విండీస్‌ టీ20 జట్టు ఇదే.. ఆరేళ్ల తర్వాత ఆ ఆటగాడికి పిలుపు | T20 Champions West Indies Announce Squad Ravi Rampual Recall After 6 Years | Sakshi
Sakshi News home page

T20 World Cup 2021: విండీస్‌ టీ20 జట్టు ఇదే.. ఆరేళ్ల తర్వాత ఆ ఆటగాడికి పిలుపు

Published Fri, Sep 10 2021 10:21 AM | Last Updated on Fri, Sep 10 2021 10:57 AM

T20 Champions West Indies Announce Squad Ravi Rampual Recall After 6 Years - Sakshi

జమైకా: టీ20 ప్రపంచకప్‌ను రెండుసార్లు గెలుచుకున్న ఏకైక జట్టుగా నిలిచింది. తాజాగా టీ20 ప్రపంచకప్‌ 2021కు సంబంధించి 15 మందితో కూడిన జట్టును ప్రకటించింది. డిపెండింగ్‌ చాంపియన్‌గా బరిలోకి దిగనున్న విండీస్‌ జట్టుకు కీరన్‌ పొలార్డ్‌ నాయకత్వం వహించనున్నాడు. ఇక దాదాపు ఆరేళ్ల విరామం తర్వాత రవి రాంపాల్‌కు విండీస్‌ టీ20 జట్టులో చోటు దక్కింది. 2010 టీ20 ప్రపంచకప్‌ గెలిచిన వెస్టిండీస్‌ జట్టులో సభ్యుడిగా ఉన్న రవి రాంపాల్‌ జట్టు తరపున చివరి టీ20 2015లో ఆడడం విశేషం.

చదవండి: T20 World Cup 2021: స్టార్‌ ఆటగాళ్లకు మొండిచేయి.. దక్షిణాఫ్రికా టీ20 జట్టు ఇదే

జట్టుగా చూస్తే మొత్తం హిట్లర్లే కనిపిస్తుండడంతో మరోసారి ఫెవరెట్‌గా బరిలోకి దిగుతుంది.  నికోలస్‌ పూరన్‌ వైస్‌ కెప్టెన్‌గా వ్యవహరిస్తుండగా.. క్రిస్‌ గేల్‌, లెండి సిమన్స్‌, హెట్‌మైర్‌, రోస్టన్‌ చేజ్‌ వంటి ఆటగాళ్లతో బ్యాటింగ్‌ బలంగా కనిపిస్తుంది. ఇక డ్వేన్‌ బ్రేవో, ఆండ్రీ రసెల్‌, ఫాబియన్‌ అలెన్‌ లాంటి నాణ్యమైన ఆల్‌రౌండర్లు ఉన్నారు. హెడెన్‌ వాల్ష్‌ జూనియర్‌ ఒక్కడే విండీస్‌  మాజీ కెప్టెన్‌ జాసన్‌ హోల్డర్‌కు 15 మందిలో చోటు దక్కలేదు. అయితే అతనికి రిజర్వ్‌ ఆటగాళ్ల జాబితాలో స్థానం కల్పించారు. 

ఇక టీ20 ప్రపంచకప్‌లో గ్రూప్‌ 1లో ఉన్న వెస్టిండీస్‌ ఇంగ్లండ్‌, ఆస్ట్రేలియా లాంటి పటిష్టమైన జట్టను ఎదుర్కోనుంది. డెత్‌ గ్రూఫ్‌గా పరిగణిస్తున్న ఈ గ్రూఫ్‌లో విండీస్‌ తన తొలి మ్యాచ్‌ను అక్టోబర్‌ 23న ఇంగ్లండ్‌తో ఆడనుంది. ఇక పొట్టి క్రికెట్‌లో విండీస్‌ జట్టు 2010, 2016లో చాంపియన్‌గా నిలిచింది.

విండీస్‌ టీ20 జట్టు ఇదే:
కీరన్ పొలార్డ్ (కెప్టెన్‌), నికోలస్ పూరన్ (వైస్‌ కెప్టెన్‌), క్రిస్ గేల్, ఫాబియన్ అలెన్, డ్వేన్ బ్రావో, రోస్టన్ చేజ్, ఆండ్రీ ఫ్లెచర్, షిమ్రన్ హెట్‌మైర్, ఎవిన్ లూయిస్, ఒబేడ్ మెక్కాయ్, రవి రాంపాల్, ఆండ్రీ రసెల్‌, లెండెల్ సిమన్స్, ఒస్నేన్ థామస్, హెడెన్‌ వాల్ష్‌ జూనియర్‌

స్టాండ్‌ బై ప్లేయర్లు: జాసన్‌ హోల్డర్‌, డారెన్‌ బ్రావో, షెల్డన్‌ కాట్రెల్‌, ఏకేల్ హోసిన్

చదవండి: Six Balls Six Sixes: ఆరు బంతుల్లో ఆరు సిక్సర్లు.. వీడియో వైరల్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement