Ishant Sharma
-
పంత్ కీలక నిర్ణయం.. ఆ లీగ్‌లో ఆడనున్న ఢిల్లీ చిచ్చర పిడుగు
ఢిల్లీ ప్రీమియర్ లీగ్ ప్రారంభ ఎడిషన్‌లో టీమిండియా స్టార్ క్రికెటర్ రిషబ్ పంత్ భాగం కానున్నాడు. ఈ లీగ్‌లో పురాణి ఢిల్లీ 6 ఫ్రాంచైజీ తరపున పంత్ ఆడనున్నాడు. అతడితో పాటు భారత వెటరన్ క్రికెటర్ ఇషాంత్ శర్మ కూడా పురాణి ఢిల్లీకి ప్రాతినిథ్యం వహించనున్నాడు. అదే విధంగా యువ ఢిల్లీ ఆటగాళ్లు హర్షిత్ రాణా, ఆయుష్ బడోనీ, అనుజ్ రావత్, యశ్దయాల్లు కూడా డీపీఎల్‌లో ఆడనున్నారు. తాజాగా డీపీఎల్‌లో పాల్గోనే ఆటగాళ్ల డ్రాఫ్ట్ జాబితాను ఢిల్లీ అండ్ డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్ విడుదల చేసింది. అయితే ఈ అరంగేట్ర సీజన్‌కు ఢిల్లీ ఫాస్ట్ బౌలింగ్ సంచలనం మయాంక్ యాదవ్ దూరమయ్యాడు. ఫిట్నెస్ సమస్యల కారణంగా ఈ టోర్నీకి మయాంక్ దూరంగా ఉండనున్నాడు. మయాంక్ ప్రస్తుతం బెంగళూరులోని నేషనల్ క్రికెట్ ఆకాడమీలో శిక్షణ పొందుతున్నాడు. ఇక ఈ డీపీఎల్ తొట్ట తొలి ఎడిషన్ ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 8 వరకు జరగనుంది. మ్యాచ్‌లన్నీ ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా జరగనున్నాయి. ఈ లీగ్ ప్రారంభ ఎడిషన్‌లో మొత్తం ఆరు ఫ్రాంచైజీలు భాగం కానున్నాయి. సౌత్ ఢిల్లీ సూపర్ స్టార్స్, పురాణి డిల్లీ 6, సెంట్రల్ ఢిల్లీ కింగ్స్, నార్త్ ఢిల్లీ స్ట్రైకర్స్, వెస్ట్ ఢిల్లీ లయన్స్, ఈస్ట్ ఢిల్లీ రైడర్స్ ఫ్రాంచైజీలు రూ. 49.65 కోట్ల రూపాయలకు విక్రయించబడ్డాయి.సౌత్ ఢిల్లీ సూపర్ స్టార్స్: ఆయుష్ బదోని, కులదీప్ యాదవ్, ప్రియాంష్ ఆర్య, సుమిత్ మాథుర్, దివిజ్ మెహ్రా, కున్వర్ బిధురి, దిగ్వేష్ రాఠీ, తేజస్వి దహియా, రాఘవ్ సింగ్, సౌరభ్ దేస్వాల్, సార్థక్ రే, లక్షయ్ సెహ్రావత్, తరుణ్ బిష్త్, శుభ్ పన్బే, శుభమ్ పన్బే, శుభమ్ పన్. సింగ్, మయాంక్ గుప్తా, అన్షుమాన్ హుడా, అనిందో నహరాయ్, దీపాంశు గులియాతూర్పు ఢిల్లీ రైడర్స్: అనుజ్ రావత్, సిమర్జీత్ సింగ్, హిమ్మత్ సింగ్, హిమాన్షు చౌహాన్, హర్ష్ త్యాగి, వైభవ్ శర్మ, మయాంక్ రావత్, సమర్థ్ సేథ్, ప్రణవ్ పంత్, సుజల్ సింగ్, హార్దిక్ శర్మ, రౌనక్ వాఘేలా, అగ్రిమ్ శర్మ, శంతను సింగ్, భగవాన్, భగవాన్, భగవాన్ చౌదరి, సాగర్ ఖత్రి, శివమ్ కుమార్ త్రిపాఠి, రిషబ్ రాణా, లక్షయ సాంగ్వాన్సెంట్రల్ ఢిల్లీ కింగ్స్: యశ్ ధుల్, ప్రిన్స్ చౌదరి, హితేన్ దలాల్, జాంటీ సిద్ధు, లక్షయ్ థరేజా, యోగేష్ శర్మ, మనీ గ్రేవార్, కేశవ్ దాబాస్, శౌర్య మాలిక్, సౌరవ్ దాగర్, ఆర్యన్ రాణా, సిద్ధాంత్ బన్సల్, రజనీష్ దాదర్, సుమిత్ కుమార్, కౌశల్ సుమన్, దీప్ బల్యాన్, విశాంత్ భాటి, ధ్రువ్ కౌశిక్, అజయ్ గులియానార్త్ ఢిల్లీ స్ట్రైకర్స్: హర్షిత్ రాణా, సుయాష్ శర్మ, ప్రన్షు విజయరన్, వైభవ్ కంద్పాల్, క్షితిజ్ శర్మ, వైభవ్ రావల్, యష్ దాబాస్, ప్రణవ్ రాజ్‌వంశీ, మనన్ భరద్వాజ్, యశ్ భాటియా, యతీష్ సింగ్, అమన్ భారతి, యజాస్ శర్మ, సార్థక్ చోరంద్, అనిరుధ్ రంజన్, అనిరుద్ , యథార్త్ సింగ్, సిద్ధార్థ సోలంకి, ధ్రువ్ చౌహాన్, యువరాజ్ రాఠీవెస్ట్ ఢిల్లీ లయన్స్: హృతిక్ షోకీన్, నవదీప్ సైనీ, దేవ్ లక్రా, దీపక్ పునియా, శివంక్ వశిష్త్, అఖిల్ చౌదరి, ఆయుష్ దోసెజా, క్రిష్ యాదవ్, అన్మోల్ శర్మ, యుగల్ సైనీ, అంకిత్ రాజేష్ కుమార్, వివేక్ యాదవ్, ఆర్యన్ దలాల్, మసాబ్ ఆలం, ఏకాంష్ దోబల్, శివం గుప్తా, యోగేష్ కుమార్, సూర్యకాంత్ చౌహాన్, తిషాంత్ దబ్లా, అబ్రహీం అహ్మద్ మసూదిపురాణి డిల్లీ 6: లలిత్ యాదవ్, ఇషాంత్ శర్మ, అర్పిత్ రాణా, శివం శర్మ, ప్రిన్స్ యాదవ్, రిషబ్ పంత్, మయాంక్ గుసేన్, సనత్ సాంగ్వాన్, అంకిత్ భదానా, యుగ్ గుప్తా, కేశవ్ దలాల్, ఆయుష్ సింగ్, కుష్ నాగ్‌పాల్, సుమిత్ ఛికారా, అర్నవ్ బుగ్గారా బేడీ, మంజీత్, యష్ భరదవాజ్, సంభవ్ శర్మ, లక్ష్మణ్ -
Virat Kohli: నన్నే ఏడిపిస్తావా?.. ప్రతీకారం తీర్చుకున్న కోహ్లి!
ఐపీఎల్-2024 ప్లే ఆఫ్స్ ఆశలు సజీవంగా ఉండాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఘన విజయం సాధించింది. ఢిల్లీ క్యాపిటల్స్‌తో ఆదివారం నాటి మ్యాచ్‌లో 47 పరుగుల తేడాతో జయభేరి మోగించింది.ఇదిలా ఉంటే.. ఆర్సీబీ- ఢిల్లీ మ్యాచ్ సందర్భంగా ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. ఆర్సీబీ స్టార్ విరాట్ కోహ్లి, ఢిల్లీ సీనియర్ పేసర్ ఇషాంత్‌ల ‘బ్రొమాన్స్’ హైలైట్‌గా నిలిచింది.కాగా చిన్నస్వామి స్టేడియంలో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు నష్టపోయి 187 పరుగులు చేసింది. ఇక ఓపెనర్ విరాట్ కోహ్లి 13 బంతులు ఎదుర్కొని 27 పరుగులు చేశాడు.అయితే, ఆర్సీబీ ఇన్నింగ్స్ నాలుగో ఓవర్ వేసిన ఇషాంత్ శర్మ బౌలింగ్‌లో మొదటి బంతికి ఫోర్ బాదిన కోహ్లి.. ఇషాంత్‌ను టీజ్ చేశాడు. తదుపరి బంతికి స్లిప్‌లో ఫీల్డర్‌ను పెట్టు అంటూ ఆటపట్టించాడు. అంతేకాదు.. మరుసటి బాల్‌ను సిక్సర్‌గా మలిచాడు.దీంతో ఉడుక్కున్నా కామ్‌గా కనిపించిన ఇషాంత్.. నాలుగో బంతికి కోహ్లిని ఊరించగా.. అతడు బంతిని గాల్లోకి లేపాడు. అభిషేక్ పోరెల్ ఏమాత్రం ఆలస్యం చేయకుండా కోహ్లి ఇచ్చిన క్యాచ్ పట్టడంతో అతడు పెవిలియన్ చేరక తప్పలేదు.ఈ క్రమంలో తానే గెలిచానన్నట్లుగా ఇషాంత్ కోహ్లిని నవ్వుతూ కోహ్లి దగ్గరు వచ్చి.. ‘‘వెళ్లు వెళ్లు ’’ అన్నట్లుగా సైగ చేశాడు. ఇందుకు బదులుగా కోహ్లి కూడా నవ్వుతూ సరేలే అన్నట్లు మైదానాన్ని వీడాడు.వీళ్లిద్దరి ఫ్రెండ్లీ బ్యాంటర్కు సంబంధించిన ఫొటోను షేర్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్.. ‘‘పశ్చిమ ఢిల్లీ అబ్బాయిలు ఇదిగో ఇలా ఉంటారు’’ అంటూ క్యాప్షన్ ఇచ్చింది. అయితే, లక్ష్య ఛేదనలో ఆరంభం నుంచే తడబడ్డ ఢిల్లీ క్యాపిటల్స్ 19.1 ఓవర్లలో 140 పరుగులకే కుప్పకూలింది.అయితే, పదకొండో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన ఇషాంత్ శర్మ నాలుగు బంతులు ఎదుర్కొని సున్నా పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. ఈ క్రమంలో కోహ్లి ఇషాంత్ శర్మ దగ్గరికి వెళ్లి ‘సర్లే పదా ఇంకా’ అంటూ టీజ్ చేశాడు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. కాగా కోహ్లి- ఇషాంత్ దేశవాళీ క్రికెట్లో ఢిల్లీకి ప్రాతినిథ్య వహించారు. ఇక టీమిండియాలో కోహ్లి కెప్టెన్సీలో ఇషాంత్ ఆడిన విషయం తెలిసిందే.Kohli man I love him 🤣❤pic.twitter.com/65HxtsIwta— POTT⁷⁶⁵ (@KlolZone) May 12, 2024Wrapped up in style ⚡️High fives 🙌 all around as #RCB make it FIVE 🖐️ in a row 🔥A comfortable 4️⃣7️⃣-run win at home 🥳Scorecard ▶️ https://t.co/AFDOfgLefa#TATAIPL | #RCBvDC pic.twitter.com/qhCm0AwUIE— IndianPremierLeague (@IPL) May 12, 2024 -
ఐపీఎల్‌కు 17 ఏళ్లు.. తొలి మ్యాచ్ ఆడిన వాళ్లు ఇప్పుడు ఎంత మంది ఉన్నారు..?
క్రికెట్ పండుగ ఇండియన్ ప్రీమియర్ లీగ్‌కు నేటితో 16 ఏళ్లు పూర్తయ్యాయి. ఇవాళ (ఏప్రిల్ 18) క్యాష్ రిచ్ లీగ్ 17వ వసంతంలోకి అడుగు పెట్టింది. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ఐపీఎల్ మేనేజ్మెంట్ ఓ పోస్టర్‌ను రిలీజ్ చేసి గతాన్ని గుర్తు చేసుకుంది. మీ ఫేవరెట్ ఐపీఎల్ జ్ఞాపకాన్ని కూడా షేర్ చేసుకోండని క్యాప్షన్ జోడించింది. దీంతో చాలామంది ఐపీఎల్ అభిమానులు తమ తీపి జ్ఞాపకాలను నెమరు వేసుకుంటున్నారు. IPL's poster on Completed "17 Years of IPL". - The Biggest Cricket Event...!!!! ⭐ pic.twitter.com/oXgkvRf0dP — CricketMAN2 (@ImTanujSingh) April 18, 2024 ఈ నేపథ్యంలో ఓ నెటిజన్ ఓ ఆసక్తికర ప్రశ్నను సంధించాడు. ఐపీఎల్ అరంగేట్రం మ్యాచ్‌లో ఆడిన వారు ప్రస్తుతం ఎంత మంది ఇప్పటికీ ఆడుతున్నారని అడిగాడు. దీనికి చాలామంది తమకు తెలిసిన సమాధానాలు చెప్పారు. సమాధానం రివీల్ చేయకముందు మీకు తెలిసిన సమాధాన్ని మీరు కూడా షేర్ చేయండి. 17 YEARS OF THE IPL...!!! 💥 The greatest league in the world started on this day in 2008. 🇮🇳 pic.twitter.com/BPApcjBkOL — Mufaddal Vohra (@mufaddal_vohra) April 18, 2024 సమాధానం విషయానికొస్తే.. ఐపీఎల్ తొలి మ్యాచ్ బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వేదికగా ఆర్సీబీ, కేకేఆర్ జట్ల మధ్య జరిగింది. ఈ మ్యాచ్‌లో కేకేఆర్ తరఫున ఆడిన వృద్దిమాన్ సాహా, ఇషాంత్ శర్మ ప్రస్తుతం గుజరాత్, ఢిల్లీ జట్లకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఈ మ్యాచ్‌లో ఆర్సీబీకి ఆడిన విరాట్ కోహ్లి ఇప్పుడు కూడా అదే జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. ఐపీఎల్ తొలి మ్యాచ్ ఆడిన ఈ ముగ్గురు మాత్రమే ఐపీఎల్లో ఇంకా కొనసాగుతున్నారు. ఇక్కడ ఆసక్తికరమైన మరో విషయం ఏంటంటే.. ఐపీఎల్ చరిత్రలో విరాట్ ఒక్కడే నాటి నుంచి నేటి వరకు ఒకే జట్టుకు ఆడుతూ ఎవరికీ సాధ్యంకాని ఘనతను సొంతం చేసుకున్నాడు. నాటి మ్యాచ్ విషయానికొస్తే.. బ్రెండన్ మెక్కల్లమ్ శివాలెత్తిపోవడంతో (73 బంతుల్లో 158; 10 ఫోర్లు, 13 సిక్సర్లు) కేకేఆర్ 140 పరుగల భారీ తేడాతో ఆర్సీబీపై విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన కేకేఆర్ నిర్ణీత ఓవరల్లో 3 వికెట్ల నష్టానికి 222 పరుగులు చేసింది. కేకేఆర్ ఇన్నింగ్స్‌లో మెక్కల్లమ్ ఒక్కడే సింహ భాగం స్కోర్ చేశాడు. సౌరవ్ గంగూలీ 10, రికీ పాంటింగ్ 20, డేవిడ్ హస్సీ 12, మొహమ్మద్ హఫీజ్ 5 (నాటౌట్) పరుగులు చేశారు.ఆర్సీబీ బౌలర్లలో జహీర్ ఖాన్, ఆష్లే నోఫ్కే, జాక్ కలిస్ తలో వికెట్ పడగొట్టారు. భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఆర్సీబీ.. ఆశోక్ దిండా (3-0-9-2), ఇషాంత్ శర్మ (3-0-7-1), అజిత్ అగార్కర్ (4-0-25-3), సౌరవ్ గంగూలీ (4-0-21-2), లక్ష్మీ రతన్ శుక్లా (1.1-0-12-1) ధాటికి 15.1 ఓవర్లలో 82 పరుగులకే కుప్పకూలింది. ఆర్సీబీ ఇన్నింగ్స్‌లో ఒకే ఒక్కరు (ప్రవీణ్ కుమార్ (18 నాటౌట్)) రెండంకెల స్కోర్ చేశారు. ద్రవిడ్ 2, వసీం జాఫర్ 6, విరాట్ కోహ్లి 1, జాక్ కలిస్ 8, కెమరూన్ వైట్ 6, మార్క్ బౌచర్ 7, బాసిల్ థంపి 0, నోఫ్కే 9, జహీర్ ఖాన్ 3, సునీల్ జోషి 3 పరుగులు చేసి ఔటయ్యారు. వికెట్ కీపర్‌గా వృద్దిమాన్ సాహా కలిస్ క్యాచ్ అందుకున్నాడు. -
అంపైర్‌తో గొడవపడ్డ పంత్.. తప్పెవరిది?.. మండిపడ్డ దిగ్గజం
ఐపీఎల్-2024లో లక్నో సూపర్ జెయింట్స్‌తో మ్యాచ్ సందర్భంగా ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ రిషభ్ పంత్ అంపైర్‌తో దురుసుగా ప్రవర్తించాడు. రివ్యూ విషయంలో ఫీల్డ్ అంపైర్‌తో చాలాసేపు వాగ్వాదానికి దిగాడు. ఆఖరికి తప్పు తనదే అని తేలడంతో మిన్నకుండిపోయాడు. లక్నో ఇన్నింగ్స్‌లో నాలుగో ఓవర్లో ఈ ఘటన జరగింది. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆస్ట్రేలియా దిగ్గజ వికెట్ కీపర్ బ్యాటర్ ఆడం గిల్‌క్రిస్ట్ రిషభ్ పంత్ తీరుపై మండిపడ్డాడు. అంపైర్‌తో దురుసుగా ప్రవర్తించిన పంత్ లాంటి ఆటగాళ్లను కచ్చితంగా పనిష్ చేయాలని విజ్ఞప్తి చేశాడు. కాగా లక్నోలో ఢిల్లీతో జరిగిన శుక్రవారం నాటి మ్యాచ్‌లో సూపర్ జెయింట్స్ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. రీప్లేలో పంత్ రివ్యూ కోరినట్లుగానే ఈ క్రమంలో మూడో ఓవర్లో బంతిని కెప్టెన్ పంత్ ఇషాంత్ శర్మకు ఇచ్చాడు. నాలుగో బాల్‌ను అంపైర్ వైడ్‌గా ప్రకటించగా.. పంత్ రివ్యూకు అప్పీలు చేసినట్లుగా కనిపించింది. దీంతో ఫీల్డ్ అంపైర్ అడిగి అతడితో కన్ఫామ్ చేసుకునీ మరీ డీఆర్ఎస్ కాల్ ఇచ్చాడు. రివ్యూలో అది వైడ్ బాల్‌గానే తేలడంతో పంత్ అసహనానికి గురయ్యాడు. ఈ క్రమంలో అసలు తాను డీఆర్ఎస్ కోరనేలేదని అంపైర్‌తో వాదించాడు. అయితే, రీప్లేలో పంత్ రివ్యూ సిగ్నల్ ఇచ్చినట్లుగా తేలింది. అయితే, అతడు ఫీల్డర్లతో సంప్రదించేందుకు అలా చేశాడా? లేదంటే నిజంగానే అంపైర్‌కే సిగ్నల్ ఇచ్చాడా అన్న విషయంలో క్లారిటీ లేకపోవడంతో ఈ గొడవ జరిగింది. పంత్ తీరుపై ఆసీస్ దిగ్గజం ఆగ్రహం ఈ నేపథ్యంలో ఆడం గిల్ క్రిస్ట్ మాట్లాడుతూ.. ‘‘అంపైర్లకు మ్యాచ్‌ను నియంత్రించేందుకు మరింత వెసలుబాటు కల్పించాలి. ఏ ఫార్మాట్లోనైనా ఇలాంటి విషయాల్లో తమ పని తాము చేసుకునే వీలు ఉండాలి. రిషభ్ పంత్ రివ్యూకు వెళ్లాడా లేదా అన్నది ఇక్కడ వాగ్వాదానికి దారితీసింది. సమన్వయలోపం జరిగిందనే అనుకుందాం. కానీ అందుకోసం సుమారు 3- 4 నిమిషాలు వృథా అయ్యాయి. రిషభ్ పంత్ ఒక్కడే కాదు.. ఇంతకు ముందు ఇలాగే చాలా మంది అంపైర్లతో గొడవకు దిగడం చూశాను. కావాలని వాదనను పొడిగిస్తే పంత్ అయినా.. ఇంకెవరైనా కచ్చితంగా వారి తప్పునకు తగిన శిక్ష పడాల్సిందే’’ అని పేర్కొన్నాడు. కాగా లక్నోతో మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ ఆరు వికెట్ల తేడాతో గెలుపొంది ఈ సీజన్లో రెండో గెలుపు అందుకుంది. Rishabh Pant and on-field umpire Rohan Pandit had a word on review.#LSGvsDC #IPL2024 #RishabhPant pic.twitter.com/NjIVgsAR5p — 𝗖𝗿𝗶𝗰 𝗶𝗻𝘀𝗶𝗱𝗲𝗿 (@cric_insiderr) April 12, 2024 చదవండి: Rishabh Pant: పంత్ అరుదైన ఘనతలు.. ఐపీఎల్లో తొలి కెప్టెన్‌గా #KL Rahul: అతడొక సర్ప్రైజ్.. వాళ్లిద్దరి వల్లే మా ఓటమి var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_7522010156.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); Victory in Lucknow for the @DelhiCapitals 🙌 A successful chase power them to their second win of the season as they win by 6⃣ wickets! Scorecard ▶️ https://t.co/0W0hHHG2sq#TATAIPL | #LSGvDC pic.twitter.com/6R7an9Cy8g — IndianPremierLeague (@IPL) April 12, 2024 -
కళ్లు చెదిరే యార్కర్.. అభినందించకుండా ఉండలేకపోయిన బ్యాటర్
ఢిల్లీ క్యాపిటల్స్ వెటరన్ పేసర్ ఇషాంత్ శర్మ కళ్లు చెదిరే యార్కర్‌ను సంధించాడు. కేకేఆర్‌తో ఇవాళ (ఏప్రిల్ 3) జరుగుతున్న మ్యాచ్‌లో ఇషాంత్ సూపర్ డెలివరీని బౌల్ చేశాడు. ఇషాంత్ యార్కర్ దెబ్బకు బ్యాటర్ ఆండ్రీ రసెల్ ఫ్యూజులు ఎగిరిపోయాయి. సెకెన్ల వ్యవధిలో బంతి వికెట్లను గిరాటు వేయడంతో రసెల్ నిర్ఘాంతపోయాడు. ఇషాంత్ యార్కర్‌కు సమాధానం చెప్పలేని రసెల్ బంతిని అడ్డుకునే క్రమంలో బొక్కబోర్లా పడ్డాడు. ఈ బంతిని సంధించినందుకుగాను రసెల్ ఇషాంత్‌ను అభినందించకుండా ఉండలేకపోయాడు. కిందపడి లేవగానే చప్పట్లతో అభినందించాడు. ఇషాంత్ సూపర్ యార్కర్‌కు సంబంధించిన వీడియో నెట్టింట వైరలవుతుంది. ISHANT SHARMA WITH A BALL OF IPL 2024...!!! 🤯 pic.twitter.com/9O015ZzlwZ — Mufaddal Vohra (@mufaddal_vohra) April 3, 2024 ఇషాంత్ రసెల్‌ను ఔట్ చేసిన సందర్భం కూడా చాలా కీలకమైంది. ఆఖరి ఓవర్ తొలి బంతికి.. అప్పటికే రసెల్ (19 బంతుల్లో 41; 4 ఫోర్లు, 3 సిక్సర్లు) శివాలెత్తిపోయి ఉన్నాడు. ఆ సమయంలో ఇషాంత్ అద్భుతమైన యార్కర్‌తో రసెల్‌ను బోల్తా కొట్టించాడు. ఆ బంతికి రసెల్ ఔట్ కాకపోయి ఉండివుంటే, కేకేఆర్ ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత భారీ స్కోర్ నమోదు చేసి ఉండేది. లేటు వయసులో ఇషాంత్ ప్రదర్శనకు అభిమానులు ఫిదా అవుతున్నారు. ఈ మ్యాచ్‌లో అతను ధారాళంగా పరుగులు సమర్పించుకున్నప్పటికీ రెండు వికెట్లు పడగొట్టాడు. కాగా, ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన కేకేఆర్.. సునీల్ నరైన్ (39 బంతుల్లో 85; 7 ఫోర్లు, 7 సిక్సర్లు), రఘువంశీ (27 బంతుల్లో 54; 5 ఫోర్లు, 3 సిక్సర్లు), ఆండ్రీ రసెల్, శ్రేయస్ అయ్యర్ (11 బంతుల్లో 18; 2 సిక్సర్లు), రింకూ సింగ్ (8 బంతుల్లో 26; ఫోర్, 3 సిక్సర్లు) చెలరేగడంతో నిర్ణీత ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 272 పరుగుల చేసింది. ఐపీఎల్ చరిత్రలో ఇది రెండో భారీ స్కోర్. ఇదే సీజన్లో ముంబై ఇండియన్స్‌పై సన్‌రైజర్స్ చేసిన స్కోర్ (277/3) ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక స్కోర్‌గా ఉంది. ఓ సీజన్లో 250పైగా స్కోర్లు రెండు సార్లు నమోదు కావడం 17 ఏళ్ల ఐపీఎల్ చరిత్రలో ఇదే మొదటిసారి. -
ఓడినా పర్వాలేదు.. ఛాంపియన్స్‌లా ఆడారు: ఇషాంత్ శర్మ
అండర్-19 ప్రపంచకప్ టైటిల్‌ను ఆరోసారి ముద్దాడాలన్న టీమిండియా కల నేరవేరలేదు. ఆదివారం బెన్నోని వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన ఫైనల్లో యువ భారత జట్టు 79 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. టోర్నీ ఆసాంతం అద్బుతమైన ప్రదర్శన కనబరిచిన టీమిండియా.. కీలకమైన ఫైనల్లో మాత్రం చేతులేత్తాశారు. ముఖ్యంగా భారత బ్యాటర్లు ఒత్తడిలో చిత్తయ్యారు. వరుసక్రమంలో పెవిలియన్‌కు క్యూ కడుతూ.. ఆసీస్‌కు నాలుగో సారి వరల్డ్‌కప్ టైటిల్‌ను అప్పగించేశారు. 254 పరుగుల లక్ష్య చేధనలో భారత్ 43.5 ఓవర్లలో 174 పరుగులకు కుప్పకూలింది. ఆదర్శ్ సింగ్(47), మురుగణ్ అభిషేక్(42 )టాప్ స్కోరర్లుగా నిలిచారు. అంతకుముందు బ్యాటింగ్ చేసిన ఆసీస్ నిర్ణీత నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్లకు 253 పరుగులు చేసింది. హర్జాస్ సింగ్(64) పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా.. ప్టెన్ హ్యూ వీబ్జెన్(48), ఓలీవర్ పీక్(42) పరుగులతో రాణించారు. ఈ నేపథ్యంలో యువ భారత జట్టుకు టీమిండియా వెటరన్ పేసర్ ఇషాంత్ శర్మ సపోర్ట్‌గా నిలిచాడు. ఫైనల్లో భారత్ ఓటమిపాలైనప్పటికీ టోర్నీ మొత్తం ఛాంపియన్స్‌లా ఆడిందని ఇషాంత్ కొనియాడాడు. "మన అండర్-19 జట్టు ఛాంపియన్స్‌లా ఆడింది. ఈ టోర్నమెంట్లో వారు పడిన కష్టాన్ని ఒక్క మ్యాచ్(ఫైనల్)తో పోల్చవద్దు. ఈ రోజు మనది కాదు. ఆటలో గెలుపుటములు సహజం. కానీ టోర్నమెంట్ అంతటా యువ ఆటగాళ్లు అద్బుతమైన ప్రదర్శన కనబరిచారు. వారి ఆటతీరు, పోరాట పటిమని చూసి యావత్తు భారత్ గర్విస్తోంది. మీరు తల దించుకోండి బాయ్స్.. అంతకంటే బలంగా తిరిగి రండి" అంటూ ఇషాంత్ ఎక్స్(ట్విటర్)లో రాసుకొచ్చాడు. -
'కోహ్లి వల్లే జహీర్ కెరీర్‌కు ముగింపు'.. మాజీ క్రికెటర్ క్లారిటీ
టీమిండియా మాజీ కెప్టెన్.. స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లి ఫీల్డింగ్ గురించి వంక పెట్టాల్సిన పని లేదు. మైదానంలో పాదరసంలా కదిలే కోహ్లి ఎన్నోసార్లు స్టన్నింగ్ క్యాచ్‌లు తీసుకున్నాడు. ఎక్కువ సందర్భాల్లో స్లిప్‌లో ఫీల్డింగ్ చేసిన కోహ్లి కొన్నిసార్లు క్యాచ్‌లు వదిలేశాడు. అందులో అమూల్యమైన క్యాచ్‌లు కూడా ఉన్నాయి. సోమవారం వెస్టిండీస్‌తో ముగిసిన రెండో టెస్టులో సిరాజ్ బౌలింగ్‌లో కోహ్లి ఒక సింపుల్ క్యాచ్‌ను జారవిడిచాడు. ఈ సందర్భంగా రెండో టెస్టుకు కామెంటేటర్లుగా వ్యవహరించిన ఇషాంత్ శర్మ, జహీర్ ఖాన్లు 2014లో కోహ్లి మిస్ చేసిన క్యాచ్ గుర్తుచేసుకున్నారు. కోహ్లి వల్లనే తన టెస్టు కెరీర్ ముగిసిపోయిందని జహీర్ అన్నట్లు ఇషాంత్ పేర్కొన్నాడు. ఇషాంత్ మాట్లాడుతూ.. ''2014లో మేము న్యూజిలాండ్ పర్యటనకు వచ్చాం. బేసిన్ రిజర్వ్ బ్యాక్ వేదికగా జరిగిన టెస్టులో మూడో రోజు ఆటలో మెక్కల్లమ్ ట్రిపుల్ సెంచరీతో మెరిశాడు. అయితే జహీర్ ఖాన్ బౌలింగ్‌లో కోహ్లి 9 పరుగుల వద్ద మెక్కల్లమ్ ఇచ్చిన క్యాచ్‌ను జారవిడవడంతో బతికిపోయిన మెక్కల్లమ్ ఆ తర్వాత 300 పరుగులు బాదాడు. దీంతో కోహ్లి.. ''ఇదంతా తన వల్లే'' అంటూ తెగ ఫీలయ్యాడు. లంచ్ విరామం సమయంలో జహీర్ వద్దకు వచ్చిన కోహ్లి సారీ చెప్పాడు. దీనికి జహీర్ బదులిస్తూ.. ''ఏం పర్లేదు తర్వాతి బంతికి ఔట్ చేద్దాం'' అని పేర్కొన్నాడు. టీ విరామ సమయంలో కోహ్లి మరోసారి జహీర్‌కు సారీ చెప్పగా.. ''నా కెరీర్ నీ వల్లే ముగిసిపోనుంది'' అంటూ బాంబు పేల్చాడు. అయితే ఇషాంత్ వ్యాఖ్యలను తప్పుబట్టిన జహీర్ వివరణ ఇచ్చుకున్నాడు. ''నా కెరీర్ నీవల్లే ఎండ్ అయిందని నేను అనలేదు. ఇషాంత్ నా వ్యాఖ్యలను వక్రీకరించాడు(నవ్వుతూ). ఇంతవరకు టీమిండియా ఆడిన టెస్టుల్లో 300 పరుగులు చేసిన ఆటగాడి క్యాచ్‌లను ఇద్దరే మిస్ చేశారు. మొదట కిరణ్ మోరే క్యాచ్ జారవిడవడంతో ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ గ్రహం గూచ్ ట్రిపుల్ సెంచరీ చేశాడు. కిరణ్ మోరే తర్వాత ఆ ఘనత సాధించింది కోహ్లినే. 9 పరుగుల వద్ద మెక్కల్లమ్ ఇచ్చిన క్యాచ్‌ను కోహ్లి జారవిడవడంతో అతను ట్రిపుల్ సెంచరీ చేశాడు. అందుకే నా కెరీర్ నీవల్లే ఎండ్ కాబోతుంది అంటూ జోక్ చేశాను. కానీ కోహ్లి మాత్రం ప్లీజ్ అలా అనొద్దు.. నాకు చాలా బాధగా ఉంది.. కానీ క్యాచ్ జారవిడవడం వల్ల పరుగులు వచ్చేశాయి. అని అన్నాడు. దీంతో నేను పర్లేదు.. ఈ విషయాన్ని ఇక్కడితో మరిచిపో అంటూ కోహ్లికి సర్ది చెప్పాను.'' అంటూ జహీర్ ఖాన్ తెలిపాడు. ఇక అప్పటి మ్యాచ్‌లో జహీర్ ఖాన్ ఐదు వికెట్లు తీసినప్పటికి 51 ఓవర్లలో 170 పరుగులు ఇచ్చుకున్నాడు. మెక్కల్లమ్ 302 పరుగులు, బీజే వాట్లింగ్, జేమ్స్ నీషమ్‌లు సెంచరీలతో చెలరేగారు. దీంతో న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్‌ను 680 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది. ఆ తర్వాత కోహ్లి రెండో ఇన్నింగ్స్‌లో సెంచరీతో(105 పరుగులు) మెరిసినప్పటికి మ్యాచ్ డ్రాగా ముగిసింది. చదవండి: Lionel Messi: 'మెస్సీని చూసేందుకు 808 మేకలు'.. అద్బుతాన్ని చూసి తీరాల్సిందే -
యాదృచ్ఛికమో లేక విచిత్రమో.. ఈ ఇద్దరు టీమిండియా మాజీ పేసర్లు..!
జెంటిల్మెన్ గేమ్ క్రికెట్లో ఒకరితో ఒకరికి సరిపోలిన గణాంకాలు ఉండటం సర్వ సాధారణం. ఉదాహరణకు క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ సాధించిన కొన్ని రికార్డులను ప్రస్తుత టీమిండియా స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లి అచ్చం అదే తరహాలో సాధించడం మనం చూశాం. ఇలాంటి సరిపోలిన ఘటనలు క్రికెట్లో కోకొల్లలు. అయితే ఇప్పుడు మనం చూడబోయే సరిపోలిన గణాంకాలను మాత్రం క్రికెట్ అభిమానులు కనివినీ ఎరిగి ఉండరు. ఇద్దరు భారత బౌలర్లకు సంబంధించి ఒకేలా ఉన్న ఈ గణాంకాలు చూసి జనాలు నివ్వెరపోతున్నారు. కెరీర్లు మిగిసే నాటికి సేమ్ టు సేమ్ ఉన్న గణాంకాలు చూసి అభిమానులు అవాక్కవుతున్నారు. పేస్ బౌలర్లైన జహీర్ ఖాన్, ఇషాంత్ శర్మ.. తమతమ కెరీర్లలో ఒకేలా 311 టెస్ట్ వికెట్లు పడగొట్టారు. ఇద్దరు బౌలర్ల విషయంలో ఇలా జరగడం చాలా కామన్. అయితే ఇద్దరూ 11 సార్లు 5 వికెట్ల ఘనత, ఓసారి 10 వికెట్ల ఘనత సాధించి.. స్వదేశంలో 104 వికెట్లు, ఇతర దేశాల్లో 207 వికెట్లు పడగొట్టి ఉండటం మాత్రం విచిత్రమే. విండీస్‌తో రెండో టెస్ట్ సందర్భంగా జహీర్, ఇషాంత్ హిందీ కామెంట్రీ బాక్స్‌లో ఉండగా.. బ్రాడ్‌కాస్టర్ ఈ గణాంకాలను తెరపైకి తెచ్చాడు. ఇది చూసి జహీర్, ఇషాంత్‌లు సైతం ఆశ్చర్యపోయారు. తమకు కూడా తెలీని ఈ విషయం క్రికెట్ ప్రపంచానికి తెలియజేసినందుకు వారు బ్రాడ్‌కాస్టర్‌కు ధన్యవాదాలు తెలిపారు. ఈ విషయం సోషల్‌మీడియాలో వైరల్ కావడంతో.. ఇదెక్కడి విచిత్రం అని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ఇదిలా ఉంటే, విండీస్‌తో జరుగుతున్న రెండో టెస్ట్‌లో టీమిండియా పట్టుబిగించింది. ఈ మ్యాచ్‌లో టీమిండియా గెలవాలంటే ఆఖరి రోజు 8 వికెట్లు పడగొట్టాల్సి ఉంది. అదే విండీస్ గెలవాలంటే మరో 289 పరుగులు చేయాల్సి ఉంది. భారత బౌలర్లు ఉన్న ఊపును చూస్తే ఇది అంత ఆషామాషీ విషయం కాదని తెలుస్తోంది. ఇప్పటికే తొలి టెస్ట్ గెలిచిన భారత్ 2 మ్యాచ్‌ల సిరీస్‌లో 1-0 ఆధిక్యంలో నిలిచింది. రెండో మ్యాచ్ కూడా గెలిస్తే 2-0తో సిరీస్‌ను క్లీన్ స్వీప్ చేస్తుంది. -
కోహ్లి నెమ్మదిగా! సీనియర్ అయి ఉండి ఏం లాభం?: ఇషాంత్ శర్మ
West Indies vs India, 1st Test: టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి- పేసర్ ఇషాంత్ శర్మ మధ్య ఉన్న స్నేహబంధం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. భారత్ తరఫున ఇద్దరూ కలిసి దాదాపు వంద టెస్టులాడారు. అయితే, అంతకంటే ముందు ఢిల్లీ రంజీ జట్టుకు వీరిద్దరు ప్రాతినిథ్యం వహించారు. అప్పుడే వీరి మధ్య స్నేహం మొదలైంది. ఎవరికీ అందనంత ఎత్తులో దేశ రాజధానికి చెందిన ఈ ఇద్దరు ఆటగాళ్ల కెరీర్ చూసుకుంటే.. కోహ్లి భారత జట్టు సారథిగా ఎదగడం(ప్రస్తుతం కేవలం బ్యాటర్) సహా అంతర్జాతీయ స్థాయిలో ఏకంగా 75 శతకాలు బాది రన్‌మెషీన్ అన్న బిరుదును సార్థకం చేసుకుంటున్నాడు. సమకాలీన క్రికెటర్లలో ఎవరికీ సాధ్యంకాని రీతిలో అనేకానేక రికార్డులు సృష్టించి అందనంత ఎత్తులో ఉన్నాడు. కామెంటేటర్‌గా అవతారం మరోవైపు ఇషాంత్ శర్మ స్టార్ పేసర్‌గా ప్రశంసలు అందుకున్నా అతడి కెరీర్ ప్రస్తుతం నెమ్మదించింది. ఏడాదిన్నరకాలంగా జట్టులో చోటే కరువైంది. దీంతో అతడు కామెంటేటర్‌గా కొత్త అవతారమెత్తాడు. టీమిండియా- వెస్టిండీస్ 2023 సిరీస్ నేపథ్యంలో వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నాడు. ఈ క్రమంలో కోహ్లి గురించి ఇషాంత్ చేసిన వ్యాఖ్యలు నెట్టింట వైరల్‌గా మారాయి. కాగా వెస్టిండీస్‌తో తొలి టెస్టు రెండో రోజు ఆట ముగిసే సరికి కోహ్లి కేవలం 36 పరుగులు మాత్రమే చేసిన విషయం తెలిసిందే. తొలి బౌండరీ బాదడానికి 81 బంతులు తీసుకున్నాడు. ఇక కోహ్లి విదేశాల్లో టెస్టుల్లో సెంచరీ చేసి దాదాపు ఐదేళ్లకు పైగానే అయింది. సీనియర్ అయి ఉండి ఏం లాభమని ప్రశ్నిస్తారు! ఈ నేపథ్యంలో ఇషాంత్ జియో సినిమా షోలో మాట్లాడుతూ.. ‘‘సీనియర్ ప్లేయర్‌గా ఉన్న కారణంగా కచ్చితంగా మంచి స్కోరు చేయడం అత్యంత ముఖ్యం. లేదంటే ..‘‘సీనియర్ అయి ఉండి ఏం లాభం’’ అని ఒకానొక సందర్భంలో జూనియర్లు అడిగే అవకాశం ఉంటుంది. విరాట్ కోహ్లి కచ్చితంగా వీలైనన్ని ఎక్కువ పరుగులే రాబడతాడని నాకు తెలుసు. తన ప్రస్తుత మానసిక స్థితి, ఆ బ్యాటింగ్ తీరు చూస్తుంటే ఇట్టే ఈ విషయం అర్థమైపోతోంది’’ అని వ్యాఖ్యానించాడు. కాగా విండీస్‌తో మ్యాచ్‌లో అరంగేట్రం చేసిన ఓపెనర్ యశస్వి జైశ్వాల్, కెప్టెన్ రోహిత్ శర్మ సెంచరీలతో మెరువగా.. అదే పిచ్‌పై కోహ్లి కాస్త స్లోగా ఇన్నింగ్స్ ఆడటం అభిమానులను నిరాశకు గురిచేసింది. ఇక గురువారం నాటి రెండో రోజు ఆట ముగిసే సరికి యశస్వి 143, కోహ్లి 36 పరుగులతో క్రీజులో ఉన్న విషయం తెలిసిందే. చదవండి: సెంచరీతో చెలరేగి అరుదైన రికార్డు సాధించిన రోహిత్ శర్మ! ప్రపంచంలోనే.. Ind Vs WI: ఏరికోరి వచ్చావు! ఏమైందిపుడు? అప్పుడు కూడా ఇలాగే! మార్చుకో.. -
వెస్టిండీస్‌తో టెస్టు సిరీస్.. కామెంటేటర్‌గా టీమిండియా స్టార్ ఆటగాడు
టీమిండియా వెటరన్ పేసర్ ఇషాంత్ శర్మ సరికొత్త అవతరమెత్తున్నాడు. గత కొంత కాలంగా జాతీయ జట్టుకు దూరంగా ఉన్న ఇషాంత్.. కామెంటేటర్‌గా తన కొత్త జర్నీని ప్రారంభించనున్నాడు. వెస్టిండీస్‌తో జరగనున్న టెస్టు సిరీస్‌కు తొలి సారి కామెంటేటర్‌గా ఇషాంత్ శర్మ వ్యవహరించనున్నాడు. ఈ మెరకు జియో సినిమాతో ఇషాంత్ శర్మ ఒప్పందం కుదుర్చుకున్నాడు. ఈ విషయాన్ని జియో సినిమా సోమవారం దృవీకరించింది. గతంలో వెస్టిండీస్‌పై ఇషాంత్ సాధించిన 10 వికెట్ల హాల్‌ను హైలైట్ చేస్తూ ఓ వీడియోను జియో సినిమా ట్విటర్లో పోస్ట్ చేసింది. అదే విధంగా ఇషాంత్ తమ కామెంటరీ ప్యానెల్లో చేరడం చాలా సంతోషంగా ఉందని జియో సినిమా రాసుకొచ్చింది. కాగా ఈ వెటరన్ ఫాస్ట్ బౌలర్ హిందీలో తన వాఖ్యాన్ని అందించనున్నాడు. ఇక ఇషాంత్ శర్మ కొన్నాళ్లపాటు భారత జట్టులో కీలక సభ్యునిగా కొనసాగాడు. ముఖ్యంగా టెస్టు క్రికెట్లో భారత జట్టుకు తన సేవలను అందించాడు. టీమిండియా తరపున ఇప్పటివరకు 105 టెస్టులు, 80 వన్డేలు, 14 టీ20లు ఆడిన ఇషాంత్.. వరుసగా 311, 115, 8 వికెట్లు పడగొట్టాడు. ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ కొత్త సైకిల్లో భాగంగా జరగనున్న భారత్-విండీస్ టెస్టు సిరీస్ జూలై 12 నుంచి ప్రారంభం కానుంది. డొమినికా వేదికగా జరగనున్న తొలి టెస్టుకు ఇరు జట్లు అన్ని విధాల సిద్దమయ్యాయి. తొలి మ్యాచ్‌లో గెలిచి డబ్ల్యూటీసీ సైకిల్ 2023-25లో బోణీ కొట్టాలని ఇరు జట్లు భావిస్తున్నాయి. విండీస్‌తో టెస్టులకు భారత జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), శుబ్‌మన్ గిల్, రుతురాజ్ గైక్వాడ్, విరాట్ కోహ్లీ, యశస్వి జైస్వాల్, అజింక్య రహానే (వైస్ కెప్టెన్), కేఎస్ భరత్ (వికెట్), ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్, అక్షర్ పటేల్ , మహ్మద్ సిరాజ్, ముకేష్ కుమార్, జయదేవ్ ఉనాద్కట్, నవదీప్ సైనీ. చదవండి: IND vs WI: విండీస్‌లో కారు డ్రైవింగ్ చేసిన రోహిత్ శర్మ! ఫోటోలు వైరల్ Ishant Sharma, whose only 10-wicket haul in Tests came against the #WestIndies - will be in our comm box for India's upcoming series!🎙️#SabJawaabMilenge only on #JioCinema ✨#WIvIND | @ImIshant pic.twitter.com/gL0xNxnok1 — JioCinema (@JioCinema) July 9, 2023 -
ధోని అస్సలు కెప్టెన్ కూల్ కాదు.. బూతులు తిట్టేవాడు: టీమిండియా ప్లేయర్
కెప్టెన్ కూల్ అంటే మనకు టక్కున గుర్తు వచ్చేంది టీమిండియా మాజీ సారధి ఎంఎస్ ధోనినే. ప్రపంచక్రికెట్లో ఎంతో మంది యువ కెప్టెన్లకు ధోని ఆదర్శంగా నిలిచాడు. భారత్‌కు మూడు ఐసీసీ టైటిల్స్‌ను అందించిన ఘనత కూడా ధోనీదే. అయితే భారత వెటరన్ పేసర్ ఇషాంత్ శర్మ మాత్రం ధోని గురించి సంచలన వాఖ్యలు చేశాడు. ధోని అసలు కెప్టెన్ కూల్ కానే కాదని, ఫీల్డ్‌లో తరుచూ దుర్భాషలాడే వాడని ఇషాంత్ షాకింగ్ కామెంట్స్ చేశాడు. "మహీ భాయ్‌కి చాలా బలాలు ఉన్నాయి. కానీ వాటిలో కూల్ అండ్ కామ్ ఒకటి కాదు. అతడు మైదానంలో బూతులు తిట్టేవాడు. నేను కూడా ఓసారి విన్నాను. ధోనికి ఉన్న ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. భారత్ తరపున ఆడినప్పుడు ఐపీఎల్‌లోనైనా ఎవరో ఒకరు అతడి చూట్టూ ఉంటారు. ఓ ఊరి వాతావరణం కనిపిస్తుంది. చెట్లు మాత్రమే ఉండవు. ఓసారి నేను నా బౌలింగ్ కోటాను పూర్తి చేసుకున్నాను. మహీ భాయ్ నా వద్దకు వచ్చి నీవు అలిసిపోయావా? అని నన్ను అడిగాడు. నేను దానికి బదులుగా అవును నేను బాగా అలిసిపోయాను అని చెప్పా. అతడి దానికి సమాధానముగా నీకు వయస్సు పైబడుతుంది, రిటైర్ అయిపో అని అన్నాడు. నేను ధోని మాటలకు ఆశ్చర్యపోయా. అయితే నాపై మహీ భాయ్ ఎప్పుడూ ఆగ్రహం వ్యక్తం చేయలేదు. ఒక్కసారి మాత్రం ధోని వేసిన త్రోను సరిగ్గా అందుకోలేకపోయాను. మొదటిసారి కోపంగా చూశాడు. రెండోసారి మరింత బలంగా త్రో వేశాడు. అదీ కూడా పట్టుకోలేకపోయాడు. ఇక మూడో సారికి మాత్రం సీరియస్ అయ్యాడు. చేతిని బంతితో కొట్టుకోమని సైగలు చేశాడు అని" టీఆర్ఎస్ క్లిప్స్ యూట్యూబ్ ఛానెల్లో ఇషాంత్ చెప్పుకొచ్చాడు View this post on Instagram A post shared by Aryan Kumar Thakur(ब्राह्मण) (@aryankumarthakur16) చదవండి: Dhoni-Sakshi: 'నాకంటే వీడియో గేమ్స్ ఎక్కువయ్యాయా?' -
కోహ్లీ గురించి షాకింగ్ నిజాలు...బయటపెట్టిన ఇషాంత్
-
అండర్సన్ కంటే జహీర్ ఖాన్ బెస్ట్ బౌలర్: ఇషాంత్
భారత క్రికెట్లో మాజీ ఫాస్ట్ బౌలర్ జహీర్ ఖాన్‌కు ప్రత్యేక స్ధానం ఉంది. తన అద్భుత బౌలింగ్‌తో భారత జట్టుకు ఎన్నో చిరస్మరణీయ విజయాలు అందించాడు. ఈ రివర్స్ స్వింగ్ కింగ్ దాదాపు దశాబ్దం పాటు భారత క్రికెట్‌కు తన సేవలు అందించాడు. 2011 వన్డే ప్రపంచకప్‌లో 21 వికెట్లతో భారత్ విజయంలో కీలక పాత్ర పోషించిన జాక్... అన్ని ఫార్మాట్లలో కలిపి 610 వికెట్లు తీసుకున్నాడు. అయితే మరోసారి ఈ దిగ్గజ పేసర్‌పై టీమిండియా వెటరన్ ఫాస్ట్ బౌలర్ ఇషాంత్ శర్మ ప్రశంసల వర్షం కురిపించాడు. తాజాగా రణ్వీర్ అల్లాబాడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఇషాంత్‌కు ఊహించని ప్రశ్న ఎదురైంది. ఇంగ్లండ్ స్టార్ పేసర్ జేమ్స్ అండర్సన్, జహీర్ ఖాన్‌లో ఎవరు అత్యుత్తమ బౌలర్ అని రణ్వీర్ ప్రశ్నించాడు. అందుకు బదులుగా ఇషాంత్ ఏమీ ఆలోచింకుండా అండర్సన్ కంటే జహీర్ గొప్ప బౌలర్‌ను అని చెప్పుకొచ్చాడు. కాగా అండర్సన్ కూడా ప్రపంచ అత్యుత్తమ బౌలర్లలో ఒకడు. తన కెరీర్లో ఇప్పటి వరకు 180 టెస్టులు, 194 వన్డేలు ఆడిన అండర్సన్ వరుసగా 269, 686 వికెట్లు పడగొట్టాడు. అతడి టెస్టు కెరీర్లో ఏకంగా 32 ఫైవ్ వికెట్ల హాల్స్ ఉన్నాయి. "జిమ్మీ అండర్సన్ బౌలింగ్ శైలి కాస్త బిన్నంగా ఉంటుంది. అతడు టాప్ క్లాస్ బౌలర్ అనడంలో ఎటువంటి సందేహం లేదు. కానీ అతడు ఎక్కువ భాగం తన కెరీర్లో ఇంగ్లండ్‌లోనే ఆడాడు. ఇంగ్లండ్ పిచ్‌లకు పేసర్లు అనుకూలిస్తాయి, అదే భారత్‌లో ఆడి వుంటే పరిస్థితి మరో విధంగా ఉండేది. నా వరకు అయితే అండర్సన్ కంటే జాక్(జహీర్ ఖాన్) బెస్ట్ బౌలర్" అని ఇషాంత్ పేర్కొన్నాడు. చదవండి: IND vs WI: వెస్టిండీస్ టూర్‌కు ముందు చాహల్ కీలక నిర్ణయం.. మరో లీగ్‌లో ఆడేందుకు! -
టీమిండియా భవిష్యత్తు స్పీడ్ గన్ అతడే..!
టీమిండియా వెటరన్ పేసర్ ఇషాంత్ శర్మ.. భారత టెస్ట్ జట్టు భవిష్యత్తు స్టార్ పేసర్లుగా ముగ్గురు పేర్లను ప్రకటించాడు. ముకేశ్ కుమార్, అర్షదీప్ సింగ్, ఉమ్రాన్ మాలిక్‌లు మున్ముందు టీమిండియా టెస్ట్ బౌలర్లు స్థిరపడతారని అభిప్రాయపడ్డాడు. ఈ ముగ్గురిని సాన పడితే టీమిండియా తరఫున అద్భుతాలు చేస్తారని ఆశాభావం వ్యక్తం చేశాడు. వీరిలో ముకేశ్ కుమార్‌పై మరింత ఫోకస్ పెడితే ప్రపంచంలోకెళ్లా మేటి బౌలర్‌గా అవతరిస్తాడని జోస్యం చెప్పాడు. ముకేశ్ కుమార్‌కు సరైన గైడెన్స్ ఇస్తే అతను ఏం చేయగలడో గమనించానని చెప్పిన ఇషాంత్.. తన ఢిల్లీ క్యాపటిల్స్ సహచర బౌలర్‌పై ప్రశంసల వర్షం కురిపించాడు. ముకేశ్ లాంటి అతి సాధారణ వ్యక్తిని తాను చూడలేదని, అతనిని ఫలానా డెలివరీ వేయమని అడిగితే, ఖచ్చితంగా అది వేయగల సమర్ధత అతని దగ్గరుందని అన్నాడు. ఒత్తిడిలో సైతం ముకేశ్ అద్భుతంగా బౌలింగ్ చేస్తాడని, అలాంటి సమయాల్లో అతను బంతిని నియంత్రణలో ఉంచుకోగలడని తెలిపాడు. ఉమ్రాన్, అర్షదీప్‌ల విషయానికొస్తే.. వీరిని కొద్దిగా సానబడితే చాలా కాలం పాటు టీమిండియాకు సేవలందించగలరని చెప్పుకొచ్చాడు. ముఖ్యంగా ఈ ముగ్గురిని టెస్ట్ క్రికెట్ కోసం ప్రిపేర్ చేస్తే భారత పేస్ దళానికి మరో ఐదారేళ్ల పాటు ఢోకా ఉండదని అన్నాడు. ఈ విషయాలన్నిటినీ ఇషాంత్ రణ్వీర్ అలహాబాదియా యూట్యూబ్ పోడ్కాస్ట్లో విశ్లేషించాడు. ఇదిలా ఉంటే, త్వరలో జరుగనున్న వెస్టిండీస్ సిరీస్ కోసం ఎంపిక చేసిన భారత టెస్ట్, వన్డే జట్లలో ముకేశ్ కుమార్, ఉమ్రాన్ మాలిక్‌లకు చోటు దక్కించుకున్నారు. ఉమ్రాన్ కేవలం వన్డే జట్టుకు ఎంపిక కాగా.. ముకేశ్ కుమార్ రెండు జట్లలో చోటు దక్కించుకున్నాడు. సెలెక్టర్లు మహ్మద్ షమీకి రెస్ట్ ఇచ్చి మరీ ముకేశ్ కుమార్‌కు అవకాశం ఇచ్చారు. విండీస్ పర్యటనలో మహ్మద్ సిరాజ్ ఆధ్వర్యంలో జయదేవ్ ఉనద్కత్, శార్దూల్ ఠాకూర్, నవ్‌దీప్ సైనీలతో కూడిన టెస్ట్ జట్టులో ముకేశ్ సభ్యుడిగా ఉన్నాడు. -
అప్పుడు కోహ్లికి 17 ఏళ్లు.. ఒంటరిగా వెళ్లి చాలా బాధపడ్డాడు! అదే నేను అయితే: ఇషాంత్
టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లి తన కెరీర్లో ఎన్నో ఒడదుడుకలను ఎదుర్కొన్న సంగతి తెలిసిందే. కోహ్లికి తన వ్యక్తిగత జీవితం కంటే ఆటకే ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తాడు. తన కెరీర్ ఆరంభరోజుల్లో జరిగిన ఓ సంఘటనే ఇందుకు ఉదహరణగా నిలుస్తుంది. 2006 డిసెంబర్ 18 కోహ్లికి తన జీవితంలో ఎన్నటికీ మర్చిపోలేని రోజు. ఆ రోజు ఢిల్లీ తరఫున కర్ణాటకతో రంజీ మ్యాచ్ ఆడుతున్న సందర్భంలో తన తండ్రి ప్రేమ్ కోహ్లీ గుండెపోటుతో మరణించాడు. ఈ వార్త విన్న కోహ్లి బాధను దిగమింగుకొని 90 పరుగులు చేసి ఢిల్లీని ఫాలోఆన్ గండం నుండి గట్టెక్కించాడు. మ్యాచ్ ముగిసిన తర్వాత తండ్రి అంత్యక్రియల్లో పాల్గొన్నాడు. ఇది ఒక్కటి చాలు కోహ్లికి ఆటపై ఉన్న నిబద్దత ఎంటో తెలపడానికి. ఇక కోహ్లి జీవితంలో చోటు చోసుకున్న ఈ విషాద సంఘటనను టీమిండియా వెటరన్ పేసర్ ఇషాంత్ శర్మ మరోసారి గుర్తుచేశాడు. తన తండ్రి మరణ వార్త విన్న కోహ్లి ఒంటరిగా ఓవైపుకు వెళ్లి చాలా బాధపడ్డాడని ఇషాంత్ తెలిపాడు. కాగా వీరిద్దరూ కలిసి దేశీవాళీ క్రికెట్లో ఢిల్లీ తరపున ఆడారు. ఓ జాతీయ మీడియా ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఇషాంత్ శర్మ మాట్లాడుతూ.. "విరాట్ కోహ్లి తన తండ్రి మరణించిన రోజు ఒంటరిగా చాలా బాధపడ్డాడు. అయినప్పటికీ కోహ్లి తన బాధను దిగమింగుకుని కీలక ఇన్నింగ్స్ ఆడాడు. ఆ అటువంటి కష్టసమయంలో అంత దుఃఖన్ని తట్టుకుని ఎలా ఆడాడో ఇప్పటివరకు నాకు అర్ధం కాలేదు. సమయంలో అతడికి కేవలం 17 ఏళ్ల వయస్సు మాత్రమే. అదే నాకు అలా జరిగి ఉంటే తట్టుకోలేకపోయేవాడిని అని అతడు చెప్పుకొచ్చాడు. చదవండి: World Cup 2023: వన్డే ప్రపంచకప్‌కు సంబంధించి ఐసీసీ కీలక అప్డేట్ -
ఐపీఎల్ 2023లో అతి పెద్ద సర్ప్రైజ్ ఎవరు..?
ఐపీఎల్ 2023 సీజన్లో కొందరు వెటరన్లు అనూహ్యంగా సత్తా చాటారు. వీరిలో చాలా మంది తమ గతానికి భిన్నంగా రాణించి, అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తారు. కొందరు తమ సహజ శైలికి భిన్నంగా రెచ్చిపోతే.. మరికొందరు తమ యుక్త వయసులో కూడా ప్రదర్శించని దూకుడును ప్రదర్శించి తమ జట్ల విజయాల్లో ప్రధాన పాత్ర పోషించారు. లేటు వయసులో కూడా ఏమాత్రం తగ్గకుండా అద్భుత ప్రదర్శనలు చేసిన ఆ ఆటగాళ్లపై ఓ లుక్కేద్దాం. ఈ జాబితాలో ముందుంగా చెప్పుకోవాల్సింది గుజరాత్ పేసర్ మోహిత్ శర్మ పేరు. సరైన అవకాశాలు రాక, చాలాకాలంగా టీమిండియాతో పాటు ఐపీఎల్‌కు కూడా దూరంగా ఉండిన 34 ఏళ్ల మోహిత్‌ను ఈ ఏడాది వేలంలో గుజరాత్ టైటాన్స్ నామమాత్రపు 50 లక్షల ధరకు సొంతం చేసుకుంది. ఈ రైట్ ఆర్మ్ పేసర్ అందరి అంచనాలను తలకిందులు చేస్తూ, ఈ సీజన్లో ఊహించిన దానికి మించి రాణిస్తున్నాడు. 13 మ్యాచ్‌ల్లో 24 వికెట్లు పడగొట్టి సత్తా చాటాడు. ముంబైతో జరిగిన క్వాలిఫయర్-2లో అయితే ఆకాశమే హద్దుగా చెలరేగి కెరీర్ అత్యుత్తమ గణాంకాలు (5/10) నమోదు చేశాడు. ఈ సీజన్‌కు ఇతనే అతి పెద్ద సర్ప్రైజ్ అని చెప్పవచ్చు. ఆ తర్వాత అజింక్య రహానే.. 35 ఏళ్ల ఈ వెటరన్ బ్యాటర్‌ను సీఎస్కే ఈ ఏడాది వేలంలో కనీస ధర 50 లక్షలకు సొంతం చేసుకుంది. రహానే.. తనకు సరైన అవకాశాలు రావడం లేదన్న కసితో ఆడాడో ఏమో కానీ, అతని శైలికి భిన్నంగా రెచ్చిపోయి మెరుపు ఇన్నింగ్స్‌లు ఆడి చెన్నై విజయాల్లో కీలకపాత్ర పోషించాడు. రహానే ఈ సీజన్లో 13 మ్యాచ్‌లు ఆడి 169.89 స్ట్రయిక్ రేట్‌తో 2 అర్ధసెంచరీల సాయంతో 299 పరుగులు చేశాడు. ఈ ప్రదర్శన కారణంగా అతను టీమిండియాలో కూడా చోటు దక్కించుకున్నాడు. పియుశ్ చావ్లా.. 35 ఏళ్ల ఈ వెటరన్ స్పిన్నర్‌ను ఈ ఏడాది వేలంలో ముంబై ఇండియన్స్ 50 లక్షలకు సొంతం చేసుకుంది. అంతా అయిపోయిందనుకున్న దశలో ఐపీఎల్‌లోకి రీ ఎంట్రీ ఇచ్చిన పియుశ్.. అంచనాలకు మించి రాణించి, తన 15 ఏళ్ల ఐపీఎల్ కెరీర్లో ఎన్నడూ లేని విధంగా 16 మ్యాచ్‌ల్లో 22 వికెట్లు పడగొట్టి, ముంబై క్వాలిఫయర్-2 దశ వరకు చేరడంలో ప్రధాన పాత్ర పోషించాడు. ఈ క్రమంలో అతను ఐపీఎల్లో అత్యధిక వికెట్లు (179) సాధించిన ఆటగాళ్ల జాబితాలో మూడో స్థానానికి ఎగబాకాడు. వీరి తర్వాత చెప్పుకోదగ్గ ప్రదర్శనలు చేసిన వెటరన్లలో ఇషాంత్ శర్మ ఉన్నాడు. 35 ఏళ్ల ఈ వెటరన్ పేసర్‌ను ఈ ఏడాది వేలంలో ఢిల్లీ క్యాపిటల్స్ 50 లక్షలకు సొంతం చేసుకుంది. గత కొంతకాలంగా క్రికెట్‌కు పూర్తిగా దూరంగా ఉంటున్న ఇషాంత్.. ఈ సీజన్లో అనూహ్యంగా సత్తా చాటాడు. 8 మ్యాచ్‌ల్లో 10 వికెట్లు పడగొట్టి, ఓ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు సైతం సొంతం చేసుకున్నాడు. ఇషాంత్ కూడా ఈ ఏడాది సర్ప్రైజ్ ఇచ్చిన ప్లేయరే అని చెప్పాలి. పై నలుగురు కాక ఈ ఐపీఎల్ సీజన్లో సర్ప్రైజ్ ప్లేయర్స్ జాబితాలో మరో ముగ్గురు వెటరన్లు ఉన్నారు. గుజరాత్.. విజయ్ శంకర్ (32 ఏళ్లు , 1.4 కోట్లు) (13 మ్యాచ్‌ల్లో 160.11 స్ట్రయిక్ రేట్‌తో 3 అర్ధ సెంచరీల సాయంతో 301 పరుగులు), రాజస్థాన్ రాయల్స్ సందీప్ శర్మ (12 మ్యాచ్‌ల్లో 10 వికెట్లు), లక్నో అమిత్ మిశ్రా (41 ఏళ్లు, 50 లక్షలు) (7 మ్యాచ్‌ల్లో 7 వికెట్లు). వీరు సైతం ఏ మాత్రం అంచనాలు లేకుండా బరిలోకి దిగి అందరిని ఆశ్చర్యపరిచారు. ఇక్కడ మరో ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే.. పై పేర్కొన్న ఆటగాళ్లలో దాదాపుగా అందరూ 50 లక్షల ధరకు, వివిధ జట్ల పంచన చేరిన వారే. మరి, మిమ్మల్ని ఈ ఏడాది అధికంగా సర్ప్రైజ్ చేసిన వెటరన్ ఆటగాడెవరో కామెంట్ రూపంలో తెలియజేయండి. చదవండి: కీలక మ్యాచ్‌ల్లో రోహిత్ రాణించడం ఎప్పుడు చూడలేదు.. అతనో ఫెయిల్యూర్...! -
లేటు వయసులో ఇరగదీస్తున్న భారత ఆటగాళ్లు.. ముఖ్యంగా నలుగురు 'శర్మ'లు
ఐపీఎల్-2023లో భారత వెటరన్ ఆటగాళ్లు కుర్రాళ్లతో పోటీపడి మరీ సత్తా చాటుతున్నారు. లేటు వయసులో వీరు అదిరిపోయే ప్రదర్శనలతో ఇరగదీస్తున్నారు. ముఖ్యంగా వయసు పైబడిన రిత్యా సరైన అవకాశాలు లేక చాలాకాలంగా క్రికెట్‌కు దూరంగా ఉన్న బౌలర్లు ఆకాశమే హద్దుగా చెలరేగిపోతున్నారు. వీరి పెర్ఫార్మెన్స్కు ఫ్యాన్స్‌కు ముగ్దులవుతున్నారు. అవకాశాలు లేవన్న కసితో బౌలింగ్ చేస్తున్న ఈ వెటరన్లు తమ కెరీర్లు పీక్స్‌లో ఉండగా చేయని అద్భుతాలు ఇప్పుడు చేసి చూపిస్తున్నారు. ముఖ్యంగా నలుగరు 'శర్మ'లు తమతమ జట్ల విజయాల్లో కీలకపాత్ర పోషిస్తున్నారు. బౌలర్లతో పాటు భారత వెటరన్ బ్యాటర్లు సైతం సత్తా చాటుతున్నారు. వీరు కూడా జాతీయ జట్టుకు ఆడే అవకాశాలు లేవన్న కసితోనే తమలోని అత్యుత్తమ ప్రదర్శనను వెలికి తీస్తున్నారు. ప్రస్తుత సీజన్లో ప్రదర్శన కారణంగానే రహానే ఏకంగా జాతీయ జట్టును నుంచి పిలుపునందుకుని జాక్‌పాట్ కొట్టేశాడు. వీరు ఈ సీజన్లో మన్ముందు మరెన్ని అద్భుతాలు చేస్తారో వేచి చూడాలి. ఐపీఎల్-2023లో రఫ్ఫాడిస్తున్న భారత వెటరన్ బౌలర్లు.. ఇషాంత్ శర్మ (ఢిల్లీ, 4 మ్యాచ్‌ల్లో 6 వికెట్లు) 34 yrs కర్ణ్ శర్మ (ఆర్సీబీ, 4 మ్యాచ్‌ల్లో 7 వికెట్లు) 35 yrs మోహిత్ శర్మ (గుజరాత్, 6 మ్యాచ్‌ల్లో 8 వికెట్లు) 34 yrs సందీప్ శర్మ (రాజస్థాన్, 7 మ్యాచ్‌ల్లో 8 వికెట్లు) 30 yrs అమిత్ మిశ్రా (లక్నో, 6 మ్యాచ్‌ల్లో 6 వికెట్లు) 40 yrs పియూశ్ చావ్లా (ముంబై, 8 మ్యాచ్‌ల్లో 13 వికెట్లు) 34 yrs అశ్విన్ (రాజస్థాన్, 9 మ్యాచ్‌ల్లో 13 వికెట్లు) 36 yrs ఐపీఎల్-2023లో రెచ్చిపోతున్న భారత వెటరన్ బ్యాటర్లు.. శిఖర్ ధవన్ (పంజాబ్, 6 మ్యాచ్‌ల్లో 148.86 స్ట్రయిక్ రేట్‌తో 65.50 సగటున 262 పరుగులు) 37 yrs అజింక్య రహానే (చెన్నై, 7 మ్యాచ్‌ల్లో 189.83 స్ట్రయిక్ రేట్‌తో 44.80 సగటున 224 పరుగులు) 34 yrs -
IPL 2023: ఇలాంటి బంతిని ఎప్పుడూ చూడలేదే..!
గుజరాత్ టైటాన్స్‌తో నిన్న (మే 2) జరిగిన ఉత్కంఠ సమరంలో అద్భుతమైన బౌలింగ్ ప్రదర్శనతో గెలవదనుకున్న తన జట్టును విజయతీరాలకు చేర్చిన ఢిల్లీ క్యాపిటల్స్ వెటరన్ పేసర్ ఇషాంత్ శర్మపై దిగ్గజ ఫాస్ట్ బౌలర్ డేల్ స్టెయిన్ ప్రశంసల వర్షం కురిపించాడు. 700 రోజుల తర్వాత ఐపీఎల్‌లోకి రీఎంట్రీ ఇచ్చిన 34 ఏళ్ల ఇషాంత్ శర్మ, కుర్ర బౌలర్లా రెచ్చిపోతున్నాడని.. ఈ మ్యాచ్‌లో అతను విజయ్ శంకర్‌ను క్లీన్ బౌల్డ్ చేసినటువంటి నకుల్ బంతిని (స్లో డెలివరి) తానెప్పుడూ చూడలేదని, క్రికెట్ చరిత్రలో బహుశా ఇదే అత్యుత్తమ నకుల్ బంతి అయ్యుంటుందని కొనియాడాడు. భీకర ఫామ్‌లో ఉన్నటువంటి విజయ్ శంకర్‌ను ఇషాంత్ అద్భుతమైన బంతితో తెలివిగా బోల్తా కొట్టించాడని, ఊహించని రీతిలో బంతి వికెట్లను తాకడంతో విజయ్ శంకర్ ఫ్యూజులు ఎగిరిపోయి ఉంటాయని అన్నాడు. కాగా, ఈ మ్యాచ్‌లో 4 ఓవర్లలో 23 పరుగులు మాత్రమే ఇచ్చి కీలక సమయంలో 2 వికెట్లు పడగొట్టిన ఇషాంత్.. ఆఖరి ఓవర్లో అత్యద్భుతంగా బౌలింగ్ చేసి, ప్రత్యర్ధిని గెలవనీయకుండా చేశాడు. Deception at its best! 👊🏻 What a ball that from @ImIshant 🔥🔥#GT have lost four wickets now and this is turning out to be a tricky chase! Follow the match ▶️ https://t.co/VQGP7wSZAj #TATAIPL | #GTvDC pic.twitter.com/j7IlC7vf0X — IndianPremierLeague (@IPL) May 2, 2023 ఆఖరి ఓవర్లో గుజరాత్ గెలుపుకు 12 పరుగులు అవసరం కాగా.. ఇషాంత్ కేవలం 6 మాత్రమే ఇచ్చి గుజరాత్ నోటి దాకా వచ్చిన విజయాన్ని లాగేసుకున్నాడు. ప్రస్తుత సీజన్లో 4 మ్యాచ్‌ల్లో 6 వికెట్లు పడగొట్టిన ఇషాంత్.. ఢిల్లీ వేదికగా కేకేఆర్‌తో జరిగిన మ్యాచ్‌లో 4 ఓవర్లలో 2 వికెట్లు (19 పరుగులిచ్చి) పడగొట్టి మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు గెలుచుకున్నాడు. ఇదిలా ఉంటే, నిన్న ఢిల్లీతో జరిగిన లో స్కోరింగ్ గేమ్‌లో గుజరాత్ టైటాన్స్ సొంతగడ్డపై 5 పరుగుల తేడాతో ఓడింది. ఇషాంత్ శర్మ (2/23) ఆఖరి ఓవర్ అద్భుతంగా బౌల్ చేసి ఢిల్లీని గెలిపించాడు. తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ..అమన్ హకీమ్ (44 బంతుల్లో 51; 3 ఫోర్లు, 3 సిక్సర్లు), రిపాల్ పటేల్ (13 బంతుల్లో 23; 2 ఫోర్లు, 1 సిక్స్) రాణించడంతో 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 130 పరుగులు చేయగా.. గుజరాత్ 20 ఓవర్లలో 6 వికెట్లకు 125 పరుగులు చేసి ఓటమిపాలైంది. గుజరాత్ తరఫున ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ షమీ (4/11) అదరగొట్టాడు. బ్యాటింగ్‌లో హార్దిక్ పాండ్యా (53 బంతుల్లో 59 నాటౌట్; 7 ఫోర్లు) అర్ధసెంచరీ రాణించినపట్పికీ తన జట్టును గెలిపించలేకపోయాడు. -
ఢిల్లీని గట్టెక్కించిన ఇషాంత్
అహ్మదాబాద్: తక్కువ స్కోర్లేగా... తుక్కుతుక్కు కింద కొట్టేస్తామంటే కుదరదు! ఎందుకంటే ఈ సీజన్లో తక్కువ స్కోర్ల మ్యాచ్‌లే ఆఖర్లో ఎక్కువ ఉత్కంఠ రేపుతున్నాయి. అలాంటి రసవత్తర పోరులో ఢిల్లీని ఆఖరి ఓవర్‌తో ఇషాంత్ శర్మ (2/23)) గెలిపించాడు. దీంతో డిఫెండింగ్ చాంపియన్ గుజరాత్ టైటాన్స్ సొంతగడ్డపై 5 పరుగుల తేడాతో ఓడింది. ముందుగా ఢిల్లీ క్యాపిటల్స్ 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 130 పరుగులు చేసింది. అమన్ హకీమ్ (44 బంతుల్లో 51; 3 ఫోర్లు, 3 సిక్సర్లు) రాణించగా, రిపాల్ పటేల్ (13 బంతుల్లో 23; 2 ఫోర్లు, 1 సిక్స్) వేగంగా ఆడాడు. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ షమీ (4/11) అదరగొట్టాడు. తర్వాత గుజరాత్ 20 ఓవర్లలో 6 వికెట్లకు 125 పరుగులు చేసి ఓడింది. హార్దిక్ పాండ్యా (53 బంతుల్లో 59 నాటౌట్; 7 ఫోర్లు) అర్ధసెంచరీ సాధించాడు. షమీ నిప్పులు చెరగడంతో... వెటరన్ సీమర్ షమీ నిప్పులు చెరగడంతో ఢిల్లీ బ్యాటర్లు హడలెత్తారు. ఒకదశలో 5 ఓవర్లకే 23 పరుగుల వద్ద సగం వికెట్లు కూలడంతో ఢిల్లీ 10, 12 ఓవర్లయినా ఆడుతుందా అనే సందేహం కలిగింది. అంతలా అతని పేస్ పదును క్యాపిటల్స్‌ను దెబ్బ తీసింది. ఇన్నింగ్స్ తొలి బంతికే సాల్ట్ (0)ను డకౌట్ చేసిన షమీ తన వరుస ఓవర్లలో రోసో (8), మనీశ్ పాండే (1), ప్రియమ్ గార్గ్ (10)లను అవుట్ చేశాడు. ఈ దశలో ఢిల్లీని అమన్ హకీమ్, అక్షర్ పటేల్ (30 బంతుల్లో 27; 2 ఫోర్లు, 1 సిక్స్) ఆదుకున్నారు. అక్షర్ అవుటయ్యాక అమన్ నిలకడగా ఆడి అర్ధసెంచరీ సాధించడంతో ఢిల్లీ వంద పైచిలుకు స్కోరు చేసింది. పాండ్యా ఆఖరిదాకా ఉన్నా... అచ్చూ ఢిల్లీలాగే... టైటాన్స్ కూడా ప్రధాన బ్యాటర్లు సాహా (0), గిల్ (6), విజయ్ శంకర్ (6), మిల్లర్ (0)లను ఆరంభంలోనే కోల్పోయింది. 32/4 స్కోరుతో కష్టాల్లో ఉన్న గుజరాత్‌ను మనోహర్ (33 బంతుల్లో 26; 1 సిక్స్) అండతో కెప్టెన్ హార్దిక్ పాండ్యా నిలబెట్టాడు. కానీ ఢిల్లీ కట్టుదిట్టమైన బౌలింగ్‌తో గుజరాత్‌కు 12 బంతుల్లో 33 పరుగుల సమీకరణం కష్టమైంది. అయితే 19వ ఓవర్లో తెవాటియా (7 బంతుల్లో 20; 3 సిక్సర్లు) హ్యాట్రిక్ సిక్సర్లు గుజరాత్‌ను విజయం వైపునకు తీసుకెళ్లాయి. 6 బంతులకు 12 పరుగులు కావాల్సి ఉండగా... ఇషాంత్ ప్రమాదకరమైన తెవాటియాను అవుట్ చేసి 6 పరుగులే ఇవ్వడంతో ఢిల్లీకి పోయిన ప్రాణం తిరిగొచ్చింది. స్కోరు వివరాలు ఢిల్లీ క్యాపిటల్స్ ఇన్నింగ్స్: సాల్ట్ (సి) మిల్లర్ (బి) షమీ 0; వార్నర్ (రనౌట్) 2; ప్రియమ్ (సి) సాహా (బి) షమీ 10; రోసో (సి) సాహా (బి) షమీ 8; పాండే (సి) సాహా (బి) షమీ 1; అక్షర్ (సి) రషీద్ (బి) మోహిత్ 27; అమన్ హకీమ్ (సి) మనోహర్ (బి) రషీద్ 51; రిపాల్ (సి) పాండ్యా (బి) మోహిత్ 23; నోర్జే (నాటౌట్) 3; కుల్దీప్ (నాటౌట్) 0; ఎక్స్‌ట్రాలు 5; మొత్తం ( 20 ఓవర్లలో 8 వికెట్లకు) 130. వికెట్ల పతనం: 1–0, 2–6, 3–16, 4–22, 4–23, 6–73, 7–126, 8–130. బౌలింగ్: షమీ 4–0–11–4, హార్దిక్ 1–0–10–0, జోష్ లిటిల్ 3–0–27–0, రషీద్ 4–0–28–1, నూర్ అహ్మద్ 4–0–20–0, మోహిత్ శర్మ 4–0–33–2. గుజరాత్ టైటాన్స్ ఇన్నింగ్స్: వృద్ధిమాన్ సాహా (సి) సాల్ట్ (బి) ఖలీల్ అహ్మద్ 0; శుబ్‌మన్ గిల్ (సి) మనీశ్ పాండే (బి) నోర్జే 6; హార్దిక్ పాండ్యా (నాటౌట్) 59; విజయ్ శంకర్ (బి) ఇషాంత్ శర్మ 6; డేవిడ్ మిల్లర్ (బి) కుల్దీప్ యాదవ్ 0; అభినవ్ మనోహర్ (సి) అమన్ (బి) ఖలీల్ అహ్మద్ 26; తెవాటియా (సి) రోసో (బి) ఇషాంత్ శర్మ 20; రషీద్ ఖాన్ (నాటౌట్) 3; ఎక్స్‌ట్రాలు 5; మొత్తం (20 ఓవర్లలో 6 వికెట్లకు) 125. వికెట్ల పతనం: 1–0, 2–18, 3–26, 4–32, 5–94, 6–122. బౌలింగ్: ఖలీల్ అహ్మద్ 4–1–24–2, ఇషాంత్ శర్మ 4–0–23–2, నోర్జే 4–0–39–1, కుల్దీప్ యాదవ్ 4–0–15–1, అక్షర్ పటేల్ 4–0–24–0. ఐపీఎల్లో నేడు లక్నో VS చెన్నై (మధ్యాహ్నం గం. 3:30 నుంచి) పంజాబ్ VS ముంబై (రాత్రి గం. 7:30 నుంచి) స్టార్ స్పోర్ట్స్, జియో సినిమాలో ప్రత్యక్ష ప్రసారం -
అనుభవం ముందు సిక్సర్ల తెవాటియా పనికిరాలేదు
ఐపీఎల్ 16వ సీజన్లో గుజరాత్ టైటాన్స్ తరపున రాహుల్ తెవాటియా సూపర్ ఫినిషర్‌గా పేరు తెచ్చుకున్నాడు. ఎక్కువ మ్యాచ్‌ల్లో ఆఖర్లో బ్యాటింగ్ వచ్చి సిక్సర్లతో విధ్వంసం సృష్టిస్తూ సిక్సర్ల తెవాటియాగా పేరు తెచ్చుకున్నాడు. అయితే తాజాగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో మ్యాచ్‌లో సిక్సర్ల తెవాటియా ఇషాంత్ అనుభవం ముందు తలవంచాల్సి వచ్చింది. అభినవ్ మనోహర్ ఔటైన తర్వాత క్రీజులోకి వచ్చిన తెవాటియా ఇన్నింగ్స్ 19వ ఓవర్లో నోర్ట్జేకు చుక్కలు చూపించాడు. హ్యాట్రిక్ సిక్సర్లు బాది ఢిల్లీ క్యాపిటల్స్ నుంచి మ్యాచ్‌ను దాదాపు లాగేసుకున్నంత పని చేశాడు. ఇక చివరి ఓవర్లో గుజరాత్ టైటాన్స్ విజయానికి 12 పరుగులు అవసరమైన దశలో ఇషాంత్ శర్మ అద్బుతంగా బౌలింగ్ వేశాడు. ఒత్తిడిలో సూపర్‌గా బౌలింగ్ చేసిన ఇషాంత్ ఇన్నేళ్ల అనుభవాన్ని చూపించాడు. Photo: IPL Twitter తొలి బంతికి హార్దిక్ పాండ్యా రెండు పరుగులు తీశాడు. ఆ తర్వాత బంతికి సింగిల్ తీయడంతో తెవాటియా మరోసారి స్ట్రైక్‌లోకి వచ్చాడు. ఇక మ్యాచ్ గుజరాత్‌దే అని అంతా భావించారు. కానీ ఇక్కడే ఇషాంత్ బౌలింగ్‌లో తన అనుభవాన్ని చూపించాడు. మూడో బంతిని తెలివిగా ఆన్ది లైన్ వేయడంతో డాల్బాల్ వచ్చింది. ఇక నాలుగో బంతిని తెవాటియా ఎక్స్ట్రా కవర్స్ మీదుగా భారీ షాట్ ఆడాలనుకున్నాడు. కానీ ఇషాంత్ అనుభవం ముందు సిక్సర్ల తెవాటియా పనికి రాలేదు. బౌన్స్ అయిన బంతి బ్యాట్ ఎడ్జ్ తాకి గాల్లోకి లేచింది. రిలీ రొసౌ పొరపాటు చేయకుండా క్యాచ్ తీసుకోవడంతో తెవాటియా వెనుదిరిగాడు. ఈ సమయంలో పాండ్యాఇచ్చిన ఎక్స్ప్రెషన్ ఆసక్తి కలిగించింది. ఆ తర్వాత రెండు బంతుల్లో 9 పరుగులు కావాల్సిన దశలో మూడు పరుగులే తీయడంతో ఢిల్లీ క్యాపిటల్స్ ఐదు పరుగుల తేడాతో విజయాన్ని అందుకుంది. Ishant Sharma the champion - Delhi Capitals defended 130 at GT's home ground. What a bowling effort! pic.twitter.com/rWsTdbzoIE — Mufaddal Vohra (@mufaddal_vohra) May 2, 2023 చదవండి: ఏడో నెంబర్లో వచ్చి అదరగొట్టాడు.. ఎవరీ అమన్ హకీమ్ ఖాన్? -
#Ishant Sharma: 717 రోజుల తర్వాత ఎంట్రీ.. అదరగొట్టాడు
టీమిండియా వెటరన్ పేసర్ ఇషాంత్ శర్మ ఐపీఎల్ రీఎంట్రీని ఘనంగా ఆరంభించాడు. దాదాపు 717 రోజుల తర్వాత ఐపీఎల్ మ్యాచ్ ఆడిన ఇషాంత్ ఆకట్టుకున్నాడు. గురువారం కేకేఆర్‌తో జరిగిన మ్యాచ్‌లో 4 ఓవర్లు బౌలింగ్ చేసిన ఇషాంత్ 19 పరగులిచ్చి రెండు కీలక వికెట్లు తీశాడు. కాగా ఈ ఏడాది జరిగిన మినీ వేలంలో ఢిల్లీ క్యాపిటల్స్ ఇషాంత్ శర్మను రూ.50 లక్షలకు దక్కించుకుంది. ఇక 2021లో చివరిసారి ఐపీఎల్లో ఢిల్లీ క్యాపిటల్స్ తరపున మ్యాచ్ ఆడిన ఇషాంత్ ఆ సీజన్లో మూడు మ్యాచ్‌ల్లో మూడు వికెట్లు తీశాడు. కాగా 2019 వరకు మాత్రం రెగ్యులర్‌గా ఐపీఎల్ ఆడిన ఇషాంత్ ఆ సీజన్లో ఢిల్లీ క్యాపిటల్స్ తరపున 13 మ్యాచ్‌ల్లో 13 వికెట్లు తీశాడు. ఇక ఓవరాల్‌గా 93 మ్యాచ్‌ల్లో 71 వికెట్లు తీసుకున్నాడు. ఇక అంతర్జాతీయ క్రికెట్ విషయానికి వస్తే కొన్నేళ్లగా టెస్టులకే మాత్రమే పరిమితమయ్యాడు. 108 టెస్టుల్లో 311 వికెట్లు, 80 వన్డేల్లో 115 వికెట్లు, 14 టి20ల్లో 8 వికెట్లు పడగొట్టాడు. Ishant Sharma spearheads #DelhiCapitals' offence! Keep watching #DCvKKR - LIVE & FREE on #JioCinema | Available across all telecom operators 😊#TATAIPL #IPL2023 #IPLonJioCinema | @ImIshant pic.twitter.com/PYK3rcoRoo — JioCinema (@JioCinema) April 20, 2023 చదవండి: సైగ చేయగానే ఆగిపోయాడు.. నమ్మకాన్ని నిలబెట్టని కోహ్లి -
'షమీపై మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలు.. 200 శాతం అలాంటి పని చేయడని చెప్పా'
మహ్మద్ షమీ.. ప్రస్తుత భారత జట్టులో కీలక పేసర్‌గా కొనసాగుతున్నాడు. తాజాగా ఆస్ట్రేలియాతో జరిగిన టెస్టు సిరీస్‌లో కూడా షమీ అద్భుత ప్రదర్శన కనబరిచాడు. అయితే షమీ తన క్రికెట్ కెరీర్‌తో పాటు తన వ్యక్తిగత జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్నాడు. ముఖ్యంగా 2018లో షమీపై అతడి మాజీ భార్య హసీన్ జహాన్ గృహ హింస కేసును పెట్టింది. దీంతో ఒక్క సారిగా షమీ వార్తల్లో నిలిచాడు. అదే విధంగా షమీ మ్యాచ్ ఫిక్సింగ్‌కు పాల్పడ్డంటూ ఆమె తీవ్రమైన ఆరోపణలు చేసింది. దీంతో బీసీసీఐ అవినీతి నిరోధక విభాగం దర్యాప్తు కూడా చేపట్టింది. అయితే ఆరోపణలు అవాస్తమని యాంటీ కరప్షన్ విభాగం కొట్టపారేసింది. తాజాగా ఇదే విషయంపై భారత వెటరన్ పేసర్ ఇషాంత్ శర్మ ఆసక్తికర వాఖ్యలు చేశాడు. క్రిక్‌బజ్ షో 'రైజ్ ఆఫ్ న్యూండియా' లో ఇషాంత్ మాట్లాడుతూ.."షమీ మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణల గురించి అవినీతి నిరోధక విభాగం హెడ్ నీరజ్ కుమార్ మా జట్టు సభ్యులందరినీ విచారించారు. పోలీసులు అడిగినట్లే అన్ని విషయాలు మా దగ్గర తెలుసుకున్నారు. అదే విధంగా షమీ వ్యక్తిగత విషయాలు గురించి నన్ను ప్రశ్నించారు. అయితే అతడి వ్యక్తిగత విషయాలు గురించి నాకు తెలియదు అని బదులు ఇచ్చాను. కానీ నా వరకు అయితే షమీ 200 శాతం అలాంటి పని చేయడని చెప్పాను. ఈ విచారణ తర్వాత షమీతో తన అనుబంధం మరింత బలపడింది" అని అతడు పేర్కొన్నాడు. చదవండి: IND vs AUS: ఆస్ట్రేలియాతో రెండో టెస్టు.. టీమిండియాకు బిగ్‌షాక్! -
Ind Vs Aus: ఆరోజు కోహ్లి బుమ్రాతో మాట్లాడతా అంటే నేనే వద్దన్నా! ఎందుకంటే
Jasprit Bumrah: జస్ప్రీత్ బుమ్రా.. టీమిండియా తరఫున 2018లో టెస్టుల్లో అడుగుపెట్టాడు. సౌతాఫ్రికా పర్యటనలో భాగంగా ప్రొటిస్ జట్టుతో జరిగిన సిరీస్‌తో అరంగేట్రం చేశాడు. తన మొదటి అంతర్జాతీయ టెస్టు మ్యాచ్‌లోనే నాలుగు వికెట్లు తీసి సత్తా చాటాడు. ఏడాది ముగిసేసరికి తొమ్మిది టెస్టులాడి.. 48 వికెట్లు తన ఖాతాలో వేసుకుని ప్రశంసలు అందుకున్నాడు. ఈ క్రమంలో, ఆ తర్వాత టెస్టు క్రికెట్ ప్రయాణంలో తనకు ఎదురైన సవాళ్లను స్వీకరించిన బుమ్రా.. వాటిని అధిగమించి భారత జట్టులో పేస్ దళ నాయకుడిగా ఎదిగాడు. ఇదిలా ఉంటే, 2018-19లో ఆస్ట్రేలియా టూర్ సందర్భంగా మొదటి స్పెల్ వేసిన బుమ్రా పెద్దగా ప్రభావం చూపలేకపోయాడు. కోహ్లి మాట్లాడతా అన్నాడు దీంతో.. నాటి కెప్టెన్ విరాట్ కోహ్లి.. బుమ్రా దగ్గరకు వెళ్లి తనతో గేమ్ ప్లాన్ గురించి చర్చించాలని అనుకున్నాడట. అయితే, అప్పటి కీలక బౌలర్ ఇషాంత్ శర్మ కోహ్లిని వద్దని వారించాడట. తానెందుకు అలా చేశాననన్న అంశం గురించి ఇషాంత్ తాజాగా వెల్లడించాడు. క్రిక్‌బజ్ షోలో మాట్లాడుతూ.. ‘‘బుమ్రా నాయకుడిగా ఎదుగుతాడని నాకెప్పుడో తెలుసు. 2018లో జరిగిన ఘటన నాకింకా గుర్తుంది. మేము ఆస్ట్రేలియాలో టెస్టు ఆడుతున్న సమయంలో తను ఆరంభంలో మెరుగ్గా బౌలింగ్ చేయలేకపోయాడు. నేను అందుకే వద్దన్నాను అప్పుడు విరాట్ వచ్చి.. ‘‘నేను తనతో మాట్లాడాలనుకుంటున్నా’’ అని చెప్పాడు. వెంటనే నేను వద్దని తనని వారించాను. బుమ్రా తెలివైన బౌలర్. పరిస్థితిని అర్థం చేసుకుని అందుకు తగ్గట్లు బౌలింగ్ చేయగలడు అని చెప్పాను. బుమ్రా దానిని నిరూపించాడు. టెస్టు క్రికెట్లో పరిస్థితులకు అనుగుణంగా అప్పటికప్పుడు బౌల్ చేయడం అత్యంత ప్రధానం. బుమ్రా ఆ పని చేసి చూపించాడు’’ అని ఇషాంత్ చెప్పుకొచ్చాడు. కాగా 2018-19 నాటి తొలి టెస్టులో బుమ్రా మొత్తంగా 6 వికెట్లతో సత్తా చాటాడు. అడిలైడ్‌లో జరిగిన ఆ మ్యాచ్‌లో భారత్ 31 పరుగుల తేడాతో గెలుపొందింది.అదేవిధంగా సిరీస్‌ను 2-1తో కైవసం చేసుకుంది. గాయాల బెడద ఇక టీమిండియా తరఫున ఇప్పటి వరకు 30 టెస్టులాడిన బుమ్రా 128 వికెట్లు కూల్చాడు. ఎనిమిది సార్లు ఐదు వికెట్లు కూల్చిన(ఒక మ్యాచ్‌లో) ఘనత సాధించాడు. అయితే, గత కొంతకాలంగా వెన్నునొప్పి కారణంగా జట్టుకు దూరమైన బుమ్రా.. ఎప్పుడు జట్టులోకి వస్తాడో తెలియని పరిస్థితి. చదవండి: Ind Vs Aus: భారత్ వర్సెస్ ఆస్ట్రేలియా.. షెడ్యూల్, జట్లు, లైవ్ స్ట్రీమింగ్ వివరాలు.. వైట్‌వాష్ ఎన్నిసార్లంటే! -
ఆ క్రికెటర్‌ను తీసుకోవాల్సిందే.. సీఎస్కేకు అభిమానుల డిమాండ్
ఐపీఎల్ 2022లో సీఎస్కేకు ఏది కలిసి రావడం లేదు. ఇప్పటికే వరుసగా నాలుగు పరాజయాలు చవిచూసిన ఆ జట్టు పాయింట్ల పట్టికలో ఆఖరి స్థానంలో ఉంది. అసలే ఓటముల బాధలో ఉన్న సీఎస్కేకు దీపక్ చహర్ సీజన్ మొత్తానికే దూరమయ్యే అవకాశాలు ఉన్నట్లు తేలడంతో పుండు మీద కారం చల్లినట్లయింది. గత ఫిబ్రవరిలో జరిగిన మెగావేలంలో దీపక్ చహర్‌ను రూ. 14 కోట్లు పెట్టి సీఎస్కే కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. దీపక్ చహర్ సీజన్‌కు దూరమయ్యే అవకాశం ఉండడంతో టీమిండియా వెటరన్ పేసర్ ఇషాంత్ శర్మను చహర్ స్థానంలో తీసుకోవాలని అభిమానులు పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తున్నారు. 33 ఏళ్ల ఇషాంత్ ఇటీవలే టెస్టులకు మాత్రమే పరిమితమయ్యాడు. ఫామ్ కోల్పోయి సతమతవుతున్న ఇషాంత్‌ను సెలెక్టర్లు పక్కనబెట్టేశారు. ఇక జట్టులోకి ఇషాంత్ రావడం కష్టమే. దీనికి తోడూ మెగావేలంలో అమ్మడుపోని జాబితాలో చేరిపోయాడు. ఇషాంత్‌కు ఐపీఎల్ మ్యాచ్‌లు జరుగుతున్న ముంబై, పూణే స్టేడియాలో సరిగ్గా సరిపోతాయని.. గతంలో అతనికి మంచి రికార్డు ఉందంటూ చాలా మంది ఫ్యాన్స్ అభిప్రాయపడ్డారు. కష్టాల్లో ఉన్న సీఎస్కేకు ఇషాంత్ రాకతో మార్పు వస్తుందేమో.. అంటూ పేర్కొన్నారు. కాగా కొన్నిరోజుల క్రితం ఐపీఎల్ వర్చువల్ గెస్ట్ బాక్స్‌లో ఇషాంత్ దర్శనమిచ్చాడు. ఇది చాలా మంది అభిమానులకు నిరాశ కలిగించింది. అందుకే ఇషాంత్‌ను సీఎస్కే తీసుకోవాల్సిందే అంటూ పెద్ద ఎత్తున డిమాండ్ చేశారు. ఇషాంత్‌పై అభిమానులు చేసిన ట్వీట్స్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. కాగా తొడ కండరాల గాయం నుంచి కోలుకుని బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీలో ఫిట్నెస్ సాధించేందుకు శ్రమిస్తున్న దీపక్ చాహర్‌కు మరో గాయమైనట్లు తెలుస్తోంది. దీంతో అతను మరో నెల రోజుల పాటు క్రికెట్‌కు దూరంగా ఉండాల్సి వస్తుందని సమాచారం. ఈలోపు ఐపీఎల్ 2022 సీజన్ ముగింపు దశకు చేరుకుంటుంది కాబట్టి చాహర్ సీజన్ మొత్తానికే దూరంగా ఉంటాడని జాతీయ మీడియా తమ కథనంలో పేర్కొంది. చదవండి: Arjuna Ranatunga: దేశం తగలబడిపోతుంటే ఐపీఎల్ ముఖ్యమా.. వదిలి రండి! Jasprit Bumrah: 'సంధికాలం నడుస్తోంది.. మార్చాల్సిన సమయం వచ్చేసింది!' Ishant sharma can be a really good replacement for Chahar. Ishant was very good in powerplays last season. https://t.co/Ii3eCeWdly — Jainil (@jainilism) April 12, 2022 With Chahar's comeback being almost next to impossible right now, can we rope in Ishant Sharma quickly? — Chinmay Singhvi (@SinghviChinmay) April 12, 2022 -
అరె ఇషాంత్ భయ్యా.. ఇదేం కర్మ!
టీమిండియా వెటరన్ పేసర్ ఇషాంత్ శర్మ.. ఒకప్పుడు జట్టులో స్టార్ బౌలర్‌గా వెలుగొందాడు. లంబూ అని ముద్దుగా పిలుచుకునే ఇషాంత్ కొన్నాళ్లపాటు టీమిండియా టెస్టు జట్టులో పెద్దన్న పాత్ర పోషించాడు. షమీ, బుమ్రాల రాకతో ఇషాంత్ ప్రతిభ వెనుకబడిపోయింది. ఆ తర్వాత ఫామ్ కోల్పోయి జట్టుకు క్రమంగా దూరమయ్యాడు. ఈ ఏడాది ఆరంభంలో సౌతాఫ్రికాతో జరిగిన టెస్టు సిరీస్‌ను టీమిండియా 2-1 తేడాతో అప్పగించింది. ఒక రకంగా ఇషాంత్‌కు సౌతాఫ్రికాతో టెస్టు సిరీస్ ఆఖరుదని చెప్పొచ్చు. అంతేకాదు శ్రీలంకతో టెస్టు సిరీస్‌కు ఇషాంత్‌ను ఎంపిక చేయలేదు. రహానే, పుజారా, సాహాలతో పాటు ఇషాంత్‌ను ఎంపికచేయలేదు. రహానే, పుజారాలు మళ్లీ జట్టులో అడుగుపెట్టే అవకాశం ఉన్నప్పటికి ఇషాంత్ కెరీర్ దాదాపు ముగిసినట్లే అని చెప్పొచ్చు. అలాంటి లంబూను ఇటీవలే ముగిసిన మెగావేలంలో ఎవరు కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపలేదు. దీంతో అమ్ముడుపోని ఆటగాళ్ల జాబితాలో ఇషాంత్ చేరిపోయాడు. ఇక ఐపీఎల్లో ఇషాంత్ కనబడడు అని మనం అనుకునేలోపు బుధవారం ఆర్సీబీ, కేకేఆర్ మధ్య మ్యాచ్‌కు సడెన్‌గా ప్రత్యక్షమయ్యాడు. అయితే ఆటగాడిగా కాకుండా వర్చువల్ గెస్ట్ అభిమానిగా కనిపించాడు. కరోనా మొదలైనప్పటికి నుంచి వర్చువల్ గెస్ట్ బాక్స్ నిర్వహిస్తున్నారు. దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి ఆయా ఫ్రాంచైజీల అభిమానులు ఈ గెస్ట్ బాక్స్‌లో పాల్గొంటారు. అలా ఇషాంత్ కూడా ఆర్సీబీ, కేకేఆర్ మ్యాచ్‌కు గెస్ట్ బాక్స్‌లో కనిపించాడు. ఇది చూసిన అభిమానులు ఊరుకుంటారా.. ఇషాంత్‌పై ట్వీట్స్ వర్షం కురిపించారు. ''ఒక టైమ్‌లో టీమిండియాలో బెస్ట్ బౌలర్‌గా ఉన్నాడు.. ఇప్పుడు మాత్రం.. ఇషాంత్ బాయ్ మళ్లీ టీమిండియాకు ఆడే అవకాశం లేదా.. అరె ఇషాంత్ శర్మ.. ఇది ఏం కర్మరా బాబు'' అంటూ కామెంట్స్ చేశారు. కాగా ఇషాంత్ శర్మ టీమిండియా తరపున 105 టెస్టుల్లో 311 వికెట్లు, 80 వన్డేల్లో 114 వికెట్లు, ఐపీఎల్లో 93 మ్యాచ్‌ల్లో 72 వికెట్లు పడగొట్టాడు. చదవండి: IPL 2022: పంజాబ్ కింగ్స్‌కు గుడ్‌న్యూస్.. సిక్సర్ల వీరుడు వచ్చేశాడు! Ishant Sharma in the virtual guest box, dfkm 😭😭 #RCBvKKR pic.twitter.com/MrrXCOh0ot — Sohom ᴷᴷᴿ (@AwaaraHoon) March 30, 2022 Check out how fans reacted after seeing Ishant Sharma in virtual guest box during RCB vs KKR match Here are some of the reactions👇#RCBvKKR #ishantsharma #IPL2022 #IPL #Cricket #CricketTwitter https://t.co/edv5m4r7EK — SportsTiger (@sportstigerapp) March 31, 2022 -
IND Vs SA 3rd Test: సిరాజ్ స్థానంలో ఎవరంటే..?
కేప్‌టౌన్: దక్షిణాఫ్రికాతో రెండో టెస్ట్ సందర్భంగా గాయపడిన టీమిండియా పేసర్ మహ్మద్ సిరాజ్, మూడో టెస్ట్‌కు అందుబాటులో ఉండడని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో అతని స్థానాన్ని సీనియర్ పేసర్ ఇషాంత్ శర్మతో భర్తీ చేయాలని టీమిండియా యాజమాన్యం భావిస్తున్నట్లు సమాచారం. సిరాజ్ స్థానానికి ఇషాంత్, మరో పేసర్ ఉమేశ్ యాదవ్‌ల మధ్య తీవ్ర పోటీ నెలకొన్నప్పటికీ.. 100 టెస్ట్‌ల అనుభవం ఉందన్న కారణంగా కోచ్ ద్రవిడ్, కెప్టెన్ కోహ్లి.. ఇషాంత్‌వైపే మొగ్గు చూపారని తెలుస్తోంది. ఆఖరి టెస్ట్‌కు వేదిక అయిన కేప్‌టౌన్‌లో పిచ్ బౌన్స్‌కు సహకరించనుండడంతో అక్కడ ఇషాంత్ ఉపయోగకరంగా మారతాడని ద్రవిడ్ భావిస్తున్నాడట. బౌన్సీ పిచ్‌పై ఇషాంత్ హైట్‌ను కూడా పరిగణలోకి తీసుకుని ఆఖరి టెస్ట్ తుది జట్టులో అతన్ని ఆడించాలని ద్రవిడ్ ఫిక్స్ అయ్యాడట. 105 టెస్ట్‌ల్లో 311 వికెట్లు పడగొట్టిన ఇషాంత్.. తన చివరి టెస్ట్‌ను గతేడాది డిసెంబర్లో ఆడాడు. న్యూజిలాండ్‌తో స్వదేశంలో జరిగిన ఆ మ్యాచ్‌లో అతను ఒక్క వికెట్ కూడా సాధించలేకపోయాడు. ఫలితంగా అతను దక్షిణాఫ్రికా సిరీస్‌లో డ్రెసింగ్ రూమ్‌కే పరిమితమ్యాడు. ఇదిలా ఉంటే, మూడు టెస్ట్‌ల ప్రస్తుత సిరీస్‌లో ఇరు జట్లు చెరో విజయంతో సమంగా నిలిచిన సంగతి తెలిసిందే. సిరీస్ డిసైడర్‌గా నిలిచే మూడో టెస్ట్‌లో ఎలాగైనా గెలిచి చరిత్ర సృష్టించాలని టీమిండియా భావిస్తుండగా, రెండో టెస్ట్ విజయం ఇచ్చిన ఉత్సాహంతో ఎల్గర్ సేన సైతం గెలుపే లక్ష్యంగా బరిలోకి దిగనుంది. జనవరి 11 నుంచి ఆఖరి టెస్ట్ మ్యాచ్ ప్రారంభంకానుంది. చదవండి: IPL 2022: ఈ ఏడాది కూడా విదేశాల్లోనే..? -
కోపం పోయినట్టుంది.. ఫుల్ జోష్‌లో కోహ్లి
IND Tour Of South Africa.. విరాట్ కోహ్లి వన్డే కెప్టెన్సీ తొలగింపు వివాదం ఎంత రచ్చగా మారిన సంగతి ప్రత్యకేంగా చెప్పనవసరం లేదు. తనను కనీసం సంప్రదించకుండానే బీసీసీఐ ఈ నిర్ణయం తీసుకున్నట్లు సౌతాఫ్రికా టూర్‌కు బయల్దేరే ఒక్కరోజు ముందు కోహ్లి మీడియా ముందుకు వచ్చి ఆవేదన వ్యక్తం చేశాడు. గంగూలీ వ్యాఖ్యలను ఖండించిన కోహ్లి.. తనతో ఎలాంటి కమ్యూనికేషన్ జరపలేదంటూ బాంబు కూడా పేల్చాడు. ఇలా ఆధ్యంతం రసవత్తరంగా సాగిన వన్డే కెప్టెన్సీ గొడవ దాదాపు సద్దుమణిగినట్లే కనిపిస్తుంది. చదవండి: IPL 2022 Mega Auction: లక్నో కెప్టెన్‌గా కేఎల్ రాహుల్.. అహ్మదాబాద్ కెప్టెన్‌గా శ్రేయాస్! మాజీ క్రికెటర్లు కూడా చొరవ తీసుకొని.. కాలమే దీనికి సమాధానం ఇస్తుందని.. ఇక కోహ్లి కెప్టెన్సీ విషయం వదిలేసి ఆటపై దృష్టి పెట్టడం మంచిదని సలహా ఇచ్చారు. అలా సౌతాఫ్రికా టూర్‌కు జట్టుతో కలిసి ఆ గడ్డపై అడుగుపెట్టాడు. ఈ సందర్భంగా ప్రయాణ సమయంలో కోహ్లి ఫుల్ జోష్‌లో ఉన్న ఫోటోలు వైరల్ అయ్యాయి. దీనికి సంబంధించిన వీడియోనూ ముంబై నుంచి జో బర్గ్(జోహన్నెస్‌బర్గ్) అంటూ క్యాప్షన్ జత చేసి విడుదల చేసింది. 25 సెకన్ల నిడివి గల వీడియోలో టీమిండియా క్రికెటర్లు సహా ద్రవిడ్‌లు సంతోషంగా ఉన్నట్లు కనిపించింది. ఇక ఫుల్ జోష్‌లో ఉన్న టెస్టు కెప్టెన్ కోహ్లి ఇషాంత్ శర్మను ఆటపట్టించడం కనిపించింది. కోహ్లి లంబూను ఏదో టీచ్ చేయబోతుంటే.. ''పొద్దుపొద్దున్నే నీకు నేనే దొరికానా.. టీజ్ చేయకు విరాట్ భయ్యా..'' అనడం వైరల్‌గా మారింది. ఇక డిసెంబర్ 16 నుంచే ప్రారంభం కావాల్సిన సిరీస్ ఒమిక్రాన్ నేపథ్యంలో వారం పాటు వాయిదా పడింది. డిసెంబర్ 26 నుంచి ఇరుజట్ల మధ్య మూడు టెస్టుల సిరీస్ ప్రారంభం కానుంది. ఆ తర్వాత మూడు వన్డేలు జరగనున్నాయి. ఇక గాయంతో రోహిత్ శర్మ టెస్టు సిరీస్‌కు దూరమైన సంగతి తెలిసిందే. From Mumbai to Jo'Burg! 👍 👍 Capturing #TeamIndia's journey to South Africa 🇮🇳 ✈️ 🇿🇦 - By @28anand Watch the full video 🎥 🔽 #SAvINDhttps://t.co/dJ4eTuyCz5 pic.twitter.com/F0qCR0DvoF — BCCI (@BCCI) December 17, 2021 -
ఆ ముగ్గురు ఆటగాళ్లకి ఇదే చివరి ఛాన్స్!
టీమిండియా పేసర్ ఇషాంత్ శర్మకు దక్షిణాఫ్రికా పర్యటనే చివరి అవకాశం కానున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. విరాట్ కోహ్లి నేతృత్వంలోని భారత జట్టు దక్షిణాఫ్రికాతో మూడు టెస్ట్‌లు ఆడనుంది. ఈ పర్యటనకు ఎంపిక చేసిన జట్టులో ఇషాంత్‌కు స్ధానం దక్కిన సంగతి తెలిసిందే. అయితే తుది జట్టులో ఇషాంత్‌కు చోటు దక్కడం చాలా కష్టం. ఇప్పటి వరకు 105 టెస్ట్‌ల్లో తన సేవలను భారత జట్టుకు అందించాడు. శార్దూల్ ఠాకూర్, మహ్మద్ సిరాజ్‌ల రూపంలో ఇషాంత్‌కు జట్టులో తీవ్రమైన పోటీ ఉంది. ఇషాంత్‌తో పాటు జట్టు సీనియర్ ఆటగాళ్లు అజింక్యా రహానే, ఛతేశ్వర్ పూజారా భవిష్యత్తు కూడా ఈ సిరీస్‌పైనే ఆధారపడి ఉంది. "భారత టెస్ట్ జట్టు వైస్ కెప్టెన్‌గా రహానె తొలగింపు ఇషాంత్‌కు ఒక స్పష్టమైన హెచ్చరిక వంటిది. సీనియర్ ఆటగాడిగా ఇషాంత్ మరింత రాణించాలి. పుజారా విషయంలో కూడా ఇదే నిజం. పుజారా చాలా కాలంగా జట్టులో ఉన్నాడు. అతడు ప్రస్తుతం ఫామ్‌లో లేడు. కానీ ఒక సీనియర్ ఆటగాడిగా కీలకమైన ఇన్నింగ్స్‌లు ఆడతాడని జట్టు ఆశిస్తోంది. ఒకవేళ వారు ఈ సిరీస్‌లో అద్బుతంగా రాణిస్తే, తమ టెస్ట్ కెరీర్‌ను పొడిగించుకోగలరు" అని బీసీసీఐ అధికారి ఒకరు ది ఇండియన్ ఎక్స్‌ప్రెస్‌తో తెలిపారు. ఇక సెంచూరియాన్ వేదికగా డిసెంబర్-26న భారత్- దక్షిణాఫ్రికా మధ్య తొలి టెస్ట్ ప్రారంభం కానుంది. భారత టెస్ట్ జట్టు: విరాట్ కోహ్లి(కెప్టెన్), రోహిత్ శర్మ(వైస్ కెప్టెన్), కేఎల్ రాహుల్, మయాంక్ అగర్వాల్, చతేశ్వర్ పుజారా, అజింక్య రహానే, శ్రేయస్ అయ్యర్, హనుమ విహారి, రిషబ్ పంత్(వికెట్ కీపర్), వృద్ధిమాన్ సాహా(వికెట్ కీపర్), రవిచంద్రన్ అశ్విన్, జయంత్ యాదవ్, ఇషాంత్ శర్మ, మహ్మద్ షమీ, ఉమేష్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, శార్దూల్ ఠాకూర్, మహ్మద్ సిరాజ్ -
IND vs NZ 2nd Test: ముంబై టెస్టు.. ఇషాంత్ స్థానంలో సిరాజ్!
IND vs NZ 2nd Test: Wasim Jaffer Suggested Mohammed Siraj Might Replace Ishant Sharma: ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్‌లో భాగంగా తొలి టెస్టు డ్రా అయిన నేపథ్యంలో రెండో మ్యాచ్‌లో ఎలాగైనా విజయం సాధించాలని టీమిండియా పట్టుదలగా ఉంది. ఆఖరి వరకు ఊరించి విజయం దూరమైనా.. ముంబై టెస్టులో గెలిచి సిరీస్‌ను కైవసం చేసుకోవాలని భావిస్తోంది. ఇందుకు తగ్గట్లుగా ప్రణాళికలు రచిస్తోంది. ఇక రెగ్యులర్ కెప్టెన్ విరాట్ కోహ్లి ముంబై టెస్టుకు అందుబాటులోకి వస్తున్న నేపథ్యంలో తుది జట్టు కూర్పుపై టీమిండియా మాజీ క్రికెటర్ వసీం జాఫర్ తన అభిప్రాయాలు పంచుకున్నాడు. తొలి టెస్టులో విఫలమైన అజింక్య రహానేకు మరో అవకాశం ఇస్తే బాగుంటుందన్నాడు. దక్షిణాఫ్రికా పర్యటన నేపథ్యంలో సీనియర్‌ను కొనసాగించాలని సూచించాడు. ఈ మేరకు ఈఎస్ఎన్క్రిక్ఇన్ఫోతో వసీం జాఫర్ మాట్లాడుతూ.. ‘‘అజింక్య రహానేను ఇప్పుడే జట్టు నుంచి తప్పించకూడదు. దక్షిణాఫ్రికా పర్యటనను దృష్టిలో పెట్టుకుని రహానే, పుజారాను పక్కనపెట్టే విషయం గురించి ఆలోచించడం తొందరపాటు అవుతుంది. కీలకమైన సిరీస్ ముందున్న నేపథ్యంలో వాళ్లిద్దరిని పక్కన పెట్టకూడదు. ఆ సిరీస్ ముగిసిన తర్వాతే ఎవరిని కొనసాగించాలి? ఎవరిని తప్పించాలన్న విషయంపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంటుంది’’ అని పేర్కొన్నాడు. ఇక కాన్పూరు టెస్టులో విఫలమైన ఓపెనర్ మయాంక్ అగర్వాల్(13, 17 పరుగులు)ను తప్పించి... అతడి స్థానంలో వృద్ధిమాన్ సాహాతో ఓపెనింగ్ చేయించాలని సూచించాడు. అదే విధంగా ముంబై టెస్టుకు ఇషాంత్ శర్మ స్థానంలో హైదరాబాదీ బౌలర్ మహ్మద్ సిరాజ్‌ను తీసుకుంటే బాగుంటుందని చెప్పుకొచ్చాడు. అయితే, పిచ్ స్వభావంపై ఇదంతా ఆధారపడి ఉంటుందని వసీం జాఫర్ చెప్పుకొచ్చాడు. ముగ్గురు సీమర్లు, ఇద్దరు స్పిన్నర్లు లేదంటే ఇద్దరు ఫాస్ట్ బౌలర్లు, ముగ్గురు స్పిన్నర్లతో బరిలోకి దిగుతారన్న అన్నది వేచి చూడాల్సి ఉందన్నాడు. ఇక కాన్పూర్ టెస్టులో ఇషాంత్ శర్మ ఒక్క వికెట్ కూడా తీయలేకపోయాడన్న సంగతి తెలిసిందే. కాగా డిసెంబరు 3-7 వరకు రెండో టెస్టు నిర్వహించేందుకు షెడ్యూల్ ఖరారైంది. చదవండి: IPL Retention- Venkatesh Iyer: వెంకటేశ్ అయ్యరా మజాకా.. అప్పుడు 20 లక్షలు.. ఇప్పుడు 8 కోట్లు.. ఏకంగా 4000 శాతం హైక్! -
పంత్ 'బుద్ధిమంతుడు' పోస్ట్‌పై టీమిండియా క్రికెటర్ల సెటైర్లు
లీడ్స్: టీమిండియా అల్లరి పిల్లగాళ్లలో ముఖ్యుడైన రిషబ్ పంత్.. తన ఇటీవలి ఇన్‌స్టా పోస్ట్ కారణంగా విపరీతంగా ట్రోలింగ్‌కు గురయ్యాడు. ఆ పోస్ట్‌పై స్పందించిన సహచర టీమిండియా సభ్యులు పంత్‌ను ఓ ఆట ఆడుకున్నారు. వివారాల్లోకి వెళితే.. ఇంగ్లండ్‌తో లార్డ్స్ టెస్ట్ అనంతరం టీమిండియా వికెట్‌కీపర్ రిషబ్ పంత్.. ఇన్స్టాగ్రామ్ వేదికగా ఓ ఫొటోను షేర్ చేశాడు. ఆ ఫొటోలో రంగురంగుల హుడీ, షార్ట్‌తో పాటు రెండు కలర్ల (ఎరుపు, నీలం) సాక్సులు ధరించి కాస్త విచిత్రంగా కనిపించిన పంత్.. 'క్లాస్‌లో అందరికంటే బుద్ధిమంతుడు' అంటూ హిందీలో కాప్షన్ జోడించాడు. నవ్వుతున్న ఎమోజీలను ఫొటోకు జత చేశాడు. View this post on Instagram A post shared by Rishabh Pant (@rishabpant) దీంతో అది కాస్త నెట్టింట వైరల్ అయ్యింది. ఈ ఫోటోకు నెటిజన్లు నుంచి విపరీతమైన రెస్పాన్స్ వస్తుంది. పంత్ పోస్ట్‌పై పలువురు టీమిండియా క్రికెటర్లు సైతం స్పందించారు. జోకులు వేయొద్దంటూ పంత్‌ను ఓ రేంజ్లో ఆటాడుకున్నారు. పంత్ ఐపీఎల్ జట్టు సహచరుడు అక్షర్ పటేల్ స్పందిస్తూ.. ఆ ఫొటోను తానే తీశానని తెలియజేసేలా.. 'బుద్ధిమంతుడివి నువ్వు కాదు.. ఆ ఫొటో తీసిన వ్యక్తి' అంటూ కామెంట్ చేశాడు. అక్షర్ పటేల్ కామెంట్‌పై మరో ఢిల్లీ క్యాపిటల్ సభ్యుడు ఇషాంత్ శర్మ సెటైర్ వేశాడు. మీరిద్దరూ అమాయకులా? అన్నట్లు కామెంట్ పెట్టాడు. ఈ క్రికెటర్ల సంభాషణ చూసిన నెటిజన్లు తెగ నవ్వుకుంటున్నారు. పంత్.. బుద్ధిమంతుడేంటి అని కొందరు ఆశ్చర్యం వ్యక్తం చేస్తుంటే.. ఇలాంటి ఎన్ని ఘోరాలు చూడాల్సి వస్తుందోనని మరికొందరు రియాక్ట్ అవుతున్నారు. ఇదిలా ఉంటే, లార్డ్స్ టెస్ట్‌లో చిరస్మరణీయ విజయం నమోదు చేయడంతో ఇంగ్లండ్‌తో ఐదు టెస్ట్‌ల సిరీస్‌లో టీమిండియా 1-0తో ఆధిక్యంలోకి వెళ్లింది. రేపటి నుంచి ఇరు జట్ల మధ్య లీడ్స్ వేదికగా మూడో టెస్ట్ ప్రారంభంకానుంది. చదవండి: టీమిండియా తదుపరి కోచ్ అతడేనా? -
ప్రియా మాలిక్ గోల్డ్ మెడల్ గెలిచింది ఒలింపిక్స్‌లో కాదు లంబూజీ..
డర్హమ్: విశ్వక్రీడా సంబురం(టోక్యో ఒలింపిక్స్) జరుగుతున్న ప్రస్తుత తరుణంలో ఎక్కడ ఏ మెడల్ వార్త కనిపించినా అది ఒలింపిక్స్‌లోనే అనుకుని చాలా మంది ప్రముఖులు పొరబడుతున్నారు. ఈ జాబితాలో టీమిండియా క్రికెటర్లు కూడా ఉండటం విశేషం. వివరాల్లోకి వెళితే.. ప్రస్తుతం టోక్యో ఒలింపిక్స్‌తో పాటు హంగేరీలోని బుడాపెస్ట్‌లో వరల్డ్ క్యాడెట్ రెజ్లింగ్ ఛాంపియన్షిప్ పోటీలు జరుగుతున్నాయి. ఆదివారం భారత రెజ్లర్ ప్రియా మాలిక్ వరల్డ్ క్యాడెట్ రెజ్లింగ్ ఛాంపియన్షిప్ పోటీల్లో గోల్డ్ మెడల్ సాధించింది. అయితే ఆమె ఒలింపిక్స్‌లోనే ఆ మెడల్ గెలిచిందనుకొని టీమిండియా క్రికెటర్లు ఇషాంత్ శర్మ, హనుమ విహారిలు.. సోషల్ మీడియా వేదికగా ఆమెకు కంగ్రాట్స్ చెప్పారు. వీరిలాగే ఇంకా చాలా మంది ప్రముఖులు కూడా ప్రియా మాలిక్ ఒలింపిక్స్‌లోనే మెడల్ గెలిచిందనుకొని శుభాకాంక్షలు చెప్పడం ప్రారంభించారు. దీంతో ట్విటర్లో #NotOlympics ట్రెండింగ్ అయ్యింది. కాగా, ఈ విషయం తెలుసుకున్న టీమిండియా క్రికెటర్లు.. వెంటనే తమతమ ట్వీట్లు డిలీట్ చేయడం విశేషం. ఇదిలా ఉంటే, టోక్యో ఒలింపిక్స్‌లో వెయిట్‌లిఫ్టింగ్ విభాగంలో మీరాబాయి చాను రజత పతకం గెలిచిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఇషాంత్.. చానుకు శుభాకాంక్షలు తెలిపాడు. -
కాళ్లకు రంగు షూలు.. తలకు పచ్చటోపీ; నీ వేషదారణ చూడలేకపోతున్నాం
లండన్: టీమిండియా క్రికెటర్ ఇషాంత్ శర్మ ప్రస్తుతం ఇంగ్లండ్ పర్యటనలో ఉన్న సంగతి తెలిసిందే. ఆగస్టు 4 నుంచి ప్రారంభం కానున్న టెస్టు సిరీస్‌కు ముందు భారత క్రికెటర్లు వినోదంలో మునిగి తేలుతున్నారు. తాజాగా ఇషాంత్ శర్మ గోల్ఫ్ ఆడడంపై యువీ తనదైన శైలిలో ట్రోల్ చేశాడు. అయితే యువీ ట్రోల్ చేసింది లంబూ ఆటను అనుకుంటే పొరపాటే... అతను ట్రోల్ చేసింది ఇషాంత్ వేషదారణను. కాళ్లకు రంగు షూలతో.. తలకు పచ్చ టోపీతో కాస్త వింతగా కనిపించిన ఇషాంత్‌ను ' లంబూ జీ నీ వేషదారణతో మేము చచ్చిపోయేలా ఉన్నాం.. కాస్త ఆ గెటప్‌ను మార్చు' అంటూ ట్రోల్ చేశాడు. కాగా ఇటీవలే కివీస్‌తో జరిగిన డబ్ల్యూటీసీ ఫైనల్లో ఆడిన ఇషాంత్ మూడు వికెట్లు పడగొట్టాడు. అయితే ఈ మ్యాచ్‌లో టీమిండియా 8 వికెట్ల తేడాతో కివీస్ చేతిలో పరాజయం పాలైంది. అయితే ఈ ఓటమిని మరిచిపోయి టీమిండియా నూతనోత్సాహంతో ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్‌కు సన్నద్ధమవుతుంది. కాగా ఇషాంత్ శర్మ కొన్నాళ్లనుంచి కేవలం టెస్టు ఫార్మాట్‌కు పరిమితమయ్యాడు. ఇటీవలే టీమిండియా తరపున 100 టెస్టు మ్యాచ్‌లను పూర్తి చేసుకున్న ఆటగాడిగా ఇషాంత్ నిలిచాడు. ఓవరాల్‌గా ఇషాంత్ శర్మ 102 టెస్టుల్లో 306 వికెట్లు పడగొట్టాడు. ఇక 80 వన్డేల్లో 115 వికెట్లు, 14 టీ20ల్లో 8 వికెట్లు తీసుకున్నాడు. View this post on Instagram A post shared by Ishant Sharma (@ishant.sharma29) -
ఇషాంత్ స్థానంలో సిరాజ్, టీమిండియాలో భారీ మార్పులు..?
లండన్: వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్లో హైదరాబాదీ పేసర్ మహ్మద్ సిరాజ్ ఉండి ఉంటే ఫలితం మరోలా ఉండేదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ నేపథ్యంలో టీమిండియా యాజమాన్యం కీలక నిర్ణయం తీసుకునేలా కనిపిస్తుంది. త్వరలో ప్రారంభం కాబోయే ఇంగ్లండ్ సిరీస్‌లో ఇషాంత్ స్థానంలో సిరాజ్‌కు తుది జట్టులో అవకాశం కల్పించాలని యోచిస్తున్నట్లు తెలుస్తోంది. డబ్ల్యూటీసీ ఫైనల్లో పేసర్లకు అనుకూలించే పిచ్‌పై ఇషాంత్ పూర్తిగా తేలిపోయాడని, మూడు వికెట్లు పడగొట్టినా అది అతని స్థాయికి తగ్గ ప్రదర్శన కాదని జట్టు యాజమాన్యం అభిప్రాయపడుతుంది. 100 టెస్టుల అనుభవం ఉన్న ఇషాంత్ ఇప్పటికీ కొత్త కుర్రాడిలాగే కనిపిస్తున్నాడని, అతడి బౌలింగ్‌ను పరిశీలిస్తే అన్ని టెస్టులు ఆడిన అనుభవం కనిపించడం లేదని విమర్శకులు చురకలంటిస్తున్నారు. దీంతో అతనికి ప్రత్యామ్నాయమైన సిరాజ్‌ను ఖచ్చితంగా తుది జట్టులోకి తీసుకోవాలని మేనేజ్మెంట్ నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే, గతేడాది ఆస్ట్రేలియా పర్యటనలో టెస్ట్ కెరీర్ ప్రారంభించిన సిరాజ్.. అద్భుతమైన బౌలింగ్‌తో అదరగొట్టాడు. సిరీస్ ప్రారంభానికి ముందు తండ్రి మరణించినా.. ఆ బాధను దిగమింగుకుని మరీ అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. మూడు టెస్టుల్లో 13 వికెట్లు తీసి.. సిరీస్‌లో భారత్ తరఫున అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా నిలిచాడు. ముఖ్యంగా బ్రిస్బేన్‌లో జరిగిన చివరి టెస్ట్‌లో 5 వికెట్లు పడగొట్టిన సిరాజ్.. టీమిండియా చారిత్రక విజయం సాధించడంలో కీలకపాత్ర పోషించాడు. కాగా, సిరాజ్ ఇప్పటి వరకూ 5 టెస్ట్ మ్యాచ్‌ల్లో 16 వికెట్లు పడగొట్టాడు. మరోవైపు ఇంగ్లండ్ సిరీస్ నిమిత్తం టీమిండియా తుది జట్టులో భారీ మార్పులు- చేర్పులు జరిగేలా కనిపిస్తున్నాయి. గాయపడిన ఓపెనర్ గిల్ స్థానంలో మయాంక్ లేదా కేఎల్ రాహుల్ జట్టులోకి వచ్చే అవకాశాలున్నాయి. అలాగే, జడేజాను పక్కకు పెట్టి విహారిని ఆడించాలని డిమాండ్లు వినిపిస్తున్నాయి. -
టీమిండియాకు షాక్.. స్టార్ ఆటగాడికి గాయం
సౌథాంప్టన్: ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ హోదాను తృటిలో చేజార్చుకున్న బాధలో ఉన్న టీమిండియాకు మరో షాక్ తగిలింది. స్టార్ ఆటగాడు, సీనియర్ పేసర్ ఇషాంత్ శర్మ గాయపడ్డాడు. అతడి కుడి చేతి మధ్య, ఉంగరపు వేళ్లకు గాయాలవ్వడంతో కుట్లు వేశారు. దీంతో అతను ఇంగ్లండ్ టెస్ట్ సిరీస్‌కు అందుబాటులో ఉంటాడో లేదోనన్న అనుమానాలు మొదలయ్యాయి. అయితే ఈ విషయమై బీసీసీఐ మాత్రం ధీమాగా ఉంది. ఇషాంత్ తొలి టెస్ట్ లోపు కోలుకుంటాడని ఆశాభావం వ్యక్తం చేస్తుంది. కాగా, డబ్ల్యూటీసీ ఫైనల్ రెండో ఇన్నింగ్స్‌లో తన బౌలింగ్‌లోనే ఓ బంతిని ఆపే క్రమంలో ఇషాంత్ గాయపడ్డాడు. అతని చేతి వేళ్లకు గాయాలయ్యాయి. తీవ్రంగా రక్తస్రావం కావడంతో వెంటనే అతను మైదానాన్ని వీడాడు. ఈ మ్యాచ్‌లో టీమిండియాపై న్యూజిలాండ్ 8 వికెట్ల తేడాతో గెలుపొందిన సంగతి తెలిసిందే. కాగా, ఇంగ్లండ్‌తో తొలి టెస్ట్‌కు మరో ఆరు వారాల సమయం ఉన్న నేపథ్యంలో అప్పట్లోగా ఇషాంత్ పూర్తిగా కోలుకుంటాడని బీసీసీఐ అధికారి ఒకరు తెలిపారు. డబ్ల్యూటీసీ ఫైనల్ అయ్యాక టీమిండియాకు 20 రోజుల విరామం లభించనుంది. ఆటగాళ్లు తమ కుటుంబ సభ్యులతో కలిసి గ్రేట్ బ్రిటన్ పరిధిలో విహరించే అవకాశాన్ని బీసీసీఐ కల్పించింది. దీంతో గురువారం సాయంత్రమే ఆటగాళ్లంతా సౌథాంప్టన్ నుంచి లండన్ బయల్దేరారు. చదవండి: కెప్టెన్ కోహ్లీని ఘోరంగా అవమానించిన కివీస్ వెబ్సైట్ -
చీఫ్ గెస్ట్‌గా వెళ్లి, అమ్మాయిని పటాయించిన లంబూ..
న్యూఢిల్లీ: ప్రస్తుత భారత జట్టులో రఫ్‌గా కనిపించే క్రికెటర్ ఎవరైనా ఉన్నారా అంటే.. అది మన లంబూ ఇషాంత్ శర్మనే అని ఠక్కున చెప్పేయొచ్చు. ఇలా కనిపించే ఈ వ్యక్తి... ఓ మ్యాచ్‌కు చీఫ్ గెస్ట్‌గా వెళ్లి ఓ అమ్మాయిని పటాయించాడంటే ఎవరైనా నమ్ముతారా..? కానీ లంబూ మాత్రం అందరి అంచనాలను తలకిందులు చేస్తూ.. అమ్మాయిని లవ్‌లో పడేశాడు. ఆ అమ్మాయి సాదాసీదా వ్యక్తి ఏమీ కాదు. బాస్కెట్ బాల్లో భారత్‌కు ప్రాతినిధ్యం వహించిన స్టార్ క్రీడాకారిణి. అయితే ఆ తర్వాత ఇషాంత్ ఆ అమ్మాయినే పెళ్లి చేసుకున్నాడనుకోండి. అది వేరే విషయం. వివరాల్లోకి వెళితే.. ఇషాంత్ శర్మ, తన భార్య ప్రతిమ సింగ్‌ను మొదటి సారి 2011లో కలుసుకున్నాడు. ఢిల్లీలో ఐజీఎంఏ బాస్కెట్ బాల్ అసోసియేషన్ నిర్వహించిన లీగ్ మ్యాచ్‌కు ఆయన ముఖ్య అతిధిగా వెళ్లాడు. ఆ కార్యక్రమాన్ని అతని స్నేహితుడు నిర్వహించాడు. అక్కడే ఇషాంత్ తన భార్య ప్రతిమను తొలిసారి చూశాడు. ఆ సమయంలో ఆమె భారత్ తరపున బాస్కెట్ బాల్ ఆడిన విషయం ఇషాంత్‌కు తెలియదు. గాయం కారణంగా ఆమె ఆ మ్యాచ్ ఆడకపోవడంతో అదే మ్యాచ్‌కు స్కోరర్‌గా వ్యవహరిస్తోంది. కుర్చీలో కూర్చొని స్కోర్ నమోదు చేస్తున్న ఆమెను ఇషాంత్ కళ్లు ఆర్పకుండా చూస్తూ ఉన్నాడు. ఇది గమనించిన ఆమెకు తొలుత ఇషాంత్‌పై చాలా కోపం వచ్చిందట. అవన్నీ పట్టించుకోని ఇషాంత్.. ప్రతిమ దగ్గరకు వెళ్లి మాటామాటా కలపడం మొదలు పెట్టాడు. అతని మాటలు తొలుత ఆమెను ఇబ్బంది పెట్టినా ఆ తర్వాత ఇద్దరూ డీప్ డిస్కషన్‌లోకి వెళ్లిపోయారు. తొలి చూపులోనే ఇద్దరి మధ్య ప్రేమ చిగురించడంతో.. ఒకరి ఫోన్ నంబర్లు ఒకరు తీసుకుని ప్రేమాయనాన్ని కొనసాగించారు. ఇక అప్పటి నుంచి ఇషాంత్ ప్రతి రోజు ప్రతిమను చూడటానికి వెళ్లేవాడు. అలా ఏడాది పాటు సాగిన వారి ప్రేమాయణం 2012లో ఓ సందర్భంగా పబ్లిక్ అయ్యిందని, ఆ రోజు వారు బహిరంగంగా తమ ప్రేమను వ్యక్త పరిచారని ఇషాంత్ స్నేహితుడు వెల్లడించాడు. ఇదే విషయాన్ని ప్రతిమ ఒక ఇంటర్వ్యూలో ప్రస్తావిస్తూ.. తొలి చూపులోనే ఇషాంత్ లవ్‌లో పడిపోయానని చెప్పింది. కాగా, 2011లో మొలకెత్తిన వీరి ప్రేమ ఐదేళ్లపాటు సాగి 2016లో పెళ్లితో ఎండ్ అయ్యింది. ఇదిలా ఉంటే, ఇషాంత్ ప్రస్తుతం టీమిండియాతో పాటు ఇంగ్లండ్‌లో పర్యటిస్తున్నాడు. న్యూజిలాండ్‌తో ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌తో పాటు ఇంగ్లండ్‌తో 5 మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ ఆడేందుకు లండన్‌లో ల్యాండయ్యాడు. చదవండి: KL RAHUL: ప్రియసఖితో తొలిసారి.. గతంలో విరుష్క జోడీ కూడా ఇలానే -
క్వారంటైన్ టైమ్‌ను గట్టిగా వాడేస్తున్నా: ఇషాంత్
ముంబై: టీమిండియా ఫాస్ట్ బౌలర్ ఇషాంత్ శర్మ క్వారంటైన్ టైమ్‌ను గట్టిగా వాడేస్తున్నట్లుగా అనిపిస్తుంది. మరో 25 రోజుల్లో ప్రపంచటెస్టు చాంపియన్‌షిప్ ఫైనల్ జరగనున్న నేపథ్యంలో ఇషాంత్ తన ఫిట్నెస్ను మెరుగుపరుచుకునే పనిలో ఉన్నాడు. విరాట్ కోహ్లి నేతృత్వంలోని టీమిండియా జూన్ 2న ఇంగ్లండ్‌కు బయల్దేరనుంది. అంతవరకు ముంబైలోని ఒక హోటల్లో ఆటగాళ్లంతా కఠిన నిబంధనల మధ్య క్వారంటైనల్లో ఉండనున్నారు. ఇంగ్లండ్‌కు వెళ్లిన అనంతరం అక్కడ మరో వారం రోజుల పాటు ఐపోలేషన్‌లో గడపనునన్నారు. కాగా టీమిండియా జూన్ 18 నుంచి 22 వరకు కివీస్‌తో డబ్ల్యూటీసీ ఫైనల్ ఆడనుంది. అనంతరం ఇంగ్లండ్‌తో ఐదు టెస్టుల సిరీస్‌లో పాల్గొననుంది. తాజాగా ఇషాంత్ శర్మ ఎక్సర్సైజ్ మూమెంట్స్‌కు సంబంధించి తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశాడు. వీడియోలో డిఫరెంట్ యాంగిల్స్‌లో కసరత్తులు చేస్తున్నట్లుగా ఉంది. ''మన బ్రెయిన్ ఏం నమ్ముతుందో.. శరీరం కూడా అదే చేయడానికి యత్నిస్తుంది. ఇప్పుడు నేను అదే చేస్తున్నా'' అంటూ క్యాప్షన్ జత చేశాడు. ఇషాంత్ వీడియోనూ ట్యాగ్ చేస్తూ ఢిల్లీ క్యాపిటల్స్.. ''ఇషాంత్ క్వారంటైన్ టైమ్‌ను గట్టిగా వాడేస్తున్నాడు'' అంటూ కామెంట్ చేసింది. ఇషాంత్ శర్మ ఇటీవలే రద్దైన ఐపీఎల్ 14వ సీజన్లో ఢిల్లీ క్యాపిటల్స్‌కు ప్రాతినిధ్యం వహించాడు. అయితే గాయం కారణంగా ఆరంభ మ్యాచ్‌లకు దూరమయ్యాడు. సీజన్ రద్దయ్యే సమయానికి ఇషాంత్ మూడు మ్యాచ్‌లాడి 1 వికెట్ తీశాడు. ఇక ఇషాంత్ శర్మ టీమిండియా తరపున 100 టెస్టులు ఆడిన ఆటగాడిగా నిలిచాడు. ప్రస్తుత టెస్టు జట్టులో వంద టెస్టు మ్యాచ్‌లాడిన ఏకైక క్రికెటర్‌గా ఇషాంత్ నిలిచాడు. ఇటీవలి కాలంలో పరిమిత ఓవర్లకు దూరమైన ఇషాంత్ కేవలం టెస్టులకు మాత్రమే పరిమితమయ్యాడు. ఓవరాల్‌గా చూసుకుంటే ఇషాంత్ టీమిండియా తరపున 101 టెస్టుల్లో 303 వికెట్లు, 80 వన్డేల్లో 115 వికెట్లు, 14 టీ20ల్లో 8 వికెట్లు తీశాడు. చదవండి: WTC Final: గర్ల్‌ఫ్రెండ్‌ను పెళ్లాడిన క్రికెటర్ ఈ వ్యక్తిని అందుకోవడం కష్టంగా ఉంది : వార్నర్ View this post on Instagram A post shared by Ishant Sharma (@ishant.sharma29) -
వారు సహకరిస్తే బాగుండు.. సుందర్ తండ్రి ఎమోషనల్
అహ్మదాబాద్: ఇంగ్లండ్‌తో జరిగిన నాలుగో టెస్టులో టీమిండియా ఆటగాడు వాషింగ్టన్ సుందర్ తొలి ఇన్నింగ్స్‌లో 96 పరుగులతో నాటౌట్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. అక్షర్ పటేల్ 43 పరుగులతో మంచి సహకారం అందించడంతో సుందర్ కచ్చితంగా సెంచరీ చేస్తాడని అంతా భావించారు. అయితే అనూహ్యంగా అక్షర్ పటేల్ వెనుదిరగడం.. ఆ తర్వాత వచ్చిన ఇషాంత్, సిరాజ్‌లు కూడా డకౌట్లుగా వెనుదిరగడంతో సుందర్ సెంచరీ మార్క్‌ను అందుకోలేకపోయాడు. కానీ సుందర్ ఆడిన ఈ ఇన్నింగ్స్ మాత్రం చిరకాలం గుర్తుండిపోతుందనంలో సందేహం లేదు. సుందర్ సెంచరీ మార్క్‌ను అందుకోకపోవడంతో తాను నిరాశకు గురయ్యాయని తండ్రి ఎమ్. సుందర్ పేర్కొన్నాడు. 'నా కొడుకు బ్యాటింగ్ చూసి కొంతమంది ఆశ్చర్యపోతుండడం నాకు వింతగా అనిపించింది. వాస్తవానికి వాడిలో మంచి బ్యాట్స్‌మన్ దాగున్నాడు. కఠిన పరిస్థితుల్లో ఒక మంచి ఇన్నింగ్స్ ఆడినందుకు చాలా సంతోషంగా ఉంది. టీమిండియా ఎప్పుడు కష్టాల్లో ఉన్న సుందర్ ఇలానే జట్టును ఆదుకున్నాడు. ఆసీస్ పర్యటనలోనూ ఇది రుజువైంది. కానీ ఒక్క విషయం మాత్రం నన్ను తీవ్రంగా బాధిస్తుంది. 96 పరుగులకు చేరుకున్న తర్వాత నా కొడుకు సెంచరీ మార్క్‌ను అందుకుంటాడని భావించా. కానీ అక్షర్ పటేల్ అవుటైన తర్వాత వచ్చిన ఇషాంత్, సిరాజ్‌లు డకౌట్ అయ్యారు. వారిని తప్పుబట్టలేను కానీ వారు కాస్త సహకరించి ఉంటే బాగుండేది. అయితే టీమిండియా విజయం సాధించడం నా బాధను మరిచిపోయేలా చేసింది.' అంటూ తెలిపాడు. నాలుగో టెస్టులో టీమిండియా ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో ఇన్నింగ్స్ 25 పరుగుల తేడాతో విజయం సాధించిన టీమిండియా వరుసగా హ్యాట్రిక్ గెలుపును అందుకుంది. ఫలితంగా వరల్డ్ టెస్టు చాంపియన్‌షిప్(డబ్యూటీసీ) ఫైనల్లో సగర్వంగా అడుగుపెట్టింది. ఇప్పటికే న్యూజిలాండ్ ఫైనల్‌కు చేరగా, తాజాగా టీమిండియా తుది పోరుకు అర్హత సాధించింది. నాల్గో టెస్టులో 160 పరుగులు వెనుకబడి రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన ఇంగ్లండ్ 135 పరుగులకు ఆలౌట్ అయింది. దీంతో టీమిండియాకు ఇన్నింగ్స్ విజయం లభించింది. అక్షర్ పటేల్, అశ్విన్ చెరో 5 వికెట్లతో ఇంగ్లండ్ నడ్డి విరిచి భారత్ విజయంలో కీలక పాత్ర పోషించారు. దీంతో నాలుగు టెస్టుల సిరీస్‌ను టీమిండియా 3-1తో కైవసం చేసుకుంది. జూన్‌లో లార్డ్స్ వేదికగా జరగనున్న ఫైనల్లో న్యూజిలాండ్‌తో టీమిండియా తలపడనుంది. చదవండి: టీమిండియా విజయం.. సగర్వంగా డబ్ల్యూటీసీ ఫైనల్‌కు కమాన్ కోహ్లి.. ఎంత పని చేశావ్ : రూట్ -
ఒక్క కిక్‌తో ఇషాంత్‌ను నిద్రలేపాను: కోహ్లి
న్యూఢిల్లీ: ఇషాంత్ శర్మ 100వ టెస్టు మ్యాచ్ ఆడనుండటం పట్ల టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి హర్షం వ్యక్తం చేశాడు. సంప్రదాయ క్రికెట్ ఆడేందుకు ప్రాధాన్యమిచ్చి, కెరీర్లో అరుదైన మైలురాయి చేరుకోవడం సంతోషకరమన్నాడు. సమకాలీన పరిస్థితుల్లో ఒక పేసర్‌గా సుదీర్ఘ కాలం కొనసాగటం అందరికీ సాధ్యంకాదని, ఆ క్రెడిట్ ఇషాంత్‌కు దక్కుతుందంటూ ప్రశంసలు కురిపించాడు. కాగా భారత దిగ్గజ క్రికెటర్ కపిల్‌దేవ్ (131 టెస్టులు) తర్వాత వంద మ్యాచ్‌లు ఆడనున్న టీమిండియా ఫాస్ట్‌బౌలర్‌గా ‘లంబూ’ చరిత్రకెక్కనున్న విషయం తెలిసిందే. అహ్మదాబాద్‌లోని మొతేరా స్టేడియంలో ఇంగ్లండ్‌తో బుధవారం జరుగనున్న పింక్‌బాల్ టెస్టులో ఈ ఘనత అందుకోనున్నాడు. ఈ నేపథ్యంలో మీడియాతో మాట్లాడిన కోహ్లి, ఇషాంత్‌తో తనకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నాడు. ‘‘ఇద్దరం కలిసే రాష్ట్రస్థాయి(ఢిల్లీ) క్రికెట్ ఆడాం. తను భారత జట్టుకు ఎంపికైన న్యూస్ వస్తున్న సమయంలో ఇషాంత్ నిద్రపోతున్నాడు. అప్పుడు నేను తన పక్కనే ఉన్నాను. ఒక్క కిక్‌తో నిద్రలేపి, ఆ శుభవార్తను తనకు తెలియజేశాను. అంత క్లోజ్‌గా ఉండేవాళ్లం. పరస్పర నమ్మకం కలిగి ఉండేవాళ్లం. ఇన్నేళ్లుగా బౌలింగ్‌ను ఎంజాయ్ చేస్తూ టెస్టు క్రికెట్ ఆడుతున్న ఇషాంత్, వందో టెస్టు ఆడనుండటం సంతోషంగా ఉంది. ఒక పేసర్‌గా సుదీర్ఘ కెరీర్ కొనసాగించడం అరుదైన విషయం. దానిని ఇషాంత్ సాధ్యం చేసి చూపించాడు. అందుకు తనను అభినందించి తీరాల్సిందే. మరికొన్నేళ్ల పాటు అతడు టెస్టు క్రికెట్ ఆడుతూనే ఉండాలి’’ అని ఆకాంక్షించాడు. కాగా దేశవాళీ క్రికెట్‌తో పాటు ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లోనూ ఆడుతున్న ఇషాంత్, టీమిండియా తరఫున 2016లో చివరి వన్డే, 2013లో ఆఖరిసారిగా టీ20 మ్యాచ్ ఆడాడు. ఇక చెన్నైలో ఇటీవల జరిగిన తొలి టెస్టులో భాగంగా ఇషాంత్ శర్మ టెస్టుల్లో 300 వికెట్లు తీసిన ఆరో భారత బౌలర్, మూడో పేసర్‌గా రికార్డు సృష్టించాడు. చదవండి: ఇషాంత్ శర్మ ‘శతకం’.. స్పెషల్ స్టోరీ -
ఇషాంత్ శర్మ శతకం
సుమారు 13 సంవత్సరాల క్రితం... 19 ఏళ్ల కుర్రాడొకడు పేస్‌కు స్వర్గధామంలాంటి పెర్త్ పిచ్‌పై ప్రపంచ టాప్ బ్యాట్స్‌మన్ రికీ పాంటింగ్‌ను గడగడలాడించాడు. ఏడు ఓవర్ల స్పెల్‌లో దాదాపు ప్రతీ బంతికి పాంటింగ్ తడబడ్డాడు. ఎంతో మంది దిగ్గజ బౌలర్లను సమర్థంగా ఎదుర్కొన్న ఆసీస్ కెప్టెన్, కేవలం నాలుగో మ్యాచ్ ఆడుతున్న ఆ పేసర్ బంతులను ఎలా ఆడాలో అర్థం కాని గందరగోళంలో పడి చివరకు స్లిప్‌లో క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. అప్పుడే క్రికెట్ వ్యాఖ్యాతలంతా ఈ మ్యాచ్ లేదా సిరీస్ ఫలితం ఏమైనా కానీ... ఈ అద్భుత స్పెల్ మాత్రం ఎప్పటికీ నిలిచిపోతుందని, ఆ పేసర్ కెరీర్లో ఎంతో ఎదుగుతాడని వ్యాఖ్యానించారు. నిజంగా అదే జరిగింది. ఆ స్పెల్ వేసిన ఇషాంత్ శర్మ స్థాయిని అమాంతం పెంచేసింది. ఆపై ఎన్నో ఆటుపోట్లను తట్టుకొన్న అతను భారత్ తరఫున అగ్రశ్రేణి బౌలర్‌గా ఎదిగాడు. తనతో పోటీ పడిన ఎందరికో సాధ్యంకాని రీతిలో 100 టెస్టుల మైలురాయిని ఇంగ్లండ్‌తో బుధవారం అహ్మదాబాద్‌లో మొదలయ్యే మూడో టెస్టులో చేరుకోబోతున్నాడు. సాక్షి క్రీడా విభాగం: ఇషాంత్ శర్మ 2011లో మొదటిసారి తన కెరీర్ లక్ష్యాల్లో 100 టెస్టులు ఆడటం ఒకటని చెప్పుకున్నాడు. అప్పటికి అతను ఇంకా 40 టెస్టులు కూడా పూర్తి చేసుకోలేదు. ఆపై వరుస గాయాలు, ఫామ్ కోల్పోవడం, కొత్త పేస్ బౌలర్ల రాక... ఇలా ఎన్నో పరిణామాలు చోటు చేసుకున్నాయి. అయినాసరే మరో దశాబ్ద కాలపు కెరీర్‌ను కొనసాగించగలగడం ఒక ఫాస్ట్ బౌలర్ కోణంలో చూస్తే సాధారణ విషయం కాదు. తన మార్గదర్శి జహీర్ ఖాన్ 92 టెస్టులతో ఆగిపోయిన చోట... ఇషాంత్ మాత్రం అతడిని దాటి వంద వరకు రాగలిగాడు. 6 అడుగుల 4 అంగుళాల ఎత్తు, హై ఆర్మ్ యాక్షన్, అసలైన ఫాస్ట్ బౌలర్ లక్షణాలతో కెరీర్ ప్రారంభించిన ‘లంబూ’ భారత జట్టు సాధించిన అనేక చిరస్మరణీయ విజయాల్లో భాగంగా నిలిచాడు. దిగ్గజ క్రికెటర్ కపిల్‌దేవ్ (131 టెస్టులు) తర్వాత వంద మ్యాచ్‌లు ఆడిన భారత ఫాస్ట్ బౌలర్‌గా నిలవడం అంటేనే ఇషాంత్ ఘనత ప్రత్యేకత ఏమిటో అర్థమవుతుంది. ఘనారంభం... తన రెండో టెస్టు మ్యాచ్‌లోనే ఐదు వికెట్ల ప్రదర్శనతో ఇషాంత్ కెరీర్ జోరుగానే ప్రారంభమైంది. ‘పెర్త్–పాంటింగ్’ మెరుపు బౌలింగ్ తర్వాత ధోని టెస్టు కెప్టెన్‌గా వ్యవహరించిన తొలి మ్యాచ్‌లోనే అతను మరోసారి ఐదు వికెట్లు తీసి కెప్టెన్ ఫేవరెట్‌గా మారాడు. ఆపై కొద్ది రోజులకే స్వదేశంలో ఆస్ట్రేలియాతో సిరీస్‌లో కూడా 15 వికెట్లతో సత్తా చాటాడు. అయితే జట్టులో రెండో ప్రధాన పేసర్‌గా జహీర్‌తో కూడా జట్టుకు కీలక విజయాలు అందిస్తున్న సమయంలో ఇషాంత్ బౌలింగ్ లయ తప్పింది. అప్పటి వరకు అతని బలమైన పేస్ బలహీనతగా మారిపోయింది. దాదాపు 150కు పైగా కిలోమీటర్ల వేగంతో బౌలింగ్ చేయడం నుంచి 130ల్లోకి పడిపోయాడు. ఫలితంగా ప్రత్యర్థుల దృష్టిలో సాధారణ బౌలర్‌గా మారిపోవడంతో ఒకవైపు వికెట్లు రాకపోగా, మరోవైపు సాధారణ బౌలర్ తరహాలో టెస్టుల్లో కూడా భారీగా పరుగులు సమర్పించుకున్న పరిస్థితి. ముఖ్యంగా 2012 ఆస్ట్రేలియా పర్యటన అతని కెరీర్లో చేదు జ్ఞాపకంగా మిగిపోయింది. నాలుగు టెస్టుల్లో కలిపి ఐదంటే ఐదే వికెట్లు తీసి గత సిరీస్‌లో హీరోగా మారిన చోట జీరోలా కనిపించాడు. ఏదోలా 50 టెస్టులు పూర్తి చేసుకున్నా... కనీసం 50 టెస్టులు ఆడిన బౌలర్లలో అందరికంటే చెత్త బౌలింగ్ సగటు ఇషాంత్‌దే కనిపించింది. మళ్లీ సత్తా చాటి... కెరీర్ ప్రమాదంలో పడిన దశలో ఇషాంత్ దానిని చక్కదిద్దుకునేందుకు తీవ్రంగా శ్రమించాడు. ముఖ్యంగా తనను ఇబ్బంది పెడుతున్న ఫిట్నెస్ సమస్యపై దృష్టి పెట్టాడు. పైగా పరిమిత ఓవర్లకు దాదాపుగా గుడ్‌బై చెప్పి పూర్తిగా ఎరుపు బంతిపైనే దృష్టి పెట్టాడు. దాంతో సహజంగానే ఫలితాలు వచ్చాయి. 2014 న్యూజిలాండ్ పర్యటన అతడికి మేలిమలుపు. రెండు టెస్టుల్లోనే 15 వికెట్లు తీసిన ఇషాంత్ బౌలింగ్‌లో పదును పెరిగిందని అందరికీ అర్థమైంది. ఆ తర్వాత కొద్ది రోజులకే లార్డ్స్ మైదానంలో జరిగిన టెస్టులో ఇంగ్లండ్‌పై 74 పరుగులకే 7 వికెట్లు పడగొట్టిన ప్రదర్శన అతని కెరీర్లో హైలైట్‌గా నిలిచింది. అతని బౌలింగ్ వల్లే ఈ సిరీస్‌లో భారత్ తన ఏకైక టెస్టును గెలవగలిగింది. ఆ తర్వాత ఇషాంత్ మళ్లీ వెనుదిరిగి చూడాల్సిన అవసరం లేకుండా పోయింది. అయితే కీలక సమయాల్లో కొంత అదృష్టం కూడా అతనికి కలిసొచ్చింది. ఇప్పుడున్న తరహాలో టీమిండియా పేస్ బౌలింగ్ దళంలో ఎక్కువ ప్రత్యామ్నాయాలు అందుబాటులో లేకపోవడంతో కొన్నిసార్లు వైఫల్యాలు వచ్చినా... సీనియర్ హోదాలో ఇషాంత్ అనేక టెస్టులు ఆడగలిగాడు. మరింత మెరుగవుతూ... గత కొన్నేళ్లలో ఇషాంత్ కెరీర్ గణాంకాలు మరింత అద్భుతంగా కనిపిస్తాయి. ససెక్స్ తరఫున కౌంటీ క్రికెట్ ఆడినప్పుడు ఆస్ట్రేలియా మాజీ పేసర్ జేసన్ గిలెస్పీ ఇచ్చిన సూచనలు ఇషాంత్ ఆటను రాటుదేల్చాయి. 2018 నుంచి చూస్తే కమిన్స్, అండర్సన్లకంటే మెరుగ్గా ఇషాంత్ సగటు అద్భుత రీతిలో 19.34 మాత్రమే ఉందంటే అతను ఎంతగా చెలరేగిపోతున్నాడో అర్థమవుతుంది. సుదీర్ఘ కెరీర్లో పలు ప్రతికూలతలు అధిగమించి కృషి, పట్టుదల, సంకల్పంతో అత్యుత్తమ ఫాస్ట్ బౌలర్లలో ఒకడిగా ఎదిగిన ఇషాంత్ శర్మ వంద టెస్టులు ఆడటం పేసర్లకు స్ఫూర్తినిచ్చే, గర్వపడే క్షణం అనడంలో సందేహం లేదు. -
కపిల్‌దేవ్ తర్వాత ఇషాంత్ శర్మదే ఆ రికార్డు
అహ్మదాబాద్: ఇంగ్లండ్‌తో మూడో టెస్టు నేపథ్యంలో టీమిండియా ఫాస్ట్ బౌలర్ ఇషాంత్ శర్మ ముంగిట అరుదైన రికార్డు ఉంది. అహ్మదాబాద్ వేదికగా జరగనున్న పింక్‌బాల్ టెస్టు ఇషాంత్‌కు వందో టెస్టు కావడం విశేషం. కాగా టీమిండియా తరపున ఈ ఫీట్ సాధించిన రెండో ఫాస్ట్ బౌలర్‌గా అతను చరిత్ర సృష్టించనున్నాడు. ఇంతకముందు టీమిండియా నుంచి 100 టెస్టులు ఆడిన ఒకే ఒక ఫాస్ట్ బౌలర్‌గా కపిల్‌దేవ్ ఉన్నాడు. ఇషాంత్ కన్నా ముందు జహీర్ ఖాన్ 92 టెస్టులు, జగవల్ శ్రీనాథ్ 67 టెస్టు మ్యాచ్‌లు ఆడారు. 2007 లో టెస్ట్ క్రికెట్లో అరంగేట్రం చేసిన ఇశాంత్ శర్మ 99వ టెస్టులోనే 300 వికెట్ల మైలురాయిని అందుకున్నాడు. మొత్తంగా చూసుకుంటే ఇషాంత్ ఇప్పటివరకు టీమిండియా తరపున 99 టెస్టుల్లో 302 వికెట్లు, 80 వన్డేల్లో 112 వికెట్లు, 14 టీ20ల్లో 8 వికెట్లు తీశాడు. ఇంగ్లండ్‌పై అత్యధికంగా 61 వికెట్లు పడగొట్టగా.. ఆస్ట్రేలియాపై 59 వికెట్లు తీశాడు. ఒక ఏడాదిలో ఎక్కువ వికెట్లు తీసిన జాబితాలో ఇషాంత్‌కు 2011, 2018 బాగా కలిసివచ్చాయి. 2011 లో 12 టెస్టుల్లో 43 వికెట్లు, 2018 లో 11 మ్యాచ్‌లాడి 41 వికెట్లు పడగొట్టాడు. కాగా ఇషాంత్ ఇప్పటివరకు ఆడిన 99 టెస్టుల్లో 45 మ్యాచుల్లో టీమిండియా విజయం సాధించడం విశేషం. చదవండి: అశ్విన్ అవసరం తీరిపోయింది.. కమ్‌బ్యాక్ కష్టమే ఆ బెయిల్ ఎలా కిందపడింది : ఇషాంత్ -
ఆ బెయిల్ ఎలా కిందపడింది : ఇషాంత్
చెన్నై: భారత్, ఇంగ్లండ్ మధ్య మంగళవారం ముగిసిన తొలి టెస్టు మ్యాచ్‌లో ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. అప్పటికే టీమిండియా ఓటమి ఖాయమైన నేపథ్యంలో ఆ సన్నివేశం నవ్వులు పూయించింది. అసలు విషయంలోకి వెళితే.. ఇన్నింగ్స్ 57వ ఓవర్లో ఇషాంత్ శర్మ క్రీజులో ఉన్నాడు. ఇంగ్లండ్ ఫాస్ట్ బౌలర్ జోప్రా ఆర్చర్ షార్ట్ పిచ్ బంతిని సంధించగా.. దానిని హిట్ చేసేందుకు ఇషాంత్ ప్రయత్నించాడు. అయితే అదనపు బౌన్స్ కారణంగా బంతి అతని బ్యాట్‌ను తాకకుండా శరీరాన్ని తాకి వికెట్లకి అతి సమీపంలో పడింది. అప్పటికే ఆఫ్ స్టంప్‌పై ఉన్న బెయిల్ కింద పడడంతో స్టంప్‌కి ఇషాంత్ పాదం తాకినట్లు భావించిన ఇంగ్లండ్ ఆటగాళ్లు హిట్ వికెట్ కోసం అప్పీల్ చేశారు. మరోవైపు ఇషాంత్ తన పాదం తాకుకుండానే బెయిల్ ఎలా కింద పడిందో అర్థం కాక ఆశ్చర్యానికి లోనయ్యాడు. అయితే ఈ విషయంపై క్లారిటీ లేకపోవడంతో ఫీల్డ్ అంపైర్ తుది నిర్ణయం కోసం థర్డ్ అంపైర్‌ని ఆశ్రయించాడు. దాంతో.. రిప్లేని పరిశీలించిన థర్డ్ అంపైర్ దానిని డెడ్‌బాల్‌గా ప్రకటించాడు. బౌలర్ జోప్రా ఆర్చర్ బంతిని రిలీజ్ చేయకముందే ఆఫ్ స్టంప్‌పై నుంచి బెయిల్ దానంతట అదే కింద పడడం రిప్లేలో స్పష్టంగా కనిపించింది. అయితే షార్ట్ లెగ్‌లో ఉన్న రోరీ బర్న్స్ బెయిల్ కింద పడడం చూసి కూడా హిట్ వికెట్ కోసం అప్పీల్ చేయడం ఇక్కడ విశేషం.దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ తర్వాత మరో 8 బంతులు మాత్రమే ఆడిన టీమిండియా బుమ్రా రూపంలో చివరి వికెట్‌ను కోల్పోయి 227 పరుగులు తేడాతో పరాజయం చవిచూసింది. కాగా ఇరుజట్ల మధ్య రెండో టెస్టు ఫిబ్రవరి 13 నుంచి చెన్నై వేదికగానే జరగనుంది. చదవండి: ఐసీసీపై విరాట్ కోహ్లి ఆగ్రహం 'ఇప్పటికైనా అతనికి అవకాశం ఇవ్వండి' pic.twitter.com/x8L1KJVzZH — Sandybatsman (@sandybatsman) February 9, 2021 -
ఇషాంత్ శర్మ కెరీర్లో మరో మైలురాయి
చెన్నై: టీమిండియా పేసర్ ఇషాంత్ శర్మ టెస్టు కెరీర్లో అరుదైన మైలురాయిని చేరుకున్నాడు. టెస్టుల్లో 300 వికెట్లు తీసిన ఆరో భారత బౌలర్, మూడో పేసర్‌గా నిలిచాడు. ఇంగ్లండ్‌తో చెన్నైలో జరుగుతున్న తొలి టెస్టులో భాగంగా ఇషాంత్ ఈ రికార్డు నమోదు చేశాడు. నాలుగో రోజు ఆటలో భాగంగా, పర్యాటక జట్టు రెండో ఇన్నింగ్స్‌లో వన్‌డౌన్‌లో క్రీజులోకి వచ్చిన ఇంగ్లిష్ బ్యాట్స్‌మెన్ డానియల్ లారెన్స్‌ను పెవిలియన్‌కు పంపడం ద్వారా, 98 వ మ్యాచ్‌లో ఈ ఘనత సాధించాడు. ఇక టీమిండియా తరఫున టెస్టు ఫార్మాట్లో మూడొందలు అంతకంటే ఎక్కువ వికెట్లు సాధించిన క్లబ్లో ఇషాంత్ కంటే ముందు అనిల్ కుంబ్లే(619), కపిల్ దేవ్(434), హర్భజన్ సింగ్(417) రవిచంద్రన్ అశ్విన్(382), జహీర్ ఖాన్(311)లు ఉన్నారు. ఇక ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌లో జోస్ బట్లర్, జోఫ్రా ఆర్చర్ వికెట్లను ఇషాంత్ కూల్చిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్‌లో ఇషాంత్ మొత్తంగా ఇప్పటి వరకు మూడు వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. చదవండి: 84 ఏళ్ల తర్వాత ఆ రికార్డు కనుమరుగు -
రోహిత్ స్థానంలో అయ్యర్!
న్యూఢిల్లీ: గాయాలతో సతమతమవుతున్న టీమిండియా స్టార్ బ్యాట్స్‌మెన్ రోహిత్ శర్మ, బౌలర్ ఇషాంత్ శర్మ ఆస్ట్రేలియాకు వెళ్లే పరిస్థితి కనిపించడం లేదు. ప్రస్తుతం వీరిద్దరు బెంగళూరులోని జాతీయ క్రికెట్ అకాడమీలో చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే. అయితే గత కొన్ని రోజులుగా ఫిట్‌నెస్‌పై ఎటువంటి పురోగతి కనిపించకపోవడంతో టెస్టు సిరీస్‌కు దూరమయ్యే అవకాశాలే ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇక గతేడాది దక్షిణాఫ్రికాతో టెస్టు సిరీస్‌లో ఓపెనర్‌గా వరుసగా డబుల్ సెంచరీ, సెంచరీతో చెలరేగిన రోహిత్ శర్మ గనుక గాయం కారణంగా జట్టుకు దూరమైతే టీమిండియాకు కోలుకోలేని దెబ్బ తగులుతుంది. ఇప్పటికే మొదటి టెస్టు తర్వాత కెప్టెన్ విరాట్ కోహ్లి ఇండియాకు తిరిగి రానున్న విషయం తెలిసిందే. దీంతో హిట్‌మ్యాన్ కూడా అందుబాటులో లేకుంటే బ్యాటింగ్‌పై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది. (చదవండి: జట్టు కోసం ఎక్కడైనా ఆడతా: రోహిత్) ఈ నేపథ్యంలో రోహిత్ స్థానంలో యువ ఆటగాడు, ఐపీఎల్ జట్టు ఢిల్లీ డేర్‌డెవిల్స్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్‌ను ఆడించాలని బీసీసీఐ భావిస్తున్నట్లు సమాచారం. ఒకవేళ అదే జరిగితే టీమిండియా తరఫున వన్డే, టీ20 మ్యాచ్‌లు ఆడిన అయ్యర్ టెస్టుల్లో కూడా అరంగేట్రం చేసేందుకు మార్గం సుగమమవుతుంది. ఇక డిసెంబరు 17న మొదలయ్యే టెస్టు సిరీస్‌లో పాల్గొనాలంటే రోహిత్ శర్మ, ఇషాంత్ మరో నాలుగైదు రోజుల్లోనే ఆస్ట్రేలియా చేరుకోవాలని హెడ్ కోచ్ రవిశాస్త్రి పేర్కొన్న సంగతి తెలిసిందే. ఆలస్యం అయ్యే కొద్దీ పరిస్థితులు మారిపోతాయని, క్వారంటైన్ నిబంధనల నేపథ్యంలో వీలైనంత త్వరగా వారిద్దరు భారత్ నుంచి బయల్దేరాలని అభిప్రాయపడ్డాడు. టెస్టు సిరీస్‌లో ఆడాలంటే కనీసం ఒక ప్రాక్టీస్ మ్యాచ్‌లోనైనా ఆడాల్సి ఉంటుందని రవిశాస్త్రి పేర్కొన్నాడు. కాగా రోహిత్, ఇషాంత్ పూర్తిస్థాయిలో గాయం నుంచి కోలుకోకపోవడంతో ఆసీస్‌కు వెళ్తారా లేదా అన్న అంశంపై సందిగ్దత నెలకొంది. ఈ నేపథ్యంలో అయ్యర్‌ను రిజర్వ్ ఆటగాడిగా తీసుకునే అవకాశాన్ని బీసీసీఐ పరిశీలిస్తోంది.(చదవండి: ఐపీఎల్ 2020: బీసీసీఐ ఆదాయం ఎంతంటే!) -
ఇటు ఇషాంత్... అటు సాహా!
బెంగళూరు/సిడ్నీ: ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్ ప్రారంభానికి నెల రోజుల ముందే భారత జట్టుకు ఊరటనిచ్చే వార్త. జట్టులోని ఇద్దరు కీలక సభ్యులు పేసర్ ఇషాంత్ శర్మ, వికెట్ కీపర్ వృద్ధిమాన్ సాహా గాయాల నుంచి కోలుకుంటున్నారు. బెంగళూరులోని జాతీయ క్రికెట్ అకాడమీ (ఎన్సీఏ)లో ఉన్న ఇషాంత్ శర్మ బుధవారం ఎలాంటి ఇబ్బంది లేకుండా సాధన చేయగా... సిడ్నీలో సాహా తొలిసారి ప్రాక్టీస్‌లో పాల్గొన్నాడు. ఇషాంత్ శర్మ పూర్తి ఫిట్‌గా ఉంటే అతను వెంటనే ఆస్ట్రేలియా బయల్దేరతాడు. ద్రవిడ్, సునీల్ జోషి సమక్షంలో... ఐపీఎల్లో ఒకే ఒక మ్యాచ్ ఆడిన అనంతరం ఇషాంత్ పొత్తికడుపు కండరాల గాయంతో తప్పుకున్నాడు. ఆ తర్వాతి నుంచి అతను ఎన్సీఏలోనే ఉంటూ గాయానికి చికిత్స పొందుతున్నాడు. ఫిట్‌గా మారితే నవంబర్ 18 నుంచి ఇషాంత్ బౌలింగ్ చేయవచ్చని ఎన్సీఏ గతంలోనే బీసీసీఐకి సమాచారం అందించింది. బోర్డు వైద్యులు, ట్రయినర్ పర్యవేక్షణలో కోలుకున్న అనంతరం బుధవారం అతను మైదానంలోకి దిగాడు. రెండు వేర్వేరు స్పెల్‌లలో కలిపి సుమారు రెండు గంటల పాటు ఇషాంత్ బౌలింగ్ చేశాడు. అతను బౌలింగ్ చేస్తున్న సమయంలో ఎన్సీఏ డైరెక్టర్ రాహుల్ ద్రవిడ్, చీఫ్ సెలక్టర్ సునీల్ జోషి అక్కడే ఉన్నారు. ఇషాంత్ బౌలింగ్‌ను భారత అండర్–19 జట్టు కోచ్, మాజీ పేసర్ పారస్ మాంబ్రే పర్యవేక్షించాడు. పూర్తి రనప్, వేగంతో ఇషాంత్ బౌలింగ్ చేశాడని, ఎక్కడా కొంచెం కూడా అతను ఇబ్బంది పడలేదని బోర్డు వర్గాలు వెల్లడించాయి. బ్యాటింగ్ ప్రాక్టీస్... ఐపీఎల్లో కండరాల గాయంతో సన్‌రైజర్స్ హైదరాబాద్ తరఫున సాహా... ఎలిమినేటర్, రెండో క్వాలిఫయర్ మ్యాచ్‌లు ఆడలేకపోయాడు. అయితే జట్టుతో పాటు అతనూ ఆస్ట్రేలియా చేరుకున్నాడు. బుధవారం సాహా బ్యాటింగ్ ప్రాక్టీస్ చేయడం చూస్తే అతను గాయం నుంచి కోలుకున్నట్లు కనిపిస్తోంది. త్రోడౌన్ స్పెషలిస్ట్‌లు నువాన్ సెనెవిరత్నే, దయానంద గరాని నెట్స్‌లో విసిరిన బంతులను సాహా ఎదుర్కొన్నాడు. రెండు టి20లకు బుమ్రా, షమీ దూరం! ఆస్ట్రేలియాతో కీలకమైన టెస్టు సిరీస్ కోసం భారత ప్రధాన పేసర్లు షమీ, బుమ్రాలకు తగినంత మ్యాచ్ ప్రాక్టీస్ ఉండాలని టీమ్ మేనేజ్మెంట్ భావిస్తోంది. డిసెంబర్ 11 నుంచి గులాబీ బంతితో జరిగే రెండో ప్రాక్టీస్ మ్యాచ్‌లో ప్రధాన జట్టు మొత్తం బరిలోకి దిగే అవకాశం ఉండగా... అంతకుముందు డిసెంబర్ 6 నుంచి జరిగే తొలి ప్రాక్టీస్ మ్యాచ్‌లో కూడా షమీ, బుమ్రా ఆడాలని జట్టు కోరుకుంటోంది. అయితే 6, 8 తేదీల్లో ఆసీస్‌తో భారత్ రెండు టి20లు మ్యాచ్‌లు ఆడనుంది. ఈ నేపథ్యంలో ఈ రెండు టి20లనుంచి తప్పించైనా సరే... ప్రాక్టీస్ మ్యాచ్ ఆడించడంపైనే జట్టు ఎక్కువ దృష్టి పెట్టింది. మూడు వన్డేలు, తొలి టి20 తర్వాత ఈ ఇద్దరు పేసర్లు టెస్టు సిరీస్ కోసమే సిద్ధం కావడం మంచిదనే అభిప్రాయం వ్యక్తమైంది. ఇదే జరిగితే చివరి రెండు టి20ల్లో చహర్, నటరాజన్, సైనీ బరిలోకి దిగే అవకాశం ఉంది. -
ఐపీఎల్ నుంచి ఇషాంత్ శర్మ అవుట్
గాయం కారణంగా మరో ప్లేయర్ ఐపీఎల్ టి20 టోర్నమెంట్ నుంచి వైదొలిగాడు. ఇప్పటికే మిచెల్ మార్‡్ష, భువనేశ్వర్ కుమార్, అమిత్ మిశ్రా తప్పుకోగా... తాజాగా వీరి సరసన ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు బౌలర్, భారత ఆటగాడు ఇషాంత్ శర్మ చేరాడు. పక్కటెముకల్లో గాయం కారణంగా మిగిలిన ఐపీఎల్ మ్యాచ్‌లకు ఇషాంత్ అందుబాటులో ఉండటంలేదని ఢిల్లీ క్యాపిటల్స్ తెలిపింది. ఇప్పటివరకు ఢిల్లీ జట్టు ఏడు మ్యాచ్‌లు ఆడగా... 32 ఏళ్ల ఇషాంత్ సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో మాత్రమే బరిలోకి దిగాడు. ఇషాంత్ తన 4 ఓవర్ల కోటా వేసి 26 పరుగులిచ్చి వికెట్లేమీ తీయలేదు. కెరీర్లో 97 టెస్టులు, 80 వన్డేలు, 14 టి20 మ్యాచ్‌లు ఆడిన ఇషాంత్ సకాలంలో కోలుకుంటే ఈ ఏడాది చివర్లో ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లే అవకాశం ఉంటుంది. -
ఢిల్లీ క్యాపిటల్స్‌కు ఎదురుదెబ్బ
దుబాయ్: ఈ ఐపీఎల్లో ఫ్రాంచైజీలను గాయాలు వేధిస్తున్నాయి. ఇప్పటికే ఎస్ఆర్హెచ్ పేసర్ భువనేశ్వర్ కుమార్‌తో పాటు మిచెల్ మార్ష్, ఢిల్లీ స్పిన్నర్ అమిత్ మిశ్రా టోర్నీ నుంచి వైదొలగగా, తాజాగా ఢిల్లీ క్యాపిటల్స్ పేసర్ ఇషాంత్ శర్మ లీగ్‌కు దూరమయ్యాడు. ఈ సీజన్లో కేవలం ఒక గేమ్ మాత్రమే ఆడిన ఇషాంత్.. గాయం కారణంగా ఇంటిముఖం పట్టాడు. అతని పక్కటెముకలు గాయం వేధిస్తుండటంతో టోర్నీకి దూరమవుతున్నట్లు ఢిల్లీ ఫ్రాంచైజీ తెలిపింది. ఈ నెల 7వ తేదీన ట్రైనింగ్ సెషన్లో ఇషాంత్ ఎడమవైపు పక్కటెముకలు నొప్పి ఎక్కువైంది. (ఫస్ట్ ఓవర్లోనే ఫైనల్ స్కోరు.. ఫిక్సింగ్ కాదా?) దీనికి కొన్ని వారాలు విశ్రాంతి అనివార్యం కావడంతో ఇషాంత్ టోర్నీని వదిలి వెళ్లక తప్పడం లేదు. ‘ ఇషాంత్ గాయం దురదృష్టకరం. ఈ ఐపీఎల్ సీజన్‌కు ఇషాంత్ దూరం కానున్నాడు. ఢిల్లీ ఫ్రాంచైజీలోని ప్రతీ ఒక్కరూ ఇషాంత్ తొందరగా కోలుకోవాలని ఆశిస్తున్నాం’ అని సదరు ఫ్రాంచైజీ ఒక ప్రకటనలో పేర్కొంది. కొన్ని రోజుల క్రితం లెగ్ స్పిన్నర్ అమిత్ మిశ్రా టోర్నీ నుంచి వైదొలిగిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఇషాంత్ శర్మ దూరం కావడం ఢిల్లీకి గట్టి ఎదురుదెబ్బ. ఇద్దరు సీనియర్ ఆటగాళ్ల అనుభవాన్ని ఢిల్లీ కోల్పోనుంది. మరొకవైపు రిషభ్ పంత్ కూడా గాయం కారణంగా వారం రోజుల పాటు జట్టుకు అందుబాటులో ఉండటం లేదు. వచ్చే బుధవారం రాజస్తాన్ రాయల్స్‌తో ఢిల్లీ క్యాపిటల్స్ తలపడనుంది. ఈ టోర్నీలో ఢిల్లీ ఏడు మ్యాచ్‌లకు గాను ఐదు విజయాలు సాధించి రెండో స్థానంలో ఉంది. నిన్న ముంబై ఇండియన్స్‌తో మ్యాచ్‌ను ఢిల్లీ కోల్పోయింది. (సునీల్ నరైన్ ఔట్) -
‘అర్జున’తో ఆనందంగా ఉన్నా
దుబాయ్: శరీరం సహకరించినంత కాలం క్రికెట్ ఆడతానని అర్జున అవార్డు విజేత, భారత పేసర్ ఇషాంత్ శర్మ అన్నాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) కోసం దుబాయ్ వెళ్లిన ఇషాంత్ శనివారం జరిగిన జాతీయ క్రీడా అవార్డుల వేడుకకు హాజరు కాలేకపోయాడు. అయినప్పటికీ ఈ ఏడాది అవార్డు గెలుపొందిన వారందరికీ అభినందనలు తెలిపాడు. ‘చిన్న వయస్సులోనే క్రికెట్‌పై నాకున్న ఇష్టాన్ని తెలుసుకున్నా. నాటి నుంచి ఇప్పటివరకు ప్రతీ మ్యాచ్‌లోనూ 100 శాతం ప్రదర్శన కనబరిచా. 13 ఏళ్ల తర్వాత లభించిన ఈ అర్జున అవార్డు మరింత రాణించేందుకు కావాల్సిన స్ఫూర్తినిచ్చింది. (చదవండి : చెన్నై ‘హైరానా’ ) ఈ గౌరవాన్ని అందుకోవడం చాలా ఆనందంగా ఉంది. ప్రతిష్టాత్మక పురస్కారానికి ఎంపిక చేసిన కేంద్ర మంత్రిత్వ శాఖకు కృతజ్ఞతలు. నా ప్రయాణంలో వెన్నంటే నిలిచిన బీసీసీఐకి ధన్యవాదాలు. ఈ ఏడాది అవార్డు గెలుపొందిన వారందరికీ అభినందనలు’ అని ఇషాంత్ ట్విట్టర్లో రాసుకొచ్చాడు. 31 ఏళ్ల ఇషాంత్ భారత్ తరఫున 97 టెస్టులు, 80 వన్డేలు, 14 టి20ల్లో ప్రాతినిధ్యం వహించాడు. ఈ ఏడాది ఇషాంత్, మహిళా క్రికెటర్ దీప్తి శర్మ అర్జునకు ఎంపిక కాగా....రోహిత్ శర్మ ‘ఖేల్‌రత్న’కు ఎంపికయ్యాడు. -
‘ఇది నా 13 ఏళ్ల కష్టం’
న్యూఢిల్లీ: అంతర్జాతీయస్థాయిలో తన 13 ఏళ్ల కష్టానికి దక్కిన ఫలమే అర్జున అవార్డు అని భారత క్రికెట్ జట్టు పేస్ బౌలర్ ఇషాంత్ శర్మ అభివర్ణించాడు. ఈ అవార్డు పట్ల తనకంటే కూడా కుటుంబం, ముఖ్యంగా భార్య ప్రతిమా సింగ్ ఎంతో ఆనందంగా, గర్వంగా ఉన్నట్లు ఇషాంత్ పేర్కొన్నాడు. (చదవండి : మెరుపు రత్నాలు) ‘అర్జున అవార్డు నన్ను వరించిందని తెలిసిన క్షణం నుంచి చాలా ఆనందంగా ఉన్నా. నాపై నాకే చాలా గర్వంగా ఉంది. నా కుటుంబం కూడా ఎంతో గర్విస్తోంది.’ అని ఇషాంత్ తన ఆనందాన్ని వ్యక్తం చేశాడు. 2007లో భారత జట్టులోకి అడుగుపెట్టిన ఇషాంత్... ఇప్పటివరకు 97 టెస్టులు, 80 వన్డేలు, 14 టి20లు ఆడాడు. ఈ నెల 29న జాతీయ క్రీడా దినోత్సవం రోజున ఆన్లైన్లో నిర్వహించే కార్యక్రమం ద్వారా అవార్డులను అందజేస్తారు. (చదవండి : ఉసేన్ బోల్ట్‌కు కరోనా పాజిటివ్) -
ఇషాంత్ ఇప్పటికీ నా సోదరుడే
న్యూఢిల్లీ: గతంలో భావించినట్లే ఇషాంత్ శర్మను ఇప్పుడు కూడా సోదరునిలానే ఆదరిస్తున్నానని వెస్టిండీస్ మాజీ కెప్టెన్ డారెన్ స్యామీ చెప్పాడు. భారత పేసర్ ఇషాంత్ శర్మపై తనకు ఎలాంటి కోపం, పగ లేదని పేర్కొన్నాడు. సన్‌రైజర్స్‌కు ప్రాతినిధ్యం (2013, 2014) వహించిన సమయంలో జాతి వివక్షకు గురైనట్లు ఇటీవలే గుర్తించిన స్యామీ... తనను ‘కాలూ’(నల్లవాడు) అని సంబోధించిన ఇషాంత్‌ను క్షమించినట్లు తెలిపాడు. ‘నేను పగలు ప్రతీకారాలు పెట్టుకోను. ఇషాంత్‌తో దీని గురించి మాట్లాడాను. ఇది ముగిసిన అధ్యాయం. ఇంతకుముందు ఇషాంత్‌ను ఎలా భావించానో ఇప్పుడు కూడా సోదరునిలాగే ఆదరిస్తా. కానీ ఇకపై భవిష్యత్‌లో ఇలాంటి వాటిని సహించను. అది ఎవరైనప్పటికీ నేను నిలదీస్తా. జాతివివక్షను సహించను. ఇప్పటికే దీని గురించి పోరాడుతున్నా. ఇక ముందూ కొనసాగిస్తా. క్రికెట్ వర్గాల్లోనూ దీనిపై అవగాహన కల్పిస్తున్నాం’ అని విండీస్‌కు రెండుసార్లు టి20 ప్రపంచకప్ అందించిన స్యామీ పేర్కొన్నాడు. స్యామీ తన కెరీర్లో 232 అంతర్జాతీయ మ్యాచ్‌ల్లో విండీస్‌కు ప్రాతినిధ్యం వహించాడు. -
‘పంచ’ ఖేల్‌రత్నాలు!
న్యూఢిల్లీ: భారత క్రీడా అవార్డుల చరిత్రలో తొలిసారి ఏకంగా ఐదుగురిని దేశ అత్యున్నత క్రీడా పురస్కారం ‘రాజీవ్ గాంధీ ఖేల్‌రత్న’ కోసం సెలెక్షన్ కమిటీ కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖకు సిఫారసు చేసింది. మేటి క్రికెటర్ రోహిత్ శర్మ (మహారాష్ట్ర), మహిళా స్టార్ రెజ్లర్ వినేశ్ ఫొగాట్ (హరియాణా), టేబుల్ టెన్నిస్ (టీటీ) ప్లేయర్ మనిక బత్రా (ఢిల్లీ), భారత మహిళల హాకీ జట్టు కెప్టెన్ రాణి రాంపాల్ (హరియాణా), 2016 రియో పారాలింపిక్స్‌లో హైజంప్‌లో స్వర్ణం నెగ్గిన దివ్యాంగ అథ్లెట్ మరియప్పన్ తంగవేలు (తమిళనాడు) పేర్లను 12 మంది సభ్యుల సెలెక్షన్ కమిటీ ఖరారు చేసింది. సోమ, మంగళవారాల్లో సమావేశమైన ఈ కమిటీ ‘ఖేల్‌రత్న’తోపాటు ఉత్తమ క్రీడాకారులకు అందించే ‘అర్జున’ అవార్డు కోసం 29 మందిని... కోచ్‌లకు ఇచ్చే ‘ద్రోణాచార్య’ అవార్డు కోసం 13 మందిని... ప్లేయర్ ఉన్నపుడు, ఆట నుంచి రిటైరయ్యాకా క్రీడాభివృద్ధికి తోడ్పడుతున్న వారికి అందించే ‘ధ్యాన్‌చంద్’ జీవితకాల సాఫల్య అవార్డు కోసం 15 మందిని ఎంపిక చేసి కేంద్ర క్రీడా శాఖకు పంపించింది. ‘అర్జున’ కోసం ఎంపిక చేసిన జాబితాలో భారత సీనియర్ క్రికెటర్ ఇషాంత్ శర్మతోపాటు ఆర్చర్ అతాను దాస్, కబడ్డీ ప్లేయర్ దీపక్ హుడా, టెన్నిస్ ప్లేయర్ దివిజ్ శరణ్ తదితరులు ఉన్నారు. సెలెక్షన్ కమిటీ పంపించిన అవార్డుల జాబితాలో మార్పులు చేర్పులు చేసే అధికారం కేంద్ర క్రీడా శాఖకు ఉంటుంది. కానీ చాలా సందర్భాల్లో సెలెక్షన్ కమిటీ పంపించిన జాబితానే కేంద్ర క్రీడా శాఖ ఆమోదించి అవార్డీలను ఖరారు చేస్తుంది. కేంద్ర క్రీడా శాఖ ఆమోదించాకే అధికారికంగా జాతీయ క్రీడా పురస్కారాల జాబితాను ప్రకటిస్తారు. హాకీ దిగ్గజం మేజర్ ధ్యాన్‌చంద్ జయంతి, జాతీయ క్రీడా దినోత్సవమైన ఆగస్టు 29న రాష్ట్రపతి భవన్లో జరిగే కార్యక్రమంలో క్రీడా అవార్డులను అందజేస్తారు. కరోనా నేపథ్యంలో ఈసారి ఆన్లైన్లో ఈ కార్యక్రమం జరగనుంది. రియో ఒలింపిక్స్ జరిగిన 2016లో అత్యధికంగా నలుగురికి ఏకకాలంలో ‘ఖేల్‌రత్న’ ఇచ్చారు. ‘రాజీవ్‌ఖేల్ రత్న’ అవార్డుకు నామినేట్ అయిన ఐదుగురు ఆటగాళ్లకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అభినందనలు తెలిపారు. భవిష్యత్తులో వారు మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. ‘ధ్యాన్‌చంద్’ అవార్డు బరిలో ఉష జీవితకాల సాఫల్య అవార్డు ‘ధ్యాన్‌చంద్’ కోసం కమిటీ పంపించిన జాబితాలో ఆంధ్రప్రదేశ్ మహిళా బాక్సర్ నగిశెట్టి ఉష కూడా ఉంది. వైజాగ్‌కు చెందిన 36 ఏళ్ల ఉష 2006 ప్రపంచ బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో రజతం, 2008 ప్రపంచ చాంపియన్‌షిప్‌లో రజతం... 2008 ఆసియా చాంపియన్‌షిప్‌లో స్వర్ణ పతకం సాధించింది. ఆరు సార్లు సీనియర్ నేషనల్ చాంపియన్‌గా నిలిచింది. ఆట నుంచి రిటైరయ్యాక ఉష 2013 నుంచి 2017 మధ్యకాలంలో పలువురు మహిళా బాక్సర్లకు శిక్షణ ఇచ్చింది. ప్రస్తుతం ఆమె విశాఖ లోకో షెడ్లో పని చేస్తోంది. అర్జున అవార్డుల కోసం ప్రతిపాదించిన పేర్లలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన సాత్విక్ సాయిరాజ్ (బ్యాడ్మింటన్) పేరు కూడా ఉంది. -
అర్జున అవార్డుకు ఇషాంత్ నామినేట్
న్యూఢిల్లీ: ప్రతిష్టాత్మక అర్జున అవార్డుకు టీమిండియా పేసర్ ఇషాంత్ శర్మ పేరును క్రీడా మంత్రిత్వ శాఖ కేంద్రానికి సిఫార్సు చేసింది. అతడితో పాటు ఆర్చర్ అతాను దాస్, హాకీ క్రీడాకారిణి దీపికా ఠాకూర్, క్రికెటర్ దీపక్ హుడా, టెన్నిస్ ప్లేయర్ దివిజ్ శరన్ సహా 29 మంది అథెట్ల పేర్లను ఈ పురస్కారానికి నామినేట్ చేసింది. ఈ మేరకు న్యూఢిల్లీలో జరిగిన సమావేశంలో సెలక్షన్ కమిటీ నిర్ణయం తీసుకుంది. కాగా 31 ఏళ్ల ఇషాంత్ శర్మ 97 టెస్టులు, 80 వన్డేలు ఆడాడు. అంతర్జాతీయ క్రికెట్లో 400 వికెట్లు తీశాడు. (ఖేల్ రత్న అవార్డుకు రోహిత్ శర్మ నామినేట్) ఇక రియో ఒలంపిక్స్‌లో కాంస్య పతకం సాధించిన రెజ్లర్ సాక్షి మాలిక్, వరల్డ్ చాంఫియన్ వెయిట్ లిఫ్టర్ మీరాబాయి చాను పేర్లను కూడా ఈ అవార్డుకు పరిశీలించగా చివరి నిమిషంలో పక్కకు పెట్టినట్లు సమాచారం. రియో ఒలంపిక్స్‌లో కాంస్యంతో మెరిసిన సాక్షి 2016లో క్రీడా అత్యున్నత పురస్కారం రాజీవ్ ఖేల్‌రత్న పొందగా.. మీరాబాయి 2018లో ఈ అవార్డు అందుకున్నారు. ఈ కారణంతో వారి పేర్లను క్రీడా మంత్రి కిరణ్ రిజిజు పక్కకు పెట్టినట్లు తెలుస్తోంది. ఏపీ సీఎం వైఎస్ జగన్ శుభాభినందనలు టీమిండియా స్టార్ క్రికెటర్ రోహిత్ శర్మ పేరును క్రీడల్లో అత్యున్నత పురస్కారమైన రాజీవ్‌గాంధీ ఖేల్ రత్న అవార్డుకు క్రీడా మంత్రిత్వశాఖ సిఫార్సు చేసిన విషయం తెలిసిందే. హిట్‌మ్యాన్‌తో పాటు రెజ్లర్ వినేశ్ ఫోగట్, టేబుల్ టెన్నిస్ సంచలనం మనిక బాత్రా, రియో పారా ఒలింపిక్స్ గోల్డ్ మెడలిస్ట్ మరియప్పన్ తంగవేలు పేర్లను ప్రతిష్టాత్మక పురస్కారానికి సిఫార్సు చేశారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి.. రోహిత్ శర్మ, వినేశ్ ఫొగట్, మనిక బాత్రా, మరియప్పన్ తంగవేలుకు శుభాభినందనలు తెలిపారు. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ సీఎం కార్యాలయం ట్వీట్ చేసింది. -
ఇక మా పని అయిపోయినట్లే: ఇషాంత్
న్యూఢిల్లీ: కరోనా వైరస్ విస్తృతి నేపథ్యంలో క్రికెట్లో బంతిపై సలైవా(లాలాజలాన్ని) రుద్దడాన్ని రద్దు చేస్తూ ఇటీవల అంతర్జాతీయ క్రికెట్ మండలి(ఐసీసీ) తీసుకున్న నిర్ణయంపై ఎక్కువ శాతం ప్రతికూల స్పందనలే వస్తున్నాయి. వన్డే, టీ20 క్రికెట్లో సలైవాను రద్దు చేసినా ఫర్వాలేదు కానీ టెస్టు క్రికెట్లో అది తీవ్రమైన ప్రభావం చూపుతుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. కాగా, సలైవా రద్దుపై టీమిండియా పేసర్ ఇషాంత్ శర్మ స్పందించాడు. ఐసీసీ తీసుకున్న సలైవా రద్దు నిర్ణయాన్ని సుతిమెత్తగా విమర్శించాడు. ఇక తమ పని అయిపోయినట్లేనని ఇషాంత్ సెటైరిక్ మాట్లాడాడు. ప్రధానంగా టెస్టుల్లో సలైవా అనేది ఎంతగానో బౌలర్లకు సహకరిస్తుందని, బంతిని స్వింగ్ చేయడంలో ఇది కీలక పాత్ర పోషిస్తుందన్నాడు. (‘యువీ.. నువ్వు ఇంకా ఆడతావనుకున్నా’) ‘బౌలర్లు బంతిని షైన్ చేయకపోతే బంతి స్వింగ్ కాదు. బంతి స్వింగ్ కాకపోతే అది బ్యాట్స్‌మన్‌కు అనుకూలంగా మారుతుంది. మొత్తం బ్యాట్స్‌మన్ ఆధిపత్యం క్రికెట్‌గా మారిపోతుందనేది కాదనలేదని వాస్తవం. అటు బౌలర్‌కు ఇటు బ్యాట్స్‌మన్‌కు పోరు అనేది ఉండదు. బంతిని రుద్దకపోతే బ్యాట్స్‌మన్‌గా ఈజీ అయిపోతుంది. ప్రస్తుతం కొన్ని కారణాల వల్ల సలైవాను బంతిపై రుద్దడాన్ని రద్దు చేశారు. కానీ దీనికి ప్రత్యామ్నాయం అవసరం. టెస్టు క్రికెట్లో బంతిని షైన్ చేయడం అనేది చాలా ముఖ్యం. ఇందుకు ఐసీసీ వేరే పద్ధతిని తీసుకురావాల్సి ఉంది’ అని ఇషాంత్ పేర్కొన్నాడు.(‘ప్లాన్-బితోనే క్రికెట్లోకి వచ్చా’) -
ఆ మాటన్నది ఇషాంతేనా!
న్యూఢిల్లీ: సన్‌రైజర్స్ హైదరాబాద్ తరఫున ఆడే సమయంలో తాను వర్ణ వివక్షకు గురయ్యానంటూ వెస్టిండీస్ మాజీ కెప్టెన్ డారెన్ స్యామీ చేసిన వ్యాఖ్యల వివాదం ముదిరింది. 2013–14 సీజన్లలో సన్‌రైజర్స్‌కు ప్రాతినిధ్యం వహించినప్పుడు సహచర ఆటగాళ్లు తనను ‘కాలూ’ (నల్లోడు) అంటూ పిలిచారని, అప్పట్లో దాని అర్థం తనకు తెలీదన్న స్యామీ... ఇప్పుడు వారంతా తనకు క్షమాపణ చెప్పాలని కోరుతున్నాడు. పాత ఇన్స్టాగ్రామ్ పోస్ట్‌లను బట్టి చూస్తే ఈ మాటలన్నది భారత పేసర్ ఇషాంత్ శర్మ అని తెలుస్తోంది. సహచరులతో కలిసి దిగిన నాటి ఫోటోలో ఇషాంత్... ‘నేను, భువీ, కాలూ, గన్ సన్‌రైజర్ (స్టెయిన్)’ అంటూ పోస్ట్ చేశాడు. ‘నన్ను అప్పట్లో ఆ మాట ఎవరెవరు అన్నారో వారందరూ నాతో మాట్లాడే ప్రయత్నం చేయండి. మీలో చాలా మంది దగ్గర నా ఫోన్ నంబర్ ఉంది. ఇతర సోషల్ మీడియా కూడా ఉంది. మీరేం అన్నారో మీకు తెలుసు. రంగు గురించి మాట్లాడటం అంటే అది ఏ రూపంలోనైనా వివక్షగానే భావించాలి. నేను చాలా బాధపడుతున్నాను. వేర్వేరు జట్లకు ఆడిన సమయంలో డ్రెస్సింగ్ రూమ్‌కు సంబంధించి నాకు ఎన్నో మధుర జ్ఞాపకాలు ఉన్నాయి. అందరినీ నా సోదరుల్లా భావించాను. ఈ అంశంలో మీరు నాకు క్షమాపణ చెప్పడంలో తప్పు లేదు’ అని స్యామీ వ్యాఖ్యానించాడు. విండీస్ ఆటగాడి ఆరోపణలపై ఇషాంత్ గానీ, సన్‌రైజర్స్ యాజమాన్యం గానీ స్పందించలేదు. -
అందుకే స్మిత్‌ను గేలి చేశా: ఇషాంత్
న్యూఢిల్లీ: ఫీల్డ్‌లో దిగిన క్రికెటర్లు మాటల ద్వారానే స్లెడ్జింగ్‌కు దిగడం సాధారణంగా జరుగుతూ ఉంటుంది. చేతలతో స్లెడ్జింగ్ చేసే సందర్భాలు చాలా తక్కువనే చెప్పాలి. ఒకవేళ చేతల ద్వారా స్లెడ్జింగ్ చేస్తే అది ఒక క్రికెటర్‌ను గేలి చేసినట్లే అవుతుంది. ఇలా ఇషాంత్ శర్మ ఒకానొక సందర్భంలో ఆస్ట్రేలియా ఆటగాడు స్టీవ్ స్మిత్‌ను గేలి చేసిన సంగతి అందరికీ సుపరిచితమే. 2017లో బెంగళూరులో ఆసీస్‌తో జరిగిన టెస్టులో స్మిత్‌ను తన ముఖ కవలికల ద్వారా గేలి చేశాడు ఇషాంత్. ఇది క్రికెట్ అభిమానుల మదిలో ఎప్పటికీ గుర్తుండిపోయే సంఘటన. స్మిత్‌ను పదే పదే ఇలా స్లెడ్జ్ చేస్తూ ఇషాంత్ శర్మ పైచేయి సాధించే యత్నం చేశాడు. ఇషాంత్ అలా గేలి చేయడం, కోహ్లి పగలబడి నవ్వడం అప్పుడు హాట్ టాపిక్‌గా మారాయి. (వికెట్ కీపర్‌గా గిల్‌క్రిస్ట్.. ధోనికి నో చాన్స్!) కాగా, ఆనాటి సంఘటనను తాజాగా మరోసారి గుర్తు చేసుకున్నాడు ఇషాంత్. అసలు అలా ఎందుకు చేశాడో చెప్పుకొచ్చాడు. స్మిత్‌ను అసౌకర్యానికి గురి చేయడంలో భాగంగానే అలా చేశానని ఇషాంత్ తెలిపాడు. ‘ అది మా ప్రణాళికలో భాగమే. స్మిత్‌ను క్రీజ్‌లో కుదురకోనీయకుండా చేయాలంటే మానసికంగా ఇబ్బంది పెట్టాలి అనేది ప్లాన్. అది ఒక క్లోజ్ గేమ్. నువ్వు బ్యాట్స్‌మన్ ఏకాగ్రతను దెబ్బతీయడానికి ఏమి చేయాలని చూస్తావో.. నేను కూడా దాదాపు అదే చేశా. స్మిత్ చాలాసార్లు బౌలర్లను విసిగిస్తాడు. క్రీజ్‌లో కుదురుకుంటే పరుగులు చేసుకుంటూ పోతాడు. మేము స్మిత్‌ను సాధ్యమైనంత త్వరగా ఔట్ చేస్తే అప్పుడు మేము గెలవడానికి అవకాశం ఉంటుంది. నేను కేవలం అతని ఏకాగ్రతను దెబ్బతీసి అసౌకర్యానికి గురి చేయాలనే లక్ష్యంగా పెట్టుకున్నా. ఇక విరాట్ కోహ్లికి దూకుడు ఎక్కువ. దూకుడును కోహ్లి ఎక్కువ ఇష్టపడతాడు. ఇలా చేయొద్దని ఎప్పుడు చెప్పడు. నువ్వు ఏమి చేయాలనుకుంటున్నావో అది చెయ్యమని చెబుతాడు. అది కూడా నిషేధం పడకుండా ఉండేలా చూసుకోమని మాత్రమే చెబుతాడు’ అని టెస్టు ఓపెనర్ మయాంక్ అగర్వాల్‌తో షేర్ చేసుకున్నాడు ఇషాంత్. బీసీసీఐ టీవీ నిర్వహించిన ఓపెన్ నెట్స్ విత్ మయాంక్ కార్యక్రమంలో ఇషాంత్ ఈ విషయాన్ని వెల్లడించాడు.(స్టోక్స్ కోసం ఏమైనా రూల్స్ మార్చారా?) -
మన పేస్‌కు మరో రెండేళ్లు ఎదురేలేదు
న్యూఢిల్లీ: టెస్టుల్లో భారత విజయవంతమైన పేస్ బలగానికి మరో రెండేళ్లు ఎదురేలేదని టీమిండియా బౌలింగ్ కోచ్ భరత్ అరుణ్ అన్నారు. ఇషాంత్ శర్మ, షమీ, ఉమేశ్ యాదవ్, బుమ్రాలతో కూడిన భారత జట్టు రెండేళ్లుగా ఇంటాబయటా విశేషంగా రాణిస్తున్న సంగతి తెలిసిందే. వచ్చే రెండేళ్ల వరకూ కూడా ఈ దళానికి ఢోకాలేదని భరత్ చెప్పుకొచ్చారు. ఆస్ట్రేలియాతో నాలుగు టెస్టులు, ఇంగ్లండ్‌తో ఐదు టెస్టుల సిరీస్ దాకా వాళ్ల పేస్ పదును కొనసాగుతుందని చెప్పారు. ఆ తర్వాత వెటరన్ పేసర్లు రిటైరైనా బుమ్రా దూకుడు అలాగే ఉంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. -
పాంటింగే అత్యుత్తమ కోచ్: భారత బౌలర్
హైదరాబాద్: ఆస్ట్రేలియా మాజీ సారథి, ఢిల్లీ క్యాపిటల్స్ ప్రధాన కోచ్ రికీ పాంటింగ్‌పై సీనియర్ బౌలర్ ఇషాంత్ శర్మ ప్రశంసల వర్షం కురిపించాడు. సోమవారం ఇన్స్టాగ్రామ్ లైవ్‌లో అభిమానులతో ముచ్చటించిన ఇషాంత్ పలు ఆసక్తికవిషయాను వెల్లడించాడు. తాను కలిసిన వారిలో పాంటింగ్ అత్యుత్తమ కోచ్ అని లంబూ స్పష్టం చేశాడు.‘గడేడాది ఐపీఎల్లో ఆడేందుకు జట్టులో చేరినప్పుడు కాస్త ఇబ్బందిపడ్డాను. ఆ సమయంలో నా మొదటి చాయిస్ ఎప్పుడూ నువ్వే.. సీనియర్వి కాబట్టి కొత్త కుర్రాళ్లకు దారి చూపించు అని పాంటింగ్ పేర్కొంటూ నాలో ఆత్మవిశ్వాసాన్ని నింపాడు. సీనియర్‌గా ఎలా ఉండాలో నేర్పాడు. అతని సలహాలు నాకు ఎంతగానో ఉపయోగపడ్డాయి’ అంటూ ఇషాంత్ పేర్కొన్నాడు. ఈ క్రమంలో 2008లో భారత్-ఆస్ట్రేలియా టెస్టు సిరీస్ గురించి లంబూ వద్ద అభిమానులు ప్రస్తావించారు. ‘ఇక పాంటింగ్ అంతర్జాతీయ క్రికెట్లో కొనసాగుతున్నప్పుడు ఎక్కువ సార్లు ఔట్ చేయడం, అతడిని ఎక్కువగా ఇబ్బంది పెట్టిన విషయం ఎప్పటికీ మరిచిపోలేను. ముఖ్యంగా 2008లో జరిగిన పెర్త్ టెస్టులో పాంటింగ్‌కు బౌలింగ్ చేసిన విధానం, అనంతరం స్వదేశంలో అతడిని ఇబ్బంది పెట్టిన తీరు నా కెరీర్లో చాలా గొప్పవి’ అని ఇషాంత్ పేర్కొన్నాడు. ఇక ప్రసుతం భారత టెస్టు జట్టులో రెగ్యులర్ బౌలర్ అయిన ఇషాంత్ నిలకడగా రాణిస్తూ జూనియర్లకు మార్గనిర్దేశకం చేస్తున్నాడు. ఇక ఐపీఎల్లో ఢిల్లీ క్యాపిటల్స్ తరుపున లంబూ ప్రాతినిథ్యం వహిస్తున్న విషయం తెలిసిందే. ఇక గత సీజన్లో ఢిల్లీ తరుపున 13 మ్యాచ్‌లు ఆడిన ఇషాంత్ 13 వికెట్లు పడగొట్టాడు. చదవండి: ‘కశ్మీర్ గురించి పట్టించుకోవడం మానేయ్’ ‘ఆ ఇన్నింగ్స్’ ఆడాలనుంది! -
గంభీర్‌తో గొడవపై పదేళ్ల తర్వాత..
కరాచీ: పదేళ్ల క్రితం టీమిండియా మాజీ ఓపెనర్ గౌతం గంభీర్‌తో జరిగిన వాగ్వాదంపై పాకిస్తాన్ వెటరన్ వికెట్ కీపర్ కమ్రాన్ అక్మల్ పెదవి విప్పాడు. ఆనాటి గొడవపై మాట్లాడుతూ.. అది కావాలని జరిగింది కాదని, ఆ సమయంలో అపార్థం చోటు చేసుకోవడంతోనే అలా జరిగిందన్నాడు. 2010లో శ్రీలంక వేదికగా జరిగిన ఆసియా కప్‌లో గౌతం గంభీర్-కమ్రాన్ అక్మల్‌ల మధ్య తీవ్ర స్థాయిలో వాగ్వాదం చోటు చేసుకుంది. ఇద్దరూ కొట్టుకునేలా తమ నోటికి పని చెప్పడంతో అంపైర్లు చొరవతో దానికి ముగింపు పలికారు. గంభీర్ బ్యాటింగ్ చేస్తుండగా.. కమ్రాన్ అక్మల్ పదే పదే కీపర్ క్యాచ్ కోసం అప్పీల్ చేశాడు. దాంతో సహనం కోల్పోయిన గంభీర్ అతనికి చిన్నపాటి వార్నింగ్ ఇవ్వగా.. కమ్రాన్ అక్మల్ కూడా అదే తరహాలో బదులివ్వడంతో మైదానంలో ఘర్షణ వాతావరణం నెలకొంది. ఆ ఓవర్లో వచ్చిన బ్రేక్‌తో ఇద్దరూ మరోసారి మాటలు తూటాలు పేల్చుకున్నారు. ఈ క్రమంలో ఇద్దరూ ఒకరినొకరు కొట్టుకునేలా కనిపించారు. అయితే మధ్యలో అంపైర్లు కలగజేసుకుని సర్దిచెప్పగా.. అప్పుడు అక్కడే ఉన్న ఎంఎస్ ధోని.. గంభీర్‌ని శాంతపరిచాడు. ఆపై 2012-13 సీజన్లో జరిగిన మ్యాచ్‌లో ఇషాంత్ శర్మపై అక్మల్ నోరు పారేసుకున్నాడు.(తమ్ముడూ... సచిన్, ధోని, కోహ్లిలను చూసి నేర్చుకో) ఈ రెండు ఘటనలు అనుకోకుండా జరిగినవేనని కమ్రాన్ అక్మల్ తెలిపాడు. ‘నేను-గంభీర్ మంచి ఫ్రెండ్స్. మేమిద్దరం లిస్ట్-ఎ క్రికెట్ ఆడే క్రమంలో స్నేహితులుగా ఉండేవాళ్లుం. ఆనాడు గంభీర్‌తో గొడవ ఎందుకు వచ్చిందో కూడా సరిగా తెలియదు. కావాలని గంభీర్‌తో గొడవ పడలేదు. ఇషాంత్ శర్మతో గొడవ ఘటన కూడా అంతే. నాకు ఇషాంత్ కూడా స్నేహితుడే. నేను ఫీల్డ్‌లో ఎక్కువగా మాట్లాడను. అవి చాలా చిల్లర ఘటనలు. మేము ఒకరినొకరు గౌరవించుకుంటాం. ఫీల్డ్‌లో జరిగింది అక్కడికే పరిమితం’ అని కమ్రాన్ తెలిపాడు. పాకిస్తాన్ తరఫున 53 టెస్టులు, 157 వన్డేలు, 58 టీ20లను కమ్రాన్ ఆడాడు. 2017లో పాకిస్తాన్ తరఫున చివరిసారి కనిపించాడు కమ్రాన్. ఆ తర్వాత పేలవమైన ఫామ్‌తో జట్టులో చోటు కోల్పోయాడు. ఆ స్థానాన్ని సర్ఫరాజ్ అహ్మద్ భర్తీ చేయడంతో కమ్రాన్‌కు చోటు లేకుండా పోయింది. ఒకానొక సమయంలో కమ్రాన్‌పై సర్ఫరాజ్ బహిరంగ విమర్శలు కూడా చేశాడు. కమ్రాన్ జట్టులో చోటు కోల్పోవడానికి సర్ఫరాజ్ లాబీయింగ్ చేశాడనేది అప్పట్లో బాగా వినిపించింది. (అక్తర్‌పై ‘పీసీబీ’ పరువు నష్టం కేసు) -
‘టీమిండియా పేస్ దెబ్బకు బెంబేలెత్తిపోయా’
మెల్బోర్న్: భారత క్రికెట్ పేస్ బౌలింగ్‌పై ఆస్ట్రేలియా టెస్టు ఓపెనర్ మార్కస్ హారిస్ ప్రశంసల వర్షం కురిపించాడు. గత కొన్నేళ్లుగా భారత్ పేస్ బౌలింగ్ విభాగం అత్యంత పటిష్టంగా మారిపోయిందంటూ కొనియాడాడు. ప్రధానంగా జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ షమీ, ఇషాంత్ శర్మల పేస్ త్రయాన్ని పొగడ్తల్లో ముంచెత్తాడు. దీనిలో భాగంగా 2018-19లో ఆస్ట్రేలియా పర్యటనకు భారత్ వచ్చిన సందర్భంలో ఆ జట్టు పేస్ బౌలింగ్ విభాగం తనకు సవాల్‌గా మారిపోయిందనే విషయాన్ని హారిస్ గుర్తు చేసుకున్నాడు. ‘ ఆ పర్యటనలో టీమిండియా పేస్ ఎటాక్‌ను ఎదుర్కోవడానికి హడలిపోయా. ప్రత్యేకంగా పెర్త్‌లో జరిగిన టెస్టులో భారత్ పేసర్లు నన్ను విపరీతంగా భయపెట్టారు.(ఇది ధోని రీఎంట్రీకి సంకేతమా?) టీవీల్లో చూస్తే పేస్‌లో దూకుడు అంతగా కనిపించి ఉండకపోవచ్చు. కానీ బుమ్రా, ఇషాంత్, షమీ, ఉమేశ్ యాదవ్‌లు భీకరమైన బంతులతో చెలరేగిపోయారు. ప్రధానంగా మధ్య ఓవర్లలో వారు మరింత ప్రమాదకరంగా మారిపోయారు ’అని అమెజాన్ ఇటీవల విడుదల చేసిన సిరీస్ ‘ద టెస్టు’లో హారిస్ తన గత అనుభవాలను పంచుకున్నాడు. ఆనాటి పెర్త్ టెస్టులో హారిస్ హెల్మెట్‌కు బంతి బలంగా తగలడంతో ఆసీస్ శిబిరంలో ఆందోళన వ్యక్తమైంది. . ఆసీస్ రెండో ఇన్నింగ్స్‌లో బుమ్రా వేసిన బౌన్సర్ హారిస్ హెల్మెట్‌కు తాకింది. ఆ సమయంలో నాలుగు పరుగుల వద్ద ఉన్న హారిస్.. హెల్మెట్‌ను మార్చుకుని మళ్లీ ఆడటానికి సిద్ధమయ్యాడు. కాగా, హారిస్ 20 వ్యక్తిగత పరుగుల వద్ద ఉండగా బుమ్రా బౌలింగ్‌లో బౌల్డ్ అయ్యాడు. ఆ మ్యాచ్‌ను భారత్ కోల్పోయింది. ఇదిలా ఉంచితే, టెస్టు సిరీస్‌ను మాత్రం భారత్ 2-1తేడాతో కైవసం చేసుకుంది. పెర్త్ టెస్టులో భారత్ ఓటమి పాలైనప్పటికీ రెండు టెస్టులను గెలిచి సిరీస్‌ను సొంతం చేసుకుంది. ఈ నాలుగు టెస్టుల సిరీస్‌లో ఒక టెస్టు మ్యాచ్ డ్రా అయ్యింది. -
ఇషాంత్ అవుట్
క్రైస్ట్‌చర్చ్: కివీస్ పర్యటనలో ఆఖరి పోరుకు ముందు భారత్‌కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. సీనియర్ పేసర్ ఇషాంత్ శర్మ గాయపడ్డాడు. అతని కుడి చీలమండకు గాయం కావడంతో రెండో టెస్టుకు అతను అందుబాటులో లేకుండా పోయాడు. ఇతని స్థానంలో ఉమేశ్ యాదవ్ బరిలోకి దిగే అవకాశముంది. ఇషాంత్‌కు అయిన గాయం కొత్తదేం కాదు. జనవరిలో రంజీ ట్రోఫీ మ్యాచ్‌లో గాయపడ్డాడు. అప్పుడే అతను కివీస్ పర్యటనకు అనుమానమేనని వార్తలొచ్చాయి. అయితే చక్కటి ఫామ్‌లో ఉన్న ఇషాంత్‌ను... వేగంగా కోలుకున్నాడనే కారణంతో టెస్టు జట్టులోకి తీసుకున్నారు. టీమ్ మేనేజ్మెంట్ ఆశించినట్లుగానే తొలిటెస్టులో ఇషాంత్ (5/68) రాణించాడు. బ్యాటింగ్ వైఫల్యంతో భారత్ ఈ మ్యాచ్ ఓడింది. శుక్రవారం జట్టు సభ్యులు ప్రాక్టీసు చేస్తుండగా... అతను కూడా వచ్చాడు. కానీ అసౌకర్యంగా కనిపించడంతో నెట్ ప్రాక్టీస్‌కు దూరంగా ఉన్నాడు. దీంతో జట్టు మేనేజ్మెంట్ ముందు జాగ్రత్తగా అతని కుడి చీలమండకు స్కానింగ్ కూడా తీయించింది. రిపోర్టులు ప్రతికూలంగా వచ్చినట్లు సమాచారం. బౌలింగ్‌లో ఎదురుదెబ్బ తగిలినా... బ్యాటింగ్‌లో మాత్రం యువ ఓపెనర్ పృథ్వీ షా ఫిట్నెస్తో ఉండటం జట్టుకు కలిసొచ్చే అంశం. అతని ఎడమ పాదానికి అయిన వాపు మానిందని, రెండో టెస్టు ఆడతాడని భారత హెడ్ కోచ్ రవిశాస్త్రి తెలిపాడు. ఫామ్‌లోలేని వెటరన్ స్పిన్నర్ అశ్విన్ స్థానంలో స్పిన్ ఆల్‌రౌండర్ జడేజాను తీసుకునేది ఖాయమైంది. జడేజా బ్యాటింగ్ చేయగల సమర్థుడు కావడంతో అతన్ని తీసుకోవాలని కోచ్‌తో పాటు కెప్టెన్ కోహ్లి నిర్ణయించినట్లు తెలిసింది. బ్యాటింగ్ పిచ్! క్రైస్ట్‌చర్చ్ వికెట్ బ్యాటింగ్‌కు అనుకూలం. గత టెస్టులా కాకుండా ఈ మ్యాచ్‌లో పరుగుల వరద పారే అవకాశముంది. ఇది బ్యాట్స్‌మెన్‌కు ఊరటనిచ్చే అంశం. ప్రత్యేకించి భారత బ్యాట్స్‌మెన్ ఆఖరి పోరులో అదిరిపోయే ఆట ఆడేందుకు ఇది చక్కని వేదిక. -
రెండో టెస్టుకు ఇషాంత్ ఔట్?
క్రిస్ట్‌చర్చ్: న్యూజిలాండ్‌తో జరిగిన తొలి టెస్టులో ఘోర ఓటమి పాలైన టీమిండియాకు మరో సమస్య వచ్చినట్లే కనబడుతోంది. తొలి టెస్టులో ఐదు వికెట్లతో రాణించిన పేసర్ ఇషాంత్ శర్మ.. రెండో టెస్టుకు దూరమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. చీలమండ గాయం మళ్లీ తిరగబెట్టడంతో ఇషాంత్.. టీమిండియాప్రాక్టీస్ సెషన్‌కు హాజరు కాలేదు. దాంతో ఇషాంత్ రెండో టెస్టులో ఆడటంపై సందేహాలు ఏర్పడ్డాయి. మ్యాచ్ తుది జట్టును ప్రకటించే సమయానికి ఇషాంత్ ఫిట్ అయితే అతను ఆడతాడు. ఒకవేళ గాయం తీవ్రత ఎక్కువగా ఉంటే మాత్రం అనుమానమే. ఇషాంత్ శర్మ దూరమైతే అతని స్థానంలో ఉమేశ్ యాదవ్ ఆడే అవకాశం ఉంది. టీమిండియా ప్రధాన కోచ్ రవిశాస్త్రి, బౌలింగ్ కోచ్ భరత్ అరుణ్‌ల పర్యవేక్షణలో ఉమేశ్ యాదవ్ నెట్ సెషన్లో సీరియస్‌గా ప్రాక్టీస్ చేశాడు. దాంతో ఇషాంత్ రెండో టెస్టులో ఆడే అవకాశాలు దాదాపు సన్నగిల్లేనట్లేననే అనుమానాలు తలెత్తాయి. ఒకవేళ ఇషాంత్ శర్మ జట్టుకు దూరమైతే అది గట్టి ఎదురుదెబ్బనే చెప్పాలి. సిరీస్‌ను సమం చేయాలని చూస్తున్న టీమిండియా.. గత మ్యాచ్‌లో రాణించిన ఇషాంత్ లేకపోతే నెట్టుకురావడం కష్టమే. చీలమండ గాయంతో నెలకు పైగా విశ్రాంతి తీసుకుని జట్టులో చేరిన ఇషాంత్ విశేషంగా రాణించాడు. తొలి టెస్టు మన పేస్ విభాగంలో కివీస్ బ్యాటింగ్‌ను ఇషాంత్ మాత్రమే ఇబ్బంది పెట్టాడు. బుమ్రా, షమీలకు తలో వికెట్ మాత్రమే తీస్తే, ఇషాంత్ మాత్రం పదునైన బంతులతో కివీస్ బ్యాట్స్‌మెన్‌కు పరీక్ష పెట్టాడు. ఇషాంత్ దూరమైన పక్షంలో అది కచ్చితంగా న్యూజిలాండ్‌కు కలిసొచ్చే అంశమే. -
‘మూడు’లో నిలవడానికి మూడు వికెట్లు!
క్రిస్ట్‌చర్చ్: టీమిండియా పేసర్ ఇషాంత్ శర్మ ‘ట్రిపుల్ సెంచరీ’ క్లబ్లో చేరడానికి చేరువగా ఉన్నాడు. న్యూజిలాండ్‌తో టెస్టు సిరీస్‌లో భాగంగా తొలి టెస్టులో ఐదు వికెట్లతో ఆకట్టుకున్న ఇషాంత్.. తన టెస్టు కెరీర్లో ఇప్పటివరకూ 297 వికెట్లను సాధించాడు. మరొకవైపు టెస్టు కెరీర్లో ఐదు వికెట్లను 11వ సారి సాధించాడు. ఈ క్రమంలోనే ఓ అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు. టెస్టుల్లో అత్యధిక సార్లు ఐదు వికెట్లు తీసిన రెండో భారత పేసర్‌గా జహీర్ సరసన ఇషాంత్ చేరాడు. జహీర్ 92 టెస్టుల్లో 11 సార్లు ఐదు వికెట్లు పడగొట్టగా.. ఇషాంత్ 97 టెస్టుల్లో ఈ ఘనతను అందుకున్నాడు. ఈ జాబితాలో కపిల్ దేవ్(23) అగ్రస్థానంలో ఉన్నాడు. ఇక విదేశీ గడ్డపై ఎక్కువ సార్లు ఐదు వికెట్లు(9) పడగొట్టిన మూడో టీమిండియా బౌలర్‌గా లంబూ నిలిచాడు. (ఇక్కడ చదవండి: జహీర్ ఖాన్ సరసన ఇషాంత్) కాగా, ఇప్పుడు మూడొందల టెస్టు వికెట్ల క్లబ్లో చేరడానికి ఇషాంత్ స్వల్ప దూరంలో నిలిచాడు. శనివారం నుంచి క్రిస్ట్‌చర్చ్ వేదికగా జరుగనున్న రెండో టెస్టులో ఇషాంత్ ఈ ఫీట్ సాధించే అవకాశం ఉంది. ఈ అరుదైన మైలురాయికి మూడు వికెట్ల దూరంలో మాత్రమే ఇషాంత్ ఉన్నాడు. ఇప్పటివరకూ భారత్ తరఫున ఐదుగురు మాత్రమే మూడొందల టెస్టు వికెట్ల క్లబ్లో చేరారు. అనిల్ కుంబ్లే(619), కపిల్‌దేవ్(434), హర్భజన్ సింగ్(417), అశ్విన్(365), జహీర్‌ఖాన్(311)లు మాత్రమే మూడొందల వికెట్లను సాధించిన భారత బౌలర్లు. వీరిలో కపిల్‌దేవ్, జహీర్‌ఖాన్‌లు పేసర్లు కాగా, మిగతా ముగ్గురు స్పిన్నర్లు. అత్యధిక టెస్టులు రికార్డు కూడా ఇషాంత్‌దే..! మూడొందల టెస్టు వికెట్లు సాధించే క్రమంలో అత్యధిక మ్యాచ్‌లు ఆడిన ఘనత న్యూజిలాండ్ మాజీ కెప్టెన్ డానియల్ వెటోరి పేరిట ఉంది. వెటోరి 94వ టెస్టులో 300 వికెట్ల మార్కును చేరుకున్నాడు. దీన్ని ఇషాంత్ బ్రేక్ చేయనున్నాడు. న్యూజిలాండ్‌తో రెండో టెస్టు ఇషాంత్‌కు 98వ మ్యాచ్ కానుంది. దాంతో వెటోరీ 94 టెస్టుల రికార్డును ఇషాంత్ బద్ధలు కొట్టనున్నాడు. 2018 నుంచి రెగ్యులర్ మెంబర్‌గా... భారత జట్టులో రెగ్యులర్ మెంబర్‌గా మారడానికి ఇషాంత్‌కు మంచి బ్రేక్ వచ్చింది మాత్రం 2018లోనే. ఆ ఏడాది నుంచి ఇషాంత్ శర్మ భారత టెస్టు జట్టులో రెగ్యులర్ సభ్యుడిగా మారిపోయాడు. 2018 నుంచి ఇప్పటివరకూ ఇషాంత్ శర్మ 71 వికెట్లను ఖాతాలో వేసుకున్నాడు. ఈ క్రమంలోనే 19.14 యావరేజ్ సాధించాడు. ఫలితంగా కనీసం 50 వికెట్లు సాధించిన పేసర్ల యావరేజ్ జాబితాలో ఇషాంత్ శర్మ రెండో స్థానంలో ఉన్నాడు. -
భారమంతా హనుమ, అజింక్యాలపైనే!
వెల్లింగ్టన్: న్యూజిలాండ్‌తో జరుగుతున్న తొలి టెస్టును టీమిండియా గెలుచుకోవాలన్నా, కనీసం డ్రా చేయాలన్నా ఆ భారమంతా వైస్ కెప్టెన్ అజింక్యా రహానే, తెలుగు కుర్రాడు హనుమ విహారిలదే. తొలి ఇన్నింగ్స్ లోటు 183 పరుగులతో రెండో ఇన్నింగ్స్ ఆరంభించిన టీమిండియా మూడో రోజు ఆట ముగిసే సమయానికి 4 వికెట్ల నష్టానికి 144 పరుగులు చేసింది. ఇంకా 39 పరుగుల వెనుకంజలో కోహ్లి సేన ఉంది. ప్రస్తుతం అజింక్యా రహానే (25 బ్యాటింగ్), విహారి (15 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు. ఓపెనర్ మయాంక్ అగర్వాల్(58) మినహా.. పృథ్వీ షా(14), పుజారా(11), కోహ్లి(19)లు ట్రెంట్ బౌల్ట్ ధాటికి పెవిలియన్‌కు క్యూ కట్టారు. ఇంకా రెండు రోజుల ఆట ఉండటంతో నాలుగో రోజు రహానే, విహారిలతో పాటు రిషభ్ పంత్‌లు బ్యాటింగ్‌పైనే టీమిండియా తొలి టెస్టు భవిత్యం ఆధారపడి ఉంది. బ్యాట్స్‌మెన్ తీరు మారలేదు.. పరువు కోసం తప్పక పోరాడాల్సిన స్థితిలో టీమిండియా టాపార్డర్ నిర్లక్ష్యంగా ఆడి వికెట్లు పారేసుకుంది. ముందుగా ట్రెంట్ బౌల్ట్ వేసిన బంతిని అంచనా వేయడంలో పొరపాటు పడిన ప్రథ్వీ షా తన వికెట్ పారేసుకున్నాడు. ఓ వైపు మయాంక్ అగర్వాల్ పోరాడుతుండగా.. పుజారా క్రీజులో నిలదొక్కుకునే ప్రయత్నం చేశాడు. టీ విరామానికి ముందు కోహ్లి సేనకు ఓ పెద్ద షాక్ తగిలింది. బౌల్ట్ బౌలింగ్‌లో పుజారా బౌల్డ్ అయి తీవ్రంగా నిరాశపరిచాడు. హాప్ సెంచరీతో ఊపుమీదున్న మయాంక్ అగర్వాల్ టిమ్ సౌతీ వేసిన లెగ్ సైడ్ బంతిని వెంటాడి మరి కీపర్ క్యాచ్‌గా వెనుదిరిగాడు. మూడు ఫోర్లతో కాన్ఫిడెంట్‌గా కనిపించిన సారథి కోహ్లి.. బౌల్ట్ వేసిన షార్ట్ పిచ్ బంతిని అనవసరంగా టచ్ చేసి క్యాచ్ అవుటయ్యాడు. దీంతో 113 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయిన టీమిండియా పీకల్లోతు కష్టాల్లో పడింది. రహానే, విహారిలు భారీ భాగస్వామ్యం నమోదు చేయడం, పంత్ మెరుపులు మెరిపిస్తే తప్ప టీమిండియా గెలిచే అవకాశాలు లేవు. మరి నాలుగో రోజు టీమిండియా ఏం చేస్తుందో చూడాలి. జేమిసన్, బౌల్ట్ బౌండరీల వర్షం.. 51 పరుగుల ఆధిక్యంతో ఓవర్‌నైట్ స్కోర్ 216/5తో మూడో రోజు ఆటను ఆరంభించిన కివీస్ తొలి ఇన్నింగ్స్‌లో 348 పరుగులకు ఆలౌటైంది. మూడో రోజు వేసిన తొలి బంతికే వాట్లింగ్(14)ను ఔట్ చేసి టీమిండియా శిబిరంలో బుమ్రా ఆనందం నింపాడు. అనంతరం సౌతీ(6) కూడా ఎక్కువసేపు క్రీజులో నిలదొక్కుకోలేదు. సౌతీని ఇషాంత్ బోల్తాకొట్టించాడు. ఇక ఇక్కడి నుంచి అసలు ఆట ప్రారంభమైంది. ఓ వైపు గ్రాండ్‌హోమ్ క్రీజులో నిలదొక్కుకోగా జేమీసన్ యథేచ్చగా బ్యాటింగ్ చేశాడు. బౌండరీలతో స్కోర్ బోర్డును పరుగులు పెట్టించాడు. కేవలం 45 బంతుల్లోనే నాలుగు సిక్సర్లు, 1 ఫోర్‌తో 44 పరుగులు చేసి అశ్విన్ బౌలింగ్‌లో అవుటయ్యాడు. అనంతరం గ్రాండ్‌హోమ్(43; 74 బంతుల్లో 5ఫోర్లు)ను కూడా అశ్విన్ బోల్తాకొట్టించాడు. ఈ క్రమంలో క్రీజులోకి వచ్చిన ట్రెంట్ బౌల్ట్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. కేవలం 24 బంతుల్లో 5ఫోర్లు, 1 సిక్సర్ సహాయంతో 38 పరుగులు చేసి కివీస్‌కు కావాల్సిన ఆధిక్యాన్ని టీమిండియాకు జరగాల్సిన నష్టాన్ని కలిగించి ఔటయ్యాడు. దీంతో కివీస్ తొలి ఇన్నింగ్స్‌లో 100.2 ఓవర్లలో 348 పరుగులకు ఆలౌటైంది. భారత బౌలర్లలో ఇషాంత్ శర్మ (5/68), అశ్విన్(3/99)లు రాణించగా.. షమీ, బుమ్రాలు తలో వికెట్ దక్కించుకున్నారు. చదవండి: ‘నా కలల రాకుమారి సోనాలి బింద్రే’ పాక్ పౌరసత్వం కోసం సామీ దరఖాస్తు! ఆధిక్యం 51 నుంచి 183కు.. -
అది కామెడీగా ఉంది: ఇషాంత్
వెల్లింగ్టన్: విమర్శకులకు ఓపిక ఉండదంటారు. ఎందుకంటే ఎవరైన ఒక చిన్న పొరపాటు చేసినా అతడికి సంబంధించిన గత ఘనతలను, రికార్డులను పట్టించుకోకుండా ఏకిపారేస్తుంటారు. పరిస్థితులు, ప్రదర్శనను పట్టించుకోకుండా కేవలం ఫలితం ఆదారంగానే విమర్శలు గుప్పిస్తుంటారు. ప్రస్తుతం టీమిండియా స్టార్ పేసర్ జస్ప్రిత్ బుమ్రా కూడా విమర్శకులకు ప్రధాన టార్గెట్‌గా నిలిచాడు. గాయం కారణంగా నాలుగు నెలలకు పైగా ఆటకు దూరమైన బుమ్రా శ్రీలంకతో జరిగిన టీ20 సిరీస్‌లో రీఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. అనంతరం టీమిండియా పేస్ దళపతిగా బుమ్రా న్యూజిలాండ్ గడ్డపై అడుగుపెట్టాడు. అయితే ఇప్పటివరకు జరిగిన రెండు ఫార్మట్లలో అంతగా ఆకట్టుకోని బుమ్రా.. తొలి టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో తేలిపోయాడు. వికెట్లను తీయకపోగా పరుగులు కట్టడిచేయడంలో విఫలమవుతున్నాడు. దీంతో బుమ్రాపై అన్ని వైపులా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలో బుమ్రాకు అండగా సీనియర్ బౌలర్ ఇషాంత్‌శర్మ నిలిచాడు. ‘రెండేళ్లుగా టెస్టుల్లో నేను, బుమ్రా, షమీ, అశ్విన్, జడేజా కలిసి 20 వికెట్లు పడగొడుతున్నాం. కేవలం ఒక మ్యాచ్ లేక ఒక ఇన్నింగ్స్‌తో ఓ ఆటగాడి సాఘార్థ్యాన్ని ప్రశ్నిస్తారు. బుమ్రా ప్రతిభ గురించి ఎవరూ ప్రశ్నించరని అనుకుంటున్నా. అరంగేట్ర మ్యాచ్ నుంచి అతడి సాధించిన రికార్డులు, ఘనతలు మనందరికీ తెలుసు. కష్టకాలంలో అండగా నిలవాలి. ఇలా ఒక ఇన్నింగ్స్‌కే గత అభిప్రాయాలను మార్చుకొని విమర్శించడం హాస్యాస్పదంగా ఉంది’అని ఇషాంత్ పేర్కొన్నాడు. ఇక కివీస్ సీనియర్ బౌలర్ టిమ్ సౌతీ కూడా బుమ్రాకు మద్దతుగా నిలిచాడు. అత్యుత్తమంగా రాణించేందుకు అతడు కఠోర సాధన చేస్తున్నాడన్నాడు. కొన్ని సార్లు పరిస్థితులు అనకూలించక బాగా బౌలింగ్ చేసిన వికెట్లు దొరకవని సౌతీ పేర్కొన్నాడు. ఇక తొలి ఇన్నింగ్స్‌లో వాట్లింగ్ వికెట్ ఒక్కటి మాత్రమే బుమ్రా దక్కించుకున్నాడు. కివీస్‌తో జరిగిన మూడు వన్డేల సిరీస్‌లో బుమ్రా ఒక్క వికెట్‌కు దక్కించుకోని విషయం తెలిసిందే. చదవండి: జహీర్ ఖాన్ సరసన ఇషాంత్ ఆధిక్యం 51 నుంచి 183కు.. -
జహీర్ ఖాన్ సరసన ఇషాంత్
వెల్లింగ్టన్: ఆతిథ్య న్యూజిలాండ్‌తో జరుగుతున్న మొదటి టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో టీమిండియా సీనియర్ బౌలర్ ఇషాంత్ శర్మ ఐదు వికెట్లతో మెరిశాడు. మిగతా పేస్ బౌలర్లు రాణించని చోట ఇషాంత్ రాణించడంతో కివీస్‌ను తొలి ఇన్నింగ్స్‌లో టీమిండియా కట్టడి చేయగలిగింది. ఓపెనర్లు టామ్ లాథమ్, టామ్ బ్లన్‌డెల్, సీనియర్ బ్యాట్స్‌మన్ రాస్ టేలర్లతో పాటు టెయిలెండర్లు టిమ్ సౌతీ, ట్రెంట్ బౌల్ట్‌ల వికెట్లను ఇషాంత్ పడగొట్టి ఈ ఐదు వికెట్లను తన ఖాతాలో వేసుకున్నాడు. టెస్టుల్లో ఐదు వికెట్లు తీయడం ఇషాంత్‌కు ఇది 11వ సారి. ఈ క్రమంలోనే ఓ అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు. టెస్టుల్లో అత్యధిక ఐదు వికెట్లు తీసిన రెండో భారత పేసర్‌గా జహీర్ సరసన ఇషాంత్ చేరాడు. జహీర్ 92 టెస్టుల్లో 11 సార్లు ఐదు వికెట్లు పడగొట్టగా.. ఇషాంత్ 97 టెస్టుల్లో ఈ ఘనతను అందుకున్నాడు. ఈ జాబితాలో కపిల్ దేవ్(23) అగ్రస్థానంలో ఉన్నాడు. ఇక విదేశీ గడ్డపై ఎక్కువ సార్లు ఐదు వికెట్లు(9) పడగొట్టిన మూడో టీమిండియా బౌలర్‌గా లంబూ నిలిచాడు. ఈ జాబితాలో తొలి రెండు స్థానాల్లో కపిల్ దేవ్(12), అనిల్ కుంబ్లే(10)లు ఉన్నారు. ఇక కివీస్‌తో టెస్టు సిరీస్ ప్రారంభానికి ముందు కూడా ఆడటం సందేహంగానే ఉన్నా...చివరకు సుదీర్ఘ ప్రయాణం తర్వాత ఇషాంత్ జట్టుతో చేరిన విషయం తెలిసిందే. చదవండి: ఇషాంత్ జోరు... ఆధిక్యం 51 నుంచి 183కు.. -
ఆధిక్యం 51 నుంచి 183కు..
వెల్లింగ్టన్: ఐదు ప్రధాన వికెట్లు తీశాం.. మూడో రోజు ఆట ప్రారంభమైన వెంటనే తోకను కత్తిరిస్తే ఆధిక్యం వందలోపే ఉంటుందని భావించిన కోహ్లి సేనకు న్యూజిలాండ్ టెయిలెండర్లు దిమ్మతిరిగే షాక్ ఇచ్చారు. తమ బౌలింగ్‌తో హడలెత్తించిన ఆతిథ్య బౌలర్లు బ్యాట్‌తోనూ మెరవడంతో కివీస్‌కు 183 పరుగుల మంచి ఆధిక్యం లభించింది. 51 పరుగుల ఆధిక్యంతో ఓవర్‌నైట్ స్కోర్ 216/5తో మూడో రోజు ఆటను ఆరంభించిన కివీస్ తొలి ఇన్నింగ్స్‌లో 348 పరుగులకు ఆలౌటైంది. మూడో రోజు వేసిన తొలి బంతికే వాట్లింగ్(14)ను ఔట్ చేసి టీమిండియా శిబిరంలో బుమ్రా ఆనందం నింపాడు. అనంతరం సౌతీ(6) కూడా ఎక్కువసేపు క్రీజులో నిలదొక్కుకోలేదు. సౌతీని ఇషాంత్ బోల్తాకొట్టించాడు. ఇక ఇక్కడి నుంచి అసలు ఆట ప్రారంభమైంది. ఓ వైపు గ్రాండ్‌హోమ్ క్రీజులో నిలదొక్కుకోగా జేమీసన్ యథేచ్చగా బ్యాటింగ్ చేశాడు. బౌండరీలతో స్కోర్ బోర్డును పరుగులు పెట్టించాడు. కేవలం 45 బంతుల్లోనే నాలుగు సిక్సర్లు, 1 ఫోర్‌తో 44 పరుగులు చేసి అశ్విన్ బౌలింగ్‌లో అవుటయ్యాడు. అనంతరం గ్రాండ్‌హోమ్(43; 74 బంతుల్లో 5ఫోర్లు)ను కూడా అశ్విన్ బోల్తాకొట్టించాడు. ఈ క్రమంలో క్రీజులోకి వచ్చిన ట్రెంట్ బౌల్ట్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. కేవలం 24 బంతుల్లో 5ఫోర్లు, 1 సిక్సర్ సహాయంతో 38 పరుగులు చేసి కివీస్‌కు కావాల్సిన ఆధిక్యాన్ని టీమిండియాకు జరగాల్సిన నష్టాన్ని కలిగించి ఔటయ్యాడు. దీంతో కివీస్ తొలి ఇన్నింగ్స్‌లో 100.2 ఓవర్లలో 348 పరుగులకు ఆలౌటైంది. భారత బౌలర్లలో ఇషాంత్ శర్మ (5/68), అశ్విన్(3/99)లు రాణించగా.. షమీ, బుమ్రాలు తలో వికెట్ దక్కించుకున్నారు. చదవండి: ఆధిక్యం పోయింది ఫోన్ మాట్లాడుతూ దొరికిపోయాడు! -
కివీస్ 348 పరుగులకు ఆలౌట్
-
ఆధిక్యం పోయింది
రెండు రోజులుగా సరైన నిద్ర లేదు... 24 గంటల విమాన ప్రయాణం... అయినా సరే పేస్ బౌలర్ ఇషాంత్ శర్మ మరోసారి తన పదును చూపించాడు. అతని చలవతో తొలి టెస్టులో న్యూజిలాండ్‌ను భారత్ కొంత వరకు కట్టడి చేయగలిగింది. ఇప్పటికే స్వల్ప ఆధిక్యం కోల్పోయినా సరే... మ్యాచ్ పూర్తిగా చేజారిపోలేదంటే ఇషాంత్ బౌలింగే కారణం. తొలి ఇన్నింగ్స్‌లో 165 పరుగులకే పరిమితమైన టీమిండియా రెండో రోజు ఆటలో ఐదు ప్రత్యర్థి వికెట్లు పడగొట్టగలిగింది. ఇద్దరు ప్రధాన బ్యాట్స్‌మెన్ క్రీజ్‌లో ఉండగా, మిగిలిన ఐదు వికెట్లతో కివీస్ తమ ఆధిక్యం ఎంత వరకు పెంచుకోగలదో... భారత్ ఎలా అడ్డుకోగలదో నిర్ణయించే ఆదివారం ఆట మ్యాచ్ గమనాన్ని శాసించే అవకాశం ఉంది. వెల్లింగ్టన్: భారత్‌తో జరుగుతున్న తొలి టెస్టులో న్యూజిలాండ్‌కు మొదటి ఇన్నింగ్స్‌లో ప్రస్తుతానికి 51 పరుగుల ఆధిక్యం లభించింది. రెండో రోజు శనివారం ఆట ముగిసే సమయానికి కివీస్ తమ తొలి ఇన్నింగ్స్‌లో 71.1 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 216 పరుగులు చేసింది. కెప్టెన్ కేన్ విలియమ్సన్ (153 బంతుల్లో 89; 11 ఫోర్లు) శతకం కోల్పోగా... కెరీర్లో 100వ టెస్టు ఆడుతున్న రాస్ టేలర్ (71 బంతుల్లో 44; 6 ఫోర్లు, 1 సిక్స్) ఫర్వాలేదనిపించాడు. వీరిద్దరు మూడో వికెట్‌కు 93 పరుగులు జోడించారు. 41 పరుగుల వ్యవధిలో కివీస్ 3 వికెట్లు చేజార్చుకుంది. ప్రస్తుతం వాట్లింగ్ (14 బ్యాటింగ్), గ్రాండ్‌హోమ్ (4 బ్యాటింగ్) క్రీజ్‌లో ఉన్నారు. భారత బౌలర్లలో ఇషాంత్ శర్మకు 3 వికెట్లు దక్కాయి. వెలుతురు మందగించడంతో అంపైర్లు ఆటను ముందుగానే నిలిపివేశారు. మొత్తంగా రెండో రోజు 11 ఓవర్ల ఆట తక్కువగా సాగింది. అంతకు ముందు ఓవర్‌నైట్ స్కోరు 122/5తో ఆట కొనసాగించిన భారత్ తమ తొలి ఇన్నింగ్స్‌లో 165 పరుగులకు ఆలౌటైంది. శనివారం 13.1 ఓవర్లు ఆడి చివరి 5 వికెట్లు చేజార్చుకున్న జట్టు మరో 43 పరుగులు జోడించగలిగింది. అజింక్య రహానే (138 బంతుల్లో 46; 5 ఫోర్లు) ఇన్నింగ్స్ టాప్ స్కోరర్‌గా నిలిచాడు. జేమీసన్, సౌతీ చెరో 4 వికెట్లు పడగొట్టారు. పంత్ రనౌట్‌తో... మ్యాచ్ రెండో రోజు కూడా బ్యాటింగ్‌లో భారత్‌కు అంతా ప్రతికూలంగానే సాగింది. శనివారం తొలి ఓవర్లోనే భారీ సిక్స్‌తో పంత్ (19) జోరుగా ఆట మొదలు పెట్టినా అది ఎక్కువ సేపు సాగలేదు. రహానే చేసిన తప్పుతో దురదృష్టవశాత్తూ పంత్ రనౌట్‌గా వెనుదిరిగాడు. సౌతీ బౌలింగ్‌లో పాయింట్ దిశగా ఆడిన రహానే లేని సింగిల్స్ కోసం పరుగు అందుకోగా, పంత్ మాత్రం ఆసక్తి చూపించలేదు. అయినా సరే రహానే తగ్గకుండా ముందుకు దూసుకొచ్చాడు. దాంతో సీనియర్ కోసం వికెట్ త్యాగం చేసేందుకు జూనియర్ సిద్ధపడ్డాడు. ఎజాజ్ విసిరిన త్రో నేరుగా స్టంప్స్‌ను తాకడంతో రనౌట్ కాక తప్పలేదు. 64 టెస్టుల కెరీర్లో రహానే ఒక రనౌట్‌లో భాగం కావడం ఇదే మొదటిసారి! తర్వాతి బంతికే చక్కటి అవుట్ స్వింగర్‌తో అశ్విన్ (0)ను సౌతీ బౌల్ట్ చేశాడు. ఆ తర్వాత రహానే కూడా ఎక్కువ సేపు నిలవలేదు. అతను కూడా ‘భిన్నమైన’ రీతిలోనే వెనుదిరిగాడు. సౌతీ వేసిన బంతిని ఆడకుండా వదిలేసే క్రమంలో బ్యాట్‌ను పైకి ఎత్తినా... బ్యాట్ లోపలి భాగాన్ని తాకుతూ వెళ్లిన బంతి కీపర్ చేతుల్లో పడింది. షమీ (20 బంతుల్లో 21; 3 ఫోర్లు) కొద్ది సేపు కివీస్ బౌలర్లను చికాకుపర్చినా, జట్టు ఆలౌట్ అయ్యేందుకు ఎక్కువ సమయం పట్టలేదు. ఇషాంత్ జోరు... టెస్టు సిరీస్ ప్రారంభానికి ముందు కూడా ఆడటం సందేహంగానే ఉన్నా...చివరకు సుదీర్ఘ ప్రయాణం తర్వాత జట్టుతో చేరిన సీనియర్ పేసర్ ఇషాంత్ తన విలువేమిటో చూపించాడు. ఇద్దరు ఓపెనర్లు క్రీజ్‌లో నిలదొక్కుకుపోయి పరుగుల వేటకు సిద్ధమైన వేళ అతను జట్టుకు తొలి బ్రేక్ అందించాడు. ఇషాంత్ బౌలింగ్‌లో లెగ్‌సైడ్ వెళుతున్న బంతిని ఆడబోయి లాథమ్ (11) కీపర్‌కు క్యాచ్ ఇచ్చాడు. ఆ తర్వాత కొద్ది సేపటికే మరో చక్కటి బంతితో బ్లన్‌డెల్ (80 బంతుల్లో 30; 4 ఫోర్లు)ను క్లీన్‌బౌల్డ్ చేశాడు. ఈ దశలో విలియమ్సన్, టేలర్ జట్టును ఆదుకున్నారు. వీరిద్దరు చక్కటి సమన్వయంతో బ్యాటింగ్ చేయడంతో రెండో సెషన్లో కివీస్ 99 పరుగులు చేసింది. 93 బంతుల్లో విలియమ్సన్ అర్ధ సెంచరీ పూర్తయిన తర్వాత ఈ భాగస్వామ్యం సెంచరీకి చేరువైన దశలో మళ్లీ ఇషాంత్ దెబ్బ వేశాడు. సీనియర్ బ్యాట్స్‌మన్ టేలర్‌ను అవుట్ చేసి మ్యాచ్ దిశ మార్చాడు. ఆ తర్వాత షమీ బౌలింగ్‌లో పాయింట్లో జడేజా చక్కటి క్యాచ్ పట్టడంతో విలియమ్సన్ సెంచరీ అవకాశం చేజారింది. నికోల్స్ (17)ను అవుట్ చేసి అశ్విన్ కూడా వికెట్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు. స్కోరు వివరాలు భారత్ తొలి ఇన్నింగ్స్: పృథ్వీ షా (బి) సౌతీ 16; మయాంక్ (సి) జేమీసన్ (బి) బౌల్ట్ 34; పుజారా (సి) వాట్లింగ్ (బి) జేమీసన్ 11; కోహ్లి (సి) టేలర్ (బి) జేమీసన్ 2; రహానే (సి) వాట్లింగ్ (బి) సౌతీ 46; విహారి (సి) వాట్లింగ్ (బి) జేమీసన్ 7; పంత్ (రనౌట్) 19; అశ్విన్ (బి) సౌతీ 0; ఇషాంత్ (సి) వాట్లింగ్ (బి) జేమీసన్ 5; షమీ (సి) బ్లన్‌డెల్ (బి) సౌతీ 21; బుమ్రా (నాటౌట్) 0; ఎక్స్‌ట్రాలు 4; మొత్తం (68.1 ఓవర్లలో ఆలౌట్) 165. వికెట్ల పతనం: 1–16; 2–35; 3–40; 4–88; 5–101; 6–132; 7–132; 8–143; 9–165; 10–165. బౌలింగ్: సౌతీ 20.1–5–49–4; బౌల్ట్ 18–2–57–1; గ్రాండ్‌హోమ్ 11–5–12–0; జేమీసన్ 16–3–39–4; ఎజాజ్ పటేల్ 3–2–7–0. న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్: లాథమ్ (సి) పంత్ (బి) ఇషాంత్ 11; బ్లన్‌డెల్ (బి) ఇషాంత్ 30; విలియమ్సన్ (సి) (సబ్) జడేజా (బి) షమీ 89; టేలర్ (సి) పుజారా (బి) ఇషాంత్ 44; నికోల్స్ (సి) కోహ్లి (బి) అశ్విన్ 17; వాట్లింగ్ (బ్యాటింగ్) 14; గ్రాండ్‌హోమ్ (బ్యాటింగ్) 4; ఎక్స్‌ట్రాలు 7; మొత్తం (71.1 ఓవర్లలో 5 వికెట్లకు) 216. వికెట్ల పతనం: 1–26; 2–73; 3–166; 4–185; 5–207. బౌలింగ్: బుమ్రా 8.1–4–62–0; ఇషాంత్ 15–6–31–3; షమీ 17–2–61–1; అశ్విన్ 21–1–60–1. -
ఇషాంత్ శర్మ ఫిట్
ముంబై: న్యూజిలాండ్‌తో టెస్టు సిరీస్‌కు ముందు భారత జట్టుకు శుభవార్త! గాయం నుంచి కోలుకున్న సీనియర్ ఫాస్ట్ బౌలర్ ఇషాంత్ శర్మ శనివారం ఫిట్నెస్ పరీక్షలో సఫలమయ్యాడు. దాంతో అతను న్యూజిలాండ్ వెళ్లేందుకు మార్గం సుగమమైంది. ఈ విషయాన్ని బీసీసీఐ వర్గాలు ధ్రువీకరించాయి. ఆదివారం ఇషాంత్ నేరుగా తొలి టెస్టు వేదిక అయిన వెల్లింగ్టన్కు బయల్దేరతాడు. విదర్భతో రంజీ ట్రోఫీ మ్యాచ్ సందర్భంగా జనవరి 21న ఇషాంత్ కాలికి గాయమైంది. ఎంఆర్ఐ స్కాన్‌లో ‘గ్రేడ్ త్రీ టియర్’గా తేలింది. అతనికి కనీసం ఆరు వారాల విశ్రాంతి, పునరావాస చికిత్స అవసరమని వైద్యులు తేల్చారు. దాంతో జాతీయ క్రికెట్ అకాడమీ చేరుకున్న ఇషాంత్ అక్కడే ఫిట్‌గా మారాడు. ఫిట్నెస్ పరీక్షలో పాస్ అయిన అనంతరం ఇందుకు సహకరించిన ఫిజియో ఆశిష్ కౌశిక్‌కు ప్రత్యేకంగా కృతజ్ఞతలు చెప్పాడు. కివీస్‌తో రెండు టెస్టుల సిరీస్ కోసం ప్రకటించిన జట్టులో ముందు జాగ్రత్తగా బీసీసీఐ సెలక్టర్లు ఇషాంత్ పేరును కూడా చేర్చారు. అతను ఫిట్నెస్ పరీక్షలో సఫలమైతే టీమిండియాతో చేరతాడని ప్రకటించారు. 13 ఏళ్ల అంతర్జాతీయ కెరీర్లో 96 టెస్టులు ఆడిన ఇషాంత్ ‘సెంచరీ’కి కేవలం నాలుగు టెస్టుల దూరంలో ఉన్నాడు. అతను వంద టెస్టుల మైలురాయిని చేరుకుంటే కపిల్‌దేవ్ తర్వాత ఈ ఘనత సాధించిన రెండో భారత పేస్ బౌలర్‌గా నిలుస్తాడు. -
ఇషాంత్‌ను వెంటాడిన గాయం!
న్యూఢిల్లీ: కీలకమైన న్యూజిలాండ్ పర్యటనకు భారత సీనియర్ పేస్ బౌలర్ ఇషాంత్ శర్మ దాదాపుగా దూరమైనట్లే. రంజీ ట్రోఫీ మ్యాచ్ సందర్భంగా సోమవారం ఇషాంత్ శర్మకు గాయం కాగా... వైద్య పరీక్ష అనంతరం దాని తీవ్రత ఎక్కువేనని తేలింది. ‘ఇషాంత్ ఎంఆర్ఐ రిపోర్టు ప్రకారం అతని చీలమండలో గ్రేడ్ త్రీ పగులు వచ్చినట్లు తేలింది. ఇది చాలా తీవ్రమైంది. అతనికి కనీసం ఆరు వారాల పాటు విశ్రాంతి అవసరం. జాతీయ క్రికెట్ అకాడమీలో పునరావాస చికిత్స తీసుకోవడం కూడా తప్పనిసరి’ అని ఢిల్లీ క్రికెట్ సంఘం (డీడీసీఏ) కార్యదర్శి వినోద్ తిహారా వెల్లడించారు. భారత్, న్యూజిలాండ్ మధ్య ఫిబ్రవరి 21న తొలి టెస్టు ప్రారంభం కానున్న నేపథ్యంలో అప్పటికి ఇషాంత్ కోలుకోవడం కష్టమే. ఇషాంత్ గాయంపై బీసీసీఐ ఇంకా అధికారిక ప్రకటన చేయలేదు. అయితే అతనికి మరోసారి పరీక్షలు నిర్వహించిన తర్వాతే బోర్డు ఈ విషయంలో స్పందించవచ్చు. -
ఇషాంత్ శర్మకు గాయం
న్యూజిలాండ్ పర్యటనకు ముందు భారత క్రికెట్ జట్టును కొంత ఆందోళనపరిచే వార్త ఇది. ఢిల్లీ తరఫున రంజీ ట్రోఫీ మ్యాచ్ బరిలోకి దిగిన టీమిండియా ప్రధాన పేసర్ ఇషాంత్ శర్మ చీలమండకు గాయమైంది. విదర్భతో జరుగుతున్న మ్యాచ్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. విదర్భ కెప్టెన్ ఫైజ్ ఫజల్‌కు బౌలింగ్ చేసిన ఇషాంత్ వెనక్కి తిరిగి గట్టిగా ఎల్బీడబ్ల్యూ కోసం అప్పీల్ చేసే క్రమంలో పట్టు తప్పి పడిపోయాడు. నొప్పితో విలవిల్లాడుతున్న అతడు సహాయక సిబ్బంది వెంట రాగా మైదానం వీడాల్సి వచ్చింది. ‘ఇషాంత్ కాలు మడత పడిపోవడంతో గాయమైంది. వాపు చాలా ఎక్కువగా ఉంది. ప్రస్తుతం గాయం తీవ్రంగానే కనిపిస్తుండటంతో ఇక మ్యాచ్‌లో కొనసాగించరాదని నిర్ణయించాం. అది ఫ్రాక్చర్ కాకూడదని కోరుకుంటున్నాం’ అని ఢిల్లీ జట్టు ప్రకటించింది. ఇషాంత్ త్వరగానే కోలుకుంటాడని ఆశిస్తున్నామని, అయితే నిబంధనల ప్రకారం అతను జాతీయ క్రికెట్ అకాడమీకి వెళ్లి పునరావాస చికిత్స తీసుకోవాల్సిందేనని కూడా వెల్లడించింది. ఆ తర్వాత రిటర్న్ టు ప్లే (ఆర్టీపీ) సర్టిఫికెట్ సమర్పిస్తేనే భారత జట్టు కోసం సెలక్టర్లు పరిశీలిస్తారు. అయితే ఇషాంత్ ప్రస్తుతం భారత జట్టులో టెస్టు స్పెషలిస్ట్‌గానే కొనసాగుతున్నాడు. న్యూజిలాండ్‌తో తొలి టెస్టు ఫిబ్రవరి 21 నుంచి జరగనున్న నేపథ్యంలో ఇషాంత్ కోలుకునేందుకు తగినంత సమయం ఉంది. -
గులాబీ గుబాళించింది
బంతులు మాత్రమే కాదు... మైదానంలో సిబ్బంది, ప్రేక్షకుల దుస్తులు... హోర్డింగ్‌లు, స్కోరు బోర్డులు... వ్యాఖ్యాతల ప్రత్యేక డ్రెస్‌లు... చివరకు స్వీట్లు కూడా... ఒకటేమిటి, ఇలా ఈడెన్ గార్డెన్స్ మొత్తం గులాబీమయమైపోయింది. పింక్ టెస్టుపై గత కొద్ది రోజులుగా పెరిగిన అంచనాలు, ఏర్పాట్లకు తగినట్లుగా మైదానం మొత్తం అదే రంగు పరచుకుంది. తొలిసారి భారత గడ్డపై జరిగిన డే అండ్ నైట్ టెస్టుకు అభిమాన జనం అమితోత్సాహంతో తరలి వచ్చింది. ఊహించినట్లుగానే మ్యాచ్ మొదటి రోజు భారత క్రికెట్ చరిత్రలో మరో మరచిపోలేని ఘట్టంగా మిగిలిపోయింది. స్థాయికి తగినట్లుగానే చెలరేగిన టీమిండియా పేసర్లు ప్రత్యర్థిని కుప్పకూల్చి మ్యాచ్‌ను తొలి రోజే మన వైపు తిప్పారు. పింక్ బాల్‌తో బౌలింగ్ చేసిన తొలి భారత బౌలర్‌గా నిలిచిన ఇషాంత్ శర్మ ఐదు వికెట్లతో బంగ్లాదేశ్ వెన్ను విరిచాడు. ఆ తర్వాత సాధికారిక బ్యాటింగ్‌తో కోహ్లి సేన ఇప్పటికే ఆధిక్యాన్ని అందుకుంది. అనుకున్నట్లే సాయంత్రం సమయంలో బంతి కొంత స్వింగ్ కాగా, బంతి రంగుతో ఇబ్బంది పడినట్లుగా మాత్రం ఆటగాళ్ల నుంచి ఫిర్యాదులు రాలేదు. ఆటకు తోడు రూనా లైనా పాట, మాజీల ముచ్చట్లు, ఘన సన్మానాలు, అభినందనలు కోల్‌కతా టెస్టుకు అదనపు ఆకర్షణలుగా నిలిచాయి. కోల్‌కతా: అమితాసక్తిని రేపిన ‘పింక్ టెస్టు’లో భారత జట్టు ఆధిపత్యం స్పష్టంగా కనిపించింది. శుక్రవారం ప్రారంభమైన ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో బంగ్లాదేశ్ 30.3 ఓవర్లలోనే 106 పరుగులకు కుప్పకూలింది. షాద్మన్ ఇస్లామ్ (29), లిటన్ దాస్ (24 రిటైర్డ్‌హర్ట్), నయీమ్ హసన్ (19) మాత్రమే రెండంకెల స్కోరు చేయగలిగారు. నలుగురు బ్యాట్స్‌మన్ డకౌట్ కావడం విశేషం. పేసర్ ఇషాంత్ శర్మ 22 పరుగులకే 5 వికెట్లు పడగొట్టడం విశేషం. ఉమేశ్‌కు 3, షమీకి 2 వికెట్లు దక్కాయి. భారత స్పిన్నర్లలో జడేజా ఒకే ఒక్క ఓవర్ వేయగా, అశి్వన్‌కు బౌలింగ్ చేయాల్సిన అవసరం రాకుండానే ప్రత్యర్థి ఆలౌట్ కావడం మన పేసర్ల ప్రభావాన్ని చూపిస్తోంది. అనంతరం భారత్ తొలి రోజు ఆట ముగిసే సమయానికి 3 వికెట్లకు 174 పరుగులు చేసింది. విరాట్ కోహ్లి (93 బంతుల్లో 59 బ్యాటింగ్; 8 ఫోర్లు), చతేశ్వర్ పుజారా (105 బంతుల్లో 55; 8 ఫోర్లు) అర్ధ సెంచరీలు చేశారు. వీరిద్దరు మూడో వికెట్‌కు 94 పరుగులు జోడించారు. ప్రస్తుతం కోహ్లితో పాటు రహానే (22 బంతుల్లో 23 బ్యాటింగ్; 3 ఫోర్లు) క్రీజ్‌లో ఉన్నాడు. భారత్‌కు ఇప్పటికే 68 పరుగుల ఆధిక్యం లభించింది. టపటపా... బంతి రంగు మారడం తప్ప బంగ్లాదేశ్ బ్యాటింగ్‌లో మాత్రం ఎలాంటి మార్పు రాలేదు. గత మ్యాచ్‌లాగే ఆ జట్టు మరోసారి పేలవ ప్రదర్శన కనబర్చింది. వరుస విరామాల్లో ఆ జట్టు వికెట్లు కోల్పోయింది. కైస్ (4)ను వికెట్ల ముందు దొరకబుచ్చుకొని ఇషాంత్ శుభారంభం అందించాడు. కైస్ రివ్యూ చేసినా లాభం లేకపోయింది. ఆ తర్వాత బంగ్లా వరుసగా మూడు డకౌట్లతో తమ పతనాన్ని కొని తెచ్చుకుంది. ఉమేశ్ ఓవర్లో మోమినుల్ (0), మిథున్ (0) అవుట్ కాగా... తర్వాతి ఓవర్లో షమీ చక్కటి బంతితో ముష్ఫికర్ (0) స్టంప్స్‌ను ఎగరగొట్టాడు. మోమినుల్ ఇచ్చిన క్యాచ్‌ను రెండో స్లిప్ నుంచి తొలి స్లిప్ మీదుగా డైవ్ చేస్తూ ఒంటి చేత్తో రోహిత్ క్యాచ్ అందుకున్న తీరు హైలైట్‌గా నిలిచింది. అప్పటి వరకు కొంత జాగ్రత్తగా ఆడిన షాద్మన్ను ఉమేశ్ అవుట్ చేయడంతో 38 పరుగులకే సగం టీమ్ పెవిలియన్ చేరింది. ఈ క్యాచ్‌తో సాహా టెస్టుల్లో 100 మందిని అవుట్ చేయడంలో భాగంగా (89 క్యాచ్‌లు, 11 స్టంపింగ్‌లు) నిలిచాడు. కొద్ది సేపటికే సాహా అత్యద్భుత క్యాచ్‌తో మహ్ముదుల్లా (6) కూడా పెవిలియన్ చేరాడు. షమీ దెబ్బతో దాస్ మైదానం వీడిన అనంతరం బంగ్లా ఇన్నింగ్స్ ఎక్కువ సేపు సాగలేదు. నయీమ్ (19) కొద్ది సేపు నిలబడినా... 24 పరుగుల వ్యవధిలో చివరి 4 వికెట్లు పడ్డాయి. రోహిత్ విఫలం... భారత్‌కు బ్యాటింగ్‌లో ఆశించిన ఆరంభం మాత్రం దక్కలేదు. మయాంక్ అగర్వాల్ (21 బంతుల్లో 14; 3 ఫోర్లు) ఎక్కువ సేపు నిలబడలేకపోగా... రోహిత్ శర్మ (35 బంతుల్లో 21; 2 ఫోర్లు, సిక్స్) కూడా తొందరగానే నిష్క్రమించాడు. 12 పరుగుల వద్ద రోహిత్ ఇచ్చిన సునాయాస క్యాచ్‌ను అల్ అమీన్ వదిలేసినా భారత బ్యాట్స్‌మన్ దానిని వాడుకోలేకపోయాడు. ఆ తర్వాత సీనియర్లు పుజారా, కోహ్లి భాగస్వామ్యం జట్టును నడిపించింది. వీరిద్దరు ఎలాంటి తడబాటు లేకుండా స్వేచ్ఛగా బ్యాటింగ్ చేస్తూ చక్కటి షాట్లు ఆడారు. ప్రత్యర్థి బౌలర్లు ఏమాత్రం ప్రభావం చూపలేకపోవడంతో చకచకా పరుగులు వచ్చాయి. ఈ క్రమంలో ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 15 వేల పరుగులు కూడా పూర్తి చేసుకున్న పుజారా 93 బంతుల్లో అర్ధ సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. అయితే ఆ వెంటనే ఇబాదత్ వేసిన బంతిని స్లిప్‌లోకి ఆడి వెనుదిరిగాడు. తర్వాత వచి్చన రహానే చూడచక్కటి షాట్లతో వేగంగా పరుగులు రాబట్టి కెపె్టన్‌గా అండగా నిలవడంతో తొలి రోజు భారత్ ఆధిపత్యం స్పష్టంగా కనిపించింది. స్కోరు వివరాలు బంగ్లాదేశ్ తొలి ఇన్నింగ్స్: షాద్మన్ (సి) సాహా (బి) ఉమేశ్ 29; కైస్ (ఎల్బీ) (బి) ఇషాంత్ 4; మోమినుల్ (సి) రోహిత్ (బి) ఉమేశ్ 0; మిథున్ (బి) ఉమేశ్ 0; ముష్ఫికర్ (బి) షమీ 0; మహ్ముదుల్లా (సి) సాహా (బి) ఇషాంత్ 6; లిటన్ దాస్ (రిటైర్డ్‌హర్ట్) 24; నయీమ్ (బి) ఇషాంత్ 19; ఇబాదత్ (బి) ఇషాంత్ 1; మెహదీ హసన్ (సి) పుజారా (బి) ఇషాంత్ 8; అల్ అమీన్ (నాటౌట్) 1; జాయెద్ (సి) పుజారా (బి) షమీ 0; ఎక్స్‌ట్రాలు 14; మొత్తం (30.3 ఓవర్లలో ఆలౌట్) 106. వికెట్ల పతనం: 1–15, 2–17, 3–17, 4–26, 5–38, 6–60, 6–73 (రిటైర్డ్‌హర్ట్), 7–82, 8–98, 9–105, 10–106. బౌలింగ్: ఇషాంత్ శర్మ 12–4–22–5; ఉమేశ్ యాదవ్ 7–2–29–3; షమీ 10.3–2–36–2; జడేజా 1–0–5–0. భారత్ తొలి ఇన్నింగ్స్: మయాంక్ (సి) (సబ్) మెహదీ (బి) అల్ అమీన్ 14; రోహిత్ (ఎల్బీ) (బి) ఇబాదత్ 21; పుజారా (సి) షాద్మన్ (బి) ఇబాదత్ 55; కోహ్లి (బ్యాటింగ్) 59; రహానే (బ్యాటింగ్) 23; ఎక్స్‌ట్రాలు 2; మొత్తం (46 ఓవర్లలో 3 వికెట్లకు) 174. వికెట్ల పతనం: 1–26; 2–43; 3–137. బౌలింగ్: అల్ అమీన్ 14–3–49–1; అబూ జాయెద్ 12–3–40–0; ఇబాదత్ 12–1–61–2; తైజుల్ 8–0–23–0. ►30.3 బంగ్లాదేశ్ ఆలౌట్ అయిన ఓవర్లు. భారత జట్టు తొలి ఇన్నింగ్స్‌లో తమ ప్రత్యరి్థని ఇన్ని తక్కువ ఓవర్లలో ఎప్పుడూ ఆలౌట్ చేయలేదు. గతంలో జింబాబ్వేను 44.2 ఓవర్లలో ఆలౌట్ చేసింది. ►2 భారత్‌పై బంగ్లాకు ఇది రెండో అత్యల్ప స్కోరు. 2000లో జరిగిన తొలి టెస్టులో ఆ జట్టు 91 పరుగులకే ఆలౌటైంది. ►4 సొంత గడ్డపై జరిగిన టెస్టుల్లో ఒక ఇన్నింగ్స్‌లో పది వికెట్లనూ భారత పేసర్లే తీయడం ఇదే నాలుగో సారి మాత్రమే. ►2 స్వదేశంలో ఇషాంత్ 5 వికెట్లు తీయడం ఇది రెండోసారి. 2007లో తన రెండో టెస్టులో అతను ఈ ఘనత నమోదు చేయగా, భారత్‌లో ఇషాంత్‌కిది 37వ టెస్టు. ►1టెస్టు క్రికెట్లో వేగంగా 5 వేల పరుగులు పూర్తి చేసిన కెప్టెన్‌గా కోహ్లి (86 ఇన్నింగ్స్) గుర్తింపు పొందాడు. పాంటింగ్ (97 ఇన్నింగ్స్) పేరిట ఉన్న రికార్డును కోహ్లి బద్దలు కొట్టాడు. ►ఎర్ర బంతితో పోలిస్తే గులాబీ బంతికి చాలా తేడా కనిపించింది. ఆరంభంలో సరైన లెంగ్త్‌లో బౌలింగ్ చేశాం కానీ బంతి మాత్రం స్వింగ్ కాలేదు. అప్పుడు మేమందరం చర్చించుకున్న తర్వాత పింక్ బాల్‌తో ఎలాంటి లెంగ్త్‌తో బౌలింగ్ చేయాలనేది అర్థమైంది. పరిమిత ఓవర్ల జట్టుకు దూరమయ్యాననే బెంగ ఏమాత్రం లేని దశకు చేరుకున్నాను. ఏ ఫార్మాట్ అయినా ఆడాలని, ఆటను ఆస్వాదించాలని మాత్రమే కోరుకుంటా. –ఇషాంత్ శర్మ -
చెలరేగిన ఇషాంత్.. బంగ్లా ఆలౌట్
కోల్‌కతా: టీమిండియాతో జరుగుతున్న పింక్ బాల్ టెస్టులో బంగ్లాదేశ్ తన మొదటి ఇన్నింగ్స్‌లో 106 పరుగులకే చాపచుట్టేసింది. భారత్ పేసర్లు చెలరేగిపోవడంతో బంగ్లాదేశ్ వంద పరుగుల మార్కును అతి కష్టం మీద చేరింది. ప్రధానంగా ఇషాంత్ శర్మ ఐదు వికెట్లతో బంగ్లా పతనాన్ని శాసించగా, ఉమేశ్ యాదవ్ మూడు వికెట్లు సాధించాడు. మహ్మద్ షమీకి రెండు వికెట్లు లభించాయి. ఇషాంత్ వేసిన ఫుల్ లెంగ్త్, స్వింగ్ బంతులకు బంగ్లా బ్యాట్స్‌మెన్ బెంబేలెత్తిపోయారు.ఇది ఇషాంత్‌కు టెస్టుల్లో 10వ సారి ఐదు వికెట్లు మార్కు కాగా, భారత్‌లో రెండోసారి. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న బంగ్లాదేశ్ ఇన్నింగ్స్‌ను షాద్మన్ ఇస్లామ్-ఇమ్రుల్ కేయిస్‌లు ప్రారంభించారు. బంగ్లా 15 పరుగుల వద్ద ఉండగా ఇమ్రుల్(4) తొలి వికెట్‌గా పెవిలియన్ చేరాడు. ఇమ్రుల్‌ను ఇషాంత్ శర్మ ఎల్బీగా ఔట్ చేశాడు. ఆపై కెప్టెన్ మోమినుల్ హక్, మహ్మద్ మిథున్, ముష్పికర్ రహీమ్‌లు డకౌట్లుగా పెవిలియన్ చేరారు. మోమినుల్, మిథున్‌లను ఉమేశ్ యాదవ్ ఔట్ చేయగా, రహీమ్‌ను షమీ పెవిలియన్‌కు పంపాడు. మూడు బంతుల వ్యవధిలో ఉమేశ్ రెండు వికెట్లు తీసి బంగ్లాను గట్టిదెబ్బ కొట్టాడు. దాంతో బంగ్లాదేశ్ 26 పరుగుల వద్ద నాలుగో వికెట్ నష్టపోయింది. కాగా, భారత బౌలర్లను కాస్త ప్రతిఘటించినట్లే కనబడిన షాద్మన్ ఇస్లామ్(29; 52 బంతుల్లో 5 ఫోర్లు)ను ఉమేశ్ చక్కటి బంతితో ఔట్ చేశాడు. కాస్త స్వింగ్ మిక్స్ చేసిన బంతికి షాద్మన్.. కీపర్ సాహాకు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. ఆరో వికెట్‌గా మహ్మదుల్లా(6) ఔటయ్యాడు. ఇషాంత్ శర్మ వేసిన 20 ఓవర్ నాల్గో బంతికి మహ్మదుల్లా కీపర్ సాహాకు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. క్యాచ్ అందుకునే క్రమంలో సాహా మరోసారి ఆకట్టుకున్నాడు. ఫస్ట్‌స్లిప్‌కు కాస్త ముందు పడబోతున్న బంతిని చక్కని టైమింగ్‌తో ఒడిసి పట్టుకున్నాడు. ఇక మిగతా నాలుగు వికెట్లను మరో 46 పరుగులు జోడించి బంగ్లా కోల్పోయింది. బంగ్లా ఇన్నింగ్స్ 30.3 ఓవర్లలో ముగియడంతో భారత్ పేసర్లు ప్రభావం ఎలా ఉందో అర్ధం చేసుకోవచ్చు. కాంకషన సబ్‌స్టిట్యూట్‌గా మెహిదీ హసన్.. భారత్‌లో జరుగుతున్న తొలి పింక్ బాల్ టెస్టులో కాంకషన్ సబ్‌స్టిట్యూట్ వచ్చిన తొలి ఆటగాడిగా మెహిదీ హసన్ నిలిచాడు. మ్యాచ్ మధ్యలో లిటాన్ దాస్ రిటైర్డ్ హర్ట్‌గా పెవిలియన్ చేరడంతో హసన్ కాంకషన్ సబ్‌స్టిట్యూట్‌గా వచ్చాడు. ఒక స్పెషలిస్టు బ్యాట్స్‌మన్ అయిన లిటాన్ దాస్ అస్వస్థత కారణంగా పెవిలియన్ చేరాడు. ఆ క్రమంలోనే మెహిదీ హసన్ సబ్‌స్టిట్యూట్‌గా బ్యాటింగ్‌కు వచ్చాడు. కాకపోతే హసన్ 8 పరుగులే చేసి ఔటయ్యాడు. -
పింక్ బాల్ టెస్టు: 38 పరుగులకే బంగ్లాదేశ్..
కోల్‌కతా: టీమిండియాతో ఇక్కడ పింక్ బాల్‌తో జరుగుతున్న డే అండ్ నైట్ టెస్టు మ్యాచ్‌లో బంగ్లాదేశ్ విలవిల్లాడుతోంది. బంగ్లాదేశ్ తన తొలి ఇన్నింగ్స్‌లో భాగంగా స్కోరు బోర్డుపై 50 పరుగులు కూడా లేకుండానే సగం వికెట్లను కోల్పోయింది. భారత పేసర్లు చెలరేగిపోతూ బంతులు వేయడంతో బంగ్లాదేశ్ బ్యాటింగ్ ఆర్డర్ చెల్లాచెదురైంది. భారత పేసర్ల దెబ్బకు బంగ్లాదేశ్ 38 పరుగులకే ఐదు వికెట్లను చేజార్చుకుంది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న బంగ్లాదేశ్ ఇన్నింగ్స్‌ను షాద్మన్ ఇస్లామ్-ఇమ్రుల్ కేయిస్‌లు ప్రారంభించారు. బంగ్లా 15 పరుగుల వద్ద ఉండగా ఇమ్రుల్(4) తొలి వికెట్‌గా పెవిలియన్ చేరాడు. ఇమ్రుల్‌ను ఇషాంత్ శర్మ ఎల్బీగా ఔట్ చేశాడు.(ఇక్కడ చదవండి: నాలుగు వికెట్లు.. మూడు డకౌట్లు) ఆపై కెప్టెన్ మోమినుల్ హక్, మహ్మద్ మిథున్, ముష్పికర్ రహీమ్‌లు డకౌట్లుగా పెవిలియన్ చేరారు. మోమినుల్, మిథున్‌లను ఉమేశ్ యాదవ్ ఔట్ చేయగా, రహీమ్‌ను షమీ పెవిలియన్‌కు పంపాడు. మూడు బంతుల వ్యవధిలో ఉమేశ్ రెండు వికెట్లు తీసి బంగ్లాను గట్టిదెబ్బ కొట్టాడు. దాంతో బంగ్లాదేశ్ 26 పరుగుల వద్ద నాలుగో వికెట్ నష్టపోయింది. కాగా, భారత బౌలర్లను కాస్త ప్రతిఘటించినట్లే కనబడిన షాద్మన్ ఇస్లామ్(29; 52 బంతుల్లో 5 ఫోర్లు)ను ఉమేశ్ చక్కటి బంతితో ఔట్ చేశాడు. కాస్త స్వింగ్ మిక్స్ చేసిన బంతికి షాద్మన్.. కీపర్ సాహాకు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. ఆరో వికెట్‌గా మహ్మదుల్లా(6) ఔటయ్యాడు. ఇషాంత్ శర్మ వేసిన 20 ఓవర్ నాల్గో బంతికి మహ్మదుల్లా కీపర్ సాహాకు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. క్యాచ్ అందుకునే క్రమంలో సాహా మరోసారి ఆకట్టుకున్నాడు. ఫస్ట్‌స్లిప్‌కు కాస్త ముందు పడబోతున్న బంతిని చక్కని టైమింగ్‌తో ఒడిసి పట్టుకున్నాడు. దాంతో 60 పరుగులకే బంగ్లాదేశ్ ఆరు వికెట్లు కోల్పోయింది. ఈ ఆరు వికెట్లలో ఉమేశ్ యాదవ్ మూడు వికెట్లు సాధించగా, ఇషాంత్ శర్మ రెండు వికెట్లు తీశాడు. షమీకి వికెట్ దక్కింది. -
నాలుగు వికెట్లు.. మూడు డకౌట్లు
కోల్‌కతా: భారత్ జరుగుతున్న చారిత్రక పింక్ బాల్ టెస్టులో బంగ్లాదేశ్ తడ‘బ్యాటు’కు గురైంది. బ్యాటింగ్‌కు ఆరంభించిన మొదలు స్వల్ప విరామాల్లో కీలక వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. భారత బౌలర్లు విజృంభించి బౌలింగ్ చేయడంతో బంగ్లా బ్యాటింగ్ ఆదిలోనే కకావికలమైంది. 12 ఓవర్లు ముగిసే సరికి బంగ్లాదేశ్ నాలుగు వికెట్లు కోల్పోయి 26 పరుగులు చేసింది. ఈ నాలుగు వికెట్లలో ముగ్గురు డకౌట్లగా పెవిలియన్ చేరడం గమనార్హం. బంగ్లా కోల్పోయిన తొలి నాలుగు వికెట్లలో ఉమేశ్ యాదవ్ రెండు వికెట్లు సాధించగా, షమీ, ఇషాంత్‌లు తలో వికెట్ తీశారు. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న బంగ్లాదేశ్ ఇన్నింగ్స్‌ను షాద్మన్ ఇస్లామ్-ఇమ్రుల్ కేయిస్‌లు ప్రారంభించారు. బంగ్లా 15 పరుగుల వద్ద ఉండగా ఇమ్రుల్(4) తొలి వికెట్‌గా పెవిలియన్ చేరాడు. ఇమ్రుల్‌ను ఇషాంత్ శర్మ ఎల్బీగా ఔట్ చేశాడు. ఆపై కెప్టెన్ మోమినుల్ హక్, మహ్మద్ మిథున్, ముష్పికర్ రహీమ్‌లు డకౌట్లుగా పెవిలియన్ చేరారు. మోమినుల్, మిథున్‌లను ఉమేశ్ యాదవ్ ఔట్ చేయగా, రహీమ్‌ను షమీ పెవిలియన్‌కు పంపాడు. మూడు బంతుల వ్యవధిలో ఉమేశ్ రెండు వికెట్లు తీయడం విశేషం. మరోవైపు పింక్‌బాల్ టెస్ట్ మ్యాచ్‌ను ప్రత్యక్షంగా వీక్షించేందుకు వచ్చిన క్రికెట్ అభిమానులు, ప్రముఖులతో ఈడెన్ గార్డెన్స్‌లో సందడి వాతావరణం నెలకొంది. క్ బాల్‌తో మన దేశంలో జరుగుతున్న తొలి టెస్ట్ మ్యాచ్‌పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. భారత్, బంగ్లాదేశ్ జట్లు పింక్ బాల్‌తో మొట్ట మొదటి టెస్ట్ ఆడుతున్నాయి. ఈడెన్ గార్డెన్స్‌లో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో బంగ్లాదేశ్ ఆటగాళ్లు షాద్మాన్ ఇస్లాం, ఇమ్రూల్ కేయాస్ ఓపెనర్లుగా వచ్చారు. తొలి బంతిని టీమిండియా పేసర్ ఇషాంత్ శర్మ వేయగా.. షాద్మాన్ ఆడాడు. భారత గడ్డపై టెస్ట్ మ్యాచ్‌లో పింక్ బాల్ సంధించిన తొలి బౌలర్‌గా ఇషాంత్ రికార్డు పుస్తకాల్లోకి ఎక్కాడు. -
పింక్ బాల్ టెస్ట్; ఫస్ట్ బాల్ వేసిందెవరంటే?
కోల్‌కతా: పింక్ బాల్‌తో మన దేశంలో జరుగుతున్న తొలి టెస్ట్ మ్యాచ్‌పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. భారత్, బంగ్లాదేశ్ జట్లు పింక్ బాల్‌తో మొట్ట మొదటి టెస్ట్ ఆడుతున్నాయి. ఈడెన్ గార్డెన్స్‌లో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో బంగ్లాదేశ్ టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్‌కు దిగింది. బంగ్లాదేశ్ ఆటగాళ్లు షాద్మాన్ ఇస్లాం, ఇమ్రూల్ కేయాస్ ఓపెనర్లుగా వచ్చారు. తొలి బంతిని టీమిండియా పేసర్ ఇషాంత్ శర్మ వేయగా.. షాద్మాన్ ఆడాడు. భారత గడ్డపై టెస్ట్ మ్యాచ్‌లో పింక్ బాల్ సంధించిన తొలి బౌలర్‌గా ఇషాంత్ రికార్డు పుస్తకాల్లోకి ఎక్కాడు. దాయాది దేశంలో పింక్ బాల్ ఎదుర్కొన్న తొలి బ్యాట్స్‌మన్‌గా షాద్మాన్ నిలిచాడు. పరుగులేమి రాకుండానే మొదటి ఓవర్ ముగిసింది. రెండో ఓవర్ ఉమేశ్ యాదవ్ వేశాడు. రెండో ఓవర్ రెండో బంతికి సింగిల్ తీసి ఇమ్రూల్ కేయాస్ ఖాతా తెరిచాడు. పింక్ బాల్‌తో తొలి వికెట్ కూడా ఇషాంత్ శర్మ దక్కించుకున్నాడు. తన మూడో ఓవర్ మూడో బంతికి ఇమ్రూల్ను ఎల్బిడబ్ల్యూగా పెవిలియన్‌కు పంపాడు. ఎనిమిది ఓవర్లు ముగిసే సరికి బంగ్లాదేశ్ వికెట్ నష్టపోయి 16 పరుగులు చేసింది. మరోవైపు పింక్‌బాల్ టెస్ట్ మ్యాచ్‌ను ప్రత్యక్షంగా వీక్షించేందుకు వచ్చిన క్రికెట్ అభిమానులు, ప్రముఖులతో ఈడెన్ గార్డెన్స్‌లో సందడి వాతావరణం నెలకొంది. బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసినా, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మ్యాచ్ వీక్షించేందుకు ఈడెన్ గార్డెన్స్‌కు విచ్చేశారు. సోషల్ మీడియాలో #PinkBallTest హాష్‌ట్యాగ్ ట్రెండింగ్‌లో నిలిచింది. -
భరత్ దిద్దిన బలగం
మనది స్పిన్నిండియా! సిరీస్‌ల్లో నెట్టుకొచ్చినా... నెగ్గుకొచ్చినా... అది స్పిన్నర్ల వల్లే సాధ్యమయ్యేది. అందుకే స్పిన్ ఇండియాగా మారింది. కానీ ఇపుడు ఈ పరిస్థితి కూడా మారింది. స్పిన్నర్లకు దీటుగా పేసర్లు దడదడలాడిస్తున్నారు. ఇటీవలే వారిని మించి కూడా రాణిస్తున్నారు. అంతలా ఈ పేస్ పదును పెరగడానికి బౌలింగ్ కోచ్ భరత్ అరుణ్ ఎంతో కృషి చేశారు... చేస్తున్నారు కూడా! సాక్షి క్రీడా విభాగం: సొంతగడ్డపై భారత్ టెస్టు సిరీస్ గెలిచిందంటే అది స్పిన్నర్ల ఘనతే! కానీ ఇది ఒకప్పటి మాట. ఇప్పుడీ ఆనవాయితీ మారింది. పేస్ పదును తేలింది. ప్రత్యర్థి జట్టును రెండుసార్లు ఆలౌట్ చేసి... మ్యాచ్‌ల్ని, సిరీస్‌లనీ గెలవడంలో పేసర్ల పాత్ర పెరిగింది. ఉన్నపళంగా ఈ మార్పేమీ జరగలేదు. కొంతకాలంగా సానబెడితేనే పేస్ ఫలితాలు సాకారమవుతున్నాయి. ఈ ఫలితాలకు, గణనీయమైన మార్పులకు టీమిండియా బౌలింగ్ కోచ్ భరత్ అరుణే కారణం. ఆయన సీమర్లనే కాదు స్పిన్నర్లు చహల్, కుల్దీప్, అశ్విన్, జడేజాల లోపాలను కూడా సరిదిద్దారు. భారత ‘బ్యాటిం గ్’కు మేలురకమైన బౌలింగ్ బలగాన్ని జతచేశారు. దీంతో ఆల్‌రౌండ్ ప్రదర్శనతో విజయాలు చేకూరుతున్నాయి. భరత్ బౌలర్లకు బంతులెక్కడ సంధించాలో చెప్పరు... ఆ బంతి ఎక్కడ పిచ్ కావాలనేది కచ్చితంగా చెబుతారు. అదే వాళ్లను అలా టర్న్ అయ్యేలా చేస్తుందనేది ఆయన నమ్మకం. ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడలో 1962లో పుట్టిన భరత్ అరుణ్ తమిళనాడు తరఫున ఫస్ట్‌క్లాస్ క్రికెట్ ఆడారు. భారత్ తరఫున రెండు టెస్టులు, నాలుగు వన్డేలు ఆడిన ఆయన 1993లో రిటైర్మెంట్ ప్రకటించారు. తొమ్మిదేళ్ల తర్వాత 2002లో తమిళనాడు రంజీ జట్టు కోచ్‌గా బాధ్యతలు స్వీకరించారు. నాలుగేళ్లపాటు భరత్ ఈ పదవిలో ఉన్నారు. రెండుసార్లు తమిళనాడును రంజీ ఫైనల్‌కు చేర్చారు. అనంతరం 2008లో జాతీయ క్రికెట్ అకాడమీ చీఫ్ బౌలింగ్ కోచ్‌గా వ్యవహరించిన ఆయన 2012లో భారత అండర్– 19 జట్టు బౌలింగ్ కోచ్‌గా పని చేశారు. 2014లో ఐపీఎల్–7లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టుకు అసిస్టెంట్ కోచ్‌గా పనిచేసిన ఆయన అదే ఏడాది భారత సీనియర్ జట్టు బౌలింగ్ కోచ్‌గా నియమితులయ్యారు. షమీ రనప్ మార్చి... మొహమ్మద్ షమీ ప్రతిభఉన్న పేసరే కానీ... తర్వాత్తర్వాత పూర్తిగా టెస్టు బౌలర్‌గా ముద్రపడిపోయాడు. గాయాలతో సతమతమయ్యాడు. ఆటకు దూరమైన సందర్భాలూ ఉన్నాయి. కానీ ఇప్పుడు అతనో ప్రధాన బౌలర్. కారణం భరత్ అరుణే! అతని సత్తా ఏంటో తెలిసిన కోచ్ ముందు షమీ రనప్‌ను గమనించాడు. పెద్దపెద్ద అంగలతో వేసే అడుగుల్ని మార్చాడు. వేగంగా పరిగెడితేనే సరిపోదని చెప్పాడు. బంతి సంధించేవేళ ఆ వేగాన్ని బ్యాలెన్స్ చేసుకోవడమే కీలకమన్నాడు. ఉదాహరణకు 200 కి.మీ. వేగంతో పరిగెత్తుకుంటూ వచ్చి తీరా బంతివేసే సమయానికి లయ కోల్పోతే లాభమేంటని సూచించాడు. ఎంత వేగంతో బ్యాలెన్స్ చేసుకుంటావో అంతే రనప్ అవసరమని చెప్పిన బౌలింగ్ కోచ్ మాటలు షమీని మార్చేశాయి. వేగం మారి బౌలింగ్ వైవిధ్యం పెరిగింది. కుదురుగా లైన్ అండ్ లెంత్కు కట్టుబడేలా చేసింది. అంతే కొన్ని రోజుల వ్యవధిలోనే అతనికి వన్డే జట్టులో పదిలమైన స్థానాన్ని కట్టబెట్టగా... ఇపుడు ఏకంగా పొట్టి ఫార్మాట్‌కు అక్కరకొచ్చే ఆటగాడ్ని చేసేసింది. పరిమిత ఓవర్ల ఆటకు దూరమైన ఆ బౌలర్‌ను వన్డే ప్రపంచకప్ ఆడే స్థితికి తీసుకొచ్చిన ఘనత అరుణ్‌దే. బుమ్రా శైలిపై సంశయమున్నా.. బౌలింగ్ కోచ్ భరత్ బౌలర్ల ప్రదర్శనకు వికెట్లే ప్రమాణంగా ఎప్పుడూ పరిగణించరు. భారత సంచలన పేసర్ జస్ప్రీత్ బుమ్రా వచ్చీ రాగానే మంచి బౌలర్‌గా కితాబు అందుకున్నాడు. అతను తీసే వికెట్లతో టీమ్ మేనేజ్మెంట్ తెగ సంబరపడింది... కానీ అతని భిన్నమైన బౌలింగ్ శైలిపై అందోళన పడింది మాత్రం అరుణే! ఇది అతని కెరీర్‌కు, ఫిట్‌నెస్‌కు సమస్యగా మారుతుందని తొలినాళ్లలోనే హెచ్చరించారు. శరీరంపై ఆ శైలి తాలూకు పడే అదనపు ఒత్తిడి వల్లే తాజాగా బుమ్రా వెన్నునొప్పితో బాధపడుతున్న సంగతి తెలిసిందే. ఇలాంటి పరిస్థితిని ముందే ఊహించడం విశేషమైతే ఫిజియోతో కలిసి అతని ఫిట్‌నెస్‌కు ఢోకా లేకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనే దానిపై కసరత్తు కూడా చేశారు అరుణ్. అయితే బుమ్రా తనకు ఆ బౌలింగ్ శైలే సౌకర్యవంతమని చెప్పడంతో కాదనలేకపోయారు. అలాగే ఇప్పుడు గాయం నుంచి కోలుకునేందుకు అన్ని రకాలుగా అతనికి సేవలందిస్తున్నారు. వికెట్లు తీస్తే సరిపోదని... నిలకడకూ ప్రాధాన్యమివ్వాలని, ఫిట్నెస్ను కాపాడుకోవాలని పదేపదే హెచ్చరిస్తారు. ఇషాంత్... స్వింగ్ సుల్తాన్ చాలా సార్లు ఇషాంత్ శర్మ వికెట్లు తీయడు. కానీ పొదుపుగా బౌలింగ్ చేస్తాడు. కారణం ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్ ఇషాంత్‌ను పెద్దగా పట్టించుకోకపోవడమే! దీన్ని బౌలింగ్ కోచ్ గమనించారు. అతని బౌలింగ్ కోణం (యాంగిల్), సంధించే ముందు మణికట్టు తీరు (రిస్ట్ పొజిషన్) మార్చుకుంటే సరిపోతుందని తగిన సలహాలిచ్చారు. అన్నట్లుగానే ఇషాంత్ తన బౌలింగ్ లోపాల్ని సరిదిద్దుకున్నాడు. అలా గాడినపడ్డ అతను వైవిధ్యమైన స్వింగ్ బౌలింగ్‌తో రాణిస్తున్నాడు. క్రికెటర్లెవరైనా ఒకసారి మంచిగా అనిపిస్తే అదే శైలిని, అదే దారిని కొనసాగిస్తారు. కానీ అది ఫలితాలను ఇవ్వకపోతే మాత్రం కొత్తదారుల్ని కనుగొనాలని చెబుతాడు అరుణ్. ఏదేమైనా ఇషాంత్ కొత్త యాంగిల్‌ను పరీక్షించడంతో పాటు ఉన్న లోపాల్ని సరిదిద్దుకోవడంతో మంచి స్వింగ్ బౌలర్‌గా మారాడు. ఉమేశ్ పేస్‌కు పదును... ఉమేశ్ సొంతగడ్డపై అద్భుతంగా రాణిస్తాడు. కానీ విదేశాల్లో ఆ మేరకు రాణించలేకపోవడానికి కారణం తగినన్ని అవకాశాలు రాలేకపోవడమేనని భరత్ అరుణ్ విశ్లేషించారు. విదేశీ పిచ్‌లపై అనుభవం లేకే ఉమేశ్ వెనుకబడ్డాడు కానీ ప్రతిభ లేక కాదు అనేది ఆయన అభిప్రాయం. అతని ప్రదర్శనకు మెరుగులు దిద్దేందుకు అరుణ్ బాగా శ్రమించారు. రనప్‌పై ఎప్పటికప్పుడు సూచనలు ఇస్తూనే జట్టుకు అవసరమైనపుడల్లా అందుబాటులో ఉంచుతున్నారు. దక్షిణాఫ్రికాతో ముందుగా ప్రకటించిన టీమిండియాలో ఉమేశ్ లేడు. కానీ బుమ్రా గాయంతో అతనికి అవకాశం వచ్చింది. స్వదేశీ పిచ్‌లపై అతనికి సరైన అవగాహన ఉంది. అప్పుడప్పుడు నిలకడ లోపించినా తుది ఎలెవన్ జట్టులో ఆడే సత్తా అతనికి ఉందని, ముగ్గురికి మించి పేసర్ల అవసరం లేకే అతను తుది జట్టుకు దూరమవుతున్నాడనేది కోచ్ అభిప్రాయం. -
బిర్యానీ, కబాబ్‌లతోనే కాదు!
ఇండోర్: టీమిండియా పేసర్ మొహమ్మద్ షమీ మరోసారి రెండో ఇన్నింగ్స్‌లో అద్భుత బౌలింగ్‌తో భారత్‌ను గెలిపించాడు. ఈ మ్యాచ్‌లో అతను మొత్తం 7 వికెట్లు తీశాడు. అతనికంటే తక్కువ వికెట్లు తీసినా... ఇషాంత్, ఉమేశ్ గెలుపులో కీలక పాత్ర పోషించారు. ఈ ముగ్గురి మధ్య జరిగిన సరదా సంభాషణలో ఇదే విషయాన్ని ఇషాంత్ ప్రశ్నించాడు. ‘షమీ బౌలింగ్‌లో బంతి ఎప్పుడు ప్యాడ్‌కు తగిలినా ఎల్బీడబ్ల్యూ అవుతోంది. పుల్ చేయబోతే క్యాచ్ అవుట్‌గా మారుతోంది. మేం మాత్రం బ్యాట్స్‌మెన్‌ను బీట్ చేసి చేసి అలసిపోతున్నాం. చాలా పరేషాన్ అవుతున్నాం. మేమూ నీలాగే బౌలింగ్ చేస్తున్నా వికెట్లు దక్కడం లేదు. నీ బంతి సరిగ్గా ప్యాడ్లకు తగిలితే మా బంతి పైనుంచి వెళ్లిపోతోంది. ఇంతకీ నీ రహస్యమేంటో చెప్పు’ అని షమీని ఇషాంత్ అడిగాడు. దీనిపై అంతే సరదాగా స్పందించిన షమీ ఆ తర్వాత తన బౌలింగ్‌ను విశ్లేషించాడు. ‘దానికి కారణం బిర్యానీ, కబాబ్‌లు అని చాలా మంది అంటుంటారు. కానీ అదొక్కటే సరిపోదు. మీరు కూడా బాగా బౌలింగ్ చేయడం వల్లే నాపై ఒత్తిడి తక్కువగా ఉంటోంది. స్వేచ్ఛగా బౌలింగ్ చేస్తున్నాను. దేవుని దయ వల్ల కొంత అదృష్టం కూడా కలిసి వస్తోంది. ఏకాగ్రతతో ఒకే లైన్ అండ్ లెంగ్త్‌లో బౌలింగ్ బాగా పడుతోందని అనిపించినప్పుడు సరిగ్గా అలాగే దానిని కొనసాగించేందుకు ప్రయత్నిస్తున్నా. దాంతో అదే కచ్చితత్వం కొనసాగుతోంది’ అని షమీ వివరించాడు. రెండో ఇన్నింగ్స్‌లో తొలి 23 ఓవర్ల వరకు స్పిన్నర్‌తో పని లేకుండా భారత పేసర్లు బౌలింగ్ చేయడం విశేషం. 2001 తర్వాత స్వదేశంలో రెండో ఇన్నింగ్స్‌లో ఇంత సుదీర్ఘంగా మన పేసర్లు బౌలింగ్ చేయడం ఇదే మొదటిసారి. ఇదే మన పేసర్ల సత్తాను చూపిస్తోంది. అదే విధంగా ఏ టెస్టులోనైనా రెండో ఇన్నింగ్స్‌లో 30 ఓవర్ల వరకు కూడా భారత ప్రధాన స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ బౌలింగ్ చేయకపోవడం కూడా ఇదే తొలిసారి. ఈ ఇన్నింగ్స్ 34వ ఓవర్లో గానీ అశ్విన్‌కు బౌలింగ్ చేసే అవకాశం దక్కలేదు. -
ఫాలోఆన్.. సున్నాకే వికెట్
పుణే: టీమిండియాతో జరుగుతున్న రెండో టెస్టులో ఫాలోఆన్ ఆడుతున్న దక్షిణాఫ్రికా జట్టు ఆరంభంలోనే వికెట్‌ను కోల్పోయింది. ఆదివారం నాల్గో రోజు ఆటలో భాగంగా రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన దక్షిణాఫ్రికా ఓపెనర్ మార్కరమ్ వికెట్‌ను నష్టపోయింది. కేవలం రెండు బంతులు మాత్రమే ఆడిన మార్కరమ్ డకౌట్‌గా పెవిలియన్ చేరాడు. దాంతో పరుగుల ఖాతా తెరవకుండానే సఫారీలు వికెట్‌ను కోల్పోయారు. ఇన్నింగ్స్ తొలి ఓవర్ రెండో బంతికి మార్కరమ్ ఎల్బీగా పెవిలియన్ చేరాడు. ఇషాంత్ శర్మ నుంచి తక్కువ ఎత్తులో వచ్చిన బంతిని ఆడటానికి తడబడిన మార్కరమ్ వికెట్ల ముందు దొరికిపోయాడు. దాంతో భారత్‌కు శుభారంభం లభించింది. దక్షిణాఫ్రికా తన తొలి ఇన్నింగ్స్‌లో 275 పరుగుల వద్ద ఆలౌటైన సంగతి తెలిసిందే. దాంతో భారత్‌కు 326 పరుగుల భారీ ఆధిక్యం లభించడంతో దక్షిణాఫ్రికా ఫాలోఆన్ ప్రమాదంలో పడింది. ఈరోజు ఆటలో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి సఫారీలను ఫాల్ఆన్ ఆప్షన్ ఎంచుకున్నాడు. తద్వారా ఇన్నింగ్స్ ఆరంభించిన దక్షిణాఫ్రికా ఆదిలోనే వికెట్‌ను చేజార్చుకోవడంతో ఆ జట్టు శిబిరంలో కలవరపాటు మొదలైంది. తొలి ఇన్నింగ్స్‌లో భారత్‌కు భారీ ఆధిక్యం లభించడంతో పాటు ఇంకా రెండు రోజుల ఆట మిగిలున్న ఈ టెస్టులో ఆతిథ్య బౌలర్ల సమష్టి జోరు చూస్తే ఇన్నింగ్స్ విజయానికి ఇది సరిపోతుంది. తొలి ఇన్నింగ్స్‌లో భారత్ 601/5 వద్ద డిక్లేర్డ్ చేయగా, దక్షిణాఫ్రికా మాత్రం తడ‘బ్యాటు’కు గురైంది.(ఇక్కడ చదవండి: శాసించేది మనమే) -
కపిల్ రికార్డుకు వికెట్ దూరంలో..
జమైకా: వెస్టిండీస్‌తో జరిగిన తొలి టెస్టులో చెలరేగిపోయిన భారత క్రికెట్ జట్టు పేసర్ ఇషాంత్ శర్మ ముంగిట అరుదైన రికార్డు ఉంది. శుక్రవారం నుంచి విండీస్‌తో ఆరంభమయ్యే రెండో టెస్టులో ఇషాంత్ వికెట్ తీస్తే భారత దిగ్గజ బౌలర్ కపిల్‌దేవ్ రికార్డును సవరిస్తాడు. ఆసియా ఖండం అవతల అత్యధిక టెస్టు వికెట్లు సాధించిన రెండో భారత బౌలర్‌గా నిలిచేందుకు ఇషాంత్‌కు వికెట్ అవసరం. ఆసియా బయట ఇప్పటివరకూ ఇషాంత్ శర్మ 45 వికెట్లను సాధించాడు. దాంతో కపిల్‌దేవ్ సరసన నిలిచాడు. కాగా, రేపటి నుంచి ప్రారంభమయ్యే టెస్టులో ఇషాంత్ వికెట్ తీస్తే కపిల్‌దేవ్‌ను అధిగమిస్తాడు. ఈ జాబితాలో భారత్ తరఫున అనిల్ కుంబ్లే(50) అగ్రస్థానంలో కొనసాగుతుండగా, కపిల్‌దేవ్, ఇషాంత్‌లు సంయుక్తంగా రెండో స్థానంలో ఉన్నారు. గత టెస్టులో ఇషాంత్ శర్మ ఎనిమిది వికెట్లతో విజృంభించాడు. తొలి ఇన్నింగ్స్‌లో ఐదు వికెట్లు సాధించిన ఇషాంత్.. రెండో ఇన్నింగ్స్‌లో మూడు వికెట్లు తీశాడు. ఫలితంగా కపిల్‌దేవ్ సరసన నిలిచాడు. తొలి టెస్టులో భారత్ 318 పరుగుల తేడాతో గెలిచిన సంగతి తెలిసిందే. ఇషాంత్, బుమ్రాల పేస్ బౌలింగ్‌కు తోడు అజింక్యా రహానే సొగసైన ఇన్నింగ్స్ భారత్‌కు భారీ విజయాన్ని అందించాయి. కాగా, రెండో టెస్టును కూడా భారత్ గెలిస్తే విరాట్ కోహ్లి అరుదైన ఘనతను సాధిస్తాడు. కెప్టెన్‌గా 28వ టెస్టు విజయాన్ని ఖాతాలో వేసుకుని ఇప్పటివరకూ ధోని పేరిట ఉన్న 27 మ్యాచ్‌ల రికార్డును కోహ్లి బ్రేక్ చేస్తాడు. -
చెలరేగిన ఇషాంత్
ఆంటిగ్వా: వెస్టిండీస్‌తో జరుగుతున్న తొలి టెస్టులో భారత పేసర్ ఇషాంత్ శర్మ చెలరేగిపోయాడు. పదునైన బంతులతో విండీస్ బ్యాట్స్‌మెన్‌ను బెంబేలెత్తించాడు. ఫలితంగా వెస్టిండీస్ తన తొలి ఇన్నింగ్స్‌లో భాగంగా రెండో రోజు ఆట ముగిసే సమయానికి 59 ఓవర్లలో 189 పరుగులే చేసిన విండీస్ ఎనిమిది వికెట్లను కోల్పోయింది. దాంతో ప్రస్తుతం టీమిండియా 108 పరుగుల ఆధిక్యంలో నిలిచింది. విండీస్ మొదటి ఇన్నింగ్స్ పూర్తి కావడానికి రెండు వికెట్లు మాత్రమే ఉండటంతో భారత్‌కు మ్యాచ్‌పై పట్టుదొరికినట్లే. విండీస్ ఆటగాళ్లలో రోస్టన్ ఛేజ్(48), హెట్మెయిర్(35)లు మాత్రమే మోస్తరుగా రాణించారు. తొలుత ఓపెనర్ క్రెయిగ్ బ్రాత్‌వైట్‌ను పెవిలియన్‌కు పంపిన ఇషాంత్.. ఆపై మరింత ప్రమాదకరంగా మారిపోయాడు. రోస్టన్ ఛేజ్, షాయ్ హోప్, హెట్ మెయిర్ వికెట్లను సాధించి విండీస్ పతనాన్ని శాసించాడు. రెండో రోజు ఆట కాసేపట్లో ముగుస్తుందనగా కీమర్ రోచ్‌ను డకౌట్‌గా పెవిలియన్‌కు పంపాడు. తద్వారా ఐదు వికెట్లను ఇషాంత్ సాధించాడు. టెస్టుల్లో ఇషాంత్ ఐదు వికెట్లను నేలకూల్చడం ఇది తొమ్మిదోసారి. కాగా, వెస్టిండీస్ గడ్డపై ఐదు అంతకంటే ఎక్కువ వికెట్లను(10 వికెట్లలోపు) తీయండ మూడోసారి. అంతకుముందు భారత్ తన తొలి ఇన్నింగ్స్‌లో 297 పరుగులకు ఆలౌటైంది. వీంద్ర జడేజా (112 బంతుల్లో 58), రహానే (81; 10 ఫోర్లు)లు ఆదుకోవడంతో టీమిండియా గౌరవప్రదమైన స్కోరు నమోదు చేసింది.