Shami
-
సానియాతో పెళ్లి?.. మీకు దమ్ముంటే ముందుకు రండి: షమీ వార్నింగ్ (ఫొటోలు)
-
ఐపీఎల్ నుంచి షమీ అవుట్
భారత పేస్ బౌలర్ షమీ ఎడమ కాలి మడమ గాయం కారణంగా ఐపీఎల్–2024 సీజన్ మొత్తానికి దూరమయ్యాడు. గత నెలలో లండన్‌లో ఈ గాయానికి చికిత్స తీసుకునే క్రమంలో మడమకు అతను ప్రత్యేక ఇంజక్షన్లు తీసుకున్నాడు. అయితే అవి ప్రభావం చూపించకపోవడంతో శస్త్ర చికిత్స చేయించుకోవడం తప్పనిసరిగా మారింది. త్వరలోనే అతను మళ్లీ లండన్‌కు వెళతాడు. వన్డే వరల్డ్ కప్‌లో 24 వికెట్లతో భారత్‌ను ఫైనల్ చేర్చడంలో కీలక పాత్ర పోషించిన షమీ ఆ తర్వాత మరే మ్యాచ్‌లోనూ బరిలోకి దిగలేదు. -
ఆ ఇద్దరు తెలుగు హీరోలే నా ఫేవరెట్: క్రికెటర్ షమి
ఒకప్పుడు తెలుగు సినిమా అంటే మనవరకు మాత్రమే తెలిసేది. కానీ 'బాహుబలి' తర్వాత పాన్ ఇండియా చిత్రాల ట్రెండ్ పెరిగింది. 'ఆర్ఆర్ఆర్', 'పుష్ప', 'కేజీఎఫ్' మూవీస్.. సౌత్ ఇండస్ట్రీ రేంజుని ఎక్కడికో తీసుకెళ్లిపోయాయి. దీంతో దేశవ్యాప్తంగా చాలామంది సెలబ్రిటీలు.. తెలుగు చిత్రాలకు ఫిదా అయిపోతున్నాతు. తాజాగా టీమిండియా క్రికెటర్ షమి కూడా.. టాలీవుడ్‌కి వీరాభిమాని అని తేలిపోయింది. (ఇదీ చదవండి: నెలకు రూ.35 లక్షలు వచ్చే పనిమానేశా: '12th ఫెయిల్' హీరో) టీమిండియా క్రికెటర్లలో బౌలర్ షమికి సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. గత కొన్నేళ్ల నుంచి భారత క్రికెట్ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఇతడు.. అద్భుతమైన విజయాల్లో పాలుపంచుకున్నాడు. తాజాగా ఓ ఈవెంట్లో భాగంగా హైదరాబాద్ వచ్చిన ఇతడితో తెలుగు మీడియా ప్రతినిధులు మాట్లాడారు. సౌత్‌లో మీకు ఇష్టమైన యాక్టర్స్ ఎవరు అని అడగ్గా ఆసక్తికర సమాధానం చెప్పాడు. 'దక్షిణాది సినిమాలు చూడటం నాకు ఇష్టం. జూ.ఎన్టీఆర్, ప్రభాస్.. నా ఫేవరెట్ హీరోలు' అని టీమిండియా క్రికెటర్ షమి చెప్పుకొచ్చాడు. దీనిబట్టి చూస్తుంటే.. షమికి మాత్రమే కాదు మిగతా భారత క్రికెటర్లు కూడా తెలుగు సినిమాలు చూస్తుంటారనిపిస్తుంది. కాకపోతే వాళ్లకు ఎప్పుడు మాట్లాడే ఛాన్స్ రాలేదు. లేదంటే కోహ్లీ కూడా తనకు అల్లు అర్జునో లేదా ఎన్టీఆర్ అంటే ఇష్టమని చెప్పే సందర్భం రావొచ్చు. (ఇదీ చదవండి: అనుపమ అభిమాని వీడియో.. ఎందుకు ఇలా చేస్తున్నారని ఆవేదన) My Favourite Actors From South #Junior #NTR 🔥🔥 and #PRABHAS 🔥🔥 - #Shami pic.twitter.com/SLbq94nTbq — CHITRAMBHALARE (@chitrambhalareI) February 19, 2024 -
డ్రెస్సింగ్ రూంలో క్రికెటర్లను ఓదార్చిన మోదీ
అహ్మదాబాద్: వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్‌లో ఓటమి తర్వాత తీవ్ర నిరాశలో ఉన్న భారత క్రికెటర్లను ప్రధాని మోదీ ఓదార్చారు. ఓటమి సాధారణమైనది, నిరుత్సాపడకూడదని ప్రోత్సహించారు. టోర్నీలో వరుసగా పది మ్యాచ్‌లు గెలిచిన తీరును గుర్తుచేశారు. దేశమంతా చూస్తోంది.. దయచేసి నవ్వండని కోరారు. అప్పుడప్పుడు ఇలా జరగుతుందని కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి చేతులు పట్టుకుని ఉత్సాహపరిచారు. ఆటగాళ్లు ఒకరినొకరు నిరంతరం ప్రోత్సహించుకోవాలని చెప్పారు. గుజరాతీ అయిన రవీంద్ర జడేజాతో ప్రధాని మోదీ గుజరాతీలో మాట్లాడారు. ఏం బాబు అని పలకరిస్తూ ఇరువురు నవ్వులు కురిపించారు. మహ్మద్ షమీ వద్దకు వచ్చిన మోదీ.. షమీని కౌగిలించుకున్నారు. అద్భుతమైన ఆటతీరు కనబరిచావని మెచ్చుకున్నారు. #WATCH | Prime Minister Narendra Modi met Team India in their dressing room after the ICC World Cup Finals at Narendra Modi Stadium in Ahmedabad, Gujarat on 19th November. The PM spoke to the players and encouraged them for their performance throughout the tournament. (Video:… pic.twitter.com/ZqYIakoIIj — ANI (@ANI) November 21, 2023 అహ్మదాబాద్ వేదికగా వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్‌లో ఆస్ట్రేలియాతో భారత్ పోరుకు దిగింది. అయితే.. 6 వికెట్ల తేడాతో భారత్‌పై ఆసిస్ అలవోక విజయం సాధించింది. ఓటమిని చవిచూసిన భారత ఆటగాళ్లు నిరుత్సాహంతో మైదానాన్ని వీడారు. కొందరు ఆటగాళ్లు కన్నీళ్లు పెట్టుకున్నారు. మ్యాచ్‌ను వీక్షించడానికి వెళ్లిన ప్రధాని మోదీ క్రికెటర్లను డ్రస్సింగ్ రూంలో కలిశారు. నిరుత్సాహంలో ఉన్న ఆటగాళ్లను ఓదార్చారు. ఇదీ చదవండి: ద్రవిడ్‌ను కొనసాగిస్తారా లేక సాగనంపుతారా.. టీమిండియా తదుపరి కోచ్ ఎవరు..? -
తొలి వన్డే భారత్‌దే
మొహాలీ: ఆ్రస్టేలియాతో వన్డే సిరీస్‌లో భారత్ శుభారంభం చేసింది. సాధారణ లక్ష్యాన్ని ఛేదించడంలో కొంత ఇబ్బంది పడినట్లు కనిపించినా చివరకు ఎలాంటి ఉత్కంఠకు అవకాశం ఇవ్వకుండా ప్రశాంతంగా టీమిండియా ఆట ముగించింది. శుక్రవారం ఇక్కడి పీసీఏ స్టేడియంలో జరిగిన తొలి వన్డేలో భారత్ 5 వికెట్ల తేడాతో ఆస్ట్రేలియాను ఓడించింది. ఈ గెలుపుతో భారత్ ఐసీసీ వన్డే టీమ్ ర్యాంకింగ్స్‌లో మళ్లీ నంబర్‌వన్ ర్యాంక్‌ను అందుకుంది. ప్రస్తుతం భారత్ మూడు ఫార్మాట్లలో (టెస్ట్, వన్డే, టి20) టాప్ ర్యాంక్‌లో ఉండటం విశేషం. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన ఆ్రస్టేలియా సరిగ్గా 50 ఓవర్లలో 276 పరుగులకు ఆలౌటైంది. వార్నర్ (53 బంతుల్లో 52; 6 ఫోర్లు, 2 సిక్స్‌లు) అర్ధసెంచరీ చేయగా... ఇన్‌గ్లిస్ (45 బంతుల్లో 45; 3 ఫోర్లు, 2 సిక్స్‌లు), స్మిత్ (60 బంతుల్లో 41; 3 ఫోర్లు, 1 సిక్స్), లబుõÙన్ (49 బంతుల్లో 39; 3 ఫోర్లు) కీలక ఇన్నింగ్స్ ఆడారు. రెండో వికెట్‌కు వార్నర్, స్మిత్ 17.4 ఓవర్లలో 94 పరుగులు జోడించారు. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ షమీ (5/51) ఐదు వికెట్లతో ప్రత్యర్థిని దెబ్బ కొట్టాడు. అనంతరం భారత్ 48.4 ఓవర్లలో 5 వికెట్లకు 281 పరుగులు సాధించింది. భారత్ తరఫున నలుగురు బ్యాటర్లు శుబ్‌మన్ గిల్ (63 బంతుల్లో 74; 6 ఫోర్లు, 2 సిక్స్‌లు), రుతురాజ్ గైక్వాడ్ (77 బంతుల్లో 71; 10 ఫోర్లు), కేఎల్ రాహుల్ (63 బంతుల్లో 58 నాటౌట్; 4 ఫోర్లు, 1 సిక్స్), సూర్యకుమార్ యాదవ్ (49 బంతుల్లో 50; 5 ఫోర్లు, 1 సిక్స్) అర్ధ సెంచరీలు చేసి జట్టు విజయంలో ప్రధాన పాత్ర పోషించారు. ఓపెనర్లు రుతురాజ్, గిల్ 21.4 ఓవర్లలో తొలి వికెట్‌కు 142 పరుగులు జత చేశారు. అయితే 9 పరుగుల వ్యవధిలో జట్టు 3 వికెట్లు కోల్పోగా, ఇషాన్ (18) కూడా విఫలమయ్యాడు. ఈ దశలో రాహుల్, సూర్య ఐదో వికెట్‌కు 14.1 ఓవర్లలో 80 పరుగులు జత చేసి జట్టును గెలుపు దిశగా నడిపించారు. విజయానికి 12 పరుగుల దూరంలో సూర్య వెనుదిరిగినా... రాహుల్ చివరి వరకు నిలిచాడు. అబాట్ ఓవర్లో వరుసగా 4, 6 కొట్టడంతో మరో 8 బంతులు మిగిలి ఉండగా జట్టు విజయం ఖాయమైంది. ఈ మ్యాచ్‌లో భారత మేనేజ్మెంట్ పేసర్ సిరాజ్‌కు విశ్రాంతినిచ్చింది. నియంత్రణతో కూడిన బౌలింగ్ ప్రదర్శనతో అశ్విన్ తనకు లభించిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగా... అర్ధ సెంచరీతో సూర్య ఫామ్‌లోకి రావడం భారత్‌కు సానుకూలాంశం. ఆదివారం ఇండోర్‌లో రెండో వన్డే జరుగుతుంది. స్కోరు వివరాలు ఆ్రస్టేలియా ఇన్నింగ్స్: మిచెల్ మార్‡్ష (సి) గిల్ (బి) షమీ 4; వార్నర్ (సి) గిల్ (బి) జడేజా 52; స్మిత్ (బి) షమీ 41; లబుõÙన్ (స్టంప్డ్) రాహుల్ (బి) అశి్వన్ 39; గ్రీన్ (రనౌట్) 31; ఇన్‌గ్లిస్ (సి) అయ్యర్ (బి) బుమ్రా 45; స్టొయినిస్ (బి) షమీ 29; షార్ట్ (సి) సూర్య (బి) షమీ 2; కమిన్స్ (నాటౌట్) 21; అబాట్ (బి) షమీ 2; జంపా (రనౌట్) 2; ఎక్స్‌ట్రాలు 8; మొత్తం (50 ఓవర్లలో ఆలౌట్) 276. వికెట్ల పతనం: 1–4, 2–98, 3–112, 4–157, 5–186, 6–248, 7–250, 8–254, 9–256, 10–276. బౌలింగ్: షమీ 10–1–51–5, బుమ్రా 10–2–43–1, శార్దుల్ ఠాకూర్ 10–0–78–0, అశ్విన్ 10–0–47–1, రవీంద్ర జడేజా 10–0–51–1. భారత్ ఇన్నింగ్స్: రుతురాజ్ (ఎల్బీ) (బి) జంపా 71; గిల్ (బి) జంపా 74; శ్రేయస్ అయ్యర్ (రనౌట్) 3; కేఎల్ రాహుల్ (నాటౌట్) 58; ఇషాన్ కిషన్ (సి) ఇన్‌గ్లిస్ (బి) కమిన్స్ 18; సూర్యకుమార్ (సి) మార్‡్ష (బి) అబాట్ 50; జడేజా (నాటౌట్) 3; ఎక్స్‌ట్రాలు 4; మొత్తం (48.4 ఓవర్లలో 5 వికెట్లకు) 281. వికెట్ల పతనం: 1–142, 2–148, 3–151, 4–185, 5–265. బౌలింగ్: కమిన్స్ 10–0–44–1, స్టొయినిస్ 5–0–40–0, అబాట్ 9.4–1–56–1, గ్రీన్ 6–0–44–0, షార్ట్ 8–0–39–0, జంపా 10–0–57–2. -
టీం ఇండియా పేసర్ షమీకి సుప్రీం కోర్ట్ షాక్
-
వంద శాతం విజయం మాదే: షమీ
-
యశస్విజైస్వాల్ రుతురాజ్ గైక్వాడ్.. వెల్కమ్ టు టీమ్ ఇండియా
-
సిరాజ్‌కు షాక్ ఇచ్చిన బీసీసీఐ బుమ్రా స్థానంలో షమీ
-
దసరా విషెస్ చెప్పిన షమీ ..దారుణంగా ట్రోల్స్ చేసిన నెటిజన్స్
-
ఆ ముగ్గురు భారత పేసర్లు పాక్ దిగ్గజాలతో సమానం..
Sanjay Manjrekar: ఇటీవలి కాలంలో టీమిండియా విదేశాల్లో అద్భుతంగా రాణించడానికి బుమ్రా, షమీ, సిరాజ్‌లే ప్రధాన కారణమని మాజీ ఆటగాడు, వివాదాస్పద వ్యాఖ్యాత సంజయ్ మంజ్రేకర్ అభిప్రాయపడ్డాడు. గత రెండు, మూడేళ్లలో ఓవర్సీస్లో టీమిండియా ప్రదర్శన చూస్తే అది ఇట్టే స్పష్టమవుతుందన్న ఆయన.. గతేడాది ఆసీస్‌ను వారి సొంతగడ్డపై మట్టికరిపించడాన్ని, ఇటీవల ఇంగ్లండ్‌కు వారి అడ్డాలోనే షాకివ్వడాన్ని ఉదహరించాడు. అలాగే, దక్షిణాఫ్రికాను ఇటీవల జరిగిన టెస్ట్‌లో రఫ్ఫాడించడంలో కూడా ఆ ముగ్గురు సీమర్లదే కీలకపాత్ర అని మంజ్రేకర్ కొనియాడాడు. తాజాగా ఓ ప్రముఖ క్రీడా మాధ్యమంతో ఆయన మాట్లాడుతూ.. టీమిండియా బౌలింగ్ త్రయాన్ని పాక్ దిగ్గజ బౌలర్లతో పోల్చాడు. బుమ్రా, షమీ, సిరాజ్‌లను చూస్తే 90లలో ప్రపంచ క్రికెట్‌ను శాసించిన పాక్ దిగ్గజ బౌలర్లు గుర్తుకొస్తారని ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. అప్పట్లో విదేశీ పిచ్‌లపై పాక్ బౌలర్లు వసీం అక్రమ్, వకార్ యూనిస్, షోయబ్ అక్తర్ అరివీర భయంకరంగా చెలరేగేవారని, ప్రస్తుతం టీమిండియా పేస్ త్రయం కూడా వారిలాగే విజృంభిస్తుందని వ్యాఖ్యానించాడు. కాగా, సఫారీలతో ముగిసిన తొలి టెస్ట్‌లో ఈ టీమిండియా బౌలింగ్ త్రయం ఏకంగా 16 వికెట్లు పడగొట్టిన సంగతి తెలిసిందే. చదవండి: నా వల్ల కాదు బాబోయ్..! పాక్ హెడ్ కోచ్ పదవికి సక్లయిన్ గుడ్‌బై -
ట్రోఫితో పాటు ఆ రెండు రికార్డులు టీమిండియా క్రికెటర్లవే..
Brett Lee Predicts Highest Run Scorer And Wicket Taker Of T20 World Cup 2021: ప్రస్తుతం జరుగుతున్న టీ20 ప్రపంచకప్-2021పై విశ్లేషకులు, మాజీ క్రికెటర్ల నుంచి రకరకాల అంచనాలు వెలువడుతున్న నేపథ్యంలో ఆసీస్ మాజీ పేసర్ బ్రెట్ లీ సైతం తన అభిప్రాయాన్ని వెల్లడించాడు. యూఏఈ వేదికగా జరుగుతున్న మెగా టోర్నీలో టీమిండియానే విజేతగా నిలువబోతుందని జోస్యం చెప్పాడు. అలాగే టోర్నీలో అత్యధిక పరుగులు, అత్యధిక వికెట్ల రికార్డు కూడా టీమిండియా క్రికెటర్లే సొంతం చేసుకోనున్నట్లు ముందే తేల్చేశాడు. భారత విధ్వంసకర ఓపెనర్ కేఎల్ రాహుల్ టోర్నీలో అత్యధిక పరుగులు చేసే బ్యాటర్‌గా నిలుస్తాడని, మహ్మద్ షమీ అత్యధిక వికెట్లు పడగొట్టే బౌలర్‌గా అవతరిస్తాడని అంచనా వేశాడు. గత కొంతకాలంగా వీరిద్దరు రాణిస్తున్న తీరును పరిగణలోకి తీసుకుని ఈ మేరకు అంచనా వేస్తున్నట్లు పేర్కొన్నాడు. వీరిద్దరు స్థాయికి తగ్గ ప్రదర్శన చేయగలిగితే టీమిండియా కప్‌ను ఎగరేసుకుపోవడం ఖాయమని తెలిపాడు. కాగా, ఇటీవల ముగిసిన ఐపీఎల్-2021లో ఈ ఇద్దరు ఆటగాళ్లు పంజాబ్ కింగ్స్‌కు ప్రాతినిధ్యం వహించిన సంగతి తెలిసిందే. పంజాబ్‌కు సారధిగా వ్యవహరించిన రాహుల్.. 13 మ్యాచ్‌ల్లో 62.60 సగటుతో 626 పరుగులు చేయగా, షమీ 14 మ్యాచ్‌ల్లో 19 వికెట్లతో రాణించాడు. ఇదిలా ఉంటే, ప్రపంచకప్ టోర్నీలో భాగంగా ఇంగ్లండ్, ఆసీస్‌లతో జరిగిన రెండు వార్మప్ మ్యాచ్‌ల్లో సత్తా చాటిన టీమిండియా మాంచి జోరు మీద ఉంది. ఇదే ఊపులో ఈనెల 24న దాయాది పాక్‌ను సైతం మట్టికరిపించాలని కోహ్లి సేన భావిస్తుంది. చదవండి: అజేయ 'విరాట్'.. పాక్‌పై అదిరిపోయే రికార్డు కలిగిన టీమిండియా కెప్టెన్ -
Squid Game Challenge: స్క్విడ్ గేమ్ ఛాలెంజ్‌లో నెగ్గిన 'హిట్‌మ్యాన్'
Team India Star Cricketers Take Squid Game Challenge: నెట్‌ఫ్లిక్స్‌లో సంచలనం సృష్టిస్తున్న కొరియన్ వెబ్ సిరీస్ 'స్క్విడ్ గేమ్'లోని డల్గోనా క్యాండీ ఛాలెంజ్ ప్రస్తుతం సోషల్‌మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతోంది. తాజాగా ఈ ఛాలెంజ్‌ను టీమిండియా క్రికెటర్లు సైతం స్వీకరించారు. ఛాలెంజ్‌లో భాగంగా క్యాండీలో ఉన్న ఆకారాన్ని ఏమాత్రం దెబ్బతినకుండా బయటకు తీయాల్సి ఉంటుంది. టీమిండియా క్రికెటర్లు రోహిత్ శర్మ, మహ్మద్ షమీ, కేఎల్ రాహుల్, సూర్యకుమార్ యాదవ్, వరుణ్ చక్రవర్తి, జస్ప్రీత్ బుమ్రా పాల్గొన్న ఈ పోటీకి సంబంధించిన వీడియోను ఐసీసీ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. View this post on Instagram A post shared by ICC (@icc) ఇందులో టీమిండియా స్టార్ బ్యాటర్, హిట్‌మ్యాన్ రోహిత్ శర్మ, మహ్మద్ షమీలు విజేతలుగా నిలిచారు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట హల్చల్ చేస్తుంది. హిట్‌మ్యానా మజాకా అంటూ అతని అభిమానులు తెగ సంబరపడిపోతున్నారు. మరో పక్క షమీపై సైతం నెటిజన్లు పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు. ఇదిలా ఉంటే, టీ20 ప్రపంచకప్-2021లో భాగంగా టీమిండియా.. ఈ నెల 24న దాయాది పాకిస్థాన్‌తో తలపడనున్న సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్‌కు ముందు జరిగిన రెండు వార్మప్ మ్యాచ్‌ల్లోనూ ఘన విజయాలు నమోదు చేసిన కోహ్లి సేన మాంచి ఊపు మీదుంది. చదవండి: ఐపీఎల్‌పై ఆసక్తి చూపుతున్న క్రిస్టియానో రొనాల్డో జట్టు..! -
ప్రాణదాత, విజయ ప్రదాత జమ్మి వృక్షం
శమీ శమయతే పాపమ్ శమీ శత్రు వినాశినీ! అర్జునస్య ధనుర్ధారీ రామస్య ప్రియదర్శినీ!! తెలంగాణ రాష్ట్ర వృక్షం జమ్మి. ఈ వృక్షాన్ని ప్రపంచ అద్భుతంగా చెప్పుకోవచ్చు. తెలంగాణతో పాటు పలు రాష్ట్రాలలో, దేశాలలో భక్తిపూర్వకంగా పూజించుకునే జమ్మి చెట్టు ఎంతో ప్రాధాన్యం గలది. తెలంగాణలో దసరా పండుగ నాడు జమ్మి చెట్టును పూజించడం ఆచారం. ఆ రోజు సాయంత్రం పక్షులను చూడటానికి ప్రజలు గుంపులు గుంపులుగా వెళతారు. ఇదే సందర్భంలో జమ్మి పూజ చేస్తారు. ‘‘శమీ శమయతే పాపమ్ శమీ శత్రు వినాశినీ! అర్జునస్య ధనుర్ధారీ రామస్య ప్రియదర్శినీ!!’’ అని చదువుతూ జమ్మి చెట్టుకు ప్రదక్షిణ చేస్తారు. ఆ తరువాత బంధు మిత్రులకు జమ్మి ఆకులు చేతిలో పెట్టి నమస్కరిస్తుంటారు. కొందరు ఆప్యాయంగా ఆలింగనం చేసుకుంటారు. ఒకరినొకరు పలుకరించుకోని వారు కూడా దసరానాడు ఈ పచ్చని ఆకులను చేతిలో పెట్టి నమస్కరించుకొని విభేదాలు మరిచి పోతారు. జమ్మి తెలంగాణ ప్రజల్లో వెల్లివిరిసే సౌహార్ద్రతకు ప్రతీక. రాముడు లంకపై యుద్ధానికి వెళ్ళే ముందు శమీ వృక్షాన్ని పూజించాడని చెబుతారు. పాండవులు అజ్ఞాతవాసానికి వెళ్ళే ముందు తమ ఆయుధాలను జమ్మి చెట్టుపై దాచి పెడతారు. తమకు విజయం సిద్ధించాలని జమ్మి చెట్టును పూజించే సంప్రదాయం ఉన్నది. పలు రాష్ట్రాలలో జమ్మిని దసరానాడు పూజిస్తుంటారు. జమ్మిని పూజిస్తే శని పీడ విరగడవుతుందనే నమ్మకం కూడా ఉన్నది. నిప్పును పుట్టించడానికి శ్రేష్టమైనది కనుక దీనిని అగ్నిగర్భ అని కూడా అనేవారు. జమ్మి చెట్టు భారత ఉపఖండంలో, పశ్చిమాసియాలో పెరుగుతుంది. ఎంతటి కరువు కాలంలో అయినా తట్టుకొని నిలువడం ఈ చెట్టు ప్రత్యేకత. అందువల్ల ఈ చెట్లు ఉంటే కరువు కాలంలో కనీస హామీ ఉన్నట్టుగా భావిస్తారు. దుర్భిక్షంలో నెలకొన్నప్పుడు పశువులకే కాకుండా, మనుషులకూ ఆహారంగా ఉపయోగపడుతుంది. జమ్మి నుంచి వివిధ రకాల ఔషధాలు తయారు చేస్తారు. ఈ చెట్టు నీడన గిరిజన పెద్దలు సమావేశాలు జరుపుకునే అలవాటు కొన్ని ప్రాంతాలలో ఉన్నది. జమ్మి చెట్టు సగటు ఆయుర్దాయం 120 ఏండ్లు. వేర్లు ముప్ఫై మీటర్ల లోతు వరకు పోతాయి. ఏ మాత్రం తేమ లేని ఎడారి ప్రాంతాలలో కూడా ఈ చెట్టు తట్టుకుని నిలుస్తుంది. ఎడారుల్లో పెనుగాలులను నిలువరిస్తుంది. అరేబియా ఎడారిలో ఏ మాత్రం తేమ లేని నేలలో ఇది వేళ్ళూనుకొని పెరగడమే పెద్ద వింత. చుట్టూరా ఒక నీటి చుక్క ఉండదు, ఒక్క గడ్డి పరక కూడా మొలవదు. అయినా ఎప్పుడూ పచ్చగా ఉండే ఈ చెట్టుకు నీరు ఎలా లభిస్తున్నదనేది శాస్త్రవేత్తలకు కూడా అంతుపట్టని విషయం. జమ్మిచెట్టు విశిష్టతకు ఈ జీవ వృక్షమే ప్రత్యక్ష ఉదాహరణ. ప్రపంచ పర్యావరణ ఉద్యమానికి నాంది పలికిన ఘనత జమ్మి చెట్టుకు ఉన్నది. 1730లో మార్వాడ (రాజ స్తాన్) రాజు తన రాజభవనం నిర్మాణంలో రాళ్ళ మధ్య బంక వాడటం కోసం చెట్లు కొట్టుకు రమ్మని ఆదేశించారు. ఎడారిలో దట్టంగా ఉన్న జమ్మి చెట్లు ఉన్న ఖేజాడ్లీ గ్రామం దగ్గరికి రాజభటులు వచ్చారు. ఇక్కడి బిష్ణోయి తెగ వారు చెట్లను నరకడాన్ని, జంతువులను చంపడాన్ని వ్యతిరేకిస్తారు. రాజభటులు చెట్లు నరుకుతున్నారని తెలిసిన అమృతాదేవి అనే మహిళ అక్కడకు వెళ్ళి అడ్డుకున్నది. జమ్మి చెట్టును కావలించుకొని ‘సర్ సాంటే రుఖ్ రహో తో భీ సస్తో జాణ్’ (చెట్టును కాపాడటానికి తలనైనా పణంగా పెట్టవచ్చు) అని నినదించింది. రాజభటుల గొడ్డలి దెబ్బకు ఆమె తల తెగిపడింది. ఆమె ముగ్గురు బిడ్డలు ఆసు, రత్ని, భాగుబాయి కూడా చెట్లను అలుముకున్నారు. వారి ముగ్గురి తలలు తెగిపడ్డాయి. ఈ విషయం తెలిసిన చుట్టుపక్కల గ్రామాలలోని బిష్ణోయి తెగవారంతా దండులా కదిలివచ్చారు. జమ్మి చెట్ల రక్షణకు పూనుకున్నారు. వృద్ధులు, మహిళలు, నవ దంపతులు, పిల్లలు అనే తేడా లేకుండా చెట్లను హత్తుకున్నారు. 363 తలలు తెగిపడ్డాయి. కర్కశ రాజభటుల హృదయం చలించింది. వారికి ఇక తలలు నరకడానికి చేతులాడలేదు. వెనుదిరిగిపోయి రాజుకు వివరించారు. వెంటనే రాజు చెట్లను నరకడాన్ని నిలిపివేయించాడు. పర్యావరణ పరిరక్షణ బిష్ణోయి సంప్రదాయం జంతువులను, మొక్కలను పరిరక్షించే బిష్ణోయి తెగ గురించి తరచు వార్తలలో చూస్తుంటాం. వైష్ణవ సంప్రదాయానికి చెందిన గురు జంభేశ్వర్ (1451– 1536) ఈ బోధనల మేరకు ఈ బిష్ణోయి శాఖ ఏర్పడింది. రాజస్తాన్‌లో 1485లో తీవ్ర కరువు ఏర్పడిన నేపథ్యంలో గురు జంభేశ్వర్ పర్యావరణ హితమైన జీవన విధానాన్ని నిర్దేశించారు. అతడు బోధించిన ఈ 29 సూత్రాలలో ఎనిమిది పర్యావరణ, జీవ వైవిధ్య పరిరక్షణకు తోడ్పడేవి కూడా ఉన్నాయి. ప్రకృతితో సహజీవనానికి వీలుగా వృక్ష జంతుజాలాన్ని కాపాడాలని ఆయన బోధించారు. బిష్ణోయి తెగవారు జమ్మిచెట్టును పవిత్రమైనదిగా పూజిస్తారు. చిప్కో అంటే హత్తుకోవడం. చెట్లను హత్తుకోవడమనే ఈ ఉద్యమం 1973లో ఉత్తరాఖండ్‌లో సాగింది. అడవుల నరికివేతకు వ్యతిరేకంగా సాగిన ఈ ఉద్యమంలో మహిళలే ప్రధాన పాత్ర వహించారు. ఈ ఉద్యమం ప్రపంచ పర్యావరణ ఉద్యమాలకు స్ఫూర్తిదాయకమైంది. ఇప్పటికీ రాజ స్తాన్‌లో జమ్మి చెట్టుకు ప్రాధాన్యం ఉన్నది. జమ్మిని రాష్ట్ర వృక్షంగా ప్రకటించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత ముఖ్యమంత్రి కేసీఆర్ జమ్మిని రాష్ట్ర వృక్షంగా ప్రకటించారు. పర్యావరణాన్ని పరిరక్షించాలని, జీవ వైవిధ్యాన్ని కాపాడుకోవాలని కేసీఆర్ బోధిస్తున్నారు. ఈ మేరకు ఉద్యమ స్ఫూర్తితో హరితహారం కార్యక్రమాన్ని చేపట్టారు. ముఖ్యమంత్రి కేసీఆర్ స్ఫూర్తితో తెలంగాణ ప్రజల భాగస్వామ్యంతో తెలంగాణ.. హరిత తెలంగాణగా మారుతోంది. కేసీఆర్ పిలుపునందుకుని పర్యావరణ ఉద్యమంలో మనం భాగస్వాములం అవుదాం. మొక్కలను నాటుదాం. మన పిల్లలకు నివాసయోగ్యమైన భూగోళాన్ని వారసత్వంగా అందిద్దాం. జోగినపల్లి సంతోష్ కుమార్ వ్యాసకర్త ఎంపీ, రాజ్యసభ (దసరా పండుగ సందర్భంగా) -
కేకేఆర్‌పై పంజాబ్ ప్రతాపం
పంజాబ్ తెలుసుగా... 220 పైచిలుకు పరుగులు చేసినా కూడా ఓడింది. సూపర్ ఓవర్లో రెండంటే రెండు పరుగులు చేసిన జట్టు. ఒక్కమాటలో చెప్పాలంటే ఐపీఎల్ తొలి సగం మ్యాచ్‌ల్లో వరుసబెట్టి నిరాశపరిచింది. కానీ ఈ కింగ్స్... చెన్నై కింగ్స్‌లా కాదు! మొదటన్నీ ఓడినా... తర్వాతన్నీ గెలుచుకుంటూ వస్తోంది. ఇప్పుడు ఆరో విజయంతో ‘ప్లే ఆఫ్స్’ దారిలో పడింది. షార్జా: ఈ సీజన్లో పంజాబ్‌ను చూస్తే ఎవరికైనా ఆశ్చర్యం, అనుమానం కలుగకమానదు. ఒకదశలో ఏడింట ‘ఆరు’ ఓడిపోయిన జట్టు... వరుసగా విజయబావుటా ఎగరేస్తున్న జట్టు ఇదేనా అని కచ్చితంగా అనిపిస్తుంది. కానీ కింగ్స్ ఎలెవన్ పంజాబ్ తన ప్రత్యర్థి జట్టపై పంజా విసురుతోంది. ఇది నిజం. అది కూడా వరుసగా! సోమవారం పంజాబ్ 8 వికెట్ల తేడాతో కోల్‌కతా నైట్‌రైడర్స్‌పై గెలిచింది. మొదట కోల్‌కతా నైట్‌రైడర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లకు 149 పరుగులు చేసింది. శుబ్‌మన్ గిల్ (45 బంతుల్లో 57; 3 ఫోర్లు, 4 సిక్స్‌లు), కెప్టెన్ మోర్గాన్ (25 బంతుల్లో 40; 5 ఫోర్లు, 2 సిక్స్‌లు) రాణించారు. షమీ 3 వికెట్లు పడగొట్టాడు. తర్వాత పంజాబ్ 18.5 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి 150 పరుగులు చేసి గెలిచింది. ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ క్రిస్ గేల్ (29 బంతుల్లో 51; 2 ఫోర్లు, 5 సిక్సర్లు) మెరిపించగా... మన్దీప్ (56 బంతుల్లో 66 నాటౌట్; 8 ఫోర్లు, 2 సిక్స్‌లు) గెలిపించాడు. షమీ తడఖా... పంజాబ్ కెప్టెన్ రాహుల్ టాస్ నెగ్గగానే ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. కోల్‌కతా ఇన్నింగ్స్ మొదలైన రెండో బంతికే మ్యాక్స్‌వెల్... నితీశ్ రాణా (0)ను డకౌట్ చేశాడు. రెండో ఓవర్ వేసిన షమీ తన తడాఖా చూపాడు. నాలుగో బంతికి రాహుల్ త్రిపాటి (7)ని, ఆఖరి బంతికి దినేశ్ కార్తీక్ (0)ను డకౌట్ చేశాడు. ఒక్కసారిగా 10/3 స్కోరుతో కోల్‌కతా కష్టాల్లో పడింది. ఈ దశలో ఓపెనర్ గిల్, కెప్టెన్ మోర్గాన్ నిలకడగా ఆడి వికెట్ల పతనాన్ని కాసేపు నిలువరించారు. శుబ్‌మన్ ఫిఫ్టీ... ఆత్మరక్షణలో పడిపోయిన నైట్‌రైడర్స్ ఇన్నింగ్స్‌ను శుబ్‌మన్, మోర్గాన్లే నడిపించారు. ఈ జోడీ ఆడినంతవరకు పరుగులకు ఢోకా లేకుండా పోయింది. అయితే ఈ భాగస్వామ్యం ముగిశాక మళ్లీ తర్వాత వచ్చిన వారు కూడా ముందరి బ్యాట్స్‌మెన్‌నే అనుసరించారు. గేల్... మెరుపుల్! కింగ్స్ లక్ష్యఛేదన ఫోర్‌తో మొదలైంది. కమిన్స్ తొలి బంతిని రాహుల్ బౌండరీకి తరలించాడు. జట్టు స్కోరు 47 పరుగుల వద్ద రాహుల్ (25 బంతుల్లో 28; 4 ఫోర్లు) ఔటయ్యాడు. దీంతో గేల్ క్రీజ్‌లోకి వచ్చాడు. వరుణ్ చక్రవర్తి, నరైన్ బౌలింగ్ల్లో భారీ సిక్సర్లతో విరుచుకుపడ్డాడు. మరోవైపు ఓపెనర్ మన్దీప్ చూడచక్కని బౌండరీలతో నిలకడగా పరుగులు చేశాడు. 49 బంతుల్లో అర్ధసెంచరీ చేశాడు. జట్టు 13.4 ఓవర్లలో 100 పరుగులను అధిగమించింది. కాసేపటికే గేల్ ఫిఫ్టీ 25 బంతుల్లోనే పూర్తయ్యింది. వీళ్లిద్దరు రెండో వికెట్‌కు సరిగ్గా 100 పరుగులు జత చేశాక గేల్ ఔటైనా... మిగతా లాంఛనాన్ని పూరన్ (2 నాటౌట్)తో కలిసి మన్దీప్ పూర్తి చేశాడు. స్కోరు వివరాలు కోల్‌కతా నైట్‌రైడర్స్ ఇన్నింగ్స్: శుబ్‌మన్ గిల్ (సి) పూరన్ (బి) షమీ 57; నితీశ్ రాణా (సి) గేల్ (బి) మ్యాక్స్‌వెల్ 0; రాహుల్ త్రిపాఠి (సి) కేఎల్ రాహుల్ (బి) షమీ 7; దినేశ్ కార్తీక్ (సి) రాహుల్ (బి) షమీ 0; మోర్గాన్ (సి) అశ్విన్ (బి) రవి బిష్ణోయ్ 40; నరైన్ (బి) జోర్డాన్ 6; నాగర్కోటి (బి) అశ్విన్ 6; కమిన్స్ (ఎల్బీడబ్ల్యూ) (బి) రవి బిష్ణోయ్ 1; ఫెర్గూసన్ (నాటౌట్) 24; వరుణ్ చక్రవర్తి (బి) జోర్డాన్ 2; ప్రసిధ్ కృష్ణ (నాటౌట్) 0; ఎక్స్‌ట్రాలు 6; మొత్తం (20 ఓవర్లలో 9 వికెట్లకు) 149. వికెట్ల పతనం: 1–1, 2–10, 3–10, 4–91, 5–101, 6–113, 7–114, 8–136, 9–149. బౌలింగ్: మ్యాక్స్‌వెల్ 2–0–21–1, షమీ 4–0–35–3, అర్‡్షదీప్ సింగ్ 2–0– 18–0, మురుగన్ అశ్విన్ 4–0–27–1, జోర్డాన్ 4–0–25–2, రవి బిష్ణోయ్ 4–1–20–2. కింగ్స్ ఎలెవన్ పంజాబ్ ఇన్నింగ్స్: కేఎల్ రాహుల్ (ఎల్బీడబ్ల్యూ) (బి) వరుణ్ 28; మన్దీప్ సింగ్ (నాటౌట్) 66; క్రిస్ గేల్ (సి) ప్రసిధ్ కృష్ణ (బి) ఫెర్గూసన్ 51; పూరన్ (నాటౌట్) 2; ఎక్స్‌ట్రాలు 3; మొత్తం (18.5 ఓవర్లలో 2 వికెట్లకు) 150. వికెట్ల పతనం: 1–47, 2–147. బౌలింగ్: కమిన్స్ 4–0–31–0, ప్రసి«ధ్ కృష్ణ 3–0–24–0, వరుణ్ చక్రవర్తి 4–0–34–1, నరైన్ 4–0–27–0, ఫెర్గూసన్ 3.5–0–32–1. -
ఉత్కం‘టై’న మ్యాచ్‌కు సూపర్ ముగింపు
‘ఆఖరి పంచ్ మనదైతే... వచ్చే కిక్కే వేరబ్బా’ ఇది బాగా పాపులర్ డైలాగ్. ఇక్కడ పొట్టి మ్యాచ్‌లో ఆ పంచ్ కివీస్‌కు పడింది. కిక్ భారత్‌కు ఎక్కింది. ఈ డైలాగ్‌ను హీరో అంటుంటే ఎలా ఉంటుందో తెలియదు కానీ... ఆస్వాదిస్తే ఇంత అద్భుతంగా ఉంటుందా అని ఈ మ్యాచ్ చూసినోళ్లకు అనిపించక మానదు. నిజమే... మ్యాచ్ అంటే ఇది. మలుపులంటే ఇవి. మెరుపులంటే మావే అన్నట్లు ఇరు జట్లను ఉత్కంఠతో ఊపేసిన మ్యాచ్‌కు ఎవరూ ఊహించని ఫినిషింగ్ లభించింది. కోట్లాది అభిమానుల్ని మునివేళ్లపై నిలబెట్టిన పోరు సిక్సర్లతో హోరెత్తింది. హామిల్టన్: ఒకతను ఆపేశాడు. మరొకతను బాదేశాడు. ఇలా ఇద్దరు సీనియర్ల దెబ్బకు కివీస్ తలకిందులైంది. రెండుసార్లు ఊహకందని విధంగా అంచనాలు తారుమారయ్యాయి. ఎంచక్కా గెలుస్తుందిలే అనుకుని ఆఖరి మజిలీకి చేరిన న్యూజిలాండ్‌ను తొలుత పేసర్ షమీ అడ్డుకున్నాడు. మ్యాచ్ ‘టై’ అయింది. సూపర్ ఓవర్ మొదలైంది. ఇక్కడా విజయావకాశాలు కివీస్‌నే ఊరిస్తే... రోహిత్ సిక్సర్లతో మార్చేశాడు. ఈ రెండు దెబ్బలకు భారత్ మూడో టి20లోనూ గెలవడంతో పాటు... ఇంకా రెండు మ్యాచ్‌లుండగానే 3–0తో సిరీస్‌ను చేజిక్కించుకుంది. న్యూజిలాండ్ గడ్డపై భారత్‌కు ఇదే తొలి పొట్టి సిరీస్ కావడం విశేషం. గతంలో రెండు సార్లు ఆతిథ్య జట్టుకే సిరీస్ సమర్పించుకుంది. ఆఖరిదాకా అత్యుత్తమ పోరాటం జరిగిన మూడో మ్యాచ్‌లో భారత్ సూపర్ ఓవర్లో గెలుపొందింది. మొదట భారత్ నిరీ్ణత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 179 పరుగులు చేసింది. రోహిత్ శర్మ (40 బంతుల్లో 65; 6 ఫోర్లు, 3 సిక్స్‌లు), కెపె్టన్ కోహ్లి (27 బంతుల్లో 38; 2 ఫోర్లు, 1 సిక్స్) మెరిపించారు. బెన్నెట్‌కు 3 వికెట్లు దక్కాయి. తర్వాత కివీస్ కూడా 20 ఓవర్లలో 6 వికెట్లను కోల్పోయి సరిగ్గా 179 పరుగులే చేయడంతో మ్యాచ్ టై అయింది. కెప్టెన్ కేన్ విలియమ్సన్ (48 బంతుల్లో 95; 8 ఫోర్లు, 6 సిక్సర్లు) వీరోచిత పోరాటం చేశాడు. కానీ ఒత్తిడిని ఎదుర్కోలేక చిత్తయ్యాడు. శార్దుల్, షమీలకు రెండేసి వికెట్లు దక్కాయి. ‘సిక్సర’ పిడుగు రోహిత్‌కు ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు లభించింది. నాలుగో టి20 శుక్రవారం వెల్లింగ్టన్లో జరుగుతుంది. దంచేసిన రోహిత్... టాస్ నెగ్గిన కివీస్ ఫీల్డింగ్ ఎంచుకోగా... గత రెండు మ్యాచ్‌ల్లో నిరాశపరిచిన రోహిత్ భారత ఇన్నింగ్స్‌కు మూలస్తంభమయ్యాడు. రాహుల్‌తో కలిసి చకచకా పరుగులు జత చేశాడు. దీంతో ఆరు ఓవర్లలోనే భారత్ 50 పరుగులకు చేరింది. బెన్నెట్ వేసిన ఈ ఓవర్‌ను రోహిత్ 1, 6, 6, 4, 4, 6తో దంచేశాడు. ఇందులో ఆ ఒక్కటీ రాహుల్దైతే... విధ్వంసం రోహిత్‌ది. దీంతో ఈ ఒక్క ఓవర్లోనే 27 పరుగులు లభించాయి. రోహిత్ శర్మ అర్ధసెంచరీ 23 బంతుల్లో (5 ఫోర్లు, 3 సిక్స్‌లు) పూర్తయ్యింది. ధాటిగా సాగిపోతున్న ఈ ఓపెనింగ్ జోడీని ఎట్టకేలకు రాహుల్ (19 బంతుల్లో 27; 2 ఫోర్లు, 1 సిక్స్)ని ఔట్‌చేయడం ద్వారా గ్రాండ్‌హోమ్ విడగొట్టాడు.89 పరుగుల వద్ద తొలివికెట్‌ను కోల్పోయిన భారత్ మరో 7 పరుగుల వ్యవధిలో రోహిత్, శివమ్ దూబే (3) వికెట్లను కోల్పోయింది. ఒకే ఓవర్లో బెన్నెట్ ఆ ఇద్దరి వికెట్లను పడేశాడు. తర్వాత కెపె్టన్ కోహ్లి, శ్రేయస్ అయ్యర్ (16 బంతుల్లో 17; 1 ఫోర్), మనీశ్ పాండే (6 బంతుల్లో 14; 1 ఫోర్, 1 సిక్స్) జట్టు స్కోరు పెంచే ప్రయత్నం చేశారు. విలియమ్సన్ వీరోచితం... అనంతరం 180 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన న్యూజిలాండ్ కూడా వేగంగానే పరుగులు జతచేసింది. బుమ్రా బౌలింగ్‌లో గప్టిల్ (21 బంతుల్లో 31; 2 ఫోర్లు, 3 సిక్సర్లు) భారీ సిక్సర్లతో విరుచుకుపడ్డాడు. కానీ ధాటిలో మన్రో (14; 2 ఫోర్లు) వెనుకబడ్డాడు. గప్టిల్ జోరుకు శార్దుల్ తెరదించగా, మన్రోను జడేజా అవుట్ చేశాడు. ఆరో ఓవర్లోనే జట్టు స్కోరు 50కి చేరినా... కీలక వికెట్లను కోల్పోయింది. అయినప్పటికీ కెపె్టన్ కేన్ విలియమ్సన్ మాత్రం క్రీజులోకి వచ్చినప్పటినుంచే దంచేసే పనిలో పడ్డాడు. బుమ్రా, చహల్, షమీ, జడేజా ఎవరు బౌలింగ్‌కు దిగినా బౌండరీలు, సిక్సర్లు బాదకుండా విడిచిపెట్టలేదు. ఈ క్రమంలోనే అతను 28 బంతుల్లో (4 ఫోర్లు, 3 సిక్సర్లు) ఫిఫ్టీ పూర్తిచేసుకున్నాడు. 12.4 ఓవర్లలో జట్టు స్కోరు వందకు చేరింది. సాన్‌ట్నర్ (9), గ్రాండ్‌హోమ్ (5) తక్కువ స్కోర్లకే నిష్క్రమించినా ...కెప్టెన్ దూకుడుతో ఆ ప్రభావం స్కోరుపై పడలేదు. జోరును ఆపలేదు! టేలర్ (10 బంతుల్లో 17; 1 ఫోర్, 1 సిక్స్) అండతో కేన్ జట్టును విజయతీరాలకు తీసుకొచ్చాడు. సెంచరీకి అతను, విజయానికి జట్టు చేరువైనా... షమీ అద్భు త బౌలింగ్‌తో ఏ ఒక్కటీ జరగలేదు. 6 బంతుల్లో 9 పరుగులు చేయాల్సిన 20వ ఓవర్‌ను వైవిధ్యమైన బంతులతో నియత్రించాడు. ఆఖరి 4 బంతుల్లో అయితే వాళ్లిద్దరినీ ఔట్ చేసిన షమీ ఒక పరుగు మాత్రమే ఇవ్వడంతో స్కోరు సమమై మ్యాచ్ ‘టై’ అయింది. ఈ మ్యాచ్‌లో రో‘హిట్స్’, షమీ బౌలింగ్‌తో భారత్ గెలిచినప్పటికీ ఫీల్డింగ్‌లో తడబడింది. విలువైన క్యాచ్‌లు చేజార్చిన భారత ఫీల్డర్లు దూబే, జడేజా చిత్రంగా తేలికపాటి బౌండరీల్ని ఆపలేకపోయారు. దీంతో ఒక పరుగొచ్చే చోట 4 పరుగులు ప్రత్యర్థి స్కోరుకు జతయ్యాయి. షమీ ఆఖరి ఓవర్లో ఆపేశాడు... ఆఖరి ఓవర్ వేసిన షమీ కివీస్‌ను ఆపేశాడు. అద్భుతమైన బౌలింగ్‌తో గెలుపు దారిని మూసేశాడు. 6 బంతుల్లో 9 పరుగులతో గెలిచే చోట తొలి రెండు బంతులకు సిక్స్ సహా 7 పరుగులిచ్చాడు. మిగిలిన బంతులు నాలుగైతే.. చేయాల్సిన పరుగులు రెండే! కానీ షమీ ఇచ్చింది ఒకటే పరుగు. తీసింది రెండు వికెట్లు. మూడో బంతికి విలియమ్సన్, ఆఖరి బంతికి రాస్ టేలర్ ఔట్. మ్యాచ్ ‘టై’... రోహిత్ ఆఖరి బంతుల్లో ఆరేశాడు... సూపర్ ఓవర్లో భారత్ విజయానికి 18 పరుగులు చేయాలి. కానీ రోహిత్, రాహుల్ ఇద్దరు చెరో 2 బంతులాడి ఎనిమిదే చేశారు. ఇక గెలవాలంటే చివరి రెండు బంతుల్లో 10 చేయాలి. క్రీజ్‌లో ‘హిట్‌మ్యాన్’ ఉన్నాడు. సౌతీ యార్కర్ ప్రయత్నం విఫలం కాగా... రోహిత్ బ్యాట్ ఝుళిపించాడు. లాంగాన్‌లో సిక్స్. ఆఖరి బంతికి 4 కావాలి. ఈసారి లాంగాఫ్‌లో సిక్స్. అంతే భారత్‌కు మూడో మ్యాచ్ గెలుపుతో పాటు సిరీస్ కూడా దక్కింది. ►6 ఇప్పటివరకు టి20ల్లో ఆరుసార్లు, వన్డేల్లో ఒకసారి కలిపి న్యూజిలాండ్ జట్టు మొత్తం ఏడుసార్లు సూపర్ ఓవర్ ఆడింది. అయితే ఆరుసార్లు న్యూజిలాండ్ జట్టుకు పరాజయమే ఎదురైంది. ►న్యూజిలాండ్ తరఫున టిమ్ సౌతీ ఐదుసార్లు సూపర్ ఓవర్ వేశాడు. ఇందులో నాలుగుసార్లు ఓడిపోవడం గమనార్హం. ►ఐపీఎల్, అంతర్జాతీయ టి20ల్లో కలిపి జస్ప్రీత్ బుమ్రా మూడుసార్లు సూపర్ ఓవర్ వేయగా... మూడుసార్లూ అతని జట్టునే విజయం వరించింది. ఐపీఎల్లో 2017లో గుజరాత్ లయన్స్‌తో మ్యాచ్‌లో... 2019లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో మ్యాచ్‌లో బుమ్రా సూపర్ ఓవర్ వేశాడు. ►న్యూజిలాండ్ గడ్డపై భారత్ టి20 సిరీస్‌ను గెలవడం ఇదే తొలిసారి. న్యూజిలాండ్‌లో భారత్ 2009లో 0–2తో... 2019లో 1–2తో టి20 సిరీస్‌లను చేజార్చుకుంది. ►ఒక దశలో ఓటమి ఖాయమనుకున్నా. కేన్ బాగా ఆడాడు. కానీ దురదృష్టం. సెంచరీకి చేరువై 95 దగ్గర ఔటైతే ఎంత బాధగా ఉంటుందో నాకు తెలుసు. చివరి బంతినెలా వేయాలనే దానిపై తర్జనభర్జన పడ్డాం. వికెట్లకు సూటిగా వేస్తే సరే కానీ... బ్యాట్‌కు తగిలితే ఆ ఒక్క పరుగు ఎలాగైనా వస్తుందనే బెంగ కూడా ఉంది. రోహిత్ ఇన్నింగ్స్‌లో, సూపర్ ఓవర్లో చెలరేగాడు. అతనొక బంతిపై విరుచుకుపడితే మరో బంతి వేసే సమయంలో తీవ్ర ఒత్తిడికి లోనవుతాడని అనుకున్నాం. సిరీస్ గెలిచాం. ఇక క్లీన్ స్వీపే మా లక్ష్యం. –భారత కెప్టెన్ కోహ్లి ►నేనెప్పుడూ సూపర్ ఓవర్లో బ్యాటింగ్‌కు రాలేదు. ఎలా మొదలెట్టాలో కూడా తెలియని పరిస్థితి. తొలి బంతినుంచే బాదాలా లేక సింగిల్ తీయాలో కూడా తెలియదు. కానీ మొత్తానికి మంచి ప్రదర్శన కనబరిచాను. చాలాసేపు క్రీజులో ఉండాలని భావించిన నేను అలా ఔట్ కావడం కాస్త నిరాశపరిచింది. –భారత ఓపెనర్ రోహిత్ స్కోరు వివరాలు భారత్ ఇన్నింగ్స్: రోహిత్ (సి)సౌతీ (బి) బెన్నెట్ 65; రాహుల్ (సి) మన్రో (బి) గ్రాండ్‌హోమ్ 27; దూబే (సి) సోధి (బి) బెన్నెట్ 3; కోహ్లి (సి) సౌతీ (బి) బెన్నెట్ 38; అయ్యర్ (స్టంప్డ్) సిఫెర్ట్ (బి) సాన్‌ట్నర్ 17; పాండే (నాటౌట్) 14; జడేజా (నాటౌట్) 10; ఎక్స్‌ట్రాలు 5; మొత్తం (20 ఓవర్లలో 5 వికెట్లకు) 179. వికెట్ల పతనం: 1–89, 2–94, 3–96, 4–142, 5–160. బౌలింగ్: సౌతీ 4–0–39–0, బెన్నెట్ 4–0–54–3, కుగెలెజిన్ 2–0–10–0, సాన్‌ట్నర్ 4–0–37–1, సోధి 4–0–23–0, గ్రాండ్ హోమ్ 2–0–13–1 న్యూజిలాండ్ ఇన్నింగ్స్: గప్టిల్ (సి) సబ్–సామ్సన్ (బి) శార్దుల్ 31; మన్రో (స్టంప్డ్) రాహుల్ (బి) జడేజా 14; విలియమ్సన్ (సి) రాహుల్ (బి) షమీ 95; సాన్‌ట్నర్ (బి) చహల్ 9; గ్రాండ్‌హోమ్ (సి) దూబే (బి) శార్దుల్ 5; టేలర్ (బి) షమీ 17; సిఫెర్ట్ (నాటౌట్) 0; ఎక్స్‌ట్రాలు 8; మొత్తం (20 ఓవర్లలో 6 వికెట్లకు) 179. వికెట్ల పతనం: 1–47, 2–52, 3–88, 4–137, 5–178, 6–179. బౌలింగ్: శార్దుల్ 3–0–21–2, షమీ 4–0–32–2, బుమ్రా 4–0–45–0, చహల్ 4–0–36–1, జడేజా 4–0–23–1, దూబే 1–0–14–0. -
ఫిట్నెస్ పరీక్షలో షమీ ఫెయిల్
న్యూఢిల్లీ: ఇటీవల కాలంలో వివాదాలతో సతమతమవుతోన్న భారత పేస్ బౌలర్ మొహమ్మద్ షమీ యో యో ఫిట్నెస్ పరీక్షలో ఫెయిలయ్యాడు. ఫలితంగా అఫ్గానిస్తాన్‌తో ఈనెల 14 నుంచి జరగనున్న ఏకైక టెస్టులో పాల్గొనే భారత జట్టు నుంచి అతడిని తప్పించారు. షమీ స్థానంలో ఢిల్లీ ఫాస్ట్ బౌలర్ నవ్‌దీప్ సైనిని తొలిసారి జాతీయ జట్టులోకి ఎంపిక చేశారు. 25 ఏళ్ల సైని ఇప్పటివరకు 31 ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌లు ఆడి 96 వికెట్లు తీశాడు. ‘బెంగళూరులోని జాతీయ క్రికెట్ అకాడమీలో నిర్వహించిన ఫిట్నెస్ పరీక్షలో షమీ నెగ్గలేకపోయాడు. దాంతో అతని స్థానంలో ఆలిండియా సీనియర్ సెలక్షన్ కమిటీ నవ్‌దీప్ సైనిని ఎంపిక చేసింది’ అని బీసీసీఐ ఒక ప్రకటనలో తెలిపింది. షమీతోపాటు భారత ‘ఎ’ జట్టు సభ్యుడు సంజూ శామ్సన్ కూడా యో యో ఫిట్నెస్ పరీక్షలో ఫెయిలయ్యాడని అతని స్థానంలో భారత అండర్–19 మాజీ కెప్టెన్ ఇషాన్ కిషన్‌ను ఎంపిక చేశామని తెలిపింది. -
షమీని విచారించిన కోల్‌కతా పోలీసులు
భారత క్రికెటర్ మొహమ్మద్ షమీని కోల్‌కతా పోలీసులు మూడు గంటల పాటు విచారించారు. అతని భార్య హసీన్ జహాన్ ఈ పేస్ బౌలర్‌పై గృహహింస తదితర కేసులు పెట్టింది. దీనిపై కోర్టు అతనికి సమన్లు జారీ చేయగా...షమీ బుధవారం పోలీసుల ఎదుట హాజరయ్యాడు. ప్రస్తుతం ఐపీఎల్లో ఢిల్లీకి ఆడుతున్న అతను 16న ఈడెన్ గార్డెన్స్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో మ్యాచ్ ముగిశాక జట్టుతో పాటు బెంగళూరు (తదుపరి మ్యాచ్ వేదిక)కు బయల్దేరలేదు.విచారణ నిమిత్తం అక్కడే ఉన్నాడు. విచారణకు షమీ సహకరించాడని, అతను తిరిగి జట్టుతో కలిసేందుకు అనుమతించినట్లు జాయింట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ (క్రైమ్) ప్రవీణ్ త్రిపాఠి చెప్పారు. -
నివేదిక వచ్చాకే షమీపై నిర్ణయం: శుక్లా
ముంబై: అవినీతి నిరోధక విభాగం నుంచి నివేదిక వచ్చాక పేసర్ షమీపై తుది నిర్ణయం తీసుకుంటామని ఐపీఎల్ చైర్మన్ రాజీవ్ శుక్లా వెల్లడించారు. పాకిస్తానీ స్నేహితురాలికి, భారత పేసర్‌కు మధ్య ఆర్థిక లావాదేవీలు జరిగినట్లు అతని భార్య హసీన్ జహాన్ ఆరోపించింది. దీంతో బీసీసీఐ మ్యాచ్ ఫిక్సింగ్ కోణంలో దర్యాప్తుకు ఆదేశించింది. ఏసీయూ చీఫ్ నీరజ్ కుమార్‌కు విచారణ బాధ్యతను అప్పగించింది. అతని నివేదిక కోసం ఎదురుచూస్తున్నామని, వచ్చిన వెంటనే షమీ ఐపీఎల్ ఆడటంపై, సెంట్రల్ కాంట్రాక్టు ఇవ్వడంపై నిర్ణయం తీసుకుంటామని శుక్లా తెలిపారు. లీగ్‌కు సంబంధించిన స్పాన్సర్షిప్ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ ఈ సీజన్లో అంపైర్ నిర్ణయ సమీక్షా పద్ధతిని అమలు చేస్తున్నట్లు చెప్పారు. ఇన్నింగ్స్‌కు ఒకసారి ఈ అవకాశాన్ని వినియోగించుకోవచ్చని చెప్పారు. -
షమీ అభిమానుల్లో నేనొకరిని...
ఇస్లామాబాద్: భారత పేసర్ మొహమ్మద్ షమీ పాకిస్తానీ స్నేహితురాలు అలీష్బా ఎట్టకేలకు మౌనం వీడింది. సోమవారం ఓ మీడియా సంస్థతో మాట్లాడుతూ షమీతో తన అనుబంధాన్ని ఆమె వెల్లడించింది. గతేడాది ఇంగ్లండ్‌లో జరిగిన ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్ అనంతరం తమ మధ్య స్నేహం మొగ్గ తొడిగిందని ఆమె చెప్పింది. ఫైనల్లో పాక్ చేతిలో భారత్ ఓడిన సంగతి తెలిసిందే. ఆ మ్యాచ్ సందర్భంగా షమీకి, పాక్ అభిమానికి మధ్య మాటామాటా పెరిగింది. అది మీడియాలో చూసిన అలీష్బా భారత పేసర్‌పై అభిమానం పెంచుకున్నట్లు తెలిపింది. ‘సామాజిక సైట్లలో షమీ లక్షలాది ఫాలోయర్లలో నేను ఒకర్ని. అప్పుడపుడు పోస్ట్‌లు చేసేదాన్ని. దానికి అతను స్పందించేవాడు. ఓ సెలబ్రిటీగా అతనితో సాధారణ సంభాషణే జరిగేది. దుబాయ్‌లో మా సోదరి నివసిస్తోంది. మా సోదరి ఇంటికి వచ్చిన సందర్భంలో షమీ కూడా దుబాయ్‌లోనే ఉండటంతో అతడిని కలిశాను. అంతకుమించి మా మధ్య ఇంకేమీ లేదు. షమీ భార్య ఆరోపిస్తున్నట్లు నేను షమీకి డబ్బు ఇవ్వలేదు’ అని అలీష్బా తెలిపింది. -
మరిన్ని చిక్కుల్లో షమీ!
న్యూఢిల్లీ: భారత పేస్ బౌలర్ మొహమ్మద్ షమీ కష్టాలు మరిన్ని పెరిగాయి. భార్య హసీన్ జహాన్ గృహహింస ఆరోపణలు, బీసీసీఐ కాంట్రాక్ట్ నిలిపివేత, పోలీసు కేసుల నమోదు అనంతరం ఇప్పుడు క్రికెట్ పరిపాలకుల కమిటీ (సీఓఏ) రంగంలోకి దిగింది. హసీన్ చేసిన ఆరోపణల్లో ‘టెలిఫోన్ సంభాషణ’పై విచారణ జరపాలని బీసీసీఐ అవినీతి నిరోధక విభాగం చీఫ్ నీరజ్ కుమార్‌ను సీఓఏ చైర్మన్ వినోద్ రాయ్ ఆదేశించారు. వారం రోజుల్లోగా దీనిపై నివేదిక ఇవ్వాలని ఆయన కోరారు. అయితే నీరజ్‌కు ఇచ్చిన ఈ ఆదేశాల్లో ఎక్కడా ‘మ్యాచ్ ఫిక్సింగ్’ అనే పదం మాత్రం వాడలేదు. ఇంగ్లండ్‌కు చెందిన వ్యాపారవేత్త మొహమ్మద్ భాయ్ చెప్పడంతో అలీస్బా అనే పాకిస్తాన్ మహిళ నుంచి షమీ డబ్బులు తీసుకున్నాడని ఆ ఫోన్‌కాల్‌లో హసీన్ ఆరోపించింది. ‘షమీపై వచ్చిన ఆరోపణలకు సంబంధించి మీడియాలో వచ్చిన వార్తలను చూసి ఈ నిర్ణయం తీసుకున్నాం. షమీ, అతని భార్యకు మధ్య జరిగిన ఫోన్ సంభాషణను మేం విన్నాం. బయట కూడా అది అందుబాటులో ఉంది. ఈ ఒక్క అంశంలో మాత్రమే విచారణ చేస్తాం. కేసుకు సంబంధించిన ఇతర విషయాల జోలికి వెళ్లదల్చుకోలేదు’ అని రాయ్ వ్యాఖ్యానించారు. మొహమ్మద్ భాయ్, అలీస్బా ఎవరు, నిజంగానే వారి నుంచి షమీ డబ్బులు తీసుకున్నాడా, ఒక వేళ తీసుకుంటే ఎందుకు తీసుకున్నాడు అనే మూడు విషయాలపై విచారణ జరిపి నీరజ్ నివేదిక ఇవ్వాల్సి ఉంటుంది. -
షమీ వివాదానికి కారణమిదే..
కోల్‌కతా : టీమిండియా పేసర్ మహ్మద్ షమీ వివాదం రోజుకో మలుపు తిరుగుతోంది. ఇప్పటికే భార్య హసీన్ ఆరోపణలతో షమీపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదైన విషయం తెలిసిందే. దీంతో అతని కెరీర్ సందిగ్దంలో పడింది. షమీ దంపతులు మధ్య వివాదం చెలరేగడానికి ‘ఫామ్ హౌజ్ కారణమ’ని వార్తలు ప్రచారం అవుతున్నాయి. ఉత్తరప్రదేశ్‌లోని అమ్రోహా జిల్లాలో షమీ దంపతులకు ‘హసీన్ ఫామ్ హౌజ్’ ఉంది. దాని విలువ సుమారు రూ. 12 కోట్ల నుంచి 15 కోట్లు ఉంటుందని అంచనా. హసీన్ పేరుతో ఉన్నా ఈ ఫామ్ హౌజ్‌కు సంబంధించిన పత్రాలలో ఆమె పేరు ఎక్కడా లేదని, భవిష్యత్తులో ఇక్కడే షమీ క్రికెట్ అకాడమీ నిర్మించాలనుకున్నాడని తెలుస్తోంది. ఈ విషయమై దంపతుల మధ్య గొడవలు మొదలైనట్లు ఓ జాతీయ చానెల్ పేర్కొంది. షమీ మంచివాడే: హసీన్ తండ్రి వివాదంపై స్పందించాలని హసీన్ తండ్రిని మీడియా ప్రతినిధులు కోరగా.. ఈ విషయం గురించి తనకు ఏమాత్రం తెలియదన్నారు. షమీ, హసీన్లకే అసలు నిజం తెలుసన్నారు. మహ్మద్ షమీ ఎలాంటివాడని ప్రశ్నించగా అతడు ఒకప్పుడు మంచివాడేనని సమాధానమిచ్చారు. ఇక తన కూతురు చిన్ననాటి నుంచే ఏదో ఒకటి సాధించాలనే తపనతో ఉండేదని, స్వశక్తితో ఎదగాలని ఆకాంక్షించేదన్నారు. -
క్రికెటర్ షమీ చుట్టూ కేసుల ఉచ్చు
-
షమీ చుట్టూ కేసుల ఉచ్చు
కోల్‌కతా: టీమిండియా పేసర్ మొహమ్మద్ షమీ పరిస్థితి మరింత క్లిష్టంగా మారిపోయింది. వ్యక్తిగత, క్రీడా జీవితంపై అతడి భార్య హసీన్ జహాన్ ఆరోపణల ఉదంతం కేసుల నమోదు వరకు చేరింది. తన భర్త మోసగాడని, తీవ్రంగా హింసిస్తున్నాడని, పలువురు యువతులతో సంబంధాలున్నాయని, పాకి స్తానీ స్నేహితురాలి నుంచి డబ్బులు తీసుకున్నాడంటూ ఇప్పటికే జహాన్ మీడియాకెక్కింది. తాజాగా ఆమె ఫిర్యాదుతో శుక్రవారం కోల్‌కతా పోలీసులు షమీ సహా అతని కుటుంబ సభ్యులు నలుగురిపై కేసులు నమోదు చేశారు. సెక్షన్ 307 (హత్యాయత్నానికి పాల్పడటం), సెక్షన్ 498ఎ (గృహ హింస), సెక్షన్ 376 (లైంగిక దాడి)ల కింద నాన్ బెయిలబుల్, సెక్షన్ 323 (ఉద్దేశపూర్వకంగా గాయపర్చడం), సెక్షన్ 506 (నేరపూరిత బెదిరింపు)ల కింద జాదవ్‌పూర్ పోలీస్ స్టేషన్లో కేసులు నమోదు చేసినట్లు కోల్‌కతా జాయింట్ పోలీస్ కమిషనర్ (క్రైం) ప్రవీణ్ త్రిపాఠి తెలిపారు. వీటిలో సెక్షన్ 376 కింద కేసును షమి సోదరుడిపై పెట్టినట్లు పేర్కొన్నారు. ఏడాది క్రితం యూపీలో తన అత్తారింటికి వెళ్లినప్పుడు షమీ సోదరుడు షోయబ్ అహ్మద్ తనపై అత్యాచారం చేసినట్లు హసీన్ ఫిర్యాదులో పేర్కొంది. మరోవైపు షమీపై ఆరోపణల అనంతరం ఫేస్ బుక్‌లో తన ఖాతాను బ్లాక్ చేశారని హసీన్ ఆరోపించింది. ‘కొన్నేళ్లుగా వారు నన్ను తీవ్రంగా హింసించారు. ఆ కుటుంబంలో ఒక్కరు కూడా నాకు అం డగా నిలవలేదు. షమీ కుటుంబ సభ్యులు ఉత్తరప్రదేశ్‌లో నివసిస్తారు. నేనక్కడకు వెళ్లినప్పుడల్లా వేధించేవారు. వారంతా వేచి చూడాలని మాత్రమే చెప్పేవారు తప్ప షమీకి వ్యతిరేకంగా ఏమీ చేసేవారు కాదు’ అని ఆమె పేర్కొంది. వివాదం నేపథ్యంలో షమీకి రెండు రోజుల క్రితం ప్రకటించిన బీసీసీఐ కాంట్రాక్టుల్లో చోటుదక్కలేదు. అయితే... అతడికి ఊహించని విధంగా దిగ్గజ ఆల్‌రౌండర్ కపిల్‌దేవ్ నుంచి మద్దతు లభించింది. షమిది కష్టపడే తత్వమని, కుటుంబ సమస్యలు ఉన్నట్లు తనకు తెలుసని కానీ అతడి భార్య ఇలాంటి ఆరోపణలకు దిగడం సరికాదని కపిల్ వ్యాఖ్యానించారు. ఒకవేళ ఇవన్నీ నిజమైతే షమీని ఎవరూ కాపాడలేరని పేర్కొన్నారు. -
షమీ సూపర్ షో
⇒ నాలుగు వికెట్లు తీసిన పేసర్ ⇒ వెస్టిండీస్ 205/9 కింగ్స్టన్: గాయం కారణంగా రెండేళ్లు జట్టుకు దూరంగా ఉన్న పేసర్ మొహమ్మద్ షమీ (4/48) అదరగొట్టే ప్రదర్శనతో తన ఫామ్‌ను చాటుకున్నాడు. 2015 వన్డే ప్రపంచకప్ అనంతరం అంతర్జాతీయ క్రికెట్‌కు దూరంగా ఉన్న తను గత మ్యాచ్‌తోనే పునరాగమనం చేసినా వికెట్ తీయలేకపోయాడు. అయితే గురువారం వెస్టిండీస్‌తో జరిగిన చివరి వన్డేలో మాత్రం చెలరేగి విండీస్ మిడిలార్డర్‌ను వణికించాడు. ఫలితంగా విండీస్ 50 ఓవర్లలో 9 వికెట్లకు 205 పరుగులు చేసింది. షాయ్ హోప్ (98 బంతుల్లో 51; 5 ఫోర్లు), కైల్ హోప్ (50 బంతుల్లో 46; 9 ఫోర్లు), హోల్డర్ (34 బంతుల్లో 36; 4 ఫోర్లు, 1 సిక్స్), పావెల్ (32 బంతుల్లో 31; 2 సిక్సర్లు) రాణించారు. ఉమేశ్‌కు మూడు వికెట్లు దక్కాయి. చివర్లో తడబాటు టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన విండీస్‌కు ఓపెనర్లు లూయిస్ (9), కైల్ హోప్ ఓ మాదిరి ఆరంభాన్ని అందించారు. ముఖ్యంగా హోప్ భారత బౌలర్లపై ఎదురుదాడికి దిగి బౌండరీలతో జోరు కనబరిచాడు. ఉమేశ్, షమీ బౌలింగ్‌ను తను సమర్థవంతంగా ఎదుర్కొన్నాడు. అయితే తొమ్మిదో ఓవర్లో లూయిస్‌ను పాండ్యా అవుట్ చేయడంతో తొలి వికెట్‌కు 39 పరుగుల భాగస్వామ్యం ముగిసింది. అయితే సిరీస్‌లో తొలిసారిగా పవర్‌ప్లేలో విండీస్ 49 పరుగులు సాధించింది. ఆ తర్వాత కూడా జోరు తగ్గించని కైల్ హోప్.. షమీ బౌలింగ్‌లో వరుసగా రెండు ఫోర్లు బాదాడు. కానీ 16వ ఓవర్లో ఉమేశ్ యాదవ్ విండీస్‌కు షాక్ ఇచ్చాడు. వరుస బంతుల్లో కైల్ హోప్, చేజ్‌ను పెవిలియన్‌కు పంపాడు. ఆ తర్వాత స్పిన్నర్లను రంగంలోకి దించడంతో విండీస్ పరుగుల వేగం తగ్గగా 10 ఓవర్లలో ఒక్క బౌండరీ కూడా నమోదు కాలేదు. మొహమ్మద్ (16)ను కేదార్ జాదర్ రిటర్న్ క్యాచ్‌తో అవుట్ చేశాడు. ఈ దశలో షాయ్ హోప్, హోల్డర్ ఇన్నింగ్స్‌ను చక్కదిద్దారు. పరిస్థితులకు తగ్గట్టు నిదానంగా ఆడిన షాయ్ 94 బంతుల్లో అర్ధ సెంచరీ పూర్తిచేశాడు. అయితే 40వ ఓవర్ నుంచి షమీ అనూహ్యంగా చెలరేగడంతో విండీస్ పతనం ప్రారంభమైంది. తన వరుస నాలుగు ఓవర్లలో జోరు మీదున్న హోల్డర్, షాయ్ హోప్‌తో పాటు నర్స్, బిషూ వికెట్లకు తీయడంతో విండీస్ వణికింది. హోల్డర్, షాయ్ హోప్ మధ్య ఐదో వికెట్‌కు అత్యధికంగా 48 పరుగుల భాగస్వామ్యం ఏర్పడింది. చివర్లో పావెల్ కాస్త దూకుడు కనబరచగా స్కోరు 200 దాటింది. స్కోరు వివరాలు:- విండీస్ ఇన్నింగ్స్: లూయిస్ (సి) కోహ్లి (బి) పాండ్యా 9; కైల్ హోప్ (సి) ధావన్ (బి) ఉమేశ్ యాదవ్ 46; షాయ్ హోప్ (సి) రహానే (బి) షమీ 51; చేజ్ ఎల్బీడబ్లు్య (బి) ఉమేశ్ యాదవ్ 0; మొహమ్మద్ (సి అండ్ బి) కేదార్ జాదవ్ 16; హోల్డర్ (సి) ధావన్ (బి) షమీ 36; పావెల్ (సి) ధోని (బి) ఉమేశ్ 31; నర్స్ (సి) కుల్దీప్ (బి) షమీ 0; బిషూ (సి) ధోని (బి) షమీ 6; జోసెఫ్ నాటౌట్ 3; విలియమ్స్ నాటౌట్ 0; ఎక్స్‌ట్రాలు 7; మొత్తం (50 ఓవర్లలో 9 వికెట్లకు) 205. వికెట్ల పతనం: 1–39, 2–76, 3–76, 4–115, 5–163, 6–168, 7–171, 8–182, 9–205. బౌలింగ్: షమీ 10–0–48–4; ఉమేశ్ యాదవ్ 10–1–53–3; పాండ్యా 6–0–27–1; జడేజా 10–1–27–0; కుల్దీప్ యాదవ్ 10–0–36–0; కేదార్ జాదవ్ 4–0–13–1.