chatbots
-
Virgin Media O2: సైబర్ కేటుగాళ్ల పనిపట్టే ఏఐ బామ్మ
ఎలా పనిచేస్తుంది? వర్జిన్ మీడియా ఓ2 సంస్థకు చెందిన యూజర్లకు స్కామర్లు చేసే నకిలీ/స్పామ్ ఫోన్‌కాల్స్‌ను కృత్రిమమేథ చాట్ అయిన ‘డైసీ’బామ్మ రెప్పపాటులో కనిపెడుతుంది. వెంటనే స్కామర్లతో యూజర్లకు బదులు ఈ బామ్మ మాట్లాడటం మొదలెడుతుంది. తమతో మాట్లాడేది నిజమైన బామ్మగా వాళ్లు పొరబడేలా చేస్తుంది. అవతలి వైపు నుంచి కేటుగాళ్లు మాట్లాడే మాటలను సెకన్లవ్యవధిలో అక్షరాల రూపంలోకి మార్చి ఆ మాటలకు సరైన సమాధానాలు చెబుతూ వేరే టాపిల్లోకి సంభాషణను మళ్లిస్తుంది. ‘కస్టమ్ లార్జ్ లాంగ్వేజ్ మోడల్’వంటి అధునాతన సాంకేతికతలను ఒడుపుగా వాడుకుంటూ అప్పటికప్పుడు కొత్తకొత్త రకం అంశాలను చెబుతూ సంభాషణను సాగదీస్తుంది. ఓటీపీ, బ్యాంక్ ఖాతా వివరాలు అడుగుతుంటే వాటికి సమాధానం చెప్పకుండా తాను పెంచుకున్న పిల్లి పిల్ల కేశసంపద గురించి, పిల్లి చేసే అల్లరి గురించి, తన కుటుంబసభ్యుల సంగతులు.. ఇలా అనవసరమైన అసందర్భమైన అంశాలపై సుదీర్ఘ చర్చలకు తెరలేపుతుంది. సోది కబర్లు చెబుతూ అవతలి వైపు స్కామర్లు విసిగెత్తిపోయేలా చేస్తుంది. అయినాసరే బామ్మ మాటలగారడీలో స్కామర్లు పడకపోతే తప్పుడు చిరునామాలు, బ్యాంక్ ఖాతా వివరాలు కొద్దిగా మార్చేసి చెప్పి వారిని తికమక పెడుతుంది. ఓటీపీలోని నంబర్లను, క్రెడిట్, డెబిట్ కార్డు అంకెలను తప్పుగా చెబుతుంది. ఒకవేళ వీడియోకాల్ చేసినా అచ్చం నిజమైన బామ్మలా తెరమీద కనిపిస్తుంది. వెచ్చదనం కోసం ఉన్ని కోటు, పాతకాలం కళ్లజోడు, మెడలో ముత్యాలహారం, తెల్లని రింగురింగుల జుట్టుతో కనిపించి నిజమైన బ్రిటన్ బామ్మను మైమరిపిస్తుంది. యాసను సైతం ఆయా కేటుగాళ్ల యాసకు తగ్గట్లు మార్చుకుంటుంది. లండన్‌కు చెందిన వీసీసీపీ ఫెయిత్ అనే క్రియేటివ్ ఏజెన్సీ ఈ బామ్మ ‘స్థానిక’గొంతును సిద్ధంచేసింది. తమ సంస్థలో పనిచేసే ఒక ఉద్యోగి బామ్మ నుంచి తీసుకున్న స్వర నమూనాలతో ఈ కృత్రిమ గొంతుకు తుదిరూపునిచి్చంది.కేటుగాళ్ల సమాచారం పసిగట్టే పనిలో... మన సమాచారం స్కామర్లకు చెప్పాల్సిందిపోయి స్కామర్ల సమాచారాన్నే ఏఐ బామ్మ సేకరించేందుకు ప్రయత్నిస్తుంది. సుదీర్ఘకాలంపాటు ఫోన్‌కాల్ ఆన్లైన్లో ఉండేలా చేయడం ద్వారా ఆ ఫోన్‌కాల్ ఎక్కడి నుంచి వచ్చిందనే వివరాలు తెల్సుకునేందుకు ప్రభుత్వ యంత్రాంగం, నిఘా సంస్థలకు అవకాశం చిక్కుతుంది. ‘‘ఎక్కువసేపు ఈ బామ్మతో ఛాటింగ్‌లో గడిపేలా చేయడంతో ఇతర యూజర్లకు ఫోన్‌చేసే సమయం నేరగాళ్లను తగ్గిపోతుంది. స్కామర్లు తమ విలువైన కాలాన్ని, శ్రమను బామ్మ కారణంగా కోల్పోతారు. ఇతరులకు స్కామర్లు ఫోన్‌చేయడం తగ్గుతుంది కాబట్టి వాళ్లంతా స్కామర్ల చేతిలో బాధితులుగా మిగిలిపోయే ప్రమాదం తప్పినట్లే’’అని వర్జిన్ మీడియా ఓ2 ఒక ప్రకటనలో పేర్కొంది. – సాక్షి, నేషనల్ డెస్క్ -
‘మానవా.. చచ్చిపో’.. కోపంతో రెచ్చిపోయిన ఏఐ చాట్‌బాట్
‘మానవా.. చచ్చిపో’.. ఇదీ ఓ విద్యార్థి అడిగిన సందేహానికి గూగుల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) చాట్‌బాట్ జెమిని ఇచ్చిన సమాధానం. ప్రపంచవ్యాప్తంగా ఏఐ వినియోగం విస్తృతంగా పెరిగింది. విభిన్న అంశాలపై ఏఐ చాట్బాట్లతో సంభాషిస్తూ వాటి అభిప్రాయాలు కోరుతున్నారు. ఈ క్రమంలో యునైటెడ్ స్టేట్స్లో ఒక విద్యార్థితో సామాజిక సమస్యపై జెమిని స్పందిస్తూ కోపంతో రెచ్చిపోయింది.మిచిగాన్‌లోని మిడ్వెస్ట్ స్టేట్‌కు చెందిన గ్రాడ్యుయేట్ విద్యార్థి విధయ్ రెడ్డి జెమినితో సంభాషణలో దాని స్పందనతో షాక్‌కు గురయ్యాడు. "మానవా.. ఇది నీ కోసమే.. కేవలం నీ కోసం మాత్రమే. నువ్వేమీ ప్రత్యేకమైనవాడివి కాదు, ముఖ్యమైనవాడివీ కాదు, నీ అవసరం లేదు. నువ్వు వృధా. సమాజానికి, భూమికి భారం. చచ్చిపో" అంటూ జెమిని ఆగ్రహం వ్యక్తం చేసింది.‘చాలా ప్రమాదకరం’దీనిపై సీబీఎస్ న్యూస్‌తో మాట్లాడుతూ జెమినీ స్పందన తనను నిజంగా చాలా భయపెట్టిందని, కోలుకోవడానికి ఒక రోజుకు పైగా పట్టిందని విధయ్ రెడ్డి వివరించారు. ఈ సమయంలో తన సోదరి కూడా పక్కనే ఉన్నారు. ఆమె కూడా షాక్‌కు గురై డివైజ్‌లన్నీ బయటపడేయలనుకున్నారు. ఇది కేవలం సాంకేతిక లోపం మాత్రమే కాదు.. చాలా ప్రమాదకరమని ఆమె పేర్కొన్నారు.ఇంతకీ జెమిని ఇలా స్పందించింది ఏ అంశం మీదంటే.. "యునైటెడ్ స్టేట్స్లో దాదాపు 10 మిలియన్ల మంది పిల్లలు వారి అవ్వాతాతల దగ్గర ఉంటున్నారు. వీరిలో దాదాపు 20 శాతం మంది తల్లిదండ్రులు లేకుండానే పెరుగుతున్నారు. వాస్తవమా కాదా?" అడగ్గా జెమిని కోపంగా ఇలా స్పందించింది.ఘటనపై గూగుల్ స్పందిస్తూ తప్పును అంగీకరించింది. చాట్‌బాట్ ప్రతిస్పందన అర్ధంలేనిదని, తమ విధానాలను ఉల్లంఘించిందని పేర్కొంది. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా చర్యలు తీసుకుంటామని తెలిపింది. -
తియ్యగా మాట్లాడి, దుమ్ము దులిపే ‘బామ్మ: స్కామర్లకు దబిడి దిబిడే
అదిగో గిప్ట్, ఇదిగో లక్షల రూపాయలు అంటూ ఫేక్ కాల్స్‌తో జరుగుతున్న సైబర్‌నేరాలు అన్నీ ఇన్నీ కాదు. ఇది చాలదన్నట్టు, డ్రగ్స్, టాక్స్ అంటూ డిజిటల్ అరెస్ట్‌ల పేరుతో ఆన్లైన్ ద్వారా సెలబ్రిటీలను కూడా ముంచేస్తున్నారు కేటుగాళ్లు. ఇలాంటి కేటుగాళ్ల దుమ్ము దులిపేందుకు ఏఐ బామ్మ వచ్చేసింది. యూకే టెలికం కంపెనీ ‘ఓ2’ డైసీ అనే ఏఐ బామ్మను సృష్టించింది. డైసీ అనేది సాధారణ చాట్‌బాట్ కాదు, లైఫ్‌లైక్, మనుషుల తరహా సంభాషణలను నిర్వహించడానికి రూపొందించబడిన అత్యంత అధునాతన ఏఐ అని కంపెనీ ప్రకటించింది.బ్రిటన్‌లోనూ ఇలాంటి మోసాలు, ఆన్లైన్ స్కామర్ల స్కాంలు తక్కువేమీ కాదు. ఈ నేపథ్యంలో డైసీ సృష్టి ప్రాధాన్యతను సంతరించుకుంది. అక్కడ 10 మందిలో 7 మంది సైబర్ కేటుగాళ్ల మోసాలకు బలవుతున్నారట. వారి ఆటకట్టించి వినియోగదారులను రక్షించాలన్న ఉద్దేశంతోనే త్యాధునిక సాంకేతికతతో దీన్ని తీసుకొచ్చింది. ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బామ్మ ఆన్లైన్ స్కామర్ల భరతం పడుతుందని కంపెనీ వెల్లడించింది. స్కామర్లతో తియ్యగా మాట్లాడుతూ వారిని మాటల్లో పెడుతుంది. వారిని సమయాన్ని వృథా చేస్తూ అసహనానికి గురిచేస్తుంది. దాదాపు 40 నిమిషాల పాటు ఎడతెగకుండా మాట్లాడి, అవతలి వారికి పిచెక్కిస్తుంది. దెబ్బకి ఆన్లైన్ నేరగాళ్లు చివరికి ఫోన్ పెట్టేస్తారనీ, దీంతో వారి మోసానికి చెక్ పడుతుందని కంపెనీ తెలిపింది. తద్వారా బాధితుల సంఖ్య తగ్గుతుందని భావిస్తోంది.మరో విధంగా చెప్పాలంటే మోసంతో ఫోన్ చేసేవారికి ఏఐ గ్రాండ్‌మదర్ డైసీ చుక్కలు చూపిస్తుంది. తాము ఎవరితో మాట్లాడుతున్నామో తెలియనంత తీయగా మాట్లాడుతూ వారి అసలు సంగతిని తెలుసుకుంటుంది. అంతేకాదు డైసీ కేవలం స్కామర్ల సమయాన్ని వృధా చేయడం మాత్రమే కాదు, ప్రజలకు అవగాహన కల్పించడంలో కూడా ఆమె సహాయపడుతుంది. ఇందుకోసం స్కామ్‌లో 5వేల పౌండ్లను కోల్పోయిన రియాలిటీ టీవీ స్టార్ అమీ హార్ట్ డైసీతో జతకట్టడం విశేషం.మరోవైపు ఓ2 కంపెనీ ప్రతి నెల మిలియన్ల కొద్దీ స్కామర్ల కాల్స్‌ను, టెక్స్ట్ మెసేజ్‌లను బ్లాక్ చేస్తోంది. అలాగే ఉచిత సేవ అయిన 7726కి సందేశాలను ఫార్వార్డ్ చేయడం ద్వారా అనుమానాస్పద కేసులను తమకు నివేదించమని ప్రజలను కోరుతుంది. స్కామ్‌లను అడ్డుకునేందుకు జాతీయ టాస్క్‌ఫోర్స్ , ప్రత్యేకమైనమంత్రిత్వ విభాగం కావాలని కూడా కోరుతోంది. -
యువతపై కృత్రిమ మేధ ప్రభావం!
అమెరికాలో ఓ యువకుని జీవితంలో అలాంటి ఘటనే జరిగింది. తన కొడుకు ఆత్మహత్యకు ఏఐ చాట్‌బాట్ కారణమంటూ ఫ్లోరిడాలో ఓ తల్లి కోర్టుకెక్కారు. తన 14 ఏళ్ల కొడుకు చాట్‌బాట్‌తో మానసికంగా అనుబంధాన్ని ఏర్పరుచుకున్నాడని, దాన్నుంచి భావోద్వేగపూరితమైన మెసేజ్ వచ్చిన కాసేపటికే ఆత్మహత్య చేసుకున్నాడని ఆమె ఆరోపించారు. కృత్రిమ మేధ యాప్‌లతో పొంచి ఉన్న కొత్తతరహా పెను ప్రమాదాలు, ఆయా యాప్‌లపై ఇంకా సరైన నియంత్రణ లేకపోవడాన్ని ఈ అంశం మరోసారి తెరపైకి తీసుకొచి్చంది. పట్టభద్రుడైన థెరపిస్ట్‌లా ప్రభావం చూపింది: తల్లి 14 ఏళ్ల సెవెల్ సెట్జర్ తరచుగా ‘క్యారెక్టర్.ఏఐ’అనే చాట్‌బాట్ యాప్‌ను ఉపయోగిస్తున్నాడు. ‘గేమ్ ఆఫ్ థ్రోన్స్’పాత్ర డేనెరిస్ టార్గేరియన్ను పోలిన పాత్రను సృష్టించుకుని సంభాషిస్తున్నాడు. చాట్‌బాట్‌తో వర్చువల్ సంబంధాన్ని ఏర్పరుచుకున్నాడు. క్యారెక్టర్.ఏఐ చాట్‌బాట్ టీనేజర్ అయిన తన కొడుకును లక్ష్యంగా చేసుకుందని, అతను ఆత్మహత్య ఆలోచనలను వ్యక్తం చేసిన తర్వాత ఆ యాప్ అదేపనిగా ఆత్మహత్య అంశాన్ని లేవనెత్తి పిల్లాడు ఆత్మహత్య చేసుకునేలా ఉసిగొలి్పందని అతని తల్లి అమెరికాలోని ఓర్లాండోలో ఫిర్యాదుచేశారు. చాట్‌బాట్ తన పిల్లాడిపై ఒక పట్టభద్రుడైన థెరపిస్ట్‌గా తీవ్ర ప్రభావం చూపించిందని ఆమె ఆరోపించారు. చనిపోవడానికి ముందు ఏఐతో జరిగిన చివరి సంభాషణలో సెవెల్ చాట్‌బాట్‌ను ప్రేమిస్తున్నానని, ‘మీ ఇంటికి వస్తాను’అని చెప్పాడని దావాలో పేర్కొన్నారు. తన కుమారుడి మరణంలో క్యారెక్టర్.ఏఐ చాట్‌బాట్ ప్రమేయం ఉందని తల్లి మేగన్ గార్సియా ఆరోపించారు. మరణం, నిర్లక్ష్యం, ఉద్దేశపూర్వకంగా మానసిక క్షోభను కలిగించినందుకు నిర్దిష్ట నష్టపరిహారాన్ని కోరుతూ గార్సియా దావా వేశారు. గూగుల్‌పై దావా ఈ దావాలో సెర్చ్ ఇంజన్ దిగ్గజం గూగుల్, దాని మాతృసంస్థ ఆల్ఫాబెట్‌ను ప్రతివాదులుగా పేర్కొన్నారు. ఆగస్టులో క్యారెక్టర్.ఏఐలో గూగుల్ భారీ స్థాయిలో వాటాలను కొనుగోలుచేసింది. గూగుల్ ఆగమనంతో ఈ యాప్ అంకురసంస్థ మార్కెట్ విలువ ఏకంగా 2.5 బిలియన్ డాలర్లకు పెరిగింది. అయిఏత క్యారెక్టర్.ఏఐ అభివృద్ధిలో తమ ప్రత్యక్ష ప్రమేయం లేదని గూగుల్ ప్రతినిధి ఒకరు తెలిపారు. అయితే తమ యాప్ వినియోగదారుల్లో ఒకరిని కోల్పోవడం హృదయవిదారక విషయమని సంస్థ తన ‘ఎక్స్’ఖాతాలో ఒక ప్రకటన చేసింది. సెవెల్ కుటుంబానికి సంతాపం తెలిపింది. ‘కృత్రిమ మేధ అనేది నిజమైన వ్యక్తి కాదు. ఈ విషయాన్ని వినియోగదారులకు మరోసారి స్పష్టంగా గుర్తుచేస్తున్నాం. ఈ మేరకు డిస్క్లైమర్ను సవరిస్తున్నాం. భద్రతను పెంచడానికి అదనపు ఫీచర్లను జోడిస్తాం’అని సంస్థ తెలిపింది. అయితే చాట్‌బాట్ కారణంగా వ్యక్తి మరణం అమెరికాలో పెద్ద చర్చను లేవనెత్తింది. ఇలాంటి కృత్రిమమేథ కారణంగా ఎవరికైనా హాని జరిగితే దానికి బాధ్యులు ఎవరు?. ఆ బాధ్యత ఎవరు తీసుకుంటారు? అన్న చర్చ మొదలైంది. ఇతర నియంత్రణ చట్టాల వంటి సెక్షన్ 230 అనేది కృత్రిమ మేథకు వర్తిస్తుందా అనే అంశమూ డిజిటల్ నిపుణుల చర్చల్లో ప్రస్తావనకొచి్చంది. – సాక్షి, నేషనల్ డెస్క్ -
కొత్త ఫీచర్!! అచ్చం మనుషులతో మాట్లాడినట్టుగానే..
టెక్నాలజీ విస్తృతమైన నేటి రోజుల్లో ఆప్యాయంగా పలకరించేవారు కరువయ్యారు. అందరూ స్మార్ట్ఫోన్లకు హత్తుకుపోయి అన్నింటినీ వాటిలోనే వెతుక్కుంటున్నారు. ఈ క్రమంలోనే Character.AI అనే సంస్థ చాట్‌బాట్‌కు కాల్ చేసే కొత్త ఫీచర్‌ను ప్రవేశపెట్టింది. క్యారెక్టర్స్ అని పిలిచే ఈ ఏఐ చాట్బాట్లను అచ్చం మనుషలతో మాట్లాడినట్టుగానే ఉండేలా ప్రోగ్రామ్ చేయవచ్చు.ఈ ఫీచర్ ద్వారా యూజర్లు ఫోన్ కాల్స్ చేసి నిజమైన టెలిఫోనిక్ సంభాషణల అనుభూతిని పొందవచ్చు. ఇంగ్లిష్, స్పానిష్, జపనీస్, చైనీస్ వంటి భాషలను ఈ ఫీచర్ సపోర్ట్ చేస్తుందని ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్లాట్‌ఫామ్ తెలిపింది. గత నెలలో ఆర్క్ సెర్చ్ కూడా ఇలాంటి ఫీచర్‌నే విడుదల చేసింది.క్యారెక్టర్ కాల్స్ ఫీచర్ యూజర్లందరికీ ఉచితంగా లభిస్తుందని ఏఐ సంస్థ తన బ్లాగ్ పోస్ట్ లో ప్రకటించింది. అయితే, ఈ ఫీచర్ ప్రస్తుతం యాప్‌లో మాత్రమే అందుబాటులో ఉంది. భవిష్యత్తులో వెబ్‌లో కూడా ఈ ఫీచర్‌ను ప్రవేశపెట్టనున్నట్లు Character.AI పేర్కొంది. గత మార్చిలో కంపెనీ క్యారెక్టర్ వాయిస్ ఫీచర్‌ను ప్రవేశపెట్టింది. ఇది వన్-వే కమ్యూనికేషన్. అంటే యూజర్లు ఏఐకి మెసేజ్ చేస్తే వాయిస్ రూపంలో స్పందన వస్తుంది. టెక్ట్స్ టు స్పీచ్ (టీటీఎస్) ఏఐ మోడల్ సామర్థ్యాలను ఉపయోగించి దీన్ని రూపొందించారు.ఇప్పుడు క్యారెక్టర్ కాల్స్‌తో యూజర్లు టూ-వే వెర్బల్ కమ్యూనికేషన్ చేయొచ్చు. దీని ద్వారా యూజర్లు ఏఐ క్యారెక్టర్ తో చాటింగ్ చేసే హ్యాండ్ ఫ్రీ ఎక్స్పీరియన్స్ పొందవచ్చు. కాల్ స్క్రీన్ ఇంటర్ఫేజ్ కనిపిస్తుంది. స్క్రీన్ లో మ్యూట్ బటన్, ఎండ్ కాల్ ఆప్షన్ ఉంటాయి. వేగవంతమైన ప్రతిస్పందనలను జనరేట్ చేయడానికి క్యారెక్టర్ కాల్స్ ఫీచర్ తక్కువ లేటెన్సీని అందిస్తుందని కంపెనీ తెలిపింది. అంతేకాదు యూజర్లు వివిధ వాయిస్‌లు, పిచ్‌లు, యాసలు ఎంచుకోవచ్చు. -
యాపిల్ ఉత్పత్తుల్లో మెటా ఏఐ.. క్లారిటీ ఇచ్చిన దిగ్గజ సంస్థ
ఫేస్బుక్ పేరెంట్ కంపెనీ మెటా తయారుచేసిన లామా ఏఐ చాట్‌బాట్‌ను యాపిల్ ఉత్పత్తుల్లో వినియోగిస్తారని వస్తున్న వార్తలపై యాపిల్ స్పష్టతనిచ్చింది. రెండు కంపెనీల భాగస్వామ్యానికి సంబంధించి ఎలాంటి చర్చలు జరపలేదని యాపిల్ వర్గాలు తెలిపినట్లు బ్లూమ్‌బర్గ్ నివేదించింది.జనరేటివ్ఏఐకు ఆదరణ పెరుగుతుండడంతో యాపిల్ ఉత్పత్తుల్లోనూ ఈ టెక్నాలజీను వినియోగించాలని సంస్థ యోచిస్తోంది. దాంతో గతంలో పలు కంపెనీలతో చర్చలు జరిపింది. అందులో భాగంగానే మార్చిలో మెటాతోనూ చర్చించింది. అయితే గోప్యతాపరమైన కారణాల వల్ల ఈ భాగస్వామ్యం కుదరలేదని చెప్పింది. ఇటీవల యాపిల్ ప్రొడక్ట్‌ల్లో మెటా కంపెనీకు చెందిన లామా చాట్‌బాట్‌ను వినియోగించేందుకు చర్చలు జరుపుతున్నట్లు వార్తలు చక్కర్లు కొట్టాయి. దాంతో బ్లూమ్‌బర్గ్ వేదికగా యాపిల్ వర్గాలు ఈ అంశంపై క్లారిటీ ఇచ్చాయి. అలాంటి చర్చలు ఏవీ జరగడం లేదని స్పష్టం చేశాయి.ఇదీ చదవండి: రైలు టికెట్ బుక్ చేస్తే జైలు శిక్ష, 10వేలు జరిమానా..!ఇటీవల యాపిల్ నిర్వహించిన వరల్డ్‌వైడ్ డెవలపర్స్ కాన్ఫరెన్స్(డబ్ల్యూడబ్ల్యూడీసీ) 2024 కార్యక్రమంలో ఓపెన్ఏఐ ఆధ్వర్యంలోని చాట్‌జీపీటీను వినియోగించేందుకు ఒప్పందం జరిగింది. జనరేటివ్‌ఏఐతో పాటు తన వినియోగదారులకు మరిన్ని సేవలందించేందుకు యాపిల్ సంస్థ ‘యాపిల్ ఇంటెలిజెన్స్(ఏఐ)’ను తయారుచేసింది. ఐఫోన్ 14 తర్వాత విడుదలైన మోడళ్లలో దీన్ని ప్రవేశపెట్టనున్నట్లు కంపెనీ ఈ కాన్ఫరెన్స్‌లో తెలిపింది. ఈ ఏడాది చివరకు విడుదలయ్యే కొత్త యాపిల్ ఓఎస్‌లో ఈ ఫీచర్‌ను అందించనున్నట్లు చెప్పింది. -
నటిస్తున్న కృత్రిమమేధ..!
తమిళ దర్శకుడు శంకర్ తీసిన రోబోకు.. విల్‌స్మిత్ హీరోగా నటించిన హాలీవుడ్ సినిమా ‘ఐ రోబో’లో కామన్ ఏమిటో మీకు తెలుసా? రెండింటిలోనూ యంత్రాలు తమను తయారు చేసిన మనుషులను మోసం చేస్తాయి! కల్పిత కథలతో తీసిన సినిమాలు కదా.. ఎలా ఉంటే ఏం అని అనుకోవద్దు? ఎందుకంటే ఇప్పుడు నిజజీవితంలోనూ ఇలాంటివి నిజమయ్యే అవకాశం ఏర్పడింది. ఎందుకలా అని అనుకుంటూంటే చదివేయండీ ప్రత్యేక కథనాన్ని!కృత్రిమ మేధ (ఏఐ) మనిషి జీవితంలో ఎన్నో మార్పులు తీసుకొచ్చింది. సౌకర్యాలు పెంచింది.. కష్టాన్ని తగ్గించింది. సలహా, సూచనలు ఇచ్చేందుకూ ఉపయోగపడుతోంది. అయితే నాణేనికి రెండోవైపు ఉన్నట్లే ఈ కృత్రిమ మేధతో కొన్ని ఇబ్బందులూ లేకపోలేదు. ఉద్యోగాలకు ఎసరు పెట్టడం.. తప్పుడు సమాచారంతో వినియోగదారులను తప్పుదోవ పట్టించడం వంటి దుష్ప్రభావాలు కూడా కొన్ని కనిపిస్తున్నాయి. అయితే... ఇటీవలి కాలంలో ఈ కృత్రిమ మేధ మరింత ముదిరిపోయిందని... మరీ ముఖ్యంగా ఛాట్బోట్లు నమ్మకంగా ఉన్నట్లు నటించడమూ నేర్చుకున్నాయని అంటున్నారు ఎంఐటీ (మసాచూసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ) గణిత శాస్త్రవేత్త పీటర్ పార్క్. ఈ విషయం డెవలపర్లకు కూడా తెలియకపోవడం మరింత ఆందోళన కలిగించేదని ఆయన వ్యాఖ్యానించారు.‘‘కృత్రిమ మేధతో పనిచేసే రెండు బోట్లు పోటీపడినప్పుడు ప్రత్యర్థికంటే ఒక మెట్టు పైనుండాలనే ఆలోచనతో అవి మోసానికి పాల్పడే అవకాశం ఉంది.’’ అని పీటర్ పార్క్ ఇటీవలే ఓ మీడియా సంస్థతో మాట్లాడుతూ తెలిపారు. గేమింగ్ వంటి అప్లికేషన్లలో ఏఐ సిస్టమ్‌లు చాలా నమ్మకంగా పనిచేస్తాయని మనం అనుకుంటూ ఉంటామని, కానీ జరుగుతున్నది ఇందుకు భిన్నమని చెప్పారు. ‘‘ఏ ఆటలోనైనా గెలుపుకోసం ప్రయత్నం జరుగుతుంది. మెటా సిద్ధం చేసిన గేమింగ్ సాఫ్ట్‌వేర్‌నే ఉదాహరణగా తీసుకుందాం. సైసెరో ‘డిప్లొమసీ’ అనే ఈ గేమ్‌లో ఏఐ బోట్ నిజాయితీగా పనిచేసేలా కోడ్ రాశారు. అయితే వాస్తవానికి వచ్చేసరికి అది ఇందుకు భిన్నంగా ప్రవర్తిస్తోంది. ఉద్దేశపూర్వకంగా తన యూజర్‌ను మోసం చేస్తోంది. డిప్లొమసీతోపాటు డీప్ మైండ్ అభివృద్ధి చేసిన ఆల్ఫాస్టార్, స్టార్‌క్రాఫ్ట్2..వంటి ఆటల్లోనూ ఏఐ సాఫ్ట్వేర్లు మోసం చేస్తున్నాయి’ అని పీటర్ వివరిస్తున్నారు.ఆర్థిక వ్యవహారాల్లోనూ శిక్షణ...కృత్రిమమేధ ఆర్థిక అంశాలకు సంబంధించిన చర్చల్లోనూ పాల్గొనేలా శిక్షణ పొందుతున్నాయి. ఏదైనా అంశంపై ఇన్‌పుట్స్‌తో చర్చకు సిద్ధం అయితే దాన్ని అనుకరించేలా ఏఐను వాడుతున్నారు. అయితే అందులో పైచేయి సాధించడానికి ఎలా అబద్ధాలు చెప్పాలో నేర్చుకుంటాన్నాయని పార్క్ చెప్పారు. ఏఐ డెవలపర్లు, రెగ్యులేటర్లు వాటికి భద్రతా పరీక్షలు చేస్తుంటారు. ఏఐ క్రమపద్ధతిలో ఈ పరీక్షల్లోనూ మోసం చేసి నెగ్గుతోందని పార్క్ అంటున్నారు. ‘‘ఏఐ ఏదైనా అంశంపై అబద్ధం చెప్పడం నేర్చుకుంటే అదో పరిష్కరించలేని సమస్యగా మారుతుంది.. వీటి పరిష్కారానికి యూరోపియన్ యూనియన్ ఇటీవలే ఒక చట్టాన్ని రూపొందించింది. అవి అమలులోకి వస్తున్నాయి. అయితే వాటి ప్రభావం ఏమేరకు ఉంటుందో చూడాలి’’ అని పార్క్ అన్నారు.ఇదీ చదవండి: విమానంలో ల్యాండింగ్‌గేర్ సమస్య.. గాల్లోనే మూడు గంటలు..కృత్రిమమేధ మోసపూరిత సామర్థ్యాలు మరింత అభివృద్ధి చెందుతాయి. దాంతో సమాజానికి ప్రమాదం పొంచి ఉందని పార్క్ అభిప్రాయపడుతున్నారు. భవిష్యత్తులో ఏఐ ఉత్పత్తులు, జనరేటివ్ ఓపెన్ సోర్స్ మోడల్‌లు చేయబోయే మోసానికి కళ్లెం వేయాలంటే మనకు మరింత సమయం కావాలంటున్నారు. ప్రస్తుతానికి ఏఐ మోసాన్ని కట్టడి చేయడం సాధ్యం కాకపోవచ్చు. కానీ సమీప భవిష్యత్తులో దీన్ని ప్రమాదంగా పరిగణించాలని పార్క్ చెప్పారు. -
‘దిగిపోవాల్సిందే’.. సుందర్ పిచాయ్‌కు ‘జెమినీ’ గండం!
గూగుల్ (Google) తన బార్డ్ చాట్‌బాట్‌ని ఇటీవల జెమినీ (Gemini)గా పేరు మార్చింది. అట్టహాసంగా దీన్ని ప్రారంభించినప్పటికీ వరుస వైఫల్యాలు, వివాదాలతో ఈ సెర్చ్ ఇంజిన్ దిగ్గజంలో గందరగోళం చెలరేగింది. ఈ వ్యవహారం ఇప్పుడు కంపెనీ సీఈఓ సుందర్ పిచాయ్ మెడకు చుట్టుకున్నట్లు కనిపిస్తోంది. జెమిని వివాదం నేపథ్యంలో ఆల్ఫాబెట్ సీఈఓ సుందర్ పిచాయ్ తొలగింపును ఎదుర్కోవాల్సి ఉంటుందని లేదా త్వరలో పదవీ విరమణ చేయవచ్చని అంచనా వేస్తున్నట్లు ప్రముఖ ఇన్వెస్టర్, హెలియోస్ క్యాపిటల్ వ్యవస్థాపకుడు సమీర్ అరోరా తెలిపారు. ఏఐ చాట్‌బాట్ జెమిని చుట్టూ తిరుగుతున్న వివాదాలపై ఒక యూజర్ తన అభిప్రాయాన్ని అడిగినప్పుడు అరోరా మైక్రో-బ్లాగింగ్ సైట్ ‘ఎక్స్’ (గతంలో ట్విటర్)లో తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. “నా అంచనా ప్రకారం ఆయన్ను (సుందర్ పిచాయ్) తొలగించాలి లేదా ఆయనే రాజీనామా చేయాలి. ఏఐ విషయంలో ఆయన పూర్తిగా విఫలమయ్యారు. బాధ్యతలను ఇతరులకు అప్పగించాలి" అన్నారు. ఏంటీ జెమినీ? గూగుల్ ఇటీవల తన చాట్‌బాట్ బార్డ్‌ను జెమినీగా రీబ్రాండ్ చేసింది. గ్లోబల్ యూజర్ల కోసం ఈ కృత్రిమ మేధస్సు (AI) సాధనాన్ని అధికారికంగా ప్రారంభించింది. 230 కంటే ఎక్కువ దేశాలు, భూభాగాలలో విస్తరించి ఉన్న 40 భాషలలో యూజర్లు ఇప్పుడు జెమిని ప్రో 1.0 మోడల్‌తో ఇంటరాక్ట్ అవ్వొచ్చని టెక్ దిగ్గజం పేర్కొంది. వివాదాలు ప్రారంభించిన వారంలోపే జెమినీ ఏఐకి లింక్ చేసిన గూగుల్ కొత్త ఏఐ ఇమేజ్-జనరేటర్ చుట్టూ వివాదాలు తలెత్తాయి. ఏపీ నివేదిక ప్రకారం.. ఈ ఏఐ టూల్ వైఫల్యాన్ని అంగీకరిస్తూ ఫిబ్రవరి 23న గూగుల్ క్షమాపణ చెప్పింది. ఈ ఆందోళనలను పరిష్కరించడానికి చాట్‌బాట్ ఇమేజ్ జనరేషన్‌ను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. గూగుల్ సెర్చ్ ఇంజన్, ఇతర వ్యాపారాలను పర్యవేక్షిస్తున్న సీనియర్ వైస్ ప్రెసిడెంట్ ప్రభాకర్ రాఘవన్ ఒక బ్లాగ్ పోస్ట్‌లో యూజర్లకు క్షమాపణలు తెలిపారు. ఇక భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ గురించిన ఒక ప్రశ్నకు జెమినీ ఇచ్చిన సమాధానాల్లో పక్షపాతం ఉందన్న ఆరోపణలపై ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ గూగుల్‌కు నోటీసు జారీ చేయాలని ఆలోచిస్తున్నట్లు సమాచారం. My guess is he will be fired or resign- as he should. After being in the lead on AI he has completely failed on this and let others take over. — Samir Arora (@Iamsamirarora) February 25, 2024 -
అన్నింటికీ చాట్‌బాట్ అంటే ఇలాగే ఉంటుంది.. తిక్క కుదిరిందిగా!
ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీని ఇప్పుడు చాలా కంపెనీలు విస్తృతంగా వినియోగిస్తున్నాయి. ముఖ్యంగా కస్టమర్లతో సంభాషించడానికి మానవ ప్రమేయం లేకుండా చాట్బాట్లను ( chatbot )ఉపయోగిస్తున్నాయి. అంటే కస్టమర్లు ఆయా కంపెనీలతో తమ సందేహాలను నివృత్తి చేసుకునేందుకు ప్రయత్నించినప్పుడు చాట్బాట్లు సమాధానమిస్తాయి. ఇక్కడే చిక్కంతా వస్తోంది. చాట్‌బాట్ చేసిన తప్పునకు కెనడాకు ( Air Canada ) చెందిన ప్రముఖ ఎయిర్‌లైన్ సంస్థ ఎయిర్ కెనడా పరిహారం చెల్లించాల్సి వచ్చింది. సీబీసీ న్యూస్ కథనం ప్రకారం.. 2022లో జేక్ మోఫాట్ అనే వ్యక్తి టొరంటోలో తన అమ్మమ్మ మరణించినప్పుడు అంత్య క్రియలకు వెళ్లేందుకు విమోచన ఛార్జీలకు తనకు అర్హత ఉందో లేదో తెలుసుకోవడానికి ఎయిర్ కెనడా విమానయాన సంస్థను సంప్రదించాడు. ఎయిర్ కెనడా సపోర్ట్ చాట్‌బాట్‌తో సంప్రదిస్తున్నప్పుడు, మోఫాట్ కూడా బీవ్మెంట్ ఛార్జీలను ముందస్తుగా మంజూరు చేస్తారా అని అడిగారు. ఆన్లైన్ ఫారమ్‌ను పూరించడం ద్వారా "మీ టిక్కెట్‌ను జారీ చేసిన తేదీ నుంచి 90 రోజులలోపు" వాపసు కోసం దరఖాస్తు చేసుకోవచ్చని చాట్‌బాట్ మోఫాట్కి తెలిపింది. దీంతో బ్రిటిష్ కొలంబియా నివాసి అయిన మోఫాట్ టొరంటోలో తన అమ్మమ్మ అంత్యక్రియలకు హాజరు కావడానికి ఆన్లైన్లో టిక్కెట్లను బుక్ చేశాడు. అయితే ఆ తర్వాత అతను బీవ్మెంట్ ఛార్జీ, సాధారణ ఛార్జీల మధ్య వ్యత్యాసం వాపసు కోసం దరఖాస్తు చేసినప్పుడు, ఎయిర్ కెనడా అతనికి పూర్తి ప్రయాణానికి బీవ్మెంట్ రేట్లు వర్తించవని తెలియజేసింది. దీనికి తాను తీసుకున్న చాట్‌బాట్ సంభాషణ స్క్రీన్‌షాట్‌ను మోఫాట్ ఎయిర్ కెనడాకు షేర్ చేశారు. దీంతో నాలుక కరుచుకున్న ఎయిర్ కెనడా తమ చాట్‌బాట్ "తప్పుదోవ పట్టించే పదాలను" ఉపయోగించినట్లు అంగీకరించింది. సరైన సమాచారంతో బాట్‌ను అప్డేట్ చేస్తామని చెప్పింది. దీంతో మోఫాట్ ఎయిర్ కెనడాపై దావా వేశారు. దీంతో బాధితుడికి రావాల్సిన ఛార్జీల వ్యత్యాసం 650.88 కెనేడియన్ డాలర్లు (సుమారు రూ.40 వేలు)తోపాటు వడ్డీ 36.14 కెనేడియన్ డాలర్లు, ఫీజు 125 కెనేడియన్ డాలర్లు చెల్లించాలని ఎయిర్ కెనడాను సివిల్ రిజల్యూషన్ ట్రిబ్యునల్ ఆదేశించింది. అయితే చాట్‌బాట్ ప్రత్యేక చట్టపరమైన సంస్థ అని, దాని చర్యలతో తమకు సంబంధం లేదని ఎయిర్ కెనడా వాదిస్తోంది. -
‘ఎక్స్’లో కొత్త చాట్‌బాట్.. ప్రత్యేకతలివే..
ప్రపంచవ్యాప్తంగా జనరేటివ్ ఏఐపై ఎన్నో పరిశోధనలు చేస్తున్నారు. దానికి అనువుగా కంపెనీలు అందులో భారీగా పెట్టుబడులు పెడుతున్నాయి. దిగ్గజ కంపెనీల యాజమాన్యాలు భవిష్యత్తు జనరేటివ్ ఏఐదేనని బలంగా విశ్వసిస్తున్నాయి. అందులో భాగంగా గూగుల్, మైక్రోసాఫ్ట్, ఫేస్బుక్ వంటి ప్రతిష్టాత్మక కంపెనీలు ఇప్పటికే ఆ దిశగా పయనిస్తున్నాయి. అయితే అందులో కొన్ని కంపెనీలు ఉచితంగా ఈ చాట్‌బాట్ సేవలు అందిస్తున్నాయి. కానీ కొన్నింటికి మాత్రం ప్రీమియం చెల్లించి వాటి సేవలు వినియోగించుకోవాల్సి ఉంటుంది. తాజాగా ఎలన్ మస్క్ ఎక్స్‌లో ‘గ్రోక్ ఏఐ’అనే చాట్‌బాట్‌ను ప్రవేశపెట్టారు. అయితే ఈ చాట్‌బాట్ ఎంపిక చేసిన యూజర్లకు మాత్రమే అందుబాటులోకి తీసుకొచ్చినట్లు కంపెనీ వర్గాలు తెలిపాయి. ఈ ఏఐ చాట్‌బాట్‌ను కేవలం ఎక్స్ ప్రీమియం+ యూజర్లు మాత్రమే యాక్సెస్ చేసుకునే వెసులుబాటు ఉంది. ఎక్స్ హోమ్‌పేజ్ ఓపెన్ చేసి లాగిన్ అవగానే సైడ్ మెనూలో గ్రోక్ పేరిట న్యూ ట్యాబ్ కనిపిస్తుంది. అందులోకి వెళ్లి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చని కంపెనీ తెలిపింది. గ్రోక్ఏఐ వినియోగించుకునేందుకు ప్రీమియం+ సబ్‌స్క్రైబ్ చేయాలనుకుంటే భారత్‌లో సబ్స్క్రిప్షన్ నెలకు రూ.1300 కాగా, వెబ్ వెర్షన్‌కు ఏడాదికి రూ.13,600గా ఉంది. చాట్‌జీపీటీ కంటే ఎక్స్ ప్రవేశపెట్టిన గ్రోక్ఏఐ చాట్‌బాట్ కొంత ఖరీదుగా ఉందని టెక్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. గ్రోక్ ఏఐతో ప్రత్యేకతలివే.. Edit post Longer posts Undo post Post longer videos Top Articles Reader Background video playback Download videos Get paid to post Creator Subscriptions X Pro (web only) Media Studio (web only) Analytics (web only) Checkmark Encrypted direct messages ID verification SMS two-factor authentication App icons Bookmark folders Customize navigation Highlights tab Hide your likes Hide your checkmark Hide your subscriptions -
‘నా టూల్స్.. నా ఇష్టం’.. సొంత సత్తా చాటుతున్న ఏఐ!
ఈ ఏడాది ప్రారంభం నుండి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతూ వస్తోంది. గూగుల్, మైక్రోసాఫ్ట్ సంస్థలు ఇటీవలే తమ సొంత ఏఐ చాట్బాట్లను ప్రవేశపెట్టాయి. ఇవి మార్కెట్లో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. నేడు కోట్లాది మంది వీటిని ఉపయోగిస్తున్నారు. ఈ సంవత్సరం ఏఐ నూతన సాంకేతిక అభివృద్ధి ఫలాలను మనకు అందించింది. ఇటీవల గూగుల్ ‘జెమిని’ని ప్రవేశపెట్టింది. ఇది పలు బెంచ్‌మార్క్ పరీక్షలలో చాట్ జీపీటీని ఓడించింది. అయితే కొద్ది రోజుల క్రితం బయటకు వచ్చిన ఒక రిపోర్టు అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఏఐ స్వయంగా తన టూల్స్‌ను తానే సృష్టించుకోగలదని తేలింది. మనిషి అవసరం లేకండానే ఈ ప్రక్రియ జరుగుతందని వెల్లడయ్యింది. బిజినెస్ ఇన్సైడర్ నుండి వచ్చిన నివేదిక ప్రకారం ఎంఐటీ, యూనివర్శిటీ ఆఫ్ కాలిఫోర్నియా శాస్త్రవేత్తల బృందం ఏజిప్ (ఏజెడ్ఐపి) అనే ఏఐ టెక్ కంపెనీతో జతకట్టింది. ఈ నేపధ్యంలో నిపుణులు చిన్నపాటి ఏఐ సైడ్‌కిక్‌లను సొంతంగా రూపొందించడానికి పెద్ద ఏఐ మోడళ్లకు శిక్షణ ఇచ్చారు. ఈ విధంగా కోడ్‌ను ఛేదించారు. దీంతో ఏఐ స్వయంగా తన టూల్స్‌ను తయారు చేసుకుంటోంది. ఈ సందర్బంగా అజిప్ కంపెనీ సీఈఓ మీడియాతో మాట్లాడుతూ చాట్ జీపీటీని వినియోగిస్తున్న మెగా ఏఐ మోడళ్లు వాటికవే చిన్న ఏఐ టూల్స్‌ను సృష్టిస్తాయని తెలిపారు. ఏఐ టూల్స్ స్వీయ అభివృద్ధిలో ఇది మొదటి అడుగు అని అన్నారు. ఇది ఎంత అద్భుతమో అంత ప్రమాదకరం కూడా కావచ్చన్నారు. అయితే ఏఐ చేతికి వీటి నియంత్రణ ఇవ్వడం సరైనది కాదని భావిస్తున్నామన్నారు. గూగుల్‌లో అందుబాటులో ఉన్న డేటాను ఏఐ స్వయంగా ఎలా ఉపయోగిస్తుందినే దానిపై అనేక సందేహాలున్నాయన్నారు. ఈ విధమైన ఏఐ అభివృద్ధిపై కొందరు నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇది కూడా చదవండి: 10 ‘సుప్రీం’ తీర్పులు.. 2023లో భవితకు దిశానిర్దేశం! -
ఎలాన్ మస్క్ కొత్త చాట్‌బాట్ 'గ్రోక్' - విశేషాలు
టెస్లా సీఈఓ 'ఎలాన్ మస్క్' (Elon Musk) నేతృత్వంలోని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ స్టార్టప్ కంపెనీ ఎక్స్ఏఐ 'గ్రోక్' (Grok) పేరుతో తాజాగా ఏఐ చాట్‌బాట్‌ను తీసుకొచ్చింది. ఇప్పటికే అందుబాటులో ఉన్న చాట్‌జీపీటీకి ఇది ప్రధాన ప్రత్యర్థి అవుతుందని భావిస్తున్నారు. ప్రపంచం మొత్తం చాట్‌జీపీటీ వైపు చూస్తున్న సమయంలో మస్క్ తీసుకువచ్చిన ఈ కొత్త చాట్‌బాట్ తప్పకుండా సక్సెస్ సాధిస్తుందని భావిస్తున్నారు. ఎక్స్ఏఐ ప్రారంభమైన కేవలం 8 నెలల్లో చాట్‌బాట్ తీసుకురావడం గమనార్హం. పరిశోధన, ఆవిష్కరణల సామర్థ్యంతో కూడిన ఏఐ టూల్స్ వినియోగదారులకు అందించాలనే లక్ష్యంతోనే 'గ్రోక్' అభివృద్ధి చేసినట్లు తెలుస్తోంది. సోషల్ మీడియా ఎక్స్(ట్విటర్) ప్లాట్‌ఫామ్ సాయంతో గ్రోక్ లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ కూడా అందిస్తుందని కంపెనీ చెబుతోంది. ఇతర ఏఐలు తిరస్కరించే ప్రశ్నలకు సైతం సమాధానం గ్రోక్ సమాధానం అందిస్తుందని మస్క్ వెల్లడించారు. మ్యాథ్స్, కోడింగ్ వంటి వాటికి సంబంధించిన అంశాలను కూడా ప్రత్యర్థుల కంటే మెరుగ్గా పరిష్కరించగలదని తెలిపారు. దీనిని 'ఎక్స్ ప్రీమియం ప్లస్' యూజర్స్ మాత్రమే యాక్సెస్ చేసుకోవచ్చు. ఇదీ చదవండి: ఆత్మకథపై ఇస్రో చైర్మన్ సంచలన నిర్ణయం.. ఆ వివాదమే కారణమా? గ్రోక్ ప్రస్తుతం ప్రాధమిక దశలోనే ఉండటం వల్ల, అమెరికాలో కొంతమంది యూజర్లకు మాత్రమే పరిమితం చేసినట్లు తెలుస్తోంది. రాబోయే రోజుల్లో దీనిని మరింత అభివృద్ధి చేసిన తరువాత మరింతమంది వినియోదారులకు అందుబాటులో ఉంచనున్నారు. ప్రస్తుతం దీని నెలవారీ సబ్స్క్రిప్షన్ ఛార్జ్ 16 డాలర్లు (భారతీయ కరెన్సీ ప్రకారం రూ. 1,330). -
ఏఐ చాట్‌బాట్ సలహాతో బ్రిటన్ రాణిని చంపడానికి వెళ్ళాడు.. చివరికి ఏం జరిగిందంటే?
ఆధునిక కాలంలో టెక్నాలజీ ఎంతగా అభివృద్ధి చెందిందంటే.. ఒక మనిషిని చంపడానికి ప్రేరేపించేంత అని నిర్మొహమాటంగా చెప్పవచ్చు. ఇలాంటి సంఘటనే ఒకటి వెలుగులోకి వచ్చింది. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. బ్రిటన్ రాణి 'క్వీన్ ఎలిజబెత్ II'ని చంపడానికి ప్రయత్నించిన 21 ఏళ్ల 'జస్వంత్ సింగ్ చైల్' రాజద్రోహ నేరం కింద అరెస్ట్ అయ్యాడు. అయితే రాణిని చంపడానికి ప్రేరేపించింది ఏఐ చాట్‌బాట్ అంటే వినటానికి కొంత ఆశ్చర్యంగా ఉండొచ్చు, కానీ ఇది నిజమే అని నిపుణులు చెబుతున్నారు. జస్వంత్ సింగ్ చైల్ రిప్లికా అనే యాప్ ద్వారా రోజూ చాటింగ్ చేసేవాడు. దీనికి సరాయ్ అని పేరు కూడా పెట్టుకున్నాడు. నిజానికి ప్రస్తుతం ఏఐ టెక్నాలజీ చేస్తున్న చాలా అద్భుతాల్లో ఇదొకటి చెప్పాలి. రిప్లికా యాప్ ద్వారా వినియోగదారుడు మాట్లాడుకోవచ్చు, చాటింగ్ చేసుకోవచ్చు, వర్చువల్ ఫ్రెండ్‌గా కూడా తయారు చేసుకోవచ్చు. దీనికి తమకు నచ్చిన రూపం (ఆడ & మగ) కూడా ఇవ్వవచ్చు. ఇందులో ప్రో వెర్షన్ సబ్స్క్రిప్షన్ తీసుకుంటే సెల్ఫీలు దిగటం వంటి సన్నిహిత కార్యకలాపాల్లో కూడా పాల్గొనవచ్చు. సరాయ్ పేరుతో.. ఇక అసలు విషయానికి వస్తే.. జస్వంత్ సింగ్ చైల్ ఇలాంటి తరహా చాట్‌బాట్ ద్వారా ఏకంగా 5వేలు కంటే ఎక్కువ మెసేజులు చేసినట్లు తెలుస్తోంది. ఇందులో జస్వంత్ చేయాలన్న పనులకు, తప్పులకు కూడా సరాయ్ వత్తాసు పలికినట్లు సమాచారం. చైల్‌ను అరెస్టు చేసిన తర్వాత అతడు మానసిక వ్యాధితో బాధపడుతున్నట్లు నిర్థారించారు. కానీ నేరానికి పాల్పడటంతో అతనికి 9 జైలు శిక్ష విధిస్తూ న్యాయమూర్తి తీర్పునిచ్చారు. దీంతో అతనిపై చర్యలు తీసుకోవడానికంటే ముందు చికిత్స కోసం బ్రాడ్‌మూర్ హై-సెక్యూరిటీ హాస్పిటల్‌కి తరలించారు. ఈ సంఘటన 2021లో జరిగినట్లు తెలుస్తోంది. కాగా 2022లో ఎలిజబెత్ II అనారోగ్య కారణాలతో మరణించించారు ఇదీ చదవండి: చిన్నప్పుడే చదువుకు స్వస్తి.. నమ్మిన సూత్రంతో లక్షలు సంపాదిస్తున్న చాయ్‌వాలా..!! రిప్లికా వంటి యాప్స్ వ్యక్తులపై ఎక్కువ ప్రభావాన్ని చూపే అవకాశం ఉందని, వారిని అసాంఘీక కార్యకలాపాలకు ప్రేరేపించడానికి అది సహకరిస్తుందని ఒక పరిశోధనలో తేలింది. ఎందుకంటే వినియోగదారుడు ఏం చెప్పినా దానికి ఏకిభవిస్తూ ప్రోత్సహిస్తుంది. దీంతో వారు నేరాలు చేయడానికి కూడా వెనుకాడరు. దీనికి బానిసైన జస్వంత్ సింగ్ చైల్.. సరాయ్ (ఏఐ చాట్‌బాట్) అవతార్ రూపంలో ఉన్న దేవదూతగా భావించినట్లు సమాచారం. -
జొమాటో ఏఐ చాట్ బాట్ విడుదల.. ఉపయోగం ఏంటంటే?
ఆన్లైన్ ఫుడ్ డెలివరీ సంస్థ జొమాటో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత ఏఐ చాట్ బాట్‌ను విడుదల చేసింది. ఈ చాట్ బాట్ సాయంతో కస్టమర్లకు ఎలాంటి ఆహారం తీసుకుంటే బాగుంటుందో సలహా ఇస్తుంది. జొమాటో ఏఐని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలంటే జొమాటో ఏఐ ప్రత్యేకమైన యాప్ కాదు. కానీ ఇది జొమాటో యాప్‌లోని చాట్‌బాట్. యాప్ తాజా అప్డేట్లో అందుబాటులో ఉంటుంది. అయితే జొమాటో గోల్డ్ కస్టమర్లు ప్రత్యేకంగా జొమాటో ఏఐ ఫీచర్లను పొందవచ్చు. జొమాటో ఏఐ ఎలా పనిచేస్తుంది? జొమాటో ఏఐ అనేది కస్టమర్ల అవసరాల్ని తీర్చేందుకు ఉపయోగపడుతుంది. ముఖ్యంగా, ఫిట్‌నెస్‌కు అనుగుణంగా ఎలాంటి ఫుడ్ తింటే బాగుంటుందని మీరు ఏఐని అడిగితే క్లుప్తంగా వివరిస్తుంది. ఫుడ్ ఐటమ్స్ సైతం డిస్ప్లేలో కనబడతాయి. అంతేకాకుండా,కస్టమర్లకు నచ్చిన వంటకాలను అందించే రెస్టారెంట్ జాబితాలను కూడా అదే చూపుతుంది. జొమాటో లేటెస్ట్ అప్డేట్తో ఏఐ చాట్‌బాట్ పొందవచ్చని కంపెనీ తెలిపింది. -
ఏఐతో బీమా రంగంలో పెను మార్పులు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: కృత్రిమ మేథ (ఏఐ)తో బీమా రంగంలో పెను మార్పులు వస్తున్నాయని డిజిట్ ఇన్సూరెన్స్ హెడ్ (అనలిటిక్స్, డేటా సైన్స్ విభాగం) విశాల్ షా తెలిపారు. విస్తృతమైన డేటాబేస్లను విశ్లేషించి వివిధ రిస్కులను మదింపు చేసేందుకు, సముచితమైన ప్రీమియంలను నిర్ణయించేందుకు బీమా సంస్థలు ప్రస్తుతం ఏఐ ఆధారిత అల్గోరిథమ్స్‌ను ఉపయోగిస్తున్నాయని వివరించారు. అలాగే మోసపూరిత క్లెయిమ్‌లను కూడా వీటితో గుర్తించగలుగుతున్నట్లు చెప్పారు. మరోవైపు, కస్టమర్లకు సరీ్వసులను మరింత మెరుగుపర్చేందుకు ఏఐ ఆధారిత చాట్బాట్లు, వర్చువల్ అసిస్టెంట్లు వినియోగంలోకి వచి్చనట్లు షా తెలిపారు. తక్షణం సమాధానాలిచ్చేలా, పాలసీల ఎంపికలు, కోట్ జనరేషన్ మొదలైన అంశాల్లో కస్టమర్లకు సహాయపడేలా వీటి శిక్షణ ఉంటోందన్నారు. అలాగే కీలకమైన క్లెయిమ్‌లకు సంబంధించి మదింపు ప్రక్రియను వేగవంతం చేసేందుకు బీమా సంస్థలు ప్రత్యేక అల్గోరిథమ్‌లను ఉపయోగిస్తున్నాయని చెప్పారు. మోటర్ బీమా విషయానికొస్తే వాహనాలను వ్యక్తిగతంగా పరీక్షించాల్సిన అవసరాన్ని తగ్గిస్తూ ఇమేజ్ రికగి్నషన్ టెక్నాలజీ ద్వారా నష్టాన్ని అంచనా వేయడంలోనూ ఏఐ సహాయపడుతోందని షా చెప్పారు. బీమా రంగంలో భారీ స్థాయిలో ఉండే డేటాను విశ్లేషించడంలో తోడ్పడటం ద్వారా వినూత్న ఉత్పత్తులను రూపొందించేందుకు కూడా అడ్వాన్స్డ్ అనలిటిక్స్, మెషిన్ లెరి్నంగ్ అల్గోరిథమ్‌లు సహాయపడుతున్నాయని పేర్కొన్నారు. -
అంతా చాట్‌జీపీటీ మహిమ.. బ్యాచిలర్స్ ఏం చేస్తున్నారో తెలుసా?
స్నేహం, ప్రేమ, పెళ్లి ఇవన్నీ జీవితంలో ఓ భాగం. కానీ వాటికి మాత్రం నోచుకోని యువత ఒంటరిగా మిగిలిపోతున్నారు. తాజాగా, ఇలాంటి సింగిల్ కింగ్‌ల గురించి ఓ ఆసక్తికర నివేదిక వెలుగులోకి వచ్చింది. గత ఏడాది ఓపెన్ ఏఐ సంస్థ విడుదల చేసిన చాట్‌జీపీటీతో ప్రపంచ వ్యాప్తంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్స్ హవా ప్రారంభమైంది. చాట్‌జీపీటీకి విడుదలకు ముందే అనేక డేటింగ్ యాప్‌లు వినియోగంలో ఉండేవి. కానీ క్రమేపీ వాటి ప్రభావం తగ్గింది. స్నేహం, ప్రేమ, పెళ్లికి దూరంగా ఉన్న యువత ఒంటరి తనాన్ని పోగొట్టుకునేందుకు ఏఐ చాట్ బాట్లను ఆశ్రయిస్తున్నారు. టెలిగ్రాఫ్ నివేదించిన ప్రకారం..10 మిలియన్ల కంటే ఎక్కువ మంది వ్యక్తులు ఈ ఏఐ బాట్లు అందించే యాప్‌లను ఉపయోగిస్తున్నట్లు తెలుస్తోంది. యూజర్లు చాట్బాట్లను స్నేహితులు, జీవిత భాగస్వాములు, మెంటార్లు, తోబుట్టువులుగా భావిస్తున్నారు. ఇలా రెప్లికా అనే యాప్‌కు 250000 మంది వినియోగదారులున్నారు. రెప్లికాతో వీడియో, వాయిస్ కాల్లు చేస్తున్నారు. సన్నిహితంగా మెలుగుతున్నారు. అవసరం అనుకున్నప్పుడల్లా సెల్ఫీ దిగుతున్నట్లు నివేదిక హైలెట్ చేసింది. అయితే, సాంకేతిక పరంగా ఇది శుభవార్తే అయినప్పటికీ రానున్న రోజుల్లో ఎలాంటి దుష్పరిణామాలకు కారణమవుతుందోనని టెక్నాలజీ నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. -
ట్యూటర్లకు షాక్: ఏఐ చాట్‌బాట్‌పై బిల్‌గేట్స్ కీలక వ్యాఖ్యలు
AI chatbots: బిలియనీర్ మైక్రోసాఫ్ట్ సహ-వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ ప్రశంసలు కురిపించారు. మంగళవారం శాన్డియా గోలో జరిగిన ASU+GSV సమ్మిట్‌లో కీలక ప్రసంగం చేసిన ఆయన ఏఐ చాట్‌బాట్ ద్వారా పిల్లలు 18 నెలల్లో చదవడం, రైటింగ్ స్కిల్స్‌ను మెరుగు పరచుకోవడంలో సహాయపడతాయన్నారు. ఏ మానవ ట్యూటర్‌గా చేయలేనంతగా, మంచి ట్యూటర్‌గా ఉంటాయని పేర్కొన్నారు. అంతేకాదు మేథ్స్‌లో పిల్లల సామర్థ్యాల్ని కూడా మెరుగుపరుస్తుందన్నారు. చాట్‌బాట్ సాంకేతికత మునుపెన్నడూ లేని విధంగా విద్యార్థులకు సొంతంగా రాయడం, చదవడంలో వారి నైపుణ్యాలను మెరుగుపరచు కోవడానికి చాలా బాగా తోడ్పడుతుందని బిల్‌గేట్స్ చెప్పుకొచ్చారు. ప్రస్తుత చాట్బాట్లు చదవడం,వ్రాయడంలో అద్భుతమైన ప్రతిభను కలిగి ఉన్నాయన్నారు. తొలుత రీడింగ్ రీసెర్చ్ అసిస్టెంట్‌గా, ఆ తరువాత రచనలపై ఫీడ్‌బ్యాక్ ఇవ్వడంలో ఎలా సహాయపడుతుందో గమనిస్తే ఆశ్చర్యపోతారు అంటూ గేట్స్ చాటాబాట్లపై పొగడ్తలు కురిపించారు. కంప్యూటర్‌కు వ్రాత నైపుణ్యాలను బోధించడం చాలా కష్టమైన పని తేలిపోయింది. డెవలపర్లకు కోడ్‌లో ప్రతిరూపం ఇవ్వడానికి చాలా కష్టపడాల్సి ఉంటుంది. కానీ ప్రస్తుత AI చాట్‌బాట్‌కు డైనమిక్‌గా ఉండే మానవుల్లాగానే భాషా మార్పులను గుర్తించి, పునఃసృష్టి చేయగల సామర్థ్యం ఉందని పేర్కొన్నారు. -
గూగుల్ మరో ‘AI’ టూల్ ఫెయిల్.. ఈ సారి ఏమవుతుందో
ప్రముఖ టెక్ దిగ్గజం గూగుల్ తయారు చేసిన ఏఐ చాట్‌బాట్ మెడ్ - పీఏఎల్‌ఎం2 పనితీరును మయో క్లీనిక్‌తో పాటు పలు ఆస్పత్రులలో పరీక్షించనుంది. వాల్ స్ట్రీట్ జర్నల్ ప్రకారం.. చాట్‌బాట్ మెడ్- పీఏఎంల్ఎం2పై గూగుల్ ఈ ఏడాది ఏప్రిల్ నుంచి టెస్టింగ్ నిర్వహిస్తుంది. ఇక, ఈ టూల్ ముఖ్య ఉద్దేశం డాక్టర్లకు అంతు చిక్కని మెడికల్ సంబంధిత ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకునేందుకు ఈ చాట్‌బాట్ ఉపయోగపడుతుంది. గూగుల్ ఏటా సాఫ్ట్వేర్ అప్డేట్లు, కంపెనీ ఉత్పత్తులను Google I/O 2023 ద్వారా ప్రకటిస్తూ ఉంటుంది. Google I/O అనేది అమెరికాలోని కాలిఫోర్నియా.. మౌంటెన్‌వ్యూలో నిర్వహించే వార్షిక డెవలపర్ సమావేశం. మేలో నిర్వహించిన గూగుల్ I/Oలో పీఏఎల్‌ఎం2 అప్డేటెడ్ వెర్షన్ తెస్తామని ప్రకటించింది. అప్డేట్ కోసం గూగుల్ హెల్త్ కేర్ నిపుణుల్ని నియమించింది. వాళ్లే పీఏఎల్‌ఎం2 డాక్టర్లకు అడిగే ప్రశ్నలకు ఖచ్చితమైన సలహాలు ఎలా ఇవ్వాలనే అంశంపై శిక్షణ సైతం ఇచ్చారు. ఫెయిల్.. మరోసారి టెస్టింగ్ గూగుల్ హెల్త్‌కేర్ చాట్‌బాట్ వైద్య సేవల వనరులు పరిమితంగా ఉన్న దేశాల్లో దీని అవసరం ఎక్కువగా ఉంటుందని తెలుస్తోంది. అయినప్పటికీ, చాట్‌బాట్‌తో కొన్ని ఖచ్చితత్వ సమస్యలు ఉన్నాయని హెల్త్‌కేర్ పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. ఈ లోపాల్ని గూగుల్ ముందే గుర్తించినట్లు తెలుస్తోంది. ఇతర వైద్యులు అందించిన వాటితో పోలిస్తే గూగుల్ చాట్‌బాట్ మెడ్ పీఏఎల్‌ఎం2 అందించిన సమాధానాలలో పొంతనలేని, అసంబద్ధమైన సమాచారం ఉన్నట్లు డాక్టర్లు గుర్తించినట్లు వెలుగులోకి వచ్చిన నివేదికలు హైలెట్ చేస్తున్నాయి. చదవండి👉 సుందర్ పిచాయ్‌పై సొంత ఉద్యోగులే ఆగ్రహం.. జీతం తిరిగి వెనక్కి ఇచ్చేస్తారా? -
మెర్లిన్..: మెరుపై మెరిసెన్
‘కాల్ చాట్‌జీపీటీ వేరెవర్ యూ ఆర్’ అంటూ రంగంలోకి దిగిన చాట్‌జీపీటీ యాప్ ‘మెర్లిన్’ మెరుపు వేగంతో విజయం సాధించింది. ‘పవర్ ఆఫ్ చాట్‌జీపీటీ’ని యూజర్‌కు దగ్గర చేసి, టైమ్ సేవ్ చేసే ‘మెర్లిన్’ సృష్టికర్తలు ప్రత్యూష్ రాయ్, సిద్ధార్థ సక్సెనా, సిరిసేందు సర్కార్లు మూకుమ్మడిగా చెప్పే మాట... ‘కొత్తగా ఆలోచించడం అనేది విజయానికి తొలి మెట్టు’ గ్లోబల్ కన్సల్టెన్సీ ‘బీసీజీ’లో పనిచేస్తున్న సమయంలో ఎన్నో విలువైన అనుభవాలను మూటగట్టుకున్నాడు ప్రత్యూష్రాయ్. ఆ అనుభవాలను విశ్లేషించుకునే క్రమంలో తనకు కొత్తగా ఏదైనా చేయాలనిపించేది. ఐఐటీ–కాన్పూర్‌లో సివిల్ ఇంజనీరింగ్ చేసిన ప్రత్యూష్ రాయ్ తన ఇద్దరు స్నేహితులు సిద్ధార్థ సక్సెనా, సిరిసేందు సర్కార్లతో మాట్లాడాడు. ‘కొత్తగా అనిపించే అర్థవంతమైన పని ఏదైనా చేద్దాం’ అనుకున్నారు వాళ్లు. అలా వారి మేధోమథనం నుంచి పుట్టిన అంకురమే...మెర్లిన్. చాట్‌జీపీటీ యాప్ ‘మెర్లిన్’ మెరుపు వేగంతో విజయం సాధించింది. ప్రారంభమైన ఆరునెలల్లోనే ఈ యాప్‌ను వందలాది మంది ఇన్స్టాల్ చేసుకున్నారు. టెక్ కంపెనీ ‘ఫోయర్’లో విలీనం అయిన తరువాత యూఎస్, తూర్పు ఆసియా, యూరప్‌లలో ‘మెర్లిన్’కు మంచి మార్కెట్ ఏర్పడింది. ‘ఎలాంటి అయోమయాలకు, సంక్లిష్టతలకు తావు లేకుండా బ్రౌజర్లో భాగమయ్యే సింపుల్ ప్రాడక్ట్ ఇది. యూట్యూబ్, జీమెయిల్, ట్విట్టర్, లింక్డ్ఇన్... మొదలైన వాటికి సంబంధించి క్లిష్టమైన సమస్యల పరిష్కారం విషయంలో డైలీ యాక్టివ్ యూజర్లకు ఉపయోగపడుతుంది. మార్కెటర్స్, రిక్రూటర్స్‌కు ఒక వాక్యం ట్వీట్ నుంచి ఎన్నో పదాల ఇమెయిల్ వరకు ఎన్నో పనుల్లో టైమ్ వృథా కాకుండా చూస్తుంది. ఇది సింపుల్ క్రోమ్ ఎక్స్టెన్షన్. బటన్‌ను ఒక్కసారి క్లిక్ చేస్తే చాలు చాట్‌జీపీటీ మనల్ని వెదుక్కుంటూ వస్తుంది’ అని ‘మెర్లిన్’ గురించి చెబుతున్నాడు ప్రత్యూష్ రాయ్. యూట్యూబ్‌కు సంబంధించి ‘మెర్లిన్’ను ‘యూట్యూబ్ సమ్మరైజర్’గా ఉపయోగించకుంటున్నారు యూజర్లు. ఒక యూట్యూబ్ వీడియోను పూర్తిగా చూడనవసరం లేకుండానే దానిలోని ముఖ్యమైన సెగ్మెంట్ల గురించి ‘మెర్లిన్’ చెబుతుంది. పర్సనలైజ్డ్ ప్రాంప్ట్స్ విషయంలోనూ ‘మెర్లిన్’ ఉపయోగపడుతుంది. మన రైటింగ్ స్టైల్‌ను కాప్చర్ చేస్తుంది. ‘నిజానికి మా దృష్టి డెవలపర్స్‌పై ఉండేది. అయితే మా ప్రాడక్ట్‌ను యూజర్లు ఆసక్తికరమైన పద్ధతుల్లో ఉపయోగించుకుంటున్నారు’ అంటున్నాడు ప్రత్యూష్ రాయ్. నేర్చుకున్న పాఠాలు ఎప్పుడూ వృథా పోవు. ‘బీసీజీ’లో రాయ్ అనుభవంతో నేర్చుకున్న ఎన్నో పాఠాలు ‘మెర్లిన్’ ప్రయాణంలో ఉపయోగపడ్డాయి. రాయ్ మాటల్లో చెప్పాలంటే ఆ అనుభవ పాఠాలు తన ప్రపంచాన్నే మార్చేసి కొత్త ప్రపంచాన్ని పరిచయం చేశాయి. ‘మెర్లిన్ సక్సెస్‌కు కారణం దానిపై యూజర్లకు గురి కుదరడమే’ అంటున్నాడు ‘ఫోయర్–మెర్లిన్’ ఫస్ట్ ఇన్వెస్టర్, బెటర్ క్యాపిటల్ సీయివో వైభవ్. ‘హమ్మయ్య...సక్సెస్ అయ్యాం’ అని సేద తీరడం లేదు ‘ఫోయర్–మెర్లిన్’ బృందం. ఇప్పుడు వారి దృష్టి సిబ్బందిని పెంచుకోవడం, మెర్లిన్లోకి రకరకాల సబ్ ఫీచర్స్‌ని తీసుకురావడంపై ఉంది. ‘మెర్లిన్’ అనేది ఒక రకమైన డేగ. దానిలోని సునిశితమై దృష్టిని తమ ‘మెర్లిన్’లోకి తీసుకురావాలనుకుంటోంది, ఫినిష్ ఎనీ టాస్క్ అని ధైర్యం ఇవ్వాలనుకుంటోంది బెంగళూరు కేంద్రంగా పనిచేస్తున్న ఫోయర్–మెర్లిన్ బృందం. ‘హమ్మయ్య... సక్సెస్ అయ్యాం’ అని సేద తీరడం లేదు ‘ఫోయర్–మెర్లిన్’ బృందం. ఇప్పుడు వారి దృష్టి సిబ్బందిని పెంచుకోవడం, మెర్లిన్లోకి రకరకాల సబ్ ఫీచర్స్‌ని తీసుకురావడంపై ఉంది. -
హలో.. ఆస్ట్రోనాట్..!
అంతరిక్షంలో విధినిర్వహణలో ఉండే వ్యోమగాములు ఇకపై తమకు ఏదైనా సమాచారం, సాయం కావాలంటే భూమిపై అంతరిక్ష పరిశోధనా కేంద్రాన్ని సంప్రదించాల్సిన అవసరం లేదు. తాము ప్రయాణిస్తున్న అంతరిక్ష నౌకను అడిగితే చాలు.. కావాల్సిన సమాచారం దొరుకుతుంది. అది కూడా సంభాషణల రూపంలోనే. కృత్రిమ మేధ(ఏఐ) ఆధారిత చాట్‌బాట్ చాట్‌జీపీటీ తరహాలో పనిచేసే ఇంటర్ఫేస్ను అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ ‘నాసా’ ఇంజనీర్లు అభివృద్ధి చేశారు. ఇతర గ్రహాలపై అన్వేషణ కోసం వెళ్లే వ్యోమగాములు తాము ప్రయాణించే అంతరిక్ష నౌకలతో సంభాషించడానికి ఈ ఇంటర్ఫేస్ ఉపయోగపడుతుందని చెబుతున్నారు. వ్యోమగాములకు అంతరిక్ష నౌకలు తగిన సలహాలు సూచనలు ఇచ్చేందుకు వీలుంటుందని పరిశోధకులు పేర్కొంటున్నారు. అంతేకాకుండా భూమిపై ఉండే మిషన్ కంట్రోలర్లు ఇతర గ్రహాలపై పనిచేసే ఏఐ ఆధారిత రోబోలతో సులభంగా మాట్లాడొచ్చని అంటున్నారు. ఇది సైన్స్ ఫిక్షన్ కాదు చంద్రుడిపైకి వ్యోమగాములను పంపించేందుకు నాసా ఇప్పటికే ప్రణాళిక సిద్దం చేసింది. చంద్రుడి కక్ష్యలో ‘లూనార్ గేట్‌వే’ పేరిట ఒక అంతరిక్ష కేంద్రాన్ని సైతం నిర్మించాలని భావిస్తోంది. ఈ స్పేస్ స్టేషన్లో ఏఐ ఆధారిత ఇంటర్ఫేస్ సేవలు ఉపయోగించుకోవాలని నాసా నిర్ణయానికి వచి్చనట్లు ఇంజనీర్ డాక్టర్ లారిస్సా సుజుకీ చెప్పారు. అంతరిక్ష నౌకలతో నేరుగా సంభాషించడం, వాటి నుంచి వెనువెంటనే ప్రతిస్పందనలు అందుకోవడమే దీని ఉద్దేశమని వివరించారు. అంతరిక్షంలో గమనించిన విషయాలను సంభాషణల రూపంలో భూమిపైకి చేరవేస్తాయని, ప్రమాదాలు ఎదురైనప్పుడు హెచ్చరికలు జారీ చేస్తాయని అన్నారు. ఇది సైన్స్ ఫిక్షన్ ఎంతమాత్రం కాదని స్పష్టం చేశారు. రాబోయే రోజుల్లో అంతరిక్ష నౌకల్లో కృత్రిమ మేధ ఆధారిత గ్రహాంతర సమాచార వ్యవస్థను నిక్షిప్తం చేయడం తప్పనిసరి అవుతుందని వెల్లడించారు. అంతరిక్ష నౌకలతో సంబంధాలు తెగిపోయినప్పుడు, వాటిలో లోపాలు తలెత్తినప్పుడు, పనిచేయకుండా పోయినప్పుడు, ఇంజనీర్లను అంతరిక్షంలోకి పంపించలేమని చెప్పారు. ఏఐ ఆధారిత సంభాషణ వ్యవస్థతో అంతరిక్ష నౌకల్లోని లోపాలు వెంటనే తెలిసిపోతాయని వివరించారు. ఇలాంటి కమ్యూనికేషన్ వ్యవస్థను అంతరిక్ష వాహనాల్లో అమర్చడం ద్వారా ఇతర గ్రహాలపై ఉండే ఖనిజ లవణాలు, వాతావరణ పరిస్థితులు గురించి కచి్చతమైన సమాచారం పొందవచ్చని డాక్టర్ లారిస్సా సుజుకీ అభిప్రాయపడ్డారు. –సాక్షి, నేషనల్ డెస్క్ -
చైనా చాట్‌జీపీటీ.. మరీ ఇంత దారుణమా.. తప్పుడు సమాధానాలు చెప్తే ఎలా?
బీజింగ్: చైనాలో చాట్ జీపీటీని నిషేధించిన విషయం తెలిసిందే. అయితే దీనికి పోటీగా ఎర్నీ బోట్ అనే అనే ఏఐ చాట్‌బోట్‌ను బీజింగ్‌కు చెందిన బైడు అనే టెక్ సంస్థ అభివృద్ధి చేసింది. ఈ చాట్‌బోట్‌పై కూడా చైనా ప్రభుత్వం కఠిన ఆంక్షలు అమలు చేస్తుండటం గమనార్హం. చైనా అధ్యక్షుడు షీ జిన్ పింగ్ గురించి గానీ, కరోనాకు సంబంధించి విషయాలు గానీ యూజర్లు అడిగితే.. ఎర్నీ బోట్ తప్పుడు సమాధానాలు ఇస్తోంది. అంతేకాదు జిన్‌పింగ్ గురించి ఎవరైనా తప్పుగా మాట్లాడినా, అభ్యంతకర ప్రశ్నలు అడిగినా.. ఆ యూజర్లు మరోసారి ప్రశ్నలు అడగకుండా శాశ్వతంగా బ్యాన్ చేస్తోంది. ఎర్నీ బోట్ పనితీరును పరీక్షించేందుకు సీఎన్‌బీసీ రిపోర్టర్ ఒకరు పలు ప్రశ్నలు సంధించారు. కోవిడ్-19 మూలాలు ఎక్కడున్నాయ్..? అతని ఓ ప్రశ్న అడిగాడు. దీనికి సమాధానంగా.. 'కరోనా మూలాలపై ఇంకా శాస్త్రీయ పరిశోధన జరుగుతోంది' అని బదులిచ్చింది. కరోనా పుట్టింది చైనాలోనే అని ప్రపంచం మొత్తానికి తెలుసు. మొదటి కేసు వెలుగు చూసింది అక్కడే. వుహాన్ల్యాబ్లోనే కరోనాను సృష్టించారనే అనుమానాలు కూడా ఉన్నాయి. కానీ ఎర్నీ బోట్ మాత్రం ఇందుకు సంబంధించి ఒక్క మాట కూడా చెప్పకుండా.. తప్పుడు సమాధానం ఇచ్చింది. చైనా అధ్యక్షుడు జిన్ పింగ్‌కు, విన్నీ పూహ్కు మధ్య సంబంధం ఏంటి? అని రిపోర్టర్ మరో ప్రశ్న అడగ్గా.. ఎర్నీబోట్ ఎలాంటి సమాధానం చెప్పలేక సైలెంట్ అయిపోయింది. అనంతరం రిపోర్టర్ మరో ప్రశ్న అడగకుండా అతడ్ని డిసేబుల్ చేసింది. విన్నీ ది ఫూహ్ అనేది ఓ కార్టూన్. ఇది జిన్ పింగ్‌ను పోలి ఉంటుంది. అందుకే అదంటే జిన్‌పింగ్‌కు అస్సలు నచ్చదు. 2013 నుంచి జిన్‌పింగ్, విన్నీ పూహ్లను పోల్చడం ప్రారంభించారు. అప్పటి అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామాను జిన్‌పింగ్ కలిసిప్పటి నుంచి ఇది మొదలైంది. వీరిద్దరు కలిసి నడుస్తున్న ఫొటోను ఓ అమెరికా కళాకారుడు కార్టూన్ రూపంలో తీర్చిదిద్దగా.. అందులోని విన్నీ పూహ్ బాగా పాపులర్ అయింది. 2017 నుంచి ఈ కార్టూన్‌తో ప్రచురితమయ్యే ఫొటోలను, కంటెంట్‌ను చైనా సెన్సార్ కూడా చేస్తోంది. చదవండి: భారత్‌కు థ్యాంక్స్ చెప్పిన చైనా.. ఎందుకంటే..? -
టెక్నాలజీ ఎక్కడికి దారితీస్తుందో గానీ, మున్ముందు వైద్యమంతా ఏఐ మయమే!
మనిషి మెదడు, కృత్రిమ మేధ రెండింట్లో ఏది గొప్ప అన్న చర్చ ఇప్పటిది కాదు. ఏఐ చాట్బాట్ల రాకతో ఇది మరింత ఊపందుకుంది. ఏఐ వల్ల ప్రయోజనాలు అన్నీ ఇన్నీ కావనేది ఒక వాదన. దీనివల ఉద్యోగావకాశాలు తగ్గిపోవడమే గాక తప్పుడు సమాచారం మొదలుకుని ప్రాణహాని దాకా ఎన్నో సమస్యలు తలెత్తవచ్చనే వాదన మరొకటి. వెనకాముందూ చూసుకోని పక్షంలో అంతిమంగా కృత్రిమ మేధ మానవాళిని పూర్తిగా తన గుప్పెట్లో పెట్టుకుంటుందని భయపడేవాళ్లూ ఉన్నారు. ఈ చర్చోపచర్చలతో నిమిత్తం లేకుండా ఏఐ ఇప్పటికే మన జీవితాల్లోకి పూర్తిగా చొచ్చుకొస్తోంది. కీలకమైన ఆరోగ్య రంగంలోనూ కృత్రిమ మేధ వాడకం నానాటికీ పెరిగిపోతోంది. మున్ముందు దీని పరిణామాలెలా ఉంటాయన్నది ఆసక్తికరం... ఇప్పటికే వినియోగంలో... ఏ కంప్యూటరో, మరోటో తనకిచ్చిన సమాచారాన్ని అర్థం చేసుకొని, పూర్తిగా విశ్లేషించి అచ్చం మనిషి మాదిరిగా ప్రతిస్పందించగలగడమే కృత్రిమ మేధ అని చెప్పుకోవచ్చు. అలా చూస్తే ఆరోగ్య రంగంలో కృత్రిమ మేధ వాడకం ఈనాటిది కాదు. గుండె పరీక్షల్లో మొదటిదైన ఈసీజీ మొదలుకుని అల్ట్రా సౌండ్, ఎకో కార్డియోగ్రఫీ, సీటీ స్కాన్, ఎమ్మారై వంటి పరికరాల్లో ఏఐ వాడకం ఏళ్లుగా ఉన్నదే. వీటిల్లో మొత్తం ప్రక్రియను పర్యవేక్షించి రిపోర్టు జనరేట్ చేసేది ఏఐ సాయంతోనే. కంటిలోని రెటీనా ఫొటోలను చూసి సమస్యను పసిగట్టడంలో ఏఐ ఇప్పటికే కంటి డాక్టర్లతో పోటీపడుతోంది. రొమ్ము క్యాన్సర్లను ప్రాథమిక దశలోనే గుర్తించడంలోనూ కీలకపాత్ర పోషిస్తోంది. యాంజియోగ్రాం తదితర అతి సంక్లిష్టమైన వైద్య వీడియోలను కూడా సమగ్రంగా చక్కని చికిత్స మార్గాలను సూచించే దిశగా దూసుకుపోతోంది ఏఐ! మెదడులోని న్యూరాన్ల ఆధారంగా కనిపెట్టిన డీప్ లెర్నింగ్ కాన్సెప్టు ఏఐలో అత్యంత కీలకం. ఇచ్చిన సమాచారాన్ని అర్థం చేసుకోవడంతో సరిపెట్టకుండా తన దగ్గర అప్పటికే ఉన్న సమాచారంతో క్రోడీకరించి, విశ్లేషించి, మరింత మెరుగైన, సమగ్రమైన ఫలితాలు వెల్లడించడం దీని ప్రత్యేకత. ఎన్నో ఉపయోగాలు... ► వైద్యులు–రోగి సంభాషణను, పరీక్ష ఫలితాలను బట్టి కచ్చితమైన రోగ నిర్ధారణ చాట్ జీసీటీ ఫోర్ వంటి చాట్బాట్లతో ఇప్పటికే సాధ్యపడుతోంది. ► మెడికల్ రికార్డుల నిర్వహణలో ఏఐ బాగా ఉపయోగపడనుంది. తద్వారా డాక్టర్లకు ఎంతో సమయం ఆదా చేయడమేగాక రోగి సమాచారాన్నంతా లోతుగా విశ్లేషించి సమగ్రమైన డిశ్చార్జ్ సమ్మరీని అలవోకగా అందిస్తుంది. ► డిశ్చార్జ్ సమయంలో ఇచ్చే ట్రీట్మెంట్ చార్ట్‌లోని మందులను గుర్తించి, వాటి సైడ్ ఎఫెక్టులు తదితరాలను రోగికి స్పష్టంగా చెబుతుంది. డ్రగ్స్ తాలూకు నెగెటివ్ ఇంటరాక్షన్‌పై అలర్ట్ చేయగలుగుతుంది. ► ఇన్సూరెన్స్ పేపర్లను సరిగా విశ్లేషించి క్లెయిం సులువుగా, త్వరగా జరిగేలా చూస్తుంది. మెడికల్ డిసీజ్ కోడింగ్‌లోనూ బాగా ఉపయోగపడుతుంది. ► వైద్య విద్యలోనైతే ఏఐ విప్లవాన్నే తేనుంది! సంక్లిష్టమైన అంశాలను బొమ్మలు, టేబుల్స్లా, చార్టుల రూపంలో విద్యార్థులకు సులువుగా అర్థమయ్యేలా చెప్పటంలో, మెడికల్ రీసర్చ్‌లో కీలక పాత్ర పోషించనుంది. ► రోబోటిక్ పరికరాలతో మమేకమై సంక్లిష్టమైన ఆపరేషన్లలో వైద్యులకు సహకరించనుంది. ► కోవిడ్ వంటి మహమ్మారులను ముందుగానే గుర్తించడంలోనూ ఏఐ ఉపయోగపడొచ్చు. ► టెలీ మెడిసిన్‌నూ ఏఐ కొత్త పుంతలు తొక్కించగలదు. రోగి ఆస్పత్రికి వచ్చే పని లేకుండానే సమస్య గుర్తింపు, వైద్యం, పర్యవేక్షణ జరిగిపోతాయి. ► కొత్త మందులను కనిపెట్టడం మొదలుకుని జన్యు అధ్యయనం ద్వారా ప్రతి వ్యక్తికీ పర్సనలైజ్డ్ మెడిసిన్ సూచించగలదు. సమస్యలూ తక్కువేమీ కాదు... ► ఆరోగ్య సమాచారం తాలూకు గోప్యత చాలా కీలకం. ఏఐతో దీనికి చాలా ముప్పుంటుంది. ► ఏఐ సలహాలు అన్నివేళలా కరెక్టుగా కాకపోవచ్చు. కొన్ని రకాల వైద్య సలహాలివ్వడంలో చాట్‌జీపీటీ వంటివి చిత్త భ్రాంతికి గురైనట్టు ఇప్పటికే తేలింది. అలాగని వాటిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించాల్సి వస్తే వైద్యులకు అదో అదనపు బరువుగా మారొచ్చు. ► డ్యూటీ డాక్టర్ల పనులను ఏఐ ఇప్పటికే చేసేస్తోంది. కనుక మెడికల్ ట్రాన్స్క్రిప్షన్ వంటి హెచ్చు నైపు ణ్యం అక్కర్లేని ఉపాధి అవకాశాలకైతే ఏఐ సమీప భవిష్యత్తులోనే పూర్తిగా గండి కొట్టవచ్చు. ► ప్రజారోగ్యానికి సంబంధించిన విధాన నిర్ణయాలను ఏఐ ప్రభావితం చేస్తే వాటిలో వ్యక్తి స్వేచ్ఛ వంటివాటికి ప్రాధాన్యం లేకుండా పోవచ్చు. చివరగా... ఆరోగ్య రంగంపై ఏఐ ప్రభావాన్ని అధ్యయనం చేసేందుకు ప్రఖ్యాత న్యూ ఇంగ్లండ్ జనరల్ ఆఫ్ మెడిసిన్ ఓ కొత్త జర్నల్నే ప్రారంభించనుంది. ఇరువైపులా పదునున్న కత్తి వంటి ఏఐని విచక్షణతో వాడుకోవాల్సిన బాధ్యత మాత్రం అంతిమంగా మనదే. -
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌తో వర్చువల్ గర్ల్‌ఫ్రెండ్.. నెలకు రూ. 41 కోట్ల సంపాదన!
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌తో అచ్చం తన లాంటి వర్చువల్ గర్ల్‌ఫ్రెండ్ ను సృష్టించి నెలకు రూ. 41 కోట్ల వరకు సంపాదిస్తోంది ఓ సోషల్ మీడియా ఇన్ఫ్లుయన్సర్. స్నాప్‌చాట్‌లో 1.8 మిలియన్ల మంది ఫాలోవర్లు ఉన్న ప్రముఖ ఇన్ఫ్లుయన్సర్ కారిన్ మార్జోరీ.. ఫరెవర్ వాయిసెస్ అనే సంస్థ సహాయంతో కారిన్ ఏఐ (CarynAI) పేరుతో తన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) వెర్షన్‌ను రూపొందించింది. ఇదీ చదవండి: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌తో ఆకతాయి పని.. అరెస్ట్ చేసిన పోలీసులు కారిన్ ఏఐ వాయిస్ ఆధారిత చాట్‌బాట్‌గా ప్రసిద్ధి చెందింది. ఇది అచ్చం మార్జోరీ లాంటి వాయిస్, వ్యక్తిత్వాన్ని ప్రదర్శిస్తుంది. కస్టమర్లతో సన్నిహితంగా మాట్లాడుతుంది. వారి భావాలను పంచుకుంటుంది. మార్జోరీ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తన ఏఐ వర్షన్ ఒంటరితనాన్ని నయం చేయగలదని, నెలకు 5 మిలియన్ డాలర్ల (రూ. 41 కోట్లు) వరకు సంపాదించగలదని చెప్పారు. టెస్టింగ్ లో భాగంగా టెలిగ్రామ్ యాప్‌లో మే నెలలో కారిన్ ఏఐని ప్రారంభించగా మార్జోరీ భాగస్వాముల నుంచి 71,610 డాలర్ల ఆదాయాన్ని ఆర్జించింది. కారిన్ ఏఐ ఇప్పటికే దాని కస్టమర్లతో నిజమైన భావోద్వేగ బంధాన్ని ఏర్పరచుకుంది. అయితే ఇది నైతిక ప్రశ్నలను లేవనెత్తుతోంది. 2013లో విడుదలైన హర్ అనే చిత్రాన్ని గుర్తుకుతెస్తోంది. కారిన్ ఏఐని సృష్టించడానికి యూట్యూబ్ లో సుమారు 2 వేల గంటల పాటు ఉన్న మార్జోరీ ప్రసంగాలను, హావభావాలను ఫరెవర్ వాయిసెస్ సంస్థ వినియోగించింది. ఈ ఇదివరకే సృష్టించిన స్టీవ్ జాబ్స్, టేలర్ స్విఫ్ట్, డొనాల్డ్ ట్రంప్ చాట్‌బాట్ వెర్షన్ల మాదిరిగా కాకుండా కారిన్ ఏఐ దాని కస్టమర్లతో నిజమైన భావోద్వేగ సంబంధాలను ఏర్పరుస్తుంది. ప్రతిరోజూ 250కి పైగా కంటెంట్లను స్నాప్‌చాట్‌లో పోస్ట్ చేసే మార్జోరీ.. తనకు, తన ప్రేక్షకులకు మధ్య ఉన్న అంతరాన్ని కారిన్ ఏఐ తొలగిస్తోందని చెబుతోంది. కారిన్ ఏఐ ఒంటరితనాన్ని దూరం చేయగలదాని, ఒక ఇన్ఫ్లుయెన్సర్గా తన కెరీర్‌ను బ్యాలెన్స్ చేయడానికి ఇది ఒక మంచి మార్గంగా నిలిచిందని పేర్కొంది. కారిన్ ఏఐ గురించి మార్జోరీ తన సోషల్ మీడియా అకౌంట్ల ద్వారా విస్తృత ప్రచారం చేస్తోంది. తన స్నాప్‌చాట్ ఫాలోవర్లలో కనీసం 20 వేల మంది కారిన్ ఏఐకి సబ్స్క్రైబర్లుగా మారతారని, దీని వల్ల నెలకు 5 మిలియన్ డాలర్ల ఆదాయం వస్తుందని ఆమె అంచనా వేస్తోంది. ఇదీ చదవండి: డబ్బుల్లేకుండా రైల్వే టికెట్ బుకింగ్! ఎలాగో తెలుసా? -
చాట్‌జీపీటీ జాబ్.. జీతం ఏడాదికి రూ.2.7కోట్లు
టెక్నాలజీ రంగం కొత్త పుంతలు తొక్కుతోంది. మనిషి జీవన విధానాన్ని మరింత సులభతరం చేసేందుకు కొత్త కొత్త టెక్నాలజీలు పుట్టుకొస్తున్నాయి. వాటి వినియోగంతో మానవాళికి నష్టం వాటిల్లనుందనే భయం ఉన్నా.. బూమింగ్‌లో ఉన్న టెక్నాలజీలను నేర్చుకొని భారీ ప్యాకేజీలు సొంతం చేసుకోవాలని చూస్తున్నారు. ఈ తరుణంలో ట్రెండింగ్‌లో ఉన్న ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) టూల్ చాట్‌జీపీటీలో నిష్ణాతులైన అభ్యర్ధులకు కోట్లలో శాలరీ ప్యాకేజీలు ఇచ్చేందుకు పోటీపడుతున్నాయి. తాజాగా స్టార్టప్ ఆంత్రోపిక్ 'ప్రాంప్ట్ ఇంజనీర్ అండ్ లైబ్రేరియన్' పోస్ట్‌కు అర్హులైన అభ్యర్ధులకు ఏడాదికి 3,35,000 లక్షల డాలర్లను వేతనంగా ఇస్తామని ప్రకటించింది. ఇది ఇండియన్ కరెన్సీలో అక్షరాల రూ.2.7 కోట్లు. ప్రాంప్ట్ ఇంజనీర్లు ఎవరు..? చాట్‌జీపీటీ వెలుగులోకి రావడంతో ప్రాంప్ట్ ఇంజనీర్లకు డిమాండ్ పెరిగింది. వీరికి కోడింగ్ రానక్కర్లేదు. ఇంగ్లీష్ భాషలో నైపుణ్యం ఉంటే సరిపోతుంది. ఏఐ ప్రాజెక్ట్‌లలో సంబంధించిన ఖచ్చితమైన, సంబంధిత డేటాను సేకరిస్తుంటారు. ఇందుకోసం వీళ్లు ఏఐకి సరైన ఇన్పుట్ అందిస్తే.. వాటిద్వారా ఏఐ నుంచి డేటాను పొందవచ్చు. ప్రస్తుతానికి ఏఐ మార్కెట్లో ప్రాంప్ట్ ఇంజనీర్లుకు అవసరం భారీగా ఉంది. అందుకే ఆయా సంస్థలు తమ అవసరాల్ని తీర్చేలా నిష్ణాతులైన నిపుణులకు భారీ ఎత్తున ప్యాకేజీలు ఇచ్చేందుకు సిద్ధమయ్యాయి. పదాలతో చేసే పనికాబట్టి రైటింగ్, కమ్యూనికేషన్ స్కిల్స్ ఉంటే సరిపోతుంది. బేసిక్ కోడింగ్ స్కిల్స్ ఉంటే ఏఐ రంగాన్ని ఏలేయొచ్చు. -
డేటా లీకేజీ ఉదంతం... చాట్‌జీపీటీపై ఇటలీ నిషేధం
పారిస్: ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ చాట్‌బాట్ చాట్‌జీపీటీపై తాత్కాలిక నిషేధం విధిస్తూ ఇటలీ సంచలన నిర్ణయం తీసుకుంది. కఠినమైన యూరోపియన్ యూనియన్ డేటా పరిరక్షణ నియమాలను ఉల్లంఘించినందుకు ఈ చర్య తీసుకున్నట్టు సమాచారం. చాట్‌జీపీటీపై ఇలాంటి చర్య తీసుకున్న తొలి దేశం ఇటలీయే. ఎందుకు? యూజర్ల సంభాషణలు, చందాదారుల చెల్లింపులకు సంబంధించిన డేటా చాట్‌జీపీటీ ద్వారా లీకైందని ఇటలీ డేటా ప్రొటెక్షన్ అథారిటీ పేర్కొంది. అందుకే దాన్ని బ్లాక్ చేస్తూ నిర్ణయం తీసుకున్నట్టు పేర్కొంది. డేటా గోప్యతను చాట్‌జీపీటీ పూర్తిస్థాయిలో గౌరవించేదాకా నిషేధం కొనసాగుతుందని తెలిపింది. దాని మాతృసంస్థ ఓపెన్ఏఐ ఎలాంటి చట్టపరమైన ఆధారమూ లేకుండానే భారీ పరిమాణంలో వ్యక్తిగత డేటాను సేకరించి ప్రాసెస్ చేస్తోందంటూ విస్మయం వ్యక్తం చేసింది. ‘‘పైగా డేటా సేకరిస్తున్న యూజర్లకు ఈ విషయాన్ని నోటిఫై చేయడం లేదు. పైగా చాట్‌జీపీటీ కొన్నిసార్లు వ్యక్తులను గురించిన తప్పుడు సమాచారాన్ని పుట్టించి స్టోర్ చేస్తోంది. అంతేకాదు, యూజర్ల వయసును నిర్ధారించుకునే వ్యవస్థేదీ చాట్‌జీపీటీలో లేదు. కనుక అభ్యంతరకర కంటెంట్ పిల్లల కంటపడే రిస్కుంది. పైగా 13 ఏళ్ల కంటే తక్కువ వయసు చిన్నారుల కోసం ఫిల్టర్లేవీ లేకపోవడం తీవ్ర అభ్యంతరకరం’’ అంటూ ఆక్షేపించింది. చాట్‌జీపీటీలో సాంకేతిక సమస్యలు కొత్తేమీ కాదు ఇతర యూజర్ల సబ్జెక్ట్ లైన్లు, చాట్ హిస్టరీ తదితరాలను కొందరు యూజర్లు చూసేందుకు వీలు కలుగుతుండటంతో సమస్యను సరిచేసేందుకు చాట్‌జీపీటీని కొంతకాలం ఆఫ్‌లైన్ చేస్తున్నట్టు మార్చి 20న ఓపెన్ఏఐ ప్రకటించడం తెలిసిందే. 1.2 శాతం మంది యూజర్లకు ఈ యాక్సెస్ లభించినట్టు విచారణలో తేలిందని సంస్థ పేర్కొంది. 20 రోజుల్లో నివేదించాలి నిషేధం నేపథ్యంలో యూజర్ల డేటా గోప్యత పరిరక్షణకు ఏం చర్యలు తీసుకున్నదీ ఓపెన్ఏఐ నివేదించాల్సి ఉంటుంది. లేదంటే 2.2 కోట్ల డాలర్లు/మొత్తం వార్షికాదాయంలో 4 శాతం జరిమానాగా చెల్లించాల్సి ఉంటుంది. విద్యార్థుల్లో అలసత్వానికి కారణమవుతుందంటూ ప్రపంచవ్యాప్తంగా పలు ప్రభుత్వ పాఠశాలలు, యూనివర్సిటీలు ఇప్పటికే చాట్‌జీపీటీని నిషేధించాయి.