
పుణే: టీమిండియాతో జరుగుతున్న రెండో టెస్టులో ఫాలోఆన్ ఆడుతున్న దక్షిణాఫ్రికా జట్టు ఆరంభంలోనే వికెట్‌ను కోల్పోయింది. ఆదివారం నాల్గో రోజు ఆటలో భాగంగా రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన దక్షిణాఫ్రికా ఓపెనర్ మార్కరమ్ వికెట్‌ను నష్టపోయింది. కేవలం రెండు బంతులు మాత్రమే ఆడిన మార్కరమ్ డకౌట్‌గా పెవిలియన్ చేరాడు. దాంతో పరుగుల ఖాతా తెరవకుండానే సఫారీలు వికెట్‌ను కోల్పోయారు. ఇన్నింగ్స్ తొలి ఓవర్ రెండో బంతికి మార్కరమ్ ఎల్బీగా పెవిలియన్ చేరాడు. ఇషాంత్ శర్మ నుంచి తక్కువ ఎత్తులో వచ్చిన బంతిని ఆడటానికి తడబడిన మార్కరమ్ వికెట్ల ముందు దొరికిపోయాడు. దాంతో భారత్‌కు శుభారంభం లభించింది.
దక్షిణాఫ్రికా తన తొలి ఇన్నింగ్స్‌లో 275 పరుగుల వద్ద ఆలౌటైన సంగతి తెలిసిందే. దాంతో భారత్‌కు 326 పరుగుల భారీ ఆధిక్యం లభించడంతో దక్షిణాఫ్రికా ఫాలోఆన్ ప్రమాదంలో పడింది. ఈరోజు ఆటలో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి సఫారీలను ఫాల్‌ఆన్ ఆప్షన్ ఎంచుకున్నాడు. తద్వారా ఇన్నింగ్స్ ఆరంభించిన దక్షిణాఫ్రికా ఆదిలోనే వికెట్‌ను చేజార్చుకోవడంతో ఆ జట్టు శిబిరంలో కలవరపాటు మొదలైంది. తొలి ఇన్నింగ్స్‌లో భారత్‌కు భారీ ఆధిక్యం లభించడంతో పాటు ఇంకా రెండు రోజుల ఆట మిగిలున్న ఈ టెస్టులో ఆతిథ్య బౌలర్ల సమష్టి జోరు చూస్తే ఇన్నింగ్స్ విజయానికి ఇది సరిపోతుంది. తొలి ఇన్నింగ్స్‌లో భారత్ 601/5 వద్ద డిక్లేర్డ్ చేయగా, దక్షిణాఫ్రికా మాత్రం తడ‘బ్యాటు’కు గురైంది.(ఇక్కడ చదవండి: శాసించేది మనమే)