
అబుదాబి: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) కోసం వెస్టిండీస్ ఆల్‌రౌండర్ కీరన్ పొలార్డ్ శనివారం అబుదాబి చేరుకున్నాడు. అతనితో పాటు కరీబియన్ ప్రీమియర్ లీగ్ (సీపీఎల్)లో పాల్గొన్న ఆటగాళ్లు కూడా తమ తమ ఫ్రాంచైజీలతో కలిశారు. తన ముంబై ఇండియన్స్ సహచరుడు రూథర్‌ఫర్డ్‌తో కలిసి పొలార్డ్ ఇక్కడ అడుగుపెట్టాడు. ఈ విషయాన్ని ముంబై ఇండియన్స్ జట్టు యాజమాన్యం ట్విట్టర్ ద్వారా ప్రకటించింది. ‘కరీబియన్ నుంచి అబుదాబి వచ్చిన రూథర్‌ఫర్డ్‌తో పాటు పొలార్డ్ కుటుంబం ముంబై ఇండియన్స్ కుటుంబంతో కలిసింది’ అని తన ఖాతాలో రాసుకొచ్చింది. కరీబియన్ ప్రీమియర్ లీగ్‌లో విజేతగా నిలిచిన ట్రిన్‌బాగో నైట్ రైడర్స్ జట్టులో పొలార్డ్ సభ్యుడు.
(చదవండి: ‘ఐపీఎల్ 2020 విజేత ఎవరో చెప్పేశాడు’)
Comments
Please login to add a commentAdd a comment