త్వరలో ఇషాంత్ పెళ్లి..
వారణాసి:త్వరలో భారత క్రికెటర్ ఇషాంత్ శర్మ ఇంటివాడు కానున్నాడు. ఈ ఏడాది జూన్లో బాస్కెట్ బాల్ క్రీడాకారిణి ప్రతిమా సింగ్తో ఇషాంత్ నిశ్చితార్థం జరిగిన విషయం తెలిసిందే. దీనికి సంబంధించిన పెళ్లి మూహుర్తాన్ని తాజాగా ఖరారు చేశారు. డిసెంబర్ 9వ తేదీన ఇషాంత్-ప్రతిమల వివాహ కార్యక్రమాన్ని జరపనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.
వారణాసికి చెందిన ప్రతిమా సింగ్.. గతంలో భారత జాతీయ బాస్కెట్ బాల్ జట్టు తరపున అనేక మ్యాచ్లకు ప్రాతినిథ్యం వహించింది. దాంతో పాటు కెప్టెన్గా కూడా వ్యహరించింది. త్వరలో ఇంగ్లండ్తో జరిగే సిరీస్కు ఇషాంత్ ఎంపికైన సంగతి తెలిసిందే. నవంబర్ 9వ తేదీ నుంచి డిసెంబర్ 20వ తేదీ వరకూ ఇరు జట్ల మధ్య ఐదు టెస్టుల సిరీస్ జరుగనుంది. నాల్గో టెస్టు ప్రారంభమైన రెండో రోజు ఇషాంత్ పెళ్లి జరపడానికి నిశ్చయించడంతో చివరి రెండు టెస్టులకు అతను అందుబాటులో ఉండకపోవచ్చు.