తీసుకున్నాడనే అనుకుంటున్నా. పొలార్డ్ చాలా నిజాయితీ పరుడు. సెలక్షన్ విషయంలో అతని మార్కు కచ్చితంగా ఉంటుంది. గతంలోని కెప్టెన్లు వలే సెలక్టర్లు చెప్పిన దానికి తల ఊపడు. అతనికి నచ్చిన విధంగానే జట్టు ఉంటుంది’ అని బ్రేవో పేర్కొన్నాడు. గతంలో అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్ బై చెప్పిన బ్రేవో.. జనవరిలో ఐర్లాండ్‌తో జరిగిన మ్యాచ్ ద్వారా రీఎంట్రీ ఇచ్చాడు.(‘ధోనికి చాలా సిగ్గు.. ఆ తర్వాతే మారాడు’) -
టి20 ఫార్మాట్లో తొలి క్రికెటర్‌గా..
పల్లెకెలె: వెస్టిండీస్ విధ్వంసక ఆటగాడు కీరన్ పొలార్డ్ అరుదైన మైలురాయిని దాటాడు. బుధవారం శ్రీలంకతో జరిగిన టి20 మ్యాచ్ అతని టి20 కెరీర్లో 500వది కావడం విశేషం. టి20 ఫార్మాట్లో ఈ ఘనత సాధించిన తొలి ఆటగాడిగా అతను నిలిచాడు. ఈ మ్యాచ్‌లో 15 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సర్లతో 34 పరుగులు చేసిన పొలార్డ్... సరిగ్గా అదే స్కోరు వద్ద టి20ల్లో 10 వేల పరుగులు కూడా పూర్తి చేసుకోవడం విశేషం. ఉదాన బౌలింగ్‌లో సిక్సర్‌తో ఈ రికార్డు చేరుకున్న అతను... క్రిస్ గేల్ (13,296) తర్వాత ఈ ఘనత అందుకున్న రెండో ఆటగాడిగా నిలిచాడు. మొత్తం 500 టి20 మ్యాచ్‌లలో 150.57 స్ట్రయిక్ రేట్‌తో 10,000 పరుగులు చేసిన పొలార్డ్... 280 వికెట్లు కూడా పడగొట్టాడు. 1 సెంచరీ, 49 అర్ధసెంచరీలు చేశాడు. పొలార్డ్ టి20 కెరీర్ విశేషాలు కొన్ని: 23- ఆడిన టి20 టోర్నీ ఫైనల్స్ సంఖ్య 17 -వెస్టిండీస్ సహా ఆడిన జట్ల సంఖ్య 13- విజయంలో భాగమైన టైటిల్స్ సంఖ్య (6 వేర్వేరు జట్ల తరఫున) 170- అత్యధికంగా ముంబై ఇండియన్స్‌కు ఆడిన మ్యాచ్‌లు 6-ముంబై తరఫు టైటిల్స్ (4 ఐపీఎల్, 2 చాంపియన్స్ లీగ్) 2012 టి20 ప్రపంచ కప్ గెలిచిన జట్టులో సభ్యుడు వెస్టిండీస్ విజయం శ్రీలంకతో జరిగిన తొలి టి20లో విండీస్ 25 పరుగులతో గెలిచింది. సిమన్స్ (51 బంతుల్లో 67 నాటౌట్; 7 ఫోర్లు, 2 సిక్సర్లు) అర్ధ సెంచరీ సహాయంతో తొలుత విండీస్ 4 వికెట్లకు 196 పరుగులు చేయగా... అనంతరం లంక 19.1 ఓవర్లలో 171 పరుగులకు ఆలౌటైంది. కుశాల్ పెరీరా (38 బంతుల్లో 66; 6 ఫోర్లు, 3 సిక్సర్లు) మినహా అంతా విఫలమయ్యారు. ఒషాన్ థామస్ (5/28) పవర్‌ప్లేలోనే ఐదు వికెట్లు తీసి ప్రత్యర్థిని దెబ్బ కొట్టాడు. -
‘నంబర్ వన్’ అని నిరూపించుకుంది: పొలార్డ్
కటక్: టీమిండియాతో జరిగిన మూడు టీ20ల సిరీస్‌ను, మూడు వన్డేల సిరీస్‌ను వెస్టిండీస్ కోల్పోయినప్పటికీ ఆ జట్టు పోరాటం మాత్రం ఆకట్టుకుంది. అసలు టీమిండియాకు విండీస్ పోటీ ఇస్తుందా అని భావించిన తరుణంలో కరీబియన్ జట్టు అంచనాలు మించి రాణించింది. విండీస్ ఓడినప్పటికీ అభిమానుల మనసును మాత్రం గెలుచుకుంది. భారత్‌తో ఆదివారం జరిగిన చివరి వన్డేలో విండీస్ 316 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించినా దాన్ని కాపాడుకోలేకపోయింది. భారత్ జట్టు బ్యాటింగ్‌లో రాణించడంతో మ్యాచ్‌ను సునాయాసంగా గెలుచుకోవడమే కాకుండా సిరీస్‌ను సైతం 2-1 తేడాతో సొంతం చేసుకుంది. కాగా, పోస్ట్ మ్యాచ్ కాన్ఫరెన్స్‌లో విండీస్ కెప్టెన్ కీరోన్ పొలార్డ్ మాట్లాడుతూ.. భారత్ పర్యటన తమకు ఎక్కువ నిరాశను మిగల్చలేదనే అనుకుంటున్నానని స్పష్టం చేశాడు. ‘ మేము ఇక్కడ చాలా బాగా ఆడాం. మా కుర్రాళ్లంతా ఆకట్టుకున్నారు. మా వాళ్ల పోరాట పటిమను చూసి గర్విస్తున్నా. ఈ ద్వైపాక్షిక సిరీస్‌లు మమ్మల్ని ఎక్కువ నిరూత్సాహ పరచలేదు. మేము బంతితో పాటు బ్యాట్‌తో కూడా రాణించాం. కాకపోతే ప్రపంచ క్రికెట్లో నంబర్ వన్ జట్టు ఆట ఎలా ఉంటుందో టీమిండియా చూపించింది. అత్యుత్తమ జట్టు ఎలా ఆడాలో అలాగే టీమిండియా ఆడింది. నంబర్ వన్ జట్టు అని టీమిండియా మరోసారి నిరూపించుకుంది. భారత్ జట్టు పరిస్థితులకు తగ్గట్టు ఆడి సిరీస్‌లను కైవసం చేసుకుంది. భారత పర్యటన ద్వారా మా జట్టులో ఉన్నటాలెంట్‌ను మరొకసారి గుర్తించాం. ప్రత్యేకంఆ హెట్మెయిర్, పూరన్, హోప్, కాట్రెల్‌లు విశేషంగా ఆకట్టుకున్నారు. ఇదే ప్రదర్శనను వారు రాబోవు సీజన్లలో కూడా రిపీట్ చేస్తారని ఆశిస్తున్నాం. ఇరు జట్ల మధ్య ఇదొక మంచి సిరీస్‌గా మిగిలి పోవడానికి పూర్తి స్థాయిలో ప్రయత్నించాం. అందులో మేము సక్సెస్ అయ్యామనే అనుకుంటున్నా’ అని పొలార్డ్ పేర్కొన్నాడు.(ఇక్కడ చదవండి: టీమిండియా రికార్డులు.. విశేషాలు) ఇక టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి మాట్లాడుతూ..‘ఈ ఏడాది అద్భుతంగా గడిచింది. ప్రపంచ కప్‌లోనూ న్యూజిలాండ్‌తో సెమీఫైనల్లో 30 నిమిషాలను మినహాయిస్తే మిగతాదంతా గొప్పగా సాగింది. ఎప్పటికైనా ఐసీసీ ట్రోఫీలను పొందేందుకు మేం నిరంతరం ప్రయత్నిస్తూనే ఉంటాం. ముఖ్యంగా మా పేస్ దళం ఎక్కడైనా, ఎలాంటి ప్రత్యర్థినైనా ఎదుర్కొనేలా తయారైంది. భారత్‌లో స్పిన్నర్లను మించి పేసర్లు రాణించడం అనేది గొప్ప పరిణామం. రాబోయే రోజుల్లో భారత క్రికెట్‌ను కొత్త ఆటగాళ్లే నడిపించాలి కాబట్టి ప్రస్తుతం యువ ఆటగాళ్లు ఒత్తిడిలో ఎలా రాణిస్తారనే అంశాన్ని మేం పరీక్షిస్తున్నాం. ఈ రోజు మా ఆట సంతృప్తి కలిగించింది. మంచు ప్రభావం ఉండటంతో భాగస్వామ్యాలు నిర్మించడంపై దృష్టి సారించాం. ఇది పనిచేసింది. నేను అవుటయ్యాక ‘జడ్డూ’ ఆత్మవిశ్వాసంతో ఆడాడు. కేవలం మూడు ఓవర్లలోనే శార్దుల్, జడేజా మ్యాచ్ గతిని మార్చేశారు. బయట నుంచి ఇతరులు ఆట పూర్తి చేస్తుంటే చూడటం అద్భుతంగా ఉంటుంది’ అని కోహ్లి పేర్కొన్నాడు. -
17 ఏళ్ల తర్వాత విండీస్ మరో రికార్డు
కటక్: టీమిండియాతో జరుగుతున్న చివరి వన్డేలో వెస్టిండీస్ బ్యాటింగ్‌లో సత్తాచాటింది. భారత్‌కు 316 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది. ప్రధానంగా పూరన్(89; 64 బంతుల్లో 10 ఫోర్లు, 3 సిక్స్‌లు), పొలార్డ్(74 నాటౌట్; 51 బంతుల్లో 3 ఫోర్లు, 7 సిక్సర్లు)లు ధాటిగా ఆడి భారత్‌కు సవాల్ విసిరారు. అయితే వీరిద్దరూ ఒక రికార్డును తమ ఖాతాలో వేసుకున్నారు. ఐదో వికెట్‌కు 135 పరుగుల భాగస్వామ్యాన్ని నమోదు చేసి విండీస్ మూడొందల స్కోరును సునాయాసంగా దాటడంలో సహకరించారు. కాగా, తాజాగా పూరన్-పొలార్డ్‌లు సాధించిన 135 పరుగుల భాగస్వామ్యమమే భారత్‌పై విండీస్‌కు అత్యధిక ఐదో వికెట్ భాగస్వామ్యంగా నమోదైంది. దాంతో 17 ఏళ్ల రికార్డును పూరన్-పొలార్డ్‌లు తుడిచిపెట్టేశారు. 2002లో శామ్యూల్స్-పావెల్‌లు ఐదో వికెట్‌కు 109 పరుగుల భాగస్వామ్యాన్ని భారత్‌పై సాధించగా, దాన్ని పూరన్-పొలార్డ్‌లు జోడి బద్ధలు కొట్టింది. 17 ఏళ్ల తర్వాత విండీస్ తరఫున ఈ ఘనతను పొలార్డ్-పూరన్‌లు తిరగరాశారు. ఈ మ్యాచ్‌లో టీమిండియా టాస్ గెలిచి ముందుగా ఫీల్డింగ్ ఎంచుకుంది. దాంతో విండీస్ బ్యాటింగ్‌ను లూయిస్, హోప్‌లు ఆరంభించారు. వీరిద్దరూ తొలి వికెట్‌కు 57 పరుగుల జత చేసిన తర్వాత లూయిస్ ఔట్ కాగా, కాసేపటికి హోప్ కూడా పెవిలియన్ చేరాడు. లూయిస్‌ను జడేజా పెవిలియన్‌కు పంపగా, హోప్‌ను మహ్మద్ షమీ ఔట్ చేశాడు. ఆపై రోస్టన్ ఛేజ్కు హెట్మెయిర్ జత కలిశాడు. ఈ జోడి 62 పరుగుల భాగస్వామ్యాన్ని జత చేసిన తర్వాత సైనీ బౌలింగ్‌లో హెట్మెయిర్ ఔటయ్యాడు.. మరో 12 పరుగుల వ్యవధిలో చేజ్‌ను సైతం సైనీ బౌల్డ్ చేశాడు. ఆ తరుణంలో నికోలస్ పూరన్‌కు జత కలిసిన పొలార్డ్ ఇన్నింగ్స్‌ను చక్కదిద్దాడు. వీరిద్దరూ ఆచితూచి ఆడుతూ స్కోరు బోర్డును ముందుకు తీసుకెళ్లారు. స్లాగ్ ఓవర్లలో ఈ జోడి ధాటిగా ఆడింది. బౌండరీలే లక్ష్యంగా చెలరేగింది. ఫలితంగా స్కోరు బోర్డు పరుగులు తీసింది. ప్రధానంగా పూరన్ హాఫ్ సెంచరీ సాధించిన తర్వాత రెచ్చిపోయి ఆడాడు. అతనికి పొలార్డ్ నుంచి చక్కటి సహకారం లభించింది. వీరిద్దరూ చక్కటి సమన్వయంతో విండీస్ స్కోరును గాడిలో పెట్టారు. కాగా, శార్దూల్ ఠాకూర్ వేసిన 48 ఓవర్ ఐదో బంతికి భారీ షాట్‌కు యత్నించిన పూరన్ ఐదో వికెట్‌గా ఔటయ్యాడు. ఆ తర్వాత హోల్డర్ క్రీజ్‌లోకి రాగా, పొలార్డ్ బ్యాట్ ఝుళిపించి ఆడాడు. చివరి పది ఓవర్లలో విండీస్ 118 పరుగుల్ని సాధించడం విశేషం. -
పూరన్ మెరుపులు..పొలార్డ్ బాదుడు
కటక్: టీమిండియాతో జరుగుతున్న మూడో వన్డేలో వెస్టిండీస్ 316 పరుగుల టార్గెట్‌ను నిర్దేశించింది. ఒకవైపు నికోలస్ పూరన్ మెరుపులు మెరిపించగా,మరొకవైపు కెప్టెన్ కీరోన్ పొలార్డ్ వీర బాదుడు బాదాడు. పూరన్(89; 64 బంతుల్లో 10 ఫోర్లు, 3 సిక్స్‌లు), పొలార్డ్(74 నాటౌట్; 51 బంతుల్లో 3 ఫోర్లు, 7 సిక్సర్లు), షాయ్ హోప్(42;50 బంతుల్లో 5 ఫోర్లు) రాణించారు. రోస్టన్ ఛేజ్(38), హెట్మెయిర్(37)లు ఫర్వాలేదనిపించడంతో విండీస్ నిర్ణీత ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి 315 పరుగులు చేసింది. ఈ మ్యాచ్‌లో టీమిండియా టాస్ గెలిచి ముందుగా ఫీల్డింగ్ ఎంచుకుంది. దాంతో విండీస్ బ్యాటింగ్‌ను లూయిస్, హోప్‌లు ఆరంభించారు. వీరిద్దరూ తొలి వికెట్‌కు 57 పరుగుల జత చేసిన తర్వాత లూయిస్ ఔట్ కాగా, కాసేపటికి హోప్ కూడా పెవిలియన్ చేరాడు. లూయిస్‌ను జడేజా పెవిలియన్‌కు పంపగా, హోప్‌ను మహ్మద్ షమీ ఔట్ చేశాడు. ఆపై రోస్టన్ ఛేజ్కు హెట్మెయిర్ జత కలిశాడు. ఈ జోడి 62 పరుగుల భాగస్వామ్యాన్ని జత చేసిన తర్వాత సైనీ బౌలింగ్‌లో హెట్మెయిర్ ఔటయ్యాడు.. మరో 12 పరుగుల వ్యవధిలో చేజ్‌ను సైతం సైనీ బౌల్డ్ చేశాడు. ఆ తరుణంలో నికోలస్ పూరన్‌కు జత కలిసిన పొలార్డ్ ఇన్నింగ్స్‌ను చక్కదిద్దాడు. వీరిద్దరూ ఆచితూచి ఆడుతూ స్కోరు బోర్డును ముందుకు తీసుకెళ్లారు. స్లాగ్ ఓవర్లలో ఈ జోడి ధాటిగా ఆడింది. బౌండరీలే లక్ష్యంగా చెలరేగింది. ఫలితంగా స్కోరు బోర్డు పరుగులు తీసింది. ప్రధానంగా పూరన్ హాఫ్ సెంచరీ సాధించిన తర్వాత రెచ్చిపోయి ఆడాడు. అతనికి పొలార్డ్ నుంచి చక్కటి సహకారం లభించింది. వీరిద్దరూ చక్కటి సమన్వయంతో విండీస్ స్కోరును గాడిలో పెట్టారు. కాగా, శార్దూల్ ఠాకూర్ వేసిన 48 ఓవర్ ఐదో బంతికి భారీ షాట్‌కు యత్నించిన పూరన్ ఐదో వికెట్‌గా ఔటయ్యాడు. ఆ తర్వాత హోల్డర్ క్రీజ్‌లోకి రాగా, పొలార్డ్ బ్యాట్ ఝుళిపించి ఆడాడు. ఈ జోడి చివరి రెండు ఓవర్లలో 32 పరుగుల్ని సాధించారు. ఇందులో 29 పరుగుల్ని పొలార్డ్ సాధించాడు. చివరి పది ఓవర్లలో 118 పరుగుల్ని విండీస్ పిండుకుంది. భారత బౌలర్లలో సైనీ రెండు వికెట్లు సాధించగా, షమీ, శార్దూల్ ఠాకూర్, రవీంద్ర జడేజాలకు తలో వికెట్ దక్కింది. -
కోహ్లికి అంత ఉత్సాహం ఎందుకో: పొలార్డ్
విశాఖ: టీమిండియా కెప్టెన్, పరుగుల మెషీన్ విరాట్ కోహ్లి ఫీల్డ్‌లో అంత దూకుడుగా ఉండటానికి కారణం ఏంటో తెలుసుకోవాలని ఉందని అంటున్నాడు వెస్టిండీస్ కెప్టెన్ కీరోన్ పొలార్డ్. రికార్డుల మీద రికార్డులు కొల్లగొడుతూ ప్రపంచ క్రికెట్లో దూసుకుపోతున్న కోహ్లి ఆన్ ఫీల్డ్‌లో దూకుడుగా ఉండటం మనకు తెలిసిందే. అయితే దీనిపై తనకు క్లారిటీ కావాలని అంటున్నాడు పొలార్డ్. తొలి వన్డేలో రవీంద్ర జడేజా రనౌట్ అయిన విషయంలో కోహ్లి జోక్యం చేసుకోవడాన్ని కానీ టీ20 సిరీస్‌లో భాగంగా రెండో టీ20లో విండీస్ బౌలర్ కెస్రిక్ విలియమ్స్ ‘నోట్ బుక్’ సెలబ్రేషన్న్ను కోహ్లి వెక్కిరించడాన్ని ఇక్కడ పొలార్డ్ పరోక్షంగా ప్రస్తావించాడు. అసలు ఆన్‌ఫీల్డ్‌లో కోహ్లికి అంత ఉత్సాహం ఎందుకో తెలుసుకోవాలని ఆత్రంగా ఉందన్నాడు. ‘ కోహ్లి అత్యుత్సాహానికి నాకు జవాబు అయితే తెలీదు. ఎప్పుడూ అంత దూకుడుగా ఎందుకు ఉంటాడో తెలుసుకోవాలని ఉంది. అలా ఎందుకు అంత ఉత్సుకతతో ఉంటాడో కోహ్లిని మీరే అడగండి. నాకైతే తెలీదు. అతన్ని ఈ ప్రశ్న అడిగి జవాబు తెలుసుకోండి. ఎందుకంటే నాకు తెలుసుకోవాలని ఉంది’ అని పొలార్డ్ పోస్ట్ మ్యాచ్ కాన్పరెన్స్‌లో పేర్కొన్నాడు. రెండో వన్డేలో భారత్ నిర్దేశించిన 388 పరుగుల టార్గెట్‌ను ఛేదించడంలో విండీస్ పూర్తిగా విఫలమైంది. 280 పరుగులకే పరిమతం కావడంతో టీమిండియా 107 పరుగుల తేడాతో విజయం సాధించింది. షాయ్ హోప్(78), నికోలస్ పూరన్(75)లు హాఫ్ సెంచరీలు ఆదుకున్నప్పటికీ భారీ లక్ష్యం కావడంతో విండీస్‌కు ఓటమి తప్పలేదు. -
వన్డేల్లో ఇదే తొలిసారి..
విశాఖ: టీమిండియాతో జరుగుతున్న రెండో వన్డేలో వెస్టిండీస్ కెప్టెన్, ఆల్ రౌండర్ కీరోన్ పొలార్డ్ ఇలా వచ్చి అలా పెవిలియన్ చేరాడు. నికోలస్ పూరన్(75; 47 బంతుల్లో 6 ఫోర్లు, 6 సిక్సర్లు) విధ్వంసకర ఇన్నింగ్స్‌కు బ్రేక్ పడిన తర్వాత క్రీజ్‌లోకి వచ్చిన పొలార్డ్ ఆడిన తొలి బంతికే పెవిలియన్ చేరాడు. మహ్మద్ షమీ వేసిన 30 ఓవర్ రెండో బంతికి పూరన్ ఔట్ కాగా, ఆ మరుసటి బంతికి పొలార్డ్ ఔటయ్యాడు. ఆఫ్ స్టంప్‌పైకి వేసిన గుడ్ లెంగ్త్ బాల్‌ను ఆడబోయిన పొలార్డ్.. అది కాస్తా ఎడ్జ్ తీసుకోవడంతో కీపర్ రిషభ్ పంత్ చేతుల్లో పడింది. దాంతో పొలార్డ్ ఇన్నింగ్స్ సున్నాకే ముగిసింది. అంతకుముందు పూరన్ ధాటిగా బ్యాటింగ్ చేసి విండీస్ స్కోరు బోర్డును పరుగులు తీయించాడు. అతని వ్యక్తిగత స్కోరు 22 పరుగుల వద్ద ఉండగా జడేజా బౌలింగ్‌లో ఇచ్చిన క్యాచ్‌లను దీపక్ చాహర్ వదిలేయడంతో బతికిపోయిన పూరన్ రెచ్చిపోయాడు. అయితే బ్యాట్ ఝుళిపించే క్రమంలో షమీ తెలివిగా బౌన్స్ వేయగా దాన్ని పూరన్ హిట్ చేశాడు. అది కాస్తా లాంగ్ లెగ్‌లో క్యాచ్‌గా లేవడంతో అక్కడకు కాస్త దూరంలో ఫీల్డింగ్ చేస్తున్న కుల్దీప్ యాదవ్ దాన్ని పరుగెత్తుకుంటూ వచ్చి అందుకున్నాడు. దాంతో పూరన్ భారంగా పెవిలియన్ చేరాడు. ఆపై క్రీజ్‌లోకి వచ్చిన పొలార్డ్‌ను చక్కటి బంతితో షమీ బోల్తా కొట్టించాడు. వెంటవెంటనే రెండు వికెట్లు సాధించడంతో టీమిండియా శిబిరంలో ఆనందంలో మునిగిపోయింది. కాగా, వన్డే చరిత్రలో ఒకే మ్యాచ్‌లో ఇద్దరు కెప్టెన్లు గోల్డెన్ డక్‌గా వెనుదిరగడం ఇదే తొలిసారి. టీమిండియా ఇన్నింగ్స్‌లో కెప్టెన్ విరాట్ కోహ్లి కూడా ఆడిన తొలి బంతికే పెవిలియన్ చేరి గోల్డెన్ డక్ అయ్యాడు. ఆ వికెట్‌ను పొలార్డ్ సాధించాడు. పొలార్డ్ వేసిన స్లో బౌన్సర్‌ను పుల్ చేయబోయి కోహ్లి డకౌట్ అయ్యాడు. ఈ మ్యాచ్‌లో భారత్ జట్టు నిర్ణీత ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 387 పరుగులు చేసింది. రోహిత్ శర్మ(159), కేఎల్ రాహుల్(102)లు సెంచరీలు చేయగా, శ్రేయస్ అయ్యర్(53), పంత్(39)లు ఆకాశమే హద్దుగా చెలరేగిపోయారు. ఆ తర్వాత విండీస్ ఇన్నింగ్స్ ఆరంభించగా 61 పరుగుల వద్ద లూయిస్(30) వికెట్‌ను కోల్పోయింది. ఆపై స్వల్ప వ్యవధిలో హెట్మెయిర్(4), రోస్టన్ ఛేజ్(4)లు ఔట్ కావడంతో టీమిండియా పట్టుబిగించింది. కాగా, షాయ్ హోప్, పూరన్‌లు 106 పరుగుల భాగస్వామ్యాన్ని సాధించడంతో టీమిండియాలో కాస్త అలజడి రేగింది. పూరన్ ఔటైన తర్వాత కాస్త ఊపిరి తీసుకున్న టీమిండియా.. పొలార్డ్‌కు డక్‌గా ఔట్ కావడంతో మ్యాచ్‌ను దాదాపు అధీనంలోకి తెచ్చుకుంది. 33 ఓవర్లు ముగిసే సరికి విండీస్ ఎనిమిది వికెట్ల నష్టానికి 210 పరుగులు చేసింది. షాయ్ హోప్(78) ఆరో వికెట్‌గా ఔట్ కాగా, ఆ తదుపరి బంతికి జాసన్ హెల్డర్(11) ఔటయ్యాడు. అటు వెంటనే జోసెఫ్(0)సైతం గోల్డెన్ డక్‌గా పెవిలియన్ చేరాడు. దాంతో కుల్దీప్ యాదవ్ హ్యాట్రిక్ సాధించాడు. -
ఆ విషయం మాకు తెలుసు: పొలార్డ్
చెన్నై: టీమిండియాతో జరిగిన తొలి వన్డేలో టీమిండియా బౌలింగ్‌ను చీల్చి చెండాడి తమ జట్టు ఘన విజయం సాధించడంలో కీలక పాత్ర పోషించిన వెస్టిండీస్ స్టార్ బ్యాట్స్‌మన్ హెట్‌మెయిర్‌ను కెప్టెన్ కీరోన్ పొలార్డ్ ప్రశంసల్లో ముంచెత్తాడు. అతనొక విధ్వంసకర ఆటగాడని, తనదైన రోజున బ్యాట్‌తో చెలరేగిపోయి మ్యాచ్‌ను ప్రత్యర్థి చేతుల్లోంచి అమాంతం లాగేసుకుంటాడంటూ పొలార్డ్ కొనియాడాడు. ‘ హెట్మెయిర్ విశేషమైన టాలెంట్ ఉన్న ఆటగాడనే విషయం మాకు తెలుసు. కానీ గత 9 నెలల నుంచి బ్యాటింగ్‌లో ఇబ్బంది పడుతూ తీవ్ర ఒత్తిడిలో ఉన్నాడు. మా జట్టులో అతనికి ఉన్న పాత్ర ఏమిటో తెలుసు కాబట్టే నమ్మకం ఉంచాం. గత 18 నెలల కాలంలో అంతర్జాతీయ క్రికెట్లో ఎన్నో తీపి జ్ఞాపకాలతో పాటు గడ్డు పరిస్థితుల్ని కూడా హెట్మెయిర్ చూశాడు. చాలా కాలం తర్వాత హెట్మెయిర్ నుంచి ఒక అద్భుత ఇన్నింగ్స్ రావడంతో టీమ్ మేనేజ్మెంట్ చాలా హ్యాపీగా ఉంది. ఈ మ్యాచ్‌లో ప్రతీ ఒక్కరూ రాణించడంతోనే సునాయాసంగా విజయం సాధించాం. మా ప్రధాన బౌలింగ్ ఆయుధం కాట్రెల్ ఎంతో పరిణితి చెందాడు. మా కరీబియన్ జట్టులో చాలా టాలెంట్ ఉంది. ఆ క్రమంలోనే యువ ఆటగాళ్లకు అవకాశాలు ఇవ్వాల్సిన అవసరం కూడా ఉంది’ అని పొలార్డ్ పేర్కొన్నాడు. భారత్‌తో జరిగిన తొలి వన్డేలో విండీస్ 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. భారత్ నిర్దేశించిన లక్ష్యాన్ని విండీస్ కేవలం రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి ఛేదించింది. హెట్మెయిర్(139; 106 బంతుల్లో 11 ఫోర్లు, 7 సిక్సర్లు), షాయ్ హోప్(102 నాటౌట్; 151 బంతుల్లో 7 ఫోర్లు, 1 సిక్స్)లు సెంచరీలు సాధించి వెస్టిండీస్ విజయంలో కీలక పాత్ర పోషించారు. ఇక్కడ చదవండి: జడేజా రనౌట్‌పై వివాదం.. కోహ్లినే వచ్చేశాడు! హెట్మెయిర్ సరికొత్త రికార్డు -
అసలు ఈ చర్చే ఉండేది కాదు: పొలార్డ్
ముంబై: టీమిండియాతో జరిగిన సిరీస్ నిర్ణయాత్మక మూడో టీ20లో వెస్టిండీస్ ఓటమి పాలుకావడంతో ఆ జట్టు కెప్టెన్ కీరోన్ పొలార్డ్ అసహనం వ్యక్తం చేశాడు. తమ ప్రణాళికల్ని అమలు చేయడంలో పూర్తిగా విఫలం కావడంతోనే ఈ ఘోర ఓటమిని చవి చూడాల్సి వచ్చిందన్నాడు. ప్రత్యేకంగా నిలకడలేని బౌలింగే తమ కొంప ముంచిందంటూ అసంతృప్తి వ్యక్తం చేశాడు. భారత జట్టులో క్లాస్ ఆటగాళ్లు ఉన్నప్పుడు బౌలింగ్ అనేది ఎంతో నియంత్రణతో ఉండాలన్నాడు. అటువంటిది తమ బౌలర్లు పూర్తిగా లైన్ తప్పారన్నాడు. ప్రధానంగా కోహ్లికి అతనే ఆడే స్లాట్‌లోనే పలు బంతుల్ని వేయడం సరైనది కాదన్నాడు. కోహ్లి ఒక అసాధారణ బ్యాట్స్‌మన్ అని, అతనిలాంటి బ్యాట్స్‌మన్‌కు చెత్త బంతులు వేస్తే వాటిని బౌండరీ ద్వారానే సమాధానం చెబుతాడన్నాడు. తాము తమ ప్రణాళికల్ని అమలు చేసే ఉంటే అసలు ఈ చర్చే ఉండేది కాదన్నాడు. ఇక మ్యాచ్‌లో విజయానికి భారత్‌కు అన్ని అర్హతలు ఉన్నాయన్నాడు. తాము టీ20 సిరీస్‌ను మొదలు పెట్టినప్పుడు సిరీస్ ఫలితం చివరి వరకూ వెళుతుందని అనుకోలేదన్నాడు. ఇక చివరి మ్యాచ్‌లో భారత్ చేసిన 240 పరుగులు పెద్ద స్కోరేమీ కాదన్నాడు. తమ చేతుల్లో వికెట్లు ఉండి ఉంటే కచ్చితంగా గెలిచి ఉండేవాళ్లమన్నాడు. తమ బ్యాటింగ్ లైనప్‌లో నిలకడ మరింత పెరగాల్సిన అవసరం ఉందన్నాడు. వన్డే సిరీస్‌లో ప్రణాళికల్ని అమలు చేయడానికి శాయశక్తులా కృషి చేస్తామని పొలార్డ్‌పేర్కొన్నాడు. ఆఖరి టి20లో భారత్ 67 పరుగుల తేడాతో విండీస్‌పై గెలిచింది. మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను 2–1తో సొంతం చేసుకుంది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన భారత్ 20 ఓవర్లలో 3 వికెట్లకు 240 పరుగుల భారీస్కోరు చేసింది. తర్వాత వెస్టిండీస్ 20 ఓవర్లలో 8 వికెట్లకు 173 పరుగులు చేసి ఓడింది. పొలార్డ్ (39 బంతుల్లో 68; 5 ఫోర్లు, 6 సిక్స్‌లు) కాసేపు పోరాటం చేసినా జట్టును గెలిపించలేకపోయాడు. -
అదరగొట్టారు.. సిరీస్ పట్టారు
ముంబై: టీమిండియా ఖాతాలో మరో సిరీస్ విజయం చేరింది. అప్రతిహత విజయాలతో దూసుకుపోతున్న కోహ్లి సేన వెస్టిండీస్‌తో జరిగిన టీ20 సిరీస్‌ను కైవసం చేసుకుంది. నిర్ణయాత్మకమైన చివరి టీ20లో అన్ని రంగాల్లో అద్భుత ప్రదర్శన చేసిన టీమిండియా విజయ ఢంకా మోగించింది. దీంతో మూడు టీ20ల సిరీస్‌ను టీమిండియా 2-1 తేడాతో కైవసం చేసుకుంది. కోహ్లి సేన నిర్దేశించిన 241 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన విండీస్ నిర్ణీత ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 173 పరుగులకే పరిమితమైంది. దీంతో 67 పరుగుల భారీ తేడాతో వెస్టిండీస్ ఘోర ఓటమి చవిచూసింది. వెస్టిండీస్ ఆటగాళ్లలో కీరన్ పొలార్డ్ (39 బంతుల్లో 68; 5 ఫోర్లు, 6 సిక్సర్లు) ఒంటరి పోరాటం చేయగా.. హెట్‌మైర్ (24 బంతుల్లో 41; 1ఫోర్, 5 సిక్సర్లు) ఉన్నంత సేపు ధాటిగా ఆడే ప్రయత్నం చేశాడు. వీరిద్దరూ మినహా మరే విండీస్ ప్లేయర్ కనీస పోరాటం కూడా చేయలేదు. టీమిండియా బ్యాటింగ్ సందర్భంగా ఎవిన్ లూయీస్ గాయపడటంతో అతడు బ్యాటింగ్‌కు దిగలేదు. దీంతో విండీస్‌కు భారీ నష్టం వాటిల్లింది. లూయిస్ ఉంటే మ్యాచ్ పరిస్థితి కాస్త భిన్నంగా ఉండేది. భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన విండీస్‌కు మంచి శుభారంభం లభించలేదు. ఓపెనర్లుగా వచ్చిన సిమన్స్(7), కింగ్(5)లతో పాటు నికోలస్ పూరన్(0)లు వెంటవెంటనే ఔటవ్వడంతో 17 పరుగులకే మూడు కీలక వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. ఈ తరుణంలో పొలార్డ్‌తో కలిసి హెట్‌మైర్ బాధ్యతాయుత ఇన్నింగ్స్ ఆడాడు. వీరిద్దరూ నాలుగో వికెట్‌కు 74 పరుగుల విలువైన భాగస్వామ్యాన్ని నమోదు చేశాడు. అయితే వీరిద్దరినీ కుల్దీప్ ఔట్ చేయడంతో టీమిండియా విజయం ఖాయమైంది. భారత బౌలర్లలో భువనేశ్వర్, షమీ, చహర్, కుల్దీప్లు తలో రెండు వికెట్లు పడగొట్టారు. సిరీస్ విజేతను డిసైడ్ చేసే మ్యాచ్‌లో భారత బ్యాట్స్‌మెన్ శివమెత్తారు. వెస్టిండీస్ బౌలర్లను ఊచకోత కోశారు. దీంతో పర్యాటక కరీబియన్ జట్టుకు టీమిండియా 241 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. ఓపెనర్లు కేఎల్ రాహుల్(56 బంతుల్లో 91; 9 ఫోర్లు, 4 సిక్సర్లు), రోహిత్ శర్మ(34 బంతుల్లో 71; 6ఫోర్లు, 5 సిక్సర్) తొలి వికెటకు 135 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని నమోదు చేసి శుభారంభం అందించారు. అనంతరం సారథి కోహ్లి (29 బంతుల్లో 70 నాటౌట్; 4 ఫోర్లు, 7 సిక్సర్లు) హిట్టింగ్‌కు నిర్వచనం చెబుతూ విశ్వరూపం ప్రదర్శించాడు. దీంతో టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 240 పరుగులు చేసింది. విండీస్ బౌలర్లలో విలియమ్స్, కాట్రెల్, పొలార్డ్‌లు తలో వికెట్ దక్కించుకున్నారు. -
ఆ ఇద్దరిని పక్కకు పెట్టిన కోహ్లి
ముంబై : సిరీస్ విజేతను డిసైడ్ చేసే మూడో టీ20 కోసం టీమిండియా, వెస్టిండీస్ జట్టు సిద్దమయ్యాయి. ముంబై వాంఖెడే వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌పై అందరిలోనూ ఉత్కంఠ నెలకొంది. తొలి మ్యాచ్‌లో గెలిచిన కోహ్లి సేన రెండో టీ20లో చతికిలపడింది. అయితే ఎలాగైన చివరి మ్యాచ్‌లో గెలిచి సిరీస్‌ను కైవసం చేసుకోవాలని ఆరాటపడుతోంది. ఇక రెండో మ్యాచ్‌లో గెలుపుతో ఆత్మవిశ్వాసంతో ఉన్న పొలార్డ్ అండ్ గ్యాంగ్ ముంబై మ్యాచ్ గెలవాలని ఉవ్విళ్లూరుతోంది. కాగా ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన వెస్టిండీస్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. వాంఖెడే పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలించడంతో పాటు ఛేజింగ్‌కు సులువు అవుతుందనే ఉద్దేశంతో పొలార్డ్ టాస్ గెలిచిన వెంటనే ఏ మాత్రం ఆలోచించకుండా బౌలింగ్ ఎంచుకున్నాడు. ఇక ఈ మ్యాచ్ కోసం టీమిండియా రెండు కీలక మార్పులు చేసింది. ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా, మణికట్టు స్పిన్నర్ యజ్వేంద్ర చహల్‌లను అనూహ్యంగా పక్కకు పెట్టి మహ్మద్ షమీ, కుల్దీప్ యాదవ్‌లను తుది జట్టులోకి తీసుకుంది. అయితే అందరూ ఊహించనట్టు వాషింగ్టన్ సుందర్‌ను పక్కకు పెట్టలేదు. అతడికి టీమ్ మేనేజ్మెంట్ మరోసారి అవకాశం కల్పించింది. మరోవైపు విండీస్ జట్టులో ఎలాంటి మార్పులు చోటుచేసుకోలేదు. గత మ్యాచ్ విన్నింగ్ టీమ్‌తోనే ముంబై మ్యాచ్‌లోనూ బరిలోకి దిగుతోంది. ఇక ఈ మైదానంలో రెండో సారి బ్యాటింగ్ చేసిన జట్టుకే విజయావకాశాలు ఎక్కువని గత రికార్డులు పేర్కొంటున్నాయి. చివరి ఆరు టీ20 మ్యాచ్‌లను పరిశీలిస్తే ఐదు మ్యాచ్‌ల్లో ఛేజింగ్ చేసిన జట్టే విజయం సాధించింది. దీంతో మ్యాచ్‌పై మరింత ఆసక్తి పెరిగింది. తుది జట్లు: భారత్: విరాట్ కోహ్లి(కెప్టెన్), రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్, శివమ్ దూబే, రిషభ్ పంత్, మహ్మద్ షమీ, దీపక్ చాహర్, భువనేశ్వర్ కుమార్, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్ వెస్టిండీస్: కీరన్ పొలార్డ్ (కెప్టెన్), లెండిల్ సిమన్స్, లూయిస్, కింగ్, హెట్‌మైర్, నికోలస్ పూరన్, జేసన్ హోల్డర్, పియరీ, విలియమ్స్, కాట్రెల్, హేడెన్ వాల్ష్ -
మేం ఎవరికీ భయపడం: రోహిత్
ముంబై: కీరన్ పొలార్డ్ సారథ్యంలోని వెస్టిండీస్ జట్టుపై టీమిండియా హిట్‌మ్యాన్ రోహిత్ శర్మ ప్రశంసల జల్లు కురిపించాడు. ముఖ్యంగా పొలార్డ్ కెప్టెన్సీని కొనియాడాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)తో పొలార్డ్ సామర్థ్యం, ఆలోచనల గురించి క్షుణ్ణంగా తెలుసన్నాడు. ఇక గత సీజన్లో తాను గైర్హాజరీ నేపథ్యంలో ఓ మ్యాచ్‌కు పొలార్డ్ సారథ్యం వహించాడని, ఆ సమయంలో అతడి వ్యూహాలు, గెలవాలనే తపన, ఫీల్డ్‌లో ఆటగాళ్లను సరిగ్గా సద్వినియోగం చేసుకునే తీరును దగ్గర్నుంచి చూశానని పేర్కొన్నాడు. కెప్టెన్‌గా ఉన్నప్పుడు అతడు చాలా ఆత్మవిశ్వాసంతో, సహచర ఆటగాళ్లపై ఎంతో నమ్మకంగా వ్యవహరిస్తాడన్నాడు. టీ20ల్లో విండీస్ అనూహ్యమైన జట్టని, ప్రతీ ఒక్క ఆటగాడు క్షణాల్లో ఆటను పూర్తిగా మార్చగలరని ప్రశంసించాడు. అయితే మేము ఏ జట్టుకు భయపడమని రోహిత్ స్పష్టం చేశాడు. ‘వెస్టిండీస్ చాల అనూహ్యమైన జట్టు. టీ20ల్లో అసాధారణ రీతిలో ఆడుతోంది. ముఖ్యంగా పొలార్డ్ సారథ్యంలోని ఆ జట్టు చాలా పరిణితి చెందుతోంది. ఆ జట్టులోని దాదాపు అందరాటగాళ్లు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అన్ని టీ20లు ఆడుతున్నారు. దీంతో ఈ ఫార్మట్‌లో వారు విశేషంగా రాణిస్తున్నారు. ఒక విషయాన్ని మనం పరిశీలిస్తే ప్రతి రెండు బంతులకో ఒక సిక్సర్ కొట్టడానికి వారు ప్రయత్నిస్తుంటారు. దీంతో వెస్టిండీస్‌తో టీ20 సిరీస్ అంటే చాలెంజింగ్‌గా తీసుకున్నాం. ఎందుకంటే ఆ జట్టులో పవర్ హిట్టర్లు ఉన్నారు. ఈ తరుణంలో బౌలర్లకు పెద్ద పరీక్ష వంటిది. అయితే మేము ఏ జట్టుకు భయపడం. మా ప్రణాళికలు పక్కాగా అమలు చేస్తే మేమే గెలుస్తాం. అయితే మాకంటే వారి ప్రణాళికలు గొప్పగా ఉంటే వారే గెలుస్తారు. ఇక తొలి రెండు మ్యాచ్‌ల్లో వారి ప్రదర్శన చాలా గొప్పగా ఉంది. హైదరాబాద్ మ్యాచ్‌లో కోహ్లి సహాయంతో టీ20ల్లో భారీ స్కోర్‌ను ఛేజ్ చేశాం. అయితే రెండో మ్యాచ్‌లో చతికిలపడ్డాం. ఆ మ్యాచ్‌లో అనేక పొరపాట్లు చేశాం. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్‌లో పూర్తిగా వైఫల్యం చెందాం. ముందగా ప్రత్యర్థి జట్టు ముందు భారీ స్కోర్ ఉంచలేకపోయినప్పటికీ పోరాడే స్కోరే సాధించాం. కానీ బౌలింగ్, ఫీల్డింగ్‌లో విఫలమవ్వడంతో ఓటమి చవిచూశాం. అయితే ఈ లోపాలన్ని సరిదిద్దుకొని నిర్ణయాత్మకమైన మూడో టీ20 కోసం బరిలోకి దిగుతాం. సిరీస్ సాధిస్తామనే విశ్వాసం మాకు ఉంది’అంటూ రోహిత్ పేర్కొన్నాడు. -
ఓటమిపై స్పందించిన పొలార్డ్
సాక్షి, హైదరాబాద్: ప్రత్యర్థి ముందు భారీ లక్ష్యాన్ని నిర్దేశించినప్పటికీ ఓడిపోవడంపై వెస్టిండీస్ సారథి కీరన్ పొలార్డ్ అసహనం వ్యక్తం చేశాడు. మూడు టీ20ల సిరీస్‌లో భాగంగా వెస్టిండీస్‌పై టీమిండియా 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. టీమిండియా సారథి విరాట్ కోహ్లి ఈ ఫార్మట్‌లో అత్యధిక వ్యక్తిగత స్కోర్ నమోదు చేశాడు. అంతేకాకుండా అంతర్జాతీయ టీ20ల్లో భారీ ఛేజింగ్ మ్యాచ్‌గా నిన్నటి మ్యాచ్ నిలవడం విశేషం. ఇక మ్యాచ్ అనంతరం కరేబియన్ సారథి పొలార్డ్ మాట్లాడుతూ.. క్రమశిక్షణ లేని బౌలింగ్, వ్యూహాలు అమలు చేయడలో వైఫల్యం చెందడంతోనే ఓటమి చవిచూసినట్లు పేర్కొన్నాడు. ‘పిచ్ గురించి ఏం మాట్లాడను. ఎందుకంటే టీ20 ఫార్మట్‌కు ఇలాంటి మైదానాలే కావాలి. మా బ్యాట్స్‌మన్ వారి బాధ్యతను సక్రమంగా నిర్వర్తించారు. దీంతో భారీ స్కోర్ సాధించగలిగాం. కానీ మా బౌలర్ల ప్రదర్శన ఏ మాత్రం ఆశాజనికంగా లేదు. కనీస ప్రాథమిక సూత్రాలను కూడా మా బౌలర్లు పాటించలేదు. ఇందుకు 23 ఎక్స్‌ట్రాలు సమర్పించుకోవడమే ఉదాహరణ. అంతేకాకుండా దాదాపు 15 వైడ్లు వేశారు. తొలి పది ఓవర్ల వరకు గేమ్ మా చేతిలోనే ఉందనిపించింది. అయితే కోహ్లి దాటిగా ఆడి మ్యాచ్‌ను మా చేతుల్లోంచి లాగేసుకున్నాడు. ఈ విషయంలో కోహ్లి గొప్పతనం ఎంత ఉందో.. మా బౌలర్ల వైఫల్యం అంతే ఉంది. అయితే మరో రెండు మ్యాచ్‌లు ఉండటంతో ఈ లోపాలన్నింటిపై దృష్టి సారిస్తాం. తిరిగి పుంజుకుంటామనే నమ్మకం ఉంది’అంటూ పొలార్డ్ పేర్కొన్నాడు. చదవండి: విరాట్ కోహ్లి సింహ గర్జన.. -
గర్జించిన కోహ్లి.. కుదేలైన విండీస్
సాక్షి, హైదరాబాద్ : టీమిండియా సారథి విరాట్ కోహ్లి మళ్లీ గర్జించాడు. విశ్వనగరంలో విశ్వరూపం ప్రదర్శించిన కోహ్లి టీమిండియాకు ఒంటి చేత్తో విజయాన్ని అందించి ఔరా అనిపించాడు. మూడు టీ20ల సిరీస్‌లో భాగంగా స్థానిక రాజీవ్ గాంధీ అంతర్జాతీయ మైదానంలో జరిగిన తొలి మ్యాచ్‌లో టీమిండియా ఆరు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. విండీస్ నిర్దేశించిన 208 పరుగుల భారీ లక్ష్యాన్ని కోహ్లి సేన మరో 8 బంతులు మిగిలుండగానే ఛేదించింది. లక్ష్య ఛేదనలో విరాట్ కోహ్లి (94 నాటౌట్; 50 బంతుల్లో 6ఫోర్లు, 6 సిక్సర్లు) అసాధారణరీతిలో బ్యాటింగ్ చేయగా.. ఓపెనర్ కేఎల్ రాహుల్(56; 41 బంతుల్లో 2 ఫోర్లు, 4 సిక్సర్లు) అర్ధసెంచరీతో కెప్టెన్‌కు సహకారాన్ని అందించాడు. విండీస్ బౌలర్లలో పియర్ రెండు వికెట్లు పడగొట్టగా.. పొలార్డ్, కాట్రెల్‌లు తలో వికెట్ దక్కించుకున్నారు. మూడు టీ20ల సిరీస్‌లో భాగంగా స్థానిక ఉప్పల్ మైదానంలో జరుగుతున్న తొలి మ్యాచ్‌లో టీమిండియాకు వెస్టిండీస్ 208 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది. పొట్టి ఫార్మట్‌కు పెట్టింది పేరైన కరేబియన్ ఆటగాళ్లు వచ్చిన వారు వచ్చినట్టు యథేచ్చగా బ్యాట్ ఝుళిపించారు. దీంతో నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 207 పరుగులు చేసింది. విండీస్ ఆటగాళ్లలో హెట్‌మైర్(56; 41 బంతుల్లో 2ఫోర్లు, 4సిక్సర్లు), లూయిస్(40; 17 బంతుల్లో 3ఫోర్లు, 4 సిక్సర్లు), పొలార్డ్(37;19 బంతుల్లో 1ఫోర్, 4 సిక్సర్లు) ఆకాశమే హద్దుగా చెలరేగారు. చివర్లో జాసన్ హోల్డర్(24; 9 బంతుల్లో 1ఫోర్, 2 సిక్సర్లు) మెరుపులు మెరిపించాడు. దీంతో కోహ్లి సేన ముందు విండీస్ భారీ లక్ష్యాన్ని నిర్దేశించగలిగింది. భారత బౌలర్లలో చహల్ రెండు, జడేజా, చహర్, సుందర్‌లు తలో వికెట్ పడగొట్టాడరు. A captain's knock by @imVkohli as India win the 1st T20I by 6 wickets. #INDvWI #TeamIndia pic.twitter.com/osg63znNEn — BCCI (@BCCI) December 6, 2019 -
తొలి టీ20: టీమిండియాకు ఎదురుందా?
హైదరాబాద్: టీ20 ప్రపంచకప్ సన్నాహకంలో భాగంగా వెస్టిండీస్‌తో టీమిండియా మూడు టీ20ల సిరీస్‌లో తలపడనున్న విషయం తెలిసిందే. దీనిలో భాగంగా ఉప్పల్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ మైదానంలో తొలి టీ20కి వేదికైంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన టీమిండియా తొలుత బౌలింగ్ ఎంచుకుంది. గాయం కారణంగా బంగ్లాదేశ్ సిరీస్‌కు దూరమైన భువనేశ్వర్ కుమార్ పునరాగమనం చేశాడు. భువీ రాకతో ఉమేశ్ యాదవ్ తుది జట్టులో చోటు కోల్పోయాడు. ఇక టెస్టు ఫార్మట్‌లో అదరగొట్టిన మహ్మద్ షమీకి టీ20 తుది జట్టులో చోటు దక్కడానికి ఇంకాస్త సమయం పట్టేలా ఉంది. యువ వికెట్ కీపర్ రిషభ్ పంత్ వైపు మరోసారి టీమ్ మేనేజ్మెంట్ మొగ్గుచూపడంతో సంజూ శాంసన్ రిజర్వ్ బెంచ్‌కే పరిమితమయ్యాడు. ఇక శిఖర్ ధావన్ గాయం కారణంగా దూరం అవడంతో కేఎల్ రాహుల్‌ను ఓపెనర్‌గా వచ్చే అవకాశం ఉంది. సారథి విరాట్ కోహ్లి రాకతో మనీశ్ పాండేకు తుది జట్టులో అవకాశం కోల్పోయాడు. ఇక సారథిగా బాధ్యతలు చేపట్టిన పొలార్డ్ తుది జట్టులో తన మార్క్ చూపించాడు. రూథర్ ఫర్డ్, కీమో పాల్, నికోలసర్ పూరన్‌లను పక్కకు పెట్టాడు. తుదిజట్లు: భారత్: విరాట్ కోహ్లి(కెప్టెన్), రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్, శ్రేయాస్ అయ్యర్, రిషభ్ పంత్, శివమ్ దూబే, వాషింగ్టన్ సుందర్, రవీంద్ర జడేజా, భువనేశ్వర్ కుమార్, దీపక్ చాహర్, యజ్వేంద్ర చహల్ వెస్టిండీస్: పొలార్డ్(కెప్టెన్), సిమన్స్, లూయిస్, బ్రాండన్ కింగ్, హెట్‌మైర్, దినేశ్ రామ్‌దిన్, జాసన్ హోల్డర్, వాల్ష్, షెల్డన్ కాట్రెల్, విలియమ్స్, పియర్ -
టీమిండియాతో సిరీస్‌కు విండీస్ జట్టు ఇదే..
ఆంటిగ్వా: టీమిండియాతో ద్వైపాక్షిక పరిమిత ఓవర్ల సిరీస్‌కు సంబంధించి వెస్టిండీస్ జట్టును ఎంపిక చేశారు. ఈ మేరకు భారత్‌తో సిరీస్‌కు జట్టును విండీస్ క్రికెట్ బోర్డు గురువారం ప్రకటించింది. ఈ సిరీస్‌లో రెండు ఫార్మాట్లకు కీరోన్ పొలార్డ్‌నే సారథిగా నియమిస్తూ సదరు బోర్దు నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం అఫ్గానిస్తాన్‌తో సిరీస్‌లో భాగంగా భారత్‌లో ఉన్న విండీస్ ఆటగాళ్లనే దాదాపు ఎంపిక చేసింది. ‘ప్రతీ ఫార్మాట్లో మూడేసి మ్యాచ్‌లు ఉన్నాయి. దాంతో తలో జట్టును ఎంపిక చేశాం. భారత్‌తో సిరీస్ కఠినతరంగా ఉంటుంది. తమ జట్టు భారత్‌లో విండీస్‌తో జరిగిన మూడు వన్డేల సిరీస్‌ను 3-0తో కైవసం చేసుకుంది. ఇది మాలో ఆత్మవిశ్వాసాన్ని నింపింది. భారత్‌తో మరింత పోటీ ఇవ్వడానికి సిద్ధం అవుతున్నాం’ హెడ్ కోచ్ ఫిల్ సిమ్మన్స్ తెలిపారు.డిసెంబర్ 6వ తేదీన హైదరాబాద్‌లో జరుగనున్న టీ20 మ్యాచ్‌తో విండీస్ పర్యటన షురూ కానుంది. డిసెంబర్ 22వ తేదీన కటక్‌లో చివరి వన్డే జరుగనుంది. విండీస్ టీ20 జట్టు: కీరోన్ పొలార్డ్(కెప్టెన్), ఫాబియన్ అలెన్, షెల్డాన్ కాట్రెల్, షిమ్రాన్ హెట్ మెయిర్, జాసన్ హోల్డర్, బ్రాండాన్ కింగ్, ఎవిన్ లూయిస్, కీమో పాల్, నికోలస్ పూరన్, కారీ పీర్రె, దినేశ్ రామ్‌దిన్, రూథర్‌ఫర్డ్, లెండిల్ సిమ్మన్స్, హెడెన్ వాల్ష్ జూనియర్, కెస్ట్రిక్ విలియమ్స్ వన్డే జట్టు: కీరోన్ పొలార్డ్(కెప్టెన్), షాయ్ హోప్, సునీల్ ఆంబ్రిస్, రోస్టన్ ఛేజ్, షెల్డాన్ కాట్రెల్, షిమ్రాన్ హెట్ మెయిర్, జాసన్ హోల్డర్, అల్జారీ జోసెఫ్, బ్రాండాన్ కింగ్, ఎవిన్ లూయిస్, కీమో పాల్, కారీ పీర్రె, నికోలస్ పూరన్, రొమారియా షెఫర్డ్, హెడెన్ వాల్స్ జూనియర్ -
ఎక్స్పర్ట్ అక్తర్‌ను మించిపోయిన పొలార్డ్
లక్నో: క్రికెట్లో బౌలర్లు నో బాల్స్ వేయడం సర్వసాధారణమే. ఎప్పుడైతే బౌలర్లు ఓవర్స్టెపింగ్తో ముందుకు వెళ్లి బంతి సంధిస్తారో దాన్ని ఎటువంటి అనుమానం లేకుండా అంపైర్ నో బాల్‌గా ప్రకటిస్తాడు. మరి ఆ నో బాల్స్‌ను డెడ్ బాల్స్‌కు మార్చుకోవాలంటే షోయబ్ అక్తర్‌ను, కీరోన్ పొలార్డ్‌లను చూసి నేర్చుకోవాల్సిందే. సోమవారం అఫ్గానిస్తాన్‌తో జరిగిన మూడో వన్డేలో వెస్టిండీస్ కెప్టెన్, ఆల్ రౌండర్ పొలార్డ్ 25 ఓవర్‌ను వేసేందుకు వచ్చాడు. అఫ్గానిస్తాన్ ఆటగాళ్లు అస్గర్ అఫ్గాన్-నజిబుల్లా జద్రాన్ల భాగస్వామ్యాన్ని విడగొట్టడానికి పొలార్డ్ ఓవర్‌ను అందుకున్నాడు. అయితే పరుగెత్తుకుంటూ వచ్చి బాల్‌ను వేయబోయే క్రమంలో పొలార్డ్ ఉన్నపళంగా ఆగిపోయాడు. ఏమైందనేది మ్యాచ్ చూస్తున్న ఫ్యాన్స్‌కు అర్థం కాలేదు. కానీ తను ఎందుకు ఆగాల్సి వచ్చిందో పొలార్డ్‌కు తెలుసు. ఆ బంతి వేసే క్రమంలో ఓవర్స్టెపింగ్ కావడంతో అంపైర్ నో బాల్ అంటూ అరిచాడు. అంతే పొలార్డ్ బంతిని పట్టుకుని అలానే ముందుకు వెళ్లిపోయాడు. ఇక అంపైర్ చేసేది లేక ముసిముసిగా నవ్వుతూ డెడ్‌బాల్‌గా ప్రకటించాడు. ఈ తరహా ఘటనలో క్రికెట్లో ఏమీ కొత్తకాదు. గతంలో అనేక సందర్భాల్లో మనం చూశాం. ఇందులో ఎక్స్పర్ట్ అక్తర్. తన క్రికెట్ ఆడిన సమయంలో అక్తర్ ఇటువంటి ట్రిక్లే ఎక్కువ ఫాలో అయ్యేవాడు. అక్తర్ వరల్డ్ ఫాస్టెస్ట్ బౌలర్లలో ఒకడు కావడంతో అంపైర్ నో బాల్ అనగానే ఆగిపోయే వాడు. ఇప్పుడు ఆ అక్తర్‌నే మించిపోయాడు పొలార్డ్. ఈ మ్యాచ్‌లో వెస్టిండీస్ గెలిచి సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేసింది. ఇప్పుడు పొలార్డ్‌కు సంబంధించిన వీడియోను ఒకనాటి అక్తర్ వీడియోకు జత చేస్తూ సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. -
బ్యాటింగ్ మెరుపులతో సరికొత్త రికార్డు
జమైకా: కరీబియన్ ప్రీమియర్ లీగ్(సీపీఎల్)లో హ్యాట్రిక్ టైటిల్‌పై కన్నేసిన ట్రిన్‌బాగో నైట్ రైడ్రైడర్స్ మరోసారి తన బ్యాటింగ్ పవర్ చూపిస్తోంది. డిఫెండింగ్ చాంపియన్‌గా బరిలోకి దిగిన నైట్‌రైడర్స్.. శుక్రవారం జమైకా తల్హాస్‌తో జరిగిన మ్యాచ్‌లో సరికొత్త బ్యాటింగ్ రికార్డు నెలకొల్పింది. తొలుత బ్యాటింగ్ చేసిన నైట్‌రైడర్స్ విజృంభించి ఆడింది. ఓపెనర్ సునీల్ నరైన్(20) తొందరగానే పెవిలియన్ చేరినప్పటికీ, మరొక ఓపెనర్ లెండి సిమ్మన్స్(86; 42 బంతుల్లో 8 ఫోర్లు, 5 సిక్సర్లు) చెలరేగి ఆడాడు. దాంతో స్కోరు బోర్డు పరుగులు తీసింది. అతనికి మున్రో జత కలవడంతో ఇద్దరూ ఎడాపెడా బాదుతూ జమైకా బౌలర్లకు దడపుట్టించారు. మున్రో(96 నాటౌట్; 50 బంతుల్లో 6 ఫోర్లు, 8 సిక్సర్లు) బౌండరీల మోత మోగించాడు. ఈ క్రమంలోనే రెండో వికెట్‌కు సిమ్మన్స్‌తో కలిసి 124 పరుగుల్ని జత చేశాడు. అటు తర్వాత కెప్టెన్ కీరన్ పొలార్డ్(45 నాటౌట్; 17 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్సర్లు) బ్యాట్ ఝుళిపించడంతో నైట్‌రైడర్స్ నిర్ణీత ఓవర్లలో రెండు వికెట్లుకు 267 పరుగులు చేసింది. ఇది కరీబియన్ లీగ్‌లో అత్యధిక స్కోరు కాగా, ఓవరాల్ టీ20ల్లో మూడో అత్యుత్తమంగా నమోదైంది. ఈ జాబితాలో అఫ్గానిస్తాన్ 278 పరుగులతో టాప్‌లో ఉంది. నైట్‌రైడర్స్ నిర్దేశించిన రికార్డు టార్గెట్‌ను ఛేదించే క్రమంలో జమైకా ధీటుగానే బదులిచ్చినా ఓటమి తప్పలేదు. నిర్ణీత ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 226 పరుగులకు పరిమితమై పరాజయం చెందింది. గేల్(39), గ్లెన్ ఫిలిప్స్(62), జావెల్లె గ్లెన్(34 నాటౌట్), రామల్ లూయిస్(37 నాటౌట్)లు మెరుపులు మెరిపించినా జట్టును గెలిపించలేకపోయారు. గత రెండు సీపీఎల్ టైటిల్స్‌ను నైట్‌రైడర్స్ గెలిచిన సంగతి తెలిసిందే. -
మళ్లీ విండీస్‌కు ఆడాలనుకుంటున్నా బ్రో!
ఆంటిగ్వా: తనకు మళ్లీ వెస్టిండీస్ జట్టుకు ఆడాలని ఉందంటూ ఏడాది క్రితం అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన డ్వేన్ బ్రేవో స్పష్టం చేశాడు. విండీస్ వన్డే, టీ20 జట్లకు కీరన్ పొలార్డ్‌ను కెప్టెన్‌గా నియమించిన నేపథ్యంలో బ్రేవో స్పందిస్తూ.. ‘ నా ఫ్రెండ్ పొలార్డ్‌కు కంగ్రాట్స్. నీలో విండీస్ కెప్టెన్ అయ్యే అన్ని అర్హతలు ఉన్నాయి. విండీస్ జట్టును ముందుండి నడిపించి ఒక అత్తుత్తమ నాయకుడిగా ఎదుగుతావని ఆశిస్తున్నా. మళ్లీ నన్ను నేను విండీస్ జెర్సీలో చూసుకోవాలనుకుంటున్నా. విండీస్ తరఫున ఆడాలనుకుంటున్నా’ అని బ్రేవో తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో పేర్కొన్నాడు. దీనికి హాస్యపూరితమైన కొన్ని ఎమోజీలను జత చేశాడు. దీనికి పొలార్డ్ థాంక్స్ సోల్జర్ అని రిప్లై ఇచ్చాడు. 2018 అక్టోబర్‌లో అంతర్జాతీయ క్రికెట్‌కు బ్రేవో వీడ్కోలు చెప్పిన సంగతి తెలిసిందే. ఇటీవల ముగిసిన వరల్డ్‌కప్‌లో వెస్టిండీస్ తొమ్మిదో స్థానంలో నిలవగా, భారత్‌తో జరిగిన ద్వైపాక్షిక సిరీస్‌లో కూడా ఘోరంగా వైఫల్యం చెందింది. దాంతో మార్పులకు శ్రీకారం చుట్టింది విండీస్ క్రికెట్ బోర్డు. విండీస్ పరిమిత ఓవర్ల కెప్టెన్‌గా ఉన్న కార్లోస్ బ్రాత్‌వైట్‌ను ఆ పదవి నుంచి తప్పించి పొలార్డ్‌కు పగ్గాలు అప్పచెప్పింది. 2020 టీ20 వరల్డ్‌కప్‌ను దృష్టిలో పెట్టుకుని డిఫెండింగ్ చాంపియన్ ఇప్పట్నుంచే మార్పులు చేస్తోంది. -
‘అతనొక టీమిండియా సూపర్ స్టార్’
ఆంటిగ్వా: టీమిండియా ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యాపై వెస్టిండీస్ ఆల్ రౌండర్ కీరన్ పొలార్డ్ ప్రశంసలు కురిపించాడు. ప్రత్యేకంగా భారత జట్టులో హార్దిక్ రెగ్యులర్ ఆటగాడిగా ఎదిగిన తీరును పొలార్డ్ కొనియాడాడు. భారత జట్టులో చోటు సంపాదించడం కోసం హార్దిక్ కష్టపడిన తీరే ఇప్పుడు అతన్ని సూపర్ స్టార్‌గా నిలబెట్టిందన్నాడు. ప్రస్తుత భారత జట్టులో హార్దిక్ ఒక స్టార్ క్రికెటర్ అనడంలో ఎటువంటి సందేహం లేదన్నాడు. ‘నేను ఎప్పుడైతే ఐపీఎల్లో ముంబై ఇండియన్స్ జట్టుకు ఆడటం మొదలు పెట్టానో అప్పట్నుంచి హార్దిక్‌ను చూస్తున్నాను. తనేంటో నిరూపించుకోవడం కోసం హార్దిక్ ఎప్పుడూ తపించి పోయేవాడు. ఇదేమీ నన్ను ఆశ్చర్యానికి గురి చేయలేదు. ఐపీఎల్లో నిరూపించుకున్న హార్దిక్.. ఇప్పుడు భారత్ క్రికెట్ జట్టులోని కీలకంగా మారిపోయాడు. భారత్‌కు దొరికిన కచ్చితమైన ఆల్ రౌండర్ హార్దిక్. వ్యక్తిగతంగా హార్దిక్‌తో నాకు మంచి స్నేహం ఉంది. ఇద్దరం ఎప్పుడూ తప్పులను సరిదిద్దుకోవడం కోసం చర్చించుకునే వాళ్లం. ఆఫ్ ఫీల్డ్‌లో ఎప్పుడైతే నమ్మకంతో ఉంటామో.. అప్పుడే ఆన్ ఫీల్డ్‌లో కూడా మన ప్రదర్శన బయటకు వస్తుంది. అది నిన్ను ఉన్నత స్థానంలో నిలుపుతుంది. అలా ఆత్మవిశ్వాసంతో ఉన్న క్రికెటర్లలో హార్దిక్ ఒకడు. చాలా తక్కువ సమయంలో హార్దిక్ చాలా బాగా ఎదిగాడు. అతని కష్టించే తత్వమే హార్దిక్‌ను మరో స్థాయికి తీసుకెళ్లింది’ అని పొలార్డ్ పేర్కొన్నాడు. -
'పొలార్డ్.. నీతో తలపడడమే నాకు ఆనందం'
న్యూఢిల్లీ : టీమిండియా టి20 జట్టులో కృనాల్ పాండ్యా తొందరగానే తన స్థానాన్ని సుస్థిరపరుచుకునేందుకు ప్రయత్నిస్తున్నాడు. తాజాగా అమెరికా వేదికగా వెస్టిండీస్‌తో జరిగిన టీ20 సిరీస్‌లో ఆకట్టుకునే ప్రదర్శన చేసి మ్యాన్ ఆఫ్ ద సిరీస్‌గా నిలిచాడు. మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను టీమిండియా 3-0 తేడాతో వైట్‌వాష్ చేసిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా కృనాల్ పాండ్యా స్పందిస్తూ ' బ్రదర్ పొలార్డ్ .. నీకు ప్రత్యర్థిగా మ్యాచ్‌లో తలపడడం తనకు సంతోషాన్నిచ్చింది. కానీ నువ్వు నాతో కలిసి ఆడుతున్నప్పుడు ఇంకా ఎక్కువ ఆనందం కలుగుతుందని' ట్వీట్ చేశాడు. కాగా, ఐపీఎల్ టోర్నీలో పాండ్యా బ్రదర్స్, కీరన్ పొలార్డ్ ముంబయి ఇండియన్స్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న సంగతి తెలిసిందే. వీరు ముగ్గురు కలిసి జట్టుకు అనేక విజయాలు సాధించి పెట్టారు. అంతేగాక ఐపీల్ చరిత్రలోనే అత్యధిక టైటిల్స్ నెగ్గిన ముంబయి ఇండియన్స్ జట్టులో వీరి పాత్ర మరువలేనిది. ఐపీఎల్లో ముంబయి ఇండియన్స్ తరపున ఇప్పటికే విజయవంతమైన ఆటగాడిగా పేరుపొందిన కృనాల్ పాండ్యా టీమిండియా తరపున 14 టి20 మ్యాచ్‌ల్లో 14 వికెట్లతో పాటు, బ్యాట్సమెన్‌గానూ రాణిస్తూ మంచి ఆల్‌రౌండర్‌గా గుర్తింపు తెచ్చుకుంటున్నాడు. -
పొలార్డ్‌కు జరిమానా
లాడర్‌హిల్(అమెరికా) : వెస్టిండీస్ ఆల్‌రౌండర్ కీరన్ పొలార్డ్‌పై ఐసీసీ జరిమానా విధించింది. భారత్‌తో జరిగిన రెండో టీ20లో అంపైర్ సూచనలను పొలార్డ్ అతిక్రమించాడనే అభియోగాలపై ఐసీసీ చర్యలు తీసుకుంది. విచారణలో పొలార్డ్ తప్పు తేలడంతో 20 శాతం మ్యాచ్ ఫీజు కోతతో పాటు ఓ డీమెరిట్‌పాయింట్‌ను విధించింది. ఆదివారం జరిగిన మ్యాచ్‌లో పొలార్డ్ సబ్‌స్టిట్యూట్ విషయంలో నిబంధనలను అతిక్రమించాడు. ఓవర్ పూర్తయ్యేవరకు ఆగమని అంపైర్లు చెప్పినా వినకుండా పదేపదే సబ్‌స్టిట్యూట్ ఆటగాడిని మైదానంలోకి రావాలని పిలిచాడు. ఇది ఐసీసీ ఆర్టికల్ 2.4 నియమావళికి విరుద్దం కావడంతో పొలార్డ్ ఖాతాలో ఒక డీమెరిట్ పాయింట్‌తో పాటు మ్యాచ్ ఫీజులో కోత విధించారు. 24 నెలల కాలంలో ఒక ఆటగాడు ఖాతాలో నాలుగు అంతకంటే ఎక్కువ డిమెరిట్ పాయింట్లు చేరితే అతనిపై సస్పెన్షన్ వేటు తీవ్రంగా ఉంటుంది. సదరు ఆటగాడిని నిషేధించే అధికారం ఐసీసీకి ఉంది. రెండు డిమెరిట్ పాయింట్లు చేరితే మాత్రం ఒక టెస్టు కానీ రెండు వన్డేలు కానీ, రెండు టీ20లు కానీ నిషేధం విధిస్తారు. రెండో టీ20లో డక్‌వర్త్ లూయిస్ ప్రకారం 22 పరుగుల తేడాతో విజయం సాధించిన భారత్ ఒక మ్యాచ్ మిగిలి ఉండగానే 2-0తో సిరీస్ కైవసం చేసుకుంది.