indian cricket board
-
వచ్చే ఏడాదైనా.. మహిళల ఐపీఎల్ మొదలు పెట్టండి!
న్యూఢిల్లీ: మహిళల ఐపీఎల్ గురించి పదే పదే చర్చ జరుగుతున్నా...దానిని పూర్తి స్థాయిలో నిర్వహించడంపై భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఇప్పటి వరకు దృష్టి పెట్టలేదు. ఐపీఎల్ 2020 సందర్భంగా నాలుగు జట్లతో మహిళల టి20 చాలెంజ్ టోర్నీని నిర్వహించాలని మాత్రం నిర్ణయించింది. అయితే పూర్తి స్థాయి ఐపీఎల్ గురించి బోర్డు ఇంకా ఎంత కాలం ఎదురు చూస్తుందని భారత వన్డే కెప్టెన్ మిథాలీ రాజ్ ప్రశ్నించింది. వచ్చే ఏడాదినుంచైనా దీనిని మొదలు పెడితే బాగుంటుందని ఆమె సూచించింది. ‘కనీసం 2021లోనైనా మహిళల ఐపీఎల్ నిర్వహించాలనేది నా వ్యక్తిగత అభిప్రాయం. మరీ భారీ స్థాయిలో కాకపోయినా పురుషుల లీగ్‌తో పోలిస్తే స్వల్ప మార్పులతోనైనా ఇది మొదలు కావాలి. ఉదాహరణకు నలుగురు విదేశీ ఆటగాళ్లకు బదులుగా ఐదు లేదా ఆరుగురు ఆడవచ్చనే నిబంధన పెట్టవచ్చు’ అని మిథాలీ వ్యాఖ్యానించింది. బీసీసీఐ అధ్యక్షుడిగా ఎన్నికైన కొత్తలో సౌరవ్ గంగూలీ మాట్లాడుతూ...‘కనీసం ఏడు జట్ల మహిళల ఐపీఎల్ నిర్వహించాలంటే వాస్తవికంగా ఆలోచించాలి. మన దగ్గర అంత మంది నాణ్యమైన క్రికెటర్లు అందుబాటులో లేరు. అందుకు కనీసం నాలుగేళ్లు పడుతుంది’ అని వ్యాఖ్యానించాడు. అయితే ఇటీవల ముగిసిన టి20 ప్రపంచకప్‌లో భారత జట్టు రన్నరప్‌గా నిలిచిన నేపథ్యంలో మహిళల ఐపీఎల్‌పై డిమాండ్ పెరిగింది. దిగ్గజ క్రికెటర్ సునీల్ గావస్కర్ కూడా దీనికి మద్దతునిచ్చారు. మహిళల ఐపీఎల్ వస్తే అప్పుడు ఆటగాళ్ల సంఖ్య ఎలాగూ పెరుగుతుందని, ఇప్పుడు ఉన్న ఐపీఎల్ జట్ల యాజమాన్యాలు మహిళల టీమ్‌లను నిర్వహించగలవని మిథాలీ చెప్పింది. ‘దేశవాళీలో ఎక్కువ మంది ప్రతిభావంతులైన అమ్మాయిలు లేరనే విషయాన్ని నేనూ అంగీకరిస్తా. అయితే ఇప్పుడున్న ఫ్రాంచైజీలే మహిళా జట్లను తీసుకుంటే పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. బోర్డు ఎప్పటికీ వేచి చూస్తామంటే ఎలా. ఎక్కడో ఒక చోట మొదలు పెట్టాలి కదా. ఒక్కో ఏడాది మెల్లగా స్థాయి పెంచుకుంటూ పోవచ్చు. అప్పుడు నలుగురు విదేశీ ఆటగాళ్లకే పరిమితం చేయవచ్చు’ అని మిథాలీ అభిప్రాయ పడింది. -
ఇది సానుకూల మలుపు
న్యూఢిల్లీ: భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) కూడా డోపింగ్ విషయంలో జాతీయ డోపింగ్ నిరోధక సంస్థ (నాడా) పరిధిలోకి రావడాన్ని కేంద్ర క్రీడాశాఖ మంత్రి కిరణ్ రిజిజు స్వాగతించారు. క్రీడల్లో పారదర్శకత కోసం ఇది కీలక మలుపు అవుతుందని ఆయన వ్యాఖ్యానించారు. ‘ఎలాంటి అంశాలు, సమస్యలు అపరిష్కృతంగా ఉండాలని నేను కోరుకోవడం లేదు. విభేదాలన్నీ పరస్పర చర్చలతో పరిష్కరించుకోవాలి. నేను క్రీడలు, క్రీడాకారుల మేలు కోరేవాడిని. వాటిలో అన్నీ పారదర్శకంగా జరగాలని భావిస్తా’ అని రిజిజు అన్నారు. మరోవైపు క్రీడా శాఖతో చర్చల కోసం బోర్డు సీఈఓ రాహుల్ జోహ్రిని పంపడాన్ని బీసీసీఐ సీనియర్ సభ్యులు ఒకరు తప్పు పట్టారు. ఒలింపిక్స్‌లో క్రికెట్ చేర్చాలని ప్రయత్నిస్తున్న ఐసీసీ బృందంలో జోహ్రి కూడా సభ్యుడని... దానికి ఉన్న డోపింగ్ అడ్డంకిని తొలగించేందుకే క్రికెట్‌నూ ‘నాడా’లో చేర్చేందుకు జోహ్రి అంగీకరించారని ఆయన విమర్శించారు. -
బీసీసీఐ ‘ఆటలు’ ఇక చెల్లవు!
మా క్రికెటర్లు మా ఇష్టం... ప్రభుత్వం మాకేమైనా నిధులిస్తోందా? మాది స్వతంత్ర సంఘం... నిబంధనలు పాటించాల్సిన అవసరం లేదు... ఏ పరీక్షలైనా మేం సొంతంగానే చేసుకుంటాం తప్ప మమ్మల్ని ప్రశ్నించే హక్కు ఎవరికీ లేదు... గత 13 ఏళ్లుగా డోపింగ్‌కు సంబంధించిన అంశంలో భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) వైఖరి ఇది. కానీ ఇకపై అలాంటిది కుదరదని తేలిపోయింది. సుదీర్ఘ కాలంగా బీసీసీఐని భారత ప్రభుత్వ నిబంధనల పరిధిలోకి తెచ్చేందుకు ప్రయత్నించి విఫలమైన కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖ ఎట్టకేలకు తమ అధికారాన్ని చూపించింది. భారత క్రికెట్ బోర్డును ఇతర క్రీడా సమాఖ్యల్లాగే గుర్తిస్తూ నిర్ణయం తీసుకుంది. ఫలితంగా క్రికెటర్లు కూడా జాతీయ డోపింగ్ నిరోధక సంస్థ (నాడా) నిర్వహించే పరీక్షలకు హాజరు కావాల్సిందే. తాజా నిర్ణయం ఏమిటి? బీసీసీఐకి కూడా ఇకపై ఇతర క్రీడలలాగే జాతీయ క్రీడా సమాఖ్య (ఎన్ఎస్ఎఫ్)గా గుర్తింపు లభించింది. ఇన్నేళ్ల పాటు మాది స్వతంత్ర సంస్థ, మాకు ఎవరితో సంబం« దం లేదు అంటూ క్రికెట్ బోర్డు చెబుతూ వచ్చింది. ఏం జరుగుతుంది? సమాచార హక్కు చట్టం (ఆర్టీఏ) సహా ప్రభుత్వ నిబంధనలు అన్నీ బీసీసీఐకీ వర్తిస్తాయి. ఆర్థికపరంగా స్వతంత్రంగా ఉన్నా... అన్ని విషయాల్లో జవాబుదారీతనం ఉంటుంది. అయితే శుక్రవారం సమావేశంలో ‘నాడా’పై మాత్రమే నిర్ణయం తీసుకున్నారు. సమాచార హక్కు విషయంలో చర్చ జరగలేదు. ‘నాడా’ పరిధిలోకి వస్తే ఏమిటి? శుక్రవారం తీసుకున్న అతి కీలక నిర్ణయం ఇదే. ప్రభుత్వం గుర్తించిన సంఘం కాబట్టి డోపింగ్ విషయంలో జాతీయ డోపింగ్ నిరోధక సంస్థ (నాడా) నిర్వహించే పరీక్షలకు భారత క్రికెటర్లు కూడా హాజరు కావాల్సి ఉంటుంది. సొంతంగా డోపింగ్ పరీక్షలు నిర్వహించుకునే అవకాశం లేదు. ఇప్పటివరకు భారత క్రికెటర్ల శాంపిల్స్‌ను స్వీడన్‌కు చెందిన ఐడీటీఎం సేకరించి జాతీయ డోప్ టెస్టింగ్ లాబొరేటరీ (ఎన్‌డీటీఎల్)కు పంపించేది. ఇకపై ఐడీటీఎంకు ఆ అధికారం ఉండదు. నేరుగా ‘నాడా’నే పరీక్షలు నిర్వహిస్తుంది. ఎప్పుడైనా, ఎక్కడైనా క్రికెటర్లకు ‘నాడా’ పరీక్షలు నిర్వహించవచ్చు. డోపింగ్ విషయంలో బోర్డు సరిగా వ్యవహరించడం లేదా? ఇటీవల యువ క్రికెటర్ పృథ్వీ షా వ్యవహారం దీనికి సరైన ఉదాహరణ. షా డోపింగ్ టెస్టులో విఫలమయ్యాడని తెలిసినా అతడిని ఐపీఎల్ ఆడించడంతో పాటు జాతీయ క్రికెట్ అకాడమీ (ఎన్సీఏ) సౌకర్యాలు వాడుకునేందుకూ బీసీసీఐ అవకాశం కల్పించింది. పైగా పాత తేదీలతో అతని సస్పెన్షన్ కాలాన్ని సాధ్యమైనంత తక్కువగా చేసేందుకు ప్రయత్నించింది. బోర్డు సొంతంగా పరీక్షలు నిర్వహిస్తే ఇలాగే ఉంటుందంటూ చెప్పేందుకు ప్రభుత్వానికి చాన్స్ లభించింది. డోపింగ్ పరీక్షల తీరును ప్రశ్నిస్తూ బీసీసీఐకి ఇటీవలే ఘాటుగా లేఖ కూడా రాసింది. ఇదే అదనుగా బోర్డుపై ఒత్తిడి పెంచి తమ దారికి తెచ్చుకుంది. ప్రభుత్వం ఒత్తిడి తెచ్చిందా? భారత్‌లో త్వరలో దక్షిణాఫ్రికా ‘ఎ’, మహిళా జట్ల పర్యటనలు ఉన్నాయి. దీనికి కేంద్ర ప్రభుత్వం మార్చిలోనే అనుమతి ఇవ్వాల్సి ఉంది. కానీ దానిని నిలిపివేసి తమతో చర్చలకు వచ్చేలా ఒత్తిడి తెచ్చింది. ‘నాడా’కు, దీనికి సంబంధం లేదని జోహ్రి చెప్పినా ఇది కూడా ఒక కారణం. ప్రభుత్వం చెప్పినట్లు వినకపోతే మున్ముందు కీలక సిరీస్‌లకు సందర్భంగా ఇది సమస్యగా మారవచ్చని ఒక రకమైన హెచ్చరిక ఇందులో కనిపించింది. ఇప్పటి వరకు బీసీసీఐ విధానం ఏమిటి? 2002 నుంచి డోపింగ్ పరీక్షలు నిర్వహిస్తున్న అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) 2006లో ప్రపంచ డోపింగ్ నిరోధక సంస్థ (వాడా)తో ఒప్పందం చేసుకుంది. ఐసీసీ సభ్య దేశాలన్నీ దీనికి అంగీకరించగా... ఒక్క భారత్ మాత్రం ఇందులో చేరేందుకు నిరాకరించింది. మన దేశంలో ఇతర క్రీడలకు సంబంధించి ‘వాడా’ పరిధిలోనే ‘నాడా’ కూడా పని చేస్తుంది. అయితే ‘వాడా’ నిర్దేశించిన ప్రమాణాల ప్రకారం అత్యుత్తమ సౌకర్యాలతో తాము సొంతంగా పరీక్షలు నిర్వహించుకునే సామర్థ్యం తమకు ఉంది కాబట్టి కొత్తగా ‘నాడా’లో చేరాల్సిన అవసరం లేదని బోర్డు స్పష్టం చేసింది. ‘నాడా’లో తరచుగా శాంపిల్స్ విషయంలో వివాదాలు రేగాయి కాబట్టి దానిని తాము నమ్మమని తేల్చేసింది. ఈ విషయంలో స్వతంత్రంగా ఉండటానికే మొగ్గు చూపింది. తాజా పరిణామంపై బోర్డు స్పందన ఏమిటి? బీసీసీఐకి అక్టోబరులో ఎన్నికలున్నాయి. ఈలోగా ఇలాంటి కీలక నిర్ణయం తీసుకోవడం పట్ల బోర్డు సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బోర్డు కార్యవర్గం లేకుండా ప్రభుత్వ నిబంధనలను అంగీకరించే హక్కు పరిపాలకుల కమిటీ (సీఓఏ), సీఈఓలకు ఎలా ఉంటు ందని ప్రశ్నిస్తున్నారు. అయితే పదవిలో ఎవరు ఉన్నా చట్టాలు గౌరవించాల్సిందేనని, అది ఎవరి చేతుల్లోనూ ఉండదంటూ జోహ్రి ఈ వాదనను కొట్టిపారేశారు. సమావేశంలో ఏం జరిగింది? శుక్రవారం జాతీయ క్రీడా కార్యదర్శి రాధేశ్యామ్ ఝులనియా, ‘నాడా’ డైరెక్టర్ జనరల్ నవీన్ అగర్వాల్‌లతో బీసీసీఐ సీఈఓ రాహుల్ జోహ్రి, జనరల్ మేనేజర్ సబా కరీమ్ సమావేశమయ్యారు. డోపింగ్‌లో ‘నాడా’ పరిధిలోకి వచ్చేందుకు తమకు ఉన్న సందేహాలను బోర్డు ప్రతినిధులు ముందుంచారు. డోపింగ్ టెస్టింగ్ కిట్ల నాణ్యత, పరీక్షలు జరిపేవారి సామర్థ్యం, శాంపిల్ తీసుకునే అధికారుల అర్హతవంటి అం శాలపై తమకు అభ్యంతరం ఉందంటూ జోహ్రి అన్నా రు. అయితే అన్ని అంశాలపై ప్రభుత్వాధికారులు స్పష్ట తనిచ్చిన తర్వాత బీసీసీఐ తరఫున జోహ్రి సంతకం చేశారు. నాణ్యత విషయంలో ఏదైనా అదనపు ఖర్చు చేయాల్సి వస్తే బీసీసీఐ దానిని భరిస్తుంది. ‘ఎవరైనా చట్టాలను గౌరవించాల్సిందే. బీసీసీఐ కూడా అందుకు సిద్ధం. ప్రభుత్వ నిబంధనలను అంగీకరిస్తున్నట్లు మేం సంతకం చేశాం’ అని జోహ్రి వెల్లడించారు. భారత క్రికెటర్ల అభ్యంతరం ఏమిటి? ‘వాడా’లో ఉన్న ఒక ప్రధాన నిబంధన ఇప్పటి వరకు బీసీసీఐ ‘నాడా’ పరిధిలోకి రాకుండా కారణమైంది. ఆటగాళ్లు ఏడాదిలో నాలుగు సార్లు రాబోయే మూడు నెలల్లో మ్యాచ్‌లు లేని సమయంలో తాము ఎక్కడ ఉండబోతున్నామో, ఏ సమయంలో డోపింగ్ పరీక్షకు సిద్ధమవుతారో ముందే వెల్లడించాల్సి ఉంటుంది. దీనిని తమ వ్యక్తిగత గోప్యతకు భంగకరంగా మన క్రికెటర్లు భావించారు. డోపింగ్ అధికారులకు సమయం ఇచ్చి మూడు సార్లు అందుబాటులో లేకపోతే తీవ్ర చర్యలు ఉంటాయి. విండీస్ క్రికెటర్ ఆండ్రీ రసెల్ ఇదే చేసి నిషేధానికి గురయ్యాడు. అయితే భారత్‌లాంటి దేశంలో క్రికెటర్ల కదలికలు అందరికీ తెలియడం మంచి కాదని... సచిన్, ధోనిలాంటి క్రికెటర్లు తమకు ఉగ్రవాదుల బెదిరింపులు కూడా వచ్చాయి కాబట్టి ఇది సాధ్యం కాదని చెప్పేశారు. దాంతో తమ స్టార్ క్రికెటర్ల మాటపై బీసీసీఐ ఈ నిబంధనను వ్యతిరేకిస్తూ వచ్చింది. ఈ అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకున్న ఐసీసీ... ఖాళీ సమయంలో కాకుండా మ్యాచ్‌లు జరిగేటప్పుడే డోపింగ్ పరీక్షలు చేస్తామని, ఎవరో ఒకరు కాకుండా ప్రత్యేకంగా నియమించిన అధికారికే ఆటగాళ్ల సమాచారం ఇస్తామని ఒప్పించే ప్రయత్నం చేసింది. అయితే మన ఆటగాళ్ల నిర్ణయం మాత్రం మారలేదు. రాహుల్ జోహ్రి, రాధేశ్యామ్ ఝులనియా -
షమీ అభిమానుల్లో నేనొకరిని...
ఇస్లామాబాద్: భారత పేసర్ మొహమ్మద్ షమీ పాకిస్తానీ స్నేహితురాలు అలీష్బా ఎట్టకేలకు మౌనం వీడింది. సోమవారం ఓ మీడియా సంస్థతో మాట్లాడుతూ షమీతో తన అనుబంధాన్ని ఆమె వెల్లడించింది. గతేడాది ఇంగ్లండ్‌లో జరిగిన ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్ అనంతరం తమ మధ్య స్నేహం మొగ్గ తొడిగిందని ఆమె చెప్పింది. ఫైనల్లో పాక్ చేతిలో భారత్ ఓడిన సంగతి తెలిసిందే. ఆ మ్యాచ్ సందర్భంగా షమీకి, పాక్ అభిమానికి మధ్య మాటామాటా పెరిగింది. అది మీడియాలో చూసిన అలీష్బా భారత పేసర్‌పై అభిమానం పెంచుకున్నట్లు తెలిపింది. ‘సామాజిక సైట్లలో షమీ లక్షలాది ఫాలోయర్లలో నేను ఒకర్ని. అప్పుడపుడు పోస్ట్‌లు చేసేదాన్ని. దానికి అతను స్పందించేవాడు. ఓ సెలబ్రిటీగా అతనితో సాధారణ సంభాషణే జరిగేది. దుబాయ్‌లో మా సోదరి నివసిస్తోంది. మా సోదరి ఇంటికి వచ్చిన సందర్భంలో షమీ కూడా దుబాయ్‌లోనే ఉండటంతో అతడిని కలిశాను. అంతకుమించి మా మధ్య ఇంకేమీ లేదు. షమీ భార్య ఆరోపిస్తున్నట్లు నేను షమీకి డబ్బు ఇవ్వలేదు’ అని అలీష్బా తెలిపింది. -
నాకొద్దీ పదవి..!
సీఓఏ నుంచి తప్పుకున్న గుహ న్యూఢిల్లీ: ప్రముఖ చరిత్రకారుడు, రచయిత రామచంద్ర గుహ బీసీసీఐ పరిపాలకుల కమిటీ (సీఓఏ)నుంచి తప్పుకున్నారు. సీఓఏలోని నలుగురు సభ్యులలో ఒకరైన గుహ, వ్యక్తిగత కారణాలతో తాను రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. తన రాజీనామా లేఖను గురువారం ఆయన సుప్రీం కోర్టులో సమర్పించారు. అయితే ప్రస్తుతం కోర్టుకు సెలవులు ఉన్నందున ఆయన రాజీనామాను ఆమోదించే విషయాన్ని కోర్టు జులై 14కు వాయిదా వేసింది. తన నిర్ణయం గురించి ఆయన బీసీసీఐకి, సీఓఏలోని ఇతర సభ్యులకు ముందే చెప్పినట్లు సమాచారం. భారత క్రికెట్ బోర్డులో సమస్యలను చక్కదిద్ది సరైన దిశలో మార్గనిర్దేశనం చేసేందుకు నలుగురు సభ్యులతో సుప్రీం కోర్టు జనవరి 30న సీఓఏను నియమించింది. గుహ రాజీమానాతో ఇప్పుడు ఈ కమిటీలో వినోద్ రాయ్, విక్రమ్ లిమాయే, డయానా ఎడుల్జీ మిగిలారు. అదే కారణమా... సీఓఏ సభ్యుడైన తర్వాత కూడా రామచంద్ర అంటీ ముట్టనట్టే ఉన్నారు. తనకున్న ఇతర వ్యాపకాల కారణంగా సీఓఏ నిర్వహించిన సమావేశాలకు ఆయన పెద్దగా హాజరు కాలేదు. అయినా సరే ఆయన రాజీనామా అనూహ్య పరిణామం. దీనిని అనిల్ కుంబ్లే వివాదంతో సంబంధం ఉన్న అంశంగా బోర్డు వర్గాలు చెబుతున్నాయి. కుంబ్లేతో గుహకు మంచి సాన్నిహిత్యం ఉంది. నిజానికి కుంబ్లే చేసిన ఫీజుల పెంపు తదితర ప్రతిపాదనల వెనక కూడా గుహనే ఉన్నారనే ప్రచారం కూడా ఉంది. తాజా పరిణామాల నేపథ్యంలో కోచ్‌గా కుంబ్లే భవిష్యత్తు కూడా ప్రశ్నార్ధకంగా మారిన తరుణంలోనే గుహ కావాలనే తప్పుకున్నారని వినిపిస్తోంది. ‘రామచంద్ర గుహ మంచి మేధావి. క్రీడలు, చరిత్రకు సంబంధించిన అంశాల్లో ఆయనకు చాలా పట్టుంది. అయితే క్రికెట్ పరిపాలన అనేది పూర్తిగా భిన్నమైన వ్యవహారం. అది ఐసీసీ అయినా బీసీసీఐ అయినా అంత సులువు కాదు. వినోద్ రాయ్, లిమాయేలాంటివాళ్లే కిందా మీదా పడిపోతున్నారు. అందుకే ఆయన తప్పుకొని ఉంటారు’ అని బోర్డు సీనియర్ అధికారి ఒకరు ఈ పరిణామంపై వ్యాఖ్యానించారు. -
20న బీసీసీఐ ముందు డీఆర్ఎస్ ప్రజెంటేషన్
ధర్మశాల: అంపైర్ నిర్ణయ సమీక్షా పద్ధతి (డీఆర్ఎస్)ని మరింత మెరుగ్గా తీర్చిదిద్దిన వీడియో ప్రజెంటేషన్‌ను భారత క్రికెట్ బోర్డు (బీసీసీఐ)కు చూపించేం దుకు అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) సిద్ధమైంది. ఈ నెల 20న న్యూఢిల్లీలో బోర్డు అధ్యక్షుడు అనురాగ్ ఠాకూర్ ముందు ఐసీసీ జనరల్ మేనేజర్ జెఫ్ అలార్డిస్ ఈ ప్రజెంటేషన్‌ను చూపించనున్నారు. అక్కడ వన్డే ఆడేందుకు వెళ్లే భారత టెస్టు జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లి, కోచ్ అనిల్ కుంబ్లే కూడా ఈ ప్రజెంటేషన్‌ను తిలకించే అవకాశముంది. కుంబ్లే ఐసీసీ క్రికెట్ కమిటీ చైర్మన్ హోదాలో ఇందులో పాల్గొననున్నాడు. భారత్ ఎప్పుడు డీఆర్ఎస్ను వద్దనలేదని దాని పనితీరుపైనే అనుమానాలు వ్యక్తం చేసిందని ఠాకూర్ పేర్కొన్నారు. -
ద్రవిడ్ ఫీజు రూ.2.60 కోట్లు
న్యూఢిల్లీ: భారత క్రికెట్ బోర్డు (బీసీసీఐ) 2013-14 సంవత్సరానికి రూ.50 కోట్ల ఆదాయ పన్ను చెల్లించినట్టు పేర్కొంది. పారదర్శక పాలనలో భాగంగా రూ.25 లక్షలకు మించి చేసే వ్యయాల వివరాలను తమ అధికారిక వెబ్సైట్లో బోర్డు ఉంచుతోంది. దీంట్లో భాగంగా తమ మార్చి నెల చెల్లింపులను వివరంగా పేర్కొంది. సర్వీస్ ట్యాక్స్ కింద రూ.2.74 కోట్లు చెల్లించింది. మరోవైపు భారత అండర్-19, ‘ఎ’ జట్టు కోచ్‌గా వ్యవహరించిన మిస్టర్ డిపెండబుల్ రాహుల్ ద్రవిడ్‌కు ఫీజు కింద బీసీసీఐ రూ.2.60 కోట్లు చెల్లిస్తోంది. దీంట్లో సగం మొత్తం రూ.1.30 కోట్లు గత నెలలో అతడికి చెల్లించింది. అలాగే 2014-15 వార్షిక బకాయిల కింద అస్సాం క్రికెట్ సంఘానికి రూ.3.37 కోట్లు, క్యాబ్‌కు రూ.6.75 కోట్లు చెల్లించింది. ఇక ప్రస్తుత ఐపీఎల్ సీజన్లో పంజాబ్, ముంబై, ఢిల్లీ ఫ్రాంచైజీలకు అడ్వాన్స్ పేమెంట్స్ కింద రూ.67.70 కోట్లు చెల్లించింది. బోర్డులకూ డబ్బులు: ఐపీఎల్-9లో ఆడేం దుకు తమ ఆటగాళ్లను పంపినందుకు ఇతర దేశాల బోర్డులకు బీసీసీఐ పెద్ద మొత్తంలో డబ్బులు చెల్లించింది. దక్షిణాఫ్రికా బోర్డుకు రూ. 4.2 కోట్లు; లంకకు రూ. 1.6 కోట్లు; న్యూజిలాండ్‌కు రూ. 1.1 కోట్లు చెల్లించినట్లు బోర్డు వెబ్సైట్లో పేర్కొంది. అయితే ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, వెస్టిండీస్, బంగ్లాదేశ్‌లకు ఇంకా చెల్లింపులు జరపాల్సి ఉంది. టి20 ప్రపంచకప్ సందర్భంగా వాడిన స్పైడర్కామ్ల కోసం రూ. 1.7 కోట్లను ఖర్చు చేసింది. -
క్రికెట్ బోర్డుకు పెప్సీ షాక్
-
నేడే ప్రకటన
అధ్యక్ష పదవికి మనోహర్ ఒక్కరే నామినేషన్ బీసీసీఐ ఎస్జీఎంకి శ్రీనివాసన్ దూరం ముంబై: భారత క్రికెట్ బోర్డు (బీసీసీఐ) కొత్త అధ్యక్షుడెవరో నేడు (ఆదివారం) అధికారికంగా ఖరారు కానుంది. జగ్మోహన్ దాల్మియా ఆకస్మిక మృతితో ఖాళీ అయిన బోర్డు అత్యున్నత పదవి ఎంపిక కోసం ఆదివారం ప్రత్యేక సర్వసభ్య సమావేశం (ఎస్జీఎం) జరుగనుంది. అధ్యక్షుడిగా అనేకమంది పేర్లతో ఊహాగానాలు వినిపించినా ఆఖరికి శశాంక్ మనోహర్ ఒక్కరే బరిలో నిలిచారు. ఈ పదవికి నామినేషన్ దాఖలైంది కూడా ఆయనొక్కరి నుంచే. కాబట్టి మనోహర్ ఎంపికకు సభ్యుల నుంచి ఏకగ్రీవ ఆమోదం లభించనుంది. ఈస్ట్ జోన్ నుంచి కూడా ఆయనకు మద్దతు లభించింది. అయితే శ్రీనివాసన్ ఎస్‌జీఎంకు హాజరుకావడం లేదు. తన వర్గానికి చెందిన వ్యక్తికి ఈ పదవిని కట్టబెట్టేందుకు ఆయన చివరిదాకా ప్రయత్నించినా.. ప్రస్తుత కార్యదర్శి అనురాగ్ ఠాకూర్, పవార్ గ్రూపు ఒక్కటి కావడంతో శ్రీనికి నిరాశే ఎదురైంది. దీంతో ఈ కీలక సమావేశానికి దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నారు. తన స్థానంలో తమిళనాడు క్రికెట్ సంఘం (టీఎన్‌సీఏ) ఉపాధ్యక్షుడు పీఎస్ రామన్ హాజరుకానున్నారు. ఈస్ట్ జోన్‌లోని ఆరు సంఘాలు వేర్వేరుగా మనోహర్‌కు తమ పూర్తి మద్దతును ప్రకటించాయి. బెంగాల్ నుంచి గంగూలీ, జాతీయ క్రికెట్ క్లబ్ (ఎన్సీసీ) నుంచి దాల్మియా కుమారుడు అవిషేక్, త్రిపుర నుంచి సౌరవ్ దాస్ గుప్తా, అస్సాం నుంచి గౌతమ్ రాయ్, ఒడిషా నుంచి ఆశీర్వాద్ బెహరా, జార్ఖండ్ క్రికెట్ సంఘం నుంచి సంజయ్ సింగ్ ప్రతి పాదించిన వారిలో ఉన్నారు. మనోహర్ గతంలో 2008-09, 2010-11లో బోర్డు అధ్యక్షుడిగా వ్యవహరించారు. -
ఆ ‘దిగ్గజాల’తో బీసీసీఐ విశ్వసనీయత మెరుగవుతుందా?
క్రికెట్లో క్రమబద్ధీకరణ, పారదర్శకత విషయంలో ప్రత్యేకించి బీసీసీఐకి పేలవమైన రికార్డు ఉంది. ఇక కామధేనువులా మారిన ఐపీఎల్ విషయంలో దాని రికార్డును చెప్పనవసరం లేదు. దిగ్గజత్రయంతో ఏర్పరచిన కొత్త ప్యానెల్‌ని ఐపీఎల్‌పై తమ అభిప్రాయం చెప్పనిస్తారనడం అనుమానమే. అలాంటప్పుడు సచిన్, సౌరవ్, లక్ష్మణ్‌లను ఎందుకు ఆహ్వానించినట్లు? ఇటీవలే క్రికెట్ నుంచి వైదొలిగిన ముగ్గురు బ్యాటింగ్ దిగ్గ జాలకు భారతీయ క్రికెట్ బోర్డు పదవులను ప్రతిపాదించిన విషయాన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలి? ప్రపంచంలోనే అతి సంపన్నమైన, అత్యంత శక్తివంతమైన క్రికెట్ సంస్థకు ‘సలహాదారులు’గా పనిచేయవలసిందిగా బీసీసీఐ సచిన్ టెండూల్కర్, సౌరవ్ గంగూలీ, వీవీఎస్ లక్ష్మణ్‌లను కోరిం ది. విదేశాల్లో మన ఆటగాళ్ల సామర్థ్యాన్ని, వారి ప్రతిభాపా టవాలను మెరుగుపర్చేందుకోసం, అంతర్జాతీయ క్రికెట్ లోని కఠిన పరిస్థితులను ఎదుర్కొనడంలో మన క్రీడాకారు లకు మార్గనిర్దేశం చేయడం కోసం, దేశీయ క్రికెట్‌ను బలో పేతం చేయడానికి తగిన చర్యలు చేపడుతూ మన జాతీయ జట్టుకు మార్గదర్శకత్వం వహించడంపైనే ఈ దిగ్గజత్రయం ప్రధానంగా దృష్టిసారిస్తుందని బీసీసీఐ తన ప్రారంభ ప్రక టనలో తెలియచేసింది. ఈ ప్రకటనే చాలా అస్పష్టంగా కనిపిస్తోంది. బీసీసీఐ ప్రకటన అనంతరం సౌరవ్ గంగూలీ స్పంది స్తూ, తన పాత్ర ఏమిటి అనే విషయంలో ఇప్పటికైతే తనకు ఏమీ స్ఫురించడం లేదని చెప్పడం వింత గొల్పుతుంది. అంటే ఈ దిగ్గజాలు నిర్వహించే పాత్రపై బీసీసీఐ కనీసంగా కూడా వారితో చర్చించటం లేదనే దీనర్థం. ఈ ముగ్గురినీ బీసీసీఐతో అనుసంధానం చేస్తే బావుంటుందన్నదే తప్ప అంతకు మించిన నిర్దిష్టమైన ఆలోచన చేయలేదని స్పష్ట మవుతోంది. కాబట్టి ఏం జరుగుతోంది? ఈ ‘సలహా కమిటీ’లో చేరడానికి రాహుల్ ద్రావిడ్ తిర స్కరించినట్లు వస్తున్న వార్తలను మనమెలా అర్థం చేసుకో వాలి? పాత వైరం కారణంగా సౌరవ్ గంగూలీతో ముడిప డివున్న ఏ కమిటీలోనూ ద్రావిడ్ భాగం కాదల్చుకోలేదనే కథనం కూడా పేరు చెప్పడానికి ఇష్టపడని వర్గాల నుంచి వినవస్తోంది. దీన్ని నేను నమ్మలేదనుకోండి. అయితే రాహు ల్ ద్రావిడ్‌కు అండర్-16, అండర్-19, ఇండియా ‘ఏ’ టీమ్‌లకు సలహాదారుగా బాధ్యతలు అప్పగించనున్నట్లు మరొక కథనం కూడా వినిపిస్తోంది. దీనికి అనుగుణంగానే శనివారం రాహుల్‌కు ‘ఏ’ టీమ్ కోచ్‌తో పాటు అండర్-19 జట్టు బాధ్యతలు కూడా అప్పజెపుతూ బీసీసీఐ ప్రకటన వెలువరించింది. బీసీసీఐ ఏర్పర్చిన ఈ కొత్త కమిటీ స్వభావం గురించి తనకు ఏమీ అర్థం కావడం లేదంటూ దాపరికం తెలియని మన బిషన్ సింగ్ బేడీ పెదవి విరిచారు. బేడీ వంటి వ్యక్తు లకే ఈ విషయం అర్థం కానప్పుడు మరెవరికి అర్థమవు తుంది? వాస్తవమేమిటంటే, మాజీ ఆటగాళ్లను తన పక్షాన ఉంచుకోవాలని బీసీసీఐ భావిస్తోంది. కామెంటేటర్లుగా ఉంటూనే బోర్డు కోసం చేసిపెడుతున్న అనిర్దిష్టమైన పనికి గానూ సునీల్ గవాస్కర్, రవిశాస్త్రి ఇద్దరూ బీసీసీఐ నుంచి కోట్లాది రూపాయల విలువైన వార్షిక ఒప్పందాలకు సమ్మ తించిన విషయం తెలిసిందే. ఇది పత్రికల్లో రాగానే వారిరు వురు నసుగుతూ వివరణ ఇచ్చారు కానీ అది ఎవరినీ మెప్పించలేకపోయింది. ఈరోజు రవిశాస్త్రి అనధికారికంగానే కావచ్చు కానీ వేతనం తీసుకుంటున్న బీసీసీఐ ప్రతినిధి గానూ, తటస్థ వ్యాఖ్యాతగానూ ఉంటున్నాడని ఆరోపణలు వస్తున్నాయి. ఇప్పుడైతే టీమ్ డెరైక్టర్‌గా కూడా ఉంటున్నాడు (ఇది సరికొత్త ఫ్యాన్సీ టైటిల్‌గా కనబడుతోంది కానీ ఇంత వరకు ఇలాంటిది ఉనికిలో లేదు). బీసీసీఐ ఇలాంటి విషయాల్లో ఎలాంటి వరసలను పాటించదు. కొద్దిమంది వ్యక్తుల బృందం ప్రతిదాన్ని నియంత్రిస్తూ ఉంటుంది. వీరిలో కొందరు వ్యాపారవేత్తలు, రాజకీయనేతలూ అయితే మరికొందరు మాజీ క్రికెటర్లు. కాని ఈ బృందం మరీ చిన్నదిగానూ, గోప్యమైనదిగానూ ఎందుకుంటోంది? కారణం ఏమిటంటే ఈ బృందం పూర్తిగా కుంభకోణాలతో కూడుకున్నది. ఐపీఎల్ వ్యవస్థాప కుడు అయిపు లేకుండాపోయాడు. ఐసీసీ చైర్మన్ శ్రీనివాసన్ అల్లుడు బెట్టింగుకుగాను జైలుపాలయ్యాడు. ఐపీఎల్ టీమ్ లలో చాలా వరకు యాజమాన్యం, ఇతర వ్యవహారాల్లో తీవ్రమైన ఆరోపణలు ఎదుర్కొంటున్నాయి. క్రికెటర్లు కూడా మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలతో పట్టుబడి నిషేధాల పాలయ్యారు. దీన్నంతా మార్చడానికి ఎవరు నడుం కడుతున్నారు? ఎవ్వరూ లేరు. ఆటను మెరుగుపర్చడానికి తనదైన ప్రయ త్నం చేస్తున్నట్లు బీసీసీఐ ఎప్పుడైనా ప్రకటించిందా అంటే నాకు అనుమానమే. వాస్తవం చెప్పాలంటే బీసీసీఐ డబ్బును సృష్టించే ఒక యంత్రం. గతంలో గుజరాత్ క్రికెట్ అధ్యక్షు డిగా ఉండిన నరేంద్రమోదీతోపాటు రాజకీయనేతలందరూ ఈ డబ్బు తయారీ కార్యక్రమంలో భాగమవ్వాలని కోరుకుం టున్నారు. క్రికెట్లో క్రమబద్ధీకరణ, పారదర్శకత విషయంలో ప్రత్యేకించి బీసీసీఐకి పేలవమైన రికార్డు ఉంది. ఇక కామధే నువులా మారిన ఐపీఎల్ విషయంలో దాని రికార్డును చెప్ప నవసరం లేదు. ఒక పత్రిక అయితే ఈ విషయాన్ని ఇప్పటికే నివేదించింది కూడా. దిగ్గజ త్రయంతో ఏర్పరచిన కొత్త ప్యానెల్‌ని ఐపీఎల్‌పై అభిప్రాయం అడుగుతారనుకోవడం కల్లోమాటే అన్నదే ఆ వార్త. అలాంటప్పుడు సచిన్, సౌరవ్, లక్ష్మణ్‌లను ఎందుకు ఆహ్వానించినట్లు? ఈ విషయానికి సంబంధించి నా అంచనా ఏమిటంటే, విశ్వసనీయమైన ఇన్సైడర్లు తన ప్రభావ పరిధికి వెలుపల ఉండిపోవడం ప్రమాదకరమని బీసీసీఐ భావిస్తోందేమో. ఇలాంటి మేటి క్రికెటర్లను వెలుపల ఉంచడం కంటే తన శిబి రంలో ఉంచుకోవడం చాలా మంచిదని అది భావిస్తుండ వచ్చు కూడా. ఇలాంటి చర్య ద్వారా బీసీసీఐ సీనియర్ కావచ్చు లేదా జూనియర్ కావచ్చు టీమ్‌ను మెరుగుపర్చడంపై ఎలాంటి ఆలోచనలను దృష్టిలో పెట్టుకున్న దాఖలాలు లేవు. స్వీయ రక్షణే దాని ఉద్దేశమన్నది స్పష్టం. ఆటగురించి బాగా తెలిసిన మాజీ ఆటగాళ్లకు మరింత పని కల్పించడంపై నిజంగా బీసీసీకి శ్రద్ధ ఉన్నట్లయితే, తనను నిర్లక్ష్యం చేస్తున్నారంటూ సయ్యద్ కిర్మాణి చేసిన ఆరోపణను అది ఎందుకు పట్టించుకోలేదు? దీనికి కారణం బహుశా కిర్మాణిని ఇవ్వాళ కొద్దిమంది మాత్రమే గుర్తు పెట్టుకోవడమే కావచ్చు. టెండూల్కర్ వంటి మాజీ ఆటగాళ్ల అభిప్రాయాలకే బీసీసీఐ భయపడు తున్నట్లుంది. ఇండియన్ బోర్డు లోపల ఉన్న అవినీతి, బంధుప్రీతి గురించి సచిన్ నోరు విప్పితే ప్రేక్షకుల దృష్టిలో బీసీసీఐ చాలా సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. అందుకే బోర్డు సచిన్‌ను తన శిబిరం లోపల ఉంచుకోవాలనుకుం టోంది. ఎన్ని కుయుక్తులు పన్నుతున్నప్పటికీ బీసీసీఐని అంతిమంగా కాపాడటమే ఒప్పందం నిజస్వభావమని ద్రావిడ్ గుర్తించబట్టే అతడు బీసీసీఐ ప్రతిపాదనను తిర స్కరించి ఉంటాడని నా అభిప్రాయం. బీసీసీఐ నియమించు కున్న సలహా మండలిని ఈ దృష్టిలోంచే పరిశీలించాల్సి ఉంటుంది. ఎందుకంటే వారికున్న సచ్చరిత్ర కారణంగా సంస్థ పట్ల విశ్వాసాన్ని ప్రోది చేయాల్సిన బాధ్యత పూర్తిగా వారిమీదే ఆధారపడి ఉంది మరి. (వ్యాసకర్త కాలమిస్టు, రచయిత) aakar.patel@icloud.com) - ఆకార్ పటేల్ -
ఐసీసీ అధ్యక్షుడిగా నజమ్ సేథి!
దుబాయ్ : అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) అధ్యక్షుడిగా నజమ్ సేథి నియామకం దాదాపుగా ఖరారైంది. ఇప్పటిదాకా బాధ్యతల్లో ఉన్న ముస్తఫా కమల్ ఈనెల 2న చేసిన రాజీనామాను ఐసీసీ ఆమోదించింది. గురువారం మండలి త్రైమాసిక సమావేశం జరిగింది. దీంట్లో పలు అంశాలపై చర్చలు జరిగాయి. ‘మరో రెండు నెలల పాటు ముస్తఫా పదవీ కాలం ఉన్నా ఆ స్థానంలో తాత్కాలిక అధ్యక్షుడిగా ఎవరినీ నియమించేది లేదు. అయితే జూన్ చివరి వారంలో జరిగే ఐసీసీ కౌన్సిల్ సమావేశంలో పాక్‌కు చెందిన నజమ్‌సేథి పేరును ఈ పదవి కోసం పరిశీలిస్తాం’ అని ఐసీసీ పేర్కొంది. ప్రపంచకప్‌ను అద్భుతంగా నిర్వహించినందుకు ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌లను ఐసీసీ చైర్మన్ శ్రీనివాసన్ అభినందించారు. -
బీసీసీఐని స్వాధీనం చేసుకోం
- ఆర్టీఐ పరిధిలోకి తెస్తాం - క్రీడల మంత్రి సోనోవాల్ వ్యాఖ్య న్యూఢిల్లీ: భారత క్రికెట్ బోర్డు (బీసీసీఐ)ని స్వాధీనం చేసుకునే ఉద్దేశం తమ ప్రభుత్వానికి లేదని కేంద్ర క్రీడల మంత్రి సర్బానంద సోనోవాల్ స్పష్టం చేశారు. అయితే సమాచార హక్కు చట్టం (ఆర్టీఐ) పరిధిలోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తామన్నారు. రాజ్యసభలో అడిగిన ఓ ప్రశ్నకు మంత్రి పైవిధంగా సమాధానమిచ్చారు. ‘బీసీసీఐ స్వతంత్ర ప్రతిపత్తి గల సంస్థ. సొసైటీస్ చట్టం కింద దాన్ని రిజస్టర్ చేశారు. కాబట్టి దాన్ని స్వాధీనం చేసుకొని రోజువారి కార్యకలాపాలు నిర్వహించలేం’ అని సోనోవాల్ లిఖితపూర్వకంగా పేర్కొన్నారు. బీసీసీఐని చుట్టుముడుతున్న వివాదాల (ఫ్రాంచైజీల కేటాయింపులు, మ్యాచ్ ఫిక్సింగ్, బెట్టింగ్)పై తమ ప్రభుత్వం అప్రమత్తంగా ఉందన్నారు. ఎన్ఫోర్స్మెంట్ డెరైక్టరేట్, ఇన్కమ్ ట్యాక్స్, సర్వీస్ ట్యాక్స్ విభాగాలు వీటిపై విచారణ జరుపుతున్నాయని చెప్పారు. వీలైనంత త్వరగా బీసీసీఐతో సహా అన్ని క్రీడా సమాఖ్యలను ఆర్టీఐ పరిధిలోకి తీసుకురావడంపై తమ మంత్రిత్వ శాఖ దృష్టిపెట్టిందన్నారు. ఈ మేరకు జాతీయ క్రీడాబిల్లు ముసాయిదాను రూపొందించామని తెలిపారు. మ్యాచ్ ఫిక్సింగ్‌లాంటి అంశాలను నిరోధించేందుకు అవసరమైన చట్టాలను తీసుకొస్తామని వెల్లడించిన మంత్రి జాతీయ క్రీడా సమాఖ్యలు పారదర్శకంగా పని చేసేందుకు కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. -
సురేష్ రైనాకు షాక్
ముంబై: ఫామ్ కోల్పోయి జట్టుకు భారంగా మారిన సురేష్ రైనాకు భారత క్రికెట్ బోర్డు ఉద్వాసన పలికింది. వన్డే జట్టు నుంచి అతడిని తొలగించింది. ఆసియా కప్‌కు అతడిని పక్కనపెట్టింది. వికెట్ల వేటలో వెనుకబడిన ఇషాంత్ శర్మపై కూడా వేటు వేసింది. ఆసియా కప్, టీ-20 వరల్డ్ కప్ ఆడే జట్టును సెలక్షన్ కమిటీ ఈ రోజు ప్రకటించింది. ఇషాంత్ శర్మను ఈ సిరీస్‌లకు ఎంపిక చేయలేదు. వన్డే జట్టు నుంచి తప్పించిన రైనాకు టీ-20 వరల్డ్ కప్‌లో ఆడే అవకాశం కల్పించారు. యువరాజ్ సింగ్‌ను టీ-20 వరల్డ్ కప్‌కు ఎంపిక చేశారు. వన్డేలో రైనా స్థానంలో ఛతేశ్వర్ పూజారాను తీసుకున్నారు. -
పాక్, లంకతో ముక్కోణపు టోర్నీ!
చెన్నై: దక్షిణాఫ్రికా పర్యటనకు బీసీసీఐ దాదాపుగా ముగింపు పలికే ఆలోచనలో ఉన్నట్టు కనిపిస్తోంది. ఈ ఏడాది చివర్లో జరిగే ఈ టూర్ స్థానంలో తాజాగా పాకిస్థాన్, శ్రీలంకతో ముక్కోణపు టోర్నీ జరపాలని బోర్డు భావిస్తోంది. ఈ మేరకు శనివారం ఇక్కడ జరిగిన ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ఏసీసీ) సమావేశంలో చర్చించారు. ఈ సమావేశానికి ఏసీసీ అధ్యక్షుడి హోదాలో ఎన్.శ్రీనివాసన్ హాజరయ్యారు. నవంబర్, డిసెంబర్ లో జరగాల్సిన సఫారీ పర్యటనలో తమకు సమాచారం ఇవ్వకుండానే సుదీర్ఘ షెడ్యూల్ ప్రకటించడంపై భారత క్రికెట్ బోర్డు ఆగ్రహంతో ఉంది. దీంతో నవంబర్‌లో విండీస్‌తో సిరీస్‌ను ఖాయం చేసుకుంది. జనవరి 19 నుంచి న్యూజిలాండ్ పర్యటనకు వెళ్లనుంది. సోమవారం బీసీసీఐ కార్యదర్శి సంజయ్ పటేల్, దక్షిణాఫ్రికా క్రికెట్ చీఫ్ హరూన్ లోర్గాత్‌తో దుబాయ్‌లో జరిగే సమావేశం అనంతరం ఈ ముక్కోణపు టోర్నీ గురించి పూర్తి స్పష్టత రానుంది. బంగ్లాదేశ్‌లో ఆసియా కప్ వచ్చే ఫిబ్రవరి 24 నుంచి మార్చి 8 వరకు ఆసియా కప్ టోర్నీ బంగ్లాదేశ్‌లో జరుగనుంది. వాస్తవానికి ఈ టోర్నీ భారత్‌లో జరగాల్సి ఉన్నా అంతర్జాతీయ బిజీ షెడ్యూల్ కారణంగా బంగ్లాదేశ్‌కు వెళ్లింది. అయితే గత టోర్నీ (2012లో) కూడా అక్కడే జరగడం విశేషం.