ఒకప్పుడు తెలుగు సినిమా అంటే మనవరకు మాత్రమే తెలిసేది. కానీ 'బాహుబలి' తర్వాత పాన్ ఇండియా చిత్రాల ట్రెండ్ పెరిగింది. 'ఆర్ఆర్ఆర్', 'పుష్ప', 'కేజీఎఫ్' మూవీస్.. సౌత్ ఇండస్ట్రీ రేంజుని ఎక్కడికో తీసుకెళ్లిపోయాయి. దీంతో దేశవ్యాప్తంగా చాలామంది సెలబ్రిటీలు.. తెలుగు చిత్రాలకు ఫిదా అయిపోతున్నాతు. తాజాగా టీమిండియా క్రికెటర్ షమి కూడా.. టాలీవుడ్‌కి వీరాభిమాని అని తేలిపోయింది.
(ఇదీ చదవండి: నెలకు రూ.35 లక్షలు వచ్చే పనిమానేశా: '12th ఫెయిల్' హీరో)
టీమిండియా క్రికెటర్లలో బౌలర్ షమికి సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. గత కొన్నేళ్ల నుంచి భారత క్రికెట్ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఇతడు.. అద్భుతమైన విజయాల్లో పాలుపంచుకున్నాడు. తాజాగా ఓ ఈవెంట్‌లో భాగంగా హైదరాబాద్ వచ్చిన ఇతడితో తెలుగు మీడియా ప్రతినిధులు మాట్లాడారు. సౌత్‌లో మీకు ఇష్టమైన యాక్టర్స్ ఎవరు అని అడగ్గా ఆసక్తికర సమాధానం చెప్పాడు.
'దక్షిణాది సినిమాలు చూడటం నాకు ఇష్టం. జూ.ఎన్టీఆర్, ప్రభాస్.. నా ఫేవరెట్ హీరోలు' అని టీమిండియా క్రికెటర్ షమి చెప్పుకొచ్చాడు. దీనిబట్టి చూస్తుంటే.. షమికి మాత్రమే కాదు మిగతా భారత క్రికెటర్లు కూడా తెలుగు సినిమాలు చూస్తుంటారనిపిస్తుంది. కాకపోతే వాళ్లకు ఎప్పుడు మాట్లాడే ఛాన్స్ రాలేదు. లేదంటే కోహ్లీ కూడా తనకు అల్లు అర్జునో లేదా ఎన్టీఆర్ అంటే ఇష్టమని చెప్పే సందర్భం రావొచ్చు.
(ఇదీ చదవండి: అనుపమ అభిమాని వీడియో.. ఎందుకు ఇలా చేస్తున్నారని ఆవేదన)
My Favourite Actors From South #Junior #NTR 🔥🔥 and #PRABHAS 🔥🔥
— CHITRAMBHALARE (@chitrambhalareI) February 19, 2024
- #Shami pic.twitter.com/SLbq94nTbq
Comments
Please login to add a commentAdd a comment