
సురేష్ రైనాకు షాక్
ఫామ్ కోల్పోయి జట్టుకు భారంగా మారిన సురేష్ రైనాకు భారత క్రికెట్ బోర్డు ఉద్వాసన పలికింది.
ముంబై: ఫామ్ కోల్పోయి జట్టుకు భారంగా మారిన సురేష్ రైనాకు భారత క్రికెట్ బోర్డు ఉద్వాసన పలికింది. వన్డే జట్టు నుంచి అతడిని తొలగించింది. ఆసియా కప్కు అతడిని పక్కనపెట్టింది. వికెట్ల వేటలో వెనుకబడిన ఇషాంత్ శర్మపై కూడా వేటు వేసింది.
ఆసియా కప్, టీ-20 వరల్డ్ కప్ ఆడే జట్టును సెలక్షన్ కమిటీ ఈ రోజు ప్రకటించింది. ఇషాంత్ శర్మను ఈ సిరీస్లకు ఎంపిక చేయలేదు. వన్డే జట్టు నుంచి తప్పించిన రైనాకు టీ-20 వరల్డ్ కప్‌లో ఆడే అవకాశం కల్పించారు. యువరాజ్ సింగ్ను టీ-20 వరల్డ్ కప్‌కు ఎంపిక చేశారు. వన్డేలో రైనా స్థానంలో ఛతేశ్వర్ పూజారాను తీసుకున్నారు.