కరాచీ: భారత క్రికెట్ జట్టుపై పాకిస్తాన్ మాజీ కెప్టెన్, పీసీబీ మాజీ చీఫ్ సెలక్టర్ ఇంజమాముల్ హక్ సంచలన కామెంట్స్ చేశాడు. తాను క్రికెట్ ఆడే రోజుల్లో భారత క్రికెటర్లకు- పాకిస్తాన్ క్రికెటర్లకు చాలా వ్యత్యాసం ఉండేదన్నాడు. భారత్ క్రికెటర్లు కేవలం తమ స్థానాలను కాపాడుకోవడం కోసమే క్రికెట్ ఆడేవారంటూ ఆరోపించాడు. భారత క్రికెటర్లు ఎప్పుడూ వ్యక్తిగత రికార్డులే లక్ష్యంగా బ్యాటింగ్ చేసేవారన్నాడు. ఇక పాకిస్తాన్ బ్యాట్స్‌మెన్ విషయానికొస్తే జట్టు ప్రయోజనాల కోసమే ఆడవారని, వ్యక్తిగత రికార్డులకు పాక్ ఆటగాళ్లు అప్పుట్లో దూరంగా ఉండేవారన్నాడు. కేవలం జట్టు గెలుపే లక్ష్యంగా పాకిస్తాన్ క్రికెటర్లు ఫీల్డ్‌లో దిగేవారని ఇంజమామ్ అన్నాడు. ‘ భారత క్రికెటర్లు వరుస సిరీస్‌లు దృష్టిలో పెట్టుకునే ఆడేవారు. (లాక్‌డౌన్‌లో క్రికెట్ మ్యాచ్ నిర్వహణ.. కేసు నమోదు)
ఒక సిరీస్‌లో ఆడితే మరొక సిరీస్‌లో ప్లేస్ ఉండేది. సిరీస్‌లో ఫెయిల్ అయితే తదుపరి సిరీస్‌లు అవకాశం వచ్చేది కాదు. వారు ఎప్పుడూ వారి వారి అత్యుత్తమ ఆటను ప్రదర్శించలేకపోయేవారు. మా సమయంలో టీమిండియా బ్యాటింగ్ చాలా పటిష్టంగా ఉండేది. మాకంటే బ్యాటింగ్ పరంగా చాలా బలంగా ఉండేది. కాగితపు పులులు తరహాలో వారు మా కంటే స్ట్రాంగ్‌గా ఉండేవారు. బ్యాట్స్‌మెన్‌గా మా రికార్డు వారి కంటే మెరుగ్గా ఉండేది కాదు. కానీ మేము ప్రతీ ఒక్కరం కనీసం 30 నుంచి 40 పరుగులు చేయాలనే పట్టుదలతో ఉండేవాళ్లం. వారు వ్యక్తిగత రికార్డుపై కన్నేసేవారు. భారత జట్టులో ఎవరైనా సెంచరీ చేస్తే అది జట్టు కోసం కాదు.. వారి వ్యక్తిగతం కోసమే. మరి మేము జట్టుగా పోరాడేవాళ్లం. భారత జట్టులో వ్యక్తిగత ప్రదర్శనకు ఎక్కువ ప్రాముఖ్యత ఇవ్వడంతో పేపర్‌పై పులిలా మిగిలిపోయేవారు. ఇప్పుడు మన క్రికెటర్లు కూడా ప్లేస్‌లు కోసం కుస్తీ పడుతున్నారు. ఏదో ఒకటి-రెండు ఇన్నింగ్స్‌లు ఆడేసి స్థానాన్ని కాపాడుకోవడంపై దృష్టి పెట్టారు. మేనేజ్‌మెంట్ కోరుకునేది మీ నుంచి పూర్తి స్థాయి ప్రదర్శన. భయపడుతూ క్రికెట్ ఆడొద్దు’ అని ఇంజమాముల్ సూచించాడు.(ధోనికి చాన్స్‌తో గుండెల్లో కత్తి దింపినట్లు అయ్యింది..)
Comments
Please login to add a commentAdd a comment