Saliva Test
-
యూరిన్ కాదు.. ఇక లాలాజలంతో ప్రెగ్నెన్సీ టెస్ట్
ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ కోసం వైద్యులను సంప్రదించడం కాకుండా.. మహిళల కోసం హోంటెస్ట్ కిట్లు అందుబాటులో ఉన్న సంగతి తెలిసిందే. అయితే కేవలం ఉమ్మితోనే అమ్మ అయ్యిందో లేదో తెలుసుకోవచ్చు. అందుకోసం ఓ కిట్ యూకేలో లాంఛ్ కాగా.. అతిత్వరలో అది ప్రపంచవ్యాప్తంగా అందుబాటులోకి రానుంది. ప్రపంచంలోనే ఈ తరహా తొలి ఉత్పత్తి ఇదే కావడం గమనార్హం. వైద్య-సాంకేతిక రంగంలో విప్లవాత్మక అడుగు పడింది. లాలాజలంతో గర్భనిర్ధారణ కిట్ అందుబాటులోకి వచ్చింది. జరూసలెంకు చెందిన సాలిగ్నోస్టిక్స్ అనే బయోటెక్ స్టార్టప్ కంపెనీ దీనిని తయారు చేసింది. ఈ ఉత్పత్తికి ‘సాలిస్టిక్’గా నామకరణం చేశారు. ఏడాది ప్రయత్నాల తర్వాత తాజాగా యూకేలో దీనిని లాంఛ్ చేశారు. యూకేతో పాటు ఐర్లాండ్‌లోనూ వీటి అమ్మకాలు మొదలయ్యాయి. అమెరికాలోనూ అమ్మకాల కోసం ఎఫ్‌డీఏ అనుమతి కోసం దరఖాస్తు చేసుకుంది ఈ కంపెనీ. ఇంతకాలం యూరిన్ బేస్డ్ హోంటెస్ట్ కిట్లు మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. అయితే ఇక నుంచి ఈ సెలైవాతో ప్రెగెన్సీ టెస్ట్ కిట్లు అందుబాటులోకి రానున్నాయి. కరోనా టెస్టింగ్ కిట్స్ సాంకేతికతను ఉపయోగించే ఈ సెలైవా ప్రెగ్నెన్సీ టెస్ట్ కిట్లు తయారు చేయడం గమనార్హం. వీటిని ఎప్పుడైనా..ఎక్కడైనా ఉపయోగించొచ్చు. థెర్మామీటర్ను ఉంచుకున్నట్లే.. కిట్‌లో వచ్చే స్టిక్‌ను నోట్లో పెట్టుకుని కాసేపు ఉంచితే అది లాలాజలాన్ని సేకరిస్తుంది. ఆపై ఫలితం కోసం ఐదు నుంచి పది నిమిషాల పాటు వేచి ఉండాల్సి ఉంటుంది. ఒక్కోసారి మూడు నిమిషాల్లోనూ చూపించే అవకాశం ఉంది. స్టిక్ తొలుత లాలాజలాన్ని సేకరించి.. దానికి ప్లాస్టిక్ ట్యూబ్‌కు బదిలీ చేస్తుంది, అక్కడ జీవరసాయన ప్రతిచర్య జరిగి ఫలితం వెలువడుతుంది. పిండం అభివృద్ధి చెందడానికి గర్భాశయాన్ని సిద్ధం చేయడంలో ఉపయోగపడే ప్రత్యేకమైన హార్మోన్(గర్భధారణ కోసం) అయిన hCGని గుర్తించే సాంకేతికతపై ఈ పరీక్ష ఆధారపడి ఉంటుంది. ఇదీ చదవండి: సాధు జంతువు అనుకోకండి.. చిర్రెత్తితే మాత్రం.. -
పెద్దవయసు పిల్లలూ చొల్లు కార్చుకుంటున్నారా?
పిల్లల్లో నోటి నుంచి చొల్లు కారడం చాలా సహజంగా కనిపించే లక్షణం. ఇలా చొల్లు/జొల్లు కారుతూ ఉన్న కండిషన్‌ను సైలోరియా అంటారు. ఇది 6 నుంచి 18 నెలల వరకు సాధారణంగా కనిపిస్తుంది. ఆ టైమ్‌లో అలా చొల్లు కారడాన్ని సాధారణంగానే పరిగణించవచ్చు. నోరు, దవడ భాగంలోని ఓరల్ మోటార్ ఫంక్షన్స్ అభివృద్ధి చెందేవరకూ ఇలా నోటి నుంచి లాలాజలం కారుతుండటం మామూలే. కానీ చిన్న పిల్లల్లో నాలుగేళ్లు దాటాక కూడా చొల్లు కారుతుంటే దాన్ని అబ్‌నార్మాలిటీగా పరిగణించాలి. కొంతమంది పెద్ద పిల్లల్లో మానసిక సమస్యలు, నరాల బలహీనతకు సంబంధించిన రుగ్మతలు ఉంటే ఈ లక్షణం కనిపిస్తుంటుంది. కారణం... వాళ్లలో నోట్లో స్రవించిన లాలాజలాన్ని తమంతట తామే మింగలేని పరిస్థితి ఉంటుంది. చిన్న పిల్లల్లో కొన్నిసార్లు ముక్కులు విపరీతంగా బిగుసుకుపోయినా, దంత (డెంటల్) సమస్యలు ఉన్నా, మింగలేకపోవడానికి ఇంకేమైనా సమస్యలు ఉన్నా (ఉదా: సివియర్ ఫ్యారింగో టాన్సిలైటిస్ వంటివి) కూడా చొల్లు/జొల్లు కారుతుంటుంది. ఇలాంటి సమస్యలు ఉన్నపుడు జొల్లు కారవడం ఎక్కువవుతుంది. కాని ఇవన్నీ తాత్కాలికం. పెద్ద పిల్లల్లో ఇలా చొల్లు/జొల్లు కారడం సమస్య ఉన్నప్పుడు వాళ్లంతట వాళ్లే లాలాజల స్రావాన్ని మింగేలా అలవాటు చేయాలి. ఇలా లాలాజల స్రావం ఎక్కువగా ఉన్న పిల్లల్లో కొన్ని ప్రత్యేకమైన దంత ఉపకరణాలు (స్పెషల్ డెంటల్ అప్లయెన్సెస్) ఉపయోగించి వాలంటరీగా మింగడం అలవాటు చేయించవచ్చు. మరికొందరిలో కొన్ని ప్రత్యేక సందర్భాల్లో (ముఖ్యంగా పెద్దవాళ్లలో, పెద్ద పిల్లల్లో) కొన్ని మందులు వాడాల్సి ఉంటుంది. ఇటీవలి కాలంలో బొట్యులినం టాక్సిమ్ అనే పదార్థాన్ని లాలాజల గ్రంథుల్లోకి ఇంజెక్ట్ చేయడం కూడా చేస్తున్నారు. వీటన్నింటికంటే ముఖ్యంగా ఇలాంటి సందర్భాల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు కొన్ని ఉన్నాయి. అవి... ♦ మంచి నోటి పరిశుభ్రత (గుడ్ ఓరల్ హైజీన్) ♦ తరచూ మింగడం అలవాటు చేయడం ♦ నోటి కండరాల కదలికలను మెరుగు పరచడం (ఇంప్రూవ్మెంట్ ఆఫ్ టోన్ అండ్ మూవ్మెంట్ ఆఫ్ ఓరల్ మజిల్స్)... ఈ చర్యలన్నీ ఇలా చొల్లు/జొల్లు కారకుండా చేసేందుకు దోహదపడతాయి. -
సెలైవా బ్యాన్‌తో సమస్య లేదు: బ్రెట్‌లీ
కోకాబుర్రా బాల్స్ ఎక్కువ స్వింగ్ కావని, సెలైవా నిషేధం వల్ల వాటిపై ప్రభావం ఎక్కువగా ఉండదని ఆస్ట్రేలిన్ మాజీ పేసర్ బ్రెట్ లీ అభిప్రాయపడ్డాడు. కరోనా విస్తరిస్తున్న నేపథ్యంలో క్రికెటర్ల ఆరోగ్యం దృష్ట్యా బంతికి సెలైవా రాయడాన్ని అంతర్జాతీయ క్రికెట్ మండలి(ఐసీసీ) నిషేధించింది. అయితే సెలైవా రాయకపోతే బాల్ స్వింగ్ అయ్యే విధానంలో మార్పు వస్తుందని, ఇది బౌలర్ ఆట తీరుపై ప్రభావం చూపుతుందని చాలా మంది అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ విషయం పై బ్రెట్‌లీ మాట్లాడుతూ, "ఇది ఖచ్చితంగా బౌలర్లకు ప్రతికూలత అని నేను అనుకుంటున్నాను. దీని కంటే క్రికెటర్లు మైదానంలోకి వెళ్ళేముందు వారందరిని పరీక్షించడం, అన్ని క్లియర్ అయిన వారిని మాత్రమే ఆటలో పాల్గొనడానికి అనుమతించడం దీనికి మరో మార్గమని నేను భావిస్తున్నాను. ఏది ఏమైనప్పటికి సెలైవా బ్యాన్ వల్ల కోకా బుర్రా బాల్స్ స్వింగ్‌లో ఎక్కువగా మార్పు రాదు. దీని వల్ల రివర్స్ స్వింగ్ కూడా పెద్దగా ఉండదు. దాంతో సెలైవా రుద్దినా రుద్దకపోయినా పెద్దగా ప్రయోజనం ఏమీ ఉండదు’ అని అన్నారు. చదవండి: ఇక మా పని అయిపోయినట్లే: ఇషాంత్ చాలా రోజుల తరువాత ఇంగ్లండ్, వెస్టిండీస్ జట్ల మధ్య అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్‌లు మొదలయ్యాయి. ఈ రెండు జట్టులు మూడు టెస్ట్ సిరీస్‌లు ఆడనున్నాయి. వీటిలో మొదట జరిగిన మ్యాచ్‌లో వెస్టిండీస్ గెలిచింది. ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్ పేసర్ జేమ్స్ఆండ్రసన్ ఆటతీరుపై విమర్శలు వస్తున్నాయి. అతని బౌలింగ్‌లో ఇంతకు ముందు ఉన్న స్వింగ్ కనిపించడం లేదని అంటున్నారు. దీనిపై బ్రెట్‌లీ మాట్లాడుతూ ఇంగ్లండ్ చాలా రోజుల తరువాత మ్యాచ్ ఆడిందని అందుకే ఇలా జరిగిందని అన్నారు. అంతే కానీ సెలైవా ఎఫెక్ట్ అంతలా ఉండదని అభిప్రాయపడ్డాడు. చదవండి: ఆ విషయంపై స్పష్టత లేదు: భువనేశ్వర్ కుమార్ -
ఇక మా పని అయిపోయినట్లే: ఇషాంత్
న్యూఢిల్లీ: కరోనా వైరస్ విస్తృతి నేపథ్యంలో క్రికెట్లో బంతిపై సలైవా(లాలాజలాన్ని) రుద్దడాన్ని రద్దు చేస్తూ ఇటీవల అంతర్జాతీయ క్రికెట్ మండలి(ఐసీసీ) తీసుకున్న నిర్ణయంపై ఎక్కువ శాతం ప్రతికూల స్పందనలే వస్తున్నాయి. వన్డే, టీ20 క్రికెట్లో సలైవాను రద్దు చేసినా ఫర్వాలేదు కానీ టెస్టు క్రికెట్లో అది తీవ్రమైన ప్రభావం చూపుతుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. కాగా, సలైవా రద్దుపై టీమిండియా పేసర్ ఇషాంత్ శర్మ స్పందించాడు. ఐసీసీ తీసుకున్న సలైవా రద్దు నిర్ణయాన్ని సుతిమెత్తగా విమర్శించాడు. ఇక తమ పని అయిపోయినట్లేనని ఇషాంత్ సెటైరిక్ మాట్లాడాడు. ప్రధానంగా టెస్టుల్లో సలైవా అనేది ఎంతగానో బౌలర్లకు సహకరిస్తుందని, బంతిని స్వింగ్ చేయడంలో ఇది కీలక పాత్ర పోషిస్తుందన్నాడు. (‘యువీ.. నువ్వు ఇంకా ఆడతావనుకున్నా’) ‘బౌలర్లు బంతిని షైన్ చేయకపోతే బంతి స్వింగ్ కాదు. బంతి స్వింగ్ కాకపోతే అది బ్యాట్స్‌మన్‌కు అనుకూలంగా మారుతుంది. మొత్తం బ్యాట్స్‌మన్ ఆధిపత్యం క్రికెట్‌గా మారిపోతుందనేది కాదనలేదని వాస్తవం. అటు బౌలర్‌కు ఇటు బ్యాట్స్‌మన్‌కు పోరు అనేది ఉండదు. బంతిని రుద్దకపోతే బ్యాట్స్‌మన్‌గా ఈజీ అయిపోతుంది. ప్రస్తుతం కొన్ని కారణాల వల్ల సలైవాను బంతిపై రుద్దడాన్ని రద్దు చేశారు. కానీ దీనికి ప్రత్యామ్నాయం అవసరం. టెస్టు క్రికెట్లో బంతిని షైన్ చేయడం అనేది చాలా ముఖ్యం. ఇందుకు ఐసీసీ వేరే పద్ధతిని తీసుకురావాల్సి ఉంది’ అని ఇషాంత్ పేర్కొన్నాడు.(‘ప్లాన్-బితోనే క్రికెట్లోకి వచ్చా’) -
పిల్లల్లో చొల్లు కారుతోందా?
ఇలా పిల్లలు నోట్లో వేలు పెట్టుకుని చొల్లు కారుస్తూ ఉన్నా చాలా అందంగా, క్యూట్‌గా కనిపిస్తుంటారు. ఆర్నెల్ల వయసు నుంచి 18 నెలల వరకు పిల్లలు ఇలా చొల్లు కార్చుకోవడం అన్నది చాలా సాధారణం. దీనికో కారణం ఉంది. నోరు, దవడ భాగాల్లోని ఓరల్ మోటార్ ఫంక్షన్స్ అని పిలిచే నాడీ వ్యవస్థ అభివృద్ధి చెందకపోవడమే దీనికి కారణం. ఆ ఓరల్ మోటార్ ఫంక్షన్స్ అభివృద్ధి చెందగానే చొల్లు కారడం ఆగిపోతుంది. ఇలా పిల్లల్లో చొల్లు/జొల్లు కారుతూ ఉండే కండిషన్‌ను ‘సైలోరియా’ అంటారు. అయితే నాలుగేళ్లు దాటాక కూడా పిల్లలు చొల్లు కారుతుంటే దాన్ని మాత్రం అబ్‌నార్మాలిటీగా పరిగణించాలి. పెద్ద పిల్లల్లో చొల్లు కాస్తంత పెద్ద వయసులో ఉన్న చిన్న పిల్లల విషయానికి వస్తే... కొన్నిసార్లు వారి ముక్కులు విపరీతంగా బిగుసుకుపోయినా, దంత (డెంటల్) సమస్యలు ఉన్నా, మింగలేకపోవడానికి ఇంకేమైనా సమస్యలు ఉన్నా (ఉదా: సివియర్ ఫ్యారింగో టాన్సిలైటిస్ వంటివి) కూడా చొల్లు/జొల్లు కారుతుంటుంది. ఇలాంటి సమస్యలు ఉన్నప్పుడు చొల్లు కారవడం ఎక్కువైనా దాని గురించి ఆందోళన పడాల్సిన అవసరం ఉండదు. కారణం... పెద్దపిల్లల్లో కనిపించే ఇవన్నీ కేవలం తాత్కాలికమే. కానీ కొంతమంది పెద్దపిల్లల్లో మానసిక సమస్యలు, నరాల బలహీనతక సంబంధించిన రుగ్మతలు ఉన్నప్పుడు చొల్లు కారే లక్షణం కనిపిస్తుంటుంది. కారణం... వాళ్లలో నోట్లో స్రవించిన లాలాజలాన్ని తమంతట తామే మింగలేరు. అందుకే పెద్దపిల్లల్లో చొల్లు కారుతుంటే మొదట న్యూరాలజిస్టుకు చూపించి, ఇతరత్రా సమస్యలేమీ లేవని నిర్ధారణ చేసుకోవడం ప్రధానం. చొల్లు కారే సమస్యనుఅధిగమించడానికి... ఇలా పెద్ద పిల్లల్లో ఇలా చొల్లు/జొల్లు కారడం సమస్య ఉన్నప్పుడు వాళ్లంతట వాళ్లే లాలాజల స్రావాన్ని మింగేలా అలవాటు చేయాలి. లాలాజల స్రావం చాలా ఎక్కువగా ఉన్న పిల్లల్లో కొన్ని ప్రత్యేకమైన దంత ఉపకరణాలు (స్పెషల్ డెంటల్ అప్లయెన్సెస్) ఉపయోగించి వాలంటరీగా మింగడం అలవాటు చేయించవచ్చు. మరికొందరిలో కొన్ని ప్రత్యేక సందర్భాల్లో (ముఖ్యంగా పెద్దవాళ్లలో, పెద్ద పిల్లల్లో) కొన్ని మందులు వాడాల్సి ఉంటుంది. ఇటీవలి కాలంలో బొట్యులినం టాక్సినమ్ అనే పదార్థాన్ని లాలాజల గ్రంథుల్లోకి ఇంజెక్ట్ చేయడం కూడా చేస్తున్నారు. ప్రత్యేకమైన జాగ్రత్తలివే... ♦ చొల్లుకారే పిల్లల్లో కొన్ని ప్రత్యేకమైన జాగ్రత్తలు కూడా తీసుకోవడం మేలు చేస్తుంది. అవి... ♦ మంచి నోటి పరిశుభ్రత (గుడ్ ఓరల్ హైజీన్) ♦ తరచూ మింగడం అలవాటు చేయడం ♦ నోటి కండరాల కదలికలను మెరుగు పరచడం (ఇంప్రూవ్మెంట్ ఆఫ్ టోన్ అండ్ మూవ్మెంట్ ఆఫ్ ఓరల్ మజిల్స్). ♦ పైన పేర్కొన్న చర్యలతో ఒకింత పెద్ద వయసు వచ్చాక కూడా చొల్లు/జొల్లు కారుతుంటే, దాన్ని ఆపేందుకు దోహదపడతాయి. అప్పటికీ పెద్ద పిల్లల్లో చొల్లుకారే అలవాటు అప్పటికీ ఆగకపోతే పిల్లల డాక్టర్‌కు/ న్యూరాలజిస్ట్‌కు తప్పక చూపించాలి.- డా. రమేశ్‌బాబు దాసరిసీనియర్ పీడియాట్రీషియన్,రోహన్ హాస్పిటల్స్, విజయనగర్ కాలనీ, హైదరాబాద్ -
టేస్ట్‌బడ్స్ కంటే లాలాజలం ప్రభావమే ఎక్కువ...
ఏదైనా పదార్థాన్ని నాలుకపై పెట్టగానే మన రుచిమొగ్గల (టేస్ట్‌బడ్స్)తో రుచి తెలిసిపోతుందని మీరు అనుకుంటున్నారా? కానీ అది పూర్తిగా వాస్తవం కాదు. రుచి తెలిపేవి రుచిమొగ్గలే అయినప్పటికీ నిజానికి మనకు రుచి తెలిసేది లాలాజలం వల్లనే. అది ఎలాగంటే... మనం తిన్న పదార్థం లాలాజలంలో కరిగిన తర్వాతే, మన నాలుకపై ఉండే రుచిమొగ్గలు (టేస్ట్‌బడ్స్) వాటిని గ్రహించగలుగుతాయి. అందుకే మనం నమలడం మొదలుపెట్టిన కొద్దిసేపటి తర్వాత రుచి ఇంకా స్పష్టంగా మనకు తెలుస్తుంటుంది. అన్నట్టు... మనకు తెలియకుండానే ప్రతి రోజూ ఒక లీటర్ నుంచి 1.6 లీటర్ల వరకు లాలాజలం స్రవిస్తూ ఉంటుంది. వామిటింగ్కు దోహదపడే లాలాజలం! వాంతి కావడం (వామిటింగ్) అనే ప్రక్రియకు లాలాజలం దోహదపడుతుంది. అసలు వాంతి ఎలా జరుగుతుందో, దానికి లాలాజలం ఎందుకు దోహదపడుతుందో చూద్దాం. వాంతి కావడానికి ముందుగా లాలాజలం ఎక్కువగా స్రవిస్తుంది. ఇలా ఎందుకు జరుగుతుందంటే... లాలాజలం నుంచే జీర్ణప్రక్రియ మొదలవుతుంది. కాబట్టి ఆహారాన్ని జీర్ణం చేసే జీర్ణప్రక్రియను వేగవంతం చేసేందుకు లాలాజలం చాలా ఎక్కువగా లాలాజలం ఊరుతుంది. ఆహారాన్ని జీర్ణం చేసే క్రమంలో పొట్ట భాగంలో అది సరిగా జరగనప్పుడు వాంతి (వామిటింగ్) అనే చర్య ద్వారా జీర్ణం చేయలేని పదార్థాన్ని శరీరం బయటకు పంపేస్తుందన్నమాట. -
లాలాజల పరీక్షతోనూ ఆస్తమా నిర్ధారణ
లండన్: సాధారణంగా రోగి ఊపిరితిత్తుల పనితీరు ఆధారంగా ఆస్తమా వ్యాధిని నిర్ధారిస్తారు. రోగి లాలాజలంపై పరీక్షలు జరిపి కూడా ఆస్తమాను నిర్ధారించవచ్చని బ్రిటన్ శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. ‘ఊపిరితిత్తులు, రక్తం, మూత్ర పరీక్షల సందర్భంగా రోగి కాస్తంత ఇబ్బంది పడతాడు. కొత్త పద్ధతి అన్ని వయసుల వారికి ఎంతో సౌలభ్యంగా ఉంటుంది’ అని బ్రిటన్‌లోని లంగ్బారో వర్సిటీ, సిటీ హాస్పిటల్ రెస్పిరేటరీ రీసెర్చ్ యూనిట్ శాస్త్రవేత్తలు తెలిపారు. ఆరోగ్యవంతుల, రోగుల లాలాజలాలపై వేర్వేరుగా చేపట్టిన లిక్విడ్ క్రొమటోగ్రఫీ–మాస్ స్పెక్రోమెట్రీ పరీక్షల ఫలితాలను విశ్లేషించి శాస్త్రవేత్తలు ఆస్తమాను నిర్ధారించగలిగారు. ఈ పరీక్ష ద్వారా వ్యాధి తీవ్రత, అభివృద్ధిని అంచనావేయవచ్చు.