దుబాయ్ : అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) అధ్యక్షుడిగా నజమ్ సేథి నియామకం దాదాపుగా ఖరారైంది. ఇప్పటిదాకా బాధ్యతల్లో ఉన్న ముస్తఫా కమల్ ఈనెల 2న చేసిన రాజీనామాను ఐసీసీ ఆమోదించింది. గురువారం మండలి త్రైమాసిక సమావేశం జరిగింది. దీంట్లో పలు అంశాలపై చర్చలు జరిగాయి. ‘మరో రెండు నెలల పాటు ముస్తఫా పదవీ కాలం ఉన్నా ఆ స్థానంలో తాత్కాలిక అధ్యక్షుడిగా ఎవరినీ నియమించేది లేదు. అయితే జూన్ చివరి వారంలో జరిగే ఐసీసీ కౌన్సిల్ సమావేశంలో పాక్‌కు చెందిన నజమ్‌సేథి పేరును ఈ పదవి కోసం పరిశీలిస్తాం’ అని ఐసీసీ పేర్కొంది. ప్రపంచకప్‌ను అద్భుతంగా నిర్వహించినందుకు ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌లను ఐసీసీ చైర్మన్ శ్రీనివాసన్ అభినందించారు.