పాకిస్తాన్ సూపర్ లీగ్ 2024 ఎడిషన్‌లో కరాచీ కింగ్స్ ఆటగాడు, విండీస్ విధ్వంసకర యోధుడు కీరన్ పోలార్డ్ రెచ్చిపోయాడు. పెషావర్ జల్మీతో ఇవాళ (ఫిబ్రవరి 21) జరిగిన మ్యాచ్‌లో మెరుపు ఇన్నింగ్స్‌తో పూర్వంలా పూనకాలు తెప్పించాడు. 21 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో అజేయమైన 49 పరుగులు చేసి తన జట్టును గెలిపించాడు.
𝑽𝒊𝒏𝒕𝒂𝒈𝒆 𝑷𝒐𝒍𝒍𝒚 𝒊𝒏 𝑷𝑺𝑳 𝟐𝟎𝟐𝟒🔥
— CricTracker (@Cricketracker) February 21, 2024
📸: Fan Code pic.twitter.com/uUMO58x5Sj
పోలార్డ్ సుడిగాలి ఇన్నింగ్స్‌తో విరుచుకుపడటంతో ప్రత్యర్ది బ్యాటర్ బాబర్ ఆజమ్ (పెషావర్) వరల్డ్ రికార్డు ఇన్నింగ్స్ వృధా అయ్యింది. ఈ మ్యాచ్‌లో 51 బంతుల్లో 7 ఫోర్లు, సిక్సర్ సాయంతో 72 పరుగులు చేసిన బాబర్.. టీ20ల్లో అత్యంత వేగంగా (271 ఇన్నింగ్స్‌ల్లో) 10,000 పరుగులు పూర్తి చేసిన ఆటగాడిగా ప్రపంచ రికార్డు నెలకొల్పాడు.
He's still got it 🥶pic.twitter.com/kthsVbhdf3
— CricTracker (@Cricketracker) February 21, 2024
పోలార్డ్‌తో పాటు జేమ్స్ విన్స్ (30 బంతుల్లో 28 నాటౌట్; 3 ఫోర్లు, సిక్స్), ముహమ్మద్ అక్లక్ (13 బంతుల్లో 24; 3 ఫోర్లు, 2 సిక్సర్లు), షోయబ్ మాలిక్ (29 బంతుల్లో 29; ఫోర్, సిక్స్) రాణించడంతో పెషావర్ నిర్ధేశించిన 155 పరుగుల లక్ష్యాన్ని కరాచీ 16.5 ఓవర్లలో కేవలం 3 వికెట్లు మాత్రమే కోల్పోయి ఛేదించింది. ఫలితంగా ఏడు వికెట్ల తేడాతో విజయం సాధించింది. పెషావర్ బౌలర్లలో లూక్ వుడ్ (3.5-1-20-2) ఒక్కడే కరాచీ బ్యాటర్లను కాస్త ఇబ్బంది పెట్టాడు. సలాంకీల్ వికెట్ తీసినప్పటికీ (4-0-54-1) భారీగా పరుగులు సమర్పించుకున్నాడు.
తొలుత బ్యాటింగ్ చేసిన పెషావర్.. బాబర్ ఆజమ్ (72) రాణించడంతో 154 పరుగుల గౌరవప్రదమైన స్కోర్ (19.5 ఓవర్లలో ఆలౌట్) చేయగలిగింది. పెషావర్ ఇన్నింగ్స్‌లో బాబర్‌తో పాటు రోవ్‌మన్ పావెల్ (39), ఆసిఫ్ అలీ (23) మాత్రమే రెండంకెల స్కోర్లు చేయగలిగారు. కరాచీ బౌలర్లలో మీర్ హమ్జా, హసన్ అలీ చెరో 3 వికెట్లు, డేనియల్ సామ్స్ 2, షోయబ్ మాలిక్, మొహమ్మద్ నవాజ్ తలో వికెట్ పడగొట్టారు.
Comments
Please login to add a commentAdd a comment