najam Sethi
-
ఆసియాకప్ మ్యాచ్‌లపై నీలినీడలు.. ఇది నాకు ముందే తెలుసు!
ఆసియాకప్-2023లో భారత్-పాకిస్తాన్ మ్యాచ్ కోసం ఎంతో అతృతగా ఎదరుచూసిన అభిమానుల ఆశల మీద వరుణుడు నీళ్లు చల్లిన సంగతి తెలిసిందే. దాయాదు పోరు మ్యాచ్ వర్షం కారణంగా ఫలితం తేలకుండానే రద్దయ్యింది. అయితే ఈ ఒక్క మ్యాచ్‌కే కాకుండా శ్రీలంకలో జరగనున్న మిగిలిన మ్యాచ్‌లకు వర్షం ముప్పు పొంచి ఉంది. సూపర్-4 మ్యాచ్‌లతో పాటు ఫైనల్ కూడా కొలంబోలో జరగనున్నాయి. అయితే కొలంబోలో మరో ఆరు రోజుల పాటు భారీ వర్షాలు కురవనున్నట్లు అక్కడ వాతవారణ శాఖ వెల్లడించింది. దీంతో అభిమానులు అందోళన చెందుతున్నారు. శ్రీలంకలో ప్రస్తుతం వర్షాకలం అని తెలిసి కూడా అక్కడ మ్యాచ్‌లు నిర్వహించడం పట్ల ఫ్యాన్స్ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అయితే పాకిస్తాన్లో షెడ్యూల్ చేసిన మ్యాచ్‌లకు మాత్రం ఎలాంటి అంతరాయం లేకుండా జరుగుతున్నాయి. ఇక ఇదే విషయంపై పాకిస్తాన్ క్రికెట్ బోర్డు మాజీ చీఫ్ నజం సేథి సంచలన వాఖ్యలు చేశారు. క్రీడల్లో రాజకీయ జోక్యం ఎక్కువైందని, తాను ఆసియాకప్‌ను యూఏఈలో నిర్వహించాలని ఏసీసీకి సూచించాని నజం సేథి తెలిపాడు. "వర్షం కారణంగా ప్రపంచ క్రికెట్లోని అత్యుత్తమ మ్యాచ్ రద్దు అయింది. ఇది నన్ను చాలా నిరాశపరిచింది. లంకలో ఈ సమయం(ఆగస్టు-సెప్టెంబర్)లో ఇలాంటి పరిస్థితి ఉంటుందని నాకు ముందే తెలుసు. అందుకే నేను పీసీసీబీ చైర్మెన్‌గా ఉన్నప్పుడు ఈ టోర్నీని పాక్‌తో పాటు యూఏఈలో నిర్వహించాలని ఏసీసీని కోరాను. కానీ ఏసీసీ నా మాటలను పట్టించుకోలేదు. వారు అందుకు చెత్త కారణాలు చెప్పారు. దుబాయ్‌లో చాలా వేడిగా ఉంటుందని, అక్కడ ఆడడం కష్టమని వారు చెప్పుకొచ్చారు. మరి ఇంతకుముందు ఏప్రిల్ 2014లో, సెప్టెంబర్ 2020లో ఐపీఎల్ ఆడినప్పుడు దుబాయ్‌లో వేడి తెలియలేదా? చివరిసారి 2022లో ఆసియా కప్ కూడా యూఏఈలోనే జరిగింది. క్రీడలపై రాజకీయాలు ఎక్కవ అయ్యాయి. అది క్షమించరానిది" అంటూ ఎక్స్(ట్విటర్)లో నజం సేథి రాసుకొచ్చాడు. కాగా వాస్తవానికి ఈ ఏడాది ఆసియాకప్ పాకిస్తాన్ వేదికగా జరగాలి. కానీ అక్కడకు భారత జట్టును పంపేందుకు బీసీసీఐ అంగీకరించకపోవడంతో టోర్నీని శ్రీలంక, పాక్ వేదికలగా నిర్వహించాలని ఏసీసీ నిర్ణయించింది. చదవండి: Asia cup 2023: నేపాల్‌తో మ్యాచ్‌కూ వర్షం గండం.. రద్దయితే టీమిండియా పరిస్థితేంటి..? How disappointing! Rain mars the greatest contest in cricket. But this was forecast. As PCB Chair, I urged the ACC to play in UAE but poor excuses were made to accommodate Sri Lanka. Too hot in Dubai, they said. But it was as hot when the Asia Cup was played there last time in… — Najam Sethi (@najamsethi) September 2, 2023 -
పాకిస్తాన్ క్రికెట్ బోర్డు కొత్త బాస్ ఎవరంటే..?
త్వరలో జరుగనున్న పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) ఛైర్మన్ ఎన్నికల బరి నుంచి తాత్కాలిక బాస్ నజమ్ సేథి వైదొలగడంతో కొత్త అభ్యర్థిగా మాజీ పీసీబీ అధ్యక్షుడు జకా అష్రాఫ్ పేరును ప్రకటించారు పాక్ ఫెడరల్ మంత్రి ఎహసాన్ మజారి. ఛైర్మన్‌గా నజమ్ సేథి పదవీకాలం రేపటితో (జూన్ 21) ముగియనుండటంతో అష్రాఫ్‌ను బరిలోకి దించింది పాక్ ప్రభుత్వం. అష్రాఫ్ 2011-13 మధ్యకాలంలో పీసీబీ ఛైర్మన్‌గా పని చేశారు. పాకిస్తాన్లో నెలకొన్న రాజకీయ అనిశ్చితి, ఆసియా కప్, భారత్‌లో జరుగనున్న వన్డే వరల్డ్‌కప్ లొల్లి నేపథ్యంలో నజమ్ సేథి అధ్యక్ష పదవి రేసు నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించాడు. ఈ మేరకు అతను ట్విటర్ వేదికగా వర్తమానం పంపాడు. కాగా, గతేడాది డిసెంబర్లో పాక్ ప్రధాని షాబాజ్.. షరీఫ్ రమీజ్ రజాను పీసీబీ ఛైర్మన్ పదవి నుంచి తప్పించి, తాత్కాలిక ఛైర్మన్ నజమ్ సేథిని ఎంపిక చేసిన విషయం తెలిసిందే. Salaam everyone! I don’t want to be a bone of contention between Asif Zardari and Shehbaz Sharif. Such instability and uncertainty is not good for PCB. Under the circumstances I am not a candidate for Chairmanship of PCB. Good luck to all stakeholders. — Najam Sethi (@najamsethi) June 19, 2023 ఈ ఆరు నెలల కాలంలో నజమ్ సేథీ పీసీబీలోని 14 మందితో కూడిన కమిటీని సమర్థంగా నడిపించాడు. కొన్ని కీలక నిర్ణయాలతో తన మార్కును చూపించాడు. మికీ ఆర్థర్‌ను డైరెక్టర్ ఆఫ్ క్రికెట్‌గా, గ్రాంట్ బ్రాడ్‌బర్న్ హెడ్‌కోచ్‌గా, సౌతాఫ్రికా మాజీ క్రికెటర్ మోర్నీ మోర్కెల్‌ను బౌలింగ్ కోచ్‌గా ఎంపిక చేయడంలో కీలకపాత్ర పోషించాడు. అలాగే ఆసియా కప్‌ను హైబ్రీడ్ మోడ్‌లో నిర్వహించే ప్రతిపాదనను తెరపైకి తెచ్చాడు. ఏసీసీని ఒప్పించి ఆసియా కప్ ఎలాంటి ఆటంకాలు లేకుండా జరిగేందుకు శక్తివంచన లేకుండా ప్రయత్నించాడు. అయితే, భారత్‌లో జరిగే వన్డే వరల్డ్‌కప్‌లో పాక్ పాల్గొనడంపై జరుగుతున్న రచ్చ నేపథ్యంలో నజమ్ సేథి అధ్యక్ష పదవి రేసు నుంచి తప్పుకున్నాడు. -
'గొడవలు జరగడం ఇష్టం లేదు.. రేసు నుంచి తప్పుకుంటున్నా'
పీసీబీ తాత్కాలిక ఛైర్మన్‌గా ఉన్న నజమ్ సేథీ మంగళవారం సంచలన నిర్ణయం తీసుకున్నాడు. త్వరలో పీసీబీ ఛైర్మన్‌కు సంబంధించి జరగనున్న ఎన్నికల్లో రేసు నుంచి తాను తప్పుకుంటున్నట్లు తెలిపాడు. ఈ విషయాన్ని నజమ్ సేథీ స్వయంగా ట్విటర్ ద్వారా తెలిపాడు. ''ఆసిఫ్ జర్దారీ, షెహబాజ్ షరీఫ్‌ల మధ్య గొడవలు జరగడం నాకు ఇష్టం లేదు. ఇంతటి అస్థిరత, అనిశ్చితి పీసీబీకి మంచిది కాద. ఈ పరిస్థితుల్లో నేను పీసీబీ చైర్మన్ అభ్యర్థి పదవికి పోటీ చేయలేను. అందుకే తప్పుకుంటున్నా. రేసులో ఉన్న మిగిలినవారికి ఆల్ ది బెస్ట్'' అంటూ చెప్పుకొచ్చాడు. కాగా గతేడాది డిసెంబర్లో రమీజ్ రాజాను పీసీబీ ఛైర్మన్ పదవి నుంచి తప్పించిన ప్రధాని షాబాజ్ షరీఫ్ అతని స్థానంలో నజమ్ సేథీని తాత్కాలిక ఛైర్మన్‌గా ఎంపిక చేశాడు. పీసీబీ ఛైర్మన్ పదవికి ఎన్నికలు జరిగేంతవరకు నజమ్ సేథీ తాత్కాలిక ఛైర్మన్‌గా ఉంటారని పీసీబీ పేర్కొంది. కాగా 120 రోజుల్లో ఎన్నికల ప్రక్రియ పూర్తవ్వాల్సి ఉండగా.. ఆరు నెలలు దాటిపోయింది. ఈ ఆరు నెలల కాలంలో నజమ్ సేథీ పీసీబీలోని 14 మందితో కూడిన కమిటీని సమర్థంగా నడిపించాడు. కొన్ని కీలక నిర్ణయాలతో తన ఇంపాక్ట్ చూపించాడు. మికీ ఆర్థర్‌ను డైరెక్టర్ ఆఫ్ క్రికెట్‌గా, గ్రాంట్ బ్రాడ్‌బర్న్ హెడ్‌కోచ్‌గా, సౌతాఫ్రికా మాజీ క్రికెటర్ మోర్నీ మోర్కెల్‌ను బౌలింగ్ కోచ్‌గా ఎంపిక చేయడంలో కీలకపాత్ర పోషించాడు. ఇక ఆసియా కప్ హైబ్రీడ్ మోడ్‌లో నిర్వహించే ప్రతిపాదన నజమ్ సేథీదే. మొత్తానికి ఏసీసీని ఒప్పించి ఆసియా కప్ హైబ్రీడ్ మోడ్‌లో జరిగేలా చూడడంలో నజమ్ సేథీ సక్సెస్ అయ్యాడు. కాగా ఈ బుధవారం(జూన్ 21న)తో పీసీబీ తాత్కాలిక ఛైర్మన్ పదవీకాలం ముగియనుంది. సమర్థంగా పనిచేసిన నజమ్ సేథీ మరోసారి పీసీబీ ఛైర్మన్‌గా ఏకగ్రీవం అయ్యే అవకాశం ఉందని వార్తలు వచ్చాయి. కానీ నజమ్ సేథీని ఎన్నుకోవడం పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ అధ్యక్షుడు ఆసిఫ్ అలీ జర్దారీకి ఇష్టం లేదు. మరోవైపు ప్రధాని షాబాజ్ షరీఫ్ మాత్రం నజమ్‌కు మద్దతుగా ఉన్నారు. కానీ తన వల్ల ఇద్దరి మధ్య గొడవలు రాకూడదని.. అది పీసీబీకి మంచిది కాదని పేర్కొన్న నజమ్ సేథీ తనంతట తానుగా రేసు నుంచి వైదొలుగుతున్నట్లు స్పష్టం చేశారు. కాగా నజమ్ సేథీ రేసు నుంచి తప్పుకోగా. మిగిలిన వారిలో జకా అష్రఫ్ పీసీబీ ఛైర్మన్ అయ్యే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. Salaam everyone! I don’t want to be a bone of contention between Asif Zardari and Shehbaz Sharif. Such instability and uncertainty is not good for PCB. Under the circumstances I am not a candidate for Chairmanship of PCB. Good luck to all stakeholders. — Najam Sethi (@najamsethi) June 19, 2023 చదవండి: 'తప్పేముంది.. రెండింటికి సమన్యాయం చేశాడు' -
'వరల్డ్‌కప్ ఆడతామో లేదో'.. పూటకో మాట మారిస్తే ఎలా?
పాకిస్తాన్ క్రికెట్ బోర్డు(పీసీబీ) ఛైర్మన్ నజమ్ సేథీ రోజుకో మాట మారుస్తూ నిత్యం వార్తల్లో ఉంటున్నారు. ఆసియా కప్‌ను హైబ్రీడ్ మోడ్‌లో నిర్వహించేందుకు ఆసియా క్రికెట్ కౌన్సిల్(ఏసీసీ) ఒప్పుకున్న వెంటనే కృతజ్ఞత తెలుపుతూ ప్రత్యేక వీడియో రిలీజ్ చేసిన నజమ్ సేథీ తాజాగా వన్డే వరల్డ్‌కప్ ఆడడంపై ఒక ఆసక్తికర ప్రకటన చేశారు. అక్టోబర్-నవంబర్ నెలల్లో భారత్ వేదికగా జరగనున్న వన్డే వరల్డ్‌కప్‌కు అంతా సిద్దమవుతుంది. పీసీబీ ప్రతిపాదన మేరకు పాక్ జట్టు తాము ఆడాల్సిన మ్యాచ్‌ల్లో ఎక్కువ భాగం సౌత్‌లోనే ఆడాల్సి ఉండగా.. భారత్-పాక్ మ్యాచ్ మాత్రం అహ్మదాబాద్ వేదికగా జరగనుంది. అయితే తాజాగా నజమ్ సేథీ భారత్‌లో జరగబోయే వన్డే వరల్డ్‌కప్ ఆడుతామా లేదా అనేది ఇప్పుడే చెప్పలేమంటూ పెద్ద బాంబ్ పేల్చారు. ఆసియా కప్ విషయంలో బీసీసీఐ ఆవలంభించిన వైఖరిని ఇప్పుడు పాక్ క్రికెట్ బోర్డు చేయనున్నట్లు సమాచారం. నిన్నటి ప్రెస్మీట్లో ఏసీసీకి కృతజ్ఞతలు తెలుపుతూనే.. ''బీసీసీఐ పరిస్థితి అర్థమైందని.. వాళ్లు మా దేశంలో ఆడాలంటే ముందు వాళ్ల ప్రభుత్వం అనుమతి తీసుకోవాల్సిందే. కానీ ఇప్పుడున్న పరిస్థితుల దృశ్యా భారత్ పాక్‌లో మ్యాచ్‌లు ఆడేందుకు అనుమతించదు. అయితే మా పరిస్థితి కూడా ఇప్పుడు అదే. భారత్‌లో జరగబోయే వన్డే వరల్డ్‌కప్ ఆడాలంటే మా ప్రభుత్వం అనుమతి తీసుకోవాల్సిందే. ఐసీసీకి ఇదే వివరించాం. మేము అనుకున్న వేదికల్లో అహ్మదాబాద్ లేదు. కానీ భారత్‌తో మ్యాచ్ అక్కడే జరగనుంది. అయితే అహ్మదాబాద్‌లో ఆడాలా వద్దా అనేది తర్వాత ఆలోచిస్తాం. ముందు వన్డే వరల్డ్‌కప్ ఆడేందుకు ప్రభుత్వం నుంచి క్లియరెన్స్ రావాలి. అప్పటివరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేము. 2016లో భారత్ పాక్‌లో పర్యటించేందుకు ఆసక్తి చూపలేదు. కానీ అదే ఏడాది భారత్‌లో జరిగిన టి20 వరల్డ్‌కప్ ఆడేందుకు వెళ్లాం. అయితే ముందుగా అప్పటి ప్రధాని నవాజ్ షరీఫ్‌ను కలిశాం. ఆయన ఆడేందుకు అనుమతించడంతో ముందు మేము ఆడే మ్యాచ్ వేదికలను పరిశీలించడానికి ఒక స్పెషల్ టీం వెళ్లింది. కాగా అప్పట్లో మేము ఆడాల్సిన ఒక మ్యాచ్ వేదికను దర్శశాల నుంచి కోల్‌కతాకు మార్పించాం. ఆ తర్వాత భారత్‌కు పయనమయ్యాం. అందుకే ముందు వరల్డ్‌కప్ ఆడడంపై క్లియరెన్స్ రానివ్వండి.. అప్పుడు మేం ఆడాల్సిన వేదికలపై చర్చించుకుంటాం'' అంటూ చెప్పుకొచ్చాడు. చదవండి: 'సంతోషంగా ఉంది.. బీసీసీఐ పరిస్థితి అర్థమైంది' -
'సంతోషంగా ఉంది.. బీసీసీఐ పరిస్థితి అర్థమైంది'
ఆసియా కప్ 2023 నిర్వహణపై సందిగ్ధత వీడింది. పీబీసీ ప్రతిపాదించిన హైబ్రీడ్ మోక్కు ఓకే చెప్పిన ఆసియా క్రికెటర్ కౌన్సిల్(ఏసీసీ) గురువారం షెడ్యూల్‌ను విడుదల చేసింది. ఇక ఆసియా కప్‌కు సంబంధించిన పూర్తి షెడ్యూల్ త్వరలో రానుంది. కాగా ఆసియా కప్ నిర్వహణలో పీసీబీ ప్రతిపాదనను అంగీకరించిన ఏసీసీకి.. పీసీబీ చైర్మన్ నజమ్ సేథీ కృతజ్ఞతలు తెలిపారు. ఆసియా కప్‌కు సంబంధించిన షెడ్యూల్ విడుదల కాగానే నజమ్ సేథీ మీడియాతో మాట్లాడారు. దీనికి సంబంధించిన వీడియోనూ పీసీబీ తన ట్విటర్లో షేర్ చేసింది. నజమ్ సేథీ మాట్లాడుతూ.. ''ACC ఆసియా కప్ 2023 కోసం మా హైబ్రిడ్ వెర్షన్ ఆమోదించింనందుకు నేను సంతోషిస్తున్నా. ఆసియా కప్ హోస్ట్‌గా మేము ఉండడం.. భారత్ పాకిస్తాన్ రాలేని కారణంగా శ్రీలంక తటస్థ వేదికగా ఉండనుంది. అయితే గత 15 ఏళ్లలో ఆసియా కప్ ద్వారా టీమిండియా పాకిస్తాన్లో అడుగుపెడుతుందని అనుకున్నాం. కానీ బీసీసీఐ పరిస్థితి మాకు అర్థమైంది. మాలాగే బీసీసీఐకి కూడా బార్డర్ దాటి పాక్‌లో ఆసియా కప్ ఆడేందుకు వారి ప్రభుత్వం నుంచి క్లియరెన్స్‌తో పాటు ఆమోదం కావాలి. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో అది జరగదని తెలుసు. కానీ మా ప్రతిపాదనను అర్థం చేసుకున్న ఏసీసీకి కృతజ్ఞతలు.'' అంటూ చెప్పుకొచ్చాడు. کرکٹ کے شائقین کے لیے بڑی خوشخبری ایشیا کپ ایک بار پھر پاکستان میں۔ پاکستان کرکٹ بورڈ کی مینجمنٹ کمیٹی کے چیئرمین نجم سیٹھی کا پیش کردہ ہائبرڈ ماڈل منظور, ایشیا کپ31 اگست سے17 ستمبر تک ہوگا۔ ابتدائی میچز پاکستان میں ہونگے جس کے بعد بقیہ میچز سری لنکا میں کھیلے جائیں گے۔ pic.twitter.com/r9jUZ8jCGX — Pakistan Cricket (@TheRealPCB) June 15, 2023 ఇక ఆగస్టు 31 నుంచి సెప్టెంబర్ 17 వరకు ఈ టోర్నీని నిర్వహిస్తారు. పాకిస్తాన్లో 4 మ్యాచ్‌లు... శ్రీలంకలో 9 మ్యాచ్‌లు జరుగుతాయి. భారత్, పాకిస్తాన్, శ్రీలంక, బంగ్లాదేశ్, అఫ్గానిస్తాన్, నేపాల్ జట్లు టైటిల్ కోసం పోటీపడతాయి. ఆరు జట్లను రెండు గ్రూప్‌లుగా (మూడు జట్లు చొప్పున) విభజించారు. ఒక గ్రూప్‌లో భారత్, పాకిస్తాన్, నేపాల్... మరో గ్రూప్‌లో శ్రీలంక, బంగ్లాదేశ్, అఫ్గానిస్తాన్ జట్లున్నాయి. గ్రూప్ దశ తర్వాత రెండు గ్రూప్‌ల నుంచి రెండేసి జట్లు ‘సూపర్ ఫోర్’ దశకు అర్హత సాధిస్తాయి. ‘సూపర్ ఫోర్’ దశ తర్వాత టాప్–2లో నిలిచిన జట్లు ఫైనల్‌కు చేరుకుంటాయి. పాకిస్తాన్‌లోని నాలుగు మ్యాచ్‌లకు లాహోర్ వేదికగా నిలుస్తుంది. శ్రీలంకలో క్యాండీ, పల్లెకెలెలో మ్యాచ్‌లు ఉంటాయి. ఈ ఏడాది వన్డే వరల్డ్ కప్ ఉండటంతో ఈసారి ఆసియా కప్‌ను వన్డే ఫార్మాట్లో నిర్వహించనున్నారు. అయితే మ్యాచ్‌ల షెడ్యూల్‌ను తర్వాత ప్రకటిస్తారు. గత ఏడాది టి20 వరల్డ్‌కప్ జరగడంతో ఆసియా కప్ టోర్నీని టి20 ఫార్మాట్లో నిర్వహించగా... ఫైనల్లో పాకిస్తాన్‌ను ఓడించి శ్రీలంక విజేతగా నిలిచింది. చదవండి: ఎట్టకేలకు ఆసియా కప్ 2023 షెడ్యూల్ విడుదల -
భారత్-పాక్‌ల మధ్య టెస్ట్ సిరీస్..?
భారత్-పాక్‌ల మధ్య ద్వైపాక్షిక క్రికెట్ సిరీస్ అంశం మరోసారి తెరపైకి వచ్చినట్టే వచ్చి కనమరుగైంది. తటస్థ వేదికపై టెస్ట్ సిరీస్ నిర్వహించే పీసీబీ (పాకిస్థాన్ క్రికెట్ బోర్డు) ప్రతిపాదనను బీసీసీఐ కొట్టిపారేసింది. సమీప భవిష్యత్తులో కూడా భారత-పాక్ సిరీస్ జరిగే అవకాశం లేదని బీసీసీఐ స్పష్టం చేసింది. పీసీబీ చీఫ్ నజమ్ సేధి సిడ్నీ మార్నింగ్ హెరాల్డ్‌కు ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో భారత్-పాక్ ద్వైపాక్షిక టెస్ట్ సిరీస్‌ను ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ లేదా సౌతాఫ్రికాల్లో జరిపితే బాగుంటుందని ప్రతిపాదించిన అనంతరం బీసీసీఐ పై విధంగా స్పందించింది. 2007 డిసెంబర్లో చివరిసారిగా భారత్-పాక్‌ల మధ్య టెస్ట్ మ్యాచ్ జరిగిన విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే, ఆసియా కప్-2023 వేదిక విషయంలో ప్రస్తుతం భారత్-పాక్‌ల మధ్య ఏకాభిప్రాయం కుదరడం లేదన్న విషయం విధితమే. భద్రతా కారణాల రిత్యా టీమిండియా పాక్‌లో అడుగుపెట్టదని బీసీసీఐ తెగేసి చెప్పగా.. దీనికి కౌంటర్‌గా పాక్ కూడా వన్డే వరల్డ్‌కప్ కోసం భారత్‌లో అడుగుపెట్టదని స్పష్టం చేసింది. ఆసియాకప్ మ్యాచ్‌లను భారత్ తటస్థ వేదికలపై ఆడాలనుకుంటే, వరల్డ్‌కప్‌లో తమ మ్యాచ్‌లను సైతం తటస్థ వేదికలపై నిర్వహించాలని పీసీబీ పట్టుబడుతుంది. ఈ నేపథ్యంలో ఆసియాకప్, వరల్డ్‌కప్ నిర్వహణపై సందిగ్ధత నెలకొంది. చదవండి: యువతి పట్ల మృగంలా వ్యవహరించిన కేసు.. శ్రీలంక క్రికెటర్‌కు ఊరట -
పాకిస్తాన్ కాదు, యూఏఈ కాదు, శ్రీలంక కాదు.. కొత్త ప్రదేశంలో ఆసియా కప్-2023..?
ఆసియా కప్-2023 ఆతిధ్యం విషయమై గతకొద్ది రోజులుగా ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ఏసీసీ) సభ్య దేశాల మధ్య ఏకాభిప్రాయం కుదరని విషయం తెలిసిందే. షెడ్యూల్ ప్రకారం ఈ మెగా టోర్నీ పాకిస్తాన్లో జరగాల్సి ఉండగా.. భద్రతా కారణాల రిత్యా భారత్.. పాక్‌లో అడుగుపెట్టేది లేదని తెగేసి చెప్పింది. దీంతో మరో ఆప్షన్ లేని పాక్.. టీమిండియా ఆడే మ్యాచ్‌లను తటస్థ వేదికపై (యూఏఈ) నిర్వహిస్తామని ప్రతిపాదిస్తూనే, వన్డే ప్రపంచకప్ కోసం తాము కూడా భారత్‌లో పర్యటించమని మెలిక పెట్టింది. తాము భారత్‌లో జరిగే ప్రపంచకప్‌లో పాల్గొనాలంటే, టీమిండియా సైతం పాక్‌లో ఆసియా కప్ మ్యాచ్‌లు ఆడాలని ప్రకటించింది. ఈ మధ్యలో ఏసీసీ మిగతా సభ్య దేశాలైన శ్రీలంక, బంగ్లాదేశ్‌లు.. యూఏఈలో ఆసియా కప్ జరిగే సమయానికి ఎండలు అధికంగా ఉంటాయని, అందుకే తాము యూఏఈలో అడుగపెట్టమని ప్రకటించాయి. ఈ సందిగ్థ పరిస్థితుల్లో పీసీబీ చీఫ్ నజమ్ సేథి సరికొత్త ప్రతిపాదనతో ముందుకొచ్చాడు. ఆతిథ్య హక్కులు తమవే కాబట్టి, వేదికను ఎంచుకునే అధికారం తమకే ఉంటుందని చెబుతూ.. ఆసియాకప్-2023ను పాక్, యూఏఈ, శ్రీలంకల్లో కాకుండా ఇంగ్లండ్‌లో నిర్వహిస్తే బాగుంటుందని అన్నాడు. పీసీబీ బాస్ సరికొత్త ప్రతిపాదనపై ఏసీసీ సభ్య దేశాలు ఏరకంగా స్పందిస్తాయో వేచి చూడాలి. చదవండి: పాక్ క్రికెట్ జట్టు హెడ్ కోచ్‌గా న్యూజిలాండ్ మాజీ క్రికెటర్ -
World Cup 2023: భారత్‌లో అడుగుపెట్టేందుకు పాక్ ప్రభుత్వం ఒప్పుకోదు..!
ఆసియా కప్-2023 వేదిక వివాదం, తదనంతరం జరిగిన పరిణామాల నేపథ్యంలో పాకిస్తాన్ క్రికెట్ బోర్డు చైర్మన్ నజమ్ సేథీ సంచలన వ్యాఖ్యలు చేశాడు. స్పోర్ట్స్ తక్ చానల్‌తో ఆయన మాట్లాడుతూ.. వన్డే వరల్డ్‌కప్-2023 కోసం తమ జట్టు భారత్‌లో అడుగుపెట్టేందుకు పాక్ ప్రభుత్వం ఒప్పుకోదని అన్నాడు. పాక్ ఆడాల్సిన మ్యాచ్‌లు తటస్థ వేదికలపై నిర్వహిస్తేనే తాము వరల్డ్‌కప్ ఆడతామని, లేదంటే లేదని తెగేసి చెప్పాడు. భారత్-పాక్ జట్ల మధ్య వరల్డ్‌కప్ మ్యాచ్ అక్టోబర్ 15న అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ అంతర్జాతీయ స్టేడియంలో జరుగనుందన్న ప్రచారం నేపథ్యంలో పీసీబీ ఈ రకంగా స్పందించింది. కాగా, భారత్-పాక్‌ల మధ్య ఈ క్రికెట్ వివాదం ఆసియా కప్ వేదిక మార్పు నేపథ్యంలో మొదలైంది. భద్రతా కారణాల దృష్ట్యా పాక్‌లో ఆసియా కప్-2023 జరిగితే తాము ఎట్టి పరిస్థితుల్లో పాల్గొనేది లేదని బీసీసీఐ తెగేసి చెప్పింది. దీంతో పీసీబీ వెనక్కు తగ్గింది. తటస్థ వేదికపై (యూఏఈ) భారత్ ఆడాల్సిన మ్యాచ్‌లు నిర్వహించే ప్రతిపాదనను తెరపైకి తెచ్చింది. దీనికి బీసీసీఐ సైతం అంగీకారం తెలిపింది. దీంతో మెగా టోర్నీ సజావుగా సాగుతుందని అంతా అనుకున్నారు. అయితే ఆసియా కప్ జరిగే సెప్టెంబర్ మాసంలో యూఏఈలో ఎండలు అధికంగా ఉంటాయన్న విషయాన్ని సాకుగా చూపుతూ, శ్రీలంక, బంగ్లాదేశ్ దేశాలు యూఏఈ ప్రతిపాదనకు ససేమిరా అంటున్నాయి. దీంతో టోర్నీ నిర్వహణపై నీలినీడలు కమ్ముకున్నాయి. దీంతో రంగంలోకి దిగిన ఏసీసీ.. యూఏఈ, పాక్‌లలో కాకుండా టోర్నీ మొత్తాన్ని శ్రీలంకలో నిర్వహించే మధ్యేమార్గ ప్రతిపాదనను తెరపైకి తెచ్చింది. అయితే ఈ ప్రతిపాదనకు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ససేమిరా అంటుంది. భారత్ ఆడే మ్యాచ్‌లను యూఏఈలో నిర్వహించేందుకు తాము అంగీకరించినప్పుడు.. కొత్తగా శ్రీలంక, బంగ్లాదేశ్‌లు అనవసర లొల్లి చేయడం సరికాదని అంటుంది. గతంలో ఐపీఎల్, ఆసియా కప్ టీ20 టోర్నీలు ఆగస్ట్, సెప్టెంబర్ నెలల్లో యూఏఈలో జరిగిన విషయాన్ని గుర్తు చేస్తుంది. ఒకవేళ కాదు కూడదని టోర్నీని శ్రీలంకలోనే నిర్వహిస్తామంటే తాము వైదొలుగుతామని బెదిరింపులకు దిగుతుంది. ఆసియా కప్ వేదికను పాక్ నుంచి శ్రీలంక మార్చాలని ఏసీసీ యోచిస్తున్న తరుణంలో పాక్ అవకాశవాద రాజకీయానికి తెర లేపింది. ఈ ఏడాది చివర్లో భారత్‌లో జరిగే వన్డే వరల్డ్‌కప్‌లో తమ మ్యాచ్‌లు తటస్థ వేదికపై నిర్వహిస్తేనే టోర్నీలో పాల్గొంటామని, లేదంటే లేదని అంటుంది. బీసీసీఐ కోరినట్లు టీమిండియా మ్యాచ్‌లు తటస్థ వేదికపై నిర్వహించేందుకు తాము ఒప్పుకున్నప్పుడు.. బీసీసీఐ కూడా తమ మ్యాచ్‌లను తటస్థ వేదికపై నిర్వహించేందుకు ఒప్పుకోవాలని డిమాండ్ చేస్తుంది. ఈ విషయంలో ఐసీసీ జోక్యం చేసుకోవాలని, లేదంటే తాము వరల్డ్‌కప్‌లో పాల్గొనేదే లేదని తెగేసి చెప్పింది. చదవండి: టీమిండియా క్రికెటర్లేమైనా ఏలియన్సా..? నోరు పారేసుకున్న పాక్ ఫాస్ట్ బౌలర్ -
'కోట్లు నష్టపోతామని తెలుసు'.. మొండివైఖరి పనికిరాదేమో!
పాకిస్తాన్ క్రికెట్ బోర్డు(పీసీబీ) ఛైర్మెన్ నజామ్ సేథీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. సెప్టెంబర్‌లో జరగనున్న ఆసియా కప్‌ను మా జట్టు బహిష్కరిస్తే పీసీబీ ఆదాయంలో మూడు అమెరికన్ మిలియన్ డాలర్లు(సుమారు రూ.25 కోట్ల రూపాయలు) నష్టపోతుందని తెలిపాడు. మేము చేసిన ప్రతిపాదనకు ఒకవేళ ఆసియా క్రికెట్ కౌన్సిల్(ఏసీసీ) అంగీకరించకుంటే ఆసియాకప్‌ను బహిష్కరించేందుకు కూడా వెనుకాడమని.. దీనివల్ల కోట్ల రూపాయల నష్టం వచ్చినా భరించడానికి సిద్దంగా ఉన్నామని తెలిపాడు. ''ఆసియా కప్ విషయంలో మా వైఖరి ఏంటో ఇప్పటికే ఏసీసీకి క్లియర్‌గా చెప్పాం. హైబ్రిడ్ మోడ్‌లో టోర్నీ నిర్వహించడంపై మాకు అభ్యంతరం లేదు. హైబ్రిడ్ మోడ్‌లో భారత్ తమ మ్యాచ్‌లను తటస్థ వేదికల్లో ఆడుకోవచ్చు.. మిగతా మ్యాచ్‌లు మాత్రం(ఫైనల్‌తో పాటు) పాక్‌లో జరిగేలా చూడాలని చెప్పాం. అయితే దీనివల్ల మేము ఆతిథ్య హక్కులు కోల్పోకుండా ఉంటాం. ఒకవేళ ఆసియా కప్‌కు మరో షెడ్యూల్‌ను ప్రకటిస్తే మేము ఒప్పుకోం. ఆసియా కప్‌ను బహిస్కరిస్తాం. ఇక దీనిపై బీసీసీఐ నుంచి ఇప్పటివరకు ఎలాంటి స్పందన లేదు. అయితే తమ దేశంలో ఆసియాకప్ ఆడడానికి భద్రతాపరమైన కారణాలు చూపిస్తున్న బీసీసీఐ ఒక విషయంలో క్లారిటీ ఇస్తే బాగుంటుంది. మా దేశంలో భద్రత కరువయ్యిందని వారు ప్రూఫ్స్ చూపిస్తే బాగుండు. ఇక ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, న్యూజిలాండ్ లాంటి జట్లు మా దేశంలో ఆడేందుకు ఎలాంటి అభ్యంతరం చెప్పనప్పుడు.. భారత్ మాత్రం ఎందుకు ఈ కారణం చూపిస్తుందో అర్థం కావడం లేదు. అయితే ఏసీసీలో 80 శాతం ఆదాయం పాకిస్తాన్, భారత్‌ల మ్యాచ్‌ల వల్లే వస్తుంది. ఒకవేళ మా ప్రతిపాదనకు బీసీసీఐ అంగీకరించకపోతే వచ్చే నష్టాన్ని భరించడానికి సిద్దంగా ఉన్నాం'' అని పేర్కొన్నాడు. నజామ్ సేథీ వ్యాఖ్యలపై క్రికెట్ అభిమానులు వినూత్నంగా స్పందించారు. ''ఇంత మొండితనం పనికిరాదేమో.. నష్టం భరిస్తామనడం మంచి పద్దతి కాదు.. బీసీసీఐతో మాట్లాడి సమస్యను పరిష్కరించుకుంటే మంచిది'' అంటూ హితబోధ చేశారు. చదవండి: ODI WC 2023: బీసీసీఐ కీలక నిర్ణయం.. హైదరాబాద్ స్టేడియానికి మహర్దశ -
ఐపీఎల్‌కు అంత సీన్ లేదు.. పాకిస్తాన్ సూపర్ లీగే తోపు..!
ఐపీఎల్‌ను ఉద్దేశిస్తూ పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) అధ్యక్షుడు నజమ్ సేథీ సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)తో పోలిస్తే పాకిస్తాన్ సూపర్ లీగ్ సూపర్ సక్సెస్ అంటూ నిరాధారమైన కామెంట్స్ చేశాడు. పీఎస్ఎల్ 2023 సీజన్ ముగిసిన అనంతరం పీసీబీ చీఫ్ విలేకరులతో మాట్లాడుతూ.. ఐపీఎల్ కంటే పీఎస్ఎల్కు మెరుగైన డిజిటల్ రేటింగ్ ఉందని గొప్పలు పోయాడు. డిజిటల్ ప్లాట్‌ఫాం వేదికగా పీఎస్ఎల్ 8వ ఎడిషన్‌ను 150 మిలియన్లకు పైగా ప్రజలు వీక్షించారని, ఐపీఎల్-2022 సీజన్‌ను కేవలం 130 మిలియన్ల డిజిటల్ రేటింగ్ మాత్రమే దక్కిందని నిరాధారమైన లెక్కలు చెబుతూ జబ్బలు చరుచుకున్నాడు. ఐపీఎల్ కంటే పీఎస్ఎల్ ఎంతో గొప్పదో చెప్పడానికి ఇదొక్క విషయం చాలంటూ బడాయి ప్రదర్శించాడు. పాక్‌లో జరగాల్సిన 2023 ఆసియా కప్‌లో పాల్గొనేది లేదని భారత్ కరాఖండిగా తేల్చి చెప్పిన నేపథ్యంలో సేథీ ఇలాంటి రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడంపై అంతర్జాతీయ క్రికెట్ సమాజం అసహనం వ్యక్తం చేస్తుంది. ఏదైనా ఉంటే కూర్చొని మాట్లాడుకోవాలి కానీ, ఇలాంటి నిరధారమైన వ్యాఖ్యలు చేసి అంతంతమాత్రంగా ఉన్న ప్రతిష్టను మరింత దిగజార్చుకోవద్దంటూ నెటిజన్లు పీసీబీకి చురకలంటిస్తున్నారు. ఇదిలా ఉంటే, మార్చి 18న ముగిసిన పీఎస్ఎల్ 2023 సీజన్లో లాహోర్ ఖలందర్స్ విజేతగా నిలిచింది. షాహీన్ అఫ్రిది నేతృత్వంలో ఖలందర్స్ వరుసగా రెండో సీజన్లో టైటిల్‌ను ఎగరేసుకుపోయింది. పీఎస్ఎల్ 2022 సీజన్లో ఎదురైన ప్రత్యర్ధి ముల్తాన్ సుల్తాన్స్నే ఖలందర్స్ మళ్లీ ఓడించి టైటిల్‌ను నిలబెట్టుకుంది. ఫైనల్లో తొలుత బ్యాటింగ్ చేసిన ఖలందర్స్ నిర్ణీత ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 200 పరుగులు చేయగా.. ఛేదనలో సుల్తాన్స్ 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 199 పరుగులు చేసి పరుగు తేడాతో ఓటమిపాలైంది. రన్నరప్‌గా నిలిచన సుల్తాన్స్‌కు మహ్మద్ రిజ్వాన్ కెప్టెన్‌గా వ్యవహరించాడు. -
ODI WC: పాక్ ఇండియాకు వెళ్తుందా? లేదా? పీసీబీ కొత్త చీఫ్ క్లారిటీ
Asia Cup 2023- India Vs Pakistan- ODI World Cup 2023: పాకిస్తాన్ వన్డే వరల్డ్‌కప్-2023 ఆడే అంశంపై ఆ దేశ క్రికెట్ బోర్డు కొత్త చైర్మన్ నజమ్ సేతీ కీలక వ్యాఖ్యలు చేశాడు. తాము ఈ ఐసీసీ మెగా టోర్నీ కోసం భారత్‌కు వెళ్లే విషయం ప్రభుత్వ నిర్ణయంపైనే ఆధారపడి ఉంటుందని స్పష్టం చేశాడు. ఇక ఆసియా కప్-2023 నిర్వహణ విషయంలోనూ ఏసీసీతో చర్చలు జరుపుతున్నామన్న సేతీ పరిస్థితులకు అనుగుణంగా ముందుకు సాగుతామని పేర్కొన్నాడు. కాగా ఆసియా కప్ ఈవెంట్‌ను పాకిస్తాన్లో నిర్వహించేందుకు షెడ్యూల్ ఖరారైనా విషయం తెలిసిందే. అయితే, భారత క్రికెట్ నియంత్రణ మండలి కార్యదర్శి, ఏసీసీ అధ్యక్షుడు జై షా మాత్రం ఆ టోర్నీ కోసం టీమిండియా అక్కడకు వెళ్లే ప్రసక్తే లేదని వ్యాఖ్యలు చేశారు. తటస్థ వేదికపై ఈవెంట్ నిర్వహించే అంశం గురించి గతంలో ప్రస్తావించారు. జరుగుతుందా? లేదా? ఇందుకు స్పందించిన పాకిస్తాన్ క్రికెట్ బోర్డు మాజీ చైర్మన్ రమీజ్ రాజా.. టీమిండియా తమ దేశానికి రాకపోతే, తాము కూడా వరల్డ్‌కప్ ఆడేందుకు అక్కడికి వెళ్లమని వ్యాఖ్యానించాడు. ఈ నేపథ్యంలో మెగా ఈవెంట్లలో మాత్రమే తలపడే చిరకాల ప్రత్యర్థుల పోరు చూస్తామో లేదోనంటూ అభిమానుల్లో సందేహాలు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో బీసీసీఐ కొత్త అధ్యక్షుడు రోజర్ బిన్నీ.. ప్రభుత్వ నిర్ణయాలకు అనుగుణంగా తాము నడుచుకుంటామని ఇది వరకే స్పష్టం చేశాడు. ఇక ఇంగ్లండ్ చేతిలో టెస్టు సిరీస్‌లో వైట్‌వాష్ తర్వాత పీసీబీ చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టిన నజమ్ సేతీ తాజాగా ఈ అంశంపై స్పందించాడు. ఎలా చెబితే అలా! కరాచీలో జరిగిన ప్రెస్ కాన్ఫరెన్స్‌లో మాట్లాడుతూ.. ‘‘ఒకవేళ ఇండియాకు వెళ్లొద్దని మా ప్రభుత్వం చెబితే మేము అలాగే నడుచుకుంటాం. ఇరు దేశాల క్రికెట్ బోర్డుల మధ్య విభేదాలు ఉన్నాయి. కాబట్టి ఇండియాతో ఆడాలా లేదా? అక్కడికి వెళ్లాలా వద్దా? అన్న విషయాల్లో ప్రభుత్వానిదే తుది నిర్ణయం’’ అని క్లారిటీ ఇచ్చాడు. ప్రభుత్వం చెప్పినట్లుగానే తాము నడుచుకుంటామని పేర్కొన్నాడు. చదవండి: David Warner: ఎన్నాళ్లకెన్నాళ్లకు.. అద్భుత శతకం.. అరుదైన రికార్డుల జాబితాలో వార్నర్ Babar Azam: పాంటింగ్ రికార్డు బద్దలు కొట్టిన బాబర్ ఆజం! సెహ్వాగ్‌లా అలా! -
భారత్-పాక్ ద్వైపాక్షిక సిరీస్‌లపై పీసీబీ కొత్త చీఫ్ కీలక వాఖ్యలు
ప్రపంచ క్రికెట్లో భారత్-పాకిస్తాన్ మ్యాచ్‌లకు ఎనలేని క్రేజ్ ఉంటుదన్న సంగతి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అయితే రెండు దేశాల మధ్య ఉద్రిక్తతల కారణంగా చాలా ఏళ్ల నుంచి ద్వైపాక్షిక సిరీస్‌లు లేవు. ఈ క్రమంలో భారత్-పాక్ జట్లు ఐసీసీ టోర్నీలు, ఆసియా కప్ వంటి ఈవెంట్లలో మాత్రమే ముఖాముఖి తలపడుతున్నాయి. అయితే ఇరు దేశాల అభిమానులు మాత్రం చిరకాల ప్రత్యర్ధిలు ద్వైపాక్షిక సిరీస్‌లలో తలపడితే చూడాలని భావిస్తున్నారు. ఇక 2012-13లో చివరగా ద్వైపాక్షిక సిరీస్‌లో పాక్‌తో భారత్ తలపడింది.కాగా భారత్-పాక్ ద్వైపాక్షిక సిరీస్‌ల నిర్వహణపై పీసీబీ కొత్త చీఫ్ నజామ్ సేథీ కీలక వాఖ్యలు చేశాడు. రెండు జట్ల మధ్య ద్వైపాక్షిక సిరీస్‌ల విషయంలో ఇరు దేశాల ప్రభుత్వాలు జోక్యం చేసుకోవాలని నజామ్ సేథీ అభిప్రాయపడ్డాడు. అదే విధంగా బోర్డు ప్యానెల్ మార్పుకు ముందు న్యూజిలాండ్‌తో జరగనున్న టెస్టు సిరీస్‌కు పీసీబీ జట్టును ఎంపిక చేయడాన్ని అతడు తప్పు బట్టాడు. "ప్రస్తుతం పాక్ జట్టులో మార్పులు చేయాల్సిన అవసరం ఉందో లేదో నాకు తెలియదు. అయితే ప్యానల్ మార్పుకు ముందు కివీస్ సిరీస్‌కు జట్టును ప్రకటించకుండా ఉంటే బాగుండేది. కానీ పాకిస్తాన్లో అన్ని ప్రధాన జట్లు పర్యటించడం చాలా సంతోషంగా ఉంది. న్యూజిలాండ్ సిరీస్ మాకు చాలా ముఖ్యమైనది. దేశవాళీ క్రికెట్ నుంచి మంచి ప్రతిభ ఉన్న ఆటగాళ్లను గుర్తించి జాతీయ జట్టులో అవకాశం కల్పిస్తాము" అని విలేకరుల సమావేశంలో సేథీ పేర్కొన్నాడు. కాగా స్వదేశంలో వరుసగా సిరీస్‌లు ఓడిపోవడంతో రమీజ్ రజాను పీసీబీ చైర్మెన్ పదవి నుంచి పాక్ ప్రభుత్వం తొలిగించింది. ఈ క్రమంలో అతడి స్థానంలో సేథీ పీసీబీ కొత్త బాస్‌గా బాధ్యతలు చేపట్టాడు. చదవండి: IPL 2023 Auction: గ్రీన్‌కు 20, కర్రన్‌కు 19.5, స్టోక్స్‌కు 19 కోట్లు..! -
‘ఆ క్రికెటర్ ఒక మూర్చ రోగి’
కరాచీ: అవినీతి ఆరోపణలపై ఇటీవల మూడేళ్ల పాటు నిషేధానికి గురైన పాకిస్తాన్ క్రికెటర్ ఉమర్ అక్మల్‌పై పీసీబీ మాజీ చైర్మన్ నజామ్ సేథీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఉమర్ ఒక మూర్చ రోగి అంటూ మరో కొత్త వివాదానికి తెరలేపారు. తాను పీసీబీ చైర్మన్‌గా,ఎగ్జిక్యూటివ్ కమిటీ హెడ్‌గా ఉన్నసమయంలో తాను ఎదుర్కొన్న తొలి సమస్య ఉమర్‌దేనని పేర్కొన్నారు. ఉమర్‌కు మూర్చ ఉన్నట్లు అప్పటి మెడికల్ రిపోర్ట్ల్లో వెల్లడైందని, కానీ దానిని సెలక్షన్ కమిటీ సీరియస్‌గా తీసుకోలేదన్నారు. అతనికి మూర్చ ఉండటం వల్లే వింత వింతగా ప్రవర్తిస్తూ ఉంటాడని సేథీ తెలిపారు. అయితే తనకు మూర్చ రోగిననే విషయాన్ని అంగీకరించడానికి ఉమర్ సిద్ధంగా లేడనే విషయాన్ని కూడా ఆయన తేల్చిచెప్పారు. గత తన పీసీబీకి చేసిన సేవల్లో ఉమర్‌తో పెద్ద సమస్యగా ఉండేదన్నారు. దాంతోనే రెండు నెలల పాటు అతన్ని క్రికెట్‌కు దూరంగా పెట్టానని, ఆ తర్వాత సెలక్షన్ కమిటీ లైట్‌గా తీసుకోవడంతో క్రికెట్‌ను తిరిగి కొనసాగించడన్నాడు. సెలక్షన్ కమిటీ విషయాల్లో తలదూర్చకూడదనే ఉద్దేశంతోనే తాను అప్పుడు మౌనంగా ఉండిపోయానన్నాడు. (తమ్ముడూ... సచిన్, ధోని, కోహ్లిలను చూసి నేర్చుకో) ఇప్పుడు ఉమర్‌పై మూడేళ్ల నిషేధం పడటంతో అతని కెరీర్ గిసిపోయినట్లేనని సేథీ తెలిపారు. తాను ఎప్పుడూ ఉమర్ కెరీర్ గురించి ఆందోళన చెందుతూనే ఉండేవాడినని, నియమావళిని అతిక్రమించడంతో అతని కెరీర్‌ను నాశనం చేసుకున్నాడన్నాడు. ఉమర్‌పై విధించిన మూడేళ్ల నిషేధంలో ఎటువంటి మార్పులు చోటు చేసుకునే ప్రసక్తే లేదని సేథీ అభిప్రాయపడ్డారు. కొన్ని రోజుల క్రితం ఉమర్ అక్మల్‌పై పీసీబీ మూడేళ్ల నిషేధాన్ని విధించింది. బోర్డు నియమావళిలోని ఆర్టికల్ 2.4.4ను అతిక్రమించినట్లు దర్యాప్తులో తేలడంతో అతనిపై వేటు వేశారు. రెండు నెలలపాటు విచారించిన తర్వాత ఉమర్‌పై నిషేధమే సబబుగా భావించి పీసీబీ నిర్ణయం తీసుకుంది. పీఎస్ఎల్లో ఒక బుకీ తనను సంప్రదించాడనే విషయాన్ని దాచి పెట్టడంతోనే ఉమర్‌పై వేటుకు కారణమైంది.మరొకవైపు ఫిట్నెస్ టెస్టుకు హాజరైన క్రమంలో ట్రైనర్‌తో ఉమర్ దూకుడుగా వ్యవహరించాడనే అపవాదు కూడా ఉంది. అంతుకుముందు మికీ ఆర్థర్ కోచ్‌గా ఉన్న సమయంలో కూడా ఉమర్ ప్రవర్తన విసుగు తెప్పించేంది. ఆర్థర్‌పై పలు మార్లు బహిరంగ విమర్శలు చేసి వార్తల్లోకెక్కాడు ఉమర్. తన అంతర్జాతీయ కెరీర్లో 16 టెస్టులు, 121 వన్డేలు, 84 టి20లను ఉమర్ ఆడాడు. (అక్తర్‌పై ‘పీసీబీ’ పరువు నష్టం కేసు) -
ఇమ్రాన్ ఎఫెక్ట్.. పీసీబీ చీఫ్ రాజీనామా!
కరాచీ: పాకిస్తాన్ ప్రధానమంత్రిగా ఇమ్రాన్ ఖాన్ బాధ్యతలు చేపట్టాక పాక్ క్రికెట్లో వేగంగా మార్పులు చోటు చేసుకుంటున్నాయి. పాక్ క్రికెట్ బోర్డు (పీసీబీ) చైర్మన్ పదవికి నజామ్ సేథీ రాజీనామా చేశారు. ఆయన పదవీకాలం 2020 వరకు ఉన్నా, అనూహ్యంగా పదవి నుంచి తప్పుకొన్నారు. ‘ నేనే పీసీబీ పదవికి రాజీనామా చేస్తూ లేఖను ప్రధానికి సమర్పించడకోసం కొన్ని రోజులుగా వెయిట్ చేస్తున్నా. సోమవారం నా రాజీనామాను సమర్పించాను. పాకిస్తాన్ క్రికెట్ బోర్డుకు ఆల్ ది బెస్ట్. మన క్రికెట్ ఉన్నతి శిఖరాలను అధిరోహిస్తుందని ఆశిస్తున్నా’ అని పేర్కొన్నారు. 2017 ఆగస్టులో పీసీబీ చైర్మన్‌గా నజామ్ సేథీ బాధ్యతలు స్వీకరించారు. ఆయన్ను పీసీబీ గవర్నింగ్ బాడీ ఏకగీవ్రంగా ఎన్నుకుంది. అయితే ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన ఇమ్రాన్ ఖాన్‌తో నజామ్కు సత్సంబంధాలు లేకపోవడమే రాజీనామకు కారణంగా తెలుస్తోంది. నజామ్ పదవీ బాధ్యతల్ని వైదొలిగిన వెంటనే ఐసీసీ మాజీ చీఫ్ ఎహ్సాన్ మణిని చైర్మన్‌గా నామినేట్ చేస్తున్నట్టు ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ట్వీట్ చేశారు. క్రికెట్లో మంచి అనుభవం ఉన్న మణి పీసీబీ చాకచక్యంగా నడుపుతాడని ఇమ్రాన్ ధీమా వ్యక్యం చేశారు. -
'బీసీసీఐ పరిహారం చెల్లించాల్సిందే'
లాహోర్: గత కొన్నేళ్లుగా తమతో ద్వైపాక్షిక సిరీస్ లు ఆడటానికి విముఖత వ్యక్తం చేస్తున్న భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు(బీసీసీఐ) అందుకు తగిన పరిహారం చెల్లించాల్సిందేనని పాకిస్తాన్ క్రికెట్ బోర్డు(పీసీబీ) మరోసారి రచ్చకెక్కింది. ఇందులో తాము వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని, తమ క్రికెట్ కు జరిగిన నష్టానికి పరిహారం ఇవ్వాల్సిందేనని పీసీబీ చైర్మన్ నజామ్ సేథీ డిమాండ్ చేస్తున్నారు. 2015-23 మధ్య కాలంలో భారత-పాకిస్తాన్ క్రికెట్ జట్లు ఆరు ద్వైపాక్షిక సిరీస్ లు జరిగేలా ఆయా క్రికెట్ బోర్డుల మధ్య ఒప్పందం జరిగింది. అయితే పాకిస్తాన్ పదే పదే ఉల్లంఘనలకు పాల్పడుతున్న నేపథ్యంలో ఆ దేశంతో క్రికెట్ కు దూరంగా ఉండాలని భారత ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఎప్పుడైతే పాకిస్తాన్ తమ ఉగ్ర చర్యలకు ఫుల్ స్టాప్ పెడుతుందో అప్పుడే వారితో ద్వైపాక్షిక సిరీస్ లు జరుగుతాయని స్పష్టం చేసింది. ప్రస్తుతం ఇరు జట్ల ద్వైపాక్షిక క్రికెట్ సిరీస్ అంశం ఆ రెండు ప్రభుత్వాల అంగీకారంపై ఆధారపడటంతో దానికి ఎటువంటి ముందడుగు పడటం లేదు. ఇక్కడ అంతర్జాతీయ క్రికెట్ మండలి(ఐసీసీ) కూడా జోక్యం చేసుకోవడం లేదు. ఇది ఇరు దేశాల ద్వైపాక్షిక సిరీస్ కావడంతో ఆయా క్రికెట్ బోర్డులే తేల్చుకోవాలని ఇటీవల స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో పీసీబీ చైర్మన్ నజామ్ సేథీ తన అసంతృప్తిని మరోసారి వెళ్లగక్కారు. 'ఇరు బోర్డుల మధ్య ఆరు ద్వైపాక్షిక సిరీస్ లు ఆడటానికి 2014 లో ఒప్పందం కుదిరింది. తొలి సిరీస్ పాక్ లో జరగాల్సి ఉంది. ఇప్పటివరకూ ఒక్క ద్వైపాక్షిక సిరీస్ కూడా జరగలేదు. ఐసీసీ టోర్నమెంట్లలో పాకిస్తాన్ తో ఆడేందుకు భారత్ కు ఎటువంటి అభ్యంతరం లేదు. కానీ ద్వైపాక్షిక సిరీస్ అంటే బీసీసీఐ ఎందుకు వెనకడుగు వేస్తోంది. తటస్థ వేదికలు దుబాయ్, శ్రీలంకల్లో సిరీస్ లు నిర్వహిస్తామన్న భారత్ ఆసక్తి చూపడం లేదు. గతేడాది లంకలో సిరీస్ జరిపేందుకు ముందుకొస్తే బీసీసీఐ అందుకు ముందుకు రాలేదు. మా క్రికెట్ కు జరిగిన నష్టానికి 70 మిలియన్ డాలర్లను బీసీసీఐ చెల్లించాల్సిందే'అని నజామ్ సేథీ డిమాండ్ చేశారు. -
పీసీబీ చీఫ్‌గా నజమ్ సేథీ
కరాచీ:పాకిస్తాన్ క్రికెట్ బోర్డు(పీసీబీ) నూతన చైర్మన్ గా నజమ్ సేథీ ఎంపికయ్యారు. గత కొంతకాలంగా పీసీబీ ఎగ్జిక్యూటివ్ చీఫ్ గా పని చేస్తున్న నజమ్ సేథీని గురువారం చైర్మన్ గా ఎన్నుకున్నారు. ఈ మేరకు వార్షిక సర్వసభ్య సమావేశంలో సేథీ ఎంపికకు ఏకగ్రీవ ఆమోదం లభించింది. ఇక తాను పీసీబీ చైర్మన్ గా కొనసాగనని షహర్యార్ ఖాన్ స్పష్టం చేయడంతో ఆయన స్థానంలో సేథీని ఎంపిక చేశారు. అయితే షహర్యార్ ఆగస్టు నెలవరకూ చైర్మన్ గా కొనసాగనున్నారు. ఆ తరువాతే నజమ్ సేథీ పీసీబీ చైర్మన్ బాధ్యతల్ని స్వీకరించనున్నారు. కాగా, షహర్యార్ తరహాలోనే ఆయన శిష్యుడు సేథీ కూడా పాకిస్తాన్ క్రికెట్ ను అభ్యున్నతిలో నడిపిస్తారని పీసీబీ ఆశాభావం వ్యక్తం చేసింది. -
మాతో ఆడతారా... లేదా!
స్పష్టం చేయాలని బీసీసీఐని కోరిన పీసీబీ కరాచీ: భారత్ తమతో క్రికెట్ ఆడేది లేనిది స్పష్టం చేయాలని పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) కోరింది. ఒకవేళ తమతో ఆడకపోతే ఎఫ్‌టీపీని ఉల్లంఘించినందుకు తమకు నష్టపరిహారం ఇవ్వాల్సి ఉంటుందని తెలిపింది. కేప్‌టౌన్‌లో ఐసీసీ సమావేశం సందర్భంగా ద్వైపాక్షిక సిరీస్‌లపై స్పష్టత ఇవ్వాలని బీసీసీఐ అధ్యక్షుడు ఠాకూర్‌ను కోరామని... దీనికి ఆయన స్పందించలేదని పీసీబీ అధికారి నజమ్ సేథీ చెప్పారు. పైగా ఐసీసీ ఈవెంట్లలోనూ భారత్, పాక్‌లను ఒకే గ్రూప్‌లో ఉంచకూడదని ఠాకూర్ కోరడం శోచనీయమని అన్నారు. ఒకవేళ ఐసీసీ ఈవెంట్లలో భారత్ తమతో ఆడకపోతే మ్యాచ్‌ను రద్దు చేసి తమకు పాయింట్లు ఇవ్వాలని ఐసీసీని ఉద్దేశించి అన్నారు. భారత్ తమతో ద్వైపాక్షిక సిరీస్ ఆడకపోతే నష్టపరిహారం చెల్లించాలని, ఐసీసీ కూడా తమకు అదనంగా గ్రాంట్స్ ఇవ్వాలని సేథి అన్నారు. -
ఆనాటి లాహోర్ పేలుళ్ల వల్లే..
కరాచీ:తమ దేశంలో క్రికెట్ మ్యాచ్ లు ఆడేందుకు వెస్టిండీస్ తొలుత మొగ్గుచూపినా, ఆ తరువాత వెనుకడుగు వేయడానికి లాహోర్ పేలుళ్ల ఘటనే ప్రధాన కారణమని పాకిస్తాన్ క్రికెట్ బోర్డు(పీసీబీ) తాజాగా స్పష్టం చేసింది. ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సిరీస్‌లో భాగంగా పాకిస్తాన్లో కొన్ని మ్యాచ్ లు ఆడేందుకు వెస్టిండీస్ సుముఖతం వ్యక్తం చేసిన తరుణంలో లాహోర్ పేలుళ్లు వల్ల వారు వెనుకంజ వేసినట్లు పీసీబీ ఎగ్జిక్యూటివ్ చీఫ్ నజీమ్ సేథీ తేల్చిచెప్పారు. ఈ సందర్భంగా 2009లో శ్రీలంక జట్టుపై తీవ్రవాదుల దాడి చేసిన ఘటనను సేథీ గుర్తు చేసుకున్నారు. 'ఇరు దేశాల సిరీస్‌లో కొన్ని పరిమిత ఓవర్లు మ్యాచ్‌లు ఆడాలని విండీస్‌ను అభ్యర్థించాం. వారు పాకిస్తాన్ క్రికెట్ కు సహకారం అందించడానికి ముందుకొచ్చారు. ఆ చర్చలు కూడా విజయమంతమయ్యాయి. పాకిస్తాన్ లో ఆటగాళ్లకు భద్రతపరమైన కారణాలతో విండీస్ ఆలోచనలో పడింది. ఆ సిరీస్‌కు పాకిస్తాన్ కు రాలేమంటూ తేల్చిచెప్పింది. దాదాపు చర్చలు సఫలమైనట్లుగా భావించిన తరువాత విండీస్ విముఖత వ్యక్తం చేయడానికి లాహోర్ పేలుళ్లే కారణం. అవి పాకిస్తాన్ క్రికెట్‌కు తీవ్రం నష్టం కల్గించాయి.ఇక చేసేది లేక ఆ మొత్తం సిరీస్‌ను యూఏఈలోనే ఆడాల్సి వస్తుంది'అని సేథీ అన్నారు. -
అప్పటివరకు మేం భారత్‌లో ఆడం
టీమిండియా వచ్చి పాకిస్థాన్‌లో ద్వైపాక్షిక సిరీస్ ఆడేవరకు తాము భారతదేశంలో పర్యటించేది లేదని పాక్ క్రికెట్ బోర్డు ఎగ్జిక్యూటివ్ కమిటీ చైర్మన్ నజామ్ సేథి స్పష్టం చేశారు. భారతదేశంతో ద్వైపాక్షిక సిరీస్‌ను పునరుద్ధరించడానికి తాము సిద్ధంగా ఉన్నామని, అయితే అది పాకిస్థాన్ లేదా మరో దేశంలో అయితే ఓకే గానీ భారత్‌లో మాత్రం కాదని ఆయన అన్నారు. ముందుగా తమ దేశంలో ఒక పూర్తిస్థాయి సిరీస్ ఆడితేనే ఆర్థిక నష్టాల నుంచి బయటపడగలమని, భారత్‌తో ఆడకపోవడం వల్ల ఇన్నాళ్లుగా చాలా నష్టపోయామని సేథి చెప్పారు. మార్చిలో భారత్‌లో జరిగే టి20 వరల్డ్‌కప్‌లో పాల్గొనేందుకు పీసీబీకి పాక్ ప్రభుత్వం అనుమతించింది. తమ ప్రభుత్వం ఈ విషయంలో ముందడుగు వేస్తోందని, కానీ భారతదేశం కూడా తమకిచ్చిన మాటను ముందుగా నిలబెట్టుకోవాలని సేథి కోరారు. ముంబై ఉగ్రదాడుల నేపథ్యంలో 2007 తర్వాత ఇంతవరకు టీమిండియా వెళ్లి పాకిస్థాన్‌లో సిరీస్ ఆడలేదు. గత సంవత్సరం డిసెంబర్ నెలలో బీసీసీఐ ఈ దిశగా కొంతవరకు ప్రయత్నాలు చేసినా.. ప్రభుత్వం మాత్రం అందుకు అనుమతించలేదు. ముంబై ఉగ్రదాడుల నుంచి ఇటీవల పఠాన్‌కోట్ దాడి వరకు పదే పదే ఉగ్రవాదులకు ఊతం ఇచ్చే చర్యలకు పాక్ పాల్పడుతుండటంతో ఆ దేశంతో ద్వైపాక్షిక సిరీస్.. అదీ వాళ్ల దేశంలో ఆడేందుకు భారత ప్రభుత్వం సుముఖంగా లేదు. -
'ఆ పదవికి వేరే వ్యక్తిని ఎంపిక చేయండి'
కరాచీ: అంతర్జాతీయ క్రికెట్ మండలి(ఐసీసీ) అధ్యక్ష పదవిపై పాకిస్థాన్ క్రికెట్ బోర్డు మాజీ చైర్మన్ నజమ్ సేథీ వెనక్కి తగ్గాడు. పాకిస్థాన్ క్రికెట్ బోర్డులో సీనియర్ సభ్యుడిగా ఉన్న నజమ్.. ఐసీసీ అధ్యక్ష పదవికి సంబంధించిన నామినేషన్ ను తాజాగా ఉపసంహరించుకున్నాడు. ఐసీసీ అధ్యక్షునిగా అతని నియామకం దాదాపుగా ఖరారైన తరుణంలో దానిపై నజమ్ విముఖత వ్యక్తం చేశాడు. ఆ పదవికి మరో పాకిస్థాన్ టెస్ట్ క్రికెటర్ ను నామినేట్ చేయాలని పీసీబీకి విన్నవించాడు. ఈ తన అకస్మిక నిర్ణయం ప్రస్తుతానికి ప్రభావం చూపినా.. తన స్థానంలో మరో వ్యక్తిని కూర్చోబెడితే బాగుంటుదని బోర్డుకు స్పష్టం చేశాడు. దీంతో పాటు ఐసీసీ చైర్మన్ శ్రీనివాసన్ కూడా నజమ్ సేథీ ఓ లేఖ రాశాడు. తన నిర్ణయాన్ని ఆలస్యంగా చెబుతున్నందుకు క్షమించమని ఐసీసీని అభ్యర్థించాడు.కానీ తాను తీసుకున్న నిర్ణయంపై ఐసీసీ సభ్యులు అంతా ఆమోదిస్తారని భావిస్తున్నట్లు నజమ్ పేర్కొన్నాడు. అంతకుముందు ఐసీసీ అధ్యక్ష బాధ్యతల్లో ఉన్న ముస్తఫా కమల్ ఇటీవల రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. అనంతరం నజమ్ సేథీ పేరు తెరపైకి వచ్చింది. ఆ పదవికి తన నియామకం దాదాపు పూర్తయిన క్రమంలో నజమ్ నామినేషన్ ను ఉపసంహరించుకున్నాడు. -
ఐసీసీ అధ్యక్షుడిగా నజమ్ సేథి!
దుబాయ్ : అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) అధ్యక్షుడిగా నజమ్ సేథి నియామకం దాదాపుగా ఖరారైంది. ఇప్పటిదాకా బాధ్యతల్లో ఉన్న ముస్తఫా కమల్ ఈనెల 2న చేసిన రాజీనామాను ఐసీసీ ఆమోదించింది. గురువారం మండలి త్రైమాసిక సమావేశం జరిగింది. దీంట్లో పలు అంశాలపై చర్చలు జరిగాయి. ‘మరో రెండు నెలల పాటు ముస్తఫా పదవీ కాలం ఉన్నా ఆ స్థానంలో తాత్కాలిక అధ్యక్షుడిగా ఎవరినీ నియమించేది లేదు. అయితే జూన్ చివరి వారంలో జరిగే ఐసీసీ కౌన్సిల్ సమావేశంలో పాక్‌కు చెందిన నజమ్‌సేథి పేరును ఈ పదవి కోసం పరిశీలిస్తాం’ అని ఐసీసీ పేర్కొంది. ప్రపంచకప్‌ను అద్భుతంగా నిర్వహించినందుకు ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌లను ఐసీసీ చైర్మన్ శ్రీనివాసన్ అభినందించారు. -
పీసీబీ చైర్మన్‌గా మళ్లీ నజమ్ సేథీ
ఆదేశాలు జారీ చేసిన సుప్రీం కోర్టు కరాచీ: పాక్ క్రికెట్ బోర్డు (పీసీబీ) చైర్మన్ వ్యవహారం రోజుకో కొత్త మలుపు తిరుగుతోంది. నజమ్ సేథీని తప్పిస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసి ఒక్క రోజు కూడా గడవకముందే సుప్రీం కోర్టు మళ్లీ ఆయనకే పగ్గాలు అప్పగించింది. 30 రోజుల్లో ఎన్నికలు నిర్వహించేలా కేర్ టేకర్ చైర్మన్‌గా రిటైర్డ్ జడ్జ్ అలీ షాను నియమిస్తూ ప్రభుత్వం జారీ చేసిన నోటిఫికేషన్‌ను కోర్టు పక్కనబెట్టింది. ప్రభుత్వ నిర్ణయం సరైంది కాదని ద్విసభ్య బెంచ్ వ్యాఖ్యానించింది. తాజా ఎన్నికల కోసమే అలీని నియమించామన్న అటార్నీ జనరల్ వాదనను పట్టించుకోలేదు. ఈ సమయంలో ఎన్నికలు నిర్వహించాలన్న ప్రయత్నం సరికాదని, విషయం తేలే వరకు సేథీని పదవిలో కొనసాగించాలని ఆదేశాలు జారీ చేసింది. తదుపరి విచారణను 21కి వాయిదా వేసింది. -
వచ్చే ఏడాది భారత్-పాక్ సిరీస్!
బీసీసీఐ నిర్ణయం కోసం పీసీబీ నిరీక్షణ కరాచీ: చిరకాల ప్రత్యర్థి భారత్‌తో మళ్లీ ద్వైపాక్షిక సిరీస్‌లు ఆడాలన్న పాకిస్థాన్ కోరిక నెరవేరనుందా! అవుననే అంటున్నాయి పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) వర్గాలు. తాజాగా దుబాయ్‌లో జరిగిన ఐసీసీ ఎగ్జిక్యూటివ్ బోర్డు సమావేశంలో ఈ మేరకు ఇరు దేశాల బోర్డులు అంగీకారానికి వచ్చినట్లు చెబుతున్నాయి. పాక్ బోర్డు చైర్మన్ నజామ్ సేథి బీసీసీఐ అధికారులతో చర్చించారని, వచ్చే ఎనిమిదేళ్లలో పాక్‌తో కొన్ని ద్వైపాక్షిక సిరీస్‌లు ఆడేందుకు బీసీసీఐ అంగీకరించిందని పీసీబీ అధికారి ఒకరు తెలిపారు. అయితే ఇందుకు బోర్డులోని ఇతర సభ్యులు, భారత ప్రభుత్వం నుంచి ఆమోదం పొందాల్సి ఉంటుందని, వారం రోజుల్లో తమ నిర్ణయాన్ని వెల్లడిస్తామని బీసీసీఐ ప్రతినిధి చెప్పినట్లు ఆ అధికారి పేర్కొన్నారు. బీసీసీఐ నుంచి ఆమోదం లభిస్తే 2015లో సిరీస్ జరిగే అవకాశం ఉందని పీసీబీ చెబుతోంది.