Squid Game Challenge: స్క్విడ్ గేమ్ ఛాలెంజ్‌లో నెగ్గిన 'హిట్‌మ్యాన్‌' | T20 World Cup 2021: Team India Star Cricketers Take Squid Game Challenge | Sakshi
Sakshi News home page

Squid Game Challenge: స్క్విడ్ గేమ్ ఛాలెంజ్‌లో నెగ్గిన 'హిట్‌మ్యాన్‌'

Published Thu, Oct 21 2021 7:02 PM | Last Updated on Thu, Oct 21 2021 7:03 PM

T20 World Cup 2021: Team India Star Cricketers Take Squid Game Challenge - Sakshi

Team India Star Cricketers Take Squid Game Challenge: నెట్‌ఫ్లిక్స్‌లో సంచలనం సృష్టిస్తున్న కొరియన్‌ వెబ్‌ సిరీస్‌ 'స్క్విడ్ గేమ్'లోని డ‌ల్‌గోనా క్యాండీ ఛాలెంజ్‌ ప్రస్తుతం సోషల్‌మీడియాలో విపరీతంగా ట్రెండ్‌ అవుతోంది. తాజాగా ఈ ఛాలెంజ్‌ను టీమిండియా క్రికెటర్లు సైతం స్వీకరించారు. ఛాలెంజ్‌లో భాగంగా క్యాండీలో ఉన్న ఆకారాన్ని ఏమాత్రం దెబ్బ‌తిన‌కుండా బ‌య‌ట‌కు తీయాల్సి ఉంటుంది. టీమిండియా క్రికెటర్లు రోహిత్ శ‌ర్మ‌, మ‌హ్మ‌ద్ ష‌మీ, కేఎల్‌ రాహుల్‌, సూర్యకుమార్ యాదవ్‌, వ‌రుణ్ చ‌క్ర‌వ‌ర్తి, జ‌స్ప్రీత్ బుమ్రా పాల్గొన్న ఈ పోటీకి సంబంధించిన వీడియోను ఐసీసీ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేసింది. 

ఇందులో టీమిండియా స్టార్‌ బ్యాటర్‌, హిట్‌మ్యాన్‌ రోహిత్‌ శర్మ, మహ్మద్‌ షమీలు విజేతలుగా నిలిచారు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట హల్‌చల్‌ చేస్తుంది. హిట్‌మ్యానా మజాకా అంటూ అతని అభిమానులు తెగ సంబరపడిపోతున్నారు. మరో పక్క షమీపై సైతం నెటిజన్లు పొగడ్తల వర్షం​ కురిపిస్తున్నారు. ఇదిలా ఉంటే, టీ20 ప్రపంచకప్‌-2021లో భాగంగా టీమిండియా.. ఈ నెల 24న దాయాది పాకిస్థాన్‌తో త‌ల‌ప‌డ‌నున్న సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్‌కు ముందు జరిగిన రెండు వార్మప్‌ మ్యాచ్‌ల్లోనూ ఘన విజయాలు నమోదు చేసిన కోహ్లి సేన మాంచి ఊపు మీదుంది.
చదవండి: ఐపీఎల్‌పై ఆసక్తి చూపుతున్న క్రిస్టియానో రొనాల్డో జట్టు..!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement