భారత్-పాక్‌ల మధ్య ద్వైపాక్షిక క్రికెట్ సిరీస్ అంశం మరోసారి తెరపైకి వచ్చినట్టే వచ్చి కనమరుగైంది. తటస్థ వేదికపై టెస్ట్ సిరీస్ నిర్వహించే పీసీబీ (పాకిస్థాన్ క్రికెట్ బోర్డు) ప్రతిపాదనను బీసీసీఐ కొట్టిపారేసింది. సమీప భవిష్యత్తులో కూడా భారత-పాక్ సిరీస్ జరిగే అవకాశం లేదని బీసీసీఐ స్పష్టం చేసింది. పీసీబీ చీఫ్ నజమ్ సేధి సిడ్నీ మార్నింగ్ హెరాల్డ్‌కు ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో భారత్-పాక్ ద్వైపాక్షిక టెస్ట్ సిరీస్‌ను ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ లేదా సౌతాఫ్రికాల్లో జరిపితే బాగుంటుందని ప్రతిపాదించిన అనంతరం బీసీసీఐ పై విధంగా స్పందించింది. 2007 డిసెంబర్‌లో చివరిసారిగా భారత్-పాక్‌ల మధ్య టెస్ట్ మ్యాచ్ జరిగిన విషయం తెలిసిందే.
ఇదిలా ఉంటే, ఆసియా కప్-2023 వేదిక విషయంలో ప్రస్తుతం భారత్-పాక్‌ల మధ్య ఏకాభిప్రాయం కుదరడం లేదన్న విషయం విధితమే. భద్రతా కారణాల రిత్యా టీమిండియా పాక్‌లో అడుగుపెట్టదని బీసీసీఐ తెగేసి చెప్పగా.. దీనికి కౌంటర్‌గా పాక్ కూడా వన్డే వరల్డ్‌కప్ కోసం భారత్‌లో అడుగుపెట్టదని స్పష్టం చేసింది. ఆసియాకప్ మ్యాచ్‌లను భారత్ తటస్థ వేదికలపై ఆడాలనుకుంటే, వరల్డ్‌కప్‌లో తమ మ్యాచ్‌లను సైతం తటస్థ వేదికలపై నిర్వహించాలని పీసీబీ పట్టుబడుతుంది. ఈ నేపథ్యంలో ఆసియాకప్, వరల్డ్‌కప్ నిర్వహణపై సందిగ్ధత నెలకొంది.
చదవండి: యువతి పట్ల మృగంలా వ్యవహరించిన కేసు.. శ్రీలంక క్రికెటర్‌కు ఊరట
Comments
Please login to add a commentAdd a comment