ప్రపంచవ్యాప్తంగా ఓపెన్‌ఏఐ ఆధ్వర్యంలోని చాట్‌జీపీటీ సేవలకు సంబంధించి వినియోగదారులు తీవ్ర అంతరాయాన్ని ఎదుర్కొన్నారు. భారత కాలమానం ప్రకారం గురువారం ఉదయం 5 గంటల ప్రాంతంలో చాట్‌జీపీటీ సేవల్లో అంతరాయం కలిగినట్లు వినియోగదారులు గుర్తించారు. ఈ విషయాన్ని పలు సామాజిక మాధ్యమాల ద్వారా తెలియజేశారు. చాట్‌జీపీటీతోపాటు ఓపెన్‌ఏఐకు చెందిన ఏపీఐ, సొర(sora-రియల్‌టైమ్ ఇమేజ్ జనరేట్ చేసే ఏఐ) సేవలు కూడా ప్రభావితం చెందినట్లు తెలిపారు.
చాట్‌జీపీటీతోపాటు ఇతర అనుబంధ సంస్థల్లో తలెత్తిన సమస్యను ఓపెన్‌ఏఐ అంగీకరించింది. సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఎక్స్‌లో ఈ విషయాన్ని ధ్రువీకరిస్తూ పోస్ట్ చేసింది. ‘ప్రస్తుతం కంపెనీ సేవల్లో అంతరాయాన్ని ఎదుర్కొంటున్నాం. సమస్యను గుర్తించాం. దాన్ని పరిష్కరించేందుకు పని చేస్తున్నాం. మీకు కలిగిన అంతరాయానికి క్షమాపణలు తెలియజేస్తున్నాం. ఈ విషయంపై త్వరలో మీకు అప్‌డేట్ చేస్తాం’ అని ఓపెన్‌ఏఐ ఎక్స్‌లో పోస్ట్ చేసింది. ఆన్‌లైన్ సర్వీసులను ట్రాక్ చేసే డౌన్ డిటెక్టర్ ప్రకారం, చాట్‌జీపీటీ ఆఫ్‌లైన్‌లో ఉండటంపై భారీగానే ఫిర్యాదులు నమోదైనట్లు తెలిపింది.
We're experiencing an outage right now. We have identified the issue and are working to roll out a fix.
Sorry and we'll keep you updated!— OpenAI (@OpenAI) December 12, 2024
ఇదీ చదవండి: రూ.5 కోట్ల వాచ్‌తో జుకర్‌బర్గ్.. ప్రత్యేకతలివే..
ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ డౌన్
మెటా ఆధ్వర్యంలోని ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ సేవల్లో యూఎస్‌లో ఇటీవల అంతరాయం ఏర్పడింది. దాదాపు 27,000 కంటే ఎక్కువ మంది వినియోగదారులు ఫేస్‌బుక్‌తో సమస్య ఏర్పడినట్లు తెలిపారు. 28,000 కంటే ఎక్కువ మంది యూజర్లు ఇన్‌స్టాగ్రామ్‌లో అంతరాయం ఏర్పడిందని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment