
Pakistan name squads for home series against West Indies: వెస్టిండీస్‌తో స్వదేశంలో జరిగే టీ20, వన్డే సిరీస్‌లకు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు(పీసీబీ) తమ జట్టును గురువారం ప్రకటించింది. టీ20 సిరీస్‌కు 15 మందితో కూడిన జట్టును ఎంపిక చేయగా, వన్డే సిరీస్ 17 మందితో కూడిన జట్టును వెల్లడించారు. ఈ సిరీస్‌కు హసన్ అలీ, ఇమాద్ వసీం, సర్ఫరాజ్ అహ్మద్, షోయబ్ మాలిక్‌కు విశ్రాంతి ఇచ్చారు.
కాగా ఈ జట్టులో ఫాస్ట్ బౌలర్ మహ్మద్ హస్నైన్‌కు చోటు దక్కింది. ఈ పర్యటనలో భాగంగా వెస్టిండీస్, పాకిస్తాన్‌తో మూడు టీ20లు, మూడు వన్డేలు ఆడనుంది. కాగా తొలి టీ20 డిసెంబర్ 13న కరాచీ వేదికగా జరగనుంది.
పాకిస్తాన్ టీ20 జట్టు: బాబర్ అజాం (కెప్టెన్), షాదాబ్ ఖాన్ (వైస్ కెప్టెన్), ఆసిఫ్ అలీ, ఫఖర్ జమాన్, హైదర్ అలీ, హరీస్ రవూఫ్, ఇఫ్తీకర్ అహ్మద్, ఖుష్దిల్ షా, మహ్మద్ హస్నైన్, మహ్మద్ నవాజ్, మహ్మద్ రిజ్వాన్ (వికెట్ కీపర్), మహ్మద్ వసీం, షానవాజ్ దహానీ, ఉస్మాన్ ఖాదిర్
పాకిస్తాన్ వన్డే జట్టు: బాబర్ ఆజం (కెప్టెన్), షాదాబ్ ఖాన్ (వైస్ కెప్టెన్), ఆసిఫ్ అలీ, ఫఖర్ జమాన్, హైదర్ అలీ, హరీస్ రవూఫ్, ఇఫ్తీకర్ అహ్మద్, ఇమామ్-ఉల్-హక్, ఖుష్దిల్ షా, మహ్మద్ నవాజ్, మహ్మద్ రిజ్వాన్ (డబ్ల్యుకె), మహ్మద్ వసీం జూనియర్, మహ్మద్ హస్నైన్, సౌద్ షకీల్, షాహీన్ ఆఫ్రిది, షానవాజ్ దహానీ, ఉస్మాన్ ఖాదిర్