టీమిండియా వెటరన్ పేసర్ ఇషాంత్ శర్మ ఐపీఎల్ రీఎంట్రీని ఘనంగా ఆరంభించాడు. దాదాపు 717 రోజుల తర్వాత ఐపీఎల్ మ్యాచ్ ఆడిన ఇషాంత్ ఆకట్టుకున్నాడు. గురువారం కేకేఆర్‌తో జరిగిన మ్యాచ్‌లో 4 ఓవర్లు బౌలింగ్ చేసిన ఇషాంత్ 19 పరగులిచ్చి రెండు కీలక వికెట్లు తీశాడు. కాగా ఈ ఏడాది జరిగిన మినీ వేలంలో ఢిల్లీ క్యాపిటల్స్ ఇషాంత్ శర్మను రూ.50 లక్షలకు దక్కించుకుంది.
ఇక 2021లో చివరిసారి ఐపీఎల్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ తరపున మ్యాచ్ ఆడిన ఇషాంత్ ఆ సీజన్‌లో మూడు మ్యాచ్‌ల్లో మూడు వికెట్లు తీశాడు. కాగా 2019 వరకు మాత్రం రెగ్యులర్‌గా ఐపీఎల్ ఆడిన ఇషాంత్ ఆ సీజన్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ తరపున 13 మ్యాచ్‌ల్లో 13 వికెట్లు తీశాడు. ఇక ఓవరాల్‌గా 93 మ్యాచ్‌ల్లో 71 వికెట్లు తీసుకున్నాడు.
ఇక అంతర్జాతీయ క్రికెట్ విషయానికి వస్తే కొన్నేళ్లగా టెస్టులకే మాత్రమే పరిమితమయ్యాడు. 108 టెస్టుల్లో 311 వికెట్లు, 80 వన్డేల్లో 115 వికెట్లు, 14 టి20ల్లో 8 వికెట్లు పడగొట్టాడు.
Ishant Sharma spearheads #DelhiCapitals' offence!
— JioCinema (@JioCinema) April 20, 2023
Keep watching #DCvKKR - LIVE & FREE on #JioCinema | Available across all telecom operators 😊#TATAIPL #IPL2023 #IPLonJioCinema | @ImIshant pic.twitter.com/PYK3rcoRoo
చదవండి: సైగ చేయగానే ఆగిపోయాడు.. నమ్మకాన్ని నిలబెట్టని కోహ్లి
Comments
Please login to add a commentAdd a comment