బాబర్‌ సెంచరీ: రెండో వన్డేలో పాక్‌ గెలుపు | Babar and Hasan square the series for Pakistan | Sakshi
Sakshi News home page

బాబర్‌ సెంచరీ: రెండో వన్డేలో పాక్‌ గెలుపు

Published Tue, Apr 11 2017 1:51 AM | Last Updated on Tue, Sep 5 2017 8:26 AM

Babar and Hasan square the series for Pakistan

గయానా: వెస్టిండీస్‌తో జరిగిన రెండో వన్డేలో పాకిస్తాన్‌ 74 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది. బాబర్‌ ఆజమ్‌ (132 బంతుల్లో 125 నాటౌట్‌; 7 ఫోర్లు, 3 సిక్సర్లు) అజేయ సెంచరీ సాధించగా... బౌలింగ్‌లో హసన్‌ అలీ (5/38) విజృంభించాడు.

మొదట బ్యాటింగ్‌ చేపట్టిన పాకిస్తాన్‌ 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 282 పరుగులు చేసింది. తర్వాత వెస్టిండీస్‌ 44.5 ఓవర్లలో 208 పరుగుల వద్ద ఆలౌటైంది. జేసన్‌ హోల్డర్‌ (68; 6 ఫోర్లు, 1 సిక్సర్‌), యాష్లే నర్స్‌ (44; 6 ఫోర్లు, 1 సిక్స్‌) రాణించారు. హఫీజ్‌కు 2 వికెట్లు దక్కాయి. మూడు వన్డేల సిరీస్‌లో ప్రస్తుతం ఇరు జట్లు చెరో విజయంతో 1–1తో సమంగా నిలిచాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement