పాకిస్తాన్ సూపర్ లీగ్-2023 ఎడిషన్‌లో ఓ ఫైనల్ బెర్తు ఖరారైంది. నిన్న (మార్చి 15) లాహోర్ ఖలందర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో విజయం సాధించడం ద్వారా మహ్మద్ రిజ్వాన్ నేతృత్వంలోని ముల్తాన్ సుల్తాన్స్ తుదిపోరుకు అర్హత సాధించింది. ఇంకో రెండు మ్యాచ్‌ల తర్వాత సుల్తాన్స్‌తో తలపడబోయే రెండో ఫైనలిస్ట్ ఎవరో తేలిపోతుంది.
TO THE FINALS#HBLPSL8 | #SabSitarayHumaray | #LQvMS pic.twitter.com/gIIye2TYtO
— PakistanSuperLeague (@thePSLt20) March 15, 2023
ఇవాళ (మార్చి 16) జరిగే ఎలిమినేటర్ 1 మ్యాచ్‌లో ఇస్లామాబాద్ యునైటెడ్, పెషావర్ జల్మీ తలపడనుండగా.. రేపు జరుగబోయే ఎలిమినేటర్ 2 మ్యాచ్‌లో లాహోర్ ఖలందర్స్ ఎలిమినేటర్ 1 విజేతను ఢీకొడుతుంది. ఈ మ్యాచ్‌లో విజేత మార్చి 19న జరిగే ఫైనల్లో ముల్తాన్ సుల్తాన్స్‌తో అమీతుమీ తేల్చుకోనుంది.
𝐏𝐎𝐋𝐋𝐀𝐑𝐃 𝐓𝐇𝐄 𝐁𝐈𝐆-𝐇𝐈𝐓𝐓𝐈𝐍𝐆 𝐌𝐀𝐂𝐇𝐈𝐍𝐄 💥
— PakistanSuperLeague (@thePSLt20) March 15, 2023
Giving the treatment to the Qalandars 💪#HBLPSL8 | #SabSitarayHumaray | #LQvMS pic.twitter.com/k2CfWGN3xq
ఇక నిన్న జరిగిన మ్యాచ్ విషయానికొస్తే.. లాహోర్ ఖలందర్స్‌పై ముల్తాన్ సుల్తాన్స్ 84 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన సుల్తాన్స్.. పోలార్డ్ (34 బంతుల్లో 57; ఫోర్, 6 సిక్సర్లు) మెరుపు హాఫ్ సెంచరీతో చెలరేగడంతో నిర్ణీత ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 160 పరుగులు చేయగా, ఛేదనలో షెల్డన్ కాట్రెల్ (3-0-20-3), ఉసామా మిర్ (2-0-12-2) ధాటికి ఖలందర్స్ 14.3 ఓవర్లలో 76 పరుగులకే చాపచుట్టేసింది.
🫡 #HBLPSL8 | #SabSitarayHumaray | #LQvMS pic.twitter.com/zDH8en06kW
— PakistanSuperLeague (@thePSLt20) March 15, 2023
సుల్తాన్స్ ఇన్నింగ్స్‌లో మహ్మద్ రిజ్వాన్ (29 బంతుల్లో 33; 3 ఫోర్లు), ఉస్మాన్ ఖాన్ (28 బంతుల్లో 29; 4 ఫోర్లు), టిమ్ డేవిడ్ (15 బంతుల్లో 22 నాటౌట్; ఫోర్, సిక్స్) ఓ మోస్తరుగా రాణించగా.. ఖలందర్స్ ఇన్నింగ్స్‌లో సామ్ బిల్లింగ్స్ (19), డేవిడ్ వీస్ (12), హరీస్ రౌఫ్ మాత్రమే రెండంకెల స్కోర్ చేశారు. ఖలందర్స్ బౌలర్లలో హరీస్ రౌఫ్ 3, జమాన్ ఖాన్, రషీద్ ఖాన్ తలో వికెట్ పడగొట్టారు. సుల్తాన్స్ బౌలర్లలో కాట్రెల్ 3, మిర్ 2, అన్వర్ అలీ, అబ్బాస్ అఫ్రిది, ఇహసానుల్లా, కీరన్ పోలార్డ్ తలో వికెట్ పడగొట్టారు.
Comments
Please login to add a commentAdd a comment