న్యూఢిల్లీ: కరోనా వైరస్ విస్తృతి నేపథ్యంలో క్రికెట్‌లో బంతిపై సలైవా(లాలాజలాన్ని) రుద్దడాన్ని రద్దు చేస్తూ ఇటీవల అంతర్జాతీయ క్రికెట్ మండలి(ఐసీసీ) తీసుకున్న నిర్ణయంపై ఎక్కువ శాతం ప్రతికూల స్పందనలే వస్తున్నాయి. వన్డే, టీ20 క్రికెట్‌లో సలైవాను రద్దు చేసినా ఫర్వాలేదు కానీ టెస్టు క్రికెట్‌లో అది తీవ్రమైన ప్రభావం చూపుతుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. కాగా, సలైవా రద్దుపై టీమిండియా పేసర్ ఇషాంత్ శర్మ స్పందించాడు. ఐసీసీ తీసుకున్న సలైవా రద్దు నిర్ణయాన్ని సుతిమెత్తగా విమర్శించాడు. ఇక తమ పని అయిపోయినట్లేనని ఇషాంత్ సెటైరిక్ మాట్లాడాడు. ప్రధానంగా టెస్టుల్లో సలైవా అనేది ఎంతగానో బౌలర్లకు సహకరిస్తుందని, బంతిని స్వింగ్ చేయడంలో ఇది కీలక పాత్ర పోషిస్తుందన్నాడు. (‘యువీ.. నువ్వు ఇంకా ఆడతావనుకున్నా’)
‘బౌలర్లు బంతిని షైన్ చేయకపోతే బంతి స్వింగ్ కాదు. బంతి స్వింగ్ కాకపోతే అది బ్యాట్స్‌మన్‌కు అనుకూలంగా మారుతుంది. మొత్తం బ్యాట్స్‌మన్ ఆధిపత్యం క్రికెట్‌గా మారిపోతుందనేది కాదనలేదని వాస్తవం. అటు బౌలర్‌కు ఇటు బ్యాట్స్‌మన్‌కు పోరు అనేది ఉండదు. బంతిని రుద్దకపోతే బ్యాట్స్‌మన్‌గా ఈజీ అయిపోతుంది. ప్రస్తుతం కొన్ని కారణాల వల్ల సలైవాను బంతిపై రుద్దడాన్ని రద్దు చేశారు. కానీ దీనికి ప్రత్యామ్నాయం అవసరం. టెస్టు క్రికెట్‌లో బంతిని షైన్ చేయడం అనేది చాలా ముఖ్యం. ఇందుకు ఐసీసీ వేరే పద్ధతిని తీసుకురావాల్సి ఉంది’ అని ఇషాంత్ పేర్కొన్నాడు.(‘ప్లాన్-బితోనే క్రికెట్‌లోకి వచ్చా’)
Comments
Please login to add a commentAdd a comment