pratima singh
-
చీఫ్ గెస్ట్‌గా వెళ్లి, అమ్మాయిని పటాయించిన లంబూ..
న్యూఢిల్లీ: ప్రస్తుత భారత జట్టులో రఫ్‌గా కనిపించే క్రికెటర్ ఎవరైనా ఉన్నారా అంటే.. అది మన లంబూ ఇషాంత్ శర్మనే అని ఠక్కున చెప్పేయొచ్చు. ఇలా కనిపించే ఈ వ్యక్తి... ఓ మ్యాచ్‌కు చీఫ్ గెస్ట్‌గా వెళ్లి ఓ అమ్మాయిని పటాయించాడంటే ఎవరైనా నమ్ముతారా..? కానీ లంబూ మాత్రం అందరి అంచనాలను తలకిందులు చేస్తూ.. అమ్మాయిని లవ్‌లో పడేశాడు. ఆ అమ్మాయి సాదాసీదా వ్యక్తి ఏమీ కాదు. బాస్కెట్ బాల్లో భారత్‌కు ప్రాతినిధ్యం వహించిన స్టార్ క్రీడాకారిణి. అయితే ఆ తర్వాత ఇషాంత్ ఆ అమ్మాయినే పెళ్లి చేసుకున్నాడనుకోండి. అది వేరే విషయం. వివరాల్లోకి వెళితే.. ఇషాంత్ శర్మ, తన భార్య ప్రతిమ సింగ్‌ను మొదటి సారి 2011లో కలుసుకున్నాడు. ఢిల్లీలో ఐజీఎంఏ బాస్కెట్ బాల్ అసోసియేషన్ నిర్వహించిన లీగ్ మ్యాచ్‌కు ఆయన ముఖ్య అతిధిగా వెళ్లాడు. ఆ కార్యక్రమాన్ని అతని స్నేహితుడు నిర్వహించాడు. అక్కడే ఇషాంత్ తన భార్య ప్రతిమను తొలిసారి చూశాడు. ఆ సమయంలో ఆమె భారత్ తరపున బాస్కెట్ బాల్ ఆడిన విషయం ఇషాంత్‌కు తెలియదు. గాయం కారణంగా ఆమె ఆ మ్యాచ్ ఆడకపోవడంతో అదే మ్యాచ్‌కు స్కోరర్‌గా వ్యవహరిస్తోంది. కుర్చీలో కూర్చొని స్కోర్ నమోదు చేస్తున్న ఆమెను ఇషాంత్ కళ్లు ఆర్పకుండా చూస్తూ ఉన్నాడు. ఇది గమనించిన ఆమెకు తొలుత ఇషాంత్‌పై చాలా కోపం వచ్చిందట. అవన్నీ పట్టించుకోని ఇషాంత్.. ప్రతిమ దగ్గరకు వెళ్లి మాటామాటా కలపడం మొదలు పెట్టాడు. అతని మాటలు తొలుత ఆమెను ఇబ్బంది పెట్టినా ఆ తర్వాత ఇద్దరూ డీప్ డిస్కషన్‌లోకి వెళ్లిపోయారు. తొలి చూపులోనే ఇద్దరి మధ్య ప్రేమ చిగురించడంతో.. ఒకరి ఫోన్ నంబర్లు ఒకరు తీసుకుని ప్రేమాయనాన్ని కొనసాగించారు. ఇక అప్పటి నుంచి ఇషాంత్ ప్రతి రోజు ప్రతిమను చూడటానికి వెళ్లేవాడు. అలా ఏడాది పాటు సాగిన వారి ప్రేమాయణం 2012లో ఓ సందర్భంగా పబ్లిక్ అయ్యిందని, ఆ రోజు వారు బహిరంగంగా తమ ప్రేమను వ్యక్త పరిచారని ఇషాంత్ స్నేహితుడు వెల్లడించాడు. ఇదే విషయాన్ని ప్రతిమ ఒక ఇంటర్వ్యూలో ప్రస్తావిస్తూ.. తొలి చూపులోనే ఇషాంత్ లవ్‌లో పడిపోయానని చెప్పింది. కాగా, 2011లో మొలకెత్తిన వీరి ప్రేమ ఐదేళ్లపాటు సాగి 2016లో పెళ్లితో ఎండ్ అయ్యింది. ఇదిలా ఉంటే, ఇషాంత్ ప్రస్తుతం టీమిండియాతో పాటు ఇంగ్లండ్‌లో పర్యటిస్తున్నాడు. న్యూజిలాండ్‌తో ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌తో పాటు ఇంగ్లండ్‌తో 5 మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ ఆడేందుకు లండన్‌లో ల్యాండయ్యాడు. చదవండి: KL RAHUL: ప్రియసఖితో తొలిసారి.. గతంలో విరుష్క జోడీ కూడా ఇలానే -
క్రికెటర్ ఇషాంత్ శర్మ ఓ ఇంటివాడయ్యాడు
క్రికెటర్ ఇషాంత్ శర్మ ఓ ఇంటివాడయ్యాడు. న్యూఢిల్లీలో శుక్రవారం భారత బాస్కెట్‌బాల్ జట్టు సభ్యురాలు ్రప్రతిమా సింగ్‌ను అతను పెళ్లాడాడు. ఈ వివాహానికి ధోని, యువరాజ్ సహా పలువురు క్రికెటర్లు హాజరయ్యారు. -
ఇంటివాడైన ఇషాంత్
వారణాసి:టీమిండియా పేసర్ ఇషాంత్ శర్మ ఇంటివాడయ్యాడు. బాస్కెట్ బాల్ ప్లేయర్ ప్రతిమా సింగ్-ఇషాంత్‌ల వివాహం శుక్రవారం జరిగింది. గత జూన్‌లో ఈ జోడికి నిశ్చితార్థం జరగ్గా, తాజాగా వారి వివాహం కార్యక్రమం జరిగింది. ఈ పెళ్లి వేడుకకు పలువురు క్రికెటర్లు విచ్చేశారు. ప్రధానంగా టీమిండియా పరిమిత ఓవర్ల కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని, యువరాజ్ సింగ్‌లు వీరి వివాహానికి హాజరయ్యారు. అయితే ఈ వివాహ కార్యక్రమానికి యువరాజ్ సింగ్ భార్య హజల్తో పాటు, ధోని భార్య సాక్షిలు హాజరు కాలేదు.గత కొన్ని రోజుల క్రితం యువరాజ్ సింగ్-హజల్కీచ్ల వివాహం జరిగిన సంగతి తెలిసిందే. వారణాసికి చెందిన ప్రతిమా సింగ్.. గతంలో భారత జాతీయ బాస్కెట్ బాల్ జట్టు తరపున అనేక మ్యాచ్‌లకు ప్రాతినిథ్యం వహించింది. దాంతో పాటు కెప్టెన్‌గా కూడా వ్యహరించింది. 2011లో ప్రతిమను బాస్కెట్ బాల్ ఈవెంట్లో ఇషాంత్ తొలిసారి చూశాడు. ఆ ఈవెంట్‌కు ముఖ్య అతిథిగా వెళ్లిన ఇషాంత్.. ఆమెతో ప్రేమలో పడ్డాడు. ఆ రకంగా వారి ప్రేమకు మొదటి అడుగుపడింది. మరిన్ని చిత్రాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
త్వరలో ఇషాంత్ పెళ్లి..
వారణాసి:త్వరలో భారత క్రికెటర్ ఇషాంత్ శర్మ ఇంటివాడు కానున్నాడు. ఈ ఏడాది జూన్‌లో బాస్కెట్ బాల్ క్రీడాకారిణి ప్రతిమా సింగ్‌తో ఇషాంత్ నిశ్చితార్థం జరిగిన విషయం తెలిసిందే. దీనికి సంబంధించిన పెళ్లి మూహుర్తాన్ని తాజాగా ఖరారు చేశారు. డిసెంబర్ 9వ తేదీన ఇషాంత్-ప్రతిమల వివాహ కార్యక్రమాన్ని జరపనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. వారణాసికి చెందిన ప్రతిమా సింగ్.. గతంలో భారత జాతీయ బాస్కెట్ బాల్ జట్టు తరపున అనేక మ్యాచ్‌లకు ప్రాతినిథ్యం వహించింది. దాంతో పాటు కెప్టెన్‌గా కూడా వ్యహరించింది. త్వరలో ఇంగ్లండ్‌తో జరిగే సిరీస్‌కు ఇషాంత్ ఎంపికైన సంగతి తెలిసిందే. నవంబర్ 9వ తేదీ నుంచి డిసెంబర్ 20వ తేదీ వరకూ ఇరు జట్ల మధ్య ఐదు టెస్టుల సిరీస్ జరుగనుంది. నాల్గో టెస్టు ప్రారంభమైన రెండో రోజు ఇషాంత్ పెళ్లి జరపడానికి నిశ్చయించడంతో చివరి రెండు టెస్టులకు అతను అందుబాటులో ఉండకపోవచ్చు.