పాక్‌ను ఆడేసుకుంటోన్న నెటిజన్స్.. పుష్ప-2 సీన్‌ను కూడా వదల్లేదు! | Netizens Create Funny Memes Against Pak Cricket Team With Pushpa 2 Scenes After CT 2025 IND Vs PAK Match, Videos Viral | Sakshi
Sakshi News home page

IND Vs PAK Memes: పాక్‌ను ఆడేసుకుంటోన్న నెటిజన్స్.. పుష్ప-2 సీన్‌ను కూడా వదల్లేదు!

Published Mon, Feb 24 2025 2:39 PM | Last Updated on Mon, Feb 24 2025 4:12 PM

Netizens Create Funny Meams Against pakistan Cricket Team with Pushpa 2 scene

భారత్- పాకిస్తాన్ మధ్య ఆదివారం జరిగిన వన్డే మ్యాచ్‌లో టీమిండియా జయకేతనం ఎగరేసింది. దుబాయ్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో అతిథ్య పాక్ జట్టును భారత్‌ మట్టికరిపించింది. ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా జరిగిన ఈ లీగ్ మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ సెంచరీతో చెలరేగాడు. పాక్ జట్టు నిర్దేశించిన లక్ష్యాన్ని కేవలం నాలుగు వికెట్లు మాత్రమే టీమిండియా ఘనవిజయం సాధించింది. అయితే దాయాదుల పోరు అంటే ఓ రేంజ్‌లో ఫైట్ ఉంటుంది. అందుకు తగ్గట్టుగానే ఇరుదేశాల అభిమానుల్లోనూ భారీ అంచనాలు పెట్టుకుని ఉంటారు. ఆటలో గెలుపోటములు సహజమే అయినప్పటికీ భారత్- పాకిస్తాన్‌ మ్యాచ్‌ అంటే ఓ రేంజ్ ఉంటుంది. ఇలాంటి ప్రతిష్టాత్మక మ్యాచ్‌లో ఓటమి పాలైన జట్టుపై విమర్శలు కూడా అదేస్థాయిలో ఉంటాయి.

ఇంకేముంది పాక్‌ జట్టు ఇండియాతో ఓడిపోవడంతో నెటిజన్స్ ఓ ఆటాడేసుకుంటున్నారు. ఆ జట్టుపై నెట్టింట ట్రోల్స్ తెగ వైరలవుతున్నాయి. కింగ్ కోహ్లీని ప్రశంసలు కురిపిస్తూ.. పాక్‌ టీమ్‌ను ఫుట్‌బాల్‌ ఆడేస్తున్నారు నెటిజన్స్. తాజాగా పాక్ జట్టుపై చేసిన  ఓ మీమ్ మాత్రం తెగ వైరలవుతోంది. ఇందులో మన పుష్పరాజ్‌ను కూడా వాడేశారు. అల్లు అర్జున్‌ పుష్ప-2 చిత్రంలోని ఓ పైట్‌ సీన్‌తో క్రియేట్ చేసిన మీమ్‌ నెట్టింట నవ్వులు పూయిస్తోంది.

పుష్ప-2 చిత్రంలోని గంగమ్మ జాతర సాంగ్‌ తర్వాత వచ్చే ఫైట్‌ సీన్‌ గురించి సినిమా చూసిన ఎవ్వరైనా మర్చిపోలేరు. తాజాగా ఆ ఫైట్‌ సీన్‌లోని ఓ క్లిప్‌తో పాక్‌ టీమ్‌ను ట్రోల్ చేశారు. అల్లు అర్జున్‌కు ఫేస్‌కు కోహ్లీని చూపిస్తూ.. రౌడీలను పాక్‌ జట్టుతో పోలుస్తూ మీమ్ క్రియేట్ చేశారు. ఈ వీడియో సోషల్ మీడియాలో మాత్రం తెగ వైరలవుతోంది. ఇంకేముంది ఈ ఫన్నీ మీమ్ చూసిన మన టీమిండియా ఫ్యాన్స్ మాత్రం తెగ నవ్వేసుకుంటున్నారు. ఇంకేందుకు ఆలస్యం ఆ మీమ్ మీరు కూడా చూసి ఎంజాయ్ చేయండి.
 

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement