మొహాలీ: ఆ్రస్టేలియాతో వన్డే సిరీస్‌లో భారత్ శుభారంభం చేసింది. సాధారణ లక్ష్యాన్ని ఛేదించడంలో కొంత ఇబ్బంది పడినట్లు కనిపించినా చివరకు ఎలాంటి ఉత్కంఠకు అవకాశం ఇవ్వకుండా ప్రశాంతంగా టీమిండియా ఆట ముగించింది. శుక్రవారం ఇక్కడి పీసీఏ స్టేడియంలో జరిగిన తొలి వన్డేలో భారత్ 5 వికెట్ల తేడాతో ఆస్ట్రేలియాను ఓడించింది. ఈ గెలుపుతో భారత్ ఐసీసీ వన్డే టీమ్ ర్యాంకింగ్స్‌లో మళ్లీ నంబర్‌వన్ ర్యాంక్‌ను అందుకుంది. ప్రస్తుతం భారత్ మూడు ఫార్మాట్‌లలో (టెస్ట్, వన్డే, టి20) టాప్ ర్యాంక్‌లో ఉండటం విశేషం.
టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన ఆ్రస్టేలియా సరిగ్గా 50 ఓవర్లలో 276 పరుగులకు ఆలౌటైంది. వార్నర్ (53 బంతుల్లో 52; 6 ఫోర్లు, 2 సిక్స్‌లు) అర్ధసెంచరీ చేయగా... ఇన్‌గ్లిస్ (45 బంతుల్లో 45; 3 ఫోర్లు, 2 సిక్స్‌లు), స్మిత్ (60 బంతుల్లో 41; 3 ఫోర్లు, 1 సిక్స్), లబుõÙన్ (49 బంతుల్లో 39; 3 ఫోర్లు) కీలక ఇన్నింగ్స్ ఆడారు. రెండో వికెట్‌కు వార్నర్, స్మిత్ 17.4 ఓవర్లలో 94 పరుగులు జోడించారు. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ షమీ (5/51) ఐదు వికెట్లతో ప్రత్యర్థిని దెబ్బ కొట్టాడు. అనంతరం భారత్ 48.4 ఓవర్లలో 5 వికెట్లకు 281 పరుగులు సాధించింది.
భారత్ తరఫున నలుగురు బ్యాటర్లు శుబ్‌మన్ గిల్ (63 బంతుల్లో 74; 6 ఫోర్లు, 2 సిక్స్‌లు), రుతురాజ్ గైక్వాడ్ (77 బంతుల్లో 71; 10 ఫోర్లు), కేఎల్ రాహుల్ (63 బంతుల్లో 58 నాటౌట్; 4 ఫోర్లు, 1 సిక్స్), సూర్యకుమార్ యాదవ్ (49 బంతుల్లో 50; 5 ఫోర్లు, 1 సిక్స్) అర్ధ సెంచరీలు చేసి జట్టు విజయంలో ప్రధాన పాత్ర పోషించారు. ఓపెనర్లు రుతురాజ్, గిల్ 21.4 ఓవర్లలో తొలి వికెట్‌కు 142 పరుగులు జత చేశారు. అయితే 9 పరుగుల వ్యవధిలో జట్టు 3 వికెట్లు కోల్పోగా, ఇషాన్ (18) కూడా విఫలమయ్యాడు. ఈ దశలో రాహుల్, సూర్య ఐదో వికెట్‌కు 14.1 ఓవర్లలో 80 పరుగులు జత చేసి జట్టును గెలుపు దిశగా నడిపించారు.
విజయానికి 12 పరుగుల దూరంలో సూర్య వెనుదిరిగినా... రాహుల్ చివరి వరకు నిలిచాడు. అబాట్ ఓవర్లో వరుసగా 4, 6 కొట్టడంతో మరో 8 బంతులు మిగిలి ఉండగా జట్టు విజయం ఖాయమైంది. ఈ మ్యాచ్‌లో భారత మేనేజ్‌మెంట్ పేసర్ సిరాజ్‌కు విశ్రాంతినిచ్చింది. నియంత్రణతో కూడిన బౌలింగ్ ప్రదర్శనతో అశ్విన్ తనకు లభించిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగా... అర్ధ సెంచరీతో సూర్య ఫామ్‌లోకి రావడం భారత్‌కు సానుకూలాంశం. ఆదివారం ఇండోర్‌లో రెండో వన్డే జరుగుతుంది.
స్కోరు వివరాలు
ఆ్రస్టేలియా ఇన్నింగ్స్: మిచెల్ మార్‡్ష (సి) గిల్ (బి) షమీ 4; వార్నర్ (సి) గిల్ (బి) జడేజా 52; స్మిత్ (బి) షమీ 41; లబుõÙన్ (స్టంప్డ్) రాహుల్ (బి) అశి్వన్ 39; గ్రీన్ (రనౌట్) 31; ఇన్‌గ్లిస్ (సి) అయ్యర్ (బి) బుమ్రా 45; స్టొయినిస్ (బి) షమీ 29; షార్ట్ (సి) సూర్య (బి) షమీ 2; కమిన్స్ (నాటౌట్) 21; అబాట్ (బి) షమీ 2; జంపా (రనౌట్) 2; ఎక్స్‌ట్రాలు 8; మొత్తం (50 ఓవర్లలో ఆలౌట్) 276. వికెట్ల పతనం: 1–4, 2–98, 3–112, 4–157, 5–186, 6–248, 7–250, 8–254, 9–256, 10–276. బౌలింగ్: షమీ 10–1–51–5, బుమ్రా 10–2–43–1, శార్దుల్ ఠాకూర్ 10–0–78–0, అశ్విన్ 10–0–47–1,
రవీంద్ర జడేజా 10–0–51–1.
భారత్ ఇన్నింగ్స్: రుతురాజ్ (ఎల్బీ) (బి) జంపా 71; గిల్ (బి) జంపా 74; శ్రేయస్ అయ్యర్ (రనౌట్) 3; కేఎల్ రాహుల్ (నాటౌట్) 58; ఇషాన్ కిషన్ (సి) ఇన్‌గ్లిస్ (బి) కమిన్స్ 18; సూర్యకుమార్ (సి) మార్‡్ష (బి) అబాట్ 50; జడేజా (నాటౌట్) 3; ఎక్స్‌ట్రాలు 4; మొత్తం (48.4 ఓవర్లలో 5 వికెట్లకు) 281. వికెట్ల పతనం: 1–142, 2–148, 3–151, 4–185, 5–265. బౌలింగ్: కమిన్స్ 10–0–44–1, స్టొయినిస్ 5–0–40–0, అబాట్ 9.4–1–56–1, గ్రీన్ 6–0–44–0, షార్ట్ 8–0–39–0, జంపా 10–0–57–2.
Comments
Please login to add a commentAdd a comment