Salistick World First Saliva Pregnancy Test Launched In UK - Sakshi

విప్లవాత్మక అడుగు: యూరిన్‌ కాదు.. ఇక లాలాజలంతో ఇక ప్రెగ్నెన్సీ టెస్ట్‌

Jun 20 2023 1:36 PM | Updated on Jun 20 2023 2:50 PM

Salistick World First Saliva Pregnancy Test Launched In UK - Sakshi

ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్‌ కోసం వైద్యులను సంప్రదించడం కాకుండా.. మహిళల కోసం హోంటెస్ట్ కిట్‌లు అందుబాటులో ఉన్న సంగతి తెలిసిందే. అయితే కేవలం ఉమ్మితోనే అమ్మ అయ్యిందో లేదో తెలుసుకోవచ్చు. అందుకోసం ఓ కిట్‌ యూకేలో లాంఛ్‌ కాగా.. అతిత్వరలో అది ప్రపంచవ్యాప్తంగా అందుబాటులోకి రానుంది. ప్రపంచంలోనే ఈ తరహా తొలి ఉత్పత్తి ఇదే కావడం గమనార్హం. 

వైద్య-సాంకేతిక రంగంలో విప్లవాత్మక అడుగు పడింది. లాలాజలంతో గర్భనిర్ధారణ కిట్‌ అందుబాటులోకి వచ్చింది. జరూసలెంకు చెందిన సాలిగ్నోస్టిక్స్‌ అనే బయోటెక్‌ స్టార్టప్‌ కంపెనీ దీనిని తయారు చేసింది. ఈ ఉత్పత్తికి ‘సాలిస్టిక్‌’గా నామకరణం చేశారు. ఏడాది ప్రయత్నాల తర్వాత తాజాగా యూకేలో దీనిని లాంఛ్‌ చేశారు. యూకేతో పాటు ఐర్లాండ్‌లోనూ వీటి అమ్మకాలు మొదలయ్యాయి. అమెరికాలోనూ అమ్మకాల కోసం ఎఫ్‌డీఏ అనుమతి కోసం దరఖాస్తు చేసుకుంది ఈ కంపెనీ. 

ఇంతకాలం యూరిన్‌ బేస్డ్‌  హోంటెస్ట్‌ కిట్‌లు మార్కెట్‌లో అందుబాటులో ఉన్నాయి. అయితే ఇక నుంచి ఈ సెలైవాతో ప్రెగెన్సీ టెస్ట్‌ కిట్‌లు అందుబాటులోకి రానున్నాయి. కరోనా టెస్టింగ్‌ కిట్స్‌ సాంకేతికతను ఉపయోగించే ఈ సెలైవా ప్రెగ్నెన్సీ టెస్ట్‌ కిట్‌లు తయారు చేయడం గమనార్హం. 

వీటిని ఎప్పుడైనా..ఎక్కడైనా ఉపయోగించొచ్చు. థెర్మామీటర్‌ను ఉంచుకున్నట్లే.. కిట్‌లో వచ్చే స్టిక్‌ను నోట్లో పెట్టుకుని కాసేపు ఉంచితే అది లాలాజలాన్ని సేకరిస్తుంది. ఆపై ఫలితం కోసం ఐదు నుంచి పది నిమిషాల పాటు వేచి ఉండాల్సి ఉంటుంది. ఒక్కోసారి మూడు నిమిషాల్లోనూ చూపించే అవకాశం ఉంది.

స్టిక్‌ తొలుత లాలాజలాన్ని సేకరించి.. దానికి ప్లాస్టిక్ ట్యూబ్‌కు బదిలీ చేస్తుంది, అక్కడ జీవరసాయన ప్రతిచర్య జరిగి ఫలితం వెలువడుతుంది. పిండం అభివృద్ధి చెందడానికి గర్భాశయాన్ని సిద్ధం చేయడంలో ఉపయోగపడే ప్రత్యేకమైన హార్మోన్(గర్భధారణ కోసం) అయిన hCGని గుర్తించే సాంకేతికతపై ఈ పరీక్ష ఆధారపడి ఉంటుంది.

ఇదీ చదవండి: సాధు జంతువు అనుకోకండి.. చిర్రెత్తితే మాత్రం..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all

Video

View all
Advertisement