వాట్సప్‌లో చాట్‌జీపీటీ.. అందుకు ఏం చేయాలంటే.. | OpenAI integrated ChatGPT with WhatsApp users to interact with the AI chatbot | Sakshi
Sakshi News home page

వాట్సప్‌లో చాట్‌జీపీటీ.. అందుకు ఏం చేయాలంటే..

Dec 20 2024 10:12 AM | Updated on Dec 20 2024 10:12 AM

OpenAI integrated ChatGPT with WhatsApp users to interact with the AI chatbot

ఓపెన్‌ఏఐ ఆధ్వర్యంలోని జనరేటివ్‌ఏఐ చాట్‌బాట్‌ చాట్‌జీపీటీ ఇకపై వాట్సప్‌లోనూ దర్శనమివ్వనుంది. వాట్సప్‌లోనూ చాట్‌జీపీటీ సేవలు వినియోగించుకోవచ్చని ఓపెన్‌ఏఐ తెలిపింది. వినియోగదారులకు ప్రత్యేకంగా ఇతర యాప్‌తో పనిలేకుండా వాట్సప్‌లోనే నేరుగా ఈ సేవలు వాడుకోవచ్చని కంపెనీ పేర్కొంది.

ఈ సేవలు వినియోగించుకోవాలంటే +18002428478 నంబర్‌తో వాట్సప్‌లో చాట్‌ చేయాల్సి ఉంటుంది. ఈ నంబర్‌ ద్వారా వాట్సప్‌లో అడిగిన ప్రశ్నలకు చాట్‌జీపీటీ సమాధానాలు ఇస్తుంది. ఈ చాట్‌బాట్‌ టెక్ట్స్‌ రూపంలో అందించే సేవలు ప్రపంచవ్యాప్తంగా వినియోగించుకోవచ్చు. అయితే వాయిస్‌ ఇంటరాక్షన్స్‌ మాత్రం ప్రస్తుతం యూఎస్‌, కెనడా దేశాల్లోనే అందుబాటులో ఉన్నట్లు కంపెనీ తెలిపింది. త్వరలో ఇతర దేశాలకు ఈ సర్వీసును విస్తరిస్తామని పేర్కొంది.

ఇదీ చదవండి: ఈ–వ్యాలెట్లలోకి పీఎఫ్‌ సొమ్ము?

ఈ సర్వీసుకు కొన్ని పరిమితులున్నట్లు కంపెనీ తెలిపింది. రోజువారీ వాడుకలో పరిమితి ముగిశాక నోటిఫికేషన్‌ ద్వారా సమాధానాలు పొందవచ్చని స్పష్టం చేసింది. భవిష్యత్‌లో చాట్‌జీపీటీ సెర్చ్‌, ఇమేజ్‌ బేస్డ్‌ ఇంటరాక్షన్‌, కన్వర్జేషన్‌ మెమొరీ లాగ్స్‌ వంటి సర్వీసులు అందుబాటులోకి తీసుకురాబోతున్నట్లు సంస్థ వెల్లడించింది. ఇప్పటికే మెటా సంస్థ ఏఐ చాట్‌బాట్‌ను వాట్సప్‌లో అందిస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement