అంతర్జాతీయ క్రికెట్‌లో పాకిస్తాన్ మాజీ కెప్టెన్ బాబర్ ఆజమ్ వైఫల్యాల పరంపర కొనసాగుతుంది. మూడు ఫార్మాట్లలో బాబర్ సెంచరీ చేసి 61 ఇన్నింగ్స్‌లు అవుతుంది. ఇన్ని ఇన్నింగ్స్‌లుగా సెంచరీ చేయని తొలి టాపార్డర్ బ్యాటర్‌గా బాబర్ అప్రతిష్ఠ మూటగట్టుకున్నాడు.
గత 10 టెస్ట్ ఇన్నింగ్స్‌ల్లో బాబర్ స్కోర్లు..
31(67)
1(5)
5(11)
8(20)
5(18)
30(71)
11(18)
31(77)
22(50)
0(2)
ముల్తాన్ వేదికగా వెస్టిండీస్‌తో జరుగుతున్న రెండో టెస్ట్ మ్యాచ్ రెండో ఇన్నింగ్స్‌లోనూ బాబర్ విఫలమయ్యాడు. ఈ ఇన్నింగ్స్‌లో బాబర్ 31 పరుగులు చేసి రెండో రోజు ఆట ముగియడానికి కొద్ది నిమిషాల ముందు నిష్క్రమించాడు. ఈ మ్యాచ్‌లో పాకిస్తాన్ కష్టాల్లో ఉంది. 255 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన పాక్ రెండో రోజు ఆట ముగిసే సమయానికి 4 వికెట్ల నష్టానికి 76 పరుగులు చేసింది.
ఈ మ్యాచ్‌లో పాక్ గెలవాలంటే ఇంకా 178 పరుగులు చేయాలి. చేతిలో 6 వికెట్లు మాత్రమే ఉన్నాయి. సౌద్ షకీల్ (13), కషిఫ్ అలీ (1) క్రీజ్‌లో ఉన్నారు.
అంతకుముందు విండీస్ రెండో ఇన్నింగ్స్‌లో 244 పరుగులకు ఆలౌటైంది. బ్రాత్‌వైట్ (52) అర్ద సెంచరీతో రాణించాడు. అమీర్ జాంగూ (30) ఓ మోస్తరు స్కోర్ చేయగా.. చివరి వరుస బ్యాటర్లు టెవిన్ ఇమ్లాచ్ (35), కెవిన్ సింక్లెయిర్ (28), గుడకేశ్ మోటీ (18), గోమెల్ వార్రికన్ (18) రెండంకెల స్కోర్లు చేశారు. పాక్ బౌలర్లలో సాజిద్ ఖాన్, నౌమన్ అలీ తలో నాలుగు వికెట్లు పడగొట్టగా.. కషిఫ్ అలీ, అబ్రార్ అహ్మద్ చెరో వికెట్ దక్కించుకున్నారు.
తొలి రోజు ఆటలో ఇరు జట్లు తమతమ ఇన్నింగ్స్‌లను ముగించాయి. బౌలర్లు.. ముఖ్యంగా స్పిన్నర్లు చెలరేగడంతో మొదటి రోజు 20 వికెట్లు నేలకూలాయి. తొలుత బ్యాటింగ్ చేసిన విండీస్ 163 పరుగులకే ఆలౌట్ కాగా.. పాకిస్తాన్ 154 పరుగులకే కుప్పకూలింది. ఈ మ్యాచ్‌లో పాక్ స్పిన్నర్ నౌమన్ అలీ హ్యాట్రిక్ సహా 10 వికెట్లు తీశాడు.
Comments
Please login to add a commentAdd a comment