![Mohammed Shami's Pak friend Alishba denies money transaction - Sakshi](/styles/webp/s3/article_images/2018/03/20/SHAMI-BEARD.jpg.webp?itok=-tJydyi5)
ఇస్లామాబాద్: భారత పేసర్ మొహమ్మద్ షమీ పాకిస్తానీ స్నేహితురాలు అలీష్బా ఎట్టకేలకు మౌనం వీడింది. సోమవారం ఓ మీడియా సంస్థతో మాట్లాడుతూ షమీతో తన అనుబంధాన్ని ఆమె వెల్లడించింది. గతేడాది ఇంగ్లండ్‌లో జరిగిన ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్ అనంతరం తమ మధ్య స్నేహం మొగ్గ తొడిగిందని ఆమె చెప్పింది. ఫైనల్లో పాక్ చేతిలో భారత్ ఓడిన సంగతి తెలిసిందే. ఆ మ్యాచ్ సందర్భంగా షమీకి, పాక్ అభిమానికి మధ్య మాటామాటా పెరిగింది. అది మీడియాలో చూసిన అలీష్బా భారత పేసర్‌పై అభిమానం పెంచుకున్నట్లు తెలిపింది.
‘సామాజిక సైట్లలో షమీ లక్షలాది ఫాలోయర్లలో నేను ఒకర్ని. అప్పుడపుడు పోస్ట్‌లు చేసేదాన్ని. దానికి అతను స్పందించేవాడు. ఓ సెలబ్రిటీగా అతనితో సాధారణ సంభాషణే జరిగేది. దుబాయ్‌లో మా సోదరి నివసిస్తోంది. మా సోదరి ఇంటికి వచ్చిన సందర్భంలో షమీ కూడా దుబాయ్‌లోనే ఉండటంతో అతడిని కలిశాను. అంతకుమించి మా మధ్య ఇంకేమీ లేదు. షమీ భార్య ఆరోపిస్తున్నట్లు నేను షమీకి డబ్బు ఇవ్వలేదు’ అని అలీష్బా తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment