చీఫ్‌ గెస్ట్‌గా వెళ్లి, అమ్మాయిని పటాయించిన లంబూ.. | Indian Basket Ball Player Pratima Singh Fell In Love In First Sight With Teamindia Fast Bowler Ishant Sharma | Sakshi
Sakshi News home page

చీఫ్‌ గెస్ట్‌గా వెళ్లి, అమ్మాయిని పటాయించిన లంబూ..

Published Thu, Jun 17 2021 8:24 PM | Last Updated on Thu, Jun 17 2021 8:49 PM

Indian Basket Ball Player Pratima Singh Fell In Love In First Sight With Teamindia Fast Bowler Ishant Sharma - Sakshi

న్యూఢిల్లీ: ప్రస్తుత భారత జట్టులో రఫ్‌గా కనిపించే క్రికెటర్‌ ఎవరైనా ఉన్నారా అంటే.. అది మన లంబూ ఇషాంత్‌ శర్మనే అని ఠక్కున చెప్పేయొచ్చు. ఇలా కనిపించే ఈ వ్యక్తి... ఓ మ్యాచ్‌కు చీఫ్‌ గెస్ట్‌గా వెళ్లి ఓ అమ్మాయిని పటాయించాడంటే ఎవరైనా నమ్ముతారా..? కానీ లంబూ మాత్రం అందరి అంచనాలను తలకిందులు చేస్తూ.. అమ్మాయిని లవ్‌లో పడేశాడు. ఆ అమ్మాయి సాదాసీదా వ్యక్తి ఏమీ కాదు. బాస్కెట్‌ బాల్‌లో భారత్‌కు ప్రాతినిధ్యం వహించిన స్టార్‌ క్రీడాకారిణి.  అయితే ఆ తర్వాత ఇషాంత్‌  ఆ అమ్మాయినే పెళ్లి చేసుకున్నాడనుకోండి. అది వేరే విషయం. వివరాల్లోకి వెళితే..  

ఇషాంత్ శర్మ, తన భార్య ప్రతిమ సింగ్‌ను మొదటి సారి 2011లో కలుసుకున్నాడు. ఢిల్లీలో ఐజీఎంఏ బాస్కెట్ బాల్ అసోసియేషన్ నిర్వహించిన లీగ్ మ్యాచ్‌కు ఆయన ముఖ్య అతిధిగా వెళ్లాడు. ఆ కార్యక్రమాన్ని అతని స్నేహితుడు నిర్వహించాడు. అక్కడే ఇషాంత్‌ తన భార్య ప్రతిమను తొలిసారి చూశాడు. ఆ సమయంలో ఆమె భారత్ తరపున బాస్కెట్ బాల్ ఆడిన విషయం ఇషాంత్‌కు తెలియదు. గాయం కారణంగా ఆమె ఆ మ్యాచ్ ఆడకపోవడంతో అదే మ్యాచ్‌కు స్కోరర్‌గా వ్యవహరిస్తోంది. కుర్చీలో కూర్చొని స్కోర్ నమోదు చేస్తున్న ఆమెను ఇషాంత్ కళ్లు ఆర్పకుండా చూస్తూ ఉన్నాడు. ఇది గమనించిన ఆమెకు తొలుత ఇషాంత్‌పై చాలా కోపం వచ్చిందట.

అవన్నీ పట్టించుకోని ఇషాంత్‌.. ప్రతిమ దగ్గరకు వెళ్లి మాటామాటా కలపడం మొదలు పెట్టాడు. అతని మాటలు తొలుత ఆమెను ఇబ్బంది పెట్టినా ఆ తర్వాత ఇద్దరూ డీప్‌ డిస్కషన్‌లోకి వెళ్లిపోయారు. తొలి చూపులోనే ఇద్దరి మధ్య ప్రేమ చిగురించడంతో.. ఒకరి ఫోన్‌ నంబర్లు ఒకరు తీసుకుని ప్రేమాయనాన్ని కొనసాగించారు. ఇక అప్పటి నుంచి ఇషాంత్ ప్రతి రోజు ప్రతిమను చూడటానికి వెళ్లేవాడు. అలా ఏడాది పాటు సాగిన వారి ప్రేమాయణం 2012లో ఓ సందర్భంగా పబ్లిక్‌ అయ్యిందని, ఆ రోజు వారు బహిరంగంగా తమ ప్రేమను వ్యక్త పరిచారని ఇషాంత్‌ స్నేహితుడు వెల్లడించాడు.

ఇదే విషయాన్ని ప్రతిమ ఒక ఇంటర్వ్యూలో ప్రస్తావిస్తూ.. తొలి చూపులోనే ఇషాంత్‌ లవ్‌లో పడిపోయానని చెప్పింది. కాగా,  2011లో మొలకెత్తిన వీరి ప్రేమ ఐదేళ్లపాటు సాగి 2016లో పెళ్లితో ఎండ్‌ అయ్యింది. ఇదిలా ఉంటే, ఇషాంత్‌ ప్రస్తుతం టీమిండియాతో పాటు ఇంగ్లండ్‌లో పర్యటిస్తున్నాడు. న్యూజిలాండ్‌తో ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌తో పాటు ఇంగ్లండ్‌తో 5 మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ ఆడేందుకు లండన్‌లో ల్యాండయ్యాడు.


చదవండి: KL RAHUL: ప్రియసఖితో తొలిసారి.. గతంలో విరుష్క జోడీ కూడా ఇలానే

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

Photos

View all
 
Advertisement