PCB
-
ఐపీఎల్‌తో పోటీకి దిగిన పాకిస్తాన్ సూపర్ లీగ్.. షెడ్యూల్ ప్రకటన
పాకిస్తాన్ సూపర్ లీగ్ (PSL) ఇండియన్ ప్రీమియర్ లీగ్‌తో (IPL) నేరుగా పోటీకి దిగింది. పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (PCB) పీఎస్ఎల్ 10వ ఎడిషన్ షెడ్యూల్‌ను ఇవాళ (ఫిబ్రవరి 28) ప్రకటించింది. ఈ షెడ్యూల్ ఐపీఎల్-2025 షెడ్యూల్‌తో క్లాష్ అవుతుంది. పీఎస్ఎల్ 10వ ఎడిషన్ ఏప్రిల్ 11 నుంచి ప్రారంభమవుతుంది. మే 18న జరిగే ఫైనల్‌తో ముగుస్తుంది. ఐపీఎల్ 17వ ఎడిషన్ మార్చి 22న ప్రారంభమై, మే 25న ముగుస్తుంది. ఐపీఎల్లో పాల్గొనే విదేశీ ప్లేయర్లను ఇరకాటంలో పెట్టేందుకే పీసీబీ పీఎస్ఎల్ను ఐపీఎల్ డేట్స్‌లో ఫిక్స్ చేసింది.పీఎస్ఎల్-2025 విషయానికొస్తే.. ఈ సీజన్లో మొత్తం 34 మ్యాచ్‌లు (6 జట్లు) జరుగనున్నాయి. లాహోర్‌లోని గడాఫీ స్టేడియంలో రెండు ఎలిమినేటర్ మ్యాచ్‌లు, ఫైనల్ సహా 13 మ్యాచ్‌లు జరుగనున్నాయి. రావల్పిండి స్టేడియం క్వాలిఫయర్-1 సహా 11 మ్యాచ్‌లకు ఆతిథ్యం ఇవ్వనుంది. కరాచీ మరియు ముల్తాన్ స్టేడియాల్లో తలో ఐదు మ్యాచ్‌లు జరుగనున్నాయి. ఈ సీజన్లో మూడు డబుల్ హెడర్ మ్యాచ్‌లు జరుగనున్నాయి. ఇందులో రెండు వీకెండ్లో (శనివారం) జరుగనుండగా.. ఓ డబుల్ హెడర్ పాక్ నేషనల్ హాలిడే లేబర్ డే రోజున జరుగనుంది.లీగ్ ఆరంభ మ్యాచ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్స్ ఇస్లామాబాద్ యునైటెడ్ టూ టైమ్ ఛాంపియన్స్ లాహోర్ ఖలందర్స్‌తో తలపడనుంది. ఈ మ్యాచ్ రావల్పిండి క్రికెట్ స్టేడియంలో జరుగనుంది.ఈ సీజన్లో ఓ ఎగ్జిబిషన్ మ్యాచ్ కూడా జరుగనుంది. ఏప్రిల్ 8న పెషావర్‌లో ఈ మ్యాచ్ జరుగనుంది. ఈ మ్యాచ్‌లో పాల్గొనే జట్లపై త్వరలో ప్రకటన వెలువడనుంది.పీఎస్ఎల్-2025 పూర్తి షెడ్యూల్..11 ఏప్రిల్ - ఇస్లామాబాద్ యునైటెడ్ v లాహోర్ ఖలందర్స్, రావల్పిండి క్రికెట్ స్టేడియం12 ఏప్రిల్ - పెషావర్ జల్మీ v క్వెట్టా గ్లాడియేటర్స్, రావల్పిండి క్రికెట్ స్టేడియం12 ఏప్రిల్ - కరాచీ కింగ్స్ v ముల్తాన్ సుల్తాన్స్, నేషనల్ బ్యాంక్ స్టేడియం, కరాచీ13 ఏప్రిల్ - క్వెట్టా గ్లాడియేటర్స్ v లాహోర్ క్వాలండర్స్, రావల్పిండి క్రికెట్ స్టేడియం14 ఏప్రిల్ - ఇస్లామాబాద్ యునైటెడ్ v పెషావర్ జల్మీ, రావల్పిండి క్రికెట్ స్టేడియం15 ఏప్రిల్ - కరాచీ కింగ్స్ v లాహోర్ క్వాలండర్స్, నేషనల్ బ్యాంక్ స్టేడియం, కరాచీ16 ఏప్రిల్ - ఇస్లామాబాద్ యునైటెడ్ v ముల్తాన్ సుల్తాన్స్, రావల్పిండి క్రికెట్ స్టేడియం18 ఏప్రిల్ - కరాచీ కింగ్స్ v క్వెట్టా గ్లాడియేటర్స్, నేషనల్ బ్యాంక్ స్టేడియం, కరాచీ19 ఏప్రిల్ - పెషావర్ జల్మీ v ముల్తాన్ సుల్తాన్స్, రావల్పిండి క్రికెట్ స్టేడియం20 ఏప్రిల్ - కరాచీ కింగ్స్ v ఇస్లామాబాద్ యునైటెడ్, నేషనల్ బ్యాంక్ స్టేడియం, కరాచీ21 ఏప్రిల్ - కరాచీ కింగ్స్ v పెషావర్ జల్మీ, నేషనల్ బ్యాంక్ స్టేడియం, కరాచీ22 ఏప్రిల్ - ముల్తాన్ సుల్తాన్స్ v లాహోర్ క్వాలండర్స్, ముల్తాన్ క్రికెట్ స్టేడియం23 ఏప్రిల్ - ముల్తాన్ సుల్తాన్స్ v ఇస్లామాబాద్ యునైటెడ్, ముల్తాన్ క్రికెట్ స్టేడియం24 ఏప్రిల్ - లాహోర్ ఖలందర్స్ v పెషావర్ జల్మీ, గడ్డాఫీ స్టేడియం, లాహోర్ఏప్రిల్ 25 - క్వెట్టా గ్లాడియేటర్స్ vs కరాచీ కింగ్స్, గడ్డాఫీ స్టేడియం, లాహోర్ఏప్రిల్ 26 - లాహోర్ క్వలండర్స్ vs ముల్తాన్ సుల్తాన్స్, గడ్డాఫీ స్టేడియం, లాహోర్ఏప్రిల్ 27 - క్వెట్టా గ్లాడియేటర్స్ vs పెషావర్ జల్మి, గడ్డాఫీ స్టేడియం, లాహోర్ఏప్రిల్ 29 - క్వెట్టా గ్లాడియేటర్స్ vs ముల్తాన్ సుల్తాన్స్, గడ్డాఫీ స్టేడియం, లాహోర్ఏప్రిల్ 30 - లాహోర్ క్వలండర్స్ vs ఇస్లామాబాద్ యునైటెడ్, గడ్డాఫీ స్టేడియం, లాహోర్మే 1 - ముల్తాన్ సుల్తాన్స్ vs కరాచీ కింగ్స్, ముల్తాన్ క్రికెట్ స్టేడియంమే 1 - లాహోర్ క్వాలండర్స్ v క్వెట్టా గ్లాడియేటర్స్, గడాఫీ స్టేడియం, లాహోర్మే 2 - పెషావర్ జల్మీ v ఇస్లామాబాద్ యునైటెడ్, గడ్డాఫీ స్టేడియం, లాహోర్మే 3 - క్వెట్టా గ్లాడియేటర్స్ v ఇస్లామాబాద్ యునైటెడ్, గడ్డాఫీ స్టేడియం, లాహోర్మే 4 - లాహోర్ ఖలందర్స్ v కరాచీ కింగ్స్, గడాఫీ స్టేడియం, లాహోర్మే 5 - ముల్తాన్ సుల్తాన్స్ v పెషావర్ జల్మీ, ముల్తాన్ క్రికెట్ స్టేడియంమే 7 - ఇస్లామాబాద్ యునైటెడ్ v క్వెట్టా గ్లాడియేటర్స్, రావల్పిండి క్రికెట్ స్టేడియంమే 8 - పెషావర్ జల్మీ v కరాచీ కింగ్స్, రావల్పిండి క్రికెట్ స్టేడియంమే 9 - పెషావర్ జల్మీ v లాహోర్ ఖలందర్స్, రావల్పిండి క్రికెట్ స్టేడియంమే 10 - ముల్తాన్ సుల్తాన్స్ v క్వెట్టా గ్లాడియేటర్స్, ముల్తాన్ క్రికెట్ స్టేడియంమే 10 - ఇస్లామాబాద్ యునైటెడ్ vs కరాచీ కింగ్స్, రావల్పిండి క్రికెట్ స్టేడియం13 మే – క్వాలిఫైయర్ 1, రావల్పిండి క్రికెట్ స్టేడియం14 మే – ఎలిమినేటర్ 1, గడాఫీ స్టేడియం, లాహోర్16 మే – ఎలిమినేటర్ 2, గడాఫీ స్టేడియం, లాహోర్18 మే – ఫైనల్, గడాఫీ స్టేడియం, లాహోర్ -
ఓటమి ఎఫెక్ట్.. పాకిస్థాన్ క్రికెటర్లు, బోర్డుకు ఝలక్!
ఇస్లామాబాద్: ఛాంపియన్స్ ట్రోఫీ-2025లో ఆతిథ్య పాకిస్థాన్ జట్టు ప్రదర్శన ఆ దేశ అభిమానులను తీవ్ర నిరాశకు గురిచేసింది. పాకిస్థాన్ ఆడిన రెండు మ్యాచుల్లో(భారత్, న్యూజిలాండ్) ఓటమిని చవిచూసింది. వర్షం కారణంగా బంగ్లాదేశ్‌తో మ్యాచ్ రద్దు అయ్యింది. దీంతో, పాయింట్ల పట్టికలో ఆఖరి స్థానానికి పరిమితమైంది. ఈ నేపథ్యంలో ప్లేయర్స్, పీసీబీపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.మరోవైపు.. పాకిస్థాన్ టీమ్ ఆటతీరుపై రాజకీయ నాయకులు కూడా దృష్టి సారించారు. రిజ్వాన్ సేన దారుణ ఆటతీరు, పీసీబీ వ్యవహారాలను ప్రధాని షెహబాజ్ షరీఫ్ దృష్టికి తీసుకెళ్తామని ప్రధాని రాజకీయ, ప్రజా వ్యవహారాల సలహాదారు రాణా సనావుల్లా వెల్లడించారు. పార్లమెంట్లో జట్టు ప్రదర్శనపై చర్చించాలని ప్రధాని షెహబాబ్ను కోరుతామని అన్నారు. జట్టు ఓటమిపై ప్రధాని కూడా ఆందోళన వ్యక్తం చేసినట్టు తెలిపారు. ఈ సందర్బంగా సనావుల్లా మాట్లాడుతూ.. పాక్ క్రికెట్ జట్టు ఆట తీరుపై ప్రధాని వ్యక్తిగతంగా దృష్టిసారించాని కోరుతాం. జట్టు ఆటతీరు దారుణంగా ఉంది. పాక్ దారుణ ప్రదర్శనపై మంత్రివర్గంలో, పార్లమెంటులో ప్రస్తావించాలనుకుంటున్నాం. క్రికెట్ బోర్డు ఒక స్వతంత్ర సంస్థ. పాక్ బోర్డు తమ దగ్గర ఉన్న నగదును వేటికి ఎలా ఖర్చుపెడుతుందో తెలుసుకునే హక్కు ప్రజలకు ఉంది. పీసీబీలోని కొందరు అధికారులు నెలకు ఐదు మిలియన్లకు వరకు అందుకుంటున్నారు. వారు తమకు నచ్చినట్లు చేయగలరు. కానీ, వారి బాధ్యతలను నిర్వర్తించడంలో విఫలం అవుతున్నారు. గత దశాబ్ద కాలంగా మనం క్రికెట్లో ఒడిదుడుకులను ఎదుర్కొంటున్నాం. ఆటగాళ్లకు ఇచ్చే ప్రోత్సాహకాలు సైతం భారీగా ఉన్నాయి. ఇవన్నీ జట్టు ప్రదర్శనపై ప్రభావితం చూపుతున్నాయి’ అని చెప్పుకొచ్చారు. ఈ నేపథ్యంలో పాక్ జట్టు ఆట తీరుపై పార్లమెంట్లో వాడేవేడి చర్చ జరిగే అవకాశం ఉంది.ఇదిలా ఉండగా.. ఛాంపియన్స్ ట్రోఫీలో పాకిస్తాన్ కథ ముగిసింది. ఒక్క మ్యాచ్‌లో కూడా గెలవకుండానే(బంగ్లాదేశ్‌తో మ్యాచ్ వర్షం కారణంగా రద్దు) టోర్నీ నుంచి నిష్క్రమించింది. ఈ నేపథ్యంలో జట్టు దారుణమైన ప్రదర్శన ఆ దేశ క్రికెట్ నిపుణులు, మాజీ ఆటగాళ్లలో ఆందోళనను రేకెత్తించింది. ఇలాంటి వైఫల్యాలకు జట్టు ఆటగాళ్ల ప్రదర్శన ఒక్కటే కారణం కాదని, పాక్ జట్టు దేశవాలీ వ్యవస్థ పూర్తిగా క్షీణించడం అని వారు చెబుతున్నారు. -
పాక్‌ను ఆడేసుకుంటోన్న నెటిజన్స్.. పుష్ప-2 సీన్‌ను కూడా వదల్లేదు!
భారత్- పాకిస్తాన్ మధ్య ఆదివారం జరిగిన వన్డే మ్యాచ్‌లో టీమిండియా జయకేతనం ఎగరేసింది. దుబాయ్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో అతిథ్య పాక్ జట్టును భారత్ మట్టికరిపించింది. ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా జరిగిన ఈ లీగ్ మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ సెంచరీతో చెలరేగాడు. పాక్ జట్టు నిర్దేశించిన లక్ష్యాన్ని కేవలం నాలుగు వికెట్లు మాత్రమే టీమిండియా ఘనవిజయం సాధించింది. అయితే దాయాదుల పోరు అంటే ఓ రేంజ్లో ఫైట్ ఉంటుంది. అందుకు తగ్గట్టుగానే ఇరుదేశాల అభిమానుల్లోనూ భారీ అంచనాలు పెట్టుకుని ఉంటారు. ఆటలో గెలుపోటములు సహజమే అయినప్పటికీ భారత్- పాకిస్తాన్ మ్యాచ్ అంటే ఓ రేంజ్ ఉంటుంది. ఇలాంటి ప్రతిష్టాత్మక మ్యాచ్‌లో ఓటమి పాలైన జట్టుపై విమర్శలు కూడా అదేస్థాయిలో ఉంటాయి.ఇంకేముంది పాక్ జట్టు ఇండియాతో ఓడిపోవడంతో నెటిజన్స్ ఓ ఆటాడేసుకుంటున్నారు. ఆ జట్టుపై నెట్టింట ట్రోల్స్ తెగ వైరలవుతున్నాయి. కింగ్ కోహ్లీని ప్రశంసలు కురిపిస్తూ.. పాక్ టీమ్‌ను ఫుట్‌బాల్ ఆడేస్తున్నారు నెటిజన్స్. తాజాగా పాక్ జట్టుపై చేసిన ఓ మీమ్ మాత్రం తెగ వైరలవుతోంది. ఇందులో మన పుష్పరాజ్‌ను కూడా వాడేశారు. అల్లు అర్జున్ పుష్ప-2 చిత్రంలోని ఓ పైట్ సీన్‌తో క్రియేట్ చేసిన మీమ్ నెట్టింట నవ్వులు పూయిస్తోంది.పుష్ప-2 చిత్రంలోని గంగమ్మ జాతర సాంగ్ తర్వాత వచ్చే ఫైట్ సీన్ గురించి సినిమా చూసిన ఎవ్వరైనా మర్చిపోలేరు. తాజాగా ఆ ఫైట్ సీన్లోని ఓ క్లిప్‌తో పాక్ టీమ్‌ను ట్రోల్ చేశారు. అల్లు అర్జున్‌కు ఫేస్‌కు కోహ్లీని చూపిస్తూ.. రౌడీలను పాక్ జట్టుతో పోలుస్తూ మీమ్ క్రియేట్ చేశారు. ఈ వీడియో సోషల్ మీడియాలో మాత్రం తెగ వైరలవుతోంది. ఇంకేముంది ఈ ఫన్నీ మీమ్ చూసిన మన టీమిండియా ఫ్యాన్స్ మాత్రం తెగ నవ్వేసుకుంటున్నారు. ఇంకేందుకు ఆలస్యం ఆ మీమ్ మీరు కూడా చూసి ఎంజాయ్ చేయండి. #INDvsPAK pic.twitter.com/7dP4diEwq7— Unlisted-pre IPO Investment Zone (@reddy73375) February 23, 2025 -
పాకిస్తాన్‌కు పరీక్షా సమయం
1996 వన్డే వరల్డ్ కప్‌లో భాగంగా ఫిబ్రవరి 16న పాకిస్తాన్లో తొలి లీగ్ మ్యాచ్ జరిగింది. దాదాపు నెల రోజుల తర్వాత మార్చి 17న లాహోర్‌లో ఫైనల్‌తో టోర్నీ ముగిసింది. అనంతరం మరో నెల రోజులు ఆ దేశం క్రికెట్ సంబరాల్లో మునిగింది. డిఫెండింగ్ చాంపియన్‌గా బరిలోకి దిగి సెమీస్‌కు కూడా చేరకపోయినా... ఆతిథ్య దేశంగా అభిమానులకు ఆనందం పంచింది. సరిగ్గా 29 ఏళ్ల తర్వాత ఫిబ్రవరి 19న తొలి మ్యాచ్‌తో ఆ దేశం మరో ఐసీసీ టోర్నీకి ఆతిథ్యం ఇస్తోంది. దాదాపు మూడు దశాబ్దాల వ్యవధిలో పాకిస్తాన్ ఎన్నో సంక్షోభాలను దాటి ఒక మెగా టోర్నీ నిర్వహణకు సిద్ధమైంది. ఈసారీ డిఫెండింగ్ చాంపియన్‌గా పాక్ బరిలోకి దిగుతోంది. అయితే ఇప్పుడు అక్కడిఅభిమానుల దృష్టిలో టైటిల్ గెలవడంకంటే కూడా టోర్నీ జరగడమే పెద్ద విశేషం. –సాక్షి క్రీడా విభాగందాదాపు మూడు దశాబ్దాల ఈ సమయాన్ని పాకిస్తాన్ క్రికెట్లో 2009కి ముందు... దానికి తర్వాతగా విభజించవచ్చు. లాహోర్‌లో టెస్టు సిరీస్ సమయంలో శ్రీలంక జట్టు క్రికెటర్లపై జరిగిన ఉగ్రవాదుల దాడి ఆ దేశ క్రికెట్‌ను మసకబార్చింది. ఆరేళ్ల పాటు ఏ జట్టు కూడా ఆ దేశం వైపు కన్నెత్తి చూడలేదు. అంత సాహసం ఏ దేశం కూడా చేయలేకపోయింది. ఐసీసీ కూడా టోర్నీ నిర్వహణల విషయంలో పూర్తిగా వెనక్కి తగ్గింది. ఎట్టకేలకు ఆరేళ్ల తర్వాత 2015లో జింబాబ్వేను పిలిచి పరిస్థితులు చక్కబడ్డాయనే సందేశంతో పాక్ బోర్డు మళ్లీ అంతర్జాతీయ క్రికెట్‌ను మొదలు పెట్టింది. అయితే 2021లో ఒక ప్రధాన జట్టు ఆ్రస్టేలియా వచ్చిన తర్వాత గానీ అక్కడ అసలు క్రికెట్ రాలేదు. ఈ నాలుగేళ్లలో భారత్ మినహా మిగతా అన్ని జట్లూ అక్కడ పర్యటించడం ఊరటనిచ్చింది. ఎట్టకేలకు ఇప్పుడు ఐసీసీ టోర్నీ అవకాశం రాగా... దీన్ని సమర్థంగా నిర్వహించడం పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీపీ)కు పెద్ద సవాల్. దీనిపైనే ఆ జట్టు, బోర్డు భవి ష్యత్తు ఆధారపడి ఉందనడంలో సందేహం లేదు. కళ వచ్చింది... సుదీర్ఘ కాలం అంతర్జాతీయ క్రికెట్ లేక సహజంగానే అక్కడి మైదానాలు వెలవెలబోయాయి. నిర్వహణ సరిగా లేక పాడుబడినట్లు తయారయ్యాయి. ఆర్థికంగా బలమైన బోర్డు కాకపోవడం, రాజకీయ కారణాలతో కేవలం దేశవాళీ టోరీ్నల కోసం స్టేడియాలను అత్యుత్తమంగా తీర్చిదిద్దే ధైర్యం చేయలేకపోయింది. పాకిస్తాన్ సూపర్ లీగ్ (పీఎస్ఎల్) జరుగుతున్నా... ఆ మ్యాచ్‌లను కూడా ఏదో మమ అన్నట్లుగా ముగించేస్తూ వచ్చారు. ఇలాంటి స్థితిలో చాంపియన్స్ ట్రోఫీ అవకాశం వచ్చింది. స్టేడియాల ఆధునీకరణ కోసం ఐసీసీ ఇచ్చిన సొమ్మును వాడుకుంది. మూడు వేదికలు లాహోర్, కరాచీ, రావల్పిండిలపైనే పూర్తిగా దృష్టి పెట్టి సౌకర్యాలను మెరుగుపర్చింది. ఇందులో లాహోర్‌లోని గడాఫీ స్టేడియంలో చాలా భాగాన్ని పడగొట్టి దాదాపు కొత్తదే అన్నట్లు తీర్చిదిద్దగా, మిగతా రెండింటిని ఆధునీకరించారు. సరిగ్గా చెప్పాలంటే పాక్‌లోని మైదానాలు ఎప్పుడో పాతకాలం కట్టడాల తరహాల్లో ఉన్నాయి. ఈతరం అవసరాలు, మారిన క్రికెట్‌కు అనుగుణంగా ఏవీ లేవు. ఇప్పుడు ఐసీసీ టోర్నీ పుణ్యమాని స్టేడియాలకు కొత్త కళ వచ్చింది. అభిమానులు కూడా అంతే ఉత్సాహంతో ఒక పెద్ద ఈవెంట్ కోసం ఎదురు చూస్తున్నారు. అన్ని నగరాల్లో టోర్నీ పోస్టర్లు, బ్యానర్లు పెద్ద సంఖ్యలో కనిపిస్తున్నాయి. సహజంగానే స్థానిక మార్కెట్లలో టీమ్ జెర్సీలు, ఇతర జ్ఞాపికలు వంటి ‘క్రికెట్ వ్యాపారం’ జోరుగా సాగుతోంది కూడా. ‘క్రికెట్‌ను తాము ఎంతగా అభిమానిస్తామో చూపించేందుకు పాకిస్తానీయులకు ఇది చక్కటి అవకాశం. వచ్చే కొన్ని రోజులు అంతా పండగ వాతావరణమే’ అని మాజీ కెపె్టన్ మియాందాద్ చెప్పిన మాటలో అతిశయోక్తి లేదు. భారత జట్టు లేకపోయినా... పాక్ బోర్డు 2026 టి20 వరల్డ్ కప్, 2031 వన్డే వరల్డ్ కప్ కోసం కూడా బిడ్లు వేసి భంగపడింది. ఈ నేపథ్యంలో గతంలోనే ఖరారైన చాంపియన్స్ ట్రోఫీ మాత్రమే వారికి మిగిలింది. దాంతో తమ నిర్వహణా సామర్థ్యం, ఆతిథ్యం గురించి ప్రపంచ క్రికెట్‌కు చూపించాలని ఆశించింది. ఇందులో భాగంగానే రాజకీయ పరిస్థితులపై పూర్తి అవగాహన ఉండి, సాధ్యం కాదని తెలిసి కూడా ఎలాగైనా భారత్‌ను చాంపియన్స్ ట్రోఫీలో ఆడించేలా పీసీబీ చివరి వరకు అన్ని ప్రయత్నాలు, డిమాండ్లు చేసింది. కానీ చివరకు వెనక్కి తగ్గక తప్పలేదు. 2009 ఉగ్రవాదుల దాడి తర్వాత పాక్‌లో ద్వైపాక్షిక సిరీస్ కాకుండా ఒకేఒక్క చెప్పుకోదగ్గ టోర్నీ 2023లో (ఆసియా కప్) జరిగింది. భారత్ మాత్రం తమ మ్యాచ్‌లు శ్రీలంకలోనే ఆడింది. భారత్ ఫైనల్ చేరితే పేరుకే ఆతిథ్య జట్టు తప్ప ఫైనల్ నిర్వహించే అవకాశం కూడా లేదు. అయితే భారత్ లేకపోయినా ఇతర అన్ని పెద్ద జట్లు ఆడుతుండటం సానుకూలాంశం. అందుకే పీసీబీ పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తోంది. ఆదివారమే లాహోర్ ఫోర్ట్‌లో ప్రారంభ వేడుకలు ఘనంగా జరిగాయి. అన్నింటికి మించి కట్టుదిట్టమైన భద్రత కీలకాంశంగా మారింది. ఒక్క చిన్న పొరపాటు జరిగినా పాక్‌లో క్రికెట్ ముగిసిపోయే ప్రమాదముంది. ఈ నేపథ్యంలో పరుగులు, ఫలితాలతోపాటు టోర్నీ ఎలా సాగుతుందనేది ఆసక్తికరం. -
కటక్ వన్డేలో ఫ్లడ్ లైట్ల సమస్య.. బీసీసీఐపై ఎదురుదాడికి దిగిన పాక్ అభిమానులు
భారత్, ఇంగ్లండ్ మధ్య కటక్ వేదికగా జరిగిన రెండో వన్డేలో ఫ్లడ్ లైట్లు మొరాయించిన విషయం తెలిసిందే. ఛేదనలో భారత ఇన్నింగ్స్ ఏడో ఓవర్ సందర్భంగా అకస్మాత్తుగా కొన్ని ఫ్లడ్ లైట్ ఆగిపోయాయి. ఊహించని ఈ పరిణామంతో ఇరు జట్ల ఆటగాళ్లు విస్మయానికి గురయ్యారు. ఫీల్డ్ అంపైర్లు ఆటగాళ్లను మైదానాన్ని వీడాల్సిందిగా కోరారు. ఫ్లడ్ లైట్లు ఆగిపోవడంతో కొద్ది సేపు ఆటకు అంతరాయం కలిగింది. మైదాన సిబ్బంది వెంటనే స్పందించడంతో ఫ్లడ్ లైట్లు మళ్లీ ఆన్ అయ్యాయి. తదనంతరం మ్యాచ్ యధావిధిగా కొనసాగింది.కాగా, ఈ ఉదంతం జరగడానికి ఒక్క రోజు ముందు ఇదే ఫ్లడ్ లైట్ల సమస్య కారణంగా న్యూజిలాండ్ ఆటగాడు రచిన్ రవీంద్ర తీవ్రంగా గాయపడ్డాడు. ట్రై సిరీస్‌లో భాగంగా పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. పాకిస్తాన్ ఇన్నింగ్స్ 38వ ఓవర్ మూడో బంతిని కుష్దిల్ షా.. డీప్ స్క్వేర్ లెగ్ దిశగా స్వీప్ షాట్ ఆడాడు. బంతి గాల్లోకి లేచింది. ఆ దిశగా ఫీల్డింగ్ చేస్తున్న రచిన్ రవీంద్ర క్యాచ్ పట్టే ప్రయత్నం చేశాడు. అయితే రచిన్ బంతి గమనాన్ని అంచనా వేయడంలో విఫలమయ్యాడు. దీంతో బంతి నేరుగా అతని నుదిటిపై తాకింది. బంతి బలంగా తాకడంతో రచిన్‌కు తీవ్ర రక్తస్రావమైంది. ఫ్లడ్ లైట్ల వెలుతురు సరిగ్గా లేకపోవడంతో ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది. గాయపడిన రచిన్‌ను వెంటనే అస్పత్రికి తరలించారు.ఫ్లడ్ లైట్ల కారణంగా రచిన్‌కు తీవ్రమైన గాయమైన నేపథ్యంలో భారత క్రికెట్ అభిమానులు పాక్ క్రికెట్ బోర్డును ఏకి పారేశారు. చెత్త లైటింగ్ కారణంగా ఈ ఘోరం జరిగిందని దుయ్యబట్టారు. త్వరలో ఛాంపియన్స్ ట్రోఫీ నిర్వహించేది పెట్టుకుని ఇంత నాసిరకమైన ఏర్పాట్లు ఏంటని మండిపడ్డారు. ఇలాంటి మైదానానికి ఓకే చెప్పినందుకు ముందుగా ఐసీసీని నిందించాలని అంన్నారు. తక్షణమే గడాఫీ స్టేడియానికి మరమ్మత్తులు చేయాలని సూచించారు. లేకపోతే ఛాంపియన్స్ ట్రోఫీ వేదికను పాక్ నుంచి దుబాయ్‌కు మార్చాలని కోరారు.భారత అభిమానుల ఘాటైన విమర్శల అనంతరం కటక్ ఉదంతాన్ని బూచిగా చూపెడుతూ పాక్ అభిమానులు బీసీసీఐపై విమర్శలు ఎక్కు పెట్టారు. బీసీసీఐకు ఫ్లడ్ లైట్లు అవసరమైతే పాక్ క్రికెట్ బోర్డు సరఫరా చేస్తుందని సెటైర్లు వేస్తున్నారు. మమ్మల్ని నిందించే ముందు మీ విషయాన్ని సరి చూసుకోండని హితవు పలుకుతున్నారు. రచిన్ ఉదంతంపై భారత అభిమానులు స్పందించినందుకు బీసీసీఐపై ఎదురుదాడికి దిగుతున్నారు. -
BCCI: టీమిండియా జెర్సీలపై పాకిస్తాన్ పేరు.. డ్రెస్ కోడ్ ఫాలో అవుతాం
చాంపియన్స్ ట్రోఫీ-2025(ICC Champions Trophy)లో టీమిండియా ధరించే జెర్సీ గురించి వస్తున్న వార్తలపై భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) కార్యదర్శి దేవజిత్ సైకియా(Devajit Saikia) స్పందించాడు. అంతర్జాతీయ క్రికెట్ మండలి(ఐసీసీ) నిబంధనలకు అనుగుణంగానే తాము నడుచుకుంటామని స్పష్టం చేశాడు. తమ ఆటగాళ్లు ధరించే జెర్సీ లోగోలో పాకిస్తాన్ పేరు ఉండటాన్ని బీసీసీఐ వ్యతిరేకించిందన్న వార్తలను కూడా ఈ సందర్భంగా ఖండించాడు.దుబాయ్‌లో టీమిండియా మ్యాచ్‌లుకాగా ఫిబ్రవరి 19 నుంచి పాకిస్తాన్ వేదికగా చాంపియన్స్ ట్రోఫీ మొదలుకానుంది. అయితే, భద్రతా కారణాల దృష్ట్యా టీమిండియాను అక్కడికి పంపేందుకు నిరాకరించిన బీసీసీఐ(BCCI).. ఐసీసీ అనుమతితో తటస్థ వేదికపై మ్యాచ్‌లు ఆడనుంది. ఈ క్రమంలో పాక్‌తో పాటు దుబాయ్ కూడా ఈ ఐసీసీ టోర్నీకి ఆతిథ్యం ఇవ్వనుంది.ఇక ఈ మెగా ఈవెంట్లో తమ తొలి మ్యాచ్‌లో భాగంగా ఫిబ్రవరి 20న బంగ్లాదేశ్‌తో టీమిండియా తలపడనుంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే రోహిత్ శర్మ కెప్టెన్సీలో పదిహేను మంది సభ్యులతో కూడిన జట్టును బీసీసీఐ ప్రకటించింది. ఇదిలా ఉంటే.. నిబంధనల ప్రకారం ఐసీసీ టోర్నీ ఆతిథ్య దేశం పేరు.. అన్ని జట్ల ఆటగాళ్ల జెర్సీలపై ఉంటుంది. అయితే, బీసీసీఐ మాత్రం దాయాది పేరును తమ జెర్సీలపై ముద్రించకుండా ఉండాలని ఐసీసీకి ఫిర్యాదు చేసినట్లు వార్తలు వచ్చాయి.మా డ్రెస్ కోడ్ కూడా అలాగే ఉంటుందిఈ విషయం గురించి బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా ఇండియా టుడేతో మాట్లాడుతూ.. ‘‘ చాంపియన్స్ ట్రోఫీ-2025 కోసం ఐసీసీ రూపొందించిన అన్ని నిబంధనలను బీసీసీఐ పాటిస్తుంది. జెర్సీ లోగో అంశం సహా అన్నింటినీ మేము ఫాలో అవుతాము. ఏ దశలోనూ ఉద్దేశపూర్వకంగా మేము నిబంధనలను ఉల్లంఘించబోము. కానీ మీడియాలో ఇలాంటి వార్తలు ఎందుకు పుట్టుకు వస్తున్నాయో.. వారికి వీటి గురించి ఎవరు సమాచారం ఇస్తున్నారో అర్థం కావడం లేదు. ఐసీసీ రూల్స్‌ను అతిక్రమించేందుకు మాకు ఎలాంటి కారణాలు లేవు. చాంపియన్స్ ట్రోఫీ కోసం ఐసీసీ పెట్టిన డ్రెస్ కోడ్‌ను మేము ఫాలో అవుతాం. లోగో కూడా యథాతథంగా ఉంటుంది’’ అని స్పష్టం చేశాడు. కాగా దాయాదులు భారత్- పాకిస్తాన్ మ్యాచ్ ఫిబ్రవరి 23న దుబాయ్‌లో జరుగుతుంది.ఫిబ్రవరి 5లోగా మైదానాలు రెడీ: పీసీబీఇదిలా ఉంటే.. చాంపియన్స్ ట్రోఫీ ప్రారంభానికి రెండు వారాల ముందే స్టేడియంలను సిద్ధం చేసేలా పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) పనులు వేగవంతం చేసింది. కరాచీ, లాహోర్ స్టేడియాలలో పునరి్నర్మాణ పనులు జోరుగా సాగుతున్నాయి. అధునాతన కుర్చీలు, అదనపు సౌకర్యాలతో కూడిన భవనాలు, ఎల్ఈడీ ఫ్లడ్‌లైట్లు, డిజిటల్ స్కోరు బోర్డులు ఇలా సర్వాంగ సుందరంగా ముస్తాబవుతన్న మైదానాలను వచ్చే నెల 5 వరకు సిద్ధం చేయనున్నారు. చాంపియన్స్ ట్రోఫీ ఆరంభానికి ముందు పాకిస్తాన్, దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్ ఆడనున్న ముక్కోణపు సిరీస్‌ను ఈ మైదానాల్లో నిర్వహించనున్నారు. ఈ రెండు మైదానాల పునర్నిర్మాణం కోసం పీసీబీ 12 బిలియన్ పాకిస్తానీ రూపాయలను ఖర్చు చేస్తోంది. కరాచీ స్టేడియం మేనేజర్ అర్షద్‌ఖాన్ మాట్లాడుతూ... ‘నిర్మాణ పనులు చివరి దశకు వచ్చాయి. మిగిలి ఉన్న కొన్ని చిన్న చిన్న పనులు ఈ నెలాఖరులోగా ముగుస్తాయి. ఫిబ్రవరి 5లోగా అధునాతన మైదానాన్ని పీసీబీకి అందిస్తాం. లాహోర్ స్టేడియంలో కూడా పనులు దాదాపు ముగిశాయి. తాజా మార్పుల్లో అధునాతన సదుపాయాలు కల్పించాం’ అని పేర్కొన్నాడు.చదవండి: రీ ఎంట్రీ ఇస్తా.. కాంపిటేటివ్ క్రికెట్ ఆడాలని ఉంది.. కానీ: డివిలియర్స్ -
CT 2025: టీమిండియా మ్యాచ్‌లన్నీ అక్కడే.. ఐసీసీ నిర్ణయం ఇదే
చాంపియన్స్ ట్రోఫీ విషయంలో భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) మాట నెగ్గింది. బీసీసీఐ పట్టుబట్టినట్లుగానే హైబ్రిడ్ మోడల్‌తో చాంపియన్స్ ట్రోఫీని నిర్వహించాలని అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) నిర్ణయించింది. ఈ మేరకు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు(పీసీబీ) అధ్యక్షుడు మొహ్సిన్ నక్వీతో శనివారం స్వయంగా ప్రకటన వెలువరించేందుకు ఏర్పాట్లు చేసింది. పీసీబీ చీఫ్ శనివారం ఇందుకు సంబంధించి ప్రకటన చేస్తారని ఐసీసీ వర్గాలు తెలిపాయి.టీమిండియా మ్యాచ్‌లన్నీ అక్కడేమరోవైపు.. ఐసీసీ చైర్మన్, బీసీసీఐ మాజీ కార్యదర్శి జై షా బ్రిస్బేన్ నుంచి వర్చువల్ ఈ సమావేశంలో పాల్గొని అధికారికంగా ప్రకటన చేస్తారని తెలిసింది. వచ్చే ఏడాది జరిగే చాంపియన్స్ ట్రోఫీలో టీమిండియా ఆడే మ్యాచ్‌లన్నీ దుబాయ్‌లో నిర్వహిస్తారు. చిరకాల ప్రత్యర్థుల మ్యాచ్‌లు అన్నీ ఇక హైబ్రిడ్ పద్ధతిలోనేఇదొక్క టోర్నీయే కాదు... ఇకపై అన్ని ఐసీసీ టోర్నీలకు చిరకాల ప్రత్యర్థుల మధ్య జరిగే మ్యాచ్‌లు హైబ్రిడ్ పద్ధతిలోనే నిర్వహిస్తారు. అంటే వచ్చే ఏడాది భారత్‌లో జరిగే మహిళల వన్డే ప్రపంచకప్‌లో ఆడేందుకు పాకిస్తాన్ ఇక్కడకు రాదు. భారత్ మాదిరే పాక్ మ్యాచ్‌ల్ని కూడా తటస్థ వేదికపై నిర్వహిస్తారు. అదే విధంగా.. 2026లో భారత్, శ్రీలంక సంయుక్తంగా ఆతిథ్యమిచ్చే పురుషుల టీ20 ప్రపంచకప్ కూడా హైబ్రిడ్ పద్ధతిలోనే జరుగుతుంది. భద్రతా కారణాల దృష్ట్యాకాగా వన్డే వరల్డ్‌కప్-2023 ప్రదర్శన ఆధారంగా ఆస్ట్రేలియా, టీమిండియా, అఫ్గనిస్తాన్, సౌతాఫ్రికా, ఇంగ్లండ్, న్యూజిలాండ్, బంగ్లాదేశ్ ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025కి అర్హత సాధించిన విషయం తెలిసిందే. అయితే, డిఫెండింగ్ చాంపియన్ హోదాలో ఈ మెగా టోర్నీ నిర్వహణ హక్కులను పాకిస్తాన్ దక్కించుకుంది. ఫలితంగా నేరుగా ఈ ఈవెంట్‌కు క్వాలిఫై అయింది.అయితే, భద్రతా కారణాల దృష్ట్యా టీమిండియాను పాకిస్తాన్‌కు పంపేందుకు బీసీసీఐ నిరాకరించింది. భారత విదేశాంగ శాఖ సైతం బోర్డు నిర్ణయాన్ని సమర్థించింది. ఈ నేపథ్యంలో అనేక చర్చల అనంతరం టీమిండియా మ్యాచ్‌లను తటస్థ వేదికపై నిర్వహించేందుకు పీసీబీ అంగీకరించింది. వేదిక మొత్తాన్ని తరలిస్తామంటూ ఐసీసీ కఠిన చర్యలు చేపట్టేందుకు సిద్ధం కావడంతో పట్టువీడి హైబ్రిడ్ మోడల్‌కు ఒప్పుకొంది. అయితే, తాము కూడా ఐసీసీ ఈవెంట్ల కోసం ఇకపై భారత్‌లో పర్యటించబోమన్న షరతు విధించినట్లు తాజా పరిణామాలను బట్టి స్పష్టమవుతోంది.చదవండి: Vijay Merchant Trophy: సెంచరీతో చెలరేగిన ద్రవిడ్ చిన్న కుమారుడు.. బౌండరీల వర్షం -
భారత్ రాదు... నిర్ణయం మీదే!
కరాచీ: వచ్చే ఏడాది పాకిస్తాన్ అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) చాంపియన్స్ ట్రోఫీ వన్డే క్రికెట్ టోర్నమెంట్‌కు ఆతిథ్యమివ్వనుంది. అయితే పాక్‌లో ఆడేందుకు భారత్ ససేమిరా అంటోంది. మరోవైపు హైబ్రిడ్ మోడల్ (భారత్ ఆడే మ్యాచ్‌లు తటస్థ వేదికపై నిర్వహణ)కి పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) సుముఖంగా లేదు. ఈ నేపథ్యంలో తమ దేశంలో భారత్ మెగా టోర్నీ ఆడే విషయమై ఐసీసీని మరింత స్పష్టత కోరాలని పీసీబీ భావిస్తుండగా... ఐసీసీ నాన్చకుండా తేల్చేసింది. భారత్ ఆడే మ్యాచ్‌లు యూఏఈలో... ఫైనల్ పోరు దుబాయ్‌లో నిర్వహించే హైబ్రిడ్ పద్ధతికే తాము అంగీకరిస్తామని భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఇప్పటికే తమకు స్పష్టం చేసిందని పాక్ బోర్డుకు ఐసీసీ తేల్చిచెప్పింది. భారత్ ఆడే మ్యాచ్‌లు కోల్పోయినప్పటికీ నష్టపరిహారం పూర్తిగా భర్తీ చేస్తామని ఐసీసీ హామీ ఇచి్చంది. ఇక కాదు... కూడదంటే... మీ ఇష్టమని పాక్ బోర్డుకు స్పష్టం చేయడంతో పీసీబీ కినుక వహించింది. నిరసనగా ఆతిథ్య హక్కులు వదిలేసుకోవాలని బోర్డు యోచిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. దీంతో ఐసీసీ ప్రత్యామ్నాయ ఏర్పాట్లు కూడా చేసింది. టోర్నీ ఆతిథ్యం నుంచి ఒకవేళ పాక్ తప్పుకుంటే టోర్నీని దక్షిణాఫ్రికాకు తరలించాలని ఐసీసీ భావిస్తోంది. ఎలాగైనా పాక్‌లో భారత క్రికెట్ జట్టు అడుగుపెట్టాలనే ఉద్దేశంతో హైబ్రిడ్ మోడల్‌కు పీసీబీ విముఖత వ్యక్తం చేస్తోంది. ‘హైబ్రిడ్ పద్ధతిలో చాంపియన్స్ ట్రోఫీ నిర్వహించే ఆలోచన పీసీబీకి లేదు. ప్రస్తుత పరిస్థితిని బోర్డు అంచనా వేస్తోంది. (పాక్) ప్రభుత్వాన్ని సంప్రదించాకే తదుపరి నిర్ణయం తీసుకోవాలనుకుంటుంది. ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా బోర్డు పనిచేస్తుంది’ అని పీసీబీ అధికారి ఒకరు చెప్పారు. కాగా చిరకాల ప్రత్యర్థుల మధ్య గడిచిన 16 ఏళ్లుగా ద్వైపాక్షిక సిరీసే జరగడం లేదు. 2008లో ముంబైపై పాక్ ఉగ్రదాడి అనంతరం రాజకీయ, క్రికెట్ బంధాలు పూర్తిగా దెబ్బతిన్నాయి. అప్పటి నుంచి భారత్, పాక్ జట్లు కేవలం ఐసీసీ ప్రపంచకప్ టోరీ్నల్లో, చాంపియన్స్ ట్రోఫీల్లోనే తలపడుతున్నాయి. -
ICC CT 2025: టీమిండియా లేకుంటే చాంపియన్స్ ట్రోఫీ లేనట్లే!
చాంపియన్స్ ట్రోఫీ-2025 ఆడేందుకు టీమిండియాను పాకిస్తాన్‌కు పంపే ప్రసక్తే లేదని భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) కుండబద్దలు కొట్టింది. ఈ మేరకు తమ నిర్ణయాన్ని అంతర్జాతీయ క్రికెట్ మండలి(ఐసీసీ)కి ఈ- మెయిల్ ద్వారా తెలిపింది. ఈ విషయాన్ని పాకిస్తాన్ క్రికెట్ బోర్డు(పీసీబీ) ఆదివారం ధ్రువీకరించింది.పాక్ ప్రభుత్వానికి లేఖబీసీసీఐ నిర్ణయాన్ని తమకు తెలియజేస్తూ ఐసీసీ మెయిల్ పంపిందని పీసీబీ ఒక ప్రకటనలో పేర్కొంది. ఈ విషయం గురించి తాము పాక్ ప్రభుత్వానికి లేఖ పంపామని.. ప్రభుత్వ సూచనలు, సలహా మేరకు అంతిమ నిర్ణయం తీసుకుంటామని పేర్కొంది. అయితే, అంతకంటే ముందే పీసీబీ చీఫ్ మొహ్సిన్ నక్వీ మాట్లాడుతూ.. టీమిండియా తమ దేశానికి తప్పక రావాలని.. ఐసీసీ టోర్నీ విషయంలో హైబ్రిడ్ విధానం కుదరదని పేర్కొన్నాడు.ఈ పరిణామాల నేపథ్యంలో పాక్, భారత మాజీ క్రికెటర్లు ఈ అంశంపై తమ అభిప్రాయాలు పంచుకుంటున్నారు. ఇందులో భాగంగా టీమిండియా మాజీ ఓపెనర్ ఆకాశ్ చోప్రా మాట్లాడుతూ.. పీసీబీకి గట్టి కౌంటర్ ఇచ్చాడు. ఆదాయానికి భారీగా గండి‘‘అవును.. ఇది ఐసీసీ ఈవెంటే! బ్రాడ్కాస్టర్లు అందుకే డబ్బు కూడా చెల్లించారు. అయితే, ఒకవేళ ఈ టోర్నీలో టీమిండియా పాల్గొనకపోతే.. మ్యాచ్ ప్రసారకర్తలు పెట్టుబడి పెట్టేందుకు ముందుకు రారు.ఆర్థికంగా ఒకరకమైన సంక్షోభం ఏర్పడుతుంది. ఒకవేళ టీమిండియా ఈ టోర్నీలో ఆడకపోతే ఆదాయానికి భారీగా గండిపడుతుంది. గతేడాది వన్డే వరల్డ్‌కప్-2023 కోసం పాకిస్తాన్ జట్టు భారత్‌కు వచ్చేటపుడు పీసీబీ చీఫ్ మేము శత్రు ప్రదేశంలో అడుగుపెట్టబోతున్నామని అన్నారు.టీమిండియా లేకపోతే ఈసారి చాంపియన్స్ ట్రోఫీ లేనట్లేఒకవేళ పాకిస్తాన్ గనుక భవిష్యత్తులో టీమిండియాతో ఆడొద్దని అనుకుంటే.. అందుకు తగ్గట్లుగానే ప్రభావం ఉంటుంది. అదే విధంగా.. టీమిండియా పాకిస్తాన్‌తో ఆడకపోతే ఆ ప్రభావం మరింత తీవ్రస్థాయిలో ఉంటుంది. ఎందుకంటే.. ఇది ఆర్థికాంశాలతో ముడిపడి ఉంది.పాకిస్తాన్ ఇప్పుడు డిమాండ్ చేసే స్థితిలో లేదన్నది చేదు నిజం. ఒకవేళ టీమిండియా లేకపోతే ఈసారి చాంపియన్స్ ట్రోఫీ కూడా ఉండదు. పాకిస్తాన్‌తో సహా ప్రతీ జట్టు ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలి’’ అని ఆకాశ్ చోప్రా చెప్పుకొచ్చాడు.కాగా వచ్చే ఏడాది ఫిబ్రరి- మార్చి నెలలో జరుగబోయే చాంపియన్స్ ట్రోఫీ ఆతిథ్య హక్కులను పాకిస్తాన్ దక్కించుకుంది. ఈ మెగా టోర్నీలో పాకిస్తాన్ డిఫెండింగ్ చాంపియన్ హోదాలో దిగనుండగా.. గతేడాది వన్డే వరల్డ్‌కప్‌లో సత్తా చాటిన టీమిండియా, చాంపియన్ ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా, అఫ్గనిస్తాన్, న్యూజిలాండ్ బంగ్లాదేశ్, ఇంగ్లండ్ తదితర దేశాలు ఈ టోర్నీకి అర్హత సాధించాయి.చదవండి: Ind vs SA: సూర్య చేసిన అతిపెద్ద తప్పు అదే.. అతడిని ఎందుకు ఆడిస్తున్నట్లు మరి? -
పాకిస్తాన్‌లోనే చాంపియన్స్ ట్రోఫీ: ఐసీసీ చీఫ్ ఎగ్జిక్యూటివ్
చాంపియన్స్ ట్రోఫీ-2025 గురించి ఐసీసీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ జాఫ్రీ అలార్డిస్ చేసిన వ్యాఖ్యలు వైరల్‌గా మారాయి. ఈ మెగా ఈవెంట్ వేదికను మార్చే ఆలోచన తమకు లేదన్న అతడు.. పాకిస్తాన్ క్రికెట్ బోర్డే(పీసీబీ) ఈ టోర్నీని నిర్వహిస్తుందని స్పష్టం చేశాడు. ఈ నేపథ్యంలో భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) ఎలాంటి నిర్ణయం తీసుకోనుందన్న విషయం క్రికెట్ ప్రేమికుల్లో చర్చకు దారితీసింది.ఆతిథ్య హక్కులు పాకిస్తాన్వేకాగా వన్డే ఫార్మాట్లో నిర్వహించే చాంపియన్ ట్రోఫీ తాజా ఎడిషన్ ఆతిథ్య హక్కులను పాకిస్తాన్ దక్కించుకున్న విషయం తెలిసిందే. అయితే, భద్రతా కారణాల దృష్ట్యా టీమిండియా అక్కడకు వెళ్లదనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ఆసియా వన్డే కప్-2023లో భారత జట్టు మ్యాచ్‌లను పాక్‌లో కాకుండా శ్రీలంకలో నిర్వహించినట్లు.. ఈసారి కూడా హైబ్రిడ్ విధానంలో టోర్నీని నిర్వహిస్తారని వార్తలు వచ్చాయ.టీమిండియా అక్కడకు వెళ్లే పరిస్థితి లేదు!అయితే, పీసీబీ వర్గాలు మాత్రం తమ దేశం నుంచి ఐసీసీ వేదికను తరలించబోదని.. టీమిండియా మ్యాచ్‌లన్నీ లాహోర్‌లో నిర్వహించాలనే నిశ్చయానికి వచ్చినట్లు తెలిపాయి. ఇందుకు స్పందనగా.. బీసీసీఐ సన్నిహిత వర్గాలు మాత్రం టీమిండియా పాక్‌కు వెళ్లబోదనే సంకేతాలు ఇచ్చాయి. ఈ పరిణామాల నేపథ్యంలో ఐసీసీ కొత్త చైర్మన్‌గా బీసీసీఐ కార్యదర్శి జై షా నియమితుడు కావడంతో.. పీసీబీకి వ్యతిరేక పవనాలు వీస్తాయనే అంచనాలు ఏర్పడ్డాయి.వేదికను మార్చే ఆలోచన లేదుకానీ.. ఐసీసీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ జాఫ్రీ అలార్డిస్ చేసిన వ్యాఖ్యలు ఇందుకు విరుద్ధంగా ఉన్నాయి. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లో జరిగిన ఓ ఈవెంట్‌కు హాజరైన అలార్డిస్.. ‘‘చాంపియన్స్ ట్రోఫీ పాకిస్తాన్లో నిర్వహించేందుకు షెడ్యూల్ చేశాం. ఇప్పటివరకైతే వేదికను మార్చే అంశం మా ప్రణాళికల్లో లేదు. ఈ క్రమంలో ఎదురుకాబోయే కొన్ని సవాళ్లకు సరైన పరిష్కారాలు కనుగొనాలనే యోచనలో ఉన్నాం.అయితే, ముందుగా అనుకున్నట్లుగానే పాక్‌లో ఈ టోర్నీ నిర్వహించాలన్న అంశానికి కట్టుబడి ఉన్నాం’’ అని పేర్కొన్నాడు. ఇప్పటికే ఇంగ్లండ్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, బంగ్లాదేశ్ వంటి జట్లు పాక్‌లో సిరీస్ ఆడిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తుచేశాడు.కాదంటే వాళ్లకే నష్టంఈ నేపథ్యంలో బీసీసీఐ ఎలా స్పందిస్తుందోనని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఒకవేళ ఐసీసీ గనుక ఈ నిర్ణయం మార్చుకోకపోతే.. టీమిండియా పాక్‌కు వెళ్లాలి లేదంటే టోర్నీ నుంచి వైదొలగడం తప్ప వేరే ఆప్షన్లు లేవంటున్నారు విశ్లేషకులు.ఒకవేళ రోహిత్ సేన ఈ ఈవెంట్ ఆడకపోతే ఐసీసీతో పాటు పీసీబీ ఆర్థికంగా భారీగానే నష్టపోయే సూచనలు ఉన్నాయి. ఈ టోర్నీలో టీమిండియానే హాట్ ఫేవరెట్ మరి!! అయితే, భారత ప్రభుత్వ నిర్ణయం ఆధారంగానే టీమిండియా పాకిస్తాన్‌కు వెళ్తుందా? లేదా? అన్నది తేలుతుంది.చదవండి: 147 ఏళ్ల చరిత్రలో తొలిసారి: కోహ్లి మరో 58 రన్స్ చేశాడంటే! -
'మా దేశానికి టీమిండియా రావద్దు'.. పాక్ మాజీ క్రికెటర్ కీలక వ్యాఖ్యలు
ఛాంపియన్స్-2025లో పాల్గోనేందుకు పాకిస్తాన్‌కు టీమిండియా వెళ్తుందా లేదా అన్నది ఇంకా స్పష్టత లేదు. ఎట్టిపరిస్ధితులలోనూ తమ జట్టును పాక్‌కు పంపేది లేదని బీసీసీఐ ఇప్పటికే తేల్చి చేప్పగా..పాకిస్తాన్ క్రికెట్ బోర్డు మాత్రం భారత జట్టు తమ దేశానికి రావాల్సందేనని మొండి పట్టుతో ఉంది.ఇరు దేశాల మధ్య రాజకీయ ఉద్రిక్తతల కారణంగా 2023 ఆసియాకప్‌లో తలపడేందుకు కూడా భారత జట్టు పాకిస్తాన్‌కు వెళ్లలేదు. దీంతో ఈ టోర్నీని హైబ్రిడ్ మోడల్లో నిర్వహించారు. భారత్ తమ మ్యాచ్‌లను శ్రీలంకలో ఆడింది. ఇప్పుడు కూడా ఛాంపియన్స్ ట్రోఫీ టోర్నీని హైబ్రిడ్ మోడల్లోనే నిర్వహించాలని బీసీసీఐ డిమాండ్ చేస్తుంది. అయితే ఈ విషయంపై ఐసీసీ ఇంకా ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. ఈ క్రమంలో బీసీసీఐ సెక్రటరీ జై షా ఐసీసీ ఛైర్మన్‌గా ఎన్నికవడంతో ఛాంపియన్స్ ట్రోఫీని ఎక్కడ నిర్వహిస్తారనే దానిపై మరింత ఆసక్తిని పెంచింది. ఈ ఏడాది నవంబర్ తర్వాత ఓ క్లారిటీ వచ్చే అవకాశముంది.మా దేశానికి రావద్దు..ఈ నేపథ్యంలో పాకిస్తాన్ మాజీ క్రికెటర్ డానిష్ కనేరియా కీలక వ్యాఖ్యలు చేశాడు. భారత జట్టు పాకిస్తాన్‌కు రావద్దని కనేరియా సూచించాడు. ఆటగాళ్ల భద్రతకు మొదటి ప్రాధన్యం ఇవ్వాలని అతడు తెలిపాడు."పాకిస్తాన్లో ప్రస్తుత పరిస్థితిని చూడండి. నేను అయితే టీమిండియా పాకిస్తాన్‌కు వెళ్లొద్దని చెబుతాను. ఈ విషయం గురుంచి పాకిస్తాన్ ఆలోచించాలి. దీనిపై ఐసీసీ తుది నిర్ణయం తీసుకుంటుంది. అంతే తప్ప పీసీబీ ఎటువంటి డిమాండ్ చేయకూడాదు. నా వరకు అయితే ఈ ఛాంపియన్స్ ట్రోఫీ హైబ్రిడ్ మోడల్లో నిర్వహించే అవకాశముంది. భారత్ ఆడే మ్యాచ్‌లన్నీ దుబాయ్‌లో జరిగే ఛాన్స్ ఉంది. ఆటగాళ్ల భద్రతే మొదటి ప్రాధాన్యత. ఆ తర్వాతే గౌరవం, ఇంకా ఏమైనా. బీసీసీఐ అద్భుతంగా పనిచేస్తోంది. వారి నిర్ణయం ఏదైనా సరే, ఇతర దేశాలు కూడా అందుకు అంగీకరించాలి. టోర్నీ హైబ్రిడ్ మోడల్లో జరిగితే బెటర్" అని స్పోర్ట్స్ టాక్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో కనేరియా పేర్కొన్నాడు.కాగా ఈ టోర్నీకి సంబంధించి డ్రాప్ట్ షెడ్యూల్‌ను పీసీబీ ఇప్పటికే ఐసీసీకి పంపించింది. ఆ షెడ్యూల్ ప్రకారం.. ఫిబ్రవరి 19 నుంచి మార్చి మార్చి 9 వరకు జరగనుంది. ఈ ఈవెంట్‌కు లాహోర్‌లోని గఢాఫీ స్టేడియం, కరాచీ నేషనల్ స్టేడియం, రావల్పిండి అంతర్జాతీయ క్రికెట్ స్టేడియాలు ఆతిథ్యమివ్వనున్నాయి. దీంతో ఇప్పటికే ఆయా స్టేడియాల్లో పునర్నిర్మాణ పనులు కూడా మొదలయ్యాయి ఇందుకు కోసం పీసీబీ రూ. 1,280 కోట్లు కేటాయించింది. -
PCB: మెంటార్లుగా ఆ ఐదుగురు.. షోయబ్ మాలిక్ సహా..
దేశవాళీ చాంపియన్స్ కప్ టోర్నీలో ఐదుగురు మాజీ క్రికెటర్లకు మెంటార్లుగా అవకాశం ఇచ్చినట్లు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు తెలిపింది. మిస్బా ఉల్ హక్, సక్లెయిన్ ముస్తాక్, వకార్ యూనిస్, షోయబ్ మాలిక్, సర్ఫరాజ్ అహ్మద్‌లతో ఇందుకు గానూ మూడేళ్ల ఒప్పందం కుదుర్చుకున్నట్లు పేర్కొంది. అయితే ఎవరు ఏ జట్టుకు మార్గనిర్దేశకుడిగా ఉంటారనేది మాత్రం ఇంకా వెల్లడించలేదు.నవతరం ఆణిముత్యాలను గుర్తించేందుకుతొలుత వీరు చాంపియన్స్ వన్డే కప్ ద్వారా ఆయా జట్లకు మెంటార్లుగా తమ ప్రయాణం మొదలుపెడతారని తెలిపింది. ఈ విషయం గురించి పీసీబీ చీఫ్ మొహ్సిన్ నక్వీ మాట్లాడుతూ.. ‘‘చాంపియన్స్కప్ టీమ్స్ మెంటార్లుగా ఐదుగురు చాంపియన్లను నియమించడం ఎంతో సంతోషంగా ఉంది. అంతర్జాతీయ క్రికెట్లో అపార అనుభవం గడించి.. ఆట పట్ల అంకితభావం కలిగి ఉన్న వీరు.. నవతరం ఆణిముత్యాలను గుర్తించడంలో.. వారిని మెరికల్లా తీర్చిదిద్దడంలో పాకిస్తాన్ క్రికెట్ బోర్డుకు సహకరిస్తారని విశ్వసిస్తున్నాం’’ అని పేర్కొన్నారు.ప్రక్షాళనలో భాగంగా కొత్తగా మూడు టోర్నీలుఅంతర్జాతీయ, దేశవాళీ క్రికెట్‌కు మధ్య వారధులుగా పనిచేస్తారని.. యువ క్రికెటర్ల నైపుణ్యాలకు సానపెట్టడంలో వీరు కీలక పాత్ర పోషించబోతున్నారని నక్వీ వెల్లడించారు. ఆట పరంగానే వ్యక్తిగతంగానూ యువ ఆటగాళ్లకు వీరు దిక్సూచిలుగా వ్యవహరిస్తారని తెలిపారు. కాగా నేషనల్ టీ20 కప్, ఖైద్- ఈ - ఆజం ట్రోఫీ, ప్రెసిడెంట్స్ ట్రోఫీ, ప్రెసిడెంట్స్ కప్, హెచ్‌బీఎల్ పాకిస్తాన్ సూపర్ లీగ్ వంటి డొమెస్టిక్ క్రికెట్ టోర్నీలు పాకిస్తాన్లో ఉన్నాయి.వీటికి అదనంగా మూడు కొత్త టోర్నమెంట్లను పీసీబీ ఇటీవల ప్రవేశపెట్టింది. పురుషుల క్రికెట్లో చాంపియన్స్ వన్డే కప్, చాంపియన్స్ టీ20 కప్, చాంపియన్స్ ఫస్ట్‌క్లాస్ కప్ పేరిట టోర్నీలు నిర్వహిస్తామని వెల్లడించింది. ఇందులో భాగంగా మొదట సెప్టెంబరు 12- 29 వరకు చాంపియన్స్ వన్డే కప్ నిర్వహించనుంది. ఇందులో టాప్ దేశవాళీ క్రికెటర్లతో పాటు సెంట్రల్ కాంట్రాక్టు ప్లేయర్లు కూడా పాల్గొనున్నట్లు పీసీబీ తెలిపింది. ప్రతిభావంతులైన ఆటగాళ్లను వెలికి తీసి.. వారి నైపుణ్యాలకు మెరుగులు దిద్ది అంతర్జాతీయ స్థాయిలో రాణించేలా తీర్చిదిద్దడమే లక్ష్యంగా పీసీబీ ఈ టోర్నమెంట్లను ప్రవేశపెట్టింది.ఐదుగురు అనుభవజ్ఞులుపాక్ మాజీ బ్యాటర్, 52 ఏళ్ల వకార్ యూనిస్ ఇటీవల పీసీబీ సలహాదారుగా పనిచేశాడు. మరో మాజీ ఆటగాడు సక్లెయిన్ ముస్తాక్ పాక్ జాతీయ హెడ్‌కోచ్‌గా గతంలో సేవలు అందించాడు. ఇక వికెట్ కీపర్ బ్యాటర్ సర్ఫరాజ్ ఖాన్, మాజీ బ్యాటర్ మిస్బా ఉల్ హక్, మాజీ ఆల్‌రౌండర్ షోయబ్ మాలిక్ ఐసీసీ ట్రోఫీలు గెలిచిన పాక్ జట్లలో సభ్యులుగా ఉన్నారు. ఇకపై మెంటార్లుగా వీరు కొత్త అవతారం ఎత్తనున్నారు. చదవండి: రోహిత్ కోసం మేమూ పోటీలో ఉంటాం: పంజాబ్ కింగ్స్ అధికారి -
భారత్ రాకపోయినా నష్టం లేదు.. ఆ టోర్నీ మాత్రం పాక్‌లోనే: హసన్ అలీ
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ-2025 పాకిస్తాన్ వేదికగా జరగనున్న సంగతి తెలిసిందే. దాదాపు 28 ఏళ్ల తర్వాత ఓ ఐసీసీ టోర్నీకి ఆతిథ్యమిచ్చేందుకు పాకిస్తాన్ సిద్దమైంది. అయితే ఈ మెగా టోర్నీలో భారత జట్టు పాల్గోనడంపై ఇంకా సందిగ్ధం నెలకొంది. పాకిస్తాన్‌కు భారత జట్టును పంపిచేందుకు బీసీసీఐ విముఖత చూపుతోంది. భారత్ ఆడే మ్యాచ్‌లను తటస్ధ వేదికలపై నిర్వహించాలని బీసీసీఐ డిమాండ్ చేస్తోంది. ఇప్పటికే తమ నిర్ణయాన్ని బీసీసీఐ అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్‌కు సైతం తెలియజేసింది.ప్రస్తుతం ఈ విషయాన్ని ఐసీసీ పరిశీలిస్తోంది. అయితే పీసీబీ మాత్రం మ్యాచ్‌లన్నీ పాకిస్తాన్‌లోనే నిర్వహించాలని పట్టుదలగా ఉంది. ఈ నేపథ్యంలో పాకిస్తాన్ స్టార్ పేసర్ హసన్ అలీ కీలక వ్యాఖ్యలు చేశాడు.ఈ టోర్నీ నుంచి భారత్ వైదొలిగినా పాకిస్తాన్ మాత్రం ఛాంపియన్స్ ట్రోఫీని విజయవంతంగా నిర్వహిస్తుందని అలీ థీమా వ్యక్తం చేశాడు."మేము గతేడాది వరల్డ్‌కప్‌లో ఆడేందుకు భారత్‌కు వెళ్లాము. అటువంటిప్పుడు వారు కూడా పాకిస్తాన్‌కు రావాలి కాదా. క్రీడలను రాజకీయాలకు దూరం పెట్టాలని ఇప్పటికే చాలా మంది లెక్కలేనన్ని సార్లు చెప్పారు. మరోవైపు చాలా మంది భారత ఆటగాళ్లు సైతం పాకిస్తాన్లో ఆడేందుకు సముఖత చూపిస్తున్నారు.ఈ విషయాన్ని భారత క్రికెటర్లే పలు ఇంటర్వ్యూలలో చెప్పారు. అంటే భారత జట్టు సైతం పాక్‌కు వచ్చేందుకు సిద్దంగా ఉన్నారనే కదా. కానీ వారి దేశ విధి విధానాలకు కట్టుబడి ఉన్నారు. అయితే ఛాంపియన్స్ ట్రోఫీ పాకిస్తాన్‌లోనే జరుగుతుందని పీసీబీ చైర్మెన్ ఇప్పటికే స్పష్టం చేశారు. ఆయన చెప్పినట్లు ఈ మెగా ఈవెంట్ పాకిస్తాన్‌లోనే జరుగుతుంది.భారత్ రాకపోయినా ఈ టోర్నీ మాత్రం ఎట్టిపరిస్థితుల్లోనూ పాక్ దాటి వెళ్లదు. కచ్చింగా పాక్‌లో ఆడాల్సిందే. భారత్ ఆడకపోతే ఓవరాల్‌గా క్రికెట్ ముగిసినట్లు కాదు కాదా. భారత్ ఒక్కటే కాదు మిగితా టీమ్స్ కూడా ఈ టోర్నీలో ఉన్నాయి" అని సమా టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో అలీ పేర్కొన్నాడు. -
ఫిక్సింగ్ ఆరోపణలు.. స్పందించిన పాక్ బోర్డు!
పాకిస్తాన్ క్రికెట్ జట్టుపై వస్తున్న మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలను ఆ దేశ క్రికెట్ బోర్డు తీవ్రంగా పరిగణిస్తున్నట్లు సమాచారం. బాబర్ ఆజం బృందాన్ని ఉద్దేశించి నిరాధార ఆరోపణలు చేస్తున్న వారిపై అవసరమైతే చట్ట ప్రకారం చర్యలు తీసుకునేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది.పీసీబీ సన్నిహిత వర్గాలు ఈ విషయాన్ని వెల్లడించినట్లు స్థానికి మీడియా పేర్కొంది. కాగా టీ20 ప్రపంచకప్-2024లో పాకిస్తాన్ దారుణంగా విఫలమైన విషయం తెలిసిందే. అమెరికా, టీమిండియా చేతిలో ఓటమిపాలైన బాబర్ బృందం.. కెనడా, ఐర్లాండ్‌లపై గెలిచింది.అయితే, అప్పటికే గ్రూప్-ఏ నుంచి టీమిండియా, అమెరికా సూపర్-8కు చేరగా పాక్ టోర్నీ నుంచి నిష్క్రమించింది. ఈ నేపథ్యంలో ఇంటాబయటా పాక్ జట్టుపై తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్నాయి.ఈ నేపథ్యంలో పాకిస్తాన్‌కు చెందిన సీనియర్ జర్నలిస్టు ముబాషిర్ లుక్మాన్ బాబర్ ఆజంపై తీవ్ర ఆరోపణలు చేశాడు. పాక్ కెప్టెన్ మ్యాచ్ ఫిక్సింగ్‌కు పాల్పడ్డాడన్న అర్థం వచ్చేలా మాట్లాడుతూ ఓ వీడియో విడుదల చేశాడు.ఈ క్రమంలో పీసీబీ వర్గాలు స్పందించాయి. ‘‘విమర్శలకు కూడా ఓ హద్దు ఉంటుంది. అదుపులో ఉన్నంత వరకు విమర్శకుల పట్ల మాకెలాంటి అభ్యంతరం లేదు.అయితే, మ్యాచ్ ఫిక్సింగ్ అంటూ నిరాధార ఆరోపణలు చేస్తే మాత్రం పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి. ఎవరెవరు ఏం మాట్లాడుతున్నారో గమనిస్తూనే ఉన్నాం.ఆటగాళ్ల విషయంలో పీసీబీకి ఎలాంటి సందేహాలు లేవు. అలాంటపుడు విచారణ జరపాల్సిన అవసరం కూడా లేదు. ఎవరైతే ఆరోపణలు చేస్తున్నారో వారు ఆధారాలతో సహా ముందుకు రావాలి.ఒకవేళ అందులో గనుక విఫలమైతే మేము పరువునష్టం దావా వేయడానికి కూడా వెనుకాడం. ఇందుకు సంబంధించి ఓ కొత్త చట్టం తీసుకురాబోతున్నాం’’ అని సదరు వర్గాలు పేర్కొన్నట్లు పాక్ మీడియా వెల్లడించింది. కాగా వరల్డ్‌కప్ టోర్నీ నుంచి నిష్క్రమణ తర్వాత పాక్ ఆటగాళ్లు విదేశాల్లో సెలవులను ఆస్వాదించడం విశేషం. -
పాక్ పరిమిత ఓవర్ల క్రికెట్ జట్టు హెడ్ కోచ్‌గా సౌతాఫ్రికా దిగ్గజం
పాకిస్తాన్ పరిమిత ఓవర్ల (వన్డే, టీ20) క్రికెట్ జట్టు హెడ్ కోచ్‌గా సౌతాఫ్రికా దిగ్గజ ఆటగాడు గ్యారీ కిర్‌స్టెన్ ఎంపికయ్యాడు. ఈ విషయాన్ని పాక్ క్రికెట్ బోర్డు అధికారికంగా వెల్లడించింది. పాక్ టెస్ట్ జట్టుకు ఆసీస్ మాజీ స్పీడ్‌స్టర్ జేసన్ గిలెస్పీ హెడ్ కోచ్‌గా వ్యవహరిస్తాడని పీసీబీ ప్రకటించింది. మూడు ఫార్మాట్లలో అసిస్టెంట్ కోచ్‌గా మాజీ ఆల్‌రౌండర్ (పాక్) ఉంటాడని పేర్కొంది. మే 22 నుంచి ప్రారంభమయ్యే ఇంగ్లండ్ టీ20 సిరీస్‌తో కిర్‌స్టెన్ పాక్ కోచింగ్ బాధ్యతలు చేపడతాడని తెలుస్తుంది. ఇంగ్లండ్ సిరీస్‌లో పాక్ నాలుగు టీ20లు ఆడుతుంది. అక్కడి నుంచి పాక్ జట్టు నేరుగా వరల్డ్‌కప్ వేదిక అయిన యూఎస్ఏకు బయల్దేరుతుంది. pic.twitter.com/nGMEvkPW70— Pakistan Cricket (@TheRealPCB) April 28, 2024 కాగా, 2023 వన్డే వరల్డ్‌కప్ తర్వాతి నుంచి పాక్ జట్టుకు రెగ్యులర్ హెడ్ కోచ్ లేడు. ఆ వరల్డ్‌కప్‌లో పాక్ జట్టు పేలవ ప్రదర్శన నేపథ్యంలో పీసీబీ అప్పటి ప్రధాన కోచ్ గ్రాంట్ బ్రాడ్‌బర్న్, టీమ్ డైరెక్టర్ మిక్కీ ఆర్థర్, బౌలింగ్ కోచ్ మోర్నీ మోర్కెల్, బ్యాటింగ్ కోచ్ ఆండ్రూ పుట్టిక్లను తొలగించింది. ఈ మెగా ఈవెంట్ తర్వాత పాక్ ప్రీమియర్ బ్యాటర్ బాబర్ అజామ్ కూడా కెప్టెన్సీ నుండి తొలగించబడ్డాడు. వైట్ బాల్ కెప్టెన్‌గా షాహీన్ షా ఆఫ్రిది, టెస్ట్ జట్టు కెప్టెన్‌గా షాన్ మసూద్ ఎంపికయ్యారు. అయితే ఇటీవలి పరిణామాల నేపథ్యంలో పీసీబీ తిరిగి బాబర్ ఆజమ్‌ను పరిమిత ఓవర్ల జట్టు కెప్టెన్‌గా నియమించింది.కిర్‌స్టెన్ విషయానికొస్తే.. రిటైర్మెంట్ అనంతరం ఫుల్‌టైమ్ కోచ్‌గా సెటిల్ అయిన కిర్‌స్టెన్ దేశ విదేశాల్లో చాలా జట్లకు కోచ్‌గా పని చేశాడు. కిర్‌స్టెన్ టీమిండియా 2011 వన్డే వరల్డ్‌కప్ గెలిచినప్పుడు హెడ్ కోచ్‌గా ఉన్నాడు. ఈ సౌతాఫ్రికా మాజీ ఆల్‌రౌండర్ ఐపీఎల్లో గుజరాత్ టైటాన్స్ హెడ్ కోచ్‌గా పని చేస్తున్నాడు. 56 ఏళ్ల కిర్‌స్టెన్ సౌతాఫ్రికా తరఫున101 టెస్ట్‌లు, 185 వన్డేలు ఆడి 14000 పైచిలుకు పరుగులు చేశాడు. కిర్‌స్టెన్ గతంలో సొంత జట్టుకు కూడా కోచ్‌గా పని చేశాడు. -
పాకిస్తాన్ వైస్ కెప్టెన్‌గా మొహమ్మద్ రిజ్వాన్
పాకిస్తాన్ టీ20 జట్టు వైస్ కెప్టెన్‌గా మొహమ్మద్ రిజ్వాన్ ఎంపికయ్యాడు. వన్డే వరల్డ్‌కప్ అనంతరం కెప్టెన్‌గా బాబర్ ఆజమ్ తప్పుకోవడంతో పాక్ టీ20 జట్టుకు కెప్టెన్‌గా షాహీన్ అఫ్రిది ఎంపిక కాగా.. తాజాగా అఫ్రిదికి డిప్యూటీగా రిజ్వాన్ ఎంపిక చేశారు పాక్ సెలెక్టర్లు. త్వరలో న్యూజిలాండ్‌తో జరుగనున్న ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్ నుంచి అఫ్రిది, రిజ్వాన్ బాధ్యతలు చేపడతారు. .@iMRizwanPak has been appointed vice-captain of Pakistan's T20I team 🚨 pic.twitter.com/0Zu6DcstML — Pakistan Cricket (@TheRealPCB) January 8, 2024 కాగా, ఐదు మ్యాచ్‌ల సిరీస్ కోసం పాక్ న్యూజిలాండ్ గడ్డపై ల్యాండ్ అయ్యింది. జనవరి 12, 14, 17, 19, 21 తేదీల్లో ఆక్లాండ్, హామిల్టన్, డునెడిన్, క్రైస్ట్ చర్చ్ వేదికలుగా ఐదు టీ20లు జరుగనున్నాయి. బాబర్ ఆజమ్ పాక్ కెప్టెన్‌గా తప్పుకున్న తర్వాత ఆ దేశ టెస్ట్ జట్టుకు షాన్ మసూద్ కెప్టెన్‌గా ఎంపికైన విషయం తెలిసిందే. టెస్ట్, టీ20 జట్లకు కెప్టెన్లను ప్రకటించిన పీసీబీ వన్డే జట్టు కెప్టెన్‌ను ఎంపిక చేయాల్సి ఉంది. ఇదిలా ఉంటే, ఇటీవలే ఆస్ట్రేలియాతో మూడు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ ఆడిన పాక్.. 0-3 తేడాతో సిరీస్‌ను కోల్పోయింది. ఈ సిరీస్ మొత్తం పాక్ పేలవ ప్రదర్శన కనబర్చి దారుణ పరాభవాన్ని మూటగట్టుకుంది. ఈ సిరీస్‌కు ముందు వరల్డ్‌కప్‌లోనూ పాక్ చెత్త ఆడి సెమీస్‌కు చేరకుండానే మెగా టోర్నీ నుంచి నిష్క్రమించింది. న్యూజిలాండ్‌తో ఐదు టీ20లకు పాక్ జట్టు: షాహీన్ ఆఫ్రిది (కెప్టెన్), ఆమిర్ జమాల్, అబ్బాస్ అఫ్రిది, ఆజం ఖాన్ (వికెట్ కీపర్), బాబర్ ఆజం, ఫఖర్ జమాన్, హరీస్ రౌఫ్, హసీబుల్లా (వికెట్‌కీపర్), ఇఫ్తీకర్ అహ్మద్, మహ్మద్ నవాజ్, మహ్మద్ రిజ్వాన్ (వైస్ కెప్టెన్) , మహ్మద్ వాసిం జూనియర్, సాహిబ్జాదా ఫర్హాన్, సైమ్ అయూబ్, ఉసామా మీర్, జమాన్ ఖాన్ -
వరల్డ్‌కప్‌లో దారుణ ప్రదర్శన.. పాకిస్తాన్ కెప్టెన్సీకి బాబర్ ఆజం గుడ్‌బై..!
వన్డే వరల్డ్‌కప్-2023లో సెమీస్ రేసు నుంచి పాకిస్తాన్ నిష్కమ్రిచించడం దాదాపు ఖాయమైంది. ఈ మెగా టోర్నీలో భాగంగా ఈడెన్ గార్డెన్స్ వేదికగా ఇంగ్లండ్‌తో మ్యాచ్‌లో టాస్ ఓడిపోవడంతో పాక్ సెమీస్ ఆశలు ఆవిరయ్యాయి. న్యూజిలాండ్‌ను అధిగమించి పాక్ సెమీస్‌కు వెళ్లాలంటే ఈ మ్యాచ్‌లో 287 పరుగులతో గెలవడం లేదంటే.. ఇంగ్లండ్ విధించిన ఎంతటి లక్ష్యాన్నైనా 2.5 ఓవర్లలోపు ఛేదించాలి. ఒక వేళ పాకిస్తాన్ మొదటి బ్యాటింగ్ చేసి ఉంటే సెమీస్‌కు చేరే చిన్నపాటి ఛాన్స్ ఉండేది. కానీ ఇప్పుడు ఇంగ్లండ్ తొలుత బ్యాటింగ్ చేయడంతో పాక్ సెమీస్‌కు చేరే దారులు మూసుకుపోయాయి. కాగా ఈ వరల్డ్‌కప్ ముగిసిన పాకిస్తాన్ వైట్ బాల్ క్రికెట్ కెప్టెన్సీ నుంచి బాబర్ ఆజం తప్పుకోనున్నట్లు తెలుస్తోంది. జియో న్యూస్ రిపోర్ట్స్ ప్రకారం.. తన స్వదేశానికి వెళ్లాక పాకిస్తాన్ క్రికెట్ బోర్డు చైర్మెన్‌తో తన రాజీనామా విషయంపై చర్చించనున్నట్లు సమాచారం. కాగా ఈ టోర్నీలో బాబర్ బ్యాటర్‌గా కాస్త పర్వాలేదనపించినా.. సారధిగా మాత్రం దారుణంగా విఫలమయ్యాడు. దీంతో అతడిని కెప్టెన్సీ నుంచి తప్పించాలని సొంత దేశ మాజీ ఆటగాళ్ల నుంచే వ్యతిరేకత ఎదురైంది. ఈ క్రమంలో వరల్డ్‌కప్‌లో దారుణ ప్రదర్శనకు నైతిక బాధ్యత వహిస్తూ తప్పుకోవాలని బాబర్ భావిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. చదవండి: IPL 2024: 'వరల్డ్‌కప్‌లో అదరగొట్టాడు.. కచ్చితంగా ఐపీఎల్లో కూడా ఆడుతాడు' -
ఆస్పత్రుల వ్యర్థాలపై నిఘా
లబ్బీపేట (విజయవాడ తూర్పు): ఆస్పత్రులలోని వ్యర్థాల (బయో మెడికల్స్) సేకరణ, నిర్వీర్యంపై ప్రభుత్వం నిబంధనల్ని కఠినతరం చేసింది. ఆస్పత్రి నుంచి సేకరించిన వ్యర్థాలు కంపెనీకి తీసుకెళ్లి నిర్వీర్యం చేసేవరకూ నిరంతరం నిఘా వ్యవస్థను ఏర్పాటు చేశారు. ఎక్కడా బయో మెడికల్ వ్యర్థాలను బయట వేయకుండా.. కచ్చితంగా వాటిని నిర్వీర్యం చేసేలా వ్యవస్థను పటిష్టం చేశారు. వాహనాలకు జీపీఎస్ సిస్టమ్ అమర్చారు. ఆస్పత్రిలో వ్యర్థాలను సేకరించినప్పుడు, కంపెనీకి తరలించిన తర్వాత బ్యాగ్‌లను స్కాన్ చేసేలా బార్ కోడింగ్, కంపెనీ వద్ద ఆన్లైన్ ఎమిషన్ మోనిటరింగ్ సిస్టమ్ ఏర్పాటు వంటి విధానాలను అమలు చేస్తున్నారు. ప్రస్తుతం ఉమ్మడి కృష్ణాజిల్లాలో 17,200 బెడ్స్ ఉండగా.. నిత్యం 5 వేల బెడ్స్‌పై రోగులు చికిత్స పొందుతుంటారని కాలుష్య నియంత్రణ మండలి (పీసీబీ) లెక్కలు చెబుతున్నాయి. ప్రతి రోజూ 1.20 టన్నుల నుంచి 1.40 టన్నుల బయో మెడికల్ వ్యర్థాల సేకరణ, నిర్వీర్యం జరుగుతున్నట్టు పీసీబీ అధికారులు చెపుతున్నారు. తరలింపు.. నిర్వీర్యంపై నిఘా బయో మెడికల్ వ్యర్థాలను సంబంధిత కంపెనీకి ఖచ్చితంగా తరలించేలా ప్రభుత్వం నిఘా పటిష్టం చేసింది. ప్రతి బ్యాగ్‌కు బార్ కోడింగ్ ఏర్పాటు చేశారు. ఆస్పత్రి నుంచి సేకరించేటప్పుడు బార్ కోడింగ్‌ను స్కాన్ చేయడంతో పాటు కంపెనీకి తరలించిన తర్వాత దానిని స్కాన్ చేయాల్సి ఉంది. అప్పుడే దానిని నిర్వీర్యం చేసేందుకు తరలించినట్టు నిర్థారణ అవుతుంది. ఆస్పత్రి యాజమాన్యాలకు మొబైల్ యాప్ ప్రవేశ పెట్టారు. ఈ యాప్‌లో ప్రతిరోజూ ఆస్పత్రిలో ఎన్ని పడకలపై రోగులు ఉన్నారు. ఆ రోజు వ్యర్థాలు ఎంత ఉన్నాయి అనే విషయాలను యాప్‌లో అప్లోడ్ చేయాల్సి ఉంది. బయో మెడికల్ వ్యర్థాలను తరలించే ప్రతి వాహనానికి జీపీఎస్ సిస్టమ్ ఏర్పాటు చేశారు. ఆస్పత్రి నుంచి సేకరించిన వ్యర్థాలు కంపెనీ వద్దకు వెళ్లాయా లేదా ఇతర ప్రాంతాలకు వెళ్లాయా అనే దానిపై నిఘా వేస్తారు. జగ్గయ్యపేట సమీపంలో బయో వ్యర్థాల నిర్వీర్యం ప్లాంట్ ఉంది. ఆ ప్లాంట్‌లో వ్యర్థాల నిర్వీర్యం ప్రక్రియను నిరంతరం ఆన్లైన్ ఎమిషన్ మోనిటరింగ్ సిస్టమ్ ద్వారా పరిశీలిస్తుంటారు. అక్కడ ఎంత డిగ్రీల్లో నిర్వీర్యం చేస్తున్నారు. ప్లాస్టిక్ వ్యర్థాల నిర్వీర్యం సమయంలో వచ్చే పొగలో ఏమైనా రసాయనాలు ఉన్నాయా, హానికర కాలుష్యం వస్తోందా అనే అంశాలను పరిశీలిస్తారు. వ్యర్థాలకు కలర్ కోడింగ్ ఆస్పత్రిలోని వ్యర్థాలకు కలర్ కోడింగ్‌ను ఏర్పాటు చేశారు. పసుపు, ఎరుపు, బ్లూ, తెలుపు నాలుగు రంగుల్లో ఉన్న బ్యాగుల్లో నిర్ధేశించిన వ్యర్థాలను ఆస్పత్రి సిబ్బంది వేసేలా ఇప్పటికే అవగాహన కల్పించారు. పసుపు బ్యాగుల్లో మానవ శరీర సంబంధమైన వ్యర్థాలు, జంతు శరీర సంబంధమైన వ్యర్థాలు, మాయ, కలుషిత దూది, డ్రెస్సింగ్ క్లాత్, విషపూరిత వ్యర్థాలు, గడువు ముగిసిన మందులు, మాస్‌్కలు వేస్తారు. వీటిని కంపెనీకి తరలించి 1,200 డిగ్రీల వద్ద నిర్వీర్యం చేస్తారు. ఎరుపు బ్యాగుల్లో సిరంజీలు, ఐవీ సెట్, కాథెటర్, గ్లౌజులు, బ్లడ్ బ్యాగ్స్, యూరిన్ బ్యాగ్స్, డయాలసిస్ కిట్, ఐవీ బాటిల్స్ వేసేలా ఏర్పాట్లు చేశారు. తెలుపు బ్యాగ్స్‌లో సూదులు, స్థిర సూదులు, సిరంజిలు, బ్లేడ్లు, శస్త్ర చికిత్స బ్లేడ్లు వేస్తారు. బ్లూ బ్యాగ్స్ గ్లాసుతో చేసిన ఇంజెక్షన్ బాటిల్స్, గాజు సీసాలు, ల్యాబ్ స్లైడ్స్, ఇంప్లాంట్స్, కత్తెరలు వేసేలా అవగాహన కల్పించారు. అవగాహన కలిగిస్తున్నాం ప్రతి ఆస్పత్రిలో వ్యర్థాలను నిబంధనల మేరకు కలర్ కోడింగ్ ఆధారంగా వేరు చేయాలని యాజమాన్యాలకు అవగాహన కల్పిస్తున్నాం. వ్యర్థాల తరలింపు, నిర్వీర్యం వంటి వాటిపై నిరంతర నిఘా ఏర్పాటు చేశాం. – పి.శ్రీనివాసరావు, ఎన్విరాన్మెంటల్ ఇంజినీర్, కాలుష్యనియంత్రణ మండలి -
నా కూతురు ఫీజు కూడా కట్టలేకపోయా.. కన్నీళ్లు పెట్టుకున్న స్టార్ క్రికెటర్
ఉమర్ అక్మల్.. పాకిస్తాన్ తరపున సత్తా చాటి కనుమరుగు అయిపోయిన క్రికెటర్లలో ఒకడు. పాకిస్తాన్ స్టార్ వికెట్ కీపర్ కమ్రాన్ అక్మల్ సోదురుడే ఈ ఉమర్ అక్మల్. అరంగేట్ర టెస్టులోనే సెంచరీతో చెలరేగిన అక్మల్.. అన్నకు తగ్గ తమ్ముడిగా నిరూపించుకున్నాడు. అయితే పాక్ క్రికెట్లో కీలక ఆటగాడిగా ఎదుగుతున్న తరణంలో ఉమర్ మ్యాచ్ ఫిక్సింగ్ వివాదంలో చిక్కుకుని తన భవిష్యత్తును నాశనం చేసుకున్నాడు. 2020లో మ్యాచ్ ఫిక్సింగ్ కోసం బుకీలు తనని సంప్రదించిన విషయాన్ని దాచిన అక్మల్‌పై పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) మూడేళ్ల నిషేధం విధించింది. అయితే అదే ఏడాది తన తప్పును క్షమించాలని, శిక్షను తగ్గించాలంటూ అక్మల్ ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్‌ను ఆశ్రయించాడు. ఈ క్రమంలో అతడిపై ఉన్న మూడేళ్ల నిషేధాన్ని 12 నెలలకు కుదిస్తూ న్యాయస్ధానం తీర్పు వెల్లడించింది. దీంతో అతడిపై 2021లో పీసీబీ నిషేదం ఎత్తివేసింది. అయితే ఆ తర్వాత అతడికి పాక్ జాతీయ జట్టులో మాత్రం చోటు దక్కలేదు. తాజాగా ఓ ఛానల్‌కు ఇంటర్వ్యూ ఇచ్చిన ఉమర్.. తనపై నిషేదం ఉన్న సమయంలో ఎదుర్కొన్న ఇబ్బందులను గుర్తు చేసుకుంటూ భావోద్వేగానికి గురయ్యాడు. ఆమె చాలా గ్రేట్.. "ఆ సమయంలో నేను పడిన బాధ నా శత్రువులకు కూడా కలగకూడదు. ఆ దేవుడు కొన్ని సమయాల్లొ మనల్ని పరీక్షిస్తాడు. నా రోజులు బాగోలేక నేను గడ్డుపరిస్ధితులు ఎదుర్కొన్నప్పుడు.. చాలా మంది అసలు రూపం బయటపడింది. నన్ను తప్పుబడుతూ నా పక్కన ఉన్నవారు కూడా వెళ్లిపోయారు. నేను ఆ సమయంతో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నాను. నా కూతరి ఫీజు కట్టలేక ఎనిమిది నెలల పాటు స్కూల్‌కి పంపలేకపోయాను. అదే విధంగా నా భార్య ఓ సుసంపన్న కుటుంబంలో పుట్టింది. అయినప్పటికీ ఆ క్లిష్ట పరిస్ధితుల్లో ఆమె నన్ను అర్ధం చేసుకుని లా సపోర్ట్‌గా ఉండేది. ఆమెకి ఎప్పటికి రుణపడి ఉంటాను. ఆ రోజుల గురించి తలచుకున్నప్పుడల్లా కళ్లల్లో నీళ్లు తిరుగుతున్నాయి అంటూ అక్మల్ ఉద్వేగానికి లోనయ్యాడు. చదవండి: World Cup 2023: వన్డే ప్రపంచకప్‌కు భారత జట్టు ఇదే.. స్టార్ ఆటగాళ్లకు నో ఛాన్స్! సంజూకు -
గ్రీన్ సిగ్నల్.. ప్రపంచకప్ కోసం భారత్‌కు పాక్
కరాచీ: కొన్నాళ్లుగా... భారత్ ఆతిథ్యమిచ్చే ప్రపంచకప్‌కు రాం రాం, భారత్‌లో ఆడబోం అంటూ మేకపోతు గాంభీర్యానికి పోయిన పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) ఇప్పుడు ఆడేందుకు రెడీ అయ్యింది. క్రికెట్ లోకం కంటపడేందుకు, ఎక్కడలేని సస్పెన్స్ క్రియేట్ చేసేందుకు ప్రయత్నించిన పీసీబీ ఇంకో మాట మాట్లాడకుండా వచ్చేందుకు సై అంటోంది. ఈ మేరకు ఆదివారం పాకిస్తాన్ ప్రభుత్వం భారత్‌లో ఆడేందుకు పచ్చజెండా ఊపింది. ద్వైపాక్షిక సంబంధాలు అంతంత మాత్రంగానే ఉన్నప్పటికీ క్రీడలను రాజకీయాలతో ముడిపెట్టబోమని పాకిస్తాన్ విదేశీ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. అంతర్జాతీయ క్రికెట్ టోర్నీల్లో తమ జట్టు ఎప్పటిలాగే పాల్గొంటుందని, తమ దేశం నిర్మాణాత్మక, బాధ్యతాయుత విధానాన్ని అవలంభిస్తుందనేదానికి తమ నిర్ణయమే నిదర్శనమని అందులో పేర్కొంది. భారత్‌లో పాకిస్తాన్ క్రికెట్ జట్టు భద్రతకు ఢోకా ఉండబోదనే ఆశిస్తున్నట్లు తెలిపింది. -
మరో యూ టర్న్.. వరల్డ్‌కప్‌లో పాకిస్తాన్ పాల్గొనడంపై నీలినీడలు!
దాదాపు పుష్కర కాలం తర్వాత వన్డే ప్రపంచకప్‌కు భారత్ అతిథ్యం ఇవ్వనున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ మెగా టోర్నీకు ఐసీసీ షెడ్యూల్ ఖారారు చేయడంతో.. ఈ ఈవెంట్లో పాల్గోనే ఆయా జట్లు తమ సన్నహాకాలను కూడా ప్రారంభించాయి. అయితే ప్రపంచకప్ విషయంలో అందరిది ఒక లెక్క. తనొదక లెక్క అన్నట్లుగా పాకిస్తాన్ వ్యవహరిస్తోంది. ఈ టోర్నీలో పాకిస్తాన్ క్రికెట్ జట్టు మాత్రం పాల్గొంటుందా..? లేదా..? అన్నది ఇంకా అనుమానంగానే ఉంది. తమ జట్టును భారత్‌కు పంపించడంపై పాకిస్తాన్ క్రికెట్ బోర్డుతో పాటు ఆ దేశ ప్రభుత్వం సైతం పూటకో మాట మారుస్తోంది. తాజాగా ఇదే విషయంపై పాకిస్తాన్ క్రీడా శాఖామంత్రి ఎహ్సాన్ మజారీ కీలక వాఖ్యలు చేశాడు. ఆసియాకప్ ఆడేందుకు టీమిండియా తమ దేశానికి రాకపోతే పాకిస్తాన్ జట్టు సైతం భారత్‌కు వెళ్లదని అతడు షాకింగ్ కామెంట్స్ చేశాడు. వాస్తవానికి ఈ ఏడాది ఆసియాకప్ పాకిస్తాన్ వేదికగా జరగాల్సి ఉంది. కానీ పాకిస్తాన్‌కు భారత జట్టును పంపించేందుకు బీసీసీఐ నిరాకరించడంతో.. ఆసియా క్రికెట్ కౌన్సిల్ శ్రీలంక, పాకిస్తాన్ వేదికలగా హైబ్రిడ్ మోడల్లో నిర్వహించాలని నిర్ణయించింది. అయితే ఇందుకు సంబంధించిన షెడ్యూల్‌ను ఏసీసీ ఇంకా విడుదల చేయలేదు. ఈ నేపథ్యంలో ఎహ్సాన్ మజారీ విలేకురల సమావేశంలో మాట్లాడుతూ.. "పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పిసిబి) నా మంత్రిత్వ శాఖ పరిధిలోకి వస్తుంది. కాబట్టి భారత్ ఆసియా కప్ మ్యాచ్‌లను తటస్థ వేదికల్లో ఆడాలని డిమాండ్ చేస్తే.. భారత్‌లో జరిగే మేము కూడా అదే అదే డిమాండ్ చేస్తాము" అని అతను పేర్కొన్నాడు. అతడు చేసిన వాఖ్యలు మరోసారి తీవ్ర చర్చకు దారితీశాయి. ఉన్నతస్థాయి కమిటీ.. ఇక ఈ మెగా టోర్నీలో పాకిస్తాన్ పాల్గోనడంపై ఆ దేశ ప్రధాని షెహబాజ్ షరీఫ్ ఓ అత్యున్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేశారు. విదేశాంగ శాఖ మంత్రి బిలావల్ భుట్టో నేతృత్వంలోని ఈ కమిటీ.. ప్రపంచకప్ కోసం భారత్‌లో పాక్ పర్యటించే విషయంపై నిర్ణయం తీసుకోనుంది. ఈ కమిటీ లో ఎహ్సాన్ మజారీ కూడా సభ్యునిగా ఉన్నాడు. 11 మంది సభ్యులతో కూడిన ఈ కమిటీ భారత్-పాకిస్తాన్లకు సంబంధించిన అన్ని అంశాలపై ఈ కమిటీ చర్చించి తుది నివేదికను ప్రధానికి అందించనుంది. ఇక షెడ్యూల్ ప్రకారం చిరకాల ప్రత్యర్థులు పాకిస్తాన్, భారత్ జట్లు అక్టోబర్ 15న అహ్మదాబాద్ వేదికగా తలపడనున్నాయి. చదవండి: BAN W vs IND W: బంగ్లాదేశ్‌తో తొలి టీ20.. ఆంధ్ర స్పిన్నర్ ఎంట్రీ! -
వరల్డ్‌కప్ షెడ్యూల్ ప్రకటనకు ముహూర్తం ఖరారు..!
ఐసీసీ వన్డే వరల్డ్‌కప్-2023 షెడ్యూల్ ప్రకటనను ఎట్టకేలకు ముహూర్తం ఖరారైనట్లు తెలుస్తోంది. ఈ నెల (జూన్) 27న షెడ్యూల్ విడుదల చేసేందుకు ఐసీసీ సర్వం సిద్ధం చేసుకున్నట్లు సమాచారం. వరల్డ్‌కప్ ప్రారంభ తేదీ అయిన అక్టోబర్ 5కు జూన్ 27 సరిగ్గా 100 రోజులు ముందుండంతో ఐసీసీ ఈ తేదీన షెడ్యూల్ విడుదల చేసేందుకు మొగ్గు చూపినట్లు తెలుస్తోంది. కాగా, బీసీసీఐ-పీసీబీల మధ్య ఆసియా కప్-2023, వన్డే వరల్డ్‌కప్-2023 వేదికల వ్యవహారంలో ఏకాభిప్రాయం కుదరని విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే వరల్డ్‌కప్ షెడ్యూల్ ప్రకటన ఆలస్యం అవుతూ వస్తుంది. ఐసీసీ పంపిన ముసాయిదా షెడ్యూల్‌కు పీసీబీ ఇంత వరకు ఆమోదం తెలుపలేదు. షెడ్యూల్‌కు ఆమోదం తెలపాల్సింది తమ ప్రభుత్వమని పీసీబీ తాత్కాలిక అధ్యక్షుడిగా దిగిపోయే ముందు నజమ్ సేథి ప్రకటన చేశాడు. భద్రత కారణాల దృష్ట్యా అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో భారత్‌తో మ్యాచ్ ఆడబోమని పీసీబీ స్పష్టం చేసింది. ఈ విషయంలోనే బీసీసీఐ-పీసీబీల మధ్య ఏకాభిప్రాయం కుదరడం లేదు. మరోవైపు పీసీబీ కాబోయే ఛైర్మన్ జకా అష్రాఫ్ ఆసియా కప్‌ను హైబ్రిడ్ మోడల్లో నిర్వహించడంపై సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఆసియా కప్‌ను హైబ్రిడ్ మోడ్‌లో నిర్వహించడం ఇష్టం లేదని, దీనికి తాను వ్యతిరేకమంటూ బాంబు పేల్చాడు. ఈ పరిస్థితుల నేపథ్యంలో ఐసీసీ అధికారికంగా షెడ్యూల్ ప్రకటించాక అయినా పీసీబీ దానికి అమోదం తెలుపుతుందా లేక ఏవైనా కారణాలు సాకుగా చూపించి అడ్డుపుల్ల వేస్తుందా అన్న విషయం తేలాంటే ఒకటి రెండ్రోజుల వరకు వేచి చూడాల్సిందే. -
AsiaCup 2023: కొత్త ట్విస్ట్.. పాక్ లేకుండానే టోర్నీ నిర్వహణ!
ఆసియా కప్ 2023 విషయమై ప్రస్తుతం భారత్-పాకిస్థాన్ మధ్య సయోధ్య కుదిరేలా సూచనలు కనిపించడం లేదు. ఆసియా కప్‌ను హైబ్రిడ్ మోడ్‌లో నిర్వహించి తమ పంతం నెగ్గించుకోవాలని చూసిన పీసీబీకి చుక్కెదురైనట్లు తెలుస్తోంది. హైబ్రిడ్ మోడ్ ప్రకారం పాక్‌లో కొన్ని మ్యాచ్‌లు.. భారత్ ఆడే మ్యాచ్‌లను దుబాయ్‌లో నిర్వహించాలని పీసీబీ భావించింది. కానీ హైబ్రిడ్ మోడ్‌కు బీసీసీఐ అంగీకరించలేదని.. ఆ సమయంలో దుబాయ్‌లో వేడి ఎక్కువగా ఉంటుందని.. ఆటగాళ్లు తట్టుకోలేరని ఏసీసీకి బీసీసీఐ వివరించినట్లు సమాచారం. ఏసీసీలో భాగంగా ఉన్న ఇతర దేశాలు కూడా పాక్ ప్రతిపాదించిన హైబ్రీడ్ మోడ్‌కు ఒప్పుకోనట్లు తెలిసింది. దీంతో పాకిస్తాన్ లేకుండానే ఆసియా కప్ జరగనున్నట్లు తెలిసింది. రిపోర్టు ప్రకారం, టోర్నమెంట్‌కు అధికారిక హోస్ట్ అయిన పాకిస్థాన్ మినహా ఆసియా కప్ ఆడేందుకు ఏసీసీ సభ్యులందరూ అంగీకరించినట్లు తెలిసింది. పాకిస్థాన్ కాకుండా వేరే దేశంలో ఆసియా కప్ నిర్వహించేందుకు అంగీకరించినట్లు సమాచారం. కానీ పాకిస్థాన్ మాత్రం హైబ్రిడ్ మోడల్‌కు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తోంది. అందువల్ల పాకిస్థాన్ తన నిర్ణయాన్ని సడలించకపోతే ఈసారి పాక్ జట్టు లేకుండానే ఆసియాకప్ జరగనుంది. ఆసియా క్రికెట్ కౌన్సిల్(ఏసీసీ) రాబోయే ఎగ్జిక్యూటివ్ బోర్డు సమావేశంలో పాల్గొనే ఇతర దేశాలన్నీ శ్రీలంకలో ఆసియా కప్ ఆడేందుకు ఏకగ్రీవంగా అంగీకరించినట్లు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ)కి స్పష్టమైన సందేశం పంపే అవకాశాలు ఉన్నాయి. అలాగే, శ్రీలంకలో ఆసియా కప్‌కు ఆతిథ్యం ఇవ్వడానికి పాకిస్థాన్ కాకుండా ఇతర దేశాల నుంచి మద్దతు ఎక్కువగా ఉన్నందున ఏసీసీ నిర్ణయాన్ని అంగీకరించడం లేదా పూర్తిగా వైదొలగడం మినహా పాకిస్థాన్‌కు ఇప్పుడు వేరే మార్గం లేదు. ఒకవేళ ఈ ఈవెంట్లో పాకిస్థాన్ క్రికెట్ జట్టు పాల్గొనకపోతే భారత్, శ్రీలంక, బంగ్లాదేశ్, అఫ్గానిస్తాన్, నేపాల్‌లు శ్రీలంక వేదికగా ఆసియా కప్‌లో ఆడతాయి. అయితే ఇప్పుడు పాకిస్థాన్ హైబ్రిడ్ మోడల్‌ను భారత్ తిరస్కరిస్తే.. అక్టోబర్, నవంబర్లలో భారత్‌లో జరిగే వన్డే ప్రపంచకప్ నుంచి పాకిస్తాన్ వైదొలిగే అవకాశం ఉంది. అయితే ఇది పాకిస్తాన్‌కే నష్టం చేకూర్చే అవకాశం ఎక్కువగా ఉంది. ఇక ఆసియా కప్ సెప్టెంబర్ 2 నుంచి 17 వరకు జరిగే నిర్వహించే యోచనలో ఏసీసీ ఉంది. చదవండి: విధ్వంసకర ఇన్నింగ్స్.. 38 బంతుల్లోనే సెంచరీ శ్రీలంకలో ఆసియాకప్.. జరుగుతుందా? లేదా? ఫామ్‌లో ఉన్నాడు.. రికార్డులు బద్దలు కొట్టడం కష్టమేమి కాదు -
శ్రీలంకలో ఆసియాకప్.. జరుగుతుందా? లేదా?
ఆసియాకప్ 2023 నిర్వహణపై ఇంకా సందిగ్థత వీడడం లేదు. వాస్తవానికి ఈ ఏడాది సెప్టెంబర్‌లో ఆసియా కప్ జరగాల్సి ఉంది. ఐపీఎల్ 2023 ఫైనల్ తర్వాత ఆసియా కప్ నిర్వహణపై ఒక నిర్ణయం తీసుకుంటామని ఆసియా క్రికెట్ కౌన్సిల్ అధ్యక్షుడు జై షా ఒక ప్రకటనలో తెలిపారు. కాగా ఐపీఎల్ ఫైనల్ అనంతరం నిర్వహించిన మీటింగ్‌లో ఆసియాకప్ వేదికను పాకిస్తాన్ నుంచి శ్రీలంకకు మార్చినట్లు వార్తలు వస్తున్నాయి. పాకిస్తాన్లో ఆసియా కప్ ఆడేందుకు బీసీసీఐ నిరాకరించింది. దీంతో పీసీబీ హైబ్రిడ్ మోడ్‌లో ఆసియా కప్ నిర్వహించేందుకు ప్రణాళిక పంపింది. అయితే ఈ ప్రపోజల్‌ను మీటింగ్‌లో శ్రీలంక సహా బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డులు తిరస్కరించినట్లు తెలుస్తోంది. దీనికి తోడు ఆసియా కప్‌ను నిర్వహించేందుకు తాము సిద్ధంగా ఉన్నట్లు శ్రీలంక క్రికెట్ బోర్డు ఏసీసీకి తెలిపింది. దీనికి బీసీసీఐ కూడా ఓకే చెప్పినట్లు సమాచారం. దీంతో ఆసియాకప్ శ్రీలంకలో జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇది జరిగితే మాత్రం ఆసియా కప్‌లో పాక్ ఆడేందుకు నిరాకరించే అవకాశం ఉంది. అంతేకాదు ఆసియా కప్ నిర్వహణకు అడ్డుపడుతూ తమవద్ద నుంచి బలవంతంగా తరలించే ప్రయత్నం చేస్తున్నందుకు పీసీబీ ఐసీసీకి ఫిర్యాదు చేసే అవకాశం కూడా ఉంది.దీంతో ఆసియా కప్ నిర్వహణపై నీలినీడలు కమ్ముకున్నాయి. అసలు జరుగుతుందా లేదా అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. అయితే ఆసియా క్రికెట్ కౌన్సిల్ బుధవారం మరొకసారి సమావేశం కానుంది. ఈ మీటింగ్‌లో చర్చించి ఆసియా కప్‌పై తుది నిర్ణయం తీసుకోనున్నారు. ఇక పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ప్రతిపాదన హైబ్రిడ్ మోడల్ రెండు రకాలు ఉన్నాయి. మొదటి ప్రతిపాదన ఏంటంటే ఆసియా కప్ టోర్నమెంట్ పాకిస్థాన్‌లో నిర్వహించబడుతుంది.. అయితే భారత జట్టు తటస్థ వేదికలో వారితో ఆడవచ్చు. ఇక రెండవ ప్రతిపాదన ఆసియా కప్ టోర్నీని రెండు భాగాలుగా విభజించనున్నారు. తొలి రౌండ్ మ్యాచ్‌లకు పాకిస్థాన్ ఆతిథ్యం ఇవ్వనుండగా... ఈ రౌండ్లో భారత్‌తో మ్యాచ్‌లు ఉండవు. నిజానికి రెండో రౌండ్లో వారితో భారత జట్టు ఆడుతుంది. అలాగే టోర్నీ ఫైనల్ మ్యాచ్ తటస్థ వేదికపై జరుగుతుంది. చదవండి: #MSDhoni: దాయాది అభిమానులే మెచ్చుకునేలా! -
భారత్-పాక్‌ల మధ్య టెస్ట్ సిరీస్..?
భారత్-పాక్‌ల మధ్య ద్వైపాక్షిక క్రికెట్ సిరీస్ అంశం మరోసారి తెరపైకి వచ్చినట్టే వచ్చి కనమరుగైంది. తటస్థ వేదికపై టెస్ట్ సిరీస్ నిర్వహించే పీసీబీ (పాకిస్థాన్ క్రికెట్ బోర్డు) ప్రతిపాదనను బీసీసీఐ కొట్టిపారేసింది. సమీప భవిష్యత్తులో కూడా భారత-పాక్ సిరీస్ జరిగే అవకాశం లేదని బీసీసీఐ స్పష్టం చేసింది. పీసీబీ చీఫ్ నజమ్ సేధి సిడ్నీ మార్నింగ్ హెరాల్డ్‌కు ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో భారత్-పాక్ ద్వైపాక్షిక టెస్ట్ సిరీస్‌ను ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ లేదా సౌతాఫ్రికాల్లో జరిపితే బాగుంటుందని ప్రతిపాదించిన అనంతరం బీసీసీఐ పై విధంగా స్పందించింది. 2007 డిసెంబర్లో చివరిసారిగా భారత్-పాక్‌ల మధ్య టెస్ట్ మ్యాచ్ జరిగిన విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే, ఆసియా కప్-2023 వేదిక విషయంలో ప్రస్తుతం భారత్-పాక్‌ల మధ్య ఏకాభిప్రాయం కుదరడం లేదన్న విషయం విధితమే. భద్రతా కారణాల రిత్యా టీమిండియా పాక్‌లో అడుగుపెట్టదని బీసీసీఐ తెగేసి చెప్పగా.. దీనికి కౌంటర్‌గా పాక్ కూడా వన్డే వరల్డ్‌కప్ కోసం భారత్‌లో అడుగుపెట్టదని స్పష్టం చేసింది. ఆసియాకప్ మ్యాచ్‌లను భారత్ తటస్థ వేదికలపై ఆడాలనుకుంటే, వరల్డ్‌కప్‌లో తమ మ్యాచ్‌లను సైతం తటస్థ వేదికలపై నిర్వహించాలని పీసీబీ పట్టుబడుతుంది. ఈ నేపథ్యంలో ఆసియాకప్, వరల్డ్‌కప్ నిర్వహణపై సందిగ్ధత నెలకొంది. చదవండి: యువతి పట్ల మృగంలా వ్యవహరించిన కేసు.. శ్రీలంక క్రికెటర్‌కు ఊరట -
World Cup 2023: భారత్‌లో అడుగుపెట్టేందుకు పాక్ ప్రభుత్వం ఒప్పుకోదు..!
ఆసియా కప్-2023 వేదిక వివాదం, తదనంతరం జరిగిన పరిణామాల నేపథ్యంలో పాకిస్తాన్ క్రికెట్ బోర్డు చైర్మన్ నజమ్ సేథీ సంచలన వ్యాఖ్యలు చేశాడు. స్పోర్ట్స్ తక్ చానల్‌తో ఆయన మాట్లాడుతూ.. వన్డే వరల్డ్‌కప్-2023 కోసం తమ జట్టు భారత్‌లో అడుగుపెట్టేందుకు పాక్ ప్రభుత్వం ఒప్పుకోదని అన్నాడు. పాక్ ఆడాల్సిన మ్యాచ్‌లు తటస్థ వేదికలపై నిర్వహిస్తేనే తాము వరల్డ్‌కప్ ఆడతామని, లేదంటే లేదని తెగేసి చెప్పాడు. భారత్-పాక్ జట్ల మధ్య వరల్డ్‌కప్ మ్యాచ్ అక్టోబర్ 15న అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ అంతర్జాతీయ స్టేడియంలో జరుగనుందన్న ప్రచారం నేపథ్యంలో పీసీబీ ఈ రకంగా స్పందించింది. కాగా, భారత్-పాక్‌ల మధ్య ఈ క్రికెట్ వివాదం ఆసియా కప్ వేదిక మార్పు నేపథ్యంలో మొదలైంది. భద్రతా కారణాల దృష్ట్యా పాక్‌లో ఆసియా కప్-2023 జరిగితే తాము ఎట్టి పరిస్థితుల్లో పాల్గొనేది లేదని బీసీసీఐ తెగేసి చెప్పింది. దీంతో పీసీబీ వెనక్కు తగ్గింది. తటస్థ వేదికపై (యూఏఈ) భారత్ ఆడాల్సిన మ్యాచ్‌లు నిర్వహించే ప్రతిపాదనను తెరపైకి తెచ్చింది. దీనికి బీసీసీఐ సైతం అంగీకారం తెలిపింది. దీంతో మెగా టోర్నీ సజావుగా సాగుతుందని అంతా అనుకున్నారు. అయితే ఆసియా కప్ జరిగే సెప్టెంబర్ మాసంలో యూఏఈలో ఎండలు అధికంగా ఉంటాయన్న విషయాన్ని సాకుగా చూపుతూ, శ్రీలంక, బంగ్లాదేశ్ దేశాలు యూఏఈ ప్రతిపాదనకు ససేమిరా అంటున్నాయి. దీంతో టోర్నీ నిర్వహణపై నీలినీడలు కమ్ముకున్నాయి. దీంతో రంగంలోకి దిగిన ఏసీసీ.. యూఏఈ, పాక్‌లలో కాకుండా టోర్నీ మొత్తాన్ని శ్రీలంకలో నిర్వహించే మధ్యేమార్గ ప్రతిపాదనను తెరపైకి తెచ్చింది. అయితే ఈ ప్రతిపాదనకు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ససేమిరా అంటుంది. భారత్ ఆడే మ్యాచ్‌లను యూఏఈలో నిర్వహించేందుకు తాము అంగీకరించినప్పుడు.. కొత్తగా శ్రీలంక, బంగ్లాదేశ్‌లు అనవసర లొల్లి చేయడం సరికాదని అంటుంది. గతంలో ఐపీఎల్, ఆసియా కప్ టీ20 టోర్నీలు ఆగస్ట్, సెప్టెంబర్ నెలల్లో యూఏఈలో జరిగిన విషయాన్ని గుర్తు చేస్తుంది. ఒకవేళ కాదు కూడదని టోర్నీని శ్రీలంకలోనే నిర్వహిస్తామంటే తాము వైదొలుగుతామని బెదిరింపులకు దిగుతుంది. ఆసియా కప్ వేదికను పాక్ నుంచి శ్రీలంక మార్చాలని ఏసీసీ యోచిస్తున్న తరుణంలో పాక్ అవకాశవాద రాజకీయానికి తెర లేపింది. ఈ ఏడాది చివర్లో భారత్‌లో జరిగే వన్డే వరల్డ్‌కప్‌లో తమ మ్యాచ్‌లు తటస్థ వేదికపై నిర్వహిస్తేనే టోర్నీలో పాల్గొంటామని, లేదంటే లేదని అంటుంది. బీసీసీఐ కోరినట్లు టీమిండియా మ్యాచ్‌లు తటస్థ వేదికపై నిర్వహించేందుకు తాము ఒప్పుకున్నప్పుడు.. బీసీసీఐ కూడా తమ మ్యాచ్‌లను తటస్థ వేదికపై నిర్వహించేందుకు ఒప్పుకోవాలని డిమాండ్ చేస్తుంది. ఈ విషయంలో ఐసీసీ జోక్యం చేసుకోవాలని, లేదంటే తాము వరల్డ్‌కప్‌లో పాల్గొనేదే లేదని తెగేసి చెప్పింది. చదవండి: టీమిండియా క్రికెటర్లేమైనా ఏలియన్సా..? నోరు పారేసుకున్న పాక్ ఫాస్ట్ బౌలర్ -
ఆసియా కప్ జరగడం అనుమానమే.. 'అందుకు' ససేమిరా అంటున్న శ్రీలంక, బంగ్లాదేశ్
ఆసియా కప్-2023 నిర్వహణ రోజుకో మలుపు తిరుగుతుంది. షెడ్యూల్ ప్రకారం ఈ మెగా టోర్నీ పాకిస్తాన్లో జరగాల్సి ఉంది. అయితే, భద్రత కారణాల దృష్ట్యా పాక్‌లో అడుగుపెట్టేందుకు బీసీసీఐ అంగీకరించకపోవడంతో, సగం మ్యాచ్‌లు యూఏఈలో (భారత్ ఆడే మ్యాచ్‌లు), సగం మ్యాచ్‌లు తమ దేశంలో నిర్వహించేందుకు పాక్ అయిష్టంగా ఒప్పుకుంది. వేదిక విషయంలో ప్రధాన జట్లైన భారత్, పాక్ అంగీకారం తెలపడంతో టోర్నీ సజావుగా సాగుతుందని అంతా ఊహించారు. అయితే, తాజాగా శ్రీలంక, బంగ్లాదేశ్‌లు యూఏఈలో మ్యాచ్‌లు ఆడేందుకు ససేమిరా అంటుండటంతో సమస్య మళ్లీ మొదటికొచ్చింది. సెప్టెంబర్ నెలలో యూఏఈలో ఎండలు భయానకంగా ఉంటాయని ఈ రెండు దేశాలు సాకుగా చూపుతున్నట్లు తెలుస్తోంది. ఈ మధ్యలో యూఏఈ, పాక్‌లలో కాకుండా టోర్నీ మొత్తాన్ని శ్రీలంకలో నిర్వహించే మధ్యేమార్గ ప్రతిపాదనను ఆసియా క్రికెట్ కౌన్సిల్ తెరపైకి తెచ్చింది. అయితే ఈ ప్రతిపాదనకు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ససేమిరా అంటున్నట్లు సమాచారం. టీమిండియా ఆడే మ్యాచ్‌లను యూఏఈలో నిర్వహించేందుకు తాము అంగీకరించినప్పుడు.. కొత్తగా శ్రీలంక, బంగ్లాదేశ్‌లు అనవసర లొల్లి చేయడం సరికాదని పీసీబీ చీఫ్ అన్నట్లు సమాచారం. గతంలో ఐపీఎల్, ఆసియా కప్ టీ20 టోర్నీలు ఆగస్ట్, సెప్టెంబర్ నెలల్లో యూఏఈలో జరిగిన విషయాన్ని గుర్తు చేసినప్పటికీ శ్రీలంక, బంగ్లాదేశ్‌లు ససేమిర అన్నట్లు తెలుస్తోంది. ఒకవేళ కాదు కూడదని టోర్నీని శ్రీలంకలోనే నిర్వహిస్తామంటే తాము వైదొలుగుతామని పీసీబీ బెదిరింపులకు దిగినట్లు సమాచారం. శ్రీలంక, బంగ్లాదేశ్‌లను ఒప్పించేందుకు పీసీబీ చీఫ్ నజమ్ సేథి స్వయంగా రంగంలో దిగినప్పటికీ ప్రయోజనం లేకపోవడంతో టోర్నీ నిర్వహణపై మరోసారి నీలినీడలు కమ్ముకున్నాయి. కాగా, సెప్టెంబర్ 2 నుంచి 17 వరకు జరగాల్సి ఉన్న ఆసియా కప్-2023 టోర్నీకి సంబంధించి వచ్చే నెల(జూన్)లో జరిగే సమావేశంలో ఏసీసీ తుది నిర్ణయం తీసుకోనుంది. చదవండి: వన్డే ప్రపంచకప్.. భారత్ తొలి మ్యాచ్ ఎవరితో అంటే? మరి పాక్‌తో -
ODI WC 2023: హైదరాబాద్‌లో టీమిండియా-పాక్ మ్యాచ్!
ఈ ఏడాది అక్టోబర్‌లో జరగనున్న వన్డే వరల్డ్‌కప్‌లో దాయాది పాకిస్తాన్ తన మ్యాచ్‌లన్నీ హైదరాబాద్, చెన్నైలో ఆడే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా భారత్‌తో జరగనున్న మ్యాచ్ అహ్మదాబాద్‌లో నిర్వహించాలని బీసీసీఐ భావిస్తున్నప్పటికి.. పాక్ మాత్రం హైదరాబాద్‌లో టీమిండియాతో మ్యాచ్ ఆడితే బాగుంటుందని ఆలోచిస్తోంది. అయితే టోర్నీ నిర్వహణకు ఐసీసీ క్లియరెన్స్ ఇచ్చినప్పటికి బీసీసీఐ వన్డే వరల్డ్‌కప్‌కు సంబంధించిన షెడ్యూల్‌ను విడుదల చేయాల్సి ఉంది. బహుశా ఐపీఎల్ తర్వాత షెడ్యూల్‌ను అనౌన్స్ చేసే అవకాశం ఉంది. ఇక ఐసీసీ అక్టోబర్ 5 నుంచి నవంబర్ 19 వరకు వన్డే ప్రపంచకప్ జరుగుతుందని ప్రకటించింది. క్రిక్‌బజ్ సమాచార మేరకు అహ్మదాబాద్ వేదికగా అక్టోబర్ 5న ఇంగ్లండ్, న్యూజిలాండ్ మధ్య మ్యాచ్‌తో మెగాటోర్నీ ఆరంభమయ్యే అవకాశం ఉంది. ఇక టోర్నీ ఫైనల్ మ్యాచ్ నవంబర్ 19న అహ్మదాబాద్‌లోనే నిర్వహిస్తే బాగుంటుందని ఐసీసీ అభిప్రాయపడింది. ఇక దాయాది పాకిస్థాన్‌తో టీమిండియా ఆడే మ్యాచ్ అక్టోబర్ 15న జరిగే అవకాశం ఉన్నట్లు రిపోర్టు తెలిపింది. వరల్డ్ కప్ లో ఆడటానికి పాకిస్థాన్ అంగీకరించినట్లు తెలుస్తోంది. అయితే ఇండియాతో మ్యాచ్ ను అహ్మదాబాద్ లో నిర్వహించడంపైనే పాక్ బోర్డు అభ్యంతరం వ్యక్తం చేసినట్లు సమాచారం. రిపోర్టు ప్రకారం పాకిస్థాన్ హైదరాబాద్, అహ్మదాబాద్, చెన్నై, బెంగళూరులలో ఆడాల్సి ఉన్నప్పటికి అహ్మదాబాద్, బెంగళూరులో ఆడేందుకు పాక్ ఇష్టపడడం లేదని తెలిసింది. దీంతో చిరకాల ప్రత్యర్థుల మ్యాచ్(టీమిండియా-పాకిస్తాన్) హైదరాబాద్‌లో జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఈసారి వన్డే వరల్డ్‌కప్ మ్యాచ్‌లు చెన్నై, హైదరాబాద్, బెంగళూరు, అహ్మదాబాద్ కోల్‌కతా, ఢిల్లీ, ఇండోర్, ధర్మశాల, గువాహటి, రాజ్‌కోట్, రాయ్‌పూర్, ముంబైలలోనూ వరల్డ్ కప్ మ్యాచ్ లు జరగనున్నాయి. ప్రతి టీమ్ 9 లీగ్ మ్యాచ్ లు ఆడనుండటంతో.. దాదాపు ప్రతి సిటీలో ఇండియా మ్యాచ్ లు ఉండనున్నాయి. వరల్డ్ కప్ లో మొత్తం 10 జట్లు ఆడనుండగా.. 48 మ్యాచ్ లు జరుగుతాయి. చదవండి: 'మ్యాచ్ గెలిచాం కదా.. ఆ సెలబ్రేషన్ అవసరమా?' -
Asia Cup: పాకిస్తాన్‌కు షాక్! పంతం నెగ్గింది..!
Asia Cup 2023: ఆసియా కప్-2023 వేదిక మారనుందా? అంటే అవుననే సమాధానమే వినిపిస్తోంది. పాకిస్తాన్ నుంచి వేరే దేశానికి వేదికను తరలించే అంశంపై ఆసియా క్రికెట్ మండలి కసరత్తు చేస్తున్నట్లు జాతీయ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. కాగా ఆసియా టీ20 టోర్నీ-2022 ఫైనలిస్టు పాకిస్తాన్ ఈసారి ఈ మెగా ఈవెంట్ నిర్వహించేందుకు హక్కులు సంపాదించిన విషయం తెలిసిందే. అయితే, భద్రతా కారణాల దృష్ట్యా తమ ఆటగాళ్లను పాకిస్తాన్‌కు పంపలేమని భారత క్రికెట్ నియంత్రణ మండలి ఇప్పటికే స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో టీమిండియా మ్యాచ్‌లను తటస్థ వేదికపై నిర్వహించేందుకు సిద్ధంగా ఉన్నట్లు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు తెలిపింది. కానీ.. బీసీసీసీఐ ఈ హైబ్రీడ్ మోడల్‌ను కూడా తిరస్కరించినట్లు కథనాలు వచ్చాయి. ఈసారి ఆసియా కప్ అక్కడే ఈ క్రమంలో ఆసియా కప్-2023 నిర్వహణ వేదికను పాకిస్తాన్ నుంచి శ్రీలంకకు తరలించినట్లు తాజాగా వార్తలు వినిపిస్తున్నాయి. ఇందుకు సంబంధించి వచ్చే నెల(జూన్)లో జరిగే సమావేశంలో ఏసీసీ తుది నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు విశ్వసనీయవర్గాలు వెల్లడించినట్లు ఇండియా టుడే తన కథనంలో పేర్కొంది. కాగా ఆసియా కప్ 2022 టీ20 టోర్నీలో శ్రీలంక- పాకిస్తాన్ ఫైనల్‌కు చేరగా.. పాక్‌ను ఓడించి లంక ట్రోఫీ గెలిచిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈసారి వన్డే ఫార్మాట్లో నిర్వహించనున్న ఈవెంట్‌కు సంబంధించి పాక్ ఆతిథ్య హక్కులు దక్కించుకుంది. అయితే, ఆటగాళ్ల భద్రతా అంశంపై బీసీసీఐ నుంచి అభ్యంతరాలు వ్యక్తం కాగా.. పీసీబీ హైబ్రీడ్ మోడల్‌ను ప్రతిపాదించింది. గట్టిగా ఫిక్స్ అయ్యారు టీమిండియా తప్ప మిగతా దేశాల మ్యాచ్‌లు పాకిస్తాన్లో నిర్వహిస్తామని తెలిపింది. అయితే, ఆసియా క్రికెట్ మండలి అధ్యక్షుడు, బీసీసీఐ కార్యదర్శి జై షా ఈ ప్రపోజల్‌ను కూడా తిరస్కరించడంతో కథ మళ్లీ మొదటికి వచ్చినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో పాక్ నుంచి వేదికను తరలించే దిశగా ప్రయత్నాలు ముమ్మరం చేసినట్లు సమాచారం. కాగా సెప్టెంబరులో ఈ టోర్నీ ఆరంభానికి షెడ్యూల్ ఖరారు కాగా కానుండగా.. వేదికపై మాత్రం ఇంకా స్పష్టత రాలేదు. చదవండి: ముంబై ఇండియన్స్‌కు బిగ్ షాక్.. స్టార్ బౌలర్ దూరం! జోర్డాన్ ఎంట్రీ -
పాక్‌లోనే ఆసియా కప్.. పంతం నెగ్గించుకున్న బీసీసీఐ!
ఈ ఏడాది సెప్టెంబర్‌లో ఆసియా కప్-2023 జరగనున్న సంగతి తెలిసిందే. ఈ టోర్నీకి పాకిస్తాన్ ఆతిథ్యమివ్వనుంది. అయితే టోర్నీ పాక్‌లో జరుగుతుండడంతో టీమిండియా అక్కడ ఆడేందుకు నిరాకరించింది. దీంతో మొదట ఆసియా కప్‌ను తటస్థ వేదికకు మార్చాలని ఆసియా క్రికెట్ కౌన్సిల్(ఏసీసీ) భావించింది. కానీ పాకిస్తాన్ క్రికెట్ బోర్డు(పీసీబీ) ఆసియా కప్ తమ దేశంలో నిర్వహించకపోతే ఈ ఏడాది చివర్లో భారత్‌లో జరగనున్న వన్డే వరల్డ్‌కప్‌ను బహిష్కరిస్తామని తెలిపింది. అటు బీసీసీఐ కూడా ఈ విషయంలో మొండి వైఖరితోనే ఉంది. దీంతో ఆసియా క్రికెట్ కౌన్సిల్ ఇరుబోర్డుల మధ్య రాజీ కుదిర్చేందుకు ప్రయత్నించింది. ఇందులో భాగంగానే గురువారం రాత్రి ఏసీసీ ఆధ్వర్యంలో పీసీబీ, బీసీసీఐ బోర్డులు సమావేశమయ్యాయి. ఈ నేపథ్యంలో టీమిండియా ఆసియా కప్ ఆడుతుందని.. టోర్నీ పాకిస్తాన్‌లోనే జరుగుతుందని ఏసీసీ తెలిపింది. అయితే భారత్ ఆడే మ్యాచ్‌లను మాత్రం తటస్థ వేదికపై నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. భారత్ ఆడే మ్యాచ్‌లకు సంబంధించి ఒమన్, యూఏఈ, ఇంగ్లండ్, శ్రీలంక పేర్లను పరిశీలించారు. ఈ వేదికల్లో ఏదో ఒకటి ఫైనలైజ్ చేయనున్నట్లు తెలిసింది. ఒకవేళ టీమిండియా ఆసియా కప్ ఫైనల్ బెర్తు బుక్ చేసుకుంటే.. ఫైనల్ కూడా తటస్థ వేదికలో నిర్వహించాలని ఏసీసీ నిర్ణయించింది. ఇందుకు పీసీబీ కూడా అంగీకరించినట్లు ఏసీసీ ఒక ప్రకటనలో తెలిపింది. ఈ లెక్కన ఆసియా కప్ విషయంలో బీసీసీఐ తమ పంతం నెగ్గించుకున్నట్లే. మరోవైపు పీసీబీ మాత్రం ఏసీసీ ప్రతిపాదనకు అంగీకరించడంతో ఒక మెట్టు దిగినట్లయింది. ఇక ఏడాది చివర్లో వన్డే వరల్డ్‌కప్ ఉండడంతో ఆసియా కప్‌ను వన్డే ఫార్మాట్లోనే నిర్వహించాలని ఏసీసీ భావిస్తోంది. ఆసియా కప్‌లో మొత్తం ఆరు దేశాలు పాల్గొననుండగా.. భారత్, పాకిస్తాన్, క్వాలిఫయర్లు ఒక గ్రూప్‌లో ఉండగా.. మరొక గ్రూప్‌లో శ్రీలంక, బంగ్లాదేశ్, అఫ్గానిస్తాన్‌లు ఉన్నాయి. మొత్తం 13 రోజుల పాటు జరగనున్న టోర్నీలో గ్రూప్ దశలో తొలి రెండు స్థానాల్లో నిలిచిన జట్లు సూపర్-4కు అర్హత సాధిస్తాయి. సూపర్-4లో టాప్ రెండు స్థానాల్లో నిలిచిన జట్లు ఫైనల్ మ్యాచ్ ఆడనున్నాయి. చదవండి: ఎలిమినేటర్.. ఫైనల్‌కు వెళ్లేది ఎవరు? ఐపీఎల్‌పై రోహిత్ శర్మ కీలక వ్యాఖ్యలు -
పాక్‌కు ఎదురుదెబ్బ.. యూఏఈలో ఆసియాకప్!
ఆసియా కప్ తమ దేశంలో నిర్వహించాలనుకున్న పాకిస్తాన్‌కు ఎదురుదెబ్బ తగిలే అవకాశం ఉంది. ఆసియాకప్ పాక్‌లో నిర్వహిస్తే తాము ఆడబోయేది లేదని బీసీసీఐ ఇప్పటికే స్పష్టం చేసింది. దీంతో ఈసారి కూడా ఆసియాకప్‌ను యూఏఈ వేదికగా నిర్వహించే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. శనివారం బహ్రెయిన్‌లో ఆసియా క్రికెట్ కౌన్సిల్(ఏసీసీ) సభ్య దేశాల మధ్య జరిగిన సమావేశంలో ఈ విషయం చర్చకు వచ్చింది. ఏసీసీ ఛైర్మన్ జై షా, పీసీబీ అధ్యక్షుడు నజామ్ సేథీ టోర్నీని యూఏఈకి మార్చే అంశంపై చర్చించారు. కాగా ఆసియాకప్‌ను ఎక్కడ నిర్వహించాలనేది మార్చిలో ఖరారు చేయనున్నారు. ఇక షెడ్యూల్ ప్రకారం ఈ ఏడాది సెప్టెంబర్‌లో ఆసియాకప్ పాకిస్తాన్లో జరగాల్సి ఉంది. కానీ ఈ టోర్నీలో ఆడేందుకు పాక్‌కు వెళ్లమని గతేడాది అక్టోబర్‌లోనే బీసీసీఐ తేల్చి చెప్పింది. ఈ టోర్నీలో భారత్ ఆడకుంటే ఆసియా కప్ పాక్ నిర్వహించినప్పటికి ఆదాయం మాత్రం పెద్దగా రాదు. భారత్ సహా అన్ని దేశాలతో తటస్థ వేదికలో టోర్నీ నిర్వహించినా ఆతిథ్య హక్కులు కలిగిన పీసీబీకి తగినంత గ్రాంటు లభిస్తుంది. అసలే ఆర్థిక సంక్షోభంతో కొట్టుమిట్టాడుతున్న సమయంలో ఆసియా కప్ నిర్వహణ పేరుతో బీసీసీఐతో సున్నం పెట్టుకోవడం కంటే భారత్‌కు అనుగుణంగా టోర్నీని యూఏఈలో నిర్వహించడమే మేలని పీసీబీ ఒక అభిప్రాయానికి వచ్చినట్లు తెలుస్తోంది. ఈ విధంగానైనా పాకిస్తాన్ క్రికెట్ బోర్డుకు ప్రసార హక్కుల ద్వారా ఆదాయాన్ని పొందే అవకాశం ఉందని యోచిస్తోంది. చదవండి: యువరక్తం ఉరకలేస్తుంది.. కుర్రాళ్లు కుమ్మేస్తున్నారు 'నీకు పదేళ్లు ఇస్తా.. సగం అయినా పట్టగలవేమో చూస్తా' -
లేక లేక మ్యాచ్‌లు.. పీసీబీకి సంకటస్థితి
పీసీబీకి సంకటస్థితి ఏర్పడింది. లేక లేక పాకిస్తాన్లో క్రికెట్ మ్యాచ్‌లు జరుగుతుంటే ఆదరణ కరువయింది. అభిమానులు మైదానాలకు వచ్చి మ్యాచ్‌లు చూడడానికి ఆసక్తి చూపించడం లేదు. దీంతో స్టేడియాలన్నీ ప్రేక్షకులు లేక వెలవెలబోతున్నాయి. 17 ఏళ్ల తర్వాత పాక్ గడ్డపై టెస్టు సిరీస్ ఆడేందుకు ఇంగ్లండ్ వచ్చిన సంగతి తెలిసిందే. ఆ సిరీస్‌కు అంతో ఇంతో ఆదరణ దక్కగా.. తాజాగా కివీస్‌తో జరుగుతున్న టెస్టు సిరీస్‌కు మాత్రం ప్రేక్షకులే కరువయ్యారు. దీనికి తోడూ పాక్ వరుస ఓటములు కూడా అభిమానులకు నిరాశకు గురి చేశాయి. కరాచీ వేదికగా శుక్రవారం న్యూజిలాండ్‌తో జరిగిన తొలి టెస్టులోనూ ప్రేక్షకులు లేక స్టేడియం వెల వెల బోయింది. దీంతో రెండో టెస్టు నుంచి ఉచితంగా ఆడియెన్స్‌ను అనుమతించనుంది. ఈ మేరకు పీసీబీ ప్రకటన విడుదల చేసింది. "మ్యాచ్‌ను వీక్షించేందుకు ప్రేక్షకులు ఒరిజినల్ ఐడీ కార్డు లేదా బీ ఫారం తీసుకుని స్టేడియానికి వస్తే ఉచితంగా ఎంట్రీ లభిస్తుంది. ఇమ్రాన్ ఖాన్, క్వాద్, వసీం అక్రమ్, జహీర్ అబ్బాస్ పేరిట ఉన్న ప్రీమియం లాంజ్‌లకు వెళ్లి చూసే అవకాశం కూడా ఉంది. ప్రీమియం, ఫస్ట్ క్లాస్, జనరల్ విభాగంలో ఏ ప్రదేశంలోనైనా కూర్చుని మ్యాచ్‌ను వీక్షించవచ్చు. పీసీబీ నేషనల్ బ్యాంక్ క్రికెట్ ఎరీనా, గరీబ్ నవాజ్ పార్కింగ్ ఏరియాలోనూ ప్రేక్షకులకు అనుమతి ఉంది. అంటూ పేర్కొంది. మరి ఉచిత ఎంట్రీ అయినా ప్రేక్షకులను స్టేడియాలకు రప్పిస్తుందేమో చూడాలి. ఇక కరాచీ వేదికగా జరిగిన తొలి టెస్టు పేలవ డ్రాగా ముగిసింది. తొలి ఇన్నింగ్స్‌లో పాక్ 438 పరుగులు చేయగా.. అనంతరం న్యూజిలాండ్ కేన్ విలియమ్సన్ డబుల్ సెంచరీతో రాణించడంతో 612 పరుగులు చేసింది. రెండో ఇన్నింగ్స్‌ను పాక్ 8 వికెట్ల నష్టానికి 311 పరుగులు చేసి డిక్లేర్ చేసింది. కివీస్ విజయానికి 15 ఓవర్లలో 138 పరుగులు అవసరం కాగా.. 7.3 ఓవర్లలో వికెట్ నష్టానికి 61 పరుగులు చేయగా.. వెలుతురు లేకపోవడంతో మ్యాచ్‌ను డ్రాగా ముగించారు. చదవండి: నిలకడగా రిషబ్ పంత్ ఆరోగ్యం -
ఘోర అవమానం.. బోరుమన్న రమీజ్ రాజా
పీసీబీ మాజీ ఛైర్మన్ రమీజ్ రాజాకు ఘోర అవమానం జరిగినట్లు తెలుస్తోంది. విశ్వసనీయవర్గాల సమాచారం మేరకు పీసీబీ కొత్త బాస్ నజమ్ సేతీ.. రమీజ్ రాజాను ఆఫీస్‌లోకి రాకుండా అడ్డుకున్నట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని రమీజ్ రాజానే స్వయంగా తన యూట్యూబ్ చానెల్లో పేర్కొంటూ బోరుమన్నాడు. ''పీసీబీ మొత్తం మారిపోయింది. నజమ్ సేతీ ఛైర్మన్‌గా అడుగుపెట్టగానే అతని రాజకీయం మొదలైంది. తన వాళ్లకు మాత్రమే పీసీబీలోకి ఎంట్రీ అన్నట్లుగా అక్కడి ప్రవర్తన ఉంది. నాకు తెలిసి ఒక్క వ్యక్తి(నజమ్ సేతీ) కోసం పీసీబీ రాజ్యాంగాన్ని కూడా మార్చేసినట్లు కనిపిస్తుంది. పీసీబీ మాజీ ఛైర్మన్‌గా ఉన్న నాకు నజమ్ సేతీ పీసీబీ ఆఫీస్‌లోనికి రానివ్వలేదు. ఎంత మాజీ అయినా వ్యక్తిగత ఫైల్స్ కొన్ని ఆఫీస్‌లోనే ఉంటాయి. వాటిని తీసుకునేందుకు వస్తే అనుమతి ఇవ్వడం లేదు. పైగా మనుషులను పెట్టి దౌర్జన్యంగా బయటికి పంపిస్తున్నారు. మూడేళ్ల కాలానికి మొదట ఒప్పందం కుదుర్చుకొని ఏడాది తిరిగేలోపే బయటికి పంపించడం ఎవరికైనా చిరాకు తెప్పిస్తుంది. తమ స్వార్థ ప్రయోజనాల కోసం పీసీబీని కొందరు భ్రస్టు పట్టిస్తున్నారు. ఇది క్రికెట్ బోర్డుతో పాటు సిస్టమ్‌పై, జాతీయ జట్టుపై, జట్టు కెప్టెన్‌పై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది. '' అంటూ తన అక్కసును వెల్లగక్కాడు. ఇటీవలే సొంతగడ్డపై ఇంగ్లండ్‌తో జరిగిన టెస్టు సిరీస్‌లో 3-0తో వైట్‌వాష్ అయిన పాకిస్తాన్ దారుణ పరాభవాన్ని మూటగట్టుకుంది. ఈ సిరీస్ ఓటమి పీసీబీ ప్రక్షాళనకు దారి తీసింది. పీసీబీ ఛైర్మన్‌గా ఉన్న రమీజ్ రాజాపై వేటు పడిన సంగతి తెలిసిందే. అతని స్థానంలో నజమ్ సేతీ కొత్త ఛైర్మన్‌గా ఎంపికయ్యాడు. తాను ఎంపికైన రెండురోజులకే పీసీబీలో కీలక మార్పులు చేపట్టాడు నజమ్ సేతీ. పాక్ క్రికెట్లో కీలకపాత్ర పోషించిన ఆల్‌రౌండర్ షాహిద్ అఫ్రిదిని చీఫ్ సెలెక్టర్ పదవికి ఎంపిక చేశాడు. అఫ్రిదితో పాటు మాజీ ఆల్‌రౌండర్ అబ్దుల్ రజాక్, మాజీ క్రికెటర్ ఇఫ్తికార్ అంజుమ్‌లు ప్యానెల్లో సభ్యులుగా ఎంపికవ్వగా.. హరూన్ రషీద్ కన్వీనర్‌గా ఎంపికయ్యాడు. చదవండి: Shahid Afridi: షాహిద్ అఫ్రిదికి పీసీబీలో కీలక బాధ్యతలు -
షాహిద్ అఫ్రిదికి పీసీబీలో కీలక బాధ్యతలు
పాకిస్తాన్ క్రికెట్ బోర్డు(పీసీబీ) చీఫ్ సెలెక్టర్‌గా మాజీ క్రికెటర్ షాహిద్ అఫ్రిది ఎంపికయ్యాడు. ఇటీవలే సొంతగడ్డపై ఇంగ్లండ్‌తో జరిగిన టెస్టు సిరీస్‌లో 3-0తో వైట్‌వాష్ అయిన పాకిస్తాన్ దారుణ పరాభవాన్ని మూటగట్టుకుంది. ఈ సిరీస్ ఓటమి పీసీబీ ప్రక్షాళనకు దారి తీసింది. పీసీబీ ఛైర్మన్‌గా ఉన్న రమీజ్ రాజాపై వేటు పడిన సంగతి తెలిసిందే. అతని స్థానంలో నజమ్ సేతీ కొత్త ఛైర్మన్‌గా ఎంపికయ్యాడు. తాను ఎంపికైన రెండురోజులకే పీసీబీలో కీలక మార్పులు చేపట్టాడు నజమ్ సేతీ. పాక్ క్రికెట్లో కీలకపాత్ర పోషించిన ఆల్‌రౌండర్ షాహిద్ అఫ్రిదిని చీఫ్ సెలెక్టర్ పదవికి ఎంపిక చేశాడు. అఫ్రిదితో పాటు మాజీ ఆల్‌రౌండర్ అబ్దుల్ రజాక్, మాజీ క్రికెటర్ ఇఫ్తికార్ అంజుమ్‌లు ప్యానెల్లో సభ్యులుగా ఎంపికవ్వగా.. హరూన్ రషీద్ కన్వీనర్‌గా ఎంపికయ్యాడు. ఈ మేరకు పీసీబీ తన ట్విటర్లో ప్రకటన విడుదల చేసింది. ప్రస్తుతం పీసీబీలో ప్రక్షాళన జరుగుతుంది. త్వరలోనే పాక్ జట్టులోనూ ఆటగాళ్ల ప్రక్షాళన జరిగే అవకాశం ఉంది. బాబర్ ఆజంను త్వరలోనే కెప్టెన్సీ నుంచి తప్పించే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇక పీసీబీ చీఫ్ సెలెక్టర్‌గా ఎంపికైన షాహిద్ అఫ్రిది పాక్ తరపున అత్యుత్తమ ఆల్రౌండర్లలో ఒకడిగా పేరు పొందాడు. 22 ఏళ్ల లాంగ్ కెరీర్లో అఫ్రిది 27 టెస్టులు, 398 వన్డేలు, 99 టి20 మ్యాచ్‌లు ఆడాడు. 2009 టి20 వరల్డ్‌కప్ నెగ్గిన పాకిస్తాన్ జట్టులో అఫ్రిది సభ్యుడిగా ఉన్నాడు. ఇక అబ్దుల్ రజాక్ కూడా పాక్ తరపున మంచి ఆల్‌రౌండర్‌గా గుర్తింపు పొందాడు. 1996 నుంచి 2013 వరకు పాక్‌కు ప్రాతినిధ్యం వహించిన అబ్దుల్ రజాక్ 46 టెస్టులు, 265 వన్డేలు, 32 టి20 మ్యాచ్‌లు ఆడాడు. ఇక ఇఫ్తికర్ అంజూమ్ పాక్ తరపున 62 మ్యాచ్‌ల్లో 77 వికెట్లు పడగొట్టాడు. PCB Management Committee has appointed former Pakistan captain Shahid Afridi as the interim Chair of the Men’s National Selection Committee. Other members of the panel are: Abdul Razzaq and Rao Iftikhar Anjum. Haroon Rashid will be the Convener. — Pakistan Cricket (@TheRealPCB) December 24, 2022 -
17 ఏళ్ల తర్వాత పాక్ గడ్డపై అడుగుపెట్టిన ఇంగ్లండ్
పాకిస్తాన్‌తో మూడు టెస్టు మ్యాచ్‌ల సిరీస్ ఆడేందుకు ఇంగ్లండ్ జట్టు ఆదివారం తెల్లవారుజామున పాక్ గడ్డపై అడుగుపెట్టింది. దాదాపు 17 సంవత్సరాల తర్వాత ఇంగ్లండ్ పాక్‌లో టెస్టు సిరీస్ ఆడేందుకు రావడం ఆసక్తిగా మారింది. చివరగా 2005లో పాకిస్తాన్లో ఇంగ్లండ్ టెస్టు సిరీస్ ఆడింది. ఈ సందర్భంగా ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు తమ ట్విటర్లో ఇంగ్లండ్ టెస్టు బృందం పాకిస్తాన్లో ల్యాండ్ అయింది.. సిరీస్ ఆడడమే తరువాయి అని క్యాప్షన్ జత చేసి వీడియో రిలీజ్ చేసింది. అయితే టి20 ప్రపంచకప్‌కు ముందు ఇంగ్లండ్ జట్టు పాకిస్తాన్ గడ్డపై ఏడు మ్యాచ్‌ల టి20 సిరీస్ ఆడేందుకు వచ్చింది. ఈ సిరీస్‌లో ఇంగ్లండ్ 4-3 తేడాతో పాకిస్తాన్‌ను మట్టికరిపించి ట్రోఫీని కైవసం చేసుకుంది. ఆ తర్వాత వరల్డ్‌కప్ ఉండడంతో మళ్లీ ఇరుజట్లు ఆస్ట్రేలియాకు చేరుకున్నాయి. టి20 వరల్డ్‌కప్ ముగిసిన అనంరతం ముందుగా అనుకున్న ప్రకారమే బెన్ స్టోక్స్ సేన పాకిస్తాన్లో అడుగుపెట్టింది. డిసెంబర్ 1 నుంచి రావల్పిండిలో తొలి టెస్టు జరగనుంది. ఆ తర్వాత ముల్తాన్ వేదికగా(డిసెంబర్ 9 నుంచి 13 వరకు) రెండో టెస్టు, కరాచీ వేదికగా డిసెంబర్ 17 నుంచి 21 వరకు మూడో టెస్టు జరగనుంది. 2023 ఐసీసీ టెస్టు చాంపియన్‌షిప్‌లో భాగంగా ఇరుజట్లకు ఈ సిరీస్ కీలకం కానుంది. ప్రస్తుతం పాకిస్తాన్ ఐదో స్థానంలో ఉండగా.. ఇంగ్లండ్ ఏడో స్థానంలో ఉంది. ఈ సిరీస్‌లో విజేతగా నిలిచిన జట్టు టాప్-4కు చేరుకునే అవకాశం ఉంది. ఇక టి20 ప్రపంచకప్‌లో గాయంతో దూరమైన మార్క్ వుడ్ పాక్‌తో టెస్టు సిరీస్ ఆడేది అనుమానంగా ఉంది. వాస్తవానికి ఇంగ్లండ్ జట్టు గతేడాదే పాకిస్తాన్లో టెస్టు సిరీస్ ఆడాల్సింది. కానీ కివీస్ సెక్యూరిటీ కారణాలతో సిరీస్‌ను రద్దు చేసుకోవడంతో ఇంగ్లండ్ పాక్ రావడానికి సంశయించింది. అయితే ఏడాది వ్యవధిలో పాకిస్తాన్లో కొంత పరిస్థితి మెరుగవడంతో ఇంగ్లండ్ ఆడడానికి ఒప్పుకుంది. Touchdown in Pakistan for our Men’s Test squad! 🇵🇰 pic.twitter.com/2GbRr1Xcw1 — England Cricket (@englandcricket) November 26, 2022 చదవండి: మారడోనా సరసన మెస్సీ.. కళ్లు చెదిరే గోల్ చూడాల్సిందే 'కొకైన్ కోసం పిచ్చోడిలా తిరిగా.. అక్కడ నిత్యం నరకమే' -
అన్న అడుగు పడింది.. ఇప్పుడు తమ్ముడి వంతు
చిరకాల ప్రత్యర్థి.. దాయాది పాకిస్తాన్ జట్టులో బౌలింగ్ విభాగం ఎంత పటిష్టంగా ఉందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ప్రత్యర్థి జట్టు ఆటగాళ్లయినప్పటికి అలాంటి నిఖార్సైన పేసర్లు మనకూ ఉంటే బాగుండేదని చాలా మంది అభిప్రాయం. ప్రస్తుతం పాకిస్తాన్ జట్టులో పేసర్లకు కొదువ లేదు. ఒకరు గాయపడితే మరొక ఫాస్ట్ బౌలర్ సిద్ధంగా ఉంటున్నాడు. అది చురకత్తులాంటి బంతులతో వికెట్లు తీసే బౌలర్లు తయారవుతున్నారు. ఇటీవలే టి20 ప్రపంచకప్‌లో పాకిస్తాన్ ఫైనల్ వరకు వచ్చిందంటే అందులో బౌలర్ల పాత్రే ఎక్కువగా ఉంది. షాహిన్ అఫ్రిది, నసీమ్ షా, మహ్మద్ వసీమ్ జూనియర్, హారిస్ రౌప్ ఇలా జట్టులో ఒకరిని మించి మరొక బౌలర్ ఉన్నాడు. పాక్ జట్టులో ఇప్పుడే కాదు.. వాళ్లు క్రికెట్ ఆడుతున్నప్పటి నుంచి పేసర్లకు ప్రత్యేక స్థానం ఉంటుంది. ఇమ్రాన్ ఖాన్, వసీం అక్రమ్, వకార్ యూనిస్‌ల తర్వాత ఆ బాధ్యత షోయబ్ అక్తర్, మహ్మద్ సమీ, సోహైల్ తన్వీర్, మహ్మద్ ఆమిర్, మహ్మద్ ఆసిఫ్‌లు తీసుకున్నారు. వీరి తర్వాత వచ్చినవాళ్లే ప్రస్తుతం పాక్ జట్టులో ఉన్న స్టార్ బౌలర్లుగా వెలుగొందుతున్నారు. ఇక పాక్ జట్టులోకి కొత్తగా ఎంట్రీ ఇచ్చిన క్రికెటర్ నసీమ్ షా(19) ఒక సంచలనం. తనదైన స్వింగ్.. పేస్ బౌలింగ్‌తో ప్రత్యర్థి బ్యాటర్లను ముప్పతిప్పలు పెట్టగల సమర్థుడు. అయితే టి20 ప్రపంచకప్‌లో పెద్దగా రాణించనప్పటికి తనదైన రోజున అతన్ని ఆపడం ఎవరి తరం కాదు. పదునైన పేస్ బౌలింగ్‌తో వికెట్లు రాబట్టగల నైపుణ్యం అతని సొంతం. ఈ ఏడాది ఆసియా కప్‌లో టీమిండియాపై తొలి అంతర్జాతీయ టి20 ఆడిన నసీమ్ షా డెబ్యూ మ్యాచ్‌లోనే మంచి ప్రదర్శన కనబరిచాడు. షాహిన్ అఫ్రిది స్థానంలో జట్టులోకి వచ్చిన నసీమ్ షా తన పదునైన బంతులతో టీమిండియా బ్యాటర్లను ఇబ్బంది పెట్టాడు. ఆ మ్యాచ్‌లో 4 ఓవర్లు వేసిన నసీమ్ షా 27 పరుగులిచ్చి రెండు వికెట్లు తీశాడు. తద్వారా పాక్ బౌలింగ్‌లో కీలకంగా మారిన నసీమ్ షా టి20 ప్రపంచకప్‌కు కూడా ఎంపికయ్యాడు. ఇక టి20 ప్రపంచకప్‌లో మూడు మ్యాచ్‌లాడిన నసీమ్ మూడు వికెట్లు తీశాడు. తాజాగా నసీమ్ షా తమ్ముడు హునైన్ షా(18) అన్నను మించిపోయేలా ఉన్నాడు. ప్రస్తుతం ఫస్ట్‌క్లాస్ క్రికెట్లో ఆడుతున్న హునైన్ షా మ్యాచ్‌లో ఒక్క వికెట్ మాత్రమే తీసినప్పటికి తన బౌలింగ్‌తో ఆకట్టుకున్నాడు. గుడ్ లెంగ్త్‌తో వేసిన బంతి బ్యాటర్ చేతిని తాకి ఆ తర్వాత బ్యాట్‌ను తాకి గాల్లోకి లేవడం.. స్లిప్‌లో ఉన్న ఫీల్డర్ క్యాచ్ తీసుకోవడం జరిగిపోయింది. బ్యాటర్ తన చేతికి బంతి గట్టిగా తగలడంతో నొప్పితో బాధపడిన అతను పెవిలియన్‌కు వెళ్తూ రాసుకోవడం కనిపించింది. ఇక హునైన్ షాకు ఫస్ల్‌క్లాస్ క్రికెట్లో ఇదే తొలి వికెట్ కావడం విశేషం. అయితే మ్యాచ్‌లో 76 పరుగులిచ్చిన హునైన్ కేవలం ఒక్క వికెట్‌తోనే సరిపెట్టుకన్నాడు. మొత్తానికి అన్న నసీమ్ షా అడుగు ఇప్పటికే పాకిస్తాన్ జట్టులో పడింది.. ఇక ఇప్పుడు తమ్ముడి వంతు త్వరలో రాబోతుందంటూ అభిమానులు కామెంట్స్ చేశారు. దీనికి సంబంధించిన వీడియోనూ పీసీబీ స్వయంగా ట్విటర్లో షేర్ చేసింది. Hunain Shah picks up his first wicket in first-class cricket ☝️ Watch Live ➡️ https://t.co/LcfNgwD2hw#QeAT | #CPvBAL pic.twitter.com/ORrjwhsQJL — Pakistan Cricket (@TheRealPCB) November 17, 2022 చదవండి: వర్షంతో మ్యాచ్ రద్దు.. వింత గేమ్ ఆడిన భారత్, కివీస్ ఆటగాళ్లు -
ఇండియా ఎవరి మాట వినదు.. మా దేశానికి రమ్మని పాక్‌ను బతిమాలేది లేదు..!
పాకిస్తాన్ వేదికగా వచ్చే ఏడాది జరుగబోయే ఆసియా కప్ వన్డే టోర్నీలో భారత్ పాల్గొనదంటూ బీసీసీఐ కార్యదర్శి జై షా ఇటీవల ఓ ప్రకటన విడుదల చేసిన విషయం తెలిసిందే. జై షా చేసిన ఈ ప్రకటనపై పీసీబీ (పాకిస్తాన్ క్రికెట్ బోర్డు) తీవ్రంగా స్పందించింది. ఆసియా కప్‌లో పాల్గొనేందుకు భారత్.. పాకిస్తాన్లో అడుగుపెట్టకపోతే, ఇండియాలో జరిగే 2023 వన్డే వరల్డ్‌కప్‌ను తాము బాయ్‌కాట్ చేస్తామని పీసీబీ బెదిరింపులకు దిగింది. ఈ ఉదంతంపై తాజాగా భారత క్రీడా శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ స్పందించారు. భారత్ వేదికగా జరిగే వన్డే ప్రపంచకప్‌లో పాల్గొనమని ఎవరిని బతిమాలేది లేదని పాక్‌ను ఉద్దేశిస్తూ ఘాటుగా బదులిచ్చారు. వచ్చే వారికి భారత్ సాదరంగా స్వాగతం పలుకుతుందని.. రావడం, రాకపోవడం ఆయా జట్ల ఇష్టమని, ఈ విషయంపై స్పందించడం కూడా అనవసరమని పాక్‌కు సున్నితంగా మొట్టికాయలు వేశారు. భారత్ ఓ క్రీడా శక్తి అని, ప్రపంచ క్రికెట్ చరిత్రలో బీసీసీఐకి అత్యున్నత హోదా ఉందని, ఇదివరకే భారత్ ఎన్నో ప్రపంచకప్‌లను సమర్ధవంతంగా నిర్వహించిందని గుర్తు చేశారు. పాక్ బెదిరింపులకు భారత ఎట్టి పరిస్థితుల్లో తలొగ్గేది లేదని, భారత్ ఒక్కసారి నిర్ణయం తీసుకున్న తర్వాత ఎవరి మాట వినదని అవాక్కులు చవాక్కులు పేలుతున్న పాక్‌కు గట్టిగా కౌంటరిచ్చారు. పాక్‌లో పర్యటించే అంశం కేంద్ర హోం శాఖ పరిధిలోని అంశమని, అక్కడ భద్రతాపరమైన సమస్యలున్నాయని నిఘా వర్గాల సమాచారం అందిందని మంత్రి వివరించారు. చదవండి: IND vs BAN: ఏడేళ్ల తర్వాత బంగ్లాదేశ్ పర్యటనకు టీమిండియా..! -
'భారత్‌లో జరిగే వరల్డ్‌కప్‌ను బాయ్‌కాట్ చేస్తాం'
Asia Cup 2023- India Vs Pakistan: చిరకాల ప్రత్యర్థులు టీమిండియా, పాకిస్తాన్ మధ్య ద్వైపాక్షిక సిరీస్‌లు జరిగి చాలా కాలమైపోయింది. రాజకీయ వ్యవహారాల కారణంగా ఇరు దేశాల మధ్య సత్సంబంధాలు లేవు. అందుకే ఐసీసీ మేజర్ టోర్నీల్లోనే టీమిండియా, పాకిస్తాన్‌లు తలపడుతూ వస్తున్నాయి. ఈసారి టి20 ప్రపంచకప్‌లోనూ అక్టోబర్ 23న చిరకాల ప్రత్యర్థులు తలపడనున్నారు. మ్యాచ్ సంగతి పక్కనబెడితే.. ప్రస్తుతం బీసీసీఐ కార్యదర్శి జై షా చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. పాకిస్థాన్ వేదికగా వచ్చే ఏడాది జరగనున్న ఆసియాకప్-2023లో భారత్ జట్టు పాల్గొనబోదని కుండబద్దలు కొట్టాడు. కాగా జై షా వ్యాఖ్యలపై పాకిస్తాన్ అభిమానులు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వచ్చే ఏడాది టీమిండియా ఆసియా కప్ ఆడేందుకు పాకిస్తాన్ రాకపోతే.. అదే ఏడాది జరగనున్న వన్డే వరల్డ్‌కప్ 2023 బాయ్‌కాట్ చేయాలని పీసీబీకి సూచనలు ఇస్తున్నారు. అంతేకాదు జై షా అధ్యక్షుడిగా ఉన్న ఏసీసీ(ఆసియా క్రికెట్ కౌన్సిల్) నుంచి కూడా తప్పుకోవాలనే యోచనలో పీసీబీ ఉన్నట్లు తెలుస్తోంది. ఇక పీసీబీ కూడా జై షా వ్యాఖ్యలపై అసంతృప్తి వ్యక్తం చేసింది. టి20 వరల్డ్‌కప్ ముగిసిన అనంతరం మెల్బోర్న్లో జరగనున్న ఐసీసీ సభ్య సమావేశంలో జై షా చేసిన వ్యాఖ్యలను దృష్టికి తీసుకువస్తామని పీసీబీ ప్రతినిధి ఒకరు పేర్కొన్నారు. ఇక వన్డే వరల్డ్‌కప్ 2023కి భారత్ ఆతిథ్యమివ్వనున్న సంగతి తెలిసిందే. ఏసీసీ అధ్యక్ష హోదాలో ఉండి ఒక దేశం తరఫునే మాట్లాడటం సరికాదని అభిమానులు మండిపడుతున్నారు. బీసీసీఐ తమ పలుకుబడి చూపిస్తోందని.. పాకిస్థాన్ క్రికెట్ టీమ్‌ను తొక్కెయ్యాలనుకుంటుందని పేర్కొన్నారు. వన్డే వరల్డ్‌కప్ బాయ్‌కాట్ చేస్తే బీసీసీఐ, ఐసీసీకి భారీ నష్టం వాటిల్లుతుందని.. పాకిస్థాన్ లేకుండా టోర్నీని ఎలా నిర్వహిస్తారో చూద్దామని కామెంట్ చేశారు. వన్డే వరల్డ్‌కప్‌ను బాయ్‌కాట్‌ను చేయడం ద్వారా బీసీసీఐకి వచ్చే నష్టం ఏం లేదని.. అది పీసీబీకే ఎసరు తెస్తుందని క్రీడా పండితులు అభిప్రాయపడుతున్నారు. వన్డే ప్రపంచకప్ బాయ్‌కట్ చేస్తే.. పీసీబీపై ఐసీసీ కన్నెర్ర చేస్తుందని, బ్లాక్ లిస్ట్‌లో పెట్టి ఇచ్చే నిధులను ఆపేస్తుందని చెబుతున్నారు. తద్వారా పీసీబీకే నష్టం వాటిల్లుతుందని, ఈ వ్యవహారంపై ఆచితూచి అడుగెయ్యాలని హెచ్చరించారు. చదవండి: ఆసియా కప్ టోర్నీలో ఆడలేం: జై షా var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_1971406958.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
ఆ టోర్నీ కోసం పాక్‌కు టీమిండియా...?
-
IND Vs PAK: ఈసీబీ ఆఫర్‌ను రిజెక్ట్ చేసిన బీసీసీఐ!
క్రికెట్లో భారత్-పాకిస్తాన్ మ్యాచ్‌లకు ఎనలేని క్రేజ్ ఉంటుదన్న సంగతి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అయితే ఇరుదేశాల మధ్య ద్వైపాక్షిక సిరీస్‌లు మాత్రం జరిగి చాలా సంవత్సరాలు అయిపోయింది. ఐసీసీ, ఆసియా కప్ లాంటి మేజర్ టోర్నీల్లో తప్ప పెద్దగా మ్యాచ్‌లు ఆడలేదు. అందుకే భారత్, పాక్ మ్యాచ్‌కు అంత క్రేజ్ ఉంటుంది. ఇక అక్టోబర్‌లో ఆస్ట్రేలియా వేదికగా జరగనున్న టి20 ప్రపంచకప్‌లో ఈ చిరకాల ప్రత్యర్థులు మరోసారి తలపడనున్నాయి. ఆ మ్యాచ్ కోసం ఇరుదేశాల ప్రజలు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. తాజాగా టీమిండియా, పాకిస్తాన్‌లు ఒప్పుకుంటే మా దేశంలో ద్వైపాక్షిక సిరీస్ నిర్వహించేందుకు సిద్ధమని ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు(ఈసీబీ) పేర్కొనడం ఆసక్తి కలిగించింది. అయితే ఈసీబీ ప్రతిపాధించింది వన్డేలు, టీ20లు కాదు. ఐదు రోజుల పాటు జరిగే టెస్టు సిరీస్ కోసం. బీసీసీఐ, పీసీబీ ఒప్పుకుంటే తమ దేశంలో ఇండియా-పాక్ లతో మూడు టెస్టులు ఆడించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని ఈసీబీ ప్రతిపాదించింది. కానీ ఈసీబీ ప్రతిపాదనను ఇరు దేశాల బోర్డులు తిరస్కరించినట్టు సమాచారం. తటస్థ వేదికపై ఇండియా-పాక్ టెస్టు మ్యాచ్ లు జరిపించాలన్న ఆలోచన తమకు లేదని.. ఆడితే ఇండియాలో అయినా లేదంటే పాకిస్తాన్ లో ఓకే గానీ టెస్టులను కూడా ఇతర దేశాలలో తాము ఆడబోమని కరాఖండీగా చెప్పినట్టు తెలుస్తున్నది. ఇక సుమారు 17 సంవత్సరాల తర్వాత ఇంగ్లండ్ జట్టు పాకిస్తాన్లో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. 2009లో శ్రీలంక క్రికెటర్లపై ఉగ్రవాదుల దాడి తర్వాత సుమారు పదేండ్లుగా అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్ లు లేక అల్లాడిన పాకిస్తాన్ కు ఇప్పుడిప్పుడే విదేశీ జట్లు వస్తున్నాయి. ఈ ఏడాది ప్రారంభంలో ఆస్ట్రేలియా రాగా ఇప్పుడు ఇంగ్లండ్ పాక్ పర్యటనకు వచ్చింది. టి20 సిరీస్ ముగిశాక డిసెంబర్లో ఇంగ్లండ్ టెస్టులు ఆడేందుకు మరోసారి పాక్‌కు రానుంది. ఈ సిరీస్ చర్చ సందర్బంగానే ఈసీబీ పీసీబీ ఎదుట ప్రతిపాదనను తెచ్చినట్టు సమాచారం. ఇంగ్లండ్‌లో దక్షిణాసియా వాసులు అధికంగా ఉన్నారని.. తద్వారా అక్కడ ఇండియా-పాకిస్తాన్ టెస్టు సిరీస్ సూపర్ హిట్ అవుతుందని ఈసీబీ భావిస్తున్నది. మరోవైపు బీసీసీఐ కూడా ఈ ప్రతిపాదనను తోసిపుచ్చింది. ఇదే విషయమై బీసీసీఐ ప్రతినిధి ఒకరు మాట్లాడుతూ.. ''ఇండియా-పాక్ సిరీస్ గురించి ఈసీబీ మాట్లాడటం ఆశ్చర్యకరంగా ఉంది. పాకిస్తాన్‌తో మ్యాచ్‌లు అంటే అది బీసీసీఐ పరిధిలో లేదు. అది కేంద్ర ప్రభుత్వం చేతుల్లో ఉంది. ఇప్పటివరకైతే ఇండో-పాక్ ద్వైపాక్షిక సిరీస్ గురించి మా వైఖరిలో మార్పు లేదు. పాకిస్తాన్‌తో ఐసీసీ టోర్నీలు, ఆసియా కప్ లో మాత్రమే ఆడతాం'' అని కుండబద్దలు కొట్టాడు. భారత్-పాకిస్తాన్ లు చివరిసారిగా 2007లో టెస్టు సిరీస్ ఆడాయి. ముంబై ఉగ్రదాడుల తర్వాత ఈ రెండు దేశాల మధ్య దూరం నానాటికీ పెరుగుతున్నది. -
'అక్క మరణం నా జీవితాన్ని తలకిందులు చేసింది'
పాకిస్తాన్ సీనియర్ క్రికెటర్ షాన్ మసూద్ దాదాపు ఆరు నెలల తర్వాత పాకిస్తాన్ జట్టులోకి ఎంట్రీ ఇచ్చాడు. టెస్టు ఓపెనర్‌గా ముద్రపడిన షాన్ మసూద్ ఇంతకాలం టెస్టులు, వన్డేలకు మాత్రమే పరిమితమయ్యాడు. తన కెరీర్లో ఒక్క టి20 మ్యాచ్ ఆడని షాన్ మసూద్‌ను పీసీబీ ఏకంగా ప్రతిష్టాత్మక టి20 ప్రపంచకప్‌కు ఎంపికచేసింది. గాయంతో బాధపడుతున్న ఫఖర్ జమాన్ స్థానంలో షాన్ మసూద్‌ను ఎంపిక చేసింది. 2013లో అంతర్జాతీయ క్రికెట్లో అరంగేట్రం చేసిన షాన్ మసూద్ ఇప్పటివరకు 25 టెస్టులాడి 1378 పరుగులు చేశాడు. ఇందులో నాలుగు సెంచరీలు, ఆరు అర్థసెంచరీలు ఉండడం విశేషం. కాగా టి20 ప్రపంచకప్‌కు ఎంపిక చేయడంపై షాన్ మసూద్ శనివారం స్పందించాడు. ''పాక్ జట్టుకు ఆడని కాలంలో చాలా విషయాలు తెలుసుకున్నా.. ఒక వ్యక్తిగా, ఆటగాడిగా చాలా ఎదిగాననిపిస్తుంది. క్రికెట్ కంటే జీవితంలో ఎన్నో ముఖ్యమైన విషయాలు ఉంటాయని తెలుసుకున్నా. మన ఆత్మీయులను పోగొట్టుకున్నప్పుడు ఆ బాధ మనకు తెలుస్తుంది. అది నేను అనుభవించా. ఈ ఏడాది మా అక్క మరణం నా జీవితాన్ని తలకిందులు చేసింది. ఆమె మరణంతో ఒక్కసారిగా అంతా కోల్పోయానన్న భావన కలిగింది. కానీ దేశం కోసం మనకిష్టమైన ఆట ఆడినప్పుడు విఫలం కంటే సఫలం ఎక్కువగా ఉంటుందని అక్క చెప్పిన మాటలు మనసులో ఉంచుకున్నా. జట్టులో ఎంపికవుతామా అన్న విషయాన్ని పక్కనబెట్టి రాణిస్తే ఫలితాలు వెతుక్కుంటూ వస్తాయని నా విషయంలో నిరూపితమైంది. ఇక జట్టులోకి తిరిగి రావడం సంతోషమనిపించింది. జట్టులో నా పాత్రను సమర్థంగా పోషిస్తానని అనుకుంటున్నా'' అంటూ చెప్పుకొచ్చాడు. ఇక పాకిస్తాన్ ప్రస్తుతం స్వదేశంలో ఇంగ్లండ్ ఏడు మ్యాచ్‌ల టి20 సిరీస్ ఆడనుంది. ఇది ముగిసిన అనంతరం ఆస్ట్రేలియాకు వెళ్లనున్న పాకిస్తాన్ టి0 ప్రపంచకప్‌లో ఆడనుంది. తమ తొలి మ్యాచ్‌ను చిరకాల ప్రత్యర్థి టీమిండియాతో అక్టోబర్ 23న(ఆదివారం) ఆడనుంది. చదవండి: ఆస్ట్రేలియాతో తొలి టీ20.. మొహాలీకి చేరుకున్న భారత ఆటగాళ్లు -
'మొన్ననే కదా ఫైనల్ చేరారు.. అంత మాట ఎలా అంటావు!'
పాకిస్తాన్ మాజీ ఫాస్ట్ బౌలర్ షోయబ్ అక్తర్ పీసీబీ సెలెక్టర్లపై మండిపడ్డాడు. టి20 ప్రపంచకప్‌కు ఎంపిక చేసిన పాక్ జట్టు పరమ చెత్తగా ఉందని.. ఇలా అయితే ప్రతిష్టాత్మక టోర్నీలో తొలి రౌండ్లోనే వెనుదిరుగుతుందంటూ పేర్కొన్నాడు. టి20 ప్రపంచకప్‌కు 15 మంది సభ్యులతో కూడిన జట్టును ఈ గురువారం ప్రకటించారు. బాబర్ ఆజం కెప్టెన్ కాగా.. షాదాబ్ ఖాన్ వైస్‌కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. ఫాస్ట్ బౌలర్ షాహిన్ అఫ్రిది తిరిగి జట్టులోకి రాగా.. చాలాకాలం తర్వాత హైదర్ అలీ జ్టుటలో చోటు సంపాదించాడు. అయితే ఆశ్చర్యంగా ఫఖర్ జమాన్‌ను రిజ్వర్ జాబితాలో చోటు కల్పించింది. ఇక సీనియర్ ఆటగాడు షోయబ్ మాలిక్‌కు సెలక్టర్లు మరో సారి మొండి చేయి చూపించారు. ఇక ఆసియా కప్ ఫైనల్ ఆడిన జట్టులోని ఆటగాళ్లంతా టి20 ప్రపంచకప్‌కు ఎంపికయ్యారు. కాగా జట్టు ఎంపికపై షోయబ్ అక్తర్ స్పందిస్తూ.. ''టి20 ప్రపంచకప్‌కు ప్రకటించిన పాకిస్తాన్ జట్టు సమతుల్యంగా లేదు. ముఖ్యంగా మిడిలార్డర్ చాలా వీక్‌గా కనిపిస్తోంది. ఇలాంటి మిడిలార్డర్ ఉంటే ప్రతిష్టాత్మక టోర్నీలో తొలి రౌండ్లోనే వెనుదిరగడం గ్యారంటీ. మిడిలార్డర్లో సమర్థుల అవసరం ఉంది.. బ్యాటింగ్ డెప్త్ పెంచాల్సిందే. ఇది సాధ్యం కాకపోతే పాకిస్తాన్ క్రికెట్ జట్టు ఒక్కో మ్యాచ్ గెలవడానికి కష్టపడాల్సిందే. అలా జరగకూడదని కోరుకుంటున్నా.'' అంటూ చెప్పుకొచ్చాడు. ఇక అక్తర్ వ్యాఖ్యలపై అభిమానులు వినూత్న రీతిలో కామెంట్స్ చేశారు. ''మొన్ననే కదా ఆసియాకప్‌లో ఫైనల్ వరకు చేరారు.. అంత మాట ఎలా అంటావు అక్తర్''.. ''మిడిలార్డర్ కాదు.. ముందు బాబర్ ఆజంను కెప్టెన్సీ నుంచి తీసేయాలి.. అప్పుడే టీం బాగా ఆడుతుంది.'' అంటూ పేర్కొన్నారు. ఇక టి20 ప్రపంచకప్‌లో గ్రూఫ్-2లో ఉన్న పాకిస్తాన్ తన తొలి మ్యాచ్‌ను చిరకాల ప్రత్యర్థి టీమిండియాతో అక్టోబర్ 23న(ఆదివారం) ఆడనుంది. ఆ తర్వాత సౌతాఫ్రికా, బంగ్లాదేశ్, క్వాలిఫయర్‌తో మ్యాచ్‌లు ఆడనుంది. టి20 ప్రపంచకప్‌కు పాకిస్థాన్ జట్టు: బాబర్ ఆజం (కెప్టెన్), షాదాబ్ ఖాన్ (వైస్ కెప్టెన్), ఆసిఫ్ అలీ, హైదర్ అలీ, హరీస్ రవూఫ్, ఇఫ్తీకర్ అహ్మద్, ఖుష్దిల్ షా, మహ్మద్ హస్నైన్, మహ్మద్ నవాజ్, మహ్మద్ రిజ్వాన్, మహ్మద్ వసీం, నసీమ్ షా, షాహీన్ షా ఆఫ్రిది మసూద్, ఉస్మాన్ ఖాదిర్ రిజర్వ్ ఆటగాళ్లు: ఫఖర్ జమాన్, మహ్మద్ హరీస్, షానవాజ్ దహానీ చదవండి: క్రికెట్లోకి ఎంట్రీ ఇవ్వనున్న ఉసేన్ బోల్ట్ కడసారి చూపులకు 13 గంటలు నిరీక్షించిన మాజీ కెప్టెన్ -
ఇంగ్లండ్ క్రికెటర్ల పెద్ద మనసు..
రాబోయే టి20 ప్రపంచకప్‌కు సన్నాహకంగా ఇంగ్లండ్ జట్టు పాకిస్తాన్ గడ్డపై సుధీర్ఘ టి20 సిరీస్ ఆడనుంది. గురువారం రాత్రి పాకిస్తాన్‌కు చేరుకున్న ఇంగ్లండ్ జట్టు ఏడు మ్యాచ్‌ల టి20 సిరీస్ ఆడేందుకు సిద్ధమవుతుంది. ఈ సందర్భంగా వచ్చే నెలలో ఆస్ట్రేలియా వేదికగా జరగనున్న టి20 ప్రపంచకప్‌కు ఇది మంచి ప్రాక్టీస్‌లా ఉపయోగపడనుంది. ఇంగ్లండ్ జట్టులో కెప్టెన్ బట్లర్ సహా ఇతర ఆటగాళ్లకు పాకిస్తాన్లో ఒక్క మ్యాచ్ ఆడిన అనుభవం లేదు. అలెక్స్ హేల్స్, మొయిన్ అలీ, లియామ్ డాసన్ లాంటి ఆటగాళ్లు పాకిస్తాన్ సూపర్ లీగ్‌లో ఆడడం ద్వారా పాక్ పిచ్‌లపై కాస్త అవగాహన ఉంది. అయితే గాయంతో బాధపడుతున్న కెప్టెన్ జాస్ట్ బట్లర్ సిరీస్‌లో ఆరంభ మ్యాచ్‌లకు దూరం కానున్నాడు. పాకిస్తాన్లో భారీ వర్షాలు కురవడంతో వరదలు పోటెత్తాయి. పాక్‌లోని చాలా ప్రాంతాలు వరదల్లో మునిగిపోయాయి. ఈ నేపథ్యంలోనే ఇంగ్లండ్ క్రికెటర్లు పెద్ద మనసు చాటుకున్నారు. ఇదే విషయమై కెప్టెన్ జాస్ బట్లర్ మాట్లాడుతూ..'' పాకిస్తాన్ ప్రస్తుతం భారీ వరదలతో అతలాకుతలమైంది. ఇలాంటి క్లిష్ట సమయంలో మేము పాక్ గడ్డపై సిరీస్ ఆడేందుకు వచ్చాం. ఒక జట్టుగా గెలుపోటములు పక్కనబెడితే.. మ్యాచ్‌కు సంబంధించిన డొనేషన్స్‌ను వరద బాధితులకు అందేలా చూస్తాం. ఇందుకోసం ఈసీబీతో ఇప్పటికే మాట్లాడాము. ఈసీబీ కూడా మా వ్యాఖ్యలను పరిగణలోకి తీసుకొని పెద్ద మొత్తంలో సాయం చేడయానికి ముందుకు రానుంది. క్రికెట్లో ఇలాంటి స్నేహపూరిత వాతావరణం ఉండడం చాలా మంచిది. ఇక ఇరుజట్ల మధ్య జరగనున్న టి20 సిరీస్.. వరద నష్టాల నుంచి పాక్ ప్రజలకు, అక్కడి అభిమానులకు మంచి ఉపశమనం కలిగిస్తుందని ఆశిస్తున్నా'' అంటూ చెప్పుకొచ్చాడు. ఇటీవలే ఆసియా కప్ ఫైనల్లో లంక చేతిలో ఓటమి పాలైన పాకిస్తాన్.. స్వదేశంలో ఇంగ్లండ్‌తో సిరీస్‌లో గెలిచి టి20 ప్రపంచకప్‌కు ఆత్మవిశ్వాసంతో అడుగుపెట్టాలని భావిస్తోంది. మరోవైపు ఇంగ్లండ్ మాత్రం సౌతాఫ్రికాతో టెస్టు సిరీస్ విజయం అనంతరం పాక్ గడ్డపై అడుగుపెట్టింది. చదవండి: 'ఇలాంటి రోజు ఎప్పుడు రాకూడదని అనుకున్నా' -
17 ఏళ్ల తర్వాత పాకిస్తాన్ గడ్డపై అడుగుపెట్టిన ఇంగ్లండ్
ఇంగ్లండ్ క్రికెట్ జట్టు దాదాపు 17 ఏళ్ల తర్వాత పాకిస్తాన్ గడ్డపై గురువారం అడుగు పెట్టింది. ఈ పర్యటనలో భాగంగా ఇంగ్లండ్ 7 మ్యాచ్‌ల టీ20 సిరీస్ ఆడనుంది. కాగా ఇంగ్లండ్ చివరిసారిగా 2005లో పాకిస్తాన్లో ఆడింది. 2007లో శ్రీలంక జట్టు ప్రయాణిస్తున్న బస్‌పై ఉగ్రదాడి తర్వాత ఏ జట్టు కూడా పాక్‌లో పర్యటించడానికి ముందుకు రాలేదు. ఈ క్రమంలో ఇంగ్లండ్ కూడా భద్రతా కారణాల దృష్ట్యా పాకిస్తాన్లో ఇంగ్లండ్ అడుగుపెట్టలేదు. 2012, 2015లో యూఏఈ వేదికగా ఇరు జట్ల మధ్య సిరీస్‌లు జరిగాయి, కాగా గత ఐదు ఏళ్లలో పరిస్థితులు సద్దుమణగడంతో అంతర్జాతీయ జట్లు పాకిస్తాన్లో పర్యటిస్తున్నాయి. ఈ క్రమంలో గతేడాది టీ20 ప్రపంచకప్ ముందు ద్వైపాక్షిక సిరీస్ ఆడేందుకు ఇంగ్లండ్ జట్టు పాకిస్తాన్లో పర్యటించాల్సింది. అయితే ఆటగాళ్ల భద్రత దృష్ట్యా అఖరి నిమిషంలో పాక్ పర్యటను ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు రద్దు చేసింది. కాగా టీ20 ప్రపంచకప్-2021 ముగిసిన తర్వాత ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు, పాకిస్తాన్ క్రికెట్ బోర్డు అధికారులు దుబాయ్‌లో సమావేశమయ్యారు. 2022 ఏడాది మధ్యలో ఇంగండ్ జట్టు పాక్‌లో పర్యటించి ఏడు మ్యాచ్‌ల ద్వైపాక్షిక సిరీస్ ఆడేందుకు ఈసీబీ ఒప్పందంకుదర్చుకుంది. ఈ ఒప్పందంలో భాగంగానే ఇంగ్లండ్ జట్టు పాక్ గడ్డపై అడుగుపెట్టింది. భారీ భద్రత కరాచీ విమానాశ్రయానికి చేరుకున్న ఇంగ్లండ్ ఆటగాళ్లను భారీ భద్రత నడుమ హాటల్‌కు తరలించారు. ఇరు జట్లు మధ్య మ్యాచ్ జరిగే సమయంలో జట్టు బస చేస్తున్న హాటల్‌తో పాటు కరాచీ నేషనల్ స్టేడియం వద్ద రోడ్లు మొత్తం బ్లాక్ చేయనున్నట్లు పోలీస్ అధికారులు పేర్కొన్నారు. అదే విధంగా హాటల్‌తో పాటు స్టేడియం వద్ద కూడా సాయుధ బలగాలను భారీగా మోహరించినట్లు పీసీబీ అధికారి ఒకరు తెలిపారు. 7టీ20ల సిరీస్ పాకిస్తాన్‌తో ఇంగ్లండ్ ఏడు టీ20ల సిరీస్‌లో తలపడనుంది. ఈ టీ20 సిరీస్ సెప్టెంబర్ 20 నుంచి ఆక్టోబర్2 వరకు జరగనుంది. ఈ సిరీస్‌లోని తొలి నాలుగు మ్యాచ్‌లు కరాచీ నేషనల్ స్టేడియం వేదికగా జరగనున్నాయి. అఖరి మూడు టీ20లకు లాహోర్‌లోని గడాఫీ స్టేడియం ఆతిథ్యం ఇవ్వనుంది. The England squad has arrived at the team hotel in Karachi ✅#PAKvENG pic.twitter.com/M5esMUlDMT — Pakistan Cricket (@TheRealPCB) September 15, 2022 చదవండి: T20 World Cup 2022: జట్టును ప్రకటించిన అఫ్గనిస్తాన్.. యువ బౌలర్ ఎంట్రీ -
క్రతువు ముగిసింది.. కాలుష్యం మిగిలింది!
సాక్షి, హైదరాబాద్: మహా నగరంలో గణేష్ నిమజ్జన ఉత్సవాలు వైభవంగా ముగిశాయి. హుస్సేన్‌సాగర్ సహా సుమారు వంద జలాశయాల్లో వేలాదిగా గణపతి ప్రతిమలను నిమజ్జనం చేశారు. నిమజ్జన క్రతువు ముగిసిన వెంటనే వ్యర్థాలను గణనీయంగా తొలగించినట్లు బల్దియా యంత్రాంగం ప్రకటించినప్పటికీ.. ప్లాస్టర్‌ఆఫ్ ప్యారిస్ విగ్రహాల నిమజ్జనం కారణంగా టన్నుల కొద్దీ ఘన వ్యర్థాలు, అధిక గాఢత రసాయనాలు, హానికారక మూలకాలు, ఇనుము, కలప, పీఓపీ ఆయా జలాశయాల్లో కలిసినట్లు పీసీబీ నిపుణులు చెబుతున్నారు. త్వరలో నిమజ్జన కాలుష్యంపై తుది నివేదిక విడుదల చేయనున్నట్లు తెలిపారు. హుస్సేన్‌సాగర్‌లో అంచనా ఇలా.. జలాశయంలోకి సుమారు 5 వేల టన్నుల ఘన వ్యర్థాలు, 30 వేల లీటర్ల అధిక గాఢత గల రసాయనాలు, హానికారక మూలకాలు, 2 టన్నుల ఇనుము, 150 టన్నుల కలప, సుమారు వంద టన్నుల పీఓపీ సాగరంలో కలిసినట్లు పీసీబీ ప్రాథమికంగా అంచనా వేసింది. ఇందులో ఇనుము, కలపను బల్దియా ఆధ్వర్యంలో తొలగించినా.. పీఓపీ, ఇతర హానికారక రసాయనాలు, రంగులు నీళ్లలో కలిసిపోవడంతో హుస్సేన్‌సాగర్ మరింత గరళమవుతుందని నిపుణులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. అధిక మోతాదులో హానికారక రసాయనాలు, వ్యర్థాలు, మూలకాలు ప్రవేశించడంతో జలాశయంలో ప్రతి లీటరు నీటిలో జీవరాశుల మనుగడకు అత్యావశ్యకమైన బయోలాజికల్ ఆక్సిజన్ డిమాండ్(బీఓడీ), కెమికల్ ఆక్సిజన్ డిమాండ్లు పరిమితులకు మించి నమోదైనట్లు అంచనా వేస్తున్నారు. రసాయనాలు, మూలకాలిలా.. రసాయన రంగుల అవశేషాలు: లెడ్ సల్ఫేట్, చైనా క్లే, సిలికా, జింక్ ఆక్సైడ్, రెడ్ ఐరన్ ఆక్సైడ్, రెడ్ లెడ్, క్రోమ్ గ్రీన్, పైన్ ఆయిల్, లిన్సీడ్ ఆయిల్, లెడ్ అసిటేట్, వైట్ స్పిరిట్, టరీ్పన్, ఆల్కహాల్, ఎస్టర్, తిన్నర్, వార్ని‹Ù. హానికారక మూలకాలు: కోబాల్ట్, మాంగనీస్, డయాక్సైడ్, మాంగనీస్ సల్ఫేట్, అల్యూమినియం, జింక్, బ్రాంజ్ పౌడర్స్, బేరియం సల్ఫేట్, క్యాల్షియం సల్ఫేట్, కోబాల్ట్, ఆర్సినేట్, క్రోమియం ఆక్సైడ్, రెడ్ ఆర్సినిక్, జిక్ సలై్ఫడ్, మెర్క్యురీ, మైకా. తలెత్తే అనర్థాలు.. ఆయా జలాశయాల్లో సహజ ఆవరణ వ్యవస్థ దెబ్బతింటుంది. చేపలు, పక్షులు, వృక్ష, జంతు అనుఘటకాల మనుగడ ప్రశ్నార్థకమవుతుంది. పర్యావరణం దెబ్బతింటుంది. సమీప ప్రాంతాల్లో గాలి, నీరు కలుషితమవుతుంది. దుర్వాసన వెలువడే ప్రమాదం ఉంది. ఆయా జలాశయాల్లో పట్టిన చేపలను పలువురు మత్స్యకారులు నగరంలోని వివిధ మార్కెట్లలో విక్రయిస్తున్నారు. వీటిని కొనుగోలు చేసి తిన్న వారికి శరీరంలోకి హానికారక మూలకాలు చేరుతున్నాయి. మలేరియా, డెంగీ వ్యాధులు ప్రబలే ప్రమాదం ఉంది. సమీప ప్రాంతాల్లో భూగర్భ జలాలు గరళంగా మారతాయి. క్యాల్షియం, ఐరన్, మెగ్నిషియం మాలిబ్డనమ్, సిలికాన్లు జలాశయం ఉపరితలంపై తెట్టుగా ఏర్పడతాయి. జలాశయాల అడుగున క్రోమియం, కోబాల్ట్, నికెల్, కాపర్, జింక్, కాడ్మియం, లిథియం వంటి హానికారక మూలకాలు అవక్షేపాలుగా ఏర్పడతాయి. (చదవండి: రూబీ లాడ్జీ: ఎనమిదికి చేరిన మృతుల సంఖ్య..ఫైర్ అధికారి కీలక వ్యాఖ్యలు) -
పాక్‌కు మరో ఎదురుదెబ్బ.. వెన్నునొప్పితో కీలక బౌలర్ దూరం!
ఆసియాకప్‌లో భాగంగా భారత్‌తో మ్యాచ్‌కు ముందు పాకిస్తాన్‌కు మరో ఎదురుదెబ్బ తగిలింది. ఇప్పటికే మోకాలి గాయంతో స్టార్ పేసర్ షాహిన్ అఫ్రిది దూరం కాగా.. తాజాగా ఆ జట్టు ఫాస్ట్ బౌలర్ మహ్మద్ వసీమ్ వెన్నునొప్పితో బాధపడుతున్నట్లు సమాచారం. ప్రాక్టీస్ సమయంలో బౌలింగ్ సెషన్లో పాల్గొన్న మహ్మద్ వసీమ్ బౌలింగ్ చేస్తున్న సమయంలోనే వెన్నునొప్పి వచ్చింది. దీంతో జట్టు సిబ్బంది వెంటనే అతన్ని ఐసీసీ అకాడమీకి తరలించి ఎంఆర్ఐ స్కాన్ చేయించారు. రిపోర్ట్స్‌లో వసీమ్‌కు వెన్నునొప్పి తీవ్రంగానే ఉన్నట్లు తేలింది. దీన్నిబట్టి అతను ఆసియాకప్‌కు పూర్తిగా దూరమయ్యే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఆసియా కప్ ముగిసిన తర్వాత పాకిస్తాన్‌కు బిజీ షెడ్యూల్ ఉంది. ఇంగ్లండ్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియాలతో వరుస సిరీస్‌లు ఆడనుంది. ఆ తర్వాత టి20 ప్రపంచకప్‌లో ఆడనుంది. ఈ నేపథ్యంలో మహ్మద్ వసీమ్‌కు విశ్రాంతినివ్వడమే కరెక్టని పీసీబీ అభఙప్రాయపడుతోంది. ఇప్పటికే మోకాలి గాయంతో నాలుగు వారాల పాటు ఆటకు దూరమైన షాహిన్ అఫ్రిది అక్టోబర్‌లో జరగనున్న టి20 ప్రపంచకప్‌లో ఆడతాడని ఆశాభావం వ్యక్తం చేసింది. ఇక మహ్మద్ వసీమ్ పాక్ తరపున 11 టి20 మ్యాచ్‌ల్లో 17 వికెట్లు తీశాడు. చదవండి: ఆఫ్రిది లేకున్నా మాకు ఆ ముగ్గురు ఉన్నారు.. భారత బ్యాటర్లకు సవాల్! Asia Cup 2022: భారత్- పాకిస్తాన్ ఏ జట్టు ఆటగాడైనా ఒకటే! మేము అన్నదమ్ముల్లా ఉంటాం! -
17 ఏళ్ల తర్వాత ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్.. షెడ్యూల్ విడుదల చేసిన పాకిస్తాన్!
17 ఏళ్ల తర్వాత తొలిసారిగా ఇంగ్లండ్ జట్టు పాకిస్తాన్లో అడుగు పెట్టనుంది. ఈ పర్యటనలో భాగంగా 7 టీ20లు, మూడు టెస్టుల సిరీస్‌లో అతిథ్య జట్టుతో ఇంగ్లండ్ తలపడనుంది. కాగా ఇప్పటికే టీ20 సిరీస్‌కు సంబంధించిన షెడ్యూల్‌ను ప్రకటించిన పాకిస్తాన్ క్రికెట్ బోర్డు.. తాజాగా టెస్టు సిరీస్ షెడ్యూల్‌ను కూడా విడుదల చేసింది. ఇక ఇరు జట్లు మధ్య చారిత్రాత్మక టెస్ట్ సిరీస్ డిసెంబర్ 1 నుంచి డిసెంబర్ 21 వరకు జరగనుంది. తొలి టెస్టుకు రావల్పిండి, రెండో టెస్టుకు మూల్తాన్ అతిథ్యం ఇవ్వనుండగా.. అఖరి టెస్టు కరాచీ వేదికగా జరగనుంది. అదే విధంగా పాకిస్తాన్ ఇంగ్లండ్ మధ్య టీ20 సిరీస్ సెప్టెంబర్ 20 నుంచి ఆక్టోబర్2 వరకు జరగనుంది. ఈ సిరీస్‌లోని తొలి నాలుగు మ్యాచ్‌లు కరాచీ నేషనల్ స్టేడియం వేదికగా జరగనున్నాయి. అఖరి మూడు టీ20లకు లాహోర్‌లోని గడాఫీ స్టేడియం ఆతిథ్యం ఇవ్వనుంది. కాగా గతేడాది టీ20 ప్రపంచకప్ ముందు ద్వైపాక్షిక సిరీస్ ఆడేందుకు ఇంగ్లండ్ జట్టు పాకిస్తాన్లో పర్యటించాల్సి ఉంది. అయితే ఆటగాళ్ల భద్రత దృష్ట్యా అఖరి నిమిషంలో పాక్ పర్యటను ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు రద్దు చేసింది. అయితే టీ20 ప్రపంచకప్-2021 ముగిసిన తర్వాత ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు, పాకిస్తాన్ క్రికెట్ బోర్డు అధికారులు దుబాయ్‌లో సమావేశమయ్యారు. 2022 ఏడాదిలో ఇంగండ్ జట్టు పాక్‌లో పర్యటించి ద్వైపాక్షిక సిరీస్‌లు ఆడేందుకు ఇరు బోర్డులు ఒప్పందం కుదుర్చుకున్నాయి. ఈ ఒప్పందంలో భాగంగానే ఇంగ్లండ్ జట్టు పాక్ గడ్డపై అడుగు పెట్టనుంది. చదవండి: IND vs ZIM: మూడేళ్ల నిరీక్షణకు తెర.. సెంచరీతో చేలరేగిన శుబ్‌మన్ గిల్ -
'నా క్రికెట్ కెరీర్ ముగిసి పోయిందని భావించాను.. పాకిస్తాన్ క్రికెట్‌కు ధన్యవాదాలు'
పాకిస్తాన్ టెస్టు ఓపెనర్ ఆబిద్ అలీ గతేడాది జరిగిన క్వాయిడ్-ఎ-అజం ట్రోఫీలో తీవ్రమైన గుండె పోటుకు గురైన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో అతడికి యాంజియో ప్లాస్టీ నిర్వహించి రెండు స్టంట్లను వైద్యులు అమర్చారు. అయితే అతడు ప్రస్తుతం పూర్తిగా కోలుకున్నాడు. తాజాగా పాకిస్తాన్ క్రికెట్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆబిద్ అలీ భావోద్వేగానికి లోనయ్యాడు. తన ఆరోగ్యం బాగాలేనప్పుడు తనకు మద్దతుగా నిలిచిన పాకిస్థాన్ క్రికెట్ బోర్డు, చైర్మన్ రమీజ్ రాజా,ఎన్సీఎ వైద్యులకు అలీ కృతజ్ఞతలు తెలిపాడు. "గత 5-6 నెలలుగా నేను ఆరోగ్య పరంగా చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాను. ప్రస్తుతం నా ఆరోగ్యం చాలా బాగుంది. మళ్లీ ఈ స్థితికి వస్తానని అస్సలు నేను ఊహించలేదు. నా క్రికెట్ కెరీర్ ముగిసి పోయిందని భావించాను. సర్వశక్తిమంతుడైన అల్లాకు ధన్యవాదాలు. నేను మళ్లీ తిరిగి కోలుకోవడానికి సహాయపడిన పిసిబి, చైర్మన్ రమీజ్ రాజా,ఎన్‌సిఎ వైద్యులకు ధన్యవాదాలు. అదే విధంగా పునరావాస కేంద్రంలో నాకు మద్దతుగా నిలిచిన నా సహాచర ఆటగాళ్లకు కృతజ్ఞతలు" అని ఆబిద్ అలీ పేర్కొన్నాడు. చదవండి: Attack On Cricketer Mondli Khumalo: కోమా నుంచి కోలుకున్న దక్షిణాఫ్రికా యువ క్రికెటర్.. -
ఏ ముహుర్తానా పాక్ గడ్డపై అడుగుపెట్టిందో అన్ని విచిత్ర పరిస్థితులే; తాజాగా
ఆస్ట్రేలియా జట్టు ఏ ముహుర్తానా పాక్ గడ్డపై అడుగుపెట్టిందో కానీ.. అన్ని విచిత్ర పరిస్థితులే ఎదురవుతున్నాయి. 24 ఏళ్ల అనంతరం పాకిస్తాన్లో మూడు టెస్టులు, మూడు వన్డేలు, ఒక టి20 ఆడేందుకు ఆస్ట్రేలియా వచ్చింది. వచ్చీ రాగానే పెషావర్‌లో బాంబుల మోత.. తమను స్వాగతం పలికామా అన్నట్లుగా ఆస్ట్రేలియా జట్టును ఉలిక్కిపడేలా చేసింది. మసీదును లక్ష్యంగా చేసుకొని ఉగ్రవాదులు జరిపిన ఈ దాడిలో సుమారు 50 మంది మృతి చెందినట్లు తెలుస్తోంది. అప్పటికే పక్కనే ఉన్న రావల్పిండి సిటీలో పాకిస్తాన్, ఆస్ట్రేలియా మధ్య తొలి టెస్టు మ్యాచ్ మొదలైంది. సిరీస్ రద్దయ్యే అవకాశాలు ఉన్నట్లు అనుమానాలు వచ్చినప్పటికి.. పీసీబీ ఆసీస్ ఆటగాళ్ల భద్రత మాదేనని పేర్కొంది. అలా మొదటి టెస్టు పూర్తి కాగానే.. దేశంలో రాజకీయ సంక్షోభ దుమారం రేగింది. అధికారంలో ఉన్న ఇమ్రాన్‌ఖాన్ ప్రభుత్వం ఒక్కసారిగా సంక్షోభంలో పడింది. ఇమ్రాన్‌ఖాన్‌కు వ్యతిరేకంగా తమ పార్టీలు ఎంపీలు, మంత్రులు రాజీనామాలు చేస్తున్నారు. ప్రతిపక్షాలు తీసుకొచ్చిన అవిశ్వాస తీర్మానం కారణంగా ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వం ఇరకాటంలో పడింది. తాజాగా రాజకీయ సంక్షభం సెగ పాకిస్తాన్- ఆస్ట్రేలియా సిరీస్‌ను తాకింది. మూడు వన్డేల సిరీస్‌తో పాటు ఏకైక టి20 మ్యాచ్ మార్చి 29, 31, ఏప్రిల్ 2, 4 తేదీలలో రావల్పిండి వేదికగా జరగాల్సి ఉంది. అయితే రాజకీయ సంక్షోభం కారణంగా పాక్ రాజధాని ఇస్లామాబాద్‌తో పాటు పక్కనే ఉన్న రావల్పిండిలో అల్లర్లు తలెత్తే ప్రమాదం ఉంది. అందుకే ముందు జాగ్రత్త చర్యగా రావల్పిండి నుంచి లాహోర్‌కు మ్యాచ్ వేదికలను మారుస్తున్నట్లు దేశ విదేశాంగ మంత్రి షేక్ రషీద్ ఒక ప్రకటనలో వెల్లడించారు. లాహోర్ వేదికగా అవే తేదీల్లో మూడు వన్డేలు, ఒక టి20 మ్యాచ్ జరగనుందని ఆయన స్పష్టం చేశారు. కాగా ఇప్పటికే మూడో టెస్టు కోసం ఇరుజట్లు లాహోర్‌లోని గడాఫీ వేదికగా ఆడనున్నాయి. ఇక సిరీస్‌లో మిగిలిన మ్యాచ్‌లు కూడా అక్కడే ఆడనున్నట్లు పీసీబీ తెలిపింది. ఈ విషయాన్ని ఇప్పటికే క్రికెట్ ఆస్ట్రేలియాకు తెలిపామని.. వారు తమ క్రికెటర్ల క్షేమ సమాచారాలు మాత్రమే అడిగారని.. సిరీస్ ముగిశాక జాగ్రత్తగా పంపించాలని కోరారని షేక్ రషీద్ తెలిపారు. చదవండి: 'ఇప్పుడు కాదు రోహిత్.. ఆస్ట్రేలియాపై గెలిచి చూపించు' Glenn Maxwell Marriage: గర్ల్‌ఫ్రెండ్‌ను పెళ్లాడిన ఆసీస్ విధ్వంసకర ఆటగాడు -
‘అమరరాజా’ ఉల్లంఘనలపై వచ్చే విచారణలో ఉత్తర్వులు
సాక్షి, అమరావతి: అమరరాజా బ్యాటరీస్‌పై వచ్చిన పర్యావరణ నిబంధనల ఉల్లంఘనల ఆరోపణలపై వచ్చే విచారణ సమయంలో తగిన ఉత్తర్వులు జారీ చేస్తామని హైకోర్టు మంగళవారం స్పష్టం చేసింది. తదుపరి విచారణ నాటికి ఆ సంస్థ ఉద్యోగుల రక్తనమూనాల పరీక్షల నివేదికను, కౌంటర్‌ను తమ ముందుంచాలని కాలుష్య నియంత్రణ మండలి (పీసీబీ)ని ఆదేశించింది. తదుపరి విచారణను ఫిబ్రవరి 3కి వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ అసనుద్దీన్ అమానుల్లా, జస్టిస్ బి.శ్రీ భానుమతిలతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. పర్యావరణ నిబంధనలు పాటించకపోవడంతో అమరరాజా బ్యాటరీస్ మూసివేతకు పీసీబీ గతేడాది ఏప్రిల్ 30న ఉత్తర్వులిచ్చింది. వీటిని సవాల్ చేస్తూ ఆ సంస్థ హైకోర్టును ఆశ్రయించింది. విచారణ జరిపిన హైకోర్టు మూసివేత ఉత్తర్వుల అమలును నిలిపేస్తూ మధ్యంతర ఉత్తర్వులిచ్చిన విషయం తెలిసిందే. తాజాగా ఈ వ్యాజ్యంపై ధర్మాసనం మంగళవారం మరోసారి విచారణ జరిపింది. పీసీబీ తరఫు న్యాయవాది వి.సురేందర్‌రెడ్డి స్పందిస్తూ.. అమరరాజా ఉద్యోగుల రక్త నమూనాలపై ఐఐటీ–మద్రాస్ బృందం పరీక్ష చేయాల్సి ఉందన్నారు. అయితే కోవిడ్ కారణంగా అది సాధ్యం కాలేదని చెప్పారు. దీంతో ప్రైవేటు ల్యాబ్‌లో పరీక్షలు చేయించాల్సి వచ్చిందని తెలిపారు. ధర్మాసనం స్పందిస్తూ.. ‘గత విచారణ సమయంలో నివేదిక ఇస్తామని చెప్పారు. అన్ని వివరాలతో కౌంటర్ వేస్తామన్నారు. ఇంతవరకు వేయలేదు’ అని వ్యాఖ్యానించింది. తనకు కోవిడ్ సోకడంతో హోం ఐసోలేషన్‌లో ఉన్నానని, అందువల్ల నివేదిక తెప్పించుకోవడంలో జాప్యం జరిగిందని సురేందర్‌రెడ్డి విన్నవించారు. అనంతరం అమరరాజా తరఫు సీనియర్ న్యాయవాది బి.ఆదినారాయణరావు వాదనలు వినిపిస్తూ.. ఒక్క ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పర్యవేక్షణలో తప్ప ప్రపంచంలో ఏ సంస్థ ద్వారానైనా పరీక్షలకు సిద్ధమన్నారు. ఏపీ ప్రభుత్వం తమ పట్ల కక్షపూరితంగా వ్యవహరిస్తోందన్నారు. ఇరుపక్షాల వాదనలు విన్న ధర్మాసనం వచ్చే విచారణలో కేసు పూర్వాపరాల ఆధారంగా ఉత్తర్వులు జారీ చేస్తామంది. -
అదే జరిగితే, యావత్ పాకిస్థాన్ మీకు స్వాగతం పలుకుతుంది.. మహ్మద్ రిజ్వాన్
Australia Tour Of Pakistan 2022: 24 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత ఈ ఏడాది మార్చ్-ఏప్రిల్ నెలల్లో పాకిస్థాన్‌లో పర్యటించేందుకు క్రికెట్ ఆస్ట్రేలియా ఒప్పుకుంది. పర్యటనలో భాగంగా ఆసీస్-పాక్ జట్ల మధ్య మూడు టెస్ట్‌లు, మూడు వన్డేలు, ఓ టీ20 మ్యాచ్ జరగనున్నాయి. అయితే, ఇటీవల న్యూజిలాండ్, ఇంగ్లండ్ జట్లు భద్రతా కారణాలను సాకుగా చూపి పాక్ పర్యటనకు డుమ్మా కొట్టిన నేపథ్యంలో ఈ పర్యటనకు ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ పర్యటనపై పాక్ మాజీలు, అభిమానులు హర్షం వ్యక్తం చేస్తుండగా.. ఆ జట్టు స్టార్ ఆటగాడు, వికెట్ కీపర్ మహ్మద్ రిజ్వాన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. చాలాకాలం తర్వాత ప్రపంచ మేటి జట్టు తమ దేశంలో పర్యటిస్తున్నందుకు చాలా ఆనందంగా ఉందన్నాడు. ఇటీవల కాలంలో కొన్ని జట్లు నిరాధారమైన కారణాల చేత తమతో క్రికెట్ ఆడేందుకు వెనకడుగు వేశాయని, ఇది తమను, తమ అభిమానులు తీవ్రంగా కలచి వేసిందని, అంతే కాకుండా తమ దేశ క్రికెట్ బోర్డును భారీగా నష్టాల పాలు చేసిందని వాపోయాడు. ఫైనల్‌గా ఆసీస్ జట్టు తమ దేశంలో పర్యటించేందుకు ఒప్పుకోవడం శుభపరిణామమని, ఈ పర్యటన కార్యరూపం దాల్చితే, యావత్ పాక్ ఆసీస్ జట్టుకు స్వాగతం పలుకుతుందని, ఈ సిరీస్ కోసం తామెంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నామని చెప్పుకొచ్చాడు. పాక్ ఆటగాళ్లు షాదాబ్ ఖాన్, ఫకర్ జమాన్, హరీస్ రౌఫ్, మహ్మద్ హస్నైన్‌లు బిగ్‌బాష్ లీగ్‌లో ఆడుతూ.. ఆసీస్ ఆటగాడు ఉస్మాన్ ఖ్వాజా పాకిస్థాన్ సూపర్ లీగ్‌లో ఆడుతూ ఇరు దేశాల మధ్య బంధాన్ని మరింత బలపరుస్తున్నారని పేర్కొన్నాడు. ఈ బంధం బలపడేందుకు పాక్ బ్యాటింగ్ కన్సల్టెంట్ మాథ్యూ హేడెన్ తన వంతు సహకారాన్ని అందించాడని గుర్తు చేశాడు. చదవండి: IPL 2022: ముంబై ఇండియన్స్‌తో తెగదెంపులు.. ఇకపై..! -
మోస్ట్ వాల్యూబుల్ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్‌గా మహ్మద్ రిజ్వాన్ ..
2021 ఏడాదికి గాను పాకిస్తాన్ క్రికెట్ బోర్డు వార్షిక అవార్డులను ప్రకటించింది. 2021లో పాకిస్తాన్ అద్భుతమైన విజయాలు సాధించింది. టీ20 ప్రపంచకప్-2021లో చిరకాల ప్రత్యర్థి భారత్‌పై 10 వికెట్ల తేడాతో చారిత్రాత్మక విజయాన్ని నమోదు చేసిన సంగతి తెలిసిందే. ప్రపంచకప్ ఈవెంట్లలో భారత్‌పై పాకిస్తాన్ గెలవడం ఇదే తొలిసారి. అంతేకాకుండా టీ20ల్లో ఒకే క్యాలెండర్ ఇయర్లో అత్యధిక విజయాలు(20) నమోదు చేసిన జట్టుగా పాక్ నిలిచింది. పాక్ విజయాల్లో ఓపెనర్లు మహ్మద్ రిజ్వాన్, కెప్టెన్ బాబర్ ఆజం కీలక పాత్రపోషిస్తున్నారు. వీరితో పాటు హసన్ అలీ, షాహీన్ షా ఆఫ్రిది బౌలింగ్ అద్భుతంగా రాణిస్తున్నారు. ఈ క్రమంలో పాక్ ఓపెనర్ మహ్మద్ రిజ్వాన్ మోస్ట్ వాల్యూబుల్ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ అవార్డును అందుకున్నాడు. గత ఏడాది టీ20ల్లో రిజ్వాన్ 1,326 పరుగులు సాధించాడు. ఇక హసన్ అలీ టెస్ట్ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ అవార్డును గెలుచుకోగా,కెప్టెన్ బాబర్ అజామ్ వన్డే క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ అవార్డును కైవసం చేసుకున్నాడు. అదే విధంగా పాక్ యువ బౌలర్ మహ్మద్ వసీం జూనియర్ ఎమర్జింగ్ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్‌ను అందుకున్నాడు. చదవండి: టాప్-5లోకి సౌతాఫ్రికా ... టీమిండియా ఎన్నో స్థానంలో ఉందంటే! -
ఇకపై పవర్ హిట్టింగ్ బ్యాటింగ్ కోచ్ కూడా...
పాకిస్తాన్ పవర్ హిట్టింగ్ బ్యాటింగ్ కోచ్ పదవి కోసం పాకిస్తాన్ క్రికెట్ బోర్డు దరఖాస్తులను ఆహ్వానించింది. అదే విధంగా లహోర్‌లోని హై పెర్ఫార్మెన్స్ సెంటర్లో వివిధ కోచ్ పదవిల కోసం కూడా పీసీబీ దరఖాస్తులను ఆహ్వానించింది. కాగా ఇప్పటివరకు పవర్ హిట్టింగ్ బ్యాటింగ్ కోచ్ ఏ జట్టుకు లేరు. అయితే ఆధునిక క్రికెట్‌కు అనుగుణంగా తమ ఆటగాళ్లను సన్నద్దం చేయడానికే పవర్ హిట్టింగ్ బ్యాటింగ్ కోచ్‌ను నియమిస్తున్నట్లు పీసీబీ ఛైర్మన్ రమీజ్ రాజా తెలిపారు. ఇక హై ఫార్మమన్స్ కోచ్ పదవికు గల అర్హతలను పీసీబీ ప్రకటించింది."గత 10 సంవత్సరాలలో కనీసం ఐదేళ్ల పని అనుభవం కలిగి ఉండాలి. అంతేకాకుండా జాతీయ లేదా అంతర్జాతీయ జట్లకు లైఫ్ కోచ్‌గా పని చేసి ఉండాలి. మిగితా నాలుగు కోచ్‌లకు గత10 సంవత్సరాలలో కనీసం ఐదేళ్ల మూడవ స్థాయి క్రికెట్ కోచింగ్ అక్రిడిటేషన్‌లో పని చేసి వుంటే చాలు" అని పీసీబీ పేర్కొంది. చదవండి: IND Vs SA ODI Series: టీమిండియా వన్డే కెప్టెన్‌గా కేఎల్ రాహుల్ -
వెస్టిండీస్‌తో సిరీస్‌కు జట్టును ప్రకటించిన పాక్.. స్టార్ ఆటగాడికి నోఛాన్స్
Pakistan name squads for home series against West Indies: వెస్టిండీస్‌తో స్వదేశంలో జరిగే టీ20, వన్డే సిరీస్‌లకు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు(పీసీబీ) తమ జట్టును గురువారం ప్రకటించింది. టీ20 సిరీస్‌కు 15 మందితో కూడిన జట్టును ఎంపిక చేయగా, వన్డే సిరీస్ 17 మందితో కూడిన జట్టును వెల్లడించారు. ఈ సిరీస్‌కు హసన్ అలీ, ఇమాద్ వసీం, సర్ఫరాజ్ అహ్మద్, షోయబ్ మాలిక్‌కు విశ్రాంతి ఇచ్చారు. కాగా ఈ జట్టులో ఫాస్ట్ బౌలర్ మహ్మద్ హస్నైన్కు చోటు దక్కింది. ఈ పర్యటనలో భాగంగా వెస్టిండీస్, పాకిస్తాన్‌తో మూడు టీ20లు, మూడు వన్డేలు ఆడనుంది. కాగా తొలి టీ20 డిసెంబర్ 13న కరాచీ వేదికగా జరగనుంది. పాకిస్తాన్ టీ20 జట్టు: బాబర్ అజాం (కెప్టెన్), షాదాబ్ ఖాన్ (వైస్ కెప్టెన్), ఆసిఫ్ అలీ, ఫఖర్ జమాన్, హైదర్ అలీ, హరీస్ రవూఫ్, ఇఫ్తీకర్ అహ్మద్, ఖుష్దిల్ షా, మహ్మద్ హస్నైన్, మహ్మద్ నవాజ్, మహ్మద్ రిజ్వాన్ (వికెట్ కీపర్), మహ్మద్ వసీం, షానవాజ్ దహానీ, ఉస్మాన్ ఖాదిర్ పాకిస్తాన్ వన్డే జట్టు: బాబర్ ఆజం (కెప్టెన్), షాదాబ్ ఖాన్ (వైస్ కెప్టెన్), ఆసిఫ్ అలీ, ఫఖర్ జమాన్, హైదర్ అలీ, హరీస్ రవూఫ్, ఇఫ్తీకర్ అహ్మద్, ఇమామ్-ఉల్-హక్, ఖుష్దిల్ షా, మహ్మద్ నవాజ్, మహ్మద్ రిజ్వాన్ (డబ్ల్యుకె), మహ్మద్ వసీం జూనియర్, మహ్మద్ హస్నైన్, సౌద్ షకీల్, షాహీన్ ఆఫ్రిది, షానవాజ్ దహానీ, ఉస్మాన్ ఖాదిర్ చదవండి: IND VS NZ: అతడు టీమిండియా ఓపెనర్‌గా రావాలి... -
టెస్టులకు గుడ్‌బై చెప్పిన పాక్ క్రికెటర్
Usman Shinwari Announces Retirement From Test Cricket.. పాకిస్తాన్ క్రికెటర్ ఉస్మాన్ షిన్వరీ టెస్టు క్రికెట్‌కు గుడ్‌బై చెప్పాడు. ఈ విషయాన్ని షిన్వరీ ట్విటర్ ద్వారా ప్రకటించాడు. '' ఇటీవలే వెన్నునొప్పి నుంచి కోలుకున్నా. వేగంగా కోలుకోవడంలో సహాయపడిన స్పోర్ట్స్ ఫిజియో అహ్మదుల్లాకు కృతజ్క్షతలు. ఫిజియో, డాక్టర్లు సూచన మేరకు టెస్టు క్రికెట్‌కు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నా. సుధీర్ఘంగా బౌలింగ్ చేస్తే గాయాలు మళ్లీ తిరగబెట్టే అవకాశాలున్యాయని వైద్యులు హెచ్చరించారు. అందుకే టెస్టులకు గుడ్‌బై చెప్పాలని నిర్ణయించుకున్నా. ఇక వన్డేలు, టి20లపై పూర్తిస్థాయిలో దృష్టి పెడుతానంటూ'' చెప్పుకొచ్చాడు 27 ఏళ్ల షిన్వరీ పాకిస్తాన్ జట్టు తరపున 17 వన్డేల్లో 34 వికెట్లు, 16 టి20ల్లో 13 వికెట్లు తీశాడు. ఇక తన కెరీర్లో ఒకే ఒక టెస్టు ఆడిన షిన్వరీ 2013లో అంతర్జాతీయ క్రికెట్లో అరంగేట్రం చేశాడు. ఇక 33 ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌ల్లో 96 వికెట్లు తీసిన షిన్వరీ రెండుసార్లు ఐదు వికెట్ల ఘనతను అందుకున్నాడు. 2019 డిసెంబర్లో ఆఖరిసారిగా పాక్ జట్టు తరపున ఆడాడు. -
అమరరాజా బ్యాటరీస్ యాజమాన్యంపై హైకోర్టు సీరియస్
సాక్షి, అమరావతి: ప్రజల ప్రాణాలకు హాని కలిగించే చర్యలను తాము ఎంత మాత్రం సహించబోమని, డబ్బు కంటే ప్రజల ఆరోగ్యమే ముఖ్యమని హైకోర్టు స్పష్టం చేసింది. చిత్తూరు జిల్లాలోని అమరరాజా బ్యాటరీస్‌లో పర్యావరణ కాలుష్యంపై న్యాయస్థానం మరోసారి తీవ్రంగా స్పందించింది. కాసుల కోసం ప్రజల ప్రాణాలతో ఆడుకుంటారా? అంటూ యాజమాన్యాన్ని నిలదీసింది. ఈ వ్యవహారాన్ని తాము తీవ్రంగా పరిగణిస్తున్నామని తేల్చి చెప్పింది. కార్మికుల రక్త నమూనాల్లో సీసం ఆనవాళ్లు ఉన్నాయంటే పరిస్థితి ఎంత ఘోరంగా ఉందో అర్థమవుతోందని ఘాటుగా వ్యాఖ్యానించింది. అమరరాజా బ్యాటరీస్‌లో పనిచేసే ఉద్యోగుల ఆరోగ్య పరిస్థితులపై నివేదిక ఇవ్వాలని కాలుష్య నియంత్రణ మండలి (పీసీబీ)ని ఆదేశించింది. తదుపరి విచారణను నవంబర్ 9కి వాయిదా వేసింది. అమరరాజా బ్యాటరీస్ మూసివేతకు పీసీబీ జారీ చేసిన ఉత్తర్వుల అమలును నిలిపేస్తూ గతంలో తామిచ్చిన మధ్యంతర ఉత్తర్వులను హైకోర్టు మరోసారి పొడిగించింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ అసనుద్దీన్ అమానుల్లా, జస్టిస్ కృష్ణమోహన్‌లతో కూడిన ధర్మాసనం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. పర్యావరణ నిబంధనలు పాటించకపోవడంతో అమరరాజా బ్యాటరీస్ మూసివేతకు పీసీబీ ఈ ఏడాది ఏప్రిల్ 30న ఉత్తర్వులిచ్చింది. ఈ ఉత్తర్వులను సవాలు చేస్తూ అమరరాజా బ్యాటరీస్ హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. ఈ వ్యాజ్యాలపై తాజాగా జస్టిస్ అమానుల్లా నేతృత్వంలోని ధర్మాసనం గురువారం మరోసారి విచారణ జరిపింది. ఈ సందర్భంగా ధర్మాసనం, గతంలో అమరరాజా ఉద్యోగులు, కార్మికుల ఆరోగ్య స్థితిపై పీసీబీ సమర్పించిన నివేదికలను పరిశీలించింది. ఆ నివేదికల్లో కార్మికులు, ఉద్యోగుల రక్త నమూనాల్లో సీసం ఉన్నట్లు తేలడంతో తీవ్రంగా స్పందించింది. ఇదిలాఉంటే ఇదే కేసులో, తమ సంస్థలో ఎలాంటి అధ్యయనం చేయకుండా పీసీబీని నియంత్రించాలని కోరుతూ అమరరాజా బ్యాటరీస్ ఓ అనుబంధ పిటిషన్ దాఖలు చేసింది. -
పాకిస్తాన్ టి20 జట్టులో మూడు మార్పులు.. ఆ ముగ్గురికి చోటు
3 Players Added In Pakistan T20 Worldcup Team.. టి20 ప్రపంచకప్ 2021 ప్రారంభానికి ముందు పాకిస్తాన్ తన జట్టులో మూడు మార్పులు చేసింది. టాప్ ఆర్డర్ బ్యాటర్ ఫఖర్ జమాన్, వికెట్ కీపర్ సర్ఫరాజ్ అహ్మద్, మిడిలార్డర్ బ్యాటర్ హైదర్ అలీ జట్టులోకి వచ్చారు. కాగా ముందు ప్రకటించిన జట్టులో సర్ఫరాజ్‌తో హైదర్ అలీకి చోటు లేదు. అజమ్ ఖాన్, మహ్మద్ హస్నైన్ల స్థానంలో వీరిద్దరు చోటు దక్కించుకోగా.. ఇక ట్రావెల్ రిజర్వ్ ప్లేయర్‌గా ఉన్న ఫఖర్ జమాన్‌ను కుష్దిల్ షా స్థానంలో జట్టులోకి ఎంపిక చేశారు. తాజాగా జరిగిన నేషనల్ టి20 కప్‌లో ప్రదర్శన ఆధారంగా ఈ ముగ్గురిని తుది జట్టులోకి తీసుకున్నట్లు చీఫ్ సెలెక్టర్ ముహముద్ వసీమ్ పేర్కొన్నారు. ''ఈ ముగ్గురు నేషనల్ టి20 కప్‌లో ఆకట్టుకున్నారు. వాళ్ల అనుభవం ప్రస్తుతం జట్టుకు ఎంతో అవసరం. వీరు చేరడం వల్ల జట్టుకు మరింత బలం చేకూరుతుంది. ఇక అజమ్ ఖాన్, కుష్దిల్ షా, హస్నైన్లకు భవిష్యత్తులో మంచి అవకాశాలు వస్తాయి.'' అంటూ చెప్పుకొచ్చాడు. కాగా అక్టోబర్ 17 నుంచి నవంబర్ 14 వరకు జరగనున్న టి20 ప్రపంచకప్ టోర్నీలో పాకిస్తాన్ తన తొలి మ్యాచ్‌ను టీమిండియాతో అక్టోబర్ 24న ఆడనుంది. టి20 ప్రపంచకప్ పాకిస్తాన్ 15మందితో కూడిన జట్టు బాబర్ అజమ్ (కెప్టెన్), షాదాబ్ ఖాన్ (వైస్ కెప్టెన్), ఆసిఫ్ అలీ, ఫఖర్ జమాన్, హైదర్ అలీ, హారిస్ రౌఫ్, హసన్ అలీ, ఇమాద్ వసీం, మహ్మద్ హఫీజ్, మహ్మద్ నవాజ్, మహ్మద్ రిజ్వాన్, మొహమ్మద్ వసీం జూనియర్, సర్ఫరాజ్ అహ్మద్, షహీన్ షా అఫ్రిది, సోహైబ్ మక్సూద్ రిజర్వ్ ఆటగాళ్లు- కుష్దిల్ షా, షానవాజ్ దహాని, ఉస్మాన్ ఖాదిర్ -
పాకిస్తాన్‌కు ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు క్షమాపణలు
ECB Chief issues apology To Pakistan: భద్రతా సమస్యల కారణంగా న్యూజిలాండ్, ఇంగ్లండ్ జట్లు పాకిస్తాన్ పర్యటనను రద్దు చేసుకున్న సంగతి తెలిసిందే. ఆటగాళ్ల మానసిక, శారీరక క్షేమం ముఖ్యమని ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు పాక్ పర్యటను రద్దు చేసుకుంది. ఈ అయితే పాక్ పర్యటనను ఇంగ్లండ్ రద్దు చేసుకోవడంపై ఆ జట్టు క్రికెట్ బోర్డుపై పాకిస్తాన్ మాజీ ఆటగాళ్లు తీవ్ర స్థాయిలో ద్వజం ఎత్తారు. ఈ క్రమంలో స్పందించిన ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు ఛీప్ ఇయాన్ వాట్మోర్ క్షమాపణలు తెలిపారు. కాగా వచ్చే ఏడాది తమ జట్టు పాకిస్తాన్లో పర్యటిస్తుందని ఆయన మాటిచ్చారు. "ముఖ్యంగా మా నిర్ణయంతో పాకిస్తాన్ బాధపడినందకు నేను చింతిస్తున్నాను. బోర్డు తీసుకున్న నిర్ణయం చాలా క్లిష్టమైనది. మా ఆటగాళ్లు, సిబ్బంది సంక్షేమం, మానసిక ఆరోగ్యం గురించి ఆలోచించి బోర్డు ఈ నిర్ణయం తీసుకుంది. వచ్చే ఏడాది పాకిస్తాన్ పర్యటన కోసం ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు ఎదురుచూస్తోంది ”అని వాట్మోర్ డైలీ మెయిల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో భాగంగా చెప్పారు. అయితే ఈసీబీ ఛీప్ తీసుకున్న నిర్ణయాన్ని పాకిస్తాన్ సమాచార ప్రసార మంత్రి ఫవాద్ చౌదరి ముక్తకంఠంతో స్వాగతించారు. "వచ్చే ఏడాది పాకిస్తాన్ పర్యటనకు ఇంగ్లండ్ రాబోతుందని ప్రకటించడం చాలా సంతోషకరం. పాకిస్థాన్ క్రికెట్‌కు మద్దతుగా నిలిచిన ప్రపంచంలోని మాజీ క్రికెటర్లకు, మీడియా, క్రికెట్ అభిమానులకు నేను కృతజ్ఞతలు తెలుపుతున్నా''. అని ఆయన ట్వీట్ చేశారు చదవండి: కోహ్లిపై బీసీసీఐకి ఫిర్యాదు చేసింది ఆ ముగ్గురేనా..? -
పాకిస్తాన్ క్రికెట్ బోర్డు కీలక నిర్ణయం..
No More Neutral Venues For Us Says PCB: పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) కీలక నిర్ణయం తీసుకుంది. పాకిస్తాన్ అతిధ్యం ఇచ్చే హోమ్ సిరీస్‌లను తటస్థ వేదికలలో ఇప్పటినుంచి నిర్హహించబోమని ఆ దేశ క్రికెట్ బోర్డు సృష్టం చేసింది. అంతర్జాతీయ మ్యాచ్‌లు నిర్వహించడానికి తమ దేశం చాలా సురక్షితం అని పీసీబీ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. 2005 తర్వాత మొదటిసారి పాక్ పర్యటనకు వచ్చిన న్యూజిలాండ్ భద్రతా కారణాల దృష్ట్యా ఒక్క మ్యాచ్ కూడా ఆడకుండా సీరిస్ రద్దు చేసుకున్న సంగతి తెలిసిందే. ఆదే విధంగా ఇంగ్లండ్ జట్టు కూడా న్యూజిలాండ్ బాటలోనే పయనించింది. పాక్‌తో సీరీస్‌ను రద్దు చేసుకున్నట్లు ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు ప్రకటించింది. కాగా 2009లో శ్రీలంక జట్టు బస్సుపై జరిగిన ఉగ్రదాడి తర్వాత అన్ని దేశాల క్రికెట్ జట్లు పాకిస్తాన్లో పర్యటించడనికి విముఖత చూపాయి. దీంతో పాక్‌తో జరగాల్సిన సీరీస్‌లను తటస్థ వేదికగా యూఏఈలో పీసీబీ నిర్వహించేది. చదవండి: T20 World Cup 2021: శ్రీలంక క్రికెట్ బోర్డు కీలక నిర్ణయం -
అమరరాజాపై కక్ష సాధింపుల్లేవు
తిరుపతి మంగళం: అమరరాజా ఫ్యాక్టరీలపై ఎలాంటి కక్ష సాధింపుల్లేవని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి స్పష్టం చేశారు. తిరుపతిలో బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. అమరరాజా ఫ్యాక్టరీల ద్వారా వెలువడే కాలుష్యంతో ప్రజల ప్రాణాలకు, పర్యావరణానికి హాని కలుగుతోందని పొల్యూషన్ కంట్రోల్ బోర్డు (పీసీబీ), హైకోర్టు పలుమార్లు స్పష్టం చేశాయని గుర్తుచేశారు. అయినా ఫ్యాక్టరీల తీరులో మార్పు రాకపోవడంతో వాటిని మూసివేయాలని పీసీబీ ఆదేశాలు జారీ చేసిందన్నారు. అమరరాజా సంస్థల యాజమాన్యం హైకోర్టును ఆశ్రయించినా అదే తీర్పు ఇచ్చిందన్నారు. విశాఖలో విషవాయువు వెలువడుతున్న ఓ ఫ్యాక్టరీని మూసివేసినట్లు ఆయన గుర్తుచేశారు. రాష్ట్రంలోని 66 పరిశ్రమలకు నోటీసులిచ్చామని తెలిపారు. కొన్ని పత్రికలు, చానళ్లు మాత్రం కక్షసాధింపుతో అమరరాజా ఫ్యాక్టరీలు పక్కరాష్ట్రాలకు తరలిపోయేలా ప్రభుత్వం చేస్తోందని చెప్పడం దారుణమన్నారు. అందులో ఎంతమాత్రం వాస్తవం లేదన్నారు. టీడీపీ పోతూపోతూ రాష్ట్రాన్ని ఎంతగా నష్టాల్లోకి నెట్టేసిందో అందరికీ తెలుసన్నారు. అప్పులు చెల్లించాలని ఆర్బీఐ నుంచి హెచ్చరికలు వచ్చాయని పేర్కొన్నారు. కోవిడ్‌తో రాష్ట్రానికి ఆర్థికంగా ఎంతో నష్టం జరిగినప్పటికీ సంక్షేమ పథకాలు, అభివృద్ధి పనులు, ప్రాజెక్టులు ఏవీ ఆగకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని తెలిపారు. -
మైనింగ్ ఆధారిత పరిశ్రమలపై హేతుబద్ధ ఫీజులు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఖనిజాధారిత పరిశ్రమలపై శాస్త్రీయంగా హేతుబద్ధమైన ఫీజులు విధించాలని గనులు, పంచాయతీరాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కాలుష్య నియంత్రణ మండలి (పీసీబీ) అధికారులకు సూచించారు. విజయవాడలోని పీసీబీ కార్యాలయంలో మంగళవారం ఇంధన, అటవీ శాఖల మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డితో కలిసి కాలుష్యకారక పరిశ్రమలు, వాటి నియంత్రణ తదితర అంశాలపై పెద్దిరెడ్డి సమీక్ష జరిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రోత్సాహకరమైన వాతావరణంలోనే పరిశ్రమలు పనిచేసేందుకు సహకరించాలన్నారు. మైనింగ్ పరిశ్రమలకు అనుమతులు, నిర్వహణ సందర్భంగా విధిస్తున్న సీఎఫ్ఓ, సీఎఫ్ఈ ఫీజుల పెంపు హేతుబద్ధంగా ఉండాలన్నారు. కాలుష్య నియంత్రణ, పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యత ఇస్తూనే మైనింగ్ ఆధారిత పరిశ్రమలను ప్రోత్సహించాల్సిన అవసరం ఉందన్నారు. ఇతర రాష్ట్రాల్లో ఫీజులు ఎలా వసూలు చేస్తున్నారో పరిశీలించాలన్నారు. కాలుష్య నియంత్రణ మండలి ప్రతిపాదించిన ఫీజులు తమకు ఆర్థికంగా భారంగా మారుతున్నాయని మైనింగ్ పరిశ్రమల నిర్వాహకులు ఆందోళన వ్యక్తం చేశారని, దాన్ని కూడా పరిగణనలోకి తీసుకోవాలని చెప్పారు. దీనిపై సమగ్రంగా అధ్యయనం చేసేందుకు ఒక కమిటీని ఏర్పాటు చేసి నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. నివేదిక ఆధారంగా ప్రభుత్వం సరైన నిర్ణయం తీసుకుంటుందన్నారు. మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ.. కాలుష్య నియంత్రణలో దేశంలోనే మన రాష్ట్రం మొదటి స్థానంలో ఉండాలనే సీఎం ఆశయానికి అనుగుణంగా అధికారులు పనిచేయాలని కోరారు. ఘన, ద్రవరూప వ్యర్థాలను శాస్త్రీయంగా శుద్ధి చేయాలన్నారు. దీనికి అవసరమైన సహాయ సహకారాలను మునిసిపాలిటీలు, కార్పొరేషన్లు అందించాలని సూచించారు. కోవిడ్ నేపథ్యంలో ఆస్పత్రులు, ల్యాబ్‌ల నుంచి పెద్దఎత్తున వస్తున్న బయో మెడికల్ వ్యర్థాలను తగిన జాగ్రత్తలతో నాశనం చేయాలని ఆదేశించారు. పీసీబీ చైర్మన్ ఏకే ఫరీడా అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో పర్యావరణ, అటవీ, సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖ ముఖ్య కార్యదర్శి విజయ్‌కుమార్, ఇతర అధికారులు పాల్గొన్నారు. -
కెప్టెన్ చెప్పిన వాళ్లను ఎంపిక చేయరు.. మా పద్దతి అదే
కరాచీ: పాకిస్తాన్ క్రికెట్ జట్టు.. తాజాగా సౌతాఫ్రికా, జింబాబ్వే పర్యటనలకు వెళ్లివచ్చిన సంగతి తెలిసిందే. ఈ రెండు సిరీసుల్లో కూడా పాక్ కెప్టెన్ బాబర్ ఆజామ్ కోరుకున్నట్లుగా జట్టును ఎంపిక చేయలేదని ఆ జట్టు సీనియర్ ఆటగాడు షోయబ్ మాలిక్ పేర్కొన్నాడు. '' కెప్టెన్ బాబర్ అడిగిన చాలా మంది ఆటగాళ్లను ఇటీవలి దక్షిణాఫ్రికా, జింబాబ్వే సిరీసులకు తీసుకోలేదు. తమ వద్ద నచ్చడం.. నచ్చకపోవడం అనే పద్దతి ఉంది. సెలక్షన్ ప్రక్రియలో ఇతరుల అభిప్రాయాలకు విలువ ఉన్నా తుది నిర్ణయం తీసుకోవాల్సింది కెప్టెనే. ఇంకోవిషయం ఏంటంటే ఆటగాళ్ల ఎంపికలో పక్షపాత ధోరణి నడుస్తుంది. ఇది సరైనది కాదు.. పీఎస్ఎల్ ఆధారంగా ఆటగాళ్లను ఎంపిక చేయాలి. కనీసం రెండు సీజన్ల పాటు అందులో ఆడే ఆటగాళ్లను పరిశీలించి అప్పుడు జట్టులోకి తీసుకోవాలి. ఈ విషయాన్ని ఇలా బయటపెట్టడం వల్ల నాకే నష్టం జరిగినా పరవాలేదు. నన్ను మళ్లీ టీ20ల్లో ఆడనివ్వకపోయినా నేనేమి బాధపడను. నేను ఇప్పటివరకు ఎంతోమంది కెప్టెన్లతో ఆడాను. వకార్ యూనిస్, వసీమ్ అక్రమ్, ఇంజమామ్, అఫ్రిది లాంటి దిగ్గజాలతో ఆడాను. కెప్టెన్‌గా ఉండాలంటూ ఇతరులను కాకా పట్టడం చేయొద్దు. అలా చేయకుండా ఉంటే తప్పకుండా గొప్ప కెప్టెన్‌గా మిగిలిపోతారు.'' అంటూ చెప్పుకొచ్చాడు. చదవండి: 'విమర్శలు పట్టించుకోం.. మా పనేంటో మాకు తెలుసు' -
'చాలా థ్యాంక్స్.. మమ్మల్ని బాగా చూసుకున్నారు'
ఇస్లామాబాద్: పాకిస్తాన్ జట్టు జింబాబ్వే పర్యటనను విజయవంతంగా ముగించుకొని స్వదేశానికి తిరిగొచ్చింది. మూడు టీ20, రెండు టెస్టు మ్యాచ్‌ల సిరీస్ నిమిత్తం పాకిస్తాన్ జింబాబ్వే పర్యటనకు వెళ్లిన విషయం తెలిసిందే. టీ20 సిరీస్‌ను 2-1, టెస్టు సిరీస్‌ను 2-0 తేడాతో పాక్ కైవసం చేసుకుంది. డబుల్ సెంచరీ చేసిన ఆబిద్ అలీ ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ గా నిలవగా... 14 వికెట్లు పడగొట్టిన హసన్ అలీ ‘ప్లేయర్ ఆఫ్ ద సిరీస్’ గా నిలిచాడు. తాజాగా పాక్ జట్టు ప్రదర్శనపై ఆ జట్టు మేనేజర్ మన్సూర్ రాణా ప్రశంసలతో ముంచెత్తాడు. '' జింబాబ్వేను టెస్టు సిరీస్‌లో క్లీన్‌స్వీప్ చేయడం సూపర్ అని.. జట్టుగానే గాక ఆటగాళ్ల వ్యక్తిగత ప్రదర్శన నాకు సంతోషాన్ని కలిగించింది. బౌలర్ హసన్ అలీకి ఈ సిరీస్ చిరకాలం గుర్తుండిపోతుందనడంలో సందేహం లేదు. ఇక జింబాబ్వేలో మేం బస చేసిన హోటల్లో అన్ని సౌకర్యాలు బాగున్నాయి. వారు మమ్మల్ని బాగా చూసుకున్నారు. రంజాన్ మాసం దృష్టిలో ఉంచుకొని ఇఫ్తార్, సెహర్ సమయాల్లో రకరకాల డిషెస్‌ను వడ్డించారు. చాలా థ్యాంక్స్ జింబాబ్వే క్రికెట్ బోర్డ్'' అంటూ పేర్కొన్నాడు. ఇక ఈ సిరీస్‌లో పాక్ బౌలర్ హసన్ అలీ అద్బుత ప్రదర్శనతో అదరగొట్టాడు. రెండు మ్యాచ్‌లు కలిపి 8.93 యావరేజ్‌తో మొత్తం 14 వికెట్లు తీయగా.. ఇందులో ఒకే మ్యాచ్‌లో రెండు ఇన్నింగ్స్‌లోనూ ఐదు వికెట్ల ప్రదర్శన నమోదు చేయడం విశేషం. చదవండి: 'విమర్శలు పట్టించుకోం.. మా పనేంటో మాకు తెలుసు' నా తండ్రి ఆటను టీవీలో చూశా.. అప్పడే నిశ్చయించుకున్నా -
చెత్త ఫుడ్ అంటూ విమర్శలు.. క్లారిటీ ఇచ్చిన ఆటగాడు
కరాచీ: ఫిబ్రవరి 20న అట్టహాసంగా ప్రారంభమైన పాకిస్తాన్ సూపర్ లీగ్(పీఎస్ఎల్ 2021) గురువారం అర్థంతరంగా వాయిదా పడిన సంగతి తెలిసిందే. లీగ్‌లో భాగంగా ఏడుగురు ఆటగాళ్లతో పాటు సహాయ సిబ్బందిలో ఒకరికి కరోనా పాజిటివ్ అని తేలడంతో పీసీబీ లీగ్‌ను వాయదా వేయాలని నిర్ణయం తీసుకుంది. తాజాగా పీఎస్ఎల్ లీగ్‌పై మరో విషయం సోషల్ మీడియాలో వివాదాస్పదంగా మారింది. లీగ్‌లో పాల్గొంటున్న ఆటగాళ్లకు నాణ్యత లేని ఆహారాన్ని అందిస్తున్నారని.. ఎక్కడ పరిశుభ్రత పాటించడం లేదని.. అందుకే కరోనా కేసులు వెలుగు చూశాయంటూ ట్రోల్స్ చేశారు. దీనికి తోడూ ఇంగ్లండ్ ఆటగాడు అలెక్స్ హేల్స్ తన ట్విటర్లో పెట్టిన ఫోటోను ఒక వ్యక్తి రీట్వీట్ చేశాడు. ఆ ఫోటోలో రెండు ఎగ్స్, టోస్ట్ బ్రెడ్.. కనిపించాయి. హేల్స్ కూడా పీసీబీని ట్రోల్ చేస్తూ ఆ ఫోటో పెట్టాడంటూ సదరు వ్యక్తి కామెంట్స్ చేశారు. అయితే ఇది చూసిన హేల్స్.. చెత్త ఫుడ్ అంటూ విమర్శలు చేసినవారికి క్లారిటీ ఇస్తున్నట్లుగా తన కామెంట్స్‌లో తెలిపాడు. '' మీరు ఫోటోలో చూస్తున్నది నిజానికి మంచి క్వాలిటీతో ఉన్న ఆహారం. కాకపోతే వారిచ్చిన ఫుడ్ ఆర్డర్ ప్రకారం ఇవ్వలేదు.. ఇది కొంచెం ఫన్నీగా అనిపించింది.. అందుకే ఫోటోను షేర్ చేశా.. అంతేగాని ఫుడ్ క్వాలిటీని తప్పుబట్టాల్సిన అవసరం లేదు. పీఎస్ఎల్ నిర్వాహకులు మా అందరిని ఆహ్లదకర వాతావరణంలోనే ఉంచింది. అనవసరంగా ఇలాంటి తప్పుడు వార్తలు ప్రచారం చేయొద్దు.''అంటూ చెప్పుకొచ్చాడు. కాగా అలెక్స్ హేల్స్ పీఎస్ఎల్లో ఇస్లామాబాద్ యునైటెడ్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. చదవండి: పీఎస్ఎల్ 2021 వాయిదా.. వికెట్ తీయగానే జెర్సీ విప్పేసిన తాహిర్ It was one meal where the order was incorrect.. I found it funny, nothing more. The food and hospitality here has been excellent, hope this clears it up 👍🏼 — Alex Hales (@AlexHales1) March 4, 2021 -
'ఛీ.. స్కూల్ లెవల్ కన్నా దారుణం'
క్రైస్ట్‌చర్చి : పాకిస్తాన్ మాజీ బౌలర్ షోయబ్ అక్తర్ పీసీబీపై తనదైన శైలిలో ట్రోల్ చేశాడు. న్యూజిలాండ్‌తో జరుగుతున్న టెస్ట్ సిరీస్‌లో భాగంగా రెండో టెస్టులో పాక్ ఆటతీరును విమర్శిస్తూ పీసీబీని ఎండగట్టాడు. పాక్ ఆటతీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ తన ట్విటర్లో ఒక వీడియోనూ షేర్ చేశాడు. 'పాకిస్తాన్ ఆటతీరు స్కూల్ లెవెల్ కన్నా దారుణంగా ఉంది. పీసీబీ విధానాలు ఏంటో నాకు ఇప్పటికీ అర్థం కావడం లేదు. యావరేజ్‌గా ఆడే ఆటగాళ్లను టెస్టు జట్టుకు ఎంపిక చేయడం పీసీబీకే చెల్లింది. యావరేజ్ జట్టుగా ఉంది కాబట్టే ఫలితాలు కూడా యావరేజ్‌గానే వస్తాయి.. అయినా పాక్ జట్టు ఎప్పుడు టెస్టు మ్యాచ్ ఆడినా ఇలాంటి ఆటతీరునే ప్రదర్శిస్తుంది.వీరికన్నా క్లబ్ క్రికెట్ ఆడేవాళ్లు నయం. నిజానికి పాక్ ఆటతీరు స్కూల్ లెవెల్ క్రికెట్‌కు పడిపోవడానికి పీసీబీయే పరోక్షంగా కారణం.అయితే పీసీబీ ఇప్పుడు మేనేజ్మెంట్ను మార్చాలని చూస్తుంది. ఇది జరిగితే మంచిదే.. కానీ ఎప్పుడు మేనేజ్మెంట్ను మారుస్తుందనేది ఒక ప్రశ్నగా మిగిలిపోయిందంటూ 'అక్తర్ అసంతృప్తి వ్యక్తం చేశాడు. (చదవండి: పాపం టీ20 తరహాలో ఆడాడు.. ట్విస్ట్ ఏంటంటే) కాగా రెండో టెస్టులో కివీస్ బౌలర్ ఖైల్ జేమిసన్ దాటికి పాక్ జట్టు 297 పరుగులకే ఆలౌట్ అయింది. రిజ్వాన్ 61 పరుగులతో రాణించడం మినహా మిగతావారు పూర్తిగా విఫలమయ్యారు. అనంతరం మొదటి ఇన్నింగ్స్‌లో కివీస్ భారీ స్కోరు నమోదు చేసింది. కేన్ విలియమ్సన్ డబుల్ సెంచరీతో అదరగొట్టడంతో తన మొదటి ఇన్నింగ్స్‌ను 659 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది. విలియమ్సన్కు తోడుగా హెన్రీ నికోలస్ 157 పరుగులు, డారెల్ మిచెల్ 102 పరుగులతో విజృంభించారు. అనంతరం రెండో ఇన్నింగ్స్‌ను ఆరంభించిన పాక్ ఒక వికెట్ నష్టానికి 8 పరుగులు చేసి మూడోరోజు ఆటను ముగించింది. పాక్ ఆటతీరు చూస్తుంటే ఇన్నింగ్స్ పరాజయం దిశగా కొనసాగుతున్నట్లు కనిపిస్తుంది.(చదవండి: 'ఆ మ్యాచ్ ఆడేందుకు త్యాగాలకు కూడా సిద్ధం') Clubs teams would play better than this. pic.twitter.com/r9m4ekqbeq — Shoaib Akhtar (@shoaib100mph) January 5, 2021 -
ఆమిర్‌కు ఇచ్చిన విలువ నాకెందుకు ఇవ్వలేదు
కరాచీ : పాకిస్తాన్ పేసర్ మొహమ్మద్ ఆమిర్ అంతర్జాతీయ క్రికెట్‌కు గురువారం రిటైర్మెంట్ ప్రకటించిన సంగతి తెలిసిందే. పాక్ క్రికెట్ బోర్డు (పీసీబీ) పెట్టే మానసిక క్షోభ భరించలేకే క్రికెట్ నుంచి తప్పుకుంటున్నట్లు వీడియో సందేశంలో పేర్కొన్నాడు. ఆమిర్ రిటైర్మెంట్ నిర్ణయం తర్వాత షోయబ్ అక్తర్ సహా పలువురు మాజీ క్రికెటర్లు అతనికి మద్దతుగా నిలిచారు. అయితే పాక్ మాజీ స్పిన్నర్ దానిష్ కనేరియా ఆమిర్‌కు వస్తున్న మద్దతును తప్పుబడుతూ ట్విటర్లో కామెంట్ చేశాడు.(చదవండి : మెంటల్ టార్చర్.. అందుకే ఇలా) 'పీసీబీ మెంటల్ టార్చర్ భరించలేక రిటైర్మెంట్ ప్రకటిస్తున్నట్లు ఆమిర్ ప్రకటించాడు. అది ఆమిర్ వ్యక్తిగత నిర్ణయం.. అతని నిర్ణయాన్ని నేను తప్పుబట్టను. స్పాట్ ఫిక్సింగ్ తర్వాత దోషిగా తేలిన ఆమిర్ మళ్లీ పాక్‌కు క్రికెట్ ఆడాడు. అయితే పీసీబీ అదే ధోరణిలో అతను చూడడంతో ఇప్పుడు ఆటకు గుడ్‌బై చెప్పాడు. కానీ ఆమిర్ విషయంలో పీసీబీని తప్పుబడుతూ పలువురు మాజీ, స్టార్ క్రికెటర్లు మద్దతు పలికారు. గతంలో ఇదే పీసీబీ విషయంలో నాకు న్యాయం జరగాలని వారికి విజ్ఞప్తి చేశాను.. అప్పుడు నేను మతం కార్డును ఉపయోగించానన్న కారణంతో ఏ ఒక్క క్రికెటర్ మద్దతుగా నిలవలేదు. ఆమిర్‌కు ఇచ్చిన విలువలో కనీసం సగం ఇచ్చినా బాగుండు అనిపించిందంటూ' ట్వీట్ చేశాడు.(చదవండి : ఆ రికార్డుకు 51 ఏళ్లు పట్టింది) 2000వ సంవత్సరంలో అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టిన దానిష్ కనేరియా పాక్ తరపున అత్యుత్తమ స్పిన్నర్లలో ఒకడిగా నిలిచాడు. కనేరియా పాక్ తరపున 61 టెస్టుల్లో 261 వికెట్లు.. 18 వన్డేల్లో 15 వికెట్లు తీశాడు. 2012లో ఇంగ్లీష్ కౌంటీ క్రికెట్ ఆడుతుండగా.. దానిష్ కనేరియా మ్యాచ్ ఫిక్సింగ్‌కు పాల్పడ్డాడని ఇంగ్లండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు (ఈసీబీ) అతడిపై జీవితకాల నిషేధం విధించింది. ఈసీబీ చర్యను సమర్థిస్తూ పీసీబీ కూడా కనేరియాపై నిషేధం విధించింది. దీంతో కనేరియా అప్పటినుంచీ ఎలాంటి క్రికెట్ ఆడడం లేదు. 2018లో ఓ టీవీ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ స్పాట్ ఫిక్సింగ్ చేసినట్లు అంగీకరించాడు. అయినా పీసీబీ తనపై కనికరం చూపడం లేదంటూ చాలాసార్లు తన ఆవేదన వ్యక్తం చేశాడు. తాను హిందువు అయినందున పాక్ బోర్డు తన విషయంలో జోక్యం చేసుకోవట్లేదని బాహాటంగానే ఆరోపించాడు. ఈ విషయం అప్పుట్లో పెద్ద దుమారం రేపింది. కనేరియా వ్యాఖ్యలపై అప్పట్లో కొందరు పాక్ క్రికెటర్లు తప్పుబడుతూ విమర్శించారు. -
నిబంధనలు పాటిస్తూ ఇసుక డ్రెడ్జింగ్
సాక్షి, అమరావతి: ఇసుక అక్రమ తవ్వకాలు జరగకుండా పటిష్ట నిఘా వ్యవస్థను ఏర్పాటు చేసి నిబంధనల ప్రకారం నదులు, రిజర్వాయర్లలో డ్రెడ్జింగ్ చేసుకోవచ్చని జాతీయ హరిత ట్రిబ్యునల్ (ఎన్జీటీ) తాజాగా రాష్ట్ర ప్రభుత్వానికి సూచించింది. ఇసుక డ్రెడ్జింగ్ /తవ్వకాలకు ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలి (పీసీబీ) అనుమతి తప్పనిసరి నిబంధనను మినహాయిస్తూ గత సర్కారు 2016లో జారీ చేసిన మైనర్ మినరల్ కన్సెషన్ రూల్స్ సవరణ (ఇసుక పాలసీ) ఉత్తర్వులను కొందరు ఎన్జీటీలో సవాల్ చేయడం తెలిసిందే. దీనివల్ల పర్యావరణం దెబ్బ తింటుందని, ఇష్టారాజ్యంగా నదులు, రిజర్వాయర్లు, కాలువల్లో ఇసుక తోడేయడం వల్ల భూగర్భ జలమట్టం పడిపోయి కరువు ఏర్పడిందని పేర్కొన్నారు. అడ్డగోలుగా ఇసుక తవ్వకాల వల్ల పర్యావరణ సమతుల్యం దెబ్బ తింటుందన్నారు. ఈ మినహాయింపులు సుప్రీంకోర్టు ఉత్తర్వులకు విరుద్ధమని, తక్షణమే దీనిపై స్టే విధించి పర్యావరణ పరిరక్షణకు సహకరించాలని పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన తిరుమలశెట్టి శ్రీనివాస్, దేవినేని రాజశేఖర్ ఎన్జీటీలో సవాల్ చేశారు. ప్రకాశం బ్యారేజిలో అడ్డగోలుగా ఇసుక తవ్వకాలు సాగిస్తూ పర్యావరణానికి తూట్లు పొడుస్తున్నారంటూ అనుమోల్ గాంధీ కూడా ఎన్జీటీని ఆశ్రయించారు. ఈ పిటిషన్ విషయంలో ఎన్జీటీ 2018లో నాటి ప్రభుత్వానికి కొన్ని అంశాలపై ఆదేశాలు జారీ చేసింది. ప్రభుత్వం రూ.100 కోట్లు డిపాజిట్ చేయాలని, దీన్ని ఇసుక అక్రమ తవ్వకందారుల నుంచి వసూలు చేయాలని అప్పట్లో ఆదేశించింది. నిబంధనలకు విరుద్ధంగా డ్రెడ్జింగ్ జరుగుతున్నట్లు రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి, కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి సమర్పించిన ఉమ్మడి తనిఖీ నివేదిక ఆధారంగా ఎన్జీటీ ఈ ఆదేశాలు జారీ చేసింది. గణాంకాలతో ఎన్జీటీకి ప్రభుత్వం నివేదిక.. పూడిక వల్ల రిజర్వాయర్ల నిల్వ సామర్థ్యం తగ్గిపోతోందని, కాలువలు, నదుల్లో పూడిక (ఇసుక)ను నిర్దిష్ట పరిమాణంలో తొలగించకుంటే వర్షాల సమయంలో వరదల ముప్పు ఎక్కువగా ఉంటుందని రాష్ట్ర ప్రభుత్వం గణాంకాలతో శాస్త్రీయ నివేదిక సమర్పించింది. నిబంధనలకు లోబడి ఇసుక తవ్వకాల వల్ల పర్యావరణానికి నష్టం ఉండదని వివరించింది. ఈ అంశాలను పరిగణలోకి తీసుకున్న ఎన్జీటీ కొన్ని నిబంధనలు పాటిస్తూ ఇసుక డ్రెడ్జింగ్ చేసుకునేందుకు అనుమతించింది. అనుమతించిన దానికంటే అధిక పరిమాణంలో ఇసుక తవ్వినా, నిబంధనలను ఉల్లంఘించినా కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. దీంతో ప్రకాశం, ధవళేశ్వరం బ్యారేజీల్లో ఇసుక డ్రెడ్జింగ్‌కు అవరోధం తొలగిందని అధికారులు పేర్కొంటున్నారు. ఎన్జీటీ తీర్పులో కీలక అంశాలివీ.. – ఇసుక డీసిల్టింగ్/ డ్రెడ్జింగ్/ మైనింగ్ నిర్వహించే ప్రాంతాల్లో శాస్త్రీయ పర్యవేక్షణ నిమిత్తం సీసీటీవీలను ఏర్పాటు చేయాలి. దీనివల్ల అక్రమ తవ్వకాలు, రవాణాను కట్టడి చేయడం సులభమవుతుంది. – శాస్త్రీయ సర్వే నిర్వహించి నిర్ణీత పరిమాణంలో మాత్రమే ఇసుక డ్రెడ్జింగ్ నిర్వహించాలి. నిబంధనలను ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి. (ఇప్పటికే ఇసుక అక్రమ తవ్వకాలు, రవాణా నిరోధానికి కఠిన నిబంధనలతో ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులు బాగున్నాయి. ఇవి పక్కాగా అమలు చేస్తే చాలు) – డ్రెడ్జింగ్/ డీసిల్టింగ్‌కు అనుమతుల కోసం ప్రతి జిల్లాలో శాశ్వతంగా నిపుణులతో కమిటీని ఏర్పాటు చేయాలి. -
ఒక బ్యాడ్ గేమ్‌తో కెప్టెన్సీ తీసేస్తారా?
కరాచీ: పాకిస్తాన్ టెస్టు జట్టుకు కొత్త కెప్టెన్‌గా బాబర్ అజామ్‌ను నియమించేందుకు రంగం సిద్ధమైంది. గతేడాది మే నెలలో పాకిస్తాన్ టెస్టు కెప్టెన్‌గా నియమించబడ్డ అజహర్ అలీ స్థానంలో అజామ్‌ను కెప్టెన్‌గా చేయాలని పీసీబీ భావిస్తోంది. ఇప్పటికే పరిమిత ఓవర్ల జట్లకు కెప్టెన్‌గా ఉన్న అజామ్‌నే టెస్టులకు కూడా సారథిగా నియమించడమే సరైనదిగా పాక్ బోర్డు యోచిస్తోంది.ఇటీవల ఇంగ్లండ్‌తో జరిగిన మూడు టెస్టుల సిరీస్‌ను పాకిస్తాన్ కోల్పోవడంతో అజహర్ అలీకి ఉద్వాసన పలికారు. తొలి టెస్టులో అజహర్ అలీ ఫీల్డింగ్ తప్పిదం కారణంగానే ఆ మ్యాచ్ పోయిందని పీసీబీకి అందిన రిపోర్ట్. దాంతో టెస్టు కెప్టెన్ పదవిని అజహర్ అలీ కోల్పోయాడు. దీనిపై పాకిస్తాన్ మాజీ పేసర్ షోయబ్ అక్తర్ మండిపడ్డాడు. ఇది చాలా అన్యాయమని అక్తర్ విమర్శించాడు. ఒక బ్యాడ్ గేమ్‌తో కెప్టెన్సీని మార్చేస్తారా అంటూ పీసీబీ నిర్ణయాన్ని తప్పుబట్టాడు. ‘ ఇంగ్లండ్‌తో జరిగిన తొలి టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో అజహర్ అలీ తప్పుచేశాడు.. దాన్ని అంగీకరిస్తాను. ఆ ఫీల్డింగ్ చర్యతో అతను తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నాడు. కానీ ఆ తప్పు కారణంగా అతన్ని కెప్టెన్‌గా తీసేయడం అన్యాయం. కేవలం ఒక మ్యాచ్ కారణంగా అజహర్‌ను కెప్టెన్సీ నుంచి తప్పిస్తారా?, నేనే కచ్చితంగా చెప్పగలను.. రాబోవు మ్యాచ్‌ల్లో అజహర్ వంద శాతం ప్రదర్శన ఇవ్వగలడు. ఈ తరహా చర్యలు ఆటగాళ్ల ఆటపై ప్రభావం చూపుతాయి’ అని తన యూట్యూబ్ చానల్ అక్తర్ పేర్కొన్నాడు. ఇప్పటివరకూ తొమ్మిది టెస్టులకు కెప్టెన్‌గా చేసిన అజహర్ అలీ.. రెండు మ్యాచ్‌లను గెలిచి, నాలుగు మ్యాచ్‌లను కోల్పోయాడు. -
మిస్బాకు ఉద్వాసన.. రేసులో అక్తర్?
కరాచీ: పాకిస్తాన్ క్రికెట్ బోర్డు(పీసీబీ)లో రెండు పదవుల్లో కొనసాగుతున్న మాజీ క్రికెటర్ మిస్బావుల్ హక్కు చీఫ్ సెలక్టర్ పదవికి ఉద్వానస పలకడానికి దాదాపు రంగం సిద్ధమైంది. పాకిస్తాన్ క్రికెట్ జట్టుకు అటు ప్రధాన కోచ్‌గా, ఇటు చీఫ్ సెలక్టర్‌గా కొనసాగుతున్న మిస్బావుల్‌కు రెండు పదవులు అనవసరం అని ఆలోచనలో పీసీబీ ఉంది. పాకిస్తాన్ జట్టు ఆశించిన స్థాయిలో విజయాలు సాధించకపోవడంతో చీఫ్ సెలక్టర్ పదవి నుంచి తప్పించి హెడ్ కోచ్‌గా మాత్రమే కొనసాగించాలని పీసీబీ చూస్తోంది. ఈ మేరకు ఇప్పటికే రంగం సిద్ధం కాగా, పాకిస్తాన్ చీఫ్ సెలక్టర్ రేసులోకి షోయబ్ అక్తర్ వచ్చేశాడు. ఈ మేరకు పాకిస్తాన్ క్రికెట్ బోర్డుతో చర్చలు జరిగిన విషయాన్ని అక్తర్ ధృవీకరించాడు. కాకపోతే తనకు ఏ పదవి ఇస్తారో వేచి చూడాలన్నాడు. (చదవండి: ఆసీస్‌కు అంతుచిక్కని బ్యాట్స్‌మన్) ‘పీసీబీతో చర్చలు జరిగిన మాట వాస్తవమే. నేను పీసీబీలో కీలక పాత్ర పోషించడానికి బోర్డుతో సంప్రదింపులు జరిపా. పీసీబీ ఆహ్వానం మేరకు చర్చలకు వెళ్లా. ఇంకా ఏమీ నిర్ణయం కాలేదు. నేను ప్రస్తుతం చాలా మంచి జీవితాన్నే గడుపుతున్నా. నేను నా క్రికెట్ కాలంలో ఆడా. ఇప్పుడు సెటిల్ అయిపోయా. ఇక పీసీబీకి సేవలందించడానికి సిద్ధంగా ఉన్నా. నేను ఇతరులకు సలహా ఇవ్వడానికి భయపడను. నాకు అవకాశం వస్తే పాకిస్తాన్ క్రికెట్‌ను ప్రక్షాళన చేస్తా’ అని క్రికెట్ బాజ్ నిర్వహించిన యూట్యూబ్ కార్యక్రమంలో అక్తర్ తన మనసులోని మాటను వెల్లడించాడు. (చదవండి: సెరెనాకు ఊహించని షాక్) తమ మధ్య జరిగిన చర్చల్లో అటు బోర్డు కానీ, ఇటు తాను కానీ ఎటువంటి గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదన్నాడు. ఇంకా చర్చల దశలోనే ఉన్నందను త్వరలోనే స్పష్టత వచ్చే అవకాశం ఉందన్నాడు. క్రికెట్లో దూకుడైన మైండ్ సెట్‌తో కొత్త తరం క్రికెట్లో ఉండాలని అక్తర్ అభిప్రాయపడ్డాడు. ఇక్కడ సక్సెస్, ఫెయిల్యూర్ అనేది పక్కన పెట్టి దూకుడైన క్రికెట్‌ను ఆడాల్సి అవసరం ఉందన్నాడు. పాకిస్తాన్‌కు గత క్రికెట్ వైభవం తీసుకురావాలంటే తమ క్రికెటర్ల మైండ్ సెట్ మారాలన్నాడు. పాకిస్తాన్ దిగ్గజ క్రికెటర్లు జావేద్ మియాందాద్, వసీం అక్రమ్, ముస్తాక్ అహ్మద్ వంటి క్రికెటర్లు ఇలా దూకుడైన స్వభావంతోనే పాక్‌కు ఘనమైన విజయాలను అందించారన్నాడు. -
చెప్పాల్సింది గంగూలీ కాదు: పీసీబీ
ఇస్లామాబాద్: ఆసియా కప్ 2020 రద్దయ్యింది అంటూ బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ చేసిన వ్యాఖ్యలపై పాకిస్తాన్ క్రికెట్ బోర్డు మీడియా డైరెక్టర్ శామ్యూల్ హసన్ బర్నీ స్పందించారు. ఆ మాటలకు ఎలాంటి విలువ లేదంటూ కొట్టి పారేశారు. ఆసియా కప్ రద్దు విషయాన్ని ధృవీకరించాల్సింది ఆసియన్ క్రికెట్ కౌన్సిల్ ( ఏసీసీ) అని తెలిపారు. ‘ఇలాంటి ప్రకటనలు కేవలం ఏసీసీ ప్రెసిడెంట్ మాత్రమే చేయాలి. గంగూలీ వ్యాఖ్యాలు మ్యాచ్ షెడ్యూల్‌కు సంబంధించిన ప్రొసిడింగ్స్ మీద ఎలాంటి ప్రభావాన్ని చూపలేవు. గంగూల్ ప్రతి వారం ఏదో ఒకటి ప్రకటిస్తూ ఉంటారు, ఆయన మాటలకు విలువ లేదు అని అన్నారు. దీనికి సంబంధించి ఏసీసీ ప్రెసిడెంట్ నజ్నూల్ హసన్ మాత్రమే ప్రకటన చేయాలి. మాకు తెలిసినంత వరకు ఏసీసీ సమావేశం షెడ్యూల్ ఇంకా ప్రకటించబడలేదు’ అని పేర్కొన్నారు. (ఆసియాకప్ 2020 వాయిదా : గంగూలీ) ప్రముఖ ఇంగ్లీష్ ఛానెల్‌తో జరిగిన ఇన్స్టాగ్రామ్ లైవ్ సెషన్లో గంగూలీ ఆసియా కప్ 2020 రద్దైనట్లు పేర్కొన్నారు. కరోనా పరిస్థితుల మధ్య ఎప్పుడు మ్యాచ్‌లు జరుగుతాయో చెప్పలేమని గంగూలీ పేర్కొన్నారు. ప్రభుత్వ నిబంధనలకు అణుగుణంగా ముందుకు వెళతామని, ఆటగాళ్ల ఆరోగ్యమే ముఖ్యమని గంగూలీ పేర్కొన్నారు. షెడ్యూల్ ప్రకారం ఆసియాకప్‌ను పాకిస్తాన్ నిర్వహించాల్సి ఉంది. కానీ బీసీసీఐ భద్రతా విషయాలకు సంబంధించి అభ్యంతరం తెలపడంతో మ్యాచ్ జరగాల్సిన వేదికను దుబాయ్‌కు మార్చారు. సెప్టెంబరులో ఈ టోర్ని జరగాల్సి ఉండగా గురువారం (జూలై 9న) ఆసియా క్రికెట్ మండలి సమావేశం జరగనుంది. అయితే దీనికి ముందే ఈ టోర్నీ రద్దైనట్లు గంగూలీ చెప్పడం చర్చనీయాంశం అయ్యింది. . (ఐపీఎల్ లేకుండా 2020 ముగిసిపోవద్దు) -
యూనిస్ జోక్ చేస్తే.. సీరియస్ వ్యాఖ్యలా?
మాంచెస్టర్: తన పీకపై పాకిస్తాన్ మాజీ క్రికెటర్, ప్రస్తుత బ్యాటింగ్ కోచ్ యూనిస్ ఖాన్ కత్తి పెట్టి బెదిరించాడంటూ మాజీ బ్యాటింగ్ కోచ్ గ్రాంట్ ఫ్లవర్ చేసిన వ్యాఖ్యలు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు(పీసీబీ)లో కలకలం రేపాయి. తాను బ్యాటింగ్ కోచ్‌గా ఉన్న సమయంలో యూనిస్ ఖాన్ కత్తితో బెదిరింపులకు దిగాడంటూ ఫ్లవర్ చేసిన కామెంట్స్‌ను పీసీబీతో పాటు పాక్ టీమ్ మేనేజ్మెంట్ కూడా ఖండించింది. ‘ గ్రాంట్ ఫ్లవర్ చేసిన వ్యాఖ్యలు ఎంతమాత్రం వాస్తవం కాదు. యూనిస్ ఖాన్ ఏదో సరదాగా కూరగాయాలు తరిగే కత్తి తీసుకుని గ్రాంట్ ఫ్లవర్‌ను ఆట పట్టించాడు. (రాంచీలో ధోని ఏదో చేశాడు.. లేకపోతే ఎలా?) బ్రేక్ ఫాస్ట్ టేబుల్ దగ్గర సలహాలు ఎందుకు అని యూనిస్ అలా చేసి ఉండవచ్చు. అంతేకానీ కావాలని బెదిరింపులకు దిగలేదు’ అని పీసీబీ వర్గాలు స్పష్టం చేశాయి. మరొకవైపు పాక్ జట్టుతో పని చేసిన కోచ్‌లు కానీ, సపోర్టింగ్ స్టాఫ్ కానీ ఒకసారి తమ కాంట్రాక్ట్‌లు ముగిసిపోయిన తర్వాత గోప్యంగా ఉంచాల్సిన సమాచారాన్ని ఇలా బహిర్గతం చేయడాన్ని పీసీబీ తప్పుబట్టింది. ఇది వారికి తగదంటూ హితవు పలికింది. ఒక జట్టుకు కోచ్‌గా పని చేసి వెళ్లిపోయినప్పుడు ఎందుకు కొన్ని అంశాల్ని తెరపైకి తీసుకొస్తున్నారో అర్థం కావడం లేదని పీసీబీలో ఒక సీనియర్ అధికారి వ్యాఖ్యానించారు. పాకిస్తాన్ మాజీ కెప్టెన్‌కు యూనిస్ ఖాన్‌కు సలహా ఇవ్వబోతే తన పీకపై కత్తి పెట్టాడని గ్రాంట్ ఫ్లవర్ తీవ్ర వ్యాఖ్యలు చేశాడు. పాక్ జట్టు తరఫున బ్యాటింగ్ కోచ్‌గా ఉండగా ఆసీస్ పర్యటనలో ఇది జరిగిందన్నాడు. బ్యాటింగ్‌లో సలహా ఇస్తుండగా ఏకంగా పీకపై కత్తి పెట్టాశాడని, ఇది నచ్చకే ఇలా చేసి ఉండవచ్చన్నాడు. ఈ ఘటనతో తాను షాక్‌కు గురైనట్లు ఫ్లవర్ తెలిపాడు. ప్రధాన కోచ్ మికీ ఆర్థర్ కలగజేసుకుని సముదాయించడన్నాడు. ఇది 2016 ఆస్ట్రేలియా పర్యటనలో జరిగిన విషయాన్ని ఫ్లవర్ తెలిపాడు. ప్రస్తుతం పాకిస్తాన్ క్రికెట్ జట్టు ఇంగ్లండ్ పర్యటనలో ఉంది. ఆగస్టు నెలలో ఇరు జట్ల మధ్య మూడు టెస్టుల సిరీస్‌తోపాటు మూడు టీ20ల సిరీస్ జరుగనుంది. దీనికి పాక్ బ్యాటింగ్ కోచ్‌గా చేయడానికి యూనిస్ ఖాన్ గతనెల్లో పీసీబీతో ఒప్పందం చేసుకున్నాడు.(యూనిస్ నా పీకపై కత్తి పెట్టాడు: ఫ్లవర్) -
కాలుష్య పరిశ్రమలపై చర్యలేవి?
సాక్షి, హైదరాబాద్: విశాఖలో ఎల్జీ పాలిమర్స్ పరిశ్రమ నుంచి గ్యాస్ లీకేజీ ఘటన నేపథ్యంలో అలాంటివి పునరావృతం కాకుండా తెలంగాణ ప్రభుత్వం కూడా కట్టుదిట్ట చర్యలు చేపట్టాలని హైకోర్టు ఆదేశించింది. హైదరాబాద్ నగర శివారు జీడిమెట్లలో పారిశ్రామిక కాలుష్య కట్డడికి కాలుష్య నియంత్రణ మండలి (పీసీబీ) చేపట్టిన చర్యలపై హైకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. భూగర్భ జలాలు కలుషితం అవుతుంటే పీసీబీ చర్యలు ఆశాజనకంగా లేవని పేర్కొంది. పరిశ్రమల నుంచి కాలుష్యం వెదజల్లుతుంటే గత నాలుగేళ్లల్లో 45 కేసులు మాత్రమే నమోదవడం పీసీబీ పనితీరును తెలియజేస్తోందని వ్యాఖ్యానించింది. జీడిమెట్లలో భూగర్భ జలాలు కలుషితంపై పత్రికల్లో వచ్చిన కథనాన్ని హైకోర్టు సుమోటోగా ప్రజాహిత వ్యాజ్యంగా పరిగణించింది. దీనిపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రాఘవేంద్రసింగ్ చౌహాన్, న్యాయమూర్తి జస్టిస్ బి.విజయసేన్‌రెడ్డిల ధర్మాసనం బుధవారం మరోసారి విచారించింది. 799 ఫార్మా కంపెనీలు ఉంటే వాటిలో 708కే అనుమతి ఉందని ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది సంజీవ్‌కుమార్ చెప్పారు. 24 కంపెనీలకు నోటీసులు, 2 కంపెనీలను మూసివేయాలని, అలాగే పలు కంపెనీలపై 23 ఎఫ్ఐఆర్లను నమోదు చేసినట్లు ఆయన తెలిపారు. దీనిపై హైకోర్టు స్పందిస్తూ గత ఆరు నెలల్లోనే ఇన్ని కేసులు నమోదయ్యాయంటే కోర్టులో కేసు దాఖలైన తర్వాతే పీసీబీ చర్యలు తీసుకుంటున్నట్లు స్పష్టం అవుతోందని తప్పుబట్టింది. శివారుల్లోని 220 బల్క్ డ్రగ్స్ యూనిట్స్‌లో చేసిన తనిఖీల నివేదికలను ఎందుకు వివరించలేదని ప్రశ్నిస్తూ తదుపరి విచారణను 26కి వాయిదా వేసింది. -
అక్తర్ వివాదం.. మాకు సంబంధం లేదు!
కరాచీ: పాకిస్తాన్ క్రికెట్ మాజీ బౌలర్ షోయబ్ అక్తర్‌పై తఫాజ్జుల్ రిజ్వి దాఖలు చేసిన పరువు నష్టం కేసులో తమకేటి సంబంధం అంటుంది పీసీబీ. పీసీబీ లీగల్ అడ్వైజర్‌గా పని చేస్తున్న తఫాజ్జుల్ రిజ్వి పిటిషన్లో తమ పాత్ర ఏమీ లేదని డొంక తిరుగుడు మాటలు మాట్లాడుతోంది. ఒక వివాదంలో అక్తర్‌పై పరువు నష్టం దావా కేసు వేయగా, దాన్ని ఫెడరల్ ఇన్విస్టిగేషన్ ఏజెన్సీ(ఎఫ్ఐఏ) విచారించనుంది. ఈ క్రమంలోనే అక్తర్‌కు ఇప్పటికే సమన్లు పంపిన ఎఫ్ఐఏ.. ఈరోజు విచారణ చేపట్టనుంది. తొలుత అక్తర్ స్టేట్మెంట్ను రికార్డు చేసి తర్వాత ఎఫ్ఐఆర్ నమోదు చేయాలా.. వద్దా అనే అంశాన్ని పరిశీలిస్తామని ఇప్పటికే ఒక ఎఫ్ఐఏ అధికారి చెప్పగా, ఇప్పుడు పీసీబీ మాత్రం ఆ అంశంలో తమకు సంబంధం లేదని అంటోంది. గత నెల్లో అక్తర్ వ్యాఖ్యలు చేసినప్పుడు సీరియస్‌గా స్పందించిన పీసీబీ.. ఇప్పుడు మాత్రం ఆ వివాదంలోకి తమను లాగొద్దని తెలిపింది. పీసీబీ అధికారి ప్రతినిధి ఒకరు మాట్లాడుతూ.. ‘ రిజ్వీ ఫిర్యాదుపైనే అక్తర్‌కు సమన్లు జారీ అయ్యాయి. ఈ విషయంలో బోర్డుకు సంబంధం లేదు. అక్తర్‌పై రిజ్వి వ్యక్తిగత ఫిర్యాదులో భాగంగానే పరువు నష్టం దావా వేశాడు. అంతే కానీ అక్తర్‌పై మేము ఎటువంటి కేసు వేయలేదు’ అని తెలిపారు. (‘అందులో ఐపీఎల్ కంటే పీఎస్ఎల్ భేష్’) ఇక అక్తర్ మాట్లాడుతూ.. ‘నేను ఎఫ్ఐఏ నుంచి ఒక నోటీసును అందుకున్నా. అది చాలా అస్పష్టంగా ఉంది. వారు నాకు పంపిన నోటీసు గందరగోళానికి గురి చేసేలా అస్పష్టంగా ఉంది. నా లాయర్ సల్మాన్ నియాజీతో మాట్లాడిన తర్వాత తదుపరి కార్యాచరణ ఏమిటనేది చెబుతా’ అని అక్తర్ తెలిపాడు. కాగా, తనపై అసభ్య పదజాలం వాడటమే కాకుండా న్యాయపరమైన అంశాల్లో అక్తర్ తలదూర్చిందుకు గాను అతనిపై పరువు నష్టం దావా వేశాడు రిజ్వి. ఈ క్రమంలోనే 100 మిలియన్ల పాకిస్తాన్ కరెన్సీ చెల్లించాలంటూ అందులో పేర్కొన్నాడు. అవినీతి ఆరోపణల్లో భాగంగా పాకిస్తాన్ వెటరన్ క్రికెటర్ ఉమర్ అక్మల్‌పై మూడేళ్లు నిషేధం విధించిన సందర్భంలో పీసీబీ లీగల్ డిపార్ట్‌మెంట్‌పై అక్తర్ అసంబద్ధ వ్యాఖ్యలు చేశాడు. తన యూట్యూబ్ చానల్లో అక్మల్‌పై మూడేళ్ల నిషేధాన్ని తప్పుబట్టాడు. ఇది పీసీబీ లీగల్ అడ్వైజరీ అసమర్థవత వల్లే ఉమర్‌కు మూడేళ్ల శిక్ష పడిందంటూ వ్యాఖ్యానించాడు. అదే సమయంలో రిజ్విపై ఆరోపణలు చేశాడు. చాలా సున్నితమైన అంశాల్లో రిజ్వికి అనుభవం లేదంటూ విమర్శించాడు. పీసీబీ లీగల్ డిపార్ట్మెంట్ అనేది కుళ్లిన టెంక అంటూ విమర్శలు చేశాడు. పీసీబీ అండదండలు ఉన్న కారణంగానే రిజ్వి సుదీర్ఘ కాలం లీగల్ అడ్వైజర్‌గా కొనసాగుతున్నాడంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశాడు. ఈ విషయంలో పీసీబీ కూడా సీరియస్ అయ్యింది. న్యాయపరమైన అంశాల్లో అక్తర్ తలదూర్చడం మంచిది కాదంటూ హెచ్చరించింది. ఈ క్రమంలోనే అక్తర్‌పై రిజ్వి పరువు నష్టం కేసు వేశాడు. బోర్డు సాయంతోనే కేసు వేసినట్లు అందరికీ తెలుస్తున్నా, తమకేమీ సంబంధం లేదంటూ తప్పించుకునే పనిలో పడింది పీసీబీ.(విదేశాల్లో ఐపీఎల్-2020? బీసీసీఐ సమాలోచన) -
షోయబ్ అక్తర్‌కు సమన్లు
కరాచీ: పాకిస్తాన్ క్రికెట్ బోర్డు(పీసీబీ) లీగల్ అడ్వైజర్ తఫాజ్జుల్ రిజ్వి అసమర్థుడని సంచలన వ్యాఖ్యలు చేసిన ఆ దేశ మాజీ పేసర్ షోయబ్ అక్తర్‌కు ఫెడరల్ ఇన్విస్టిగేషన్ ఏజెన్సీ(ఎఫ్ఐఏ) సమన్లు జారీ చేసింది. రిజ్విపై అక్తర్ చేసిన వ్యాఖ్యలపై విచారణకు సిద్ధమైన ఎఫ్ఐఏ.. ముందుగా సమన్లు పంపింది. శుక్రవారం అక్తర్ స్టేట్మెంట్ను రికార్డు చేసిన తర్వాత విచారణను చేపట్టనున్నట్లు పేర్కొంది. ‘ ఇంకా అక్తర్‌పై ఎటువంటి కేసు నమోదు చేయలేదు. అతని యూట్యూబ్ చానల్లో రిజ్విని దూషించిన క్రమంలో ఫిర్యాదు అందింది. దాంతో అక్తర్‌కు సమన్లు జారీ చేశాం. అక్తర్‌పై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలా.. వద్దా అనేది స్టేట్మెంట్ను రికార్డు చేసుకున్నాక పరిశీలిస్తాం’అని ఒక అధికారి తెలిపారు.(బాల్కనీ నుంచి దూకేద్దామనుకున్నా: ఊతప్ప) తనపై అసభ్య పదజాలం వాడటమే కాకుండా న్యాయపరమైన అంశాల్లో అక్తర్ తలదూర్చిందుకు గాను అతనిపై పరువు నష్టం దావా వేశాడు రిజ్వి. ఈ క్రమంలోనే 100 మిలియన్లు పాకిస్తాన్ కరెన్సీ చెల్లించాలంటూ అందులో పేర్కొన్నాడు. అవినీతి ఆరోపణల్లో భాగంగా పాకిస్తాన్ వెటరన్ క్రికెటర్ ఉమర్ అక్మల్‌పై మూడేళ్లు నిషేధం విధించిన సందర్భంలో పీసీబీ లీగల్ డిపార్ట్‌మెంట్‌పై అక్తర్ అసంబద్ధ వ్యాఖ్యలు చేశాడు. తూ తన యూట్యూబ్ చానల్లో వీడియోను విడుదల చేశారు. ప్రధానంగా మూడేళ్ల నిషేధాన్ని తప్పుబట్టాడు. ఇది పీసీబీ లీగల్ అడ్వైజరీ అసమర్థవత వల్లే ఉమర్‌కు మూడేళ్ల శిక్ష పడిందంటూ వ్యాఖ్యానించాడు. అదే సమయంలో రిజ్విపై ఆరోపణలు చేశాడు. చాలా సున్నితమైన అంశాల్లో రిజ్వికి అనుభవం లేదంటూ విమర్శించాడు. పీసీబీ లీగల్ డిపార్ట్మెంట్ అనేది కుళ్లిన టెంక అంటూ విమర్శలు చేశాడు. పీసీబీ అండదండలు ఉన్న కారణంగానే రిజ్వి సుదీర్ఘ కాలం లీగల్ అడ్వైజర్‌గా కొనసాగుతున్నాడంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశాడు. దాంతో అక్తర్‌పై పరువు నష్టం కేసును రిజ్వి దాఖలు చేశాడు. (ముగ్గురు క్రికెటర్లపై ఫిక్సింగ్ ఆరోపణలు) -
కశ్మీర్‌కు నేనే కెప్టెన్‌గా ఉండాలి: అఫ్రిది
కశ్మీర్: పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్ (పీఓకే)పై పదే పదే వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ వస్తున్న పాకిస్తాన్ మాజీ ఆల్‌రౌండర్ షాహిద్ అఫ్రిది మరోసారి వక్రబుద్ధిని చూపెట్టాడు. కశ్మీర్ తమదేనని అర్థం వచ్చేలా మరింత అగ్గిరాజేశాడు. తొలుత భారత ప్రధాని నరేంద్ర మోదీపై అక్కసు వెళ్లగక్కిన అఫ్రిది.. కశ్మీర్ జట్టును పాకిస్తాన్ సూపర్ లీగ్(పీఎస్ఎల్)లో ఆడటానికి అనుమతి ఇవ్వాలంటూ ఆ దేశ క్రికెట్ బోర్డు(పీసీబీ)కి విజ్ఞప్తి చేశాడు. పీఎస్ఎల్లో కశ్మీర్ పేరిట ఒక ఫ్రాంచైజీ ఉండాలంటూ కొత్త రాగం అందుకున్నాడు. వచ్చే పీఎస్ఎల్ సీజన్ నాటికే కశ్మీర్ టీమ్ ఏర్పాటుకు కృషి చేయాలంటూ మరింత రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశాడు. మరో అడుగు ముందుకేసి తన చివరి పీఎస్ఎల్ సీజన్లో ఆ జట్టుకు తానే నాయకత్వం వహించాలన్నాడు (మోదీపై విషం కక్కిన అఫ్రిది: పెను దుమారం) ‘పీసీబీకి ఇదే నా విన్నపం. తదుపరి పీఎస్ఎల్లో కశ్మీర్ పేరిట ఒక ఫ్రాంచైజీని తయారు చేయండి. ఈ జట్టుకు నేనే సారథిగా వ్యహరించి పీఎస్ఎల్కు వీడ్కోలు చెబుతా. కశ్మీర్ జట్టుకు సారథిగా చేసే అవకాశాన్ని నేనే ఉపయోగించుకుంటా. కచ్చితంగా పీఎస్ఎల్లో కశ్మీర్ జట్టు ఉండాల్సిందే’ అంటూ ఒకవైపు విజ్ఞప్తి, మరొకవైపు డిమాండ్ అనే విధంగా అఫ్రిది సంచలన వ్యాఖ్యలు చేశాడు. అదే సమయంలో కశ్మీర్లకు ఒక స్టేడియం, ఒక అకాడమీని కూడా ఏర్పాటు చేయాలన్నాడు. దీనికి తాను కరాచీ నుండి వచ్చి సాయం చేస్తానంటూ ఎప్పుడూ లేని ప్రేమను కురిపించాడు. ఇక్కడ దాదాపు 125 క్రికెట్ క్లబ్‌లు ఉన్నట్లు విన్నానని, వీటి మధ్య టోర్నమెంట్లు నిర్వహించే దిశగా ఏర్పాట్లు కూడా చేయాలని పీసీబీకి కొత్త తలపోటును తెచ్చిపెట్టాడు. కశ్మీర్లో మ్యాచ్‌లు చూడటానికి సంతోషంగా ఇక్కడకి వస్తానని, నాణ్యమైన ఆటగాళ్లను గుర్తించి తనతో పాటు కరాచీకి తీసుకువెళ్తానన్నాడు. వారంతా తనతోపాటు ఉండవచ్చని, వారికి ప్రాక్టీస్‌తో పాటు ఎడ్యుకేషన్ కూడా తానే చూస్తానని భరోసా ఇస్తూ లేనిపోని ఆశలు కల్పించాడు అఫ్రిది. (ఈ బ్యాట్‌తో ఎక్కడ కొడతానో తెలుసా?) కశ్మీర్‌కు స్వయం ప్రతిపత్తి కల్పిస్తున్న ఆర్టికల్ 370 రద్దు చేస్తూ భారత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని గతంలో అఫ్రిది తీవ్రంగా తప్పుబట్టిన విషయం తెలిసిందే. తాజాగా మరోసారి అలాంటి వ్యాఖ్యలే చేసి భారతీయుల ఆగ్రహానికి గురయ్యాడు. లాక్డౌన్ నేపథ్యంలోనే ఇబ్బందులు ఎదుర్కొంటున్న పేదల ప్రజలకు తన ట్రస్ట్ ద్వారా సహాయం చేసేందుకు అఫ్రిది ఆదివారం పీఓకేలో పర్యటించాడు. ఈ సందర్భంగా నరేంద్ర మోదీపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. ‘పాకిస్తాన్ మొత్తం సైన్యం ఏడు లక్షలు మాత్రమే. భారత ప్రభుత్వం ఒక్క కశ్మీర్‌లోనే ఏడు లక్షలకుపైగా తన సైన్యాన్ని మోహరించందంటూ వ్యాఖ్యానించాడు.. అయినా కశ్మీరీ పౌరులకు పాక్ సైన్యానికే మద్దతు తెలుపుతున్నారు. ప్రపంచమంతా కరోనా వ్యాధిపై పెద్ద పోరాటమే చేస్తోంది. కానీ భారత ప్రధాని నరేంద్ర మోదీ మనస్సులో కరోనా కంటే ప్రమాదకరమైన వ్యాధి ఉందని విషం వెళ్లగక్కాడు. దీనిపై పెద్ద దుమారమే చెలరేగింది.ఇప్పటికే పలువురు భారత క్రికెటర్లు.. అఫ్రిది వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు. అఫ్రిది నీ స్థాయిని తెలుసుకుని మాట్లాడితే బాగుంటుందని బీజేపీ ఎంపీ, మాజీ క్రికెటర్ గౌతం గంభీర్ విమర్శించగా, భజ్జీ, యువరాజ్ సింగ్‌లు సైతం మండిపడ్డారు.తీవ్ర దుమారాన్ని రేపిన అఫ్రిది వ్యాఖ్యలపై భారత అభిమానులు కూడా తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తుతున్నారు. -
నా కెరీర్‌ను నాశనం చేశాడు..
కరాచీ: తన కెరీర్ నాశనం కావడానికి షాహిద్ అఫ్రిదినే కారణమని పాకిస్తాన్ మాజీ స్పిన్నర్ డానిష్ కనేరియా మరోసారి ధ్వజమెత్తాడు. అఫ్రిది కారణంగా తన కెరీర్ అర్థాంతరంగా ముగిసిపోయిందని విమర్శించాడు. ప్రత్యేకంగా పరిమిత ఓవర్ల క్రికెట్లో వన్డేలు ఎక్కువ ఆడకపోవడానికి అఫ్రిది తనపై ఉన్న చులకన భావనే కారణమన్నాడు. తనతో అఫ్రిది చాలా దారుణంగా వ్యహరించేవాడన్నాడు. ఇది దేశవాళీ క్రికెట్ నుంచి జరుగుతూ వస్తుందని, అక్కడ కూడా కెప్టెన్ అయిన అఫ్రిది.. తనను రిజర్వ్ బెంచ్‌లో కూర్చోబెట్టేవాడన్నాడు. అంతర్జాతీయ క్రికెట్లో కూడా వన్డేల్లో తనకు అవకాశాలు రాకుండా అడ్డుకున్నాడన్నాడు. తాను కేవలం 18 వన్డేలే ఆడటానికి కారణం అఫ్రిదినేనని అన్నాడు. ‘ ఎప్పుడూ మిగతా క్రికెటర్లరు అఫ్రిది సపోర్ట్ చేస్తూ ఉండేవాడు. నాకు మాత్రం అఫ్రిది ఎప్పుడూ సహకరించలేదు. నేను పాకిస్తాన్ తరఫున క్రికెట్ బానే ఆడినందుకు ఆ దేవుడికి ధన్యవాదాలు చెప్పుకోవాలి.(ధోని.. ఈరోజు నీది కాదు!) తాను ప్రపంచ గర్వించే స్థాయిలో ఎదగలేకపోయినా, ఆడినంతలో తృప్తిగానే ఉన్నానని కనేరియా తెలిపాడు. ‘ నన్ను జట్టులో రెగ్యులర్ సభ్యుడు కాకుండా అఫ్రిది ఎప్పుడూ అడ్డుకునేవాడు. నేను ఒక లెగ్ స్పిన్నర్‌ని. అతను కూడా లెగ్ స్పిన్నర్ కావడంతో నన్ను తొక్కేయాలని చూసేవాడు. పాకిస్తాన్ తరఫున ఒక స్టార్ క్రికెటర్ కావడంతో నన్ను చులకనగా చూసేవాడు. తుది జట్టులో ఇద్దరు స్పిన్నర్లు ఉండాల్సిన అవసరం లేదని ఎప్పుడూ చెబుతూ ఉండేవాడు. పరిమిత ఓవర్ల క్రికెట్లో నా ఫీల్డింగ్‌ను కూడా తొలిగించడానికి కారణంగా చూపేవాడు. అఫ్రిది ఒక సుప్రీమ్ ఫిట్ లీడర్ అయితే నా ఫీల్డింగ్‌ను ఎత్తిచూపాలి. పాకిస్తాన్ క్రికెట్లో ఎప్పుడూ ఒకరిద్దరు మించి ఫీల్డర్లు ఉండేవారు కాదు. ఫీల్డింగ్ పరంగా మేము మెరుగైన జట్టేమీ కాదు. కానీ ఏదొక సాకుతో నన్ను రిజర్వ్ బెంచ్‌లో ఉంచేవాడు’ అని కనేరియా ఆవేదన వ్యక్తం చేశాడు. పాకిస్తాన్ తరఫున 61 టెస్టులు ఆడిన కనేరియా 261 వికెట్లు సాధించాడు. ('ఆరోజు హర్భజన్‌ను కొట్టడానికి రూమ్‌కు వెళ్లా') -
సర్ఫరాజ్‌కు డిమోషన్..!
కరాచీ: పాకిస్తాన్ క్రికెట్లో ఒక వెలుగు వెలిగిన మాజీ కెప్టెన్ సర్ఫరాజ్ అహ్మద్ క్రమేపీ తన ఉనికిని కోల్పోతున్నాడు. గతేడాది నవంబర్‌లో అటు కెప్టెన్‌గా, ఇటు ఆటగాడిగా మూడు ఫార్మాట్ల నుంచి తొలగించబడ్డ సర్ఫరాజ్.. తాజాగా మరింత కిందకి పడిపోయినట్లు తెలుస్తోంది. 2020-21 సీజన్‌కు సంబంధించి పాకిస్తాన్ క్రికెట్ బోర్డు(పీసీబీ)కి విడుదల చేయడానికి సిద్ధంగా ఉ్నన కొత్త కాంట్రాక్ట్ జాబితాలో సర్ఫరాజ్‌కు సి కేటగిరీ కేటాయించినట్లు తెలుస్తోంది.. గతంలో కెప్టెన్‌గా చేసిన సమయంలో ‘ ఏ’ కేటగిరీలో ఉన్న సర్ఫరాజ్‌కు ‘సి’తో సరిపెట్టాలని నిర్ణయించినట్లు సమాచారం. గతేడాది ఆగస్టులో 19 క్రికెటర్లకు మాత్రమే సెంట్రల్ కాంట్రాక్ట్‌లో చోటు కల్పించిన సంగతి తెలిసిందే. అప్పటివరకూ 32 మందికి చోటు కల్పిస్తూ వచ్చిన పీసీబీ వారిని 19కి కుదించింది. తాజాగా వారికే తిరిగా చోటు కల్పించడానికి సిద్ధమైన పీసీబీ.. 2017 చాంపియన్స్ ట్రోఫీ కెప్టెన్ అయిన సర్ఫరాజ్‌కు ‘సి’తో సరిపెడితే చాలని భావిస్తోంది. ('పాంటింగ్ గెలుపు కోసం చూస్తాడు.. ధోని మాత్రం') గతంలో సర్పరాజ్ అహ్మద్ కెప్టెన్‌గా ఉన్న సమయంలో ‘ఎ’ కేటగిరీని దక్కించుకున్నాడు. బాబర్ అజామ్, యాసిర్ షాలతో కలిసి సర్ఫరాజ్ కొంతకాలం ‘ఎ’ కాంట్రాక్ట్ విభాగంలో కొనసాగాడు. ప్రస్తుతం పాకిస్తాన్ క్రికెట్ జట్టులో సభ్యుడిగా లేని సర్ఫరాజ్‌ను తిరిగి మళ్లీ జట్టులోకి తీసుకోవాలనే ఉద్దేశంతోనే అతనికి ‘సి’ కేటాగిరీ కేటాయించినట్లు పీసీబీ వర్గాల సమాచారం. అదే సమయంలో ఆటగాళ్ల మ్యాచ్ ఫీజులో కోత విధించడానికి కూడా పీసీబీ సిద్ధమైంది. ప్రస్తుత పీసీబీ నిబంధనల ప్రకారం ’ఏ’ కేటగిరీలో ఉన్న ఆటగాడికి టెస్టు మ్యాచ్ ఫీజు రూ. 7, 62,300 ఉండగా, బి కేటగిరీలో ఉన్న ఆటగాడికి రూ. 6,65,280 గా ఉంది. ఇక సి కేటగిరీలో క్రికెటర్లకు రూ. 5, 68, 260 గా ఉంది. గతేడాది చివర్లో శ్రీలంకతో జరిగిన స్వదేశీ సిరీస్ తర్వాత సర్ఫరాజ్ మళ్లీ పాకిస్తాన్ తరఫున ఆడలేదు. ఇంగ్లండ్ వేదికగా జరిగిన గత వన్డే వరల్డ్‌కప్‌లో పాకిస్తాన్ నాకౌట్ స్టేజ్‌కు వెళ్లకుండానే నిష్క్రమించింది. దానిలో భాగంగా ప్రక్షాళన చేపట్టిన పీసీబీ.. ముందుగా కెప్టెన్ సర్ఫరాజ్‌ను కోచ్ మికీ ఆర్థర్‌లకు ఉద్వాసన పలికింది. సర్ఫరాజ్‌ను కెప్టెన్‌గా తొలగించినా ఆటగాడిగా మాత్రం ఉంచింది. అయితే కెప్టెన్సీ భారం తగ్గినా సర్ఫరాజ్ ఆటలో మార్పు రాకపోవడంతో అతన్ని ఆటగాడిగా తప్పించింది. మళ్లీ సర్ఫరాజ్‌కు చోటు కల్పించాలనే ఉద్దేశంతో ఉన్న పీసీబీ.. కనీసం సి కేటగిరిలో ఉంచినట్లు సమాచారం.(ధావన్ ఒక ఇడియట్.. స్ట్రైక్ తీసుకోనన్నాడు..!) -
‘అధికారుల్ని ముప్పుతిప్పలు పెట్టాడు’
కరాచీ: అవినీతి ఆరోపణలపై మూడేళ్ల నిషేధాన్ని ఎదుర్కొంటున్న పాకిస్తాన్ క్రికెటర్ ఉమర్ అక్మల్‌లో కనీసం పశ్చాత్తాపం ఎక్కడా కనబడటం లేదని పీసీబీ క్రమశిక్షణా ప్యానల్ పేర్కొంది. తనకు పడిన నిషేధంపై ఎటువంటి చింతా లేని అక్మల్.. బోర్డుకు కూడా క్షమాపణలు తెలుపలేదని ప్యానల్ చీఫ్ ఫజల్ ఈ మిరాన్ చౌహాన్ తెలిపారు. ఉమర్ అక్మల్ కేసులో సమగ్ర నివేదికను పీసీబీకి అందజేసిన ఫజల్.. దర్యాప్తు చేసేటప్పుడు కూడా అధికారుల్నిముప్పు తిప్పలు పెట్టడన్నారు. కనీసం బాధ్యత లేకుండా విచారణకు సైతం సహకరించలేదన్నారు. ఆర్టికల్ 2.4.4 నియమావళిని అక్మల్ అతిక్రమించిన కారణంగా అతనిపై సుదీర్ఘ కాలం నిషేధం పడిందన్నారు. బుకీలు సంప్రదించినప్పుడు దాన్ని బోర్డుకు చెప్పకుండా దాచి పెట్టడం అతి పెద్ద నేరమని ఫజల్ తెలిపారు. దీనిలో భాంగానే ఉమర్ అక్మల్ మూడేళ్ల నిషేధాన్ని చవిచూడాల్సి వచ్చిందన్నారు. ఉమర్ అక్మల్ విచారణకు సహకరించకపోవడంతోనే రెండు నెలల సమయం పట్టిందన్నారు.(అతనొక మూర్చ రోగి: పీసీబీ మాజీ చైర్మన్) పీఎస్ఎల్కు సంబంధించి మ్యాచ్ ఫిక్సింగ్ చేయమంటూ అక్మల్‌ను కొందరు సంప్రదించారు. దానికి అక్మల్ అంగీకరించలేదు. కానీ తనను బుకీలు సంప్రదించిన విషయాన్ని గోప్యంగా ఉంచాడు. ఈ విషయంపై కొన్ని నెలల క్రితం బయటపడటంతో ఉమర్‌పై వేటు తప్పలేదు. ఉమర్‌పై నిషేధమే సబబు అని భావించి పీసీబీ ఈ నిర్ణయం తీసుకుంది. మరొకవైపు ఫిట్నెస్ టెస్టుకు హాజరైన క్రమంలో ట్రైనర్‌తో ఉమర్ దూకుడుగా వ్యవహరించాడనే అపవాదు కూడా ఉంది. ఆ సమయంలోనే అక్మల్‌పై వేటు పడుతుందని భావించినా దాని నుంచి తప్పించుకున్నాడు.కేవలం ఒక వార్నింగ్‌తో పీసీబీ సరిపెట్టడంతో ఉమర్ బయటపడ్డాడు. అయితే ఫిక్సింగ్ వివాదంలో మాత్రం అక్మల్ నిషేధాన్ని చవిచూడాల్సి వచ్చింది. గతంలో మికీ ఆర్థర్ కోచ్‌గా ఉన్న సమయంలో కూడా ఉమర్ ప్రవర్తన విసుగు తెప్పించేది. ఆర్థర్‌పై పలు మార్లు బహిరంగ విమర్శలు చేసి తరచు వార్తల్లో నిలిచేవాడు ఉమర్. తన అంతర్జాతీయ కెరీర్లో 16 టెస్టులు, 121 వన్డేలు, 84 టి20లను ఉమర్ ఆడాడు.గత అక్టోబర్‌లో పాకిస్తాన్ తరఫున అక్మల్ చివరిసారి ప్రాతినిథ్యం వహించాడు. (ధావన్ ఒక ఇడియట్.. స్ట్రైక్ తీసుకోనన్నాడు..!) -
చిక్కుల్లో పడ్డ అక్తర్‌కు మాజీ క్రికెటర్ సపోర్ట్
కరాచీ: పాకిస్తాన్ క్రికెట్ బోర్డు(పీసీబీ) లీగల్ డిపార్ట్‌మెంట్‌పై సంచలన కామెంట్స్ చేసి చిక్కుల్లో పడ్డ ఆ దేశ మాజీ పేసర్ షోయబ్ అక్తర్‌కు మాజీ క్రికెటర్ అండగా నిలిచాడు. అక్తర్ చేసిన వ్యాఖ్యల్లో ఎటువంటు తప్పూ లేదని అందుకు తాను కూడా మద్దతు ఇస్తున్నానని యూనిస్ ఖాన్ ముందుకొచ్చాడు. పాకిస్తాన్ క్రికెట్‌ను విశ్లేషించడానికి ఇదే సరైన సమయమని యూనిస్ పేర్కొన్నాడు. ‘ అక్తర్ మాట్లాడింది చేదు నిజం. అతని వ్యాఖ్యల్లో ఎటువంటి తప్పుల్లేదు. రాజీ పడకుండా ఉండటానికి అక్తర్ వ్యాఖ్యలే నిదర్శనం. అక్తర్ వ్యాఖ్యలతో పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ఇకనైనా విశ్లేషణ ఆరంభించాలి. పాకిస్తాన్ క్రికెటర్ల భవిష్యత్తు, దేశ క్రికెట్‌ను దృష్టిలో పెట్టుకుని నిర్ణయాలు తీసుకోవాలి. నేను అక్తర్‌కు అండగా ఉంటా’ అని యూనిస్ పేర్కొన్నాడు. (అక్తర్‌పై ‘పీసీబీ’ పరువు నష్టం కేసు) కేవలం బుకీ సంప్రదించిన విషయాన్ని చెప్పలేదని ఉమర్ అక్మల్‌పై మూడేళ్ల నిషేధం సమంజసం కాదని అక్తర్ ప్రశ్నించాడు. అవినీతి క్రికెటర్లపై ఏదో చర్యలను తీసుకుంటున్నామని బిల్డప్ ఇచ్చేందుకు, కొంతమంది అవినీతి క్రికెటర్లను కాపాడటానికే ఉమర్ కెరీర్‌ను పణంగా పెట్టారంటూ ధ్వజమెత్తాడు. ఈ విషయంలో పీసీబీ లీగల్ అడ్వైజరీ కమిటీ నిర్ణయాన్ని సవాల్ చేశాడు. మీకు నచ్చిన మ్యాచ్ ఫిక్సర్లను రక్క్షించడానికి మరి కొంతమందిపై ఇలాంటి చర్యలు తీసుకుంటారా అంటూ నిలదీశాడు. ఒక చిన్నపాటి తప్పు చేస్తే అందుకు ఆరు నెలలో రెండు సంవత్సరాలు నిషేధం విధిస్తూ నిర్ణయం తీసుకోవాలని, కెరీర్ నాశనం అయిపోయేలా మూడేళ్ల నిషేధం ఎందుకోసం, ఎవరి కోసం అంటూ విమర్శించాడు. పీసీబీ లీగల్ అడ్వైజరీ అసమర్థవత వల్లే ఉమర్‌కు మూడేళ్ల శిక్ష పడిందంటూ వ్యాఖ్యానించాడు. దీనిపై తన యూట్యూబ్ చానల్ వీడియోను విడుదల చేసి మరీ పీసీబీ చర్యలను ప్రశ్నించాడు. దాంతో పీసీబీ లీగల్ డిపార్ట్మెంట్ అక్తర్‌పై పరువు నష్టం కేసు వేయడానికి సిద్ధమైంది. తమ లీగల్ వ్యవహారాల్లో తలదూర్చి అక్తర్ తప్పుచేశాడంటూ పీసీబీ లీగల్ అడ్వైజర్ తఫాజ్జుల్ రిజ్వి పరువు నష్టం దావాతో పాటు క్రిమినల్ కేసును ఫైల్ చేశారు. న్యాయపరమైన అంశాలు మాట్లాడేటప్పుడు అక్తర్ కాస్త ఒళ్లు దగ్గర పెట్టుకుని వ్యాఖ్యానిస్తే మంచిదనే సలహా ఇచ్చారు. దీనిపై పీసీబీ కూడా అసంతృప్తి వ్యక్తం చేసింది. అసలు అక్తర్ బహిరంగంగా పీసీబీ లీగల్ డిపార్ట్మెంట్తో పాటు తమ అడ్వైజరీపై ఇలా ఆరోపణలు చేయడం ఏమిటని ప్రశ్నించింది. ఇది అక్తర్‌కు సరికాదని మండిపడింది.(అతనొక మూర్చ రోగి: పీసీబీ మాజీ చైర్మన్) -
‘ఆ క్రికెటర్ ఒక మూర్చ రోగి’
కరాచీ: అవినీతి ఆరోపణలపై ఇటీవల మూడేళ్ల పాటు నిషేధానికి గురైన పాకిస్తాన్ క్రికెటర్ ఉమర్ అక్మల్‌పై పీసీబీ మాజీ చైర్మన్ నజామ్ సేథీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఉమర్ ఒక మూర్చ రోగి అంటూ మరో కొత్త వివాదానికి తెరలేపారు. తాను పీసీబీ చైర్మన్‌గా,ఎగ్జిక్యూటివ్ కమిటీ హెడ్‌గా ఉన్నసమయంలో తాను ఎదుర్కొన్న తొలి సమస్య ఉమర్‌దేనని పేర్కొన్నారు. ఉమర్‌కు మూర్చ ఉన్నట్లు అప్పటి మెడికల్ రిపోర్ట్ల్లో వెల్లడైందని, కానీ దానిని సెలక్షన్ కమిటీ సీరియస్‌గా తీసుకోలేదన్నారు. అతనికి మూర్చ ఉండటం వల్లే వింత వింతగా ప్రవర్తిస్తూ ఉంటాడని సేథీ తెలిపారు. అయితే తనకు మూర్చ రోగిననే విషయాన్ని అంగీకరించడానికి ఉమర్ సిద్ధంగా లేడనే విషయాన్ని కూడా ఆయన తేల్చిచెప్పారు. గత తన పీసీబీకి చేసిన సేవల్లో ఉమర్‌తో పెద్ద సమస్యగా ఉండేదన్నారు. దాంతోనే రెండు నెలల పాటు అతన్ని క్రికెట్‌కు దూరంగా పెట్టానని, ఆ తర్వాత సెలక్షన్ కమిటీ లైట్‌గా తీసుకోవడంతో క్రికెట్‌ను తిరిగి కొనసాగించడన్నాడు. సెలక్షన్ కమిటీ విషయాల్లో తలదూర్చకూడదనే ఉద్దేశంతోనే తాను అప్పుడు మౌనంగా ఉండిపోయానన్నాడు. (తమ్ముడూ... సచిన్, ధోని, కోహ్లిలను చూసి నేర్చుకో) ఇప్పుడు ఉమర్‌పై మూడేళ్ల నిషేధం పడటంతో అతని కెరీర్ గిసిపోయినట్లేనని సేథీ తెలిపారు. తాను ఎప్పుడూ ఉమర్ కెరీర్ గురించి ఆందోళన చెందుతూనే ఉండేవాడినని, నియమావళిని అతిక్రమించడంతో అతని కెరీర్‌ను నాశనం చేసుకున్నాడన్నాడు. ఉమర్‌పై విధించిన మూడేళ్ల నిషేధంలో ఎటువంటి మార్పులు చోటు చేసుకునే ప్రసక్తే లేదని సేథీ అభిప్రాయపడ్డారు. కొన్ని రోజుల క్రితం ఉమర్ అక్మల్‌పై పీసీబీ మూడేళ్ల నిషేధాన్ని విధించింది. బోర్డు నియమావళిలోని ఆర్టికల్ 2.4.4ను అతిక్రమించినట్లు దర్యాప్తులో తేలడంతో అతనిపై వేటు వేశారు. రెండు నెలలపాటు విచారించిన తర్వాత ఉమర్‌పై నిషేధమే సబబుగా భావించి పీసీబీ నిర్ణయం తీసుకుంది. పీఎస్ఎల్లో ఒక బుకీ తనను సంప్రదించాడనే విషయాన్ని దాచి పెట్టడంతోనే ఉమర్‌పై వేటుకు కారణమైంది.మరొకవైపు ఫిట్నెస్ టెస్టుకు హాజరైన క్రమంలో ట్రైనర్‌తో ఉమర్ దూకుడుగా వ్యవహరించాడనే అపవాదు కూడా ఉంది. అంతుకుముందు మికీ ఆర్థర్ కోచ్‌గా ఉన్న సమయంలో కూడా ఉమర్ ప్రవర్తన విసుగు తెప్పించేంది. ఆర్థర్‌పై పలు మార్లు బహిరంగ విమర్శలు చేసి వార్తల్లోకెక్కాడు ఉమర్. తన అంతర్జాతీయ కెరీర్లో 16 టెస్టులు, 121 వన్డేలు, 84 టి20లను ఉమర్ ఆడాడు. (అక్తర్‌పై ‘పీసీబీ’ పరువు నష్టం కేసు) -
షోయబ్ అక్తర్‌పై ‘పీసీబీ’ పరువు నష్టం కేసు
కరాచీ: పాకిస్తాన్ మాజీ పేసర్ షోయబ్ అక్తర్‌పై పీసీబీ లీగల్ అడ్వైజర్ తఫాజ్జుల్ రిజ్వి పరువు నష్టం కేసు వేశారు. దాంతో పాటు అక్తర్‌పై క్రిమినల్ కేసును కూడా ఫైల్ చేశారు. అవినీతి ఆరోపణల్లో భాగంగా పాకిస్తాన్ వెటరన్ క్రికెటర్ ఉమర్ అక్మల్‌పై మూడేళ్లు నిషేధం విధించిన సందర్భంలో పీసీబీ లీగల్ డిపార్ట్‌మెంట్‌పై అక్తర్ అసంబద్ధ వ్యాఖ్యలు చేశాడు. ఉమర్ అక్మల్ మూడేళ్ల నిషేధంలో పీసీబీ లీగల్ అడ్వైజరీ తీసుకున్న నిర్ణయాలను తప్పుబట్టాడు. దీనిపై ఒక వీడియో కూడా విడుదల చేసి బహిరంగ చర్చకు ఆజ్యం పోశాడు. అక్తర్ వైఖరితో విసుగుచెందిన పీసీబీ లీగల్ అడ్వైజర్ రిజ్వి పరువు నష్టం కేసును వేశారు. న్యాయపరమైన అంశాలు మాట్లాడేటప్పుడు అక్తర్ కాస్త ఒళ్లు దగ్గర పెట్టుకుని వ్యాఖ్యానిస్తే మంచిదనే సలహా ఇచ్చారు. దీనిపై పీసీబీ కూడా అసంతృప్తి వ్యక్తం చేసింది. అసలు అక్తర్ బహిరంగంగా పీసీబీ లీగల్ డిపార్ట్మెంట్తో పాటు తమ అడ్వైజరీపై ఇలా ఆరోపణలు చేయడం ఏమిటని ప్రశ్నించింది. ఇది అక్తర్‌కు సరికాదని మండిపడింది. (తమ్ముడూ... సచిన్, ధోని, కోహ్లిలను చూసి నేర్చుకో) ఇటీవల ఉమర్ అక్మల్‌కు అనుకూలంగా అక్తర్ మాట్లాడుతూ తన యూట్యూబ్ చానల్లో వీడియోను విడుదల చేశారు. ప్రధానంగా మూడేళ్ల నిషేధాన్ని తప్పుబట్టాడు. ఇది పీసీబీ లీగల్ అడ్వైజరీ అసమర్థవత వల్లే ఉమర్‌కు మూడేళ్ల శిక్ష పడిందంటూ వ్యాఖ్యానించాడు. అదే సమయంలో రిజ్విపై ఆరోపణలు చేశాడు. చాలా సున్నితమైన అంశాల్లో రిజ్వికి అనుభవం లేదంటూ విమర్శించాడు. కాగా, ఉమర్ అక్మల్‌పై పీసీబీ మూడేళ్ల నిషేధం విధించిన సంగతి తెలిసిందే. పీసీబీ అవినీతి నిరోధక విభాగం అతనిపై రెండు నెలలుగా విచారించింది. చివరకు సోమవారం శిక్ష ఖరారు చేసింది. అయితే ఉమర్‌పై నిషేధం విధించడానికి గల స్పష్టమైన కారణాలను పీసీబీ వెల్లడించలేదు. కానీ బోర్డు నియమావళిలోని ఆర్టికల్ 2.4.4ను అతిక్రమించినట్లు దర్యాప్తులో తేలడంతో వేటు వేశామని పీసీబీ ఒక ప్రకటనలో పేర్కొంది.(అతని కంటే మాలికే బెటర్: చహల్) -
హైడ్రాక్సీక్లోరోక్విన్ తయారీకి వేగంగా అనుమతులు
సాక్షి,హైదరాబాద్: ప్రస్తుతం వైద్య, ఆరోగ్యపరంగా ఏర్పడిన అత్యవసర పరిస్థితుల నేపథ్యంలో హైడ్రాక్సీ క్లోరోక్విన్, ప్రాణాలను కాపాడే ఇతర బల్క్ డ్రగ్స్, తదితర మందుల తయారీకి అవసరమైన అనుమతులు వేగంగా ఇచ్చేందుకు చర్యలు చేపట్టినట్లు తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి (పీసీబీ) వెల్లడించింది. ఈ ప్రక్రియను అత్యంత ప్రాధాన్యమైందిగా పరిగణిస్తున్నట్లు తెలిపింది. ఈ మందులను ఇతర దేశాలకు ఎగుమతి, ఇతరత్రా అవసరాల నిమిత్తం తయారు చేయనున్నందున దీన్ని ప్రజా ప్రయోజనంగా పరిగణిస్తూ ప్రస్తుత బల్క్‌డ్రగ్స్/ డ్రగ్ ఇంటర్మీడియట్ మాన్యుఫాక్చరింగ్ ఇండస్ట్రీస్ తమ ప్రతిపాదనలను cee-tspcb@telangana.gov. in/tspcbseeunit2@gmail.com ఈ–మెయిల్ ఐడీలకు పంపాలని పీసీబీ సభ్య కార్యదర్శి శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. ఈ మేరకు ప్రతిపాదనలతో పాటు తాము ఉత్పత్తి చేసే మందుల మార్పు, కంపారెటివ్ పొల్యూషన్ లోడ్స్ స్టేట్మెంట్, ఈ ప్రతిపాదిత ఉత్పత్తులకు మెటీరియల్ బ్యాలెన్స్, ఎన్విరాన్మెంట్ ఆడిటర్ సర్టిఫికెట్‌ను జతచేయాలని సూచించారు. కరోనా చికిత్సకు సంబంధించి బల్క్‌డ్రగ్స్/ లైఫ్ సేవింగ్ డ్రగ్స్‌ను ఉత్పత్తి చేసే ఇంటర్మీడియట్ ఇండస్ట్రీస్/ ఇంటర్మీడియెట్స్ ప్రతిపాదనలను ప్రాధాన్యతతో పరిశీలించి, వేగంగా క్లియరెన్స్‌లు ఇచ్చేలా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఈ మందులను కరోనా నియంత్రణకు ఉపయోగించేందుకు కేంద్రం అనుమతినిచ్చిన నేపథ్యంలో ప్రపంచస్థాయిలో వస్తున్న డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకుని వీటి తయారీకి రాష్ట్రంలోని కొన్ని బల్స్డ్రగ్స్/ డ్రగ్ ఇంటర్మీడియట్ మాన్యుఫాక్చరింగ్ ఇండస్ట్రీస్ ముందుకొచ్చినట్లు పేర్కొన్నారు. -
‘ఐపీఎల్ కోసం షెడ్యూల్ మార్చితే సహించం’
కరాచీ: భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) పట్ల పాకిస్తాన్ క్రికెట్ బోర్డు(పీసీబీ)మరోసారి విషం వెళ్లగక్కింది. కరోనా వైరస్ కారణంగా అసలు ఈఏడాది క్రికెట్ టోర్నీలు జరగడం సందేహాస్పదంగా మారిన తరుణంలో ఆసియా కప్ షెడ్యూల్‌ను భారత్ మార్చడానికి యత్నిస్తుందంటూ కొత్త పల్లవి అందుకుంది. ఐపీఎల్ కోసం ఆసియాకప్నే భారత మార్చేస్తుందంటూ పీసీబీ ఆరోపిస్తోంది. ఒకవేళ ఐపీఎల్-13 వ సీజన్ కోసం ఆసియా కప్ షెడ్యూల్‌ను మార్చితే తాము అంగీకరించమని ముందుగానే సన్నాయి నొక్కులు నొక్కుతోంది. ‘ మా వైఖరి చాలా క్లియర్‌గా ఉంది. ఆసియా కప్‌కు సెప్టెంబర్‌లో షెడ్యూల్ చేయబడి ఉంది. ఇది పాకిస్తాన్లో జరగాల్సి ఉన్నా కొన్ని కారణాల వల్ల దుబాయ్‌లో జరుగుతుంది. అక్కడ వరకూ ఓకే.. కానీ మొత్తం ఆసియా కప్ షెడ్యూల్‌నే మార్చాలని చూస్తే మేము చూస్తూ ఊరుకోం. ఐపీఎల్ కోసం ఆసియాకప్‌ను మార్చాలనే చర్చలు ఆరంభం అయినట్లు మాకు సమాచారం ఉంది. (నేరుగా ధోని వద్దకు పో..!) దీన్ని మేము సహించం. ఆసియాకప్‌ను నవంబర్-డిసెంబర్లో జరపడానికి ప్రయత్నాలు ప్రారంభం అయినట్లు తెలుస్తోంది. అలా అయితే అది మాకు సాధ్యం కాదు. కేవలం ఆసియాకప్ సభ్యత్వ దేశాల్లో ఉన్న ఒక దేశం కోసం దాని షెడ్యూల్‌ను మార్చిస్తే అది చాలా దారుణం. దానికి మాకు సహకారం అస్సలు ఉండదు’ అని పీసీబీ సీఈఓ వసీం ఖాన్ తెలిపారు. అయితే ఐపీఎల్‌ను ఏ ప్రధాన సిరీస్‌లు మిస్ కాకుండా ఉండేలా ప్రయత్నాలు చేస్తున్నారు. దానికి అక్టోబర్ విండోను అనుకుంటున్నారు. షెడ్యూల్ ప్రకారం ఆసియా కప్ అనేది అక్టోబర్ 6వ తేదీతో ముగుస్తుంది.దీని తర్వాతే ఐపీఎల్‌ను ప్లాన్ చేయాలని అనుకుంటున్నారు. అన్ని సవ్యంగా సాగితే ఇదే సరైనది బీసీసీఐ భావిస్తోంది. కాకపోతే ఐపీఎల్ కోసం ఆసియాకప్ షెడ్యూల్‌ను మార్చాలనే చర్చలు ఇప్పటివరకూ జరగలేదు. మరి పీసీబీ ముందర కాళ్లకు బంధం వేయడానికి కొత్త రాగం అందుకుని ఉండవచ్చు. కరోనా వైరస్ కారణంగా ఐపీఎల్ నిరవధిక వాయిదా పడిన సంగతి తెలిసిందే. ఐపీఎల్-13వ సీజన్ ఇప్పటికే ఆరంభం కావాల్సి ఉండగా దానికి లాంగ్ బ్రేక్ పడింది. ఈ పరిణామానికి అటు బీసీసీఐ, ఇటు ఫ్రాంఛైజీలు వేల కోట్ల రూపాయిలు నష్టపోతున్నాయి. అయితే కరోనా వైరస్ ప్రభావం తగ్గితే ఐపీఎల్‌ను జరిపించాలని బీసీసీఐ సన్నాహాలు చేస్తోంది.(ఓడిపోతే సరదా ఏమిటి..?; భార్యకు స్మిత్ రిప్లై) -
భారత క్రికెటర్లు స్వార్థపరులు..వేస్ట్!
కరాచీ: భారత క్రికెట్ జట్టుపై పాకిస్తాన్ మాజీ కెప్టెన్, పీసీబీ మాజీ చీఫ్ సెలక్టర్ ఇంజమాముల్ హక్ సంచలన కామెంట్స్ చేశాడు. తాను క్రికెట్ ఆడే రోజుల్లో భారత క్రికెటర్లకు- పాకిస్తాన్ క్రికెటర్లకు చాలా వ్యత్యాసం ఉండేదన్నాడు. భారత్ క్రికెటర్లు కేవలం తమ స్థానాలను కాపాడుకోవడం కోసమే క్రికెట్ ఆడేవారంటూ ఆరోపించాడు. భారత క్రికెటర్లు ఎప్పుడూ వ్యక్తిగత రికార్డులే లక్ష్యంగా బ్యాటింగ్ చేసేవారన్నాడు. ఇక పాకిస్తాన్ బ్యాట్స్‌మెన్ విషయానికొస్తే జట్టు ప్రయోజనాల కోసమే ఆడవారని, వ్యక్తిగత రికార్డులకు పాక్ ఆటగాళ్లు అప్పుట్లో దూరంగా ఉండేవారన్నాడు. కేవలం జట్టు గెలుపే లక్ష్యంగా పాకిస్తాన్ క్రికెటర్లు ఫీల్డ్‌లో దిగేవారని ఇంజమామ్ అన్నాడు. ‘ భారత క్రికెటర్లు వరుస సిరీస్‌లు దృష్టిలో పెట్టుకునే ఆడేవారు. (లాక్డౌన్లో క్రికెట్ మ్యాచ్ నిర్వహణ.. కేసు నమోదు) ఒక సిరీస్‌లో ఆడితే మరొక సిరీస్‌లో ప్లేస్ ఉండేది. సిరీస్‌లో ఫెయిల్ అయితే తదుపరి సిరీస్‌లు అవకాశం వచ్చేది కాదు. వారు ఎప్పుడూ వారి వారి అత్యుత్తమ ఆటను ప్రదర్శించలేకపోయేవారు. మా సమయంలో టీమిండియా బ్యాటింగ్ చాలా పటిష్టంగా ఉండేది. మాకంటే బ్యాటింగ్ పరంగా చాలా బలంగా ఉండేది. కాగితపు పులులు తరహాలో వారు మా కంటే స్ట్రాంగ్‌గా ఉండేవారు. బ్యాట్స్‌మెన్‌గా మా రికార్డు వారి కంటే మెరుగ్గా ఉండేది కాదు. కానీ మేము ప్రతీ ఒక్కరం కనీసం 30 నుంచి 40 పరుగులు చేయాలనే పట్టుదలతో ఉండేవాళ్లం. వారు వ్యక్తిగత రికార్డుపై కన్నేసేవారు. భారత జట్టులో ఎవరైనా సెంచరీ చేస్తే అది జట్టు కోసం కాదు.. వారి వ్యక్తిగతం కోసమే. మరి మేము జట్టుగా పోరాడేవాళ్లం. భారత జట్టులో వ్యక్తిగత ప్రదర్శనకు ఎక్కువ ప్రాముఖ్యత ఇవ్వడంతో పేపర్‌పై పులిలా మిగిలిపోయేవారు. ఇప్పుడు మన క్రికెటర్లు కూడా ప్లేస్‌లు కోసం కుస్తీ పడుతున్నారు. ఏదో ఒకటి-రెండు ఇన్నింగ్స్‌లు ఆడేసి స్థానాన్ని కాపాడుకోవడంపై దృష్టి పెట్టారు. మేనేజ్మెంట్ కోరుకునేది మీ నుంచి పూర్తి స్థాయి ప్రదర్శన. భయపడుతూ క్రికెట్ ఆడొద్దు’ అని ఇంజమాముల్ సూచించాడు.(ధోనికి చాన్స్‌తో గుండెల్లో కత్తి దింపినట్లు అయ్యింది..) -
ఇంకా నాపై నిషేధం ఎందుకు?
కరాచీ: తనపై విధించిన జీవితకాల నిషేధాన్ని తొలగించాలని పాకిస్తాన్ క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ సలీమ్ మాలిక్ విన్నవించాడు. ఈ మేరకు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు(పీసీబీ)కి, అంతర్జాతీయ క్రికెట్ మండలి(ఐసీసీ)కి ఓ వీడియో సందేశాన్ని పంపాడు. తనపై కొనసాగుతున్న నిషేధాన్ని తొలగించి, తాను కోచ్‌గా చేసుకోవడానికి సహకరించాలని విజ్ఞప్తి చేశాడు. (‘గేర్’ మార్చి దంచి కొట్టిన వేళ..!) ప్రస్తుతం తనకు దేశానికి, ఆటగాళ్లకు కోచ్‌గా చేయాలని ఉందని వీడియో మెస్సేజ్‌లో పేర్కొన్నాడు. కాగా, 1995లో ఆస్ట్రేలియా క్రికెట్ జట్టు.. పాకిస్తాన్లో పర్యటించినప్పుడు సలీమ్ మాలిక్.. అవినీతికి పాల్పడినట్లు ఆరోపణలు వచ్చాయి. ఆస్ట్రేలియా ఆటగాళ్లు షేన్ వార్న్, మార్క్ వా, టిమ్ మేలు మాలిక్ భారీగా ముడుపులు అందుకున్నాడని ఆరోపణలు వ్యాపించాయి. దీనిపై పీసీబీ సుదీర్ఘ విచారణ తర్వాత మాలిక్‌పై జీవిత కాల నిషేధం విధించారు. 2000లో మాలిక్ తప్పుచేసినట్లు తేలడంతో అతనిపై నిషేధం పడింది. కాగా, 2008లో మాలిక్‌పై విధించిన జీవితకాల నిషేధాన్ని ఎత్తివేయాలంటూ పాకిస్తాన్ కోర్టు తీర్పునిచ్చింది. (హర్మన్ మ్యాజిక్ ట్రిక్కు ఫ్యాన్స్ బౌల్డ్..!) కాగా, మాలిక్‌పై నిషేధం విషయంలో పీసీబీ తగ్గకపోవడంతో అతను క్రికెట్ సంబంధిత వ్యవహారాల్లో పాలుపంచుకోవడానికి దూరం కావాల్సి వస్తుంది. అయితే ప్రస్తుతం తాను కోచ్‌గా చేయాలనుకుంటున్నానని, దాంతో తనపై ఉన్న నిషేధాన్ని తొలగించాలంటూ పీసీబీ, ఐసీసీలను కోరాడు. 1982-99 మధ్య కాలంలో పాకిస్తాన్ తరఫున 103 టెస్టులు, 283 వన్డేలను మాలిక్ ఆడాడు. 2008లో నేషనల్ అకాడమీలు కోచ్‌గా చేయడానికి మాలిక్ దరఖాస్తు చేసుకోగా, 2012లో పాకిస్తాన్ బ్యాటింగ్ కోచ్‌గా చేయడానికి అప్లై చేసుకున్నాడు. ఈ రెండు సందర్భాల్లోనూ మాలిక్ దరఖాస్తులను కనీసం పట్టించుకోలేకపోవడం గమనార్హం. -
నీలాగ దేశాన్ని అమ్మేయలేదు..!
లాహోర్: ప్రస్తుతం పాకిస్తాన్ క్రికెట్లో మాటల యుద్ధం నడుస్తోంది. లాక్డౌన్లో ప్రపంచ దేశాల క్రికెటర్లంతా తమ ఇంట్లోనే సరదా సరదాగా గడుపుతుంటే పాకిస్తాన్ క్రికెట్లో మాత్రం ఇప్పుడు గతాన్ని తవ్వుకుంటూ విమర్శించుకుంటున్నారు. అంతకుముందు పాక్ దిగ్గజాలైన ఇమ్రాన్ ఖాన్, వసీం అక్రమ్‌లపై ఆ దేశ మాజీ క్రికెటర్ బాసిత్ అలీ మండిపడిన సంగతి తెలిసిందే. జావేద్ మియాందాద్‌ను జట్టు నుంచి తొలగించడానికి ఇమ్రాన్, అక్రమ్‌లు కుట్ర చేశారంటూ బాసిత్ అలీ ధ్వజమెత్తగా, తాజాగా మరో ఇద్దరు పాక్ మాజీ క్రికెటర్లైన డానిష్ కనేరియా, ఫైజల్ ఇక్బాల్‌ల మధ్య ట్వీటర్ వేదికగా మాటల యుద్ధం నడుస్తోంది. ఇందులో 2006లో ముల్తాన్‌లో వెస్టిండీస్‌తో జరిగిన టెస్టు మ్యాచ్ కారణమైంది. వీరి మధ్య వాగ్వాదానికి మాత్రం పరోక్షంగా ఇంజమాముల్ హక్ కారణమయ్యాడు.(అది ఇమ్రాన్, అక్రమ్ల కుట్ర..!) వివరాల్లోకి వెళితే.. 2006 ముల్తాన్ టెస్ట్‌లో విండీస్ దిగ్గజం బ్రియాన్ లారా.. కనేరియా బౌలింగ్‌లో విరుచుకుపడిన వీడియోను ఇంజమాముల్ హక్ పోస్ట్ చేశాడు. ఆ మ్యాచ్‌లో కనేరియాపై లారా పూర్తి ఆధిపత్యం చెలాయించాడని హక్ పేర్కొన్నాడు. దీనికి స్పందించిన కనేరియా..తాను ఐదుసార్లు లారాను అవుట్ చేశానని, పీసీబీ మద్దతుగా నిలిస్తే తాను ఎన్నో రికార్డులు కొల్లగొట్టేవాడినని చెప్పుకొచ్చా డు. అయితే దీనికి స్పందించిన ఫైసల్ ఇక్బాల్.. లారాని స్లెడ్జింగ్ చేయబోయి అభాసుపాలయ్యాడని, బ్రియాన్ ఫోర్లు, సిక్సర్లు బాదుతుంటే కనేరియా ప్రేక్షకుడిగా మిగిలిపోయాడని ఎద్దేవాచేశాడు. దీనికి ఘాటుగా బదులిచ్చిన కనేరియా ‘ఫైసల్లాంటి క్రికెటర్ నాపై వ్యాఖ్యలు చేయడమా. మొదట నీ స్థాయి ఏపాటిదో తెలుసుకో’ అని సూచించాడు. దాంతో ఇక్బాల్ చిర్రెత్తుకొచ్చింది. ‘నువ్వు డబ్బు కోసం ఏమైనా చేస్తావ్. నువ్వు ఎటువంటి విలువలు లేని క్రికెటర్‌వి. నేను నీలాగ దేశాన్ని అమ్మేయలేదు’ అని ఇక్బాల్ ఘాటగా బదులిచ్చాడు.(‘ఆ రోజు పంత్‌ను ఆపడం ఎవరితరం కాదు’) -
‘నా క్రేజే వేరు.. బ్రాండ్ వాల్యూ రెట్టింపు చేస్తా’
కరాచీ: తమ దేశంలోనే కాదు.. ప్రపంచ వ్యాప్తంగా తనకున్న క్రేజ్ ప్రత్యేకమని పాకిస్తాన్ మాజీ క్రికెటర్ షోయబ్ అక్తర్ తనకు తాను కితాబు ఇచ్చేసుకున్నాడు. పాకిస్తాన్ ప్రజల చేత అత్యంత ప్రేమించబడే వ్యక్తులలో తాను కూడా ఒకడినని అక్తర్ పేర్కొన్నాడు. అంతేకాదు ప్రపంచ వ్యాప్తంగా అక్తర్ అంటే ఒక ఫేమస్ పేరనే విషయం తెలుసుకోవాలన్నాడు. ఇక్కడ అక్తర్ గుర్తింపు పొందిన క్రికెటర్ అనే విషయం అందరికీ తెలిసినా ఈ వ్యాఖ్యల వెనుక కారణం మాత్రం వ్యాపార కోణం ఉంది. పాకిస్తాన్ సూపర్ లీగ్(పీఎస్ఎల్)లో తాను కూడా ఒక జట్టుకు యజమాని కావాలని ఉవ్విళ్లూరడమే అక్తర్ వ్యాఖ్యల వెనుకున్న ఉద్దేశం. పీఎస్ఎల్ విలువను తన పేరుతో పెంచుతానని అక్తర్ వ్యాఖ్యానించాడు. ‘పాకిస్తాన్‌లోనే కాదు... నేను వరల్డ్‌వైడ్ బాగా ఫేమస్. నాకున్న ఫ్యాన్ ఫాలోయింగ్ సెపరేటు. ప్రజలకు నాకు గురించి బాగా తెలుసు. పీఎస్ఎల్ బ్రాండ్ వాల్యూ పెరగాలంటే నాకు అందులో ఒక జట్టు ఉంటే బాగుంటుంది. పీఎస్ఎల్లో నాకు పెట్టుబడులు పెట్టే అవకాశం వస్తే పీఎస్ఎల్ బ్రాండ్ వాల్యూ అమాంతం పెరిగిపోతుంది. రెండు పీఎస్ఎల్ రెండు జట్లను పీసీబీ తీసుకోవాలి. అందులో ఒక జట్టు కోసం నేను బిడ్ వేస్తా’ అని అక్తర్ చెప్పుకొచ్చాడు. (హెడ్ లైన్స్ కాదు.. ఆర్టికల్ మొత్తం చదువు) కరోనా వైరస్ మహమ్మారి ప్రపంచాన్ని అతాలకుతలం చేస్తున్న సమయంలో ఒకరికొకరు సాయం చేసుకుంటూ ముందుకు సాగడం ఒక్కటే మార్గమని ఇటీవల షోయబ్ అక్తర్ సూచించాడు. కరోనా వైరస్ కట్టడిలో భాగంగా ప్రపంచమంతా లాక్డౌన్లో పడిపోయిన సమయంలో ఒకరికోసం ఒకరు నిలబడాలంటూ పేర్కొన్నాడు. ఇక్కడ దొంగ నిల్వలు అనేవి పెట్టుకోవద్దని అక్తర్ విజ్ఞప్తి చేశాడు. మనం నిత్యావసరాలను దొంగ నిల్వలుగా పెట్టుకునే సమయంలో రోజు వారీ శ్రామికుల గురించి ఆలోచించాల్సిన అవసరం ఉందని హితవు పలికాడు. -
‘దొంగ నిల్వలు పెట్టుకోవద్దు’
కరాచీ: కరోనా వైరస్ మహమ్మారి ప్రపంచాన్ని అతాలకుతలం చేస్తున్న సమయంలో ఒకరికొకరు సాయం చేసుకుంటూ ముందుకు సాగడం ఒక్కటే మార్గమని పాకిస్తాన్ మాజీ ఫాస్ట్ బౌలర్ షోయబ్ అక్తర్ సూచించాడు. కరోనా వైరస్ కట్టడిలో భాగంగా ప్రపంచమంతా లాక్డౌన్లో పడిపోయిన సమయంలో ఒకరికోసం ఒకరు నిలబడాలంటూ పేర్కొన్నాడు. ఇక్కడ దొంగ నిల్వలు అనేవి పెట్టుకోవద్దని అక్తర్ విజ్ఞప్తి చేశాడు. మనం నిత్యావసరాలను దొంగ నిల్వలుగా పెట్టుకునే సమయంలో రోజు వారీ శ్రామికుల గురించి ఆలోచించాల్సిన అవసరం ఉందన్నాడు. ఇప్పుడు ప్రతీ స్టోర్ ఖాళీగానే కనుబడటం లేదా మూసి వేయడమే జరుగుతూ ఉందని, ఇది మూడు నెలల తర్వాతైనా అదుపులోకి వస్తుందనే గ్యారంటీ ఏమీ లేదన్నాడు.(ఇది భరించలేని చెత్త వైరస్) ఇప్పుడున్న పరిస్థితుల్లో ఉన్నవాళ్లు లేనివాళ్లకు సాయం చేయడం ఒక్కటే మార్గమన్నాడు. ఏ రోజుకు ఆరోజు బ్రతికే వారి గురించి అంతా ఆలోచించాలన్నాడు. ఇక్కడ హిందూ, ముస్లిం అనే తేడా ఉండకూడదన్నాడు. మనిషి మనిషిలాగా ఉండి కనీసం తమ వంతు సాయం చేయాలని పేర్కొన్నాడు. ‘ ఆర్థిక పరిస్థితి బాగున్నవారు నేటికి పెద్దగా సమస్యను ఏమీ చూడటం లేదు. ఇక్కడ ఇబ్బంది పడుతున్నది పేద ప్రజలు మాత్రమే. నమ్మకం ఉంచడం. మనం మనుషుల్లా బ్రతుకుదామా.. లేక జంతువుల్లా ఉందామా. కనీసం తినడానికి తిండి లేనివాడికి సాయం చేయడానికి ప్రయత్నించండి. నిల్వలు పెట్టుకునే మాటే వద్దు. ఒకరికోసం ఒకరు అన్నట్లే ఉండాలి. అవతలి వాడి గురించి మనకెందుకు అనే ధోరణి వద్దు. మనుషులగా ఉందా.. తోటి వారిని రక్షించుకుందా’ అని అక్తర్ తెలిపాడు. -
డైలమాలో అక్మల్ కెరీర్..!
కరాచీ: పాకిస్తాన్ క్రికెటర్ ఉమర్ అక్మల్ కెరీర్ డైలమాలో పడింది. మ్యాచ్ ఫిక్సింగ్ కోసం బుకీలతో అక్మల్ సంప్రదింపులు జరిపినట్లు వెలుగులోకి రావడంతో పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) అతనిపై ఇటీవల సస్పెన్షన్ విధించిన విషయం తెలిసిందే. అక్మల్‌పై విచారణ పూర్తయ్యే వరకూ అతను ఎటువంటి క్రికెట్ కార్యకలాపాల్లో పాల్గొనవద్దని పీసీబీ ఆదేశాలు జారీ చేసింది. అయితే అక్మల్‌పై పాక్ క్రికెట్ బోర్డు జీవితకాల నిషేధం విధించే అవకాశం ఉంది.అవినీతి నిరోధక కోడ్‌లోని పలు ఉల్లంఘనలకు పాల్పడినందున ఉమర్ అక్మల్‌కు పీసీబీ నోటీసులు జారీ చేసింది.(ఉమర్.. మా డబ్బులు మాకిచ్చేయ్!) మ్మ్యాచ్ ఫిక్సింగ్‌కు సంబంధించిన విషయాలను ఉద్దేశపూర్వకంగా బోర్డు అవినీతి నిరోధక శాఖ అధికారులకు తెలియజేయనందున ఈ నోటీసులు జారీ చేసింది. దీనిపై మార్చి 31 లోపు లిఖితపూర్వక సమాధానం ఇవ్వాలని పేర్కొంది. ఒకవేళ అక్మల్ చెప్పే కారణాలతో పీసీబీ సంతృప్తి చెందకపోతే.. అతడిపై ఆరు నెలల నుంచి గరిష్టంగా జీవితకాల నిషేధం విధించే అవకాశం ఉంది. గతేడాది ఆగస్టులో శ్రీలంకపై జరిగిన టీ20 మ్యాచ్‌లో పాకిస్తాన్ తరపున అక్మల్ చివరిసారి ఆడాడు. ఆ సిరీస్‌లో అక్మల్ విఫలం కావడంతో.. అతనిపై తీవ్ర విమర్శలు వచ్చాయి. దాంతో పాకిస్తాన్ జట్టులో చోటు కోల్పోయాడు. ప్రస్తుతం వాయిదా పడిన పాకిస్తాన్ సూపర్ లీగ్ (పీఎస్ఎల్) ఆడేందుకు సిద్దమయ్యాడు. కానీ.. ఇంతలోనే అక్మల్‌పై తాత్కాలిక నిషేధం విధించడంతో పీఎస్ఎల్కు అక్మల్ దూరమయ్యాడు. -
‘మాటలు కాదు..చేతల్లో చూపించు’
కరాచీ: అత్యున్నత ప్రమాణాలు కల్గిన క్రికెటర్లు తమ ప్రస్తుత క్రికెట్ జట్టులో లేరంటూ పాకిస్తాన్ దిగ్గజ ఆటగాడు జావెద్ మియాందాద్ విమర్శలు గుప్పించాడు. పాకిస్తాన్ జట్టులో మోస్ట్ సక్సెస్ఫుల్ బ్యాట్స్‌మన్ అయిన మియాందాద్.. పీసీబీ పదే పదే తప్పులు చేయడంతోనే టాలెంట్ ఉన్న క్రికెటర్లు రావడం లేదని మండిపడ్డాడు. పేలవమైన ఫామ్‌తో ఉండే క్రికెటర్లకే ఎక్కువ అవకాశాలు ఇవ్వడంతో టాలెంట్ అనేది మరుగను పడుతుందన్నాడు. ఆస్ట్రేలియా, భారత్, ఇంగ్లండ్ జట్ల తరహాలో ఉండే క్రికెటర్లు తమ జట్టులో లేరన్నాడు. ఇక ఆ తరహా క్రికెటర్ల అన్వేషణ జరిగితే గానీ పాక్ క్రికెట్లో మార్పులు రావన్నాడు. ‘పాకిస్తాన్ క్రికెట్ బోర్డును ఒకటే అడుగుతున్నా. ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, భారత్, దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్ జట్లలో ఉండే క్రికెటర్లు పాకిస్తాన్ క్రికెట్లో ఎందుకు లేరు. ఆ జట్ల తరహాలో ఉండే క్రికెటర్లే పాక్‌లో కరువైపోయారు. మన బౌలింగ్ విభాగం బాగానే ఉంది.. కానీ బ్యాట్స్‌మెన్ ఎక్కడ. జీత భత్యాల విషయంలో ప్రపంచ క్రికెట్ పరుగులు పెడుతోంది. ఈ రోజు పరుగులు చేస్తే అప్పుడే వారిని ప్రోత్సహిస్తున్నారు. రేపు పరుగులు చేస్తే మళ్లీ వారికి అందుకు తగ్గ ప్రతిఫలం లభిస్తుంది. మనం ప్రొఫెషనల్ క్రికెటర్లం. మరి అటువంటప్పుడు పరుగులు చేయకపోతే అప్పుడు వారికి డబ్బులు ఎందుకు. ఆడితే ప్రోత్సహకాలు ఇవ్వండి.. లేదంటే జీత భత్యలు కట్ చేయండి. ఇది పాకిస్తాన్ క్రికెట్ బోర్డు పని. అలా చేస్తేనే పాక్ క్రికెట్ బాగు పడుతుంది’ అని మియాందాద్ పేర్కొన్నాడు. ముందు నువ్వు ఆడి చూపించు.. తాను మరో 12 ఏళ్లు పాకిస్తాన్ క్రికెట్లో ఆడతానంటూ ఇటీవల అహ్మద్ షెహజాద్ చేసిన వ్యాఖ్యలపై మియాందాద్ మండిపడ్డాడు. ‘ ముందు నువ్వు నీ ప్రదర్శనతో ఆకట్టుకో. 12 ఏళ్లు ఏమిటి.. 20 ఏళ్లు ఆడొచ్చు. అందుకు నేను గ్యారంటి. నువ్వు బ్యాట్‌తో మెరుస్తూ ఉంటే నిన్ను ఎవరూ తీయరు. ఈ తరహా బాధ్యతారాహిత్య స్టేట్మెంట్లు కరెక్ట్ కాదు. ఫీల్డ్‌లో మన ఆట ద్వారా నిరూపించాలి. మాటల ద్వారా కాదు బాస్.. చేతల్లో ఉండాలి’ అని మియాందాద్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. -
ఉమర్.. మా డబ్బులు మాకిచ్చేయ్!
కరాచీ: ఇటీవల పాకిస్తాన్ సీనియర్ క్రికెటర్ ఉమర్ అక్మల్‌ను సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే. పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) అవినీతి నిరోధక నియమావళిలోని ఆర్టికల్ 4.7.1 కింద అక్మల్ సస్పెండ్ అయ్యాడు. గతంలో పీఎస్ఎల్ ఆడే క్రమంలో తనను ఒక బుకీ సంప్రదించిన విషయాన్ని దాచి పెట్టిన కారణంగానే అక్మల్‌పై నిషేధం విధించారు. అక్మల్‌పై విచారణ పూర్తయ్యే వరకూ అతను ఎటువంటి కార్యకలాపాల్లో పాల్గొనకుండా పీసీబీ ఆదేశాలు జారీ చేసింది. దాంతో ప్రస్తుతం జరుగుతున్న పాకిస్తాన్ సూపర్ లీగ్(పీఎస్ఎల్)ను అక్మల్ మిస్సయ్యాడు. పీఎస్ఎల్ క్వెట్టా గ్లాడియేటర్స్‌కు ప్రాతినిథ్యం వహించాల్సిన అక్మల్ సస్పెన్షన్ కారణంగా ఆ లీగ్‌కు దూరం కావాల్సి వచ్చింది. దాంతో అక్మల్‌కు మరో తలనొప్పి ఎదురైంది. (ఇక్కడ చదవండి: అక్మల్‌ను సస్పెండ్ చేశారు..!) పీఎస్ఎల్ ఆడటానికి తాము ముందుగా ఇచ్చిన అడ్వాన్స్‌ను తిరిగి ఇచ్చేయాలంటూ గ్లాడియేటర్స్ స్పష్టం చేసింది. ఈ మేరకు పీఎస్ఎల్ నిర్వహిస్తున్న పాకిస్తాన్ క్రికెట్ బోర్డుకు విన్నవించింది. ‘అక్మల్ సస్పెండ్ అయిన కారణంగా అతనికి చెల్లించిన 70శాతం డబ్బును తిరిగి ఇచ్చేయండి. అతను చేసుకున్న కాంట్రాక్ట్‌లో భాగంగా చెక్ రూపంలో చెల్లించాం. దాన్ని పీసీబీ ద్వారానే సదరు క్రికెటర్‌కు అందజేశాం. దాంతో ఉమర్‌కు అందజేసిన డబ్బులు విషయంలో పీసీబీదే బాధ్యత’ అని ఫ్రాంచైజీ అధికారి ఒకరు తెలిపారు. పీఎస్ఎల్లో ఆటగాళ్ల నుంచి ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉండేందుకు నగదును క్రికెట్ బోర్డు ద్వారానే ఇప్పిస్తున్నారు. ఈ క్రమంలోనే అక్మల్‌కు 70 శాతం కాంట్రాక్ట్ మొత్తాన్ని చెల్లించారు. (ఇక్కడ చదవండి: ‘జీవితకాల నిషేధం విధించండి’) అబ్దుల్ రజాక్‌ను ‘అమ్మ’ను చేసేశాడు..! -
‘జీవితకాల నిషేధం విధించండి’
కరాచీ: పాకిస్తాన్ క్రికెట్లో మళ్లీ మ్యాచ్ ఫిక్సింగ్ కలకలం రేగడంతో ఆ జట్టు మాజీ కెప్టెన్, ప్రముఖ వ్యాఖ్యత రమీజ్ రాజా ఆగ్రహం వ్యక్తం చేశాడు. అసలు అవినీతికి పాల్పడ్డ పాక్ క్రికెటర్లపై జీవితకాలం నిషేధం విధించేలా పార్లమెంట్లో చట్టం చేయాలని ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌కు విజ్ఞప్తి చేశాడు. గతంలో పాకిస్తాన్ సూపర్ లీగ్(పీఎస్ఎల్)లో ఫిక్సింగ్ చేయమని తనను కొంతమంది సంప్రదించిన విషయాన్ని పాకిస్తాన్ వెటరన్ క్రికెటర్ ఉమర్ అక్మల్ దాచి పెట్టాడు. ఇది తాజా విచారణలో తేలడంతో పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) అవినీతి నిరోధక నియమావళిలోని ఆర్టికల్ 4.7.1 కింద అతన్ని సస్పెండ్ చేసింది. దీనిపై పూర్తి విచారణ జరిగే వరకూ అక్మల్‌పై నిషేధం కొనసాగుతుందని పేర్కొంది. దీంతో పీసీబీ అవినీతి నిరోధక విభాగం విచారణ ముగిసే వరకు అక్మల్ ఎలాంటి క్రికెట్ కార్యకలాపాల్లో పాల్గొనే అవకాశం లేదు. ఈ క్రమంలోనే తాజా పీఎస్ఎల్ను అక్మల్ మిస్సయ్యాడు. (ఇక్కడ చదవండి: అబ్దుల్ రజాక్‌ను ‘అమ్మ’ను చేసేశాడు..!) అయితే ఈ తరహా క్రికెటర్లను అసలు క్రికెట్ ఆడకుండా జీవితకాలం నిషేధం విధించాలని రమీజ్ రాజా డిమాండ్ చేస్తున్నాడు. ఈ మేరకు పార్లమెంట్లో చట్టం చేయాలని ప్రధాని ఇమ్రాన్‌ను కోరాడు. ‘ షార్జిల్, ఖలీద్‌ల ఫిక్సింగ్ వ్యవహారం నిన్ననో-మొన్ననో జరిగినట్లు ఉంది. అది ఇంకా కళ్లు ముందు ఉండగానే మరొక ఫిక్సింగ్ కలకలం. పాకిస్తాన్ క్రికెట్లో ఇలా జరగుతూ ఉండటం నన్ను తీవ్రంగా కలచి వేస్తోంది. మరొకవైపు అసహ్యం కూడా వేస్తోంది. ఇక నుంచి ఫిక్సింగ్ చేసేవాళ్లు జీవిత కాలం నిషేధం విధించేలా చట్టం అవసరముంది. న్యూజిలాండ్ తరహా దేశాల్లో ఫిక్సింగ్ చేస్తే చాలా కాలం వరకూ వారికి అవకాశమే ఉండదు. ఫిక్సింగ్‌లో దోషి అని తేలితే జీవితం కాలం వేటే సరైనది’ రమీజ్రాజా పేర్కొన్నాడు. -
ఎట్టకేలకు అక్మల్‌ను సస్పెండ్ చేశారు..!
కరాచీ: పాకిస్తాన్ సీనియర్ క్రికెటర్ ఉమర్ అక్మల్‌పై ఎట్టకేలకు సస్పెన్షన్ వేటు పడింది. పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) అవినీతి నిరోధక నియమావళిలోని ఆర్టికల్ 4.7.1 కింద ఆయనను సస్పెండ్ చేశారు. ఈ ఆదేశాలు తక్షణమే అమల్లోకి వస్తాయని పీసీబీ గురువారం ఓ ప్రకటనలో వెల్లడించింది. దీంతో పీసీబీ అవినీతి నిరోధక విభాగం విచారణ ముగిసే వరకు అక్మల్ ఎలాంటి క్రికెట్ కార్యకలాపాల్లో పాల్గొనే అవకాశం లేదు. ‘ప్రస్తుతం విచారణ కొనసాగుతున్నందున పీసీబీ దీనిపై ముందు ముందు ఎలాంటి వ్యాఖ్యలు చేయబోదు’ అని పీసీబీ ఓ ప్రకటనలో పేర్కొంది. గతంలో పీఎస్ఎల్లో భాగంగా ఒక బుకీ సంప్రదించిన విషయాన్ని దాచి పెట్టిన కారణంగానే అతనిపై నిషేధం విధించినట్లు తెలుస్తోంది. ఓ ఫిట్నెస్ టెస్ట్ సందర్భంగా ఉమర్ అక్మల్ దురుసుగా ప్రవర్తించినట్టు ఆరోపణలు వచ్చిన నేపథ్యంలోనే అతడిపై సస్పెన్షన్ వేటు పడాల్సి ఉండగా దాని నుంచి తప్పించుకున్నాడు. లాహార్‌లోని నేషనల్ క్రికెట్ అకాడమీ వద్ద జరిగిన ఫిట్నెస్ టెస్టులో విఫలమైన అక్మల్... అక్కడి సిబ్బందితో అభ్యంతరకరంగా ప్రవర్తించినట్టు ఆరోపణలు వచ్చాయి. (ఇక్కడ చదవండి: మేము వదిలేసుకోవడానికి సిద్ధం: పాకిస్తాన్) కొన్ని రోజుల క్రితం ఈ ఘటనపై అక్మల్ క్షమాపణలు కోరిన క్రమంలో అతనిపై ఎటువంటి నిషేధం విధించడం లేదని పీసీబీ తెలిపింది. ఇప్పుడు అవినీతి నిరోధక నియమావళిని అతిక్రమించిన కారణంగా అక్మల్‌ను సస్పెండ్ చేశారు. గతేడాది ఆగస్టులో శ్రీలంకపై జరిగిన టీ20 మ్యాచ్‌లో పాకిస్తాన్ తరపున అక్మల్ చివరిసారి కనిపించాడు. ఆ సిరీస్‌లో అక్మల్ ఘోరంగా విఫలం కావడంతో అతనిపై తీవ్ర విమర్శలు వచ్చాయి. దాంతో పాకిస్తాన్ జట్టులో అక్మల్ చోటు కోల్పోయాడు. ప్రస్తుతం పాకిస్తాన్ సూపర్ లీగ్(పీఎస్ఎల్) ఆరంభానికి ముందు అక్మల్‌ను సస్పెండ్ చేయడం గమనార్హం. ఈ రోజు నుంచి పీఎస్ఎల్ ఆరంభం కానుంది. (ఇక్కడ చదవండి: అబ్దుల్ రజాక్‌ను ‘అమ్మ’ను చేసేశాడు..!) -
మేము వదిలేసుకోవడానికి సిద్ధం: పాకిస్తాన్
కరాచీ: ఆసియాకప్ హక్కులను వదిలేసుకోవడానికి పాకిస్తాన్ క్రికెట్ బోర్డు(పీసీబీ) సిద్ధమైంది. ఈ ప్రతిష్టాత్మక టోర్నీలో భారత క్రికెట్ జట్టు పాల్గొనడానికి సిద్ధంగా లేని క్రమంలో తాము ఏకంగా హక్కులనే వదిలేసుకోవడానికి కూడా వెనుకాడబోమని పీసీబీ చైర్మన్ ఇహసాన్ మణి తెలిపారు. ఈ ఏడాది సెప్టెంబర్‌లో ఆసియా కప్ జరగాల్సి ఉంది. దీని హక్కులను పాకిస్తాన దక్కించుకోగా, భారత్ మాత్రం అక్కడికి తమ జట్టును పంపమని ఇది వరకే తేల్చిచెప్పింది. అయినప్పటికీ భారత్ నిర్ణయం కోసం వేచిచూస్తామని పీసీబీ గతంలో స్పష్టం చేసినా, ఇప్పుడు మాత్రం చేతులెత్తేసినట్లే కనబడుతోంది. భారత క్రికెట్ జట్టు ఆసియా కప్‌లో ఆడకపోతే తాము ఆ నిర్వహణ హక్కులను వదులుకుంటామని మణి తెలిపారు. దీనిపై మార్చి నెలలో జరుగనున్న ఆసియన్ క్రికెట్ కౌన్సిల్(ఏసీసీ) సమావేశంలో తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. మణి వ్యాఖ్యలను ఈ టోర్నీని ఎక్కడ నిర్వహించాలనే దానిపై చర్చించనున్నారు. (ఇక్కడ చదవండి: అబ్దుల్ రజాక్‌ను ‘అమ్మ’ను చేసేశాడు..!) ‘అసోసియేట్ సభ్యుల ఆదాయాలు ప్రభావితం కాకుండా చూసుకోవాలి. ఇది ఐసీసీ పూర్తి సభ్యత్వం ఉన్న దేశాల గురించి కాదు.. ఇక్కడ అసోసియేట్ సభ్యత్వం కల్గిన దేశాల గురించి కూడా ఆలోచించాలి. అవసరమైతే మేము ఆసియా కప్ హక్కులను సైతం వదులకోవడానికి కూడా సిద్ధంగా ఉన్నాం’ అని పాకిస్తాన్ సూపర్ లీగ్(పీఎస్ఎల్)ను తాజా సీజన్లో ట్రోఫీని ఆవిష్కరించిన క్రమంలో మణి ఈ వ్యాఖ్యలు చేశారు. కాగా, ఆసియా కప్‌లో భారత్ ఆడితే అది పాకిస్తాన్ వేదిక మీద ఉండదని విషయాన్ని బీసీసీఐ అధికారి ఒకరు తెలిపారు. భారత్ లేకుండా పాక్‌లో ఆసియా కప్ జరిగితే అదొక భిన్నమైన గేమ్‌గా ఉంటుంది, ఒకవేళ భారత్ ఆడాలనుకుంటే మాత్రం తాము ఆడే మ్యాచ్‌లు వేదిక మాత్రం పాకిస్తాన్లో ఉండదన్నారు. ఆసియా కప్‌పై పాకిస్తాన్ ఎన్నో ఆశలు పెట్టుకుంది. ఈ టోర్నీలో భారత్ పాల్గొంటేనే విజయవంతం అవుతుందని పీసీబీ భావించింది. భారత్ మద్దతు లేకండా ఈ టోర్నీ విజయవంతం కాదని పీసీబీ సీఈఓ వసీం ఖాన్ గతంలోనే అభిప్రాయపడ్డాడు. ఆసియా కప్‌లో భారత్ ఆడాలని ఆకాంక్షించాడు. అయితే ఆసియా కప్ భారత్‌లో నిర్వహించినా పాక్ రావడానికి సిద్దంగా ఉందన్నాడు. అంతిమంగా ఈ మెగా టోర్నీలో భారత్ ఆడాలన్నదే తమ ఆశ అని వసీం ఖాన్ పేర్కొన్నాడు. అయితే ఆసియన్ క్రికెట్ కౌన్సిల్, ఐసీసీలదే తుది నిర్ణయమని స్పష్టం చేశాడు. తటస్థ వేదకల్లోనైనా భారత్‌తో పాక్ ఆడాలని కోరుకుంటున్నట్లు తెలిపాడు. 26/11 దాడుల తర్వాత పాక్‌తో ద్వైపాకిక్ష సిరీస్‌లను భారత్ రద్దు చేసుకున్న విషయం తెలిసిందే. దాంతో పాకిస్తాన్‌తో తటస్థ వేదికలపై ఐసీసీ నిర్వహించే టోర్నీల్లో మాత్రమే భారత్ పాల్గొంటుంది. -
అబ్దుల్ రజాక్‌ను ‘అమ్మ’ను చేసేశాడు..!
కరాచీ: ఇటీవల పాకిస్తాన్ సీనియర్ క్రికెటర్ ఉమర్ అక్మల్ అన్ని విధాల విమర్శల పాలవుతున్నాడు. కొన్ని రోజుల క్రితం ఫిట్నెస్ పరీక్షలకు హాజరై ట్రైనీతో గొడవపడిన అక్మల్.. మరొకసారి తాను చేసిన ట్వీట్‌తో నవ్వుల పాలయ్యాడు. ఇక్కడ పాకిస్తాన్ మాజీ ఆల్ రౌండర్ అబ్దుల్ రజాక్‌ను ‘అమ్మ’ను చేయడంతో నెటిజన్ల విమర్శలకు గురయ్యాడు. ఇంగ్లిష్‌లో అంతగా ప్రావీణ్యం లేని ఉమర్ అక్మల్.. రజాక్‌తో దిగిన ఫొటోను ట్వీటర్లో జత చేసి ‘Mother from another Brother’ అనే క్యాప్షన్ జోడించాడు. ఇక్కడ కాస్త తికమక పడ్డ అక్మల్.. ఏకంగా రజాక్‌ను ‘అమ్మ’ను చేయడం ఒకవైపు నవ్వులు పూయించడంతో పాటు మరొకవైపు విమర్శల పాలు చేసింది. వాస్తవానికి ‘Brother from another Mother’ అనే విషయాన్ని ఉమర్ అక్మల్ చెప్పాలనుకున్నాడు.. కానీ.. దాన్ని రివర్స్‌లో ఉమర్ అక్మల్ వాడేశాడు. (ఇక్కడ చదవండి: నాకు కొవ్వుందా.. ఏది చూపించు!) దీంతో.. నెటిజన్లు అతనిపై సెటైర్ల వర్షం కురిపించేశారు. అభిమానుల విమర్శలతో తేరుకున్న ఉమర్ అక్మల్.. వెంటనే ఆ ట్వీట్‌ని డిలీట్ చేశాడు. అయితే అప్పటికే అది వైరల్‌గా మారిపోవడంతో ఉమర్ అక్మల్ మరొకసారి ‘ట్రెండ్’ అయిపోయాడు. ‘ఎందుకురా నాయనా.. ఇంగ్లిష్ రాకపోతే, నీకు తెలిసిన హిందీలో ట్వీట్ చేయొచ్చు కదా’ అని ఒకరు ఎద్దేవా చేయగా, ‘ నీకు పాకిస్తాన్ జట్టులో అవకాశం రాకపోతే, దాన్ని దక్కించుకునే ప్రయత్నం గట్టిగా చేయి కానీ ఇలా అభాసు పాలుకావొద్దు’ అని మరొకరు చమత్కరించారు. ‘An apple a day keeps the doctor away’ అనే సామెతను ‘A doctor a day Keeps the apple away’ అన్నట్లు ఉంది ఉమర్ అక్మల్ సర్ అంటూ విమర్శిస్తున్నారు. -
ఉమర్ అక్మల్‌పై నో యాక్షన్!
కరాచీ: పాకిస్తాన్ నేషనల్ క్రికెట్ అకాడమీ(ఎన్సీఏ) ట్రైనర్‌ను కొట్టినంత పని చేసిన ఆ దేశ వెటరన్ బ్యాట్స్‌మన్ ఉమర్ అక్మల్‌పై ఎటువంటి చర్యలు తీసుకోకుండానే ఆ వివాదాన్ని పీసీబీ ముగించేసింది. ఇటీవల నిర్వహించిన ఫిట్నెస్ టెస్టుల్లో భాగంగా ట్రైనర్‌తో అతిగా ప్రవర్తించిన ఉమర్ అక్మల్‌పై జరిమానాతో పాటు నిషేధం కూడా ఉంటుందని హరూన్ రషీద్ నేతృత్వంలోని ఎంక్వైరీ కమిటీ స్పష్టం చేసింది. అతన్ని తాత్కాలికంగా పాకిస్తాన్ దేశవాళీ మ్యాచ్‌లు ఆడకుండా నిషేధం విధించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని విచారణ తర్వాత హరూన్ పేర్కొన్నాడు. దీనిపై నివేదకను కూడా పీసీబీ అందజేశాడు. అయితే పీసీబీ మాత్రం పేరుకే కమిటీ వేసి విచారణ చేపట్టినా అతనిపై చర్యలకు ముందుడుగు వేయలేదు. తన ప్రవర్తనపై క్షమాపణలు చెప్పడంతో అక్మల్‌పై ఎటువంటి చర్యలు తీసుకోలేదు. మరొకసారి ఆ తప్పు చేయొద్దని హెచ్చరించి వదిలేసింది. దాంతో నిషేధం నుంచి అక్మల్ తప్పించుకున్నట్లయ్యింది. గతంలో మికీ ఆర్థర్ కోచ్‌గా ఉన్న సమయంలో కూడా అక్మల్ ప్రవర్తన పీసీబీకి తలనొప్పిగా ఉండేది. పలుమార్లు కోచ్‌ను విమర్శించడంతో పాటు ఫిట్నెస్ టెస్టును కూడా సీరియస్‌గా పట్టించుకునేవాడు కాదు. అయినప్పటికీ అతనిపై చర్యలు శూన్యం. కొన్ని రోజుల క్రితం నిర్వహించిన పలురకాల ఫిట్నెస్ టెస్టుల్లో విఫలం కావడంతో పాటు తనకు కొవ్వు ఉందంటావా అంటూ ట్రైనర్‌తో వాగ్వాదానికి దిగాడు. తనకు కొవ్వు ఎక్కడ ఉందో చూపించూ అంటూ అతిగా ప్రవర్తించాడు. చొక్కా విప్పి మరీ బెదిరింపు చర్యలకు దిగాడు. దీనిపై కోచ్ మిస్బావుల్ హక్-పీసీబీలకు సదరు ట్రైనర్ ఫిర్యాదు చేశాడు. దానిపై కమిటీ వేసిన పీసీబీ.. ఎటువంటి చర్యలు తీసుకోకుండానే చేతులు దులుపేసుకోవడం పాకిస్తాన్ క్రికెట్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. గతేడాది అక్టోబర్‌లో శ్రీలంకతో జరిగిన టీ20 సిరీస్ ద్వారా పాకిస్తాన్ క్రికెట్ జట్టులోకి రీఎంట్రీ ఇచ్చిన వికెట్ కీపర్ ఉమర్ అక్మల్ వరుసగా రెండు గోల్డెన్ డక్‌లతో విమర్శల పాలై జట్టుకు మరొకసారి దూరమయ్యాడు. ప్రస్తుతం పాకిస్తాన్ క్రికెట్ జట్టు హెడ్ కోచ్‌గా ఉన్న మిస్బావుల్ హక్.. ఆటగాళ్ల ఫిట్నెస్ టెస్టులపై సీరియస్‌గా దృష్టిసారించాడు. జూనియర్, సీనియర్ స్థాయిలో క్రికెటర్లు ఏ ఫిట్నెస్ టెస్టులో విఫలమైనా అతన్ని పక్కకు పెట్టాలనే తలంపుతో ముందుకు వెళుతున్నాడు. ఇది కేవలం అంతర్జాతీయ మ్యాచ్‌లతో పాటు దేశవాళీ మ్యాచ్‌లకు కూడా వర్తింప చేస్తే ఫిట్నెస్ ప్రమాణాలు పెరుగుతాయనే భావనలో ఉన్నాడు. ఈ క్రమంలోనే ఉమర్ అక్మల్‌కు ఫిట్నెస్ నిర్వహించగా ఫెయిల్ అయ్యాడు. -
సర్ఫరాజ్‌కు పీసీబీ షాక్!
కరాచీ: గత కొంతకాలంగా పాకిస్తాన్ క్రికెట్ జట్టులో చోటు కోల్పోయినప్పటికీ వన్డే కెప్టెన్సీ హోదాలో మాత్రం కొనసాగుతూ వస్తున్నాడు సర్ఫరాజ్ అహ్మద్. గతేడాది అక్టోబర్‌లో సర్ఫరాజ్‌ను టెస్టు కెప్టెన్సీ, టీ20 కెప్టెన్సీ పదవుల నుంచి తొలగించిన పీసీబీ.. అజహర్ అలీకీ టెస్టు కెప్టెన్ పదవి కట్టబెట్టగా, బాబర్ అజామ్‌కు టీ20 సారథ్య బాధ్యతలను అప్పగించింది. అయితే పాకిస్తాన్‌కు వన్డే సిరీస్‌లు లేకపోవడంతో అప్పట్లో ఆ ఫార్మాట్ కెప్టెన్‌గా సర్ఫరాజ్‌నే కొనసాగిస్తున్నామని పీసీబీ పేర్కొంది. అయితే ఏప్రిల్‌లో బంగ్లాదేశ్‌తో ఏకైక వన్డే జరుగుతుండటంతో సర్ఫరాజ్‌కు మొత్తంగా ఉద్వాసన పలకాలనే యోచనలో ఉంది పీసీబీ. ప్లేయర్‌గా కూడా ఆ మ్యాచ్‌లో సర్ఫరాజ్ చోటు ఇవ్వడానికి సుముఖంగా లేని పీసీబీ సెలక్టర్లు.. ఇప్పుడు కెప్టెన్‌గా ఎవర్ని చేయాలనే దానిపై కసరత్తులు చేస్తున్నారు. (ఇక్కడ చదవండి: సర్ఫరాజ్ ఇక దేశవాళీ ఆడుకో: ఇమ్రాన్) ఈ రేసులో ముందు వరుసలో ఉన్న పేరు బాబర్ అజామ్. టీ20 ఫార్మాట్‌కు కెప్టెన్‌గా ఉన్న అజామ్‌నే వన్డే ఫార్మాట్‌కు కూడా కెప్టెన్‌గా చేయాలని పీసీబీ ఇప్పటికే ప్రణాళికలు చేసింది. అయితే సర్ఫరాజ్‌ను పక్కకు పెడుతున్నారనే వార్తల నేపథ్యంలో విమర్శలు మొదలయ్యాయి. గతేడాది వరుసగా ఆరు వన్డే మ్యాచ్‌ల్లో విజయాలు అందించిన సర్ఫరాజ్‌కు ఉద్వాసన చెప్పడం మంచి నిర్ణయం కాదని ఆ దేశీ మాజీలు అంటున్నారు. 2017లో సర్ఫరాజ్ నేతృత్వంలోని పాకిస్తాన్ చాంపియన్స్ ట్రోఫీ గెలవడమే కాకుండా అతనే నేతృత్వంలోని టీ20 ర్యాంకింగ్స్‌లో పాక్ టాప్కు చేరుకుందనే విషయాన్ని గుర్తు చేస్తున్నారు. ఇది సర్ఫరాజ్‌కు జరిగిన నష్టంగానే చూడాలని పాకిస్తాన్ మాజీ చీఫ్ సెలక్టర్ మొహిసిన్ ఖాన్ తెలిపారు. అతను కీపర్ అనే అంశాన్ని పరిగణలోకి తీసుకుని మాత్రమే ప్లేయర్‌గా అన్యాయం చేస్తున్నారన్నాడు. -
సీనియర్స్‌తో బేరాలాడితే ఇలానే ఉంటుంది
కరాచీ: అండర్-19 వరల్డ్‌కప్‌లో భారత్ అద్భుత ప్రదర్శనను కొనియాడిన పాకిస్తాన్ మాజీ పేసర్ షోయబ్ అక్తర్.. తమ జట్టును మాత్రం దుమ్మెత్తిపోశాడు. అసలు ఆట ఎలా ఆడాలో, ఒత్తిడిని ఎలా అధిగమించాలో భారత యువ జట్టును చూసి నేర్చుకోవాలంటూ చురకలంటించాడు. ఇటీవల పాకిస్తాన్‌తో జరిగిన సెమీ ఫైనల్లో భారత్ 10 వికెట్ల తేడాతో విజయం సాధించి ఫైనల్‌కు చేరిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే పాకిస్తాన్ ప్రదర్శనపై అక్తర్ మండిపడ్డాడు. ప్రత్యేకంగా భారత ఓపెనర్ యశస్వి జైస్వాల్‌ను కొనియాడాడు. ఒక పానీపూరీ అమ్ముకుంటూ జట్టులో చోటు కోసం కష్టపడటమే కాకుండా కీలక సమయంలో తనలోని సత్తాను చాటి జట్టు నమ్మకాన్ని జైస్వాల్ నిలబెడితే, మీరంతా కలిసి ‘మేము ఇంతే’ అన్నట్లు ఏదో మొక్కుబడిగా ఆడేసి వచ్చారంటూ విమర్శించాడు. (ఇక్కడ చదవండి: పది వికెట్లతో పని పట్టారు) ఇక పాకిస్తాన్ క్రికెట్ బోర్డు(పీసీబీ)ని కూడా అక్తర్ వదిలి పెట్టలేదు. అండర్-19 వరల్డ్‌కప్‌కు వెళ్లే జట్టుకు ఆ స్థాయి వరకూ మాత్రమే ఆడిన క్రికెటర్లతో కోచింగ్ ఇప్పిస్తారా అంటూ ధ్వజమెత్తాడు. పాకిస్తాన్లో ఎంతోమంది సీనియర్ క్రికెటర్లు ఉన్నా వారిని పట్టించుకోకుండా కింది స్థాయి కోచింగ్ ఇస్తే ఇలానే ఉంటుందంటూ ఎద్దేవా చేశాడు. ‘పాకిస్తాన్లో యూనస్ ఖాన్, మహ్మద్ యూసఫ్ వంటి స్టార్ క్రికెటర్లు ఉన్నారు కదా. వారిద్దరూ పాకిస్తాన్ క్రికెట్ జట్టుకు సాయం అందించడానికి ముందుకొచ్చినా బోర్డు మాత్రం సుముఖంగా లేదు. ఇక్కడ భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు(బీసీసీఐ)ని చూసి నేర్చుకోండి. జూనియర్ స్థాయిలో వారి కోచింగ్ ప్రమాణాలు ఎలా ఉన్నాయో ఒక్కసారి చూడండి. భారత్ క్రికెట్లో ద వాల్‌గా పిలవబడిన రాహుల్ ద్రవిడ్ వంటి ఆటగాడు అండర్-19, భారత్-‘ఎ’ జట్లకు కోచ్‌గా వ్యవహరించాడు. చాలామంది క్రికెటర్లు ద్రవిడ్ శిక్షణలో రాటుదేలి ఇప్పుడు సత్తాను చాటుతున్నారు. జూనియర్ స్థాయి నుంచి క్రికెటర్ల ప్రతిభను గుర్తించడంతో పాటు వారికి సరైన కోచింగ్ ఇవ్వాలి. అప్పుడే జట్టు బలంగా మారుతుంది. మరి మనం ఎప్పుడూ ఒక ప్రతిభ ఉన్న సీనియర్ క్రికెటర్‌ను అండర్-19 స్థాయిలో కోచ్‌గా నియమించుకుందాం. పీసీబీ ఏదో జాబ్ ఉందంటే యూనిస్ ఖాన్ దరఖాస్తు చేసుకుని మీ వద్దకు వచ్చాడు. అప్పుడు మీరేం చేశారు. అతనితో బేరాలాడారు. అతను రూ. 15 లక్షలు అడిగితే, మీరు రూ. 13 లక్షలకే చేయమంటూ గీత గీసుకుని కూర్చుకున్నారు. ఇదేనా సీనియర్ క్రికెటర్లకు ఇచ్చే విలువ. ఇలాగే దిగ్గజ క్రికెటర్లను ట్రీట్ చేస్తారా. మీరు అండర్ 19 స్థాయి క్రికెట్ ఆడిన వారితో మాత్రమే కోచింగ్ ఇప్పిస్తామంటే మన రాతలు ఎప్పటికీ ఇంతే’ అంటూ అక్తర్ విమర్శలు గుప్పించాడు. -
నాకు కొవ్వుందా.. ఏది చూపించు!
కరాచీ: గతేడాది అక్టోబర్‌లో శ్రీలంకతో జరిగిన టీ20 సిరీస్ ద్వారా పాకిస్తాన్ క్రికెట్ జట్టులోకి రీఎంట్రీ ఇచ్చిన వికెట్ కీపర్ ఉమర్ అక్మల్ వరుసగా రెండు గోల్డెన్ డక్‌లతో విమర్శల పాలై జట్టుకు మరొకసారి దూరమయ్యాడు. అయితే తాజాగా ఒక వివాదంలో చిక్కుకున్నాడు ఉమర్ అక్మల్. పాకిస్తాన్ క్రికెట్ బోర్డు(పీసీబీ) నిర్వహించిన ఫిట్నెస్ టెస్టులకు హాజరైన ఉమర్ అక్మల్. అక్కడ ఎన్సీఏ అకాడమీలో ఉన్న ట్రైనర్‌తో అతిగా ప్రవర్తించాడు. ఉమర్ అక్మల్‌కు ఫిట్నెస్ నిర్వహించే క్రమంలో ట్రైనర్‌తో వాగ్వాదానికి దిగాడు. తనకు ఎక్కడ కొవ్వుందో చూపించూ అంటూ వాదించాడు. ఒక ఫిట్నెస్ టెస్టు ఫెయిల్ అయిన తర్వాత సహనం కోల్పోయిన ఉమర్ అక్మల్ నోటికి వచ్చినట్లు మాట్లాడాడు. ఇది పీసీబీ పెద్దల దృష్టికి వెళ్లడంతో ఉమర్ అక్మల్‌పై క్రమశిక్షణా చర్యలు తీసుకునే అవకాశం ఉంది. తదుపరి దేశవాళీ టోర్నమెంట్ నుంచి అక్మల్‌ను నిషేధించే అవకాశాలు కనబడుతున్నాయి. ప్రస్తుతం పాకిస్తాన్ క్రికెట్ జట్టు హెడ్ కోచ్‌గా ఉన్న మిస్బావుల్ హక్.. ఆటగాళ్ల ఫిట్నెస్ టెస్టులపై సీరియస్‌గా దృష్టిసారించాడు. జూనియర్, సీనియర్ స్థాయిలో క్రికెటర్లు ఏ ఫిట్నెస్ టెస్టులో విఫలమైనా అతన్ని పక్కకు పెట్టాలనే తలంపుతో ముందుకు వెళుతున్నాడు. ఇది కేవలం అంతర్జాతీయ మ్యాచ్‌లతో పాటు దేశవాళీ మ్యాచ్‌లకు కూడా వర్తింప చేస్తే ఫిట్నెస్ ప్రమాణాలు పెరుగుతాయనే భావనలో ఉన్నాడు. ఈ క్రమంలోనే ఉమర్ అక్మల్‌కు ఫిట్నెస్ నిర్వహించగా ఫెయిల్ అయ్యాడు. దాంతో ఫిట్నెస్ టెస్టులు నిర్వహించే ట్రైనర్‌ను తిట్టిపోశాడు. చొక్కా విప్పి మరీ తన కొవ్వును చూపించు అంటూ బెదిరింపు చర్యలకు దిగాడు. గతంలో మికీ ఆర్థర్ కోచ్‌గా ఉన్న సమయంలో కూడా ఉమర్ అక్మల్ పదేపదే ఫిట్నెస్ టెస్టుల్లో విఫలమయ్యాడు. అప్పుడు కూడా ఆర్థర్‌పై విమర్శలు గుప్పించిన సందర్భాలు కూడా ఉన్నాయి. -
బీసీసీఐ ఒప్పుకునే ప్రసక్తే ఉండదు: అక్తర్
కరాచీ: అంతర్జాతీయ క్రికెట్ మండలి(ఐసీసీ) ఇటీవల తెరపైకి తీసుకొచ్చిన నాలుగు రోజుల టెస్టు క్రికెట్ ప్రతిపాదనను వ్యతిరేకిస్తున్న వారి సంఖ్య రోజు రోజుకీ పెరుగుతోంది. తాజాగా ఈ జాబితాలో పాకిస్తాన్ మాజీ పేసర్ షోయబ్ అక్తర్ చేరిపోయాడు. ఈ విధానాన్ని వద్దంటూనే దానికి ఆమోద ముద్ర పడాలంటే ముందుగా భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు(బీసీసీఐ) ఒప్పుకుని తీరాల్సిందేనని తేల్చిచెప్పాడు. అసలు బీసీసీఐ ఒప్పుకోలేని పక్షంలో దాన్ని ఐసీసీ అమలు చేయడానికి ఒక్క అడుగు కూడా ముందుకు వేయదన్నాడు. ఈ విషయంలో బీసీసీఐ ఒప్పుకునే ప్రసక్తే ఉండదని అక్తర్ అభిప్రాయపడ్డాడు. సౌరవ్ గంగూలీ నేతృత్వంలోని బీసీసీఐ.. ఐసీసీ నాలుగు రోజుల టెస్టు ప్రతిపాదనను తిరస్కరించడం ఖాయమని ధీమా వ్యక్తం చేశాడు. సంప్రదాయ టెస్టు క్రికెట్‌ను చంపాలని గంగూలీ ఎప్పటికీ అనుకోడని అన్నాడు. ఐసీసీ ప్రతిపాదనకు ఏ ఒక్కరూ సానుకూలంగా స్పందించడం లేదని, ఇదొక చెత్త నిర్ణయమని విమర్శించాడు. గంగూలీ ఒక క్రికెట్ మేధావి అని, దీనికి అతన్ని నుంచి ఎట్టి పరిస్థితుల్లోనూ గ్రీన్ సిగ్నల్ లభించదన్నాడు. ఇప్పటికే సచిన్ టెండూల్కర్, గౌతం గంభీర్, మెక్‌గ్రాత్, రికీ పాంటింగ్‌లు నాలుగు రోజుల టెస్టు ప్రతిపాదనను వ్యతిరేకించారు. ఇక పాకిస్తాన్ నుంచి కూడా క్రికెట్ పెద్దలు దీనిపై పెదవి విప్పాలని అక్తర్ కోరాడు. -
అప్పుడు గంగూలీనే కారణం
కరాచీ: ప్రస్తుతం తమ క్రికెట్ జట్టు ఎదుర్కొంటున్న గడ్డు పరిస్థితుల నుంచి బయటపడాలంటే భారత క్రికెట్ కంట్రోల్ బోర్డే(బీసీసీఐ) శరణ్యమని అంటున్నాడు పాకిస్తాన్ మాజీ క్రికెటర్ రషీద్ లతీఫ్. దీనికి బీసీసీఐ అధ్యక్షుడు, టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ చొరవ తీసుకోవాలని విన్నవించాడు. భారత్-పాక్ మధ్య ద్వైపాక్షిక సిరీస్‌తో తమ దేశంలో మళ్లీ ఆటకు మంచి రోజులు వస్తాయని భావిస్తున్న లతీఫ్.. ఆ దిశగా ప్రయత్నాలు చేయాలని గంగూలీని కోరాడు. 2004లో పాకిస్తాన్లో టీమిండియా పర్యటించిందంటే అందుకు నాటి కెప్టెన్ గంగూలీయే కారణమన్న విషయాన్ని అతడు ఈ సందర్భంగా ప్రస్తావించాడు. తమ దేశంలో పర్యటించడానికి అప్పుడు బీసీసీఐ సుముఖత చూపకపోయినా గంగూలీ కారణంగానే భారత జట్టు.. పాక్‌లో పర్యటించిందన్నాడు. ఇప్పుడు కూడా పాకిస్తాన్‌తో ద్వైపాక్షిక సిరీస్‌ల విషయంలో గంగూలీ శ్రద్ధ చూపాలన్నాడు. భారత్-పాక్ జట్ల క్రికెట్ మ్యాచ్‌ల పునరుద్ధరణకు ఓ క్రికెటర్‌గా, బీసీసీఐ చీఫ్‌గా పీసీబీ ప్రెసిడెంట్ ఎహ్సాన్ మణికి గంగూలీ సాయం చేస్తాడని తాను ఆశిస్తున్నానని తెలిపాడు. ‘భారత్-పాకిస్థాన్ నడుమ పూర్తిస్థాయి ద్వైపాక్షిక సిరీ్‌సలు జరగనంతవరకు రెండు దేశాల మధ్య పరిస్థితులు మెరుగువపడవు. 2004లో పాకిస్థాన్‌లో భారత జట్టు పర్యటనకు బీసీసీఐ మొదట విముఖత ప్రదర్శించింది. కానీ అప్పటి కెప్టెన్ గంగూలీ బోర్డు, ఆటగాళ్లకు నచ్చజెప్పి పర్యటనకు ఒప్పించాడు. సుదీర్ఘకాలం తర్వాత జరిగిన ఆ టూర్లో భారత్ మరపురాని విజయాలు అందుకుంది’ అని మాజీ కీపర్ లతీఫ్ గుర్తుచేశాడు.ఆ సమయంలో పాకిస్తాన్లో పర్యటించిన భారత జట్టు అటు వన్డే సిరీస్‌తో పాటు టెస్టు సిరీస్‌ను కూడా కైవసం చేసుకుంది. ఐదు వన్డేల సిరీస్‌ను 3-2 తేడాతో గెలిచిన భారత్.. మూడు టెస్టుల సిరీస్‌ను 2-1 తేడాతో సొంతం చేసుకుంది.(ఇక్కడ చదవండి: మా తరంలో మ్యాచ్ విన్నర్ అతడే: దాదా) -
భారత్ సంగతి మీకెందుకు!
న్యూఢిల్లీ: భారత్‌లో కంటే తమ దేశంలో సెక్యూరిటీ బాగుందంటూ అక్కసును ప్రదర్శించిన పాకిస్తాన్ క్రికెట్ బోర్డు చైర్మన్ ఎహ్సాన్ మణికి బీసీసీఐ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది. తమ దేశంలో సంగతి తాము చూసుకుంటామని, మీ దేశంలో సెక్యూరిటీపై దృష్టి పెడితే సమంజసంగా ఉంటుందంటూ బీసీసీఐ వైస్ ప్రెసిడెంట్ మహీమ్ వర్మ స్పష్టం చేశారు. అసలు భారత్‌లో సంగతి పీసీబీకి ఎందుకంటూ మండిపడ్డారు. ‘ ముందు మీరు చేయాల్సింది.. మీ దేశంలో రక్షణ గురించి. తొలుత దానిపై ఫోకస్ చేయండి. అంతేకానీ భారత్‌లో సెక్యూరిటీని ఉదహరిస్తూ వ్యాఖ్యలు చేయాల్సిన అవసరం లేదు. మా సెక్యూరిటీ గురించి మేము చూసుకుంటాం. మా దేశంలో పటిష్టమైన సెక్యూరిటీతో మ్యాచ్‌లు నిర్వహించుకునే సత్తా మాకు ఉంది. అందుకు తగినంత బలం మాకు ఉంది. మాపై వ్యాఖ్యలు ఆపి మీ పని మీరు చూసుకుంటే మంచిది’ అని మహీమ్ వర్మ స్పష్టం చేశారు. స్వదేశంలో దశాబ్దం తర్వాత శ్రీలంకతో జరిగిన తొలి టెస్టు సిరీస్ విజయవంతం కావడంతో పాకిస్తాన్ క్రికెట్ బోర్డు అమితానందంగా ఉంది. ఈ సందర్భంగా పీసీబీ చైర్మన్ ఎహ్సాన్ మణి ఆనందం వ్యక్తం చేయడంతో పాటు భారత్‌పై అక్కసు వెల్లగక్కాడు. భద్రతా పరంగా భారత్ కంటే పాకిస్తాన్ ఎంతో సురక్షితమని సంచలన వ్యాఖ్యలు చేశాడు. ‘శ్రీలంకతో జరిగిన టెస్టు సిరీస్‌తో పాకిస్తాన్ సురక్షిత దేశమని నిరూపించాం. ఇంకా ఎవరికైనా అనుమానాలు ఉంటే ఇక్కడికి(పాక్) రండి మా భద్రతా ఎలా ఉందో చూపిస్తాం. ప్రస్తుత పరిస్థితుల్లో మా పొరుగు దేశమైన భారత్ కంటే పాక్ ఎంతో సురక్షితమైన దేశం. మరి భారత్‌కు వెళ్లి క్రికెట్ ఆడటానికి లేని భయం పాక్ రావడానికి ఎందుకు?’ అని వ్యాఖ్యానించాడు. (ఇక్కడ చదవండి: ‘భారత్ కంటే పాకిస్తాన్ ఎంతో సురక్షితం’) -
ఆ క్రికెటర్‌ను వరల్డ్‌కప్‌కు పంపించొద్దు..
కరాచీ: ఇటీవల ఆస్ట్రేలియాతో జరిగిన టెస్టు సిరీస్‌లో పాకిస్తాన్ జాతీయ క్రికెట్ తరఫున అరంగేట్రం చేసిన నసీమ్ షాను అండర్-19 వరల్డ్‌కప్ జట్టులో సైతం ఎంపిక చేస్తూ ఆ దేశ జూనియర్ క్రికెట్ సెలక్షన్ కమిటీ నిర్ణయం తీసుకుంది. అయితే అండర్-19 వరల్డ్‌కప్‌కు నసీమ్‌ను పంపించవద్దని అంటున్నాడు మరో క్రికెటర్ మహ్మద్ హఫీజ్. పాక్ జాతీయ జట్టు తరఫున అరంగేట్రం చేసిన నసీమ్ మానసింకంగా, ధృఢంగా మారాలంటే మరింత సాధన అవసరమని, దాంతో జూనియర్ స్థాయిలో మ్యాచ్‌లకు ఎంపిక చేయొద్దని పీసీబీకి సూచించాడు. ‘ పీసీబీకి, మా జూనియర్ సెలక్షన్ కమిటీ ఇది నేను మర్యాద పూర్వకంగా విన్నవిస్తున్నా. అండర్-19 వరల్డ్‌కప్‌కు నసీమ్‌ను పంపవద్దు. అతను ఇప్పటికే అంతర్జాతీయ స్థాయి మ్యాచ్‌లు ఆడేశాడు. ఆ స్థాయిలో టెక్నికల్‌గా, శారీరకంగా మరింత పరిణితి సాధించాలంటే ఎక్కువ శ్రమించాలి. నసీమ్ స్థానంలో మరొకర్ని ఎంపిక చేయండి. మిగతా పేస్ బౌలర్ ఎవరైనా ఉంటే అతనికి అవకాశం ఇవ్వండి’ అని హఫీజ్ కోరాడు. శ్రీలంకతో జరిగిన రెండో టెస్టులో పాకిస్తాన్ 263 పరుగుల తేడాతో గెలిచి సిరీస్‌ను 1-0 తేడాతో కైవసం చేసుకుంది. 2009 తర్వాత స్వదేశంలో శ్రీలంకతో రెండు టెస్టుల సిరీస్ ఆడిన పాకిస్తాన్.. తొలి టెస్టును డ్రా చేసుకోగా, రెండో టెస్టులో ఘన విజయం సాధించింది. ప్రధానంగా పాకిస్తాన్ టీనేజ్ క్రికెటర్ నసీమ్ షా విజృంభించాడు.రెండో ఇన్నింగ్స్‌లో ఐదు వికెట్లు సాధించి శ్రీలంక పతనాన్ని శాసించాడు. తద్వారా ఒక టెస్టు మ్యాచ్ ఒక ఇన్నింగ్స్‌లో ఐదు వికెట్లు సాధించిన అత్యంత పిన్నవయస్కుడిగా రికార్డు సాధించాడు. ప్రస్తుతం పీసీబీ లెక్కల ప్రకారం నసీమ్ షా 16 ఏళ్ల 307 రోజుల వయసు కల్గి ఉన్నాడు. -
నసీమ్ షా సరికొత్త రికార్డు
కరాచీ: శ్రీలంకతో జరిగిన రెండో టెస్టులో పాకిస్తాన్ 263 పరుగుల తేడాతో గెలిచి సిరీస్‌ను 1-0 తేడాతో కైవసం చేసుకుంది. 2009 తర్వాత స్వదేశంలో శ్రీలంకతో రెండు టెస్టుల సిరీస్ ఆడిన పాకిస్తాన్.. తొలి టెస్టును డ్రా చేసుకోగా, రెండో టెస్టులో ఘన విజయం సాధించింది. శ్రీలంకకు 476 పరుగుల టార్గెట్‌ను నిర్దేశించిన పాకిస్తాన్ చెలరేగిపోయి బౌలింగ్ వేసింది. ప్రధానంగా పాకిస్తాన్ టీనేజ్ క్రికెటర్ నసీమ్ షా విజృంభించాడు.రెండో ఇన్నింగ్స్‌లో ఐదు వికెట్లు సాధించి శ్రీలంక పతనాన్ని శాసించాడు. నసీమ్ షా దెబ్బకు లంకేయులు తమ రెండో ఇన్నింగ్స్‌లో 212 పరుగులకు ఆలౌట్ అయ్యారు. చివరి మూడు వికెట్లలో రెండు వికెట్లను నసీమ్ షా సాధించడంతో లంకకు ఘోర ఓటమి తప్పలేదు. కాగా, ఈ క్రమంలోనే నసీమ్ షా సరికొత్త రికార్డు నెలకొల్పాడు. ఒక టెస్టు మ్యాచ్ ఒక ఇన్నింగ్స్‌లో ఐదు వికెట్లు సాధించిన అత్యంత పిన్నవయస్కుడిగా రికార్డు సాధించాడు. ఆదివారం ఆటలో చివరి బంతికి దిల్రువాన్ పెరీరాను ఔట్ చేసిన నసీమ్.. ఈ రోజు ఆటలో తొలి బంతికే లసిత్ ఎంబల్దెనియాను పెవిలియన్‌కు పంపాడు. దాంతో హ్యాట్రిక్ సాధించే అవకాశం నసీమ్‌కు వచ్చింది. కాగా, దాన్ని సాధించడంలో నసీమ్ విఫలమైనప్పటికీ, మరొక ఓవర్లో విశ్వ ఫెర్నాండో ఔట్ చేసి ఐదు వికెట్ల మార్కును అందుకున్నాడు. ఈ మ్యాచ్‌లో పాకిస్తాన తన తొలి ఇన్నింగ్స్‌లో 191 పరుగులకు ఆలౌటైతే, రెండో ఇన్నింగ్స్‌ను 555/3 వద్ద డిక్లేర్డ్ చేసింది. షాన్ మసూద్, అబిద్ అలీ, అజహర్ అలీ, బాబర్ అజామ్‌లు సెంచరీలతో మెరిశారు. ఇక శ్రీలంక తన తొలి ఇన్నింగ్స్‌లో 271 పరుగులకు ఆలౌటైంది. -
టీ20 సిరీస్ ఆడతాం.. టెస్టు సిరీస్ వద్దు!
ఢాకా: తమ దేశ పర్యటనలో టెస్టు సిరీస్ సైతం ఆడాలని పాకిస్తాన్ క్రికెట్ బోర్డు(పీసీబీ) చేసిన విన్నపాన్ని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు తోసిపుచ్చింది. పాకిస్తాన్లో ఎట్టి పరిస్థితుల్లోనూ ద్వైపాక్షిక టెస్టు సిరీస్ ఆడే ప్రసక్తే లేదని తేల్చిచెప్పింది. ఈ విషయాన్ని పీసీబీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ వాసిం ఖాన్ స్పష్టం చేశారు. తమ దేశంలో టెస్టు సిరీస్ ఆడటానికి బంగ్లాదేశ్ ఒప్పుకోలేదని తెలిపారు. వారు కేవలం టీ20 సిరీస్ ఆడటానికి మాత్రమే మొగ్గుచూపారని, టెస్టు సిరీస్ ఆడటానికి ముందుకు రాలేదన్నారు. అయితే తమ దేశంలో జరగాల్సిన మ్యాచ్‌లను తటస్థ వేదికలపై నిర్వహించడానికి పీసీబీ సుముఖంగా లేదనే విషయాన్ని వాసిం ఖాన్ ఈ సందర్భంగా ప్రస్తావించారు. తమ దేశంలోని భద్రతాపరమైన ప్రణాళికల్ని ఇప్పటికే ఐసీసీ అంగీకరించిందని, దీన్ని తమ దేశానికి వచ్చే విదేశీ క్రికెట్ బోర్డులు దృష్టిలో పెట్టుకోవాలన్నాడు. ముందుగా తమ దేశంలో టెస్టు సిరీస్ ఆడటానికి బీసీబీ ఆమోదం తెలిపినా, ఆ తర్వాత అందుకు నిరాకరించడం బాధ కల్గించిందన్నాడు. బీసీబీతో ఇంకా చర్చలు జరుపుతున్నామన్నాడు. ఇటీవల పాకిస్తాన్ పర్యటనకు వచ్చిన శ్రీలంక క్రికెట్ జట్టుముందుగా వన్డే, టీ20 సిరీస్‌లను ఆడింది. సెప్టెంబర్-అక్టోబర్‌లో పరిమిత ఓవర్ల ద్వైపాక్షిక సిరీస్ ఆడిన శ్రీలంక.. మళ్లీ టెస్టు సిరీస్ ఆడటానికి పాకిస్తాన్లో అడుగుపెట్టింది. ఈ తరహాలో బంగ్లాదేశ్ కూడా అంగీకారం తెలుపుతుందనే ఆశాభావంతో పీసీబీ పెద్దలు ఉన్నారు. -
ఇంకా ఆశే నిలబెడుతుంది: క్రికెటర్ ఆవేదన
కరాచీ: తాను దేశవాళీ క్రికెట్లో రాణిస్తున్నప్పటికీ తనపై ఎందుకింత వివక్ష అని ప్రశ్నిస్తున్నాడు పాకిస్తాన్ వెటరన్ క్రికెటర్ ఫవాద్ అలామ్. తనను అసలు సెలక్షన్ కమిటీలో పట్టించుకో పోవడంతో అలామ్ ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. చివరిసారి 2009లో పాకిస్తాన్ తరఫున ఆడిన అలామ్.. దేశవాళీ మ్యాచ్‌ల్లో 164 ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌లు ఆడి 12, 106 పరుగులు చేశాడు. దాదాపు 57.00 సగటుతో ఉన్నప్పటికీ పీసీబీ సెలక్టర్లు మాత్రం అలామ్‌ను విస్మరిస్తున్నారు. దాంతో అలామ్ స్థానిక వార్తా చానల్‌తో మాట్లాడుతూ తన మనసులో మాటను వెల్లడించాడు. ‘ నన్ను కనీసం పరిగణలోకి తీసుకోక పోవడం బాధిస్తుంది. మనం సత్తాచాటుకున్న పట్టించుకోలేకపోతే బాధ అనేది సహజంగానే వస్తుంది. నన్ను ఎందుకు ఎంపిక చేయడం లేదో నాకైతే తెలీదు. కానీ నేను ఆశ కోల్పోలేదు. నన్ను ఆశే నిలబెడుతుంది. ప్రపంచంలో నిలవాలంటే ఆశే ముఖ్యం. ఆ ఆశే నన్ను ఇంకా రాటుదేలేలా చేస్తుంది’ అని ఫవాద్ అలామ్ తెలిపాడు. పాకిస్తాన్ తరఫున మూడు టెస్టు మ్యాచ్‌లు ఆడిన అలామ్.. ఇటీవల ఖ్వాయిద్ ఈ అజామ్ ట్రోఫీలో సింధ్ తరఫున ఆడి డబుల్ సెంచరీ చేసి తాను రేసులో ఉన్నానని సెలక్టర్లకు చెప్పకనే చెప్పాడు. కానీ పాకిస్తాన్ సెలక్టర్లు మాత్రం అతన్ని పట్టించుకోవడం లేదు. అయితే తాను మళ్లీ పాకిస్తాన్ తరఫున ఆడతాననే ఆశతో ఉన్నాడు అలామ్. అంతకుముందు పాకిస్తాన్ మాజీ కెప్టెన్ సర్ఫరాజ్ అహ్మద్ దృష్టికి సైతం ఇదే విషయాన్ని తీసుకెళ్లానని చెప్పాడు. కాకపోతే అలామ్ ఏమీ చెప్పలేదని సర్ఫరాజ్ అంటున్నాడు. -
పదేళ్ల తర్వాత పాకిస్తాన్లో..
కరాచీ: ఇటీవల కాలంలో పాకిస్తాన్లో క్రికెట్ ఆడటానికి పలు దేశాలు ముందుకొస్తున్న సంగతి తెలిసిందే. 2009లో శ్రీలంక క్రికెటర్ల బస్సుపై ఉగ్రదాడి జరిగిన తర్వాత ఏ దేశం కూడా అక్కడికి పంపించడానికి సంసిద్ధత వ్యక్తం చేయడం లేదు. అయితే పాకిస్తాన్ సూపర్ లీగ్(పీఎస్ఎల్)కు శ్రీకారం చుట్టిన తర్వాత ఆ దేశంలో కాస్త మార్పు కనిపిస్తోంది. పాక్‌లో పీఎస్ఎల్లో ఆడటానికి పలువురు విదేశీ క్రికెటర్లు ఆసక్తి కనబరచడం ఒకటైతే, కొన్ని రోజుల క్రితం శ్రీలంక కూడా టీ20 సిరీస్ ఆడటానికి పాక్‌లో పర్యటించింది. అయితే ఈ పర్యటనకు శ్రీలంక స్టార్, సీనియర్ క్రికెటర్లు దాదాపు పది మంది దూరమైనప్పటికీ ‘జూనియర్ జట్టు’నే అక్కడికి పంపించీ మరీ ఎస్ఎల్సీ తమ ఒప్పందాన్ని కొనసాగించింది. కాగా, పాకిస్తాన్లో టెస్టు సిరీస్ జరిగి దాదాపు పదేళ్లు అవుతుంది. ఒక ద్వైపాక్షిక సిరీస్‌ను పాకిస్తాన్లో ఆడించాలన్న పీసీబీ కోరిక పరోక్షంగా ఇన్నాళ్లకు నెరవేరింది. తాజాగా పాక్‌లో టెస్టు సిరీస్ ఆడటానికి శ్రీలంక సమాయత్తమైంది. ఐసీసీ టెస్టు చాంపియన్‌షిప్‌లో భాగంగా పాక్‌లో శ్రీలంక టెస్టు సిరీస్ ఆడాల్సి ఉంది. దాంతో పాక్‌లో టెస్టు సిరీస్ ఆడుతున్న విషయాన్ని శ్రీలంక క్రికెట్ బోర్డు స్పష్టం చేసింది. ఇరు జట్ల మధ్య జరుగనున్న ద్వైపాక్షిక సిరీస్‌లో భాగంగా డిసెంబర్ 11 నుంచి 15 వరకూ రావల్పిండిలో తొలి టెస్టు జరుగనుండగా, డిసెంబర్ 19నుంచి 23 వరకూ కరాచీలో రెండో టెస్టు జరుగనుంది. -
బాల్ ట్యాంపరింగ్‌కు పాల్పడి మళ్లీ కష్టాల్లోకి..
కరాచీ: సుదీర్ఘ కాలం తర్వాత పాకిస్తాన్ క్రికెట్ జట్టులో పునరాగమనం చేసిన షెహజాద్ అహ్మద్ మళ్లీ కష్టాల్లో పడ్డాడు. బాల్ ట్యాంపరింగ్‌కు పాల్పడి తిరిగి ఇబ్బందుల్ని కొనితెచ్చుకున్నాడు. క్వాయిద్ ఈ అజామ్ ట్రోఫీలో భాగంగా సెంట్రల్ పంజాబ్‌కు కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న అజామ్.. సింధ్‌తో జరిగిన మ్యాచ్‌లో బాల్ ఆకారాన్ని దెబ్బ తీసే యత్నం చేశాడు. ఇది పాకిస్తాన్ క్రికెట్ బోర్డు(పీసీబీ)దృష్టికి వెళ్లడంతో పాటు దీన్ని సీరియస్‌గా తీసుకోవడంతో అజామ్ కెరీర్ డైలమాలో పడింది. ‘ బాల్ ట్యాంపరింగ్‌కు యత్నించిన అజామ్‌పై విచారణ చేపట్టాం. అతనిపై నిర్ణయం తీసుకుంటాం’ అని పీసీబీ ఒక ప్రకటనలో తెలిపింది. ఫైసలాబాద్‌లో సింధ్‌తో మ్యాచ్ జరుగుతున్న సమయంలో రెండో రోజు ఆటలో షెహజాద్ బంతి ఆకారాన్ని దెబ్బ తీసేందుకు యత్నించాడు. ఈ విషయాన్ని ఫీల్డ్ అంపైర్లు రిఫరీ నదీమ్ దృష్టికి తీసుకెళ్లడంతో షెహజాద్‌కు సమన్లు జారీ చేశారు. దీనిపై ఈరోజు నిర్ణయం తీసుకునే అవకాశాలు కనబడుతున్నాయి. ఇలా క్రమ శిక్షణా నియమావళిని ఉల్లంఘించడం షెహజాద్ ఇది తొలిసారి కాదు. 2018లో యాంటీ డోపింగ్ రూల్స్‌ను అతిక్రమించి నాలుగు నెలలపాటు నిషేధానికి గురయ్యాడు. దాంతో గతేడాది జూలై 10వ తేదీన అతనిపై సస్పెన్షన్ వేటు వేసింది పీసీబీ. కాగా, ఇటీవల శ్రీలంకతో జరిగిన టీ20 సిరీస్ ద్వారా రీ ఎంట్రీ ఇచ్చిన షెహజాద్ తీవ్రంగా నిరాశపరిచాడు. దాంతో విమర్శల పాలయ్యాడు. కాకపోతే కోచ్ మిస్బావుల్ హక్ మాత్రం షెహజాద్‌కు మద్దతుగా నిలవడంతో ఊరట లభించింది. అయితే ఇప్పుడు బాల్ ట్యాంపరింగ్ ఉదంతంలో చిక్కుకున్న షెహజాద్‌పై పీసీబీ ఏ మేరకు చర్యలు తీసుకుంటుందో చూడాలి. -
ఈ దీపావళికి మోత మోగించారు..
సనత్‌నగర్: నగరంలో ఈసారి దీపావళికి టపాసుల మోత మోగింది. పర్యావరణహిత దీపావళి జరుపుకోవాలని స్వచ్ఛంద సంస్థలు పిలుపునిచ్చినా నగరవాసులు వినిపించుకోలేదు. ఫలితంగా గతేడాది దీపావళి రోజు కంటే ఈసారి కాలుష్యం అధికంగా నమోదైంది. రెసిడెన్షియల్, ఇండస్ట్రియల్, కమర్షియల్.. ఇలా అన్ని ప్రాంతాల్లోనూ పరిమితికి మించి ధ్వని కాలుష్యం నమోదు కాగా, గాలిలో కాలుష్య ఉద్గారాల పరిమితి పెరిగింది. ఈ మేరకు కాలుష్య నియంత్రణ మండలి (పీసీబీ) దీపావళికి సంబంధించిన ప్రాథమిక నివేదికను మంగళవారం విడుదల చేసింది. నివాస ప్రాంతాల్లో గతేడాది ధ్వని కాలుష్యం సరాసరిన (ఉదయం 6–రాత్రి 10) 64 డెసిబెల్స్ నమోదైతే... ఈసారి అది 69 డెసిబెల్స్‌కు పెరిగింది. నిబంధనల మేరకు రెసిడెన్షియల్ప్రాంతాల్లో 55 డెసిబెల్స్‌కు మించరాదు. వాణిజ్య ప్రాంతాల్లో గతేడాది 71 డెసిబెల్స్ నమోదైతే.. ఈసారి 72 డెసిబెల్స్‌కు పెరిగింది. వాస్తవానికి ఈ ప్రాంతాల్లో 65 డెసిబెల్స్‌కు మించరాదు. ఇక పారిశ్రామిక ప్రాంతాల్లో రాత్రి 10 గంటల తర్వాత టపాసుల మోత మోగిందని నివేదిక పేర్కొంది. ఉదయం 6 నుంచి రాత్రి 10గంటల వరకు 64 డెసిబెల్స్ ఉంటే... ఆ తర్వాత రాత్రి 10 నుంచి ఉదయం 6గంటల వరకు 71 డెసిబెల్స్‌కు పెరిగింది. గతేడాది ఈ ప్రాంతాల్లో రాత్రి 10గంటల తర్వాత 66 డెసిబెల్స్‌గా ఉంది. ఉదయం 6 నుంచి రాత్రి 10గంటల వరకు పరిగణనలోకి తీసుకుంటే గతేడాది కంటే 7 డెసిబెల్స్ తగ్గడం గమనార్హం. కమర్షియల్ ప్రాంతా ల్లో రాత్రి 10 తర్వాత 70 డెసిబెల్స్‌కు మించ రాదు. పీఎం10 రెట్టింపు శ్వాసకోశ సంబంధ వ్యాధులకు కారణమయ్యే పీఎం 10 ఉద్గార స్థాయి ఊహించని రీతిలో పెరిగినట్లు పీసీబీ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. సాధారణ రోజుల్లో సగటున 85 ఉంటే దీపావళి రోజున 163 మైక్రోగ్రాము/క్యూబిక్ మీటర్‌గా నమోదైంది. అంటే సాధారణ రోజుల్లో కంటే దాదాపు రెట్టింపు స్థాయిలో నమోదైంది. పీఎం 10 గతేడాది దీపావళికి 140 మైక్రోగ్రాము/క్యూబిక్ మీటర్ నమోదు కాగా... ఈసారి అదనంగా 23 మైక్రోగ్రాము/క్యూబిక్ మీటర్ మేర పెరిగినట్లు నివేదిక పేర్కొంది. వాస్తవానికి గాలిలో పీఎం10 ఉద్గార స్థాయి 24 గంటల పాటు సగటున 100 మైక్రోగ్రాములు/క్యూబిక్ మీటరు మించరాదు. ఇక పీఎం 2.5 మాత్రం గతేడాదితో పోలిస్తే తగ్గింది. 2018లో 95 మైక్రోగ్రాము/క్యూబిక్ మీటర్‌గా ఉంటే... ఈసారి 71.6 గా నమోదైంది. పీఎం 2.5 ఉద్గార స్థాయి 24 గంటల పాటు సగటున 60కి మించరాదు. పెరిగిన ఎన్ఓఎక్స్ కళ్లు, ముక్కు మండేలా చేసే ఆక్సైడ్స్ ఆఫ్ నైట్రోజన్ (ఎన్ఓఎక్స్) గతేడాది కంటే పెరిగింది. 2018లో 43.5 మైక్రోగ్రాము/క్యూబీక్ మీటర్ నమోదు కాగా.. ఈసారి 65కు నమోదైంది. ఇక శ్వాసకోశ, బ్రాంకైటీస్, చికాకును కలిగించే సల్ఫర్ డయాక్సైడ్ (ఎస్ఓ2) గతేడాది కంటే కాస్త తగ్గడం ఊరటనిచ్చింది. 2018లో 7.6 నమోదు కాగా.. ఈసారి 6.0 నమోదైంది. అందుకే పెరిగిందా? ఓవైపు కాలుష్యం పెరగ్గా... మరోవైపు టపాసుల విక్రయాలు మాత్రం గతేడాదితో పోలిస్తే తగ్గాయంటున్నారు వ్యాపారులు. ఈ నేపథ్యంలో కాలుష్యం తీవ్ర స్థాయిలో నమోదు కావడానికి కారణం గాలిలో ఆర్ధ్రత (తేమ శాతం) ఎక్కువగా ఉండడమేనని తెలుస్తోంది. గాలిలో తేమ శాతం ఎక్కువగా ఉన్నప్పుడు టపాసుల నుంచి వెలువడే కాలుష్య ఉద్గారాలు త్వరలో గాలిలో కలసిపోయే ఆస్కారం ఉండదు. దీంతో ఆయా ప్రాంతాల్లో చుట్టుముట్టడంతో కాలుష్యం ఎక్కువగా నమోదైందని పేర్కొంటున్నారు. గతేడాది గాలి వేగం 1.6 మీటర్స్/సెకనుగా ఉండగా... ఈసారి 0.5 మీటర్స్/సెకనుకు పడిపోయింది. సనత్‌నగర్‌లో అత్యధికం.. ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్‌ను పరిశీలిస్తే అత్యధికంగా సనత్‌నగర్‌లో 361, బొల్లారంలో 300 నమోదైంది. ఈ మేర స్థాయి ఆరోగ్యానికి హానికరమని పీసీబీ పేర్కొంది. ఇక సున్నిత (సెన్సిటివ్) ప్రాంతాల్లోనూ కాలుష్య ఉద్గారాలు వెలువడ్డాయి. హెచ్‌సీయూ వద్ద 170, జూపార్కు వద్ద 113 నమోదైంది. -
నిషేధం తర్వాత క్రికెట్లోకి రీఎంట్రీ
కరాచీ: పాకిస్తాన్ సూపర్ లీగ్(పీఎస్ఎల్)లో స్పాట్ ఫిక్సింగ్‌కు పాల్పడి నిషేధానికి గురైన ఆ దేశ క్రికెటర్ షార్జీల్‌ఖాన్ తిరిగి రీ ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. షార్జిల్‌కు ఆ దేశ యాంటీ కరప్షన్ యూనిట్(అవినీతి నిరోధక శాఖ) నుంచి క్లియరెన్స్ లభించడంతో అతను ఆడటానికి మార్గం సుగుమం అయ్యింది. ఈ మేరకు ఇటీవల పీసీబీ యాంటీ కరప్షన్ యూనిట్ ముందు హాజరైన షార్జిల్ ఖాన్‌కు దేశవాళీ ఈవెంట్లలో ఆడటానికి అనుమతి లభించింది. దాంతో త్వరలో ఆరంభం కానున్న పీఎస్ఎల్లో షార్జిల్ ఆడనున్నాడు. పీఎస్ఎల్ ఆటగాళ్ల డ్రాఫ్ట్‌లో షార్జిల్ చేరబోతున్నాడు. పాకిస్తాన్ తరఫున 25 వన్డేలు, ఏకైక టెస్టు, 15 అంతర్జాతీయ టీ20లు ఆడిన షార్జిల్.. పీఎస్ఎల్ రెండో ఎడిషన్‌లో స్పాట్ ఫిక్సింగ్‌కు పాల్పడ్డాడు. దాంతో 2017, ఆగస్టులో అతనిపై ఐదేళ్ల నిషేధం విధిస్తూ పీసీబీ నిర్ణయం తీసుకుంది. కాగా, తనను క్షమించాలంటూ పీసీబీకి షార్జిల్ విన్నవించుకోవడంతో అతనిపై ఉన్న నిషేధాన్ని రెండేళ్లకే పరిమితం చేశారు. దాంతో షార్జిల్‌పై నిషేధం ముగిసింది. దాంతో షార్జిల్ తన కెరీర్‌ను తిరిగి కొనసాగించడానికి రంగం సిద్ధం చేసుకుంటున్నాడు. కాగా, ఖలీద్ లతీఫ్, మహ్మద్ ఇర్ఫాన్, మహ్మద్ నవాజ్, నసీర్ జెంషెడ్, షహ్‌జైబ్ హసన్‌లు ఇంకా నిషేధం ఎదుర్కొంటున్నారు. -
పీసీబీ.. పంజాబ్ క్రికెట్ బోర్డు అయ్యింది!
కరాచీ: పాకిస్తాన్ క్రికెట్ జట్టు టెస్టు, టీ20 కెప్టెన్‌గా సర్ఫరాజ్ అహ్మద్‌ను తప్పించడంపై ఆ దేశ క్రికెట్ ఫ్యాన్స్ నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తుంది. శ్రీలంకతో జరిగిన మూడు టీ20ల సిరీస్‌లో ఓవరాల్‌గా జట్టు మొత్తం విఫలమైతే సర్ఫరాజ్‌ను బలి పశువును చేశారంటూ మండిపడుతున్నారు. అసలు సర్ఫరాజ్ నుంచి అజహర్ అలీకి టెస్టు పగ్గాలు అప్పచెప్పడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. గత కొన్ని మ్యాచ్‌లను చూస్తే అజహర్ అలీ పూర్తిగా విఫలమయ్యాడనే విషయాన్ని పీసీబీ పెద్దలు మరిచిపోయారా అంటూ విమర్శిస్తున్నారు. గత ఐదు మ్యాచ్‌ల్లో అజహర్ అలీ పేలవ ప్రదర్శన కనిపించలేదా అంటూ పీసీబీని ఎండగడుతున్నారు. ఇప్పుడు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు కాస్తా పంజాబ్ క్రికెట్ బోర్డు అయిపోయిందంటూ ఎద్దేవా చేస్తున్నారు. పాకిస్తాన్‌లోని పంజాబ్‌కు చెందిన మిస్బావుల్ హక్, వకార్ యూనిస్‌లు ఇప్పుడు అదే ప్రాంతానికి చెందిన అజహర్ అలీని కెప్టెన్‌గా నియమించారంటూ మండిపడుతున్నారు. (ఇక్కడ చదవండి: మిస్బా మార్క్.. సర్ఫరాజ్ కెప్టెన్సీ ఫట్!) ‘ఇదొక అవినీతి నిర్ణయం.. ఇది పంజాబ్ క్రికెట్ బోర్డు’ అని ఒకరు విమర్శించగా, ‘ అలీని ఎందుకు కెప్టెన్‌గా చేశారు.. బాబర్ అజామ్‌నే అన్ని ఫార్మాట్లకు కెప్టెన్‌గా చేయాల్సింది’ అని మరొకరు విమర్శించారు. ఈ విషయంలో సర్ఫరాజ్ అహ్మద్‌ను బలి పశువునే చేశారు.. శ్రీలంకతో సిరీస్‌లో జట్టు ఓవరాల్‌గా విఫలమైతే సర్ఫరాజ్‌ను తీసేస్తారా’ అని మరొక అభిమాని ప్రశ్నించాడు. ‘ శ్రీలంకతో సిరీస్‌లో అత్యధిక పరుగులు చేసినందుకు సర్ఫరాజ్‌కు ఇది కానుక’ అని మరొకరు చమత్కరించారు. ‘అజహర్ అలీ డబ్బులిచ్చి తిరిగి జట్టులోకి వచ్చాడు’ అని మరొక అభిమాని ఫైర్ అయ్యాడు. -
మిస్బా మార్క్.. సర్ఫరాజ్ కెప్టెన్సీ ఫట్!
కరాచీ: ఇటీవల శ్రీలంకతో జరిగిన మూడు టీ20ల సిరీస్‌లో పాకిస్తాన్ వైట్‌వాష్ కావడంతో ఆ జట్టు కెప్టెన్ సర్ఫరాజ్ అహ్మద్ ముప్పు తెచ్చిపెట్టింది. దీనిపై వెంటనే చర్యలకు శ్రీకారం చుట్టిన పాకిస్తాన్ క్రికెట్ బోర్డు(పీసీబీ).. సర్ఫరాజ్‌ను టీ20లతో పాటు టెస్టు కెప్టెన్సీ నుంచి తప్పిస్తూ నిర్ణయం తీసుకుంది. కొన్ని రోజుల క్రితం పాకిస్తాన్ ప్రధాన కోచ్‌గా, చీఫ్ సెలక్టర్‌గా నియమించబడ్డ మిస్బావుల్ హక్ దిద్దుబాటు చర్యలకు రంగం సిద్ధం చేసిన నేపథ్యంలో తొలుత సర్ఫరాజ్‌ను రెండు ఫార్మాట్లకు కెప్టెన్సీ నుంచి తప్పించారు. ఒక కెప్టెన్‌గా పాకిస్తాన్ క్రికెటర్లను సరైన దారిలో పెట్టడంలో విఫలమవుతున్న సర్ఫరాజ్ వైఖరిపై మిస్బా గుర్రుగా ఉన్నారు. ఈ తరుణంలో సర్ఫరాజ్‌ను సారథిగా తప్పించడమే మంచిదని భావించిన మిస్బా.. దాన్ని వెంటనే అమలు చేశాడు. కేవలం వన్డేలకు మాత్రమే సర్ఫరాజ్‌ను కెప్టెన్‌గా పరిమితం చేసిన మిస్బా నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ.. టీ20, టెస్టు ఫార్మాట్లకు వేర్వేరు సారథుల్ని నియమించింది. అజహర్ అలీని టెస్టు కెప్టెన్సీ అప్పచెప్పగా, బాబర్ అజామ్‌కు టీ20 కెప్టెన్సీ బాధ్యతలు ఇచ్చింది. కాకపోతే వచ్చే ఏడాది జూలై వరకూ పాకిస్తాన్‌కు పెద్దగా వన్డే సిరీస్‌లు లేకపోవడంతో సర్ఫరాజ్‌ను నామమాత్రపు కెప్టెన్‌గానే ఉంచారు. 2016లో టీ20 కెప్టెన్‌గా నియమించబడ్డ సర్ఫరాజ్.. 2017లో వన్డే సారథిగా ఎంపికయ్యాడు. ఈ క్రమంలోనే టెస్టు కెప్టెన్‌గా కూడా సర్ఫరాజ్ నియమించబడ్డాడు. అయితే పాకిస్తాన్ పర్యటనకు వచ్చిన ‘జూనియర్ శ్రీలంక’ జట్టు చేతిలో వైట్‌వాష్ కావడంతో సర్ఫరాజ్ కెప్టెన్సీకి ప్రధానంగా ఎసరు తెచ్చింది. -
జీవనోపాధి కోసం వ్యాన్ డ్రైవర్‌గా మారిన క్రికెటర్..
-
జీవనోపాధి కోసం వ్యాన్ డ్రైవర్‌గా మారిన క్రికెటర్..
కరాచీ: జీవనోపాధి కోసం ఒక క్రికెటర్ కాస్తా వ్యాన్ డ్రైవర్‌గా మారాడు. పాకిస్తాన్ దేశవాళీల్లో ఆడిన మాజీ క్రికెటర్ ఫజాల్ షుబాన్ తన కుటుంబాన్ని పోషించుకునేందుకు వేరే గత్యంతరం లేక వ్యాన్ నడుపుతున్నాడు. దీనికి సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. పాకిస్తాన్ క్రికెట్లో తీసుకొచ్చిన నూతన విధానం వల్ల డిపార్ట్మెంటల్ క్రికెట్‌కు చరమగీతం పాడారని, దాంతోనే తాను ఇలా రోడ్డున పడ్డానని ఆవేదన వ్యక్తం చేశాడు. ‘ పాకిస్తాన్ క్రికెట్ జట్టు తరఫున ఆడటానికి చాలా శ్రమించా. దేశవాళీ క్రికెట్లో భాగంగా ఉన్న డిపార్ట్మెంటల్ క్రికెట్లో ఆడా. దాంతో రూ. లక్ష వరకూ జీతంగా వచ్చేది. కానీ వాటిని మూసేయడంతో ఇప్పుడు వ్యాన్ డ్రైవర్‌గా మారాల్సి వచ్చింది. ఇప్పుడు నా సంపాదన 30 వేల నుంచి 35 వేల వరకూ మాత్రమే ఉంది. దీంతో కుటుంబాన్ని పోషించుకోవడం కష్టంగా ఉంది. అయినా సంతోషంగానే ఉన్నా’ అని ఫజాల్ పేర్కొన్నాడు. కాగా, ఈ వీడియో వైరల్ అయిన తర్వాత తన ట్వీటర్ అకౌంట్లో షేర్ చేశాడు పాకిస్తాన్ క్రికెటర్ మహ్మద్ హఫీజ్. పాకిస్తాన్ క్రికెట్ తీసుకొచ్చిన కొత్త పాలసీ వల్ల చాలా మంది ఇలా వీదిన పడ్డారు. ఇది చాలా బాధాకరం. ఈ పాలసీ వల్ల 200 మంది మాత్రమే లబ్ది పొందే అవకాశం ఉండగా వేల సంఖ్యలో దేశవాళీ క్రికెటర్లు ఉద్యోగాలు లేకుండా పోయారు. దీని బాధ్యత ఎవరు తీసుకుంటారు అనేది అయితే నాకు కచ్చితంగా తెలియదు. ఇలా క్రికెటర్లు ఉద్యోగాలు లేకండా బాధితులుగా మారిపోయారు’ అంటూ పేర్కొన్నాడు. -
పాక్ క్రికెటర్లతో కోచ్‌కు తిప్పలు
కరాచీ: ఇటీవల శ్రీలంకతో స్వదేశంలో జరిగిన మూడు టీ2ల సిరీస్‌లో పాకిస్తాన్ వైట్‌వాష్ కావడంతో ఆ జట్టు ప్రధాన కోచ్, చీఫ్ సెలక్టర్ మిస్బావుల్ హక్ విమర్శల పాలవుతున్నాడు. టీ20 ఫార్మాట్లో నంబర్ వన్‌గా ఉన్న పాకిస్తాన్.. శ్రీలంక ‘జూనియర్’ జట్టు చేతిలో ఘోర పరాభవాన్ని మూట గట్టుకోవడంతో మిస్బావుల్‌పై అభిమానులు అప్పుడే సోషల్ మీడియాలో సెటైర్లు గుప్పిస్తున్నారు. ఇదిలా ఉంచితే, పాకిస్తాన్ క్రికెటర్లు క్రమశిక్షణ విషయంలో కూడా సరైన వైఖరిని ప్రదర్శించడం కూడా మిస్బావుల్‌కు తలపోటుగా మారింది. పాకిస్తాన్ క్రికెట్ జట్టులోని పలువురు క్రికెటర్లు ప్రాక్టీస్ చేయడంలో కూడా బాధ్యతారాహిత్యంగా వ్యవహరించడమే మిస్బావుల్ కొత్త తలపోటుకు కారణమైంది. ‘కొంతమంది పాక్ ఆటగాళ్లు ట్రైనింగ్‌ను తేలిగ్గా తీసుకోవడమే కాకుండా రిలాక్స్డ్గా గడపడం మిస్బావుల్‌కు మింగుడు పడటం లేదు. ఒకవైపు తమ క్రికెట్ క్రమశిక్షణా ప్రమాణాలను పెంచాలని మిస్బా చూస్తున్నా అందుకు ఆటగాళ్ల నుంచి సహకారం లభించడం లేదు. ఈ విషయంలో కెప్టెన్ సర్ఫరాజ్ అహ్మద్‌కు పెద్దగా పట్టించుకోవడం లేదు. ఎవరైతే క్రమ శిక్షణలో భాగమైన ప్రాక్టీస్‌ను ఎగ్గొడుతున్నారో వారిని మందలించే యత్నం కూడా చేయడం లేదు. వారంటే సర్ఫరాజ్ భయపడుతున్నట్లు ఉన్నాడు. ప్రధానంగా వహాబ్ రియాజ్, ఇమాద్ వసీం, హరీస్ సొహైల్‌ల వ్యవహారం మిస్బాను ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఏదో వంకతో ప్రాక్టీస్‌ను తప్పించుకోవడానికే వారు చూస్తున్నారు. డ్రెస్సింగ్ రూమ్‌లో మ్యాచ్‌కు సంబంధించి ప్రణాళికల్లో భాగం కావడానికి కూడా వారు రావడం లేదు’ అని పీసీబీలోని ఉన్నతస్థాయి అధికారి ఒకరు పేర్కొన్నారు. -
శ్రీలంక క్రికెట్ బోర్డుకు పీసీబీ వార్నింగ్!
కరాచీ: ఇటీవల పాకిస్తాన్ పర్యటనకు వచ్చిన శ్రీలంక జట్టు మూడు వన్డేల సిరీస్‌ను కోల్పోగా, మూడు టీ20ల సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేసిన సంగతి తెలిసిందే. శ్రీలంక సీనియర్ క్రికెటర్లు పాకిస్తాన్ పర్యటనకు వెళ్లమంటూ డుమ్మా కొట్టిన సందర్భంలో ‘జూనియర్’ జట్టునే పంపించి మరీ హుందాతనాన్ని చాటుకుంది ఎస్ఎల్సీ. కాగా, ఇప్పుడు శ్రీలంక క్రికెట్ జట్టుకు కొత్త చిక్కు వచ్చి పడింది. ఇరు దేశాల ద్వైపాక్షిక సిరీస్‌ల ఒప్పందంలో భాగంగా వచ్చే డిసెంబర్లో జరుగనున్న టెస్టు సిరీస్ కోసం పాకిస్తాన్లో శ్రీలంక క్రికెట్ జట్టు పర్యాటించాల్సి ఉంది. అయితే ఆ జట్టు వస్తుందా.. లేదా అనే సందిగ్థంతో ఉన్న పాకిస్తాన్ క్రికెట్ బోర్డు(పీసీబీ).. ముందుగానే బెదిరింపు చర్యలకు దిగింది. ఒకవేళ పాక్ పర్యటనకు రాకుండా తటస్థ వేదికైన యూఏఈలో ఆ సిరీస్‌ను నిర్వహించాలని కోరితే మాత్రం అందుకు అయ్యే ఖర్చును ఎస్ఎల్సీ కూడా సమంగా భరించాలంటూ వార్నింగ్ ఇచ్చింది. ‘పాకిస్తాన్లో పర్యటించడానికి ఎటువంటి ఇబ్బందులు లేవు. మేము భద్రతా పరంగా అన్ని పటిష్టమైన ఏర్పాట్లు చేస్తాం. కొన్ని రోజుల క్రితం కరాచీ, లాహోర్ వేదికగా జరిగిన పరిమిత ఓవర్ల సిరీస్ విజయవంతమైంది. అలా కాకుండా యూఏఈలో నిర్వహించాలని పట్టుబడితే మాత్రం శ్రీలంక క్రికెట్ బోర్డు కూడా అందుకు ఖర్చు అయ్యే వాటాను భరించాలి’ అని పీసీబీలో అధికారి ఒకరు తెలిపారు. -
ప్లాస్టిక్ వినియోగంలో స్వీయ నియంత్రణ
సాక్షి, హైదరాబాద్: రోజువారి జీవన విధానంలో భాగంగా వివిధ రూపాల్లో పెరిగిన ప్లాస్టిక్ వస్తువుల వినియోగాన్ని తగ్గించేందుకు స్వీయ నియంత్రణ కీలకంగా మారింది. ప్రధానంగా ఒకసారి వాడి పారేసే ‘యూజ్ అండ్ త్రో’, ‘సింగిల్ యూజ్ ప్లాస్టిక్’వస్తువులతోనే సమస్య తీవ్రత పెరిగింది. దళసరికాగితం, నార(జ్యూట్), గుడ్డలతో తయారు చేసిన సంచుల ద్వారా ప్రస్తుతం సింగిల్‌యూజ్ ప్లాస్టిక్‌కు, ఇతర ప్లాస్టిక్ వస్తువులకు చెక్ చెప్పే ప్రయత్నాలు సాగుతున్నాయి. ఒకసారి విని యోగించిన ప్లాస్టిక్ సీసాలు, ఇతర వ్యర్థాలను ఎక్కడ పడితే అక్కడ పారవేస్తుండడంతో వాటి వల్ల పర్యావరణానికి, జీవవైవిధ్యానికి ఎక్కువ నష్టం జరుగుతోంది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో ప్లాస్టిక్ వస్తువుల వినియోగంపై నియంత్రణకు తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి (టీపీసీబీ) నడుం బిగించింది. పీసీబీ ఆధ్వర్యంలో ‘స్వచ్ఛతా హి సేవా’పేరిట ఈ నెలలో మొదలుపెట్టిన కార్యక్రమంలో భాగంగా ‘ప్లాస్టిక్ వేస్ట్ శ్రమదాన్’నినాదంతో ప్రజలను చైతన్యపరుస్తున్నారు. ఈ నెల 27 వరకు వివిధరూపాల్లో కార్యాచరణను చేపట్టనున్నారు. బుధవారం నుంచి హైదరాబాద్‌తోపాటు అన్ని జిల్లా కేంద్రాల్లో ఆటోల ద్వారా ఒకమారు వినియోగించిన ప్లాస్టిక్‌కు వ్యతిరేకంగా ప్రచారంతోపాటు, బాటిళ్లు ఇతరవస్తువుల సేకరణకు ప్లాస్టిక్ సేకరణ కేంద్రాలను ఏర్పాటు చేసింది. మళ్లీ వాటిని పున ర్వినియోగంలోకి తెచ్చేందుకు ఏర్పాట్లుచేస్తోంది. ప్రైవేట్సంస్థలు రూపొందించిన ‘రీ సై కాల్’ యాప్ ద్వారా ప్లాసిక్వ్యర్థాల సేకరణను చేపట్టి రీసైక్లింగ్ ద్వారా సిమెంట్ ఉత్పత్తి కర్మాగారాల్లో దానిని వినియోగించేలా చర్యలు తీసుకుంటోంది. ఇంటివద్దే ప్లాస్టిక్ వ్యర్థాలను విడదీసి దగ్గర్లోని సేకరణ కేంద్రాల్లో అందజేస్తే, వాటిని రీసైక్లింగ్‌కు, లేదా ధ్వంసం చేసేందుకు పంపిస్తారు. క్యారీ బ్యాగ్‌లు, కప్‌లు, స్ట్రాలు, కట్లరీ వంటి సింగిల్‌యూజ్ ప్లాస్టిక్ వస్తువుల వల్ల పర్యా వరణానికి జరిగే నష్టాన్ని వివిధ సాధనాల ద్వారా వివరించేందుకు పీసీబీ ఏర్పాట్లు చేసింది.అక్టోబర్ 1–7 తేదీల మధ్య ఎఫ్ఎం రేడియో కార్యక్రమాల ద్వారా, 35 లక్షల మందికి ఎస్ఎంఎస్లు పంపించడం ద్వారా, కరపత్రాల పంపిణీ, తదితర రూపా ల్లో ప్రచార, ప్రజాచైతన్య కార్యకమాలు నిర్వహిస్తోంది. -
ఇక పాక్ క్రికెటర్లకు బిర్యానీ బంద్?
లాహోర్: ఇటీవల ముగిసిన వన్డే వరల్డ్‌కప్‌లో పాకిస్తాన్ క్రికెటర్లకు చేదు అనుభవాలే ఎదురయ్యాయి. కనీసం నాకౌట్ పోరుకు అర్హత సాధించకపోవడం ఒకటైతే, ఆ దేశ క్రికెటర్లు పిజ్జాలు-బర్గర్లు తింటూ డైట్ విషయంలో అలసత్వం ప్రదర్శించారని ఫ్యాన్స్ మండిపడ్డారు. ఒక అభిమానైతే పాక్ కెప్టెన్ సర్ఫరాజ్ అహ్మద్ పిజ్జా-బర్గర్ తింటున్న వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసి మరీ విమర్శించాడు. భారత్‌తో మ్యాచ్‌లోసర్పరాజ్ ఫీల్డ్‌లోనే ఆపసోపాలు పడుతున్న మరో వీడియో చక్కర్లు కొట్టింది. వరల్డ్‌కప్‌లో పాకిస్తాన్ క్రికెట్ జట్టు పేలవ ప్రదర్శనకు ఆహార నియమావళిలో సరైన నియంత్రణ లేకపోవడమేననే వాదన వినిపించింది. కాగా, పాక్ క్రికెటర్లకు కొత్త కోచ్ మిస్బావుల్ హక్ సరికొత్త నియమావళిని ప్రవేశపెట్టాడట. ఫిట్నెస్ విషయంలో కొత్త సంప్రదాయానికి తెరలేపాలనే ఉద్దేశంతో ఇక నుంచి పాక్ క్రికెటర్లు బిర్యానీ, స్వీట్లకు దూరంగా ఉండాలనే నిబంధనను అమలు చేయడానికి రంగం సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. ప్రధానంగా మ్యాచ్‌లు జరిగే సందర్భంలో కొవ్వును పెంచే బిర్యానీ, స్వీట్లు వంటి పదార్థాలు పాక్ క్రికెటర్లు ఎట్టి పరిస్థితుల్లోనూ తీసుకోకూడదనే నిబంధనను చేర్చాడట. దీన్ని దేశవాళీ క్రికెట్ మ్యాచ్‌ల్లో కూడా అవలంభించాలని చూస్తున్నట్లు ఒక పాక్ జర్నలిస్టు ట్వీట్ చేశాడు. కొన్ని రోజుల క్రితం మికీ ఆర్థర్‌ను పాక్ ప్రధాన కోచ్ బాధ్యతల నుంచి తప్పించిన పీసీబీ.. మిస్బావుల్‌కు ఆ బాధ్యతలు అప్పగించింది. మరొకవైపు దేశవాళీ మ్యాచ్‌లకు కోచ్‌లుగా వ్యవహరించే వారికి చీఫ్ సెలక్టర్‌గా కూడా మిస్బావుల్‌ను ఎంపిక చేశారు. దాంతో ఒకే సమయంలో రెండు కీలక బాధ్యతలు మిస్బావుల్ స్వీకరించాల్సి వచ్చింది. దానిలో భాగంగా తన మార్కును చాటడానికి యత్నిస్తున్న మిస్బావుల్ హక్.. ముందుగా ఆహార నియంత్రణలో కఠిన నిర్ణయాలు తప్పవనే సంకేతాలిస్తున్నట్లు తెలుస్తోంది. -
ఆడితే ఆడండి.. పోతే పొండి!
లాహోర్: పాకిస్తాన్ పర్యటనకు తాము రాలేమంటూ 10 శ్రీలంక క్రికెటర్లు తేల్చి చెప్పిన నేపథ్యంలో తటస్థ వేదిక ప్రస్తావన వచ్చింది. పాకిస్తాన్లో జరగాల్సిన మ్యాచ్‌లను తటస్థ వేదికపై నిర్వహిస్తే బాగుంటుందనే శ్రీలంక క్రికెట్ బోర్డు విన్నపాన్ని పీసీబీ తిరస్కరించింది. ఎట్టి పరిస్థితుల్లోనూ షెడ్యూల్‌ను మార్చబోమని తెగేసి చెప్పింది. అసలు స్వదేశీ సిరీస్‌ను వేరే చోట(తటస్థ వేదికపై) నిర్వహించే ప్రశ్నే లేదని పీసీబీ అధికారి ఒకరు పేర్కొన్నారు. అంతర్జాతీయ క్రికెట్‌ను తిరిగి పాకిస్తాన్‌కు తీసుకురావాలని భావిస్తున్న తరుణంలో తటస్థ వేదికలో నిర్వహిస్తే ప్రయోజనం ఏముందని నిలదీశారు. ఒకవేళ శ్రీలంకతో సిరీస్‌ను తటస్థ వేదికపై నిర్వహించడానికి ముందడుగు వేస్తే మిగతా విదేశీ ఆటగాళ్లను పాకిస్తాన్‌కు తీసుకు రావడం కష్టతరం అవుతుందన్నారు. త్వరలో పాకిస్తాన్ సూపర్ లీగ్(పీఎస్ఎల్) ఆరంభం కానున్న వేళ.. ఒక ద్వైపాక్షిక సిరీస్‌కు తాము వేరే వేదికను కేటాయిస్తే దేశంలో భద్రతపై మరింత ఆందోళన వ్యక్తమవుతుందని సదరు అధికారి తెలిపారు. దాంతో ముందస్తు షెడ్యూల్ ప్రకారం కచ్చితంగా శ్రీలంక క్రికెట్ జట్టు.. పాకిస్తాన్లో ఆడాల్సి ఉంటుందనే సంకేతాలిచ్చారు. పాకిస్తాన్-శ్రీలంక జట్ల ద్వైపాక్షిక సిరీస్‌లో భాగంగా మూడు వన్డేలు, మూడు టీ20 మ్యాచ్‌లను కరాచీ, లాహోర్‌లో ఆడాల్సి ఉంది. సెప్టెంబర్ 27వ తేదీ నుంచి అక్టోబర్9 తేదీ వరకూ ఇరు జట్ల మధ్య సిరీస్ జరగాల్సి ఉంది. అయితే భద్రతా కారణాల రీత్యా శ్రీలంక సీనియర్ క్రికెటర్లు తాము పాకిస్తాన్ పర్యటనకు వెళ్లలేమని చెప్పడంతో ఆ సిరీస్ డైలమాలో పడింది. -
రియాజ్ గుడ్ బై చెప్పేశాడా?: ట్వీట్ కలకలం
కరాచీ: ఇటీవల పాకిస్తాన్ క్రికెట్ ప్రధాన పేసర్ మహ్మద్ అమిర్ టెస్టు కెరీర్‌కు గుడ్ బై చెప్పిన సమయంలోనే వహాబ్ రియాజ్‌కు ఆ వరుసలోనే ఉన్నాడనే విమర్శలు వచ్చాయి. ‘ నీ తర్వాత రియాజే టెస్టులకు వీడ్కోలు చెప్పనున్నాడా’ అని ఆ దేశ మాజీ పేసర్ షోయబ్ అక్తర్ ధ్వజమెత్తాడు. అసలే కష్టకాలంలో ఉన్న పాక్ క్రికెట్ జట్టుకు రిటైర్మెంట్లతో షాకిలివ్వడం తగదంటూ అక్తర్ విమర్శించాడు. కాగా, ఇప్పుడు రియాజ్ చేసిన ట్వీట్ పాకిస్తాన్ క్రికెట్ పెద్దల్లో అలజడి రేపుతోంది. తాను టెస్టు క్రికెట్‌కు బ్రేక్ ఇవ్వనున్నట్లు రియాజ్ ప్రకటించడం చర్చనీయాంశంగా మారింది. ‘నేను నిరవధికంగా టెస్టు క్రికెట్‌కు బ్రేక్ ఇవ్వాలనుకుంటున్నా. మా కుటుంబ సభ్యులు, బోర్డుతో చర్చించిన తర్వాత టెస్టులకు విరామం ఇవ్వడానికి సిద్ధమయ్యా. నా ఫిట్‌నెస్‌పై దృష్టి పెట్టే క్రమంలోనే ఎర్ర బంతి క్రికెట్‌కు దూరంగా ఉండాలనుకుంటున్నా. ప్రస్తుతం పరిమిత ఓవర్ల క్రికెట్‌పై దృష్టి పెట్టా. ఇది చాలా కఠిన నిర్ణయమే. కానీ బోర్డు, కుటుంబ సభ్యుల సహకారంతో ఈ నిర్ణయం తీసుకున్నా’ అని రియాజ్ తన ట్వీటర్ అకౌంట్లో పేర్కొన్నాడు. After a lot of thinking and discussions with my family and board, I have decided to take a break from red-ball cricket and maintain my fitness and focus on the shorter format for my country. It was a tough decision and I appreciate my Board’s support and guidance during this time — Wahab Riaz (@WahabViki) September 12, 2019 -
మీకిచ్చిన సపోర్ట్‌ను మరిచిపోయారా?: అక్తర్
కరాచీ: తమ దేశ పర్యటనకు దూరంగా ఉండాలని అధిక శాతం మంది శ్రీలంక సీనియర్ క్రికెటర్లు నిర్ణయించుకోవడంతో పాకిస్తాన్ మాజీ పేసర్ షోయబ్ అక్తర్ ఆవేదన వ్యక్తం చేశాడు. ఒక దేశంలో క్రికెట్‌ను తిరిగి బ్రతికించుకోవడానికి ప్రయత్నాలు జరుగుతుంటే, ఇదేనా మీ సపోర్ట్ అంటూ ప్రశ్నించాడు. తమ జాతీయ జట్టు ఎప్పుడూ శ్రీలంక క్రికెట్‌కు అండగానే నిలిచిందనే విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశాడు. ‘ ఒకేసారి 10 మంది శ్రీలంక క్రికెటర్లు పాక్ పర్యటనకు వెనుకడుగు వేయడం చాలా నిరాశ పరిచింది. మేము మీకు ఎప్పుడూ అండగానే ఉన్నాం. మీకిచ్చిన సపోర్ట్ మరిచిపోయారా. ఇటీవల శ్రీలంకలోని ఒక చర్చిలో దాడి జరిగిన తర్వాత కూడా పాకిస్తాన్ అండర్-19 జట్టు మీ దేశంలో పర్యటించింది. ఆ దాడి తర్వాత తొలుత పర్యటించిన జట్టు ఏదైనా ఉందంటే అది పాకిస్తానే. భద్రతా కారణాలతో 1996 వరల్డ్‌కప్ సమయంలో శ్రీలంకలో ఆడబోమని ఆసీస్, వెస్టిండీస్‌లు తెగేసి చెప్పాయి. అప్పుడు కూడా భారత్‌తో పాటు మీకు అండగా ఉన్నది పాకిస్తానే. మేము మీతో ఫ్రెండ్లీ మ్యాచ్‌లు ఆడి మీకు సహకారం అందించాం. మేము ఇప్పుడు శ్రీలంక నుంచి మద్దతు ఆశిస్తున్నాం.బోర్డు సహకారం అందిస్తున్నది కాబట్టి.. ఆటగాళ్లు కూడా మాకు అండగా నిలవండి’ అని అక్తర్ కోరాడు. పాకిస్తాన్లో శ్రీలంక జట్టు పర్యటించాల్సి ఉండగా భద్రతా కారణాల రీత్యా లసిత్ మలింగా, ఏంజెలో మాథ్యూస్, దినేశ్ చండీమాల్, సురంగా లక్మల్, కరుణరత్నే, తిషారీ పెరీరా అఖిల ధనంజయ, ధనజంయ డిసిల్వా, కుశాల్ పెరీరా తదితరులు బాయ్ కాట్ ప్రకటించారు. తమకు పాకిస్తాన్‌లోని భద్రతపై అనుమానం ఉందనే కారణంతో వారు పర్యటనకు వెళ్లలేమని తేల్చిచెప్పారు. దాంతో పాకిస్తాన్ క్రికెట్ బోర్డు(పీసీబీ)కి మరోసారి షాక్ తగిలినట్లయ్యింది. కచ్చితంగా పాక్‌లో పర్యటిస్తుందనుకున్న పూర్తిస్థాయి శ్రీలంక జట్టులోని సీనియర్లు వెనుకడుగు వేయడం పీసీబీకి మింగుడు పడటం లేదు. -
ప్లాస్టిక్ లైసెన్స్ రూల్స్ అమలు బాధ్యత మున్సిపల్ శాఖదే
సాక్షి, హైదరాబాద్: పర్యావరణానికి ముప్పు కలిగించే 50 మైక్రాన్ల కంటే తక్కువ మందం ఉన్న ప్లాస్టిక్ కవర్లు, వస్తువులు, షీట్లు, ఫిలిమ్స్ వంటి వాటిని తయారీ స్థాయిలోనే ఉత్పత్తి కాకుండా కఠిన చర్యలు తీసుకుంటామని తెలంగాణ రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి (పీసీబీ) హైకోర్టుకు తెలిపింది. ఈ మేరకు జీవో 79 జారీ చేశామని, దీనిని తొలిసారి ఉల్లంఘించిన ఉత్పత్తిదారులకు రూ.50 వేలు, రెండోసారి అదే తప్పు చేస్తే ఉత్పత్తికిచ్చిన అనుమతులను రద్దు చేస్తామని తెలిపింది. లైసెన్స్ మంజూరుకు విధించిన కఠిన నిబంధనల్ని అమలు చేసే బాధ్యత మాత్రం మున్సిపల్ శాఖదేనని పీసీబీ సభ్య కార్యదర్శి దాఖలు చేసిన కౌంటర్ పిటిషన్లో పేర్కొంది. వినాయక విగ్రహాలకు నిషిద్ధ ప్లాస్టిక్ కవర్లు కప్పుతున్నారని, వీటి వల్ల పర్యావరణానికి ముప్పు రాకుండా ఉత్తర్వులు ఇవ్వాలని కోరుతూ ఎల్బీనగర్కు చెందిన వైవీ మురళీకృష్ణ దాఖలు చేసిన ప్రజాహిత వ్యాజ్యంలో హైకోర్టు ధర్మాసనం ఆదేశాల మేరకు ఈ కౌంటర్ పిటిషన్‌ను దాఖలు చేశారు. ఈ పిల్ దాఖలు తర్వాత ఎల్బీనగర్, బోయినపల్లి, సుచిత్ర, గండిమైసమ్మ క్రాస్ రోడ్ నుంచి ఓఆర్ఆర్ వరకూ, కొంపల్లి, మియాపూర్, ఉప్పల్, నాగోలు వంటి ప్రాంతాల్లో వినాయక విగ్రహాలు వర్షానికి తడవకుండా కప్పిన ప్లాస్టిక్ కవర్లను తొలగించామని, వాటిని పరీక్షలకు పంపామన్నారు. 40 తయారీ సంస్థలపై తనిఖీలు నిర్వహిస్తే ఎనిమిది చోట్లే ప్రమాణాలకు విరుద్ధంగా ఉత్పత్తి అవుతున్నట్లుగా గుర్తించి రూ.50 వేలు చొప్పున జరిమానా విధించినట్లు తెలిపారు. ఇప్పటికే నాలుగు యూనిట్లను మూసివేశామని, షాపుల నుంచి రూ.32 లక్షలకుపైగా జరిమానా వసూలు చేశామని తెలిపారు. ఈ పిల్‌ను హైకోర్టు విచారించనుంది. -
‘మంచి స్నేహితున్ని కోల్పోయాను’
కరాచీ: పాకిస్తాన్ దిగ్గజ స్పిన్నర్ అబ్దుల్ ఖాదిర్ ఆకస్మిక మృతి పట్ల ఆ దేశ ప్రధాని, మాజీ క్రికెట్ కెప్టెన్ ఇమ్రాన్ ఖాన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఖాదిర్ హఠాన్మరణం దేశ క్రికెట్‌కు ఎంతో లోటని సంతాపం వ్యక్తం చేశారు. తనకు ఎంతో ఇష్టమైన ఖాదిర్ మృతి వార్త తెలుసుకుని షాక్‌కు గురైనట్లు ఇమ్రాన్ తన సంతాప సందేశంలో పేర్కొన్నారు. ‘ నేనొక మంచి స్నేహితున్ని కోల్పోయాను. దేశ క్రికెట్ అభ్యున్నతి ఖాదిర్ ఎంతో కృషి చేశాడు. అతనొక అద్భుతమైన క్రికెటర్. ఖాదిర్ మృతి విస్మయానికి గురి చేసింది. ఆయన ఆత్మను అల్లా ఆశీర్వదిస్తాడు. ఖాదిర్ మృతి కుటుంబ సభ్యులకు తీరని లోటు. వారికి ధైర్యాన్ని ప్రసాదించాలని దేవుడ్ని ప్రార్థిస్తున్నా’ అని ఇమ్రాన్ ఖాన్ పేర్కొన్నారు. ఖాదిర్‌కు గుండె పోటు రావడంతో శుక్రవారం తుదిశ్వాస విడిచారు. శుక్రవారం ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఖాదిర్ మృతి చెందారు. పాకిస్తాన్ క్రికెట్ జట్టు విశేషమైన సేవలందించిన ఘనత ఖాదిర్ది. ప్రధానంగా లెగ్ స్పిన్‌కు ఆయన ఎంతో ప్రాచుర్యం తెచ్చారు. అబ్దుల్ ఖాదిర్ బౌలింగ్‌ను ఎదుర్కోవడానికి దిగ్గజ బ్యాట్స్మెన్లు సైతం తడబడేవారు. 2009లో చీఫ్ సెలక్టర్‌గా ఖాదిర్ సేవలందిచారు. సెప్టెంబర్ 15వ తేదీన 64వ పుట్టిన రోజు జరుపుకోవాల్సిన తరుణంలో ఖాదిర్ ఇలా ఆకస్మికంగా మృతి చెందండం కంట తడిపెట్టిస్తోంది. -
పరీక్షలు.. పక్కాగా
సాక్షి, సిటీబ్యూరో: గ్రేటర్ పరిధిలోని చెరువులు, కుంటల్లో నీటి నాణ్యతాపరీక్షలు నిర్వహించేందుకు పీసీబీ సన్నాహాలు చేస్తోంది. ఇందుకు సరికొత్తవిధానాన్ని అవలంభించనుంది. ప్రస్తుతం సిబ్బంది కొరతను సాకుగా చూపుతూ హుస్సేన్‌సాగర్, హిమాయత్‌సాగర్, ఉస్మాన్‌సాగర్ సహా మరో 19 జలాశయాల్లో మాత్రమే ప్రతినెలా విధిగా నీటి నాణ్యతా పరీక్షలు నిర్వహిస్తోంది. అయితే అక్టోబర్ నుంచి అన్ని జలాశయాల్లోనూ పరీక్షలు నిర్వహించాలని భావిస్తోంది. ఇందులో జేఎన్టీయూ, ఓయూ పరిధి కళాశాలల్లో ఇంజినీరింగ్, ఫార్మా, కెమిస్ట్రీ తదితర విభాగాల్లో పీజీ, పీహెచ్డీ చేస్తున్న విద్యార్థులను భాగస్వాములను చేయాలని నిర్ణయించింది. ఇందుకోసం ప్రత్యేకంగా కిట్లను సిద్ధం చేస్తున్నట్లు పీసీబీ వర్గాలు ‘సాక్షి’కి తెలిపాయి. ప్రస్తుతం 22 జలాశయాల్లోనే... హెచ్ఎండీఏ పరిధిలో 3,132.. జీహెచ్ఎంసీ పరిధిలో 185 చెరువులు ఉన్నాయి. అయితే ప్రస్తుతానికి కేవలం 22 చెరువుల్లోనే పీసీబీ నెలనెలా నీటి నాణ్యత పరీక్షలు నిర్వహిస్తోంది. మిగతా చెరువుల్లో కాలుష్యం స్థాయి తెలుసుకోకుండా... సిబ్బంది కొరతను సాకుగా చూపుతున్నారు. ప్రస్తుతానికి పెద్దచెరువు, బంజారా చెరువు, హిమాయత్‌సాగర్, ఉస్మాన్‌సాగర్, హుస్సేన్‌సాగర్, శామీర్‌పేట్, ప్రగతినగర్, సరూర్‌నగర్, ఉమ్దాసాగర్, కాముని చెరువు, ఇబ్రహీం చెరువు, మల్లాపూర్, ఫాక్స్‌సాగర్, నూర్‌మహ్మద్‌కుంట, దుర్గం చెరువు, నల్ల చెరువు, కాప్రా, అంబర్ చెరువు, హస్మత్‌పేట్ చెరువు, రంగధాముని చెరువు, సఫిల్‌గూడ, మీరాలం, లంగర్‌హౌస్ చెరువుల్లో నీటి నాణ్యత పరీక్షిస్తున్నారు. ఇక నుంచి జీహెచ్ఎంసీ పరిధిలోని చెరువుల్లో నీటి నమూనాలు సేకరించి విద్యార్థులతో పరీక్షలు చేయించేందుకు ప్రత్యేక కిట్లను తయారు చేస్తున్నట్లు పీసీబీ వర్గాలు తెలిపాయి. అక్టోబర్ నుంచి ఈ విధానం అమలు చేయనున్నట్లు పేర్కొన్నాయి. ప్రధానంగా నీటిలో గాఢత, కరిగిన ఘన పదార్థాలు, కోలీఫాం బ్యాక్టీరియా ఆనవాళ్లు, బయోలాజికల్ ఆక్సిజన్ డిమాండ్, కెమికల్ ఆక్సిజన్ డిమాండ్, కరిగిన ఆక్సిజన్ శాతం తదితరాలను ఈ పరీక్షల ద్వారా తెలుసుకుంటారు. కాలుష్య కాసారాలు... నగరానికి మణిహారంలా ఉన్న పలు చెరువులు రోజురోజుకుకాలుష్యకాసారంగా మారుతున్నాయి. వీటి ప్రక్షాళనకు అవసరమైన చర్యలు తీసుకోవడంలో జీహెచ్ఎంసీ యంత్రాంగం విఫలమవుతోంది. పలు చెరువుల్లో ఇటీవల కాలంలో గుర్రపుడెక్క అనూహ్యంగా పెరిగింది. మరోవైపు సమీప కాలనీలు, బస్తీలు, పారిశ్రామిక వాడలు, వాణిజ్య సముదాయాల నుంచి వెలువడుతున్న వ్యర్థ జలాలను శుద్ధి చేయకుండానే ఈ చెరువుల్లోకి వదులుతున్నారు. దీంతో జలాశయాలు దుర్గంధభరితంగా మారుతున్నాయి. ప్రధానంగా మలమూత్రాదులు, వ్యర్థ జలాల్లో ఉండే ఫేకల్ కోలిఫాం, టోటల్ కోలిఫాం మోతాదు అధికంగా పెరగడంతో పాటు నీటిలో కరిగిన ఘన పదార్థాల మోతాదు అనూహ్యంగా పెరిగినట్లు పీసీబీ తాజా పరిశీలనలో తేలింది. మురుగుతోనే అనర్థాలు... చెరువులు కబ్జాలకు గురవడం, ఎఫ్టీఎల్ పరిధిలో గృహ, వాణిజ్య, పారిశ్రామిక సముదాయాలు ఏర్పడడంతో ఆయా జలాశయాలు మురికి కూపాలవుతున్నాయి. పలు చెరువులు ఎఫ్టీఎల్ పరిధిలో సగం భూములను కోల్పోయాయి. చెరువుల ప్రక్షాళన విషయంలో జీహెచ్ఎంసీ పైపై మెరుగులకే ప్రాధాన్యం ఇస్తోంది. మురుగు నీరు చేరకుండా పటిష్ట చర్యలు తీసుకోవడంలో విఫలమవుతోంది. మరోవైపు రోజువారీగా గ్రేటర్ వ్యాప్తంగా వెలువడుతోన్న 1400 మిలియన్ లీటర్ల వ్యర్థ జలాల్లో సగం మాత్రమే ఎస్టీపీల్లో శుద్ధి చేసి మూసీలోకి వదులుతున్నారు. మిగతా 700 మిలియన్ లీటర్ల మురుగునీరు ఎలాంటి శుద్ధి లేకుండానే మూసీలో కలుస్తుండడంతో పరిస్థితి విషమిస్తోంది. చెరువులు ఇలా.. హెచ్ఎండీఏ పరిధిలో 3,132 జీహెచ్ఎంసీ పరిధిలో 185 -
నీకు పీసీబీ చైర్మన్ పదవి ఇవ్వలేదా?: అక్తర్
కరాచీ: పాకిస్తాన్ క్రికెట్ జట్టు ప్రధాన కోచ్‌గా, దేశవాళీ క్రికెట్ జట్ల హెడ్ కోచ్‌లకు చీఫ్ సెలక్టర్‌గా ఆ దేశ మాజీ క్రికెటర్ మిస్బావుల్ హక్‌ను నియమిస్తూ పీసీబీ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. రెండు ప్రధాన బాధ్యతలను మిస్బావుల్ హక్కు అప్పజెప్పడంపై రావల్పిండి ఎక్స్‌ప్రెస్ షోయబ్ అక్తర్ తనదైన శైలిలో చమత్కరించాడు. ‘కేవలం రెండు కీలక పదవులే నీకు అప్పచెప్పారు. ఇంకా నయం పీసీబీ చైర్మన్‌గా కూడా నిన్నే నియమించలేదు’ అంటూ సెటైర్ వేశాడు. ఇది తాను తమాషాకే మాత్రమే అంటున్నానని, మిస్బావుల్‌కు కీలక బాధ్యతలు ఇవ్వడం తనకేమీ ఆశ్చర్యానికి గురి చేయలేదన్నాడు. వీటికి మిస్బావుల్‌కు అర్హత ఉందని కొనియాడాడు. ‘ కంగ్రాట్స్ మిస్బావుల్. రెండు కొత్త బాధ్యతల్లో నీ మార్కు ఉంటుందనే అనుకుంటున్నా. అతను క్రికెట్ ఆడుతున్న సమయంలో జట్టుకు ఎంతటి ఘన విజయాలు అందించాడో, అదే తరహాలో కోచ్‌గా కూడా రాణించాలి. ఇక చీఫ్ సెలక్టర్‌గా కూడా మిస్బా తనదైన ముద్ర వేస్తాడనే అనుకుంటున్నా. కాకపోతే పీసీబీ చైర్మన్‌గా మిస్బాను ఎంపిక చేయకపోవడం నన్ను ఆశ్చర్యానికి గురి చేసింది(నవ్వుతూ)’ అని అక్తర్ పేర్కొన్నాడు. అయితే పీసీబీ చైర్మన్‌గా ఎంపిక చేయలేదనేది కేవలం సరదాగా వ్యాఖ్యానించానని అక్తర్ వివరణ ఇచ్చాడు. మూడేళ్ల పాటు మిస్బావుల్ హక్‌ను పాక్ క్రికెట్ జట్టు ప్రధాన కోచ్‌గా నియమించగా, మూడు ఫార్మాట్లకు అతనే కోచ్‌గా ఉంటాడని బుధవారం పీసీబీ ఒక ప్రకటనలో తెలిపింది. అదే సమయంలో పాకిస్తాన్ దేశవాళీ క్రికెట్లో భాగంగా ఆరు ఫస్ట్‌క్లాస్ క్రికెట్ అసోసియేన్లలో ప్రధాన కోచ్‌లగా ఉన్న వారికే కూడా చీఫ్‌గా మిస్బానే వ్యవహరిస్తాడని తెలిపింది. ఇక బౌలింగ్ కోచ్‌గా వకార్ యూనిస్‌ను ఎంపిక చేసింది. గతంలో కోచ్‌గా పని చేసిన అనుభవం ఉన్న వకార్‌కు బౌలింగ్ యూనిట్ బాధ్యతల్ని కేటాయించింది. -
హెడ్ కోచ్‌గా, చీఫ్ సెలక్టర్‌గా..
కరాచీ: పాకిస్తాన్ మాజీ క్రికెటర్ మిస్బావుల్ హక్ ఆ దేశ ప్రస్తుత క్రికెట్ జట్టు ప్రధాన కోచ్‌గా ఎంపికయ్యారు. ఈ మేరకు పీసీబీ మిస్బావుల్ హక్‌ను హెడ్ కోచ్‌గా నియమిస్తూ నిర్ణయం తీసుకుంది. పాకిస్తాన్ కోచ్ పదవి కోసం పలువురు దిగ్గజాలు పోటీ పడ్డప్పటికీ మిస్బావుల్‌కే పీసీబీ పెద్దలు పెద్ద పీట వేశారు. ప్రధానంగా విదేశీ కోచ్‌లను వద్దనుకున్న పీసీబీ.. స్వదేశీ కోచ్‌ల్లో మిస్బావులే యోగ్యుడిగా భావించి అతనికి పర్యవేక్షణ బాధ్యతలు అప్పగించింది. మూడేళ్ల పాటు మిస్బావుల్‌ను కోచ్‌గా నియమిస్తున్నట్లు పీసీబీ ప్రకటించింది. కాగా, పాకిస్తాన్‌కు చెందిన ఆరు ఫస్ట్‌క్లాస్ క్రికెట్ జట్ల కోచ్‌లకు చీఫ్ సెలక్టర్‌గా కూడా మిస్బావుల్నే ఎంపిక చేయడం విశేషం. దాంతో దేశవాళీ క్రికెట్‌కు సంబంధించి హెడ్ కోచ్‌ల పని తీరును కూడా మిస్బావులే పర్యవేక్షించాల్సి ఉంటుంది. 2017 మే నెలలో అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్ బై చెప్పిన మిస్బావుల్ తన తాజా నియామకంపై సంతోషం వ్యక్తం చేశాడు. ఇది తనపై ఉంచిన అతి పెద్ద బాధ్యతగా పేర్కొన్నాడు. ఇప్పుడు తనపై చాలా అంచనాలు ఉన్నాయని, దాన్ని సాకారం చేసుకోవడానికి శక్తి వంచన లేకుండా కృషి చేయడమే తన ముందున్న లక్ష్యమని తెలిపాడు. ఇక బౌలింగ్ కోచ్‌గా పాకిస్తాన్ దిగ్గజ బౌలర్ వకార్ యూనిస్‌ను ఎంపిక చేశారు. గతంలో పాకిస్తాన్ కోచ్‌గా పని చేసిన అనుభవం ఉన్న వకార్‌పై మరోసారి నమ్మకం ఉంచుతూ బౌలింగ్ కోచింగ్ బాధ్యతలు అప్పగించింది. -
పాక్ కోచ్‌గా అతని ఎంపిక లాంఛనమే!
కరాచీ: పాకిస్తాన్ క్రికెట్ జట్టు ప్రధాన కోచ్‌గా మిస్బావుల్ హక్‌ను నియమించేందుకు రంగం సిద్ధమైంది. ఇప్పటికే మిస్బావుల్‌ను హెడ్ కోచ్‌గా నియమించడానికి పాకిస్తాన్ క్రికెట్ బోర్డు(పీసీబీ) నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్, ప్రముఖ వ్యాఖ్యాత డీన్ జోన్స్ పాక్ క్రికెట్ జట్టు ప్రధాన కోచ్ పదవి కోసం దరఖాస్తు చేసుకున్నప్పటికీ, స్వదేశీ క్రికెటర్ కావడంతో మిస్బావుల్ హక్కే మొగ్గుచూపినట్లు సమాచారం. విదేశీ కోచ్‌ల ప్రయోగం పాకిస్తాన్‌కు పెద్దగా లాభించకపోవడంతో డీన్ జోన్స్‌ను ఫైనల్ జాబితా వరకే పరిమితం చేసినట్లు తెలుస్తోంది. పీసీబీ కుదించిన జాబితాలో మిస్బావుల్ హక్‌తో పాటు ఆ దేశానికి చెందిన మొహిసిన్ హసన్ కూడా పోటీ పడ్డారు. అయితే 65 ఏళ్ల మొహిసిన్ ఖాన్‌పై పీసీబీ పెద్దగా ఆసక్తికనబరచలేదు. ఆయనకి వయసే ప్రధాన అడ్డంకిగా నిలవడంతో మిస్బావుల్‌కే ఫైనల్ ఓటేసినట్లు విశ్వసనీయ సమాచారం. ఇక బౌలింగ్ కోచ్‌గా వకార్ యూనస్‌ను ఎంపిక చేయడానికి మార్గం సుగమం అయినట్లు తెలుస్తోంది. అంతకుముందు పాకిస్తాన్ ప్రధాన కోచ్‌గా పని చేసిన అనుభవం ఉన్న వకార్‌ను బౌలింగ్ కోచ్‌గా నియమించాలని యోచిస్తున్నారు. ఈ రేసులో వెస్టిండీస్ దిగ్గజ బౌలర్ కర్ట్నీ వాల్ష్ ఉన్నప్పటికీ వకార్కే గ్రీన్ సిగ్నల్ ఇచ్చేందుకు చూస్తున్నారు. -
నన్ను క్షమించండి: పాక్ క్రికెటర్
కరాచీ: పాకిస్తాన్ సూపర్ లీగ్(పీఎస్ఎల్)లో స్పాట్ ఫిక్సింగ్‌కు పాల్పడి నిషేధానికి గురైన ఆ దేశ క్రికెటర్ షార్జీల్‌ఖాన్ తిరిగి తన కెరీర్‌ను కొనసాగించేందుకు ఆ దేశ క్రికెట్ బోర్డుకు క్షమాపణలు చెప్పాడు. సోమవారం పీసీబీ అవినీతి నిరోధక శాఖ అధికారులను షార్జీల్ కలిసి విజ్ఞప్తి చేశాడు. బోర్డు విధించిన నిషేధం గడువు ముగియడంతో తిరిగి కెరీర్‌ను కొనసాగించేందుకు అతడికి అనుమతి లభించింది. ‘నా వల్ల ఇబ్బంది పడ్డ పీసీబీకి, సహచరులకు, అభిమానులకు, కుటుంబసభ్యులకు క్షమాపణలు చెబుతున్నా. ఇప్పటి నుంచి బాధ్యతాయుతంగా ఉండి భవిష్యత్‌లో మంచి ప్రదర్శన చేస్తానని హమీ ఇస్తున్నా’ అంటూ పీసీబీ విడుదల చేసిన లేఖలో షార్జీల్ పేర్కొన్నాడు. అతడికి విధించిన నిషేధం రెండున్నరేళ్ల గడువు ముగిసినందున తిరిగి రిహాబిలిటేషన్ ప్రోగ్రామ్‌కి ఎంపికయ్యాడని, ఈ ఏడాది పూర్తయ్యేలోపు షార్జీల్ తన శిక్షణను పూర్తి చేసుకుంటాడని పీసీబీ ప్రకటించింది. ఆ తర్వాత జాతీయ జట్టులో చేరతాడని చెప్పింది. 2017లో దుబాయ్‌లో నిర్వహించిన పీఎస్ఎల్ రెండో సీజన్లో షార్జీల్ స్పాట్ ఫిక్సింగ్‌కు పాల్పడిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా అతడిపై ఐదేళ్ల పాటు నిషేధం విధించిన పాక్ బోర్డు. తర్వాత దాన్ని రెండున్నరేళ్లకు కుదించింది. ఇటీవల ఆ గడువు పూర్తవడంతో తిరిగి తన కెరీర్ కొనసాగించేందుకు అవకాశమిచ్చింది. -
పాక్ క్రికెట్లో ఇమ్రాన్ ‘గేమ్’ మొదలైందా?
కరాచీ: ‘నా వ్యాఖ్యలు గుర్తుంచుకోండి. వచ్చే వరల్డ్‌కప్‌కు పాక్ జట్టు ఒక ప్రొఫెషనల్ జట్టుగా మారుస్తా. అత్యుత్తమ ఆటగాళ్ల ఎంపికే లక్ష్యంగా ముందుకెళతాం. ఇందుకోసం క్షేత్ర స్థాయిలో చర్యలకు శ్రీకారం చుడతాం. ఎక్కడైతే టాలెంట్ ఉందో వారిని కచ్చితంగా సానబెడతాం. ఇక నుంచి పాక్ క్రికెట్ జట్టు ఎలా ఉండాలనేది నేను సెట్ చేస్తా. పాక్ జట్టు ఉన్నత శిఖరాలు తీసుకు వెళ్లాలని నేను డిసైడ్ అయ్యా’ అని మాజీ క్రికెటర్, ప్రస్తుత పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. వరల్డ్‌కప్‌లో పాకిస్తాన్ నాకౌట్‌కు చేరకపోవడంపై తీవ్ర అసహనం వ్యక్తం చేసిన ఇమ్రాన్ ఖాన్ పై విధంగా స్పందించారు. కాగా, తాజా పరిస్థితుల్ని బట్టి చూస్తే పాక్ క్రికెట్లో ఇమ్రాన్ ఖాన్ ‘గేమ్’ మొదలైనట్లే కనబడుతోంది. మొన్నటి వరకూ పాకిస్తాన్ క్రికెట్ జట్టు ప్రధాన కోచ్‌గా వ్యవహరించిన మికీ ఆర్థర్‌ను తప్పించడం వెనుక ఇమ్రాన్ హస్తం ఉన్నట్లు తెలుస్తోంది. పీసీబీలోని విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు ఆర్థర్‌కు ఉద్వాసన చెప్పడానికి ఇమ్రానే ప్రధాన కారణమట. మరో రెండేళ్ల పాటు ఆర్థర్‌ను కోచ్‌గా కొనసాగించాలని పీసీబీ పెద్దలు భావించినప్పటికీ ఇమ్రాన్ జోక్యంతో అతనికి స్వస్తి పలికాల్సివచ్చిందట. దాంతో సపోర్టింగ్ స్టాఫ్‌ను కూడా తొలగించడానికి ఇమ్రాన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. తనను మరో రెండేళ్ల పాటు ప్రధాన కోచ్‌గా కొనసాగించాలని ఆర్థర్ విన్నవించినప్పటికీ దాన్ని పీసీబీ తిరస్కరించడంతో పాక్ క్రికెట్ ప్రక్షాళనను ఇమ్రాన్ సీరియస్‌గానే తీసుకున్నారనే దానికి నిదర్శనంగా కనబడుతోంది. స్వదేశీ కోచ్‌వైపే మొగ్గు ప్రస్తుత పరిణామాల్ని బట్టి చూస్తే విదేశీ కోచ్ ఎంపికకు పీసీబీ సానుకూలంగా లేదు. విదేశీ కోచ్ కంటే కూడా స్వదేశీ క్రికెటర్‌నే కోచ్‌గా ఎంపిక చేయాలనే యోచనలో పీసీబీ ఉంది. మికీ ఆర్థర్ పర్యవేక్షణలో పాక్ జట్టు ఆశించిన స్థాయిలో ఫలితాలు సాధించకపోవడంపై స్వదేశీ కోచ్ ఎంపికకు ఎక్కువ మొగ్గు కనబడుతోంది. ఈ రేసులో పాక్ మాజీ క్రికెటర్లు మొహిసిన్ ఖాన్, మిస్బావుల్ హక్‌లు ఉన్నారు. వీరిలో మిస్బావుల్ హక్ ముందు వరుసలో ఉండగా, మొహిసిన్ ఖాన్ కూడా ప్రధాని కోచ్ పదవిపై ధీమాగా ఉన్నారు. -
అక్తర్ ఫిక్సింగ్ చేయమన్నాడు!
ఒంటారియో: తమ దేశానికి చెందిన ఓ మాజీ క్రికెటర్ తనను ఫిక్సింగ్ చేయమన్నాడంటూ వివాదాస్పద పాకిస్తాన్ క్రికెటర్ ఉమర్ అక్మల్ మరో వివాదానికి తెరలేపాడు. గ్లోబల్ టీ20 కెనడా లీగ్‌లో భాగంగా విన్‌పిగ్ హాక్స్ తరఫున ఆడుతున్న అక్మల్‌ను ఆ జట్టు మేనేజ్మెంట్ కీలక పాత్ర పోషిస్తున్న మన్సూర్ అక్తర్ ఫిక్సింగ్ చేయమన్నాడట. ఈ విషయాన్ని కెనడా లీగ్ యాజమన్యంతో పాటు తమ అవినీతి నిరోధక విభాగానికి అక్మల్ తెలియజేనట్లు పీసీబీ వర్గాలు వెల్లడించాయి. ‘కొన్ని మ్యాచ్‌లు ఫిక్సింగ్ చేస్తావా’ అంటూ అక్తర్ ఆఫర్ చేసిన అక్మల్ తమ దృష్టికి తీసుకొచ్చాడని పాక్ క్రికెట్ బోర్డులోని ఒక అధికారి పేర్కొన్నారు. దీనిపై దర్యాప్తుకు ఆదేశాలు జారీ చేయనున్నట్లు సదరు అధికారి తెలిపారు. 61 ఏళ్ల మన్సూర్ అక్తర్ 19 టెస్టులు, 41 వన్డేలు ఆడాడు. 1980 నుంచి 1990 వరకూ పాక్ తరఫున క్రికెట్ ఆడాడు. ప్రస్తుతం గ్లోబల్ ట20 కెనడా లీగ్ విన్పిక్ హాగ్స్ మేనేజ్మెంట్ విభాగంలో సేవలందిస్తున్నాడు. ఇదిలా ఉంచితే, ఇటీవల ముగిసిన వన్డే వరల్డ్‌కప్‌లో ఉమర్ అక్మల్‌కు చోటు దక్కలేదు. కోచ్ మికీ ఆర్థర్‌తో విభేదాల నేపథ్యంలో అక్మల్‌ను వరల్డ్‌కప్ జట్టులో ఎంపిక చేయలేదు. ఈ ఏడాది మార్చి-ఏప్రిల్‌లో ఆస్ట్రేలియా జరిగిన వన్డే సిరీస్‌లో అక్మల్ ఆకట్టుకున్నప్పటికీ అతనికి వరల్డ్‌కప్ జట్టులో చోటు కల్పించలేదు. -
సర్ఫరాజ్‌ను తీసేయండి.. నన్ను కొనసాగించండి!
కరాచీ: ఇటీవల ముగిసిన వన్డే వరల్డ్‌కప్‌లో పాకిస్తాన్ నాకౌట్ దశకు చేరకపోవడంతో ఆ దేశ క్రికెట్ బోర్డు(పీసీబీ) ప్రక్షాళన చేపట్టింది. ప్రధానంగా కోచ్, కెప్టెన్లను మార్చాలనే యోచనలో ఉంది. ఆ దేశ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కూడా పాక్ క్రికెట్ ఆట తీరుపై గుర్రుగా ఉన్నారు. ఇక నుంచి పాక్ క్రికెట్‌ను తీర్చిదిద్దే బాధ్యత తానే తీసుకుంటానని హామి ఇచ్చారు కూడా. అయితే పాకిస్తాన్ క్రికెట్‌కు ప్రధాన కోచ్ మికీ ఆర్థర్ సమర్పించిన నివేదికలో కెప్టెన్ సర్ఫరాజ్ అహ్మద్‌నే టార్గెట్ చేశారంట. అసలు కెప్టెన్‌గా సర్ఫరాజ్ వద్దంటూ బోర్డుకు తేల్చిచెప్పారు పీసీబీలో విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. దీనిలో భాగంగా సర్పరాజ్ అహ్మద్‌లో పలు నెగిటివ్ విషయాల్ని ప్రస్తావించినట్లు తెలుస్తోంది. ఇక తాను కోచ్‌గా ఉండేందుకు మరో రెండేళ్లు పొడిగించాలని ఆర్థర్ కోరినట్లు సమాచారం. తన పర్యవేక్షణలో పాక్ క్రికెట్ జట్టు ఆశించిన స్థాయిలోనే ఫలితాలు సాధించిందని స్పష్టం చేశారట. తన కోచ్ పదవిపై పీసీబీ మేనేజింగ్ డైరెక్టర్ వసీం ఖాన్ నుంచి హామీ లభించిందని ఆర్థర్ ధైర్యంగా ఉన్నాడట. అయితే అదే సమయంలో శ్రీలంక ప్రధాన కోచ్‌గా సేవలందించేందుకు కూడా ఆర్థర్ దరఖాస్తు చేసుకున్నాడనే వార్తలు వస్తున్నాయి. 2016లో పాకిస్తాన్ కోచ్‌గా ఆర్థర్ స్వీకరించాడు. అతని పర్యవేక్షణలో పాకిస్తాన్ జట్టు చాంపియన్ ట్రోఫీని కైవసం చేసుకుంది. ఆ తర్వాత అతని హయాంలో భారీ ఘనతలు ఏమీ లేకపోకపోయినప్పటికీ, టీ20ల్లో పాక్‌ను నంబర్ వన్ స్థానంలో నిలిపాడు. ఇక టెస్టు, వన్డే ఫార్మాట్లో మాత్రం పాక్ క్రికెట్ జట్టు ఆశించిన స్థాయిలో ఫలితాలు సాధించకపోవడం ఆర్థర్‌ను కోచ్‌గా కొనసాగిస్తారా.. లేదా అనేది సందిగ్థంలో ఉంది. కోచ్‌గా ఆర్థర్‌ను కొనసాగించేందుకు కొంతమంది పాక్ మాజీలు మద్దతు తెలుపుతుండగా, మరికొంతమంది మాత్రం అతను వద్దనే అంటున్నారు. (ఇక్కడచ చదవండి: చాలా నష్టం చేశాడు.. ఇంకా కోచ్‌గా ఎందుకు?) -
వహాబ్ రియాజ్ గుడ్ బై?
కరాచీ: కొన్నిరోజుల క్రితం పాకిస్తాన్ పేసర్ మహ్మద్ ఆమిర్ టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటించడం తీవ్ర కలకలం రేపింది. ఇక తాను టెస్టు క్రికెట్ ఆడనంటూ ఉన్నపళంగా ప్రకటన చేయడం పాకిస్తాన్ క్రికెట్ బోర్డు(పీసీబీ)లో అలజడి రేపింది. దీనిపై ఆ దేశ మాజీ క్రికెటర్లు తీవ్ర స్థాయిలో దుమ్మెత్తుపోశారు కూడా. 27 ఏళ్ల వయసులోనే టెస్టు క్రికెట్ నుంచి తప్పుకుని పాక్ క్రికెట్‌కు ద్రోహం చేశావంటూ షోయబ్ అక్తర్ ఘాటుగా విమర్శించాడు. అదే సమయంలో ఆమిర్ తర్వాత రియాజ్ టెస్టులకు గుడ్ బై చెప్పబోతున్నాడా అనే సందేహాన్ని కూడా వ్యక్తం చేశాడు అక్తర్. ఇప్పుడు అదే నిజమైనట్లు కనబడుతోంది. తాజాగా 34 ఏళ్ల వహాబ్ రియాబ్ టెస్టులకు వీడ్కోలు చెప్పాడట. ఇప్పటికే ఈ విషయాన్ని పాక్ క్రికెట్ బోర్డుకు తెలియజేశాడని, ఇక కేవలం సాధారణ ప్రకటన మాత్రమే చేయాల్సి ఉందంటూ వార్తలు వస్తున్నాయి. ఇప్పటివరకూ 27 టెస్టు మ్యాచ్‌లు ఆడిన రియాజ్ 83 వికెట్లు తీశాడు. అతని అత్యుత్తమ బౌలింగ్ గణాంకాలు 5/63గా ఉంది. చివరిసారి 2018 అక్టోబర్‌లో ఆస్ట్రేలియాతో టెస్టు మ్యాచ్ ఆడాడు రియాజ్. -
ఎఫైర్ల వివాదంలో పాక్ క్రికెటర్ క్షమాపణలు
కరాచీ: యువతులను మోసం చేశాడంటూ ఆన్లైన్లో స్క్రీన్ షాట్లతో సహా వార్తలు వ్యాపించిన ఘటనలో పాకిస్తాన్ క్రికెటర్ ఇమాముల్ హక్ ఎట్టకేలకు దిగివచ్చాడు. ఈ వివాదంపై పాకిస్తాన్ క్రికెట్ బోర్డు(పీసీబీ) సీరియస్‌గా దృష్టి సారించడంతో క్షమాపణలు తెలియజేశాడు. ఏదైతే జరిగిందో దానిపై ఇమాముల్ పశ్చాత్తాపం వ్యక్తం చేయడమే కాకుండా బోర్డు పెద్దలను క్షమాపణలు కోరాడని పీసీబీ ఎండీ వసీం ఖాన్ తెలిపారు. ‘ జాతీయ క్రికెట్ జట్టులో ఉంటూ ఈ తరహా వివాదం రావడం సరైంది కాదు. దీనిపై మేము ఇమామ్‌ను వివరణ కోరడంతో పాటు తీవ్రంగా మందలించాం. అయితే వెలుగుచూసిన వివాదంపై ఇమామ్ పశ్చాత్తాపం వ్యక్తం చేస్తూ క్షమాపణలు కోరాడు. సాధారణంగా వ్యక్తిగత విషయాల్లో మేము జోక్యం చేసుకోకూడదు. కానీ మా కాంట్రాక్ట్ ఆటగాళ్లు ఎంతో బాధ్యతతో ఉండాల్సి క్రమంలో ఇటువంటి వివాదాలు మంచిది కాదు. ఇది బోర్డు క్రమశిక్షణను ఉల్లఘించడమే. దాంతోనే ఇమామ్‌ను వివరణ కోరగా క్షమాపణలు తెలియజేశాడు. (ఇక్కడ చదవండి: ఎఫైర్ల వివాదంలో ఇమాముల్ హక్!) -
చాలా నష్టం చేశాడు.. ఇంకా కోచ్‌గా ఎందుకు?
కరాచీ: పాకిస్తాన్ క్రికెట్ జట్టుకు ప్రధాన కోచ్‌గా దక్షిణాఫ్రికాకు చెందిన మికీ ఆర్థర్‌ను తిరిగి కొనసాగించాలా.. వద్దా అనే దానిపై భిన్న స్వరాలు వినిపిస్తున్నాయి. ఆర్థర్‌కు మరో చాన్స్ ఇవ్వాలంటూ పాక్ దిగ్గజ ఆటగాడు వసీం అక్రమ్ పేర్కొనగా, ఆ దేశానికే స్పిన్ లెజెండ్ అబ్దుల్ ఖాదిర్ మాత్రం విభేదించాడు. ఇంకెంత కాలం ఆర్థర్‌ను కోచ్‌గా కొనసాగిస్తారంటూ ప్రశ్నించాడు. అసలు పాకిస్తాన్ క్రికెట్ జట్టుకు ఆర్థర్ ఏమి చేశాడంటూ నిలదీశాడు. అదే సమయంలో అక్రమ్ సూచనను తప్పుబట్టాడు. తన దృష్టితో చూస్తే ఆర్థర్‌ను కోచ్‌గా కొనసాగించాలని అక్రమ్ పీసీబీకి చెప్పడం న్యాయం కాదన్నాడు. పీసీబీ కమిటీలో సభ్యుడిగా ఉన్న అక్రమ్.. ఆర్థర్ అండగా నిలవడం బాలేదన్నాడు. తానైతే ఆర్థర్ సేవలు ఇక పాకిస్తాన్‌కు అవసరం లేదనే చెబుతానన్నాడు. ఆర్థర్ వచ్చిన తర్వాత పాక్ క్రికెట్ జట్టుకు నష్టమే జరిగిందే కానీ లాభం చేకూరలేదన్నాడు. కమ్రాన్ అక్మల్, ఉమర్ అక్మల్, సొహైల్ ఖాన్ వంటి క్రికెటర్లు దూరం కావడానికి ఆర్థరే కారణమని విమర్శించాడు. వహాబ్ రియాజ్ వంటి ఒక స్టార్ పేసర్ పాక్ క్రికెట్‌కు రెండేళ్లు దూరం కావడానికి ఆర్థరే కారణమన్నాడు. వరల్డ్‌కప్‌కు చివరి నిమిషంలో గత్యంతరం లేక ఒత్తిడితో రియాజ్‌కు చోటు ఇవ్వడానికి ఆర్థర్ ఒప్పుకున్నాడని ఖాదిర్ విమర్శించాడు. ఇక ఆర్థర్ సేవలకు స్వస్తి పలకాలని సూచించాడు. పాక్ జాతీయ క్రికెట్ జట్టును ముందుకు తీసుకు వెళ్లడానికి మిగతా వారికి అవకాశం ఇవ్వాలన్నాడు. -
ఇంగ్లండ్‌కు ఆమిర్ మకాం!
కరాచీ: రెండు రోజుల క్రితం టెస్టు క్రికెట్‌కు గుడ్ బై చెప్పిన పాకిస్తాన్ స్టార్ పేసర్ మహ్మద్ ఆమిర్.. ఇంగ్లండ్‌కు మకాం మార్చనున్నాడనే వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే పాకిస్తాన్ క్రికెట్లో రెగ్యులర్ ఆటగాడిగా ఉన్న ఆమిర్ తన కెరీర్‌ను ఇంగ్లండ్ క్రికెట్ జట్టుతో కొనసాగించాలనే యోచనలో ఉన్నాడట. ఆ క్రమంలోనే ముందుగా టెస్టు క్రికెట్‌కు గుడ్ బై చెప్పి పాకిస్తాన్ క్రికెట్ బోర్డు(పీసీబీ)కి షాకిచ్చాడు. దాంతో ఆమిర్‌పై పాక్ మాజీ క్రికెటర్లు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. 27 ఏళ్లకే టెస్టు క్రికెట్‌కే గుడ్ బై చెప్పి పాక్ క్రికెట్‌ను మరింత కష్టాల్లోకి నెట్టావంటూ మాజీ పేసర్ షోయబ్ అక్తర్ విమర్శించాడు. అసలు నీలాంటి వాళ్లను ఏ ఫార్మాట్ క్రికెట్ ఆడకుండా చేయాలంటూ మండిపడ్డాడు. ఇదిలా ఉంచితే, మొత్తంగా దేశమే మారిపోతే ఎలా ఉంటుందనే ఆలోచనలో ఆమిర్ ఉన్నాడని వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. బ్రిటీష్ పౌరసత్వం కల్గిన నర్గీస్ మాలిక్‌ను ఆమిర్ మూడేళ్ల క్రితం వివాహం చేసుకోవడంతో అతనికి ఇంగ్లండ్‌లో సెటిల్ కావడానికి అవకాశం ఉంది. భార్య వీసా మీద ఆమిర్ ఇంగ్లండ్‌లో స్థిరపడే అవకాశం ఉన్నందను ఇప్పుడు ఆ ప్లానింగ్‌లోనే ఉన్నాడట. అక్కడే ఇల్లు కొనడానికి ఆమిర్ సిద్ధమవుతున్నట్లు కథనాలు వెలువడుతున్నాయి. ఇంకా తన క్రికెట్ కెరీర్ ఎంతో నేపథ్యంలో దాన్ని ఇంగ్లండ్ తరఫున పరీక్షించుకోవాలనేది ఆమిర్ ప్రధాన ఉద్దేశంగా కనబడుతోందనేది వార్తల సారాంశం. ప్రస్తుతం ఇంగ్లండ్ ప్రధాన జట్టును పరిశీలిస్తే స్వదేశీ క్రికెటర్ల కంటే విదేశీ క్రికెటర్లే ఎక్కువగా ఉన్నారు. ఇంగ్లండ్ వన్డే కెప్టెన్ ఇయాన్ మోర్గాన్(ఐర్లాండ్), బెన్ స్టోక్స్(న్యూజిలాండ్), జోఫ్రా ఆర్చర్(వెస్టిండీస్)తదితరులు ఇలా ఇంగ్లండ్‌కు దిగుమతి అయినవారే. ఇప్పటికే పాకిస్తాన్ తరఫున తానేంటో నిరూపించుకున్న ఆమిర్.. ఇంగ్లండ్ జట్టు తరఫున ఆడటం ఏ మాత్రం కష్టం కాదు. దాంతోనే తన ఇంగ్లండ్ మకాం ప్రణాళికల్లో ఆమిర్ ఉన్నట్లు సమాచారం. గత ఏడాది కాలంగా ఇంగ్లండ్‌లో కౌంటీ క్రికెట్ ఆడటానికి ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వడం ఇందుకు మరింత బలాన్ని చేకూరుస్తోంది. (ఇక్కడ చదవండి: మీలాంటి వాళ్లను క్రికెట్ ఆడకుండా చేసేవాడ్ని!) -
మీలాంటి వాళ్లను క్రికెట్ ఆడకుండా చేసేవాడ్ని!
కరాచీ: టెస్టు క్రికెట్‌కు గుడ్ బై చెప్పిన పాకిస్తాన్ లెఫ్టార్మ్ పేసర్ మహ్మద్ ఆమిర్‌పై ఆ దేశ మాజీ పేసర్ షోయబ్ అక్తర్ నిప్పులు చెరిగాడు. టెస్టు ఫార్మాట్‌ను వదిలి, పరిమిత ఓవర్ల క్రికెట్‌కు మాత్రమే పరిమితం అవుతానంటూ ఆమిర్ పేర్కొనడం అక్తర్‌కు తీవ్ర అసంతృప్తికి గురి చేసింది. అసలు మీలాంటి వాళ్లను ఏ ఫార్మాట్లోనూ క్రికెట్ ఆడకుండా చేయాలంటూ ఘాటుగా వ్యాఖ్యానించాడు. ఒకవేళ తానే సెలక్షన్ కమిటీలో ఉంటే ఇలాంటి నిర్ణయాలు తీసుకునే క్రికెటర్లను ఏ ఫార్మాట్లో ఎంపిక కాకుండా చేసేవాడినని అక్తర్ విమర్శించాడు. 27 ఏళ్లకే టెస్టు క్రికెట్‌కు వీడ్కోలు చెప్పడం అసలు న్యాయంగా అనిపిస్తోందా అంటూ మండిపడ్డాడు. (ఇక్కడ చదవండి: మహ్మద్ ఆమిర్ సంచలన నిర్ణయం) ‘నీకు ఇంకా బోలెడు క్రికెట్ ఉంది. ఈ సమయంలో టెస్టు క్రికెట్ నుంచి వైదొలుగుతావా. ఇప్పటికే పాకిస్తాన్ టెస్టు క్రికెట్ అంతంతమాత్రంగా ఉంది. అటువంటి తరుణంలో దేశానికి ఇచ్చేది ఇదేనా. నువ్వు మ్యాచ్ ఫిక్సింగ్ వివాదంలో చిక్కుకున్నప్పుడు పాకిస్తాన్ క్రికెట్ చాలా ఖర్చు పెట్టింది. నీకు ఎన్నో చాన్స్‌లు ఇచ్చి రాటుదేలేలా చేసింది. ఫామ్‌లో ఉన్న సమయంలో టెస్టు క్రికెట్ నుంచి తప్పుకుంటావా. నీలాగే మిగతా క్రికెటర్లకు కూడా ఆలోచిస్తే పరిస్థితి ఏమవుతుంది. నీ తర్వాత హసన్ అలీ, వహాబ్ రియాజ్‌లు లైన్లో ఉన్నారా. మేము మీలాగే క్రికెట్ ఆడామా. ఇంగ్లండ్, న్యూజిలాండ్‌ల్లో పాకిస్తాన్ సిరీస్‌లు గెలిచిన సమయంలో నేను గాయంతోనే బరిలోకి దిగా. అసలు పాక్ క్రికెట్లో ఏమి జరుగుతుంది. దీనిపై పీసీబీ సీరియస్‌గా దృష్టి సారించాలి. 27 ఏళ్లకే రిటైర్మెంట్ చెబితే, అది మిగతా ఆటగాళ్లపై తీవ్ర ప్రభావం చూపుతుంది. ఇక పాకిస్తాన్ క్రికెట్‌ను ప్రధాని ఇమ్రాన్ ఖానే బతికించాలి. పాక్ క్రికెట్లో పూర్వ వైభవం రావాలంటే గట్టి చర్యలకు శ్రీకారం చుట్టాలి’ అని అక్తర్ పేర్కొన్నాడు. శుక్రవారం ఆమిర్ టెస్టుల నుంచి రిటైర్మెంట్ తీసుకుంటున్నట్లు ప్రకటించాడు. ఇది పాక్ క్రికెట్లో అలజడి రేపింది. ప్రధానంగా పాక్ మాజీ క్రికెటర్లు.. ఆమిర్ నిర్ణయంపై మండిపడుతున్నారు. ఇదొక బాధ్యతారాహిత్య నిర్ణయమంటూ విమర్శలు గుప్పిస్తున్నారు.( ఇక్కడ చదవండి: ఆమిర్ తొందరపడ్డాడు : వసీం అక్రం) -
ఆమిర్ తొందరపడ్డాడు : వసీం అక్రం
ఇస్లామాబాద్ : పాకిస్తాన్ లెఫ్టార్మ్ పేసర్ మహ్మద్ ఆమిర్ టెస్టు ఫార్మాట్‌కు వీడ్కోలు పలకడం తనని ఆశ్చర్యానికి గురిచేసిందని ఆ దేశ మాజీ క్రికెటర్ వసీం అక్రమ్ తెలిపాడు. టెస్టు ఫార్మాట్లో పాక్ జట్టుకు ఆమిర్ అవసరం చాలా ఉందన్నాడు. ‘మహ్మద్ ఆమిర్ టెస్టు ఫార్మాట్‌కు గుడ్‌బై చెప్పడం ఆశ్చర్యానికి గురిచేసింది. ఎందుకంటే 28 ఏళ్ల వయసులోనే క్రికెట్లో గొప్ప ఫార్మాట్ అయిన టెస్ట్‌లకు గుడ్‌బై చెప్పడం. పైగా పాకిస్తాన్ జట్టుకు అతని అవసరం ఎంతో ఉంది. ఆస్ట్రేలియా పర్యటనలోని రెండు టెస్ట్‌లు, ఇంగ్లండ్‌లో మూడు టెస్ట్‌లకు జట్టులో అతను ఉండటం ముఖ్యం’ అని వసీం ట్వీట్ చేశాడు. ఇక షోయబ్ అక్తర్ సైతం ఆమిర్ నిర్ణయంపై అసహనం వ్యక్తం చేశాడు. To me Mohammad Amir retiring from Test cricket is a bit surprising because you peak at 27-28 and Test cricket is where you are judged against the best, it’s the ultimate format. Pakistan will need him in two Tests in Australia and then three in England. — Wasim Akram (@wasimakramlive) July 26, 2019 ప్రధానంగా వచ్చే ఏడాది టీ20 వరల్డ్‌కప్ జరుగనున్న తరుణంలో అందుకు ఇప్పట్నుంచే ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని భావించే టెస్టు క్రికెట్ నుంచి తప్పుకుంటున్నట్లు ఆమిర్ పేర్కొన్నాడు. ‘ పాకిస్తాన్ తరఫున క్రికెట్ ఆడాలనేది నా ఏకైక కోరిక. పాకిస్తాన్ క్రికెట్‌కు సాధ్యమైనంత వరకూ అత్యుత్తమ ప్రదర్శన ఇవ్వడంపైనే నేను దృష్టి సారించా. రాబోవు పరిమిత ఓవర్ల సిరీస్‌లను నేను చాలెంజ్‌గా తీసుకుంటున్నా. కేవలం వైట్ బాల్ క్రికెట్‌పైనే ఫోకస్ చేయాలనుకుంటున్నా’ అని ఆమిర్ తెలిపాడు. ఆమిర్ 17 ఏళ్ల వయసులోనే 2009లో గాలేలో శ్రీలంకతో జరిగిన టెస్టు మ్యాచ్ ద్వారా టెస్ట్ ఫార్మాట్లో అరంగేట్రం చేశాడు. ఇప్పటివరకూ 36 టెస్టు మ్యాచ్‌లు ఆడిన ఆమిర్ 119 వికెట్లు సాధించాడు. నాలుగేసి వికెట్లను ఆరు సార్లు తీసిన ఆమిర్.. ఐదు వికెట్లను నాలుగు సందర్బాల్లో సాధించాడు. జమైకాలో వెస్టిండీస్‌తో జరిగిన టెస్టు మ్యాచ్‌లో భాగంగా ఒక ఇన్నింగ్స్‌లో ఆమిర్ 44 పరుగులిచ్చి ఆరు వికెట్లు తీశాడు. ఇదే అతని అత్యుత్తమ టెస్టు ప్రదర్శన. -
మహ్మద్ ఆమిర్ సంచలన నిర్ణయం
కరాచీ: పాకిస్తాన్ లెఫ్టార్మ్ పేసర్ మహ్మద్ ఆమిర్ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. ఉన్నపళంగా టెస్టు ఫార్మాట్‌కు గుడ్ బై చెప్పేశాడు. కేవలం పరిమిత ఓవర్ల క్రికెట్లో మాత్రమే కొనసాగాలనుకుంటున్న ఆమిర్.. తాజాగా టెస్టు క్రికెట్‌కు వీడ్కోలు చెబుతున్నట్లు ప్రకటించాడు. ప్రధానంగా వచ్చే ఏడాది టీ20 వరల్డ్‌కప్ జరుగనున్న తరుణంలో అందుకు ఇప్పట్నుంచే ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని భావించే టెస్టు క్రికెట్ నుంచి తప్పుకుంటున్నట్లు ఆమిర్ పేర్కొన్నాడు. ‘ పాకిస్తాన్ తరఫున క్రికెట్ ఆడాలనేది నా ఏకైక కోరిక. పాకిస్తాన్ క్రికెట్‌కు సాధ్యమైనంత వరకూ అత్యుత్తమ ప్రదర్శన ఇవ్వడంపైనే నేను దృష్టి సారించా. రాబోవు పరిమిత ఓవర్ల సిరీస్‌లను నేను చాలెంజ్‌గా తీసుకుంటున్నా. కేవలం వైట్ బాల్ క్రికెట్‌పైనే ఫోకస్ చేయాలనుకుంటున్నా’ అని ఆమిర్ తెలిపాడు. ఆమిర్ 17 ఏళ్ల వయసులోనే టెస్టుల్లో అరంగేట్రం చేశాడు. 2009లో గాలేలో శ్రీలంకతో జరిగిన టెస్టు మ్యాచ్ ద్వారా ఈ ఫార్మాట్లోకి రంగ ప్రవేశం చేశాడు. ఇప్పటివరకూ 36 టెస్టు మ్యాచ్‌లు ఆడిన ఆమిర్ 119 వికెట్లు సాధించాడు. నాలుగేసి వికెట్లను ఆరు సార్లు తీసిన ఆమిర్.. ఐదు వికెట్లను నాలుగు సందర్బాల్లో సాధించాడు. పాట్ ఫిక్సింగ్ పాల్పడి ఐదేళ్ల నిషేధం ఎదుర్కొన్నమొహమద్ ఆమిర్.. 2016లో పునరాగమనం చేశాడు. అయితే ఆమిర్ జాతీయ జట్టులోకి పునరాగమనం తర్వాత మరింత రాటుదేలాడు. 2016 నుంచి ఇప్పటివరకూ 22 టెస్టులు ఆడిన ఆమిర్ 68 టెస్టు వికెట్లు సాధించాడు. జమైకాలో వెస్టిండీస్‌తో జరిగిన టెస్టు మ్యాచ్‌లో భాగంగా ఒక ఇన్నింగ్స్‌లో ఆమిర్ 44 పరుగులిచ్చి ఆరు వికెట్లు తీశాడు. ఇదే అతని అత్యుత్తమ టెస్టు ప్రదర్శన. -
ఎఫైర్ల వివాదంలో ఇమాముల్ హక్!
కరాచీ: పాకిస్తాన్ క్రికెటర్ ఇమాముల్ హక్ వివాదంలో చిక్కుకున్నాడు. ప్రేమ పేరుతో అనేక మంది యువతులను ఇమాముల్ హక్ మోసం చేశాడనే వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. దీనికి సంబంధించి సదరు యువతులతో ఇమాముల్ చాట్ చేసిన స్క్రీన్ షాట్లు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. పాకిస్తాన్ మీడియా తెలిపిన వివరాల ప్రకారం.. ఓపెనర్ ఇమామ్ ఉల్ హక్ తన స్టార్‌డమ్‌ని ఉపయోగించి అనేకమంది యువతుల్ని మోసం చేశాడని తెలుస్తోంది. తమని పెళ్లి చేసుకుంటానని నమ్మించి ప్రేమ పేరుతో వంచించాడని, వారితో శారీరక సంబంధాలు కూడా కొనసాగించాడని పేర్కొన్నాయి. గత ఐదారు నెలల్లోనే ఇవన్నీ జరిగాయని పేర్కొన్నాయి. అందుకు మరింత బలాన్ని చేకూరుస్తూ ఆ యువతులతో ఇమామ్ కొనసాగించిన ఛాటింగ్ విశేషాలు సైతం అనేక స్క్రీన్షాట్లు వెలుగులోకి వచ్చాయి. ప్రపంచకప్‌లో ఇమామ్ మంచి ప్రదర్శన చేయలేదనే విమర్శలు వస్తున్న నేపథ్యంలో ఈ వివాదం మరింత తలనొప్పిగా మారింది. ప్రధానంగా చీఫ్ సెలక్టర్‌గా ఉన్న ఇంజమాముల్ హక్‌ను ఇమాముల్‌పై వస్తున్న వార్తలు కలవరపెడుతున్నాయి. ఇంజమామ్‌కు మేనల్లుడైన ఇమాముల్ వీటిపై ఎలా స్పందిస్తాడో చూడాలి. -
‘ఇక పాక్ క్రికెట్ జట్టును నేను సెట్ చేస్తా’
వాషింగ్టన్: ఇటీవల ముగిసిన వన్డే వరల్డ్‌కప్‌లో పాకిస్తాన్ క్రికెట్ జట్టు లీగ్ దశ నుంచే నిష్క్రమించిన నేపథ్యంలో ఆ దేశ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ప్రక్షాళనకు నడుంబిగించారు. స్వతహాగా క్రికెటర్ అయిన ఇమ్రాన్ ఖాన్.. వచ్చే వరల్డ్‌కప్ నాటికి పాక్ జట్టును మేటి జట్టుగా తయారు చేయడమే లక్ష్యంగా కృషి చేస్తానని హామీ ఇచ్చారు.అమెరికా పర్యటనలో ఉన్న ఇమ్రాన్ ఖాన్ పాక్ క్రికెట్ జట్టు వరల్డ్‌కప్ ప్రదర్శనను ఉద్దేశించి మాట్లాడుతూ.. ‘ నా వ్యాఖ్యలు గుర్తుంచుకోండి. వచ్చే వరల్డ్‌కప్‌కు పాక్ జట్టు ఒక ప్రొఫెషనల్ జట్టుగా మారుస్తా. అత్యుత్తమ ఆటగాళ్ల ఎంపికే లక్ష్యంగా ముందుకెళతాం. ఇందుకోసం క్షేత్ర స్థాయిలో చర్యలకు శ్రీకారం చుడతాం. ఎక్కడైతే టాలెంట్ ఉందో వారిని కచ్చితంగా సానబెడతాం. ఇక నుంచి పాక్ క్రికెట్ జట్టు ఎలా ఉండాలనేది నేను సెట్ చేస్తా. పాక్ జట్టు ఉన్నత శిఖరాలు తీసుకు వెళ్లాలని నేను డిసైడ్ అయ్యా’ అని పేర్కొన్నారు. వరల్డ్‌కప్‌లో పాకిస్తాన్ జట్టు ఐదో స్థానంలో నిలిచి లీగ్ దశలోనే తన ప్రస్థానాన్ని ముగించింది. గ్రూప్ దశలో పాకిస్తాన్ నిలకడలేమి ఆ జట్టు నాకౌట్ ఆశల్నిదూరం చేసింది. కివీస్‌తో సమానంగా 11 పాయింట్లు సాధించినప్పటికీ రన్‌రేట్ ఆధారంగా పాక్ వెనుకబడిపోయింది. ప్రధానంగా వెస్టిండీస్ చేతిలో పాకిస్తాన్ ఘోర ఓటమి ఎదుర్కోవడం ఆ జట్టు సెమీస్ అవకాశాల్ని దూరం చేసింది. -
‘సర్ఫరాజ్.. జట్టును ముందుండి నడిపించు’
ఇస్లామాబాద్ : భారత్ చేతిలో ఎదురైన ఓటమిని మరిచిపోయి ప్రపంచకప్ టోర్నీలోని మిగతా మ్యాచ్‌లపై దృష్టి సారించాలని పాకిస్తాన్ కెప్టెన్ సర్ఫరాజ్ అహ్మద్‌కు ఆ దేశ క్రికెట్ బోర్డ్ (పీసీబీ) చైర్మన్ ఎహ్సాన్ మణి వెల్లడించినట్లు పాక్ మీడియా పేర్కొంది. ‘దేశమంతా మీకు అండగా ఉంది. రాబోయే రోజుల్లో కలసికట్టుగా మెరుగైన ప్రదర్శనను ఇస్తారని ఆశిస్తున్నాం’ అని సర్ఫరాజ్ అహ్మద్‌తో ఎహ్సాన్ మణి ఫోన్లో మాట్టాడినట్లు తెలిపింది. సామాజిక మాధ్యమాల్లో వస్తున్న వార్తకథనాలను పట్టించుకోకుండా రానున్న మ్యాచ్‌ల్లో కెప్టెన్‌గా జట్టును ముందుకు నడిపించాలని చైర్మన్ ఎహ్సాన్ మణి సర్ఫరాజ్ అహ్మద్‌ను కోరినట్లు న్యూస్ ఎక్స్ తన కథనంలో వివరించింది. ‘మిగిలిన మ్యాచ్‌ల్లో మెరుగైన ప్రదర్శన చేయలేకపోతే తన సహచరులతో కలిసి స్వదేశానికి వెళ్తే ఇబ్బందులు తప్పవని’ ఆదివారం మాంచెస్టర్ ఓల్డ్ ట్రాఫర్డ్ మైదానంలో భారత్‌తో ముగిసిన మ్యాచ్ అనంతరం సర్ఫరాజ్ అహ్మద్ వెల్లడించిన విషయం తెలిసిందే. ఇప్పటివరకు 5 మ్యాచ్‌లాడిన పాక్ 3 పాయింట్లతో పట్టికలో 9వ స్ధానంలో నిలిచింది. తమ తర్వాతి మ్యాచ్‌లో భాగంగా ఈ నెల 23న లార్డ్స్‌లో దక్షిణాఫ్రికాతో తలపడనుంది. -
పాక్ జట్టును రద్దు చేయాలంటూ పిటిషన్!
ఇస్లామాబాద్ : ప్రపంచకప్ మ్యాచ్‌లో భారత్ చేతిలో పాకిస్తాన్ చిత్తుగా ఓడటాన్ని ఆ దేశ అభిమానులు ఇంకా జీర్ణించుకోలేకపోతున్నారు. ఇప్పటికే కెప్టెన్ సర్ఫరాజ్ అహ్మద్‌తో పాటు జట్టు ఆటగాళ్లపై సోషల్ మీడియా వేదికగా దారుణంగా ట్రోలింగ్ జరిగింది. కీపర్ మాత్రమే కాదు, ‘స్లీప్’ ఫీల్డర్ అంటూ సర్ఫరాజ్ ఆవలింతలపై అభిమానులు వ్యంగ్యాస్త్రాలు సంధించారు. అటు పాక్ మాజీ క్రికెటర్లు సైతం తమ ఆటగాళ్ల ప్రదర్శనపై మండిపడుతున్నారు. తాజాగా ఓ అభిమాని ప్రస్తుత పాక్ జట్టును నిషేధించాలని గుజరన్వాలా సివిల్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు. భారత్‌తో ఘోరపరాజయం నేపథ్యంలో పాక్ జట్టుతో పాటు ఇంజుమామ్ ఉల్ హక్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీని కూడా రద్దు చేయాలని పిటిషన్లో పేర్కొన్నాడు. పేరుచెప్పడానికి ఇష్టపడని ఓ అభిమాని ఈ పిటిషన్‌ను దాఖలు చేసినట్లు సామా న్యూస్ పేర్కొంది. ఈ పిటిషన్‌పై స్పందించిన గుజరన్వాలా సివిల్ కోర్టు న్యాయమూర్తి పూర్తి వివరణ ఇవ్వాలని పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) అధికారులకు నోటీసులు జారీ చేశారు. భారత్ చేతిలో ఘోరాపరాజయం పొందిన నేపథ్యంలో పీసీబీ గవర్నింగ్ బోర్డు బుధవారం సమావేశం కానున్నట్లు జియో న్యూస్ తెలిపింది. ఈ సమావేశంలో జట్టులో చేయాల్సిన కొన్ని మార్పులపై నిర్ణయం తీసుకోనున్నట్లు పేర్కొంది. ప్రపంచకప్‌లో పాక్ దారుణ ప్రదర్శన నేపథ్యంలో పీసీబీ.. టీమ్‌మేనేజ్‌మెంట్‌లోని కోచ్‌లు, సెలక్టర్లతో సహా కొంత మందిని మార్చాలని భావిస్తున్నట్లు లండన్ మీడియా వర్గాలు పేర్కొన్నాయి. పాక్ జట్టు కోచ్ మిక్కి ఆర్థర్ క్రాంట్రాక్టును సైతం పొడిగించకుండా ఇంటికి పంపించేయోచనలోపీసీబీ ఉన్నట్లు సమాచారం. అలాగే టీమ్ మేనేజర్ తలాత్ అలీ, బౌలింగ్ కోచ్ అజార్ మహమ్ముద్‌లపై వేటు వేయడంతో పాటు సెలక్షన్ కమిటీని మొత్తం రద్దుచేయాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇక ఆదివారం పాక్‌తో జరిగిన పోరులో భారత్ 89 పరుగుల (డక్‌వర్త్–లూయిస్ ప్రకారం) తేడాతో పాకిస్తాన్‌పై ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. చదవండి: కోహ్లినిస్తే.. కశ్మీర్ అడగం : పాక్ అభిమానులు మా కెప్టెన్‌కు బుద్ధి లేదు : అక్తర్ ఫైర్ ‘సర్ఫరాజ్ స్లీప్ ఫీల్డర్’ -
వ్యర్థాల నియమావళి బాధ్యత పీసీబీదే
సాక్షి, హైదరాబాద్: భవన నిర్మాణ వ్యర్థాలు, ప్లాస్టిక్, బయో మెడికల్ వేస్ట్ నియమాల అమలును పర్యవేక్షించే బాధ్యతను రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి (పీసీబీ)కి అప్పగించి, ప్రత్యేక అధికారులను బాధ్యులను చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఎస్కే జోషి ఆదేశించారు. భవన నిర్మాణ వ్యర్థాలను తిరిగి వినియోగించేలా రీ సైక్లింగ్ చేసేందుకు కొత్త ప్లాంట్లు ఏర్పాటు చేయాలన్నారు. ఈ నెల 29వ తేదీన ఢిల్లీలో మున్సిపల్ సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ నియమాల అమలుపై నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ సమావేశం ఏర్పాటు చేసింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్కే జోషి సంబంధిత శాఖల అధికారులతో శనివారం సచివాలయంలో సమీక్షించారు. ఎన్జీటీకి సమర్పించాల్సిన నివేదికలకు చెందిన సమాచారాన్ని ఈ నెల 23వ తేదీలోగా పీసీబీకి సమర్పించాలని ఆదేశించారు. రాష్ట్రంలో గృహాల నుంచి 8,450 మెట్రిక్ టన్నుల వ్యర్థాలు వెలువడుతుండగా, 8,273 మెట్రిక్ టన్నులు గడప గడపకూ వెళ్లి సేకరిస్తున్నట్లు సీఎస్ ఈ సందర్భంగా వెల్లడించారు. వ్యర్థాల సేకరణ కోసం ‘సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ రూల్స్ 2016’కు అనుగుణంగా ప్రత్యేక కార్యాచరణ రూపొందించినట్లు అధికారులు వివరించారు. పురపాలక సంఘాల్లో డంపింగ్ యార్డులకు అవసరమైన స్థల సేకరణ, వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్ల ఏర్పాటు, వ్యర్థాలను తగుల బెట్టడంపై ప్రజలకు అవగాహన తదితర అంశాలను జోషి సమీక్షించారు. 11 కామన్ బయో మెడికల్ వేస్ట్ ట్రీట్మెంట్ విధానంలో రాష్ట్ర వ్యాప్తంగా ప్రతీ రోజూ 15వేల కిలోల బయో మెడికల్ వేస్ట్‌ను సేకరిస్తున్నట్లు అధికారులు వివరించారు. 50 మైక్రాన్ల లోపు మందం ఉన్న ప్లాస్టిక్ సంచుల వినియోగాన్ని నిషేధించి, నిబంధనలు అతిక్రమిం చిన వారిపై చర్యలు తీసుకుంటున్నట్లు అధికారులు పేర్కొన్నారు. నదుల పునరుజ్జీవనంపై ప్రణాళిక నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఆదేశాలకు అనుగుణంగా నదీ కాలుష్యాన్ని నివారించేందుకు నిర్దిష్ట కాల పరిమితితో కూడిన కార్యాచరణ ప్రణాళిక రూపొందించినట్లు అధికారులు తెలిపారు. నదుల పునరుజ్జీవనం ప్రణాళికపై ఇప్పటికే పలు సమావేశాలు నిర్వహించామన్నారు. మొదటి, రెండో ప్రాధాన్యతలో చేపట్టాల్సిన పనులకు సంబంధించి ఇప్పటికే కేంద్ర కాలు ష్య నియంత్రణ మండలి (సీపీసీబీ)కి నివేదిక సమర్పించినట్లు అధికారులు వివరించారు. జూన్ 30 నాటికి తర్వాతి ప్రాధాన్యతా క్రమంలో నదుల్లో కాలుష్య నివారణకు చేపట్టాల్సిన ప్రణాళికపై నివేదిక సమర్పిస్తామన్నారు. వాయు, పారిశ్రామిక కాలుష్య నివారణకు తీసుకుంటున్న చర్యలపైనా ఈ సమావేశంలో జోషి సమీక్ష జరిపారు. కాలుష్య వ్యర్థాల శుద్దీకరణ ప్లాంటు (ఈటీపీ), ఉమ్మడి కాలుష్య వ్యర్థాల శుద్ధీకరణ ప్లాంట్లు (సీఈటీపీ), మురుగునీటి శుద్ధీకరణ ప్లాంట్ల (ఎస్టీపీ) పనితీరుపైనా సమావేశంలో చర్చించారు. రాష్ట్ర వ్యాప్తంగా 1979 పరిశ్రమల్లో ఈటీపీలు పనిచేస్తున్నాయని, పనిచేయని చోట సం బంధిత పరిశ్రమలకు షోకాజ్ నోటీసులు జారీ చేసి మూసివేతకు చర్యలు తీసుకుంటున్నట్లు అధికారులు వివరించారు. వీటితో పాటు మరో 372 ఎస్టీపీలు కూడా ఉన్నట్లు వారు తెలిపారు. నెల రోజుల్లో పటాన్చెరు ఎస్టీపీ పటాన్చెరు పారిశ్రామిక ప్రాంతంలోని ఖాజిపల్లి, ఇస్నాపూర్, కిష్టారెడ్డిపేట, గండిగూడెం, ఆ సానికుంట చెరువుల్లో కాలుష్య నివారణకు ఎస్టీపీలు ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్కే జోషి ఆదేశించారు. ఈ ఎస్టీపీల ఏర్పాటుకు వీలుగా సవివర ప్రణాళిక నివేదిక (డీపీఆర్) తయారు చేయడంతో పాటు నిధుల సేకరణ వ్యూహాన్ని కూడా నెల రోజుల్లోగా సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. ఎస్టీపీ ఏర్పాటు విషయంలో చెన్నై ఎన్జీటీ జారీ చేసిన ఆదేశాలపై ఆరోగ్య, నీటిపారుదల, భూగర్భ జల వనరుల శాఖ అధికారులు, సంగారెడ్డి జిల్లా కలెక్టర్ హనుమంతరావుతో ప్రత్యేకంగా చర్చించారు. కాగా, ఈ సమావేశంలో అటవీ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్ మిశ్రా, మున్సిపల్ శాఖ ముఖ్యకార్యదర్శి అర్వింద్ కుమార్, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి కె.రామకృష్ణారావు, పరిశ్రమల శాఖ ముఖ్యకార్యదర్శి జయేష్ రంజన్, జీహెచ్ఎంసీ కమిషనర్ దానకిషోర్, పీసీబీ కార్యదర్శి సత్యనారాయణరెడ్డి, పరిశ్రమలశాఖ కమిషనర్ నదీమ్ అహ్మద్, మున్సిపల్ డైరెక్టర్, కమిషనర్ టి.కె.శ్రీదేవిలతో పాటు గనులు, ఆరోగ్య, పర్యావరణ శాఖ అధికారులు పాల్గొన్నారు. -
భారత్ మా అనుమతి తీసుకుంది: ఐసీసీ
-
హే పాక్.. వాళ్లు మా అనుమతి తీసుకున్నారు!
దుబాయ్ : పుల్వామా ఉగ్రదాడి అమర జవాన్ల స్మారకార్థం టీమిండియా ఆటగాళ్లు మిలిటరీ క్యాపుల ధరించడాన్ని తప్పుబడుతూ గగ్గోలు పెట్టిన దాయాదీ పాకిస్తాన్ క్రికెట్ బోర్డు(పీసీబీ)కు అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్(ఐసీసీ) దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చింది. ఇటీవల ఆస్ట్రేలియాతో రాంచీ వేదికగా జరిగిన మూడో వన్డేలో భారత ఆటగాళ్లు ఆర్మీ క్యాప్‌లు ధరించడంతో పాటు తమ మ్యాచ్ ఫీజును నేషనల్ డిఫెన్స్ ఫండ్‌కు విరాళంగా ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ఈ విషయాన్ని భూతద్దంలో చూసిన పీసీబీ భారత క్రికెట్ నియంత్రణ మండలి బోర్డు(బీసీసీఐ) క్రికెట్‌ను స్వార్థ రాజకీయాలకు వాడుకుంటోందని ఆరోపిస్తూ ఐసీసీకీ ఫిర్యాదు చేసింది. గతంలో దక్షిణాఫ్రికా ఆటగాళ్లు ఇమ్రాన్ తాహిర్, మొయిన్ అలీ మైదానంలో రాజకీయాల గురించి మాట్లాడరని, వారిపై ఐసీసీ తీసుకున్న చర్యలే టీమిండియా ఆటగాళ్లపై కూడా తీసుకోవాలని పీసీబీ చైర్మన్ ఎహ్సాన్ మణి డిమాండ్ చేశారు. క్రికెట్లో రాజకీయాలను మిళితం చేసి బీసీసీఐ తనకు ఉన్న విశ్వసనీయతను కోల్పోయిందని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అయితే పీసీబీ లేఖపై ఐసీసీ స్పందించింది. ఉగ్రదాడిలో అమరులైన సైన్యానికి నివాళులుగా ఆర్మీ క్యాప్లతో బరిలోకి దిగుతున్నట్లు బీసీసీఐ తమ దగ్గర అనుమతి తీసుకుందని స్పష్టం చేసింది. దీనికి ఐసీసీ కూడా సమ్మతం తెలిపిందని ఓ ప్రకటనలో పేర్కొంది. బీసీసీఐ.. ఐసీసీ దగ్గర అనుమతి తీసుకున్న ఉద్దేశానికి.. ఆచరణకు చాలా తేడా ఉందని, ఈ విషయంలో తమ లాయర్లతో చర్చించి ఐసీసీకి మరోసారి లేఖ రాస్తామని పీసీబీ పేర్కొంది. -
పాక్ క్రికెట్‌కు షాక్ మీద షాక్.. పీసీబీ స్పందన
లాహోర్: పుల్వామా ఉగ్రదాడి తర్వాత పాకిస్తాన్ ప్రధాని, ఆ దేశ మాజీ క్రికెట్ కెప్టెన్ ఇమ్రన్‌ఖాన్ ఫొటోలను క్రికెట్ క్లబ్ ఆఫ్ ఇండియా(సీసీఐ) తొలగించిన సంగతి తెలిసిందే. ముంబైలోని బ్రాబోర్న్ స్టేడియంలో ఉన్న ఇమ్రాన్ ఖాన్ ఫొటోను తొలగిస్తూ సదరు కమిటీ నిర్ణయం తీసుకుంది. మరొకవైపు మొహాలి క్రికెట్ స్టేడియంలో ఉన్న 15 మంది పాకిస్తాన్ క్రికెటర్ల ఫొటోలను పంజాబ్ క్రికెట్ అసోసియేషన్ (పీసీఏ) తొలగించింది. అదే సమయంలో పాకిస్తాన్ సూపర్ లీగ్(పీఎస్ఎల్) పోటీలను భారత్‌లో ప్రత్యక్ష ప్రసారం చేయడాన్ని డీస్పోర్ట్ చానల్ నిలిపివేసింది. కాగా, ఇప్పటివరకూ పీఎస్ఎల్కు అధికారిక ప్రొడక్షన్ పార్టనర్ గా ఉన్న ఐఎంజీ రిలయన్స్ సైతం ఇకపై ఆ లీగ్ తో ఎటువంటి భాగస్వామ్యాన్ని కొనసాగించబోమని పేర్కొంది. ఈ నేపథ్యంలో స్పందించిన పీసీబీ.. ఈ విషయాల్ని అంతర్జాతీయ క్రికెట్ మండలి(ఐసీసీ) దృష్టికి తీసుకెళతామని పేర్కొంది. ‘ ఇది చాలా దురదృష్లకరం. పాకిస్తాన్ ప్రధాని, మాజీ కెప్టెన్ ఇమ్రాన్ ఖాన్ ఫొటోలను సీసీఐ తొలగించడం చాలా బాధాకరం. దాంతోపాటు మా దేశానికి చెందిన క్రికెటర్ల ఫొటోలను కొన్ని రాష్ట్రాల క్రికెట్ అసోసియేషన్లు తొలగించిన విషయం మా దృష్టికి వచ్చింది. భారత్‌లో పీఎస్ఎల్ మ్యాచ్‌లను కూడా నిలిపివేశారు. ఇక్కడ రాజకీయాలు, క్రీడలు వేర్వేరు అనే విషయం గ్రహించాలి. ప్రధానంగా క్రికెట్ అనేది దేశాల మధ్య ఐక్యతకు వారథి లాంటిది. చరిత్ర అదే చెబుతుంది కూడా. క్రీడల్ని రాజకీయాలతో ముడిపెట్టి చూడొద్దు. వీటిపై బీసీసీఐతో చర్చిస్తాం. ఐసీసీ వద్దే తేల్చుకుంటాం’ అని పీసీబీ మేనేజింగ్ డైరక్టర్ వసీం ఖాన్ తెలిపారు. భారత్‌లో పీఎస్ఎల్ ప్రసారాల్ని డీస్పోర్ట్ చానల్ నిలిపివేస్తూ నిర్ణయం తీసుకున్న స్వల్ప వ్యవధిలోనే, పీఎస్ఎల్ కు అఫీషియల్ ప్రొడక్షన్ పార్టనర్ గా ఉన్న ఐఎంజీ రిలయన్స్ ఇకపై లీగ్ తో ఏ మాత్రం భాగస్వామ్యాన్ని కొనసాగించబోమని స్పష్టం చేసింది. ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న పాకిస్తాన్‌తో వాణిజ్యపరమైన బంధం అవసరం లేదని భావించిన మీదటే ఈ నిర్ణయం తీసుకుంది. పీఎస్ఎల్ తో కుదుర్చుకున్న ఒప్పందం మేరకు ఐఎంజీ రిలయన్స్ పలు మ్యాచ్ ల లైవ్ కవరేజ్ కి అవసరమయ్యే వనరులను సమకూర్చాల్సివుంది. వివిధ దేశాల్లోని టీవీ చానళ్లకు మ్యాచ్ ప్రత్యక్ష ప్రసారం, కవరేజ్ చేసే వ్యక్తులు, కెమెరాలు, ఓబీ వ్యాన్ లు వంటి ఇతర మౌలిక వసతులను కల్పించాల్సివుంది. తాజాగా పీఎస్ఎల్ నుంచి ఐఎంజీ రిలయన్స్ తప్పుకోవడంతో ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టడానికి పీసీబీ సిద్ధమైంది. ఇక్కడ చదవండి: పాక్ క్రికెటర్ల ఫొటోలు తొలగింపు ఆ జవాన్ల పిల్లలను నేను చదివిస్తా: సెహ్వాగ్ -
ఉగ్రదాడి.. పాక్ క్రికెట్‌కు గట్టిషాక్!
న్యూఢిల్లీ : పుల్వామా ఘటన తర్వాత పాకిస్తాన్‌పై ప్రతీకారం తీర్చుకునేందుకు భారత్.. దొరికిన ఏ అవకాశాన్ని వదులుకోవడం లేదు. ఇప్పటికే మోస్ట్ ఫేవర్డ్ నేషన్ స్టేటస్‌ను ఉపసంహరించుకున్న భారత ప్రభుత్వం.. ఆ దేశం నుంచి దిగుమతి చేసుకునే వస్తువులపై కస్టమ్స్ డ్యూటీని 200% పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఇక తాజాగా ఆ దేశ క్రికెట్ బోర్డ్ పీసీబీకి భారత ఛానెల్ డీస్పోర్ట్స్ గట్టిషాక్ ఇచ్చింది. సరిగ్గా దాడి జరిగిన (ఫిబ్రవరి 14) రోజే ప్రారంభమైన పాకిస్తాన్ ప్రీమియర్ లీగ్ ప్రత్యక్షప్రసారాన్ని నిషేధించింది. (చదవండి: వారు చితక్కొట్టడంతోనే నా కొడుకు ఉగ్రవాదయ్యాడు) ఈ ఉగ్రదాడిలో 40 మంది సీఆర్పీఎఫ్ జవాన్లు వీర మరణం పొందగా.. 20 మంది గాయపడిన విషయం తెలిసిందే. ఈ ఘటన పట్ల యావత్ భారత్ ఉడికిపోతుంది. ప్రతీకార దాడి జరగాల్సిందేనని డిమాండ్ చేస్తోంది. సోషల్ మీడియా వేదికగా.. ఉగ్రదాడిలో అసువులు బాసిన వీరజవాన్లకు భారత ప్రజలు నివాళులర్పిస్తున్నారు. తోచిన విరాళాలు ఇస్తూ వీరమరణం పొందిన జవాన్ల కుటుంబాలకు అండగా నిలుస్తున్నారు. ఈ ఉగ్ర దాడితో దేశమంతా విషాదంలో మునిగిపోయింది. ఈ పరిస్థితుల్లో పాక్ క్రికెట్ మ్యాచ్‌లు భారత్‌లో ప్రసారం కావడం భావ్యం కాదని భావించిన డీస్పోర్ట్స్ ప్రత్యక్షప్రసారాన్ని పూర్తిగా నిషేధించింది. వాస్తవానికి లీగ్ రెండో రోజే సాంకేతిక లోపంతో ప్రసారం నిలిచిపోయినప్పటికి.. అధికారికంగా మాత్రం లీగ్ 5వ గేమ్ నుంచి నిలిపేసినట్లు ఛానెల్ అధికారులు పేర్కొన్నారు. (చదవండి: అమర జవాన్లకు సెల్యూట్) మరోవైపు ఈ ఉగ్రదాడికి నిరసనగా పాకిస్తాన్ క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్, ప్రస్తుత ఆ దేశ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఫొటోలను క్రికెట్ క్లబ్ ఆఫ్ ఇండియా(సీసీఐ) తొలగించింది. బ్రాబోర్న్ స్టేడియంలో ఉన్న ఇమ్రాన్ ఖాన్ ఫొటోలను తీసివేయాల్సిందిగా మేనేజింగ్ కమిటీ నిర్ణయించింది. ‘ఆల్ రౌండర్’ విభాగంలో ఇమ్రాన్ ఖాన్ ఫొటోను, క్రికెట్ జట్టు విభాగంలో పాకిస్తాన్ ఫొటోలను అక్కడ ఉంచారు. ఆ టీమ్‌లో ఇమ్రాన్ కూడా ఉండటంతో ఈ ఫొటోలను అక్కడ నుంచి తీసేశారు. భారతీయ ప్రజల మనోభావాలను దృష్టిలో ఉంచుకుని ఈ చర్యలు తీసుకున్నామని మేనేజింగ్ కమిటీ సీనియర్ ఒకరు తెలిపారు. (చదవండి : ఆ జవాన్ల పిల్లలను నేను చదివిస్తా) -
వారేమీ స్కూల్ పిల్లలు కాదు: పీసీబీ ఫైర్
ఇస్లామాబాద్: దక్షిణాఫ్రికా క్రికెటర్ ఆండిల్ పెహ్లువాకియాపై జాతి వివక్ష వ్యాఖ్యలు చేసిన పాకిస్తాన్ క్రికెటర్ సర్పరాజ్ అహ్మద్‌పై నాలుగు వన్డేల నిషేధం వేయడాన్ని ఆ దేశ క్రికెట్ బోర్డు(పీసీబీ) తీవ్రంగా తప్పుబట్టింది. ఈ ఘటన తర్వాత సర్ఫరాజ్ బహిరంగంగా క్షమాపణలు చెప్పినప్పటికీ అతనిపై నాలుగు వన్డేల నిషేధం వేస్తూ అంతర్జాతీయ క్రికెట్ మండలి(ఐసీసీ) నిర్ణయం తీసుకోవడాన్ని ఆక్షేపించింది. ఇది అనాలోచిత చర్యగా పీసీబీ చీఫ్ ఇషాన్ మణి ఆరోపించారు. ఇషాన్ మణి మాట్లాడుతూ.. ‘ ఆ వివాదాస్పద వ్యాఖ్యలపై సర్ఫరాజ్ బహిరంగ క్షమాపణలు కోరాడు. ఇందుకు అంతా అంగీకరించారు. దక్షిణాఫ్రికా బోర్డుతో పాక్‌కి సత్సంబంధాలు ఉన్నాయి. దక్షిణాఫ్రికా క్రికెట్ జట్టుకు దీనిని సీరియస్‌గా తీసుకోలేదు. ఐసీసీ మధ్యలోకి వచ్చి సర్ఫరాజ్ అహ్మద్‌పై చర్యలు తీసుకుంది. ఇక్కడ పెహ్లువాకియా వివరణ కూడా ఐసీసీ తీసుకోలేదు. ఈ క్రమంలో జాతి వివక్షల కింద సర్ఫరాజ్‌పై సస్పెన్షన్ వేయాల్సిన అవసరం ఏంటి?. వారేమీ స్కూల్ పిల్లలు కాదు’ అని ఇషాన్ మణి మండిపడ్డారు. -
బీసీసీఐకి రూ.14 కోట్లు చెల్లించండి
దుబాయ్: అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) వివాదాల పరిష్కార కమిటీ (డీఆర్సీ) మళ్లీ భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ)కే అనుకూలంగా తీర్పునిచ్చింది. నష్ట పరిహారం కోసం బీసీసీఐని పదేపదే ఇబ్బంది పెట్టిన పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) న్యాయపరమైన ఖర్చుల కోసం రూ. 14 కోట్లు బీసీసీఐకి చెల్లించాలని ఆదేశించింది. ఒప్పందం (ఎంఓయూ) ప్రకారం భారత్‌తో ద్వైపాక్షిక సిరీస్‌లు జరగనందువల్ల తమకు నష్టం వాటిల్లిందని, పరిహారంగా రూ. 447 కోట్లు బీసీసీఐ నుంచి ఇప్పించాలని పాకిస్తాన్ ఐసీసీతో వాదిస్తూ వచ్చింది. దీన్ని డీఆర్సీ ఇటీవల కొట్టివేసింది. ఎంఓయూ అనేది ఒక ఒప్పందం మాత్రమేనని కానీ దాని ప్రకారం అంతా నడుచుకోవాలని ఏమీ లేదని పీసీబీకి స్పష్టం చేసింది. అయితే తమను ఇబ్బంది పెట్టిన పీసీబీ నుంచి న్యాయపరమైన ఖర్చులు రాబట్టుకునే అవకాశం ఉండటంతో డీఆర్సీని బీసీసీఐ ఆశ్రయించింది. బుధవారం బీసీసీఐ పిటీషన్‌ను విచారించిన డీఆర్సీ లీగల్ ఖర్చులు, పరిపాలన, ఇతరత్రా పరిహారం ఖర్చులు కలుపుకొని 60 శాతం భారత బోర్డుకు చెల్లించాలని పీసీబీని ఆదేశించింది. 60 శాతమంటే 20 లక్షల అమెరికా డాలర్లు. ఇది భారత కరెన్సీలో రూ. 14 కోట్లు. ఇప్పుడు ఈ మొత్తం పాకిస్తాన్‌కు గుదిబండగా మారే అవకాశముంది. అసలే తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న పీసీబీకి ఇది తలకుమించిన భారమే. దీంతో బీసీసీఐతో మళ్లీ కాళ్లబేరానికి వచ్చినా ఆశ్చర్యం లేదు. -
బీసీసీఐతో వివాదంలో పీసీబీకి షాక్
దుబాయ్: భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు(బీసీసీఐ)తో వివాదంలో పాకిస్తాన్ క్రికెట్ బోర్డు(పీసీబీ)కి షాక్ తగిలింది. తమతో ద్వైపాక్షిక సిరీస్‌ల ఒప్పందాన్ని బీసీసీఐ ఉల్లంఘించిందంటూ పీసీబీ చేసిన ఫిర్యాదును ఐసీసీ వివాదాల కమిటీ తిరస్కరించింది. ఈ మేరకు తన తుది తీర్పును మంగళవారం వెల్లడించింది. రెండు దేశాల బోర్డుల మధ్య కుదిరిన ఒప్పందాన్ని భారత్ ఉల్లంఘించిందని, అందువల్ల తమకు 7 కోట్ల డాలర్ల (సుమారు రూ.445 కోట్లు) నష్ట పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఐసీసీకి పీసీబీ ఫిర్యాదు చేసింది. దీనిపై రెండు దేశాల బోర్డుల వాదనలు విన్న తర్వాత పీసీబీ వాదనను వివాదాల కమిటీ తోసిపుచ్చినట్లు ఐసీసీ వెల్లడించింది. ఈ తీర్పే ఫైనల్ అని, దీనిపై అప్పీల్ చేసే అవకాశం కూడా లేదని క్రికెట్ కౌన్సిల్ స్పష్టం చేసింది. ప్రధానంగా ఇరు జట్ల మధ్య చేసుకున్న ఒప్పందంలో భాగంగా రాసుకున్న ఎమ్ఓయూ.. ఒక ప్రపోజల్ లెటర్ లాంటిదని బీసీసీఐ వాదించింది. పరిస్థితులు అనుకూలంగా లేనప్పుడు ఎలా ఆడతామనే వాదనను బలంగా వినిపించింది. ఒప్పందం ఉల్లంఘన కారణంగా తమకు జరిగిన నష్టాన్ని పరిహారంతో పూడ్చాలని పీసీబీ డిమాండ్ చేసింది. అయితే పీసీబీ డిమాండ్ చేసిన 445 కోట్లను చెల్లించాల్సిన అవసరం లేదంటూ ఐసీసీ వివాదాల కమిటీ తీర్పు చెప్పింది. అక్టోబర్ 1 నుంచి 3 మధ్య రెండు బోర్డులు తమ వాదనలు వినిపించాయి. మూడు రోజుల పాటు జరిగిన విచారణలో రెండు బోర్డులు సమర్పించిన లిఖితపూర్వక నివేదికలను పరిశీలించిన తర్వాత పీసీబీ వాదనను కొట్టేస్తున్నట్లు ఐసీసీ ఓ ప్రకటనలో వెల్లడించింది.