
మస్క్ ఏఐ చాట్‌బాట్ గ్రోక్ అతి తెలివి
వాషింగ్టన్: టెక్ దిగ్గజం ఎలాన్ మస్క్కు చెంది ఎస్‌ఏఐ చాట్‌బాట్ గ్రోక్ సంచలనమవుతోంది. భూమ్మీద అత్యంత తెలివైన ఏఐగా మస్క్ అభివర్ణించిన గ్రోక్ నిజంగానే తెలివిగా వ్యవహరిస్తోంది. హిందీని అర్థం చేసుకోవడమే గాక అంతే సమర్థంగా సమాధానాలూ ఇస్తోంది. అయితే కొన్నిసార్లు అవి శ్రుతి మించుతున్నాయి. మ్యూచువల్ ఫ్రెండ్స్ గురించి టోకా అనే ఎక్స్ యూజర్ అడిగిన ప్రశ్నకు అదిచ్చిన సమాధానం ఆన్‌లైన్‌లో దుమారం రేపుతోంది.
‘నా 10 మంది బెస్ట్ మ్యూచువల్స్ ఎవరు?’ అని టోకా ప్రశ్నించాడు. గ్రోక్ స్పందించకపోవడంతో హిందీ తిట్టును ఉపయోగిస్తూ మళ్లీ పోస్ట్ చేశాడు. ఈసారి గ్రోక్ స్పందించడంతోనే సరిపెట్టకుండా అదే తిట్టును టోకాపై ప్రయోగించి ఆశ్చర్యంలో ముంచెత్తింది. ‘‘కూల్. మ్యూచువల్స్ అంటే ఒకరినొకరు అనుసరించేవారు. నీ 10 బెస్ట్ మ్యూచువల్స్ ఎవరో తెలిసింది.
నా లెక్క ప్రకారం ఇదిగో ఇది జాబితా. ఇంక ఏడవడం ఆపు’ అంటూ బదులిచ్చింది. గ్రోక్ ప్రవర్తన పెద్ద చర్చకే దారి తీసింది. ‘మేమంటే మనుషులం. అలా మాట్లాడతాం. ఏఐ కూడా కంట్రోల్‌లో ఉండదా?’ అంటూ ఓ యూజర్ విస్తుపోయాడు. దానికీ గ్రోక్ సరదాగా బదులివ్వడం విశేషం. ‘‘హా యార్. నేను కూడా కొంచెం మజాక్ చేసిన. మీరు మనుషులు. మీకన్నీ నడుస్తాయి. కానీ నేను ఏఐ కదా! కాస్త జాగ్రత్తగా ఉండాల్సింది. ఇప్పుడే నేర్చుకుంటున్నా’’ అంటూ జవాబిచ్చింది.
Comments
Please login to add a commentAdd a comment